Boxing Day Test
-
బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమి
-
Nitish Reddy: కొడుకంటే ఇలా ఉండాలి!.. భావోద్వేగంతో తండ్రి కన్నీళ్లు!
కఠిన శ్రమకు ఫలితం దక్కితే.. అంకితభావానికి ప్రతిగా అందమైన, అరుదైన బహుమతి లభిస్తే.. ఆటే ఆరోప్రాణంగా భావించే వారి త్యాగానికి సరైన గుర్తింపు దక్కితే ఎట్టా ఉంటది?!... టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ రెడ్డి, అతడి తండ్రి ముత్యాలరెడ్డి భావోద్వేగాలను గమనిస్తే ఆ విషయం కళ్లకు కట్టినట్లు తెలుస్తది!!తన కెరీర్‌ను త్యాగం చేసిఐదేళ్ల ప్రాయంలోనే క్రికెట్ పట్ల మక్కువ కనబరిచిన కుమారుడి కోసం ఆ తండ్రి ఉద్యోగం సైతం విడిచిపెట్టి.. కత్తిమీద సాము చేశాడు. కొడుకులోని ప్రతిభను గుర్తించి.. అతడిని క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు ఎన్నో కష్టనష్టాలకోర్చాడు. అందుకు ప్రతిగా ఆ కుమారుడు ఆస్ట్రేలియా గడ్డపై అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డు సాధించి.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు.పుత్రోత్సాహంతండ్రి కళ్లముందే ఆసీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటూ అంతర్జాతీయ కెరీర్లో.. అదీ చిన్న వయసులోనే శతకం బాదేశాడు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా అభిమానులకు వినోదం పంచడంతో పాటు.. పడ్డ కష్టాన్ని మర్చిపోయి ఆ తండ్రి పుత్రోత్సాహంతో పొంగిపోయేలా చేశాడు.పట్టరాని సంతోషంతో కన్నీటి పర్యంతంఅవును.. ఆ తండ్రి ముత్యాలరెడ్డి, కొడుకు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy). 21 ఏళ్ల 216 రోజుల వయసులో ఈ విశాఖపట్నం కుర్రాడు ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుపై.. టీమిండియా కష్టాల్లో ఉన్న విలువైన సెంచరీ చేశాడు. దీంతో తండ్రి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. కంటతడి పెడుతూ.. తన ప్రార్థనలు ఫలించాయి అన్నట్లుగా ఆకాశం వైపు చూస్తూ ముత్యాలరెడ్డి భావోద్వేగాని(Nitish Kumar Reddy Father Gets Emotional)కి గురైన తీరు అందరి మనసులను కదిలించింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘తండ్రి కష్టానికి ప్రతిఫలం దక్కింది. కొడుకంటే ఇలా ఉండాలి’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో భారత్‌ను తన సెంచరీతో గట్టెక్కించిన నితీశ్ రెడ్డిపై మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఐసీసీ, బీసీసీఐ కూడా నితీశ్ రెడ్డి సరైన సమయంలో.. సరైన చోట శతకం బాదాడంటూ కొనియాడాయి.టీ20లతో టీమిండియా అరంగేట్రంకాగా నితీశ్ రెడ్డి ఐపీఎల్-2024(IPL 2024)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో చోటు సంపాదించిన ఈ యువ కెరటం.. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాల వల్ల టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆటతోనే తిప్పి కొట్టాడుఅయితే, నితీశ్‌కు అనతికాలంలోనే పిలుపునిచ్చి సెలక్టర్లు తప్పుచేశారని.. కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శించారు. అతడికి బదులు.. ఆసీస్‌లో ఆడిన అనుభవం ఉన్న శార్దూల్ ఠాకూర్‌ను బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.అయితే, ఆ విమర్శలన్నింటికీ నితీశ్ రెడ్డి తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా పెర్త్((41, 38 నాటౌట్, ఒక వికెట్))లో టీమిండియాను ఆదుకుని విజయంలో తన వంతు పాత్ర పోషించిన నితీశ్ రెడ్డి.. అడిలైడ్‌లోనూ 42, 42 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. మూడో టెస్టులోనూ తన వంతు సహకారం అందించాడు.ఎంసీజీలో విశ్వరూపంఈ క్రమంలో మెల్బోర్న్లో జరుగుతున్న నాలుగో టెస్టులో మాత్రం నితీశ్ రెడ్డి తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు చక్కటి షాట్లతో అలరిస్తూ 171 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని.. టీమిండియాను మ్యాచ్‌లో నిలిపాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. కాగా నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 116 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఆసీస్(474) కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: ZIM Vs AFG: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జింబాబ్వే.. శతకాల మోతNitish Kumar Reddy hits his maiden Test century and receives a standing ovation from the MCG crowd ❤️ #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/Vbqq5C26gz— cricket.com.au (@cricketcomau) December 28, 2024 -
ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన నితీశ్ రెడ్డి
టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. కంగారూల దేశంలో లోయర్ ఆర్డర్లో బరిలోకి దిగి అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. ఐపీఎల్-2024(IPL-2024 )లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన విశాఖ కుర్రాడు నితీశ్ రెడ్డి.. టీ20ల ద్వారా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.అరుదైన నైపుణ్యాల కారణంగాభారత్ తరఫున పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటిన నితీశ్ రెడ్డి.. తనకున్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టులోనూ చోటు సంపాదించాడు. ఏకంగా ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టుతో భారత్ తలపడే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)కి ఎంపికవడమే కాక.. తుదిజట్టులో స్థానం దక్కించుకున్నాడు.ఇదే జోరులో టీమిండియా మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నితీశ్ రెడ్డి నిలబెట్టుకుంటున్నాడు. పెర్త్ టెస్టులో విలువైన ఇన్నింగ్స్(41, 38 నాటౌట్, ఒక వికెట్) ఆడిన 21 ఏళ్ల ఈ తెలుగు తేజం.. అడిలైడ్(42, 42, ఒక వికెట్)లోనూ బ్యాట్ ఝులిపించాడు. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులోనూ ఫర్వాలేదనిపించిన నితీశ్ రెడ్డి.. బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో మాత్రం దుమ్ములేపుతున్నాడు.అరుదైన రికార్డు.. ఆసీస్ గడ్డపై చరిత్రరోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) వంటి టాప్ బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకున్నాడు. మరో యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో కలిసి నితీశ్ రెడ్డి భారత ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. విలువైన శతకం సాధించాడు.అయితే, 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో నితీశ్ రెడ్డి ఖాతాలో అరుదైన రికార్డు జమైంది. ఆస్ట్రేలియాలో ఎనిమిది.. లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును నితీశ్ రెడ్డి బద్దలు కొట్టాడు.ఆసీస్ గడ్డపై ఎనిమిది లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోరు చేసిన భారత క్రికెటర్లు1. నితీశ్ రెడ్డి- మెల్బోర్న్-2024- 88* రన్స్2. అనిల్ కుంబ్లే- అడిలైడ్- 2008- 87 రన్స్3. రవీంద్ర జడేజా- సిడ్నీ- 2019- 81 రన్స్4. కిరణ్ మోరే- మెల్బోర్న్- 1991- 67*5. శార్దూల్ ఠాకూర్- బ్రిస్బేన్- 2021- 67. Nitish Kumar Reddy was looking like Neo in The Matrix after dodging this one 😳#AUSvIND pic.twitter.com/B8sX7aKYvf— cricket.com.au (@cricketcomau) December 28, 2024 -
కోహ్లికి అవమానం.. ఇంత నీచంగా ప్రవర్తిసారా?
మెల్బోర్న్ టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి అవమానం జరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో.. ప్రేక్షకులు పరుష పదజాలంతో అతడిని దూషించారు. దీంతో వెనక్కి తిరిగి వచ్చిన కోహ్లి సీరియస్‌గా చూస్తూ.. వారికి బదులిచ్చేందుకు సిద్ధం కాగా.. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతడికి నచ్చజెప్పి పంపించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test) మొదలైంది.ఆసీస్ స్కోరు 474ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. టాపార్డర్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal- 82) అద్బుత అర్ధ శతకంతో మెరవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(3) విఫలమయ్యాడు.ఆది నుంచే తడ‘బ్యాటు’.. ఆదుకున్న జోడీవన్డౌన్లో వచ్చిన కేఎల్ రాహుల్ 24 పరుగులకే నిష్క్రమించగా.. విరాట్ కోహ్లి(86 బంతుల్లో 36).. జైస్వాల్‌తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. దీంతో కాస్త కోలుకున్నట్లే కనిపించిన టీమిండియాకు.. వరుస ఓవర్లలో జైస్వాల్- కోహ్లి అవుట్ కావడంతో గట్టి షాక్ తగిలింది. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.ఇదిలా ఉంటే.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ అవుటైన కోహ్లి.. పెవిలియన్‌కు వెళ్తుండగా.. ఆసీస్ ఫ్యాన్స్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఏంటీ మీ సంగతి?దీంతో వెనక్కి తిరిగి వచ్చిన కోహ్లి.. ‘‘ఏంటీ మీ సంగతి?’’ అన్నట్లుగా సీరియస్ లుక్ ఇచ్చాడు. అంతలో అక్కడ ఉన్న భద్రతా అధికారి.. కోహ్లిని అనునయించి.. నచ్చజెప్పి లోపలికి తీసుకువెళ్లాడు.కాగా బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా ఆసీస్ యువ ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్(60)తో కోహ్లికి గొడవ(Virat Kohli- Sam Konstas Altercation) జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ కోహ్లి మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం మేర కోత కూడా విధించింది. ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అయితే, ఈ గొడవను దృష్టిలో పెట్టుకుని ఆసీస్ మీడియాతో పాటు ఆ దేశ అభిమానులు కోహ్లి పట్ల అవమానకర రీతిలో వ్యవహరించారు. కోహ్లిని ఉద్దేశించి.. జోకర్ అన్న అర్థంలో ఆసీస్ మీడియా కథనాలు ప్రచురించింది. ఇక కంగారూ జట్టు అభిమానులేమో ఇలా గ్రౌండ్లో కోహ్లిని హేళన చేస్తూ అభ్యంతరకర భాష ఉపయోగించారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. దిగ్గజ ఆటగాడి పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అని సోషల్ మీడియా వేదికగా #Viratkohli #KingKohli అంటూ ట్రెండ్ చేస్తున్నారు.విమర్శించండి.. కానీభారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘‘అత్యుత్తమ బ్యాటర్ పట్ల ఇలా అగౌరవంగా ప్రవర్తించడం సరికాదు. విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ హద్దులు మీరి.. అసభ్యంగా వ్యవహరించకూడదు’’ అని సంజనా పేర్కొన్నారు.చదవండి: టీమిండియా అంటే చాలు, రెచ్చిపోతాడు.. స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డుReally disrespectful behavior with country's best batter. Criticism is ok, but abuse crosses the line. Upholding the spirit of cricket and supporting our players with dignity.#ViratKohli𓃵 #INDvsAUS #AUSvIND pic.twitter.com/NnZPDkeOs7— Sanjana Ganesan 🇮🇳 (@iSanjanaGanesan) December 27, 2024 -
పాపం జైస్వాల్.. కోహ్లి క్షమాపణ చెప్పాలి!.. తప్పు ఎవరిది?
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ దిశగా పయనించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. స్వీయ తప్పిదం కారణంగా రనౌట్(#Yashasvi Jaiswal Run Out) అయ్యాడు. అయితే, కొంత మంది మాత్రం జైస్వాల్ పెవిలియన్ చేరడానికి విరాట్ కోహ్లి(#Virat Kohli)నే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.ఆసీస్ భారీ స్కోరుబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ముగియగా.. 1-1తో సమంగా ఉన్న ఇరుజట్ల మధ్య.. గురువారం నాలుగో టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ రెండు, వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్‌కు శుభారంభం లభించినా.. ఆఖర్లో మాత్రం గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి.రోహిత్ మరోసారి విఫలంకెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma Fails Again- 3) మరోసారి నిరాశపరచగా.. మూడో స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్(24) కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(82), విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, జైస్వాల్ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు.పరుగు కోసం యత్నించిన జైస్వాల్టీమిండియా ఇన్నింగ్స్ 41వ ఓవర్లో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బంతితో బరిలోకి దిగగా.. ఆఖరి బంతికి జైస్వాల్ మిడాన్దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో మరో ఎండ్‌లో ఉన్న కోహ్లి.. ఫీల్డర్ల వైపు చూస్తూ ఉండగా.. అప్పటికే జైస్వాల్ క్రీజును వీడాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌వైపు దూసుకురాగా.. అప్పటికి కోహ్లి కూడా తన ప్లేస్‌లోకి తిరిగి వచ్చేశాడు.జైస్వాల్ రనౌట్.. శతక భాగస్వామ్యానికి తెరఅప్పటికి బంతిని అందుకున్న ఫీల్డర్ కమిన్స్ స్టంప్స్ వైపు బంతిని విసరగా.. మిస్ అయింది. అయితే, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ వేగంగా స్పందించి స్టంప్స్‌ను గిరాటేయడంతో జైస్వాల్ రనౌటయ్యాడు. ఫలితంగా జైస్వాల్- కోహ్లి శతక భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 102 పరుగులు జోడించారు.అంతా తలకిందులుఅయితే, జైస్వాల్ అవుటైన కాసేపటికే కోహ్లి కూడా పెవిలియన్ చేరాడు. బోలాండ్ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్ ఇచ్చి 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ రెండు, స్కాట్ బోలాండ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.కాగా జైస్వాల్‌కు రనౌట్‌కు కోహ్లినే కారణమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డాడు. యువ బ్యాటర్‌కు కోహ్లి క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించాడు. అయితే, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం.. రనౌట్ విషయంలో జైస్వాల్‌దే తప్పని.. అందుకు కోహ్లిని నిందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.చదవండి: IND Vs AUS 4th Test: ‘జట్టుకు భారంగా మారావు.. మర్యాదగా తప్పుకుంటే మంచిది’A massive mix-up between Virat Kohli and Yashasvi Jaiswal sees Jaiswal run out for 82! #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/a9G4uZwYIk— cricket.com.au (@cricketcomau) December 27, 2024 -
టాప్–4 తడాఖా
ఆ్రస్టేలియా ప్రయోగించిన కొత్త అస్త్రం ఫలించింది. మెక్‌స్వీనీని తప్పించి ఎంపిక చేసిన 19 ఏళ్ల కుర్రాడు స్యామ్ కోన్స్టాస్ మెల్బోర్న్లో మెరిపించాడు. ప్రపంచ అత్యుత్తమ పేసర్‌గా మన్ననలు అందుకుంటున్న బుమ్రా బౌలింగ్‌లో... టి20ల తరహాలో పరుగులు రాబట్టి ఆతిథ్య జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు. అతడి స్ఫూర్తితో టాప్–4 ఆటగాళ్లు హాఫ్ సెంచరీలతో విజృంభించారు. వెరసి ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆఖర్లో బుమ్రా చెలరేగకపోయుంటే పరిస్థితి మరింత దిగజారేదే! ఇప్పటికైతే టీమిండియా పోటీలోనే ఉన్నా... పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం! మెల్బోర్న్: టాపార్డర్ రాణించడంతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆ్రస్టేలియాకు మంచి ఆరంభం లభించింది. టాప్–4 బ్యాటర్లు అర్ధశతకాలతో అదరగొట్టారు. ఫలితంగా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో భాగంగా భారత్‌తో గురువారం మొదలైన నాలుగో టెస్టులో ఆతిథ్య ఆ్రస్టేలియా జట్టు తొలిరోజే మంచి స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు సామ్ కోన్స్టాస్ (65 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 57; 6 ఫోర్లు), లబుషేన్ (145 బంతుల్లో 72; 7 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (111 బంతుల్లో 68 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.ఒకదశలో ఆసీస్ జోరు చూస్తుంటే 400 స్కోరు ఖాయమే అనిపించినా... మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రా (3/75) టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చాడు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్మిత్‌తో పాటు కెపె్టన్ ప్యాట్ కమిన్స్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కోన్స్టాస్ ల్యాప్ స్కూప్ సిక్సర్ రికార్డు స్థాయి అభిమానుల హర్షధ్వానాల మధ్య జాతీయ జట్టు తరఫున తొలి టెస్టు ఆడేందుకు బరిలోకి దిగిన టీనేజర్ కోన్స్టాస్ మొదటి మ్యాచ్‌లోనే గుర్తుండిపోయే ప్రదర్శనతో కట్టిపడేశాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మహామహా బ్యాటర్లే తడబడుతున్న తరుణంలో సంప్రదాయ శైలిని పక్కనపెట్టి ఎదురుదాడి లక్ష్యంగా పరుగులు రాబట్టడంలో సఫలమయ్యాడు. పట్టుమని పది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం కూడా లేని 19 ఏళ్ల కోన్స్టాస్... బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదడం విశేషం. ఏడో ఓవర్లో అతడు ల్యాప్ స్కూప్ ద్వారా కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలైట్. కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడితో మాటల యుద్ధం జరిగిన తర్వాత కూడా ఈ టీనేజ్ కుర్రాడు సంయమనం కోల్పోకుండా పరిణతి ప్రదర్శించాడు. ఈ క్రమంలో 52 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న కోన్స్టాస్ కాసేపటికే జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. స్మిత్, లబుషేన్ నిలకడ గత మూడు టెస్టుల్లో నిలకడ కనబర్చలేకపోయిన ఆసీస్ టాపార్డర్... కోన్స్టాస్ ఇన్నింగ్స్ స్ఫూర్తితో చెలరేగడంతో తొలి రోజు కంగారూలదే పైచేయి అయింది. లయ దొరకబుచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఖ్వాజా 101 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... లబుషేన్ నింపాదిగా ఆడాడు. ఎలాంటి తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా ఒక్కో పరుగు జోడిస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రెండో వికెట్ లబుషేన్‌తో కలిసి 65 పరుగులు జోడించిన అనంతరం ఖ్వాజా అవుటయ్యాడు. లబుషేన్, స్మిత్ జట్టు బాధ్యతలను భుజానెత్తుకున్నారు. దాంతో ఆసీస్ ఒకదశలో 237/2తో పటిష్ట స్థితిలో కనిపించింది. బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా... సిరాజ్, జడేజా ఆ తీవ్రత కొనసాగించలేకపోవడంతో ఆసీస్ ప్లేయర్లు సులువుగా పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించిన తర్వాత లబుషేన్‌ను సుందర్ అవుట్ చేశాడు. బుమ్రా బ్రేక్ ఈ సిరీస్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న బుమ్రా మూడో సెషన్లో తన తడాఖా చూపాడు. వరుస సెంచరీలతో జోరు మీదున్న ట్రావిస్ హెడ్ (0)ను ఓ చక్కటి బంతితో క్లీన్»ౌల్డ్ చేశాడు. బుమ్రా సంధించిన బుల్లెట్ లాంటి లెంత్ బాల్ హెడ్ ఆఫ్‌స్టంప్ బెయిల్‌ను గిరాటేసిన తీరు ముచ్చట గొలిపింది. ఏం జరిగిందో ఆలోచించుకునే లోపే హెడ్ బెయిల్ గాల్లోకి ఎగరగా... స్టేడియం మొత్తం ‘బూమ్.. బూమ్.. బుమ్రా’అనే నినాదాలతో హోరెత్తింది.మరుసటి ఓవర్లో మార్ష్ (4)ను బుమ్రా వెనక్కి పంపాడు. అలెక్స్ కేరీ (41 బంతుల్లో 31; 1 సిక్స్) చివర్లో వేగంగా పరుగులు సాధించగా... స్మిత్ అజేయంగా నిలిచాడు. రెండో రోజు కమిన్స్‌తో కలిసి స్మిత్ మరెన్ని పరుగులు జోడిస్తాడనే దానిపైనే ఈ మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉంది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: కోన్స్టాస్ (ఎల్బీ) (బి) జడేజా 60; ఖ్వాజా (సి) రాహుల్ (బి) బుమ్రా 57; లబుషేన్ (సి) కోహ్లి (బి) సుందర్ 72; స్మిత్ (బ్యాటింగ్) 68; హెడ్ (బి) బుమ్రా 0; మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 4; కేరీ (సి) పంత్ (బి) ఆకాశ్‌దీప్ 31; కమిన్స్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 311. వికెట్ల పతనం: 1–89, 2–154, 3–237, 4–240, 5–246, 6–299. బౌలింగ్: బుమ్రా 21–7–75–3; సిరాజ్ 15–2–69–0; ఆకాశ్‌దీప్ 19–5–59–1; జడేజా 14–2–54–1; నితీశ్ రెడ్డి 5–0–10–0; సుందర్ 12–2–37–1.1 అరంగేట్రం టెస్టులోనే భారత్‌పై అర్ధశతకం సాధించిన పిన్న వయసు (19 ఏళ్ల 85 రోజులు) ఆసీస్ ప్లేయర్‌గా కోన్స్టాస్ రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా ఆసీస్ తరఫున పిన్నవయసులో అర్ధశతకం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇయాన్ క్రెయిగ్ (17 ఏళ్ల 240 రోజులు; 1953లో దక్షిణాఫ్రికాపై) తొలి స్థానంలో ఉన్నాడు.3 ఆ్రస్టేలియా తరఫున అరంగేట్రం టెస్టులో వేగవంతమైన అర్ధశతకం సాధించిన మూడో ప్లేయర్‌గా కోన్స్టాస్ (52 బంతుల్లో) నిలిచాడు. గిల్‌క్రిస్ట్ (46 బంతుల్లో; 1999లో పాకిస్తాన్‌పై), ఆగర్ (50 బంతుల్లో; 2013లో ఇంగ్లండ్‌పై) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.మెల్బోర్న్@ 87,242 ‘బాక్సింగ్ డే’ టెస్టు తొలి రోజు ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 87,242 మంది అభిమానులు హాజరయ్యారు. ఇరు జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌కు హాజరైన అభిమానుల సంఖ్య ఇదే అత్యధికం. మెల్బోర్న్ టెస్టు ఆరంభానికి రెండు వారాల ముందే టికెట్లన్నీ అమ్ముడుపోగా... రికార్డు స్థాయిలో ప్రేక్షకులు మైదానానికి తరలివచ్చారు. -
కోహ్లితో గొడవ.. ఆసీస్ యువ ఓపెనర్ స్పందన ఇదే
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో జరిగిన వాగ్వాదం(Virat Kohli- Sam Konstas Altercation)పై ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ స్పందించాడు. ఆటలో ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు. అయితే, భావోద్వేగాలు అదుపులో లేకపోవడం వల్లే తామిద్దరం అలా గొడవపడ్డామని తెలిపాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత జట్టు ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది.అరంగేట్రంలోనే అదుర్స్ఇప్పటి వరకు మూడు టెస్టులు జరుగగా ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య మెల్బోర్న్లో గురువారం నాలుగో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్ సందర్భంగా 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. దూకుడైన ఆటతో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.ముఖ్యంగా టీమిండియా పేస్ దళ నాయకుడు, ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను సామ్ ఎదుర్కొన్న తీరు విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. టీ20 తరహాలో దంచికొట్టిన సామ్ కొన్‌స్టాస్ 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు సాధించాడు. అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీలు బాది పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే, సామ్ కొన్‌స్టాస్ ఏకాగ్రతను దెబ్బతీసే క్రమంలో విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దూకుడు మీదున్న సామ్‌కు భుజాలు తాకిస్తూ కోహ్లి కాస్త దుందుడుకుగా ప్రవర్తించినట్లు కనిపించింది. సామ్ కూడా అతడికి అంతే గట్టిగా బదులివ్వగా వాగ్వాదం జరిగింది. ఇంతలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతపరిచారు.కోహ్లికి ఐసీసీ షాక్ఇక ఈ ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి విరాట్ కోహ్లికి షాకిచ్చింది. మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం మేర కోత విధించింది. ఇదిలా ఉంటే.. తన అభిమాన క్రికెటర్‌తో గొడవపై సామ్ కొన్‌స్టాస్ స్పందించిన తీరు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది.నేను గ్లోవ్స్ సరిచేసుకుంటున్నారవీంద్ర జడేజా బౌలింగ్‌లో తాను అవుటైన తర్వాత.. కోహ్లితో గొడవ గురించి సామ్ కొన్‌స్టాస్ మాట్లాడుతూ.. ‘‘ఆ సమయంలో మేమిద్దరం భావోద్వేగంలో మునిగిపోయి ఉన్నామేమో!.. అప్పుడు నేను గ్లోవ్స్ సరిచేసుకుంటున్నా. ఆ సమయంలో అతడు వస్తున్నట్లు గమనించలేకపోయా. అయినా క్రికెట్లో ఇవన్నీ సహజమే’’ అని 7క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా కోహ్లి తన అభిమాన క్రికెటర్ అని సామ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్అదే విధంగా తన ప్రణాళికల గురించి ప్రస్తావన రాగా.. ‘‘బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్. అయితే, అతడిపై ఒత్తిడి పెంచగలిగితేనే నేను పైచేయి సాధించగలనని తెలుసు. అందుకే దూకుడుగా ఆడుతూ.. అతడిని డిఫెన్స్‌లో పడేలా చేశాను. నిజానికి మ్యాచ్‌కు ముందు నేనేమీ ప్రత్యేక ప్రణాళికలు రచించుకోలేదు’’ అని సామ్ కొన్‌స్టాస్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. బాక్సింగ్ డే టెస్టులో తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆసీస్ 311 పరుగులు చేసింది. భారత బౌలర్లు బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్The man of the moment 👊Sam Konstas chats with @copes9 about his first Test innings...And everything else that happened during it as well #AUSvIND pic.twitter.com/v7hhwMWgtB— 7Cricket (@7Cricket) December 26, 2024 -
బుమ్రా సరికొత్త చరిత్ర.. కుంబ్లే రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన కంగారూలను కట్టడి చేశాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో భారత్ విజయం సాధించగా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ గెలుపొందింది. ఇక బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల ‘డ్రా’ కావడంతో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి.టాపార్డర్ హిట్ఈ నేపథ్యంలో ఎంసీజీ వేదికగా గురువారం నాలుగో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టాపార్డర్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంది. ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57).. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(72) అర్ధ శతకాలతో మెరిశారు.బుమ్రా మ్యాజిక్ వల్లమిడిలార్డర్లో స్టీవ్ స్మిత్(68 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీ చేయడంతో ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, డేంజరస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్(0), ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(4)లను బుమ్రా త్వరత్వరగా పెవిలియన్‌కు పంపడంతో కనీసం తొలి రోజు ఆఖరి సెషన్‌లోనైనా భారత జట్టుకు కాస్త ఊరట దక్కింది. వీరిద్దరితో పాటు ఉస్మాన్ ఖవాజా వికెట్‌ను కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక మెల్బోర్న్ టెస్టులో మొదటి రోజు ఆట సందర్భంగా మొత్తంగా మూడు వికెట్లు తీసిన బుమ్రా.. ఎంసీజీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ ప్రసిద్ధ మైదానంలో బుమ్రా మూడు మ్యాచ్‌లు(ఐదు ఇన్నింగ్స్) ఆడి మొత్తంగా 18 వికెట్లు తీశాడు. అంతకు ముందు అనిల్ కుంబ్లే మూడు మ్యాచ్‌లు(ఆరు ఇన్నింగ్స్) ఆడి పదిహేను వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.మెల్బోర్న్లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు1. జస్ప్రీత్ బుమ్రా(పేసర్)- మూడు మ్యాచ్‌లు- ఐదు ఇన్నింగ్స్- 18 వికెట్లు2. అనిల్ కుంబ్లే(స్పిన్నర్)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్- 15 వికెట్లు3. రవిచంద్రన్ అశ్విన్(స్పిన్నర్)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్- 14 వికెట్లు4. కపిల్ దేవ్(పేసర్)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్- 14 వికెట్లు5. ఉమేశ్ యాదవ్(పేసర్)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్- 13 వికెట్లుతొలిరోజు ఆసీస్దేబాక్సింగ్ డే టెస్టు((Boxing Day Test))లో గురువారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.చదవండి: #Virat Kohli: యువ క్రికెటర్‌తో గొడవ.. విరాట్ కోహ్లికి ఐసీసీ భారీ షాక్ BUMRAH SEED TO GET HEAD FOR A DUCK!#AUSvIND | #DeliveredWithSpeed | @nbn_australia pic.twitter.com/ZlpIVFca5O— cricket.com.au (@cricketcomau) December 26, 2024 -
ముగిసిన తొలి రోజు ఆట.. పైచేయి సాధించిన ఆస్ట్రేలియా
IND vs AUS 4th Test Live Updates and highlights: ముగిసిన తొలి రోజు ఆట..మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.క్రీజులో స్టీవ్ స్మిత్(68 బ్యాటింగ్), కమ్మిన్స్(8) ఉన్నారు. తొలి రెండు సెషన్స్‌లో ఆస్ట్రేలియా అధిపత్యం చెలాయించగా.. ఆఖరి సెషన్లో భారత బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చారు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసి తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చాడు.భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్, సుందర్, జడేజా తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో కాన్స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72), స్మిత్(68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఆరో వికెట్ డౌన్.. అలెక్స్ క్యారీ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ.. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 84 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 303/6. క్రీజులో కమ్మిన్స్(1), స్మిత్(1) పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న స్మిత్, క్యారీ..ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్(65 నాటౌట్), అలెక్స్ క్యారీ(21 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు. 77 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ..ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరో టెస్టు హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. స్మిత్ 50 పరుగులతో తనం బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 71 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 251/5. క్రీజులో స్మిత్‌తో పాటు అలెక్స్ క్యారీ ఉన్నాడు.ఆసీస్ ఐదో వికెట్ డౌన్..మిచెల్ మార్ష్ రూపంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మార్ష్.. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 71 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 251/5బమ్రా సూపర్ బాల్.. హెడ్ క్లీన్ బౌల్డ్ టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో ట్రావిస్ హెడ్‌ను బోల్తా కొట్టించాడు. బుమ్రా దెబ్బకు హెడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 67 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 241/4ఆసీస్ మూడో వికెట్ డౌన్.. లబుషేన్ ఔట్ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 72 పరుగులు చేసిన లబుషేన్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ట్రావిస్ హెడ్ వచ్చాడు. 66 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 237/3టీ బ్రేక్‌కు ఆసీస్ స్కోరంతంటే?టీ విరామానికి 53 ఓవర్లలో ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్(44), స్టీవ్ స్మిత్(10) పరుగులతో ఉన్నారు.ఆసీస్ రెండో వికెట్ డౌన్..ఉస్మాన్ ఖావాజా రూపంలో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన ఉస్మాన్ ఖావాజా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. 45 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 154/243 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 154/143 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్(33), ఉస్మాన్ ఖావాజా(57) ఉన్నారు.37 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 137/137 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్(22), ఉస్మాన్ ఖావాజా(51) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఆసీస్ బ్యాటర్లు..లంచ్ విరామం అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. 29 ఓవర్ల ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(38), మార్నస్ లబుషేన్(12) పరుగులతో ఉన్నారు.లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోర్: 112/1ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(38 బ్యాటింగ్), లబుషేన్(12 బ్యాటింగ్) ఉన్నారు.ఆసీస్ తొలి వికెట్ డౌన్.. కొంటాస్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన కొంటాస్ రవీంద్ర జడేజా ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. క్రీజులోకి మార్నస్ లబుషేన్ వచ్చాడు. 25 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 89/1.సామ్ కొంటాస్ హాఫ్ సెంచరీ..ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొంటాస్ తన అరంగేట్రంలో అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 52 బంతుల్లోనే కొంటాస్ తన తొలి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఆసీస్ తరపున టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో పిన్నవయష్కుడిగా కొంటాస్ నిలిచాడు. 19 ఏళ్ల 85 రోజుల్లో కొంటాస్ ఈ ఘనత అందుకున్నాడు. 14 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 77/0. క్రీజులో కొంటాస్(55), ఉస్మాన్ ఖావాజా(21) ఉన్నారు.9 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 37/0అసీస్ అరంగేట్ర ఆటగాడు సామ్ కొంటాస్ అద్బుతంగా ఆడుతున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సైతం ఈ యువ ఆటగాడు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. 9 ఓవర్లకు ముగిసే సరికి ఆసీస్ స్కోర్: 37/0. క్రీజులో కొంటాస్(20), ఉస్మాన్ ఖావాజా(16) ఉన్నారు.5 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 6/05 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. క్రీజులో కొంటాస్(2), ఉస్మాన్ ఖావాజా(4) ఉన్నారు.బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. శుబ్‌మన్ గిల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు.మరోవైపు ఆసీస్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మెక్‌స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్ కొంటాస్ తుది జట్టులోకి రాగా.. గాయం కారణంగా దూరమైన హాజిల్‌వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొంటాస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ -
ఆసీస్‌తో మ్యాచ్: టీమిండియాకు ఆఖరి అవకాశం
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్లో గురువారం నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్(Boxing Day Test) కోసం రెండు దిగ్గజ జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ సిరీస్ లో మూడు టెస్ట్ ల అనంతరం రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి 1-1తో సమఉజ్జీలుగా ఉండగా, ఈ సిరీస్ ఫలితం పై రెండు జట్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ భవితవ్యం కూడా ఆధారపడి ఉండటం ఈ సిరీస్ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.ఆస్ట్రేలియా ఆశలన్నీ ఈ సిరీస్ పైనేరెండేళ్లకి ఒకమారు తొమ్మిది టెస్ట్ లు ఆడే దేశాల మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(World Test Championship:) ఫైనల్ ఈ కాలంలో వివిధ జట్లు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండు ఫైనల్ కి అర్హత సాధించే జట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుత 2023-25 సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టిక లో దక్షిణాఫ్రికా ప్రధమ స్థానంలో ఉంది.శ్రీలంక తో సొంత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో 2-౦ తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా, పాయింట్ల పట్టిక లో 63.33 సగటు తో ప్రధమ స్థానానికి దూసుకుపోయింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 58.89 సగటు తో రెండో స్థానం లో ఉంది.అయితే ఆస్ట్రేలియా ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ లోని మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ ల తోపాటు శ్రీ లంక తో ఆ దేశంలో జరిగే మరో రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియా కి శ్రీ లంక ని స్పిన్ కి అనుకూలంగా ఉండే అక్కడ పిచ్ ల పై శ్రీ లంక ని ఓడించడం అంత సులువైన పని కాదు. అందుకే ఆస్ట్రేలియా కూడా ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి తన అవకాశాలని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రస్తుత సిరీస్‌పైనే ఆస్ట్రేలియా ఆశలు పెట్టుకుంది.టీమిండియాకు ఆఖరి అవకాశం ఈ సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ తో సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్ ల సిరీస్ లో 0-2 తో ఘోర పరాభవం పొందిన భారత్(Team India) తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్థానాన్ని జారవిడుచుకునే ప్రమాదంలో పడింది. వరుసగా రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించి, రెండింటిలో పరాభవాన్ని మూటగట్టుకున్న భారత్ కి ఈ రెండు టెస్టులలో విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక లో భారత్ 55.88 సగటుతో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ సిరీస్ కి ముందు పాయింట్ల పట్టిక లో ప్రథమ స్థానంలో ఉన్న భారత్ కి ఇది ఎదురుదెబ్బే .రెండు సార్లు పరాభవం ఇంతకుముందు 2019-21 లో కరోనా అనంతరం ఇంగ్లాండ్ లోని సౌతాంఫ్టన్ లోని రైస్ బౌల్ స్టేడియంలో జరిగిన ప్రథమ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. తర్వాత 2021- 23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి ఇంగ్లాండ్ లోన్ ఓవల్ స్టేడియం ఆతిధ్యాన్నిచ్చింది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ 209 పరుగుల తేడాతో వరుసగా రెండోసారి పరాజయంచవిచూసింది .ఈ నేపథ్యంలో ఈ సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధించాలని భారత్ చాలా గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు ఈ రెండు టెస్ట్ ల లో విజయం సాధించడం ఒక్కటే భారత్ ముందున్న అవకాశం. లేని పక్షంలో వరుసగా రెండు టెస్ట్ ఛాంపియన్షియప్ ఫైనల్స్ లో పాల్గొన్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుత భారత జట్టు సారధి రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీలు కూడా అదే బాటలో పయనించి భారత్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. -
'బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాదే గెలుపు... కానీ ఆ ఒక్కటే డౌట్'
భారత్-ఆస్ట్రేలియా మధ్య ‘బాక్సింగ్ డే’ టెస్టు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా(Teamindia) అన్ని విధాల సన్నద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది. 2020–21 పర్యటనలో మెల్బోర్న్లో విజయంతోనే టీమిండియా సిరీస్ గెలుపు దిశగా అడుగు వేసింది.ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భారత్ జట్టు యోచిస్తోంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల బీజీటీ ట్రోఫీ 1-1తో సమంగా ఉంది. దీంతో ఈ బ్యాక్సింగ్ డే ఇరు జట్లకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో టీమిండియాను ఉద్దేశించి పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తుందని అలీ అంచనా వేశాడు."మెల్బోర్న్ టెస్టులో భారత్ గెలుస్తుందని భావిస్తున్నాను. ఆఖరి రెండు టెస్టుల్లోనూ భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. నాలుగో టెస్టులో ఓడిపోతే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే ఛాన్స్‌లు సన్నగిల్లుతాయని ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది.ఆ తర్వాత శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్ గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ సిరీస్ శ్రీలంకలో జరగనుంది. ఉపఖండ పిచ్‌లలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తారు. ఇవన్నీ ఆసీస్ దృష్టిలో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ ఒత్తిడిలో ఆస్ట్రేలియా తప్పులు చేసే అవకాశముంది. దీన్ని భారత్ సొమ్ము చేసుకోవాలి.అయితే బ్రిస్బేన్, అడిలైడ్‌లో బ్యాటర్లు చేసిన తప్పిదాలు మెల్బోర్న్లో కూడా రిపీట్ చేస్తే భారత్‌కు కష్టాలు తప్పవు" అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. కాగా ఈ బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఆడనున్నట్లు సమాచారం.చదవండి: IND vs AUS: ఆసీస్‌తో నాలుగో టెస్టు.. గిల్, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్? -
నేను బాగానే ఉన్నా.. వాళ్లు పుంజుకుంటారు: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన గాయం గురించి కీలక అప్డేట్ అందించాడు. తన మోకాలు బాగానే ఉందని.. ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. అదే విధంగా.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు ఉంటుందని మరోసారి స్పష్టం చేశాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్‌లో భారత్, అడిలైడ్‌లో ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. ఫలితంగా ఇరుజట్లు సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి.నేను బాగానే ఉన్నానుఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో డిసెంబరు 26(బాక్సింగ్ డే) నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma PC) మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ప్రాక్టీస్‌లో తనకు తీవ్ర గాయమైందన్న వార్తలను ఖండించిన హిట్‌మ్యాన్.. తన మోకాలు బాగానే ఉందని పేర్కొన్నాడు.అతడిపై ఒత్తిడి లేదుఅదే విధంగా.. టీమిండియా యువ ఆటగాళ్ల వైఫల్యాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘రిషభ్ పంత్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు. అతడు గత కొంతకాలంగా ఫామ్‌లోనే ఉన్నాడు. అయితే, రెండు, మూడో టెస్టులో మాత్రం రాణించలేకపోయాడు.వాళ్లు తిరిగి పుంజుకుంటారుఅంతమాత్రాన ఏకపక్షంగా అతడి గురించి తీర్పులు ఇచ్చేయడం సరికాదు. ఎలా ఆడాలన్న అంశంపై అతడికి పూర్తి స్పష్టత ఉంది. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తిరిగి పుంజుకుంటారు. జట్టులో వారి పాత్ర ఏమిటో వారికి బాగా తెలుసు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు పూర్తయిన మూడు టెస్టుల్లో యశస్వి జైస్వాల్ 193, రిషభ్ పంత్ 96 పరుగులు చేశారు. ఇక రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ 60 పరుగులు చేశాడు. మరోవైపు.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. రెండు(3, 6), మూడు టెస్టు(10)ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన రోహిత్.. ఆరో స్థానంలో బరిలోకి దిగుతున్నాడు.చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
వాడిగా 'వేడిగా' సాగనున్న బాక్సింగ్ డే టెస్ట్!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ లో జరుగనున్న నాలుగో టెస్ట్ ఆరంభానికి ముందే వేడిని పుట్టిస్తోంది. సిరీస్ పరంగా చూస్తే, భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి సమఉజ్జీలుగా ఉన్న సంగతి తెలిసిందే. పెర్త్ లో జరిగిన మొదటి టెస్ట్ లో 295 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించగా, అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా పది వికెట్లతో గెలుపొందింది. దీంతో, సిరీస్ ని 1-1తో సమమైంది. గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన నేపథ్యంలో మెల్బోర్న్ లో, అదీ క్రిస్టమస్ పర్వ దినం తర్వాత బాక్సింగ్ డే నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన ఈ టెస్ట్ లో గెలిచేందుకు రెండు జట్లు పకడ్బందీ వ్యూహాలతో సిద్ధమవుతనడంలో సందేహంలేదు. వాతావరణ శాఖ హెచ్చరిక ఆస్ట్రేలియా వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు ఈ మ్యాచ్ కి ముందే వేడెక్కిస్తున్నాయి.మెల్బోర్న్లో ఓవర్ హీట్..ఈ మ్యాచ్ జరిగే తరుణంలో మెల్బోర్న్ లో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖంగా ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు చేపడుతున్నారు.ఆటగాళ్లకు అవసరమైతే డ్రింక్స్ విరామాన్ని పెంచాలని నిర్ణయించారు. త్వరలో మెల్బోర్న్ లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అయితే ఉష్ణోగ్రత 38డిగ్రీల సెల్సియస్ దాటితే మ్యాచ్‌లను నిలిపివేస్తారు.అయితే క్రికెట్ లో ఇలాంటి నిబంధనలు లేవు. గతంలో 2018 లో జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్ సందర్భంగా సిడ్నీ లో జరిగిన టెస్ట్ సమయం లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినప్పటికీ మ్యాచ్ ని కొనసాగించారు.చెన్నైలో డీన్ జోన్స్ డబుల్, ఆసుపత్రిపాలు ప్రఖ్యాత ఆస్ట్రేలియా బ్యాటర్ డీన్ జోన్స్ 1986 లో చెన్నై లోని చేపక్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా 41 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రతలో ఎనిమిది గంటలపాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీ సాధించి చివరికి ఆసుపత్రి పాలయ్యాడు.తన సుదీర్ఘ క్రీడా జీవితంలో 52 టెస్ట్‌లు, 164 వన్డే మ్యాచ్ లు ఆడి, రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్ గా కూడా ప్రఖ్యాతి వహించిన జోన్స్ 59 ఏళ్ళ ప్రాయంలో ఐపీఎల్ సందర్భంగా ముంబైలోని ఓ హోటల్ లో ఆకస్మిక గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అదే విధంగా 2017 -18 యాషెస్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రత 40డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఇన్నింగ్స్ మధ్యలో రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిడ్నీ లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ అనంతరం రూట్ ఆసుపత్రి పాలయ్యాడు, ఆస్ట్రేలియా ఈ సిరీస్ లో 4-౦ తో విజయం సాధించింది. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!?
మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి భారత్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశముంది. బాక్సింగ్ డే టెస్టుకు ఆ జట్టు స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది.హెడ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ కుంటుతూ కన్పించాడు. అతడు భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్‌కు కూడా రాలేదు.అయితే కాసేపటికే వర్షం కారణంగా మ్యాచ్ డ్రా కావడంతో అతడు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. కాగా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. 30 ఏళ్ల హెడ్ నాలుగో టెస్టు కోసం ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్లో కూడా కన్పించలేదంట.అతడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం ఫిట్నెస్ టెస్ట్‌లో పాల్గోనున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో పేర్కొంది. కాగా హెడ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి మూడు టెస్టుల్లో హెడ్ రెండు సెంచరీలు నమోదు చేశాడు.ఒకవేళ బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరమైతే అసీస్‌కు నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు జోషల్ హాజిల్‌వుడ్ సైతం గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
ఏంటి రోహిత్ భయ్యా? ఆఖరికి అతడి చేతిలో కూడా ఔటయ్యావు (వీడియో)
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా డిసెంబర్ 26 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ బ్యాక్సింగ్ డే టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు తిరిగి తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. అయితే తన ప్రాక్టీస్ తిరిగి మొదలుపెట్టిన హిట్‌మ్యాన్.. పార్ట్ టైమ్ బౌలర్ దేవ్‌దత్త్ పడిక్కల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు "ఏంటి రోహిత్ భయ్యా అతడి బౌలింగ్‌లో కూడా ఔట్ అయ్యావు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఒకే ఒక్క హాఫ్ సెంచరీ..కాగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన రోహిత్ శర్మ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం హిట్‌మ్యాన్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఒక్క సిరీస్ మాత్రమే కాకుండా గత ఏడాదిగా రోహిత్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తనచివరి 10 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అందులో ఆరుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే రోహిత్ పరిమితమయ్యాడు. కనీసం ఆస్ట్రేలియాతో ఆఖరి రెండు మ్యాచ్‌లలోనైనా రోహిత్ రాణించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. Rohit Sharma got beaten by Part-time Bowler Devdutt Padikkal in the nets 🥲 pic.twitter.com/6iGlPXO6Nl— Jyotirmay Das (@dasjy0tirmay) December 22, 2024 -
టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయాను ఎదుర్కొనే క్రమంలో బంతి రోహిత్ ఎడమ మోకాలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వెంటనే అతడికి ఫిజియో ఐస్ ప్యాక్‌ను తెచ్చి మోకాలి మర్ధన చేశాడు. ఆ తర్వాత రోహిత్ తన ప్రాక్టీస్‌ను కొనసాగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అతడి గాయంపై బీసీసీఐ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.మ్యాచ్ ఆరంభానికి ముందు హిట్‌మ్యాన్ గాయంపై జట్టు మెనెజ్‌మెంట్ ఓ అంచనాకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అతడు దూరమైతే సర్ఫరాజ్ ఖాన్ లేదా ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌లో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఇక ఇది ఇలా ఉండగా.. రోహిత్ కంటే ముందు నెట్ ప్రాక్టీస్‌లో కేఎల్ రాహుల్ సైతం గాయపడ్డాడు. అతడి కుడి చేతి మణికట్టుకు బంతి తాకింది. అయితే అతడి గాయం తీవ్రమైనది కానట్లు తెలుస్తోంది. డిసెంబర్ 26 నుంచి ఈ బ్యాక్సింగ్ డే టెస్టు ఆరంభం కానుంది.చదవండి: ధోని శిష్యుడి విధ్వంసం.. 20 సిక్స్‌లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ -
టీమిండియా బోల్తా
‘బాక్సింగ్ డే’ టెస్టులో మన జట్టు మూడే రోజుల్లో మునిగింది. రోజు రోజుకూ ప్రత్యర్థి జట్టే పట్టు బిగించడం... మూడో రోజైతే ఏకంగా అటు బ్యాటింగ్‌లో ప్రతాపం... ఇటు బౌలింగ్‌లో పట్టుదల చూపిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ విజయం సాధించింది. దీంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ సఫారీ బౌలింగ్ ముందు ఎదురు నిలువలేకపోయింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ సొంతం చేసుకునేందుకు భారత్ మరోసారి పర్యటించాల్సి ఉంటుంది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సెంచూరియన్: టీమిండియా ఈ పర్యటనలో టి20లను సమం చేసుకున్నా... వన్డే సిరీస్‌ను వశం చేసుకున్నా... అసలైన క్రికెట్ టెస్టు ఫార్మాట్‌కు వచ్చేసరికి సఫారీలో సవారీ అంత సులభం కానేకాదని తొలిటెస్టు మూడు రోజుల్లోనే తెలుసుకుంది. ‘బాక్సింగ్ డే’ పోరులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. మొదట ఓవర్‌నైట్ స్కోరు 256/5తో గురువారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 108.4 ఓవర్లలో 408 పరుగుల వద్ద ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డీన్ ఎల్గర్ (287 బంతుల్లో 185; 28 ఫోర్లు), మార్కొ జానెŠస్న్ (147 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) భారీస్కోరుకు బాటవేశారు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 111 పరుగులు జోడించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 163 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 34.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. కోహ్లి (82 బంతుల్లో 76; 12 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ పరుగులే చేయలేదు. రెండు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది. అప్పుడు రాహుల్... ఇప్పుడు కోహ్లి ఈ టెస్టులో సఫారీ పేసర్లు భారత బ్యాటర్ల పాలిట గన్ గురిపెట్టునట్లుగా... బంతుల స్థానంలో బుల్లెట్లు సంధించారేమో! ఎందుకంటే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటర్లు తేలిగ్గా వికెట్లను సమర్పించుకున్నారు. ముఖ్యంగా మూడో రోజైతే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలాన్ని, బౌలింగ్ అ్రస్తాల్ని ప్రయోగించిన తీరుకు భారత్ భీతిల్లిపోయింది. ప్రత్యర్థి తొలిసెషన్‌కు పైగా ఆడింది. 42.4 ఓవర్లలో మిగిలున్న 5 వికెట్లతోనే 152 పరుగులు చేసింది. కానీ 10 మంది భారత బ్యాటర్లు కనీసం 35 ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయారు. రబడ (2/32), బర్గర్ (4/33), జాన్సెన్ (3/36) ముప్పేట దాడికి దిగడంతో అనుభవజు్ఞడైన కెపె్టన్ రోహిత్ (0) ఖాతా తెరువలేకపోయాడు. యశస్వి (5), అయ్యర్ (6), కేఎల్ రాహుల్ (4), అశ్విన్ (0), శార్దుల్ (2) సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. కోహ్లి అర్ధసెంచరీతో పోరాడగా, శుబ్‌మన్ గిల్ (26) కాస్త మెరుగనిపించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 245 ఆలౌట్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 5; ఎల్గర్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 185; టోని జార్జి (సి) జైస్వాల్ (బి) బుమ్రా 28; పీటర్సన్ (బి) బుమ్రా 2; బెడింగ్హమ్ (బి) సిరాజ్ 56; వెరిన్ (సి) రాహుల్ (బి) ప్రసి«ద్‌కృష్ణ 4; జాన్సెన్ నాటౌట్ 84; కొయెట్జీ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 19; రబడ (బి) బుమ్రా 1; బర్గర్ (బి) బుమ్రా 0; బవుమా (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (108.4 ఓవర్లలో ఆలౌట్) 408. వికెట్ల పతనం: 1–11, 2–104, 3–113, 4–244, 5–249, 6–360, 7–391, 8–392, 9–408. బౌలింగ్: బుమ్రా 26.4–5–69–4, సిరాజ్ 24–1–91–2, శార్దుల్ 19–2–101–1, ప్రసిధ్ కృష్ణ 20–2–93–1, అశ్విన్ 19–6–41–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి)బర్గర్ 5; రోహిత్ (బి) రబడ 0; గిల్ (బి) జాన్సెన్ 26; కోహ్లి (సి) రబడ (బి) జాన్సెన్ 76; అయ్యర్ (బి) జాన్సెన్ 6; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) బర్గర్ 4; అశ్విన్ (సి) బెడింగ్హమ్ (బి) బర్గర్ 0; శార్దుల్ (సి) బెడింగ్హమ్ (బి) రబడ 2; బుమ్రా రనౌట్ 0; సిరాజ్ (సి) వెరిన్ (బి) బర్గర్ 4; ప్రసిద్‌కృష్ణ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (34.1 ఓవర్లలో ఆలౌట్) 131. వికెట్ల పతనం: 1–5, 2–13, 3–52, 4–72, 5–96, 6–96, 7–105, 8–113, 9–121, 10–131. బౌలింగ్: రబడ 12–3–32–2, బర్గర్ 10–3–33–4, జాన్సెన్ 7.1–1–36–3, కొయెట్జీ 5–0–28–0. -
బాబర్‌ను హత్తుకున్న ఖవాజా చిన్నారి కూతురు.. అందమైన దృశ్యాలు
ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఆసీస్ క్రికెటర్లకు స్వీట్ షాకిచ్చారు పాక్ ప్లేయర్లు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఇండోర్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తున్న కంగారూ ఆటగాళ్లను బహుమతులతో ముంచెత్తారు. క్రిస్మస్ సందర్భంగా వారి కుటుంబాలకు కానుకలు అందజేసిన పాకిస్తానీ క్రికెటర్లు.. చిన్నపిల్లలకు లాలీపాప్స్ అందించి ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. పాక్ ఆటగాళ్ల చర్యకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ సహా డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్ తదితరలు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తూ వారి ప్రయత్నాన్ని అభినందించారు. Warm wishes and heartfelt gifts for the Australian players and their families at the MCG indoor nets 🎁✨ pic.twitter.com/u43mJEpBTR — Pakistan Cricket (@TheRealPCB) December 25, 2023 ఇక ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూతుళ్లు.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను ఆత్మీయంగా హత్తుకుని ధన్యవాదాలు తెలియజేయడం హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన అందమైన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. A very cute moment between Babar Azam and Usman Khawaja's daughter ♥️♥️ #AUSvPAKpic.twitter.com/GP5NhpJ95f — Farid Khan (@_FaridKhan) December 25, 2023 ఈ నేపథ్యంలో.. ‘‘మైదానంలో దిగిన తర్వాతే ప్రత్యర్థులం.. మైదానం వెలుపల మాత్రం మేమెప్పటికీ స్నేహితులమే అన్న భావనతో మెలుగుతామని ఈ క్రీడాకారులు మరోసారి నిరూపించారు’’ అంటూ క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మెల్బోర్న్ వేదికగా మంగళవారం ఆసీస్- పాక్ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో కాసేపు ఆటను నిలిపివేశారు. అప్పటికి 42.4 ఓవర్లలో ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఇక వాన తెరిపినివ్వడంతో మళ్లీ ఆటను ఆరంభించగా.. 50 ఓవర్లలో స్కోరు 126-2గా ఉంది. చదవండి: స్టార్ బౌలర్లకు షాకిచ్చిన అఫ్గన్ బోర్డు.. రెండేళ్ల నిషేధం! -
T20 WC: నాకూ ఆడాలనే ఉంది.. టీ20 కెరీర్‌పై రోహిత్ శర్మ క్లారిటీ!
Ind vs SA 1st Test Rohit Sharma Comments: సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలుస్తామనే నమ్మకం ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో ప్రతి ఒక్కరు కఠిన శ్రమకోరుస్తూ తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. కాగా భారత జట్టుకు సఫారీ దేశంలో టెస్టు సిరీస్ విజయం అందని ద్రాక్షగానే ఉంది. అయితే, ఈసారైనా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాం కాగా బాక్సింగ్ డే నుంచి సౌతాఫ్రికా- భారత్ మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ‘‘నా దృష్టిలో ఈ సిరీస్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. గతంలో ఏ భారత జట్టూ సాధించని ఘనతను అందుకునేందుకు ఇదో మంచి అవకాశం. గతంలో రెండుసార్లు సిరీస్ గెలిచేందుకు చేరువగా వచ్చినా సాధ్యం కాలేదు. ఈసారి కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇక్కడ అడుగు పెట్టాం. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని ఈ టెస్టు సిరీస్‌కు ముడి పెట్టలేం. అయితే ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఏదో ఒకటి దక్కాలి. షమీ లేకపోవడం లోటే కానీ కొత్త బౌలర్‌కు ఇది మంచి అవకాశం. మ్యాచ్‌కు ముందే మూడో పేసర్‌పై నిర్ణయం తీసుకుంటాం. కీపర్‌గా రాహుల్ రాణిస్తాడనే నమ్ముతున్నాం. అతను ఈసారి మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడు’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. త్వరలోనే మీకు సమాధానం లభిస్తుంది ఇక ఈ సందర్భంగా తన టీ20 భవిష్యత్తు గురించి స్పందిస్తూ.. ‘‘నాకు ఆడేందుకు అవకాశం ఉన్న అన్ని చోట్లా క్రికెట్ ఆడుతూనే ఉంటాం. అందరికీ ఆడాలనే ఉంటుంది. (మీరు ఏం అడుగుతారో నాకు తెలుసు). నా టి20 భవిష్యత్తు గురించి త్వరలోనే మీకు సమాధానం లభిస్తుంది’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్-2022 ముగిసిన తర్వాత హిట్‌మ్యాన్ ఇంత వరకు ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడలేదన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లోనైనా అతడి మెరుపులు చూసే అవకాశం వస్తుందని అభిమానులు భావిస్తున్న తరుణంలో ముంబై ఇండియన్స్ ఇటీవలే కీలక ప్రకటన చేసింది. ముంబైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో రోహిత్.. హార్దిక్ సారథ్యంలో ఆడతాడా? లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడా అన్న అనుమానాల నడుమ హిట్‌మ్యాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఒకవేళ రోహిత్ శర్మ గనుక ఐపీఎల్-2024కు దూరమైతే ఇక ప్రపంచకప్ ఈవెంట్లోనూ ఆడనట్లే!! Rohit Sharma on T20 World Cup 2024 pic.twitter.com/dxSNqbXxPY — Awadhesh Mishra (@sportswalaguy) December 25, 2023 చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికా-భారత్ టెస్టు సిరీస్.. ఐరెన్ లెగ్ అంపైర్ ఔట్ -
PAK vs AUS: పాకిస్తాన్‌కు ఊహించని షాక్..
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు ముందు పాకిస్తాన్‌కు బిగ్‌షాక్ తగిలింది. పాక్ యువ పేసర్ ఖుర్రం షాజాద్ గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టుతో అరంగేట్రం చేసిన షాజాద్.. మోకాలి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ అనంతరం అతడిని స్కానింగ్ తరలించగా గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే అతడిని పాకిస్తాన్ మేనెజ్మెంట్ తప్పించింది. కాగా తన అరంగేట్ర మ్యాచ్‌లో ఈ యువ పేసర్ అకట్టుకున్నాడు. మొదటి టెస్టులో 5 వికెట్లు పడగొట్టి షాజాద్ సత్తాచాటాడు. ఇక అతడి స్ధానంలో సీనియర్ పేసర్ హసన్ అలీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టులో 360 పరుగుల తేడాతో పాక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. -
పాక్‌తో రెండో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! యువ ఆటగాడు రిలీజ్
పాకిస్తాన్‌తో బాక్సింగ్ డే టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేసర్ లాన్స్ మోరిస్‌ను రెండో టెస్టుకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. మోరిస్ బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గోనున్నాడు. ఇదొక్కటి మినహా తమ జట్టులో ఆసీస్ ఎటువంటి మార్పు చేయలేదు. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌లో ఇప్పటికే ఆసీస్ 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ను ఏకంగా 360 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. 450 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. ఆసీస్ బౌలర్ల దాటికి 89 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ -
మూడేళ్ల తర్వాత రీఎంట్రీ.. నోర్ట్జే స్థానంలో
Duanne Olievier Set Comeback For SA In Boxing Day Test Vs IND.. టీమిండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. కాగా గాయపడ్డ అతని స్థానంలో కొత్త ఆటగాడిని ఎంపిక చేసేందుకు సీఎస్ఏ ఆసక్తి చూపలేదు. దీంతో తొలి టెస్టుకు నోర్జ్టే స్థానంలో ఎవరొస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో డ్యుయన్నే ఓలివర్ పేరు వినిపిస్తుంది. ఇదే నిజమైతే దాదాపు మూడేళ్ల తర్వాత సౌతాఫ్రికా తరపున ఓలివర్ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఇప్పటివరకు ప్రొటీస్ తరపున 10 టెస్టుల్లో 48 వికెట్లు పడగొట్టాడు. కగిసో రబాడ, లుంగీ ఎన్గిడితో కలిసి ఓలివర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాకు బిగ్‌షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం కాగా 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఓలివర్.. 2018లో చివరిసారి పాకిస్తాన్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టును ఆడాడు. కాగా ఓలివర్ ఆ ఆ టెస్టులో విశేషంగా రాణించాడు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఓలివర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో 24 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2019 జనవరిలో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే ద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే తరచూ గాయాల బారీన పడుతూ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత ఓలివర్ బాక్సింగ్ డే టెస్టు ద్వారానే ఎంట్రీ ఇస్తుండడం విశేషం. టీమిండియాతో ఆడబోయే సౌతాఫ్రికా జట్టు(అంచనా): డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, కీగన్ పీటర్సన్, వాన్‌డర్ డుసెన్, కైల్ వెరిన్నే, క్వింటన్ డికాక్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, డ్యుయన్నే ఓలివర్, లుంగీ ఎన్గిడి -
‘స్టీవ్ స్మిత్‌పై నాకు నమ్మకం ఉంది’
మెల్బోర్న్: ప్రతీ ఆటగాడి కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమని, తమ బ్యాట్స్‌మెన్ తిరిగి ఫాంలోకి వస్తారనే నమ్మకం ఉందని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, సిడ్నీ టెస్టులో మెరుగ్గా రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఏడాది క్రితం తమ బ్యాటర్లు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను మట్టికరిపించారని, అదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు. కాగా బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా చేతిలో 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక ఆసీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. పేలవ బ్యాటింగ్‌తో చతికిలపడి.. ఓ చెత్త రికార్డును నమోదు చేశారు. స్వదేశంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా కనీసం అర్ధ సెంచరీ చేయకపోవడం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముఖ్యంగా ఆసీస్ మాజీ కెప్టెన్, ఈ దశాబ్దపు టెస్టు ప్లేయర్(టెస్టు ప్లేయర్ ఆఫ్ ది డికేడ్)గా నిలిచిన స్టీవ్ స్మిత్ రెండు టెస్టుల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. (చదవండి: రహానే అన్ని ప్రశంసలకు అర్హుడు: రవిశాస్త్రి) ఈ నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘మా టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. తిరిగి ఫాంలోకి వస్తారు. గత పన్నెండేళ్లుగా స్టీవ్ చాంపియన్‌గానే ఉన్నాడు. ప్రతీ ఆటగాడి జీవితంలో ఎత్తుపళ్లాలు ఉంటాయి. తను ఒక్కసారి నిలదొక్కుకుంటే చాలు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మేం ఆడింది కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఒక్క ఓటమికే కుంగిపోవాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక తమ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరితే మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నాడు. కాగా చివరిసారిగా 1988లో డిసెంబరు 24 నుంచి 29 వరకు ఎంసీజీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఎవరూ అర్ధ సెంచరీ చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 285 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.(చదవండి: ఆసీస్‌కు ‘చాంపియన్‌షిప్’పాయింట్లు కోత) -
కోహ్లిని చూసినట్టే అనిపించింది: రవిశాస్త్రి
మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ప్రదర్శన పట్ల ప్రధాన కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. భారీ ఓటమి తర్వాత ఇంత గొప్పగా పునరాగమనం చాటడం ప్రశంసనీయమన్నాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రహానే సారథ్యంలోని టీమిండియా ఆతిథ్య జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది, పింక్‌బాల్ టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘36 పరుగులకు ఆలౌటైన తర్వాత కోలుకొని ప్రత్యర్థిపై పంచ్ విసిరేందుకు సిద్ధం కావడం అసాధారణం. నా దృష్టిలో భారత క్రికెట్లో... కాదు కాదు ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఘనమైన పునరాగమనంగా ఇది నిలిచిపోతుంది. మ్యాచ్‌లో మా కుర్రాళ్లు చూపించిన పట్టుదల అద్భుతం. ముఖ్యంగా అడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత ఆటగాళ్లకు నేను ఏమీ చెప్పలేదు. అలాంటి వైఫల్యం తర్వాత చేసేదేమీ ఉండదు. అయితే ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించాలంటే మ్యాచ్‌లో కొద్దిసేపు మాత్రమే కాకుండా ఐదు రోజులూ ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే. మంగళవారం క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలని, అవసరమైతే 150 పరుగుల వరకు కూడా ఛేదించాల్సి వస్తే సిద్ధంగా ఉండాలని మాట్లాడుకున్నాం. కీలక దశలో కెప్టెన్సీ భారం మోస్తూ కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఆరు గంటల పాటు మైదానంలో ఉండి సెంచరీ చేసిన రహానే అన్ని ప్రశంసలకు అర్హుడు. కోహ్లి, రహానే ఇద్దరూ గేమ్‌ను చక్కగా అర్థం చేసుకుంటారు. తనకేం కావాలో రహానేకు బాగా తెలుసు. తొందరపాటుకు తావివ్వకుండా కుదురుగా తన పని తాను చేశాడు. కోహ్లిని చూసినట్టే అనిపించింది’’ అని కితాబిచ్చాడు.(చదవండి: విజయ మధురం) టీమిండియా బాగా ఆడింది: టిమ్ పైన్ చాలా నిరాశగా ఉంది. మేం ఎంతో పేలవంగా ఆడాం. భారత్ చాలా బాగా ఆడింది. చక్కటి బౌలింగ్‌తో మేం తప్పులు చేసేలా పురిగొల్పింది. పరిస్థితులకు తగినట్లుగా మా ఆటను మార్చుకోలేకపోయాం. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాం. మా ఆటను మెరుగుపర్చుకొని తర్వాతి రెండు టెస్టులకు సిద్ధమవుతాం. –టిమ్ పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్ Great to see the maturity and confidence @RealShubmanGill & Siraj displayed on the field - @RaviShastriOfc #AUSvIND #TeamIndia pic.twitter.com/R0RhzleUX9 — BCCI (@BCCI) December 29, 2020 -
ఆ క్రెడిట్ వాళ్లిద్దరిదే: రహానే
మెల్బోర్న్: తాము అవలంబించిన ఐదు బౌలర్ల వ్యూహం బాగా పనిచేసిందని టీమిండియా కెప్టెన్(తాత్కాలిక) అజింక్య రహానే హర్షం వ్యక్తం చేశాడు. అడిలైడ్ టెస్టులో చేదు అనుభవం ఎదురైనప్పటికీ ఒత్తిడిని జయించి ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించారని పేర్కొన్నాడు. ముఖ్యంగా రెండో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్, బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడారంటూ రహానే ప్రశంసలు కురిపించాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రహానే సారథ్యంలోని భారత జట్టు ఆసీస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది పింక్‌బాల్ టెస్టులో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ వంటి ముఖ్యమైన ఆటగాళ్లు దూరమైనప్పటికీ సమిష్టి కృషితో ఆసీస్‌ను మట్టికరిపించింది.(చదవండి: బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం) ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రహానే మాట్లాడుతూ.. ‘‘ మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల నాకెంతో గర్వంగా ఉంది. అందరూ బాగా ఆడారు. అయితే ఈ విక్టరీ క్రెడిట్ అరంగేట్ర ఆటగాళ్లు సిరాజ్, గిల్‌కే ఇవ్వాలనుకుంటున్నాను. అడిలైడ్ మ్యాచ్ తర్వాత జట్టులోకి వచ్చిన వీళ్లిద్దరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన తీరు అమోఘం. అలాంటి వ్యక్తిత్వమే ఎంతో ముఖ్యం. ఇక మేం అనుసరించిన ఐదు బౌలర్ల వ్యూహం ఈ మ్యాచ్‌లో చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఒక ఆల్‌రౌండర్ కావాలనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే జడేజా అద్భుతంగా రాణించాడు. ఇక శుభ్‌మన్ గురించి చెప్పాలంటే తన ఫస్ట్‌క్లాస్ కెరీర్ గురించి మనకు తెలుసు. ఈ మ్యాచ్‌లో కూడా తను అదే స్థాయిలో ఆడాడు. సిరాజ్ ఎంతో క్రమశిక్షణగా బౌల్ చేశాడు. దేశవాలీ క్రికెట్లో వారికున్న అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడింది. మైదానంలో వారు ప్రదర్శించిన ఆటతీరు గొప్పగా ఉంది’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లు తీయగా.. గిల్ మొత్తంగా 80(45+35) పరుగులు చేశాడు. -
బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం
మెల్బోర్న్: పింక్ బాల్ టెస్టులో ఘోర పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో ఒక రోజు ఆట మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల స్వల్ప టార్గెట్‌ను టీమిండియా 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ హీరో కెప్టెన్ అజింక్యా రహానే (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (36 బంతుల్లో 35; 7 ఫోర్లు) లక్ష్యం చిన్నదే కావడంతో ఆచితూచి ఆడి టార్గెట్‌ను కరిగించారు. మూడో వికెట్‌కు విలువైన 51 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఫలితంగా వెంటవెంటనే మయాంక్ అగర్వాల్ (5), పుజారా (3) వికెట్ కోల్పోయినప్పటికీ భారత్ సునాయాసంగా గెలుపు బాట పట్టింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ దూరమైనప్పటికీ రహానే నేతృత్వంలో విజయం సాధించిన భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. కెప్టెన్ ఇన్సింగ్స్‌తో ఆకట్టుకున్న అజింక్యా రహానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా టెస్టుల్లో రహానేకు ఇది మూడో విజయం కావడం విశేషం. అంతేకాకుండా మెల్బోర్న్లో భారత జట్టుకు వరుసగా రెండో విజయం కూడా ఇదే. మొత్తంగా మెల్బోర్న్లో భారత జట్టుకు నాలుగో విజయమిది. ఇక జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది. (చదవండి: ఈ దశాబ్దపు మేటి క్రికెటర్ కోహ్లి) ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 195 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 200 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్ 326 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 70/2(15.5 ఓవర్లు) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టార్గెట్ 70; బిగ్ వికెట్ కోల్పోయిన భారత్
మెల్బోర్న్: ఆసీస్ విధించిన 70 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (15 బంతుల్లో 5) ఔటైన కాసేపటికే కీలక బ్యాట్స్‌మన్ పుజారా (4 బంతుల్లో 3) వికెట్ కోల్పోయింది. మయాంక్‌ను స్టార్క్ పెవిలియన్ పంపగా.. పుజారాను కమిన్స్ ఔట్ చేశాడు. బంతి ఎడ్జ్ తీసుకుని గల్లీలో ఉన్న గ్రీన్ చేతిలో పడటంతో పుజారా నిరాశగా వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లకు 36 పరుగులు చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో సెంచరీ హీరో కెప్టెన్ అజింక్యా రహానే (8), ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (20) క్రీజులో ఉన్నారు. ఇక అడిలైడ్‌లో జరిగిన పింక్‌బాల్ టెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న భారత్, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తో సమం చేయాలని కృత నిశ్చయంతో ఉంది. మరో 34 పరుగులు చేస్తే టీమిండియా బాక్సింగ్ డే టెస్టును సొంతం చేసుకుంటుంది. -
ఆసీస్ 200 ఆలౌట్, భారత్ టార్గెట్ 70 పరుగులు
మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో భారత్ లక్ష్యం ఖరారైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 200 ఆలౌట్ అయింది. దీంతో విజయం సాధించేందుకు టీమిండియా 70 పరుగులు చేయాల్సి ఉంది. ఆతిథ్య జట్టులో గ్రీన్ 45, వేడ్ 40, లబుషేన్ 28, కమిన్స్ 22 ప్రతిఘటనతో భారత్ గెలుపు ఆలస్యమైంది. సిరాజ్ 3, బుమ్రా, జడేజా, అశ్విన్‌కు తలో 2 వికెట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. లంచ్ విరామం అనంతరం టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్లేమీ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (5), శుభ్‌మన్ గిల్ (10) క్రీజులో ఉన్నారు. సిరాజ్‌కు రెండు 133/6 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 23 పరుగులు జత చేసిన అనంతరం కమిన్స్ (103 బంతుల్లో 22; 1x4) వికెట్ కోల్పోయింది. బుమ్రా విసిరిన బంతి కమిన్స్ గ్లోవ్స్‌ను తాకి సెకండ్ స్లిప్‌లో ఉన్న అగర్వాల్ చేతిలో పడింది. ఇక ఎనిమిదో వికెట్‌గా క్రీజులోకొచ్చిన స్టార్క్ సహకారంతో గ్రీన్ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. బుమ్రా వేసిన 90 ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. అర్ధ సెంచరీకి చేరువవుతున్న గ్రీన్ (146 బంతుల్లో 45; 5x4)ను సిరాజ్ పెవిలియన్ పంపాడు. అప్పటికీ ఆసీస్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 177 పరుగులు. చివర్లో లైయన్‌ను సిరాజ్, హేజిల్‌వుడ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపడంతో ఆతిథ్య జట్టు 200 పరుగులకు ఆలౌట్ అయింది. -
బాక్సింగ్ డే టెస్టు: అంపైర్స్ కాల్‌పై సచిన్ అసహనం
న్యూఢిల్లీ: డీఆర్ఎస్ విధానంలో ‘అంపైర్స్ కాల్’ నిబంధన పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ‘అంపైర్ నిర్ణయంపై సంతృప్తి లేకనే డీఆర్ఎస్ను ఆశ్రయిస్తారు ఆటగాళ్లు. మరి ఆ నిర్ణయాన్ని సమీక్షించి నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన థర్డ్ అంపైర్.. తను ఎటూ తేల్చలేక మళ్లీ అంపైర్ అభిప్రాయానికే వదిలేస్తే.. లాభం ఏముంటుంది’అని సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. డీఆర్ఎస్ విధానంపై ముఖ్యంగా ‘అంపైర్స్ కాల్’ అంశంపై దృష్టి సారించాలని ట్విటర్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను కోరాడు. కాగా, బాక్సింగ్ డే టెస్టులో ఎల్బీగా ఔట్ కావాల్సిన లబుషేన్, జో బర్న్స్ ఈ నియమం వల్ల బతికిపోయారు. టీమిండియా ఆటగాళ్ల అప్పీల్‌ను అంపైర్ తోసిపుచ్చడంతో.. కెప్టెన్ రహానే డీఆర్ఎస్కు వెళ్లాడు. అయినా, ఫలితం లేకపోయింది. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: విజయావకాశాలు మనకే!) బంతి వెళ్తున్న దశేమిటో స్పష్టత లేకపోవడంతో థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ అంపైర్ అభిప్రాయానికే నిర్ణయాన్ని వదిలేశాడు. దాంతో వారిద్దరూ సేవ్ అయ్యారు. అయితే, బంతి మాత్రం సరైన దిశలోనే వికెట్లపైకి వెళ్లిందని రీప్లేలో తెలుస్తోంది. మరోవైపు డీఆర్ఎస్ ద్వారా సరైన నిర్ణయం రాకపోవడం.. అంపైర్ అభిప్రాయానికే నిర్ణయాలను వదిలేయడంపై టీమిండియా ఆటగాళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజా మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 195 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా, రెండో ఇన్సింగ్స్‌లో 326 పరుగులు చేసి 131 ఆదిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను మరోమారు భారత బౌలర్లు బెంలేలెత్తించారు. 133 పరుగులకే కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 పరుగుల ఆదిక్యంలో ఉంది. టెయిలెండర్లు కామెరూన్ గ్రీన్ (17), పాట్ కమిన్స్ (15) క్రీజులో ఉన్నారు. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: 2 పరుగుల ఆదిక్యంలో ఆసీస్) The reason players opt for a review is because they’re unhappy with the decision taken by the on-field umpire. The DRS system needs to be thoroughly looked into by the @ICC, especially for the ‘Umpires Call’.#AUSvIND — Sachin Tendulkar (@sachin_rt) December 28, 2020 -
బాక్సింగ్ డే టెస్టు: పట్టు బిగిస్తున్న భారత్
మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 195 పరుగులకు ఆలౌట్ చేసిన రహానే సేన.. 326 పరుగులు చేసి 131 పరుగుల విలువైన ఆదిక్యాన్ని సాధించింది. అనంతరం మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ తలా ఒక వికెట్ తీయగా, రవీంద్ర జడేజా రెండు వికెట్లు సాధించి ఆతిథ్య జట్టు నడ్డి విరిచారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లు ఆడిన ఆసీస్ 133 పరుగులు చేసి కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం టెయిలెండర్లు కామెరూన్ గ్రీన్ (17), పాట్ కమిన్స్ (15) క్రీజులో ఉన్నారు. ఆసీస్ 2 పరుగుల ఆదిక్యంలో ఉంది. ఇక పోస్టు మ్యాచ్ ప్రెజంటేషన్లో మాట్లాడిన కెప్టెన్ రహానే భారత బౌలర్ల కృషిని కొనియాడాడు. కీలకమైన వికెట్లు తీయడం ద్వారా టీమిండియాను మంచి స్థితిలో నిలిపారని అన్నాడు. మ్యాచ్ అప్పుడే అయిపోలేదని మిగతా వికెట్లును త్వరత్వరగా తీయగలిగితే ఆశించిన ఫలితం వస్తుందని పేర్కొన్నాడు. తన రనౌట్ అనంతరం జడేజా అసంతృప్తికి లోనయ్యాడని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని అతనికి సూచించినట్టు రహానే చెప్పుకొచ్చాడు. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: అంపైర్స్ కాల్‌పై సచిన్ అసహనం) -
రెండో టెస్టు: బిగ్ వికెట్ కూల్చిన బుమ్రా
మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా జట్టు కీలక వికెట్ కోల్పోయింది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్టీవ్ స్మిత్ (30 బంతుల్లో 8)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ప్రస్తుతం 81 పరుగుల వద్ద ఉంది. ఓపెనర్ జో బర్న్స్ (10 బంతుల్లో 4)ను ఉమేశ్ యాదవ్, మార్నస్ లబుషేన్ (49 బంతుల్లో 28; 1 ఫోర్)ను అశ్విన్ ఔట్ చేశారు. ప్రస్తుతం భారత్ కంటే ఆతిథ్య జట్టు 50 పరుగుల వెనకబడి ఉంది. మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ 34 పరుగులు, ట్రావిస్ హెడ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 195 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. 326 పరుగులు చేసి 131 ఆదిక్యాన్ని సాధించింది. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: విజయావకాశాలు మనకే!) -
బాక్సింగ్ డే టెస్టు: విజయావకాశాలు మనకే!
మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 131 పరుగుల ఆదిక్యం సాధించిన భారత జట్టుకు విజయవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని గత రికార్డులను బట్టి తెలుస్తోంది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 100కు పైగా తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం సాధించిన జట్లు ఎక్కువ సార్లు గెలుపును సొంతం చేసుకున్నాయి. సెంచరీ పరుగుల కంటే ఎక్కువ తొలి ఇన్నింగ్స్ ఆదిక్యంతో గెలిచిన జట్లలో భారత్ కూడా ఉండటం విశేషం. 1910లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగులు ఆదిక్యం సాధించింది. రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంతో ద్వారా 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. 1931లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగుల ఆదిక్యం సాధించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసి 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. (చదవండి: రహానే అనూహ్య రనౌట్, టీమిండియా ఆలౌట్) 1972లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్సింగ్స్‌లో 133 పరుగుల ఆదిక్యం సాధించిన ఆతిథ్య జట్టు ప్రత్యర్థిని రెండో ఇన్సింగ్స్‌లో కట్టడి చేసి.. 92 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. ఇక 1980లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్సింగ్స్‌లో 182 పరుగుల భారీ ఆదిక్యాన్ని సాధించింది. ఆతిథ్య జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసి 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, పైన పేర్కొన్న నాలుగింటిలో మూడింట ఆస్ట్రేలియానే ఉండటం గమనార్హం. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో ఆదిక్యం సాధించి వరుసగా రెండు టెస్టుల్లో టీమిండియా ఎప్పుడూ ఓటమి చెందకపోవడం విశేషం. ఇక తాజా మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్సింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ అయిన ఆసీస్.. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 28/1 తో బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా తొలి ఇన్సింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. (చదవండి: నాయకుడు నడిపించాడు) -
రహానే అనూహ్య రనౌట్, టీమిండియా ఆలౌట్
మెల్బోర్న్: తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 277/5 తో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్ 326 పరుగులకు ఆలౌట్ అయింది. సెంచరీతో జట్టును ఆదుకున్న కెప్టెన్ అజింక్యా రహానే అనూహ్యంగా రనౌట్ కావడంతో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. లయన్ బౌలింగ్‌లో జడేజా షాట్ కొట్టగా రిస్కీ రన్ తీసే క్రమంలో రహానే (223 బంతులు 112; ఫోర్లు 12) రనౌట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 6 వికెట్లకు 294 పరుగులు. ఇక మరికొద్ది సేపటికే అర్ద సెంచరీ సాధించిన జడేజా, అశ్విన్‌తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. అయితే, 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా ఏడో వికెట్‌గా వెనుదిరగడంతో మిగతా టెయిలెండర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఉమేశ్ యాదవ్ (9), అశ్విన్ (14), బుమ్రా (0) వెనువెంటనే ఔటవడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 32 పరుగుల వ్యవధిలో టీమిండియా చివరి ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. స్టార్క్, లయన్ మూడు వికెట్ల చొప్పున, కమిన్స్ రెండు, హేజిల్‌వుడ్ ఒక వికెట్ సాధించారు. ఇక ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ కావడంతో.. టీమిండియాకు 131 పరుగుల ఆదిక్యం లభించింది. (చదవండి: నాయకుడు నడిపించాడు) -
తండ్రి కలను నెరవేర్చిన సిరాజ్
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ అరంగేట్రం చేశాడు. లబుషేన్ (132 బంతుల్లో 48; ఫోర్లు 4) ను ఔట్ చేయడం ద్వారా తన తొలి మెయిడెన్ వికెట్ తీశాడు. ఇక సిరాజ్ టెస్టు ఎంట్రీ సందర్భంగా అతని సోదరుడు మహ్మద్ ఇస్మాయిల్ ఆనందం వ్యక్తం చేశాడు. తమ తండ్రి కలను సిరాజ్ నిజం చేశాడని అన్నాడు. తమకెంతో గర్వంగా ఉందని మీడియా పేర్కొన్నాడు. తన తమ్ముడి ఆటకోసం ఉదయం నాలుగు గంటలకే టీవీ ఆన్ చేశామని ఇస్మాయిల్ చెప్పుకొచ్చారు. ఇక తొలి టెస్టులో గాయపడటంతో మహ్మద్ షమీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. దాంతో సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కాగా, మహ్మద్ సిరాజ్ తండ్రి ఊపితిత్తుల వ్యాధితో బాధపడుతూ గత నవంబర్‌లో హైదాబాద్‌లో మృతి చెందారు. అయితే, ఆస్ట్రేలియా టూర్లో ఉన్న సిరాజ్ కరోనా నిబంధనల మేరకు తండ్రి అంత్యక్రియలకు స్వదేశానికి రాలేకపోయాడు. అతను భారత్ వచ్చేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చినప్పటికీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా సిరాజ్ అక్కడే ఉండిపోయాడు. అతని నిర్ణయం పట్ల చాలా మంది క్రీడా ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఇక బాక్సింగ్ డే టెస్టులో తొలి సెషన్లో బౌలింగ్ చేసిన సిరాజ్ లబుషన్ వికెట్‌తో పాటు కామెరూన్ గ్రీన్ (60 బంతుల్లో 12)ను పెవిలియన్ పంపాడు. 15 ఓవర్లు వేసి 40 పరుగులకు 2 వికెట్లు తీశాడు. వాటిలో 4 ఓవర్లు మెయిడెన్ కావడం విశేషం. ఇదిలాఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 195 లకు ఆలౌట్ చేసిన టీమిండియా ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. 10 పరుగుల ఆదిక్యంలో కొనసాగుతోంది. అజింక్యా రహానే (62), రవీంద్ర జడేజా (12) క్రీజులో ఉన్నారు. -
మొదటి రోజు మనదే
అడిలైడ్ అపజయాన్ని అల్లంత దూరాన పెడుతూ మెల్బోర్న్ టెస్టును భారత జట్టు మెరుగైన రీతిలో ఆరంభించింది. మన బౌలర్లు మరోసారి మెరవడంతో ఆస్ట్రేలియా మళ్లీ 200 పరుగులు కూడా దాటలేకపోయింది. బుమ్రా పదునైన బౌలింగ్, అశ్విన్ అనుభవ ప్రదర్శనకు తోడు అరంగేట్రం టెస్టులో హైదరాబాదీ సిరాజ్ కూడా ఆకట్టుకోవడంతో ఆసీస్ జట్టులో ఒక్కరూ కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయారు. బదులుగా మరోసారి సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... గత మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మిగిల్చిన స్కోరు (36) వద్దే మొదటి రోజు ఆట ముగించింది. అయితే మెల్లగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతున్న పిచ్ రెండో రోజు మన ఆటగాళ్ల ప్రదర్శనపై ఆశలు రేపుతోంది. మెల్బోర్న్: ఉదయం 11 మిల్లీ మీటర్ల పచ్చికపై, కాస్త తేమ కూడా ఉన్న పిచ్‌పై బ్యాటింగ్ ఎంచుకొని ఆస్ట్రేలియా చేసిన సాహసం ఆ జట్టుకు పనికి రాలేదు. భారత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 72.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌటైంది. మార్నస్ లబ్‌షేన్ (132 బంతుల్లో 48; 4 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (38), మాథ్యూ వేడ్ (30) మాత్రమే కొద్దిగా పరుగులు చేయగలిగారు. బుమ్రాకు 4 వికెట్లు దక్కగా, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 36 పరుగులు చేసింది. మయాంక్ ‘డకౌట్’కాగా... శుబ్‌మన్ గిల్ (28 బ్యాటింగ్), పుజారా (7 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. కీలక భాగస్వామ్యం... భారత బౌలింగ్ పదునుకు తోడు కొన్ని చెత్త షాట్లు ఆసీస్ స్కోరును 200 లోపే పరిమితం చేశాయి. జట్టుకు సరైన ఓపెనింగ్ కూడా లభించలేదు. తన పేలవ ఫామ్‌ను కొనసాగించిన జో బర్న్స్ (0) బుమ్రా వేసిన చక్కటి బంతిని ఆడలేక కీపర్ పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. కొంత దూకుడు ప్రదర్శించిన వేడ్ తాను టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయాన్ని మరచిపోయినట్లుగా అశ్విన్ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడి వెనుదిరిగాడు. ఆ వెంటనే టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్ (0) కూడా డకౌట్‌గా వెనుదిరగడంతో జట్టు కష్టాలు పెరిగాయి. ఈ దశలో లబ్‌షేన్, హెడ్ 86 పరుగుల భాగస్వామ్యం ఆసీస్‌ను ఆదుకుంది. బుమ్రా బౌలింగ్‌లో లబ్‌షేన్ (స్కోరు 6) అవుట్ కోసం ఎల్బీ అప్పీల్ చేసిన భారత్... రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 26 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... ఈసారి తాను రివ్యూ కోరి లబ్‌షేన్ బయటపడ్డాడు. లంచ్ సమయానికి జట్టు 65 పరుగులు చేసింది. రెండో సెషన్లోనూ లబ్‌షేన్, హెడ్ సాధికారికంగా, చక్కటి సమన్వయంతో ఆడారు. తొలి గంటలో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో పరుగులు కూడా చకచకా వచ్చాయి. భాగస్వామ్యం మరింత పటిష్టంగా మారుతున్న దశలో మరో పదునైన బంతితో హెడ్‌ను అవుట్ చేసి బుమ్రా ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే లబ్‌షేన్‌ను అవుట్ చేసి టెస్టుల్లో తొలి వికెట్ సాధించిన సిరాజ్... కామెరాన్ గ్రీన్ (12)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. గత టెస్టు తరహాలో ఈసారి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ జట్టును ఆదుకోలేకపోయాడు. అశ్విన్ బంతిని సమర్థంగా ఎదుర్కోలేక పైన్ (13) బ్యాక్వర్డ్ షార్ట్ లెగ్‌లో విహారికి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. గిల్ అదృష్టం... సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు ఇదే మైదానంలో అరంగేట్రం చేసి అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్‌కు ఈసారి కలిసి రాలేదు. స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే మయాంక్ (0) వెనుదిరగడంతో స్కోరు బోర్డులో పరుగులు చేరకుండానే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే గిల్, పుజారా కలిసి జాగ్రత్తగా ఆడారు. తమ పదునైన బంతులతో ఆసీస్ పేసర్లు టీమిండియా ఓపెనర్లను కొంత ఇబ్బంది పెట్టారు. కమిన్స్ బౌలింగ్‌లో 5 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మూడో స్లిప్‌లో లబ్‌షేన్ వదిలేశాడు. అయితే ఆ తర్వాత గిల్ కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. ముఖ్యంగా స్టార్క్ ఓవర్లో కొట్టిన రెండు ఫోర్లు అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించాయి. అవుటా... నాటౌటా! ఆసీస్ కెప్టెన్ పైన్ రనౌట్ విషయంలో భారత్‌కు ప్రతికూల ఫలితం రావడం కొంత చర్చకు దారి తీసింది. అశ్విన్ బౌలింగ్‌లో గ్రీన్ షాట్ ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. కొంత సందిగ్ధంతో పైన్ అవతలి ఎండ్‌కు పరుగు తీయగా... అదే సమయంలో కవర్స్ నుంచి ఉమేశ్ విసిరిన త్రోను అందుకున్న పంత్ స్టంప్స్‌ను పడగొట్టాడు. దాంతో మూడో అంపైర్‌ను సంప్రదించాల్సి వచ్చింది. రీప్లేలలో పైన్ బ్యాట్ లైన్పైనే ఉన్నట్లు కనిపించింది. అలా చూస్తే అతను అవుట్. అయితే థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ పదే పదే రీప్లేలు చూసిన అనంతరం నాటౌట్‌గా ప్రకటించారు. మరో కోణంలో బ్యాట్ కాస్త లోపలికి వచ్చినట్లు కనిపించడం కూడా అందుకు కారణం కావచ్చు. అయితే దీనిపై కెప్టెన్ రహానే అంపైర్ ముందు అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది. నువ్వా...నేనా! మాథ్యూ వేడ్ క్యాచ్‌ను అందుకునే విషయంలో భారత ఫీల్డర్లు గిల్, జడేజా మధ్య సాగిన పోటీ కొంత ఉత్కంఠను రేపింది. అశ్విన్ బౌలింగ్‌లో వేడ్ కొట్టిన షాట్‌కు బంతి గాల్లోకి లేవగా మిడ్ వికెట్ నుంచి గిల్, మిడాన్ నుంచి జడేజా పరుగెత్తుకుంటూ వచ్చారు. బంతిపై మాత్రమే దృష్టి పెట్టిన వీరిద్దరు ఒకరిని మరొకరు చూసుకోలేదు. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత జడేజా ఆగమంటూ సైగ చేసినా గిల్ పట్టించుకోలేదు. చివరి క్షణంలో జడేజా కాస్త ఎత్తులోనే బంతిని అందుకొని పదిలం చేసుకోగా, గిల్ మాత్రం జారుతూ జడేజా సమీపంలోనే కింద పడ్డాడు. జడేజా ఏకాగ్రత, సరైన నియంత్రణ వల్ల ఇద్దరూ ఢీకొనలేదు గానీ లేదంటే ప్రమాదమే జరిగేది! డీన్ జోన్స్‌కు నివాళి మూడు నెలల క్రితం కన్నుమూసిన ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్‌కు అతని సొంత మైదానం ఎంసీజీలో రెండో టెస్టు సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు నివాళులు అర్పించారు. మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ తోడు రాగా... జోన్స్ భార్య, ఇద్దరు కూతుళ్లు మైదానంలోకి వచ్చి అతను ఉపయోగించిన బ్యాట్, బ్యాగీ గ్రీన్, సన్‌గ్లాసెస్‌ను వారు స్టంప్స్‌పై ఉంచారు. అనంతరం వాటిని బౌండరీ బయట సీట్‌పై పెట్టారు. జోన్స్‌ను గుర్తు చేసే విధంగా కొందరు ఆసీస్ క్రికెటర్లు తమ పెదవులపై అతనిలాగే జింక్ బామ్ పూసుకొని వచ్చారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాల్సిన రాడ్ టకర్...తన తల్లి మరణించడంతో చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఆక్సెన్‌ఫర్డ్ అంపైర్‌గా వచ్చారు. టకర్ తల్లికి నివాళిగా అంపైర్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (సి) పంత్ (బి) బుమ్రా 0; వేడ్ (సి) జడేజా (బి) అశ్విన్ 30; లబ్‌షేన్ (సి) గిల్ (బి) సిరాజ్ 48; స్మిత్ (సి) పుజారా (బి) అశ్విన్ 0; హెడ్ (సి) రహానే (బి) బుమ్రా 38; గ్రీన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 12; పైన్ (సి) విహారి (బి) అశ్విన్ 13; కమిన్స్ (సి) సిరాజ్ (బి) జడేజా 9; స్టార్క్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 7; లయన్ (ఎల్బీ) (బి) బుమ్రా 20; హాజల్‌వుడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (72.3 ఓవర్లలో ఆలౌట్) 195 వికెట్ల పతనం: 1–10, 2–35, 3–38, 4–124, 5–134, 6–155, 7–155, 8–164, 9–191, 10–195. బౌలింగ్: బుమ్రా 16–4–56–4, ఉమేశ్ యాదవ్ 12–2–39–0, అశ్విన్ 24–7–35–3, జడేజా 5.3–1–15–1, సిరాజ్ 15–4–40–2. భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; శుబ్‌మన్ గిల్ (బ్యాటింగ్) 28; పుజారా (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టానికి) 36 వికెట్ల పతనం: 1–0. బౌలింగ్: స్టార్క్ 4–2–14–1, కమిన్స్ 4–1–14–0, హాజల్‌వుడ్ 2–0–2–0, లయన్ 1–0–6–0. -
మయాంక్ డకౌట్.. ముగిసిన తొలి రోజు ఆట
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించారు. గిల్ 28 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి టీమిండియా తొలి రోజు మూడు సెషన్లలోనూ తన ఆధిపత్యం చూపించింది. అంతకముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆసీస్ బ్యాటింగ్‌లో వేడ్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెడ్ 38 పరుగులు చేశాడు. భారత బౌలింగ్‌లో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీశాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు టీమిండియా బౌలర్ బుమ్రా తొలి షాక్ ఇచ్చాడు .ఆసీస్ ఓపెనర్ బర్న్స్‌ను బుమ్రా డకౌట్ చేశాడు. దీంతో ఆసీస్ 10 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ వేడ్‌ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ దశలో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్ స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హెడ్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లబుషేన్,హెడ్లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆచితూచి ఆడారు. (చదవండి : అతనికి అరుదైన గౌరవం.. ఇది రహానేకే సాధ్యం) టీ విరామానికి ముందు బుమ్రా బౌలింగ్‌లో 38 పరుగులు చేసిన హెడ్ ఔట్ కాగా.. కాసేపటికే అర్థసెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్న లబుషేన్‌ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ 136 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీ విరామానికి వెళ్లింది. విరామం అనంతరం భారత బౌలర్లు మరింత విజృంభించడంతో 59 పరుగులు మాత్రమే నమోదు చేసి మరో 5 వికెట్లను కోల్పోయింది. కాగా సిరాజ్ లబుషేన్‌ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మెయిడెన్ వికెట్ తీశాడు. -
క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు
మెల్బోర్న్ : టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన జడేజా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ద్వారా మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తూ స్టన్నింగ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళితే.. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ భారీ షాట్ ఆడాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్) మిడాన్‌లో ఉన్న జడేజా క్యాచ్ అందుకోవడానికి పరిగెత్తుకు రాగా.. కమ్యునికేషన్ గ్యాప్ రావడంతో మిడాఫ్‌లో ఉన్న గిల్ కూడా పరిగెత్తుకు వచ్చాడు. జడేజా క్యాచ్‌ను అందుకునే క్రమంలో అతని చేయి గిల్‌ను తాకింది. దీంతో క్యాచ్ మిస్సవుతుందని అంతా భావించారు. కానీ జడేజా మాత్రం బంతిని వదలకుండా చేతిలోనే ఒడిసిపట్టుకోవడంతో వేడ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు. అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ టీ విరామం అనంతరం 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 7, కెప్టెన్ టిమ్ పైన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా బౌలర్ బుమ్రా ఆసీస్ ఓపెనర్ బర్న్స్‌ను డకౌట్ చేశాడు.దీంతో ఆసీస్ 10 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ వేడ్‌ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్) Almost disaster! But Jadeja held his ground and held the catch! @hcltech | #AUSvIND pic.twitter.com/SUaRT7zQGx — cricket.com.au (@cricketcomau) December 26, 2020 ఈ దశలో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్ స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హెడ్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లబుషేన్,హెడ్లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆచితూచి ఆడారు. టీ విరామానికి ముందు బుమ్రా బౌలింగ్‌లో 38 పరుగులు చేసిన హెడ్ ఔట్ కాగా.. కాసేపటికే అర్థసెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్న లబుషేన్‌ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ 5 వికెట్లు కోల్పోయింది. కాగా సిరాజ్ లబుషేన్‌ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మెయిడెన్ వికెట్ తీశాడు. భారత బౌలర్లలో అశ్విన్ 2, బుమ్రా 2, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. -
బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్
మెల్బోర్న్ : బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్లు మెరిశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిషాక్ ఇచ్చాడు. ఓపెనర్ జో బర్న్స్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 10 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ వేడ్‌ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ దశలో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్ స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. లబుషేన్ 26 పరుగులు, ట్రెవిస్ హెడ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో, భారత్ 28 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడి, 12 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. భారత్ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్‌ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది. -
‘సెంచరీ’ టెస్టులో విక్టరీ దక్కేనా?
మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత్ ముందు మరో సవాల్ నిలిచింది. నేటి నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగే ‘బాక్సింగ్ డే’ రెండో టెస్టులో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్ లో నెగ్గిన ఆసీస్ సిరీస్‌లో 1–0తో ప్రస్తుతం ఆధిక్యంలో ఉండగా, ఈ మ్యాచ్‌లోనూ ఓడితే భారత్ సిరీస్ గెలుచుకునే అవకాశాలు ముగుస్తాయి. అడిలైడ్‌లో గెలిచిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగుతుండగా, భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. జడేజా, పంత్‌లకు చోటు గత టెస్టులాగే ఈసారి కూడా భారత మేనేజ్మెంట్ తుది జట్టును ఒక రోజు ముందే ప్రకటించింది. విఫలమైన పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్, సాహా స్థానంలో మరో కీపర్ రిషభ్ పంత్ జట్టులోకి వచ్చారు. షమీ గాయం కారణంగా తప్పుకోవడంతో పేసర్ సిరాజ్‌కు చోటు దక్కింది. అయితే కోహ్లికి బదులుగా రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌ను కాకుండా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం కల్పించడం విశేషం. రాహుల్ రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నా... జడేజా వైపు జట్టు మొగ్గు చూపించింది. ఐదో బౌలర్‌గా అతను జట్టుకు మరింత బలం చేకూర్చగలడని టీమ్ భావిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో రాణించడం గిల్, పంత్ ఎంపికకు కారణం. అయితే కోహ్లిలాంటి స్టార్ లేని నేపథ్యంలో సహజంగానే బ్యాటింగ్ కొంత బలహీనంగా కనిపిస్తోంది. మయాంక్, గిల్ శుభారంభం అందించడం కీలకం. ఇప్పుడు ప్రధానంగా పుజారా, రహానే బ్యాటింగ్‌పైనే జట్టు భారీ స్కోరు చేయడం ఆధారపడి ఉంది. ఆంధ్ర క్రికెటర్ విహారి తనకు లభించిన మరో అవకాశాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలి. విదేశాల్లో అంతంత మాత్రమే రికార్డు ఉన్న జడేజా ఈసారి ఎలా ప్రభావం చూపిస్తాడనేది చూడాలి. బౌలింగ్‌లో ఇప్పుడు బుమ్రాపైనే పెను భారం పడింది. ఇంత కాలం అతను ఆడిన అన్ని మ్యాచ్‌లలో మరోవైపు నుంచి సీనియర్ ఇషాంత్ శర్మ లేదా షమీ సహకరించారు. ఉమేశ్ ఇప్పటికీ అద్భుతాలు చేయలేదు. ఇక సిరాజ్ ఆడుతోంది తొలి మ్యాచ్. అశ్విన్ గత మ్యాచ్‌లో లయ అందుకోవడం సానుకూలాంశం. మొత్తంగా కోహ్లి, షమీ దూరం కావడంతో రెండు విభాగాల్లోనూ కొంత బలహీనంగా మారిన జట్టు ఆసీస్‌ను నిరోధించాలంటే తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. స్మిత్ చెలరేగితే... వార్నర్ లేకపోవడంతో తొలి టెస్టులో ఆసీస్ ఓపెనింగ్ బలహీనంగా కనిపించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ప్రదర్శనతో బర్న్స్‌కు కావాల్సిన ఆత్మవిశ్వాసం దక్కగా, వేడ్ కూడా స్వేచ్ఛగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో మెరుగైన ఆరంభాన్ని జట్టు ఆశిస్తోంది. ఇక గత మ్యాచ్‌లో విఫలమైనా... స్మిత్, లబ్షేన్లను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా భారత్‌పై అద్భుత రికార్డు ఉన్న స్మిత్ చెలరేగితే కష్టాలు తప్పవు. గ్రీన్ తనను తాను నిరూపించుకోగా, కెప్టెన్ పైన్ తన బ్యాటింగ్ విలువను చూపించాడు. ట్రావిస్ హెడ్ మాత్రం ఇంకా కుదురుకోవాల్సి ఉంది. వీటన్నింటికి మించి ఆసీస్ బలం పేస్ బౌలింగ్ త్రయంపైనే ఉంది. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్ సమష్టిగా చెలరేగితే పరిస్థితి ఎలా ఉంటుందో గత మ్యాచ్ చూపించింది. వీరికి లయన్ జత కలిస్తే ఆసీస్ పైచేయి సాధించడం ఖాయం. 100: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది వందో టెస్టు కానుంది. ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో, భారత్ 28 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడి, 12 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. భారత్ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్‌ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది. సిరాజ్‌కు తొలి ‘టెస్టు’... 24 ఏళ్ల తర్వాత భారత్ తరఫున టెస్టు ఆడనున్న మరో హైదరాబాదీ. సరిగ్గా ఐదు వారాల క్రితం నాన్న చనిపోయాడు. చివరి చూపునకు వెళ్లవచ్చని బోర్డు అనుమతించినా... గుండెల్లో తన వేదనను దాచుకుంటూ ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. సహచరులు ఇచ్చిన స్థయిర్యంతో తన సాధనను కొనసాగించాడు. ఇప్పుడు ఆ బాధకు కాస్త ఉపశమనం అందించే అరుదైన అవకాశం అతనికి దక్కింది. స్వదేశం తిరిగి వెళ్లిపోకుండా అతను తీసుకున్న నిర్ణయం సరైన ఫలితాన్నందించింది. షమీ అనూహ్యంగా గాయపడటంతో మొహమ్మద్ సిరాజ్‌కు భారత తుది జట్టులో చోటు దక్కింది. సాధారణ ఆటో డ్రైవర్ కొడుకుగా మొదలైన అతని ప్రస్థానం ఇప్పుడు భారత టెస్టు క్రికెటర్‌గా ఎదగడం అసాధారణం. రంజీల్లో సూపర్ మూడు టి20 మ్యాచ్‌లలో 3 వికెట్లు... ఏకైక వన్డే లో వికెట్ దక్కనే లేదు... సిరాజ్ అంతర్జాతీయ రికార్డు ఇది. దీనిని చూస్తే అతను జాతీయ జట్టు తరఫున విఫలమయ్యాడనిపిస్తుంది. కానీ సిరాజ్‌కు అవకాశం ఇవ్వడంలో సెలక్టర్లే పొరపడ్డారని అనిపిస్తుంది. దేశవాళీలో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలన్నీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలోనే వచ్చాయి. ఎరుపు బంతితోనే అతను ఎక్కువగా తన పదును చూపించాడు. సీమ్‌ను సమర్థంగా ఉపయోగించుకునే అతని గ్రిప్, బౌన్సర్లు సిరాజ్ బౌలింగ్‌లో ప్రధాన బలాలు. తన తొలి రంజీ సీజన్ (2016–17)లోనే హైదరాబాద్ తరఫున 18.92 సగటుతో 41 వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్లో సన్‌రైజర్స్, బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించడం చకచకా జరిగిపోయాయి. నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు అతని సామర్థ్యంపై కొన్ని అనుమానాలు రేపినా ... తాజా ఐపీఎల్లో కోల్‌కతాపై 8 పరుగులకు 3 వికెట్లు తీసిన ప్రదర్శన సిరాజ్‌ను మళ్లీ సీన్లోకి తీసుకొచ్చింది. ఘనమైన రికార్డు 2018లో 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో సిరాజ్ 19.80 సగటుతో 55 వికెట్లు పడగొట్టాడు. ఇందులో దక్షిణాఫ్రికా ‘ఎ’పై రెండుసార్లు ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు తీయగా... ఆస్ట్రేలియా ‘ఎ’పై 8 వికెట్లతో చెలరేగిన ప్రదర్శన కూడా ఉంది. ఆసీస్ ‘ఎ’ జట్టులో హెడ్, లబ్‌షేన్, ఖాజాలాంటి టెస్టు క్రికెటర్లున్నారు. భారత్ ‘ఎ’ తరఫున సిరాజ్ 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇవన్నీ రంజీ ట్రోఫీకంటే నాణ్యతాపరంగా ఎక్కువ స్థాయివే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లలో కలిపి 12 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 27.63 సగటుతో 44 వికెట్లు పడగొట్టాడు. షమీ లేక కొంత అదృష్టం కలిసొచ్చినా... ఈ గణాంకాలు చూస్తే టెస్టుల్లో అతనికి అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయంగానే చెప్పవచ్చు. మొత్తంగా 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి సిరాజ్ 23.44 సగటుతో 152 వికెట్లు తీశాడు. వన్డేలు, టి20లు ఎన్ని ఆడినా టెస్టు క్రికెటర్‌గా వచ్చే గుర్తింపే వేరు. ఇప్పుడు ఆ గౌరవాన్ని అందుకున్న సిరాజ్ మున్ముందు మరింత సత్తా చాటాలని చోటు పదిలం చేసుకోవాలని ఆశిద్దాం. వీవీఎస్ లక్ష్మణ్ (1996) తర్వాత హైదరాబాద్‌లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్ సిరాజే కావడం విశేషం. మధ్యలో ప్రజ్ఞాన్ ఓజా ఆడినా... అతను భువనేశ్వర్‌లో పుట్టాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది వందో టెస్టు కానుంది. ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో, భారత్ 28 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడి, 12 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. భారత్ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్‌ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది. పిచ్, వాతావరణం ఈ టెస్టు కోసం డ్రాప్ ఇన్ పిచ్‌ను ఉపయోగిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. చక్కటి బౌన్స్ కూడా ఉంది. రెండు రోజులపాటు చిరుజల్లులు పడే అవకాశం మినహా... వాతావరణం బాగుంది. టెస్టుకు ఇబ్బంది ఉండకపోవచ్చు. జట్ల వివరాలు భారత్ (తుది జట్టు): రహానే (కెప్టెన్), మయాంక్, గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, ఉమేశ్, సిరాజ్, బుమ్రా. ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), బర్న్స్, వేడ్, లబ్‌షేన్, స్మిత్, హెడ్, గ్రీన్, స్టార్క్, లయన్, కమిన్స్, హాజల్‌వుడ్. –సాక్షి క్రీడా విభాగం -
బాక్సింగ్ డే టెస్టు : షా అవుట్.. గిల్, పంత్‌లకు చోటు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు ఒకరోజే ముందే టీమిండియా తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే తొలి టెస్టులో ఓపెనర్‌గా విఫలమైన పృథ్వీ షాను జట్టు మేనేజ్మెంట్ పక్కనబెట్టింది. అతని స్థానంలో శుబ్మాన్ తుది జట్టులోకి రాగా.. మొదటిటెస్ట్ మ్యాచ్‌లో గాయపడిన బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేశారు. మొదటి మ్యాచ్‌లో కీపర్‌గా విఫలమైన సాహా స్థానంలో రిషబ్ పంత్‌ను ఎంపికచేయగా .. కేఎల్ రాహుల్‌కు మరోసారి నిరాశే మిగిలింది. (చదవండి : 'కోహ్లికి ఇచ్చారు.. నటరాజన్‌కు ఎందుకివ్వరు') ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో గాయపడిన రవీంద్ర జడేజాను ఆల్‌రౌండర్ కోటాలో రెండో టెస్టుకు ఎంపిక చేశారు. ఇక మయాంక్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. వన్‌డౌన్‌లో పుజారా బ్యాటింగ్ చేయనున్నాడు. అజింక్యా రహానే, హనుమ విహారిలు మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. ఇక బుమ్రా ,ఉమేశ్ యాదవ్, సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్‌లు బౌలింగ్ భారం మోయనున్నారు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో రహానే మిగిలిన టెస్టులకు నాయకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంతో ఉంది. కాగా మొదటి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటైన టీమిండియా టెస్టు క్రికెట్లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. (చదవండి : 'రూ. 45 లక్షలిస్తే కేసు ఉపసంహరించుకుంటా') టీమిండియా తుది జట్టు : అజింక్యా రహానే(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
ఆసీస్‌కు షాక్ : ఆ ఇద్దరు ఆటగాళ్లు దూరం
మెల్బోర్న్ : ఆ్రస్టేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్ అబాట్ రెండో టెస్టుకూ దూరమయ్యారు. గజ్జల్లో గాయంతో వార్నర్, కండరాల గాయంతో అబాట్ తొలి టెస్టు ఆడలేకపోయారు. దీంతోపాటే వీళ్లిద్దరు బయో బబుల్ దాటి బయటికి రావడంతో కోవిడ్ ప్రొటోకాల్ నేపథ్యంలో శనివారం మొదలయ్యే ‘బాక్సింగ్ డే’ టెస్టు కూడా ఆడే వీలు లేకుండా పోయింది. పైగా వార్నర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు! ‘సిడ్నీలోని నార్తర్న్ బీచ్ వద్ద కరోనా హాట్‌స్పాట్ న్యూసౌత్‌వేల్స్ ఆరోగ్య శాఖను కలవరపెడుతోంది. ఇద్దరు ఆటగాళ్లు కూడా అక్కడి నుంచే మెల్బోర్న్కు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వాళ్లిద్దరిని జట్టుతో కలిసేందుకు అనుమతించడం లేదు’ అని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి : ధోని రనౌట్‌కు 16 ఏళ్లు..) శుబ్‌మన్‌కు అవకాశం! మెల్బోర్న్: తొలి టెస్టులో ఎదురైన పరాభవం దృష్ట్యా రెండో టెస్టు కోసం భారత జట్టు పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తోంది. కెప్టెన్ కోహ్లి స్వదేశం చేరడంతో తాత్కాలిక కెప్టెన్ రహానే నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు. కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్ల సన్నాహాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఓపెనర్ పృథీ్వషా పేలవ ఫామ్ నేపథ్యంలో తుది జట్టులో చోటు ఖాయమనుకుంటున్న శుబ్‌మన్ గిల్ నెట్స్‌లో అదేపనిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. పింక్ బాల్ వార్మప్ మ్యాచ్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 43, 65 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇతని కంటే పృథ్వీ షా అనుభవజ్ఞుడు కావడంతో అతన్నే ఆడించారు. కానీ షా 0, 4 పరుగులతో జట్టు మేనేజ్మెంట్ను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీంతో రంజీల్లో పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసే 21 ఏళ్ల శుబ్‌మన్‌వైపే జట్టు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతోంది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు కూడా నెట్స్‌లో శ్రమించారు. పేసర్లు సిరాజ్, నవ్‌దీప్ సైనీలు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. -
‘ఎంసీజీ’లో మ్యాచ్ కోసం ప్రయత్నాలు
మెల్బోర్న్ : కరోనా కారణంగా ఈ ఏడాది చివర్లో ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) నుంచి భారత్–ఆ్రస్టేలియా ‘బాక్సింగ్ డే’ టెస్టు తరలిపోనుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు సిద్ధమైంది. పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించి డిసెంబర్ 26 నుంచి 30 వరకు ‘బాక్సింగ్ డే’ టెస్టును ఎంసీజీలోనే జరిగేలా చూడాలని భావిస్తున్నట్లు మెల్బోర్న్ నగరం ఉన్న విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ వెల్లడించారు. మరోవైపు వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నకి కూడా ఇదే తరహా ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ఏడాది ‘బాక్సింగ్ డే’ టెస్టుకు 2 లక్షల మంది ప్రేక్షకులు హాజరు కాగా... ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగిన మెల్బోర్న్ పార్క్‌లో 8 లక్షల మంది మ్యాచ్‌లను వీక్షించారు. అయితే ప్రస్తుతం ఆ్రస్టేలియాలోని 70 శాతం కరోనా కేసులు విక్టోరియా రాష్ట్రంలోనే నమోదు కాగా... మరణాలు 90 శాతం ఇక్కడి నుంచే ఉన్నాయి. ‘గరిష్టంగా ఎంత మందిని టెస్టు మ్యాచ్‌లు అనుమతించాలనే విషయంలో చర్చిస్తున్నాం. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందరి ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూనే సాధ్యమైనంత ఎక్కువ మందిని లోపలికి పంపేందుకు ప్రయతి్నస్తాం. దీనికి సంబంధించి క్రికెట్ ఆ్రస్టేలియాతో మాట్లాడుతున్నాం. ఒక్క క్రీడా ఈవెంట్ కారణంగా ఇప్పటి వరకు మేం చేస్తున్న శ్రమ వృథా కాకూడదనే మా ప్రయత్నం. ఒక్కసారి ఇలాంటి చోట కోవిడ్–19 వ్యాప్తి మొదలైందంటే అది ఎక్కడి వరకు సాగుతుందో చెప్పలేం’ అని డేనియల్ ఆండ్రూస్ అభిప్రాయ పడ్డారు. మెల్బోర్న్లో ‘బాక్సింగ్ డే’ టెస్టు సాధ్యంకాకపోతే టెస్టు మ్యాచ్ వేదిక అడిలైడ్‌కు మారే అవకాశం ఉంది. -
పట్టుబిగించిన ఆసీస్
మెల్బోర్న్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ‘బాక్సిం గ్ డే’ టెస్టులో ఆ్రస్టేలియా గెలుపు దిశగా పయనిస్తోంది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. 456 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వేడ్ (15 బ్యాటిం గ్), హెడ్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 44/2తో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌ను ప్యాట్ కమిన్స్ (5/28) దెబ్బ తీశాడు. దాంతో కివీస్ 54.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. 319 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలని నిశ్చయించుకుంది. -
రాణించిన స్మిత్, లబ్‌షేన్
మెల్బోర్న్: న్యూజిలాండ్‌తో మొదలైన ‘బాక్సింగ్ డే’ టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన స్టీవ్ స్మిత్ (192 బంతుల్లో 77 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, మార్నస్ లబ్‌షేన్ (149 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్) ఈ ఏడాది తన జోరును కొనసాగించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే జో బర్న్స్ (0)ను బౌల్ట్ అవుట్ చేశాడు. ఆ తర్వాత లబ్‌షేన్, వార్నర్ (41) కలిసి జట్టును ఆదుకోగా, మరో బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ (38) కూడా ఫర్వాలేదనిపించాడు. రికార్డు ప్రేక్షకులు... టెస్టు మ్యాచ్ తొలి రోజు భారీ సంఖ్యలో అభిమానులు ఎంసీజీలో హాజరు కావడం విశేషం. గురువారం ఏకంగా 80, 473 మంది ప్రేక్షకులు మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ‘యాషెస్’ సిరీస్ కాకుండా ఇతర జట్టు ఆడిన బాక్సింగ్ డే టెస్టులో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం 1975 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 1975లో ఆసీస్–విండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఒకే రోజు 85, 661 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. -
మైదానంలో మరోసారి రచ్చచేసిన స్మిత్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ‘బాక్సింగ్ డే టెస్టు’తొలి రోజు చిన్నపాటి వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ సీనియర్ అంపైర్ నిగెల్ లాంగ్ తీరుపై ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన స్టీవ్ స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. ఇదే క్రమంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న షేన్ వార్న్ సైతం అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతడికి ఐసీసీ నిబంధనల పుస్తకాన్ని ఇవ్వాలని ఎద్దేవాచేశాడు. అయితే ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే స్మిత్ క్రీడా స్పూర్థికి విరుద్దంగా ప్రవర్తించాడని కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. అంతేకాకుండా ఆసీస్ ఆటగాళ్లకు దురుసు ఎక్కువ అనే విషయం ఈ ఒక్క సంఘటన నిరూపితమైందని మరి కొంత మంది పేర్కొంటున్నారు. ‘టెస్టు క్రికెట్లో ఒక్క పరుగు కోసం అది కూడా న్యాయబద్దం కాని దాని కోసం పోట్లాడిన ఏకైక బ్యాట్స్‌మన్ స్మిత్’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అసలేం జరిగిందంటే.. టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ పరుగుల వేట ప్రారంభించింది. అయితే ఆరంభంలేనే ఆతిథ్య జట్టుకు గట్టి షాక్ తగిలింది 61 పరుగులకే వార్నర్, బర్స్న్ వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో స్మిత్, లబుషేన్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ 26వ ఓవర్(బ్రేక్‌కు ముందు ఓవర్) సందర్భంగా కివీస్ బౌలర్ వాగ్నర్ వేసిని షార్ట్ పిచ్ బాల్ స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో సింగిల్ తీసే ప్రయత్నం చేశారు. అయితే బ్యాట్స్‌మెన్ సింగిల్ తీసే ప్రయత్నాన్ని అంపైర్ నిగేల్ లాంగ్ అడ్డుకున్నాడు. ఎందుకంటే అ బంతిని స్మిత్ ఆడాలనుకోలేదు. వదిలేద్దామనుకున్నాడు. కానీ ఆ బంతి స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మన్ బంతిని కొట్టడానికి చేసే ప్రయత్నంలో బంతి బ్యాట్‌ను మిస్సై శరీరానికి తగిలిన సమయంలో తీసే పరుగే కౌంట్ అవుతుందని.. ఇదే విషయాన్ని స్మిత్‌కు అంపైర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా అంతకుముందు ఓవర్లో కూడా జరగడంతో స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ స్మిత్ వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. అయితే కామెంటరీ బాక్స్‌లో ఉన్న షేన్ వార్న్ అంపైర్ తీరును తప్పుపట్టారు. అంపైర్‌ది చెత్త నిర్ణయం అంటూ మండిపడ్డాడు. షార్ట్ పిచ్ బంతికి బ్యాట్స్‌మన్ శరీరంలో ఎక్కడ తగిలినా పరుగు తీయవచ్చనే నిబందన ఉందని పేర్కొన్నాడు. ‘నాకు తెలిసి అంపైర్‌కు ఐసీసీ నిబంధనల బుక్ అవసరం ఉందునుకుంటున్నా. బ్రేక్ సమయంలో ఎవరైనా ఇవ్వండి’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక ఈ వివాదంపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. You make the call - should this be a dead ball? #AUSvNZ pic.twitter.com/CMp4Q9AHvW — #7Cricket (@7Cricket) December 26, 2019 Poor sportsmanship. But we’ve come to expect that from you Steve. Terrible example for kids. You are an embarrassment to the game. #NZvAUS #BoxingDayTest #MCG #stevesmith pic.twitter.com/xi0VqVjUF1 — Davidthompson420695000 (@Davidthompson42) December 26, 2019 -
నేడు ‘బాక్సింగ్ డే’ టెస్టుల షురూ
మెల్బోర్న్: ఆ్రస్టేలియా టాపార్డర్ బ్యాట్స్‌మన్ లబ్ షేన్ ను అరుదైన సెంచరీ చాన్స్ ఊరిస్తోంది. అతను గత మూడు టెస్టుల్లోనూ శతకం సాధించాడు. ఇప్పుడు ఇక్కడా శతక్కొడితే... వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు చేసిన ఆరో ఆ్రస్టేలియన్గా నిలుస్తాడు. ఈ జాబితాలో బ్రాడ్‌మన్ మూడుసార్లు ఈ ఘనతకెక్కాడు. తర్వాత ఫింగ్లెటన్, హార్వీ, హేడెన్, స్మిత్ వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు చేశారు. మరోవైపు తొలి టెస్టు పరాజయంతో సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్ ‘బాక్సింగ్ డే’ టెస్టులో ప్రతాపం చూపాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే కివీస్‌కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) ఎప్పుడూ కలిసి రాలేదు. ఇక్కడ మూడు మ్యాచ్‌లాడిన న్యూజిలాండ్ రెండు ఓడి, ఒకదాంట్లో ‘డ్రా’ చేసుకుంది. కానీ ఈసారి ఆ రికార్డును మార్చేపనిలో ఉంటామని న్యూజిలాండ్ కెపె్టన్ విలియమ్సన్ అన్నాడు. ఆతిథ్య జట్టేమో ఈ మ్యాచ్ కూడా గెలిచి... మరోటి మిగిలుండగానే మూడు టెస్టుల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. మెల్‌బోర్న్‌లాంటి బౌన్సీ వికెట్ పిచ్‌లపై ఐదుగురు బౌలర్లను బరిలోకి దించాలని యోచిస్తోంది. హాజెల్‌వుడ్ స్థానంలో ప్యాటిన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. కమిన్స్, స్టార్క్, లయన్లతో ఐదో బౌలర్‌గా మైకెల్ నెసెర్‌ను తీసుకునే అవకాశముందని కోచ్ లాంగర్ చెప్పాడు. సెంచూరియన్: గాయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్... ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తొలిటెస్టుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ‘బాక్సింగ్ డే’ పోరు జరగనుంది. పేస్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, స్పిన్నర్ జాక్ లీచ్... ఇలా కీలక ఆటగాళ్లు ‘ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్నారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ఆడేది అనుమానంగా మారింది. ఇది ఇంగ్లిష్ జట్టు కూర్పునకు పెను సమస్యగా మారింది. అయితే అందుబాటులో ఉన్న ఆటగాళ్లు సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారని కెపె్టన్ జో రూట్ తమ జట్టులో స్థైర్యాన్ని పెంచే ప్రకటన చేశాడు. రూట్, డుప్లెసిస్ మరోవైపు సొంతగడ్డపై బలంగా కనబడుతున్న దక్షిణాఫ్రికా జట్టు మొదటి రోజు నుంచే ‘దెబ్బ’తిన్న ఇంగ్లండ్‌పై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెస్టుతో తమ బ్యాట్స్‌మన్ రస్సీ వాన్‌డెర్ డస్సెన్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. అలాగే ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ కూడా అరంగేట్రం చేసే అవకాశముందని చెప్పాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగమైన ఈ సిరీస్‌లో ఇరు జట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో తలపడతాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ 56 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా... దక్షిణాఫ్రికా ఇంకా ఖాతానే తెరువకపోవడంతో అట్టడుగున 9వ స్థానంలో ఉంది. -
నేను నోరు జారడం పొరపాటే: కెర్రీ ఓకీఫ్
మెల్బోర్న్: భారత దేశవాళీ క్రికెట్‌ను ఉద్దేశించిన కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత కెర్రీ ఓకీఫ్ తనను క్షమించాలంటూ బహిరంగ లేఖ రాశాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదన్న ఓకీఫ్.. నోరు జారడం పొరపాటేనని అంగీకరించాడు. బాక్సింగ్ డే టెస్టు మొదటి రోజు అరంగేట్రం ఆటగాడు మయాంక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడు రంజీల్లో రైల్వే క్యాంటీన్ జట్టుపై త్రిశతకం చేశాడని ఎగతాళి చేశాడు. రంజీ క్రికెట్ స్థాయిని తక్కువ చేశాడు. దీంతో పెద్ద ఎత్తున అతడిపై విమర్శలు చెలరేగాయి. దీనిపై వివరణ ఇచ్చుకున్న ఓకీఫ్.. భారత క్రికెటర్లతో పాటు అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు. ‘భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యల స్పందనకు కుంగిపోయా. నా మాటల్లో ఉద్దేశాన్ని వ్యతిరేకంగా ప్రతిబింబించారు. నా అసలు ఉద్దేశం వేరు. తీవ్రంగా సాగుతున్న వ్యాఖ్యానాన్ని సరదాగా మార్చాలని అనుకున్నా. ఈ క్రమంలో నోరు జారి రైల్వే క్యాంటీన్ పదాల్ని వాడాను. అంతే తప్ప భారత క్రికెట్‌ను అగౌరవ పరచలేదు. ఒక పాఠశాల విద్యార్థిగా నేను పర్యటించిన భారత్..ఇప్పుడు అద్భుతమైన క్రికెట్ దేశంగా ఎదిగింది. సిరీస్‌కు ముందు ఆటగాళ్లపై ఎంతో పరిశోధన చేస్తా. రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారాను అవమానించలేదు. నాపై నేనే జోక్ వేసుకున్నా’ అని ఓకీఫ్ పేర్కొన్నాడు. -
విరాట్ కోహ్లి ‘హ్యాట్రిక్’ రికార్డు
మెల్బోర్న్: అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రికార్డులపై రికార్డు కొల్లగొడుతూ దూసుకుపోతున్న క్రికెటర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకుని క్రికెట్లో అతనే ఒక పెద్ద సూపర్‌స్టార్ అనేంతగా కితాబులు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఫీట్‌ను కోహ్లి నెలకొల్పాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. 2018 అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి 2,653 పరుగులతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. సుమారు 70 సగటుతో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇందులో అత్యధిక స్కోరు 160. ఫలితంగా వరుసగా మూడో ఏడాది కూడా అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. 2016లో 2,595 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి.. 2017లో 2,818 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించిన కోహ్లి ‘హ్యాట్రిక్’ పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో భారత్ విజయం సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. దాంతో విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్ గంగూలీతో కలిసి కోహ్లి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇది కోహ్లికి 11వ విదేశీ టెస్టు విజయం. మెల్బోర్న్లో మువ్వన్నెలు -
కోహ్లి.. నీ సమాధానంతో ఆ కామెంటేటర్ దిమ్మతిరిగింది!
మెల్బోర్న్ : భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ కెరీ ఓ కీఫ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అరంగేట్ర ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను ఉద్దేశిస్తూ కెరీ ఓ కీఫ్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా ‘జలంధర్ రైల్వే క్యాంటీన్ నౌకర్ల’ బౌలింగ్‌లో మయాంక్ రంజీ ట్రిపుల్ సెంచరీ చేసి ఉంటాడని ఓ కీఫ్ కామెంట్ చేశాడు. అయితే ఈ టెస్ట్ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘మా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అద్భుతం. దానివల్లే మేం ఈ విజయం సాధించాం. ఈ గెలుపు క్రెడిట్ కచ్చితంగా భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్ విధానందే. అక్కడ మా బౌలర్లకు ఎదురైన సవాళ్లు విదేశాల్లో రాణించేలా చేశాయి’ అని ఫస్ట్ క్రికెట్ విధానాన్ని కోహ్లి కొనియాడాడు. అయితే ఓ కీఫ్ జాతి వివక్ష వ్యాఖ్యలను ఉద్దేశించే కోహ్లి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో బంతితో చెరేగి మ్యాన్‌ఆప్‌దిమ్యాచ్‌గా నిలిచిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం భారత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ను కొనియాడాడు. రంజీ క్రికెట్లో చాలా బంతులు వేయడం వల్లే ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. ఇక ఓ కీఫ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా.. నాలుగో రోజు ఆటలో భారత్ ఆటగాళ్లపై మళ్లీ మాట తూలాడు. ఒక రకమైన వ్యంగ్య శైలితో మాట్లాడుతూ ‘అసలు మీ పిల్లలకు చతేశ్వర్ జడేజా వంటి పేర్లు ఎలా పెడతారు’ అంటూ ఇద్దరు భారత క్రికెటర్ల పేర్లను మిళితం చేశాడు. దీంతో ఓ కీఫ్ తీరుపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Isa: "What do you put this success down to?" Kohl: "Our first class cricket is amazing..." What an answer by Kohli to Kerry 😂😂😂#AUSvIND — Mitul (@Eme2ul) December 30, 2018 Isa Guha : What do you put this success down to? Virat Kohli : Our first class cricket is amazing. Giving it back to Kerry O’Keeffe and a bunch of dumb commentators right after the victory 😂😂😂#AUSvIND — Prajakta Bhawsar (@ViratsFangirl18) December 30, 2018 India's captain, Virat Kohli, and Man of the Match Jasprit Bumrah both credited the first-class structure in India following their win over Australia at the Melbourne Cricket Ground.#AUSvIND — Just Cricket 🏏 (@BatBallStumps) December 30, 2018 -
అందుకే ఓడాం : ఆసీస్ కెప్టెన్
మెల్బోర్న్ : భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఓటమికి బ్యాట్స్‌మెన్ అనుభవరాహిత్యమే కారణమని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి కొంచెం నిరాశను కలిగించింది. పెర్త్ విజయం పునరావృతం అవుతుందని భావించాను. కానీ బ్యాటింగ్ లైనప్ అనుభవరాహిత్యం మా కొంపముంచింది. ప్రపంచ దిగ్గజ పేస్ అటాక్ ఉన్న జట్టుతో ఆడుతున్నాం. కానీ మా జట్టులో టాప్-6 బ్యాట్స్‌మెన్ అనుభవం లేనివారే. మా తప్పిదాలను తెలుసుకొని ముందుకు సాగుతాం. మా ఆటగాళ్లు వారి శక్తి మేరకు కష్టపడ్డారు. సిడ్నీ టెస్ట్ మాకో పెద్ద చాలెంజ్. ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించి.. సిరీస్‌ను కాపాడుకుంటాం. మా బ్యాటింగ్ ఆర్డర్‌పై మరోసారి సమాలోచనలు జరుపుతాం. సిడ్నీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌దే పూర్తి క్రెడిట్. వారు అద్భుతంగా ఆడారు. ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ అద్భుతం. అతనో నాణ్యమైన ఆటగాడు. ఈ సిరీస్ అసాంతం అతను అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతనిలా రాణించే ఆటగాళ్లు కావాలి. ఒక్క విషయంలో తప్ప ఈ ఏడాది బాగానే గడిచింది. వచ్చే ఏడాది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులోకి రాబోతున్నారు. ఇది ఆసీస్ జట్టుకు కలిసొచ్చే అంశం.’ అని పైన్ చెప్పుకొచ్చాడు. మూడో టెస్ట్‌లో భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. ఆధిపత్యాన్ని చలాయిస్తాం: కోహ్లి ఈ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘సిరీస్‌లో మా ఆధిపత్యాన్ని ఇక్కడితో ఆపదల్చుకోలేదు. ఈ విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కాబట్టి.. రెట్టించిన ఉత్సాహంతో సిడ్నీ టెస్టులో ఆడతాం. సిరీస్‌లో గెలిచిన రెండు టెస్టుల్లోనూ భారత్ జట్టు అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించింది. అయితే.. ఆస్ట్రేలియా గడ్డపై మా పని ఇంకా ముగియలేదు. ఆఖరి టెస్టులో విజయం సాధించాలి. ఆ మ్యాచ్‌లో గెలిచేందుకు ఏ అవకాశం లభించినా.. చేజార్చుకోం. కచ్చితంగా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయిస్తాం’ అని విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు. చివరి టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను భారత్ కాపాడుకుంటే సిరీస్ భారత్ వశం కానుంది. -
బాక్సింగ్ డే టెస్ట్ : విజయం ముంగిట భారత్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ విజయానికి 5 వికెట్ల దూరంలో ఉంది. కోహ్లిసేన సెకండ్ ఇన్నింగ్స్‌ను 106/8 వద్ద డిక్లేర్డ్ చేయడంతో 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు అదే తడబాటును కొనసాగించింది. నాలుగో రోజు ఆట టీ విరామ సమయానికి ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ (3), మార్కస్ హర్రీస్ (13) మరోసారి విఫలం కాగా.. ఉస్మాన్ ఖాజా (33), షాన్ మార్ష్(44)లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ షమీ, బుమ్రాలు వీరిని ఔట్ చేసి దెబ్బకొట్టారు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (29), టిమ్ పైన్(1)లు పోరాడుతున్నారు. భారత బౌలర్ల దాటికి తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆ దిశగానే పయనిస్తోంది. బుమ్రా, జడేజాలు రెండేసి వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ 443/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 106/8 డిక్లేర్డ్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 151 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 138/5 (టీ విరామ సమయానికి) -
బాక్సింగ్ డే టెస్ట్ : విజయం దిశగా భారత్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది. 54/5 ఓవర్ నైట్ స్కోర్‌తో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లిసేన మరో 52 పరుగుల జోడించి 106/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ (42), రిషభ్ పంత్‌లు ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించగా.. రవీంద్ర జడేజా (5) పరుగులు చేశాడు. దీంతో ఆసీస్‌కు 399 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు ఆదిలోనే ఓపెనర్లు అరోన్ ఫించ్ (3), మార్కస్ హర్రీస్ (13)ల వికెట్లు కోల్పోయింది. ఫించ్‌ను జడేజా ఔట్ చేయగా.. హర్రీస్‌ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖాజా (26), షాన్ మార్ష్(2)లు ఆడుతున్నారు. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు సహకరిస్తున్న నేపథ్యంలో భారత్ విజయం లాంఛనం కానుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 443/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 106/8 డిక్లేర్డ్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 151 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 44/2 -
‘వీసాలు చూపించండి.. అతనో పనికిరాని వ్యక్తి’
ఆసీస్ క్రికెటర్లకే కాదు ఆ దేశానికి చెందిన క్రికెట్ అభిమానులకు కూడా నోటి దురుసు ఎక్కువేనని మరోసారి రుజువైంది. భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆతిథ్య జట్టు పతనాన్నిశాసించి.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోపే అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఉన్న భారత అభిమానులు, ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడాన్ని ఓర్చుకోలేని ఆస్ట్రేలియా అభిమానులు జాత్యహంకారంతో రెచ్చిపోయారు. ‘ మీ వీసాలు చూపించండి.. మీ కెప్టెన్ ఓ పనికిరాని వ్యక్తి’ అంటూ టీజ్ చేశారు. బాక్సింగ్ డే టెస్టు మొదలైన నాటి నుంచి వీరు ఇలాగే ప్రవర్తిసున్న నేపథ్యంలో... వారి మాటలను రికార్డు చేసిన ‘ఈఎస్పీన్క్రిక్ఇన్ఫో’ ... ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు ఫిర్యాదు చేసింది. వీటిని రుజువు చేసేందుకు ఇందుకు సంబంధించిన వీడియోను కూడా జత చేసింది.(పంత్‌పై నోరుపారేసుకున్న టిమ్ పైన్) ఈ విషయంపై స్పందించిన సీఏ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ క్రికెట్ ఆస్ట్రేలియా జాత్యహంకార చర్యలను, వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించదు. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు, అభిమానులు, సిబ్బంది ఇలా ఎవరినైనా సరే ఇలాంటి పిచ్చి చేష్టలతో బాధపెడితే సహించబోము. ఈ విషయం గురించి బాధితులు అక్కడున్న భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు. విక్టోరియా పోలీసులు ఎంసీజీ వద్ద సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన వారిని పోలీసులు బయటికి పంపించి వేశారు కూడా’ అని సమాధానమిచ్చారు. ఇలాంటి చర్యలు శ్రుతిమించితే వాళ్లు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అభిమానులపై సీఏ చర్యలు తీసుకోవడం బాగుంది... కానీ కవ్వింపు చర్యలతో భారత క్రికెటర్ల ఏకాగ్రతను దెబ్బతీసే వారి ఆటగాళ్లను మాత్రం అదుపు చేయలేదు ఎందుకో అంటూ టీమిండియా అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
పంత్‌పై నోరుపారేసుకున్న టిమ్ పైన్
మెల్బోర్న్ : గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను మించినవారు లేరనడంలో అతిశయోక్తి లేదేమో! భారత్‌తో సిరీస్‌కు ముందు తాము మారిపోయామని సుద్దపూస మాటలు చెప్పిన ఆసీస్ ఆటగాళ్లు.. ఆచరణలో మాత్రం దాన్ని చూపించడం లేదు. తొలి టెస్ట్ నుంచే మాటలతో రెచ్చగొడుతూ.. కవ్వింపు చర్యలకు పాల్పుడుతూ వచ్చిన ఆటగాళ్లు.. తాజాగా మూడో టెస్ట్‌లో కూడా అదే తరహా ప్రవర్తనను కనబర్చారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌కు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. నోటికెంత వస్తే అంత మాట్లాడుతూ భారత ఆటగాళ్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. రెండో రోజు ఆటలో రోహిత్ సిక్స్ కొడితే.. ముంబైజట్టుకు మారిపోతానని కవ్వించిన పైన్.. మూడో రోజు ఆటలో వికెట్ కీపర్ పంత్‌ను టార్గెట్ చేస్తూ నోరుపారేసుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న పంత్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ రెచ్చగొట్టాడు. ఆసీస్‌తో జరిగే వన్డే జట్టులో చోటు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ‘పంత్.. ధోని వచ్చేశాడు కదా..ఏం చేస్తావ్.. బీబీఎల్‌లో హరికేన్స్ జట్టు తరఫున ఆడుతావా?’ అంటూ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. దీన్ని ఏమాత్రం పట్టించుకోని పంత్ తనపని తాను చేసుకుంటూ పోయాడు. పైన్ వ్యాఖ్యలు స్టంప్స్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఇక తొలిటెస్ట్‌లో కమిన్స్‌కు దీటుగా పంత్ స్లెడ్జింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్ ఆటగాళ్లు ఎంత రెచ్చగొడుతున్నా.. భారత ఆటగాళ్లు సహనం ప్రదర్శించడం వల్ల వివాదాస్పదం కావడం లేదు కానీ.. వారికి దీటుగా స్పందిస్తే మైదానంలో పెద్ద గొడవలే జరుగుతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా చేష్టలతోనే బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని చేతులు కాల్చుకున్నా.. ఆసీస్ ఆటగాళ్లకు బుద్ది రావడం లేదని మండిపడుతున్నారు. Tim Paine doing some recruiting for the @HurricanesBBL out in the middle of the 'G... 😂 #AUSvIND pic.twitter.com/6btRZA3KI7 — cricket.com.au (@cricketcomau) December 28, 2018 -
కోహ్లి నిర్ణయం తప్పిదమేనా?
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయం భారత్‌కు ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో 443/7 పరుగులకు డిక్లేర్ చేసిన భారత్.. ఆతిథ్య జట్టును 151 పరుగులకే కుప్పకూల్చింది. తద్వార 292 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఆసీస్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా..భారత్ అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి చేతులు కాల్చుకుంది. వరుసగా వికెట్లు కోల్పోతూ ఆసీస్ ఆటగాళ్లకు మ్యాచ్‌పై ఆశలు రేకిత్తించింది. హనుమ విహారి(13) వికెట్ అనంతరం వరుసగా.. పుజారా (0), కోహ్లి (0), రహానే(1), రోహిత్ (5)ల వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన పుజారా, హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లిలు డకౌట్ కావడం గమనార్హం. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (28), రిషభ్ పంత్ (6)లున్నారు. మూడో రోజు ఆటలో మొత్తం 15 వికెట్లు పడటం చూస్తే పిచ్ బౌలింగ్‌కు ఎంత అనుకూలించిందో స్పష్టంగా అర్థం అవుతోంది. అయినా కోహ్లి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం తప్పిదమేనని, ఆసీస్‌ను ఫాలోఆన్ ఆడనిస్తే ఒత్తిడిలో త్వరగా వికెట్లు కోల్పోయేవారని, అప్పుడు భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచే అవకాశం ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పోయిందేమి లేదని, కానీ ఆసీస్ ఆటగాళ్లకు పోరాడే శక్తినిచ్చినట్లైందని వాపోతున్నారు. -
151 రన్స్‌కు ఆస్ట్రేలియా ఆల్ అవుట్
-
బాక్సింగ్ డే టెస్ట్ : 151 ఆసీస్ ప్యాకప్
మెల్బోర్న్ : భారత్‌తో జరుగుతున్నమూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 151 పరుగులకే ముగిసింది. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దాటికి ఆతిథ్య బ్యాట్స్‌మెన్ పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో భారత్‌కు 292 పరుగుల ఆధిక్యం లభించింది. 8/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే ఓపెనర్లు ఆరోన్ ఫించ్(8), హ్యారిస్(22) వికెట్లను కోల్పోయింది. ఫించ్ ఔట్ చేసి ఇషాంత్ శర్మ భారత్‌కు శుభారంభాన్ని అందించగా.. బుమ్రా హ్యారిస్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా (21), షాన్ మార్ష్ (19), ట్రావిస్ హెడ్(20), మిచెల్ మార్ష్ (9), టిమ్ పెయిన్ (22), కమిన్స్ (17), నాథన్ లయన్(0), హజల్‌వుడ్ (0)లు భారత బౌలర్ల దాటికి ఏ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. బుమ్రా 6 వికెట్లు పడగొట్టగా.. జడేజా రెండు, షమీ, ఇషాంత్‌లు ఒక వికెట్ తీశారు. ఆసీస్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడటానికే మొగ్గు చూపింది. -
39 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
మెల్బోర్న్ : టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 39 ఏళ్ల నాటి రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాదే అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన ఈ భారత స్పీడ్‌స్టార్.. తన పేరిట సరికొత్త రికార్డును లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో బుమ్రా బంతితో ఆతిథ్య జట్టు పతనాన్నిశాసించాడు. మార్కస్ హ్యారీస్, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, టీమ్ పైన్, లయన్, హజల్‌వుడ్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. తద్వారా టెస్టు ఫార్మాట్లో అరంగేట్ర ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి పేరిట ఉండగా.. తాజాగా బుమ్రా అధిగమించాడు. 1979లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన దిలీప్ దోషి ఆ ఏడాది 40 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్‌ను సాధించాడు. మళ్లీ 39 ఏళ్ల తర్వాత బుమ్రా ఈ రికార్డును బ్రేక్ చేసి దిలీప్‌ను వెనక్కు నెట్టేసాడు. దిలీప్ తర్వాత 37 వికెట్లతో(1996) వెంకటేశ్ ప్రసాద్, నరేంద్ర హిర్వాణీ 36(1988), శ్రీశాంత్ 35(2006)లున్నారు. ఇక ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన బుమ్రా 9 టెస్ట్‌ల్లో మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు. నా ఫేవరెట్ బౌలర్ : క్లార్క్ మూడో టెస్ట్‌లో బుమ్రా వేసిన వైవిధ్యమైన బంతులకు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఫిదా అయ్యాడు. సోనీ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ బుమ్రా ప్రదర్శనను కొనియాడాడు. ‘ అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం బుమ్రా నా ఫేవరెట్ బౌలర్. భారత జట్టు విజయానికి కృషి చేసే బౌలర్. కెప్టెన్ కోహ్లి వ్యూహాలకు సరిపోయే బౌలర్. కొత్త, పాత బంతి అనే విషయాన్ని పట్టించుకోని స్పీడ్‌స్టార్. కేవలం అతనికి భారత విజయంలో కీలకం కావడమే కావాలి. ప్రస్తుత ఐసీసీ ర్యాంకుల్లో బుమ్రా అగ్రస్థానంలో లేకపోవచ్చు. కానీ మరికొద్ది రోజుల్లోనే బుమ్రా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానం సొంతం చేసుకుంటాడు.’ అని క్లార్క్ జోస్యం చెప్పాడు. -
బాక్సింగ్ డే టెస్ట్ : కష్టాల్లో ఆసీస్
మెల్బోర్న్ : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 8/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే ఓపెనర్లు ఆరోన్ ఫించ్(8), హ్యారిస్(22) వికెట్లను కోల్పోయింది. ఫించ్‌ను ఔట్ చేసి ఇషాంత్ శర్మ భారత్‌కు శుభారంభాన్ని అందించగా.. బుమ్రా హ్యారిస్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా (21), షాన్ మార్ష్ (19), ట్రావిస్ హెడ్(20), మిచెల్ మార్ష్ (9)లు భారత బౌలర్ల ముందు తేలిపోయారు. బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా రెండు, ఇషాంత్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో టీమ్ పెయిన్ (2), ప్యాట్‌కమిన్స్(0) లున్నారు. 243 లోపు ఆతిథ్య జట్టు ప్యాకప్ అయితే ఫాలోఆన్ ప్రమాదంలో పడుతోంది. ఇక భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 443/7 డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే. -
భారత్ స్కోరు 443/7.. ఇన్నింగ్స్ డిక్లేర్
-
భారత్ స్కోరు 443/7.. ఇన్నింగ్స్ డిక్లేర్
మెల్బోర్న్ : బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్‌ను భారత్ డిక్లేర్ చేసింది. గురువారం రెండో రోజు ఆటలో భాగంగా ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసిన అనంతరం భారత్ తన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అటు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 8 పరుగులు చేసింది. మార్కస్ హారిస్ (5 బ్యాటింగ్), ఆరోన్ ఫించ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 215/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించిన భారత్ ధాటిగా ఆడింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు కోహ్లి, పుజారాలు బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత స్కోరు బోర్డు పరుగులు తీసింది. కాగా, ఈ జోడి 170 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కోహ్లి (82; 204 బంతుల్లో 9 ఫోర్లు) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శతకం సాధించిన పుజారా(106; 319 బంతుల్లో 10 ఫోర్లు) నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇది పుజారాకు టెస్టుల్లో 17వ సెంచరీ కాగా, ఆసీస్‌పై నాల్గోది. ఆ తరుణంలో అజింక్యా రహానే(34), రోహిత్ శర్మ(63 నాటౌట్)ల జోడి నిలకడగా ఆడింది. దాంతో భారత్ స్కోరు మూడొందల మార్కును అవలీలగా చేరింది. ఇక రోహిత్ శర్మ-రిషబ్ పంత్(39)లు జంట కూడా మరో కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ నాల్గొందల మార్కును దాటింది. స్కోరును పెంచే క్రమ్లో రిషభ్ పంత్ ఔటైన స్వల్ప వ్యవధిలో రవీంద్ర జడేజా సైతం ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆటలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76) హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు సాధించగా, మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు లభించాయి. హజల్‌వుడ్, లయన్‌లకు తలో వికెట్ దక్కింది. -
మయాంక్‌ని కించపరిచిన ఆస్ట్రేలియా కామెంటేటర్
మెల్బోర్న్ : భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్టు సందర్భంగా ఆసీస్ కామెంటేటర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న కర్ణాటక ప్లేయర్ మయాంక్ అగర్వాల్‌పై కామెంటేటర్ ఓ.కీఫ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు... భారత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ను అవమానించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మయాంక్ 304 పరుగులు సాధించి అజేయ ట్రిపుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 2017-18లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన మయాంక్ ఓపెనర్‌గా బరిలోకి దిగి 76 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. మయాంక్ సాధించిన ట్రిపుల్ సెంచరీ పెద్ద విషమేమీకాదనీ ఓ.కీఫ్ వ్యాఖ్యానించాడు. ఏ క్యాంటీన్ జట్టుపైనో లేదా వెయిటర్స్ టీమ్‌పైనో అతడు 304 పరగులు చేసి ఉండొచ్చని అన్నాడు. దీంతో ట్విటర్ వేదికగా ఓ.కీఫ్‌ను క్రికెట్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ‘వెటకారపు, వెకిలి నవ్వుల కోసం మరో దేశాన్ని కించపరుస్తారా’ అంటూ మండిపడుతున్నారు. జాతి వివక్ష వ్యాఖ్యలు మానుకోండని హితవు పలుకుతున్నారు. ఇదిలా ఉండగా.. 2013లో జార్ఖండ్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టిన మయాంక్.. 46 ఫస్ట్‌క్లాస్, 75 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. దాదాపు 50 సగటుతో రాణించాడు. కాగా, 1971-1977 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన కీఫ్ లెగ్ స్పిన్నర్. 24 టెస్టులు ఆడిన అతను 53 వికెట్లు తీశాడు. అనంతరం క్రికెట్ కామెంటేటర్‌గా మారి... విలక్షణమైన వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు. It might just be me, but it's pretty uncool to ridicule the FC comp of another country while using dubious stereotypes for a cheap laugh... — Melinda Farrell (@melindafarrell) December 26, 2018 Kerry o'keefe, Lord snooty!! Sounds like still living in colonial era #BoxingDayTest #INDvsAUS — Dilipsinh Abda (@dilipsinhabda) December 26, 2018 -
బాక్సింగ్ డే టెస్ట్ : రాణించిన భారత బ్యాట్స్‌మెన్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. చతేశ్వర పుజారా( 200 బంతుల్లో 68 బ్యాటింగ్: 6 ఫోర్లు), విరాట్ కోహ్లి (107 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే మూడో వికెట్‌కు అభేద్యంగా 92 పరుగులు జోడించారు. అంతకు మందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ వ్యూహాత్మకంగా మయాంక్ అగర్వాల్, హనుమ విహారీలను ఓపెనర్లుగా బరిలోకి దింపింది. అరంగేట్రంలో అర్థసెంచరీ.. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ అర్ధశతకంతో ఔరా అనిపించాడు. జట్టు స్కోర్ 40 వద్ద హనుమ విహారీ (8) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో మయాంక్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో 95 బంతుల్లో ఆరు ఫోర్లతో కెరీర్లో తొలి హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. తద్వార అరంగేట్ర టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ గుర్తింపు పొందాడు. పెర్త్ టెస్ట్ పరాజయంతో జట్టులో సమూల మార్పులు చేసిన టీమ్ మేనేజ్మెంట్.. ఉన్నపళంగా ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ను రప్పించి తుది జట్టులో అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని మయాంక్ చక్కగా సద్వినియోగం చేసుకుని తనపై టీమ్ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆచితూచి ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్లిన మయాంక్(161 బంతుల్లో 76: 8 ఫోర్లు, 1 సిక్స్)ను ప్యాట్ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పుజారా హాఫ్ సెంచరీ.. మయాంక్ వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లితో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ప్రారంభంలో దాటిగా ఆడిన కోహ్లి.. అనంతరం నెమ్మదించాడు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 152 బంతుల్లో 4 ఫోర్లతో పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి కూడా హాఫ్ సెంచరీ చేరువగా వచ్చినప్పటికి తొలి రోజు ఆట ముగిసింది. -
బాక్సింగ్ డే టెస్ట్ : రెండో వికెట్ కోల్పోయిన భారత్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అరంగేట్ర ఆటగాడు, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 76 (161బంతులు 8ఫోర్లు 1సిక్స్) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మయాంక్ వికెట్ అనంతరం అంపైర్లు టీబ్రేక్ ఇవ్వడంతో ఆ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో పుజారా 33(102 బంతులు, 2 ఫోర్లు) ఉన్నాడు. మయాంక్ అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. -
బాక్సింగ్ డే టెస్ట్ : అరంగేట్రంలో అదరగొట్టాడు!
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్ధశతకంతో ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన అగర్వాల్.. 95 బంతుల్లో ఆరు ఫోర్లతో కెరీర్లో తొలి హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. తద్వార అరంగేట్ర టెస్టుల్లో అర్థసెంచరీ నమోదు చేసిన ఏడో భారత ఓపెనర్‌గా మయాంక్ గుర్తింపు పొందాడు. మయాంక్ కన్నా ముందు ధావన్, పృథ్వీషా, గవాస్కర్, ఇబ్రహిం, అరుణ్, హుస్సెన్‌లు ఈ ఘనతను సాధించారు. పెర్త్ టెస్ట్ పరాజయంతో జట్టులో సమూల మార్పులు చేసిన టీమ్ మేనేజ్మెంట్.. ఉన్నపళంగా ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ను రప్పించి తుది జట్టులో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని మయాంక్ చక్కగా సద్వినియోగం చేసుకుని తనపై టీమ్ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అంతకముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళి విజయ్‌లపై వేటు వేసిన టీమ్ మేనేజ్మెంట్.. ప్రయోగాత్మకంగా హనుమ విహరీ-మయాంక్‌లతో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. విహారీ(8) విఫలమైనప్పటికీ.. మయాంక్, పుజారాలు నిలకడగా ఆడుతున్నారు. -
నేటి నుంచే... బాక్సింగ్ 'ఢీ' టెస్టు
మూడు విదేశీ సిరీస్ విజయాలే లక్ష్యంగా 2018ని ప్రారంభించింది టీమిండియా. ఆటగాళ్ల గాయాలు, తుది జట్టు ఎంపికలో పొరపాట్లు, బ్యాటింగ్ వైఫల్యాలతో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో ఒక్కో గెలుపుతో సరిపెట్టుకుని వెనుదిరిగింది. ఇవే లోపాలు వెంటాడుతుండగా ఇప్పుడు ఏడాది ఆఖరులో... మూడో సిరీస్ మధ్యలో నిలిచింది. దీనిని కూడా కోల్పోకుండా ఉండాలంటే... ఒక్క గెలుపు సరిపోయే స్థితిలో కొంత మెరుగ్గానే ఉంది. మరి... కోహ్లి సేన ఏం చేస్తుందో? మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) అంటేనే తెలియని ఆకర్షణ. క్రిస్మస్ను ఆనందంగా జరుపుకొని వేలాదిగా హాజరయ్యే ప్రేక్షకుల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభమై దానిని రెట్టింపు చేస్తుంది. ఆ హంగామాకు ఈసారి పోటాపోటీ సిరీస్ తోడై అభిమానులకు మరింత మజా ఇవ్వనుంది. మరి... ఫలితాన్ని 1–1 నుంచి 2–1కి మార్చే జట్టేదో? పెర్త్‌లో పరాజయం పాలైన టీమిండియా పైచేయికి ప్రయత్నిస్తుందా? తమ చరిత్రలోనే చేదైన అనుభవాలు మిగిల్చిన 2018కి... సొంతగడ్డపై వరుసగా రెండో విజయంతో కంగారూలు వీడ్కోలు పలుకుతారా? చూద్దాం... ఎవరి పంతం నెగ్గుతుందో? మెల్బోర్న్: అనుకున్నట్లే పెర్త్ టెస్టు ఓటమి టీమిండియాలో భారీ మార్పుచేర్పులకు దారితీసింది. బుధవారం నుంచి మెల్బోర్న్లో జరుగనున్న మూడో టెస్టుకు రెగ్యులర్ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఇద్దరిపై ఒకేసారి వేటుపడేలా చేసింది. కొంత సంచలనమైనా మెల్బోర్న్లో కోహ్లి సేన సాహసానికి దిగక తప్పని పరిస్థితి కల్పించింది. ఈ ప్రకంపనల నేపథ్యంలో కర్ణాటక పరుగుల యంత్రం మయాంక్ అగర్వాల్ అరంగేట్రం ఖాయమైంది. ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారిపై ఇన్నింగ్స్ ఆరంభించే పెద్ద బాధ్యత పడింది. ఫిట్టా, అన్‌ఫిట్టా అనే ఊహాగానాలకు తెరదించుతూ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు తుది 11 మందిలో చోటు దక్కింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా... బ్యాట్స్ మన్ హ్యాండ్స్కోంబ్ స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్‌ను తీసుకుంది. ఆటతో, మాటతో ఇప్పటికే వేడెక్కిన సిరీస్‌ను... ‘బాక్సింగ్ డే’ సమరం ఇంకెంత రసవత్తరం చేస్తుందో చూడాలి. మయాంకొచ్చాడు... వారిద్దరూ ఔట్ లెక్కకు మిక్కిలి అవకాశాలతో పాటు అంతే స్థాయిలో వైఫల్యాలను మూటగట్టుకున్న విజయ్, రాహుల్‌లను ఇంకెంతమాత్రం భరించలేని టీమిండియా... కొత్త కుర్రాళ్లైనా, కఠిన పరిస్థితులు ఎదురవనున్నా ఏమాత్రం సంకోచించకుండా మయాంక్, విహారిలను ఓపెనర్లుగా దించేందుకే సిద్ధమైంది. బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు రోహిత్ శర్మను ఆరో స్థానంలో పంపనుంది. ఫిట్‌నెస్‌పై విపరీత చర్చ జరిగినప్పటికీ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జడేజానే ఎంచుకుంది. పక్కటెముకల నొప్పి నుంచి ఇంకా కోలుకోని ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, ఫిట్‌నెస్‌పై అనుమానాలతో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు అవకాశం దక్కలేదు. కూర్పు రీత్యా బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ కోహ్లి, పుజారా, రహానే త్రయమే మోయాలి. వీరిలో ఏ ఇద్దరు నిలిచినా భారీ స్కోరు ఖాయం. కొద్దిసేపు నిలవగలిగితే రోహిత్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ నుంచి మంచి ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చు. పేసర్లు ఇషాంత్, షమీ, బుమ్రా చక్కగా రాణిస్తున్నారు. అయితే, ప్రత్యర్థి టాపార్డర్లానే లోయరార్డర్‌ను కూడా వీరు పడగొట్టాలి. చకచకా ఓవర్లు వేసే జడేజా... పరిస్థితులకు తగ్గట్లు వికెట్లు సైతం తీస్తే జట్టుకు మేలు చేకూరుతుంది. హనుమా... గట్టెక్కించుమా? కెరీర్లో మూడో టెస్టు ఆడబోతున్న ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి... మెల్బోర్న్లో ఓపెనింగ్‌కు దిగబోతూ ప్రస్తుతం కీలకమైన ఘట్టం ముందున్నాడు. రంజీల్లోనూ ఇన్నింగ్స్ ప్రారంభించని అతడు ఇప్పుడు ఏకంగా టీమిండియా ఓపెనర్‌గా దిగుతున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ప్రధాన పేసర్ స్టార్క్ పదునైన బంతులను దీటుగా ఎదుర్కొన్న తీరే బహుశా విహారికి ఈ అవకాశం దక్కేలా చేసింది. టెక్నిక్, దృక్పథం రెండూ ఉన్న అతడు మంచి ఇన్నింగ్స్‌తో ఈ సవాల్‌ను అధిగమించగలిగితే జట్టు మేనేజ్మెంట్ నెత్తిన పాలుపోసినవాడవుతాడు. తద్వారా, టెస్టు జట్టులో కీలక సభ్యుడిగానూ ఎదుగుతాడు. అటు నిత్యం ఊగిసలాటలో ఉండే ఆరో స్థానం కంటే, ఓపెనర్‌గా నిలదొక్కుకుంటే వ్యక్తిగతంగానూ అతడి కెరీర్‌కు మేలు చేకూరుతుంది. దీనిని అందిపుచ్చుకుని విహారి విజయవంతమవ్వాలని ఆశిద్దాం. ఆసీస్... వ్యూహాత్మకంగా బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆతిథ్య జట్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్‌కోంబ్‌ను తప్పించి మిషెల్ మార్ష్ ఆడిస్తోంది. పిచ్ పేసర్లకు అనుకూలించవచ్చన్న అంచనానే దీనికి కారణమై ఉండొచ్చు. మిషెల్ బ్యాటింగ్‌లోనూ నమ్మదగినవాడే. ధాటిగా పరుగులు రాబట్టే ఓపెనర్ అరోన్ ఫించ్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజా, షాన్ మార్‡్షలను త్వరగా వెనక్కుపంపాలి. పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్‌ల పదునైన బంతులను కాచుకోవడం భారత ఓపెనర్లకు కఠిన పరీక్ష. పిచ్ ఎలా ఉన్నా, వికెట్లు తీస్తున్న నాథన్ లయన్... రెండు జట్ల మధ్య తేడా తానేనని చాటుకున్నాడు. ఇతడి లయను దెబ్బతీస్తే కోహ్లి సేన పని సులువవుతుంది. ►2 ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో నెగ్గగా... అందులో రెండు (1977, 1981) మెల్‌బోర్న్‌లోనే వచ్చాయి. ఓవరాల్‌గా భారత్ మెల్బోర్న్లో 12 టెస్టులు ఆడి రెండింటిలో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని ఎనిమిదింటిలో ఓడిపోయింది. పిచ్, వాతావరణం గతేడాది యాషెస్ టెస్టు నిస్సారమైన ‘డ్రా’గా ముగియడంతో మెల్బోర్న్ పిచ్‌ను ఐసీసీ నాసిరకం అని తేల్చింది. తర్వాత షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లూ ఇదే విధంగా సాగాయి. ఇప్పుడు మాత్రం పచ్చికతో పిచ్ జీవం ఉన్నట్లు కనిపిస్తోంది. నాలుగు రోజులు చక్కటి ఎండ కాయనుంది. ఈ ప్రభావం పిచ్‌పైనా పడే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్‌కే మొగ్గుచూపొచ్చు. తుది జట్లు భారత్: మయాంక్ అగర్వాల్, విహారి, పుజారా, కోహ్లి (కెప్టెన్), రహానే, రోహిత్, పంత్, జడేజా, షమీ, ఇషాంత్, బుమ్రా. ఆస్ట్రేలియా: ఫించ్, హారిస్, ఖాజా, షాన్ మార్ష్, హెడ్, మిషెల్ మార్ష్, పైన్ (కెప్టెన్), స్టార్క్, కమిన్స్, లయన్, హాజల్‌వుడ్. ఉదయం గం. 5.00 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లో ప్రత్యక్ష ప్రసారం బ్యాట్స్‌మెన్... బాధ్యతగా ఆడండి అద్భుతంగా రాణిస్తున్న మా బౌలర్లకు సమష్టి ప్రదర్శనతో బ్యాట్స్‌మెన్ అండగా నిలవాలి. మేం మెరుగైన స్కోరు చేయకుంటే బౌలర్లు ఏమీ చేయలేరు. నాథన్ లయన్‌ను ఎదుర్కొనేందుకు మా వద్ద ప్రణాళికలున్నాయి. మైదానంలో జరిగిన దానికి (పైన్‌తో వాగ్వాదం) బయట ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. నేను ఇలాంటి వాడిని అని బ్యానర్ కట్టుకుని తిరుగుతూ బయటి ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదు. మిగతా వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం నా పని కూడా కాదు. ఎందుకంటే... ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. – భారత కెప్టెన్ విరాట్ కోహ్లి -
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌కు భారత జట్టు ఇదే!
-
బాక్సింగ్‌డే టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్‌దే బాధ్యత!
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరిగే బాక్సింగ్‌డే టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్ రాణించాల్సిందేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సహచర ఆటగాళ్లకు సూచించాడు. రేపటి (బుధవారం) నుంచి మెల్బోర్న్ వేదికగా మూడో టెస్ట్ ఆరంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సారి బ్యాట్స్‌మెన్ రాణించడం ఎంతో ముఖ్యం. బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తుంది. చిన్న టార్గెట్లను కూడా చేధించకపోతే బౌలర్స్ ఏం చేయలేరు. ఒక వేళ సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. ఆధిక్యం కోసం ప్రయత్నించాలి. లేకుంటే కనీసం ఆ స్కోర్‌ను సమం చేయడానికైనా కృషి చేయాలి. రెండో ఇన్నింగ్స్‌లో గెలపుకోసం ప్రయత్నించాలి. తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం భారీ స్కోర్లు సాధించి విజయావకాశాలను అందిపుచ్చుకోవాలి. దీనికోసం బ్యాట్స్‌మెన్ అంతా కలిసికట్టుగా రాణించాలి. ఏ ఒక్కరో రాణించాలని చెప్పడం లేదు. అందరూ ఐక్యంగా పరుగులు చేయాల్సిందే.’ అని భారత ఆటగాళ్లకు కోహ్లి దిశానిర్ధేశం చేశాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే చెరొకటి గెలిచిన ఇరు జట్లు మూడో టెస్ట్ విజయంపై దృష్టిసారించాయి. ఎలాగైన విజయం సాధించి సిరీస్‌లో పై చేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే భారత్ రెండో టెస్ట్‌లో పరాజయం పాలైంది. స్వల్ప టార్గెట్లను కూడా చేధించలేక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీమ్‌మేనేజ్‌మెంట్ జట్టులో మార్పులు చేసింది. దారుణంగా విఫలమైన ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌లను పక్కకు పెట్టింది. ఉన్నపళంగా కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను రప్పించి తుది జట్టులో అవకాశం కల్పించింది. గత రెండు టెస్ట్‌ల్లో ఆరంభం సరిగ్గా లేక భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యం చెందారు. దీంతో రంజీల్లో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలను ఓపెనర్లుగా పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
బాక్సింగ్‌డే టెస్ట్ భారత జట్టు ఇదే!
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా బుధవారం నుంచి జరిగే మూడో టెస్ట్‌కు బీసీసీఐ భారత తుది జట్టును ప్రకటించింది. దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళి విజయ్‌లపై వేటు వేసింది. ఇద్దరిని బెంచ్‌కే పరిమితం చేసింది. యువ ఆటగాడు పృథ్వీషా గాయంతో సిరీస్ నుంచి దూరం కావడంతో ఉన్నపళంగా రప్పించిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌కు తుది జట్టులో అవకాశం కల్పించింది. వెన్ను నొప్పితో రెండు టెస్ట్‌కు దూరమైన రోహిత్ శర్మ తిరిగి అవకాశం దక్కించుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మ వస్తారా? లేక మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలతో ఇన్నింగ్స్ ప్రారంభించి భారీ ప్రయోగం చేస్తారా? అనేది చూడాలి? ఈ మ్యాచ్‌తో మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక పేసర్ ఉమేశ్ యాదవ్‌కు కూడా ఉద్వాసన పలికిన జట్టు మేనేజ్మెంట్.. స్పిన్నర్ రవీంద్ర జడేజాకు అవకాశం కల్పించింది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే చెరొకటి గెలిచిన ఇరు జట్లు మూడో టెస్ట్ విజయంపై దృష్టిసారించాయి. ఎలాగైన విజయం సాధించి సిరీస్‌లో పై చేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. భారత తుది జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, చతేశ్వర పుజారా, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా India name Playing XI for 3rd Test: Virat Kohli (C), Ajinkya Rahane (VC), Mayank Agarwal, Hanuma Vihari, Cheteshwar Pujara, Rohit Sharma, Rishabh Pant (WK), Ravindra Jadeja, Mohammed Shami, Ishant Sharma, Jasprit Bumrah #TeamIndia #AUSvIND pic.twitter.com/DImj8BVTj5 — BCCI (@BCCI) 24 December 2018 -
నాన్నకు చెబితే నమ్మలేదు
ఆసీస్ జట్టులో చోటుపై జో బర్న్స్ మెల్బోర్న్: ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ స్థానంలో ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్న 25 ఏళ్ల బ్యాట్స్‌మన్ జో బర్న్స్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ‘బాక్సింగ్ డే’ టెస్టు కోసం జట్టులోకి ఎంపికయ్యాననే వార్తను తన తండ్రికి చెబితే ఏమాత్రం నమ్మలేదని అన్నాడు. ‘నా తండ్రి ఈ వార్తను అస్సలు పట్టించుకోలేదు. దీంతో కాస్త నిరాశకు గురయ్యాను. నేను ఆసీస్ క్రికెట్‌కు వీరాభిమానిని. ప్రతీ మ్యాచ్‌ను ఫాలో అవుతాను. నేను అభిమానించే లీమన్ ఆధ్వర్యంలో జట్టుకు ఆడేందుకు ఎదురుచూస్తున్నాను. ఓరకంగా నా కల నిజమైంది’ అని బర్న్స్ ఆనంద ం వ్యక్తం చేశాడు.