మెల్‌బోర్న్ : కరోనా కారణంగా ఈ ఏడాది చివర్లో ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) నుంచి భారత్–ఆ్రస్టేలియా ‘బాక్సింగ్ డే’ టెస్టు తరలిపోనుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు సిద్ధమైంది. పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించి డిసెంబర్ 26 నుంచి 30 వరకు ‘బాక్సింగ్ డే’ టెస్టును ఎంసీజీలోనే జరిగేలా చూడాలని భావిస్తున్నట్లు మెల్‌బోర్న్ నగరం ఉన్న విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ వెల్లడించారు.
మరోవైపు వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నకి కూడా ఇదే తరహా ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ఏడాది ‘బాక్సింగ్ డే’ టెస్టుకు 2 లక్షల మంది ప్రేక్షకులు హాజరు కాగా... ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగిన మెల్‌బోర్న్ పార్క్‌లో 8 లక్షల మంది మ్యాచ్‌లను వీక్షించారు. అయితే ప్రస్తుతం ఆ్రస్టేలియాలోని 70 శాతం కరోనా కేసులు విక్టోరియా రాష్ట్రంలోనే నమోదు కాగా... మరణాలు 90 శాతం ఇక్కడి నుంచే ఉన్నాయి.
‘గరిష్టంగా ఎంత మందిని టెస్టు మ్యాచ్‌లు అనుమతించాలనే విషయంలో చర్చిస్తున్నాం. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందరి ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూనే సాధ్యమైనంత ఎక్కువ మందిని లోపలికి పంపేందుకు ప్రయతి్నస్తాం. దీనికి సంబంధించి క్రికెట్ ఆ్రస్టేలియాతో మాట్లాడుతున్నాం. ఒక్క క్రీడా ఈవెంట్ కారణంగా ఇప్పటి వరకు మేం చేస్తున్న శ్రమ వృథా కాకూడదనే మా ప్రయత్నం. ఒక్కసారి ఇలాంటి చోట కోవిడ్–19 వ్యాప్తి మొదలైందంటే అది ఎక్కడి వరకు సాగుతుందో చెప్పలేం’ అని డేనియల్ ఆండ్రూస్ అభిప్రాయ పడ్డారు. మెల్‌బోర్న్‌లో ‘బాక్సింగ్ డే’ టెస్టు సాధ్యంకాకపోతే టెస్టు మ్యాచ్ వేదిక అడిలైడ్‌కు మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment