ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించేందుకు థాయ్‌లాండ్ అధికారులు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం బ్యాంకాక్ ఎయిర్‌పోర్టుకు వార్న్ మృతదేహాన్ని తరలించారు. రేపటిలోగా మృతదేహం ఆస్ట్రేలియాకు తరలించేలా అధికారులు ప్లాన్ చేశారు. ఇక వార్న్ శవపరీక్షకు సంబంధించి అటాప్సీ రిపోర్టు సోమవారం వచ్చిన సంగతి తెలిసిందే. రిపోర్టులో వార్న్‌ది సాధారణ మరణమేనని పోలీసులు ధ్రువీకరించారు.
ఇక వార్న్ అంత్యక్రియలు మార్చి 30న ప్రభుత్వ అధికార లాంచనాలతో నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈ నెల 30న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో వార్న్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అతని అభిమానులు, సన్నిహితులు, బంధువులు కడసారి వీడ్కోలు పలికేందుకు వీలుగా ఎంసీజీని వేదికగా చేశామని విక్టోరియా రాష్ట్ర ముఖ్యమంత్రి డానియెల్ అండ్రూస్ వెల్లడించారు. ఎంసీజీ వార్న్‌కు విశిష్టమైన వేదిక. అక్కడే 1994లో జరిగిన యాషెస్ సిరీస్‌లో హ్యాట్రిక్‌తో అందరికంటా పడ్డాడు. తర్వాత 2006లో అచ్చొచ్చిన ఆ వేదికపైనే 700వ వికెట్ తీశాడు. బ్యాంకాక్‌లోని విల్లాలో స్నేహితులతో గడిపేందుకు వచ్చిన 52 ఏళ్ల వార్న్ ఈనెల 4న గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు.
చదవండి: Shane Warne: 'వార్న్ భుజాలు బలమైనవి'... రహస్యం తెలుసన్న అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment