Shane Warne
-
అశ్విన్ ద గ్రేట్.. మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ..!
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 765 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్లతో పోలిస్తే టెస్ట్ క్రికెట్ ఎక్కువగా ఆడిన యాష్.. ఒక్క సుదీర్ఘ ఫార్మాట్లోనే 537 వికెట్లు తీశాడు. అశ్విన్ టెస్ట్‌ల్లో 37 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800) కొనసాగుతున్నాడు. మురళీ తర్వాతి స్థానాల్లో షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563) ఉన్నారు.మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ సార్లు..!టెస్ట్‌ల్లో మురళీథరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ స్పిన్నర్లు అశ్విన్ కంటే ఎక్కువ వికెట్లు తీశారు. వికెట్ల సంఖ్యా పరంగా లేదా ఇతరత్రా రికార్డుల విషయంలో వీరంతా అశ్విన్ కంటే మెరుగ్గా ఉన్నా, ఒక్క విషయంలో మాత్రం అశ్విన్ పై ముగ్గురిని తలదన్నాడు.టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక సార్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. అశ్విన్ తన కెరీర్లో ఏడు సార్లు టెస్ట్ సిరీస్‌ల్లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీయగా.. షేన్ వార్న్, మురళీథరన్ ఆరు సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అశ్విన్ 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరు సిరీస్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవడం విశేషం. అశ్విన తన కెరీర్లో మొత్తం 12 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్నాడు. -
షేన్ వార్న్ నా హీరో.. ఇప్పటికీ నేను బాధపడుతునే ఉన్నా: కుల్దీప్
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ శుక్రవారం ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ని సందర్శించాడు. ఈ సందర్భంగా ఏంసీజీలో ఏర్పాటు చేసిన దివంగత ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ విగ్రహం ముందు కుల్దీప్ నివాళులర్పించాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను కుల్దీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేశాడు. షేన్ వార్న్ బౌలింగ్‌లో ఎప్పటికి ఒక అద్భుతం అంటూ కుల్దీప్ క్యాప్షన్‌గా ఇచ్చాడు. అదే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడిన కుల్దీప్.. వార్న్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు."షేన్ వార్న్ నా ఆరాధ్య క్రికెటర్. షేన్ నా హీరో. అతడితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. వార్నీని గుర్తుచేసుకునే ప్రతీసారి నేను భావోద్వేగానికి లోనవుతాను. నా కుటుంబంలోని ఒకరిని నేను కోల్పోయినట్లు ఇప్పటికీ అనిపిస్తుందని" కుల్దీప్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పేర్కొన్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అనంతరం అతడు దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని టీమ్ Aకు కుల్దీప్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆ తర్వాత వరుస టెస్టు సిరీస్‌లతో కుల్దీప్ బీజీబీజీగా గడపనున్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో కుల్దీప్ది కీలక పాత్ర. -
బాల్ ఆఫ్ ద సెంచరీ.. బ్యాటర్ ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
క్రికెట్‌కు సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో ఓ స్పిన్ బౌలర్ నమ్మశక్యంకాని రీతిలో బంతిని స్పిన్ చేసి బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కువైట్ పేరు గల జెర్సీతో కనిపించిన సదరు బౌలర్ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ శైలిలో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. pic.twitter.com/TipPaTbbOS — Out Of Context Cricket (@GemsOfCricket) February 12, 2024 ఆఫ్ స్టంప్ ఆవల పడిన ఫుల్‌టాస్ బంతి నమ్మశక్యంకాని రీతిలో లెగ్ స్టంప్‌ను గిరాటు వేసింది. బంతి స్పిన్ అయిన విధానం చూసి బ్యాటర్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎలా స్పందించాలో తెలియక గమ్మున పెవిలియన్ బాటపట్టాడు. ఈ వీడియోని చూసిన వారంతా షేన్ వార్న్ బాల్ ఆఫ్ ద సెంచరీని మించిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను బట్టి చూస్తే ఈ మ్యాచ్ ఏదో దేశవాలీ టోర్నీలో జరిగనట్లుగా తెలుస్తుంది. Rest in Peace to the man who gave us the Ball of the Century. There will never be another like Shane Warne. pic.twitter.com/ddFaUoiTGD — Derek Alberts (@derekalberts1) March 4, 2022 కాగా, 1993లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో షేన్ వార్న్.. మైక్ గ్యాటింగ్‌ను నమ్మశక్యంకాని రీతిలో క్లీన్ బౌల్డ్ చేశాడు. వార్న్ వేసిన లెగ్ స్పిన్ బంతిని అంచనా వేయలేక గ్యాటింగ్ తికమకపడిపోయాడు. ఎక్కడో లెగ్ స్టంప్ అవతల పడిన బంతి గింగిరాలు తిరుగుతూ గ్యాటింగ్ డిఫెన్స్‌ను తప్పించుకుని ఆఫ్ స్టంప్‌ను తాకింది. ఈ బంతిని బాల్ ఆఫ్ ద సెంచరీగా పిలుస్తారు. ఇదిలా ఉంటే, దివంగత షేన్ వార్న్ ఇలాంటి బంతులను చాలా సందర్భాల్లో సంధించిన విషయం తెలిసిందే. 90వ దశకంలో షేన్ వార్న్ స్పిన్ మాయాజాలానికి బ్యాటర్లు బెంబేలెత్తిపోయేవారు. వార్న్ సంధించే బంతులను ఎలా ఆడాలో తెలియక తికమకపడిపోయేవారు. ఏ బంతి ఎక్కడ ల్యాండై ఎలా టర్న్ అవుతుందో అర్ధంకాక జట్టు పీక్కునేవారు. వార్న్ టెస్ట్ క్రికెట్లో రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా ఉన్నాడు. వార్న్ 2022లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. -
క్యూరేటర్ నుంచి ఆసీస్ స్పిన్ లెజెండ్‌గా.. ఏకంగా షేన్ వార్న్ సరసన!
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానం.. తర్వాతి మ్యాచ్ కోసం క్యురేటర్ల బృందం పిచ్ తయారు చేస్తోంది. అందులో ఒక 24 ఏళ్ల కుర్రాడు అమితోత్సాహంతో అందరికంటే వేగంగా చకచకా పని పూర్తి చేస్తున్నాడు. ముఖ్యంగా పిచ్ చివర్లో స్టంప్స్ వద్ద స్పిన్ బంతి టర్నింగ్‌కు సంబంధించి సహచరులకు ప్రత్యేక సూచనలు ఇస్తూ వాటరింగ్ చేయిస్తున్నాడు. అతను కొన్నాళ్ల క్రితమే ఆ మైదానానికి బదిలీపై వచ్చాడు. అంతకు ముందు నాలుగేళ్ల పాటు కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ గ్రౌండ్లోనూ ఇదే పని చేశాడు. పిచ్ తయారీపై బేసిక్స్ నేర్చుకొని అక్కడే పూర్తి స్థాయిలో శిక్షణ కూడా పొందాడు. అయితే క్యురేటర్‌గా అనుభవం మాత్రమే కాదు ఒక ఆటగాడి తరహాలో అతనికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ అడిలైడ్‌లోని కోచ్‌లను ఆకర్షించింది. అనంతరం జట్లు ప్రాక్టీస్‌కు సిద్ధమైనప్పుడు నెట్ బౌలర్లు తక్కువ పడటంతో నువ్వు బౌలింగ్ చేయగలవా అని కోచ్ డారెన్ బెరీ ఈ కుర్రాడిని అడిగాడు. కచ్చితంగా అని బదులిచ్చిన అతను వెంటనే బంతితో బరిలోకి దిగిపోయాడు. అతని స్పిన్ బౌలింగ్ శైలి, టర్నింగ్ రాబడుతున్న తీరు కోచ్‌ను అమితాశ్చర్యానికి గురి చేశాయి. అతని వివరాలను తెలుసుకోగా.. తాను అప్పటికే చాలా చోట్ల క్రికెట్ ఆడానని, అయితే అవేవీ గుర్తింపు పొందిన స్థాయిలో కాదని ఆ బౌలర్ చెప్పాడు. దాంతో నీకు తగిన అవకాశం కల్పిస్తానన్న కోచ్ బెరీ మాట తప్పలేదు. అతని ప్రతిభ గురించి అందరికీ చెప్పి అడిలైడ్ టి20 టీమ్ రెడ్బ్యాక్స్లోకి ఎంపిక చేశాడు. అంతే.. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తొలి అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని సత్తా చాటడంతో వరుసగా మ్యాచ్‌లు దక్కాయి. ఆపై ఫార్మాట్ మారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడే అవకాశమూ లభించింది. దానిని అందిపుచ్చుకొని ఆ బౌలర్ ఉవ్వెత్తున ఎగశాడు. ఏడు నెలల వ్యవధిలోనే జాతీయ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పుష్కరకాలంగా ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్న ఆ బౌలర్ పేరే నాథన్ లయన్. క్యురేటర్‌గా మొదలై టెస్టుల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందడం వరకు ఆఫ్‌స్పిన్నర్ లయన్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. స్టూవర్ట్ మెక్‌గిల్, మైకేల్ బీర్, డోహర్తి, క్రేజా, మెక్‌గెయిన్, హారిట్జ్, స్టీవ్ స్మిత్, హాగ్, హాలండ్, వైట్, కాసన్.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మందితో కూడిన జట్టు ఇది. ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ రిటైర్మెంట్ తర్వాత ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అన్వేషణ సుదీర్ఘంగా సాగింది. ఆ ప్రయత్నంలో భాగంగా వారు ప్రయత్నించిన 11 మంది స్పిన్నర్ల పేర్లు ఇవి. కానీ ఇందులో ఏ ఒక్కరూ ప్రతిభపరంగా వార్న్ దరిదాపుల్లోకి రావడం అటుంచి.. కనీసం పోలికకు కూడా అర్హత లేని స్థాయి వారిది. అందుకే ఎన్ని అవకాశాలు కల్పించినా ప్రతిభను చూపించలేక అతి తక్కువ సమయంలోనే కనుమరుగైపోయారు. వార్న్ స్థాయిలో కాకపోయినా, కనీసం ఉపఖండంలో సిరీస్‌లు ఆడేందుకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు తగినట్లుగా కొంతయినా ప్రభావం చూపించేవాడు ఉంటే చాలని ఆసీస్ క్రికెట్ భావించినా.. అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఇక స్పిన్నర్ల వేటను మానేసి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచవ్యాప్తంగా ఏ మైదానంలో ఆడినా తమ పేసర్ల బలాన్ని నమ్ముకుంటూ బరిలోకి దిగుతూ వచ్చింది. అలాంటి సమయంలో నాథన్ లయన్ వచ్చాడు. ఎలాంటి గందరగోళం లేకుండా సంప్రదాయ స్పిన్ బౌలింగ్, క్లాసికల్‌గా బంతిని ఫ్లయిట్ చేయడానికి ఇష్టపడే స్పిన్నర్‌గా లయన్ వెలుగులోకి వచ్చాడు. ఇలాంటి స్పిన్నర్లు సాధారణంగా ఉపఖండంలోనే గుర్తింపు దక్కించుకుంటారు. కానీ ఆసీస్‌కు లయన్ రూపంలో అలాంటి ఆటగాడు దక్కాడు. అందుకే వారు అతడిని కళ్లకు అద్దుకొని జట్టులోకి తీసుకున్నాడు. లయన్ కూడా తన ఎంపికకు న్యాయం చేస్తూ వారిని ఎప్పుడూ నిరాశపరచలేదు. అటు ఉపఖండం పిచ్‌లపై కూడా సత్తా చాటడంతో పాటు స్పిన్‌ను ఏమాత్రం అనుకూలించని ఆసీస్ మైదానాల్లోనూ ప్రత్యర్థులపై చెలరేగి తాను లేకుండా ఆసీస్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడలేని స్థాయికి చేరుకున్నాడు. వార్న్‌కు సరైన వారసుడినని నిరూపించుకుంటూ 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఏకంగా 500 టెస్టు వికెట్లతో ఇప్పుడు శిఖరాన నిలిచాడు లయన్. అలా మొదలైంది.. 2011, సెప్టెంబర్ 1.. గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు. లయన్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్‌కు దిగాడు. రౌండ్ ద వికెట్‌గా వచ్చి బంతిని సంధించాడు. గ్రిప్, ఫ్లయిట్, టర్న్, బౌన్స్.. అనూహ్యంగా వచ్చిన బంతిని ఆడలేక లంక దిగ్గజం సంగక్కర గందరగోళానికి గురయ్యాడు. బ్యాట్‌ను తాకిన బంతి స్లిప్స్‌లో కెప్టెన్ క్లార్క్ చేతుల్లో పడింది. అంతే.. అటు లయన్‌తో పాటు ఇటు ఆసీస్ బృందంలో సంబరాలు. టెస్టు క్రికెట్లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన అత్యంత అరుదైన జాబితాలో లయన్‌కు చోటు లభించింది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో అతనికి ఘనారంభం దొరికింది. అద్భుతంగా మొదలైన కెరీర్ ఆపై మరిన్ని ఘనతల దిశగా సాగింది. నాలుగేళ్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా తరఫున వికెట్లపరంగా అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్‌గా లయన్ గుర్తింపు తెచ్చేసుకున్నాడు. యాషెస్‌తో మేలిమలుపు.. ఆటలో ఎంత సత్తా ఉన్నా, అద్భుతాలు చేసే నైపుణ్యం ఉన్నా ఆటగాళ్లకు తగిన అవకాశం, సరైన వేదిక ఎంతో ముఖ్యం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లకు సంబంధించి యాషెస్ సిరీస్ అలాంటిదే. ఈ చిరకాల ప్రత్యర్థుల జట్లలో ఎంతో మంది ఆటగాళ్లను యాషెస్ సిరీస్ హీరోలను చేస్తే, మరెంతో మందిని జీరోలను చేస్తుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటున్న క్రమంలో 2011 యాషెస్ సిరీస్ కోసం లయన్‌కు చాన్స్ లభించింది. ఎంతో ఉత్సాహంతో తన టాలెంట్ చూపించేందుకు లయన్ సిద్ధం కాగా, వేర్వేరు పరిస్థితులను కారణాలుగా చూపుతూ టీమ్ మేనేజ్మెంట్ తొలి రెండు టెస్టుల్లో అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది. అయితే తర్వాతి మూడు టెస్టుల్లో అవకాశం సాధించి కీలక దశలో తొమ్మిది వికెట్లు పడగొట్టిన లయన్ రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి ఆసీస్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే జరిగిన రిటర్న్ యాషెస్ సిరీస్‌తో లయన్ విలువేమిటో ఆసీస్ మేనేజ్మెంట్కు బాగా తెలిసొచ్చింది. సొంత గడ్డపై 19 వికెట్లతో సత్తా చాటిన లయన్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఆ వెంటనే దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడా తన స్పిన్ పదును చూపించడంలో అతను సఫలమయ్యాడు. ఆ తర్వాత 2022లో గాయం కారణంగా ఒక మ్యాచ్ దూరమయ్యే వరకు లయన్ లేకుండా ఆస్ట్రేలియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదంటే అతిశయోక్తి కాదు. ఆసీస్ దిగ్గజంగా ఎదిగి.. షేన్‌వార్న్ తర్వాత ఆస్ట్రేలియా అత్యుత్తమ స్పిన్నర్‌గా లయన్‌కు ఎప్పుడో గుర్తింపు దక్కింది. స్పిన్నర్లకు వికెట్లే దక్కవని భావించే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజీలండ్లాంటి దేశాల్లో కూడా అతను పెద్ద సంఖ్యలో వికెట్లు పడగొట్టాడు. కానీ ఏదో అసంతృప్తి. అతడిని ప్రత్యేకంగా నిలబెట్టే మరి కొన్ని ప్రదర్శనలు కావాలి. ఒక స్పిన్నర్ గుర్తింపు దక్కించుకునేందుకు భారత్‌కంటే సరైన వేదిక ఏముంటుంది. భారత గడ్డపై సత్తా చాటి స్పిన్‌కు అనుకూలించే మైదానాలే అయినా భారతీయేతర స్పిన్నర్లు ఎవరూ ఇక్కడ తమదైన ముద్ర వేయలేకపోయారు. ఇక్కడా రాణిస్తే అతని కీర్తి రెట్టింపవుతుంది. లయన్ సరిగ్గా అదే చేసి చూపించాడు. భారత గడ్డపై ఆడిన 11 టెస్టుల్లో కేవలం 27.35 సగటుతో 56 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన విదేశీ బౌలర్‌గా నిలిచాడు. అతని కెరీర్ సగటు (30.85) కంటే ఇది తక్కువ కావడం విశేషం. షేన్ వార్న్ సరసన లయన్ కెరీర్లో మూడు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (8/50, 8/64, 7/94) భారత దేశంలోనే వచ్చాయి. లయన్ సాధించిన ఈ తొలి 8 వికెట్ల ప్రదర్శనకు బెంగళూరు వేదికైంది. సొంత గడ్డపై కంటే విదేశాల్లోనే ఎక్కువ వికెట్లు (258) సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో లయన్ కూడా ఉన్నాడు. కాగా స్వదేశంలో ఇటీవల పాకిస్తాన్ మూడో టెస్టు(2024) సందర్భంగా 250 వికెట్ల మైలురాయి అందుకుని షేన్ వార్న్ సరసన నిలిచాడు లయన్. ఆసీస్ ఓడిన మ్యాచ్‌లలో తీసిన వికెట్లకంటే (138) ఆ జట్టు గెలిచిన మ్యాచ్‌లలో అతను పడగొట్టిన వికెట్లు (301) అతని విలువను చూపిస్తూ దిగ్గజ స్థాయిని అందించాయి. ఆస్ట్రేలియా జట్టు అవసరాలు, కూర్పు కారణంగా లయన్ వన్డే కెరీర్ 29 మ్యాచ్‌లకే పరిమితం అయినా.. టెస్టుల్లో అతని కీర్తి శాశ్వతం. 36 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న లయన్ టెస్టు క్రికెట్లో మున్ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయం. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్ బతికుంటే సంతోషించేవాడు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుటెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆసీస్ రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇక రెండోటెస్టు ఇరుజట్ల మధ్య జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది. అయితే ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో అలీ గాయపడ్డాడు. దీంతో లార్డ్స్ టెస్టుకు మొయిన్ అలీ దూరమయ్యాడు. అయితే అతని స్థానంలో ఎవరు ఊహించని రీతిలో 18 ఏళ్ల కుర్రాడికి ఈసీబీ అవకాశం ఇచ్చింది.లెగ్ స్పిన్నర్ అయిన 18 ఏళ్ల రిహాన్ అహ్మద్‌ను మొయిన్ అలీకి రీప్లేస్‌గా తీసుకోవడం ఆసక్తి కలిగించింది. అయితే ఇదే రిహాన్ అహ్మద్‌కు గతంలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ షేక్‌హ్యాండ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రిహాన్ 13 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గ్రౌండ్లో బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. అతని బౌలింగ్‌ను నిశితంగా పరిశీలించిన షేన్ వార్న్.. కాసేపటికి అతని దగ్గరికి వచ్చి.. ''నిజంగా సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నావ్. నేను అప్పటినుంచి నిన్ను గమనిస్తున్నా. త్వరలోనే నీ గురించి కామెంట్ చేస్తానేమో. 15 ఏళ్ల వయసులోనే నువ్వు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.. అంతేకాదు చిన్న వయసులోనే ఇంగ్లండ్ జట్టులో చోటు సంపాదిస్తావు'' అని చెప్పుకొచ్చాడు. వార్న్ ఆ మాటలు ఏ శుభ ముహుర్తానా అన్నాడో తెలియదు కానీ అదే ఇప్పుడు నిజమయ్యింది. మొయిన్ అలీ స్థానంలో ఎంపికవడం.. అదీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సందర్భంగా ఇది జరగడం రిహాన్ అహ్మద్‌ది అదృష్టం అని చెప్పొచ్చు. ఒకవేళ రెండో టెస్టులో అవకాశం లభించి మంచి ప్రదర్శన ఇస్తే మాత్రం ఇంగ్లండ్ జట్టులో శాశ్వత స్పిన్నర్‌గా పాతుకుపోయే అవకాశం రావొచ్చు. ఇక రిహాన్ అహ్మద్ తన ఎంపికపై స్పందిస్తూ.. ''ఏదో ఒకరోజు ఇంగ్లండ్‌కు ఆడుతానని తెలుసు.. కానీ ఇలా ఎంపికవుతానని ఊహించలేదు. సరిగ్గా ఐదేళ్ల క్రితం దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నన్ను ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు ఇవాళ నిజమయ్యాయి. వార్న్ బతికి ఉంటే తప్పకుండా సంతోషించేవాడు'' అంటూ పేర్కొన్నాడు. The King Shane Warne knew. Rehan Ahmed. pic.twitter.com/pCl6oaXkk3 — M (@anngrypakiistan) June 23, 2023 చదవండి: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!' -
వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా!
ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది థాయ్‌లాండ్ వెకేషన్లో ఉన్నప్పుడు విల్లాలోనే గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణం అప్పట్లో మిస్టరీగా ఉండిపోయింది. పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించిన వైద్యులు వార్న్ గుండెపోటు వల్ల మరణించాడని ద్రువీకరించారు. ఇక వార్న్ మరణం వెనుక ఉన్న మిస్టరీ తాజాగా వీడినట్లు తెలుస్తోంది. వార్న్ మరణానికి కారణం గుండెపోటు అయినప్పటికి పరోక్షంగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడమేనని భారత సంతతికి చెందిన డాక్టర్ ఆసీమ్ మల్హోత్రా తాజాగా మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. డాక్టర్ ఆసీమ్ మల్హోత్రాతో పాటు ఆస్ట్రేలియా మెడికల్ ప్రొఫెషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్ నిల్ షేన్ వార్న్ మరణం వెనుక ఉన్న కారణంపై రీసెర్చీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ''వార్న్ మరణించడానికి తొమ్మిది నెలల ముందు కోవిడ్ వ్యాక్సిన్ అయిన పీ-ఫైజర్(PFizer mRNA) వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వార్న్ తన ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకపోగా.. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడంతో పాటు స్మోకింగ్ చేసినట్లు తేలింది. దీనివల్ల వ్యాక్సిన్ ప్రభావం మందగించింది. అందువల్ల గుండెల్లో రక్తనాళాలు మూసుకుపోయాయి. దీనివల్లే అతను కార్డియాక్ అరెస్టుకు గురయ్యి చనిపోయాడు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు కూడా ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అతని బాడీలో బయోమెకానిజమ్ సరిగ్గా లేదు. ఇది కూడా వార్న్ మరణానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ నిబంధనలు సరిగ్గా పాటించి ఉంటే మాత్రం వార్న్ చనిపోయే అవకాశాలు తక్కువగా ఉండేవని'' అభిప్రాయపడ్డారు. కాగా టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఈ స్పిన్ మాంత్రికుడు 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 194 వన్డేల్లో 293 వికెట్లు.. ఓవరాల్‌గా వెయ్యి వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం. చదవండి: #ShaneWarne: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్ లో ఏం జరిగిందో చూడండి
-
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్లో ఏం జరిగిందో చూడండి..!
-
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు!
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంస్ ధోని ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా ధోని నిలిచాడు. ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్కే సారథిగా బరిలోకి దిగిన ధోని ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ధోని 41 ఏళ్ల 267 రోజుల వయస్సులో ఈ ఘనత నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు దివంగత ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ పేరిట ఉండేది. ఐపీఎల్-2011 సీజన్లో 41 ఏళ్ల 249 వయస్సులో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా షేన్ వార్న్ వ్యవహరించారు. తాజా మ్యాచ్‌తో వార్న్ 12 ఏళ్ల రికార్డును మిస్టర్ కూల్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి మ్యాచ్‌లో సీఎస్కేకు నిరాశ ఎదురైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్ (63) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ 3 బంతుల్లో 10 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చదవండి: GT Vs CSK: చెన్నై పేసర్ అరుదైన ఘనత.. టోర్నీ చరిత్రలోనే మొదటిసారి ఇలా! గుజరాత్ కూడా.. Not bad for a 41 year old who hasn’t picked up a bat since last May. #dhoni #ipl2023 pic.twitter.com/QMdvWhwOJp — simon hughes (@theanalyst) March 31, 2023 -
షేన్ వార్న్ పూనాడా ఏంది కుల్దీప్, అంతలా తిప్పేశావు..?
చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మహ్మద్ సిరాజ్ (7-1-37-2), అక్షర్ పటేల్ (8-0-57-2), హార్ధిక్ పాండ్యా (8-0-44-3), కుల్దీప్ యాదవ్ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కానప్పటికీ టీమిండియా ముందు రీజనబుల్ టార్గెట్‌ను ఉంచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మినహా (0) జట్టులో ప్రతి ఒక్కరు రెండంకెల స్కోర్ చేశారు. ట్రవిస్ హెడ్ (33), మిచెల్ మార్ష్ (47), డేవిడ్ వార్నర్ (23), లబూషేన్ (28), అలెక్స్ క్యారీ (38), స్టోయినిస్ (25), సీన్ అబాట్ (26), అస్టన్ అగర్ (17), స్టార్క్ (10), జంపా (10 నాటౌట్) తమకు లభించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక భారీ స్కోర్లు చేయలేకపోయారు. Peach of a Delivery by Kuldeep Yadav to dismiss Alex Carey 🔥pic.twitter.com/9vxNV4fJ81 — Kriti Singh (@kritiitweets) March 22, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్.. అలెక్స్ క్యారీని క్లీన్‌బౌల్డ్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. తొలి బంతి నుంచే గింగిరాలు తిరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన కుల్దీప్.. 39వ ఓవర్ తొలి బంతికి స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ పునాడా అని డౌట్ వచ్చేలా బంతిని మెలికలు తిప్పి క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. బంతి అంతలా టర్న్ అవుతుందని ఊహించని క్యారీ, బౌల్డ్ అయ్యాక పెట్టిన ఎక్స్ప్రెషన్ ప్రస్తుతం వైరలవతోంది. 10 years ago today !!! This is one of my favourite deliveries.... Thanks boys.... pic.twitter.com/MXGlDNVHTV — Shane Warne (@ShaneWarne) July 6, 2015 వాస్తవానికి కుల్దీప్ కూడా ఆ బంతి అంతలా టర్న్ అవుతుందని ఊహించి ఉండడు. లెగ్ స్టంప్ అవల పడ్డ బంతి ఏకంగా హాఫ్ స్టంప్‌ను గిరాటు వేయడంతో బ్యాటర్‌తో పాటు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. ఈ తరహా బంతులు ఎక్కువగా లెజెండరీ షేన్ వార్న్ వేయడం చూశాం. తాజాగా కుల్దీప్ అలాంటి బంతి వేయడంతో ఇతనికి షేన్ వార్న్ ఏమైనా పూనాడా అని నెటిజన్లు అనుకుంటున్నారు. కుల్దీప్ కూడా మంచి టర్నరే అయినప్పటికీ, బంతి ఇంతలా టర్న్ అయిన దాఖలాలు లేవు. కుల్దీప్ మ్యాజిక్ డెలివరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. -
నిన్ను చాలా మిస్ అవుతున్నా.. స్వర్గంలో నువ్వు..: సచిన్ భావోద్వేగం
Shane Warne Death Anniversary- Sachin Tendulkar Emotional Note: ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్‌ను తలచుకుని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ భావోద్వేగానికి లోనయ్యాడు. నిన్ను చాలా మిస్ అవుతున్నా వార్న్ అంటూ ఆసీస్ లెజెండ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. కాగా గతేడాది మార్చి 4న స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. మొదటి వర్ధంతి థాయ్‌లాండ్‌లో ఉన్న సమయంలో గుండెపోటుతో కుప్పకూలిన వార్న్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. ఈ విషాదకర వార్త తెలిసి క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. స్వదేశంలో అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ ప్రభుత్వ లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా వార్న్ మొదటి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచర ఆటగాళ్లు అతడిని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు. నువ్వు ఆ స్వర్గాన్ని కూడా.. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ వార్న్‌తో కలిసి ఉన్న ఫొటో పంచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘‘మైదానంలో మనం పోటాపోటీగా ఆడిన సందర్భాలున్నాయి.. అదే సమయంలో మైదానం వెలుపలా మనకంటూ కొన్ని మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక గొప్ప క్రికెటర్‌గా మాత్రమే కాదు.. ఓ మంచి స్నేహితుడిగా కూడా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీ చరిష్మా, హాస్యచతురతతో నువ్వు ఆ స్వర్గాన్ని మరింత అందమైన ప్రదేశంగా మారుస్తూ ఉంటావని నాకు తెలుసు వార్నీ!’’ అంటూ సచిన్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సచిన్- వార్న్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఒక్క ముక్క చికెన్ తినగానే.. వామ్మో.. గతంలో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణ సందర్భంగా షేన్ వార్న్ సచిన్ ఇంట్లో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. ‘ఒకరోజు ముంబైలో ఉన్న వాళ్లింటికి వెళ్లాను. డిన్నర్ చేసి తర్వాత హోటల్‌కి వెళ్దామని అనుకున్నా. అక్కడ ఒక్క చికెన్ ముక్క తినగానే నాకు దిమ్మతిరిగిపోయింది. అయినా సరే మెల్లమెల్లగా తినడానికి ప్రయత్నించా. ఎందుకంటే నాకు సచిన్ పట్ల, అతడి కుటుంబం పట్ల ఎంతో గౌరవం ఉంది. వాళ్లు నాపై ప్రేమను కురిపిస్తారు’’ అని వార్న్ పేర్కొన్నాడు. మా కోసం భరించాడు ఇందుకు స్పందించిన సచిన్.. ‘నీకు ఇండియన్ ఫుడ్ ఇష్టమేనా అని అడిగాడు. అందుకు వార్న్.. అవును.. నాకు చాలా చాలా ఇష్టమని సమాధానమిచ్చాడు. మిగతా వాళ్లకు భోజనం వడ్డిస్తున్న సమయంలో షేన్ తనే తన ప్లేట్లో ఫుడ్ పెట్టుకున్నాడు. తను ఆ స్పైసీ ఫుడ్ తినలేకపోతున్నాడని నాకు అర్థమైంది. కానీ మమ్మల్ని బాధపెట్టడం ఇష్టంలేక తను కాసేపు అలాగే ఉండిపోయాడు. మా మేనేజర్‌ను పిలిచి విషయం చెప్పాడు. తర్వాత తనే కిచెన్‌లోకి వెళ్లి బీన్స్, చిదిమిన ఆలుగడ్డలతో ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాడు’’ అని వార్న్ గురించి గొప్పగా చెప్పాడు. చదవండి: Ind vs Aus: ఇంకెప్పుడు బ్యాట్ ఝులిపిస్తారు? సూర్యను తీసుకోండి: పాక్ మాజీ స్పిన్నర్ అగ్రస్థానానికి ఎగబాకిన ఇంగ్లండ్ -
Shane Warne: అప్పుడే ఏడాది గడిచిపోయిందా? నమ్మలేకున్నా!
Shane Warne Death Anniversary: ‘‘అత్యంత విచారకరం. అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే నిజంగా నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ దివంగత షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్నాడు. కాలం గిర్రున తిరిగిపోయిందని.. వార్న్ లేడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశాడు. అద్భుతమైన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే వార్న్ లేనిలోటు ఎవరూ పూడ్చలేరన్నాడు. ‘మాంత్రికుడు’ మరో లోకానికి.. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఈ లోకాన్ని వీడి నేటికి సరిగ్గా ఏడాది. థాయ్‌లాండ్‌లో ఉన్న సమయంలో గుండెపోటుకు గురైన అతడు హఠాన్మరణం చెందాడు. ఛాతీ నొప్పితో కుప్పకూలిన వార్న్.. థాయ్‌లాండ్ పర్యటనలోనే కన్నుమూశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించింది. వార్న్‌ను కడసారి చూసుకునేందుకు తరలివచ్చిన అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. క్రికెట్ అంటే పిచ్చి ఈ నేపథ్యంలో షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్న మార్క్ టేలర్.. వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. స్పిన్ మాంత్రికుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇండియాలో బంతి అద్భుతంగా టర్న్ అవుతున్న సందర్భాల్లో కచ్చితంగా వార్న్ మనందరికీ మరీ మరీ గుర్తుకువస్తాడు. తన స్పిన్ మాయాజాలంతో వార్న్ చేసిన అద్భుతాలు, మైదానంలో వదిలిన జ్ఞాపకాలు అలాంటివి. అతడు లేని లోటు ఎన్నటికీ ఎవ్వరూ పూడ్చలేరు. అతడి అభిప్రాయాలన్నింటితో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ ఆట పట్ల వార్న్‌కు ఉన్న ప్రేమ, అంకితభావానికి మాత్రం ఫిదా కాకుండా ఉండలేం’’ అని మార్క్ టేలర్ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీసి వార్న్ ‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి టైటిల్ గెలిచిన సారథిగానూ రికార్డులకెక్కాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇక ప్రస్తుతం టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ వార్న్ పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొడుతూ సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు.. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ind Vs Aus: ఇండోర్ పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు -
Ind Vs Aus: షేన్ వార్న్ రికార్డు బద్దలు.. నాథన్ లియోన్ అరుదైన ఘనత
Ind Vs Aus 3rd Test Indore Day 1 Nathan Lyon Record: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా టీమిండియాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. ఇండోర్‌లో మొదలైన బుధవారం నాటి తొలి రోజు ఆటలో.. ఆరంభంలో పేస్‌కు అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై స్పిన్ బౌలర్లు చెలరేగుతున్నారు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్ ప్రభావం చూపలేకపోయిన వేళ.. మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్ వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతున్నారు. స్పిన్నర్ల విజృంభణ వీరిద్దరు చెలరేగడంతో మొదటి రోజు ఆటలో 12 ఓవర్లలో టీమిండియా 46 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేసి కుహ్నెమన్ ఆసీస్‌కు శుభారంభం అందించగా.. లియోన్ దానిని కొనసాగించాడు. వార్న్ రికార్డు బద్దలు.. లియోన్ అరుదైన ఘనత భారత ఓపెనర్లు రోహిత్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వికెట్లను కుహ్నెమన్ తన ఖాతాలో వేసుకోగా.. నాథన్ లియోన్ ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో జడ్డూను అవుట్ చేయడం ద్వారా లియోన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్‌గా చరిత్ర సృష్టించాడీ వెటరన్ స్పిన్నర్. తొలి రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన జడేజా వికెట్ తీసి రికార్డు సృష్టించాడు. కాగా ఆసియాలో లియోన్‌కు ఇది 128వ వికెట్. ఈ క్రమంలో అతడు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్లు(ఇప్పటి వరకు) ►నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా స్పిన్నర్)- 128 ►షేన్ వార్న్(ఆస్ట్రేలియా స్పిన్నర్) 127 ►డానియెల్ వెటోరీ(న్యూజిలాండ్ స్పిన్నర్)- 98 ►డెయిల్ స్టెయిన్(సౌతాఫ్రికా పేసర్)-92 ►జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లండ్ పేసర్)- 82 ►కోర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్ పేసర్)- 77 చదవండి: పుజారా చెత్త రికార్డు.. భారత్ తరపున రెండో క్రికెటర్‌గా Steve Smith: 'లెక్క సరిచేస్తా'.. నీకంత సీన్ లేదు! -
BGT 2023: అలెక్స్ క్యారీ వికెట్ ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన రికార్డు
India vs Australia, 2nd Test - Ravichandran Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(111 వికెట్లు) తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. వంద వికెట్ల ఘనత బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి రోజు ఆటలో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీని డకౌట్ చేసి.. ఆస్ట్రేలియాపై వంద వికెట్ల మార్కును అందుకున్నాడు. ఇక సమకాలీన క్రికెటర్లలో రవీంద్ర జడేజా(71) తప్ప అశ్విన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అగ్రస్థానంలో వార్న్ ఇదిలా ఉంటే.. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దివంగత ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడు.. 195 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీ బ్రేక్ సమయానికి అశ్విన్ మూడు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో మూడో సెషన్ ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 199(56 ఓవర్లు) చేయగలిగింది. ఇక క్యారీ కంటే ముందు అశూ.. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: Tom Blundell: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు! IND Vs AUS: పాపం వార్నర్.. మళ్లీ షమీ చేతిలోనే! వీడియో వైరల్ GONEEEEE!#TeamIndia bowlers have the ball talking and Aussie batters dancing to their tunes! Ashwin gets two huge wickets of Labuschagne and Smith! 🔥 Tune-in to the action in the Mastercard #INDvAUS Test on Star Sports & Disney+Hotstar! #BelieveInBlue #TestByFire pic.twitter.com/xxgiqyrRau — Star Sports (@StarSportsIndia) February 17, 2023 -
NZ Vs Eng: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో..
New Zealand vs England, 1st Test: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల జంట జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్లో సంయుక్తంగా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జంటగా చరిత్రకెక్కింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించింది. తద్వారా సంప్రదాయ క్రికెట్లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్ల జంటగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ ద్వయం గ్లెన్ మెగ్రాత్- షేన్ వార్న్ 1000 వికెట్ల రికార్డు నెలకొల్పారు. పేసర్ మెగ్రాత్- స్పిన్నర్ షేన్ వార్న్ 104 టెస్టు మ్యాచ్‌లలో కలిసి ఆడి సంయుక్తంగా 1001 వికెట్లు పడగొట్టి ఆండర్సన్- బ్రాడ్ జంట కంటే ముందుగా ఈ ఘనత సాధించారు. కివీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో ఆండర్సన్ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, రెండో రోజు మొదటి సెషన్లో బ్రాడ్ నైట్ వాచ్‌మన్ నీల్ వాగ్నర్ వికెట్ పడగొట్టాడు. దీంతో జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ జంట 1000 వికెట్ల క్లబ్లో చేరింది. ఇక ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో టాప్-5 వికెట్ టేకర్ల జాబితాలో కొనసాగుతున్నారు. 178 టెస్టుల్లో 40 ఏళ్ల ఆండర్సన్ 677 వికెట్లు పడగొట్టగా.. 36 ఏళ్ల బ్రాడ్ 160 మ్యాచ్‌లలో 567 వికెట్లు తీశాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు, షేన్ వార్న్ ఖాతాలో 708 వికెట్లు ఉన్నాయి. భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మౌంట్ మాంగనీయ్ వేదికగా న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో ఇంగ్లండ్ 325/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. చదవండి: Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?! నటాషా నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్ -
షేన్‌వార్న్‌కు ఆసీస్ బోర్డు సముచిత గౌరవం
దివంగత క్రికెటర్ షేన్‌వార్న్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. ఇకపై ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్టు క్రికెటర్ అవార్డును షేన్‌వార్న్ పేరిట ఇవ్వనుంది. ఇకపై ఈ అవార్డు ‘షేన్ వార్న్ బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆస్ట్రేలియా’గా వ్యవహరిస్తారు. గత మార్చిలో షేన్ వార్న్ మృతి చెందిన తర్వాత అతని సొంత మైదానం మెల్బోర్న్ గ్రౌండ్లో మొదటి టెస్టు జరుగుతున్న సందర్భంగా సోమవారం ఈ విషయాన్ని ఆసీస్ బోర్డు ప్రకటించింది. లెగ్‌స్పిన్ దిగ్గజం వార్న్ 145 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించి 708 వికెట్లు పడగొట్టాడు. -
నాకంటే అతడే బెటర్.. చాలా నేర్చుకున్నా: ముత్తయ్య మురళీధరన్
1990లలో ప్రత్యర్ధి బ్యాటర్లను తమ స్పిన్ మయాజాలంతో ఈ ఇద్దరు స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టేవారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియా దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్.. మరొకరు శ్రీలంక లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. తాజాగా గ్రేట్ షేన్ వార్న్‌ను గుర్తుచేసుకుని ముత్తయ్య మురళీధరన్ భావోద్వేగానికి లోనయ్యాడు. వార్న్‌ను చాలా మిస్స్ అవుతున్నాము అని అతడు తెలిపాడు. నేను క్రికెట్ ఆడే రోజుల్లో వార్న్ స్పిన్ మ్యాజిక్‌ను దగ్గరి నుంచి చూసే వాడిని అని ముత్తయ్య అన్నాడు . "వార్న్ నాకంటే చాలా గొప్పవాడు అని నేను ఎప్పుడూ భావిస్తున్నాను. నేను శ్రీలంక తరపున ఆడుతున్నప్పుడు అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడు అల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్. మేము అందరం షేన్ను మిస్ అవుతున్నాం" అని మురళీధరన్ పేర్కొన్నాడు కాగా భారత్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో మురళీధరన్ ఆడనున్నాడు. ఈ టోర్నీలో మణిపాల్ టైగర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: Ind A vs NZ A: న్యూజిలాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన -
'భౌతికంగా మాత్రమే దూరం'.. హ్యాపీ బర్త్‌డే
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్.. లెజెండరీ షేన్ వార్న్ భౌతికంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన వార్న్ క్రీడాలోకాన్ని కంటతడి పెట్టించాడు. అతను భౌతికంగా లేకపోయినా..వార్న్ జ్ఞాపకాలు మాత్రం చిరకాలం మిగిలిపోనున్నాయి. కాగా ఇవాళ(సెప్టెంబర్ 13) దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ పుట్టినరోజు. 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న వార్న్‌కు ప్రత్యేక నివాళి. కాగా వార్న్ పుట్టినరోజు సందర్భంగా అతని ట్విటర్లో ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని ట్విటర్ నుంచి వచ్చిన మెసేజ్ అందరిని ఆకట్టుకుంటుంది.'' భౌతికంగా దూరమైన మీరిచ్చిన వారసత్వం ముఖ్యమైన వాటిపై గొప్ప దృక్పథాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి జీవితం గొప్పతనాన్ని సూచిస్తుంది. జీవితంలో మీరేం సాధించారన్నది అక్కడి ప్రజలు, ప్రదేశాలపై స్పష్టమైన ప్రభావం చూపిస్తుంది. షేన్ వారసత్వం ఎన్నటికి బతికే ఉంటుంది.. హ్యాపీ బర్త్‌డే షేన్ వార్న్.. మీరెప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటారు.'' అంటూ ట్వీట్ చేశారు. ఇక షేన్ వార్న్ 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 15 ఏళ్ల కెరీర్లో వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. A legacy gives you a perspective on what's important. It is about the richness of an individual's life, including what they accomplished and the impact they had on people and places. Shane’s Legacy will live on. Happy birthday - always in our hearts 🤍🤍🤍 pic.twitter.com/qL5NPIZnUk — Shane Warne (@ShaneWarne) September 12, 2022 చదవండి : FIFA-23 Ratings: మెస్సీ,చదవండి రొనాల్డోలకు ఊహించని షాక్.. నాకసలు ఈ జాబ్ అవసరమే లేదు.. కానీ ఇప్పుడు -
చనిపోయి నాలుగు నెలలు దాటింది.. ఇంకెన్నాళ్లు ఈ కథలు!
ఆస్ట్రేలియా దిగ్గజం.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మనల్ని భౌతికంగా విడిచివెళ్లి నాలుగు నెలలు దాటిపోయింది. గత మార్చిలో వార్న్ థాయిలాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించాడు. అతని మరణం యావత్ క్రీడా ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. బతికినంతకాలం క్రికెట్లో రారాజుగా వెలుగొందినప్పటికి బయటి వివాదాల్లోనూ అంతే పేరు సంపాదించాడు. ఇక వార్న్‌కు ప్లేబాయ్ అనే ముద్ర కూడా ఉంది. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్లు నడిపాడన్న వార్తలు వచ్చాయి. వీటిలో నిజమెంత అనేది తెలియకపోయినప్పటికి.. అతను భౌతికంగా దూరమైన తర్వాత కూడా యువతులతో ఎఫైర్ వార్తలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా బ్యూటీ గినా స్టివార్ట్.. వార్న్ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు నాతో ఎఫైర్ నడపాడంటూ తెలిపింది. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఎఫైర్ అని పేర్కొంది. ''వార్న్ థాయిలాండ్‌లోని విల్లాలో మరణించడానికి ముందు నాతో రెగ్యులర్ కాంటాక్ట్ ఉండేది. అయితే ఆ ఎఫైర్ స్నేహపూరిత వాతావరణం మాత్రమే. ఒక స్నేహితుడిగా.. గైడ్‌గా నాకు సలహాలిచ్చేవాడు. ఈ క్రమంలోనే మా మధ్య సన్నిహిత్యం పెరిగింది. అలా అతనితో డేటింగ్ చేశాను. ఇక దగ్గరయ్యాడనుకునే లోపే వార్న్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం కొన్ని నెలల పాటు నన్ను మాములు మనిషిని చేయలేకపోయింది.'' అంటూ 51 ఏళ్ల గినా స్టివార్ట్ తెలిపింది. కాగా గినా స్టివార్ట్ ఆస్ట్రేలియాలో ఒక సెలబ్రిటీ. 51 ఏళ్ల వయసులోనూ హాట్ ఫోటోలకు ఫోజిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇటీవలే గివార్ట్ తనను తాను ''వరల్డ్ హాటెస్ట్ గ్రాండ్ మా'' అని బిరుదు ఇచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. ఇక 2018లో గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా వార్న్‌ను తొలిసారి కలిసినట్లు గినా పేర్కొంది. ''ఒకరినొకరు పరిచయం పెంచుకోవడంతో పాటు ఆ రాత్రంతా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అలా మా మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ఇద్దరం మరింత దగ్గరయ్యాము. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియకూడదని వార్న్ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. అందుకే అతను మరణించిన తర్వాతే ఈ విషయాలు వెల్లడిస్తున్నా'' అంటూ తెలిపింది. ఇక క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరు పొందిన షేన్ వార్న్ తన లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఈ స్పిన్ దిగ్గజం 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 193 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. OnlyFans star Gina Stewart has made a startling revelation about the late great Shane Warne, five months after his tragic death > https://t.co/qc6mpq2Wty pic.twitter.com/Wzbg06oiw2 — Herald Sun (@theheraldsun) August 16, 2022 చదవండి: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్ Sanju Samson: నేను, నా భార్య ఖాళీగా ఉన్నపుడు చేసే పని అదే! నా ముద్దు పేరు.. -
యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు
టెస్టు క్రికెట్లో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఆస్ట్రేలియన్ దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. జూన్ 4, 1993న వార్న్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైక్ గాటింగ్‌ను ఔట్ చేసిన విధానం ఎవరు మరిచిపోలేరు. పూర్తిగా లెగ్‌స్టంప్ దిశగా వెళ్లిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టి.. క్రీజులో ఉన్న మైక్ గాటింగ్ సహా.. ఆసీస్ తోటి ఆటగాళ్లు, అభిమానులు సహా యావత్ క్రీడా ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు. క్రికెట్ బతికున్నంతవరకు షేన్ వార్న్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. ఆ తర్వాత ఎంతో మంది బౌలర్లు వార్న్ లాగే ఆ ఫీట్ అందుకున్నప్పటికీ వార్న్ వేసిన బంతికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ స్టార్ యాసిర్ షా కూడా అచ్చం వార్న్ తరహాలోనే వేసిన బంతిని క్రికెట్ అభిమానులు సహా కామెంటేటర్స్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా అభివర్ణిస్తున్నారు. అయితే యాసిర్ వేసిన బంతిని దిగ్గజ బౌలర్‌తో పోల్చడం ఏంటని కొందరు అభిమానులు కొట్టిపారేసినప్పటికి.. అచ్చం వార్న్ బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉండే.. యాసిర్ షా వేసిన బంతి కూడా అదే తరహాలో చరిత్రలో నిలిచిపోనుంది. పాకిస్తాన్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్‌లో ఈ అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. యాసిర్ షా డెలివరీకి అప్పటికే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న కుషాల్ మెండిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. కుషాల్ 74 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ 56వ ఓవర్లో యాసిర్ షా బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న కుషాల్‌కు పూర్తిగా లెగ్‌స్టంప్ అవతల వేసిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. తాను వేసిన బంతి అంతలా టర్న్ అవుతుందని యాషిర్ షా కూడా ఊహించి ఉండడు. అందుకే వికెట్ పడగానే గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టులో లంక పాక్ ముందు 342 పరుగుల టార్గెట్ ఉంచింది. ప్రస్తుతం పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 3, బాబర్ ఆజం 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 185 పరుగులు దూరంలో ఉండగా.. మరొక రోజు ఆట మిగిలిఉన్న నేపథ్యంలో శ్రీలంక మిగిలిన 8 వికెట్లు తీయగలిగితే విజయం సాధిస్తుంది. Ball of the Century candidate❓ Yasir Shah stunned Kusal Mendis with a stunning delivery which reminded the viewers of Shane Warne’s ‘Ball of the Century’.#SLvPAK pic.twitter.com/uMPcua7M5E — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 18, 2022 The greatest Test delivery ever? pic.twitter.com/MQ8n9Vk3aI — cricket.com.au (@cricketcomau) March 4, 2022 చదవండి: సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం ఆ అద్భుతాన్ని చూసింది.. ఐసీసీ ట్వీట్ Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్ బౌలర్ -
టెస్టు క్రికెట్లో ఆండర్సన్ అరుదైన ఫీట్.. మూడో బౌలర్‌గా..!
ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టామ్ లాథమ్‌ను ఔట్ చేసిన అండర్సన్.. తన కెరీర్లో 650వ టెస్టు వికెట్‌ని సాధించాడు. తద్వారా టెస్టుల్లో 650 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అండర్సన్ రికార్డులెక్కాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, మురళీధరన్ తొలి రెండు స్ధానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 539 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్(145), జో రూట్(176) పరుగులతో రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మిచెల్(190),టామ్ బ్లండల్(106) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. 14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కివీస్ 140 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఆడుతోంది. చదవండి: Dilip Vengsarkar: టీమిండియాకి ఆడాలంటే ఇది సరిపోదా.. ఇంకా ఏం చేయాలి? -
Shane Warne: సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం ఆ అద్భుతాన్ని చూసింది!
Ball Of The Century : ‘‘1993.. సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం షేన్ వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీని చూసింది’’ అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్, దివంగత షేన్ వార్న్‌ను గుర్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా 1993 యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఈ క్రమంలో మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా జూన్ 3 తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 289 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ గ్రాహమ్ గూచ్ శుభారంభం అందించాడు. 65 పరుగులతో జోరు మీదున్న సమయంలో వార్న్ అతడిని పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రెండో రోజు(జూన్ 4) వన్‌డౌన్‌లో వచ్చిన మైక్ గాటింగ్‌ను అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. బాల్‌ను నేరుగా గాటింగ్ కాళ్ల ముందు వేసి.. ఆఫ్ వికెట్‌ను ఎగురగొట్టాడు. అసలు బంతి ఎక్కడ పడుతుందో బ్యాటర్ అంచనా వేసే లోపే ఈ విధంగా అద్భుతం చేశాడు వార్న్. దీంతో గాటింగ్ సమా అంపైర్ కూడా బిక్కమొహం వేశారంటే ఈ స్పిన్ మాంత్రికుడి మాయాజాలం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీనిని బాల్ ఆఫ్ ది సెంచరీగా పేర్కొంటూ వార్న్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 8 వికెట్లు పడగొట్టిన వార్న్.. ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో నాటి మొదటి టెస్టులో ఆసీస్ 179 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే విధంగా ఆరు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌ను గెలిచి ప్రతిష్టాత్మక యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. కాగా ఈ ఏడాది మార్చి 4న షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. థాయ్‌లాండ్‌లోని విల్లాలో విగతజీవిగా కనిపించాడు. 1993 యాషెస్ సిరీస్: ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టెస్టు స్కోర్లు ఆస్ట్రేలియా: 289 & 432/5 డిక్లేర్డ్ ఇంగ్లండ్: 210 & 332. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షేన్ వార్న్ చదవండి: T20 WC 2022: అస్సలు బాలేదు.. కోహ్లి, రోహిత్ తమ మార్కు చూపించాలి.. లేదంటే కష్టమే! On this day in 1993, the world witnessed Shane Warne's 'Ball of the Century' 🔥 pic.twitter.com/E47RM3BpwA — ICC (@ICC) June 4, 2022 -
IPL 2022: రాజస్తాన్‌కు ఆర్సీబీ విషెస్.. గుండెల్ని పిండే ట్వీట్‌తో!
IPL 2022 RR Vs RCB: ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం శుక్రవారంతో ముగిసింది. కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. ఫైనల్ చేరి ట్రోఫీ గెలుస్తుందంటూ ఆశగా ఎదురుచూసిన లక్షలాది మంది అభిమానుల హృదయాలు ముక్కలు చేసింది. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయంతో లక్కీగా ప్లే ఆఫ్స్ చేరిన ఫాఫ్ డుప్లెసిస్ బృందం.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించి క్వాలిఫైయర్-2కు అర్హత సాధించింది. కానీ, అహ్మదాబాద్ వేదికగా సాగిన కీలక పోరులో మాత్రం రాజస్తాన్ ముందు తలవంచకతప్పలేదు. అయితే, ఓటమి బాధలో కూరుకుపోయినా ఆర్సీబీ క్రీడాస్ఫూర్తి మరువలేదు. ఆస్ట్రేలియా లెజెండ్, తొలి సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన షేన్ వార్న్‌ను గుర్తుచేస్తూ రాజస్తాన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ మేరకు.. ‘‘ది గ్రేట్ షేన్ వార్న్ మిమ్మల్ని చూసి చిరునవ్వులు చిందిస్త ఉంటారు. మీరు చాలా బాగా ఆడారు. ఫైనల్‌కు గుడ్‌లక్’’ అంటూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఇందుకు స్పందించిన రాజస్తాన్ రాయల్స్ ఇరు జట్ల జెర్సీ రంగులను ప్రతిబింబించేలా రెండు హార్ట్ ఎమోజీలతో ప్రేమను కురిపించింది. ఈ ట్వీట్లు క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకుంటున్నాయి. ఐపీఎల్ క్వాలిఫైయర్-2: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ టాస్: రాజస్తాన్ రాయల్స్ బెంగళూరు స్కోరు: 157/8 (20) రాజస్తాన్ స్కోరు: 161/3 (18.1) విజేత: ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం.. ఫైనల్లో అడుగు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు- నాటౌట్) చదవండి 👇 Sachin Tendulkar On RR Bowlers: వాళ్లిద్దరు అద్భుతం చేశారు.. ఆర్సీబీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు: సచిన్ ప్రశంసలు IPL 2022: 'ఓవైపు తల్లికి సీరియస్.. అయినా మ్యాచ్‌లో అదరగొట్టాడు' The Great late Shane Warne is smiling on you. Well played tonight, @rajasthanroyals and good luck for the final. 👍🏻#PlayBold #IPL2022 #RRvRCB — Royal Challengers Bangalore (@RCBTweets) May 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); WHAT. A. WIN for @rajasthanroyals! 👏 👏 Clinical performance by @IamSanjuSamson & Co. as they beat #RCB by 7⃣ wickets & march into the #TATAIPL 2022 Final. 👍 👍 #RRvRCB Scorecard ▶️ https://t.co/orwLrIaXo3 pic.twitter.com/Sca47pbmPX — IndianPremierLeague (@IPL) May 27, 2022 -
IPL 2022: అంచనాలు లేకుండా బరిలోకి.. వార్న్ గర్వపడుతూ ఉంటాడు: బట్లర్
IPL 2022- Jos Buttler: ‘‘ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగాను. అయితే, యాజమాన్యం, సహచర ఆటగాళ్ల ప్రోత్సాహంతో ఇక్కడి దాకా వచ్చాను. సమిష్టి కృషితో ఫైనల్స్‌లో ప్రవేశించాం. కుమార సంగక్కర, ట్రెవార్ పెన్నీతో సంభాషణలు ఎప్పటికీ మరచిపోలేను’’ అని క్వాలిఫైయర్-2 హీరో, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ అన్నాడు. ఐపీఎల్-2022 మధ్యలో కాస్త తడబడ్డానని, అప్పుడు ఒత్తిడికి గురయ్యానన్న బట్లర్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పుంజుకోవడంతో ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నానని పేర్కొన్నాడు. కాగా సీజన్ ఆరంభంలో అద్భుతంగా ఆకట్టుకున్న బట్లర్.. ఆ తర్వాత కాస్త వెనుబడ్డాడు. అయితే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1లో 89 పరుగులతో అజేయంగా నిలిచి తిరిగి ఫామ్ అందుకున్నాడు. ఈ క్రమంలో క్వాలిఫైయర్-2లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన బట్లర్.. 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్ నిలిచి రాజస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. ఆర్సీబీతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించినట్లు తెలిపాడు. వేలాది మంది ప్రేక్షకుల మధ్య, అభిమానుల మద్దతు నడుమ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం తనకు తృప్తినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఈ సందర్భంగా ఆస్ట్రేలియా లెజెండ్, రాజస్తాన్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన దివంగత షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్న బట్లర్.. అతడిని తాము మిస్ అవుతున్నామని భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘రాజస్తాన్ రాయల్స్‌ను ప్రభావితం చేసిన వ్యక్తి షేన్ వార్న్. మొదటి సీజన్లోనే కప్ సాధించిపెట్టాడు. ఆయనను చాలా మిస్ అవుతున్నాం. మా విజయాన్ని ఆయన పై నుంచి చూస్తూనే ఉంటారు. ఈరోజు మా ఆట తీరు చూసి చాలా గర్వపడతారు’’ అని వ్యాఖ్యానించాడు. చదవండి 👇 Jos Buttler: వారెవ్వా.. బట్లర్ విధ్వంసకర ఆట తీరు.. అరుదైన రికార్డు సొంతం! Trolls On RCB Fan Girl: 'ఆర్సీబీ కప్ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు' Moments we'll never forget. 😍 #RRvRCB pic.twitter.com/yhVLY254vq — Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022 𝑷𝒂𝒅𝒉𝒂𝒓𝒐. 🏨💗 pic.twitter.com/37uqOuC0MP — Rajasthan Royals (@rajasthanroyals) May 27, 2022 -
'నాకు రాజస్తాన్ ఒక కుటుంబం వంటిది.. వార్న్ సార్ ఆశీస్సులు నాకు ఉన్నాయి'
ఐపీఎల్-2022లో తొలి క్వాలిఫైయర్‌లో మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. అయితే ఈ కీలక పోరుకు ముందు రాజస్తాన్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్.. లెజెండరీ లెగ్-స్పిన్నర్, దివంగత షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో గుండెపోటుతో వార్న్ మరణించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్‌లో నాకు ఇది మొదటి సీజన్. కానీ నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆడుతున్నట్లు అనిపిస్తుంది. "నాకు రాజస్తాన్ ఒక కుటుంబం వంటిది. నేను ఇక్కడ చాలా రిలాక్స్‌గా ఉన్నాను. నాతో ఆడే జట్టు సభ్యులే కాకుండా మేనేజ్మెంట్ కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు. మరోవైపు వార్న్ సార్ రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాడు. అతను తొలి ఐపీఎల్ ఛాంపియన్‌గా ఉన్నారు. ఆదే విధంగా అతని ఆశీస్సులు నాకు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అతను నన్ను పై నుంచి చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది" అని రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో చాహల్ పేర్కొన్నాడు. చదవండి: Nikhat Zareen: ఒలంపిక్ పతకం సాధిస్తా.. రెట్టింపు కృషి ఉంటేనే.. అందుకోసం!