శతాబ్దంలోనే అరుదైన రికార్డ్‌ ఈ బౌలర్‌ సొంతం.. | Afghanistan Spinner Rashid Khan Creates Record For Bowling Most Number Of Overs In Single Test Match In 21st Century | Sakshi
Sakshi News home page

శతాబ్దంలోనే అరుదైన రికార్డ్‌ ఈ బౌలర్‌ సొంతం..

Published Mon, Mar 15 2021 4:36 PM | Last Updated on Mon, Mar 15 2021 7:04 PM

Afghanistan Spinner Rashid Khan Creates Record For Bowling Most Number Of Overs In Single Test Match In 21st Century - Sakshi

అబుదాబీ: అఫ్గనిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ప్రస్తుత తరంలో ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ శతాబ్దంలో ఒకే టెస్ట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో రషీద్‌ ఏకంగా 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు. 2002లో కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ 98 ఓవర్లు వేశాడు. ఆ రికార్డును తాజాగా రషీద్‌ బ్రేక్‌ చేశాడు. 

అయితే 1998లో ఓవల్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ 113.5 ఓవర్లు బౌల్‌ చేశాడు. ఆధునిక టెస్ట్‌ క్రికెట్‌లో మురళీ పేరిట ఈ రికార్డ్‌ నమోదైవుండగా 21వ శతాబ్దంలో మాత్రం రషీద్‌ ఖాన్‌ పేరిటే ఈ రికార్డ్‌ లిఖించబడింది. 

కాగా, 2 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా అబుదాబీ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో అఫ్గనిస్థాన్‌ 6 వికెట్లతో అద్భుత విజయం సాధించి, సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రషీద్‌ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఇదే వేదికగా మార్చి 17 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement