Muralitharan
-
అతడొక వరల్డ్‌క్లాస్ స్పిన్నర్.. కుంబ్లే, అశ్విన్ కంటే: మురళీధరన్
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన బిష్ణోయ్ 9 వికెట్లు పడగొట్టి.. భారత్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కూడా తొలి ఓవర్లోనే భారత్‌కు బిష్ణోయ్ వికెట్ అందించాడు. ఈ నేపథ్యంలో బిష్ణోయ్‌పై శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత గ్రేట్ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్‌లతో బిష్ణోయ్‌ను పోల్చాడు . "భారత్ క్రికెట్లో ప్రతీ తరానికి మంచి స్పిన్నర్లు పుట్టుకొస్తున్నారు. అనిల్ కుంబ్లే నుంచి అశ్విన్ వరకు అత్యుత్తమ స్పిన్నర్లు మనం చూశాం. ఇప్పుడు రవి బిష్ణోయ్ రూపంలో భారత్‌కు మరో వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ దొరికాడు. బిష్ణోయ్‌కు అద్బుతమైన స్కిల్స్ ఉన్నాయి. మిగతా లెగ్ స్పిన్నర్ల కంటే బిష్ణోయ్ చాలా భిన్నం. అతడికి బంతిని వేగంగా వేసే సత్తా ఉంది. బంతిని టర్న్ కూడా చేయగలడు. అదే అక్షర్ కూడా సరైన వేగంతో బౌలింగ్ చేయగలడు, కానీ టర్న్ పెద్దగా ఉండదు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ కూడా అక్షర్ మాదరిగానే ఉంటుందని" ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కూడా భారత జట్టులో బిష్ణోయ్‌కు చోటు దక్కింది. చదవండి: భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్‌కు షాక్ -
సచిన్‌లో ఆ బలహీనత గమనించా.. దిగ్గజ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్‌కు మించిన బ్యాట్స్‌మెన్ లేడంటూనే అతనిలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశాడు. సచిన్ అద్భుతమైన బ్యాట్స్‌మెనే అయినప్పటికీ.. అతని బ్యాటింగ్‌లో ఓ బలహీనతను గమనించానని పేర్కొన్నాడు. లిటిల్ మాస్టర్ ఆఫ్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడని అభిప్రాయపడ్డారు. ఓ ప్రముఖ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీధరన్ మాట్లాడుతూ.. సచిన్ బ్యాటింగ్ శైలిలో పలు లోపాలను ప్రస్తావించాడు. పేసర్లను, లెగ్ స్పిన్నర్లు సమర్ధవంతంగా ఎదుర్కొనే సచిన్.. ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో కాస్త ఇబ్బంది పడతాడని, ఈ విషయాన్ని నా కెరీర్లో చాలా సందర్భాల్లో గుర్తించానని చెప్పుకొచ్చాడు. బంతిని అంచనా వేయడంలో దిట్ట అయిన సచిన్.. తనతో సహా చాలా మంది ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో వికెట్‌ను సమర్పించుకున్న విషయాన్ని ఉదహరించాడు. కెరీర్ ఆసాంతం సచిన్‌కు ఇది పెద్ద లోపంగా ఉండిందని పేర్కొన్నాడు. అయితే, ఈ విషయాన్ని తానెప్పుడు సచిన్ వద్ద ప్రస్తావించలేదని వెల్లడించాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ(14 సార్లు) తరువాత సచిన్‌ను అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనత తనదేనని(13) ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఇక, ఓవరాల్‌గా .. సచిన్ చాలా క్లిష్టమైన ఆటగాడని, అతడిని అవుట్ చేయడం చాలాకష్టమని మురళీధరన్ చెప్పుకొచ్చాడు. కాగా, శ్రీలంక తరఫున 133 టెస్టుల్లో 800 వికెట్లు, 350 వన్డేల్లో 534 వికెట్లు పడగొట్టిన మురళీ.. అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతను మూడు ఫార్మాట్లలో కలిపి 1347 పడగొట్టాడు. అతని తర్వాతి స్థానంలో 1001 వికెట్లతో ఆసీస్ లెజండరీ స్పిన్నర్ రెండో స్థానంలో, భారత బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే 956 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. చదవండి: XYZలకు అవకాశాలు వస్తుంటే టార్చర్ అనుభవించా, అందుకే రిటైర్మెంట్ ప్రకటించా.. -
మన పోర్టులపై సూయజ్ ప్రభావం అంతంతే
సాక్షి, అమరావతి: సూయజ్ కాలువలో తలెత్తిన సమస్య ప్రభావం రాష్ట్ర పోర్టులపై పెద్దగా లేదని.. ఇతర దేశాలకు మన రాష్ట్రం నుంచి నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రకటించింది. విశాఖ, కృష్ణపట్నం కంటైనర్ పోర్టులపై సూయజ్ ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్ ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ నుంచి ఆఫ్రికా, చైనా, ఇండోనేషియా వంటి దేశాలకు నౌకా వాణిజ్యం ఎక్కువని, యూరప్ దేశాలతో లావాదేవీలు తక్కువగా ఉండటంతో ‘సూయజ్’ సమస్య అంతగా ప్రభావం చూపదని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. మధ్యధరా, హిందూ మహా సముద్రాలను కలుపుతూ ఈజిప్టు వద్ద నిర్మించిన సూయజ్ కాలువలో జపాన్‌కు చెందిన అతిపెద్ద కార్గో నౌక ‘ఎవర్ గివెన్’ పెనుగాలులకు అడ్డం తిరిగి నిలిచిపోవడంతో ప్రపంచ సముద్ర వాణిజ్యం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ కాలువ ద్వారా ఆసియా దేశాల నుంచి యూరప్ అమెరికా దేశాలకు నిత్యం 35కు పైగా నౌకలు ప్రయాణిస్తాయి. ఎవర్ గివెన్ నౌక అడ్డంగా నిలిచిపోవడంతో ఇప్పటివరకు 300 నౌకలు వరకు నిలిచిపోయాయి. దీని ప్రభావం భారత సముద్ర వాణిజ్యంపై తీవ్రంగానే ఉంది. సూయజ్ కాలువ ద్వారా మన దేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు రూ.14,80,000 కోట్ల వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నట్టు కేంద్ర నౌకాయాన శాఖ అంచనా వేసింది. తాజా సమస్య చమురు ఉత్పత్తులు, రసాయనాలు, ఆటోమొబైల్, ఉక్కు, టెక్స్టైల్స్ వంటి ఉత్పత్తుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. అత్యవసర సరకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సూచించింది. దీంతో రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఇక్కడి పోర్టుల్లో పరిస్థితిని సమీక్షించింది. విశాఖ మేజర్ పోర్టుతో పాటు 4 రాష్ట్ర పోర్టుల ద్వారా ఏటా సుమారు 200 మిలియన్ టన్నుల సరకు రవాణా అవుతోంది. ఒక్క విశాఖ పోర్టు ద్వారానే 100 మిలియన్ టన్నుల సరకు రవాణా అవుతుండగా, గంగవరం, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, కృష్ణపట్నం ద్వారా 100 మిలియన్ టన్నులకు పైగా సరకు రవాణా అవుతోంది. వీటిలో బియ్యం, జొన్నలతోపాటు గ్రానైట్, బొగ్గు, ముడి ఇనుము, బెరైటిస్ వంటి ఖనిజాలే ఎక్కువ. ఈ పోర్టుల నుంచి యూరప్‌కు వెళ్లే నౌకలు లేకపోవడంతో సూయజ్ ప్రభావం ఏపీ మారిటైమ్‌పై పెద్దగా ఉండదని అధికారులు అంచనాకు వచ్చారు. -
శతాబ్దంలోనే అరుదైన రికార్డ్ ఈ బౌలర్ సొంతం..
అబుదాబీ: అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రస్తుత తరంలో ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ శతాబ్దంలో ఒకే టెస్ట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో రషీద్ ఏకంగా 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు. 2002లో కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ 98 ఓవర్లు వేశాడు. ఆ రికార్డును తాజాగా రషీద్ బ్రేక్ చేశాడు. అయితే 1998లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 113.5 ఓవర్లు బౌల్ చేశాడు. ఆధునిక టెస్ట్ క్రికెట్లో మురళీ పేరిట ఈ రికార్డ్ నమోదైవుండగా 21వ శతాబ్దంలో మాత్రం రషీద్ ఖాన్ పేరిటే ఈ రికార్డ్ లిఖించబడింది. కాగా, 2 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా అబుదాబీ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో అఫ్గనిస్థాన్ 6 వికెట్లతో అద్భుత విజయం సాధించి, సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రషీద్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఇదే వేదికగా మార్చి 17 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. -
‘నంబర్‌వన్ బిచ్చగాడిని’ అయ్యేవాడిని!
అత్యుత్తమ ప్రదర్శనపై అశ్విన్ సరదా వ్యాఖ్య కుంబ్లే రికార్డును చేరుకుంటే చాలన్న స్పిన్నర్ చెన్నై: రవిచంద్రన్ అశ్విన్ అంటే పరిపూర్ణతకు పక్కా చిరునామా. తన బౌలింగ్‌కు ఇంజినీరింగ్ మేధస్సును జోడించి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కుప్పకూలుస్తున్న అశ్విన్ ఇప్పుడు కెరీర్లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పట్టుదల, పోరాటతత్వం ఉన్న ఈ ఆఫ్ స్పిన్నర్ అగ్ర స్థానానికి చేరినా ఇంకా నేర్చుకునేందుకు, కష్టపడేందుకు సిద్ధమని చెబుతాడు. ఎంచుకున్న రంగంలో ఎప్పుడైనా తానే నంబర్‌వన్‌గా ఉండాలనేది తన లక్ష్యమంటూ అతను ఒక సరదా వ్యాఖ్య చేశాడు. ‘నేను జట్టులోకి వచ్చిన దగ్గరి నుంచి భారత్ ప్రతీ విజయాల్లో ఎంతో కొంత పాత్ర పోషించాను. ఇది పొగరుతో చెప్పడం లేదు. దానిని సాధించేందుకు నేను ఎంతో కష్ట పడ్డాను. నేను ఎక్కడికి వెళ్లినా నాదైన ముద్ర ఉండాలని తపించే వ్యక్తిని. ఒకవేళ నేను బిచ్చగాడిగా పుట్టి ఉన్నట్లయితే అప్పుడు కూడా చెన్నై నగరంలో నేనే నంబర్‌వన్ బిచ్చగాడిని అయ్యేవాడినేమో. అక్కడ అగ్రస్థానానికి చేరాక దేశంలోనే నంబర్‌వన్ బిచ్చగాడినయ్యేందుకు కృషి చేసేవాడిని’ అంటూ చెప్పుకున్నాడు. మురళీధరన్ 800 వికెట్ల మైలురాయిని అందుకోవడం తనలాంటి మానవమాత్రులకు సాధ్యం కాదని, అయితే కుంబ్లే వికెట్ల రికార్డు (619)ను చేరుకుంటే చాలని అశ్విన్ అన్నాడు. ‘మురళీ సాధించిన ఘనత చాలా పెద్దది. నేను ఆలస్యంగా టెస్టులు ఆడటం ప్రారంభించాను. మధ్యలో ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలో కుంబ్లే రికార్డును చేరుకోవడమే గౌరవంగా భావిస్తున్నా. అంతకంటే ఒక్క వికెట్ కూడా ఎక్కువ ఆశించడం లేదు’ అని అతను చెప్పాడు. మరోవైపు భారత జట్టులో ప్రధాన సభ్యుడిగా ఎదిగినా అశ్విన్‌కు వైస్ కెప్టెన్సీ అవకాశం రాలేదు. దీనిపై వ్యాఖ్యానిస్తూ ‘నేను అలాంటివాటి గురించి ఆలోచించే దశను దాటిపోయానని భావిస్తున్నా. వైస్ కెప్టెన్ కావడం అనేది నా చేతుల్లో లేదు. క్రికెట్లో ప్రతీదానికి కొన్ని లెక్కలు ఉంటాయి. అలాంటివాటిని నేను మార్చలేనని అర్థమైంది. దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోదల్చుకోలేదు. అయినా అలాంటి పేరు, హోదా ఏమీ లేకుండా కూడా విజయాల్లో కీలక పాత్ర పోషించి నేను జట్టును నడిపించాననే నమ్ముతున్నా’ అని అశ్విన్ తన మనసులో మాట వెల్లడించాడు. -
నా క్రికెట్ కెరీర్లో అతనే బెస్ట్!
కొలంబో:మహేంద్ర సింగ్ ధోని వారుసుడిగా టీమిండియా క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించిన విరాట్ కోహ్లిపై శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత్ క్రికెట్ జట్టులో ధోని తరువాత అదే స్థాయిలో సమర్ధవంతమైన నాయకత్వ లక్షణాల్లో కల్గిన వ్యక్తి కోహ్లి అని మురళీ ధరన్ అభిప్రాయపడ్డాడు. 'నా క్రికెట్ కెరీర్లో నేను చూసిన అత్యుత్తమ భారత కెప్టెన్లలో ధోని ఒకడు. అతని నాయకత్వంలో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మూడు సంవత్సరాలు ఆడాను. నేను ఐపీఎల్ ఆడిన ఏ సందర్భంలో కూడా ధోనిలో గర్వం కనబడలేదు. ఎప్పుడూ సీనియర్ ఆటగాళ్లకు గౌరవించే వ్యక్తిత్వం ధోనిదే. చెన్నై జట్టులో ఆడిన మైక్ హస్సీతో పాటు నా నుంచి కూడా అనేక సలహాలను ధోని తీసుకునేవాడు. కింది నుంచి పైకి వచ్చిన ధోని ఆ స్థాయిని మరచిపోకుండా ఎప్పుడూ హుందాగా ఉండేవాడు. ఇప్పుడు ఆ బాధ్యతను కోహ్లి సమర్ధవంతంగా నిర్వహిస్తాడనే నమ్మకం నాకుంది. ఇంగ్లండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్‌ను కోహ్లి తేలిగ్గా తీసుకోకూడదు. ధోని సలహాలను తీసుకుంటూ అతను కెప్టెన్సీ జర్నీని కొనసాగిస్తే మంచింది'అని మురళీ ధరన్ అన్నాడు. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మురళీధరన్
శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో మురళీధరన్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని బుధవారం ఐసీసీ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సాధించిన తొలి శ్రీలంక ఆటగాడిగా మురళీధరన్ రికార్డు సృష్టించాడు. మురళీతో పాటు ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కరేన్ రోల్టన్, ఆర్థర్ మోరీస్ (ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్), 19వ శతాబ్దపు మేటి బౌలర్ జార్జ్ లిహ్‌మన్ (ఇంగ్లండ్) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు పడ గొట్టిన మురళీ 2011 ప్రపంచకప్ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. -
చరిత్ర సృష్టించిన లంక దిగ్గజ ఆటగాడు
శ్రీలంక మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీదరన్కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న తొలి లంక క్రికెటర్‌గా మురళీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ రిచర్డ్సన్ ఈ వివరాలను ప్రకటించారు. ఇంగ్లండ్ మాజీ బౌలర్ జార్జి లోమన్, ఆసీస్ మాజీ ఆటగాడు ఆర్థర్ మోరిస్, ఆసీస్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ కరెన్ రోల్టన్ ఈ అరుదైన ఘనత దక్కించుకున్నారు. వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మురళీదరన్. ఈ రెండు ఫార్మాట్లలో షేన్ వార్న్ సహా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మురళీదరన్ నిలిచాడు. 19వ దశకం చివర్లో క్రికెట్ ఆడిన లోమన్.. 100 వికెట్లు అత్యంత తక్కవ మ్యాచుల్లో పడగొట్టిన ఫాస్ట్ బౌలర్. భిన్న కాలాల్లో క్రికెట్ ఆడిన వారితో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ తయారు చేసినట్లు రిచర్డ్ సన్ వివరించారు. ఆధునిక క్రికెట్లో కేవలం మురళీ ఒక్కడే ఈ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. -
'ఆ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'
దుబాయ్: వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన శ్రీలంక క్రికెట్ జట్టులో ఓపెనర్ ఉపుల్ తరంగకు చోటు కల్పించకపోవడంపై స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఉపుల్ తరంగకు ఉద్వాసన పలికి యువ ఆల్ రౌండర్ జీవన్ మెండిస్ కు చోటు కల్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని మురళీధరన్ పేర్కొన్నాడు. తరంగకు వన్డేల్లో మంచి రికార్డు ఉందని, అతడి అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడుతుందన్నాడు. అయితే తరంగను కాదని జీవన్ ను ఎంపిక చేయడం సబబుగా లేదని అభిప్రాయపడ్డాడు. ఐదు ప్రపంచకప్ లు ఆడిన మురళీధరన్ 67 వికెట్లు తీశాడు.