PC: Inside sport
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన బిష్ణోయ్ 9 వికెట్లు పడగొట్టి.. భారత్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కూడా తొలి ఓవర్‌లోనే భారత్‌కు బిష్ణోయ్ వికెట్ అందించాడు. ఈ నేపథ్యంలో బిష్ణోయ్‌పై శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
భారత గ్రేట్ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్‌లతో బిష్ణోయ్‌ను పోల్చాడు . "భారత్ క్రికెట్‌లో ప్రతీ తరానికి మంచి స్పిన్నర్లు పుట్టుకొస్తున్నారు. అనిల్ కుంబ్లే నుంచి అశ్విన్ వరకు అత్యుత్తమ స్పిన్నర్లు మనం చూశాం. ఇప్పుడు రవి బిష్ణోయ్ రూపంలో భారత్‌కు మరో వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ దొరికాడు. బిష్ణోయ్‌కు అద్బుతమైన స్కిల్స్ ఉన్నాయి.
మిగతా లెగ్ స్పిన్నర్ల కంటే బిష్ణోయ్ చాలా భిన్నం. అతడికి బంతిని వేగంగా వేసే సత్తా ఉంది. బంతిని టర్న్ కూడా చేయగలడు. అదే అక్షర్ కూడా సరైన వేగంతో బౌలింగ్ చేయగలడు, కానీ టర్న్ పెద్దగా ఉండదు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ కూడా అక్షర్ మాదరిగానే ఉంటుందని" ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కూడా భారత జట్టులో బిష్ణోయ్‌కు చోటు దక్కింది.
చదవండి: భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్‌కు షాక్
Comments
Please login to add a commentAdd a comment