చరిత్ర సృష్టించిన లంక దిగ్గజ ఆటగాడు
శ్రీలంక మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీదరన్కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న తొలి లంక క్రికెటర్గా మురళీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ రిచర్డ్సన్ ఈ వివరాలను ప్రకటించారు. ఇంగ్లండ్ మాజీ బౌలర్ జార్జి లోమన్, ఆసీస్ మాజీ ఆటగాడు ఆర్థర్ మోరిస్, ఆసీస్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ కరెన్ రోల్టన్ ఈ అరుదైన ఘనత దక్కించుకున్నారు.
వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మురళీదరన్. ఈ రెండు ఫార్మాట్లలో షేన్ వార్న్ సహా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్గా మురళీదరన్ నిలిచాడు. 19వ దశకం చివర్లో క్రికెట్ ఆడిన లోమన్.. 100 వికెట్లు అత్యంత తక్కవ మ్యాచుల్లో పడగొట్టిన ఫాస్ట్ బౌలర్. భిన్న కాలాల్లో క్రికెట్ ఆడిన వారితో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ తయారు చేసినట్లు రిచర్డ్ సన్ వివరించారు. ఆధునిక క్రికెట్లో కేవలం మురళీ ఒక్కడే ఈ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.