ICC Hall of Fame
-
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూ డేవిడ్
దుబాయ్: భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూకు చోటు లభించింది. మాజీ ఆటగాళ్లు అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)లతో పాటు నీతూకు కూడా ఈ జాబితాలో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. డయానా ఎడుల్జీ తర్వాత భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కించుకున్న రెండో మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్ కావడం విశేషం. ‘ఇలాంటి గౌరవం దక్కడం పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ తరఫున ఆడినందుకు నాకు లభించిన జీవితకాలపు గుర్తింపుగా దీనిని భావిస్తున్నా. నా క్రికెట్ ప్రయాణంలో ఇది ప్రత్యేక క్షణంగా నిలిచిపోతుంది. నాకు అన్ని విధాలా అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, బీసీసీఐతో పాటు నన్ను గుర్తించిన ఐసీసీకి కృతజ్ఞతలు’ అని నీతూ డేవిడ్ స్పందించింది. పలు ఘనతలు... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నీతూ డేవిడ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 10 టెస్టులు, 97 వన్డేలు (1995–2008 మధ్య) ఆడింది. వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆమె ఓవరాల్‌గా వన్డేల్లో కేవలం 16.34 సగటుతో 141 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మహిళల టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (8/53) నీతూ పేరిటే ఉంది. 1995లో ఇంగ్లండ్‌పై జంషెడ్‌పూర్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. 3 వన్డే వరల్డ్ కప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నీతూ 2005 టోరీ్నలో 20 వికెట్లు తీసి భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. ఆట నుంచి రిటైర్ అయ్యాక నీతూ డేవిడ్ ప్రస్తుతం భారత మహిళల జట్టు చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తోంది. టెస్టుల్లో పరుగుల వరద...ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ అలిస్టర్ కుక్ ఆ జట్టు అత్యుత్తమ టెస్టు విజయాల్లో ఓపెనర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇటీవల రూట్ అధిగమించే వరకు ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల ఘనత అతని పేరిటే ఉంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆ్రస్టేలియా గడ్డపై యాషెస్ గెలిచేందుకు దోహదం చేసిన అతను కెపె్టన్‌గా రెండు సార్లు స్వదేశంలో యాషెస్ సిరీస్‌ను గెలిపించాడు. 2012లో భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడంలో కూడా అతనిదే ప్రధాన పాత్ర. కుక్ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 33 సెంచరీలు సహా 12,472 పరుగులు సాధించాడు. విధ్వంసానికి మారుపేరు... ఈతరం క్రికెట్ అభిమానులకు అత్యుత్తమ వినోదం అందించిన ఆటగాళ్లలో డివిలియర్స్ అగ్రభాగాన ఉంటాడు. క్రీజ్‌లోకి దిగితే చాలు తనకే సాధ్యమైన వైవిధ్యభరిత షాట్లతో మైదానం అంతా పరుగుల విధ్వంసం సృష్టించడంలో ఏబీ దిట్ట. వన్డేల్లో వేగవంతమైన 50 (16 బంతుల్లో), 100 (31 బంతుల్లో), 150 (64 బంతుల్లో) అతని పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేసిన డివిలియర్స్... 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు సాధించాడు. 78 టి20ల్లో అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు
ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు చేర్చింది. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ అలిస్టర్ కుక్, సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్, భారత దిగ్గజ స్పిన్నర్ నీతూ డేవిడ్ ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్లుగా ఎంపికయ్యారు.అలిస్టర్ కుక్ (2006-18) ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాటర్లలో ఒకరు. కుక్ తన టెస్ట్ కెరీర్లో 161 టెస్ట్‌లు ఆడి 45.35 సగటున 12,472 పరుగులు చేశాడు. అలాగే 92 వన్డేల్లో 36.40 సగటున 3204 పరగులు చేశాడు. నాలుగు టీ20ల్లో 15.25 సగటున 61 పరుగులు చేశాడు.నీతూ డేవిడ్ (1995-2008).. భారత్ తరఫున ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో చేరిన రెండో మహిళా క్రికెటర్. 2023లో డయానా ఎడుల్జి భారత్ తరఫున హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. నీతూ డేవిడ్ భారత్ తరఫున 10 టెస్ట్‌లు, 97 వన్డేలు ఆడి 182 వికెట్లు పడగొట్టింది. భారత్ తరఫున వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్ నీతూనే.ICC VIDEO FOR THE HALL OF FAMER - AB DE VILLIERS. 🐐pic.twitter.com/PzUh1MDPHR— Mufaddal Vohra (@mufaddal_vohra) October 16, 2024ఏబీ డివిలియర్స్ (2004-2018) విషయానికొస్తే.. ఏబీడీ సౌతాఫ్రికా తరఫున 114 టెస్ట్‌లు, 228 వన్డేలు, 78 టీ20 ఆడి 20014 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో ఏబీడీ సగటు 50కి పైగానే ఉంది. మైదానం నలుమూలలా షాట్లు ఆడగల ఏబీడీకి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్‌గా పేరుంది.చదవండి: IND vs NZ 1st Test: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. తొలి రోజు ఆట రద్దు -
వీరేంద్ర సెహ్వాగ్‌కు ఐసీసీ అత్యున్నత గౌరవం.. మరో ఇద్దరి కూడా..!
టీమిండియా డాషింగ్ బ్యాటర్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఐసీసీ అత్యున్నత గౌరవం లభించింది. ఐసీసీ ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో వీరూకు చోటు కల్పించింది. వీరూతో పాటు భారత మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ, శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వకు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కింది. ఈ ముగ్గురిని హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలోకి చేరుస్తున్నట్లు ఐసీసీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. 🇮🇳 🇱🇰 🇮🇳 Three stars of the game have been added to the ICC Hall of Fame 🏅 Details 👇https://t.co/gLSJSU4FvI — ICC (@ICC) November 13, 2023 45 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ 1999-2013 మధ్యలో 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి 18641 పరుగులు సాధించాడు. ఇందులో 38 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పార్ట్ టైమ్ స్పిన్నర్ కూడా అయిన వీరూ తన కెరీర్లో 136 వికెట్లు పడగొట్టాడు. 67 ఏళ్ల డయానా 1976-1993 మధ్యలో 20 టెస్ట్‌లు, 34 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. మహిళల టెస్ట్ క్రికెట్లో అత్యధిక బంతులు సంధించిన రికార్డు ఇప్పటికీ డయానా పేరిటే ఉంది. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన డయానా తన అంతర్జాతీయ కెరీర్లో 109 వికెట్లు పడగొట్టింది. 58 ఏళ్ల అరవింద డిసిల్వ 1984-2003 మధ్యలో 93 టెస్ట్‌లు, 308 వన్డేల్లో శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించి 15645 పరుగులు సాధించాడు. ఇందులో 31 సెంచరీలు, 86 అర్ధ సెంచరీలు ఉన్నాయి. డిసిల్వ తన కెరీర్లో 135 వికెట్లు కూడా పడగొట్టాడు. -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చందర్‌పాల్, ఎడ్వర్డ్స్, ఖాదిర్
సిడ్నీ: వెస్టిండీస్ దిగ్గజం చందర్‌పాల్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ చార్లట్ ఎడ్వర్డ్స్, పాకిస్తాన్ దివంగత స్పిన్ లెజెండ్ అబ్దుల్ ఖాదిర్‌లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చారు. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ సందర్భంగా ముగ్గురు క్రికెటర్లకు ఐసీసీ పురస్కారాలు అందజేశారు. 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో చందర్ పాల్ అన్ని ఫార్మాట్లలో కలిపి 20,988 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు, 125 అర్ధసెంచరీలున్నాయి. ఇంగ్లండ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఎడ్వర్డ్స్‌కు ప్రత్యేక స్థానముంది. ఆమె సారథ్యంలోనే ఇంగ్లండ్ వన్డే, టి20 ఫార్మాట్లలో ప్రపంచకప్‌లు సాధించింది. పాక్ దిగ్గజ లెగ్ స్పిన్నర్ ఖాదిర్ 63 వయస్సులో (2019) కన్నుమూశారు. టెస్టు క్రికెటర్లలో అలనాటి గ్రేటెస్ట్ స్పిన్నర్‌గా వెలుగొందారు. 67 మ్యాచుల్లోనే 236 వికెట్లు తీసిన ఘనత ఆయనది. 1987లో ఇంగ్లండ్‌పై 56 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు. ఖాదిర్ తరఫున అతని కుమారుడు ఉస్మాన్ పురస్కారాన్ని అందుకున్నారు. చదవండి: Team India: ఐపీఎల్ బ్యాన్ చేస్తేనే దారిలోకి వస్తారా! -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చంద్రపాల్, అబ్దుల్ ఖాదీర్, చార్లెట్ ఎడ్వర్డ్స్
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్‌కు అరుదైన గౌరవం లభించింది. చంద్రపాల్‌తో పాటు పాకిస్తాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదీర్, ఇంగ్లండ్ మహిళా దిగ్గజ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్లు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ దిగ్గజ త్రయాలను టి20 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్ 9న(బుధవారం) న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరగనున్న తొలి సెమీస్‌కు ముందు సత్కరించనున్నారు. సిడ్నీ మైదానంలో క్రికెట్ అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. శివనారాయణ్ చంద్రపాల్.. 21 ఏళ్ల పాటు వెస్టిండీస్ క్రికెట్లో సేవలందించిన శివ్‌నరైన్ చంద్రపాల్ 107వ క్రికెటర్గాఘైసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. 1994లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన చంద్రపాల్ 2016లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా విండీస్ జట్టులో మిడిలార్డర్లో కీలకపాత్ర పోషించాడు.ముఖ్యంగా అతని ఓపికకు సలాం కొట్టొచ్చు. క్రీజులో పాతుకుపోతే గంటల పాటు ఆడడం అతని ప్రత్యేకత. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 20,988 పరుగులు సాధించాడు. ఇందులో 41సెంచరీలు, 125 అర్థసెంచరీలు ఉన్నాయి. ''ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం సంతోషంగా ఉంది. ఎంతోమంది లెజెండరీ క్రికెటర్ల మధ్య నా పేరు ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా'' అంటూ ఐసీసీ రిలీజ్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. చార్లెట్ ఎడ్వర్డ్స్.. 16 ఏళ్ల వయసులోనే మహిళల క్రికెట్లో అడుగుపెట్టిన చార్లెట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ తరపున 20 ఏళ్ల పాటు తన సేవలందించింది. 20 ఏళ్ల కెరీర్లో 191 వన్డేల్లో 5992 పరుగులు, 95 టి20ల్లో 2605 పరుగులు, 23 టెస్టుల్లో 1676 పరుగులు సాధించింది. ఆమె ఖాతాలో నాలుగు టెస్టు సెంచరీలు, 9 వన్డే సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ మహిళా జట్టుకు కెప్టెన్‌గా 2009లో వన్డే వరల్డ్‌కప్, టి20 వరల్డ్‌కప్ సాధించి రికార్డు సృష్టించింది. చార్లెట్ వన్డేల్లో చేసిన పరుగులు.. మహిళల క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ రెండో అత్యధికంగా ఉండడం విశేషం. ఇక చార్లెట్ ఎడ్వర్డ్స్ 108వ క్రికెటర్‌గా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది. అబ్దుల్ ఖాదీర్.. పాకిస్తాన్ దివంగత ఆటగాడు అబ్దుల్ ఖాదీర్ 109వ క్రికెటర్‌గా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. పాక్ తరపున లెజెండరీ లెగ్ స్పిన్నర్‌గా పేరు పొందిన ఖాదీర్ 67 మ్యాచ్‌ల్లో 236 వికెట్లు తీశాడు. ఇక 1987లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 56 పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు తీయడం ఆయన కెరీర్లో అత్యుత్తంగా నిలిచిపోయింది. 1993లో చివరి మ్యాచ్ ఆడిన అబ్దుల్ ఖాదీర్ 2019లో 63 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఇక అబ్దుల్ ఖాదీర్‌కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంపై ఆయన కొడుకు ఉస్మాన్ ఖాదీర్ స్పందించాడు.'' నా తండ్రికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించినందుకు మా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. క్రికెట్‌కు ఆయన ఎంతో సేవ చేశారు. ఇవాళ దానికి తగిన ప్రతిఫలం లభించింది.'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: 'కోహ్లి కొట్టిన సిక్స్ చరిత్రలో నిలిచిపోతుంది' A Pakistan legend, England trailblazer and West Indies great are the three latest additions to the ICC Hall Of Fame 🌟https://t.co/CXb6Z2qgVN — ICC (@ICC) November 8, 2022 🏏 20,988 international runs 🌴 Former West Indies captain 🔥 30 Test centuries at an average of 51.37 The legendary left-hander is among the latest ICC Hall of Fame inductees.https://t.co/1KFH9Aqt6W — ICC (@ICC) November 8, 2022 🔥 Record-breaking numbers 🏅 ICC Woman’s Player of the Year in 2008 🏴 Captained two World Cup winning campaigns The legendary England superstar has been inducted into the ICC Hall of Fame.https://t.co/jAEDgELX0E — ICC (@ICC) November 8, 2022 🏏 171 international matches ☝️ 236 Test wickets and 132 ODI wickets 👊 "A bowler with killer instincts" Pakistan's legendary leg-spinner has been inducted into the ICC Hall of Fame.https://t.co/KjG5ejLEOu — ICC (@ICC) November 8, 2022 -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో వినూ మన్కడ్, సంగక్కర
దుబాయ్: తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను పురస్కరించుకొని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పది మంది దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. ఇందులో భారత్ నుంచి దివంగత క్రికెటర్ వినూ మన్కడ్‌కు... శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకుమార సంగక్కరకు స్థానం దక్కింది. 1978లో మృతి చెందిన వినూ మన్కడ్ భారత్ తరఫున 1947 నుంచి 1959 మధ్య కాలంలో 44 టెస్టులు ఆడి 2,109 పరుగులు చేయడంతోపాటు 162 వికెట్లు తీశారు. మేటి ఆల్‌రౌండర్‌గా పేరున్న వినూ మన్కడ్ 1952లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 72, రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో ఏకంగా 97 ఓవర్లు వేశారు. దిగ్గజ క్రికెటర్ సంగక్కర శ్రీలంక తరఫున 134 టెస్టులు (12,400 పరుగులు), 404 వన్డేలు (14,234 పరుగులు), 56 టి20 మ్యాచ్‌లు (1,382 పరు గులు) ఆడాడు. వినూ మన్కడ్, సంగక్కరలతోపాటు మోంటీ నోబుల్ (ఆస్ట్రేలియా), కాన్స్టన్ టైన్ (వెస్టిండీస్), స్టాన్ మెక్‌కేబ్ (ఆస్ట్రేలియా), డెక్స్టర్ (ఇంగ్లండ్), హేన్స్ (వెస్టిండీస్), బాబ్ విల్లీస్ (ఇంగ్లండ్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే) కూడా ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందారు. చదవండి: సిరీస్‌తోపాటు ‘టాప్’ ర్యాంక్ సొంతం -
'హాల్ ఆఫ్ ఫేమ్' జాబితాలో మరో పది మంది దిగ్గజాలు..
దుబాయ్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ సందర్భంగా పది మంది దిగ్గజ ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చాలని ఐసీసీ నిర్ణయించింది. క్రికెట్ ఐదు శకాల నుంచి ఇద్దరేసి ఆటగాళ్లకు ఈ గౌరవం దక్కనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో 93 మంది దిగ్గజ ఆటగాళ్లుండగా, ఆ సంఖ్యను 103కు పెంచాలని నిర్ణయించింది. జూన్ 18న సౌథాంప్టన్‌లో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ స్పెషల్ ఎడిషన్ ఉంటుందని గురువారం ఐసీసీ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. చారిత్రక మ్యాచ్(డబ్యూటీసీ ఫైనల్) సందర్భంగా.. క్రికెట్ చరిత్రను సెలబ్రేట్ చేసుకోబోతున్నామని, ఇందులో భాగంగా క్రికెట్‌కు తమ వంతు సేవలు అందించిన 10 మంది దిగ్గజాలను మనం సత్కరించుకోబోతున్నామని, వారిని గౌరవించుకోవడం మన కర్తవ్యమని ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ పేర్కొన్నారు. ఈ లెజండరీ ఆటగాళ్లు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ఆయన తెలిపారు. క్రికెట్‌ను ఐదు శకాలుగా విభజించామని, వాటిని ప్రారంభ క్రికెట్ శకం (1918 కంటే ముందు), ఇంటర్ వార్ క్రికెట్ శకం (1918-1945), యుద్ధం తర్వాత క్రికెట్ శకం (1946-1970), వన్డే క్రికెట్ శకం(1971-1995), ఆధునిక క్రికెట్ శకం (1996-2016)గా విభజించామని వెల్లడించారు. ఈ ఐదు శకాల్లో ఒక్కో శకం నుంచి ఇద్దరేసి ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఓటింగ్ అకాడమీ, హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో సజీవంగా ఉన్న సభ్యులు, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రతినిధి, ప్రముఖ క్రికెట్ జర్నలిస్టులు, సీనియర్ ఐసీసీ సభ్యులు.. ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు. అయితే వీరి ఓటింగ్ ఆధారంగా ఇప్పటికే ఆ పది మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని, జూన్ 13న ఈ జాబితాను ఐసీసీ డిజిటల్ మీడియా ఛానెళ్ల ద్వారా లైవ్‌లో ప్రకటిస్తామని జెఫ్ వెల్లడించారు. చదవండి: సచిన్ నాకు 12 ఏళ్ల పిల్లాడిలా, క్యూట్‌గా కనిపించాడు.. అందుకే వెంటపడ్డా -
కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపా..
న్యూఢిల్లీ: "ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్"కు ఎంపికైన నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేపై శ్రీలంక, పాకిస్తాన్లకు చెందిన మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపానని లంక ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాడు సంగక్కర కొనియాడాడు. వేగం, కచ్చితత్వం అతని ప్రధాన ఆయుధాలని, వీటితో కెరీర్ ఆసాంతం తనను చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. అతని ఎత్తు అతనికి అడ్వాంటేజ్ అని, దాని వల్ల అతను విసిరిన బంతులు బాగా బౌన్స్ అయ్యేవని గుర్తు చేసుకున్నాడు. బౌలర్‌గా తనను ఇబ్బంది పెట్టినా, వ్యక్తిగతంగా చాలా మంచివాడని పొగడ్తలతో ముంచెత్తాడు. బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసేందుకు కుంబ్లే వద్ద పక్కా ప్రణాళిక ఉంటుందని, దాన్ని అతను తూచా తప్పకుండా అమలు చేసి సత్ఫలితాలు సాధించాడని మరో శ్రీలంక ఆటగాడు జయవర్ధనే పేర్కొన్నాడు. కుంబ్లే బలాలేంటో తనకు బాగా తెలుసని, తన బంతుల ద్వారా అతడు బ్యాట్స్‌మన్‌ను ప్రశ్నిస్తూనే ఉంటాడని అతను వెల్లడించాడు. ఇదిలా ఉంటే బౌలర్లు సైతం కుంబ్లేను ఆకాశానికెత్తారు. పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ కుంబ్లేను ప్రశంసలతో ముంచెత్తాడు. ఢిల్లీలో కుంబ్లే తమపై 10 వికెట్లు తీయడం తన కళ్లెదుటే మెదులుతుందని, అతని పదో వికెట్ నేనే కావడంతో ఆ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నాడు. కాగా, కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అతను టీమిండియా కోచ్‌గా కూడా పనిచేశాడు. చదవండి: ఇంగ్లండ్‌లో ఐపీఎల్ నిర్వహణ డౌటే.. -
లెజెండ్‌కు మరో ఐసీసీ పురస్కారం..
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం లభించింది. 'లెజెండ్ అనే పదం సచిన్‌కి తక్కువే.. తాజాగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆయనకి స్థానం కల్పించాం' అని ఐసీసీ తన అధికారిక ట్విటర్లో ట్వీట్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో అటు టెస్టులు, ఇటు వన్డేల్లో అత్యధిక పరుగులతోపాటు వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ అంటూ ఐసీసీ ప్రశంసల జల్లు కురిపించింది. సచిన్‌కు ఈ ఘనత దక్కడం పట్ల తాజా, మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ ఫిట్జ్‌పాట్రిక్‌లకు సైతం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఇక ఈ ఘనత దక్కడం పట్ల సచిన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘నాకు లభించిన ఈ గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉంది, ఇది నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా’అంటూ సచిన్ పేర్కొన్నాడు. కాగా ఈ ఘనత అందుకున్న ఆరో భారతీయుడిగా సచిన్ నిలిచాడు. గతంలో బిషన్‌సింగ్ బేడి(2009), సునీల్ గవాస్కర్(2009), కపిల్‌దేవ్(2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018) లకు ఈ ఘనత దక్కింది. Highest run-scorer in the history of Test cricket ✅ Highest run-scorer in the history of ODI cricket ✅ Scorer of 100 international centuries 💯 The term 'legend' doesn't do him justice. @sachin_rt is the latest inductee into the ICC Hall Of Fame.#ICCHallOfFame pic.twitter.com/AlXXlTP0g7 — ICC (@ICC) July 18, 2019 -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రికీ పాంటింగ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్లో బుధవారం మొదలైన మూడో టెస్టు తొలి రోజు ఆట టీ విరామ సమయంలో అతడు ఆస్ట్రేలియాకే చెందిన మేటి బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ చేతుల మీదుగా హాల్ ఆఫ్ ఫేమ్ టోపీని అందుకున్నాడు. గత జూలైలో ఐర్లాండ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశం సందర్భంగా రాహుల్ ద్రవిడ్ (భారత్), ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ క్లెయిర్ టేలర్, పాంటింగ్‌లను హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఎంపిక చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం టోపీని స్వీకరించాడు. ‘ఈ అనుభూతిని వర్ణించలేను. మెల్బోర్న్ మైదానంలో వేలాది మంది ప్రేక్షకుల మధ్య ఈ గౌరవాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని 44 ఏళ్ల పాంటింగ్ అన్నాడు. ఆస్ట్రేలియా తరఫున పాంటింగ్ 168 టెస్టులు ఆడి 13,378 పరుగులు; 375 వన్డేలు ఆడి 13,704 పరుగులు సాధించాడు. -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ద్రవిడ్
తిరువనంతపురం: మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. తిరువనంతపురంలో గురువారం వెస్టిండీస్‌తో ఐదో వన్డేకు ముందు నిర్వహించిన కార్యక్రమంలో దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ ఇందుకు సంబంధించిన జ్ఞాపికను అతడికి అందించారు. దీంతో బిషన్ సింగ్ బేడీ, గావస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే తర్వాత భారత్ నుంచి ఈ ఘనత అందుకున్న ఐదో క్రికెటర్‌గా ద్రవిడ్ నిలిచాడు. ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ 164 టెస్టుల్లో 13,288 పరుగులు, 344 వన్డేల్లో 10,889 పరుగులు చేశాడు. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రాహుల్ ద్రవిడ్
భారత మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్లో విశేష ప్రతిభ కనబర్చినందుకు గాను అతనికి ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ క్లెయిర్ టేలర్‌లకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది. భారత్ తరఫున ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఐదో క్రికెటర్ ద్రవిడ్. అంతకుముందు బిషన్ సింగ్ బేడి, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలు ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ‘ఎ’, అండర్–19 జట్లకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్ దేశం తరఫున 164 టెస్టులకు ప్రాతినిథ్యం వహించి 13,288 పరుగులు చేశాడు. అందులో 36 సెంచరీలు ఉన్నాయి. 344 వన్డేల్లో 10,889 పరుగులు సాధించాడు. -
చరిత్ర సృష్టించిన లంక దిగ్గజ ఆటగాడు
శ్రీలంక మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీదరన్కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న తొలి లంక క్రికెటర్‌గా మురళీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ రిచర్డ్సన్ ఈ వివరాలను ప్రకటించారు. ఇంగ్లండ్ మాజీ బౌలర్ జార్జి లోమన్, ఆసీస్ మాజీ ఆటగాడు ఆర్థర్ మోరిస్, ఆసీస్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ కరెన్ రోల్టన్ ఈ అరుదైన ఘనత దక్కించుకున్నారు. వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మురళీదరన్. ఈ రెండు ఫార్మాట్లలో షేన్ వార్న్ సహా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మురళీదరన్ నిలిచాడు. 19వ దశకం చివర్లో క్రికెట్ ఆడిన లోమన్.. 100 వికెట్లు అత్యంత తక్కవ మ్యాచుల్లో పడగొట్టిన ఫాస్ట్ బౌలర్. భిన్న కాలాల్లో క్రికెట్ ఆడిన వారితో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ తయారు చేసినట్లు రిచర్డ్ సన్ వివరించారు. ఆధునిక క్రికెట్లో కేవలం మురళీ ఒక్కడే ఈ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. -
హాల్ ఆఫ్ ఫేమ్‌లో సింప్సన్
దుబాయ్: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్‌కు చోటు దక్కింది. ఆస్ట్రేలియా తరఫున ఈ గౌరవం అందుకున్న 20వ, ఓవరాల్‌గా 72వ ఆటగాడు సింప్సన్. ఆయనతో పాటు న్యూజిలాండ్ మాజీ మహిళా క్రికెటర్ డెబీ హాక్లీని కూడా హాల్ ఆఫ్ ఫేమ్ కోసం ఐసీసీ ఎంపిక చేసింది. ఈ జాబితాలో హాక్లీ నాలుగో మహిళా క్రికెటర్ కాగా, రిచర్డ్స్ హ్యడ్లీ తర్వాత రెండో న్యూజిలాండ్ క్రికెటర్ మాత్రమే కావడం విశేషం. ఆస్ట్రేలియా తరఫున 62 టెస్టుల్లో 4869 పరుగులు చేసిన సింప్సన్... ఆ జట్టు కోచ్‌గా వన్డే ప్రపంచకప్‌ను కూడా అందించారు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ (311) చేసిన కొద్ది మంది ఆటగాళ్లలో ఆయన కూడా ఒకరు. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో గిల్‌క్రిస్ట్, వకార్
దుబాయ్: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. వచ్చే వారం ఈ ఇద్దరి పేర్లను ఐసీసీ ఈ జాబితాలో చేర్చనుంది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 70వ సభ్యుడిగా గిల్లీ, 71వ సభ్యుడిగా యూనిస్ నిలిచారు. ఈనెల 11న దుబాయ్‌లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగే తొలి టి20 మ్యాచ్ సందర్భంగా యూనిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరనుండగా రెండు రోజుల అనంతరం పెర్త్‌లో ఆసీస్, ఇంగ్లండ్ యాషెస్ టెస్ట్ టీ విరామంలో గిల్‌క్రిస్ట్ ఈ ఘనత సాధించనున్నాడు. ఈనెల చివర్లో మరో ఇద్దరి పేర్లను ఐసీసీ ప్రకటించనుంది. పాక్ నుంచి ఇప్పటికే హనీఫ్ మహ్మద్, ఇమ్రాన్ ఖాన్, మియాందాద్, అక్రం హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఉండగా ఆసీస్ నుంచి 18 మంది క్రికెటర్లున్నారు.