ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చంద్రపాల్‌, అబ్దుల్‌ ఖాదీర్‌, చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌ | Chanderpaul-Charlotte Edwards-Abdul Qadir Inducted ICC Hall of Fame | Sakshi
Sakshi News home page

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చంద్రపాల్‌, అబ్దుల్‌ ఖాదీర్‌, చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌

Published Tue, Nov 8 2022 9:50 PM | Last Updated on Tue, Nov 8 2022 9:54 PM

Chanderpaul-Charlotte Edwards-Abdul Qadir Inducted ICC Hall of Fame - Sakshi

వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ శివనారాయణ్‌ చంద్రపాల్‌కు అరుదైన గౌరవం లభించింది. చంద్రపాల్‌తో పాటు పాకిస్తాన్‌ లెజెండరీ లెగ్‌ స్పిన్నర్‌ అ‍బ్దుల్‌ ఖాదీర్‌, ఇంగ్లండ్‌ మహిళా దిగ్గజ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌లు ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ దిగ్గజ త్రయాలను టి20 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్‌ 9న(బుధవారం) న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ మధ్య జరగనున్న తొలి సెమీస్‌కు ముందు సత్కరించనున్నారు. సిడ్నీ మైదానంలో క్రికెట్‌ అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. 

శివనారాయణ్‌ చంద్రపాల్‌..

21 ఏళ్ల పాటు వెస్టిండీస్‌ క్రికెట్‌లో సేవలందించిన శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ 107వ క్రికెటర్‌గాఘైసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. 1994లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన చంద్రపాల్‌ 2016లో ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కాగా విండీస్‌ జట్టులో మిడిలార్డర్‌లో కీలకపాత్ర పోషించాడు.ముఖ్యంగా అతని ఓపికకు సలాం కొట్టొచ్చు. క్రీజులో పాతుకుపోతే గంటల పాటు ఆడడం అతని ప్రత్యేకత.

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 20,988 పరుగులు సాధించాడు. ఇందులో 41సెంచరీలు, 125 అర్థసెంచరీలు ఉన్నాయి. ''ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కడం సంతోషంగా ఉంది. ఎంతోమంది లెజెండరీ క్రికెటర్ల మధ్య నా పేరు ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా'' అంటూ ఐసీసీ రిలీజ్‌ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.

చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌..

16 ఏళ్ల వయసులోనే మహిళల క్రికెట్‌లో అడుగుపెట్టిన చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌ ఇంగ్లండ్‌ తరపున 20 ఏళ్ల పాటు తన సేవలందించింది. 20 ఏళ్ల కెరీర్‌లో 191 వన్డేల్లో 5992 పరుగులు, 95 టి20ల్లో 2605 పరుగులు, 23 టెస్టుల్లో 1676 పరుగులు సాధించింది. ఆమె ఖాతాలో నాలుగు టెస్టు సెంచరీలు, 9 వన్డే సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్‌ మహిళా జట్టుకు కెప్టెన్‌గా 2009లో వన్డే వరల్డ్‌కప్‌, టి20 వరల్డ్‌కప్‌ సాధించి రికార్డు సృష్టించింది. చార్లెట్‌ వన్డేల్లో చేసిన పరుగులు.. మహిళల క్రికెట్‌ చరిత్రలో ఇప్పటికీ రెండో అత్యధికంగా ఉండడం విశేషం. ఇక చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌ 108వ క్రికెటర్‌గా హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది.

అబ్దుల్‌ ఖాదీర్‌..

పాకిస్తాన్‌ దివంగత ఆటగాడు అబ్దుల్‌ ఖాదీర్‌ 109వ క్రికెటర్‌గా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. పాక్‌ తరపున లెజెండరీ లెగ్‌ స్పిన్నర్‌గా పేరు పొందిన ఖాదీర్‌ 67 మ్యాచ్‌ల్లో 236 వికెట్లు తీశాడు. ఇక 1987లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 56 పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు తీయడం ఆయన కెరీర్‌లో అత్యుత్తంగా నిలిచిపోయింది.

1993లో చివరి మ్యాచ్‌ ఆడిన అబ్దుల్‌ ఖాదీర్‌ 2019లో 63 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఇక అబ్దుల్‌ ఖాదీర్‌కు ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కడంపై ఆయన కొడుకు ఉస్మాన్‌ ఖాదీర్‌ స్పందించాడు.'' నా తండ్రికి ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పించినందుకు మా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. క్రికెట్‌కు ఆయన ఎంతో సేవ చేశారు. ఇవాళ దానికి తగిన ప్రతిఫలం లభించింది.'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: 'కోహ్లి కొట్టిన సిక్స్‌ చరిత్రలో నిలిచిపోతుంది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement