shivnarine Chanderpaul
-
టీమిండియా అదుర్స్.. వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ తేడాతో విజయం (ఫోటోలు)
-
Ind Vs WI 1st Test Photos: వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా తొలి టెస్టు డే-1 (ఫోటోలు)
-
తండ్రీ కొడుకులిద్దరిని ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా
టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఇదే టెస్టులో రెండు వికెట్లు తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన అశ్విన్ మరో ఘనత కూడా అందుకున్నాడు. మ్యాచ్ ద్వారా తండ్రీ కొడుకులిద్దరినీ టెస్టు క్రికెట్లో అవుట్ చేసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011లో తన తొలి టెస్టులో శివ్‌నారాయణ్ చందర్‌పాల్ వికెట్ తీసిన అశ్విన్.. తాజాగా తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను అవుట్ చేశాడు. గతంలో బోథమ్, వసీమ్ అక్రమ్, మిచెల్ స్టార్క్, సైమన్ హార్మర్ ఇలాంటి ఫీట్‌ను నమోదు చేశారు. ఇయాన్ బోథమ్:లాన్స్ కెయిన్స్, క్రిస్ కెయిన్స్ వసీం అక్రమ్:లాన్స్ కెయిన్స్, క్రిస్ కెయిన్స్ మిచెల్ స్టార్క్: శివనరైన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్ సైమన్ హార్మర్: శివనరైన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్ ఆర్ అశ్విన్: శివనరైన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్ The moment Ravi Ashwin created history! The first Indian to pick the wicket of father (Shivnarine) and son (Tagenarine) in Tests. pic.twitter.com/nvqXhLz0ze — Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2023 33వ సారి ఐదు వికెట్ల హాల్.. అండర్సన్ రికార్డు బద్దలు ఇక టెస్టు క్రికెట్లో అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 33వ సారి. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్‌ను అధిగమించాడు. అండర్సన్ 32 సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఇక అశ్విన్ కంటే ముందు ఐదుగురు బౌలర్లు ఎక్కువసార్లు ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్నారు. తొలి స్థానంలో ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు(133 టెస్టులు), షేన్ వార్న్ 37 సార్లు(145 మ్యాచ్‌లు), రిచర్డ్ హడ్లీ 36 సార్లు(86 మ్యాచ్‌లు), అనిల్ కుంబ్లే 35 సార్లు(132 మ్యాచ్‌లు), రంగనా హెరాత్ 34 సార్లు( 93 మ్యాచ్‌లు) ఉన్నారు. చదవండి: అశ్విన్ పాంచ్ పటాకా.. ఆకట్టుకున్న జైశ్వాల్, తొలిరోజు టీమిండియాదే -
WI VS SA: తండ్రుల కాలం అయిపోయింది, కొడుకులు తయారయ్యారు
వెస్టిండీస్-సౌతాఫ్రికా (సౌతాఫ్రికన్ ఇన్విటేషన్ XI) జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 21) మొదలైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 1990, 2000 దశకాల్లో స్టార్లుగా వెలిగిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల తనయులు ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధులుగా ఎదురెదురుపడ్డారు. ఎదురెదురుపడటమే కాకుండా తండ్రుల తరహాలోనే ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం కూడా చేశారు. అంతిమంగా దిగ్గజ బౌలర్ తనయుడు.. దిగ్గజ బ్యాటర్ తనయుడికి విసుగు తెప్పించి వికెట్ దొరకబుచ్చుకున్నాడు. ఇంతకీ ఆ తండ్రులు, వారి పుత్రరత్నాలు ఎవరంటే..? Wonderful pressure applied by Thando Ntini who picks up Tagenarine Chanderpaul after racking up some dot balls He has been getting some nice shape away from the lefties and inswing to Braithwaite this morning#SAXIvWI pic.twitter.com/OYksHFjRk8 — Werner (@Werries_) February 21, 2023 వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ తనయుడు తేజ్‌నరైన్ చంద్రపాల్, మరొకరు సౌతాఫ్రికా లెజండరీ ఫాస్ట్ బౌలర్ మఖాయ ఎన్తిని కొడుకు థాండో ఎన్తిని. 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న వెస్టిండీస్.. సౌతాఫ్రికన్ ఇన్విటేషన్ XI జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో తేజ్‌నరైన్, థాండో ఎదురెదురు పడ్డారు. వెస్టిండీస్ తరఫున ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన తేజ్‌నరైన్.. ఫాస్ట్ బౌలర్ థాండోను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో వరుస డాట్ బాల్స్‌తో తేజ్‌నరైన్ (1) సహనాన్ని పరీక్షించిన థాండో.. ఫైనల్‌గా అతని వికెట్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. నెటిజన్లు రకరాకల కామెంట్లతో ఇరువురు ఆటగాళ్ల తండ్రులను గుర్తు చేసుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయులు అంటూ వీరిని ఆకాశానికెత్తుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తేజ్‌నరైన్, థాండో ఇద్దరూ తండ్రుల తరహాలోనే బ్యాటింగ్, బౌలింగ్ స్టైల్ కలిగి ఉండటం. వీరిద్దరు అచ్చుగుద్దినట్లు తండ్రుల తరహాలోనే హావభావాలు సైతం పలికించారు. వీరిలో తేజ్‌నరైన్ ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుండగా.. 22 ఏళ్ల థాండో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తేజ్‌నరైన్ 4 టెస్ట్‌ల్లో 69.67 సగటున డబుల్ సెంచరీ, సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 418 పరుగుల సాధించగా.. థాండో సౌతాఫ్రికా అండర్-19 జట్టు తరఫున సత్తా చాటాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా టీమ్ 41 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండో రోజు ఆట కొనసాగుతోంది. విండీస్ ఇన్నింగ్స్‌లో జాషువ డిసిల్వ (55), జేసన్ హోల్డర్ (57) హాఫ్‌సెంచరీలతో రాణించగా.. సౌతాఫ్రికా ఆటగాళ్లు విహన్ లుబ్బే (67 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్ (13 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తొలి ఇన్నింగ్స్‌లో తేజ్‌నరైన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించగా.. థాండో కూడా ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన తేజ్‌నరైన్ చంద్రపాల్.. తండ్రిని మించిపోయాడు..!
టెస్ట్ క్రికెట్లో వెస్టిండీస్ యువ ఓపెనర్ తేజ్‌నరైన్ చంద్రపాల్, తన తండ్రి శివ్‌నరైన్ చంద్రపాల్‌తో కలిసి ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ క్రమంలో తేజ్‌నరైన్ తన తండ్రిని కూడా వెనక్కునెట్టాడు. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తేజ్‌నరైన్ అజేయ డబుల్ సెంచరీ (467 బంతుల్లో 207 నాటౌట్; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచాడు. The moment Tagenarine Chanderpaul complete his maiden double hundred in Test cricket - The future of West Indies cricket.pic.twitter.com/2ZRmKZ7ZUV — CricketMAN2 (@ImTanujSingh) February 6, 2023 కెరీర్లో మూడో టెస్ట్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన తేజ్.. అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ విభాగంలో తండ్రి శివ్నరైన్నే మించిపోయాడు. శివ్‌నరైన్ 164 టెస్ట్‌ల కెరీర్లో 203 నాటౌట్ అత్యధిక స్కోర్ కాగా.. తేజ్ తన మూడో టెస్ట్‌లో తండ్రి అత్యధిక స్కోర్‌ను అధిగమించి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల జోడీ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ ఓ యూనిక్ రికార్డును సొంతం చేసుకుంది. టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధించిన తొట్టతొలి తండ్రి కొడుకుల జోడీగా శివ్-తేజ్ జోడీ రికార్డుల్లోకెక్కింది. క్రికెట్ చరిత్రలో ఏ తండ్రి కొడుకులు ఈ ఘనత సాధించలేదు. భారత్‌కు చెందిన తండ్రి కొడుకులు లాలా అమర్నాథ్-మొహిందర్ అమర్నాథ్, విజయ్ మంజ్రేకర్-సంజయ్ మంజ్రేకర్, ఇఫ్తికార్ (ఇంగ్లండ్)-మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ టెస్ట్‌ల్లో సెంచరీలు చేసినప్పటికీ తండ్రి కొడుకులు ఇద్దరూ డబుల్ సెంచరీలు మాత్రం సాధించలేకపోయారు. తేజ్‌నరైన్ కెరీర్లో 5 ఇన్నింగ్స్‌లు ఆడి హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ సాయంతో 91.75 సగటున 367 పరుగులు చేశాడు. మరోపక్క తేజ్ తండ్రి శివ్‌నరైన్ 1994-15 మధ్యకాలంలో 164 టెస్ట్‌ల్లో 51.4 సగటున 30 సెంచరీలు, 66 హాఫ్‌సెంచరీల సాయంతో 11867 పరుగులు చేశాడు. అలాగే 268 వన్డేల్లో 11 సెంచరీలు, 59 హాఫ్‌సెంచరీల సాయంతో 8778 పరుగులు, 22 టీ20ల్లో 343 పరుగులు చేసి విండీస్ దిగ్గజ బ్యాటర్ అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విండీస్ టీమ్.. తొలి టెస్ట్‌లో 447/6 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తేజ్నరైన్తో పాటు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (182) సెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. -
టెస్ట్‌ల్లో తొలి సెంచరీ బాదిన శివ్‌నరైన్ చంద్రపాల్ తనయుడు
వెస్టిండీస్ యువ క్రికెటర్ టగెనరైన్ చంద్రపాల్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కెరీర్లో మూడో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తండ్రి శివ్‌నరైన్ చంద్రపాల్‌ను పుత్రోత్సాహంతో పరవశించేలా చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ బాదిన టగెనరైన్.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. బ్యాటింగ్ శైలితో పాటు హావభావలు సైతం తండ్రిలాగే ప్రదర్శించే టగెనరైన్.. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటంలోనూ, పరుగులు సాధించడంలోనూ తండ్రికి సరిసాటి అనిపించుకుంటున్నాడు. A maiden Test ton for Tagenarine Chanderpaul as the Windies openers put on a double century stand 🙌Watch #ZIMvWI live and FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺📝 Scorecard: https://t.co/kWH1ac3IPs pic.twitter.com/GuyFrenHUF— ICC (@ICC) February 5, 2023 జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 221 పరుగులు చేసింది. ఓపెనర్లు టగెనరైన్ చంద్రపాల్ (291 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (246 బంతుల్లో 116 నాటౌట్; 7 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. జింబాబ్వే బౌలర్లు శాయశక్తులా ప్రయత్నించినా వీరిద్దరిని ఔట్ చేసుకోలేకపోయారు. ముఖ్యంగా టగెనరైన్ వికెట్ల ముందు గోడలా నిలబడి, బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. టగెనరైన్ సెంచరీ సాధించడంతో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి శివ్‌నరైన్ చంద్రపాల్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. 26 ఏళ్ల టగెనరైన్ 3 టెస్ట్ మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, అర్ధసెంచరీ సాయంతో 65.25 సగటున 261 పరుగులు చేశాడు. టగెనరైన్ తండ్రి శివ్‌నరైన్ 1994-15 మధ్యకాలంలో 164 టెస్ట్‌ల్లో 51.4 సగటున 30 సెంచరీలు, 66 హాఫ్‌సెంచరీల సాయంతో 11867 పరుగులు చేశాడు. అలాగే 268 వన్డేల్లో 11 సెంచరీలు, 59 హాఫ్‌సెంచరీల సాయంతో 8778 పరుగులు, 22 టీ20ల్లో 343 పరుగులు చేసి విండీస్ దిగ్గజ బ్యాటర్ అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. వర్షం అంతరాయం నడుమ తొలి టెస్ట్ ఆటంకాలతో సాగుతోంది. -
కీలక ఇన్నింగ్స్‌తో మెరిసిన చందర్‌పాల్ కుమారుడు
జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు తొలి రోజు ఆటకు వర్షం దెబ్బ కొట్టింది. బులవాయోలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 112 పరుగులు సాధించింది. విండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ కుమారుడు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (170 బంతుల్లో 55 బ్యాటింగ్; 8 ఫోర్లు) కెరీర్లో రెండో అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (138 బంతుల్లో 55 బ్యాటింగ్; 2 ఫోర్లు) కూడా క్రీజులో ఉన్నాడు. -
తండ్రికి తగ్గ తనయుడు.. ఆ పోలికలు ఎక్కడికి పోతాయి
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం శివనరైన్ చందర్‌పాల్ గుర్తున్నాడు కదా.. రెండు దశాబ్దాల పాటు విండీస్ క్రికెట్లో మిడిలార్డర్లో మూల స్తంభంగా నిలిచాడు. బ్రియాన్ లారా తర్వాత టెస్టు క్రికెట్లో చందర్‌పాల్ విండీస్ జట్టులో కీలకపాత్ర పోషించాడు. అతని బ్యాటింగ్ స్టైల్ ఒక యూనిక్ అని చెప్పొచ్చు. క్రీజులో కాస్త వంకరగా నిలబడి మిడిల్ వికెట్‌ను మొత్తం కవర్ చేస్తూ బ్యాటింగ్ చేయడం అతనికి మాత్రమే సాధ్యం. రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ఆడిన చందర్‌పాల్ బ్యాటింగ్ స్టాండింగ్ విషయంలో ఏనాడు ఒక్క ఫిర్యాదు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. తాజాగా చందర్‌పాల్ కొడుకు టగ్‌నరైన్ చందర్‌పాల్ కూడా విండీస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అచ్చం తండ్రిలానే బ్యాటింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు. చందర్పాల్ది యూనిక్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అని అంటారు. అతనిలా మరే ఆటగాడు బ్యాటింగ్ చేయకపోవచ్చని పేర్కొన్నారు. కానీ ఆ మాటలను టగ్‌నరైన్ చందర్‌పాల్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన టగ్‌నరైన్ చందర్‌పాల్ అచ్చం తండ్రి బ్యాటింగ్‌ను గుర్తు చేస్తూ ఇన్నింగ్స్ కొనసాగించాడు. తండ్రి బ్యాటింగ్ స్టైల్‌ను అనుకరిస్తూ ఆడిన టగ్‌నరైన్ అర్థశతకం సాధించాడు. ఓవరాల్‌గా 79 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. తండ్రికి తగ్గ కొడుకు.. ఆ పోలికలు ఎక్కడికి పోతాయి.. అంటూ కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ 64, టగ్‌నరైన్ చందర్‌పాల్ 51 మినహా పెద్దగా ఎవరు రాణించలేదు. బ్లాక్‌వుడ్ 36, షమ్రా బ్రూక్స్ 33 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో కమిన్స్, స్టార్క్ చెరో మూడు వికెట్లు తీయగా.. నాథన్ లియోన్ 2, కామెరున్ గ్రీన్, హాజిల్‌వుడ్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 598 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌లు డబుల్ సెంచరీలతో మెరిశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 336 పరుగుల ఆధిక్యంలో ఉంది. Chanderpaul taking on Cummins! #AUSvWI pic.twitter.com/MMS31dMZjW — cricket.com.au (@cricketcomau) December 1, 2022 చదవండి: 17 ఏళ్ల తర్వాత తొలి టెస్టు మ్యాచ్.. 657 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ -
లబూషేన్, స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీలు.. పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న హెడ్
పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్నస్ లబూషేన్ (350 బంతుల్లో 204; 20 ఫోర్లు, సిక్స్), స్టీవ్ స్మిత్ (311 బంతుల్లో 200 నాటౌట్; 16 ఫోర్లు) డబుల్ సెంచరీలతో, ట్రవిస్ హెడ్ (95 బంతుల్లో 99; 11 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (149 బంతుల్లో 65; 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్.. తన కెరీర్లో నాలుగో సారి ఈ ఫీట్‌ను నమోదు చేయగా, లబూషేన్ తన 27 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా స్మిత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 59 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టీవ్ స్మిత్.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్లో 29వ టెస్ట్ శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో స్మిత్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్ తన 52 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 29 శతకాలు సాధించగా.. స్మిత్ తన 88వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే స్మిత్.. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా కూడా ప్రమోటయ్యాడు. ఆసీస్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32), మాథ్యూ హేడెన్ (30) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్మిత్.. బ్రాడ్‌మన్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్.. 14వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ 51 శతకాలతో అందరి కంటే ముందున్నాడు. మరోవైపు ట్రవిస్ హెడ్.. ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. క్రెయిగ్ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో 99 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన హెడ్.. పరుగు తేడాతో తన 5వ టెస్ట్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. హెడ్ ఔట్ కావడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ద్వారా విండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు టగెనరైన్ చంద్రపాల్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన టగెనరైన్.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. -
తండ్రికి తగ్గ తనయుడు.. తొలి పర్యటనలోనే సెంచరీ బాదిన చంద్రపాల్ కొడుకు
Shivnarine Chanderpaul: వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు టగెనరైన్ చంద్రపాల్.. తన తొలి అధికారిక విదేశీ పర్యటనలోనే సెంచరీ బాది అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్న టగెనరైన్ చంద్రపాల్.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి, దాదాపు 90 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండి 7వ వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 293 బంతులు ఎదుర్కొన్న టగెనరైన్.. 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 119 పరుగులు చేశాడు. టగెనరైన్ ఇన్నింగ్స్ తండ్రి శివ్నరైన్ను గుర్తు చేసిందని క్రికెట్ అభిమానులు చర్చించుకున్నారు. అచ్చం తండ్రిలాగే ఓపికగా, సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్నాడని కొనియాడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో విండీస్ ఇన్నింగ్స్ మొత్తంలో టగెనరైన్ ఒక్కడే రాణించడం విశేషం. కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ (47) ఓ మోస్తరుగా రాణించగా మిగతావారంతా దారుణంగా విఫలయ్యారు. ఫలితంగా ఆ జట్టు 234 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టు.. మ్యాట్ రెన్షా (81), మార్కస్ హ్యారిస్ (73), హ్యాండ్స్కోంబ్ (55) అర్ధసెంచరీలతో రాణించడంతో 91.5 ఓవర్లలో 322 పరుగులు చేసి ఆలౌటైంది. ఇవాళ (నవంబర్ 25) రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టు.. మ్యాట్ రెన్షా (71 నాటౌట్), హ్యాండ్స్కోంబ్ (75) మరోసారి అర్ధసెంచరీలతో రాణించడంతో డిన్నర్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ఆ జట్టు 252 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, నవంబర్ 30 నుంచి ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న టగెనరైన్.. విండీస్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైనట్లే. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చంద్రపాల్, అబ్దుల్ ఖాదీర్, చార్లెట్ ఎడ్వర్డ్స్
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్‌కు అరుదైన గౌరవం లభించింది. చంద్రపాల్‌తో పాటు పాకిస్తాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదీర్, ఇంగ్లండ్ మహిళా దిగ్గజ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్లు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ దిగ్గజ త్రయాలను టి20 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్ 9న(బుధవారం) న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరగనున్న తొలి సెమీస్‌కు ముందు సత్కరించనున్నారు. సిడ్నీ మైదానంలో క్రికెట్ అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. శివనారాయణ్ చంద్రపాల్.. 21 ఏళ్ల పాటు వెస్టిండీస్ క్రికెట్లో సేవలందించిన శివ్‌నరైన్ చంద్రపాల్ 107వ క్రికెటర్గాఘైసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. 1994లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన చంద్రపాల్ 2016లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా విండీస్ జట్టులో మిడిలార్డర్లో కీలకపాత్ర పోషించాడు.ముఖ్యంగా అతని ఓపికకు సలాం కొట్టొచ్చు. క్రీజులో పాతుకుపోతే గంటల పాటు ఆడడం అతని ప్రత్యేకత. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 20,988 పరుగులు సాధించాడు. ఇందులో 41సెంచరీలు, 125 అర్థసెంచరీలు ఉన్నాయి. ''ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం సంతోషంగా ఉంది. ఎంతోమంది లెజెండరీ క్రికెటర్ల మధ్య నా పేరు ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా'' అంటూ ఐసీసీ రిలీజ్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. చార్లెట్ ఎడ్వర్డ్స్.. 16 ఏళ్ల వయసులోనే మహిళల క్రికెట్లో అడుగుపెట్టిన చార్లెట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ తరపున 20 ఏళ్ల పాటు తన సేవలందించింది. 20 ఏళ్ల కెరీర్లో 191 వన్డేల్లో 5992 పరుగులు, 95 టి20ల్లో 2605 పరుగులు, 23 టెస్టుల్లో 1676 పరుగులు సాధించింది. ఆమె ఖాతాలో నాలుగు టెస్టు సెంచరీలు, 9 వన్డే సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ మహిళా జట్టుకు కెప్టెన్‌గా 2009లో వన్డే వరల్డ్‌కప్, టి20 వరల్డ్‌కప్ సాధించి రికార్డు సృష్టించింది. చార్లెట్ వన్డేల్లో చేసిన పరుగులు.. మహిళల క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ రెండో అత్యధికంగా ఉండడం విశేషం. ఇక చార్లెట్ ఎడ్వర్డ్స్ 108వ క్రికెటర్‌గా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది. అబ్దుల్ ఖాదీర్.. పాకిస్తాన్ దివంగత ఆటగాడు అబ్దుల్ ఖాదీర్ 109వ క్రికెటర్‌గా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. పాక్ తరపున లెజెండరీ లెగ్ స్పిన్నర్‌గా పేరు పొందిన ఖాదీర్ 67 మ్యాచ్‌ల్లో 236 వికెట్లు తీశాడు. ఇక 1987లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 56 పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు తీయడం ఆయన కెరీర్లో అత్యుత్తంగా నిలిచిపోయింది. 1993లో చివరి మ్యాచ్ ఆడిన అబ్దుల్ ఖాదీర్ 2019లో 63 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఇక అబ్దుల్ ఖాదీర్‌కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంపై ఆయన కొడుకు ఉస్మాన్ ఖాదీర్ స్పందించాడు.'' నా తండ్రికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించినందుకు మా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. క్రికెట్‌కు ఆయన ఎంతో సేవ చేశారు. ఇవాళ దానికి తగిన ప్రతిఫలం లభించింది.'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: 'కోహ్లి కొట్టిన సిక్స్ చరిత్రలో నిలిచిపోతుంది' A Pakistan legend, England trailblazer and West Indies great are the three latest additions to the ICC Hall Of Fame 🌟https://t.co/CXb6Z2qgVN — ICC (@ICC) November 8, 2022 🏏 20,988 international runs 🌴 Former West Indies captain 🔥 30 Test centuries at an average of 51.37 The legendary left-hander is among the latest ICC Hall of Fame inductees.https://t.co/1KFH9Aqt6W — ICC (@ICC) November 8, 2022 🔥 Record-breaking numbers 🏅 ICC Woman’s Player of the Year in 2008 🏴 Captained two World Cup winning campaigns The legendary England superstar has been inducted into the ICC Hall of Fame.https://t.co/jAEDgELX0E — ICC (@ICC) November 8, 2022 🏏 171 international matches ☝️ 236 Test wickets and 132 ODI wickets 👊 "A bowler with killer instincts" Pakistan's legendary leg-spinner has been inducted into the ICC Hall of Fame.https://t.co/KjG5ejLEOu — ICC (@ICC) November 8, 2022 -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! చంద్రపాల్ కొడుకు ఎంట్రీ
ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు యువ సంచలనం టాగెనరైన్ చంద్రపాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ టాగెనరైన్ చంద్రపాల్ ఎవరో కాదు.. విండీస్ దిగ్గజ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్ పెద్ద కుమారుడు. చందర్‌పాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొట్టాడు. 2021-22 వెస్టిండీస్ ఫోర్డే ఛాంపియన్ షిఫ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన టాగెనరైన్.. 439 పరుగలు చేసి అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 34.21 సగటుతో 2669 పరుగులు సాధించాడు. అతడు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు టాగెనరైన్ రిజర్వ్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు. ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో విండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. చదవండి: T20 WC 2022: కోహ్లి బ్యాటింగ్.. 'దేవుడే పాట పాడినంత మధురంగా' -
‘క్రికెట్లో అతనే అత్యుత్తమం’
ఆంటిగ్వా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటను అభిమానించే మాజీల జాబితాలో మరో క్రికెటర్ చేరాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్ కూడా కోహ్లి ఆటంటే తనకు ఇష్టమని వెల్లడించాడు. కోహ్లి ఆట సూపర్ అంటూ కొనియాడాడు. ప్రతీసారి అత్యుత్తమ ప్రదర్శన చేసే ఆటగాళ్లలో కోహ్లి ఒకడన్నాడు. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడనడానే విషయాన్ని అతని ర్యాంకింగ్స్ చెబుతున్నాయన్నాడు. ‘క్రికెట్లో అతను సాధించిన ఘనతలే చెబుతున్నాయి కోహ్లి అత్యుత్తమం అని. కోహ్లి చాలా ఎక్కువ సందర్భాల్లో టాప్ ర్యాంకింగ్స్‌లో ఉన్నాడు. ఇలా ఒక ఆటగాడు ఎప్పుడూ బ్యాట్‌తో రాణించడం అంటే సాధారణ విషయం కాదు. కచ్చితంగా కోహ్లి ఒక అసాధారణ ఆటగాడు. ఫిట్నెస్ విషయంలో కూడా కోహ్లి శ్రమించే తీరు బాగుంటుంది. కోహ్లి ఏమిటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఒక గేమ్‌లో సుదీర్ఘ కాలం టాప్‌లో నిలవడం అంటే మామూలు విషయం కాదు. అతను కష్టించే తీరే కోహ్లిని టాప్‌లో నిలబెట్టింది’ అని చంద్రపాల్ తెలిపాడు. ఇప్పటి వరకూ కోహ్లి తన అంతర్జాతీయ కెరీర్ 70 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 సెంచరీలు సాధించాడు. కాగా, ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో మాత్రం కోహ్లి విఫలమయ్యాడనే చెప్పాలి. కేవలం ఆ పర్యటనలో 11 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి 218 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. -
‘టెన్ ఇయర్ చాలెంజ్’.. ఐసీసీ ట్వీట్ వైరల్
ప్రతీ ఒక్కరికీ గడిచిన క్షణాలను నెమరువేసుకోవడం ఓ సరదా. కానీ ఆ సరదానే ఇప్పుడు చాలెంజ్‌గా మారింది. ఐస్ బకెట్, కికీ, ఫిట్నెస్, తదితర చాలెంజ్‌లు ప్రపంచాన్ని ఊపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ తరహాలోనే ‘టెన్ ఇయర్ చాలెంజ్’ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగా పదేళ్ల క్రితం దిగిన ఫొటోను, ఇప్పటి ఫొటోను జత చేయాలి. ఇక ఇప్పటికే సినీతారలు, నెటిజన్లు తమ ఫోటోలను షేర్ చేస్తూ, పదేళ్లలో తమ జీవితంలో జరిగిన మార్పులను ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా తమ సన్నిహితులకు, స్నేహితులకు చాలెంజ్ విసురుతున్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కూడా ‘టెన్ ఇయర్ చాలెంజ్’ను స్వీకరించి తమ అధికారిక వెబ్ సైట్లో పలు ఫోటోలను షేర్ చేసింది. పదేళ్ల క్రితం నాటి క్రికెట్ అనుభూతులను గుర్తు చేస్తూ ఐసీసీ చేసిన ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పదేళ్ల క్రితం అంటే 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా.. 2019లో ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాకు సంబంధించిన ఫోటోలను ఐసీసీ షేర్ చేసింది. 2009లో టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు శివనారాయణ్ చందర్‌పాల్ ఉండగా, ప్రస్తుతం టీమిండియా సారథి విరాట్ కోహ్లి కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ జాబితాలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ టాప్ ప్లేస్‌లో ఉండగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఐసీసీ చేసిన ట్వీట్ చూసి పదేళ్ల క్రితం క్రికెటర్లను గుర్తు చేసుకుంటున్నామని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. The @MRFWorldwide ICC Test Batting Rankings, then and now!#2009vs2019 #10YearChallenge pic.twitter.com/7OcV2zEteV — ICC (@ICC) 16 January 2019 The @MRFWorldwide ICC Test Bowling Rankings, then and now!#2009vs2019 #10YearChallenge pic.twitter.com/B519NAinN8 — ICC (@ICC) 16 January 2019 -
తండ్రి చేతిలో కొడుకు రనౌట్
-
కొడుకుని రనౌట్ చేసిన తండ్రి..!
గయానా: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్, అతని కొడుకు త్యాగనారాయణ్ చందర్‌పాల్ కొన్నేళ్లుగా కలిసి క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. కరీబియన్ దేశవాళీ క్రికెట్లో వీరిద్దరు గయానా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, తాజాగా జరుగుతున్న సూపర్ ఫిఫ్టీ టోర్నీలో త్యాగనారాయణ్ను శివనారాయణ్ చందర్ పాల్ రనౌట్ చేయడం వార్తల్లో నిలిచింది. శివనారాయణ్ స్టైట్ డ్రైవ్ ఆడగా, బంతిని అడ్డుకునే ప్రయత్నంలో బౌలర్ కాలు అడ్డుపెట్టాడు. అతడి కాలికి తాకిన బంతి బెయిల్స్‌ను పడగొట్టింది. అప్పటికి క్రీజు బయట ఉన్న త్యాగనారాయణ్ రనౌటై వెనుదిరగాల్సి వచ్చింది. అసలు తండ్రి-కొడుకులు క్రికెట్ ఆడటమే అరుదైతే, కొడుకుని తండ్రి రనౌట్ చేయడం కాస్తా ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
తండ్రీకొడుకుల అర్ధ శతకాలు
కింగ్స్టన్: క్రికెట్లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో అర్ధ శతకాలు బాది రికార్డు సృష్టించారు. మామూలుగా క్రికెట్లో అన్నదమ్ములు కలసి బ్యాటింగ్ చేస్తుంటేనే చూడ ముచ్చటగా ఉంటుంది. అలాంటిది తండ్రీ కొడుకులు ఒకే మ్యాచ్ ఆడుతూ అర్ధ శతకాలు బాదితే! అద్భుతంగా అనిపిస్తుంది. కరీబియన్ అభిమానులు ఈ అరుదైన ఇన్నింగ్స్‌ను చూసి ఆనందించారు. విండీస్ బ్యాటింగ్ దిగ్గజం శివ్‌నారాయణ్ చందర్‌పాల్ గుర్తున్నాడు కదా! ఆయన తన కుమారుడు త్యాగి నారాయణ్ చందర్‌పాల్‌తో కలసి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. సబీనా పార్క్‌లో నిర్వహిస్తున్న ప్రాంతీయ టోర్నీలో శివ్‌నారాయణ్, త్యాగినారాయణ్ గయానా తరఫున ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడారు. వీరిద్దరూ అర్ధశతకాలు సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 262 పరుగులు చేసింది. ప్రత్యర్థి జమైకా జట్టు 255 పరుగులు మాత్రమే చేయగలిగింది. త్యాగి (20) ఓపెనింగ్ రాగా తండ్రి శివ్‌నారాయణ్ (42) మూడో బ్యాట్స్‌మన్‌గా వచ్చాడు. వీరిద్దరూ కలసి 12.2 ఓవర్లలో నాలుగో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వీరిద్దరూ కలసి ఫస్ట్‌క్లాస్ యేతర మ్యాచ్‌లెన్నో ఆడి శతకాలు కూడా బాదారు. టెస్టు క్రికెట్లో 11,867 పరుగులు చేసిన శివ్‌నారాయణ్ విండీస్ రెండో అత్యుత్తమ బ్యాట్స్‌మన్. బ్రయాన్ లారా అతడికన్నా ముందున్నాడు. -
క్రికెట్ కు చందర్‌పాల్ వీడ్కోలు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్:వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు శివనారాయణ్ చందర్‌పాల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 22 సంవత్సరాల పాటు వెస్టిండీస్ క్రికెట్ కు సుదీర్ఘ సేవలందించిన చందర్‌పాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించాడు. అన్ని ఫార్మెట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చందర్ పాల్ స్పష్టం చేశాడు. తన కెరీర్ లో 164 టెస్టు మ్యాచ్‌లు ఆడిన చందర్‌పాల్ 30 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీల సాయంతో 11, 867 పరుగులు చేసి విండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో టెస్టు క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. అతని కంటే ముందు బ్రియాన్ లారా(11,953) ఉన్నాడు. కాగా, చందర్‌పాల్ 268 వన్డేలు ఆడి 11 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీల సాయంతో 8,778 పరుగులు సాధించాడు. గతేడాది జూన్ లో తన వీడ్కోలకు సమయం ఆసన్నమైందంటూ సూచనప్రాయంగా తెలిపిన చందర్‌పాల్.. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది ఆరంభంలోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 2011 మేనెలలో పాకిస్తాన్ తో చివరి వన్డే ఆడిన చందర్ పాల్..2015 మే నెలలో ఇంగ్లండ్ తో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉండగా 2015-16 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితా ను ఇటీవల ప్రకటించిన విండీస్ బోర్డు... సీనియర్ ఆటగాడు చందర్‌పాల్ కు అవకాశం కల్పించకపోవడం కూడా అతని రిటైర్మెంట్ నిర్ణయానికి ఒక కారణం. విండీస్ బోర్డు విడుదల చేసిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో చందర్ పాల్ తో పాటు డారెన్ సామీ, ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో, ఆండ్రూ రస్సెల్, క్రిస్ గేల్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. -
చందర్‌పాల్ ‘రికార్డు’ శతకం
హామిల్టన్: వెస్టిండీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (229 బంతుల్లో 122 నాటౌట్; 11 ఫోర్లు) తానెంత కీలక ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. నలభై ఏళ్లకు చేరువవుతున్నా జట్టు కష్టకాలంలో అండగా ఉంటూ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అజేయ సెంచరీ చేశాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ సాధించిన 16 అజేయ శతకాల రికార్డును చందర్‌పాల్ (17) అధిగమించాడు. ఓవరాల్‌గా తనకిది 29వ సెంచరీ కాగా... మ్యాచ్ రెండో రోజు తన జోరుతో విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 116.2 ఓవర్లలో 367 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. స్యామీ (3) నిరాశపరచగా చివర్లో పెరుమాల్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు; 1 సిక్స్), బెస్ట్ (44 బంతుల్లో 25; 3 ఫోర్లు) చందర్‌పాల్‌కు సహకరించారు. సౌతీకి నాలుగు, అండర్సన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ి విలియమ్సన్ (148 బంతుల్లో 58; 5 ఫోర్లు), రాస్ టేలర్ (133 బంతుల్లో 56 బ్యాటింగ్; 8 ఫోర్లు) రాణించారు. ఈ జోడి మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించింది. ప్రస్తుతం క్రీజులో టేలర్‌తో పాటు మెకల్లమ్ (23 బంతుల్లో 11 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నాడు. ‘బోర్డర్’ను దాటిన చందర్‌పాల్ 86 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన చందర్‌పాల్ అద్భుత ఆటతీరుతో శతకం సాధించడమే కాకుండా టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆరో ఆటగాడిగానూ నిలిచాడు. ఈక్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ సాధించిన పరుగులను అధిగమించాడు. 156 టెస్టుల్లో బోర్డర్ 11,174 పరుగులు చేయగా... ప్రస్తుతం చందర్‌పాల్ 153 టెస్టుల్లో 11,199 పరుగులతో ఉన్నాడు. విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా 11,953 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. జట్టులో లారా ఉన్నప్పుడు చందర్‌పాల్ సగటు (101 టెస్టుల్లో) 44.60 ఉండగా తన చివరి 52 టెస్టుల్లో ఇది దాదాపు 70గా ఉండడం ఈ సీనియర్ ఆటగాడి జోరును చూపుతోంది. -
ఆదుకున్న రామ్‌దిన్, చందర్‌పాల్
హామిల్టన్: న్యూజిలాండ్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో వెస్టిండీస్ తడబడి కోలుకుంది. దినేశ్ రామ్‌దిన్ (148 బంతుల్లో 107; 18 ఫోర్లు) సెంచరీకి తోడు చందర్‌పాల్ (168 బంతుల్లో 94 బ్యాటింగ్; 10 ఫోర్లు) నిలకడను ప్రదర్శించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది. చందర్‌పాల్‌తో పాటు స్యామీ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. సెడాన్ పార్క్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కివీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్ ఓపెనర్లలో బ్రాత్‌వైట్ (45) ఓ మోస్తరుగా ఆడినా, పావెల్ (26) నిరాశపర్చాడు. ఓ దశలో 71/1 స్కోరుతో లంచ్‌కు వెళ్లిన విండీస్ ఆ తర్వాత కష్టాల్లో పడింది. 34 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి 86/5తో నిలిచింది. ఎడ్వర్డ్స్ (6), శామ్యూల్స్ (0), దేవ్‌నారాయణ్ (2) విఫలమయ్యారు.. అయితే రామ్‌దిన్, చందర్‌పాల్ సమయోచితంగా ఆడుతూ ఆరో వికెట్‌కు 200 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. కివీస్ పేలవ ఫీల్డింగ్ కారణంగా మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రామ్‌దిన్ కెరీర్లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. ఆట మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా అతను... అండర్సన్ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అండర్సన్ 3, సౌతీ 2, వాగ్నేర్ ఒక్క వికెట్ తీశారు.