ఆదుకున్న రామ్‌దిన్, చందర్‌పాల్ | Ramdin helps pull West indies back from the brink | Sakshi
Sakshi News home page

ఆదుకున్న రామ్‌దిన్, చందర్‌పాల్

Published Fri, Dec 20 2013 1:33 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

రామ్‌దిన్ - Sakshi

రామ్‌దిన్

హామిల్టన్: న్యూజిలాండ్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో వెస్టిండీస్ తడబడి కోలుకుంది. దినేశ్ రామ్‌దిన్ (148 బంతుల్లో 107; 18 ఫోర్లు) సెంచరీకి తోడు చందర్‌పాల్ (168 బంతుల్లో 94 బ్యాటింగ్; 10 ఫోర్లు) నిలకడను ప్రదర్శించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది. చందర్‌పాల్‌తో పాటు స్యామీ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. సెడాన్ పార్క్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కివీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్ ఓపెనర్లలో బ్రాత్‌వైట్ (45) ఓ మోస్తరుగా ఆడినా, పావెల్ (26) నిరాశపర్చాడు.
 

  ఓ దశలో 71/1 స్కోరుతో లంచ్‌కు వెళ్లిన విండీస్ ఆ తర్వాత కష్టాల్లో పడింది. 34 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి 86/5తో నిలిచింది. ఎడ్వర్డ్స్ (6), శామ్యూల్స్ (0), దేవ్‌నారాయణ్ (2) విఫలమయ్యారు.. అయితే రామ్‌దిన్, చందర్‌పాల్ సమయోచితంగా ఆడుతూ ఆరో వికెట్‌కు 200 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. కివీస్ పేలవ ఫీల్డింగ్ కారణంగా మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రామ్‌దిన్ కెరీర్‌లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. ఆట మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా అతను... అండర్సన్ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అండర్సన్ 3, సౌతీ 2, వాగ్నేర్ ఒక్క వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement