ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు యువ సంచలనం టాగెనరైన్ చంద్రపాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ టాగెనరైన్ చంద్రపాల్ ఎవరో కాదు.. విండీస్ దిగ్గజ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్ పెద్ద కుమారుడు.
చందర్‌పాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదరగొట్టాడు. 2021-22 వెస్టిండీస్ ఫోర్‌డే ఛాంపియన్ షిఫ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన టాగెనరైన్.. 439 పరుగలు చేసి అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 34.21 సగటుతో 2669 పరుగులు సాధించాడు. అతడు ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు టాగెనరైన్ రిజర్వ్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు. ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో విండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.
చదవండి: T20 WC 2022: కోహ్లి బ్యాటింగ్.. 'దేవుడే పాట పాడినంత మధురంగా'
Comments
Please login to add a commentAdd a comment