austarlia
-
ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆస్ట్రేలియా జట్టులోకి యువ సంచలనాలు!?
మెల్బోర్న్: ప్రధాన ఆటగాళ్ల గాయాలకు తోడు... ఆల్‌రౌండర్ స్టొయినిస్ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నెల 19 నుంచి పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఈ టోర్నీ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది. కాగా... ఇందులో రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు మరో పేసర్ జోష్ హాజల్‌వుడ్ గాయాల కారణంగా అధికారికంగా టోర్నీ దూరం కాగా... పేస్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ వెన్ను నొప్పి కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక మరో పేస్ ఆల్‌రౌండర్ స్టొయినిస్ అనూహ్యంగా వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ నెల 12 వరకు జట్లలో మార్పులు చేసుకునేందుకు ఐసీసీ గడువు ఇవ్వగా... ఆ్రస్టేలియా జట్టు దాదాపు కొత్త జట్టును ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్లో ఒకరు ఆసీస్ జట్టుకు సారథ్యం వహిస్తారని సీఏ వెల్లడించింది.‘కమిన్స్, హాజల్‌వుడ్, మార్ష్, అనుకోకుండా.. టోర్నీకి దూరమయ్యారు. ఐసీసీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఆ్రస్టేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ అని ఆ్రస్టేలియా జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ అన్నాడు.జట్టులోకి యువ ఆటగాళ్లు..ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతుండడంతో టోర్నీకి దూరమైన ఆటగాళ్ల స్ధానాలను భర్తీ చేసే పనిలో క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ పడింది. కమ్మిన్స్, హాజిల్‌వుడ్ స్ధానాల్లో యువ పేసర్లు జేవియర్ బార్ట్లెట్, స్పెన్సర్ జాన్సన్ పేర్లను జార్జ్ బెయిలీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకున్నారు. ఆసీస్ తరపున కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బార్టలెట్ 8 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జాన్సన్ కూడా ఆసీస్ తరపున రెండు వన్డేలు ఆడి వికెట్ ఏమీ సాధించలేదు. కానీ టీ20ల్లో మాత్రం అతడి పేరిట 14 వికెట్లు ఉన్నాయి. అదేవిధంగా మిచెల్ మార్ష్, స్టోయినిష్ స్ధానాల్లో కాపర్ కొన్నోలీ, బ్యూ వెబ్స్టర్లను ఎంపిక చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కాపర్ కొన్నోలీకి అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటికి దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్బుతమైన రికార్డు ఉంది. ఇటీవలే ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లోనూ కొన్నోలీకి చోటు దక్కింది. అతడికి బ్యాట్, బంతితో రాణించే సత్తాఉంది.మరోవైపు తన టెస్టు అరంగేట్రంలోనే ఆకట్టుకున్న బ్యూ వెబ్స్టెర్ను కూడా ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మీడియం పేస్ ఆల్‌రౌండర్ భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో సత్తాచాటాడు. ఆ తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లోనూ దుమ్ములేపాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా అప్డెటెడ్ జట్టు(అంచనా)అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జేవియర్ బార్ట్లెట్, ఆడమ్ జంపా, కాపర్ కొన్నోలీ, బ్యూ వెబ్స్టర్చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆసీస్‌కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025)కి ముందు ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) వెన్ను గాయం కారణంగా ఈ ఐసీసీ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో మార్ష్‌కు చోటు దక్కింది. ఇప్పుడు అతడి స్ధానాన్ని మరో ఆల్‌రౌండర్‌తో సెలక్టర్లు భర్తీ చేయనున్నారు.స్వదేశంలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఆరంభంలోనే తను వెన్ను నొప్పితో బాధపడుతున్నాని క్రికెట్ ఆస్ట్రేలియాకు మార్ష్ తెలియజేశాడు. దీంతో అతడిపై ఎక్కువ బౌలింగ్ లోడ్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ ఉంచలేదు. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ మార్ష్ తీవ్ర నిరాశపరిచాడు.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 73 పరుగులు చేశాడు. దీంతో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టుకు టీమ్ మెనెజ్‌మెంట్ అతడిపై వేటు వేసింది. అతడి స్ధానంలో బ్యూ వెబ్స్టార్కు చోటు ఇచ్చాడు. ఈ టాల్ ఆల్‌రౌండర్ తన అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బిగ్‌బాష్‌లోకి వెళ్లిన మార్ష్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోలుకోవడానికి బిగ్‌బాష్ లీగ్ చివరి మూడు మ్యాచ్‌లను మార్ష్ దాటేశాడు. అయినప్పటికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు."మిచెల్ మార్ష్ వెన్ను నొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఇటీవల కాలంలో అతడి నడుము నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని ఆస్ట్రేలియా సెలక్షన్ ప్యానల్ నిర్ణయించింది. అతడు కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టనున్నట్లు" క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా మార్ష్ ఐపీఎల్ ఫస్ట్‌హాఫ్‌కు కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. కాగా మార్ష్ స్ధానాన్ని వెబ్‌స్టెర్‌తో భర్తీ చేసే అవకాశముంది.ఛాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్ జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపాచదవండి: Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్! దారుణ వైఫల్యం -
ఆస్ట్రేలియాలో సోషల్‌మీడియా బ్యాన్.. వారికి నో లాగిన్
మెల్బోర్న్:సోషల్‌మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ఆంక్షలు విధించింది. తమ దేశంలో 16 ఏళ్లలోపు చిన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై నిషేధం విధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆస్ట్రేలియా దిగువసభ సుదీర్ఘచర్చ అనంతరం పాస్ చేసింది.పిల్లలు సోషల్‌మీడియా వాడకుండా నిషేధించడంపై దేశ ప్రధాని ఆంథోని అల్బనీస్ స్పందించారు.తమ దేశంలో పిల్లల భద్రత ప్రశ్నార్థకంలో పడకుండా సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్‌మీడియా నిషేధం బిల్లు పాసవ్వడంతో ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్,టిక్‌టాక్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలలో ఇక నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు లాగిన్ అవడానికి వీల్లేదు.ఈ మేరకు ఆయా ప్లాట్‌ఫాంలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.లేదంటే ఆయా కంపెనీలు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.ఈ నిషేధాన్ని జనవరి నుంచి ట్రయల్ పద్ధతిలో అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయి నిషేధం అమలులోకి రానుంది. -
అప్పట్లో ఆమెతో డేటింగ్.. ఆరోజు తన కారణంగా: యువీ
అద్బుత ప్రదర్శనలతో భారత్‌కు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఘనత అతడది. అంతర్జాతీయ టీ20ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన తొలి క్రికెటర్ అతడు. 17 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలు అందించిన ధీరుడు. క్యాన్సర్‌తో పోరాడి మరి గెలిచిన యోదుడు. జట్టు కష్టాల్లో ఉందంటే అందరికి గుర్తు వచ్చే సేవియర్. అటు బ్యాట్‌తోనూ ఇటు బంతితోనూ మాయ చేసే మేజిషేయన్. ఇప్పటకే మీకు ఆర్ధమై పోయింటుంది ఇదింతా ఎవరి కోసమో. అవును మీరు అనుకుంటుంది నిజమే. అతడే టీమిండియా దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్.సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను బయట ఎక్కువగా మాట్లాడని యువీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. గతంలో ఓ సినీ నటితో డేటింగ్ చేసినట్లు యువీ చెప్పుకొచ్చాడు. 2007-08లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్‌కు వెళ్లగా తనకు ఎదురైన అనుభవాలను ఈ పంజాబీ దిగ్గజం గుర్తుచేసుకున్నాడు."2007-08లో టెస్టు సిరీస్ కోసం ఆసీస్ పర్యటనకు వెళ్లాం. ఆ సమయంలో నేను ఒక నటితో డేటింగ్లో ఉన్నాను. నేను ఆమె పేరు చెప్పాలనుకోవడం లేదు. ఆ సమయంలో ఆమె టాప్ హీరోయిన్లో ఒకరిగా ఉంది. ఆమె కూడా షూటింగ్ పనిమీద అడిలైడ్‌కు వచ్చింది. మేము అప్పడు కాన్బెర్రాలో ఉన్నాం. కానీ నేను ఆమెతో ఫోన్లో ఒక మాట చెప్పాను. ఆసీస్ టూర్లో ఉన్నందున ఆటపై దృష్టి పెట్టాలనకుంటున్నాను, మనం ఎక్కువగా కలవద్దని ఆమెతో అన్నాను.కానీ ఆమె మాత్రం నా మాట వినకుండా కాన్‌బెర్రాకు వచ్చేసింది. నేను అప్పటికే తొలి రెండు టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోయాను. కాబట్టి మూడో మ్యాచ్‌లో ఎలాగైనా మెరుగ్గా రాణించాలన్న పట్టుదలతో ఉన్నాను. ఆ సమయంలో ఆమెను కాన్బెర్రాలో చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఏమి చేస్తున్నావు అని ప్రశ్నించాను. నేను మీతో సమయం గడపాలనుకుంటున్నాను ఆమె చెప్పింది. ఆ రోజు రాత్రి ఆమెను నేను కలిశాను. ఆమెతో చాలా విషయాలు మాట్లాడాను. నీవు నీ కెరీర్‌పై దృష్టి పెట్టు, నా కెరీర్‌పై కూడా నేను ఫోకస్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఆసీస్ పర్యటనలో ఉన్నాను. మాకు ఆ సిరీస్ చాలా ముఖ్యం. ఆ తర్వాత కాన్బెర్రా నుండి అడిలైడ్‌కి బయలు దేరుతున్నాము. ఆమె నా సూట్‌కేస్‌ను ప్యాక్ చేసింది. పొద్దున్న లేచే సరికి నా బూట్లు కన్పించలేదు. వెంటనే ఆమెను నా షూ ఎక్కడ ఉన్నాయి? అని అడిగాను, వాటిని కూడా ప్యాక్ చేసేశాను ఆమె చెప్పింది. మరి నేను బస్సులో ఎలా వెళ్లాలి అని ఆమెను ప్రశ్నించాను. నా స్లిప్పర్స్ ధరించండి అని ఆమె సలహా ఇచ్చింది. ఆమె మాటలు విన్న నేను ఓమైగాడ్ అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె దగ్గర ఉన్న పింక్ స్లిప్పర్లు వేసుకుని బస్సు దగ్గరకు వెళ్లాను.నా లగేజీ బ్యాగ్‌ను అడ్డుపెట్టుకుని కనిపించకుండా బస్ ఎక్కాను. కానీ సహచరుల్లో కొందరు చూసేశారు. నన్ను చప్పట్లు కొడుతూ ఆట పట్టించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో వేరే చెప్పులను కొనుకున్నాను. మా హోటల్ నుంచి విమానాశ్రయానికి పింక్ స్లిప్పర్స్‌ను ధరించవలిసి వచ్చింది" అని క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్లో యువీ పేర్కొన్నాడు. -
AUS vs SC: షాకింగ్.. థర్డ్ అంపైర్ లేకుండానే టీ20 సిరీస్
అంతర్జాతీయ క్రికెట్లో ఏదైనా మ్యాచ్‌కు సాధరణంగా ఇద్దరూ ఫీల్డ్ అంపైర్లతో పాటు ఓ థర్డ్ అంపైర్ కూడా బాధ్యతలు నిర్వరిస్తారు. ఈ విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలుసు. కానీ ఓ ఇంటర్ననేషనల్ సిరీస్ థర్డ్ అంపైర్ లేకుండానే జరుగుతోంది. అవును మీరు విన్నది నిజమే.ఎడిన్బర్గ్ వేదికగా ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు థర్డ్ అంపైర్ ఎవరూ లేరు. థర్డ్ అంపైర్‌తో పాటు డీఆర్ఎస్ కూడా అందుబాటులో లేదు. థర్డ్ అంపైర్ అందుబాటులో లేకపోవడంతో రనౌట్, స్టంపౌట్‌లపై ఫీల్డ్ అంపైర్లదే తుది నిర్ణయం.మూడో అంపైర్ లేకపోవడంతో రెండో టీ20లో ఆసీస్ బ్యాటర్ ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు కలిసొచ్చింది. మెక్‌గర్క్ స్టంపౌట్ ఔటైనప్పటకి ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించిడంతో మెక్‌గర్క్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.అయితే ఆస్ట్రేలియా వంటి వరల్డ్‌క్లాస్ జట్టు ఆడుతున్న సిరీస్‌కు థర్డ్ అంపైర్ లేకపోవడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక వరుసగా రెండు టీ20ల్లో ఘన విజయం సాధించిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.చదవండి: AUS vs SCO: జోష్ ఇంగ్లిస్ రికార్డు సెంచరీ.. ఆసీస్ సిరీస్ విజయం -
ఏకైక టెస్టు.. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
భారత మహిళల ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా పర్యటను ఓటమితో ముగించింది. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఆసీస్‌తో చేతిలో భారత్ ఓటమి పాలైంది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 243 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బ్యాటర్లలో ఉమన్ ఛెత్రి 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియా పునియా(36), శుభా సతీష్(45) పరుగులతో తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ఫ్లింటాఫ్, నాట్ తలా మూడు వికెట్టు పడగొట్టారు. అంతకుముందు ఆ్రస్టేలియా ‘ఎ’ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌటైంది. మ్యాడీ డార్క్ (197 బంతుల్లో 105 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డి బ్రోగే(58) పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో మిన్నుమణి 6 వికెట్లు తీయగా, సయాలీ, ప్రియా మిశ్రా చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 28 పరుగులు కలుపుకొని భారత్ ముందు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమైంది. -
షేన్ వార్న్ నా హీరో.. ఇప్పటికీ నేను బాధపడుతునే ఉన్నా: కుల్దీప్
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ శుక్రవారం ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ని సందర్శించాడు. ఈ సందర్భంగా ఏంసీజీలో ఏర్పాటు చేసిన దివంగత ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ విగ్రహం ముందు కుల్దీప్ నివాళులర్పించాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను కుల్దీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేశాడు. షేన్ వార్న్ బౌలింగ్‌లో ఎప్పటికి ఒక అద్భుతం అంటూ కుల్దీప్ క్యాప్షన్‌గా ఇచ్చాడు. అదే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడిన కుల్దీప్.. వార్న్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు."షేన్ వార్న్ నా ఆరాధ్య క్రికెటర్. షేన్ నా హీరో. అతడితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. వార్నీని గుర్తుచేసుకునే ప్రతీసారి నేను భావోద్వేగానికి లోనవుతాను. నా కుటుంబంలోని ఒకరిని నేను కోల్పోయినట్లు ఇప్పటికీ అనిపిస్తుందని" కుల్దీప్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పేర్కొన్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అనంతరం అతడు దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని టీమ్ Aకు కుల్దీప్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆ తర్వాత వరుస టెస్టు సిరీస్‌లతో కుల్దీప్ బీజీబీజీగా గడపనున్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో కుల్దీప్ది కీలక పాత్ర. -
వారసుడిని ప్రకటించిన డేవిడ్ వార్నర్.. ఆసీస్ కొత్త ఓపెనర్ ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రయాణం ముగిసింది. ఇప్పటికే వన్డేలకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. ఇప్పుడు టీ20ల నుంచి తప్పుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో అఫ్గానిస్తాన్- బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇదివరకే టీ20 వరల్డ్‌కప్ అనంతరం తన రిటైర్ అవుతానని వార్నర్ ప్రకటించేశాడు. దీంతో తన చివరి మ్యాచ్‌ను వార్నర్ భారత్‌పై ఆడేశాడు. ఇక వార్నర్ తన వారసుడిగా ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌ను ప్రకటించాడు. ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న వార్నర్ జేక్ ఫ్రేజర్-మెక్గర్క్తో కలిసి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు."ఇక నుంచి అంతా నీదే ఛాంపియన్ అంటూ" వార్నర్ క్యాప్షన్‌గా ఇచ్చాడు. కాగా మెక్‌గర్క్‌కు టీ20 వరల్డ్‌కప్ ప్రధాన జట్టులో చోటు దక్కకపోయినప్పటికి బ్యాకప్ ఓపెనర్‌గా రిజర్వ్‌లో ఉన్నాడు. మెక్‌గర్క్ కూడా ప్రస్తుతం ఓపెనర్‌గా సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఫ్రెజర్.. 9 మ్యాచ్‌ల్లో 230 పరుగులు చేశాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో ట్రావిస్ హెడ్‌తో కలిసి మెక్‌గర్క్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. ఇక ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8786, 6932, 3277 పరుగులు సాధించాడు. వార్నర్ ఇక పై ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నాడు. David Warner passes the baton to Jake Fraser-McGurk 💛📸: David Warner pic.twitter.com/VwCFtjvIX0— CricTracker (@Cricketracker) June 25, 2024 -
ఇది మా దేశం గర్వించదగ్గ విజయం.. అతడొక అద్బుతం: రషీద్ ఖాన్
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా జైత్ర యాత్రకు అఫ్గానిస్తాన్ బ్రేక్‌లు వేసింది. కింగ్స్టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ను 21 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. దీంతో 2023 వన్డే ప్రపంచకప్‌లో ఓటమికి అఫ్గాన్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 150 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని అఫ్గాన్ బౌలర్లు కాపాడుకున్నారు. లక్ష్య చేధనలో అఫ్గాన్ బౌలర్ల దాటికి ఆసీస్ 127 పరుగులకే చాపచుట్టేసింది. అఫ్గాన్ మీడియం పేసర్ గుల్బాదిన్ నైబ్ 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. నవీన్ ఉల్హక్ మూడు వికెట్లు, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నబీ ఒక్క వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఈ విజయంతో అఫ్గాన్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. ఆసీస్ వంటి పటిష్ట జట్టుపై విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని రషీద్ తెలిపాడు."ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం. ఆసీస్ వంటి పెద్ద జట్టుపై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా దేశం గర్వించదగ్గ సందర్భం. మాకు కూడా ఒక జట్టుగా చాలా గర్వంగా ఉంది. ప్రత్యర్ది బౌలింగ్ లైనప్‌ను బట్టి మా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేస్తున్నాము. అందుకే ప్రతీ మ్యాచ్‌లోనూ ఒకే ప్లేయింగ్ ఎలెవన్‌తో ఆడలేకపోతున్నాము. కింగ్స్ టౌన్ పిచ్‌పై 140 పరుగులు మంచి స్కోర్‌గా భావించవచ్చు. మాకు బ్యాటింగ్‌లో మంచి ఆరంభం వచ్చింది. కానీ మేము ఫినిషింగ్ మాత్రం సరిగ్గా చేయలేకపోయాం. ఆఖరికి ప్రత్యర్ధి ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచాము. ఈ టార్గెట్‌ను ఎలాగైనా డిఫెండ్ చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగాం. అందుకు తగ్గట్టే మా బాయ్స్ అదరగొట్టారు. మా జట్టు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎక్కువ మంది ఆల్రౌండర్లను కలిగి ఉండటం జట్టుకు కలిసొచ్చింది. ఇక నైబ్ ఒక అద్బుతం. అతడి వల్లే ఇదింతా. నైబ్కు ఉన్న అనుభవాన్ని మొత్తం ఈ మ్యాచ్‌లో చూపించాడు. అదే విధంగా నవీన్,నబీ కూడా అద్బుమైన ప్రదర్శన కనబరిచారు. మా తదుపరి మ్యాచ్‌లో ఇదే జోరును కొనసాగిస్తామని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. -
టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం.. ఆసీస్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్
టీ20 వరల్డ్‌కప్-2024లో పెను సంచలనం నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సూపర్-8 మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై 21 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది.ఈ విజయంతో తమ సెమీస్ ఆశలను అఫ్గానిస్తాన్ సజీవంగా ఉంచుకుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. అఫ్గానిస్తాన్ బౌలర్ల దాటికి 127 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో క్రీజులో మాక్స్వెల్ ఉన్నప్పుడు ఆసీస్‌దే విజయమని అంతా భావించారు. కానీ అఫ్గాన్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్.. మాక్సీని ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో నైబ్ తన 4 ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. నైబ్‌తో పాటు నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మాక్స్వెల్(59) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్(60), ఇబ్రహీం జద్రాన్(51) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 3 వికెట్లు పడగొట్టగా.. జంపా రెండు, స్టోయినిష్ ఒక్క వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన కమ్మిన్స్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఆస్ట్రేలియా స్టార్ పేసర్, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా కింగ్స్టౌన్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన కమ్మిన్స్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.తొలుత 18వ ఓవర్ వేసిన కమ్మిన్స్ ఆఖరి బంతికి అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ 20 ఓవర్ వేసిన కమ్మిన్స్.. వరుస బంతుల్లోకరీం జనత్, గుల్బాదిన్ నైబ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.అంతకముందు ఇదే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. దీంతో వరల్డ్‌కప్ చరిత్రలోనే రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. అదేవిధంగా మరో కొన్ని రికార్డులను కూడా కమ్మిన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.కమ్మిన్స్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు.అంతర్జాతీయ టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాతో లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్ సౌతీ (న్యూజిలాండ్), మార్క్ పావ్లోవిక్ (సెర్బియా), వసీం అబ్బాస్ (మాల్టా), పాట్ కమ్మిన్స్ (ఆసీస్) ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన ఆడమ్ జంపా.. తొలి ఆసీస్ ప్లేయర్‌గా రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అదరగొడుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం పసికూన నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో జంపా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో నమీబియా బ్యాటర్లను జంపా తన మయాజాలంతో ముప్పుతిప్పులు పెట్టాడు. జంపా తన 4 ఓవర్ల కోటాలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జంపా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి ఆస్ట్రేలియా బౌలర్‌గా జంపా రికార్డులకెక్కాడు. నమీబియా బ్యాటర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ను అవుట్ చేయడంతో జంపా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకు 83 మ్యాచ్‌లు ఆడిన జంపా.. 100 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన జంపా 8 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నమీబియాను 9 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 5.4 ఓవర్లలో ఛేదించింది. -
ఆసీస్ యువ సంచలనానికి లక్కీ ఛాన్స్.. వరల్డ్‌కప్ జట్టులో చోటు!?
ఐపీఎల్-2024లో ఆస్ట్రేలియా యువ సంచలనం, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన మెక్‌గర్క్ టోర్నీ ఆసాంతం అదరగొట్టాడు. ఈ ఏడాది సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గర్క్.. 234.04 స్ట్రైక్ రేటుతో 330 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అతడికి ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌నకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టులో మెక్‌గర్క్‌కు చోటు దక్కలేదు.కనీసం రిజర్వ్ జాబితాలో కూడా జేక్ ఫ్రేజర్‌కు అవకాశం ఇవ్వలేదు. సెలక్టర్ల నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఆసీస్ సెలక్టర్లు ఇప్పుడు తమ మనసును మార్చుకున్నట్లు తెలుస్తోంది. జేక్ ఫ్రేజర్‌ను టీ20 వరల్డ్‌కప్‌నకు రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేయాలని ఆసీస్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు ఆసీస్ మీడియా వర్గాలు వెల్లడించాయి.ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్‌కు బ్యాకప్‌గా మెక్‌గర్క్‌ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జాన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఒమెన్తో తలపడనుంది.టీ20 ప్రపంచ కప్‌నకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్. జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. -
LSG Vs DC: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్?
ఆస్ట్రేలియా యువ సంచలనం, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌తో క్యాష్‌రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టిన మెక్‌గుర్క్.. తన ఆట తీరుతో అందరని ఆకట్టుకున్నాడు. వార్నర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మెక్‌గుర్క్ లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. జేక్ ఫ్రేజర్- తను ఎదుర్కొన్న రెండో బంతినే అద్భుతమైన సిక్స్‌గా మలిచాడు. క్రీజులో ఉన్నంత సేపు లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా లక్నో స్పిన్నర్ కృనాల్ పాండ్యాను ఓ ఆట ఆడేసుకున్నాడు. 13 ఓవర్ వేసిన పాండ్యా బౌలింగ్‌లో మెక్‌గుర్క్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. ఓవరాల్‌గా బంతులు ఎదుర్కొన్న ఈ యువ సంచలనం.. 2 ఫోర్లు ,5 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ నెటిజనక్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్? 22 ఏళ్ల మెక్‌గుర్క్ ఏప్రిల్ 11, 2002న ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించాడు. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో విక్టోరియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2019లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి జేక్ అడుగుపెట్టాడు. అదే ఏడాది లిస్ట్-ఏ క్రికెట్లో అడుగుపెట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లోకి అదరగొట్టడంతో అతడికి బిగ్‌బాష్‌లో లీగ్ ఆడే అవకాశం వచ్చింది. బిగ్‌బాష్ లీగ్-2020 సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 37 టీ20 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్ 645 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 550 పరుగులు, లిస్ట్-ఏ క్రికెట్లో 525 పరుగులు మెక్‌గుర్క్ చేశాడు. అయితే జేక్ గతేడాదిలో లిస్ట్-ఏ క్రికెట్లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా దేశీవాళీ వన్డే టోర్నీలో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. తద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆటగాడిగా అతడు రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో ఈ ఏడాది వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో మెక్‌గుర్క్ ఆసీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో కూడా అతడు ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మెక్‌గుర్క్ ఐపీఎల్-2024 వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోవడంతో మెక్‌గుర్క్‌కు క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగమయ్యే అవకాశం దక్కింది. రూ. 50 లక్షల బేస్ ప్రైస్‌కు మెక్గార్క్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. బ్రూక్ స్ధానాన్ని ఈ యువ కెరటంతో ఢిల్లీ భర్తీ చేసింది. Maiden IPL FIFTY for Jake Fraser-McGurk on DEBUT! Hat-trick of sixes in this thoroughly entertaining knock 💥💥💥 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvDC pic.twitter.com/0hXuBkiBr3 — IndianPremierLeague (@IPL) April 12, 2024 -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. డేవిడ్ వార్నర్‌కు గాయం!
న్యూజిలాండ్‌తో మూడో టీ20కు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మూడో టీ20కు దూరమయ్యాడు. వార్నర్ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండో టీ20కు విశ్రాంతి తీసుకున్న వార్నర్.. ఇప్పుడు మూడో టీ20 నుంచి సైతం తప్పుకున్నాడు. ఈ మెరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన విడుదల చేసింది. "వార్నర్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అతడు కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది. అయితే అతడు కచ్చితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 వరల్డ్‌కప్‌కు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని" క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటనలో పేర్కొంది. కాగా కివీస్‌తో జరిగిన తొలి టీ20లో వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వార్నర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్లో రిషబ్ పంత్ గైర్హజరీలో ఢిల్లీ జట్టును డేవిడ్ భాయ్ ముందుండి నడిపించాడు. చదవండి: IND vs ENG: అయ్యో.. ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్ శర్మ! వీడియో వైరల్ -
ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! యువ క్రికెటర్‌కు ఛాన్స్
స్వదేశంలో ఆస్ట్రేలియాపై చారిత్రత్మక విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే, టీ20 తలపడేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే వైట్ బాల్ సిరీస్‌లకు భారత జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ రెండు సిరీస్‌లలోనూ భారత జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ నడిపించనుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బౌలర్ శ్రేయాంక పాటిల్‌కు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సైకా ఇషాక్‌కు కూడా ఆసీస్‌తో వన్డే, టీ20 జట్లలో సెలక్టర్లు అవకాశం కల్పించారు. మరోవైపు 20 ఏళ్ల మన్నత్ కశ్యకు వన్డే, టీ20 జట్టుల్లో అవకాశం దక్కింది. డిసెంబర్ 28న వాంఖడే వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు టీమిండియా ఆడనుంది. వన్డే సిరీస్ వాంఖడే వేదికగా జరగనుండగా.. టీ20 సిరీస్ డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. భారత మహిళల వన్డే జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, హర్లీన్ డియోల్ భారత మహిళల టీ20 జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా! -
ప్రమాదకరంగా మారిన పిచ్.. 6 ఓవర్ల తరువాత మ్యాచ్ రద్దు! వీడియో వైరల్
ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్-2023లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గిలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో ఆదివారం మెల్ బోర్న్ రెనిగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను పిచ్ సమస్య కారణంగా రద్దు చేశారు. ఏమి జరిగిందంటే? ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ రెండో బంతికే స్టీపెన్ (0)ను టామ్ రోజర్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వెంటనే మరో ఓపెనర్ కూపర్ కొన్నోలీ(6) కూడా పెవిలియన్‌కు చేరాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలో పెర్త్ స్కాచర్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన విల్ సదర్లాండ్ బౌలింగ్‌లో మొదటి మూడు బంతులు మరీ ఎక్కువగా బౌన్స్ అయ్యాయి. బ్యాటర్లతో సహా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పెర్త్ స్కార్చర్స్ బ్యాటర్లు పరిస్థితిని అంపైర్లు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అంపైర్లు.. ఇరు జట్ల సారథులతో చర్చించి మ్యాచ్‌ను అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి గిలాంగ్ లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కవర్స్ లీక్ అయ్యి నీరు పిచ్ పై చేరి ఉంటుందని, అందుకే బంతి ఎక్కువగా బౌన్స్ అయిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Here's the delivery that prompted the discussions. Quinton de Kock's reaction 🫢 #BBL13 pic.twitter.com/1Tbq5YRjnq — KFC Big Bash League (@BBL) December 10, 2023 -
పాకిస్తాన్‌తో తొలి టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! సీనియర్ ఆటగాడు ఎంట్రీ
స్వదేశంలో పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 14 నుంచి పెర్త్ వేదికగా పాకిస్తాన్- ఆసీస్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి టెస్టుకు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ పేసర్ లాన్స్ మోరిస్‌కు చోటు దక్కింది. అంతేకాకుండా గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ తిరిగి వచ్చాడు. లియోన్ తిరిగి రావడంతో యవ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి తొలి టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఇక ఈ టెస్టు సిరీస్‌కు కోసం పాకిస్తాన్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, మిచ్ మార్ష్, లాన్స్ మోరిస్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ పాకిస్థాన్ టెస్టు జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహీన్ షా అఫ్రిది చదవండి: పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం.. సల్మాన్ భట్‌పై వేటు -
ఇదేమి బుద్దిరా బాబు.. ఔటైనా గ్రౌండ్లో నుంచి వెళ్లలేదు! వీడియో వైరల్
ఆస్ట్రేలియా దేశీవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ 2023-24లో భాగంగా ఆడిలైడ్ వేదికగా విక్టోరియా- సౌత్ ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విక్టోరియా బ్యాటర్ పీటర్ హ్యాండ్‌కాంబ్ ఔటైనప్పటికీ మైదానం నుంచి బయటకు వెళ్లేందుకు సముఖత చూపలేదు. ఏం జరిగిందంటే? విక్టోరియా ఇన్నింగ్స్ 13 ఓవర్లో తొలి బంతిని సౌత్ ఆస్ట్రేలియా బౌలర్ బెన్ డగెట్ అద్బుతమైన అవుట్ స్వింగర్‌గా సంధించాడు. ఈ క్రమంలో హ్యాండ్‌కాంబ్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకుని థర్డ్ స్లిప్‌లో ఉన్న జేక్ లెమాన్ చేతికి వెళ్లింది. దీంతో బౌలర్‌తో పాటు సౌత్ ఆస్ట్రేలియా ఫీల్డర్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. అయితే హ్యాండ్‌కాంబ్ మాత్రం అది క్యాచ్ కాదు, నాటౌట్ అని మైదానం విడిచి వెళ్లనని పట్టుబట్టాడు. రిప్లేలో క్లియర్‌గా క్యాచ్‌ను అందుకున్నట్లు తేలినప్పటికి హ్యాండ్‌కాంబ్ మైదానం నుంచి బయటకు వెళ్లకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. ఆఖరికి ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకుని అతడి దగ్గరకు వెళ్లి మాట్లాడి ఫీల్డ్ నుంచి బయటకు పంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఇదేమి బుద్దిరా బాబు.. అదేమైనా గల్లీ క్రికెట్ అనుకున్నావా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా -
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా నవంబర్ 4న ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు దూరమయ్యాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టు తప్పి పడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో అక్టోబర్ 28న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో తలపడిన సంగతి తెలిసిందే. అయితే తమ తర్వాతి మ్యాచ్‌కు నాలుగు రోజుల సమయం ఉండడంతో ఆసీస్ ఆటగాళ్లు ధర్మశాలలోనే ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు గోల్ప్ ఆడుతుండగా గాయ పడ్డాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం వెనుక నుండి జారి పడడంతో తలకు గాయమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. దీంతో కంకషన్ ప్రోటోకాల్స్ రూల్స్ ప్రకారం మ్యాక్సీ దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు పాటు వైద్యుల పర్యవేక్షణలో వుండనున్నాడు. కాగా మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడని, సెమీఫైనల్స్‌కు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా మ్యాక్సీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ(44 బంతుల్లో 106 పరుగులు) మ్యాక్స్‌వెల్ బాదాడు. చదవండి: CWC 2023: సూర్యకుమార్ యాదవ్‌కు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన అభిమాని -
కంగారెత్తించే కంగారులకు ఏమైంది? తిరిగి గాడిలో పడేనా?
వన్డే ప్రపంచకప్ 2023లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా. తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. 5 సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆసీస్ జట్టు.. పసికూన కంటే దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ అంటే వార్ వన్ సైడే అని భావించేవారు. కానీ ఇప్పడు పరిస్థితి మరోలా ఉంది. భారత్ చేతిలో తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైన కంగారులు.. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఘోర పరభావం మూటకట్టుకుంది. సఫారీల దెబ్బకు ఆసీస్ జట్టు విలావిల్లాడింది. ఏకంగా 134 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 311 పరుగుల భారీ లక్ష్య చేధనలో కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. వరల్డ్‌కప్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఎందుకు ఈ స్ధాయికి దిగజారింది? కంగారులు ఎక్కడ తప్పుచేస్తున్నారు? తర్వాత మ్యాచ్‌ల్లో కమ్మిన్స్ సేన తిరిగి పుంజుకుంటుందా వంటి విషయాలను ఓసారి చర్చిద్దాం. ఓపెనర్లు విఫలం.. ఆస్ట్రేలియాకు బౌలింగ్ ఎంత బలమో.. బ్యాటింగ్ కూడా అంతే బలం. 300 పరుగుల టార్గెట్ కూడా ఆసీస్ బ్యాటింగ్ జోరు ముందు చిన్నబోయేది. అటువంటి ఆస్ట్రేలియా ఈ వరల్డ్‌కప్‌లో 200 పరుగుల మార్క్‌ను అందుకోవడానికి కూడా నానా కష్టాలు పడుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఓపెనర్లు విఫలం. ఈ మెగా టోర్నీకి ఆసీస్ రెగ్యూలర్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ గాయం కారణంగా దూరమయ్యాడు. హెడ్ లేని లోటు ఆసీస్ జట్టులో స్పష్టంగా కన్పిస్తోంది. హెడ్ గైర్హాజరీలో ఆసీస్ ఇన్నింగ్స్‌ను మిచెల్ మార్ష్.. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఆరంభిస్తున్నాడు. ఓపెనర్‌గా వస్తున్న మార్ష్ కనీసం ఒకట్రెండు ఓవర్లు కూడా క్రీజులో ఉండలేకపోతున్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన మార్ష్.. ప్రోటీస్‌పై కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కాస్త పర్వాలేదనపిస్తున్నాడు. టీమిండియాపై 41 పరుగులతో రాణించిన వార్నర్.. దక్షిణాఫ్రికాపై మాత్రం 13 పరుగులకే తమ ఇన్నింగ్స్‌ను ముగించాడు. అయితే ఇది వార్నర్ నుంచి ఆశించిన ప్రదర్శన కాదు. తర్వాతి మ్యాచ్‌లో ఆసీస్ తిరిగి గాడిలో పడాలంటే ఓపెనింగ్ జోడిని మార్చాలిందే. మరో వికెట్ కీపర్ లేడా? ప్రస్తుత ఆస్ట్రేలియాతో జట్టులో సమర్థవంతమైన వికెట్ కీపర్ బ్యాటర్ లేడు. ఒకప్పుడు ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఇయాన్ హీలీ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఆసీస్.. ఇప్పుడు ఆ స్ధాయి కీపర్లను తయారుచేయలేకపోతుంది. వికెట్ కీపర్ అంటే.. వికెట్ల వెనుక మెరుగ్గా రాణిస్తే చాలు అన్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరిస్థితి ఉంది. ప్రస్తతం ఆసీస్ జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా అలెక్స్ కారీ కొనసాగుతున్నాడు. వికెట్లు వెనుక పర్వాలేదనపిస్తున్న కారీ.. బ్యాటింగ్ పరంగా తీవ్ర నిరాశపరిస్తున్నాడు. జట్టుకు కీలకమైన మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తున్న అతడు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమవుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే కారీ పెవిలియన్‌కు చేరాడు. దీంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు క్యారీ ఆసీస్ జట్టు మేనెజ్మెంట్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో జోష్ ఇంగ్లీష్ జట్టులోకి వచ్చాడు. జోష్ ఇంగ్లీష్ కూడా అదే తీరును కనబరిచాడు. 5 పరుగులకే తన ఇన్నింగ్స్‌ను జోష్ ముగించాడు. కచ్చితంగా వీరిద్దరి ప్రత్యామ్నాయం వెతకాల్సిన సమయం క్రికెట్ ఆస్ట్రేలియాకు అసన్నమైంది. ఫినిషింగ్ లేదు.. ఆస్ట్రేలియా అంటే విధ్వంసకర ఆటకు మారుపేరు. అటువంటిది ప్రస్తుత మెగా టోర్నీలో ఆసీస్ ఆటగాళ్ల బ్యాట్లు మూగబోయాయి. సిక్స్‌లు మాట పక్కన పెడితే ఫోర్లు కూడా కొట్టడానికి కష్టపడుతున్నారు. టాపర్డర్‌లో వార్నర్.. మిడిలార్డర్లో స్మిత్, లాబుషేన్ కొన్ని మంచి ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ ఆసీస్‌కు ఫినిషింగ్ మాత్రం దొరకడంలేదు. వరల్డ్ క్రికెట్లో విధ్వంసకర ఆటగాళ్లగా పేరు గాంచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, గ్రీన్, స్టోయినిష్ తుస్సుమనిపిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో గ్రీన్, మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సఫారీలతో మ్యాచ్‌కు గ్రీన్ స్ధానంలో స్టోయినిష్కు అవకాశం ఇచ్చారు. స్టోయినిష్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్‌ది కూడా అదే పరిస్ధితి. బౌలింగ్‌లో పర్వాలదేనపిస్తున్న మ్యాక్సీ.. బ్యాటింగ్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ హిట్టర్లు తిరిగి గాడిలో పడకపోతే ఈ మెగా టోర్నీలో ఆసీస్ ఇంటిముఖం పట్టకతప్పదు. జంపా ఫెయిల్.. ఆసీస్ బౌలింగ్ పరంగా కాస్త పర్వాలేదనపిస్తుంది. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి కష్టాలోక్కి నెట్టారు. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు తమ రిథమ్‌ను కోల్పోవడంతో టీమిండియా విజేతగా నిలిచింది. హాజిల్‌వుడ్, స్టార్క్, కమ్మిన్స్ వంటి తమ స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేస్తున్నారు. కానీ కంగారుల ఫ్రంట్ లైన్ స్పిన్నర్ ఆడమ్ జంపా మాత్రం తీవ్ర నిరాశపరిస్తున్నాడు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్న జంపా.. పరుగులు భారీగా సమర్పించుకుంటున్నాడు. చెత్త ఫీల్డింగ్.. ఆస్ట్రేలియా క్రికెటర్లు మైదానంలో చాలా చురుగ్గా ఉంటారు. ఎన్నో అద్బుత క్యాచ్‌లను అందుకోవడం మనం చూశాం. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఫీల్డింగ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచింది. 4 ఈజీ క్యాచ్‌లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రాప్ చేశారు. అంతేకాకుండా మిస్ ఫీల్డ్‌లు కూడా చాలా చేశారు. శ్రీలంకతో.. ఆసీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 16న శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి మూడు విభాగాల్లో తిరిగిపుంజుకోవాలి. అయితే శ్రీలంక బ్యాటింగ్ పరంగా దుమ్మురేపుతోంది.కాబట్టి శ్రీలంకనుంచి కూడా ఆసీస్‌కు గట్టిపోటి ఎదునుకానుంది. చదవండి: WC 2023: దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి.. 48 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు -
వన్డేల్లో నెం1 జట్టుగా ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి
అంతర్జాతీయ వన్డేల్లో ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్ వన్‌గా జట్టుగా అవతరించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్ధానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికాతో 5 టీ20 సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో విజయం సాధించిన ఆసీస్.. పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. వన్డే ర్యాంకింగ్స్‌లో 121 రేటింగ్‌తో ఆసీస్ ఆగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్ 120 రేటింగ్‌తో రెండో స్ధానంలో ఉంది. ఇక భారత జట్టు 114 రేటింగ్‌తో మూడో ర్యాంక్‌లో ఉంది. కాగా ఆసియాకప్ సూపర్-4లో భాగంగా భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఆదివారం జరగనుండడంతో మళ్లీ ర్యాంక్‌లు తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది. వార్నర్, లబుషేన్ సెంచరీలు ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై 123 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. డేవిడ్ వార్నర్(106), లబుషేన్(124) సెంచరీలతో చెలరేగగా.. హెడ్(64), జోష్ ఇంగ్లీష్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ షమ్సీ నాలుగు వికెట్లు సాధించగా.. రబాడ రెండు, మార్కో జానెసన్ వికెట్ పడగొట్టారు. 393 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 41.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లతో చెలరేగాడు. చదవండి: కోహ్లితో ఎక్కువ మాట్లాడకండి.. అతడిని ఎలా అయినా ఔట్ చేయాలి: అక్తర్ -
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ విధ్వంసం... ఓకే ఓవర్లో 5 సిక్స్‌లు! వీడియో వైరల్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అడితో ఏ మాత్రం పవర్ తగ్గలేదు. ఫించ్ ప్రస్తుతం యూఎస్ మాస్టర్ లీగ్‌లో కాలిఫోర్నియా నైట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం న్యూజెర్సీ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 31 బంతుల్లో 8 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫించ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తన జట్టు మాత్రం 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. కాలిఫోర్నియా బ్యాటర్లలో ఫించ్‌తో పాటు మిలాంద్ కుమార్(27) పరుగులతో రాణించాడు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజెర్సీ లెజెండ్స్ 4 వికెట్లు కోల్పోయి 9.4 ఓవర్లలో ఛేదించింది. న్యూజెర్సీ బ్యాటర్లలో టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులు చేసి న్యూజెర్సీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు నమాన్ ఓజా(25) పరుగులతో రాణించాడు. చదవండి: MS Dhoni- Rohit: ఆరోజు రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు.. వెంటనే కోచ్ కూడా! మేమేం చేయలేకపోయాం.. Why we call him the Aaronator 👊 Take a bow @AaronFinch5 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣#USMastersT10 #NJTvCK #SunshineStarsSixes#CricketsFastestFormat #T10League pic.twitter.com/NUdccQxuKq — US Masters T10 (@USMastersT10) August 21, 2023 -
ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు!
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023 కోసం ఆస్ట్రేలియా తమ సన్నాహాకాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌కు 18 మంది సభ్యులతో కూడిన ప్రిలిమనరీ(ప్రాథమిక) జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ సారధ్యం వహించనున్నాడు. ఇదే జట్టు ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా, భారత పర్యటనలకు వెళ్లనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ జట్టులో స్టార్ ఆటగాడు మార్నస్ లబుషేన్‌కు చోటు దక్కక పోవడం గమానార్హం. అదే విధంగా యువ ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ,స్పిన్నర్ తన్వీర్ సంగాకు తొలిసారి ఆసీస్ జట్టులో చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న వీరిద్దరని వరల్డ్‌కప్ ప్రిలిమనరీ జట్టులో సెలక్టర్లు భాగం చేశారు. కాగా వన్డే ప్రపంచకప్‌కు ముందు కంగారు జట్టు 8 వన్డేలు ఆడనుంది. తొలుత దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌లో తలపడనున్న ఆస్ట్రేలియా.. అనంతరం టీమిండియాతో మూడు వన్డేలు ఆడనుంది. . సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత్-ఆసీస్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ప్రపంచకప్‌లో భాగమయ్యే జట్లు తమ 15 మంది సభ్యుల వివరాలను సెప్టెంబర్5 లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ నేపథ్యంలో ప్రోటీస్ పర్యటనకు వెళ్లే ముందు ఆసీస్ 15 మంది సభ్యులను ఖారారు చేసే అవకాశం ఉంది. ఇక ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న టీమిండియాతో తలపడనుంది. వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘా , ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్. చదవండి: IND vs WI: ఏంటి బ్రో ఆట మర్చిపోయావా..? ఐపీఎల్‌లోనే ఆడుతాడు! అక్కడ పనికిరాడు -
చివరి బంతికి సిక్స్.. వికెట్ కూడా! వారెవ్వా బ్రాడీ! వీడియో వైరల్
40 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన యాషెస్ సిరీస్‌కు ఎండ్ కార్డ్ పడింది. లండన్ వేదికగా జరిగిన యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. అయితే గత సిరీస్‌ను గెలిచిన ఆసీస్ వద్దే ‘యాషెస్’ ఉండిపోనుంది. ఇక ఆఖరి రోజు 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 135/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా 94.4 ఓవర్లలో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖ్వాజా(72), డేవిడ్ వార్నర్(60), స్టీవ్ స్మిత్(54) పరుగులతో రాణించినప్పటికీ.. ఓటమి మాత్రం తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మొయిన్ అలీ మూడు, బ్రాడ్ రెండు వికెట్లు సాధించారు. కెరీర్లో చివరి వికెట్ ఇక ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన టెస్టు కెరీర్‌కు చిరస్మణీయ ముగింపు పలికాడు. తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన బ్రాడ్.. రెండు కీలక వికెట్లు పడగొట్టి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. క్రీజులో పాతుకుపోయిన ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీని ఔట్ చేసి.. చారిత్రత్మక యాషెస్ సిరీస్‌ను సమం చేశాడు. ఆస్ట్రేలియా ఆఖరి రెండు వికెట్లు కూడా బ్రాడ్ సాధించినవే కావడం గమానార్హం. కాగా బ్రాడ్ ఫేర్వెల్ మ్యాచ్ చూడటానికి అతడి కుటంబ సభ్యులు స్టేడియంకి వచ్చారు. బ్రాడ్ తన కెరీర్ చివరి వికెట్ సాధించిగానే.. స్టాండ్స్‌లో ఉన్న అతడి కుటంబ సభ్యులు ఆనందంలో మునిగి తెలిపోయారు. కాగా అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లోఆఖరి బంతిని బ్రాడ్ అద్భుతమైన సిక్సర్ మలిచాడు. అదే అతడి కెరీర్లో చివరి బంతి కావడం గమానర్హం. అదే విధంగా బౌలింగ్‌లో కూడా ఆఖరి బంతిని వికెట్‌తోనే ముగించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రికార్డుల రారాజు.. కెరీర్లో 167 టెస్ట్‌లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు (604) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ENG vs AUS: ఆఖరి మజిలీలో ఇంగ్లండ్‌దే విక్టరీ.. విజయంతో బ్రాడ్ విడ్కోలు A fairytale ending for a legend of the game. Broady, thank you ❤️ #EnglandCricket | #Ashes pic.twitter.com/RUC5vdKj7p — England Cricket (@englandcricket) July 31, 2023 -
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా
యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. ఆసీస్‌కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టును మరుపురాని విజయాన్ని అందించాడు. అతడితో పాటు ఖ్వాజా కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్, ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు, ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం బిగ్ షాకిచ్చింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మేయింటన్ చేసినందుకు ఇరు జట్ల ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 40 శాతం కొత విధించింది. నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా ఉన్నాయని నిర్ధారించిన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఆటగాళ్లకు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైతే.. ప్రతీ ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించబడుతుంది. 2 రెండు ఓవర్లు ఆలస్యమైంది కాబట్టి 40 శాతం జరిమానా విధించారు. అదే విధంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. ప్రతీ ఓవర్ లేటుకు వారి డబ్ల్యూటీసీ పాయింట్లలో ఒక పాయింట్ కొత విధిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇరు జట్లు చెరో రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు కోల్పోయాయి. చదవండి: ICC CWC Qualifier 2023: అమెరికాకు మరో బిగ్ షాక్.. నేపాల్ సంచలన విజయం -
టీమిండియాకు బిగ్ షాక్.. టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా ఆస్ట్రేలియా!
టెస్టుల్లో ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్ వన్ జట్టుగా అవతరించనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ తొలి టెస్టులో విజయం సాధించిన ఆసీస్.. టీమిండియాను వెనుక్కి నెట్టి నెం1 ర్యాంక్‌ను కైవసం చేసుకోనుంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ 121 పాయింట్లతో అగ్ర స్ధానంలో ఉండగా.. ఆసీస్ 116 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. అయితే ఇంగ్లండ్‌పై విజయం సాధించడంతో ఆసీస్ ఖాతాలో అదనంగా పాయింట్లు వచ్చి చేరున్నాయి. ఈ క్రమంలో భారత్‌ను ఆస్ట్రేలియా అధిగమించే ఛాన్స్ ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం ఇంకా టెస్టు ర్యాంకింగ్స్‌ను అప్డేట్ చేయలేదు. ఐసీసీ చివరగా మే3న టెస్టు ర్యాంకింగ్స్‌ను అప్డేట్ చేసింది. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియాదే తొలి విజయం. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో ఆసీస్ 12 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కీలక సమయంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 44 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఉస్మాన్ ఖవాజా (65) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్డ్ 3, ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. శుబ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్! రుత్‌రాజ్ రీ ఎంట్రీ Good morning Australia, we've got some pretty good news for you 😉#Ashes pic.twitter.com/kRgNnusl38 — Cricket Australia (@CricketAus) June 20, 2023 -
WTC ఫివర్ ఫేవరెట్ గా ఇండియా ఎందుకంటే..!
-
25, 26 తేదీల్లో భారత్‌లో జర్మనీ అధ్యక్షుని పర్యటన
న్యూఢిల్లీ: జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్ షోల్జ్ ఈ నెల 25, 26వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఏడాది క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షోల్జ్ భారత్ రానుండటం ఇదే మొదటిసారి. సీనియర్ అధికారులు, ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి వర్గంతో 25న ఆయన ఢిల్లీకి చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. షోల్జ్, ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. 26న బెంగళూరులో జరిగే కార్యక్రమాల్లో జర్మనీ అధ్యక్షుడు షోల్జ్ పాల్గొంటారు. అదేవిధంగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా మార్చి 8వ తేదీన భారత్‌లో పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు తదితర అంశాలపై ఆయన ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్‌లో జరిగే భారత్–ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను తిలకించనున్నారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
వన్డేల్లో శ్రీలంక అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిన రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక పరాజాయం పాలైంది. దీంతో అత్యంత చెత్త రికార్డును శ్రీలంక తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా శ్రీలంక నిలిచింది. శ్రీలంక ఇప్పటివరకు 880 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 437 వన్డేల్లో ఓటమిపాలైంది. తద్వారా ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు టీమిండియా పేరిట ఉండేది. భారత్ ఇప్పటి వరకు 436 వన్డేల్లో ఓటమి చవిచూసింది. తాజా ఓటమితో భారత్‌ను లంక జట్టు అధిగిమించింది. ఇక మూడో 419 ఓటములతో పాకిస్తాన్ మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా రికార్డును సమం చేసిన భారత్ ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా కూడా ఓ అరుదైన రికార్డు సాధించింది. లంకపై రెండో వన్డేలో గెలుపొందిన రోహిత్ సేన.. వన్డేల్లో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియాతో సంయుక్తంగా నిలిచింది. శ్రీలంకపై అత్యధికంగా 95 వన్డేల్లో భారత్ గెలవగా.. ఆస్ట్రేలియా కూడా న్యూజిలాండ్‌పై ఇప్పటివరకు 95 వన్డేల్లో విజయం సాధించింది. చదవండి: Virat Kohli: ఇషాన్‌తో కలిసి డాన్స్ అదరగొట్టిన కోహ్లి! వీడియో వైరల్ -
రషీద్ ఖాన్‌కు తీవ్ర గాయం.. టోర్నీ నుంచి ఔట్!
టీ20 ప్రపంచకప్-2022లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు ఆఫ్గానిస్తాన్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో బౌండరీ ఆపే ప్రయత్నంలో రషీద్ ఖాన్ కాలికి గాయమైంది. వెంటనే ఫీల్డ్‌ను వదిలి రషీద్ ఫిజియో సాయంతో బయటకు వెళ్లాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో మహ్మద్ నబీ బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో రషీద్ 9 పరుగులతో పాటు రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆఫ్గాన్ ఓటమిపాలైంది. ఆఫ్గాన్ ఆడాల్సిన మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక తమ అఖరి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ నవంబర్ 4న ఆస్ట్రేలియాతో తలపడనుంది. #SLvsBAN pic.twitter.com/J8Mw59RWgP — The sports 360 (@Thesports3601) November 1, 2022 చదవండి: వన్డే చరిత్రలో తొలి వికెట్ టేకర్.. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ కన్ను మూత -
వన్డే చరిత్రలో తొలి వికెట్ టేకర్.. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ కన్ను మూత
వన్డే చరిత్రలో తొలి వికెట్ టేకర్.. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అలాన్ థామ్సన్ (76) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న థామ్సన్.. మంగళవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతని సోదరుడు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. "మా అన్నయ్య, మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ అలాన్ థామ్సన్ మరణించారు. కొన్ని రోజులు కిందట అతనికి హిప్(తుంటి గాయం) సర్జరీ జరిగింది. కానీ అన్నయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగపడలేదు. అఖరికి అలాన్ మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు" అని అతడి సోదరుడు ట్విటర్లో పేర్కొన్నారు. కాగా విక్టోరియాకు చెందిన అలాన్ ఆస్ట్రేలియా తరపున ఒక వన్డే, నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడారు. నాలుగు టెస్టుల్లో 12 వికెట్లు అలాన్ సాధించారు. అదే విధంగా అతని బౌలింగ్ యాక్షన్ కూడా అందరికంటే భిన్నంగా ఉంటుంది. అందుకే అతనిని ముద్దుగా "ఫ్రాగీ" అని పిలుచుకోనేవారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విక్టోరియా తరపున 44 మ్యాచ్‌లు ఆడిన అలాన్.. 184 వికెట్లు పడగొట్టారు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి వికెట్ ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో 1971 జనవరి 5న ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్ ఆసీస్‌కు ప్రాతినిద్యం వహించిన అలాన్ థామ్సన్ పడగొట్టారు. తద్వారా వన్డేల్లో తొలి వికెట్ సాధించిన బౌలర్‌గా అలాన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన అలాన్ 22 పరుగులిచ్చి ఒక్క వికెట్ సాధించారు. చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ -
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ దూరం!
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో కీలక మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయం కారణంగా ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా సోమవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న ఫించ్.. 5 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 63 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ అఖరిలో ఫించ్ తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ బాధను భరిస్తూనే ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫించ్ ఫీల్డ్‌లోకి రాలేదు. అతడి స్థానంలో వైస్-కెప్టెన్ మాథ్యూ వేడ్ బాధ్యతలు స్వీకరించాడు. ఇక తన గాయంకు సంబంధించిన అప్డేట్ను మ్యాచ్ అనంతరం ఫించ్ వెల్లడించాడు. "ప్రస్తుతం చాలా నొప్పిగా ఉంది. నేను రేపు(మంగళవారం) స్కానింగ్ కోసం వెళ్తాను. గతంలో కూడా ఇదే గాయంతో బాధపడ్డాను. స్కాన్ రిపోర్ట్స్ బట్టి విశ్రాంతి తీసుకోవాలా వద్ద అన్నది ఆలోచిస్తాను" అని ఫించ్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 42 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇక నవంబర్ 4న ఆడిలైడ్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. In a positive update, it was just precautionary for Tim David, who was kept out from fielding with hamstring tightness 🤞 https://t.co/SpUaVotkhk — Fox Cricket (@FoxCricket) October 31, 2022 చదవండి: T20 WC 2022: 'బాబర్ అజం స్వార్దపరుడు.. కేవలం రికార్డుల కోసం మాత్రమే' -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! చంద్రపాల్ కొడుకు ఎంట్రీ
ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు యువ సంచలనం టాగెనరైన్ చంద్రపాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ టాగెనరైన్ చంద్రపాల్ ఎవరో కాదు.. విండీస్ దిగ్గజ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్ పెద్ద కుమారుడు. చందర్‌పాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొట్టాడు. 2021-22 వెస్టిండీస్ ఫోర్డే ఛాంపియన్ షిఫ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన టాగెనరైన్.. 439 పరుగలు చేసి అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 34.21 సగటుతో 2669 పరుగులు సాధించాడు. అతడు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు టాగెనరైన్ రిజర్వ్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు. ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో విండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. చదవండి: T20 WC 2022: కోహ్లి బ్యాటింగ్.. 'దేవుడే పాట పాడినంత మధురంగా' -
టిమ్ డేవిడ్ తుపాన్ ఇన్నింగ్స్.. 110 మీటర్ల భారీ సిక్స్
బ్రెస్బేన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న డేవిడ్.. 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు సాధించాడు. కాగా డేవిడ్ కొట్టిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన మెక్కాయ్ బౌలింగ్‌లో.. నాలుగో బంతిని డేవిడ్ డిప్ మిడ్ వికెట్ దిశగా 110 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో విండీస్‌పై ఆస్ట్రేలియా 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(41 బంతుల్లో 75), డేవిడ్(42) పరుగులతో అదరగొట్టారు. విండీస్ బౌలర్లలో జోషఫ్ మూడు వికెట్లు, మెక్కాయ్ రెండు, స్మిత్ ఒక్క వికెట్ సాధించారు. ఇక 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. కరీబియన్ బ్యాటర్లలో చార్లెస్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కమ్మిన్స్ రెండు, గ్రీన్, జంపా ఒక్క వికెట్ పడగొట్టారు. చదవండి: Faf Du Plesis: 'మరో మూడు వారాల్లో పూర్తిగా తెలుసుకుంటారు' -
'టీ20 ప్రపంచకప్ టైటిల్ రేసులో ఆ మూడు జట్లే నిలుస్తాయి'
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఆక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలుత రౌండ్ 1 మ్యాచ్‌లు జరగనుండగా.. ఆక్టోబర్ 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ఈ మార్క్యూ ఈవెంట్ కోసం అన్ని ప్రధాన జట్లు సన్నద్దం అవుతున్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబిజీగా గడుపుతున్నాయి. కాగా ఈ మెగా ఈవెంట్లో టైటిల్ బరిలో నిలిచే మూడు ఫేవరేట్ జట్లను ఆస్ట్రేలియన్ మాజీ బ్యాటర్ మైఖేల్ బెవన్ ఎంచుకున్నాడు. వాటిలో అతిధ్య ఆస్ట్రేలియా, టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అన్ని జట్ల కంటే భారత్, ఇంగ్లండ్ జట్లు అద్భుతంగా ఉన్నాయని బెవన్ తెలిపాడు. "టీ20 ప్రపంచకప్-2022 టైటిల్ రేసులో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నిలుస్తాయని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం జట్లు ఫామ్ బట్టి చూస్తే టీమిండియా, ఇంగ్లండ్ ముందంజలో ఉన్నాయి. అదే విధంగా ఆస్ట్రేలియాను కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఆస్ట్రేలియా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారు తమ ఫామ్‌ను కొనసాగిస్తే.. ఆసీస్‌కు కూడా టైటిల్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ మెగా ఈవెంట్ స్వదేశంలో జరగనుండడం ఆస్ట్రేలియాకు కలిసి వస్తుంది" అని బెవన్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SA: శ్రేయస్ అయ్యర్ బుల్లెట్ త్రో.. డికాక్ అస్సలు ఊహించలేదుగా! -
టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన స్కాట్లాండ్
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టను స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్లో స్కాట్లాండ్ జట్టుకు రిచీ బెరింగ్టన్ సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2021 స్కాట్లాండ్ జట్టులో భాగంగా ఉన్న జోష్ డేవి, వీల్ ఈ ఏడాది మెగా ఈవెంట్‌కు కూడా ఎంపికయ్యారు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన స్కాట్లాండ్.. సూపర్-12 అర్హత సాధించింది. సూపర్-12లో కూడా స్కాట్లాండ్ పర్వాలేదనిపించింది. ఇక ఈ ఏడాది మెగా ఈవెంట్లో స్కాట్లాండ్.. ఐర్లాండ్, వెస్టిండీస్,జింబాబ్వేతో గ్రూప్ దశలో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌కు స్కాట్లాండ్ జట్టు: రిచర్డ్ బెర్రింగ్టన్ (కెప్టెన్), మైఖేల్ లీస్క్, జార్జ్ మున్సే, బ్రాడ్లీ వీల్, క్రిస్ సోల్, క్రిస్ గ్రీవ్స్, సఫ్యాన్ షరీఫ్, జోష్ డేవీ, మాథ్యూ క్రాస్, హంజా తాహిర్, కాలమ్ మెక్లియోడ్, మార్క్లెన్ ఎమ్గ్రాడ్, మార్క్లెన్ వాక్మ్రాడ్, వాలెస్, మైఖేల్ జోన్స్ చదవండి: Ind vs Aus: మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.. మీ జీవితం బాగు చేసుకోండి! భువీ భార్య కౌంటర్ -
T20 World Cup 2022: పాకిస్తాన్ మెంటార్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్..
టీ20 ప్రపంచకప్-2022కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసంతమ జట్టు మెంటార్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ను పిసిబీ నియమించింది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో కూగా హేడెన్ పాకిస్తాన్ మెంటార్‌గా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్ అద్భుతంగా రాణించింది. అనూహ్యంగా సెమీఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ ఏడాది టోర్నీలో పాక్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్, ఇతర సహాయక సిబ్బందితో కలిసి హేడెన్ పనిచేయున్నాడు. కాగా అతడు ఆక్టోబర్ 15న పాకిస్తాన్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్‌లో ఆడనుంది. ఇక ప్రస్తుతం జరుగుతోన్న ఆసియాకప్‌లో పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. సెప్టెంబర్11న దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో శ్రీలంకతో పాక్ తలపడనుంది. చదవండి: Asia Cup 2022: తొలిసారి బౌలింగ్ చేసిన దినేష్ కార్తీక్.. వీడియో వైరల్! -
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా..!
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. శనివారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో రియాన్ బర్ల్ వికెట్ పడగొట్టిన స్టార్క్.. తన వన్డే కెరీర్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను స్టార్క్ తన పేరిట లిఖించుకున్నాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ బౌలర్ సక్లైన్ ముస్తాక్ (104 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజాగా స్టార్క్ కేవలం 102 మ్యాచ్‌ల్లోనే 200 వికెట్లు పడగొట్టి ముస్తాక్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో టాప్‌లో స్టార్క్ ఉండగా.. రెండు మూడు స్ధానాల్లో వరుసగా సక్లైన్ ముస్తాక్ (104 మ్యాచ్‌లు), ఆసీస్ దిగ్గజం బ్రెట్‌లీ(112 మ్యాచ్‌లు) ఉన్నారు. అదే విధంగా వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన పేసర్‌గా కూడా స్టార్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. చదవండి: Aus Vs Zim 3rd ODI: సొంతగడ్డపై ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వే.. సంచలన విజయం -
T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు!
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపచంకప్-2022కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఆసియా కప్-2022కు దూరమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జస్ప్రీత్ స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌లతో పాటు టీ20 ప్రపచంకప్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వారం రోజులు పాటు గడిపాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవడంతో తిరిగి స్వస్థలం ముంబైకు చేరుకున్నట్లు సమాచారం. "బుమ్రా తన గాయం నుంచి కోలుకోవడంతో పురోగతి సాధించాడు. ఫిజియోలతో నిరంతరం మేము టచ్‌లో ఉన్నాం. మా జట్టు ప్రధాన ఫిజియో నితిన్ పటేల్ జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిజియోలతో ఎప్పటికప్పడు బుమ్రా గాయం గురించి చర్చిస్తున్నాడు. బుమ్రా తిరిగి ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడనున్నాడని మేము భావిస్తున్నాం. అయితే అతడు టీ20 ప్రపంచకప్‌కు మాత్రం ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్‌తో పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడు టీ20ల సిరీస్ నిమిత్తం ఆసీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అనంతరం ఆదే నెలలో దక్షిణాఫ్రికా జట్టు కూడా ఐదు టీ20ల సిరీస్ కోసం భారత గడ్డపై అడుగు పెట్టనుంది. చదవండి: Asia cup 2022: 'కోహ్లి మళ్లీ విఫలమయ్యాడు.. ఇదీ ఒక ఇన్నింగ్సేనా' -
జింబాబ్వేపై ఆస్ట్రేలియా ఘన విజయం..
18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన జింబాబ్వే ఓటమితో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. టౌన్స్ విల్లే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 47.3 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఆల్‌రౌండర్ మాధేవేరే 72 పరుగులతో రాణించడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోర్ అయినా చేయగల్గింది. ఇక ఆసీస్ బౌలర్లలో యువ కామెరాన్ గ్రీన్ ఐదు వికెట్లతో చేలరేగగా.. జంపా మూడు, మార్ష్, స్టార్క్ తలా వికెట్ సాధించారు. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా 33.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్ 48 పరుగులతో(నాటౌట్)గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో బర్ల్ మూడు వికెట్లు పడగొట్టగా..రజా, నగర్వ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో వన్డే ఇదే వేదికగా ఆగస్టు 31న జరగనుంది. చదవండి: Asia Cup Ind Vs Pak: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్! -
వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ లీగ్‌లో రీ ఎంట్రీ!
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొమ్మిదేళ్ల తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ మెరకు బిగ్‌బాష్ లీగ్ 12వ సీజన్ ముందు సిడ్నీ థండర్‌తో రెండు సంవత్సరాల ఒప్పందాన్ని వార్నర్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని సిడ్నీ థండర్ ఆదివారం సోషల్ మీడియాలో వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం వార్నర్ జట్టులో చేరనున్నాడని సిడ్నీ థండర్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆట పట్ల పూర్తి అంకితభావంతో ఉంటా ఇక ఇదే విషయంపై వార్నర్ స్పందిస్తూ.. నా బిగ్‌బాష్ కెరీర్‌ను ప్రారంభించిన జట్టులోకి మళ్లీ తిరిగి రావడం నాకు సంతోషంగా ఉంది. నేను నా ఆట పట్ల పూర్తి అంకితభావంతో ఉంటాను.. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నా సీనియర్లు చూపిన మార్గం నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎల్లవేళలా ఆటను ఆస్వాదిస్తూ ఉంటా. అదే విధంగా బిగ్‌బాష్ లీగ్ నుంచి భవిష్యత్తు ఆటగాళ్లను తయారు చేయడంతో నా వంతు పాత్ర పోషిస్తాను అని పేర్కొన్నాడు. కాగా 2011 బిగ్‌బాష్ లీగ్ తొలి సీజన్లో వార్నర్ అరేంగట్రం చేసినప్పటికీ.. అంతర్జాతీయ షెడ్యూల్, తదితర కారణాల వల్ల ఇప్పటి వరకు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వార్నర్ ఈ లీగ్‌లో చివరసారిగా 2014 సీజన్లో కనిపించాడు. ఇక బిగ్‌బాష్ లీగ్(2022-23) సీజన్ డిసెంబర్13 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరగనుంది. మరో వైపు డేవిడ్ భాయ్ యూఏఈ సరికొత్త టీ20లీగ్‌లో కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది. He's BACK. ⚡️@davidwarner31 signs with Sydney Thunder for two seasons ahead of #BBL12! ✍️ pic.twitter.com/pdEDcO6uLl — KFC Big Bash League (@BBL) August 20, 2022 చదవండి: IND vs ZIM: దీపక్ హుడా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! -
అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..!
దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ జ్ణాపకారక్ధం టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. టౌన్స్విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కాగా సైమండ్స్ టౌన్స్విల్లేలోనే జన్మించాడు. సైమండ్స్ జూనియర్లను ఎంతో మందిని ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని, అతడి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ తెలిపారు. ఇక ఈ స్టేడియం వేదికగా ఇప్పటి వరకు హాంకాంగ్, పాపువా న్యూ గినియా మధ్య రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఈ స్టేడియం వేదికగానే ఆగస్టు అఖరిలో ఆస్ట్రేలియా-జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది మే లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైమండ్స్ మరణించిన సంగతి తెలిసిందే. 1998లో ఆస్ట్రేలియా తరపున సైమండ్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిద్యం వహించాడు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: IND vs WI: మియామి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్ -
ఆస్ట్రేలియాలో ఘనంగా బోనాల జాతర
ఆస్ట్రేలియాలో బోనాల జాతర ఘనంగా జరిగింది. తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో మెల్బోర్న్ సిటీ రాక్బ్యాంక్ ప్రాంతానికి చెందిన దుర్గా మాత దేవాలయంలో బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో మహిళలు అమ్మ వారికి బోనాలు, తొట్టెల సమర్పించి మొక్కుల్ని చెల్లించుకున్నారు . ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో పోతురాజుల నృత్యంతో సందడి నెలకొంది. బోనాల పాటలకు మనదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల భక్తులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ వేడుకల్ని ఆస్ట్రేలియా మెల్బోర్న్లో తెలంగాణ న్యూస్ సంస్థ నిర్వాహకులు మధు, రాజు వేముల, ప్రజీత్ రెడ్డి కోతి,దీపక్ గద్దెలు గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం అంగరంగ వైభవంగా బోనాల జాతర జరపడంపై భక్తులు.. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. -
జింబాబ్వే, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన ఆసీస్..!
స్వదేశంలో జింబాబ్వే, న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌లకు ఆ జట్టు స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా సీనియర్ స్పిన్నర్ ఆడమ్ జంపా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక శ్రీలంక పర్యటనలో ఆసీస్ జట్టులో భాగమైన పలువురి ఆటగాళ్లను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. మిచెల్ స్వెప్సన్, జోష్ ఇంగ్లిస్, ఝే రిచర్డ్సన్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్‌లకు జట్టులో చోటు దక్కలేదు. ఇక రెండు సిరీస్‌లు నార్త్ క్వీన్స్‌లాండ్‌లో జరగనున్నాయి. ఆగస్టు 28న జింబాబ్వేతో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 6న న్యూజిలాండ్‌తో సిరీస్ మొదలుకానుంది. జింబాబ్వే, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లకు ఆసీస్ జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ ఆడమ్ జాంపా Rate this Aussie ODI squad out of 10 pic.twitter.com/LRJpqFL9M6 — cricket.com.au (@cricketcomau) July 18, 2022 చదవండి: IND vs WI: టీమిండియాతో సిరీస్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..! -
శ్రీలంకతో టెస్టు సిరీస్.. ఐదేళ్ల తర్వాత మాక్స్వెల్ రీ ఎంట్రీ..!
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన ట్రావిస్ హెడ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో మాక్స్‌వెల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 29న ప్రారంభం కానుంది. ఈ రెండు టెస్టులు కూడా గాలే వేదికగానే జరగనున్నాయి. ఇక మాక్స్వెల్ చివరి సారిగా 2017 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. 2013లో భారత్‌పై టెస్టుల్లో మాక్స్వెల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడిన మాక్స్వెల్ 339 పరుగులతో పాటు 8 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ (విసి), మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్ చదవండి: వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తివేత..! -
ఇదేందయ్యా ఇది.. క్యాచ్ పట్టడానికి ప్రయత్నించిన అంపైర్.. వీడియో వైరల్!
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫీల్డర్‌కు బదులు అంపైర్ క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆలెక్స్ క్యారీ షార్ట్ పిచ్ బాల్‌ను స్వ్కేర్ లెగ్ దిశగా ఆడాడు. కాగా స్క్వేర్-లెగ్‌లో అంపైర్‌గా ఉన్న కుమార్ ధర్మసేన క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించాడు. అయితే తను ఫీల్డర్ కాదని అంపైర్ అని గ్రహించి అఖరి క్షణంలో ధర్మసేన తన చేతులను వెనక్కి తీసుకున్నాడు. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అంతా ఒక్క సారిగా నవ్వుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అంపైర్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ధర్మసేన ఇప్పుడు అంపైర్‌గా కాదు శ్రీలంక ఆటగాడిగా ఫీలవుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 2-1తో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్లు మద్య నాలుగో వన్డే కొలంబో వేదికగా మంగళవారం జరగనుంది. చదవండి: IND vs ENG 5th Test: రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా పాజిటివ్.. తగ్గాకే ఇంగ్లండ్‌కు..! Kumar Dharmasena going for a catch in SL vs Aus Odi match pic.twitter.com/DYyxn6kEsy — Sportsfan Cricket (@sportsfan_cric) June 20, 2022 -
శ్రీలంకతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొలంబోలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సమయంలో మార్ష్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీంతో పల్లెకెలె వేదికగా జరిగిన మూడో టీ20కి మార్ష్ దూరమయ్యాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే పల్లెకెలె వేదికగా జాన్ 14న జరగనుంది. మరోవైపు శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా వన్డే జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ , డేవిడ్ వార్నర్ చదవండి: SL vs AUS: టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక.. తొలి జట్టుగా..! -
3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం..!
పల్లెకెలె: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో చివరి టి20...177 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6... చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావాలి. కానీ కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో అసాధ్యం అనిపించినదాన్ని ఒక్కసారిగా సుసాధ్యం చేసేశాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టిన లంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19.5 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (39; 6 ఫోర్లు), స్టొయినిస్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (37 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. చదవండి: IND vs SA T20 Series: ఒడిశా ఎలా ఉంది?.. దక్షిణాఫ్రికా ఆటగాడి ఎపిక్ రిప్లై Hero of the match! 💪 What a knock by Dasun Shanaka 💥#SLvAUS #CheerForLions pic.twitter.com/n8ug04rQvh — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 11, 2022 -
టీమిండియాతో టీ20 సిరీస్.. ఐర్లాండ్ కీలక నిర్ణయం
టీమిండియాతో టీ20 సిరీస్ ముందు క్రికెట్ ఐర్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు స్పిన్-బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు నాథన్ హౌరిట్జ్ ఐర్లాండ్ నియమించింది. హౌరిట్జ్ ఆస్ట్రేలియా తరపున 17 టెస్టులు, 58 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2002లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హౌరిట్జ్ మూడు ఫార్మాట్లలో 128 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో క్వీన్స్‌ల్యాండ్, న్యూ సౌత్ వేల్స్ జట్లకు హౌరిట్జ్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో కూడా అతడు బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్ల తరపున ఆడాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత హౌరిట్జ్ క్వీన్స్‌ల్యాండ్ ఫైర్, బ్రిస్బేన్ హీట్ జట్లకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇక ఐర్లాండ్ పర్యటనలో భాగంగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. డబ్లిన్ వేదికగా జూన్ 26న తొలి టీ20 జరగనుంది. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్..! -
శ్రీలంక టూర్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్.. స్టార్ బౌలర్ దూరం..!
ఈ ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్ మూడు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే ఆల్ ఫార్మాట్ టూర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును శుక్రవారం ప్రకటించింది. ఆ జట్టు స్టార్ బౌలర్, టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కు శ్రీలంకతో టీ20 సీరీస్‌కు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మరో వైపు టెస్టు జట్టులో ఓపెనర్ మార్కస్ హారిస్, పేసర్ మార్క్ స్టెకెటీకి చోటు దక్కలేదు. అదే విధంగా మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్వెల్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు పరిమిత ఓవర్ల జట్టులోకి తిరిగి రావడంతో ఆసీస్ చాలా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే పాక్ పర్యటనలో అద్భుతంగా రాణించిన బెన్ మెక్‌డెర్మాట్‌కు పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఇక కొలంబో వేదికగా జూన్ 7న శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరగనుంది. ఆస్ట్రేలియా టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, జే రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వీప్సన్, డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా వన్డే జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోనినిస్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్ చదవండి: IPL 2022: ఆల్ టైం ఐపీఎల్ ప్లేయింగ్ 11 ప్రకటించిన కైఫ్.. రైనాకు చోటు..! -
అప్పుడు 75.. ఇప్పుడు 170 పరుగులు.. భర్త ఉంటే చాలు.. ‘తగ్గేదేలే..!’
మహిళల వన్డే ప్రపంచకప్-2022ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైన్లలో 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి వరల్డ్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. కాగా ఆస్ట్రేలియా విజయంలో ఆ జట్టు ఓపెనర్ అలీసా హీలీ 170 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించింది. ఇది ఇలా ఉంటే.. హీలీ భర్త, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ స్టాండ్స్ నుంచి ఆమెను ఉత్సాహపరిస్తూ కనిపించాడు.ఈ మ్యాచ్‌లో ఆమె సెంచరీ సాధించినప్పుడు చప్పట్లు కొడూతూ స్టార్క్ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక 2020 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా మిచెల్ స్టార్క్ హాజరై హీలీను ఉత్సాహపరిచాడు. ఆమె ఆ మ్యాచ్‌లో 75 పరుగులు చేసి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. హీలీతో పాటు రేచల్ హేన్స్ (68), మూనీ (62) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్సోల్ 3, ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నతాలీ స్కీవర్ 148 పరుగులతో ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ వికెట్లు,జెస్ జోనాస్సెన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. మెగాన్ షట్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో 170 పరుగలు, అదే విధంగా ఈ మెగా టోర్నమెంట్లో 509 పరుగులు సాధించి అద్భుతంగా రాణించిన హీలీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. చదవండి: IPL 2022: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. విధ్వసంకర ఆటగాడు వచ్చేశాడు.. ఇక బౌలర్లకు చుక్కలే! View this post on Instagram A post shared by ICC (@icc) -
'ఇప్పుడు కాదు రోహిత్.. ఆస్ట్రేలియాపై గెలిచి చూపించు'
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడి సారథ్యంలో భారత్ ఇటీవల వెస్టిండీస్, శ్రీలంకతో టీ20,వన్డే సిరీస్‌లను సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేసింది. ఆ క్రమంలో రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రోహిత్ తన కెప్టెన్సీ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడని బ్రాడ్ హాగ్ కొనియాడాడు. అయితే ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లతో ఆడినప్పుడు రోహిత్ కెప్టెన్సీ స్కిల్స్ బయటపడతాయి అని అతడు తెలిపాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ రోహిత్‌కు అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు. "త్వరలో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అది రోహిత్ శర్మకు కఠిన సవాల్‌కు మారనుంది. నేను అతనిని ఒత్తిడిలో చూడాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఇప్పటి లాగే ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటాడా లేదా మనం కోపాన్ని చూస్తామా. భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, ఇంగ్లాండ్ పర్యటన, ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనోంది. కాబట్టి రాబోయే అన్నీ టోర్నీలు రోహిత్ కఠినమైనవి" అని హాగ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: కేఎల్ రాహుల్ జట్టులోకి జింబాబ్వే స్టార్ బౌలర్! -
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ షాక్.. 26 మంది స్టార్ ఆటగాళ్లు దూరం!
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. ఇక పుణే,లక్నో రూపంలో కొత్త జట్లు రావడంతో ఈ సీజన్‌కు సరికొత్త ప్రాధన్యత సంతరించుకొంది. అయితే ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు 26 మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏఏ ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారో పరిశీలిద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీంట్లో చాలా మంది విదేశీ ఆటగాళ్లే. వారిలో ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లు ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఇక దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ సిరీస్ కారణంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్,లుంగి ఎంగిడి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. అదే విధంగా ప్రోటీస్ స్టార్ పేసర్ నార్ట్జే గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్లో కొత్త జట్టుగా అవతరించింది. ఈ జట్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. లక్నో కూడా వేలంలో విదేశీ స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్,క్వింటన్ డి కాక్ వంటి విదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో గాయపడిన మార్క్ వుడ్ అందుబాటులో ఉండటం కూడా ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్థాన్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల తర్వాతే మార్కస్ స్టోయినిస్ లక్నో జట్టులోకి రానున్నాడు. పంజాబ్ కింగ్స్ అంతర్జాతీయ సిరీస్‌ల కారణంగా జానీ బెయిర్‌స్టో, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్ ఐపీఎల్- 2022లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ముఖ్యంగా స్టార్ పేసర్ రబడా ఒకటి నుంచి ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్- 2022 ఆరంభ మ్యాచ్‌ల్లో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్ల సేవలను ఆర్సీబీ కోల్పోతుంది. గ్లెన్ మాక్స్వెల్,హాజిల్‌వుడ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ దూరం కానున్నారు. గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో అరంగేట్రం చేసింది. గుజరాత్‌కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్, వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ దూరం కానున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌లో డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికా జట్టులో భాగమై ఉండగా, అల్జారీ జోసెఫ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ తరపున ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్కో జాన్సెన్, ఐడెన్ మార్క్రామ్ సేవలను కోల్పోనుంది. అదే విధంగా ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్ కూడా దూరం కానున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆరంభ మ్యాచ్‌లకు ప్రోటీస్ స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ దూరం కానున్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో డస్సెన్ భాగమై ఉన్నాడు. ఒక వేళ టెస్ట్ సిరీస్‌కు ఎంపికైతే అతడు ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ గత ఏడాది ఫైనలిస్ట్ కోల్‌కతా నైట్ రైడర్స్ పాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్ లేకుండానే ఆరంభ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనుంది. పాకిస్థాన్‌తో జరిగే టెస్ట్ సిరీస్ తర్వాత కమ్మిన్స్ జట్టులో చేరే అవకాశం ఉన్నప్పటికీ, ఫించ్ మాత్రం వైట్ బాల్ సిరీస్‌లో భాగమై ఉన్నాడు. ముంబై ఇండియన్స్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరం కానున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ మాత్రం తొలి మ్యాచ్‌లో ఆడేందుకు పూర్తి స్థాయి జట్టును కలిగి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ దూరం కానున్నాడు.బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో అతడు ప్రోటీస్ జట్టులో భాగమై ఉన్నాడు. చదవండి: IPL 2022- Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! అయితే.. -
'మూన్బాల్'తో భయపెట్టిన బౌలర్.. షాక్‌లో బ్యాటర్!
Women's World Cup: వన్డే మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ నికోలా కారీ 'మూన్బాల్' తో ప్రత్యర్ధి బ్యాటర్‌ను షాక్‌కు గురి చేసింది. పాక్ ఇన్నింగ్స్ 45వ ఓవర్ వేసిన కారీ బౌలింగ్‌లో.. బంతి చేతి నుంచి జారిపోయి బ్యాటర్ తలపై నుంచి హై ఫుల్ టాస్‌గా వెళ్లింది. ఆ బంతిని ఆపడానికి వికెట్ కీపర్ అలిస్సా హీలీ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించారు. అయితే ఫ్రీ హిట్ బాల్‌కు కారీ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చింది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ అలీసా హీలీ(72), మెగ్ లానింగ్(35) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ మహరూఫ్(78), ఆలియా రియాజ్(53) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలీనా కింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్కాట్,పేరీ, కారీ చెరో వికెట్ సాధించారు. మూన్ బాల్ బౌలర్ వేసే బంతి ఎక్కువ ఎత్తుకు వెళ్లి కీపర్‌కు కూడా అందకపోతే దాన్ని మూన్ బాల్‌గా పరిగణిస్తారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
వన్డే మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మౌంట్ మౌంగానుయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ అలీసా హీలీ(72), మెగ్ లానింగ్(35) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ మహరూఫ్(78), ఆలియా రియాజ్(53) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలీనా కింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్కాట్,పేరీ, కారీ చెరో వికెట్ సాధించారు. ఇక వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో ఆస్ట్రేలియా తొలి స్ధానంలో ఉంది. కాగా పాక్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకు ముందు తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఘోరమి ఓటమి చెందిన సంగతి తెలిసిందే. చదవండి: Shane Warne: ‘నేను వార్న్‌ను అంతమాట అనకుండా ఉండాల్సింది’ -
వార్న్‌ను బతికించడానికి 20 నిమిషాలు కష్టపడ్డారు.. అయినా కానీ!
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ ఆకాల మరణంతో క్రీడా లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. థాయిలాండ్‌లోని కోహ్ సమీయులో తన విల్లాలో గుండెపోటుతో వార్న్ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వార్న్ మృతికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. షేన్ వార్న్‌ను బతికించడానికి తన ముగ్గురు స్నేహితులు విశ్వప్రయత్నాలు చేశారని థాయ్‌లాండ్ పోలీసులు తెలిపారు. వార్న్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి థాయిలాండ్‌లోని కోహ్ సమీయులోని విల్లాలో ఉంటున్నారని, వార్న్ డిన్నర్‌కు రాకపోవడంతో స్నేహితుడు వెళ్లి చూసే సరికి వార్న్ విగిత జీవిగా పడి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. "వార్న్‌కు తన స్నేహితుడు సీపీఆర్ చేశాడు. వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ వచ్చి 10-20 నిమిషాల పాటు మరో సీపీఆర్ చేసింది. తరువాత థాయ్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చి అతన్ని తీసుకువెళ్లింది. హాస్పిటల్ వెళ్లాక ఐదు నిమిషాలు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేదని, అతడు మరణించాడు" అని థాయ్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Shane Warne: మా గుండె పగిలింది.. మాటలు రావడం లేదు: రాజస్తాన్ రాయల్స్ భావోద్వేగం -
ఐపీఎల్ తొలి టైటిల్‌ను ముద్దాడిన వార్న్..
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకంలో తీవ్ర విషాదం నిపింది. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన లెజెండ్.. ఇక లేడన్న వార్తను అతడు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన 15 ఏళ్ల కేరిర్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట వార్న్ లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు.. ఐపీఎల్లో కూడా వార్న్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఐపీఎల్లో ఆరంభ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు వార్న్ సారథ్యం వహించాడు. తొలి సీజన్లో ఏ మాత్రం గెలుపు అంచనాలు లేకుండానే యువకులతో బరిలోకి దిగిన రాజస్తాన్.. తొలి టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో తొలి ట్రోఫీని ముద్దాడడంలో షేన్ వార్న్‌దే కీలక పాత్ర. తన అంతర్జాతీయ అనుభవాన్నంతా రంగరించి అతను యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. ప్రతీ దశలోనూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ విజయం దిశగా నడిపించడం విశేషం. అంతేకాకుండా రీటైర్డ్ అయ్యిన తర్వాత అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా వార్న్ రికార్డు సృష్టించాడు. 2008 ఐపీఎల్ వేలంలో వార్న్‌ను రాజస్తాన్ రాయల్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. చదవండి: PAK Vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. చెలరేగి ఆడుతోన్న పాక్ -
వార్న్ వెళ్లిపోయాడు.. జ్ఞాపకాలు పదిలం ( అరుదైన ఫోటోలు )
-
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. చెలరేగి ఆడుతోన్న పాక్
రావల్పిండి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 245 పరుగులు సాధించింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హఖ్ (132 బ్యాటింగ్; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. అజహర్ అలీ (64 బ్యాటింగ్)తో కలిసి రెండో వికెట్‌కు ఇమామ్ 140 పరుగులు.. ఓపెనర్ షఫీఖ్ (44)తో తొలి వికెట్‌కు 105 పరుగులు జత చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయాన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక 24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇది ఇలా ఉంటే.. పెషావర్‌లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడి ఆస్ట్రేలియా క్రికెటర్లను ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే పెషావర్‌కు 187 కిమీ దూరంలో ఉన్న రావల్పిండి వేదికగానే తొలి టెస్ట్ జరగుతోంది. చదవండి: India Vs Sri Lanka 1st Test: శ్రీలంక బౌలర్లకు చుక్కలు.. తొలి రోజు మనదే.. -
టీ20 ప్రపంచకప్ జట్టులో హార్దిక్ పాండ్యా.. స్టార్ బౌలర్‌కు నో ఛాన్స్!
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఆక్టోబర్16న క్వాలిఫైర్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. ఆక్టోబర్ 22 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నమెంట్లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. గత ఏడాది ప్రపంచ కప్‌లో పాక్ చేతిలో ఘోర ఓటమికు టీమిండియా బదులు తీర్చుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఇప్పటినుంచే ప్రపంచ కప్ సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2022లో పాల్గొనే భారత జట్టును టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అంచనా వేశాడు. తన జట్టులో తొలి మూడు స్ధానాల్లో రోహిత్ శర్మ,కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లిను ఎంపిక చేశాడు. తరువాత యువ ఆటగాళ్లు కిషన్, శ్రేయస్ అయ్యర్,సూర్యకుమార్ యాదవ్‌ను ఎంచుకున్నాడు. జట్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశాడు. ఆల్ రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, వెంకటేశ్ అయ్యర్,హార్ధిక్ పాండ్యాకు చోటు ఇచ్చాడు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన హార్ధిక్ పాండ్యాకి చోటు ఇవ్వడం గమనార్హం. ఇక బౌలర్ల కోటాలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్ లేదా దీపక్ చాహర్‌లో ఒకరు భారత జట్టులో చోటు దక్కించుకుంటారని చోప్రా తెలిపాడు. మూడో పేసర్ కోసం ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ లేదా అవేష్ ఖాన్లలో ఒకరు జట్టులో స్ధానం దక్కించుకుంటారు. అదే విధంగా మహమ్మద్ షమీ, టి నటరాజన్ లేదా ఖలీల్ అహ్మద్‌లలో ఒకరిని రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది అని చోప్రా పేర్కొన్నాడు. ఇక టీ20ల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను తన జట్టులో చోప్రా చోటు ఇవ్వక పోవడం గమనార్హం. చదవండి: Ravichandran Ashwin: 'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్‌ను ఉతికారేసిన అశ్విన్ -
25 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు.. జట్టును ప్రకటించిన ఆసీస్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెలలో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా 3 టెస్టులు, 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే పాక్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆసీస్ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. కాగా గాయం కారణంగా యాషెస్ సిరీస్ మధ్యలో నుంచి తప్పుకున్న జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్వెప్సన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక ఈ జట్టుకు పాట్ కమిన్స్ నాయకత్వం వహించనున్నాడు. ఇక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు కమిన్స్ కెప్టెన్‌గా అద్భుతమైన విజయం అందించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్) ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్ , నాథన్ లి యోన్, మిచెల్ మార్ష్, మైఖేల్ నెజర్ మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్ -
సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగాడు.. భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.. దటీజ్ యష్ ధుల్!
Yash Dhull U19 World Cup: అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో యువ భారత్ ఫైనల్‌కు చేరింది. ఆంటిగ్వా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో శనివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. కాగా భారత విజయంలో కెప్టెన్ యష్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కీలక పాత్ర పోషించారు. యష్ ధుల్ సెంచరీ(114)తో చెలరేగగా, షేక్ రషీద్ 94 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 37 పరుగులకే రెండు వికెట్లుకోల్పోయి కష్టాల్లో పడింది. ఆనంతరం యష్ ధుల్, షేక్ రషీద్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. అనంతరం 291 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 194 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో విక్టీ ఓస్టావల్ మూడు వికెట్లు సాధించగా, నిషాంత్ సింధు, రవి కుమార్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దటీజ్ యశ్ ధుల్ న్యూఢిల్లీకి చెందిన యశ్ దుల్‌కి ఢిల్లీ అండర్-16, అండర్-19, ఇండియా ‘ఎ’ అండర్-19 జట్లకు నాయకత్వం వహించాడు. ఇక ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడుగా ఉన్నాడు. డీడీసీఈ(ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్) తరుపున 5 మ్యాచ్‌లు ఆడిన యశ్ దుల్ 302 పరుగులు చేశాడు. అదే విధంగా ఆసియా అండర్–19 క్రికెట్ టోర్నీలో భారత జట్టుకు సారథ్యం వహించిన యశ్ ధుల్.... జట్టును చాంపియన్‌గా నిలిపాడు. యశ్ కెప్టెన్సీలో భారత యువ జట్టు ఫైనల్లో శ్రీలంకను 9 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది. ఇక ఇప్పుడు ఐసీసీ మేజర్ టోర్నీ వరల్డ్‌కప్‌లోనూ జట్టును ఫైనల్‌కు చేర్చి కెప్టెన్‌గా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా సెమీ ఫైనల్లో 110 బంతుల్లో 110 పరుగులు సాధించి బ్యాటర్‌గానూ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు భారీ షాక్.. భారత్- విండీస్ తొలి వన్డే వాయిదా! Who Is Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారు! -
పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు.. ఆస్ట్రేలియా పర్యటన ఇక..!
Australias tour of Pakistan: పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో భారీ బాంబు పేలుడు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ కేంద్ర మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు ఆస్ట్రేలియా పర్యటనను అడ్డుకోవడమే బాంబు పేలుళ్ల ప్రధాన ఉద్దేశ్యమని అతను అభిప్రాయపడ్డారు. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2022 జనవరి 27న ప్రారంభం కానుంది. "దేశంలో శాంతి నెలకొనడంతో పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు ముష్కరులు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్, చారిత్రాత్మక ఆస్ట్రేలియా పర్యటనను అడ్డుకోవడమే ఈ పేలుడు ముఖ్య ఉద్దేశ్యం. కానీ మేము దానిని జరగనివ్వము" అని రషీద్ అహ్మద్ పేర్కొన్నారు. ఇక 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు తొలి సారిగా పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మార్చిలో ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. అయితే ఈ పేలుడుతో ఆసీస్ పర్యటన మరోసారి సందిగ్ధంలో పడింది. చదవండి: హైదరాబాదీ ఆల్‌రౌండర్‌కి బంఫర్ ఆఫర్.. భారత జట్టులో చోటు! -
టీమిండియాకు మరో బిగ్ షాక్..
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను స్వదేశంలో 4-0 తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా టెస్టుల్లో నంబర్‌వన్‌గా అవతరించింది. గురువారం విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 119 పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా.. 117 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ స్థానంలో ఉంది. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన భారత్ 116 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. నాలుగో స్ధానంలో ఇంగ్లండ్ నిలిచింది. ఇక భారత్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన ప్రోటీస్ ఐదో స్థానానికి ఎగబాకగా, పాకిస్థాన్ ఆరో స్థానానికి దిగజారింది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో భాగంగా ఆసీస్ పాకిస్తాన్లో మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం పర్యటించనుంది. కాగా 1998 తర్వాత ఆసీస్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. మరోవైపు స్వదేశంలో శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విషయానికి వస్తే.. టీమిండియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 49.07 విజయ శాతంతో నాలుగు విజయాలు, మూడు ఓటములు, రెండు డ్రాలతో ఐదవ ర్యాంక్‌లో కోనసాగుతోంది. మరోవైపు, ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌లలో 86.66 విజయ శాతంతో నాలుగు విజయాలు, ఒక డ్రాతో రెండో స్థానంలో ఉంది. చదవండి: IND vs SA: ఎనిమిదేళ్ల తర్వాత బౌలింగ్‌లో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో అదుర్స్ -
ఇంగ్లండ్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!
యాషెస్ ఐదో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా హోబర్ట్ వేదికగా జరిగే ఐదో టెస్ట్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ధృవీకరించాడు. కాగా నాల్గవ టెస్ట్‌లో జోస్ బట్లర్ గాయడ్డాడు. ఇక అఖరి టెస్ట్‌లో బట్లర్ స్ధానంలో జానీ బెయిర్‌స్టో వికెట్ కీపింగ్ చేయనున్నాడు. "బట్లర్ చేతి వేలుకు తీవ్రమైన గాయమైంది. దీంతో అతడు తన ఇంటికి వెళ్లనున్నాడు. అతడు హోబర్ట్ టెస్ట్‌కు దూరం కావడం మాకు పెద్ద ఎదురుదెబ్బ. జట్టు కష్టపరిస్థితిల్లో ఉన్నప్పడు చాలా సార్లు అండగా నిలిచాడు" అని రూట్ పేర్కొన్నాడు. ఇక యాషెస్ సిరీస్‌లో వైట్ వాష్ నుంచి ఇంగ్లండ్ తప్పించుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌ను ఇంగ్లండ్ డ్రాగా ముగించింది. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు మధ్య అఖరి టెస్ట్ జనవరి 14న ప్రారంభం కానుంది. చదవండి: Devon Conway: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా! -
ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన బెయిర్‌స్టో.. తొలి సెంచరీ నమోదు
సిడ్నీ వేదికగా జరుగుతన్న యాషెస్ నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగాడు. 140 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స్‌లతో 103 పరుగులు సాధించి ఆజేయంగా ఉన్నాడు. కాగా ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తరుపున బెయిర్‌స్టో తొలి సెంచరీ సాధించాడు. 13-0 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఇంగ్లండ్.. ఆదిలోనే ఓపెనర్ హమీద్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత 36 పరుగులకే 4వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో స్టోక్స్‌తో కలిసి బెయిర్‌స్టో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెయిర్‌స్టో (103), లీచ్(4) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్టార్క్, గ్రీన్, లియాన్ చెరో వికెట్ సాధించారు. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్... ఇక ఆ సిరీస్ కూడా కష్టమే! ఆట సాగిందిలా... సిడ్నీ: ‘సున్నా’ పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు... ఒకదశలో స్కోరు 36/4... వరుసగా 70 బంతుల పాటు సింగిల్ కూడా రాలేదు... ‘యాషెస్’లో ఈ స్థితి చూస్తే ఆస్ట్రేలియా చేతిలో మరో ఘోర పరాజయానికి ఇంగ్లండ్ బాటలు వేసుకున్నట్లు అనిపించింది. అయితే అద్భుత సెంచరీతో జానీ బెయిర్‌స్టో (140 బంతుల్లో 103 బ్యాటింగ్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), అతనికి తోడుగా బెన్ స్టోక్స్ (91 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా మూడేళ్ల తర్వాత సాధించిన శతకంతో బెయిర్‌స్టో ఇంగ్లండ్‌ను రక్షించడంతో పాటు జట్టులో తన స్థానాన్ని కూడా కాపాడుకున్నా డు. వర్షం కారణంగా మ్యాచ్ మూడో రోజు 65 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నిం గ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. బెయిర్‌స్టోతో పాటు లీచ్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉండగా ప్రస్తుతం ఆ జట్టు 158 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 13/0తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ అదే తడబాటును ప్రదర్శించింది. హమీద్ (6)ను స్టార్క్ వెనక్కి పంపగా... 36 పరుగుల స్కోరు వద్దే క్రాలీ (18), రూట్ (0), మలాన్ (0) అవుటయ్యారు. ఈ దశలో స్టోక్స్, బెయిర్‌స్టో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 9 పరుగుల వద్ద స్టోక్స్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కమిన్స్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత 16 పరుగుల వద్ద స్టోక్స్‌కు మళ్లీ అదృష్టం కలిసొచ్చింది. గ్రీన్ బౌలింగ్‌లో బంతి స్టంప్స్‌ను తాకుతూ వెళ్లినా బెయిల్స్ పడలేదు! ముందు ఎల్బీ కోసం ఆసీస్ అప్పీల్ చేయగా అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. అయితే రివ్యూలో ప్యాడ్‌కు బంతి తగల్లేదని, స్టంప్స్ పైభాగంలో తగిలి వెళ్లిందని తేలడంతో స్టోక్స్ బతికిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో దూసుకుపోయారు. ఎట్టకేలకు 128 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం తర్వాత స్టోక్స్‌ను లయన్ అవుట్ చేయగా, బట్లర్ (0) విఫలమయ్యాడు. అనంతరం వుడ్ (39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ ఫాలోఆన్‌ను కూడా తప్పించుకుంది. ఆ తర్వాత 138 బంతుల్లో బెయిర్ స్టో తన కెరీర్లో ఏడో సెంచరీని అందుకున్నాడు. -
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌కు కరోనా..
యాషెస్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ట్రావియస్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. దీంతో సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌కు అతడు దూరమయ్యాడు. శుక్రవారం హెడ్‌కి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా తెలినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అయితే ప్రస్తుతం అతడికి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో, తన భార్యతో కలిసి మెల్బోర్న్లో ఐషోలేషన్‌లో ఉన్నాడు. కాగా ప్రతిష్టాత్మాక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో జో రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా హెడ్ ఉన్నాడు. ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 248 పరుగులు చేశాడు. ఇక నాలుగో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 5 నుంచి జరగనుంది. చదవండి: Quinton De Kock/ IND Vs SA: భారత్‌తో ఓటమి.. డికాక్ సంచలన నిర్ణయం! -
అరంగేట్ర మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్ బౌలర్!
టెస్ట్ క్రికెట్లో ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ రికార్డు సృష్టించాడు. అత్యంత వేగవంతగా 5వికెట్ల ఘనతను సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల కెక్కాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్ట్‌లో 5వికెట్లు పడగొట్టి బోలాండ్ ఈ ఘనతను సాధించాడు. కాగా అరంగేట్ర మ్యాచ్‌లోనే బోలాండ్ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. దీంతో ఇంగ్లండ్ బౌలర్లు ఎర్నీ తోషాక్, స్టువర్ట్ బ్రాడ్ రికార్డులను అతడు సమం చేశాడు. 1947లో భారత జట్టుపై తోషాక్ ఈ ఘనత సాధించగా,2015లో ఆసీస్‌పై బ్రాడ్ ఫాస్టెస్ట్ 5వికెట్ల రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో బోలాండ్ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 15పరుగల తేడాతో ఘన విజయం సాదించింది. దీంతో యాషెస్ సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 68 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో స్కాట్ బోలాండ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. చదవండి: Sourav Ganguly Covid Positive: ఆస్పత్రిలో చేరిన గంగూలీ... INSANE! Scott Boland takes two in the over! #OhWhatAFeeling #Ashes | @Toyota_Aus pic.twitter.com/Uhk046VGG6 — cricket.com.au (@cricketcomau) December 27, 2021 -
బెయిర్‌స్టో వచ్చేశాడు.. ఇంగ్లండ్ ఈ సారైనా గెలిచేనా!
యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్(బాక్సింగ్‌డే టెస్ట్) డిసెంబరు 26న ప్రారంభం కానుంది. కాగా బాక్సింగ్‌డే టెస్ట్ ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ స్ధానంలో జాక్ క్రాలీకి చోటు దక్కింది. ఈ సిరీస్‌లో రెండు టెస్ట్‌లు ఆడిన బర్న్స్ కేవలం 51 పరుగులు మాత్రమే సాధించాడు. ఆదే విధంగా హసీబ్ హమీద్‌కి మరో అవకాశం ఇచ్చారు. ఓలీ పోప్ స్ధానంలో సీనియర్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో జట్టులోకి వచ్చాడు. ఆదే విధంగా క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్ కూడా దూరమయ్యారు. వీరి స్ధానంలో మార్క్ వుడ్, జాక్ లీచ్ జట్టులోకి వచ్చారు. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటకట్టకుంది. కాగా బాక్సింగ్ డే టెస్ట్‌లో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలి అని భావిస్తోంది. ఇక ఆస్ట్రేలియా మాత్రం ఇదే జోరు కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సిరీస్‌లో 2-0తో ఆస్ట్రేలియా అధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ జట్టు: హసీబ్ హమీద్, జాక్ క్రాలీ, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్(వికెట్ కీపర్), మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్. చదవండి: SA vs IND: ఓపెనర్లుగా మయాంక్, రాహుల్.. హనుమ విహారికు నో ఛాన్స్! -
ఫెన్సర్ భవానీ దేవికి క్రీడా శాఖ చేయూత
ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవి (తమిళనాడు) వచ్చే ఏడాది నాలుగు అంతర్జాతీయ టోర్నమెంట్లలో బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలలో పాల్గొనేందుకు భవానీ దేవికి రూ. 8 లక్షల 16 వేలు కేంద్ర క్రీడా శాఖ మంజూరు చేసింది. జార్జియాలో వచ్చే జనవరి 14 నుంచి 16 వరకు జరిగే ప్రపంచకప్ టోర్నీతో భవానీ దేవి సీజన్ మొదలవుతుంది. ఆ తర్వాత బల్గేరియాలో, గ్రీస్‌లో, బెల్జియంలో జరిగే ప్రపంచకప్ టోర్నీలలోనూ ఆమె పోటీపడుతుంది. వైల్డ్ కార్డుతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో... మెల్బోర్న్లో వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 30 వరకు జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే (బ్రిటన్) వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ముర్రే చివరిసారిగా 2019లో ఆడాడు. అనంతరం తుంటి గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకొని ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడాల్సి ఉండగా... కరోనా బారిన పడటంతో బరిలోకి దిగలేదు. చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. -
"ఇంగ్లండ్ కెప్టెన్‌గా అతడే సరైనోడు.. రూట్ వద్దే వద్దు"
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటకట్టకుంది. ఇక సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్( బ్యాక్సింగ్ డే టెస్ట్) డిసెంబర్26న మెల్బోర్న్ వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో అయిన గెలిచి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఆదే విధంగా మరోసారి ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటకీ, సారథిగా జట్టును నడిపించలేక పోతున్నాడాని తీవ్ర స్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో జో రూట్‌పై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ కీలక వాఖ్యలు చేశాడు. రూట్ టెస్టు కెప్టెన్‌గా పనికిరాడని, అతడి స్ధానంలో బెన్ స్టోక్స్‌కు అవకాశం ఇవ్వాలి అని అతడు అభిప్రాయపడ్డాడు. "రెండో టెస్ట్ నాలుగో రోజు జో రూట్ గైర్హాజరీ నేపథ్యంలో బెన్ స్టోక్స్ బాధ్యతలు స్వీకరించాడు. అతడు ఆ సమయంలో ఫీల్డ్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అతడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఫీల్డ్ విధానం కూడా చాలా బాగుంది. కేవలం 20 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ బౌలర్లు నాలుగు వికెట్లు పడగొట్టారు. స్టోక్స్ తన కెప్టెన్సీతో ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టాడు. నా దృష్టిలో రూట్ కంటే స్టోక్స్ అత్యత్తుమ కెప్టెన్" అని హాడిన్ పేర్కొన్నాడు. డే-నైట్ టెస్ట్‌లో ఘోర పరాజయం తర్వాత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారని రూట్ చేసిన వాఖ్యలపై హాడిన్ మండిపడ్డాడు. "అతడు కోచ్‌తో పాటు సెలక్షన్ కమిటీలో పాల్గొన్నాడు. అనంతరం సరైన జట్టును ఎంపిక చేశామని రూట్, కోచ్ ప్రకటించారు. ఇప్పుడు ఇలా బౌలర్లను నిందించడం సరికాదు" అని హాడిన్ పేర్కొన్నాడు. చదవండి: న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌పై వేటు.. -
అభిమానులకు ‘గుడ్‌న్యూస్’... స్టేడియంలోకి అనుమతి.. అయితే!
యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్( బాక్సింగ్‌డే టెస్ట్) డిసెంబర్26 న మెలబోర్న్ వేదికగా జరగనుంది. అనూహ్యంగా ఈ మ్యాచ్‌కు పూర్తి స్ధాయిలో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అధికారులు తెలిపారు. ఒమ్రికాన్ వ్యాప్తి చెందుతున్న వేళ ఏంసీజీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అందరనీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా మెల్బోర్న్లో ప్రతిరోజూ 1500 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా బుధవారం జరిగే ఈ మ్యాచ్‌కు ఇప్పటికే సూమారు 70,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయని మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ ఫాక్స్ తెలిపారు. "మేము స్టేడియంను అన్ని విధాలా సిద్ధం చేశాము. బాక్సింగ్ డే టెస్ట్ కోసం అన్ని రకాల నిబంధనలను పాటిస్తున్నాము. వ్యాక్సినేషన్ సర్టికెట్ ఉన్నవారిని లోపలకి మాత్రమే అనుమతిస్తాం" అని స్టువర్ట్ ఫాక్స్ పేర్కొన్నారు. ఇక 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 తేడాతో ఆస్ట్రేలియా అధిక్యంలో ఉంది. మరో వైపు దక్షిణాఫ్రికా- భారత్ టెస్ట్ సిరీస్‌కు మాత్రం ప్రేక్షకులను అనుమతి చేయడంలేదు. చదవండి: Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం! -
మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆస్ట్రేలియా కెప్టెన్సీకి టిమ్ పైన్ రాజీనామా
Tim Paine Announces Resignation as Australian Test Cricket Captain Over Private Text Exchange: యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఓ మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపడాన్న ఆరోపణల నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి పైన్ తప్పుకున్నాడు. "ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న నా నిర్ణయాన్ని ఈరోజు ప్రకటిస్తున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ నాకు, నా కుటుంబానికి, మాజట్టుకు సరైన నిర్ణయం” అని టిమ్ పైన్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. 2017 లో తన సహోద్యోగికు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు అతడు వెల్లడించాడు. ఈ సంఘటనపై విచారణ జరుగుతుందిని, ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నాని టిమ్ పైన్ తెలిపాడు. ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. "టిమ్ పైన్ ఆస్ట్రేలియా పురుషుల టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీనిపై మరింత సమాచారం త్వరలో అందిస్తాం అని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. కాగా 2017లో ఓ మహిళకు అసభ్యకరమైన రీతిలో మేసేజ్‌లు పంపాడాన్న ఆరోపణలు పైన్‌పై వచ్చాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా.. నిజమేనని ధృవీకరించింది. కాగా యాషెస్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. #BREAKING: Tim Paine has announced he will step down as Captain of the Australian Test team. He read a statement but did not take any questions from the media.@WINNews_Tas pic.twitter.com/57fBcDKvZp — Brent Costelloe (@brentcostelloe) November 19, 2021 -
యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్.. వరల్డ్‌కప్ హీరోకు నో ఛాన్స్..
Australia announce Ashes squad: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ హీరో మిచల్ మార్ష్‌కు చోటు దక్కలేదు. మరో వైపు ఆజట్టు సీనియర్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజాకు రెండు ఏళ్ల తర్వాత మళ్లీ టెస్ట్‌ల్లో చోటు దక్కింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఆస్ట్రేలియా బుధవారం(నవంబర్-17) ప్రకటించింది. ఈ ప్రఖ్యాత సిరీస్ డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది. డిసెంబర్ 8న బ్రిస్బేన్‌లో మొదటి టెస్టు, 16న ఆడిలైడ్‌లో రెండో టెస్టు, 26న మెల్బోర్న్లో మూడో టెస్టు ఆడుతుంది. 2022 జనవరి 5న సిడ్నీలో నాలుగో టెస్టు, పెర్త్‌లో జనవరి 14న జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: టిమ్ పైన్ (సి), పాట్ కమిన్స్ , కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ , నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, జో రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్టార్క్, స్విప్సన్, డేవిడ్ వార్నర్ యాషెస్ సిరీస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. 1882 లో ది ఓవల్ స్టేడియంలో జరిగిన ఓ ఆసక్తికరమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఇంగ్లండ్ అనుహ్యంగా ఓడిపోయింది. అయితే ఇంగ్లండ్ గడ్డపై ఆసీస్‌కి ఇదే మొట్టమొదటి విజయం. దీంతో ఓ ఇంగ్లీష్ వార్తాపత్రిక, ఇంగ్లండ్ క్రికెట్ చనిపోయిందనే ఉద్దేశంతో 'అంత్యక్రియలు జరపగా వచ్చిన బూడిద (యాషెస్)ను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తారు’ అంటూ రాసుకొచ్చింది. 1883లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు, ఇంగ్లీష్ మీడియా ‘యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ’ వార్తలు ప్రచురించాయి. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్‌కి ‘ది యాషెస్’ అనే పేరు వచ్చింది. చదవవండి: కొత్త కెప్టెన్.. కొత్త కోచ్.. కొత్తకొత్తగా..! -
ఆ అవార్డు వార్నర్‌కు ఎలా ఇస్తారు..? మా వాడు ఉన్నాడుగా: షోయబ్ అక్తర్
Shoaib Akhtar Comments On Man Of The tournament Award T20 World Cup 2021: అందని ద్రాక్షగా ఊరిస్తున్న టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఎట్టకేలకు కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్-2021లో (నవంబర్ 14)న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో చారిత్రాత్మక విజయం సాధించిన.. ఆస్ట్రేలియా తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఈ విజయంలో ఆజట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ఒక్క ఫైనల్లోనే కాకుండా.. వార్నర్ టోర్నీ అంతటా అద్బుతంగా రాణించాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా డేవిడ్ వార్నర్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. అయితే డేవిడ్ వార్నర్‌ను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక చేయడంపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా స్పందించిన అక్తర్.. "ఇది అసలు సరైన నిర్ణయం కాదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ బాబర్ ఆజమ్ కు ఇస్తారాని ఎదురు చూశాను. ఇదైతే కచ్చితంగా అన్యాయమే "అంటూ ట్వీట్ చేశాడు. ఎందుకంటే.. ఈ టోర్నీలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం కూడా అద్బుతంగా రాణించాడు. ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లలో 303 పరుగులు చేసిన బాబర్ ఆజాం.. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. మరోవైపు వార్నర్.. ఏడు ఇన్నింగ్స్‌లలో 289 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన బాబర్‌కు అవార్డు ఇవ్వకుండా వార్నర్‌కు ఎలా ఇచ్చారాని ఐసీసీపై అక్తర్ మండి పడ్డాడు. చదవండి: T20 World Cup 2021: టీమిండియా ఆటగాళ్లకు ఐసీసీ షాక్! ఒక్కరంటే ఒక్కరికీ కూడా నో ఛాన్స్ Was really looking forward to see @babarazam258 becoming Man of the Tournament. Unfair decision for sure. — Shoaib Akhtar (@shoaib100mph) November 14, 2021 -
అనూహ్యంగా సిక్స్ కొట్టిన వార్నర్.. ‘అలా చేయడం నిజంగా సిగ్గు చేటు’
Gautam Gambhir And Ashwin Slams David warner: టీ20 ప్రపంచకప్-2021 లో భాగంగా గురువారం(నవంబర్11)న జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం సాధించి ఆస్టేలియా ఫైనల్లో అడుగు పెట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కొట్టిన ఒక సిక్సర్ మాత్రం ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ హఫీజ్ వేసిన డెడ్ బాల్‌ను డేవిడ్ వార్నర్ సిక్స్ కొట్టాడు. దీంతో వార్నర్ వ్యవహరించిన తీరును మాజీలు, క్రికెట్ నిపుణులు తప్పుపడుతున్నారు. వార్నర్ ఇలా చేయడం క్రీడా స్పూర్తి కి విరుద్దం అని పలువురు వార్నర్‌ను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ కూడా వార్నర్‌పై విమర్శల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ వ్యవహరించిన తీరు సిగ్గు చేటు అని గంభీర్ పెదవి విరిచాడు. అదే విధంగా ఈ వివాదంపై అశ్విన్ స్పందించాలంటూ ట్విటర్ వేదికగా కోరాడు. స్పందించిన అశ్విన్... ‘ఇప్పుడు వార్నర్ చేసింది సరైందే అయితే.. గతంలో నేను కూడా చేసింది (మాన్కడింగ్) సరైందే! వార్నర్ చేసింది తప్పు అయితే.. నేను చేసింది కూడా తప్పే’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆస్టేలియా ఇన్నింగ్స్‌లో 8 ఓవర్ వేయడానికి వచ్చిన మహ్మద్ హఫీజ్ ... తన తొలి బంతిని వేసే క్రమంలో అతడి చేతి బంతి నుంచి జారిపోయి డబుల్ బౌన్స్‌తో వైడ్ దిశగా వెళ్లింది. అయితే స్టైక్‌లో ఉన్న వార్నర్ ఆ బంతిని సిక్స్‌కు తరలించాడు. బంతి రెండుసార్లు బౌన్స్ కావడంతో అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. ఇక 49 పరుగులు చేసిన వార్నర్ ఆస్టేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా రెండో సెమిఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఆస్టేలియా.. న్యూజిలాండ్‌తో నవంబర్14న దుబాయ్ వేదికగా ఫైనల్లో తలపడనుంది. చదవండి: AUS Vs NZ: ఆసీస్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. ఇక కష్టమే! What an absolutely pathetic display of spirit of the game by Warner! #Shameful What say @ashwinravi99? pic.twitter.com/wVrssqOENW — Gautam Gambhir (@GautamGambhir) November 11, 2021 -
రెండు జట్లు ఓకే.. అయితే పాకిస్తానే నా ఫేవరెట్: టీమిండియా క్రికెటర్
Robin Uthappa Picks Pakistan As Favourites In Semi Final Clash Against Australia: టీ20 ప్రపంచకప్-2021 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే తొలి సెమిఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక గురువారం(నవంబర్11)న రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో భారత వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ కీలక పోరులో పాకిస్తాన్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుతుందని ఊతప్ప జోస్యం చెప్పాడు. ఈ టోర్నమెంట్లో ఇరు జట్లు అద్బుతంగా ఆడుతున్నాయని.. అయితే పాక్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదని, అందుకే ఫేవరెట్‌గా ఎంచుకున్నానని అతడు తెలిపాడు. "టీ20 ప్రపంచకప్‌లో తదుపరి సమరం పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా పాకిస్తాన్ కొనసాగుతుంది. అది వారికి కలిసిసొస్తుందని నేను ఆశిస్తున్నాను. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ టోర్నమెంట్లో ఆద్బుతంగా ఆడుతోంది. ఆసీస్‌ను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఐసీసీ టోర్నమెంట్లో వాళ్లకు మంచి రికార్డు ఉంది. కానీ టీ20 ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా టైటిల్‌ను అందకోలేకపోయారు. ఈ టోర్నీలో ఆసీస్ ఓపెనర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. కంగారూలు తమదైన రోజున ఏ జట్టునైనా ఓడించగలరు" అని ఊతప్ప పేర్కొన్నాడు. Koo App Can’t wait for the two super exciting semis coming up! #t20worldcup #EngVsNZ #PakVsAus #semifinals #sabsebadastadium View attached media content - Robin Uthappa (@robinuthappa) 10 Nov 2021 -
పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా జట్టు.. 1998 తర్వాత ఇప్పుడే..
Australia set for first tour of Pakistan in 24 years: 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు తొలి సారిగా పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. ఆసీస్ పర్యటనకు సంబంధించిన వివరాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోమవారం (నవంబర్ 8) వెల్లడించింది. ఈ సిరీస్ కరాచీలో జరగబోయే మొదటి టెస్ట్‌తో ప్రారంభమవుతుంది. రెండో టెస్ట్ రావల్పిండిలో, మూడో టెస్ట్‌తో పాటు మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ లాహోర్‌లో జరగనున్నాయి. 1998లో పాకిస్తాన్లో పర్యటించిన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా చివరిసారిగా 1998లో పాకిస్తాన్లో పర్యటించింది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల అనేక సార్లు పాక్ పర్యటను ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. 2002 పాకిస్తాన్లో పర్యటించాల్సిన ఆస్ట్రేలియా.. కరాచీలో ఆత్మాహుతి బాంబు దాడితో ఆ పర్యటను రద్దు చేసుకుంది. అదే విధంగా 2008లో పర్యటించాల్సిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన హింసాత్మకమైన ఘటనల నేపథ్యంలో పర్యటను మరోసారి రద్దు చేసుకుంది. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రదాడి ఆ తర్వాత 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరగడంతో.. ఏ జట్టు కూడా పాకిస్తాన్లో పర్యటించడానికి సాహసం చేయలేదు. ఇటీవలి కాలంలో శ్రీలంక, జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్టులు పాకిస్తాన్లో పర్యటించాయి. దీంతో మరోసారి ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల సందడి మొదలైంది. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌ని కూడా ఆ దేశ క్రికెట్ బోర్డు విజయవంతంగా నిర్వహిస్తుంది. ఈ లీగ్‌లో చాలా మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. మరో వైపు భద్రతా కారణాల దృష్ట్యా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాక్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పర్యటనకు ఆస్ట్రేలియా ఆమోదం తెలపడం గమనార్హం చదవండి: Sanju Samson: రాజస్తాన్‌కు బిగ్ షాక్: జట్టును వీడనున్న సంజూ శాంసన్.. సీఎస్కేకు!? -
ఆఫ్ఘనిస్తాన్‌కి షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
Australia Postpone First Ever Test Match Against Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నవంబర్ 27 నుంచి టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. దేశంలో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మహిళల క్రీడలపై నిషేధం విధించారు. దీంతో ఆస్ట్రేలియా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహిళా క్రికెట్‌పై నిషేధం కొనసాగితే టెస్టును రద్దు చేయాలని ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్లుఘా దేశ క్రికెట్ బోర్డును సూచించినట్లు సమాచారం. "ప్రస్తుత అనిశ్చితి దృష్ట్యా ఆఫ్ఘాన్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ నిర్వహించడం సరికాదని మేం భావిస్తున్నాం. అందకే ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డుతో చర్చల తర్వాత టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేయాలాని నిర్ణయించకున్నాము. ఆఫ్ఘనిస్తాన్‌లో పురుషులు, మహిళల క్రికెట్ అభివృద్దికి ఆస్ట్రేలియా ఎప్పడూ కట్టుబడి ఉంటుంది" అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఆస్ట్రేలియా నిర్ణయంపై ఆఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్ నబీ స్పందించాడు. ఈ ఏడాది టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం నిరాశపరిచింది అని తెలిపాడు. "ఈ సంవత్సరం టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం నిరాశపరిచింది, అయితే మ్యాచ్ వాయిదా మాత్రమే వేయబడింది. పూర్తిగా రద్దు కానుందున నేను సంతోషంగా ఉన్నాను" అని నబీ పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2021 NZ Vs NAM: కివీస్ బౌలర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..