
యాషెస్ ఐదో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా హోబర్ట్ వేదికగా జరిగే ఐదో టెస్ట్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ధృవీకరించాడు. కాగా నాల్గవ టెస్ట్‌లో జోస్ బట్లర్ గాయడ్డాడు. ఇక అఖరి టెస్ట్‌లో బట్లర్ స్ధానంలో జానీ బెయిర్‌స్టో వికెట్ కీపింగ్ చేయనున్నాడు.
"బట్లర్ చేతి వేలుకు తీవ్రమైన గాయమైంది. దీంతో అతడు తన ఇంటికి వెళ్లనున్నాడు. అతడు హోబర్ట్ టెస్ట్‌కు దూరం కావడం మాకు పెద్ద ఎదురుదెబ్బ. జట్టు కష్టపరిస్థితిల్లో ఉన్నప్పడు చాలా సార్లు అండగా నిలిచాడు" అని రూట్ పేర్కొన్నాడు. ఇక యాషెస్ సిరీస్‌లో వైట్ వాష్ నుంచి ఇంగ్లండ్ తప్పించుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌ను ఇంగ్లండ్ డ్రాగా ముగించింది. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు మధ్య అఖరి టెస్ట్ జనవరి 14న ప్రారంభం కానుంది.
చదవండి: Devon Conway: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment