ashes test series
-
Ashes 5th Test: మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధం..
లండన్: ఈసారి యాషెస్ సిరీస్ మునుపెన్నడు లేని విధంగా పోటాపోటీగా జరుగుతోంది. ఇప్పుడు ఆఖరి మజిలీ కూడా రసవత్తరంగా మారింది. అయితే ఆటలో అరటిపండులా... రసపట్టుపై వాన చినుకులు అంతరాయం కలిగించాయి. ఆదివారం నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 389/9తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన మరో ఇంగ్లండ్ 6 పరుగులు చేసి ఆలౌటైంది. అండర్సన్ (8)ను అవుట్ చేసి మర్ఫీ (4/110) కూడా స్టార్క్ (4/100)తో సమంగా నిలిచాడు. అనంతరం 384 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 38 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 135 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (58 బ్యాటింగ్; 9 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (69 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ చివరిరోజు సోమవారం ఆసీస్ నెగ్గాలంటే మరో 249 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ గెలవాలంటే పది వికెట్లు తీయాలి. లంచ్ బ్రేక్ దాకా 75/0 స్కోరు చేసిన ఆసీస్ రెండో సెషన్లోనూ అదే ఆటను కొనసాగించడంతో ఖ్వాజా, వార్నర్ అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. తర్వాత కాసేపటికే వర్షం ముంచెత్తింది. దీంతో ఈ సెషన్లో కేవలం 14 ఓవర్ల ఆటే సాధ్యపడింది. ప్రస్తుతం ఆసీస్ 2–1తో ఆధిక్యంలో ఉంది. గత యాషెస్ సాధించడంతో ఈ మ్యాచ్‌తో సంబంధం లేకుండానే సిరీస్‌ను నిలబెట్టుకుంది. చదవండి: Ashes 5th Test Day 4: డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు -
యాషెస్ సిరీస్: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్ తొలి రోజు హైలైట్స్ (ఫోటోలు)
-
'మ్యాచ్ పోతే పోయింది.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు'
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బజ్‌బాల్ క్రికెట్‌తో దూకుడు ప్రదర్శిస్తున్న ఆ జట్టుకు ఆసీస్ ముకుతాడు వేసింది. అయితే మ్యాచ్ ఓటమిపై స్టోక్స్ తనదైన శైలిలో స్పందించాడు. మ్యాచ్ ఓడిపోయామన్న బాధ ఉన్నా బజ్‌బాల్ క్రికెట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ పేర్కొన్నాడు. ''మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు.. కానీ ఒక విషయంలో సంతోషంగా ఉంది. అదేంటంటే మ్యాచ్‌ను ఆఖరి నిమిషం వరకు తీసుకెళ్లడం. ఒక గొప్ప గేమ్‌లో భాగస్వామ్యం కావడం.. మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు కూడా ఐదురోజుల పాటు ఎడ్జ్ ఆఫ్ సీట్ ఫీల్‌ను అనుభవించారు. ఒక టెస్టు క్రికెట్‌కు కావాల్సింది ఇదే. యాషెస్‌ను ఇరుదేశాల్లో ఎంతలా ఆదరిస్తానేది మరోసారి కనిపించింది. మ్యాచ్‌లో ఎవరో ఒకరే గెలవాలి..ఇవాళ మేం ఓటమి డెడ్‌లైన్‌ను దాటలేకపోయాం. అంతమాత్రానా మా ఆటతీరును మార్చుకోలేం. బజ్‌బాల్ క్రికెట్‌ను కంటిన్యూ చేస్తాం. ఈ మ్యాచ్‌లో మా వ్యూహాలను ఎదుర్కోవాలనే ప్లాన్‌తో ఆసీస్ వచ్చింది. మేం జస్ట్ మిస్ అయ్యాం. లేదంటే ఇక్కడ వేరే ఫలితం గురించి మాట్లాడుకునేవాళ్లం. ఈ సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్ మాత్రమే. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. చాలా క్రికెట్ ఆడాలి. ఇప్పుడు మా ఫోకస్ అంతా ఆ మ్యాచ్‌లపైనే. చేతిలో వికెట్లు ఉండి కూడా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను తొలిరోజే డిక్లేర్ చేయడం వెనుక నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. ఈరోజు దీనికి క్లారిటీ ఇస్తున్నా. నేను ఒక కెప్టెన్‌ను కాబట్టి.. ఆ టైంలో ఆస్ట్రేలియాను మరింత ఒత్తిడిలోకి నెట్టొచ్చు అనిపించింది. అందుకే ఆ పని చేశా. ఏ ఓపెనింగ్ బ్యాటర్ కూడా ఆట ముగియడానికి 20 నిమిషాల ముందు బ్యాటింగ్‌కు వెళ్లాలని అనుకోడు. అందుకే ఆ పని చేశా. అయితే ఆ రోజు ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ ఎలాంటి పొరపాటు చేయకుండా తొలి రోజు ఆటను ముగించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయినా కూడా.. ఇంగ్లండ్‌కు కేవలం 7 పరుగుల ఆధిక్యమే లభించింది. అదే ఇంగ్లండ్ కనుక తొలి రోజు డిక్లేర్ చేయకుండా మరికొంత సమయం ఆడి ఉంటే మరింత ఆధిక్యం లభించేదే. మేం ఆడిన విధానం, ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడి చేయడం చూసి డిక్లేర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నా. డిక్లేర్ చేయకపోతే ఐదో రోజు ఇంత ఎగ్జయిట్మెంట్ వచ్చేదా? చెప్పండి'' అంటూ ప్రశ్నించాడు. మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
రసవత్తరంగా యాషెస్ తొలి టెస్టు.. స్టేడియంలో కన్పించిన షాహీన్ అఫ్రిది! ఫోటో వైరల్
యాడ్జ్బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరగుతున్న యాషెస్ తొలి టెస్టు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో బోణీ కొట్టేందుకు ఆఖరి రోజు ఆసీస్‌కు మరో 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్‌కు మరో 7 వికెట్లు కావాలి. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆటముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్రీజులో క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా(34), స్కాట్ బోలాండ్(13) నాటౌట్‌గా ఉన్నారు. స్టేడియంలో కన్పించిన షాహీన్ ఇక రసవత్తరంగా సాగుతున్న ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంకు వచ్చాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 33 ఓవర్లో షాహీన్ కెమరా కంట పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అఫ్రిది ప్రస్తుతం ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో బీజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో నాటింగ్‌హామ్‌షైర్ అఫ్రిది ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌తో రెడ్‌బాల్ క్రికెట్లో అఫ్రిది పునరాగమనం చేయనున్నాడు. గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి టెస్టు జట్టుకు అఫ్రిది దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అఫ్రిదికి చోటు దక్కింది. చదవండి: #Ashes2023: ఇదేమి యార్కర్రా బాబు.. దెబ్బకు బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ Shaheenn Shah Afridi at Edgbaston, watching the 1st #ashes test day 4 pic.twitter.com/L1rNZBCJK8 — Team Shaheen Afridi (@TeamShaheenShah) June 19, 2023 -
తీరు మారని వార్నర్.. మరోసారి బ్రాడ్దే పైచేయి! వీడియో వైరల్
టెస్టుల్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న యాషెస్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా డేవిడ్ భాయ్ ఇదే తీరును కనబరిచాడు. తీరు మారని వార్నర్.. డేవిడ్ వార్నర్‌పై మరోసారి ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పైచేయి సాధించాడు. అద్భుతమైన బంతితో వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. టెస్టుల్లో వార్నర్‌ను బ్రాడ్ ఔట్ చేయడం 15వసారి కావడం గమనార్హం. టెస్టుల్లో ఓవరాల్‌గా బ్రాడ్ బౌలింగ్‌లో 734 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. కేవలం 26.46 సగటుతో 397 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఇంగ్లడ్ గడ్డపై వార్నర్‌ను బ్రాడ్ ఎక్కువసార్లు ఔట్ చేశాడు. తన సొంత గడ్డపై 9 సార్లు వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 2013 నుంచి టెస్టుల్లో వార్నర్‌కు బ్రాడ్ చుక్కలు చూపిస్తునే వస్తున్నాడు. క్రికెట్లో వార్నర్‌ను ఏ బౌలర్ కూడా ఇన్ని పర్యాయాలు ఔట్ చేయలేదు. వార్నర్‌ను బ్రాడ్ ఏకంగా నాలుగు సార్లు డకౌట్ చేశాడు. కాగా వార్నర్‌కు ఇదే ఆఖరి యాషెస్ సిరీస్. కనీసం ఈ సిరీస్‌లోనైనా బ్రాడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 16 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(22),స్టీవ్ స్మిత్(7) పరుగులతో ఉన్నారు. చదవండి: PAK vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన!స్టార్ బౌలర్ వచ్చేశాడు Broad beats Warner again! 🐇pic.twitter.com/hiHb1BNcK6 — ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2023 -
ఐదు వికెట్లతో చెలరేగిన బ్రాడ్.. 172 పరుగులకే ఐర్లాండ్ ఆలౌట్
లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు సన్నాహంగా ఐర్లాండ్‌తో ఆడుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజే అన్ని విభాగాల్లో శాసించింది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఐర్లాండ్ 56.2 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ సీమర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) నిప్పులు చెరిగాడు. దీంతో టాపార్డర్‌లో జేమ్స్ (36; 5 ఫోర్లు), పీటర్ మూర్ (10; 2 ఫోర్లు), కెప్టెన్ బాల్బిర్నీ (0) సహా... టెక్టర్ (0), లోయర్ ఆర్డర్లో అడెర్ (14; 2 ఫోర్లు)లు బ్రాడ్ పేస్ పదునుకు తలవంచారు. 98 పరుగులకు 5 వికెట్లు కోల్పోగా... ఇందులో 4 వికెట్లు బ్రాడ్వే! ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో క్యాంఫర్ (33; 6 ఫోర్లు), పాల్ స్టిర్లింగ్ (30; 5 ఫోర్లు) కాసేపు ఇంగ్లండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచారు. స్పిన్నర్ జాక్ లీచ్ 2, మాథ్యూ పాట్స్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలీ (56; 11 ఫోర్లు), డకెట్ (60 బ్యాటింగ్; 8 ఫోర్లు) 16.3 ఓవర్లలోనే వేగంగా 109 పరుగులు జోడించారు. క్రాలీని హ్యాండ్ అవుట్ చేయగా, డకెట్‌తో ఒలీ పోప్ (29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 20 పరుగుల దూరంలోనే ఉంది. చేతిలో 9 వికెట్లున్నాయి. చదవండి: Josh Tongue: ఇంగ్లండ్‌కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్‌పాట్ కొట్టేశాడు The I̶a̶n̶ ̶B̶e̶l̶l̶ Ollie Pope cover drive... One of the most pleasing shots in cricket 😍 Get it on repeat 🔁 #EnglandCricket | #ENGvIRE pic.twitter.com/our07uvBgw — England Cricket (@englandcricket) June 1, 2023 -
కౌంటీల్లో ఆడనున్న స్మిత్! ద్రోహులు అంటూ ఫైర్! తప్పేముంది?
Steve Smith- Sussex Deal: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడనున్నాడు. ససెక్స్ జట్టు తరఫున మూడు మ్యాచ్‌లలో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని స్మిత్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే ససెక్స్ క్రికెట్ హెడ్ పాల్ ఫాబ్రేస్తో మాట్లాడానని, కౌంటీల్లో ఆడనుండటం నిజమేనని ధ్రువీకరించాడు. అందుకే ఈ నిర్ణయం తనకు ఇదో సరికొత్త అనుభవమన్న స్మిత్.. యువ క్రికెటర్లతో కలిసి బ్యాటింగ్ చేయడం కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. యంగ్ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకోవడం ద్వారా వాళ్లను మెంటార్ చేసే అవకాశం కూడా వస్తుందని, ఇది తనకు సంతృప్తినిస్తుందని స్మిత్ సంతోషం వ్యక్తం చేశాడు. మండిపడుతున్న అభిమానులు కాగా ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ ఏడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సన్నాహకాల్లో భాగంగా స్మిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. స్మిత్ కౌంటీల్లో ఆడటంపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడికి ఈ అవకాశం ఇచ్చిన ససెక్స్ జట్టును ద్రోహులుగా అభివర్ణిస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. యాషెస్ సిరీస్‌కు ముందు ఆసీస్ ఆటగాళ్లను ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడించడం ప్రతికూల ప్రభావం చూపుతుందని మండిపడుతున్నారు. తప్పేముందన్న మాజీ సారథి అయితే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ మైకేల్ వాన్ భిన్నంగా స్పందించాడు. స్మిత్ కౌంటీల్లో ఆడటాన్ని అతడు స్వాగతించాడు. స్మిత్ వంటి మేటి టెస్టు క్రికెటర్లు ససెక్స్ డ్రెస్సింగ్‌రూంలో ఉండటం.. యువ ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతుందని, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్.. మైకేల్ వ్యాఖ్యలతో ఏకీభవించినప్పటికీ.. యాషెస్ సిరీస్(డిసెంబరులో)కు ముందు ఇలాంటి నిర్ణయం సరికాదని పెదవి విరిచాడు. చదవండి: పిచ్చిగా మాట్లాడొద్దు.. అతడిని చూసి నేర్చుకో! అంటే.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా? ఫ్యాన్స్ ఫైర్ Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. Great signing for our game … Well done 👍👍 https://t.co/Qs2iqrBARy — Michael Vaughan (@MichaelVaughan) January 19, 2023 -
జో రూట్ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్ కెప్టెన్సీకి గుడ్‌బై
ఇంగ్లండ్ టెస్టు సారథి జో రూట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు రూట్ శుక్రవారం ప్రకటించాడు. యాషెస్ సిరీస్‌లో ఘోరపరాభవం, వెస్టిండీస్ పర్యటనలో ఓటమి అనంతరం రూట్ కెప్టెన్సీ వైదొలగాలని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రూట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెటరన్ బ్యాటర్ అలిస్టర్ కుక్ రాజీనామా చేసిన తర్వాత 2017లో జో రూట్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రూట్ (64మ్యాచ్‌లు) రికార్డు సృష్టించాడు. తన ఐదేళ్ల కెప్టెన్సీ లో ఇంగ్లండ్‌కు 27 విజయాలు అందించి అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కూడా రూట్ కలిగి ఉన్నాడు."నా దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇంగ్లండ్ వంటి జట్టకు కెప్టెన్‌గా మరి కొంత కాలం కొనసాగాలని భావించాను. కానీ ఇటీవల కాలంలో అనూహ్య పరిణమాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ ఒత్తిడి నా ఆటపై ప్రభావం చూపింది. ఇంగ్లండ్ తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఎంపికైన నా వంతు సహాయం చేయడానికి నేను ఎప్పుడు సిద్దంగా ఉంటాను. నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన అభిమానులకు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు దన్యవాదాలు" అని రూట్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 RR Vs GT: "అది ఒక చెత్త నిర్ణయం.. అశ్విన్ ఆ స్థానంలో బ్యాటింగ్‌కు అవసరమా" -
'ఇప్పుడు నా టార్గెట్ అదే.. ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా'
యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం తర్వాత ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి క్రిస్ సిల్వర్‌వుడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాల్ కాలింగ్‌వుడ్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా హెడ్ కోచ్ పదవి కోసం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తదుపరి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఆసక్తి చూపుతున్నాడు. కాగా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్.. ది హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ జట్లకు మెంటార్‌గా వార్న్ ఉన్నాడు. 'ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి నేను సిద్దంగా ఉన్నాను. జట్టును విజయ పథంలో నడిపించగలను అని అనుకుంటున్నాను. ఇంగ్లండ్‌లో చాలా మంది అత్యత్తుమ ఆటగాళ్లు ఉన్నారు. ప్రాథమికంగా జట్టులో కొన్ని మార్పులను చేస్తే చాలు. అదే విధంగా జట్టులో అద్భుతమైన బౌలర్లతో పాటు, ఫీల్డర్లు ఉన్నారు. కానీ ప్రస్తుతం వారు అంతగా రాణించలేకపోతున్నారు' అని వార్నర్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ కోచ్ పదవికోసం ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ కూడా పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి జస్టిన్ లాంగర్ తప్పుకున్నాడు. చదవండి: Prasidh Krishna: బౌలింగ్‌లో దుమ్మురేపాడు.. రాజస్తాన్ రాయల్స్ పంట పండినట్లే -
యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం.. 8 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లపై వేటు!
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభావం పొందిన ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టెస్టులకు 16 మంది సభ్యలుతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. అయితే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు మందు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. యాషెస్ సిరీస్‌లో పాల్గొన్న ఎనిమిది మంది ఆటగాళ్లపై సెలెక్షన్ ప్యానల్ వేటు వేసింది. జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, హసీబ్ హమీద్ . డేవిడ్ మలన్ సహ మరికొంత మంది ఆటగాళ్లపై వేటు పడింది. అలెక్స్ లీస్,మాథ్యూ ఫిషర్ వంటి యువ ఆటగాళ్లు ఇంగ్లండ్ తరుపున టెస్టుల్లో అరంగట్రేం చేయనున్నారు. ఇక ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్- వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మార్చి 8న ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జొనాథన్ బెయిర్‌స్టో, జాక్ క్రాలీ, మాథ్యూ ఫిషర్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, సాకిబ్ మహమూద్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పార్కిన్సన్, ఒల్లీ పోప్, బెన్ స్టీక్ రాబిన్సన్ , క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా! -
మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. స్టార్ క్రికెటర్ రొమాంటిక్ మూమెంట్
ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్- ఆస్ట్రేలియన్ స్టార్ వుమెన్ క్రికెటర్ అలీసా హేలీల లవ్‌స్టోరీ అందరికి తెలిసిందే. క్యూట్ లవ్కపుల్గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు 2016లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు. మిచెల్ స్టార్క్ ప్రస్తుతం ఆసీస్ జట్టులో అన్ని ఫార్మాట్లలోనూ కీలకబౌలర్‌గా సేవలందింస్తున్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి స్టార్క్ ఇప్పటివరకు 529 వికెట్లు తీశాడు. మరోవైపు అలీసా హేలీ ఆస్ట్రేలియన్ వుమెన్స్ టీమ్‌లో ప్రధాన బ్యాటర్‌గా రాణిస్తుంది. టి20ల్లో 2,136 పరుగులు, వన్డేల్లో 2039 పరుగులు, ఆరు టెస్టుల్లో 236 పరుగులు చేసింది. చదవండి: WI vs ENG: అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం ఇక ఆస్ట్రేలియా మెన్స్ టీమ్‌కు ప్రస్తుతం ఏ సిరీస్‌లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్.. ఆస్ట్రేలియన్ వుమెన్స్ యాషెస్ టెస్టు మ్యాచ్ చూడడానికి వచ్చాడు. మ్యాచ్ చివరిరోజు ఆటలో కాసేపు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్‌రూమ్‌లో మిచెల్ స్టార్క్, అలీసా హేలీల రొమాంటిక్ యాంగిల్ కెమెరాలకు చిక్కింది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు. ఆ తర్వాత హేలీ.. డోనట్‌ను స్టార్క్‌కు ఇచ్చింది. స్టార్క్ ఆ డోనట్‌ను సగం చేసి తన భార్యకు ప్రేమతో తినిపించాడు. ఈ సమయంలో మైదానంలోని కెమెరాలన్నీ వీరిద్దరిపై ఫోకస్ చేశాయి. ఇది చూసిన సహచర మహిళ ప్లేయర్స్ వారిద్దరి క్యూట్లవ్కు తెగ ముచ్చటపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్‌తో వుమెన్స్‌తో జరిగిన ఏకైక యాషెస్ టెస్టు డ్రాగా ముగిసింది. 48 ఓవర్లలో 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులతో విజయం దిశగా సాగింది. అయితే ఆసీస్ వుమెన్స్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగి కేవలం 26 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను పడగొట్టారు. దీంతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు అయింది ఇంగ్లండ్ పరిస్థితి. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ కష్టతరంగా డ్రా చేసుకుంది. 48 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఆస్ట్రేలియన్ వుమెన్స్‌లో అన్నాబెల్ సుథర్లాండ్ 3, అల్నా కింగ్ 2, ఎలిస్ పెర్రీ, డార్సీ బ్రౌన్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Akhtar Vs Brett Lee: ఫైనల్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న క్రికెటర్లు Cute 🥰#Ashes pic.twitter.com/WlAMXUXzoy — 7Cricket (@7Cricket) January 30, 2022 -
దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం
ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ బెత్ మూనీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఇంగ్లండ్‌తో యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండోరోజు ఆటలో బెత్‌మూనీ డైవ్ చేసి బౌండరీని సేవ్ చేయడం వైరల్‌గా మారింది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ప్రాక్టీస్ సెషన్లో బెత్‌మూనీ ఫీల్డింగ్ చేస్తూ జారిపడింది. వేగంగా పడడంతో ఆమె దవడ పగిలింది. ముఖమంతా రక్తమయమయింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చదవండి: IPL 2022: సగం సీజన్ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి వైద్యులు ఆమె ముఖానికి మూడు మెటల్ప్లేట్స్ అమర్చి కుట్లు వేసి సర్జరీ చేశారు. దవడ బాగానికి బలంగా తాకడంతో గట్టి పదార్థాలు తినకూడదని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో బెత్‌మూనీ తన రోజూవారి ఆహరంలో సూప్, మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌లను కేవలం స్ట్రా ద్వారా మాత్రమే తీసుకుంది. దాదాపు పదిరోజుల పాటు బెత్‌మూనీ ఆహారం ఇదే. సరిగ్గా పదిరోజుల తర్వాత పడిలేచిన కెరటంలా బెత్‌మూనీ యాషెస్‌లో బరిలోకి దిగింది. రెండోరోజు ఆటలో బెత్‌మూనీ బౌండరీలైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని ఆపడం కెమెరాలకు చిక్కింది. గాయం నొప్పి ఇంకా ఉన్నప్పటికి ఏ మాత్రం లెక్కచేయకుండా జట్టుకోసం బరిలోకి దిగిన బెత్మూనీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బెత్ మూనీ దైర్యాన్ని తాము మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామని.. సర్జరీ జరిగిన కేవలం పదిరోజుల్లోనే తిరిగి క్రికెట్ ఆడిన బెత్‌మూనీ మాకు ఆదర్శప్రాయమని ఆ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వుమెన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కెప్టెన్ హెథర్ నైట్ 127 పరుగులు నాటౌట్, సోఫీ ఎసిల్స్టోన్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. Playing with a broken jaw and Beth Mooney is still throwing herself around in the field 😳 #Ashes pic.twitter.com/hBjxOnVgtw — 7Cricket (@7Cricket) January 28, 2022 -
ఇంగ్లండ్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!
యాషెస్ ఐదో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా హోబర్ట్ వేదికగా జరిగే ఐదో టెస్ట్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ధృవీకరించాడు. కాగా నాల్గవ టెస్ట్‌లో జోస్ బట్లర్ గాయడ్డాడు. ఇక అఖరి టెస్ట్‌లో బట్లర్ స్ధానంలో జానీ బెయిర్‌స్టో వికెట్ కీపింగ్ చేయనున్నాడు. "బట్లర్ చేతి వేలుకు తీవ్రమైన గాయమైంది. దీంతో అతడు తన ఇంటికి వెళ్లనున్నాడు. అతడు హోబర్ట్ టెస్ట్‌కు దూరం కావడం మాకు పెద్ద ఎదురుదెబ్బ. జట్టు కష్టపరిస్థితిల్లో ఉన్నప్పడు చాలా సార్లు అండగా నిలిచాడు" అని రూట్ పేర్కొన్నాడు. ఇక యాషెస్ సిరీస్‌లో వైట్ వాష్ నుంచి ఇంగ్లండ్ తప్పించుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌ను ఇంగ్లండ్ డ్రాగా ముగించింది. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు మధ్య అఖరి టెస్ట్ జనవరి 14న ప్రారంభం కానుంది. చదవండి: Devon Conway: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా! -
ఏందయ్యా ఇది.. స్టంప్స్ తాకినా బెయిల్స్ కదల్లా.. స్టోక్స్ బచాయించాడు పో!
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్టులో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 30 వ ఓవర్ వేసిన కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో.. బెన్ స్టోక్స్ డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నించగా బంతి మిస్ అయ్యి ప్యాడ్ తాకినట్లుగా కీపర్ చేతికి వెళ్లింది. ఈ క్రమంలో కీపర్‌తో పాటు బౌలర్ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. వెంటనే స్టోక్స్ రివ్యూ తీసుకున్నాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. రీప్లేలో బంతి నేరుగా ప్యాడ్ తాకకుండా, ఆఫ్ స్టంప్‌ని తాకింది. అయితే బంతి స్టంప్స్‌ని తాకినా బెయిల్స్ పడక పోవడం గమనర్హం. కాగా రీప్లేలో అది చూసిన స్టోక్స్.. బతికి పోయాను అంటూ గట్టిగా నవ్వాడు. అయితే ఈ సంఘటన మాత్రం ఆసీస్ క్రికెటర్లతో పాటు, అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా చివరికి 66 పరుగులు చేసిన స్టోక్స్, లయాన్ బౌలింగ్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. మూడో టెస్ట్‌కు స్టార్ బౌలర్ దూరం! One of the strangest things ever I have seen in cricket - Stokes was given LBW but actually, the ball hit on the stumps, and the bails didint move. pic.twitter.com/h2ZMNwNd2X — Johns. (@CricCrazyJohns) January 7, 2022 UNBELIEVABLE #Ashes pic.twitter.com/yBhF8xspg1 — cricket.com.au (@cricketcomau) January 7, 2022 -
ఏడంకెల జీతం ఉంది కదా.. అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరం కావొద్దు!
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పటికే వరసుగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఇంగ్లండ్ సిరీస్‌ను చేజార్చుకుంది. దీంతో రూట్ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ అసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో ఆడేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరం కావద్దని అతడు సూచించాడు. ఇంగ్లండ్ టీమ్ మెనేజ్మెంట్ వెంటనే జట్టు వైఫల్యాలపై చర్చించి మార్పులతో ముందుకు వెళ్లాలని అథర్టన్ తెలిపాడు. అదే విధంగా టెస్ట్ జట్టు కెప్టెన్‌గా రూట్ స్ధానంలో బెన్ స్టోక్స్‌ని నియమించాలని అతడు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని అథర్టన్ పేర్కొన్నాడు. "ఇంగ్లండ్ జట్టులో చాలా మంది ఆటగాళ్లకి ఏడంకెల జీతం ఈసీబీ చెల్లిస్తుంది. కానీ ఐపీఎల్ సమయంలో రెండు నెలలపాటు ఈసీబీ వారి సేవలను కోల్పోతుంది. ఐపిఎల్,ఇతర ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడాడనికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఈసీబీ ఎందకు ఇస్తుందో నాకు అర్ధం కావడం లేదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈసీబీ నిర్ణయాలు తీసుకుంటే బాగుటుంది. ఐపీఎల్లో ఆడేందుకు ఆటగాళ్లు తమ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎట్టి పరిస్ధితుల్లో దూరం కావద్దు" అని అతడు పేర్కొన్నాడు. కాగా జోస్ బట్లర్, బెన్‌స్టోక్స్, మోయిన్ అలీ వంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారు. చదవండి: SA vsIND: "టీమిండియా వన్డే వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా.. ఇది అద్భుతమైన నిర్ణయం" -
ట్రవిస్ హెడ్‌కు కరోనా... మరి యాషెస్ సిరీస్?
సిడ్నీ: ‘యాషెస్’ సిరీస్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రవిస్ హెడ్ కరోనా పాజిటివ్‌గా తేలాడు. దాంతో సిడ్నీలో ఈనెల 5 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకు అతను దూరమయ్యాడు. హెడ్ స్థానంలో ముగ్గురు ఆటగాళ్లు మిచెల్ మార్ష్, నిక్ మ్యాడిసన్, జోష్ ఇంగ్లిస్‌లను ఆసీస్ జట్టులోకి ఎంపిక చేశారు. కరోనా సోకడంతోనే ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కూడా సిడ్నీ టెస్టు బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. -
55 నిమిషాల పాటు నరకం అనుభవించా: స్టీవ్ స్మిత్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెల్బోర్న్ హోటల్ రూంలో సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్మిత్ కూడా వారి సంబరాలకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవాలనుకున్నాడు. అయితే అనుకోకుండా తాను ఎక్కిన లిఫ్ట్ డోర్ ఇరుక్కుపోయింది. దీంతో ఈ వైస్ కెప్టెన్ సాంకేతిక కారణాలతో 55 నిమిషాల పాటు లిఫ్ట్‌లో గడపాల్సి వచ్చింది. తన సహచర క్రికెటర్ మార్నస్ లబుషేన్ స్మిత్‌ను బయటికి తీసే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకపోయింది. చివరికి లిఫ్ట్ టెక్నిషియన్ వచ్చి స్మిత్‌ను క్షేమంగా బయటికి తీశాడు. ఈ మొత్తాన్ని స్మిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీవేలో చెప్పుకొచ్చాడు. చదవండి: Ashes Series 2021-22: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌కు కరోనా.. '' లిఫ్ట్ ఎక్కిన తర్వాత నేను వెళ్లాల్సిన ఫ్లోర్ వచ్చినప్పటికి డోర్స్ ఓపెన్ కాలేదు. దీంతో బయట ఉన్న మార్నస్ లబుషేన్‌కు సమాచారం అందించాను. ఒకవైపు నేను ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా.. అటువైపు లబుషేన్ కూడా ప్రయత్నించాడు. మా ప్రయత్నాలు ఫలించకపోవడంతో లిఫ్ట్ ఆపరేటర్ వచ్చి నన్ను కాపాడాడు. పోయిన ప్రాణం తిరిగివచ్చింది అనుకున్నా ఆ క్షణంలో.. ఇక 55 నిమిషాల పాటు లిఫ్ట్‌లో నరకం అనుభవించా. ఆ తర్వాత రూమ్‌లోకి వచ్చి రెస్ట్ తీసుకున్నా'' అంటూ రాసుకొచ్చాడు. ఇక యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపుతుంది. వరుసగా మూడు టెస్టుల్లో భారీ విజయాలు అందుకున్న ఆసీస్ ఐదు టెస్టుల సిరీస్‌లో 3-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు జనవరి 5 నుంచి 9 వరకు సిడ్నీ వేదికగా జరగనుంది. చదవండి: Year End 2021: నిజంగానే అపురూపం.. ఆటల్లో ఎన్నో అద్భుతాలు, మరెన్నో.. such incredible content from the big man stuck in a lift pic.twitter.com/5XtZasAMWk — Abi Slade (@abi_slade) December 30, 2021 -
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌కు కరోనా..
యాషెస్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ట్రావియస్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. దీంతో సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌కు అతడు దూరమయ్యాడు. శుక్రవారం హెడ్‌కి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా తెలినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అయితే ప్రస్తుతం అతడికి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో, తన భార్యతో కలిసి మెల్బోర్న్లో ఐషోలేషన్‌లో ఉన్నాడు. కాగా ప్రతిష్టాత్మాక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో జో రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా హెడ్ ఉన్నాడు. ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 248 పరుగులు చేశాడు. ఇక నాలుగో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 5 నుంచి జరగనుంది. చదవండి: Quinton De Kock/ IND Vs SA: భారత్‌తో ఓటమి.. డికాక్ సంచలన నిర్ణయం! -
'ఇంగ్లండ్ జట్టులో అందరిని తొలగించండి'
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. ఆడిన మూడు టెస్టుల్లోనూ ఘోర పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించింది. మిగిలిన రెండు టెస్టులు నామమాత్రంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటతీరును ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇంగ్లండ్ ఆటతీరుపై ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: IND vs SA: నో బాల్స్ వేయడమే గగనం.. చెత్త రికార్డులేంది? రూట్ సహా జట్టు మొత్తాన్ని తొలగించాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఆ దేశ అభిమానులు ఏకిపారేశారు. ఇంగ్లండ్ ఆటతీరును దుమ్మెత్తిపోస్తూ.. టీమ్ మొత్తాన్ని తొలగిస్తే గానీ మా ఆవేశం చల్లారదంటూ డిమాండ్ చేశారు. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ రాణిస్తున్న చోట ఇంగ్లండ్ బ్యాటర్లు మాత్రం ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదంటూ తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడూ ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో ఒక్క రూట్ మినహా మిగిలిన ఏ ఒక్కరు కనీసం అర్థ సెంచరీ నమోదు చేయలేకపోయారు. 2019లో వన్డే ప్రపంచకప్ సాధించిన ఇంగ్లండ్.. అప్పటినుంచి వారి ఆటతీరుకు సంబంధించిన గ్రాఫ్ పూర్తిగా పడిపోతూ వస్తుంది. గాయాలతో.. వ్యక్తిగత కారణాలతో ఆటగాళ్లు దూరంగా ఉండడం ఆ జట్టు ఆటను పూర్తిగా దెబ్బతీస్తుంది. రొటేషన్ పాలసీ పేరుతో స్టువర్ట్ బ్రాడ్ లాంటి సీనియర్ ఆటగాడిని అసలు జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదనేది ఇప్పటికి అర్థం కాలేదంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్‌కు పుట్టినిల్లుగా అభివర్ణించే ఇంగ్లండ్ ఈ రకమైన అవమానాలను ఎప్పుడు ఎదుర్కోలేదనే చెప్పాలి. మరి యాషెస్ సిరీస్ ముగించుకొని సొంతగడ్డపై అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లండ్‌కు ఫ్యాన్స్ నుంచి ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: Rishab Pant: ఏకకాలంలో ధోని, సాహా రికార్డు బద్దలుకొట్టిన పంత్ -
ఎంతైనా వార్నర్ కూతురు కదా.. ఆ మాత్రం ఉండాలి
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికి విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇప్పటికే మూడు టెస్టులు వరుసగా గెలిచిన ఆసీస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 3-0తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. కాగా ఇరుజట్ల మధ్య జనవరి 5 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. చదవండి: Mohammed Shami: సూపర్ షమీ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఈ విషయం పక్కనబెడితే.. వార్నర్ ఆటలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. కుటుంబంతో కూడా అంతే ఆనందంగా గడుపుతాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడోటెస్టుకు వార్నర్ ఫ్యామిలీ కూడా హాజరైంది. మ్యాచ్ గెలిచిన తర్వాత వార్నర్ తన కూతుర్లతో కలిసి అధికారుల అనుమతితో ఎంసీజీలో క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోనూ వార్నర్ తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. కాగా వీడియోలో వార్నర్ కూతురు ఇండీ తండ్రిని మించిపోయింది. ఇండీకి బంతి వేస్తే.. లెగ్‌సైడ్ దిశగా భారీ షాట్ ఆడింది. ఈ విషయాన్ని వార్నర్ ట్విటర్లో పంచుకుంటూ.. ఎంసీజీ మైదానంలో ఇండీ ఫస్ట్ షాట్ కొట్టింది.. అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. చదవండి: BBL 2021: ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు Indi having her first hit at the MCG 👌👌 pic.twitter.com/fb9eqd85u0 — David Warner (@davidwarner31) December 28, 2021 -
18 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ పరాజయంతో పాటు ఐదు టెస్టుల సిరీస్‌ను 3-0 తేడాతో ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ 18 ఏళ్ల చెత్త రికార్డును తిరగరాసింది. ఈ ఏడాది ఇంగ్లండ్‌కు టెస్టుల్లో ఇది తొమ్మిదో పరాజయం. జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు టీమిండియా చేతిలో ఐదు పరాజయాలు( స్వదేశంలో రెండు, విదేశంలో మూడు), ఆ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో మరో ఓటమిని చవిచూసింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో వరుసగా మూడు టెస్టుల్లో ఓటములు చవిచూసి చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఇంతకముందు 2003లో బంగ్లాదేశ్ జట్టు ఆ ఏడాదిలో 9 పరాజయాలు చవిచూసింది. తాజాగా ఇంగ్లండ్ సరిగ్గా ఏడాదిలో 9 పరాజయాలే అందుకొని బంగ్లాతో సమానంగా నిలిచింది. అయితే ఇంగ్లండ్ ఈ ఏడాది గెలిచిన సిరీస్ ఏదైనా ఉందంటే అది శ్రీలంకతో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవడం మాత్రమే. చదవండి: Ashes 2021: అరంగేట్ర మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్ బౌలర్! -
68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే..
యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో యాషెస్ సిరీస్‌ను 3–0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 68 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్.. ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో గెలిపొందింది. 31-4 పరుగలు వద్ద మూడో రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బౌలర్లు ధాటికి 68 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోరూట్(28), బెన్ స్టోక్స్(11) పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు, స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఆరంగ్రేట మ్యాచ్‌లోనే ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ 7 వికెట్లు పడగొట్టి ఆద్బుతమైన ప్రదర్శన చేశాడు. కాగా కేవలం రెండున్నర రోజుల్లోనే ఆస్ట్రేలియా మ్యాచ్‌ను ముగించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 185 పరుగులుకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 267 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా స్కాట్ బోలాండ్ ఎంపికయ్యాడు. ఇక ఇరు జట్లు మధ్య నాలుగో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవవరి 5న ప్రారంభంకానుంది. చదవండి: ఇదేమి బౌలింగ్రా బాబు.. 4 ఓవర్లలో 70 పరుగులు! -
13 సార్లు 200లోపూ ఆలౌట్.. 20 మంది ఆటగాళ్లు డకౌట్
ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లో ఈ ఏడాది చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది ఆడిన 28 ఇన్నింగ్స్‌ల్లో 13 సార్లు 200లోపూ ఆలౌట్ అయింది. ఇక తాజాగా యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో డేవిడ్ మలాన్ డకౌట్ కావడం ద్వారా మరో చెత్త రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో ఈ ఏడాది గోల్డెన్ డక్ లేదా డకౌట్ అయిన 20వ ఆటగాడిగా నిలిచాడు. మలాన్ కంటే ముందు 19 మంది ఉంటే అందులో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ సహా బెన్‌స్టోక్స్, ఇతర క్రికెటర్లు ఉన్నారు. చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ మరో ఓటమి దిశగా పయనిస్తోంది. ఆస్ట్రేలియాను 267 పరుగులకు ఆలౌట్ చేశామన్న ఆనందం ఎక్కువసేపు నిలవకుండానే పోయింది. 82 పరుగులు తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 పరుగులకే నాలుగో వికెట్లు కోల్పోయి రెండోరోజు ఆటను ముగించింది. ఇంకా 51 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ ఓటమినుంచి తప్పించుకోవడం కష్టమే. చదవండి: James Anderson: అరె అండర్సన్.. పట్టి ఉంటే స్టన్నింగ్ క్యాచ్ అయ్యేది! -
అరె అండర్సన్.. పట్టి ఉంటే స్టన్నింగ్ క్యాచ్ అయ్యేది!
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఒకవైపుగా డైవ్చేస్తే దాదాపు క్యాచ్‌ను పట్టినంత పని చేశాడు. ఒకవేళ అండర్సన్ ఈ క్యాచ్‌ను తీసుకొని ఉంటే మాత్రం కచ్చితంగా క్యాచ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచేది. మూడోటెస్టులో భాగంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 82వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. మార్క్‌వుడ్ వేసిన ఓవర్ నాలుగో బంతిని పాట కమిన్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న అండర్సన్ అమాంతం గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ బంతిని అందుకున్నప్పటికి చేతి నుంచి జారిపోయింది. దీంతో కోపంతో అండర్సన్ బంతిని పక్కకు విసిరేశాడు. అయితే తన జట్టుకు మూడు పరుగులు సేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు ఇక క్యాచ్ మిస్ చేసిన అండర్సన్ బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో అండర్సన్ తన బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. తొలిరోజు ఆటలో డేవిడ్ వార్నర్(38) వికెట్ తీసుకున్న అండర్సన్ మార్స్ హారిస్(76), స్టీవ్ స్మిత్(16), కమిన్స్(21) రూపంలో మిగతా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా 23 ఓవర్లు 10 మెయిడెన్లు సహా 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయి 82 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అంతకముందు ఇంగ్లండ్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ తడబడుతుంది. ప్రస్తుతం 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఇంకా 60 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా! -
బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు
Pat Cummins Terrific Bowling To Hameed Hasib At Last Duck Out Viral.. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటైంది. రూట్ అర్థశతకం మినహా మిగతావారెవ్వరు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రలియా తొలి రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా! ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 3 వికెట్లతో చెలరేగడమే కాదు.. తన బంతులతో ఇంగ్లండ్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఇక ఇంగ్లండ్ ఓపెనర్ హసీబ్ హమీద్‌కు కమిన్స్ తన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌన్సర్లు, షార్ట్‌పిచ్ బాల్స్‌తో కమిన్స్.. హమీద్‌ను బెంబేలెత్తించాడు. చివరకు అతన్ని డకౌట్ చేసి వారెవ్వా అనిపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ కమిన్స్ వేయగా.. మొదటి నాలుగు బంతులను టచ్ చేయడానికే భయపడగా... ఐదో బంతిని టచ్ చేయాలా వద్దా అని హమీద్ అనుకునే లోపే బంతి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ క్యారీ చేతుల్లో పడింది. అలా హమీద్ డకౌట్ అయి పెవిలియన్‌కు నిరాశగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: AUS vs ENG: పాపం రూట్.. రికార్డు సాధించానన్న ఆనందం లేకుండా It's taken Pat Cummins less than one over to have an impact on his return to the side! #OhWhatAFeeling @Toyota_Aus | #Ashes pic.twitter.com/iAVB3vC33C — cricket.com.au (@cricketcomau) December 26, 2021