క్రేజీ బౌన్సర్‌.. తృటిలో తప్పించుకున్న రూట్‌ | Ashes 2021: Ben Stokes Bouncer Hits Root Head Practice Session Viral | Sakshi
Sakshi News home page

Ashes 2021: క్రేజీ బౌన్సర్‌.. తృటిలో తప్పించుకున్న రూట్‌

Published Tue, Dec 14 2021 3:50 PM | Last Updated on Tue, Dec 14 2021 3:53 PM

Ashes 2021: Ben Stokes Bouncer Hits Root Head Practice Session Viral - Sakshi

Ben Stokes Bouncer To Joe Root.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు సమాయత్తమవుతుంది. తొలి టెస్టులో ఆసీస్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్‌ రెండో టెస్టులో గెలిచి తిరిగి ఫామ్‌లోకి రావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌ తమ ప్రాక్టీస్‌లో జోరు పెంచింది.

చదవండి: Virat Kohli: ఒకప్పుడు సచిన్‌, ద్రవిడ్‌లు అనుభవించారు.. ఇప్పుడు కోహ్లి

కాగా ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ బౌన్సర్‌ విసిరాడు. బ్యాటింగ్‌ చేస్తున్న రూట్‌పైకి వచ్చిన బంతి తలకు బలంగా తగిలింది. అయితే హెల్మెట్‌ ఉండడంతో రూట్‌కు పెద్దగా గాయం కాలేదు. దీంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ తన ప్రాక్టీస్‌ సెషన్‌ను కొనసాగించాడు. ఇంకో విశేషమేమిటంటే.. ఇంగ్లండ్‌ ఆటగాళ్లందరి కంటే చివరగా రూట్‌ ప్రాక్టీస్‌ నెట్‌ వీడడం ఆసక్తి కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ 

మరోవైపు తొలి టెస్టులో బౌలింగ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న స్టోక్స్‌ మోకాలి గాయంతో రెండో టెస్టు ఆడేది అనుమానం కలిగింది. కానీ అతను బౌలింగ్‌ చేసిన తీరు చూస్తే పింక్‌బాల్‌ టెస్టు(డే నైట్‌)కు సిద్ధంగా ఉన్నట్లు ఈసీబీకి తెలియజేశాడు.  కాగా డిసెంబర్‌ 16 నుంచి ఇరుజట్ల మధ్య పింక్‌బాల్‌ టెస్టు జరగనుంది.

చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్‌ సహా ఐదుగురి రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement