ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. ఆడిన మూడు టెస్టుల్లోనూ ఘోర పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించింది. మిగిలిన రెండు టెస్టులు నామమాత్రంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటతీరును ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇంగ్లండ్ ఆటతీరుపై ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: IND vs SA: నో బాల్స్ వేయడమే గగనం.. చెత్త రికార్డులేంది?
రూట్ సహా జట్టు మొత్తాన్ని తొలగించాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఆ దేశ అభిమానులు ఏకిపారేశారు. ఇంగ్లండ్ ఆటతీరును దుమ్మెత్తిపోస్తూ.. టీమ్ మొత్తాన్ని తొలగిస్తే గానీ మా ఆవేశం చల్లారదంటూ డిమాండ్ చేశారు. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ రాణిస్తున్న చోట ఇంగ్లండ్ బ్యాటర్లు మాత్రం ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదంటూ తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడూ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో ఒక్క రూట్ మినహా మిగిలిన ఏ ఒక్కరు కనీసం అర్థ సెంచరీ నమోదు చేయలేకపోయారు.
2019లో వన్డే ప్రపంచకప్ సాధించిన ఇంగ్లండ్.. అప్పటినుంచి వారి ఆటతీరుకు సంబంధించిన గ్రాఫ్ పూర్తిగా పడిపోతూ వస్తుంది. గాయాలతో.. వ్యక్తిగత కారణాలతో ఆటగాళ్లు దూరంగా ఉండడం ఆ జట్టు ఆటను పూర్తిగా దెబ్బతీస్తుంది. రొటేషన్ పాలసీ పేరుతో స్టువర్ట్ బ్రాడ్ లాంటి సీనియర్ ఆటగాడిని అసలు జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదనేది ఇప్పటికి అర్థం కాలేదంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్‌కు పుట్టినిల్లుగా అభివర్ణించే ఇంగ్లండ్ ఈ రకమైన అవమానాలను ఎప్పుడు ఎదుర్కోలేదనే చెప్పాలి. మరి యాషెస్ సిరీస్ ముగించుకొని సొంతగడ్డపై అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లండ్‌కు ఫ్యాన్స్ నుంచి ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.
చదవండి: Rishab Pant: ఏకకాలంలో ధోని, సాహా రికార్డు బద్దలుకొట్టిన పంత్
Comments
Please login to add a commentAdd a comment