Ashes 2021 Aus Won By 9 Wickets Vs Eng 1st Test.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది.ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ విధించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఒక వికెట్ కోల్పోయి 5.1 ఓవర్లలో చేధించింది.
చదవండి: Ashes Test Series: 74 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ 20
అంతకముందు మూడోరోజు ఆట ముగిసేసమయానికి 220/2 స్కోరుతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట తొలి సెషన్‌లో తేలిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్నింగ్స్ 73వ ఓవర్లో జట్టు స్కోరు 223 పరుగులు ఉన్నప్పుడు.. 82 పరుగుల చేసిన మలాన్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. అక్కడి నుంచి ఏ దశలోనూ ఇంగ్లండ్ కోలుకోకుండా ఆసీస్ బౌలర్లు దెబ్బతీస్తూ వచ్చారు. చివరికి 74 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లను చేజార్చుకుంది. జో రూట్ 89 పరుగులు చేయగా.. మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఆసీస్ బౌలింగ్‌లో నాథన్ లియోన్ 4, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. స్టార్క్, హాజిల్‌వుడ్ తలా ఒక వికెట్ తీశారు.
చదవండి: Nathon Lyon: వికెట్ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర
ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో ట్రెవిస్ హెడ్(152 పరుగులు) శతకంతో మెరవడం.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 94 పరుగులు, లబుషేన్ 74 పరుగులతో రాణించడంతో 425 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇంగ్లండ్: తొలి ఇన్నింగ్స్: 147 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్: 297 ఆలౌట్
ఆస్ట్రేలియా: తొలి ఇన్నింగ్స్: 425 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్: 20/1
Comments
Please login to add a commentAdd a comment