AUS vs ENG, 3rd Ashes Test: England Equalled Bangladesh's Worst Record for Most Defeats in a Year - Sakshi
Sakshi News home page

AUS vs ENG: 18 ఏళ్ల చెత్త రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్‌

Published Tue, Dec 28 2021 3:28 PM | Last Updated on Tue, Dec 28 2021 6:09 PM

England Equal Bangladesh 18-Years Worst Record After Loss 3rd Ashes Test - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ పరాజయంతో పాటు ఐదు టెస్టుల సిరీస్‌ను 3-0 తేడాతో ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌ 18 ఏళ్ల చెత్త రికార్డును తిరగరాసింది. ఈ ఏడాది ఇంగ్లండ్‌కు టెస్టుల్లో ఇది తొమ్మిదో పరాజయం.

జో రూట్‌ నాయకత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు టీమిండియా చేతిలో ఐదు పరాజయాలు( స్వదేశంలో రెండు, విదేశంలో మూడు), ఆ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో మరో ఓటమిని చవిచూసింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో వరుసగా మూడు టెస్టుల్లో ఓటములు చవిచూసి చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఇంతకముందు 2003లో బంగ్లాదేశ్‌ జట్టు ఆ ఏడాదిలో 9 పరాజయాలు చవిచూసింది. తాజాగా ఇంగ్లండ్‌ సరిగ్గా ఏడాదిలో 9 పరాజయాలే అందుకొని బంగ్లాతో సమానంగా నిలిచింది. అయితే ఇంగ్లండ్‌ ఈ ఏడాది గెలిచిన సిరీస్‌ ఏదైనా ఉందంటే అది శ్రీలంకతో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవడం మాత్రమే.

చదవండి: Ashes 2021: అరంగేట్ర మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్‌ బౌలర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement