Australia vs England
-
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవికి లూయిస్ గుడ్‌బై
లండన్: ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కోచ్ పదవి నుంచి జాన్ లూయిస్ తప్పుకొన్నాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనకు తోడు యాషెస్ సిరీస్‌లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోవడంతో జాన్ లూయిస్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2022 నుంచి జాన్ ఇంగ్లండ్ మహిళల జట్టు కోచ్‌గా వ్యవహరిస్తుండగా... ఆ జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశకే పరిమితమైంది.ఇక వేర్వేరు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లోనూ ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చింది. ‘ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. జట్టులో ప్రతిభకు లోటు లేదు. మరో మెరుగైన కోచ్‌ను నియమిస్తాం. త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకముంది’ అని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: హైదరాబాద్ పరాజయంగువాహటి: జాతీయ అండర్–23 మహిళల వన్డే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో మమత సారథ్యంలోని హైదరాబాద్ జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 49.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. స్టార్ ప్లేయర్ గొంగడి త్రిష (14 బంతుల్లో 3) విఫలమవ్వగా... కెప్టెన్, వికెట్ కీపర్ మమత (83 బంతుల్లో 77; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.సాక్షి రావు (37 బంతుల్లో 36; 1 ఫోర్), కావ్య (63 బంతుల్లో 30; 3 ఫోర్లు) రాణించారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో గరీమా యాదవ్, సోనమ్ యాదవ్ 3 వికెట్ల చొప్పున తీయగా... ఏక్తాకు 2 వికెట్లు లభించాయి. అనంతరం ఉత్తరప్రదేశ్ జట్టు 44.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించి విజయం ఖరారు చేసుకుంది. తృప్తి సింగ్ (99 బంతుల్లో 73; 10 ఫోర్లు), ముస్కాన్ మాలిక్ (92 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి ఉత్తరప్రదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ బౌలర్లలో కేసరి ధృతి, సాక్షి రావు ఒక్కో వికెట్ తీశారు. -
చరిత్ర సృష్టించిన బెన్ డకెట్.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికి డకెట్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. స్టార్ బ్యాటర్ జో రూట్‌తో కలిసి స్కోర్ బోర్డును డకెట్ పరుగులు పెట్టించాడు.ఈ జోడీ మూడో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో కేవలం 95 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్‌ను డకెట్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 143 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 165 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు జో రూట్ (68), కెప్టెన్ జోస్ బట్లర్ (23) రాణించారు.డకెట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 351 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన డకెట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.డకెట్ సాధించిన రికార్డులు ఇవే..👉ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా డకెట్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం నాథన్ ఆస్ట్లీ పేరిట ఉండేది. నాథన్ ఆస్ట్ లీ 2004లో అమెరికాపై 145 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ఆస్ట్లీ రికార్డును డకెట్ బ్రేక్ చేశాడు.👉ఐసీసీ టోర్నమెంట్(వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ)లలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా డకెట్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో ఆసీస్ పై సచిన్ 141 పరుగులు చేశాడు. 👉ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగానూ డకెట్ రికార్డు సాధించాడు. కెవిన్ పీటర్సన్ ను అతడు అధిగమించాడు. 2007 వన్డే ప్రపంచకప్ లో పీటర్సన్ ఆసీస్ పై 104 పరుగులు చేశాడు.చదవండి: Champions Trophy: టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టుకు ‘స్పెషల్ కోచ్’ -
డకెట్ విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ ముందు భారీ టార్గెట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు జూలు విధిలిచ్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్(England) నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డకెట్(Ben Duckett) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.ఆసీస్ బౌలర్లను డకెట్ ఊతికారేశాడు. వెటరన్ బ్యాటర్ జో రూట్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 95 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్‌ను డకెట్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 143 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 165 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు జో రూట్(78 బంతుల్లో 4 ఫోర్లతో 68) హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ జోస్ బట్లర్(23), జోఫ్రా ఆర్చర్(21) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. లబుషేన్, జంపా తలా రెండు వికెట్లు సాధించారు.డకెట్ సరికొత్త చరిత్ర..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన డకెట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా డకెట్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం నాథన్ ఆస్టిల్(145) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఆస్టిల్ ఆల్‌టైమ్ రికార్డును డకెట్ బ్రేక్ చేశాడు.తుది జట్లుఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: Champions Trophy IND Vs PAK: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్‌మేన్‌లా డైవ్ చేస్తూ! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కారీ అద్బుతమైన ఫీల్డింగ్ విన్యాసం కనబరిచాడు. సంచలన క్యాచ్‌తో ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు ఫిల్ సాల్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు. సాధరణంగా వికెట్ల వెనుక ఉండే కారీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం కాకుండా ఫీల్డర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.లాహోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. అందుకు తగ్గట్టుగానే స్పెన్సర్ జాన్సన్ వేసిన తొలి ఓవర్లో సాల్ట్ ఓ బౌండరీ, సిక్సర్‌తో 10 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసేందుకు బెన్ ద్వార్షుయిస్ ఎటాక్‌లో వచ్చాడు.ఈ క్రమంలో రెండో ఓవర్ వేసిన ద్వార్షుయిస్ నాలుగో బంతిని సాల్ట్‌కు ఫుల్-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీ సాల్ట్ మిడ్-ఆన్ పైనుంచి షాట్ ఆడేందుకు సాల్ట్ ప్రయత్నించాడు. కానీ మిడ్-ఆన్‌లో ఉన్న సాల్ట్ అద్భుతం చేశాడు. అలెక్స్ కారీ తన కుడివైపనకు దూకుతూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు.అది చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత మరో క్యాచ్‌ను కూడా కారీ అందుకున్నాడు. అయితే అది మొదటి క్యాచ్‌తో పోలిస్తే సులువైనది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 17 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.తుది జట్లుఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్ మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టండి..𝙎𝙃𝙊𝙏𝙎 𝙂𝘼𝙇𝙊𝙍𝙀, 𝘽𝙐𝙏 𝙏𝙃𝙀𝙉... 𝙂𝙊𝙉𝙀! 😲💥Phil Salt was in full flow, but Alex Carey’s stunning grab brings his blazing knock to an end! 🧤🔥Can Australia capitalize on this breakthrough? 🏏⚡#ChampionsTrophyOnJioStar 👉 #AUSvENG, LIVE NOW on Star Sports 2,… pic.twitter.com/CgScZ0l4Wi— Star Sports (@StarSportsIndia) February 22, 2025 -
AUS Vs ENG: ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ.. తుది జట్లు ఇవే
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా లహోర్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆసీస్ ఆడుతోంది.ఈ మెగా టోర్నీకి ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ కూడా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా స్మిత్‌నే బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.ఆసీస్‌దే పైచేయి..వన్డే క్రికెట్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి 161 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఆస్ట్రేలియా 91 విజయాలు, ఇంగ్లండ్ 65 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. డు మ్యాచ్‌లు టై కాగా.. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 3, ఆసీస్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. తుది జట్లుఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: మిస్టరీ గర్ల్‌తో శిఖర్ ధవన్.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు -
ఆస్ట్రేలియాతో మ్యాచ్.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా ఫిబ్రవరి 23న లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనుంది. ఇప్పటికే లహోర్‌కు చేరుకున్న ఇంగ్లీష్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని బట్లర్ సేన భావిస్తోంది.ఈ క్రమంలో ఆసీస్‌తో మ్యాచ్‌కు ఇంగ్లండ్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. భారత్‌తో వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ జోస్ బట్లర్ స్ధానంలో వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది.ఆసీస్‌తో మ్యాచ్‌కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదేఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: Champions Trophy: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు -
ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం?
‘కెప్టెన్‌గా టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడమే నాకున్న అతిపెద్ద లోటు.. ఈసారి ఎలాగైనా ఆ పని పూర్తిచేస్తాను’.. భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అనుకున్నట్లుగానే ఈసారి కంగారూ జట్టుకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందించాడు ఈ స్టార్ పేసర్.సుదీర్ఘ నిరీక్షణకు తెరబౌలర్గా, కెప్టెన్‌గా తనదైన వ్యూహాలతో 3-1తో టీమిండియాను ఓడించి.. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. అంతేకాదు.. తన కెప్టెన్సీలో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు కమిన్స్‌పై కూడా తీవ్రమైన భారం పడింది.స్కాట్ బోలాండ్, స్టార్క్ నుంచి సహకారం అందినా.. కమిన్స్ కూడా వీలైనన్ని ఎక్కువ ఓవర్లు బౌల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కమిన్స్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. శ్రీలంక పర్యటనకు టెస్టు జట్టును ప్రకటించిన సందర్భంగా ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ ఈ విషయాన్ని వెల్లడించాడు.చీలమండ గాయంకాగా సొంతగడ్డపై టీమిండియాపై టెస్టు సిరీస్ విజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. కమిన్స్ ఈ టూర్‌కు దూరం కాగా.. అతడి డిప్యూటీ స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాల గురించి జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘కమిన్స్‌కు వ్యక్తిగతంగా కాస్త పని ఉంది. అయితే, అతడు జట్టుకు దూరం కావడానికి అదొక్కటే కారణం కాదు.అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. వచ్చే వారం అతడు స్కానింగ్‌కు వెళ్తాడు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై పూర్తి స్పష్టత వస్తుంది’’ అని తెలిపాడు. కాగా కమిన్స్ గాయం గనుక తీవ్రతరమైతే ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే.చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎదురుదెబ్బఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ ప్రధాన టోర్నమెంట్ సమీపిస్తోంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. టోర్నీ మొదలయ్యేనాటికి కమిన్స్ పూర్తి ఫిట్‌గా లేనట్లయితే.. ఈ వన్డే వరల్డ్‌కప్-2023 చాంపియన్‌కు కష్టాలు తప్పవు. కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆటగాడిగా, కెప్టెన్‌గా సత్తా చాటాడు కమిన్స్. ఫైనల్లో టీమిండియాను ఓడించి ఆసీస్‌ను చాంపియన్‌గా నిలిపాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్-‘బి’లో ఉంది. ఇందులో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్ లాహోర్ వేదికగా ఫిబ్రవరి 22న ఇంగ్లండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా.. పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది.శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, ట్రవిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్పీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’ -
Aus vs Eng: యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల.. 43 ఏళ్ల తర్వాత ఇలా!
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. పెర్త్ వేదికగా వచ్చే ఏడాది నవంబరు 21 నుంచి ఇరుజట్ల మధ్య టెస్టులు మొదలవుతాయని తెలిపింది. అదే విధంగా.. పింక్ బాల్‌తో జరిగే రెండో టెస్టుకు ఐకానిక్ గాబా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొంది.ఇక ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టుకు అడిలైడ్ ఓవల్ మైదానం, బాక్సింగ్ డే మ్యాచ్‌కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ), ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికలుగా ఉంటాయని సీఏ తెలిపింది. కాగా యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యం ఇవ్వనుండటం 43 ఏళ్లలో ఇదే తొలిసారి.ఇంగ్లండ్లోడ్రాఇంగ్లండ్ వేదికగా జరిగిన గత యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ గెలవగా.. మూడో టెస్టులో ఫలితం తేలలేదు. నాలుగు, ఐదో టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచింది. ఇక ఈ ప్రతిష్టాత్మక తాజా సిరీస్ కంగారూ గడ్డపై జరుగనుంది.ఆసీస్ గడ్డపై గెలుపునకై తహతహఇదిలా ఉంటే.. 2010 నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. 2010లో 3-1తో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. ఆ తర్వాత ఇప్పటి వరకు మూడుసార్లు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఆడిన 15 టెస్టుల్లో 13 ఓడి.. రెండు డ్రా చేసుకుంది.ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-2023 గెలిచిన ఆస్ట్రేలియా తదుపరి స్వదేశంలో టీమిండియాతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లు ఆసీస్‌కు కీలకం.ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- యాషెస్ సిరీస్-2025- 26 షెడ్యూల్👉మొదటి టెస్టు- పెర్త్ స్టేడియం, నవంబరు 21-25, 2025👉రెండో టెస్టు- ది గాబా(డే, నైట్ పింక్‌బాల్ మ్యాచ్)- డిసెంబరు 4-8, 2025👉మూడో టెస్టు- అడిలైడ్ ఓవల్, డిసెంబరు 17- 21, 2025👉నాలుగో టెస్టు- ఎంసీజీ, డిసెంబరు 26- 30, 2025👉ఐదో టెస్టు- ఎస్సీజీ, జనవరి 4-8, 2026.చదవండి: అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్ ఆజం పోస్ట్ వైరల్ -
స్టార్క్‌కు పీడకల.. ఆసీస్ తొలి బౌలర్‌గా చెత్త రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వరల్డ్‌క్లాస్ పేసర్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ చితక్కొట్టాడు. ఒకే ఓవర్లో 6,0,6,6,6, 4 పరుగులు పిండుకుని పీడకలను మిగిల్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంగ్లండ్ టీ20 తరహా బ్యాటింగ్పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా శుక్రవారం.. ఆతిథ్య జట్టుతో నాలుగో వన్డేలో తలపడింది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.27 బంతుల్లోనేఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 312 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ 63, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 87 పరుగులు చేయగా.. లియామ్ లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే మూడు బౌండరీలు, ఏడు సిక్సర్లు బాది 62 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.స్టార్క్‌కు పీడకలఇక లివింగ్‌స్టోన్ ఖాతాలోని ఏడు సిక్స్‌లలో నాలుగు స్టార్క్ బౌలింగ్‌లో బాదినవే. అది కూడా ఆఖరి ఓవర్లో కావడం విశేషం. 39వ ఓవర్లో స్టార్క్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన లివింగ్‌స్టోన్.. రెండో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు. అయితే, మూడో బంతి నుంచి స్పీడు పెంచాడు. హ్యాట్రిక్ సిక్స్‌లు బాది ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.186 పరుగుల తేడాతో విజయంఇదిలా ఉంటే.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు మాథ్యూ పాట్స్ నాలుగు, బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ పడగొట్టి కాంగరూ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు వన్డేల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తదుపరి బ్రిస్టల్ వేదికగా ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే జరుగనుంది.స్టార్క్ చెత్త రికార్డులివింగ్స్టోన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా స్టార్క్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా ప్లేయర్లలో వన్డే మ్యాచ్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు(28) సమర్పించుకున్న బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు జేవియర్ డోహర్టి పేరిట ఉండేది. బెంగళూరులో 2013లో టీమిండియాతో మ్యాచ్‌లో అతడు 26 పరుగులు ఇచ్చుకున్నాడు.చదవండి: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣Incredible final over hitting from Liam Livingstone 💪💥🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024 -
Eng Vs Aus ODI: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. 27 బంతుల్లోనే
ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 186 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. కాగా మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో పొట్టి సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మూడో మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. దీంతో 1-1తో టీ20 సిరీస్ డ్రాగా ముగిసిపోయింది. ఇక వన్డేల విషయానికొస్తే.. తొలి రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మూడో వన్డే నుంచి ఇంగ్లండ్ గెలుపుబాట పట్టింది.39 ఓవర్లకు మ్యాచ్ కుదింపుచెస్టెర్ లీ స్ట్రీట్ వేదికగా డీఎల్ఎస్ పద్ధతిలో ఆసీస్‌ను 46 పరుగుల తేడాతో ఓడించింది. అదే విధంగా.. లార్డ్స్ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. లండన్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ బౌలింగ్ ఎంచుకుంది.బౌండరీల వర్షం కురిపించిన బ్రూక్అయితే, వర్షం కారణంగా 39 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాపార్డర్‌లో ఓపెనర్ బెన్ డకెట్ 62 బంతుల్లో 63 పరుగులు చేయగా.. హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. Leading from the front 💪Batted, Harry Brook! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/RGV0rEZeWT— England Cricket (@englandcricket) September 27, 2024నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఫోర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 87 పరుగుల సాధించాడు. ఆడం జంపా బౌలింగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో బ్రూక్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆసీస్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన లివింగ్స్టోన్ఇక వికెట్ కీపర్ జేమీ స్మిత్ 28 బంతుల్లో 39 రన్స్ చేయగా.. లియామ్ లివింగ్ స్టోన్ ఆసీస్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి ఏకంగా 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 39 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 312 పరుగులు స్కోరు చేసింది.6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣Incredible final over hitting from Liam Livingstone 💪💥🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024ఆసీస్ 126 పరుగులకే ఆలౌట్ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కనీస పోరాటపటిమ ప్రదర్శించలేకపోయింది. 24.4 ఓవర్లలో కేవలం 126 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ 34 పరుగులతో కంగారు జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ 28 రన్స్ చేశాడు. స్టీవ్ స్మిత్(5), జోష్ ఇంగ్లిస్(8), మార్నస్ లబుషేన్(4), గ్లెన్ మాక్స్వెల్(2), స్టార్క్(3 నాటౌట్) సింగిల్ డిజిట్లకే పరిమితం కాగా.. ఆడం జంపా, హాజిల్‌వుడ్ డకౌట్ అయ్యారు.మాథ్యూ పాట్స్‌కు నాలుగు వికెట్లుమిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ 13, సీన్ అబాట్ 10 పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించిన హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక ఐదో వన్డే ఆదివారం జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదిక.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా గ్రీన్‌కు వెన్ను సంబంధించిన సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో ఇవాళ జరుగుతున్న నాలుగో వన్డేకు గ్రీన్ అందుబాటులో లేడు. ఈ గాయం నేపథ్యంలో గ్రీన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పాల్గొంటాడా లేదా అన్నది సందిగ్దంగా మారింది. గాయం తీవ్రతపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండో వన్డేకు దూరంగా ఉన్న గ్రీన్ మూడో వన్డేలో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. ఆ మ్యాచ్‌లో గ్రీన్ 2 వికెట్లు తీసి 45 పరుగులు చేశాడు. తాజాగా గ్రీన్ గాయం బారిన పడటంతో ఈ పర్యటనలో ఆసీస్ ఇంజ్యూరీస్ సంఖ్య ఐదుకు చేరింది. ఈ సిరీస్ ప్రారంభమైన నాటి నుంచి గాయాల కారణంగా నాథన్ ఇల్లిస్, జేవియర్ బార్ట్లెట్, రిలే మెరిడిత్, బెన్ డ్వార్షుయిస్ జట్టుకు దూరమయ్యారు.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ముగియగా.. ఆసీస్ రెండు, ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్‌లో గెలుపొందాయి. నాలుగో వన్డే ఇవాళ లార్డ్స్ వేదికగా జరుగుతుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 21 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ (22), విల్ జాక్స్ (10) ఔట్ కాగా.. బెన్ డకెట్ (58), హ్యారీ బ్రూక్ (35) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: 56 ఏళ్ల కిందటి చెత్త రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్ బ్యాటర్ -
ENG VS AUS 3rd ODI: కుక్ రికార్డు బ్రేక్ చేసిన బ్రూక్
ఇంగ్లండ్ తాత్కాలిక వన్డే జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ చరిత్ర పుటల్లోకెక్కాడు. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. బ్రూక్ ఈ ఘనతను తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సాధించాడు. బ్రూక్ 25 ఏళ్ల 215 రోజుల వయసులో ఇంగ్లండ్ కెప్టెన్‌గా సెంచరీ సాధించాడు. గతంలో ఈ రికార్డు అలిస్టర్ కుక్ పేరిట ఉండేది. కుక్ 26 ఏళ్ల 190 రోజుల వయసులో ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా సెంచరీ చేశాడు. ఈ జాబితాలో బ్రూక్, కుక్ తర్వాత ఇయాన్ మోర్గాన్ (26 ఏళ్ల 358 రోజులు), అలిస్టర్ కుక్ (27 ఏళ్ల 50 రోజులు), అలిస్టర్ కుక్ (27 ఏళ్ల 52 రోజులు) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 348 రోజుల తర్వాత ఆస్ట్రేలియా ఓ వన్డే మ్యాచ్‌లో ఓడింది. ఆ జట్టు వరుసగా 14 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ఓ మ్యాచ్‌ను కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 24) చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 46 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (60), అలెక్స్ క్యారీ (77 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. Harry Brook's 15 boundaries Vs Australia. - A match winning hundred by captain Brook. ⭐pic.twitter.com/RDCF37v3c1— Mufaddal Vohra (@mufaddal_vohra) September 25, 2024అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 37.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలై ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఇంగ్లండ్‌ను విజేతగా నిర్దారించారు. బ్రూక్ 94 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విల్ జాక్స్ 82 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 84 పరుగులు చేశాడు. లివింగ్‌స్టోన్ (33) బ్రూక్‌కు జతగా అజేయంగా నిలిచాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సిరీస్‌లోని నాలుగో వన్డే సెప్టెంబర్ 27న లార్డ్స్‌లో జరుగుతుంది. చదవండి: హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ -
హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో డక్‌వర్త్-లూయిస్ ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో తమ సిరీస్ ఆశలను ఇంగ్లండ్ సజీవంగా ఉంచుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు ఇంగ్లీష్ జట్టు తగ్గించింది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కంగారులు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌కు విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూరమైనప్పటకి మిగితా బ్యాటర్లు సత్తాచాటారు. ఆసీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(77) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(60), గ్రీన్(42), హార్దీ(44) రాణించారు.సెంచరీతో చెలరేగిన బ్రూక్..?అనంతరం 305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది. మిచిల్ స్టార్క్ దెబ్బకు 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లపై బ్రూక్ ఎదురుదాడికి దిగాడు. అద్భుతమైన సెంచరీతో తమ జట్టును ఆదుకున్నాడు. కాగా హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం గమనార్హం. 94 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 13 ఫోర్లు,2 సిక్సులతో 110 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు విల్ జాక్స్(84 పరుగులు; 9 ఫోర్లు,1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ భాగ్యస్వామ్యానికి 156 పరుగులు జోడించారు. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 37.4 ఓవర్లలో 254-4 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. ఈ క్రమంలో వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే లండన్ వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 27)న జరగనుంది. -
చెలరేగిన స్టార్క్.. ఇంగ్లండ్‌పై ఆసీస్ ఘన విజయం
ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. లీడ్స్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో 69 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-0 ఆధిక్యంలో ఆసీస్ దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా 44.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలెక్స్ క్యారీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 67 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మార్ష్(59 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అదేవిధంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. స్టీవ్ స్మిత్ (4), మ్యాక్స్‌వెల్ (7), లబుషేన్ (19) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టగా, రషీద్, బెతల్, పొట్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.నిప్పులు చేరిగిన స్టార్క్..అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (61 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (32) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు హాజిల్‌వుడ్, హార్దీ, మాక్స్వెల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇరు జట్ల మధ్య మంగళవారం(సెప్టెంబర్ 24) మూడో వన్డే జరగనుంది.చదవండి: IND vs BAN: అశ్విన్ మాస్టర్ మైండ్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్(వీడియో) -
అదేం బ్యాటింగ్ సామీ!.. ఊచకోతే.. రోహిత్ రికార్డు బద్దలు
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రవిస్ హెడ్. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తనకు తానే సాటి అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక స్ట్రయిక్‌రేటుతో అత్యధిక పరుగులు రాబట్టిన క్రికెటర్‌గా కొనసాగుతున్న హెడ్.. వన్డేల్లోనూ హవా కొనసాగిస్తున్నాడు.ఆరోజు టీమిండియాపైటీమిండియాతో వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సృష్టించిన పరుగుల సునామీని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. నీలిసంద్రమైన అహ్మదాబాద్ స్టేడియంలో.. అశేష టీమిండియా అభిమానుల నడుమ.. 137 పరుగులతో హెడ్ చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ చేతికే బ్యాట్ మొలిచిందా అన్నట్లు పరుగుల వరద పారించాడు. 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అద్భుత శతకం సాధించి.. రోహిత్ సేనకు పీడకలను మిగిల్చాడు. తాజాగా.. ట్రవిస్ హెడ్ మరోసారి అదే తరహా సునామీ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్ బౌలర్లు బలిఈసారి అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్ బౌలర్లు బలయ్యారు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా గురువారం జరిగిన వన్డేలో హెడ్ పరుగుల సునామీ సృష్టించాడు. 129 బంతులు ఎదుర్కొన్న అతడు ఇంగ్లండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ.. ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్స్‌లు బాదాడు.రికార్డులు సాధించిన హెడ్మొత్తంగా 154 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను ట్రవిస్ హెడ్ తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. అంతకు ముందు షేన్ వాట్సన్ 2011లో 161 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక ఆస్ట్రేలియా తరఫున వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు(20) బాదిన మూడో క్రికెటర్‌గానూ హెడ్ మరో రికార్డు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్(24), గ్లెన్ మాక్స్వెల్(21) హెడ్ కంటే ముందున్నారు. అయితే, ఈ రెండు ఘనతలతో పాటు మరో అరుదైన ఫీట్‌ను కూడా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ అందుకున్నాడు. రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డు బద్దలుట్రెంట్బ్రిడ్జి స్టేడియంలో వన్డే లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా హెడ్ చరిత్రకెక్కాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 2018లో రోహిత్ ఇదే స్టేడియంలో 114 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ సృష్టించిన ఓ అరుదైన రికార్డును హెడ్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా.. న్యూజిలాండ్‌పై హెడ్ 59 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన తొలి ఓపెనర్‌గా హెడ్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రోహిత్ పేరిట ఉండేది.ఇదే ఎడిషన్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ 63 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు. ఇలా రోహిత్ సాధించిన రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు హెడ్. అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తిఇక వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియాపై ఆసీస్ విజయం తర్వాత హెడ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తి బహుశా రోహితే అయ్యుంటాడని పేర్కొన్న విషయం తెలిసిందే. అద్భుత ఫామ్‌లో ఉన్నా జట్టుకు ట్రోఫీ అందించలేకపోయాడనే ఉద్దేశంతో హెడ్ అలా వ్యాఖ్యానించాడు.చదవండి: Eng Vs Aus: లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గాThe perfect 𝐇𝐄𝐀𝐃 start for the Aussies in the ODI series 💯 🇦🇺#SonySportsNetwork #ENGvAUS #TravisHead | @travishead34 pic.twitter.com/PBItCBhPKE— Sony Sports Network (@SonySportsNetwk) September 20, 2024 -
లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన అతడు.. ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. కాగా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు ఆసీస్ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది.హెడ్ విధ్వంసకర శతకం.. లబుషేన్ అజేయ హాఫ్ సెంచరీఇందులో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కంగారూ టీమ్.. గురువారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (129 బంతుల్లో 154 నాటౌట్) విధ్వంసకర శతకంతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ సైతం రాణించాడు. 61 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చడంలో హెడ్‌కు సహకరించాడు.మూడు వికెట్లు తీసిన లబుషేన్ఇక అంతకు ముందు.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లతో చెలరేగగా.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల లబుషేన్ సైతం మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ రెండు, డ్వార్షుయిస్, మాథ్యూ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు క్యాచ్‌లతో మెరిసిన లబుషేన్ఇక ఈ మ్యాచ్‌లో బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు), కెప్టెన్ హ్యారీ బ్రూక్(31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రూపంలో కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన లబుషేన్.. జోఫ్రా ఆర్చర్(4) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. డకెట్, బ్రూక్, జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆదిల్ రషీద్(0) క్యాచ్‌లు కూడా తానే అందుకున్నాడు.𝐃𝐮𝐜𝐤𝐞𝐭𝐭 𝐦𝐮𝐬𝐭 𝐛𝐞 𝐠𝐮𝐭𝐭𝐞𝐝 😤Catching practice for Labuschagne off his own bowling 😎Watch #ENGvAUS LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/p0IxZKhQZY— Sony LIV (@SonyLIV) September 19, 2024 వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్గాఅలా మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు నాలుగు క్యాచ్‌లు అందుకుని.. లక్ష్య ఛేదనలో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు లబుషేన్. తద్వారా ఈ కుడిచేతి వాటం ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక వన్డే మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. మూడు వికెట్లు తీసి.. మూడు కంటే ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇదీ 30 ఏళ్ల లబుషేన్ సాధించిన అత్యంత అరుదైన ఘనత!!.. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే లీడ్స్ వేదికగా శనివారం జరుగనుంది. చదవండి: IND vs BAN: బుమ్రా సూపర్ బాల్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారీ లక్ష్య చేధనలో కంగారుల ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 129 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్స్‌లతో 154 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో మార్నస్ లబుషేన్(77) పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో పొట్స్, బెతల్, లివింగ్‌స్టోన్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా...విల్ జాక్స్ (56 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. కెపె్టన్ హ్యారీ బ్రూక్ (31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించారు. ఆ్రస్టేలియా బౌలర్లలో లబుషేన్, జంపా చెరో 3 వికెట్లు పడగొట్టగా...ట్రవిస్ హెడ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం లీడ్స్‌లో జరుగుతుంది. -
Eng vs Aus: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!
ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!.. కంగారూ జట్టులోని ముగ్గురు స్టార్ క్రికెటర్లు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఫలితంగా ఈ ముగ్గురు నాటింగ్‌హామ్ వన్డేలో ఆడటంపై సందిగ్దం నెలకొంది. కాగా మూడు టీ20, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఆ ముగ్గురు దూరంఇందులో భాగంగా తొలి టీ20లో ఆసీస్ గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడో టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే, ఆసీస్ స్టార్లు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ తొలి వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.గాయాల బెడదఈ ముగ్గురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా రెండో టీ20కి ముందు కూడా ఆసీస్‌కు ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే. కెప్టెన్ మిచెల్ మార్ష్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరం కాగా.. ట్రవిస్ హెడ్ సారథ్యం వహించాడు. ఇక వీరితో పాటు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్, యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ కూడా గాయాలతో బాధపడుతున్నట్లు సమాచారం.మాథ్యూ షార్ట్‌కు అవకాశం?ఇదిలా ఉంటే.. తొలి వన్డే నేపథ్యంలో హాజిల్‌వుడ్, స్టార్క్ దూరమైతే సీన్ అబాట్, డ్వార్షుయిస్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మాక్సీ స్థానాన్ని మాథ్యూ షార్ట్ భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఇక మార్ష్ ప్రస్తుతం కోలుకున్నట్లు సమాచారం. టీ20 సిరీస్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ సైతం వన్డేలతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తొలి వన్డేకు ముందు కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టు కూర్పుపై ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపాడు. ఇక లెగ్ స్పిన్నర్ ఆడం జంపా తమ జట్టులో ఉండటం అదృష్టమని.. వందో వన్డే ఆడబోతున్న అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిస్, కూపర్ కనోలీ.చదవండి: IND vs BAN 1st Test: భారత కీలక వికెట్లుకూల్చిన యువ పేసర్ -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. అసీస్ అండర్ -19 వరల్డ్ కప్ హీరోకు పిలుపు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను సంయుక్తంగా పంచుకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. అయితే సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్‌కు ముందు ఆసీస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.టీ20 సిరీస్ సమయంలో గాయపడిన పేసర్ గ్జావియర్ బార్టెలెట్ వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని అండర్-19 వరల్డ్ కప్ హీరో, ఫాస్ట్ బౌలర్ మహిల్ బియర్డ్మన్తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం వెల్లడించింది. కాగా అండర్ -19 వరల్డ్ కప్-2024 విజేతగా ఆసీస్ నిలవడంతో బియర్డ్‌మన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో టీమిండియాపై మూడు వికెట్ల చెలరేగాడు. ఓవరాల్‌గా టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడి పది వికెట్లతో సత్తాచాటాడు. బియర్డ్‌మన్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. ఈ క్రమంలోనే సెలక్టర్ల దృష్టిలో ఈ యువ సంచలనం పడ్డాడు. ఆస్ట్రేలియా జట్టు : మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్), ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా ట్రావెలింగ్ రిజర్వ్: మహ్లీ బార్డ్‌మాన్ -
ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్ స్థానంలో యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 15) ప్రకటించారు. గాయం కారణంగా 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్ బౌలర్ జోష్ హల్ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఆసీస్‌తో రెండో టీ20లో చెలరేగిన లియామ్ లివింగ్‌స్టోన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్25 ఏళ్ల హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టనున్నాడు. 18 నెలల కింద వన్డే అరంగేట్రం చేసిన బ్రూక్.. టెస్ట్, టీ20ల్లో తనను తాను నిరూపించుకున్నప్పటికీ.. వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయాడు. బ్రూక్ ఇప్పటివరకు 15 వన్డేలు ఆడి 29.1 సగటున 407 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బ్రూక్ ఇటీవల ముగిసిన ద హండ్రెడ్ లీగ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జామీ స్మిత్, ఒల్లీ స్టోన్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచాయి. మూడో టీ20 ఇవాళ (రాత్రి 7 గంటలకు) జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఇప్పటివరకు టాస్ కూడా పడలేదు. టీ20 సిరీస్ ముగిసిన అనంతరం సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో ఐదు వన్డేలు జరుగనున్నాయి. చదవండి: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. 13 ఏళ్ల రికార్డు బద్దలు
కార్డిప్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ పరాజయం పాలైనప్పటకి.. ఆ జట్టు ఆల్‌రౌండర్, ఓపెనర్ మాథ్యూ షార్ట్ మాత్రం చరిత్ర సృష్టించాడు. బ్యాటింగ్‌లో 28 పరుగులతో పర్వాలేదన్పించిన షార్ట్.. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసిన షార్ట్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ఔరా అన్పించాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన షార్ట్.. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. దీంతో పలు అరుదైన రికార్డులను షార్ట్ తన పేరిట లిఖించుకున్నాడు. షార్ట్ సాధించిన రికార్డులు ఇవే..?టీ20ల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా షార్ట్ రికార్డులలెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ పేరిట ఉండేది. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో వాట్సన్ 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో 5 వికెట్ల ఘనత సాధించిన షార్ట్.. 13 ఏళ్ల వాట్సన్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా షార్ట్ నిలిచాడు. ఈ జాబితాలో భారత స్పిన్నర్ చాహల్ తొలి స్దానంలో ఉన్నాడు. 2017లో చాహల్ ఇంగ్లండ్‌పై ఏకంగా 6 వికెట్లు సాధించాడు.ఓడిపోయిన మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా బంగ్లాపేసర్ ముస్తిఫిజుర్ రెహ్మన్ సరసన షార్ట్ నిలిచాడు. -
లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఆసీస్ బ్యాటర్లలో యువ ఆటగాడు ఫ్రెజర్ మెక్‌గర్క్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోష్ ఇంగ్లిష్(42), హెడ్(31), మాథ్యూ షార్ట్(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, లివింగ్ స్టోన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుర్రాన్, రషీద్ చెరో వికెట్ సాధించారు.లివింగ్ స్టోన్ ఊచకోత..అనంతరం 194 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లడ్ ఆల్‌రౌండర్ లైమ్ లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు.అతడితో పాటు జాకబ్ బితల్(24 బంతుల్లో 44), కెప్టెన్ సాల్ట్(23 బంతుల్లో 39) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ మాథ్యూ షార్ట్ 5 వికెట్లు పడగొట్టి ఔరా అన్పించాడు. అతడితో పాటు అబాట్ రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లందరూ విఫలమయ్యారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన లైమ్ లివింగ్ స్టోన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 15న జరగనుంది.చదవండి: టీమిండియా ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్: గంభీర్, దాదాకు దక్కని చోటు -
ఇంగ్లండ్ హ్యాట్రిక్.. ముగ్గురూ క్లీన్ బౌల్డ్
ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 59; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఊచకోత కోయడంతో 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (41), జోష్ ఇంగ్లిస్ (37) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్ 3, జోఫ్రా ఆర్చర్, సకీబ్ మహమూద్ తలో 2, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. సీన్ అబాట్ 3, హాజిల్‌వుడ్, జంపా చెరో 2, బార్ట్లెట్, గ్రీన్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్ (37), ఫిలిప్ సాల్ట్ (20), సామ్ కర్రన్(18), జోర్డన్ కాక్స్ (17), జేమీ ఓవర్టన్ (15), సాకిబ్ మహమూద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్ 13న జరుగుతుంది.A terrific video by England on team's hat-trick against Australia last night. 👌pic.twitter.com/tZzlLT8vbS— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024ఇంగ్లండ్ హ్యాట్రిక్ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ హ్యాట్రిక్ వికెట్లు తీసింది. ఆసీస్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి రెండు బంతులకు.. 19వ తొలి బంతికి ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీశారు. 18వ ఓవర్లో సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్లను జోఫ్రా ఆర్చర్.. 19వ ఓవర్ తొలి బంతికి కెమరూన్ గ్రీన్‌ను సాకిబ్ మహమూద్ ఔట్ చేశారు. ఈ ముగ్గురూ క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడినప్పటికీ ఇదొక్కటే చెప్పుకోదగ్గ ప్రదర్శన.4,4,6,6,6,4 by Travis Head against Sam Curran in a single over. - The ruthless version of Head is scary! 🤯pic.twitter.com/QfFQCwgHN9— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024ట్రవిస్ హెడ్ ఊచకోతఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ తన సహజ సిద్దమైన హిట్టింగ్తో ఇంగ్లండ్ బౌలర్లను భయపెట్టారు. హెడ్.. సామ్ కర్రన్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. హెడ్.. ఆసీస్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హెడ్ కంటే ముందు పాంటింగ్, డేనియల్ క్రిస్టియన్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్ ఒకే ఓవర్లో 30 పరుగులు బాదారు.చదవండి: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
ఒకే ఓవర్లో 30 పరుగులు.. హెడ్ అరుదైన రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్కాట్లాండ్తో టీ20 సిరీస్‌లో విధ్వంసం సృష్టించిన హెడ్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా అదే దూకుడును కనబరుస్తున్నాడు.సౌత్ంప్టాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.కుర్రాన్‌ను ఊతికారేసిన ట్రావిస్..ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ సామ్ కుర్రాన్‌ను హెడ్ ఊతికారేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ వేసిన కుర్రాన్ బౌలింగ్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో హెడ్ ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. తొలి రెండు బంతులని బౌండరీలు బాదిన హెడ్.. ఆ తర్వాత మూడు బంతులను హ్యాట్రిక్ సిక్సర్లగా మలిచాడు. చివరి బంతికి మళ్లీ ఫోర్ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.హెడ్ అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో సామ్ కుర్రాన్‌కు చుక్కలు చూపించిన హెడ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆస్ట్రేలియా క్రికెటర్ల సరసన నిలిచాడు. హెడ్ కంటే ముందు పాంటింగ్, డానియల్ క్రిష్టియన్, ఫించ్, మిచెల్ మార్ష్ ఒకే ఓవర్లో 30 పరుగులు బాదారు.చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే జట్టులో విరాట్ కోహ్లి, బాబర్ ఆజం? 6️⃣6️⃣6️⃣: Number of the batting beast, i.e. Travis Head 🔥The explosive Aussie opener hit 30 runs off a Sam Curran over, including 3 successive sixes! #RivalsForever #ENGvAUSonFanCode pic.twitter.com/R6Bac6Sd6R— FanCode (@FanCode) September 11, 2024 -
హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్
యూకే పర్యటనలో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. స్కాట్లాండ్తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లివింగ్‌స్టోన్(37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ 3 వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, జంపా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు బ్రాట్‌లెట్, గ్రీన్, స్టోయినిష్ చెరో వికెట్ పడగొట్టారు.హెడ్ విధ్వంసం..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 23 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59 పరుగులు చేశాడు.అతడితో పాటు మాథ్యూ షార్ట్(41), ఇంగ్లిష్(37) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, మహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్ 13న కార్డిప్ వేదికగా జరగనుంది.చదవండి: Duleep Trophy 2024: రింకూ, శ్రేయస్, సుందర్‌లపై దృష్టి -
ఆసీస్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ముగ్గురి అరంగేట్రం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో రేపు (సెప్టెంబర్ 11) జరుగబోయే తొలి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్‌తో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు (జేకబ్ బేథెల్, జేమీ ఓవర్టన్, జోర్డన్ కాక్స్) టీ20 అరంగేట్రం చేయనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాంప్టన్ వేదికగా రేపటి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది.ఆసీస్‌తో తొలి టీ20 కోసం ఇంగ్లండ్ తుది జట్లు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్), విల్ జాక్స్, జోర్డన్ కాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెథెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లేకాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది.ఆసీస్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్..సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)సెప్టెంబర్ 24- చెస్టర్ లీ స్ట్రీట్సెప్టెంబర్ 27- లండన్సెప్టెంబర్ 29- బ్రిస్టల్ -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ కీలక నిర్ణయం
శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో మరో సవాల్‌కు సిద్దమైంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, 5 వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడనుంది. అయితే ఈ వైట్‌బాల్ సిరీస్‌లకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు తమ జట్టు స్టార్ పేసర్ గుస్ అట్కిన్సన్కు ఈసీబీ విశ్రాంతినిచ్చింది. ఈ విషయాన్నిఈసీబీ ధ్రువీకరించింది. అతడి స్ధానాన్ని మరో యువ పేసర్ ఓలీ స్టోన్‌తో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది.ఈ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది. కాగా లెజెండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ టెస్ట్ జట్టులోకి వచ్చిన అట్కిన్సన్ తన ప్రదర్శనతో అందరినికి ఆకట్టుకున్నాడు.వెస్టిండీస్‌పై డెబ్యూ మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఓవరాల్‌గా తన అరంగేట్ర సిరీస్‌లో 22 వికెట్లు సాధించి తన పేరు మోరుమ్రోగేలా చేశాడు. ఆ తర్వాత శ్రీలంకతో సిరీస్‌లో కూడా 12 వికెట్లు పడగొట్టాడు. కేవలం రెండు సిరీస్‌లలోనే 34 వికెట్లు పడగొట్టి తన అగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.అంతేకాకుండా బ్యాట్‌తో కూడా అదరగొట్టాడు. లార్డ్స్ వేదికగా లంకతో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. అండర్సర్ వారుసుడిగా వచ్చిన అట్కిన్సన్పై వర్క్‌లోడ్ తగ్గించాలని ఈసీబీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు రెస్టు ఇచ్చింది.చదవండి: 144 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి: నిసాంక ప్రపంచ రికార్డు -
ఆసీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ ఆసీస్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్.. టీ20 సిరీస్‌తో పాటు తదనంతరం జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. బట్లర్ గైర్హాజరీలో ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ టీ20 జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు గురువారం (సెప్టెంబర్ 5) అధికారికంగా ప్రకటించింది. బట్లర్ స్థానాన్ని ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ భర్తీ చేయనున్నాడు. కాగా, మూడు టీ20లు, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్ 11 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు జరుగుతాయి. సెప్టెంబర్ 11, 13, 15 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది.ఇంగ్లండ్ టీ20 జట్టు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ -
ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్ల ప్రకటన
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్లను నిన్న (ఆగస్ట్ 26) ప్రకటించారు. ఈ జట్లకు జోస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా హండ్రెడ్ లీగ్‌కు దూరంగా ఉండిన బట్లర్ ఆసీస్‌తో సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్‌లలో తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆతర్వాత ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనున్నాయి. టీ20 సిరీస్ సెప్టెంబర్ 11, 13, 15 తేదీల్లో.. వన్డే సిరీస్ సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో జరుగనుంది. లంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఆసీస్‌తో టీ20 సిరీస్ మొదలుకానుంది.ఆసీస్‌తో సిరీస్‌ల కోసం సీనియర్లు జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, క్రిస్ జోర్డన్లను పక్కకు పెట్టారు ఇంగ్లండ్ సెలెక్టర్లు. ఈ ముగ్గురు ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. వీరి స్థానంలో ఇంగ్లండ్ సెలెక్టర్లు ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (జోర్డన్ కాక్స్, జేకబ్ బేతెల్, డాన్ మౌస్లీ, జోష్ హల్, జాన్ టర్నర్) టీ20 జట్టులో అవకాశం కల్పించారు. ఈ ఐదుగురు వివిధ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వీరిలో జోర్డన్ కాక్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ కాగా.. జోష్ హల్, జాన్ టర్నర్ పేస్ బౌలర్లు. జేకబ్ బేతెల్, డాన్ మౌస్లీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు. ప్రస్తుత శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో సభ్యులుగా ఉన్న హ్యారీ బ్రూక్, మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్‌లకు టీ20 జట్టులో చోటు దక్కలేదు. ఈ ముగ్గురు కేవలం వన్డే సిరీస్‌కు మాత్రమే పరిమితమయ్యారు. లంకతో తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన మార్క్ వుడ్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోకపోగా.. జో రూట్‌కు వన్డే జట్టు నుంచి రెస్ట్ ఇచ్చారు సెలెక్టర్లు. ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్ ఈ సిరీస్‌లతో రీఎంట్రీ ఇస్తున్నాడు.ఇంగ్లండ్ టీ20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్స్, జోర్డన్ కాక్స్, సామ్ కర్రన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లే, జాన్ టర్నర్ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, రీస్ టాప్లే, జాన్ టర్నర్షెడ్యూల్..సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)సెప్టెంబర్ 24- మూడో వన్డే (చెస్టర్ లీ స్ట్రీట్)సెస్టెంబర్ 27- నాలుగో వన్డే (లండన్)సెప్టెంబర్ 29- ఐదో వన్డే (బ్రిస్టల్) -
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెప్టెంబర్‌లో యూకే టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా స్కాట్లాండ్తో మూడు టీ20లు.. ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. అయితే ఈ టూర్‌కు ముందు కంగారులకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కాలి పిక్క కండరాల గాయం కారణంగా స్కాట్లాండ్తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో హాజిల్‌వుడ్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. అతడికి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కూడా హాజిల్‌వుడ్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్వదేశంలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని హాజిల్‌వుడ్‌కు మరింత విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హాజిల్‌వుడ్ స్ధానాన్ని రీలే మెరిడిత్తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. అతడు చివరగా 2021లో ఆసీస్ తరపున ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ దేశీవాళీ క్రికెట్లో మెరిడిత్ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు.కాగా ఈ యూకే టూర్‌కు ఇప్పటికే యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా దూరమయ్యాడు. ఇక ఇక సెప్టెంబర్ 4న స్కాట్లాండ్తో జరగనున్న తొలి టీ20తో ఆసీస్ యూకే టార్ ప్రారంభం కానుంది.స్కాట్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, మెరిడిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా -
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. ఆసీస్‌కు ఊహించని ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెప్టెంబర్‌లో యూకే టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా స్కాట్లాండ్తో మూడు టీ20లు, ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ తలపడనుంది. అయితే ఈ టూర్‌కు ముందు కంగారులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ గాయం కారణంగా స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. దిహాండ్రల్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడుతున్న జాన్సన్ ప్రక్కెటెముకల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు.అయితే అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూకే టూర్‌కు ఈ యువ ఫాస్ట్ బౌలర్ దూరమయ్యాడు. ఇక అతడి స్ధానాన్ని ఆల్‌రౌండర్ సీన్ అబాట్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. అబాట్‌కు తొలుత కేవలం ఇంగ్లండ్‌తో వన్డే జట్టులో మాత్రం చోటు దక్కింది. ఇప్పుడు అనూహ్యంగా జాన్సన్ తప్పుకోవడంతో అబాట్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఇక సెప్టెంబర్ 4న స్కాట్లాండ్తో జరగనున్న తొలి టీ20తో ఆసీస్ యూకే టార్ ప్రారంభం కానుంది.స్కాట్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా -
ఇంగ్లండ్ టూర్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా! కెప్టెన్ ఎవరంటే?
ఇంగ్లండ్, స్కాట్లాండ్లతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. ఓవరాల్‌గా యూనైటడ్ కింగడమ్ టూర్‌కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కంగారులు యూకే పర్యటనలో భాగంగా తొలుత స్కాట్లాండ్తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 2న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆసీస్ ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పర్యటన సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లతో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ సెలక్టర్లు రెస్ట్ ఆస. అయితే వీరు ముగ్గురూ వన్డే జట్టులో భాగమయ్యారు.ఈ టూర్లో ఆసీస్ వన్డే, టీ20 జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. కాగా యువ ఆటగాడు కూపర్ కొన్నోలీకి తొలిసారి ఆసీస్ జట్టులో దక్కింది. అదేవిధంగా యువ సంచలనం ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు వన్డే, టీ20 జట్టులో చోటు దక్కింది.స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20లకు ఆసీస్ జట్టుమిచిల్ మార్ష్ (కెప్టెన్),. జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ. టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. కామెరాన్ గ్రీన్. ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచ్ మార్ష్ (కెప్టెన్). సీన్ అబాట్. అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్. ట్రావిస్ హెడ్. జోష్ ఇంగ్లిస్. మార్నస్ లాబుస్చాగ్నే. గ్లెన్ మాక్స్వెల్. మాథ్యూ షార్ట్. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
WC: ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నాం: ఇంగ్లండ్ పేసర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సూపర్-8కు అర్హత సాధించాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆ జట్టు పేసర్ మార్క్‌వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.చిరకాల ప్రత్యర్థిగా భావించే ఆస్ట్రేలియా జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో స్కాట్లాండ్ను చిత్తుగా ఓడించాలని కోరుకున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో తమ మద్దతు పూర్తిగా ఆస్ట్రేలియాకే ఉంటుందని పేర్కొన్నాడు.కాగా స్కాట్లాండ్తో మ్యాచ్ రద్దవడం, ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ముందుకెళ్లే ఆశలు సన్నగిల్లిన విషయం తెలిసిందే. అయితే ఒకే ఒక్క విజయం... 3.1 ఓవర్లలో ముగించేయడం... 101 బంతులు మిగల్చడం... ఇంగ్లండ్‌ను ఒక్కసారిగా ఈ టి20 ప్రపంచకప్ రేసులోకి తీసుకొచ్చింది.అంటిగ్వా వేదికగా... శుక్రవారం జరిగిన పోరులో బట్లర్ బృందం 8 వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. షోయబ్ ఖాన్ (23 బంతుల్లో 11; 1 ఫోర్) ఇన్నింగ్స్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆదిల్ రషీద్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ 12 పరుగుల చొప్పున ఇచ్చి చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్ 3.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ జోస్ బట్లర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సాల్ట్ (3 బంతుల్లో 12; 2 సిక్స్‌లు) దంచేశారు.ఈ నేపథ్యంలో సూపర్-8 రేసులోకి దూసుకువచ్చిన ఇంగ్లండ్.. శనివారం రాత్రి నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కచ్చితంగా గెలవాలి. భారీ తేడాతో విజయం సాధిస్తే ఇంకా మంచిది.అదే విధంగా జూన్ 16 నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈ రెండూ జరిగి.. నెట్ రన్‌రేటు పరంగా స్కాట్లాండ్ కంటే ఇంగ్లండ్ మెరుగ్గా ఉంటేనే తదుపరి దశకు అర్హత సాధిస్తుంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్- నమీబియా, ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ మ్యాచ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్.. ఇంగ్లండ్‌ను టోర్నీ నుంచి పంపడమే తమ లక్ష్యమని పేర్కొనడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.హాజిల్‌వుడ్ వ్యాఖ్యలను బట్టి స్కాట్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోవడానికి సిద్ధపడిందా అనే సందేహాలు తలెత్తాయి. అయితే, ఆ జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. హాజిల్‌వుడ్ సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో మార్క్‌వుడ్ స్పందిస్తూ.. హాజిల్‌వుడ్ చేసిన వ్యాఖ్యలు తమ జట్టు గౌరవాన్ని పెంచుతున్నాయంటూ కౌంటర్ వేశాడు. ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టు ఎలిమినేట్ అయితే బాగుంటుందని ప్రతి జట్టు కోరుకుంటుందని.. ఏదేమైనా స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.కాగా గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టగా.. శనివారం నాటి మ్యాచ్ ఫలితంతో ఇంగ్లండ్ భవితవ్యం తేలనుంది. పాయింట్ల పట్టికలో ఆసీస్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. స్కాట్లాండ్ 5 పాయింట్లు(నెట్ రన్‌రేటు +2.164), ఇంగ్లండ్ మూడు పాయింట్ల(నెట్ రన్‌రేటు +3.081)తో ఉన్నాయి. -
హాజిల్‌వుడ్ వ్యాఖ్యలకు ఇంగ్లండ్ కోచ్ కౌంటర్
తమ జట్టు గురించి ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హాజిల్‌వుడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ మాథ్యూ మాట్ స్పందించాడు. జోష్ మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. తమ దృష్టి ప్రస్తుతం మిగిలిన రెండు మ్యాచ్‌లపైనే ఉందని తెలిపాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్‌లతో పాటు ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. వీటిలో వరుసగా మూడు విజయాలు సాధించిన ఆసీస్.. గ్రూప్ టాపర్‌గా సూపర్-8లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది.ఇక ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లు రెండింట భారీ తేడాతో ఓడి సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో తాము గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే తప్ప టోర్నీలో ముందడుగు వేయలేని దుస్థితిలో ఉంది డిఫెండింగ్ చాంపియన్.ఇక మూడింట రెండు విజయాలతో ఉన్న స్కాట్లాండ్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. తమకు ఆస్ట్రేలియాతో మిగిలిన మ్యాచ్‌లో గనుక గెలిస్తే నేరుగా సూపర్-8కు చేరుకుంటుంది. అయితే, ఆసీస్ మ్యాచ్ అంటే అంత తేలికాదన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నమీబియాపై గెలుపుతో సూపర్-8 చేరిన తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌ను టోర్నీ నుంచి బయటకు పంపాలని తాము భావిస్తున్నట్లు తెలిపాడు.ఈ క్రమంలో కావాలనే స్కాట్లాండ్ చేతిలో ఓడి ఇంగ్లండ్ సూపర్-8 ఆశలపై నీళ్లు చల్లాలని ఆసీస్ కుట్ర పన్నిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మాట్.. జోష్ హాజిల్‌వుడ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.అతడు కేవలం సరదాగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశాడని.. జోష్ నిజాయితీ గురించి తనకు తెలుసునని పేర్కొన్నాడు. ఒమన్, నమీబియా జట్లపై విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాథ్యూ మాట్ పేర్కొన్నాడు.నమీబియాను చిత్తు చేసిగ్రూప్-బిలో ఆద్యంతం పూర్తి ఆధిపత్యం కనబరిచిన ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నమీబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. నమీబియా నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 34 బంతుల్లోనే ఛేదించింది. వరుసగా మూడో విజయంతో ఆస్ట్రేలియా ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... పేసర్లు హాజల్‌వుడ్, స్టొయినిస్ రెండు వికెట్ల చొప్పున తీశారు. కమిన్స్, ఎలిస్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.నమీబియా జట్టులో కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ (43 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్), మైకేల్ వాన్ లింగెన్ (10 బంతుల్లో 10; 2 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లు రెండంకెల స్కోరు దాటలేకపోయారు.అనంతరం ఆస్ట్రేలియా జట్టు 5.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 74 పరుగులు చేసి గెలిచింది. డేవిడ్ వార్నర్ (8 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) అవుటవ్వగా... ట్రావిస్ హెడ్ (17 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్ష్ (9 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. జంపాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. జూన్ 16న జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్తో ఆస్ట్రేలియా తలపడుతుంది. -
AUS Vs ENG: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు.ట్రావిస్ హెడ్(34), వార్నర్(39), మిచెల్ మార్ష్(35), మాక్స్వెల్(28), స్టోయినిష్(30) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ,అర్చర్, లివింగ్ స్టోన్, రషీద్ తలా వికెట్ సాధించారు.రాణించిన ఆసీస్ బౌలర్లు..202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్ సాల్ట్(37), మొయిన్ అలీ(25) తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్‌వుడ్, మార్కస్ స్టోయినిష్ తలా వికెట్ పడగొట్టారు. కాగా ఆసీస్‌కు ఇది వరుసగా రెండో విజయం కావడం గమనార్హం. -
T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు
అంతర్జాతీయ క్రికెట్ మండలి నేతృత్వంలో 2007లో మొదలైన టీ20 ప్రపంచకప్ టోర్నీ విజయవంతంగా ఎనిమిది ఎడిషన్లు పూర్తి చేసుకుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి తొమ్మిదో ఎడిషన్ మొదలుకానుంది.ఈ మెగా ఈవెంట్ ఆరంభం నుంచి ఇప్పటి దాకా ఇద్దరంటే ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ మాజీ సారథి షకీబ్ అల్ హసన్‌కు మాత్రమే ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.పటిష్ట భారత జట్టును మరోసారి పొట్టి ప్రపంచకప్ టోర్నీలో ముందుకు నడిపించే క్రమంలో రోహిత్ నాయకుడిగా బరిలో దిగనుండగా.. నజ్ముల్ షాంటో సారథ్యంలో షకీబ్ ఆల్‌రౌండర్‌గా వరల్డ్‌కప్‌లో భాగం కానున్నాడు.ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 20 జట్లు ఈ ఐసీసీ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. నాలుగు గ్రూపులుగా వీటిని విభజించారు. మరి 20 జట్లలో భాగమైన ఆటగాళ్లు ఎవరో చూద్దామా?👉గ్రూప్- ఏ: ఇండియా, పాకిస్తాన్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా👉గ్రూప్- బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్👉గ్రూప్- సి: వెస్టిండీస్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా👉గ్రూప్- డి: సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.ఇండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.పాకిస్తాన్బాబర్ ఆజం(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.యునైటెడ్ స్టేట్స్మోనాక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరె అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీష్ కుమార్, నౌష్టుష్ కెంజిగే, సౌరభ్ నెత్రాల్వాకర్, షాడ్లీ వాన్ షాల్క్విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్. రిజర్వ్ ప్లేయర్లు: గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్డేల్, యాసిర్ మొహమ్మద్.ఐర్లాండ్పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బాల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెకార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.కెనడాసాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్ జాన్సన్, రవీందర్‌పాల్ సింగ్, నవనీత్ ధాలివాల్, కలీమ్ సనా, దిలోన్ హెయిలీగర్, జెరెమీ గోర్డాన్, నిఖిల్ దత్తా, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, రేయాన్ ఖాన్ పఠాన్, జునైద్ సిద్ధిఖీ, దిల్‌ప్రీత్ బజ్వా, శ్రేయాస్ మొవ్వా, రిషివ్ జోషి.రిజర్వ్ ప్లేయర్లు: తజిందర్ సింగ్, ఆదిత్య వరదరాజన్, అమ్మర్ ఖలీద్, జతిందర్ మథారు, పర్వీన్ కుమార్.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్-మెగర్క్, మాట్ షార్ట్.నమీబియాగెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, మైఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచర్, రూబెన్ ట్రంపెల్మాన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, టాంగెని లుంగామెని, నికో డావిన్, జేజే స్మిత్, జాన్ ఫ్రైలింక్, జేపీ కోట్జ్, డేవిడ్ వీస్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మలన్ క్రూగర్, పీడీ బ్లిగ్నాట్.స్కాట్లాండ్రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఓలీ హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్ ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ టియర్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్.ఒమన్అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషాన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ, మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్, ఖలీద్ కైల్. రిజర్వు ప్లేయర్లు: జతిందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జయ్ ఓదెరా.వెస్టిండీస్రోవ్మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయిర్, షాయీ హోప్, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెకాయ్.న్యూజిలాండ్కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, కరీం జనత్, నంగ్యాల్ ఖరోతి, ముజీబ్ యువర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. రిజర్వ్ ప్లేయర్లు: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ.ఉగాండాబ్రియాన్ మసాబా (కెప్టెన్), సైమన్ సెసాజీ, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యూవుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేశ్ రాంజానీ, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ స్సెన్యోండో, బిలాల్ హస్సున్, రాబిన్సన్ ఓబుయా, రియాజత్ అలీ షా, జుమా మియాజీ, రోనక్ పటేల్. ట్రావెలింగ్ రిజర్వ్స్: ఇన్నోసెంట్ మ్వెబాజ్, రోనాల్డ్ లుటాయా.పపువా న్యూగినియాఅస్సాడోల్లా వాలా (కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, సీజే అమిని, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కరికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కామియా, సెసే బావు, టోనీ ఉరా.సౌతాఫ్రికా ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.శ్రీలంకవనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక, కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సాంకా, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డిసిల్వా, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీషా పతిరణ, దిల్షాన్ మదుశంక. ట్రావెలింగ్ రిజర్వ్స్: అసితా ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, భానుకా రాజపక్స, జనిత్ లియానాగే.బంగ్లాదేశ్నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహీద్ హ్రిదోయ్, మహ్మద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మహేది హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్. ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.నెదర్లాండ్స్స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, కైల్ క్లెయిన్, లోగాన్ వాన్ బీక్, మ్యాక్స్ ఓ డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, ర్యాన్ క్లెయిన్, సాకిబ్ జుల్ఫికర్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజ నిడమనూరు, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్, వివ్ కింగ్మా, వెస్లీ బారేసి. ట్రావెలింగ్ రిజర్వ్: ర్యాన్ క్లెయిన్నేపాల్రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సాహ్, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కేసీ, గుల్షన్ ఝా, సోంపాల్ కామి, ప్రతిస్ జీసీ, సందీప్ జోరా, అవినాష్ బోహరా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుT20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. వివరాలు -
World Cup 2023: ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా మరో విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 253 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లతో అదరగొట్టాడు. అతడితో పాటు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మలాన్(50) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(71) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(44), కామెరాన్ గ్రీన్(47) పరుగులతో పర్వాలేదనపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు లివింగ్‌స్టోన్, విల్లీ చెరో వికెట్ సాధించారు. చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు -
రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ 287
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలోనే ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ అదుకున్నారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం స్మిత్ ఔటైనప్పటికీ.. లబుషేన్ మాత్రం తన పని తను చేసుకుపోయాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(71) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(44), కామెరాన్ గ్రీన్(47) పరుగులతో పర్వాలేదనపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు లివింగ్‌స్టోన్, విల్లీ చెరో వికెట్ సాధించారు. చదవండి: WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే -
WC 2023: వన్డే వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఆటగాళ్లు.. 10 జట్ల పూర్తి వివరాలివే
ICC ODI World Cup 2023 All Final Squads: ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. భారత్ వేదికగా అక్టోబరు 5న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య పోరుతో మెగా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. పుష్కరకాలం తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా సహా ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్.. మొత్తంగా పది జట్లు పాల్గొననున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచే వామప్ మ్యాచ్‌లు కూడా మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే వరల్డ్‌కప్-2023 కోసం ఆయా మేనేజ్మెంట్లు ఖరారు చేసిన ఫైనల్ టీమ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్. పాకిస్తాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ ఆఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం. అఫ్గనిస్తాన్ హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా జుర్మతి, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ ఇసాఖిల్, ఇక్రమ్ అలీ ఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్ అర్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ లకన్వాల్, ఫజల్హక్ ఫారూఖీ, అబ్దుల్ రెహ్మాన్ రహ్మానీ, నవీన్ ఉల్ హక్ మురీద్. ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్. బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ కుమర్ దాస్, తన్జిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (వైస్ కెప్టెన్), తవ్హిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసూమ్ అహ్మద్, షేక్ మహేదీ హసన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ సకీబ్. ఇంగ్లండ్ జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్. నెదర్లాండ్స్ స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మ్యాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడ్, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కొలిన్ అకెర్మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లెయిన్, వెస్లీ బారెసి, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్. న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. సౌతాఫ్రికా తెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోట్జీ, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్. శ్రీలంక దసున్ షనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దుషన్ హేమంత, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీషా పతిరానా, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ -
WC 2023: ఈసారి వరల్డ్‌కప్ ఫేవరెట్లు ఆ ఐదు జట్లే! కానీ..
ICC World Cup 2023: వన్డే వరల్డ్‌కప్-2023కి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 5న ఈ ఐసీసీ ఈవెంట్ 13వ ఎడిషన్ మొదలుకానుంది. పుష్కర కాలం తర్వాత భారత్ ఆతిథ్య ఇస్తున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ తదితర పది జట్లు పాల్గొనబోతున్నాయి. 2011లో.. తర్వాత మళ్లీ ఇప్పుడే ఇక సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ సేన హాట్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆసియా వన్డే కప్-2023 గెలిచి జోరు మీదున్న భారత జట్టు 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ రాకతో మరింత పటిష్టంగా మారగా.. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా కూడా బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(బార్డ్) వరల్డ్‌కప్-2023లో ఫేవరెట్లు ఎవరన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఈ ఐదు జట్లు ఫేవరెట్.. కానీ ‘‘వన్డే క్రికెట్లో ప్రపంచంలోనే ఇండియా టాప్ ర్యాంకులో ఉంది. అదీగాకుండా ఈసారి స్వదేశంలో టోర్నీ జరుగనుంది. కాబట్టి వాళ్లకు హోం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇక ఇంగ్లండ్.. డిఫెండింగ్ చాంపియన్ కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు అపార అనుభవం ఉంది. కాబట్టి ఆసీస్ జట్టు కూడా ఎప్పుడూ బలమైన పోటీదారే. పాకిస్తాన్ కూడా తనదైన రోజున అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. పాక్ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక సౌతాఫ్రికా కూడా గత కొన్నేళ్లుగా మెరుగ్గా ఆడుతోంది. సమతూకమైన జట్టుగానూ ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక కూడా సవాల్ విసరగలుగుతాయి. అయితే, ఐసీసీ వరల్డ్‌కప్ విజేత ఎవరన్న అంశంపై అంచనా వేయడం కష్టం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రస్తుత ఫామ్, ర్యాంకింగ్ దృష్ట్యానే ఈ టీమ్‌లను ఎంచుకోవడం జరిగింది’’ అని బార్డ్ సమాధానమిచ్చింది. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! -
బజ్‌బాల్ సూపర్! రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి: టీమిండియా దిగ్గజం
Indian cricket legend Praising England’s “Bazball” approach: సంప్రదాయ క్రికెట్లో ఇంగ్లండ్ అనుసరిస్తున్న ‘బజ్‌బాల్’ విధానం అద్భుతంగా ఉందని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ కొనియాడాడు. టెస్టుల్లో అన్ని క్రికెట్ జట్లు ఇలాంటి దూకుడు ప్రదర్శిస్తే ఆట మరింత రసవత్తరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇటీవల తాను చూసిన అత్యుత్తమ టెస్టు సిరీస్‌లలో యాషెస్ అద్భుతమని కొనియాడాడు. కాగా న్యూజిలాండ్ మాజీ స్టార్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ అయిన తర్వాత.. బెన్‌స్టోక్స్ సారథంలో బజ్‌బాల్ విధానానికి శ్రీకారం చుట్టాడు. పరిమిత ఓవర్ల మాదిరే టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే ఇంగ్లండ్ గుర్తుండిపోయే విజయాలు సాధించింది కూడా! డ్రాగా ముగిసినా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోనూ దూకుడును కొనసాగించింది. తొలి టెస్టులో అతి విశ్వాసంతో ఓటమి పాలైనా వెనక్కి తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగింది. ఈ క్రమంలో పర్యాటక ఆసీస్‌తో కలిసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచి డ్రాతో సరిపెట్టుకుంది. అయితే, సిరీస్ ఆసాంతం.. ముఖ్యంగా ఆఖరి టెస్టు నువ్వా- నేనా అన్నట్లు సాగడం అభిమానులకు మజాను అందించింది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బజ్‌బాల్ విధానంపై ప్రశంసలు కురిపించాడు. ‘‘బజ్‌బాల్ అద్భుతం. రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి ఇటీవల నేను చూసిన సిరీస్‌లలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా సిరీస్ అత్యుత్తమంగా అనిపించింది. నిజానికి క్రికెట్ అంటే అలాగే ఆడాలి మరి! మన కెప్టెన్ రోహిత్ వర్మ మంచి సారథి అనడంలో సందేహం లేదు. అయితే, నాయకుడిగా తను కూడా ఇకపై మరింత దూకుడుగా ఉండాలి. ఇంగ్లండ్ ఎలా ఆడుతుందో గమనించాలి. కేవలం మనం మాత్రమే కాదు.. అన్ని క్రికెట్ జట్లు బజ్‌బాల్ గురించి ఆలోచించాలి. కేవలం డ్రాలతో సరిపెట్టుకునే విధానానికి స్వస్తి పలికి దూకుడుగా ఆడుతూ.. గెలుపే పరమావధిగా ముందుకు సాగాలి’’ అని కపిల్ దేవ్ ప్రపంచ టెస్టు క్రికెట్ జట్లకు సూచించాడు. అలాంటపుడే ఆటకు మరింత ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్‌ను ఉద్దేశించి కపిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే.. -
ఏమో.. టీమిండియాపై అదే రిపీట్ చేస్తామేమో! స్టోక్స్ ఓవరాక్షన్ వద్దు!
Ben Stokes Reply on England Bazball Tactics Against Rohit Sharma's Side: ‘బజ్‌బాల్’ ఇంగ్లండ్ తదుపరి గమ్యస్థానం భారత్. 177 రోజుల తర్వాత అది కూడా హైదరాబాద్‌లో టీమిండియాతో స్టోక్స్ బృందం తొలి టెస్టు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఆఖరి టెస్టులో అద్భుత విజయం సాధించింది. లండన్‌లో ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఉత్కంఠగా సాగిన మైదానంలో 49 పరుగుల తేడాతో ప్యాట్ కమిన్స్ బృందంపై గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. అయితే, గత సిరీస్‌లో ఆస్ట్రేలియా గెలిచిన కారణంగా ట్రోఫీ మాత్రం కంగారూల వద్దనే ఉండనుంది. ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మక యాషెస్ తర్వాత టీమిండియాతో జనవరి నుంచి మరో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సిద్ధమవుతోంది. ఇక న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా వచ్చిన తర్వాత స్టోక్స్ సారథ్యంలో బజ్‌బాల్ పేరిట దూకుడైన ఆటతో అలరిస్తోంది. మెకల్లమ్ మార్గదర్శనంలో స్టోక్స్ కెప్టెన్సీలో టెస్టుల్లో అగ్రెసివ్ క్రికెట్‌తో వరుస విజయాలు సాధించింది. అయితే, ఆసీస్‌తో మాత్రం ఇంగ్లండ్ అనుసరించి ఈ విధానం బెడిసికొట్టింది. ఫలితంగా సిరీస్ గెలిచే అవకాశం చేజారింది. ఈ క్రమంలో ఐదో టెస్టులో విజయానంతరం మీడియాతో మాట్లాడిన బెన్ స్టోక్స్‌కు టీమిండియాతో సిరీస్ గురించి ప్రశ్న ఎదురైంది. రోహిత్ సేనతో సిరీస్‌లోనూ బజ్‌బాల్ కంటిన్యూ చేస్తారా అని అడుగగా.. ‘‘మేము న్యూజిలాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశాం. అయితే, సౌతాఫ్రికాపై అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాం. మళ్లీ పాకిస్తాన్‌ను ఓడించాం. కానీ ఆ తర్వాత.. ఆస్ట్రేలియాపై కూడా ఇలాంటి ఫీట్ అందుకోలేకపోయాం. ఏమో ఒకవేళ టీమిండియాతో సిరీస్‌లో ఇలాంటి విజయం అందుకుంటామేమో! కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది’’ అంటూ స్టోక్స్ బదులిచ్చాడు. కాగా బజ్‌బాల్‌తో కివీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన ఇంగ్లండ్.. సౌతాఫ్రికాపై 2-1తో గెలిచింది. అనంతరం పాకిస్తాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్.. టీమిండియాతో జనవరి 25- మార్చి 24 వరకు ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక స్టోక్స్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ‘‘ఓవరాక్షన్ వద్దు.. ఇక్కడికి వచ్చాక ద్రవ్‌బాల్ దెబ్బ రుచిచూద్దురు కానీ..’’ అంటూ టీమిండియా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు -
'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ గెలవడంతో ఇంగ్లండ్ కథ ముగిసేనట్లేనని అంతా భావించారు. కానీ మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో ఐదోటెస్టు ఇంగ్లండ్‌కు కీలకంగా మారింది. చివరి టెస్టు గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని భావించిన ఇంగ్లండ్ అందుకు తగ్గట్లుగానే బజ్‌బాల్ ఆటతీరుతో ఆసీస్‌ను కట్టడి చేసింది. కానీ 384 పరుగుల టార్గెట్‌ను ఆసీస్ చేధించేలా కనిపించింది. కానీ ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకోవడంతో ఆట ఐదోరోజు తొలి సెషన్లో కథ మొత్తం మారిపోయింది. ఆసీస్ తొందరగా వికెట్లు కోల్పోవడంతో 49 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. కాగా మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసీస్ ఆటగాళ్లు, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక దగ్గర చేరి డ్రెస్సింగ్‌రూమ్‌లోనే మందు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఖండించాడు. స్టోక్స్ మాట్లాడుతూ.. ''పార్జీ జరిగిన మాట నిజమే.. కానీ మీరు అనుకుంటున్నట్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు. నిజానికి మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం అనంతరం ఆసీస్ ఆటగాళ్లు మా దగ్గరకు వచ్చారు. కానీ మా ప్రధాన ఆటగాళ్లు స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీ రిటైర్మెంట్పై స్పెషల్ స్పీచ్‌లతో చిన్న పార్టీ చేసుకున్నాం. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఒక గంటపాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేం బిజీగా ఉండడంతో మమ్మల్ని కలవకుండానే ఆసీస్ ఆటగాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిజానికి యాషెస్ సిరీస్ ముగిశాక ఆసీస్ ఆటగాళ్లతో కలిసి సంప్రదాయ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కానీ బ్రాడ్, మొయిన్ అలీ రిటైర్మెంట్, ఇతర కార్యక్రమాల వల్ల కలవడం కుదరలేదు. అయితే ఆసీస్ ఆటగాళ్లతో కలిసి నైట్‌క్లబ్‌కు వెళ్లి పార్టీ ఎంజాయ్ చేయాలని నిశ్చయించుకున్నాం. నెలరోజుల పాటు యాషెస్ ఆడాం. ఎన్ని గొడవలు జరిగినా అది మ్యాచ్‌ల వరకే పరిమితం. బయట ఆ విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించుకోం.. సరదాగా ఎంజాయ్ చేయడానికి చూస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి' ఉస్మాన్ ఖవాజా అరుదైన ఘనత! యాషెస్ చరిత్రలో 26 ఏళ్ల తర్వాత.. -
Ashes 2023: ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు! యాషెస్ చరిత్రలో..
The Ashes, 2023- England vs Australia: యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(141) సాధించి శుభారంభం అందుకున్న ఈ ఓపెనర్.. మొత్తంగా మూడు అర్ద శతకాలు కూడా సాధించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓవరాల్‌గా 496 పరుగులతో మెరిశాడు. ఈ క్రమంలో యాషెస్ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన ఆసీస్ ఓపెనర్ల జాబితాలో చేరాడు. కాగా 1997లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ మాథ్యూ ఇలియట్ యాషెస్ సిరీస్‌లో మొత్తంగా 556 పరుగులు చేశాడు. అతడి కెరీర్ మొత్తంలో సాధించిన రన్స్‌లో సగానికి పైగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ సందర్భంగానే స్కోర్ చేయడం గమనార్హం. 26 ఏళ్ల తర్వాత.. ఈ నేపథ్యంలో 26 ఏళ్ల తర్వాత ఖవాజా అత్యధికంగా 496 పరుగులు సాధించి మాథ్యూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. 1997 తర్వాత యాషెస్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసీస్ ఓపెనర్‌గా నిలిచాడు. ఆ రికార్డు మిస్! ఇదిలా ఉంటే.. 1948లో 39 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ యాషెస్‌లో 508 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక వయసులో 500కు పైగా రన్స్ సాధించిన ఆసీస్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 496 పరుగుల వద్ద నిలిచిపోయిన 36 ఏళ్ల ఖవాజా.. బ్రాడ్‌మన్ తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కే అవకాశం కోల్పోయాడు. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్-2023 డ్రాగా ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొంది సిరీస్‌ను 2-2తో సమం చేయగా.. గత సిరీస్ గెలిచిన ఆసీస్ ట్రోఫీని తమ వద్దే అట్టిపెట్టుకోనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న క్రిస్ వోక్స్.. మిచెల్ స్టార్క్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పంచుకున్నాడు. యాషెస్-2023లో ఉస్మాన్ ఖావాజా సాధించిన పరుగులు ►ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో- 141, 65. ►లండన్ టెస్టులో- 17, 77. ►లీడ్స్ టెస్టులో- 13, 43. ►మాంచెస్టర్ టెస్టులో- 3, 18. ►ఓవల్ మైదానంలో- 47, 72. చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్‌కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి'
దాదాపు నెలరోజులకు పైగా అలరించిన యాషెస్ సిరీస్ ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి 'యాషెస్'ను ఎగురేసుకపోతుందని అంతా భావించారు. కానీ మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్ 2-1కి ఆధిక్యం తగ్గించింది. ఇక నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం వచ్చినప్పటికి వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక కీలకమైన ఐదోటెస్టులో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ విధించిన 384 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 334 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అయినప్పటికి గత యాషెస్‌ను గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి ట్రోఫీని రిటైన్ చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. దాదాపు 37 ఓవర్ల పాటు అదే బంతితో బౌలింగ్ చేసింది. బంతి స్వింగ్ కాకపోవడంతో ఇంగ్లండ్ పేసర్లు ఎంత ప్రయత్నించినా వాళ్లను ఔట్ చేయలేకపోయారు. అయితే నాలుగో రోజు మార్క్ వుడ్ వేసిన ఒక బంతి ఖవాజా హెల్మెట్ ను బలంగా తాకింది. దీంతో ఆ బాల్ పాడవడంతో అంపైర్లు మరో బాల్ తీసుకున్నారు. అక్కడి నుంచే కథ మారిపోయింది. ఐదో రోజు ఉదయం ఆస్ట్రేలియా ఓపెనర్లును త్వరగా కోల్పోయింది. కాగా మ్యాచ్ ముగిశాకా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ బంతిని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిని మార్చడం వల్లే ఆస్ట్రేలియా మ్యాచ్ ఓడిందని పేర్కొన్నాడు. స్కైస్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. '' బంతి పరిస్థితి అంచనా వేయకుండానే దానిని మార్చాలని నిర్ణయించడం సరైంది కాదు. రెండు బంతులను పోలుస్తే సరైనవి చెప్పే మార్గంలో ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. మధ్యలో అలా కొత్త బంతిని తీసుకోవడం సరైంది కాదు. మీరు ఒకవేళ బంతిని మార్చాలని భావిస్తే ఆ తరహాలోనే ఉండేలా చూడాలి. అంపైర్లు పరీక్షిస్తున్న పెట్టలో మరీ పాతబడిన బంతులు ఎక్కువగా లేవు. కొన్ని చూసినప్పటికి వాటిని పక్కన పడేశారు. పాత బంతి స్థానంలో కొత్తదానిని ఎంపిక చేసినట్లుగా ఉంది. ఐదోరోజు పిచ్ ఉదయం బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది. నాలుగోరోజు చివర్లో బంతిని మార్చడం వల్ల ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. అందుకే ఈ విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా. బాక్స్‌లో అలాంటి పాత బంతులు లేవా? లేకపోతే అంపైర్లు ఏదొకటి ఎంచుకుని ఆడించారా? అనేది తేలాలి. అప్పటికి 37 ఓవర్లు మాత్రమే ఆ బంతితో ఆట జరిగింది. కానీ మార్చిన బంతి మాత్రం దానికి తగ్గట్టుగా లేదు'' అంటూ పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ.. "వాళ్లు బంతిని మార్చగానే ఆ కొత్త బాల్ చాలా భిన్నంగా ఉన్నట్లు అర్థమైంది. అప్పుడే అంపైర్ కుమార్ ధర్మసేన దగ్గరికి వెళ్లి ఈ బాల్ ఎంత పాతది? 8 ఓవర్లు వేసినట్లు కనిపిస్తోంది అని అడిగాను. ఆ బంతి నా బ్యాట్ ను చాలా బలంగా తాకింది. యాషెస్ లో ప్రతి టెస్టులో ఓపెనింగ్ చేశాను. కానీ ఏ బంతి కూడా అంత బలంగా నా బ్యాట్‌ను తాకలేదు. కొత్తగా బ్యాటింగ్ చేయడానికి వచ్చే వాళ్లతో ఈ కొత్త బంతి కాస్త భిన్నంగా ఉందని చెప్పాను. కొన్ని విషయాలు మనం నియంత్రించలేము. ఇది నిరాశ కలిగించింది. ఇంగ్లండ్ ది క్లాస్ బౌలింగ్ అటాక్. వాళ్లకు కాస్త సందు దొరికినా దానిని అద్భుతంగా ఉపయోగించుకుంటారు" అని ఖవాజా అన్నాడు. "There's no way in the world you can look at those two balls there and say in any way that they're comparable" 😤 Ricky Ponting is NOT happy with that 'new' ball 😳 pic.twitter.com/maDFpv8RhM — Sky Sports Cricket (@SkyCricket) July 31, 2023 Won WC by boundary count now winning ashes by changing ball. Is this how a 40 overs old ball change would look alike @ECB_cricket ? pic.twitter.com/aJPWSB2qkZ — ̴D̴̴e̴̴e̴̴p̴̴s̴ (@vkrcholic) July 31, 2023 చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్‌కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
ఆఖరి మజిలీలో ఇంగ్లండ్‌దే విక్టరీ.. విజయంతో బ్రాడ్ విడ్కోలు
లండన్: సంప్రదాయ క్రికెట్లో యాషెస్ సిరీస్‌కున్న ప్రత్యేకత, విశిష్టత ఇంకే సిరీస్‌కు ఎందుకు ఉండదో తాజా సిరీస్‌లో ఏ ఒక్క మ్యాచ్ చూసిన ఇట్టే అర్థమవుతుంది. టెస్టు సమరం ఐదు రోజులు ఆసక్తి కరంగానే మొదలైంది. ఐదు టెస్టులూ రసవత్తరంగానే జరిగాయి. గెలిచినా... ఓడినా... ఫలితంతో సంబంధంలేకుండా ఇంగ్లండ్ ఈ సిరీస్ అసాంతం వన్డేను తలపించే దూకుడునే కొనసాగించింది. ఇక ఈ ఐదో టెస్టు చివరి మజిలీలో వర్షం కూడా ‘యాషెస్’ విశిష్టత ముందు తోకముడిచింది. ఆఖరి రోజు ఆటలో క్లైమాక్స్‌కు సరిపడా మలుపులిచ్చి... ఇరు జట్లను ఊరించి మరీ సిరీస్‌ను పంచింది. ఆసీస్‌ను నడిపించి... ఇంగ్లండ్‌ను గెలిపించి... ఆఖరి రోజు 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 135/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా 94.4 ఓవర్లలో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు వార్నర్ (60; 9 ఫోర్లు), ఖ్వాజా (72; 8 ఫోర్లు) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ స్మిత్ (54; 9 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (43; 6 ఫోర్లు) కలిసి నాలుగో వికెట్ కు 95 పరుగుల జోడించడంతో ఆసీస్ ఆశలు పెంచుకుంది. టీ సెషన్లో 238/3 స్కోరుతో ఇంగ్లండ్‌ను కంగారు పెట్టిన ఆసీస్‌కు... హెడ్, స్మిత్, మార్ష్ (6), స్టార్క్ (0), కెప్టెన్ కమిన్స్ (9) వికెట్లను 300 పరుగుల్లోపే కోల్పోవడంతో ఓటమి ఖాయమైంది. బ్రాడ్ కెరీర్ ఆఖరి టెస్టులో ఆఖరి వికెట్‌గా క్యారీ (28; 1 ఫోర్, 1 సిక్స్)ని అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌కు 334 స్కోరువద్ద తెరపడింది. ఐదో టెస్టులో 49 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్ సిరీస్‌ను 2–2తో సమం చేసుకుంది. అయితే గత సిరీస్‌ను గెలిచిన ఆసీస్ వద్దే ‘యాషెస్’ ఉండిపోనుంది. 2 వికెట్లతో బ్రాడ్ తన కెరీర్‌కు చిరస్మరణీయ ముగింపు ఇచ్చుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వోక్స్ 4, మొయిన్ అలీ 3 వికెట్లు తీశారు. వోక్స్, స్టార్క్‌లకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. తదుపరి యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాలో 2025–2026లో జరుగుతుంది. చదవండి: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు కొత్త కెప్టెన్, రింకూ సింగ్‌కు పిలుపు -
Ashes 5th Test: మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధం..
లండన్: ఈసారి యాషెస్ సిరీస్ మునుపెన్నడు లేని విధంగా పోటాపోటీగా జరుగుతోంది. ఇప్పుడు ఆఖరి మజిలీ కూడా రసవత్తరంగా మారింది. అయితే ఆటలో అరటిపండులా... రసపట్టుపై వాన చినుకులు అంతరాయం కలిగించాయి. ఆదివారం నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 389/9తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన మరో ఇంగ్లండ్ 6 పరుగులు చేసి ఆలౌటైంది. అండర్సన్ (8)ను అవుట్ చేసి మర్ఫీ (4/110) కూడా స్టార్క్ (4/100)తో సమంగా నిలిచాడు. అనంతరం 384 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 38 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 135 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (58 బ్యాటింగ్; 9 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (69 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ చివరిరోజు సోమవారం ఆసీస్ నెగ్గాలంటే మరో 249 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ గెలవాలంటే పది వికెట్లు తీయాలి. లంచ్ బ్రేక్ దాకా 75/0 స్కోరు చేసిన ఆసీస్ రెండో సెషన్లోనూ అదే ఆటను కొనసాగించడంతో ఖ్వాజా, వార్నర్ అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. తర్వాత కాసేపటికే వర్షం ముంచెత్తింది. దీంతో ఈ సెషన్లో కేవలం 14 ఓవర్ల ఆటే సాధ్యపడింది. ప్రస్తుతం ఆసీస్ 2–1తో ఆధిక్యంలో ఉంది. గత యాషెస్ సాధించడంతో ఈ మ్యాచ్‌తో సంబంధం లేకుండానే సిరీస్‌ను నిలబెట్టుకుంది. చదవండి: Ashes 5th Test Day 4: డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు -
రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్
ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఓవల్‌లో జరుగుతున్న మ్యాచే తనకు చివరి టెస్టు అని 37 ఏళ్ల బ్రాడ్ వెల్లడించాడు. యాషెస్‌లో చివరి టెస్టుకు ముందు 166 టెస్టుల్లో 27.68 సగటుతో 600 వికెట్లు తీసిన బ్రాడ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో చివరి వన్డే ఆడిన బ్రాడ్ అప్పటినుంచి ఒక్క టెస్టులకే పరిమితమయ్యాడు. ఈతరం టెస్టు క్రికెట్లో గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు స్టువర్ట్ బ్రాడ్. తన సహచర పేసర్ జేమ్స్ అండర్సన్‌తో పోటీ పడి మరీ వికెట్లు తీసే బ్రాడ్ అర్థంతరంగా రిటైర్మెంట్ ఇవ్వడం అభిమానులకు షాక్ కలిగించింది. ఇక స్టువర్ట్ బ్రాడ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్. 2007 టి20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఇప్పటికి బ్రాడ్ అనగానే ఆ ఆరు సిక్సర్లే కళ్లు ముందు కదలాడతాయి. అంతకముందు ఓవర్లో యువరాజ్‌తో ఆండ్రూ ఫ్లింటాఫ్ వైరం పెట్టుకున్నాడు. దీంతో యువరాజ్ కోపం ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన బ్రాడ్‌కు శాపంగా మారింది. ఓవరాల్‌గా స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టుల్లో 3656 పరుగులు.. 602 వికెట్లు, 121 వన్డేల్లో 529 పరుగులు.. 178 వికెట్లు, 56 టి20ల్లో 118 పరుగులు.. 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014లో జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో బ్రాడ్ ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అయితే ఇంగ్లండ్‌ను సెమీస్ చేర్చడంలో బ్రాడ్ విఫలమయ్యాడు. BREAKING 🚨: Stuart Broad announces he will retire from cricket after the Ashes ends. pic.twitter.com/dNv8EZ0qnC — Sky Sports Cricket (@SkyCricket) July 29, 2023 Forever remembered for 𝘁𝗵𝗼𝘀𝗲 mesmerising spells, 𝘁𝗵𝗼𝘀𝗲 Ashes battles, 𝘁𝗵𝗼𝘀𝗲 602* wickets. Take a bow, Stuart Broad 👏#EnglandCricket | #Ashes pic.twitter.com/6WvdTW5AoA — England Cricket (@englandcricket) July 29, 2023 చదవండి: Ben Stokes: యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు; రోహిత్‌ను దాటలేకపోయాడు ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ -
యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు; రోహిత్‌ను దాటలేకపోయాడు
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తోంది. మూడోరోజు ఆటలో మూడో సెషన్లో బ్యాటింగ్ ఆడుతున్న ఇంగ్లండ్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. జో రూట్ 71, జానీ బెయిర్ స్టో 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఆసీస్ ముంగిట ఇంగ్లండ్ కనీసం 400 పరుగుల టార్గెట్‌ను పెట్టాలని భావిస్తోంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్ 67 బంతుల్లో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ క్రమంలో స్టోక్స్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో స్టోక్స్ చోటు సంపాదించాడు. ఆసీస్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లో స్టోక్స్ ఇప్పటివరకు 15 సిక్సర్లు బాదాడు. 2018-19లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ ఆటగాడు హెట్‌మైర్ కూడా 15 సిక్సర్లు బాదాడు. ఇక తొలి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 2019-20లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో 19 సిక్సర్లు బాది తొలి స్థానంలో ఉన్నాడు. ఇక యాషెస్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన టెస్టు సిరీస్‌లు కలిపి ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా స్టోక్స్ రికార్డులకెక్కాడు. స్టోక్స్ తర్వాతి స్థానంలో కెవిన్ పీటర్సన్(2005 యాషెస్‌లో) 14 సిక్సర్లు బాదగా, 2019 యాషెస్‌లో మళ్లీ బెన్ స్టోక్స్ 13 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా.. 2005 యాషెస్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్ 11 సిక్సర్లు బాది నాలుగో స్థానంలో ఉన్నాడు. Ben Stokes straightaway in the mood. Smashes Josh Hazlewood for a six in the first over after Lunch. pic.twitter.com/z9Di8YY4PM — Mufaddal Vohra (@mufaddal_vohra) July 29, 2023 చదవండి: Cristiano Ronaldo: 'అవతలికి పో'.. కెమెరామన్‌పై రొనాల్డో అసహనం వాళ్లు లేరు.. వీళ్లకు ఛాన్స్.. బెడిసికొట్టిన ప్రయోగం! 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి.. -
Ashes 2023: ఒకరి జెర్సీని మరొకరు.. 'మతిమరుపు' గానీ వచ్చిందా?
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి రోజు ఇంగ్లండ్ ఆలౌట్ అయితే.. రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు ఆలౌట్ చేశారు. కాగా ఆసీస్ కేవలం 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. మూడోరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 75 బంతుల్లో 73 పరుగులతో వేగంగా ఆడుతుండగా.. స్టోక్స్ కూడా 30 బంతుల్లో 20 పరుగులతో దాటిగా ఆడుతూ అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 128 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒకరి జెర్సీని మరొకరు ధరించారు. ఇది చూసిన అభిమానులకు కాసేపు అర్థం కాలేదు. ఇంగ్లండ్ ఆటగాళ్లు మరిచిపోయి ఒకరి జెర్సీ ఒకరు వేసుకున్నారేమోనని అభిప్రాయపడ్డారు. నిజానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలా జెర్సీలను మార్చుకోవడానికి ఒక కారణం ఉంది. అల్జీమర్స్(Dementia-మతిమరుపు)వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు మద్దతుగా బెన్ స్టోక్స్ బృందం ఒకరి జెర్సీలు మరొకరు ధరించారు. కెప్టెన్ స్టోక్స్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో జెర్సీ వేసుకున్నాడు. మోయిన్ అలీ మాజీ కెప్టెన్ జోరూట్ జెర్సీతో వచ్చాడు. జేమ్స్ అండర్స్ మరో పేసర్ స్టువార్ట్ బ్రాడ్ జెర్సీతో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఒక్క చోట చేరారు. అల్జీమర్స్ సొసైటీ సభ్యులు ఆలపించిన పాట విన్నారు. ఆ తర్వాత మూడోరోజు ఆటను ప్రారంభించారు. అల్జీమర్స్ అనేది ఒక వృద్దాప్య సమస్య. 60 ఏళ్లు పైబడిన వాళ్లలో రోజు రోజుకు మతిమరుపు పెరుగుతుంటుంది. దాంతో, వాళ్లు అన్ని విషయాలు మర్చిపోతారు. కుటుంబసభ్యులను, ప్రాణ స్నేహితులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటారు. డిమెన్షియా వల్ల వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. A moving and powerful rendition of Jerusalem 👏@alzheimerssoc | #CricketShouldBeUnforgettable pic.twitter.com/cMC37JWC96 — England Cricket (@englandcricket) July 29, 2023 Today is the day! It's the @lv=Men's Ashes Test Match: Day 3 Supporting Alzheimer’s Society. 🏏 Huge thanks to the Kia Oval (@surreycricket) and @englandcricket - and sending lots of luck to our boys! 🤞 Great #CricketShouldBeUnforgettable https://t.co/oFsZXP1wXb pic.twitter.com/vbFrIO8HXj — Alzheimer's Society (@alzheimerssoc) July 29, 2023 చదవండి: ICC ODI WC 2023: గుడ్‌న్యూస్.. ఆగస్టు 10 నుంచి వన్డే వరల్డ్‌కప్ టికెట్లు అందుబాటులో! -
యాషెస్ చరిత్రలో తొలిసారి.. ‘అరుదైన’ రికార్డు బద్దలు! ఎంత గొప్పగా అంటే..
England vs Australia, 5th Test: ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ యాషెస్ సిరీస్‌లో ‘అరుదైన’ రికార్డు నమోదు చేశారు. యాషెస్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా స్లో ఇన్నింగ్స్ ఆడి రికార్డులకెక్కారు. కాగా లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య గురువారం ఐదో టెస్టు ఆరంభమైంది. లబుషేన్ జిడ్డు బ్యాటింగ్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(47), డేవిడ్ వార్నర్(24) ఫర్వాలేదనిపించారు. అయితే, క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో వార్నర్ పెవిలియన్ చేరిన క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్ జిడ్డు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మొత్తంగా 82బంతులు ఎదుర్కొన్న అతడు 10.98 స్ట్రైక్‌రేటుతో కేవలం 9 పరుగులు సాధించాడు. రన్‌రేటు 1.61.. ఖవాజాతో కలిసి 26 ఓవర్ల ఆటలో.. రెండో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ అవుటయ్యే సమయానికి ఖవాజా 123 బంతులాడి 37 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఇక వీరిద్దరి పార్ట్నర్షిప్లో రన్‌రేటు 1.61గా నమోదైంది. వారి రికార్డు బద్దలు కొట్టి యాషెస్ చరిత్రలో.. ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 150 బంతులు ఎదుర్కొని ఈ మేరకు అత్యల్ప రన్‌రేటుతో పరుగులు రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో 2013 నాటి అడిలైడ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మైకేల్ కార్బెర్రి, జోరూట్ 1.75 రన్‌రేటుతో 27 ఓవర్లలో 48 పరుగులు సాధించారు. ఖవాజా, లబుషేన్ ఇప్పుడు వారి రికార్డు బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘మీకంటే నత్త నయమనుకుంటా. మహగొప్పగా ఆడారు.. 1.61 రన్‌రేటు గ్రేటు’’ అంటూ ఖవాజా, లబుషేన్‌లను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐదో టెస్టులో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ స్టీవ్ స్మిత్ 71 పరుగులతో రాణించడంతో.. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేయగలిగింది. ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. చదవండి: 151 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్! వీడియో వైరల్ -
ఆసీస్ ఇంత చెత్తగా ఆడటం నా జీవితంలో చూడలేదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
The Ashes, 2023- England vs Australia, 5th Test: యాషెస్ సిరీస్-2023 ఐదో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. కంగారూ జట్టు ఇంత బెరుగ్గా, భయం భయంగా బ్యాటింగ్ చేయడం ఎన్నడూ చూడలేదన్నాడు. ఓవల్ మైదానంలో ఆసీస్ ప్రదర్శన చెత్తగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇప్పటికే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ట్రోఫీ తమ వద్దే పెట్టుకునే అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై.. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి 2-2తో సిరీస్‌ను డ్రా చేసుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. స్వల్ప ఆధిక్యంలో ఇక బజ్‌బాల్ విధానం పేరిట దూకుడుగా ఆడుతున్న స్టోక్స్ బృందం.. ఓవల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. హ్యారీ బ్రూక్(85) మెరుగైన ప్రదర్శన కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో.. బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సరికి 295 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. ఇంత చెత్తగా ఆడటం ఎప్పుడూ చూడలేదు స్టీవ్ స్మిత్ అర్ధ శతకం(71) కారణంగా 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించగలిగింది. ఆచితూచి ఆడుతూ ఈ మేరకు స్కోరు సాధించింది. వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్ 82 బంతులు ఎదుర్కొని 9 పరుగులు మాత్రమే చేశాడంటే కంగారూల బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ స్పందిస్తూ.. ‘‘ఆస్ట్రేలియా ఇంత డిఫెన్సివ్‌గా ఆడటం ఎప్పుడూ చూడలేదు. సాధారణంగా వాళ్లు దూకుడుగా ఆడతారు. మ్యాచ్ చూసే వాళ్లకు మజా అందిస్తారు. కానీ ఈసారి.. బౌలర్లపై ఏమాత్రం ఒత్తిడి పెంచలేకపోయారు. నేనైతే ఆస్ట్రేలియా ఇంత చెత్తగా ఆడటం నా జీవితంలో ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. నిజం.. వాళ్లు గతంలో ఇలా అస్సలు ఆడలేదు’’ అని బీబీసీ మ్యాచ్ స్పెషల్ ప్రోగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. చదవండి: అస్సలు నేను ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి -
82 బంతుల్లో 9 పరుగులు.. సూపర్ ఇన్నింగ్స్! మరో పుజారా అంటూ
లండన్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న యాషెస్ ఆఖరి టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 61/1 తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఆసీస్ 151 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్మిత్ (71; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే ఆసీస్‌కు లభించింది. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. లబుషేన్‌పై ట్రోల్స్.. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ స్లో ఇన్నింగ్స్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ తన ఆటతీరుతో విసుగు తెప్పించాడు. 82 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన లబుషేన్.. ఆఖరికి వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. లుబషేన్ స్లో ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ రెండో రోజు తొలి సెషన్లో కేవలం 54 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో లుబషేన్ను ఉద్దేశించి మరో ఛతేశ్వర్ పుజారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు వ్యతిరేకంగా లబుషేన్ ఆడుతున్నాడని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కాగా అంతకముందు నాలుగో టెస్టులో లబుషేన్ సెంచరీ నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 162 పరుగులు చేశాడు. చదవండి: MLC 2023: జూనియర్ 'ఏబీడీ' సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్ టీమ్ -
చరిత్ర సృష్టించిన స్టువర్ట్ బ్రాడ్.. తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ అరుదైన ఫీట్ సాధించాడు. యాషెస్ చరిత్రలో ఆసీస్‌పై 150 వికెట్లు తీసిన మొదటి ఇంగ్లండ్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఆఖరి టెస్టులో అతను ఈ మైలురాయిని అందుకున్నాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(47) ఎల్బీగా ఔట్ చేయడం ద్వారా బ్రాడ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ తరపున 166 టెస్టుల్లో 600 వికెట్లు, 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టి20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. ఈ దశాబ్దంలో టెస్టు క్రికెట్లో 600కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో బ్రాడ్ ఒకడిగా నిలిచాడు. ఇక అండర్సన్ తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గానూ బ్రాడ్ రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. ఇంగ్లండ్‌ను తక్కువకు ఆలౌట్ చేశామన్న ఆనందం ఆసీస్ నిలబెట్టుకోలేకపోయింది. వరుస విరామాల్లో ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీస్తుండడంతో ఆసీస్ ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 64 పరుగులు.. అర్థసెంచరీతో రాణించగా.. కెప్టెన్ కమిన్స్ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, మార్క్‌వుడ్‌లు రెండు వికెట్లు తీయగా.. అండర్సన్, వోక్స్, జోరూట్ తలా ఒక వికెట్ తీశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 57 పరుగుల దూరంలో ఉంది. చదవండి: Japan Open 2023: సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి -
మొదలైన ఐదో టెస్టు.. ఇంగ్లండ్ గెలిచినా యాషెస్ కంగారులదే
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ఓవల్ వేదికగా ఐదో టెస్టు గురువారం ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగింది. కామెరాన్ గ్రీన్ ఈ టెస్టుకు దూరం కావడంతో అతని స్థానంలో స్పిన్నర్ టాడ్ మర్ఫీ తుదిజట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. బెన్ డకెట్ 29, జాక్ క్రాలీ 10 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, టాడ్ మర్ఫీ ఇంగ్లండ్ గెలిచినా ఆసీస్‌దే యాషెస్.. ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో 2-1తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. ఒకవేళ చివరి టెస్టులో ఇంగ్లండ్ గెలిచి 2-2తో సిరీస్ సమం అయినా యాషెస్ ట్రోఫీ మాత్రం ఆస్ట్రేలియా వద్దనే ఉంటుంది. చివరగా 2021లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-1తో ఇంగ్లండ్‌పై నెగ్గింది. రూల్ ప్రకారం యాషెస్ సిరీస్ ఎప్పుడు జరిగినా సిరీస్ డ్రాగా ముగిస్తే గత ఎడిషన్‌లో ట్రోఫీ సాధించిన జట్టు వద్దే యాషెస్ ఉంటుంది. ఈ లెక్కన ఆస్ట్రేలియా చివరి టెస్టులో ఓడినా, డ్రా అయినా యాషెస్ మాత్రం వారి వద్దే ఉంటుంది. ఇక ఇంగ్లండ్ చివరిసారి 2015లో యాషెస్ దక్కించుకుంది. స్టోక్స్ సారధ్యంలో బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడుగా కనిపిస్తున్న ఇంగ్లండ్ ఈసారి కచ్చితంగా యాషెస్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ డిఫెండింగ్ ఛాంపియన్ ఆటతీరు ప్రదర్శించిన ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టుల్లో నెగ్గి ఇంగ్లండ్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో టెస్టులో ఓడినప్పటికి.. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ దూకుడు చూపించినా.. వరుణుడి ఆటంకం, లబుషేన్ అద్భుత సెంచరీతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! World cup 2023: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్.. 10 సెకన్లకు 30 లక్షలు! -
ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు!
England Remain Unchanged For Fifth Ashes Test: యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఓవల్ వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో మాంచెస్టర్‌లో ఆడిన జట్టునే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. కాగా నాలుగో టెస్టులో విఫలమైన వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌పై విమర్శల నేపథ్యంలో.. ఆఖరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ అతడికి అవకాశం ఇవ్వడం విశేషం. కాగా లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో అండర్సన్ మిస్ అయ్యాడు. ఈ క్రమంలో మాంచెస్టర్‌లో అతడికి ఛాన్స్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. వైఫల్యాలు కొనసాగిస్తూ గత వైఫల్యాలను కొనసాగిస్తూ కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లో మొత్తంగా 114 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 1000 వికెట్ల(ఫస్ట్‌క్లాస్)తో లెజెండరీ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న అతడు.. తాజా యాషెస్ సిరీస్‌లో మాత్రం జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వంటి వాళ్లు ఘాటు విమర్శలు చేశారు. దీంతో.. ఆఖరి టెస్టులో అండర్సన్ ఆడిస్తారా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అతడిని కొనసాగిస్తున్నట్లు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. దీంతో ఇంత మొండితనం పనికిరాదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 2-1తో ఆధిక్యంలో ఆస్ట్రేలియా అండర్సన్‌కు బదులు ఓలీ రాబిన్సన్, జోస్ టంగ్లలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కాగా జూలై 27 నుంచి ఇంగ్లండ్- ఆసీస్ మధ్య ఐదో టెస్టు ఆరంభం కానుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో.. 2-1తో ఆధిక్యంలో ఉన్న కమిన్స్ బృందంపై ఇంగ్లండ్ పైచేయి సాధిస్తుందా లేదా వేచి చూడాలి!! యాషెస్ 2023- ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలీ, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
Ashes 2023: అదొక్కటే మార్పు.. చివరి టెస్టులో వార్నర్‌కు చోటు!
The Ashes, 2023- England vs Australia, 5th Test: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 తుది అంకానికి చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జూలై 27న ఆరంభం కానుంది. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా రెండు, ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలవగా.. నాలుగో టెస్టు వర్షార్పణం అయింది. ఆ ఒక్కటి గెలిచి కచ్చితంగా గెలుస్తామని భావించిన ఆతిథ్య ఇంగ్లండ్‌కు వరణుడు చేదు అనుభవం మిగల్చడంతో మాంచెస్టర్ డ్రాగా ముగిసిపోయింది. దీంతో.. ట్రోఫీ కోల్పోయినప్పటికీ ఐదో టెస్టు గెలిచి సిరీస్ సమం చేయాలని స్టోక్స్ బృందం ఆశిస్తోంది. అదే సమయంలో 2-1తో ఆధిక్యంలో ఉన్న పర్యాటక ఆసీస్ చివరి మ్యాచ్‌లోనూ సత్తా చాటి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఐదో టెస్టు తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి టీమ్‌లో స్థానంలో కల్పించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌ను పటిష్టం చేసే క్రమంలో మర్ఫీని నాలుగో టెస్టు నుంచి తప్పించి తప్పుచేశారని అభిప్రాయపడ్డారు. అదొక్కటే మార్పు ‘‘ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా ఏం చేయబోతోందో చూడాలి. నా లెక్క ప్రకారమైతే మర్ఫీని కచ్చితంగా జట్టులోకి తీసుకురావాలి. ఓవల్ మైదానంలో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. కాబట్టి అతడిని ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. మర్ఫీ ఒక్కడు తప్ప జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవనుకుంటున్నా. మాంచెస్టర్‌లో పర్వాలేదనిపించాడు. తక్కువ స్కోర్లకే పరిమితమైనా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తను ఓపెనర్‌గా రావడం ఖాయమనిపిస్తోంది’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా జూలై 27- 31 వరకు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఐదో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. యాషెస్ ఐదో టెస్టుకు పాంటింగ్ ఎంచుకున్న ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), టాడ్ మర్ఫీ, జోష్ హాజిల్‌వుడ్. పాంటింగ్ ఇంగ్లండ్ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జోష్ టంగ్. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
అంతకు మించి! బొక్కబోర్లా పడ్డ ఇంగ్లండ్.. టీమిండియా వరల్డ్ రికార్డు!
West Indies vs India, 2nd Test: వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. టెస్టు క్రికెట్లో ‘బజ్‌బాల్’ అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌ను మించిపోయే విధంగా దంచికొట్టారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ 30 బంతుల్లో 38, రోహిత్ శర్మ 44 బంతుల్లో 57, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 52(నాటౌట్) ఆకాశమే హద్దుగా బ్యాట్‌తో వీరవిహారం చేశారు. సంచలన ఇన్నింగ్స్‌తో సరికొత్త రికార్డు ఈ ముగ్గురి అద్భుత ఆట తీరు కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది భారత జట్టు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి విండీస్‌కు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో ట్రినిడాడ్ టెస్టులో సంచలన ఆట తీరుతో టీమిండియా టెస్టుల్లో చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా పేరిట ఉన్న అరుదైన రికార్డు బద్దలు కొట్టి సత్తా చాటింది. కాగా విండీస్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో రోహిత్ సేన 7.54 రన్‌రేటుతో 181 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. తద్వారా టెస్టుల్లో కనీసం 20 ఓవర్ల ఆటలో అత్యధిక రన్‌రేటుతో ఎక్కువ పరుగులు రాబట్టిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది. ఆస్ట్రేలియా అప్పుడలా అంతకు ముందు ఆస్ట్రేలియా.. 2017లో సిడ్నీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 32 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 7.53 రన్‌రేటుతో 241 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ను వెనక్కి నెట్టి ఈ జాబితాలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది. అంతేకాదు.. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగుల మార్కు అందుకున్న జట్టుగా శ్రీలంక పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించింది. ఇది ద్రవ్‌బాల్.. ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బజ్‌బాల్ కాదు.. అంతకుమించి! ఇది ‘ద్రవ్‌బాల్’(హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ఉద్దేశించి). ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. వాట్ టుడూ వాట్ నాట్ టుడూ’’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే, విండీస్ లాంటి బలహీన(ప్రస్తుతం) జట్టుపై ఆడటం కాదు.. పటిష్ట జట్లపై ప్రతాపం చూపాలని పెదవి విరిచేవాళ్లూ లేకపోలేదు. మెకల్లమ్ వచ్చిన తర్వాత కాగా న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆట తీరులో పలు మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ నాయకత్వంలో మెకల్లమ్ మార్గదర్శనంలో పరిమిత ఓవర్ల మాదిరే టెస్టు క్రికెట్లోనూ దూకుడుగా ఆడుతోంది. ఈ క్రమంలో బజ్‌బాల్ ఫేమస్ అయింది. అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్-2023లో మాత్రం ఈ విధానంతో ఇంగ్లండ్ బొక్కబోర్లా పడింది. ఇప్పటికే 1-2తో వెనుకపడి ట్రోఫీని కోల్పోయే దుస్థితి తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ట్రినిడాడ్‌లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి వెస్టిండీస్ 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా 289 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ashes 2023: లెజెండ్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు... -
దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా
ఇంగ్లండ్ వికెట్‌కీపర్ జానీ బెయిర్ స్టో బ్యాడ్‌లక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔట్ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవర్ పూర్తయిందని భావించిన బెయిర్ స్టో క్రీజు బయటకు రాగా.. ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని నేరుగా వికెట్ల మీదకు విసిరాడు. బంతి ఇంకా డెడ్ కాలేదని.. రూల్ ప్రకారం బెయిర్ స్టో ఔట్ అని అంపైర్ ప్రకటించాడు. దీంతో చేసేదేం లేక బెయిర్ స్టో పెవిలియన్ చేరాడు. అయితే ఈ ఔట్‌పై ఆ తర్వాత చాలా పెద్ద చర్చే జరిగింది. సహచర బ్యాటర్ రూపంలో వెంటాడిన దురదృష్టం.. తాజాగా బెయిర్ స్టోను మరోసారి దురదృష్టం వెంటాడింది. అయితే ఈసారి ఔట్ రూపంలో కాదు.. సెంచరీ రూపంలో. సెంచరీ చేసే అవకాశమున్నా ఆ అదృష్టానికి నోచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీకి దూరమయ్యాడు. మరి ఔట్ అయ్యాడా అంటే అదీ లేదు. తన సహచర బ్యాటర్ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో బెయిర్ స్టో 99 పరుగులు నాటౌట్‌గా నిలవాల్సి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే గాయంతో ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన బెయిర్ స్టో రీఎంట్రీ దగ్గరి నుంచి బ్యాడ్‌లక్ వెంటాడుతన్నట్లుగా అనిపిస్తోంది. ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి బెయిర్ స్టో తన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌తో 592 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. జాక్ క్రాలీ 189, మొయిన్ ఆలీ 54, జో రూట్ 84, హారీ బ్రూక్ 61, బెన్ స్టోక్స్ 51 పరుగులు చేసి ఔటయ్యారు. క్రిస్ వోక్స్,బ్రాడ్, అండర్సన్‌లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జానీ బెయిర్ స్టో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న సమయంలో జేమ్స్ అండర్సన్‌ని కామెరూన్ గ్రీన్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 99 వద్ద నాటౌట్‌గా మిగిలిన ఏడో బ్యాటర్‌గా.. టెస్టు క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద నాటౌట్‌గా మిగిలిన ఏడో క్రికెటర్‌గా జానీ బెయిర్‌స్టో నిలిచాడు. ఇంతకుముందు జోఫ్రె బాయ్‌కాట్, స్టీవ్ వా, అలెక్స్ టూడర్, షాన్ పోలాక్, ఆండ్రూ హాల్, మిస్బా వుల్ హక్‌లు 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది.మార్నస్ లబుషేన్ 51, మిచెల్ మార్ష్ 51, ట్రావిస్ హెడ్ 48, స్టీవ్ స్మిత్ 41, మిచెల్ స్టార్క్ 36, డేవిడ్ వార్నర్ 32, అలెక్స్ క్యారీ 20 పరుగులు చేసి సంయుక్తంగా రాణించారు. క్రిస్ వోక్స్ 5 వికెట్లు తీశాడు. 273 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడోరోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసిది. క్రీజులో మార్నస్ లబుషేన్(44 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ ఒక్క పరుగుతో ఉన్నారు. ఆసీస్ ఇంకా 162 పరుగులు వెనుకబడి ఉంది. View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) చదవండి: #Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది వేరే బంతిని -
రూట్‌తో కలిసి చరిత్ర సృష్టించిన జాక్ క్రాలీ! అరుదైన రికార్డు బద్దలు
Ashes- 2023- England vs Australia, 4th Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ అద్భుతం చేశాడు. బజ్‌బాల్ విధానానికి అర్థం చెబుతూ 182 బంతుల్లో 189 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. మాంచెస్టర్‌లో వందకు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగుల వరద పారించడం ద్వారా క్రాలీ వ్యక్తిగతంగా ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన జో రూట్(84)తో కలిసి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొయిన్ అలీ(54)తో కలిసి రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించిన క్రాలీ.. మాజీ సారథి జో రూట్‌తో కలిసి 206 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అయితే, 178 బంతుల్లోనే ఈ మేరకు మూడో వికెట్‌కు భారీగా పరుగులు జోడించడం విశేషం. ఈ క్రమంలో క్రాలీ- రూట్ జోడీ వరల్డ్ రికార్డు సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ సాధించిన జంటగా నిలిచింది. ఈ క్రమంలో తమ సహచర ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో- బెన్‌స్టోక్స్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టింది. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీలివే! 1.జాక్ క్రాలీ- జో రూట్: మాంచెస్టర్, 2023- ఆస్ట్రేలియా మీద 206(178) 2.జానీ బెయిర్‌స్టో- బెన్ స్టోక్స్: కేప్‌టౌన్, 2016- సౌతాఫ్రికా మీద- 399 (306) 3.ఆడం గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్: పెర్త్, 2002- జింబాబ్వే మీద- 233 (203) 4.జాక్ క్రాలీ- బెన్ డకెట్- రావల్పిండి: 2022- పాకిస్తాన్ మీద- 233 (214) 5.జో బర్న్స్- డేవిడ్ వార్నర్- బ్రిస్బేన్: 2015- న్యూజిలాండ్ మీద- 237 (226) 6. ఏబీ డివిల్లియర్స్- గ్రేమ్ స్మిత్- కేప్‌టౌన్: 2005- జింబాబ్వే మీద- 217 (209). చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! ఆసియా కప్-2023 ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్.. A fourth Test century, coming in just 93 balls 💯 Take a bow, Zak Crawley! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/25Nah8QBTh — England Cricket (@englandcricket) July 20, 2023 -
జాక్ క్రాలీ సంచలనం.. యాషెస్ చరిత్రలో మూడో ఇంగ్లండ్ బ్యాటర్‌గా
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైనప్పటికి బజ్‌బాల్ దూకుడు మాత్రం వదల్లేమని తేల్చి చెప్పింది. మూడో టెస్టులో విజయం అందుకున్న ఇంగ్లండ్ ఎలాగైనా సిరీస్ కోల్పోకూడదనే పట్టుదలతో ఉంది. అందుకే మాంచెస్టర్ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మరోసారి బజ్‌బాల్ ఆటతీరును చూపించింది. ఒక్కరోజులోనే దాదాపు 400 పరుగులు మార్క్ అందుకునేలా కనిపించిన ఇంగ్లండ్ చివరకు రెండో రోజు ఆటను 4 వికెట్ల నష్టానికి 384 పరుగుల వద్ద ముగించింది. ఒకవేళ ఆసీస్ తొలి సెషన్ ఆరంభంలోనే ఔటయ్యి ఉంటే ఇంగ్లండ్ 400 పరుగులు మార్క్‌ను కూడా క్రాస్ చేసేదే. ఇక ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వన్డే తరహాలో వేగంగా ఆడిన క్రాలీ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నప్పటికి 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. 93 బంతుల్లోనే శతకం మార్క్ సాధించిన క్రాలీ ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అతనికి రూట్(95 బంతుల్లో 84 పరుగులు) జత కలవడంతో ఇంగ్లండ్ స్కోరు ఓవర్‌కు ఐదు పరుగుల రనరేట్కు తగ్గకుండా పరిగెత్తడం విశేషం. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు కేవలం మూడు మెయిడెన్ ఓవర్లు మాత్రమే ఇచ్చుకున్నారంటే ఇంగ్లండ్ ఎంత ధాటిగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ► ఈ క్రమంలో జాక్ క్రాలీ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు.యాషెస్ చరిత్రలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఇంగ్లండ్ బ్యాటర్‌గా జాక్ క్రాలీ నిలిచాడు. క్రాలీ ఈ మ్యాచ్‌లో 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. క్రాలీ కంటే ముందు టిప్ ఫోస్టర్(1902లో సిడ్నీ వేదికగా 214 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వాలీ హామండ్(1938లో లార్డ్స్ వేదికగా 210 పరుగులు) ఉన్నాడు.ఇక బాబ్ బార్బర్(1966లో సిడ్నీ వేదికగా 185 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు. ► ఇక యాషెస్ టెస్టులో ఒక్క సెషన్లోనే సెంచరీ అందుకున్న ఆరో ఇంగ్లండ్ బ్యాటర్‌గా క్రాలీ రికార్డులకెక్కాడు. ► క్రాలీ స్ట్రైక్‌రేట్ 103 కాగా యాషెస్ చరిత్రలో ఇది రెండో బెస్ట్‌గా ఉంది. 103 స్ట్రైక్‌రేట్‌తో ఒక ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో కలిసి క్రాలీ సంయుక్తంగా ఉన్నాడు. ► 93 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న క్రాలీ యాషెస్ టెస్టులో వేగవంతంగా సెంచరీ సాధించిన నాలుగో ఇంగ్లండ్ బ్యాటర్‌గా నిలిచాడు. A fourth Test century, coming in just 93 balls 💯 Take a bow, Zak Crawley! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/25Nah8QBTh — England Cricket (@englandcricket) July 20, 2023 చదవండి: 500వ మ్యాచ్‌లో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
'అనుకున్నంత గొప్ప క్యాచ్ ఏమి కాదులే..'
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇరుజట్లు సమాన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. అయితే ఆట ముగిసే సమయంలో మాత్రం ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా అనిపించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ కీపర్ జానీ బెయిర్ స్టో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 63వ ఓవర్ క్రిస్ వోక్స్ వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతిని వోక్స్ వైడ్ లైన్ స్టంప్ మీదుగా వేశాడు. మార్ష్ పొజిషన్ మార్చి షాట్ ఆడాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి స్లిప్స్ కార్డన్ దిశగా వెళ్లింది. అయితే బంతి కాస్త లో యాంగిల్లో వెళ్లడంతో క్యాచ్ కష్టతరమనిపించింది. కానీ కీపర్ బెయిర్ స్టో డైవ్ చేస్తూ తన గ్లోవ్స్‌ను దూరంగా పెట్టడం.. బంతి సేఫ్‌గా అతని చేతుల్లో పడింది. దీంతో షాక్ తిన్న మార్ష్ నిరాశతో పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు బెయిర్ స్టో క్యాచ్‌పై విభిన్న రీతిలో స్పందించారు. ''ఇదేమంత గొప్ప క్యాచ్‌గా అనిపించడం లేదు.. మాములుగానే ఉంది'' అంటూ కామెంట్ చేశారు. STOP THAT JONNY BAIRSTOW! 🤯 #EnglandCricket | #Ashes pic.twitter.com/aZ7wKcncRW — England Cricket (@englandcricket) July 19, 2023 చదవండి: ICC ODI WC 2023: 'కింగ్' ఖాన్ చేతిలో వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ.. ఫ్యాన్స్ రచ్చ Virat Kohli: '500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే' -
600 వికెట్ల క్లబ్లో.. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో బౌలర్‌గా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. హెడ్‌ను అవుట్ చేయడం ద్వారా బ్రాడ్ టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. అత్యధిక వికెట్ల జాబితాలో మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అండర్సన్ (688) మాత్రమే బ్రాడ్కంటే ముందున్నారు. 𝗧𝗵𝗲 moment.#EnglandCricket | #Ashes https://t.co/lz2j0t9LN5 pic.twitter.com/9RxHutgLDC — England Cricket (@englandcricket) July 19, 2023 చదవండి: భారత్‌కు ఎదురుందా! #ChrisMartin: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్‌చేస్తే.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో -
Ashes Series: తొలి వన్డే ఇంగ్లండ్‌దే.. 2 వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం
మల్టీ ఫార్మట్ మహిళల యాషెస్ సిరీస్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ పైచేయి సాధిస్తుంది. ఈ సిరీస్‌లో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన ఇంగ్లండ్.. ఆతర్వాత పుంజుకుని 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 3 వన్డేల సిరీస్‌లో తొలి వన్డే నెగ్గి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బెత్ మూనీ (81 నాటౌట్), ఎల్లీస్ పెర్రీ (41), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (34), జొనాస్సెన్ (30) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, నాట్ సీవర్ బ్రంట్ చెరో 2 వికెట్లు.. కేట్ క్రాస్, ఎక్లెస్టోన్, సారా గ్లెన్, అలైస్ క్యాప్సీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. హీథర్ నైట్ (75 నాటౌట్), ట్యామీ బేమౌంట్ (47), అలైస్ క్యాప్సీ (40), నాట్ సీవర్ బ్రంట్ (31) రాణించడంతో 48.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 3, జార్జియా వేర్హమ్ 2, ఎల్లైస్ పెర్రీ, మెగాన్ షట్, జెస్ జోనాస్సెన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జులై 16న జరుగనుంది. లక్ష్య ఛేదనలో రికార్డు.. ఈ మ్యాచ్‌లో 264 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఇంగ్లండ్.. లక్ష్య ఛేదనలో తమ రికార్డును మెరుగుపర్చుకుంది. గతంలో ఇంగ్లండ్ అత్యధిక లక్ష్యఛేదన రికార్డు 245/7గా ఉండింది. 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ రికార్డు సాధించింది. యాషెస్ తొలి వన్డే ద్వారా ఇంగ్లండ్ వన్డేల్లో తొలిసారి 250 పరుగులకు పైబడిన లక్ష్యాన్ని ఛేదించింది. -
'అరె శాండ్‌పేపర్ మరిచిపోయా'.. ఆసీస్ ప్రధానికి రిషి సునాక్ కౌంటర్
ప్రతిష్టాత్మ యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి రెండింటిలో ఆసీస్ విజయం సాధించగా.. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి రేసులో నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 19 నుంచి 23 వరకు జరగనుంది. ఈ విషయం పక్కనబెడితే లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజు దాటడంతో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు గిరాటేశాడు. నిబంధనల ప్రకారం థర్డ్ అంపైర్ బెయిర్ స్టో ఔట్ అని ప్రకటించాడు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఆస్ట్రేలియా ప్రవర్తించిందంటూ అభిమానులు సహా ఇంగ్లీష్ మీడియా తమ కథనాల్లో హోరెత్తించింది. విమర్శల స్థాయి ఎలా ఉందంటే అది మూడో టెస్టుకు కూడా పాకింది. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అలెక్స్ కేరీ కనిపించిన ప్రతీసారి ఇంగ్లీష్ అభిమానులు అతన్ని టార్గెట్ చేశారు. ఇక బెయిర్ స్టో ఔట్ వివాదంపై రెండు దేశాల ప్రధానులు కూడా జోక్యం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమంటే.. ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ రిషి సునాక్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అయితే క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అని.. ఇక్కడితో ఈ వివాదానికి స్వస్తి పలకాలని ఇరు దేశాల ప్రధానులు అభిమానులను కోరారు. తాజాగా ఇరుదేశాల ప్రధానులు మరోసారి సమావేశమయ్యారు. అయితే ఈసారి దేశాల మధ్య అనుబంధం మరింత పెంపొందించేందుకు సమ్మిళిత అభివృద్ధి సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ చాలెంజెస్, యూకే-ఆస్ట్రేలియా మధ్య వ్యాపార రంగానికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నారు. వీటిలోనే యాషెస్ సిరీస్ ప్రస్తావన కూడా వచ్చినట్లు ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ ట్విటర్ వేదికగా తెలిపారు. ఆసీస్ ప్రధాని ఆంథోని షేర్ చేసిన వీడియోలో.. యాషెస్పై ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మొదట అల్బనీస్ యాషెస్‌లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉన్నట్లు ఒక పేపర్‌పై చూపించారు. ఆ తర్వాత రిషి సునాక్ లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన పేపర్ కట్‌ను చూపించారు. ఇక ఆసీస్ ప్రధాని ఈసారి లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో ఔటైన విధానంకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను చూపించగా.. రిషి సునాక్.. ''సారీ తాను శాండ్‌పేపర్(Sandpaper-Ball Tampering) గేట్ ఉదంతం పేపర్ క్లిప్పింగ్‌ను మరిచిపోయాను'' అంటూ పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాండ్‌పేపర్ వివాదమేంటి? రిషి సునాక్ ప్రస్తావించిన శాండ్ పేపర్ వివాదం 2018లో జరిగింది. ఐదేళ్ల క్రితం సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్ ముక్కతో బంతిని రుద్దడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇలా చేయడం వల్ల బంతి స్వింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ శాండ్‌పేపర్ ఉదంతం వెనుక అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లది కీలకపాత్ర అని తేలడంతో ఏడాది నిషేధం పడింది. బెన్‌క్రాఫ్ట్ తొమ్మిది నెలలు నిషేధానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ తన తప్పును క్షమించమంటూ కెమెరా ముందు బోరున ఏడ్వడం ఎప్పటికి మరిచిపోలేం. ఈ ఉదంతం అనంతరం స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఏడాది తర్వాత స్మిత్, వార్నర్‌లు మళ్లీ జట్టులోకి రాగా.. బెన్‌క్రాఫ్ట్ మాత్రం మళ్లీ అడుగుపెట్టలేకపోయాడు. And of course we discussed the #Ashes pic.twitter.com/FeKESkb062 — Anthony Albanese (@AlboMP) July 11, 2023 చదవండి: Asia Cup 2023: 'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే' #NovakDjokovic: 46వసారి సెమీస్‌లో.. ఫెదరర్ రికార్డు సమం -
Ashes 2023: కీలకమైన టెస్టుకు మళ్లీ అదే జట్టు! మొండిగా వ్యవహరిస్తే..
The Ashes, 2023- England vs Australia: యాషెస్ సిరీస్ నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. లీడ్స్‌లో మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌నే మాంచెస్టర్ టెస్టులోనూ కొనసాగించనుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది మేనేజ్మెంట్. కాగా గత మ్యాచ్‌లో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోకు మరో అవకాశం ఇవ్వడం విశేషం. బొక్కబోర్లా పడి ఈ నేపథ్యంలో బెన్ ఫోక్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో స్టోక్స్ బృందం ఓటమి పాలైన విషయం తెలిసిందే. బజ్‌బాల్ విధానంతో సొంతగడ్డపై బొక్కబోర్లా పడి పర్యాటక జట్టు చేతిలో ఓడి 0-2తో వెనుకబడింది. అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని మూడో టెస్టులో గెలుపొంది బోణీ కొట్టింది. గెలుపు జోష్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. హెడ్డింగ్లీ మైదానంలో హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ బౌలర్ మార్క్‌వుడ్ 8 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచి తమ జట్టుకు విజయం అందించాడు. ఇదే జోష్‌లో మాంచెస్టర్ టెస్టుకు సిద్ధమవుతోంది ఇంగ్లండ్. కాగా జూలై 19- జూలై 23 వరకు నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే ఐదో టెస్టు నిర్ణయాత్మకంగా మారుతుంది. లేదంటే ఆసీస్ ఎంచక్కా టైటిల్ ఎగరేసుకుపోతుంది. కాగా బెయిర్‌స్టోకు వరుస అవకాశాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెయిర్‌స్టోను తప్పించకుండా మొండిగా వ్యవహరించినందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జొనాథన్ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ రాబిన్సన్, జో రూట్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, మార్క్‌వుడ్. చదవండి: అమ్మ నమ్మట్లే! ఈ బుడ్డోడు టీమిండియాలో అత్యంత కీలక వ్యక్తి.. గుర్తుపట్టారా? Ind Vs WI: ఛీ.. మరీ ఘోరంగా ఉంది.. నాకైతే! -
ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌కు చేదు అనుభవం..
యాసెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. మూడోరోజు ఆటలో రెండు సెషన్లు దాదాపు వర్షంతో తుడిచిపెట్టుకుపోయినప్పటికి.. ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కేవలం ఆఖరి సెషన్లోనే మిగతా ఆరు వికెట్లు కూల్చిన ఇంగ్లండ్.. ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 251 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో ఇంగ్లండ్ గెలుస్తుందా.. లేక ఆసీస్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా అనేది చూడాలి. కాగా లార్డ్స్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు సహా సిబ్బందికి ఏదో ఒక రకంగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ అభిమానుల దృష్టిలో అలెక్స్ కేరీ విలన్‌గా మారిపోయాడు. ఇక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు కూడా లీడ్స్‌లోని హెడ్డింగ్లే స్టేడియంలో చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టు ప్రారంభానికి ముందు స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎంట్రీ పాస్ లేదని ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను స్టేడియం లోపలికి అనుమతించలేదని సమాచారం. ఇంగ్లండ్ మీడియాలో దీని గురించి కథనాలు వెలువడ్డాయి. ఆ కథనాల ప్రకారం.. సరైన ఎంట్రీ పాస్ లేకపోవడంతో మెక్‌కల్లమ్‌ను భద్రతా సిబ్బంది గేటు వద్ద ఆపేశారు. డ్యూటీలో ఉన్న సెక్యురిటీ గార్డ్ మెక్‌కల్లమ్‌ను గుర్తుపట్టలేదు. అంతేకాకుండా అతడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో సెక్యురిటీ గార్డ్ తన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెక్కల్లమ్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భద్రతా సిబ్బందిని హెచ్చరించి అక్కడి నుంచి ముందుకుసాగాడు. ఇక మెక్కల్లమ్ న్యూజిలాండ్ తరపున 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టి20 మ్యాచ్‌లు ఆడి.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 14,676 పరుగులు సాధించాడు. విధ్వంసకర బ్యాటర్‌గా పేరు పొందిన మెక్కల్లమ్ ఖాతాలో 19 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
Eng Vs Aus: మేమింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం: ఇంగ్లండ్ స్టార్
The Ashes, 2023- England vs Australia, 3rd Test- Day 2- లీడ్స్: యాషెస్ సిరీస్ మూడో టెస్టు ఆసక్తికర మలుపులతో సాగుతోంది. రెండో రోజు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పోటాపోటీగా పోరాడాయి. రెండో రోజు నాటి శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (43), డేవిడ్ వార్నర్ (1), మార్నస్ లబుషేన్ (33), స్టీవ్ స్మిత్ (2) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 142 పరుగులకు చేరింది. స్టోక్స్ దూకుడు అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 68/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (80; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటిచేత్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివర్లో మార్క్ వుడ్ (8 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు ఇంగ్లండ్ భారీ ఆధిక్యం కోల్పోకుండా కాపాడాయి. ఇక ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (6/91) రాణించాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ బీబీసీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్ మూడో టెస్టులో తామింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నామని ధీమా వ్యక్తం చేశాడు. వికెట్ బాగుందని.. తమ జట్టు కచ్చితంగా ఈ మ్యాచ్‌లో పైచేయి సాధిస్తుందని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 200 మార్కు దాటడం తమలో సానుకూల దృక్పథం నింపిందన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండు వికెట్లు పడగొట్టి ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే తాను దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నానన్న అలీ.. రెండు వికెట్లు తీయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజు ఆటలో మొయిన్ అలీ లబుషేన్, స్మిత్ వికెట్లు పడగొట్టగా.. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజాను క్రిస్ వోక్స్, డేవిడ్ వార్నర్‌ను స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్‌కు పంపారు. ఇదిలా ఉంటే.. యాషెస్ తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఆసీస్ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాతో సిరీస్‌కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి -
బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టు రసవత్తరంగా మారుతుంది. రెండో రోజు రెండో సెషన్లోనే ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో ఆసీస్‌కు 26 పరుగులు స్వల్ప ఆధిక్యం లభించినట్లయింది. అయితే తాను మొదటినుంచి చెప్పుకుంటున్న బజ్‌బాల్ ఆటను మరోసారి ఆస్ట్రేలియాకు రుచి చూపించాడు. ఫలితం సంగతి ఎలా ఉన్నా స్టోక్స్ మాత్రం తాను ఉన్నంతసేపు దాటిగా ఆడాడు. మొదట క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న స్టోక్స్ ఆ తర్వాత ఫాస్ట్‌గా ఆడాడు. అయితే ఏ జట్టైనా వికెట్లు కోల్పోతుంటే బ్యాటర్ కూడా స్లో ఆడడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్టోక్స్ మాత్రం ఎదురుదాడి చేశాడు.ఇంగ్లండ్ 168 పరుగుల వద్ద మార్క్‌వుడ్(24 పరుగులు) ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరగ్గానే స్టోక్స్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 95 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కుదురుకున్న స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన స్టోక్స్ ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా 106 బంతుల్లో 80 పరుగులు చేసిన స్టోక్స్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే స్టోక్స్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో ఆరువేల పరుగులు, వంద వికెట్లు సాధించిన మూడో ఆల్‌రౌండర్‌గా స్టోక్స్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు స్టోక్స్ 94 టెస్టుల్లో 6008 పరుగులు చేయడంతో పాటు 197 వికెట్లు పడగొట్టాడు. ఇక తొలి స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్(13289 పరుగులు, 292 వికెట్లు), రెండో స్థానంలో విండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్(8032 పరుగులు, 235 వికెట్లు) ఉన్నాడు. చదవండి: #TamimIqbal: దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్ #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
ఆరు వికెట్లతో చెలరేగిన కమిన్స్.. ఇంగ్లండ్ 237 ఆలౌట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసకందాయంలో పడింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్ (108 బంతుల్లో 80 పరుగులు) ఒంటరిపోరాటం చేశాడు. పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ భరతం పట్టాడు. ఇక ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించినట్లయింది. మూడు వికెట్ల నష్టానికి 68 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ కాసేపటికే రూట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు పడ్డప్పటికి ఒక ఎండ్‌లో స్టోక్స్ మాత్రం కుదురుగా ఆడాడు. 168 పరుగుల వద్ద మార్క్‌వుడ్(24 పరుగులు) ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరగ్గానే స్టోక్స్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 95 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కుదురుకున్న స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన స్టోక్స్ ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లతో చెలరేగాడు. తన దూకుడైన ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం దక్కేలా చేశాడు. స్టోక్స్ మినహా మిగతా బ్యాటర్లలో మొయిన్ అలీ 21, మార్క్ వుడ్ 24, జాక్ క్రాలీ 33 పరుగులు చేశారు. కమిన్స్ ఆరు వికెట్లు తీయగా.. స్టార్క్ రెండు, టాడ్ మర్ఫీ, మిచెల్ మార్ష్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ సెంచరీతో రాణించాడు. చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం #Ashes2023: నిప్పులు చెరుగుతున్న కమిన్స్.. కష్టాల్లో ఇంగ్లండ్ -
నిప్పులు చెరుగుతున్న కమిన్స్.. కష్టాల్లో ఇంగ్లండ్
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ 67 బంతుల్లో 27 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. కమిన్స్‌కు తోడుగా స్టార్క్ రెండు, మిచెల్ మార్ష్ ఒక వికెట్ తీశారు. కమిన్స్ దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి సతమతమయ్యారు. 68 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు కాసేపటికే రూట్ రూపంలో షాక్ తగిలింది. 19 పరుగులు చేసిన రూట్ కమిన్స్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇంకా ప్రస్తుతం 121 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: బర్త్‌డేకు ఒక్కరోజు ముందు.. ఓపెనర్‌గా డబుల్ సెంచరీ -
నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన మార్ష్ కేవలం 102 బంతుల్లోనే శతకం సాధించడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన ఆసీస్.. మార్ష్ ఇన్నింగ్స్‌తో కోలుకున్నట్లగా కనిపిస్తోంది. మార్ష్‌కు.. ట్రెవిస్ హెడ్ (39 బ్యాటింగ్) అండగా నిలబడ్డాడు. చివరికి 118 బంతుల్లో 118 పరుగులు చేసిన మార్ష్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఇక మిచెల్ మార్ష్ నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. 2019 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో ఆఖరిసారిగా ఆడాడు. మళ్లీ తాజాగా యాషెస్తోనే ఎంట్రీ ఇచ్చిన మార్ష్ పునరగమనాన్ని ఘనంగా చాటాడు. కామెరున్ గ్రీన్ గాయపడడంతో మూడో టెస్టుకు జట్టులోకి వచ్చిన మార్ష్ ఏకంగా సెంచరీతో మెరిశాడు. మార్ష్ కెరీర్లో ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం విశేషం. Mitchell Marsh playing brutally against England 100 completed #Ashes#MitchellMarsh#Ashes2023 pic.twitter.com/UDAE7xadUY — Ansh Gaba (@cricketansh12) July 6, 2023 #MitchellMarsh #Bisonball🦬 pic.twitter.com/xNKEXpHqJa — Mr.Mirja (@Mr_Mirja01) July 6, 2023 What an outstanding 100, great counter -attack from Mitchell Marsh. #Ashes pic.twitter.com/8gcITRxdxV — Virender Sehwag (@virendersehwag) July 6, 2023 Sensational, Mitchell Marsh ✨#ENGvAUS | #Ashes pic.twitter.com/F4ATR2Gknr — ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023 చదవండి: #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ #SteveSmith: వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు -
యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్
ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ దెబ్బకు ఉస్మాన్ ఖవాజా మైండ్ బ్లాక్ అయింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు మూడో టెస్టు ఆడుతున్నాయి. తొలిరోజు ఆటలో భాగంగా టాస్ గెలిచిన స్టోక్స్ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. స్టోక్స్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లు తొలి సెషన్లోనే చెలరేగిపోయారు. లంచ్ విరామ సమయానికి నాలుగు వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బతీశారు. స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీసినప్పటికి.. హైలెట్ అయింది మాత్రం మార్క్ వుడ్ అని చెప్పొచ్చు. యాషెస్ సిరీస్‌లో మార్క్ వుడ్‌కు ఇదే తొలి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు విసురుతూ ఆసీస్‌కు చాలెంజ్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖవాజాను ఔట్ చేసిన 13వ ఓవర్లో మార్క్‌వుడ్ ప్రతీ బంతిని గంటకు 90 మైళ్ల వేగంతో విసరడం విశేషం. గుడ్‌లైన్ అండ్ లెంగ్త్‌తో సంధించిన మార్క్‌వుడ్ ఆఖరి బంతిని ఇన్‌స్వింగర్ వేశాడు. బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని ఖవాజా కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. 96.5 మైళ్ల వేగం(గంటకు 152 కిమీ)తో వచ్చిన బంతి దెబ్బకు స్టంప్ ఎగిరి కింద పడింది. ఇక యాషెస్ చరిత్రలో మార్క్ వుడ్ వేసిన బంతి రెండో ఫాస్టెస్ట్ డెలివరీగా నిలిచింది. ఇంతకముందు ఆసీస్ స్టార్ మిచెల్ జాన్సన్ 2013 యాషెస్ సిరీస్‌లో గంటకు 97 మైళ్ల వేగం(గంటకు 156.7 కిమీ)తో బంతిని విసిరాడు. ఇప్పటికి ఈ రికార్డు యాషెస్ చరిత్రలో పదిలంగా ఉంది. అంతకముందు స్టువర్ట్ బ్రాడ్.. వార్నర్‌ను(4 పరుగులు), వందో టెస్టు ఆడుతున్న స్మిత్(22 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక మార్నస్ లబుషేన్‌ను(21 పరుగుల) క్రిస్ వోక్స్ పెవిలియన్ చేర్చాడు. లంచ్ అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ప్రస్తుతం 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసిది. మిచెల్ మార్ష్ 30, ట్రెవిస్ హెడ్ 17 పరుగులతో ఆడుతున్నారు. It's full and straight and far too quick for Usman Khawaja 🌪️ Australia are 2 down and Mark Wood is on fire! 🔥 #EnglandCricket | #Ashes pic.twitter.com/y5MAB1rWxd — England Cricket (@englandcricket) July 6, 2023 చదవండి: #SteveSmith: వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు #GlennMcGrath: ఇంగ్లండ్‌కు ఆసీస్ దిగ్గజం చురకలు.. 'బజ్‌బాల్ కాదది కజ్బాల్' -
వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కష్టాల్లో పడినట్లుగా అనిపిస్తుంది. లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 5, ట్రెవిస్ హెడ్ 10 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆసీస్ బ్యాటింగ్‌లో మార్నస్ లబుషేన్ 21, స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ చెరొక వికెట్ తీశారు. ఇక ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీతో మెరిశాడు. అయితే మూడో టెస్టులో 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో స్మిత్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. లీడ్స్ టెస్టులో 22 పరుగులు చేసిన స్మిత్ ఇప్పటివరకు 3226 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్(3222 పరుగులు)ను దాటిన స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. స్మిత్ కంటే ముందు జాక్ హాబ్స్(3636 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో ఆస్ట్రేలియన్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్(5028 పరుగులు) ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక స్మిత్‌కు ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఆసీస్ తరఫున ఈ మైలురాయిని గతంలో 14 మంది చేరుకోగా.. స్మిత్ 15వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చిరకాలం గుర్తుండిపోయే తన 100వ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి, మరింత స్పెషల్‌గా మార్చుకోవాలని స్మిత్ భావిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే, సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంటుంది. స్మిత్ జట్టులోకి వచ్చాక ఆసీస్.. ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ గెలిచింది లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి చిరస్మరణీయంగా మార్చుకోవాలని స్మిత్ అనుకుంటున్నాడు.కెరీర్లో ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన స్మిత్.. 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 59.56 సగటున 9113 పరుగులు చేశాడు. 100 seconds of Steve Smith gold, ahead of his 100th Test for Australia tonight! #Ashes pic.twitter.com/y1JbDt3k8t — cricket.com.au (@cricketcomau) July 6, 2023 చదవండి: భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?.. కోహ్లి, సచిన్, ధోనిలు కాదు! -
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బజ్‌బాల్‌ను పక్కనబెడుతుందా?
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైంది. లీడ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులు ఓడి 0-2తో వెనుకబడిన ఇంగ్లండ్ మూడో టెస్టులో గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం మూడో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను గెలవాలని చూస్తోంది. యాషెస్ సిరీస్‌కు ముందు బజ్‌బాల్ ఆటతో ఆసీస్‌కు కళ్లెం వేస్తామని పేర్కొన్న స్టోక్స్ సేన ఆటకు వచ్చేసరికి పూర్తిగా చతికిలపడింది. బజ్‌బాల్ దూకుడు కొనసాగించాలన్న తపనతో చేతులు కాల్చుకున్న ఇంగ్లండ్ కనీసం మూడో టెస్టులోనైనా దానిని పక్కనబెడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు జరగ్గా.. ఇంగ్లండ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. కామెరాన్ గ్రీన్ స్థానంలో మిచెల్ మార్ష్ తుదిజట్టులోకి రాగా.. గాయపడ్డ నాథన్ లియోన్ స్థానంలో టాడ్ మర్ఫీ వచ్చాడు. ఇక ఇంగ్లండ్ జట్టులో అండర్సన్ స్థానంలో మార్క్ వుడ్‌ను తీసుకోగా.. గాయపడ్డ ఓలీపోప్ స్థానంలో మోయిన్ అలీ.. జోష్ టంగ్ స్థానంలో క్రిస్ వోక్స్ తుదిజట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్ ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్ BREAKING: England choose to bowl after winning the toss ✅ pic.twitter.com/BbHIFZFM2S — Sky Sports Cricket (@SkyCricket) July 6, 2023 చదవండి: #ManchesterUnited: ఇంగ్లండ్ స్టార్‌కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా! IND vs WI: అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్‌రాజ్ -
Ashes 2023: అండర్సన్‌పై వేటు.. బ్రూక్‌కు ప్రమోషన్
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్ కాస్త డీలా పడినట్లు కనిపిస్తోంది. ఎలాగైనా మూడో టెస్టులో గెలవాలన్న పట్టుదలతో ఉంది. లీడ్స్ వేదికగా మూడో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బుధవారం తుది జట్టును ప్రకటించింది. అంతా ఊహించినట్లుగానే తొలి రెండు టెస్టుల్లో వికెట్లు తీయడంలో విఫలమైన సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌పై వేటు పడింది. 41 ఏళ్ల అండర్సన్ టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 179 టెస్టుల్లో 688 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌తో మూడో టెస్టుకు అతన్ని పక్కనబెట్టారు. అండర్సన్‌తో పాటు రెండో టెస్టులో ఐదు వికెట్లతో రాణించిన జోష్ టంగ్‌ను కూడా పక్కనబెట్టడం ఆశ్చర్యం కలిగించింది. వీరిద్దరి స్థానాల్లో ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌తో పాటు మార్క్ వుడ్లు తుది జట్టులోకి వచ్చారు. ఇక భుజం గాయంతో సిరీస్‌కు దూరమైన బ్యాటర్ ఓలీ పోప్ స్థానంలో ఆల్‌రౌండర్ మొయిన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక హ్యారీ బ్రూక్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ వచ్చింది. లార్డ్స్ టెస్టులో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హ్యారీ బ్రూక్.. మూడో టెస్టులో మాత్రం ఓలీ పోప్ స్థానమయిన నెంబర్-3లో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఈ మ్యాచ్‌లో గనుక ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మాత్రం ఇంగ్లండ్ గడ్డపై 22 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్‌ను గెలిచిన కెప్టెన్‌గా పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించనున్నాడు. మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్ చదవండి: దిగ్గజంతో చేతులు కలిపిన రోహిత్, విరాట్.. #Neymar: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా -
Ashes: ‘బజ్‌బాల్’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్‌కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి..
Ashes Series 2023: ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో రెండు మ్యాచ్‌లలో స్టోక్స్ బృందం చిత్తైన విషయం తెలిసిందే. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుబడింది. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శించి స్వదేశంలో తొలి రెండు మ్యాచ్‌లలో బోల్తా పడిన ఇంగ్లండ్‌కు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఆ జట్టు కీలక ఆటగాడు గాయపడ్డాడు. ఓలీ పోప్ దీంతో మిగిలిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడు మరెవరో కాదు.. ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్. కుడి భుజం నొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఆసీస్‌తో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ అతడు మిగిలిన మ్యాచ్‌లలో అందుబాటులో ఉండడని పేర్కొంది. ఈ మేరకు.. ‘‘లండన్‌లో స్కానింగ్ చేయించగా.. అతడి గాయం మరింత తీవ్రతరమైందని తేలింది. సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కాబట్టి మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు’’ అని ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది. తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఓలీ పోప్ చికిత్స పొందుతాడని వెల్లడించింది. కాగా ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో ఓలీ పోప్.. ఓ మోస్తరుగా రాణించాడు. మొదటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 31, 14 పరుగులు చేసిన వన్‌డౌన్ బ్యాటర్.. రెండో టెస్టులో 42, 3 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల ప్రధానులు సైతం పరస్పర విమర్శలతో తమ జట్లకు అండగా నిలవడం విశేషం. చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' -
'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి'
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔటైన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆసీస్ జట్టు వ్యవహరించిన తీరుపై పలువురు మాజీలు సహా చాలా మంది విమర్శలు గుప్పించారు. ''ఆస్ట్రేలియా జట్టుది కపట బుద్ది అని.. గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తారంటూ'' ఇంగ్లండ్ అభిమానులు ట్విటర్లో పేర్కొన్నారు. దీనిపై 'ద వెస్ట్ ఆస్ట్రేలియన్' అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆసీస్‌పై మండిపడుతున్నారు. కానీ ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్ కపటత్వం అంటే ఏంటో చూపించిందని కొంతమంది ఆసీస్ అభిమానులు పాత వీడియోలను షేర్ చేశారు. 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ చూపిన కపట బుద్ధిని బయటపెట్టింది. క్రీడాస్పూర్తికి ఉప్పుపాతరేశారు. ఒక అభిమాని షేర్ చేసిన వీడియోలో అప్పటి ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతిని హెన్రీ నికోల్స్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అయితే దురదృష్టవశాత్తూ బంతి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్‌ను తాకి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. చేసేదేం లేక హెన్రీ నికోల్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఇక్కడ ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నప్పటికి వాళ్లు గెలవడానికే మొగ్గు చూపారు. అభిమాని షేర్ చేసిన వీడియోపై ఆకాశ్ చోప్రా స్పందించాడు. ''క్రీడాస్పూర్తి అనే పదాన్ని భుజాలపై ఎత్తుకొని వాదిస్తున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ వీడియోపై స్పందించండి. ఇప్పుడు ఆసీస్ చీటింగ్ చేసిందని అంటున్నారు.. న్యాయంగా మీరు ఆరోజు చేసింది కూడా చీటింగ్ కిందే వస్తుంది. మీ కపటత్వాన్ని చాటిచెప్పే పలు వీడియోలు ఇక్కడ ఉన్నాయి.అందులో ప్రస్తుత ఆటగాళ్లలో కొందరు భాగస్వాములుగా ఉన్నారు. ఇంగ్లీష్ క్రికెట్ కపటత్వం, అర్హత యొక్క భావం నా దృష్టిలో వేరే విషయం.'' అని చెప్పుకొచ్చాడు. Ouch. You can even see the torchbearer of ‘The Spirit of the Game’ shrugging his shoulders instead of initiating the process to withdraw the appeal. After all, you wouldn’t want to be remembered for things like these 🤣🫣🤪 Also, there are multiple videos circulating calling out… https://t.co/yR8Nq2UeVd — Aakash Chopra (@cricketaakash) July 4, 2023 చదవండి: #Chahal: 'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే! ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు -
Ashes 2023: రిషి సునాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్! మాములుగా లేదు..
Bairstow Controversial Dismissal: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లిష్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన తీరుపై వివాదం కొనసాగుతూనే ఉంది. బంతి వికెట్‌కీపర్ చేతిలో ఉండగానే.. బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సమయస్ఫూర్తితో బెయిర్‌స్టోను స్టంపౌట్ చేసిన ఆసీస్ వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ సహా ఇతర ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియా తీరుపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిన నేపథ్యంలో.. తామైతే ఇలా ఆసీస్ తరహాలో గెలుపొందాలని కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం స్టోక్స్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రిషి సునాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇందుకు ప్రతిస్పందనగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ సైతం రంగంలోకి దిగారు. తమ జట్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళా, పురుష క్రికెట్ జట్లను చూసి తాను గర్వపడుతున్నానన్నారు. ‘‘అదే ఆసీస్.. పూర్వవైభవాన్ని గుర్తు చేస్తూ.. ఎల్లప్పుడూ విజయాలు సాధిస్తూనే ఉంటుంది. వాళ్లు విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా.. విజేతలైన మా ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని ఆంథనీ అల్బనీస్ పేర్కొన్నారు. పరస్పరం విమర్శలు కాగా యాషెస్ సిరీస్ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట సందర్భంగా.. ఓవర్ పూర్తైందని భావించిన బెయిర్‌స్టో క్రీజు దాటి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని వికెట్లకు గిరాటేసి.. రనౌట్‌కు అప్పీలు చేశాడు. అయితే, బెయిర్‌స్టో కీపర్ లేదంటే అంపైర్‌కి సిగ్నల్ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్ అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ ఇంగ్లండ్ అభిమానులు, మీడియా ప్రత్యర్థి జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆసీస్ మీడియా కూడా తగ్గేదేలే అన్నట్లు స్టోక్స్ ఫొటోలతో ఇంగ్లండ్ విమర్శలను తిప్పి కొట్టింది. తాజాగా ఇరు దేశాల ప్రధానులు సైతం తమ తమ ఆటగాళ్లకు అండగా నిలుస్తూ కౌంటర్ అటాక్ చేసుకోవడం విశేషం. చదవండి: BCCI: అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్.. నెదర్లాండ్స్ ఆశలు సజీవం BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 -
స్టోక్స్‌ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా పత్రిక.. ఫోటో వైరల్
లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో రనౌటైన విధానం తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ఆస్ట్రేలియన్లు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని, గెలుపు కోసం ఏదైనా చేస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టుపై ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లతో పాటు భారత లెజండరీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ సైతం మండిపడ్డారు. అదే విధంగా ఇంగ్లండ్ మీడియా కూడా ఆస్ట్రేలియా జట్టుపై ఛీటర్స్ అంటూ వరుస కథనాలు ప్రచురించింది. అయితే ఈసారి ఆస్ట్రేలియా మీడియా వంతు వచ్చింది. ఆస్ట్రేలియా మీడియా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను దారుణంగా అవమానపరిచింది. ‘ద వెస్ట్ ఆస్ట్రేలియన్’ అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. ఓ పసిబాలుడు నోటిలో పాలపీకాను పట్టుకుని.. ఓ వైపు యాషెస్ ట్రోఫిని, బంతిని పడేసినట్లు ఉన్న ఫోటోను ప్రచురించింది. ఆ పసిబాలుడు ముఖాన్ని స్టోక్స్‌గా మార్ఫింగ్ చేసింది. ఇక ఇందుకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. "కచ్చితంగా అది నేను కాదు.. నేనెప్పుడు కొత్త బాల్ తో బౌలింగ్ చేశాను’ అంటూ స్టోక్స్ కౌంటరిచ్చాడు. కాగా రెండో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికీ స్టోక్స్ మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. జట్టును గెలిపించేందుకు ప్రయత్నించిన స్టోక్స్.. చివరిలో ఔట్ కావడంతో ఓటమిని చవి చూసింది. ఓవరాల్‌గా 214 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ 155 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య యాషెస్ మూడో టెస్టు జూలై 6 నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది. సిరీస్ రేసులో నిలవాలంటే మూడో టెస్టులో ఇంగ్లండ్ కచ్చితంగా విజయం సాధించాలి. చదవండి: IND Vs WI 2023: టీమిండియాతో వరుస సిరీస్‌లు.. వెస్టిండీస్ క్రికెట్ కీలక నిర్ణయం! That’s definitely not me, since when did I bowl with the new ball https://t.co/24wI5GzohD — Ben Stokes (@benstokes38) July 3, 2023 -
ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ వివాదంతో 'క్రీడాస్పూర్తి' అనే పదం మరోసారి తెరపైకి వచ్చింది. క్రీడాస్పూర్తి ప్రకారం చూస్తే అలెక్స్ క్యారీ చేసింది తప్పని చెప్పొచ్చు.. కానీ న్యాయంగా చూస్తే బెయిర్ స్టో అవుట్ కిందే లెక్క. బంతి ఇంకా డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజు దాటడం తప్పు. ఇదే అదనుగా భావించిన అలెక్స్ క్యారీ అతన్ని రనౌట్ చేశాడు. రూల్స్ ప్రకారం ఒక బంతి డెడ్ కావడానికి ముందే బ్యాటర్ క్రీజు దాటిన సమయంలో కీపర్ వికెట్లను గిరాటేస్తే అది ఔట్ కిందే లెక్కిస్తారు. అయితే అప్పీల్‌ను వెనక్కి తీసుకునే అవకాశం కెప్టెన్‌కు ఉంటుంది. కానీ పాట్ కమిన్స్ అందుకు సిద్ధపడలేదు. జట్టు గెలుపు దిశలో ఉన్నప్పుడు క్రీడాస్పూర్తి ప్రదర్శించడానికి కమిన్స్ వెనకాడాడు. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం క్రీడాస్పూర్తికి విలువనిచ్చాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఔటైన ఇయాన్ బెల్‌ను మళ్లీ వెనక్కి పిలిచి ధోని క్రీడాస్పూర్తి చాటుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 319 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఓడినా ధోని మాత్రం తన చర్యతో ఇంగ్లండ్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. క్రీడాస్పూర్తి అనే అంశం మరోసారి తెరమీదకు రావడంతో ధోని ప్రదర్శించిన క్రీడాస్పూర్తిని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. 2011లో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించింది. నాటింగ్హమ్ వేదికగా ఇరుజట్లు టెస్టు మ్యాచ్ ఆడాయి. టీ విరామానికి ముందు ఇషాంత్ శర్మ ఆఖరి ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో ఇషాంత్ వేసిన ఒక బంతిని ఇయాన్ మోర్గాన్ లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. నేరుగా బౌండరీ లైన్ వద్ద ఉన్న ప్రవీణ్ కుమార్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్ అయి బౌండరీ పక్కన పడింది. అయితే అది బౌండరీనా కాదా అని సందేహం ఉన్న సమయంలోనే ప్రవీణ్‌కుమార్ బంతిని తీసుకొని ధోనికి అందించాడు. ధోని కూడా కామన్‌గా బంతి అందుకొని బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. కానీ ఇయాన్ బెల్ అప్పటికే క్రీజు బయట ఉన్నాడు. ఇది గమనించిన అంపైర్ బంతి ఇంకా డెడ్ కాలేదని.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి ఇంకా డెడ్ కాకముందే ఇయాన్ బెల్ క్రీజు బయటకు వెళ్లడంతో రనౌట్ అని బిగ్స్క్రీన్పై వచ్చింది. అప్పటికే పెవిలియన్ దగ్గర వేచి ఉన్న ఇయాన్ మోర్గాన్, ఇయాన్ బెల్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా బాల్కనీ నుంచి అసలేం ఏం జరుగుతుందో అర్థంకాక నిలబడిపోయారు. అంతలో టీ విరామం రావడంతో మైదానంలోని ప్రేక్షకులు ధోని చేసిన పనికి చివాట్లు, శాపనార్థాలు పెట్టారు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని.. ధోని లాంటి కెప్టెన్ ఇలా చేస్తాడా అంటూ సూటిపోటి మాటలు అన్నారు. కానీ టీ విరామం అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి ఇయాన్ మోర్గాన్‌తో పాటు ఇయాన్ బెల్ కూడా వచ్చాడు. దీంతో షాక్ తిన్న అభిమానులు ఒక్కసారిగా మాట మార్చారు. ధోని నిర్ణయాన్ని స్వాగతిస్తూ టీమిండియాను చప్పట్లతో అభినందించారు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తో ధోని సంప్రదింపులు జరిపి అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్‌కు చెప్పగానే అతను కృతజ్ఞతగా ధోనిని హగ్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది. అనంతరం మైదానంలో కూల్‌గా కనిపించిన ధోనిని చూస్తూ అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఈ వీడియోనూ ఇంగ్లండ్ అభిమానులు రీట్వీట్ చేస్తూ ''కమిన్స్.. క్రీడాస్పూర్తి అంటే ఏంటో తెలియకపోతే ధోనిని చూసి నేర్చుకో.. ఇలా చీటింగ్ చేసి గెలవడం కరెక్ట్ కాదు'' అంటూ హితబోద చేశారు. Jonny Bairstow Runout reminds me of "When MS Dhoni called back Ian Bell after Run out even though he was out" (Full Story in Thread) pic.twitter.com/TQuHne7HD4 — 🏆×3 (@thegoat_msd_) July 2, 2023 BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 చదవండి: బెయిర్ స్టో ఔట్ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా! Ashes Series 2023: గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్.. ఇకపై కష్టమే..! -
బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం.. ప్రత్యర్ధి సైతం దాసోహం..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం చేశాడు. భారీ శతకంతో చెలరేగాడు. పట్టుసడలని పోరాటంతో ప్రత్యర్ధిని గడగడలాడించాడు. అదే ప్రత్యర్ధి చేతనే శభాష్ అనిపించుకున్నాడు. 2019లో హెడింగ్లీ మైదానంలో జరిగిన మ్యాచ్ తరహాలో ఒంటి చేత్తో జట్టును గెలిపించేలా కనిపించాడు. అయితే గెలుపుకు మరో 70 పరుగులు చేయాల్సిన తరుణంలో హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటై, నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఆతర్వాత ఇంగ్లండ్ 26 పరుగుల వ్యవధిలో మిగిలిన 3 వికెట్లు కోల్పోవడంతో ఓటమిపాలైంది. స్టోక్స్ వీరోచిత పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఏ స్థితిలోనైనా ‘బజ్‌బాల్’ను కొనసాగిస్తానంటూ పట్టుదలగా నిలిచి సిక్సర్లతో చెలరేగిన స్టోక్స్, చివరకు జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫలితంగా ఆసీస్ లార్డ్స్‌లో గెలుపు జెండా ఎగరేసి 5 టెస్ట్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లండన్: ఆ్రస్టేలియా జట్టు యాషెస్ సిరీస్‌పై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. లార్డ్స్ మైదానంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 43 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 371 పరుగులను ఛేదించే ప్రయత్నంలో ఓవర్‌నైట్ స్కోరు 114/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) చెలరేగగా... బెన్ డకెట్ (112 బంతుల్లో 83; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. గాయంతో ఉన్న స్పిన్నర్ లయన్ బౌలింగ్ చేయకుండానే ఆసీస్ ఈ విజయాన్ని అందుకోగలిగింది. స్టీవ్ స్మిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, మూడో టెస్టు గురువారంనుంచి లీడ్స్‌లో జరుగుతుంది. విజయం కోసం చివరి రోజు చేతిలో 6 వికెట్లతో 257 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. డకెట్, స్టోక్స్ భారీ భాగస్వామ్యంతో జట్టును ముందుకు నడిపించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. డకెట్‌తో పాటు బెయిర్‌స్టో (10) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. విజయం కోసం మరో 178 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో స్టోక్స్ బాధ్యత తీసుకొని భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. గ్రీన్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతను...గ్రీన్ తర్వాతి ఓవర్లో ఒక ఫోర్ కొట్టి 82 పరుగులకు చేరుకున్నాడు. అదే ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 6 బాది అతను సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. హాజల్‌వుడ్ ఓవర్లోనూ మరో 2 సిక్సర్లు బాదిన స్టోక్స్... స్టార్క్ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి 150కు చేరుకున్నాడు. ఏడో వికెట్‌కు బ్రాడ్ (11)తో కలిసి స్టోక్స్ 20.2 ఓవర్లలోనే 108 పరుగులు జోడించాడు. ఆసీస్ మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా స్టోక్స్‌కు కలిసొచ్చింది. ఇంగ్లండ్ గెలుపు దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయితే హాజల్‌వుడ్ బౌలింగ్‌లో స్టోక్స్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అంచనా తప్పడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా బ్యాక్వర్డ్ పాయింట్ వరకు పరుగెత్తుతూ వెళ్లి కీపర్ క్యారీ అందుకోవడంతో అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఆసీస్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. -
Ashes Series 2nd Test: టాప్-5లోకి చేరిన మిచెల్ స్టార్క్
స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా టాప్-5 బౌలర్ల జాబితాలో చేరాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్‌ల్లో ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానానికి (79 టెస్ట్‌ల్లో 315 వికెట్లు) ఎగబాకాడు. ఈ క్రమంలో మాజీ స్పీడ్‌స్టర్ మిచెల్ జాన్సన్‌ను (73 టెస్ట్‌ల్లో 313 వికెట్లు) అధిగమించాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తొలి స్థానంలో (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు) ఉండగా.. గ్లెన్ మెక్‌గ్రాత్ (124 టెస్ట్‌ల్లో 563 వికెట్లు), నాథన్ లయోన్ (122 టెస్ట్‌ల్లో 496 వికెట్లు), డెన్నిస్ లిల్లీ (70 టెస్ట్‌ల్లో 355 వికెట్లు) వరుసగా 2,3,4 స్థానాల్లో నిలిచారు. ఇదిలా ఉంటే, ఆసీస్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. బెన్ డకెట్ (50), బెన్ స్టోక్స్ (29) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే ఆఖరి రోజు 257 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ గెలుపుకు 6 వికెట్లు అవసరమున్నాయి. స్కోర్ వివరాలు.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (స్టీవ్ స్మిత్ 110, ట్రవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66; రాబిన్సన్ 3/100, టంగ్ 3/98) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్ (డకెట్ 98, బ్రూక్ 50; స్టార్క్ 3/88, హెడ్ 2/17) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 279 ఆలౌట్ (ఖ్వాజా 77; బ్రాడ్ 4/65) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 114/4 (డకెట్ 50 నాటౌట్; కమిన్స్ 2/20) (నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి) -
స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్.. థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు!
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 325 పరుగులకే పరిమితం చేసిన ఆసీస్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ప్రస్తుతం 149 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్ పట్టు బిగించేలా కనిపిస్తోంది. ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీసుకుంటున్న పలు క్యాచ్‌లు వివాదాస్పదంగా మారుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో గిల్ క్యాచ్‌ను గ్రీన్ అందుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం యాషెస్ సిరీస్‌లోనూ బర్మింగ్హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ మళ్లీ గ్రీన్ మరో వివాదాస్పద క్యాచ్‌తో వార్తల్లో నిలిచాడు. బెన్ డక్కెట్ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లో ఉన్న గ్రీన్ అందుకున్నాడు. అయితే బంతి నేలను తాకినట్లు క్లియర్‌గా ఉన్నా థర్డ్ అంపైర్ మరోసారి గ్రీన్‌కే ఓటు వేశాడు. ఈ రెండు సందర్భాల్లో గ్రీన్ విలన్‌గా మారితే.. తాజాగా స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్‌ల జాబితాలో చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభం లభించింది. అయితే రూట్ (10 పరుగులు) ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్టార్క్ వేసిన బంతిని(46.3వ ఓవర్లో) రూట్ ఎదుర్కొనే క్రమంలో బ్యాక్వర్డ్ స్క్వేర్ వద్ద స్మిత్ చేతికి చిక్కాడు. అయితే క్యాచ్ అందుకున్న విధానంపై అనుమానంతో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. రిప్లేలో బంతి నేలను తాకుతుందని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి.. ఔట్ ఇవ్వడం ఏంటని ఇంగ్లండ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Nine wickets ☝ Three hundred and thirty-five runs 🏏 Another day of Test match cricket to savour 👇 pic.twitter.com/48K4lXmk2J — England Cricket (@englandcricket) June 30, 2023 -
ట్రెవిస్ హెడ్‌కు స్పిన్ బాధ్యతలు.. ఇంగ్లండ్ 325 ఆలౌట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. 278/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 47 పరుగులు మాత్రమే జత చేసి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆసీస్‌కు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బెన్ డకెట్ 98 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. హ్యారీ బ్రూక్ 50, జాక్ క్రాలీ 48, ఓలీ పోప్ 42 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ట్రెవిస్ హెడ్, హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, నాథన్ లియోన్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా లంచ్ విరామ సమయానికి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్ సేవలను కోల్పోయినప్పటికి ట్రెవిస్ హెడ్ సహా పేస్ బౌలర్లు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. చదవండి: Dhananjaya-De-Silva: దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం -
'ఇదేం పాడు పని'.. వైరలవుతున్న లబుషేన్ చర్య
ఇటీవలే టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన లబుషేన్ ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడే పనిలో ఉన్నాడు. అయితే లబుషేన్‌కు ఒక అలవాటు ఉంది. ఏ మ్యాచ్ అయినా సరే అతను చూయింగ్ గమ్ లేకుండా గ్రౌండ్లో అడుగుపెట్టడు. ఆరోజు మ్యాచ్ ముగిసేవరకు నోటిలో చూయింగ్ గమ్‌ను నములుతూనే కనిపిస్తుంటాడు. తాజాగా మార్నస్ లబుషేన్ చేసిన ఒక పని ఆలస్యంగా వెలుగు చూసింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో ఆట తొలిరోజు లబుషేన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎప్పటిలానే నోట్లో చూయింగ్ గమ్ వేసుకొని వచ్చాడు. బ్రేక్ సమయంలో బ్యాటింగ్ సిద్ధమవుతున్న తరుణంలో నోటి నుంచి చూయింగ్ గమ్ కిందపడింది. మట్టిలో పడినప్పటికి దానిని తీసి మళ్లీ నోట్లోనే పెట్టుకున్నాడు. అంపైర్ అనుమతి తీసుకొని మట్టిపాలైన చూయింగ్ గమ్‌ను కింద పడేయకుండా నోటిలో పెట్టుకోవడం ఏంటో అర్థం కాలేదు. అయితే లబుషేన్ మాత్రం చూయింగ్ గమ్‌కు మట్టి అంటినా కూడా పట్టించుకోకుండా తన స్టైల్లో నమలడం ఆరంభించాడు. ఇది కాస్త ఆలస్యంగా వెలుగుచూసినప్పటికి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ 47 పరుగులు చేశాడు. Marnus dropping his gum on the pitch and then putting it back in his mouth????pic.twitter.com/tGdYqM3w72 — 🌈Stu 🇦🇺 (@stuwhy) June 29, 2023 ఇక మ్యాచ్ విషయానికి వస్తే స్టీవ్ స్మిత్ సెంచరీ బాదడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులతో పటిష్టంగా నిలిచింది. ఇక నాథన్ లియోన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడడం ఆసీస్‌కు ఇబ్బంది కలిగించే అంశం. తీవ్ర గాయం కావడం.. స్రెచర్ సాయంతో నడుస్తున దృశ్యాలు బయటికి రావడంతో లియోన్ మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది. దీంతో ఆసీస్ నలుగురు బౌలర్లతోనే ఆడాల్సి వస్తుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 138 పరుగులు వెనుకబడి ఉంది. Marnus Labuschagne was sleeping and then suddenly realised his turn had arrived. pic.twitter.com/pw1xOk9IeI — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: Ashes 2023: నాథన్ లియోన్‌కు గాయం.. ఆసీస్‌కు ఊహించని షాక్! -
Ashes 2023: నాథన్ లియోన్‌కు గాయం.. ఆసీస్‌కు ఊహించని షాక్!
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ తీవ్రంగా గాయపడ్డాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటలో లియోన్ ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ లైన్ వద్ద గాయపడ్డాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఇది జరిగింది. ఈ క్రమంలో నొప్పి తీవ్రంగా ఉండడంతో వెంటనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాతి సెషన్‌కు లియోన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఇది ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ అని చెప్పొచ్చు. రెండో టెస్టులో లియోన్ 13 ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే 500వికెట్ల మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది. ఇక లియోన్‌కు లార్డ్స్ టెస్టు వందోది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లియోన్ గాయంపై స్టీవ్ స్మిత్ స్పందింస్తూ.. ''నాథన్ కచ్చితంగా ఎలా ఉన్నాడో తెలియదు.. అతని గాయం తీవ్రమైతే మాత్రం తమ జట్టుకు భారీ నష్టం మిగలనుంది. అతని లోటును తీర్చడం చాలా కష్టం. ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది.''అంటూ తెలిపాడు. తాజాగా మూడోరోజు ఆటకు ఇరుజట్లు సిద్ధమవుతున్నా వేళ ఆడమ్ వైట్ అనే వ్యక్తి తన ట్విటర్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టేడియానికి వస్తున్న వీడియోనూ షేర్ చేశాడు. ఈ వీడియోలో నాథన్ లియోన్ రెండు స్రెచర్ల సాయంతో నడుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీన్నిబట్టి లియోన్‌కు గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రెండో టెస్టుకు లియోన్ దూరమైనట్లే. నాథన్ లియోన్ స్థానంలో టాడ్ మార్ఫీ! ఒకవేళ నాథన్ గాయంతో యాషెస్ సిరీస్ కు దూరమైతే అతని స్థానంలో టాడ్ మార్ఫీని మూడో టెస్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. లియోన్ 30 యాషెస్ టెస్టుల్లో 29.41 సగటుతో 110 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటివరకు 122 టెస్టుల్లో 31.01 సగటుతో 496 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు మ్యాచుల్లో 10 వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక లార్డ్స్ టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ రెండోరోజు ఆట ముగిసేసమయానికి 61 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 45, బెన్ స్టోక్స్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ ప్రస్తుతం 138 పరుగులు వెనుకబడి ఉంది. The Australians have arrived 80 minutes before play as Nathan Lyon struggles with his team mates on crutches following his calf injury yesterday. @SEN_Cricket pic.twitter.com/a1lRWLIofm — Adam White (@White_Adam) June 30, 2023 చదవండి: అతడి గురించి మీకేం తెలుసు? ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరా?: గంగూలీ ఆగ్రహం #Ashes2023: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే -
58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే
అభిమానం అనేది ఒక వ్యక్తిని ఎంత దూరమైనా ప్రయాణం చేసేలా చేస్తోంది. మనకిష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్న కుతూహలం ఉంటుంది. ఒకవేళ మనకు దగ్గర్లో ఉన్న సినిమా థియేటర్లో టికెట్ దొరక్కపోతే.. వంద కిలోమీటర్లు దూరం ఉన్నా సరే వెర్రి అభిమానం అంత దూరం మనల్ని తీసుకెళ్తుంది. అలా చూసినప్పుడే మనకు ఆత్మసంతృప్తి. క్రికెట్లో కూడా అలాంటి పిచ్చి అభిమానం ఉన్న ఫ్యాన్స్ కొందరుంటారు. ఆ కోవకు చెందిన వాడే మిస్టర్ మాట్. తస్మానియాకు చెందిన మాట్కు క్రికెట్ అన్నా.. ఆస్ట్రేలియా జట్టు అన్నా విపరీతమైన అభిమానం. ఆ వెర్రి అభిమానమే అతన్ని తస్మానియా నుంచి వయా చైనా, సైప్రస్‌లు మీదుగా ఇంగ్లండ్‌కు తీసుకొచ్చింది. 58 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణం చేసిన మ్యాట్ లార్డ్స్‌కు చేరుకున్నాడు. కానీ మ్యాట్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. యాషెస్ సిరీస్ ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా అభిమానులైతే టి20ల కంటే ఎక్కువగా యాషెస్‌ను ఆదరిస్తారు. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టు రసవత్తరంగా సాగడంతో లార్డ్స్ టెస్టుపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో టికెట్లన్నీ ఆన్ లైన్ లో మూడు రోజుల ముందే ముగిశాయి. అయితే 58 గంటలు ప్రయాణించి లార్డ్స్ కు వచ్చిన మ్యాట్.. స్టేడియంలోకి ఎంట్రీ కావడానికి టికెట్ ను ముందుగా బుక్ చేసుకోలేదు.లార్డ్స్ కు చేరుకున్నాకా అతడికి టికెట్ దక్కలేదు. దీంతో అతడు లార్డ్స్ స్టేడియం ముందు ''నాకు ఒక టికెట్ కావాలి. నేను లార్డ్స్ లో మ్యాచ్ చూసేందుకు గాను 58 గంటలు జర్నీ చేసి వచ్చాను. దయచేసి నాకు ఒక టికెట్ ఇప్పించండి.''అని ప్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ అయిన బర్మీ ఆర్మీని మ్యాట్ ఒక టికెట్ ఉంటే ఇప్పించండి అంటూ బతిమాలుకున్నాడు. దీంతో బర్మీ ఆర్మీలోని ఒక వ్యక్తి అతని అభిమానానికి కరిగిపోయి తన టికెట్‌ను అతనికి ఇచ్చేశాడు. దీంతో రెండో టెస్టు తొలి రోజున మూడో సెషన్లో అతను గ్రౌండ్లోకి చేరుకొని మ్యాచ్ వీక్షించి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Can we help Aussie Matt out? He’s travelled from Tasmania with no ticket!#Ashes pic.twitter.com/h1pZ3p4xJj — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023 ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా క్రితం రోజు స్కోరుకు మరో 76 పరుగులు జోడించి 416 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. మూడో సెషన్లో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. బెన్ డకెట్ 86, ఓలీ పోప్ 39 పరుగులతో ఆడతున్నారు. ఇంగ్లండ్ ఓవర్‌కు 4 పరుగులకు పైగా రన్‌రేట్‌తో పరుగులు సాధిస్తుండడం విశేషం. చదవండి: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన Ashes 2023: కామెంటరీ కంటే ఐస్‌క్రీం ఎక్కువైపోయిందా! -
Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
The Ashes, 2023: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో విఫలమైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెండో మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో స్మిత్ వరుసగా 16, 6 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా 110 పరుగులు సాధించాడు. తద్వారా టెస్టు కెరీర్లో 32వ శతకం నమోదు చేసిన స్మిత్.. అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్‌గా 44వ శతకం సాధించాడు. రోహిత్ శర్మను వెనక్కినెట్టిన స్మిత్ తద్వారా టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మను అధిగమించాడు. యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక దీనితో పాటు మరో రికార్డును కూడా స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీ వీరుల జాబితాలో ఆసీస్ తరఫున దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా(32 సెంచరీలు)తో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. సచిన్ టెండుల్కర్(51), జాక్ కలీస్(45), రికీ పాంటింగ్(41) ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. యాషెస్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 416 పరుగులకు ఆలౌట్ అయింది. 416 పరుగులకు ఆలౌట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 66 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన లబుషేన్ 47, ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ట్రవిస్ హెడ్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ 22, కెప్టెన్ కమిన్స్ 22 రన్స్ తీశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, జోష్ టంగ్ మూడేసి వికెట్లు తీయగా.. రూట్ రెండు వికెట్లు పడగొట్టారు. స్టువర్ట్ బ్రాడ్, ఆండర్సన్‌కు ఒక్కో వికెట్ దక్కింది. ప్రస్తుత తరం క్రికెటర్లలో అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్-5 బ్యాటర్లు ►విరాట్ కోహ్లి(భారత్)- 75 ►జో రూట్(ఇంగ్లండ్)- 46 ►డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- 45 ►స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 44 ►రోహిత్ శర్మ(భారత్)- 43. చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం! వాళ్లకు ఊరటనిచ్చేలా.. ఇక ధావన్ కెప్టెన్‌గా.. 🚨Steve Smith is the fastest batsman to score 32nd Hundreds in Test Cricket🚨#Ashes23 #ENGvAUS#ENGvsAUS #Ashespic.twitter.com/bKwZYRL5Ez — Cricket Videos 🏏 (@Abdullah__Neaz) June 29, 2023 -
Ashes 2023: కామెంటరీ కంటే ఐస్‌క్రీం ఎక్కువైపోయిందా!
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆసక్తిగా మొదలైంది. రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియాను.. ఇంగ్లండ్ 416 పరుగుల వద్ద తొలి సెషన్లోనే ఆలౌట్ చేసింది. ప్రస్తుతానికైతే ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున సాధిస్తుండడం విశేషం. జాక్ క్రాలే 45, బెన్ డకెట్ 25 పరుగులతో ఆడుతున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. రెండో టెస్టు సందర్భంగా కామెంటరీ ప్యానెల్లో కామెంటేటర్లు చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీరియస్‌గా మ్యాచ్ సాగుతుంటే కామెంటరీ చేయాల్సింది పోయి ఐస్‌క్రీం తింటుండడం ఆసక్తి కలిగించింది. అయితే మార్క్ టేలర్ తన చేతిలో ఐస్‌క్రీం పెట్టుకొని పక్కనే ఉన్న ఇషా గుహాను ఊరించేలా చేశాడు. అయితే ఇషా గుహా మాత్రం తానేం తక్కువ తిన్నానా అన్నట్లుగా మార్క్ టేలర్ చేతిలో ఉన్న ఐస్‌క్రీం నుంచి ఒక పీస్తో క్రీం తీసుకొని రుచి చూడడం ఆసక్తి కలిగించింది. మొత్తానికి మైదానంలో జరుగుతున్న విషయాలను కామెంటరీ చేయాల్సింది పోయి ఐస్‌క్రీమ్ తింటూ బిజీగా ఉండడం ఏంటని అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక యూజర్ తన ట్విటర్లో షేర్ చేశాడు. #Ashes2023 Day 1 Commentators steal the show🤣 Ice Cream is more important 😛 pic.twitter.com/dgUC0S2NSg — SoRaD 🇮🇳❤️🇷🇺 (@risingstar_de) June 29, 2023 చదవండి: సూర్య, డివిలియర్స్నే మించిపోయాడు.. ఎవరయ్యా నువ్వు? అభిమానుల డిమాండ్; అశ్లీల వెబ్సైట్లో జాయిన్ అయిన ఫుట్‌బాలర్ -
లంచ్ విరామం.. స్మిత్ సెంచరీ, ఆస్ట్రేలియా 416 ఆలౌట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 110 పరుగులతో సెంచరీ చేయగా.. ట్రెవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66 పరుగులు చేశారు. 339/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి సెషన్లోనే తమ పోరాటాన్ని ముగించింది. రెండోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే అలెక్స్ కేరీ వెనుదిరిగాడు. ఆ తర్వాత స్టార్క్ కూడా 6 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో కమిన్స్ స్మిత్‌కు జత కలిశాడు. ఇద్దరు కలిసి 8వ వికెట్‌కు 35 పరుగులు జోడించి జట్టు స్కోరును 400 దాటించారు. ఈ దశలో స్మిత్ టెస్టుల్లో 32వ సెంచరీ మార్క్‌ను సాధించాడు. అయితే కాసేపటికే స్మిత్ ఔట్ కావడం.. తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు టెయిలెండర్ల పని కానిచ్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, ఓలీ రాబిన్సన్లు చెరో మూడు వికెట్లు తీయగా.. జో రూట్ 2, అండర్సన్, బ్రాడ్లు ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 6, బెన్ డకెట్ ఏడు పరుగులతో ఆడుతున్నారు. చదవండి: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన -
టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ శతకంతో మెరిశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ 169 బంతుల్లో శతకం మార్క్ అందుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఓపికతో ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. కాగా స్మిత్‌కు తన టెస్టు కెరీర్లో ఇది 32వ శతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అత్యధిక సెంచరీల విషయంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వాతో(32 టెస్టు సెంచరీలు) కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (51 సెంచరీలు) తొలి స్థానంలో ఉండగా.. జాక్ కలీస్(45 సెంచరీలు) రెండో స్థానంలో, రికీ పాంటింగ్(41 సెంచరీలు) మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన క్రికెటర్లలో స్మిత్.. స్టీవ్ వాతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుత తరంలో టెస్టుల్లో యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు స్మిత్వే కావడం విశేషం. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 32 సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా స్మిత్ చరిత్ర సృష్టించాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో ఆడుతున్న స్మిత్ సెంచరీకి చేరువగా వచ్చిన సమయంలో ఒత్తిడికి గురయ్యాడు. మరోవైపు ఆసీస్ కూడా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో స్మిత్ సెంచరీ చేస్తాడా అన్న అనుమానం వచ్చింది. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక ఎండ్‌లో నిలబడి స్మిత్ సెంచరీ అయ్యేలా చూశాడు. ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసిది. స్మిత్ 110 పరుగులు, పాట్ కమిన్స్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 🚨Steve Smith is the fastest batsman to score 32nd Hundreds in Test Cricket🚨#Ashes23 #ENGvAUS#ENGvsAUS #Ashespic.twitter.com/bKwZYRL5Ez — Cricket Videos 🏏 (@Abdullah__Neaz) June 29, 2023 A fine innings comes to an end for Steve Smith 🤝 https://t.co/gywkuUUD3T pic.twitter.com/Bxn4vbbRg5 — England Cricket (@englandcricket) June 29, 2023 In 2010 - Steve Smith made his Test debut at Lord's & batted at 8. In 2023 - Steve Smith completed his 32nd Test hundred at Lord's. One of the Greatest turn-arounds in cricket history. pic.twitter.com/UjjS9cc9Oy — Johns. (@CricCrazyJohns) June 29, 2023 చదవండి: సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ హ్యాట్రిక్ సెంచరీ.. వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నాడా! -
సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్
ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ ఆటతీరుతో వరుసగా సిరీస్‌లు గెలిచిన సంగతి తెలిసిందే. స్టోక్స్ కెప్టెన్‌గా.. మెక్కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంగ్లండ్ జట్టు 13 టెస్టుల్లో 11 విజయాలు సాధించింది. అన్నింటిలోనూ బజ్‌బాల్ ఆట దూకుడునే ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లను మట్టికరిపించి సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. ఇక యాషెస్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఇంగ్లండ్ జట్టు తమ బజ్‌బాల్ దూకుడు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఆసీస్‌తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ను ఒక్కరోజులోనే డిక్లేర్ చేసింది. అయితే ప్రతీసారి మనది కాదని తెలుసుకోని ఇంగ్లండ్ ప్రపంచ టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు తలవంచింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఐదోరోజు సూపర్‌గా బౌలింగ్ చేసినప్పటికి పాట్ కమిన్స్, నాథన్ లయోన్ల అద్బుత పోరాటం ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేసింది. కానీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం బజ్‌బాల్ ఆటను సమర్థించుకున్నాడు. ఒక్క టెస్టులో ఓడిపోయినంత మాత్రానా బజ్‌బాల్‌ను పక్కనపెట్టేదే లేదని కుండబద్దలు కొట్టాడు. సీన్ మొత్తం రివర్స్.. అయితే బుధవారం(జూన్ 28న) లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో సీన్ మొత్తం రివర్స్ అయింది. బజ్‌బాల్ ఆటతో దూకుడు కనబరుస్తామనుకున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎందుకంటే తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా వేగంగా ఆడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇలాగే ఆడుతామంటూ బజ్‌బాల్ ఆటను ఇంగ్లండ్‌కు చూపించింది. డేవిడ్ వార్నర్, ట్రెవిస్ హెడ్లు వన్డే స్టైల్లో వేగంగా ఆడితే.. స్మిత్ ఎప్పటిలాగే తన నిలకడైన ఆటను ప్రదర్శిస్తూ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సెంచరీకి దగ్గరయ్యాడు. ఓవర్‌కు 4.08 రన్‌రేట్‌తో 83 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఒక దశలో వార్నర్-లబుషేన్, ట్రెవిస్ హెడ్- స్మిత్ జోడి ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున జోడించారు. నిజంగా ఇది ఇంగ్లండ్ ఇది ఊహించలేదు. ఇక రెండోరోజు ఆటలో స్మిత్ సెంచరీ నుంచి డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలెక్స్ క్యారీ, లాస్ట్ మ్యాచ్ హీరో పాట్ కమిన్స్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. తొలి సెషన్లో వీరిని ఎంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్‌కు అంత మంచిది. రెండు సెషన్ల పాటు ఆసీస్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 500 స్కోరు దాటే అవకాశం ఉంది. అప్పుడు ఇంగ్లండ్‌కు కష్టాలు మొదలైనట్లే. బజ్‌బాల్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిద్దామనుకున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియానే ముచ్చెమటలు పట్టించేలా కనిపిస్తోంది. చదవండి: రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా భారత్ చేతిలో ఓడినా సరే.. మాకు అదే ముఖ్యం: పాక్ స్టార్ క్రికెటర్ -
రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ ఇటీవలీ కాలంలో తన ఆటను పూర్తిగా మార్చేశాడు. ఒకప్పుడు టెస్టులు, వన్డే క్రికెట్‌పై మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసిన రూట్ టి20ల్లోనూ తన పాగా వేసేందుకు ఆటశైలిని మార్చాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫలితం ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా వచ్చినప్పటికి రూట్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒక మంచి బ్యాటర్‌గా పేరు పొందిన రూట్ ఈ మధ్య కాలంలో బౌలర్‌గానూ రాణిస్తూ ఆల్‌రౌండర్ అవతారం ఎత్తినట్లుగా అనిపిస్తున్నాడు. తాజాగా లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో తొలి రోజే తన బౌలింగ్ మాయాజాలన్ని ప్రదర్శించాడు. ప్రధాన బౌలర్లకు తీసిపోని విధంగా ప్రదర్శన చేసిన రూట్.. ఆసీస్ ప్రధాన బ్యాటర్లు కామెరూన్ గ్రీన్, ట్రెవిస్ హెడ్లు ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ఈ నేపథ్యంలో రూట్ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అదేంటంటే.. యాషెస్ చరిత్రలో బ్యాటింగ్‌లో 2వేల పరుగులు పూర్తి చేయడంతో పాటు 20 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్(2172 పరుగులు, 74 వికెట్లు), ఇంగ్లండ్‌కు చెందిన వాలీ హామండ్(2852 పరుగులు, 36 వికెట్లు) పడగొట్టారు. ఇక తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. స్మిత్ 85 పరుగులు నాటౌట్ మరో సెంచరీ వైపు దూసుకెళుతుండగా.. అలెక్స్ కేరీ 11 పరుగులతో స్మిత్‌కు సహకరిస్తున్నాడు. అంతకముందు ట్రెవిస్ హెడ్(77 పరుగులు), డేవిడ్ వార్నర్(66 పరుగులు) వన్డే తరహాలో ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, జోష్ టంగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఓలి రాబిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు. Joe Root strikes twice in an over and Australia are 5️⃣ down! #EnglandCricket | #Ashes pic.twitter.com/wmn9hC5K6c — England Cricket (@englandcricket) June 28, 2023 చదవండి: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో అరుదైన మైలురాయిని దాటిన స్టీవ్ స్మిత్.. ఇతని కంటే కోహ్లి ఒక్కడే బెటర్ -
పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ దూకుడుకు ముకుతాడు వేస్తూ ఆసీస్ అద్బుత విజయాన్ని మూటగట్టుకుంది. అయితే కేవలం ఒక్క టెస్టు ఓడినంత మాత్రానా బజ్‌బాల్ ఆటను ఆపే ప్రసక్తే లేదని స్టోక్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ మీదకు దూసుకొచ్చిన ఆందోళనకారులు కాగా మ్యాచ్ ప్రారంభం అయిన కాసేపటికే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆందోళనకారులు స్టేడియంలోని పిచ్‌పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్టేడియం నాలుగు వైపుల నుంచి ఒక్కసారిగా ఆందోళనకారులు దూసుకురావడంతో ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాలేదు. ఇంతలో గ్రౌండ్‌స్టాఫ్ వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో బౌలింగ్ ఎండ్‌లో ఇద్దరు ఆందోళనకారులు సిబ్బందిని అడ్డుకుంటూ కిందపడేశారు. కాగా ఈ ఆందోళనకారులు ఎవరంటే.. 'జస్ట్ స్టాప్ ఆయిల్' అనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలీ కాలంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా ఈ ఆందోళనకారులు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో ఆయిల్ టర్మినెల్స్ను కాపాడాలంటూ జస్ట్ స్టాప్ ఆయిల్ పేరుతో ఒక సోషల్ యాక్టివిస్ట్ సంస్థ 2022 నుంచి తమ ఉద్యమం కొనసాగిస్తుంది. ఏమిటీ ‘జస్ట్ స్టాప్ ఆయిల్’? పర్యావరణానికి హాని కలిగించే చమురు ఉత్పాదన కోసం కొత్త లైసెన్సులను నిలిపివేయాలని కొందరు నిరసనకారులు ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ పేరిట ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది బ్రిటన్‌లో పలు క్రీడల ఈవెంట్లను ఈ పర్యావరణ కార్యకర్తలు ఆటంకపరుస్తూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్, ఐర్లాండ్ క్రికెట్ మ్యాచ్, ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, ప్రీమియర్‌షిప్ రగ్బీ ఫైనల్‌కు, ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లలోనూ తమ నిరసన గళం వినిపించారు. ఆశ్చర్యపరిచిన బెయిర్ స్టో చర్య.. ఇదంతా సీరియస్‌గా జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో చేసిన పని అభిమానులను ఆశ్చర్యపరిచింది. తమ వైపుగా దూసుకొచ్చిన ఒక ఆందోళనకారుడిని బెయిర్ స్టో తన చేతుల్లోకి ఎత్తుకొని బౌండరీ లైన్ వద్ద ఎత్తిపడేశాడు. ''మీరు ఉద్యమం చేయడం తప్పు కాదు.. కానీ ఇలా మ్యాచ్‌కు ఆటంకం కలిగించడం మంచి పద్దతి కాదు'' అంటూ బెయిర్ స్టో అతనికి సర్ది చెప్పాడు. కాగా బెయిర్ స్టో చర్యకు అభిమానులు షాక్ తిన్నప్పటికి.. అతను చేసింది సరైన చర్యే అవడంతో చప్పట్లతో అభినందించారు. ఇక బెయిర్ స్టో తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టేటప్పుడు ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టోకు అభినందనలు తెలపడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Bairstow picking up a pitch invader#Ashes pic.twitter.com/vCWCkXb3IA — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023 Good start to the 2nd test. Bairstow has done some heavy lifting already😂😂 #Ashes2023 pic.twitter.com/f0JcZnCvEr — Ashwin 🇮🇳 (@ashwinravi99) June 28, 2023 చదవండి: విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! ‘పాకిస్తాన్ జట్టు భద్రతకై ప్రత్యేక ఏర్పాట్లు.. వాళ్లకు భయం వద్దు! నాకు నమ్మకం ఉంది’ -
ఇంగ్లండ్‌కు పరాభవం.. యాషెస్ టెస్ట్ సిరీస్ ఓటమి
నాటింగ్హమ్: ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. మూడు ఫార్మాట్ల ఫలితాలతో విజేత ఖరారయ్యే ఈ సిరీస్‌లో ఆసీస్ అమ్మాయిలు ఏకైక టెస్టులో గెలిచి ఆధిక్యంలోకి వచ్చారు. ఇక ఈ యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే తదుపరి జరిగే ఆరు మ్యాచ్‌ల్లో (మూడు టి20లు, మూడు వన్డేలు) ఐదింట గెలవాలి. సోమవారం ముగిసిన టెస్టులో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ ఆష్లే గార్డ్నర్ (8/66) ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. భారత స్పిన్నర్ నీతూ డేవిడ్ (8/53; 1995లో ఇంగ్లండ్‌పై) తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆష్లే నిలిచింది. 268 పరుగుల లక్ష్యంతో ఆఖరి రోజు 116/5తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి సెషన్లోనే ఆలౌటైంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 49 ఓవర్లలో 178 పరుగుల వద్ద ముగిసింది. నాలుగో రోజు ఆటలోనే 3 కీలక వికెట్లు తీసిన ఆష్లే చివరి రోజు ఉదయం మరో ఐదు వికెట్లను పడగొట్టింది. ఈ టెస్టులో ఆమె మొత్తం 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 4) పడగొట్టింది. తద్వారా మహిళల టెస్టు చరిత్రలో రెండో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. ఈ జాబితాలో పాక్ బౌలర్ షాయిజా ఖాన్ (2004లో విండీస్‌పై 13 వికెట్లు) అగ్రస్థానంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆసీస్ 473, ఇంగ్లండ్ 463 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో ఆ్రస్టేలియా 257 పరుగులు చేసింది. -
ఇంతటి విషాదమా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట్లు చూడకుండానే.. మళ్లీ..
Andrew Strauss Recalls Wif Words After Learning Devastating Cancer Diagnosis: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం దాగుంది. అతడి భార్య రూత్ లంగ్ క్యాన్సర్‌తో అర్ధంతరంగా తనువు చాలించింది. ఇద్దరు చిన్నారుల ఆలనాపాలనా, వారి ముద్దుముచ్చట్లు పూర్తిగా చూడకుండానే ఈ లోకాన్ని వీడింది. భార్య పేరిట ఫౌండేషన్ భార్య జ్ఞాపకాలను మర్చిపోలేని స్ట్రాస్.. ఆమె పేరిట రూత్ స్ట్రాస్ పేరిట ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్నాడు. స్మోకింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం కల్పించడం, క్యాన్సర్ బాధితుల్లో అవగాహన పెంచడం సహా వ్యాధి తీవ్రతరమైన వారి కుటుంబాలకు ఎమోషనల్ సపోర్టునివ్వడంలో తోడ్పడటం ఈ ఫౌండేషన్ ధ్యేయం. కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నేపథ్యంలో జూన్ 29న మొదలు కానున్న రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా రూత్‌కు నివాళిగా రెడ్ ఫర్ రూత్ డే జరుపనున్నారు. ప్రేక్షకులు, వాలంటీర్లు తదితరులు ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రిబ్యూట్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ బాధిత కుటుంబాలను ఆదుకునే నిమిత్తం నిధులు సేకరించనున్నారు. ఇంతటి విషాదమా! ‘‘నేను ఎప్పుడైతే ఆ చేదువార్త విన్నానో అప్పుడు నా హృదయం ముక్కలైంది. నా మానసిక వ్యథను మాటల్లో వర్ణించలేను. మా జీవితాల్లో కోలుకోలేని షాక్ అది. అసలు మాకే ఎందుకిలా జరిగింది? ఇదసలు నిజమేనా? అంటూ నా మనసు పరిపరివిధాలుగా ఆలోచించింది. కానీ రూత్ మాత్రం ఆది నుంచి ధైర్యంగానే ఉంది. నాకే ఎందుకిలా? అని తను బాధపడుతూ కూర్చోలేదు. ప్రతిరోజూ ఇలాగే ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉండేది. మహమ్మారి బారిన పడ్డా తను అలా ఎలా ఉండగలిగిందో నాకైతే అర్థం కాలేదు. క్యాన్సర్ సోకిందన్న వార్త వినగానే తను కూల్‌గా స్పందించింది. టీ తాగుతారా? అని అడిగింది. చావుకు సిద్ధపడే నిజంగా.. దురదృష్టం తనను వెంటాడింది. చావుకు మానసికంగా సిద్ధమైనా.. పిల్లల విషయంలో మాత్రం చాలా బాధపడేది. వాళ్ల ఎదుగుదల చూడలేకపోతున్నానే అని వేదన చెందేది. జీవితంలో తను చాలా సాధించాలనుకుంది. కానీ అర్ధంతరంగా జీవితం ముగించాల్సి వస్తుందని తెలిసి.. ముందుగానే అందుకు సిద్ధమైంది. ఈ భూమ్మీద తనకు మిగిలిన రోజులను కుటుంబంతో సంతోషంగా గడపాలని నిశ్చయించుకుంది. తను మమ్మల్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోవడానికి ముందే మాకేం కావాలో అన్నీ అమర్చి పెట్టింది’’ అంటూ ఆండ్రూ స్ట్రాస్ తమ జీవితంలో చోటు చేసుకున్న విషాదం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన దివంగత భార్య రూత్ ఎంతో ధైర్యవంతురాలని, ఆమెను చాలా మిస్ అవుతున్నామని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా 2017లో తనకు క్యాన్సర్ సోకిందన్న విషయం తెలుసుకున్న రూత్.. ఆ మరుసటి ఏడాది తుదిశ్వాస విడిచింది. ఇక 2003లో ఆండ్రూ- రూత్ పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు సామ్(2005), లుకా (2008) జన్మించారు. కాగా రూత్ చనిపోయిన తర్వాత ఆండ్రూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. చదవండి: లేటు వయస్సులో రీ ఎంట్రీ ఇస్తానంటున్న ఆటగాడు.. ఏకంగా కోహ్లి స్ధానానికే! జింబాబ్వే చేతిలో ఓటమి ఎఫెక్ట్.. వైస్ కెప్టెన్‌నే తప్పించిన విండీస్ -
Ashes Series 2023: ఇంగ్లండ్ ఓపెనర్ డబుల్ సెంచరీ.. ఆసీస్‌కు ధీటుగా..!
మహిళల యాషెస్ సిరీస్ 2023 ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ట్యామీ బీమౌంట్ డబుల్ సెంచరీ సాధించింది. మహిళల క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా, తొలి ఇంగ్లీష్ మహిళగా ట్యామీ రికార్డుల్లోకెక్కింది. 317 బంతుల్లో 26 బౌండరీ సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్యామీ.. కెరీర్లో తాను సాధించిన తొలి టెస్ట్ శతకాన్నే ద్విశతకంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు ట్యామీ తన 7 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే సాధించింది. అయితే ఆమెకు వన్డేల్లో, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. 103 వన్డేల్లో 9 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీల సాయంతో 3505 పరుగులు (40.8 యావరేజ్‌తో), 99 టీ20ల్లో సెంచరీ, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1721 పరుగులు (108.4 స్ట్రయిక్‌రేట్‌తో) సాధించింది. WOW 🤯 Our first female double centurion in Test match cricket.#EnglandCricket #Ashes pic.twitter.com/Eju1kwmlug — England Cricket (@englandcricket) June 24, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 473 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన అనాబెల్ సదర్లాండ్ (137) అజేయమైన సెంచరీతో చెలరేగగా.. ఎల్లైస్ పెర్రీ (99) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకుంది. తహిల మెక్‌గ్రాత్ (61) అర్ధసెంచరీతో రాణించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లెస్టోన్ 5 వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్, లారెన్ ఫైలర్ తలో 2 వికెట్లు, కేట్ క్రాస్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్‌కు ధీటుగా జవాబిస్తుంది. ఆ జట్టు మూడో రోజు మూడో సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 25 పరుగులు వెనుకబడి ఉంది. ట్యామీ బీమౌంట్ (205), కేట్ క్రాస్ (0) క్రీజ్‌లో ఉన్నారు. హీథర్‌నైట్ (57), నాట్‌సీవర్ బ్రంట్ (78) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 3, తహిల మెక్‌గ్రాత్, డార్సీ బ్రౌన్, నదర్లాండ్, పెర్రీ తలో వికెట్ పడగొట్టారు. -
'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్ బతికుంటే సంతోషించేవాడు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుటెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆసీస్ రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇక రెండోటెస్టు ఇరుజట్ల మధ్య జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది. అయితే ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో అలీ గాయపడ్డాడు. దీంతో లార్డ్స్ టెస్టుకు మొయిన్ అలీ దూరమయ్యాడు. అయితే అతని స్థానంలో ఎవరు ఊహించని రీతిలో 18 ఏళ్ల కుర్రాడికి ఈసీబీ అవకాశం ఇచ్చింది.లెగ్ స్పిన్నర్ అయిన 18 ఏళ్ల రిహాన్ అహ్మద్‌ను మొయిన్ అలీకి రీప్లేస్‌గా తీసుకోవడం ఆసక్తి కలిగించింది. అయితే ఇదే రిహాన్ అహ్మద్‌కు గతంలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ షేక్‌హ్యాండ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రిహాన్ 13 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గ్రౌండ్లో బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. అతని బౌలింగ్‌ను నిశితంగా పరిశీలించిన షేన్ వార్న్.. కాసేపటికి అతని దగ్గరికి వచ్చి.. ''నిజంగా సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నావ్. నేను అప్పటినుంచి నిన్ను గమనిస్తున్నా. త్వరలోనే నీ గురించి కామెంట్ చేస్తానేమో. 15 ఏళ్ల వయసులోనే నువ్వు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.. అంతేకాదు చిన్న వయసులోనే ఇంగ్లండ్ జట్టులో చోటు సంపాదిస్తావు'' అని చెప్పుకొచ్చాడు. వార్న్ ఆ మాటలు ఏ శుభ ముహుర్తానా అన్నాడో తెలియదు కానీ అదే ఇప్పుడు నిజమయ్యింది. మొయిన్ అలీ స్థానంలో ఎంపికవడం.. అదీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సందర్భంగా ఇది జరగడం రిహాన్ అహ్మద్‌ది అదృష్టం అని చెప్పొచ్చు. ఒకవేళ రెండో టెస్టులో అవకాశం లభించి మంచి ప్రదర్శన ఇస్తే మాత్రం ఇంగ్లండ్ జట్టులో శాశ్వత స్పిన్నర్‌గా పాతుకుపోయే అవకాశం రావొచ్చు. ఇక రిహాన్ అహ్మద్ తన ఎంపికపై స్పందిస్తూ.. ''ఏదో ఒకరోజు ఇంగ్లండ్‌కు ఆడుతానని తెలుసు.. కానీ ఇలా ఎంపికవుతానని ఊహించలేదు. సరిగ్గా ఐదేళ్ల క్రితం దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నన్ను ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు ఇవాళ నిజమయ్యాయి. వార్న్ బతికి ఉంటే తప్పకుండా సంతోషించేవాడు'' అంటూ పేర్కొన్నాడు. The King Shane Warne knew. Rehan Ahmed. pic.twitter.com/pCl6oaXkk3 — M (@anngrypakiistan) June 23, 2023 చదవండి: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!' -
'అలా అయితే యాషెస్‌లో నా కథ ముగిసినట్లే!'
ఇంగ్లండ్ వెటరన్ పేసర్.. జేమ్స్ అండర్సన్ నిస్సందేహంగా ఈ తరంలో ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్ అని చెప్పొచ్చు. స్వింగ్ కింగ్‌గా పేరొందిన అండర్సన్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టి ఇంగ్లండ్‌కు ఎన్నో విజయాలు అందించాడు. ఇరుదేశాలు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్‌లోనూ అండర్సన్ కీలకపాత్ర పోషించాడు. 2015లో ఇంగ్లండ్ యాషెస్ గెలవడంలో అండర్సన్‌దే ముఖ్యపాత్ర. అలాంటి అండర్సన్ బౌలింగ్‌లో పదును తగ్గినట్లు అనిపిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన యాషెస్ సిరీస్ 2023లో అండర్సన్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అయితే ఈ ఒక్క ప్రదర్శనతో అతనికి వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే బెన్ స్టోక్స్ అండర్సన్‌ను బాగా నమ్ముతాడు. అందుకే రెండో టెస్టులో రాణించి స్టోక్స్ నమ్మకాన్ని నిలబెట్టాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న అండర్సన్ ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై విమర్శలు గుప్పించాడు. ''లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో నా బౌలింగ్ పదును చూపించాలనుకుంటున్నా. కానీ ఎడ్జ్‌బాస్టన్ టెస్టు పిచ్ ఫ్లాట్‌గా ఉంది. యాషెస్ సిరీస్‌లో జరిగే మిగతా టెస్టుల్లోనూ పిచ్ ఇలాగే ఉంటే మాత్రం యాషెస్‌తో నా బంధం ముగిసినట్లే. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో పిచ్‌పై స్వింగ్, రివర్స్ సింగ్ లేవు.. సీమ్ బౌన్స్ అసలే లేదు.. కనీసం పేస్ బౌలింగ్‌కు కూడా అనుకూలంగా లేదు. రానున్న మ్యాచ్‌ల్లో పేస్‌కు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా. ఇక ఎన్నో ఏళ్లుగా ఇంగ్లండ్‌కు ప్రధాన బౌలర్‌గా ఉన్నా. నా బౌలింగ్ స్కిల్స్‌తో ఎలాంటి కండీషన్స్లోనైనా వికెట్లు రాబట్టే ప్రయత్నం చేశా.. కానీ ఎడ్జ్‌బాస్టన్ పిచ్ మొదటిసారి కొత్తగా కనిపించింది. ఇలాగే ఉంటే యాషెస్‌తో నా బంధం ముగిసినట్లే(అంటే జట్టులో చోటు కోల్పోవడమే) అని అర్థం'' అంటూ వివరించాడు. James Anderson said - "If all Ashes pitches are like Edgbaston that I'm done in the Ashes series. That pitch was like kryptonite for me. There was not much swing, no reverse swing, no seam bounce, no movement and no pace". (On Edgbaston pitch in first Ashes)#Ashes2023 pic.twitter.com/fqQBldgENj — Aman Awasthi (@AwasiAman17) June 23, 2023 చదవండి: టీమిండియాకు దూరం.. పుజారా కీలక నిర్ణయం, సూర్య కూడా -
యాషెస్ రెండో టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి యువ ఆటగాడు
యాషెస్ తొలి టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్.. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్టుకు అన్ని విధాల సన్నద్దం అవుతోంది. రెండో టెస్టు జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. అయితే రెండో టెస్టుకు ఇంగ్లీష్ జట్టు ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఆడేది సందేహం గా మారింది. తొలి టెస్టులో మోయిన్ అలీ చేతి వేలి గాయంతో బాధపడ్డాడు. దీంతో సెకెండ్ ఇన్నింగ్స్‌లో పెద్దగా అలీ బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలో రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టు మెనెజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. మోయిన్ అలీ బ్యాకప్‌గా యువ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను ఇంగ్లండ్ ఎంపిక చేసింది. కాగా 18 ఏళ్ల అహ్మద్.. గతేడాది డిసెంబర్లో పాకిస్తాన్‌పై టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా రెహాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్టులోనే ఏడు వికెట్లు పడగొట్టి అందరని రెహాన్ అకట్టుకున్నాడు. ప్రస్తుతం విటిలిటి టీ20 బ్లాస్ట్‌లో లీసెస్టర్‌షైర్ తరపున ఆడుతున్న రెహాన్ పర్వాలేదనపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అలీ బ్యాకప్‌గా ఈయువ లెగ్గీని ఎంపిక చేశారు. చదవండి: Shayan Jahangir: 'కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటమే నా లక్ష్యం.. ఎదురుచూస్తున్నా' -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. రెండో ఆటగాడిగా!
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన రెండో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఖ్వాజా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో ఖ్వాజా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లకు అడ్డుగా నిలిచి మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ మొత్తంలో 518 బంతులు ఎదుర్కొని 206 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ మొదటిరోజే 3/393 వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా ఆరోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు నాలుగు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. అనంతరం రెండో రోజు మొత్తం బ్యాటింగ్ చేసిన ఖ్వాజా 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 126 పరుగులు వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ చేసిన ఉస్మాన్ ఖవాజా మరో 15 పరుగులు జోడించి 141 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లడ్.. 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మళ్లీ అదే రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు వచ్చింది. నాలుగో రోజు చివరి సెషన్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు . మ్యాచులో చివరి రోజైన ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించి మరో 31 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తద్వారా టెస్టు మ్యాచ్‌లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా ఈ ఆసీస్ ఓపెనర్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు వీరే.. మోత్గనల్లి జైసింహ (భారత్) వర్సెస్ ఆస్ట్రేలియా - 1960 జియోఫ్రీ బాయ్‌కాట్ (ఇంగ్లండ్) వర్సెస్ ఆస్ట్రేలియా - 1977 కిమ్ హ్యూస్ (ఆస్ట్రేలియా) వర్సెస్ ఇంగ్లండ్ - 1980 అలన్ లాంబ్ (ఇంగ్లాండ్) వర్సెస్ వెస్టిండీస్ - 1984 రవిశాస్త్రి (భారత్) వర్సెస్ ఇంగ్లాండ్ - 1984 అడ్రియన్ గ్రిఫిత్ (వెస్టిండీస్) వర్సెస్ న్యూజిలాండ్ - 1999 ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్) వర్సెస్ భారతదేశం - 2006 అల్విరో పీటర్సన్ (దక్షిణాఫ్రికా) వర్సెస్న్యూజిలాండ్ - 2012 చెతేశ్వర్ పుజారా (భారత్) వర్సెస్ శ్రీలంక - 2017 రోరీ బర్న్స్ (ఇంగ్లాండ్) వర్సెస్ ఆస్ట్రేలియా - 2019 క్రైగ్ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్) వర్సెస్ జింబాబ్వే - 2023 టాంగెనరైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్) వర్సెస్ జింబాబ్వే - 2023 ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా) వర్సెస్ ఇంగ్లాండ్ - 2023* చదవండి: Asia Cup 2023: అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ స్ట్రాంగ్ కౌంటర్.. తగ్గేదేలేదు! Only in Test Cricket 😍 An unconventional field setup from 🏴 forced Usman Khawaja to come down the track and ended up getting bowled 😲👏#SonySportsNetwork #TheAshes #ENGvAUS #RivalsForever pic.twitter.com/jb0XKnBJCv — Sony Sports Network (@SonySportsNetwk) June 18, 2023 -
అప్పుడు నాన్న.. అమ్మతో వచ్చారు.. కానీ ఈసారి: కమిన్స్ భావోద్వేగం
England vs Australia, 1st Test: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. 2019లో తన తండ్రి.. తల్లితో పాటు మ్యాచ్ చూడటానికి వచ్చారని.. ఇప్పుడు లండన్‌లో ఆయన ఒక్కరే ఉన్నారని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్న సమయంలో ప్యాట్ కమిన్స్ ఉన్నఫళంగా ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి బాగోగులు చూసుకునేందుకు టెస్టు సిరీస్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే కమిన్స్ తల్లి కన్నుమూసింది. అయితే, తాను ఎంతగానో ప్రేమించే మాతృమూర్తిని కోల్పోయిన బాధ నుంచి కమిన్స్ ఇంకా బయటపడలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ తర్వాత ఆసీస్ నేరుగా టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడింది. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కమిన్స్.. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక కమిన్స్ సారథ్యంలోని ఆసీస్.. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో 209 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేనను ఓడించింది. తద్వారా సంప్రదాయ క్రికెట్లోనూ విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఈ మ్యాచ్ ముగియగానే ఆసీస్.. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 16-20 వరకు జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కమిన్స్ 4 వికెట్లు తీయడంతో పాటు.. కీలక సమయంలో 44 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం కమిన్స్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా.. గత కొన్నిరోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా. అయితే, ఈ వారం మొత్తం నాన్న, నా సోదరుడు నాతో పాటే ఉన్నారు. 2019లో నాన్న అమ్మతో పాటు వచ్చారు. కానీ ఇప్పుడు ఇలా!.. మరేం పర్లేదు ఆయన నాతో ఉండటం స్పెషల్.. లక్కీగా ఫీలవుతున్నా’’ అని ఎమోషనల్ అయ్యాడు. చదవండి: Ravindra Jadeja: పాపం! జడేజా మనసు గాయపడి ఉంటుంది.. సీఎస్కే సీఈఓ కామెంట్స్ వైరల్ -
న్యూ మిస్టర్ కూల్ అంటూ ప్రశంసల వర్షం.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్
England vs Australia, 1st Test: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో శుభారంభం చేసిన ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఉత్కంఠభరిత టెస్టు మ్యాచ్ చూడనేలేదంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆసీస్ సారథిని ‘న్యూ మిస్టర్ కూల్’గా అభివర్ణించిన వీరూ భాయ్.. ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా అద్భుతం అంటూ ఆకాశానికెత్తాడు. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా జూన్ 16-20 వరకు మొదటి టెస్టు జరిగింది. బజ్‌బాల్ విధానం పేరిట సంప్రదాయ క్రికెట్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్.. మొదటి రోజే 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా అద్భుత సెంచరీ(141)కి తోడు.. ట్రవిస్ హెడ్ అర్ధ శతకం(50)తో రాణించడంతో 386 పరుగులకు ఆలౌట్ అయి మొదటి ఇన్నింగ్స్ ముగించింది. అద్భుతం చేసిన కమిన్స్, నాథన్ ఇదిలా ఉంటే.. ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్, వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ నాలుగేసి వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఉస్మాన్ ఖవాజా (65) మరోసారి బ్యాట్ ఝులిపించగా.. ప్యాట్ కమిన్స్, నాథన్ లియోన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కమిన్స్ 73 బంతుల్లో 44 పరుగులతో.. నాథన్ 28 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచి ఓటమి నుంచి ఆసీస్‌ను గట్టెక్కించి గెలుపుబాట పట్టించారు. దీంతో అనూహ్య రీతిలో సొంతగడ్డపై తొలి టెస్టులోనే ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. వాటే టెస్ట్ మ్యాచ్! ఈ నేపథ్యంలో రెండు వికెట్ల తేడాతో గెలుపొంది 1-0తో ముందంజ వేసిన ఆస్ట్రేలియా, జట్టును గెలిపించిన టెయిలెండర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఆసీస్‌ను కొనియాడుతూ చేసిన ట్వీట్ అభిమానులను ఆకర్షిస్తోంది. ‘‘వాటే టెస్ట్ మ్యాచ్! ఇటీవలి కాలంలో నేను చూసిన అత్యంత గొప్ప మ్యాచ్ ఇదే. నిజంగా టెస్ట్ క్రికెట్ బెస్ట్ క్రికెట్. మొదటి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వాతావరణం అలా ఉన్న సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం అంటే మాటలు కాదు! ఏదేమైనా ఖవాజా రెండు ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు. ఇక ప్యాట్ కమిన్స్ టెస్టు క్రికెట్లో మరో మిస్టర్ కూల్‌గా అవతరించాడు. తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయిన సమయంలో కమిన్స్, లియోన్ నమోదు చేసిన భాగస్వామ్యం సుదీర్ఘ కాలం పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది’’ అని సెహ్వాగ్ కమిన్స్‌ను ప్రశంసించాడు. కాగా సాధారణంగా టీమిండియా లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మిస్టర్ కూల్‌గా అభిమానులు పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. చదవండి: శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా! వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. శుబ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్! రుత్‌రాజ్ రీ ఎంట్రీ బంగ్లాదేశ్ చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్.. What a Test Match. One of the best I have seen in recent times. Testcricket is Best Cricket. Was a gutsy decision by England to declare just before close on Day 1, especially considering the weather. But Khawaja was outstanding in both innings and @patcummins30 is the new Mr.… pic.twitter.com/9QqC2hjyzr — Virender Sehwag (@virendersehwag) June 20, 2023 A final day thriller to kick off the series 🏏 🏴 #ENGvAUS 🇦🇺 #Ashes pic.twitter.com/EuAk2CUeWC — England Cricket (@englandcricket) June 21, 2023 -
తొలిటెస్టు ఆసీస్‌దే.. ఇంగ్లండ్‌పై రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం (ఫొటోలు)
-
'మ్యాచ్ పోతే పోయింది.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు'
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బజ్‌బాల్ క్రికెట్‌తో దూకుడు ప్రదర్శిస్తున్న ఆ జట్టుకు ఆసీస్ ముకుతాడు వేసింది. అయితే మ్యాచ్ ఓటమిపై స్టోక్స్ తనదైన శైలిలో స్పందించాడు. మ్యాచ్ ఓడిపోయామన్న బాధ ఉన్నా బజ్‌బాల్ క్రికెట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ పేర్కొన్నాడు. ''మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు.. కానీ ఒక విషయంలో సంతోషంగా ఉంది. అదేంటంటే మ్యాచ్‌ను ఆఖరి నిమిషం వరకు తీసుకెళ్లడం. ఒక గొప్ప గేమ్‌లో భాగస్వామ్యం కావడం.. మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు కూడా ఐదురోజుల పాటు ఎడ్జ్ ఆఫ్ సీట్ ఫీల్‌ను అనుభవించారు. ఒక టెస్టు క్రికెట్‌కు కావాల్సింది ఇదే. యాషెస్‌ను ఇరుదేశాల్లో ఎంతలా ఆదరిస్తానేది మరోసారి కనిపించింది. మ్యాచ్‌లో ఎవరో ఒకరే గెలవాలి..ఇవాళ మేం ఓటమి డెడ్‌లైన్‌ను దాటలేకపోయాం. అంతమాత్రానా మా ఆటతీరును మార్చుకోలేం. బజ్‌బాల్ క్రికెట్‌ను కంటిన్యూ చేస్తాం. ఈ మ్యాచ్‌లో మా వ్యూహాలను ఎదుర్కోవాలనే ప్లాన్‌తో ఆసీస్ వచ్చింది. మేం జస్ట్ మిస్ అయ్యాం. లేదంటే ఇక్కడ వేరే ఫలితం గురించి మాట్లాడుకునేవాళ్లం. ఈ సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్ మాత్రమే. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. చాలా క్రికెట్ ఆడాలి. ఇప్పుడు మా ఫోకస్ అంతా ఆ మ్యాచ్‌లపైనే. చేతిలో వికెట్లు ఉండి కూడా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను తొలిరోజే డిక్లేర్ చేయడం వెనుక నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. ఈరోజు దీనికి క్లారిటీ ఇస్తున్నా. నేను ఒక కెప్టెన్‌ను కాబట్టి.. ఆ టైంలో ఆస్ట్రేలియాను మరింత ఒత్తిడిలోకి నెట్టొచ్చు అనిపించింది. అందుకే ఆ పని చేశా. ఏ ఓపెనింగ్ బ్యాటర్ కూడా ఆట ముగియడానికి 20 నిమిషాల ముందు బ్యాటింగ్‌కు వెళ్లాలని అనుకోడు. అందుకే ఆ పని చేశా. అయితే ఆ రోజు ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ ఎలాంటి పొరపాటు చేయకుండా తొలి రోజు ఆటను ముగించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయినా కూడా.. ఇంగ్లండ్‌కు కేవలం 7 పరుగుల ఆధిక్యమే లభించింది. అదే ఇంగ్లండ్ కనుక తొలి రోజు డిక్లేర్ చేయకుండా మరికొంత సమయం ఆడి ఉంటే మరింత ఆధిక్యం లభించేదే. మేం ఆడిన విధానం, ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడి చేయడం చూసి డిక్లేర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నా. డిక్లేర్ చేయకపోతే ఐదో రోజు ఇంత ఎగ్జయిట్మెంట్ వచ్చేదా? చెప్పండి'' అంటూ ప్రశ్నించాడు. మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆట ఆఖరిరోజు వరుణుడు అడ్డుపడడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడం మ్యాచ్‌ను ఆ జట్టువైపు తిప్పింది. అయితే చివరి సెషన్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియోన్లు వీరోచిత పోరాటం ఆసీస్‌ను గెలుపు దిశగా నడిపించింది. బజ్‌బాల్ అంటూ దూకుడు మీదున్న ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టి పలు రికార్డులను ఆసీస్ తన పేరిట లిఖించుకుంది. అవేంటో పరిశీలిద్దాం. ► ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో 275 అంతకంటే ఎక్కువ టార్గెట్‌ను చేధించడం ఇది 15వ సారి కాగా.. ఈ ఏడాదే ఐదుసార్లు ఉండడం గమనార్హం ► ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఇది ఐదోసారి. ఇంతకముందు 1948లో హెడ్డింగేలో ఆస్ట్రేలియా 404 పరుగుల టార్గెట్‌ను, 1984లో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ 342 పరుగుల టార్గెట్‌ను, 2017లో హెడ్డింగే వేదికగా వెస్టిండీస్ 322 పరుగుల టార్గెట్‌ను, 2008లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సౌతాఫ్రికా 281 పరుగుల టార్గెట్‌ను చేధించాయి. ► ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్లలో బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 80 పరుగులతో పాటు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. ఇంతకముందు బాబ్ సింప్సన్ నాలుగుసార్లు, జార్జ్ గిఫెన్ రెండుసార్లు, వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, రిచీ బెర్నాడ్, అలెన్ బోర్డర్, పాట్ కమిన్స్ తలా ఒకసారి ఈ ఘనత సాధించారు. ► టెస్టుల్లో చేజింగ్ సందర్భాల్లో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జంటగా పాట్ కమిన్స్-నాథన్ లియోన్ నిలిచారు. ఈ ద్వయం ఇంగ్లండ్‌తో టెస్టులో తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఇక తొలి స్తానంలో 81 పరుగులు - వీవీఎస్ లక్ష్మణ్ & ఇషాంత్ శర్మ (IND) vs AUS, మొహాలి, 2010; 61* పరుగులు - జెఫ్ డుజోన్ & విన్స్టన్ బెంజమిన్ (WI) vs PAK, బ్రిడ్జ్‌టౌన్, 1988; 56* పరుగులు - టిబ్బి కాటర్ & గెర్రీ హాజ్లిట్ (AUS) vs ENG, సిడ్నీ, 1907; 55* పరుగులు - పాట్ కమ్మిన్స్ & నాథన్ లియోన్ (AUS) vs ENG, ఎడ్జ్‌బాస్టన్, 2023 ; 54 పరుగులు - బ్రియాన్ లారా & కర్ట్లీ ఆంబ్రోస్ (WI) vs AUS, బ్రిడ్జ్‌టౌన్, 1999 ఉన్నారు. ► ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో పాట్ కమిన్స్ చోటు సంపాదించాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కమిన్స్ ఐదు సిక్సర్లు కొట్టాడు. ఇంతకముందు రికీ పాంటింగ్ 2005లో న్యూజిలాండ్‌పై ఐదు సిక్సర్లు, ఇయాన్ చాపెల్ 1972లో పాకిస్తాన్‌పై నాలుగు సిక్సర్లు కొట్టాడు. ► యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఆస్ట్రేలియాకు ఇది ఐదోసారి. ఇంతకముందు 404 పరుగుల టార్గెట్‌ను 1948లో హెడ్డింగే వేదికగా, 315 పరుగుల టార్గెట్‌ను అడిలైడ్ వేదికగా 1901-02లో, 286 పరుగుల టార్గెట్‌ను మెల్బోర్న్ వేదికగా 1928-29లో, తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లో(2023లో) 281 పరుగుల టార్గెట్‌ను, 1897-98లో సిడ్నీ వేదికగా 275 పరుగుల టార్గెట్‌ను చేధించింది. ► యాషెస్ చరిత్రలో ఇది ఆరో క్లోజెస్ట్ విజయం. ఇంతకముందు ఇంగ్లండ్ మూడు సందర్భాల్లో ఒక వికెట్ తేడాతో, ఒకసారి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ఆస్ట్రేలియా రెండు సందర్బాల్లో రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చదవండి: బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్
ఆటలో ప్రతీరోజు మనది కాదు. ప్రయోగాలు మంచిదే అయినప్పటికి ప్రతీసారి అది మనకు కలిసి వస్తుందని చెప్పలేం. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టకు ఈ విషయం బాగా అర్థమయి ఉంటుంది. బజ్‌బాల్ అంటూ దూకుడైన ఆటతీరుతో తమకు ఎదురులేదని విర్రవీగుతున్న ఇంగ్లండ్‌ను ఆసీస్ అణిచివేసింది. అది కూడా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కావడంతో ఇంగ్లీష్ అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. బజ్‌బాల్ క్రికెట్‌తో ఇంగ్లండ్ ఏడాది కాలంగా మంచి ఫలితాలను సాధించింది. బెన్‌స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు కొత్తగా కనిపించింది. ఇదే బజ్‌బాల్ మంత్రంతో పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లను మట్టికరిపించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కానీ జరుగుతున్నది ప్రతిష్టాత్మక యాషెస్.. అందునా ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ విషయం తెలిసి కూడా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలిరోజే సాహసం చేశాడు. పూర్తి బ్యాటింగ్ చేయకుండా తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 393 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిచ్చింది. 386 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల దాటికి 273 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సొంతగడ్డపై జరుగుతుండడంతో ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి రోజు బౌలర్లకు అనుకూలిస్తుందని చెప్పారు. ఇక ఐదోరోజు ఆటలో వరుణుడు దోబుచులాడడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనిపించాయి. ఇంగ్లండ్ వ్యూహం బెడిసికొట్టేలా కనిపించింది. అయితే రెండో సెషన్లో కుదురుకున్న ఇంగ్లండ్ వరుసగా వికెట్లు పడగొట్టింది. అరె మళ్లీ ఇంగ్లండ్ బజ్‌బాల్ మంత్రం ఫలించిందే అనుకుంటున్న తరుణంలో పాట్ కమిన్స్, నాథన్ లియోన్లు తమ పోరాటంతో ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేశారు. ప్రతీసారి బజ్‌బాల్ దూకుడు పనికి రాదన్నది మరోసారి ఇంగ్లండ్‌కు అర్థమయి ఉండాలి. రెండో టెస్టు నుంచి బజ్‌బాల్ క్రికెట్‌ను పక్కనబెడతారా లేక కొనసాగిస్తారా అనేది చూడాలి. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలి సెషన్లో వర్షంతో ఆటకు అంతరాయం కలగడం.. రెండో సెషన్లో పిచ్‌పై ఉన్న పదును ఉపయోగించుకొని ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లతో చెలరేగారు. దీంతో ఆఖరి సెషన్లో ఎలాగైనా నిలబడి డ్రా చేసుకున్నా చాలు అనే దోరణిలో తొలుత ఆసీస్ ఆట కొనసాగింది. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ధైర్యం ప్రదర్శించాడు. ఆరంభంలో కాస్త నిధానంగా ఆడిన కమిన్స్.. లయన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ‘డ్రా’కు అవకాశమివ్వకుండా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నాథన్ లయన్ (28 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు. దీంతో ఇంగ్లండ్ గెలిచేందుకు బాట వేసుకున్న ఆఖరి సెషన్లో వీళ్లిద్దరు పిచ్‌పై పరుగులతో పాగా వేశారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. Ball by ball Last 4 overs of Ashes thriller between Australia and England in first test at Edgbaston #Ashes23 pic.twitter.com/OYpoar6vhW — Spartan (@_spartan_45) June 20, 2023 చదవండి: 2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా? -
రసవత్తరంగా యాషెస్ తొలి టెస్టు.. స్టేడియంలో కన్పించిన షాహీన్ అఫ్రిది! ఫోటో వైరల్
యాడ్జ్బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరగుతున్న యాషెస్ తొలి టెస్టు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో బోణీ కొట్టేందుకు ఆఖరి రోజు ఆసీస్‌కు మరో 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్‌కు మరో 7 వికెట్లు కావాలి. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆటముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్రీజులో క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా(34), స్కాట్ బోలాండ్(13) నాటౌట్‌గా ఉన్నారు. స్టేడియంలో కన్పించిన షాహీన్ ఇక రసవత్తరంగా సాగుతున్న ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంకు వచ్చాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 33 ఓవర్లో షాహీన్ కెమరా కంట పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అఫ్రిది ప్రస్తుతం ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో బీజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో నాటింగ్‌హామ్‌షైర్ అఫ్రిది ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌తో రెడ్‌బాల్ క్రికెట్లో అఫ్రిది పునరాగమనం చేయనున్నాడు. గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి టెస్టు జట్టుకు అఫ్రిది దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అఫ్రిదికి చోటు దక్కింది. చదవండి: #Ashes2023: ఇదేమి యార్కర్రా బాబు.. దెబ్బకు బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ Shaheenn Shah Afridi at Edgbaston, watching the 1st #ashes test day 4 pic.twitter.com/L1rNZBCJK8 — Team Shaheen Afridi (@TeamShaheenShah) June 19, 2023 -
'తప్పేముంది.. రెండింటికి సమన్యాయం చేశాడు'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆట ఆఖరిరోజు విజయానికి ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ మరో 174 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఐదోరోజు ఆటలో తొలి సెషన్ కీలకం కానుంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగుతారా.. లేక ఆసీస్ బ్యాటర్లు సమర్థంగా రాణించి ఆసీస్‌కు విజయాన్ని అందిస్తారా అనేది చూడాలి. బజ్‌బాల్ క్రికెట్లో జోరుమీదున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ ముకుతాడు వేస్తుందో లేక చతికిలపడుతుందో చూడాలి. ఇక ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ చర్య నవ్వులు పూయిస్తోంది. బౌలింగ్‌కు వచ్చిన రాబిన్సన్ తన కాళ్లకు వేర్వేరు షూ వేయడం ఆసక్తి కలిగించింది. సంబంధం లేకుండా ఎడమకాలికి అడిడాస్(Adidas)వేసిన రాబిన్సన్.. తన కుడికాలికి రాజోర్(Razor) షూ వేసుకున్నాడు. మధ్య ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చిన సందర్భంలో ఓలీ రాబిన్సన్ ఇలా మిస్‌మ్యాచ్ షూ వేసుకొచ్చి సీరియస్‌గా సాగిపోతున్న మ్యాచ్‌లో తన చర్యతో అందరిని నవ్వించాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఇందులో తప్పేముంది.. బహుశా రెండింటికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యుంటాడు.. అందుకే ఇలా వేసుకొచ్చి సమన్యాయం చేశాడు. 281 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 34, నైట్ వాచ్‌మన్ స్కాట్ బొలాండ్ 13 పరుగులతో ఆడుతున్నారు. స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీశాడు. ఆసీస్ విజయానికి 174 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు కావాలి. pic.twitter.com/abYYFCVMub — Out Of Context Cricket (@GemsOfCricket) June 18, 2023 చదవండి: ఔటయ్యి కూడా చరిత్రకెక్కిన జో రూట్ -
ఔటయ్యి కూడా చరిత్రకెక్కిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అయితే తన టెస్టు కెరీర్లో రూట్ స్టంప్ అవుట్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఔటయ్యి కూడా రూట్ ఒక రికార్డు అందుకున్నాడు. కెరీర్లో 130 టెస్టులాడిన రూట్ 11,168 పరుగులు చేసిన అనంతరం తొలిసారి స్టంప్ ఔట్ అయి రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో విండీస్ దిగ్గజం చందర్‌పాల్ 11,414 పరుగులు చేసిన తర్వాత తొలిసారి స్టంపౌట్ అయ్యాడు.మూడో స్థానంలో గ్రేమీ స్మిత్ 8800 పరుగులు చేసిన తర్వాత, టీమిండియా నుంచి కోహ్లి 8195 పరుగులు, సచిన్ టెండూల్కర్ 7419 పరుగులు చేసిన తర్వాత స్టంపౌట్ అయి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్ కాని ఆటగాడిగా మహేల జయవర్దేనే నిలిచాడు. టెస్టుల్లో 11,814 పరుగులు చేసిన జయవర్దనే ఒక్కసారి స్టంపౌట్ కాకపోవడం విశేషం. After 11,168 runs, Joe Root has been stumped for the first time in Tests! (h/t @sirswampthing) #Ashes pic.twitter.com/X1XackGAYa — ESPNcricinfo (@ESPNcricinfo) June 19, 2023 చదవండి: 2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా? -
2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా?
'బజ్‌బాల్' అంటూ దూకుడు కనబరుస్తున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా ముకుతాడు వేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆటకు ఇవాళ చివరి రోజు కావడంతో ఇంగ్లండ్ విజయానికి ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ విజయానికి 174 పరుగుల దూరంలో ఉంది. అయితే చివరి రోజు బౌలర్లకు అనూకూలంగా ఉంటుందన్న అంశం ఇంగ్లండ్ బౌలర్లకు ఊరటనిచ్చే అంశం. అయితే ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచి చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ పోరాడకుండా మాత్రం ఉండదు. చేయాల్సింది 174 పరుగులే కావడం.. క్రీజులో ఉస్మాన్ ఖవాజా ఉండగా.. ట్రెవిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీలు ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని వీలైనంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు క్లిక్ అయినా ఆసీస్ తొలి టెస్టును కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం చూసుకుంటే ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. 2005 రిపీట్ అవుతుందా? అయితే 2005లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. అప్పట్లో 282 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ 279 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 407 పరుగులు చేయగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు 101 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా ఇంగ్లండ్ 182 పరుగులకే కుప్పకూలింది. దీంతో 281 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ విజయానికి కేవలం రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరిగినప్పటికి చివర్లో షేన్ వార్న్ 42, బ్రెట్ లీ 43 పరుగులు సంచలన ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే ఆండ్రూ ఫ్లింటాఫ్ నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం 2023లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు పరిస్థితి కూడా అచ్చం అదే పరిస్థితిని తలపిస్తుంది. బజ్‌బాల్ మంత్రంతో ఇంగ్లండ్ ఆసీస్ ఆట కట్టిస్తుందా లేక ఆసీస్ ఇంగ్లండ్‌కు షాకిస్తుందా అన్నది చూడాలి. చదవండి: #Ashes2023: ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు.. ఆసీస్‌కు 174 పరుగులు -
#Ashes2023: ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు.. ఆసీస్‌కు 174 పరుగులు
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ తొలి టెస్టు హోరాహోరీగా సాగుతున్నది. టెస్టుల్లో కొత్త సంప్రదాయానికి తెరతీసిన ‘బజ్‌బాల్’ శైలితో ఇంగ్లండ్ దూకుడు కనబరుస్తుంటే..ఆసీస్ అంతే దీటుగా సై అంటున్నది. దీంతో ఆధిక్యం చేతులు మారుతున్న మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదల కనబరుస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. ఇంగ్లండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. జరుగుతున్నది టెస్టు మ్యాచ్ అయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను తలపిస్తూ ఇరు జట్ల బ్యాటర్లు తమదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిర్దేశిత లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు మెరుగైన శుభారంభమే దక్కింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న వార్నర్(36) ఫర్వాలేదనపించగా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజ(34 నాటౌట్) అద్భుత పోరాట పటిమ కనబరుస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను కాచుకుంటూ వీరిద్దరు లక్ష్యఛేదనను ప్రారంభించారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో వార్నర్‌ను రాబిన్సన్ ఔట్ చేయడం ద్వారా ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. వార్నర్ వెనుదిరుగడంతో తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్(13) మరోమారు నిరాశపరిచాడు. క్లిష్ట సమయాల్లో జట్టును గట్టెక్కించే లబుషేన్(13) బ్రాడ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. జట్టును ఆదుకుంటాడనుకున్న స్టీవ్ స్మిత్ (6)..బ్రాడ్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఆసీస్ విజయానికి 174 పరుగుల దూరంలో ఉంది. ఇంగ్లండ్ 273 ఆలౌట్: ఓవర్‌నైట్ స్కోరు 28/2 నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమదైన రీతిలో దూకుడు మంత్రాన్ని పటించింది. బ్యాటర్లు ఆది నుంచే బాదుడు మొదలుపెట్టారు. ముఖ్యంగా జో రూట్(46), హ్యారీ బ్రూక్(46), కెప్టెన్ బెన్ స్టోక్స్(43) కీలక పరుగులు జత చేశారు. ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా నిలువరిస్తూ వైవిధ్యమైన షాట్లతో స్కోరు బోర్డుకు పరుగులు జతచేశారు. ఇన్ఫామ్ బ్యాటర్ రూట్..ర్యాంప్ షాట్లతో టి20 ఫార్మాట్ బ్యాటింగ్‌ను తలపించాడు. అయితే మరో ఎండ్‌లో కమిన్స్(4/63), లియాన్(4/80) బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను ఇబ్బందులకు గురిచేశారు. వీరిద్దరు ఇంగ్లండ్ భారీ స్కోరు ఆశలకు గండికొట్టారు. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 386, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 273 ఆలౌట్, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 103/3 -
‘మొదటి బంతి’కే రూట్ అలా! పంత్‌ను లాగిన ఫ్యాన్స్.. వీడియో వైరల్
England vs Australia, 1st Test- Joe Root: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతోంది. మూడో రోజైన ఆదివారం నాటి ఆట వర్షం కారణంగా కేవలం 32.4 ఓవర్ల పాటే సాగింది. వరుణుడి ఆటంకంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు నష్టపోయి 28 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. సోమవారం నాలుగో రోజు ఆట మొదలు కాగా ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ మొదటి బంతికే దూకుడు ప్రదర్శించాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన బంతిని రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు విఫలయత్నం చేశాడు. పంత్ రియల్ ఐడీ నుంచి రావొచ్చు కదా! బజ్‌బాల్ విధానంతో టెస్టుల్లో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ పేరును నిలబెడుతూ నమ్మశక్యం కాని రీతిలో ఫస్ట్ బాల్కే రూట్ ఇలాంటి షాట్ ఆడటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పేరును ప్రస్తావిస్తున్నారు. ‘‘నాలుగో రోజు మొదటి బాల్.. కమిన్స్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ షాట్ ప్రయత్నించిన రూట్’’ అంటూ జాన్స్ అనే యూజర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘నిజమైన ఐడీ నుంచి రావొచ్చు కదా పంత్’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా యాషెస్ మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులతో అజేయంగా నిలిచిన జో రూట్ పలు రికార్డులు సృష్టించాడు. అజేయ సెంచరీతో.. ఇప్పుడిలా రెండో ఇన్నింగ్స్‌లో 55 బంతదుల్లో 46 పరుగులు చేసిన అతడు.. నాథన్ లియోన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కాగా రిషభ్ పంత్ రివర్స్ స్కూప్ షాట్లు ఆడటంలో దిట్ట అన్న విషయం తెలిసిందే. ఇక రోడ్డు ప్రమాదం బారిన పడిన కారణంగా పంత్ పలు కీలక సిరీస్‌లతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే ఎవరి సాయం లేకుండా నడవగలుగుతున్న అతడు వన్డే వరల్డ్‌కప్ నాటికైనా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. పోటాపోటీగా ఇదిలా ఉంటే.. నాలుగోరోజు ఆటలో 35 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో(0), బెన్ స్టోక్స్(13) క్రీజులో ఉన్నారు. ఇక అంతకుముందు ఇంగ్లండ్ 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు దీటుగానే బదులుచ్చిన ఆసీస్ 386 పరుగులకు తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! రూ. లక్ష ఇవ్వాల్సిందే! అక్కడుంది హార్దిక్ కదా! 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి మరీ.. A ramp-bunctious start from Joe Root 🔥 What is going on!? 😂🤷♂️ #EnglandCricket | #Ashes pic.twitter.com/ieMdbBnRAH — England Cricket (@englandcricket) June 19, 2023 -
Ashes 1st Test: ‘యాషెస్’ టెస్టుకు వర్షం దెబ్బ
బర్మింగ్ హామ్: ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య తొలి ‘యాషెస్’ టెస్టు మ్యాచ్ వర్షం బారిన పడింది. వాన కారణంగా మూడో రోజు కేవలం 32.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆదివారం మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. డకెట్ (19), క్రాలీ (7) ఒకే స్కోరు వద్ద పెవిలియన్ చేరగా...ప్రస్తుతం పోప్ (0), రూట్ (0) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 311/5తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 7 పరుగుల అతి స్వల్ప ఆధిక్యం లభించింది. ఉస్మాన్ ఖ్వాజా (321 బంతుల్లో 141; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) తన స్కోరుకు మరో 15 పరుగులు జోడించగా, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (38; 3 సిక్స్‌లు) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ మూడు వికెట్ల చొప్పున తీశారు. చదవండి: రోహిత్ ఫామ్‌లోకి రావాలంటే అదొక్కటే మార్గం: స్మిత్ -
ENG VS AUS Ashes 1st Test: బజ్‌బాల్ బెడిసికొట్టింది..!
బజ్‌బాల్ అప్రోచ్ అంటూ టెస్ట్ క్రికెట్ ఉనికిని చెరిపే ప్రయత్నం చేస్తున్న ఇంగ్లండ్ జట్టుకు తిక్క కుదిరింది. వారు నమ్ముకున్న బజ్‌బాల్ ఫార్ములా తొలిసారి బెడిసికొట్టింది. ఆసీస్ లాంటి జట్టు ప్రత్యర్ధిగా ఉన్నప్పుడు బజ్‌బాల్, గిజ్బాల్ అంటూ ఓవరాక్షన్లు చేయకూడదని ఇంగ్లండ్‌కు తెలిసొచ్చింది. యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఇంగ్లండ్ పరిస్థితి ప్రస్తుతం చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్న చందంగా మారింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (141) వీరోచిత శతకంతో ఇంగ్లండ్ తిక్క కుదిర్చాడు. అతనికి ట్రవిస్ హెడ్ (50), కెమారూన్ గ్రీన్ (38), అలెక్స్ క్యారీ (66), పాట్ కమిన్స్ (38) సహకరించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఆసీస్ దాదాపుగా చేరుకున్నంత పని చేసింది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటై, 7 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. 311/5 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. ఆదిలోనే అలెక్స్ క్యారీ వికెట్ కోల్పోయింది. జేమ్స్ ఆండర్సన్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత ఖ్వాజా.. కమిన్స్ సాయంతో ఆసీస్ స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. అయితే ఆఖర్లో ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో 386 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), లయోన్ (1), బోలండ్ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో 3 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, ఆండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. -
మెయిన్ అలీ సూపర్ డెలివరీ..బిత్తర పోయిన గ్రీన్! వీడియో వైరల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగుతున్న యాషెస్ తొలి టెస్టుతో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన బంతితో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 67 ఓవర్లో అలీ తొలి బంతిని ఔట్ సైడ్ఆఫ్ దిశగా వేశాడు. ఆఫ్‌సైడ్ పడిన బంతి ఒక్క సారిగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో ఒక్క సారిగా గ్రీన్ బిత్తిరిపోయాడు. చేశాదేమి లేక గ్రీన్నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గ్రీన్ 38 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మెయిన్ అలీని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసిచాడు. "వాటే ఏ బ్యూటీ మోయిన్" అంటూ.. గ్రీన్ ఔటైన వీడియోను భజ్జీ ట్విటర్లో షేర్ చేశాడు. ఇక యాషెస్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 393/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా(137), కమ్మిన్స్ ఉన్నారు. చదవండి: నేను బతికుండగా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. ఇంతకంటే దిగజారడం అంటే: మాజీ కెప్టెన్ What was that Moeen Ali.. 🥹#ENGvAUS #Ashes #Ashes23 pic.twitter.com/dATMqppgXQ — Abu Zaid Sarooji (@Sarooji_) June 17, 2023 What a beauty Moen ♠️ https://t.co/Rai7KEj4XN — Harbhajan Turbanator (@harbhajan_singh) June 17, 2023 -
క్యాచ్ విడిచిపెట్టారు.. స్టంపింగ్ మిస్ చేశారు! చెత్త ఫీల్డింగ్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి రోజు ఇంగ్లండ్ పైచేయి సాధించినప్పటికీ.. రెండో రోజు ఆస్ట్రేలియా కూడా ధీటుగా బదులుస్తోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 393/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి సెషన్లోనే వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా(126 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఖ్వాజా వీరోచిత సెంచరీ సాధించాడు. దీంతో ఆసీస్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. చెత్త ఫీల్డింగ్.. ఇక ఇది ఇలా ఉండగా.. రెండో రోజు చివరి సెషన్లో పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ విమర్శలు వర్షం కురిపించాడు. ఆఖరి సెషనల్లో ఇంగ్లండ్ ఫీల్డర్లు బద్దకంగా కన్పించారు అని నాజర్ హుస్సేన్ విమర్శించాడు. కాగా ఆఖరి సెషన్లో ఖ్వాజా క్యాచ్‌ను విడిచిపెట్టగా.. క్యారీ స్టంపౌట్ రూపంలో అవకాశం ఇచ్చారు. అదే విధంగా రెండో రోజు ఆఖరిలో బ్రాడ్ బౌలింగ్‌లో ఖ్వాజా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నోబాల్ కావడంతో మరోసారి ఖ్వాజా బతికిపోయాడు. "ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్పిన్‌గా అద్భుతంగా అనుకూలిస్తోంది. ఇంగ్లీష్ స్పిన్నర్ మోయిన్ అలీ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ చివరి సెషన్లో ఇంగ్లండ్ ఫీల్డర్లు అంత యాక్టివ్‌గా కనిపించలేదు. ఈజీ క్యాచ్‌ను విడిచిపెట్టడమే కాకుండా స్టంపౌట్ ఛాన్స్‌ను కూడా మిస్ చేశారు. నో బాల్ వికెట్ కూడా ఇంగ్లండ్‌కు చాలా ఖరీదుగా మారనుంది" అని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హుస్సేన్ పేర్కొన్నాడు. చదవండి: Ashes 2023: ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్ -
Eng Vs Aus: పట్టుదలగా నిలబడ్డ ఖ్వాజా.. క్యారీ సైతం..! కోలుకున్న ఆస్ట్రేలియా!
England vs Australia, 1st Test- బర్మింగ్హమ్: ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (279 బంతుల్లో 126 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) మొండి పట్టుదలతో ఆడటంతో... ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా కోలుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 94 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (393/8 డిక్లేర్డ్)కు ఆస్ట్రేలియా మరో 82 పరుగుల దూరంలో ఉంది. ఖ్వాజాతో కలిసి అలెక్స్ క్యారీ (80 బంతుల్లో 52 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 14/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో తొలి రెండు బంతుల్లో డేవిడ్ వార్నర్ (27 బంతుల్లో 9; 2 ఫోర్లు), లబుషేన్ (0)లను బ్రాడ్ అవుట్ చేశాడు. కాసేపటికి స్టీవ్ స్మిత్ (59 బంతుల్లో 16) కూడా పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలిచయా 67 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ దశలో ట్రావిస్ హెడ్ (63 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్) తో ఖ్వాజా నాలుగో వికెట్‌కు 81 పరుగులు... గ్రీన్ (68 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్)తో ఐదో వికెట్‌కు 72 పరుగులు జత చేసి ఆదుకున్నాడు. గ్రీన్ అవుటయ్యాక వచ్చిన క్యారీ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఖ్వాజాతో ఆరో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. చదవండి: వరల్డ్‌కప్ క్వాలిఫియర్ మ్యాచ్‌లకు సర్వం సిద్దం.. ఫోటోలకు ఫోజులిచ్చిన కెప్టెన్లు -
Ashes 1st Test: సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ బౌలర్ ఖాతాలో వికెట్
యాషెస్ సిరీస్ 2023 కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని (టెస్ట్‌లు) సైతం వెనక్కు తీసుకున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. 22 నెలల సుదీర్ఘ విరామం (650 రోజులు) తర్వాత టెస్ట్‌ల్లో తొలి వికెట్ సాధించాడు. యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో మొయిన్.. కీలకమైన ట్రవిస్ హెడ్ (50) వికెట్ పడగొట్టాడు. హెడ్ ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గిస్తున్న క్రమంలో మొయిన్ అతని వికెట్‌ను దక్కించుకుని, మళ్లీ ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టేశాడు. లెగ్ సైడ్ అప్పర్ డ్రైవ్ చేసే క్రమంలో మిడ్‌వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న జాక్ క్రాలే క్యాచ్ పట్టడంతో హెడ్ పెవిలిన్ బాట పట్టాడు. Moeen Ali gets his first wicket upon returning to Test cricket. pic.twitter.com/gmSUjQtNT6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 17, 2023 కాగా, మొయిన్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021 (సెప్టెంబర్) భారత పర్యటనలో ఆడాడు. అనంతరం అతను టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పి పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతున్నాడు. రీఎంట్రీకి ముందు టెస్ట్‌ల్లో మొయిన్ చివరి వికెట్ రిషబ్ పంత్‌ది. ఆ మ్యాచ్ కూడా పంత్ కూడా హెడ్ లాగే 50 పరుగుల వద్ద ఔటయ్యాడు. కాగా, హెడ్ వికెట్ కోల్పోయాక కాస్త నెమ్మదించిన ఆసీస్ స్కోర్.. 56 ఓవర్లు ముగిసే సమయానికి 172/4గా ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (78), కెమరూన్ గ్రీన్ (12) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 221 పరుగులు వెనుకపడి ఉంది. 14/0 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి సెషన్లోనే వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16) వికెట్లు కోల్పోయింది. స్టువర్ట్ బ్రాడ్‌కు 2, స్టోక్స్ ఓ వికెట్ (స్మిత్) పడగొట్టాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..? -
Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..?
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ (టెస్ట్‌ల్లో) బజ్ బాల్ అంటూ తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అప్రోచ్‌తో ఆ జట్టు చాలా మ్యాచ్‌ల్లో గెలుపొంది, భారీ సక్సెస్ సాధించింది. తాజాగా ఆ జట్టు యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లోనూ బజ్‌బాల్ ఫార్ములానే ఉపయోగించి, తొలి ఇన్నింగ్స్‌ను తొలి రోజే డిక్లేర్ చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయం ఇంగ్లండ్‌కు మరో విజయం సాధించి పెడుతుందో, లేక ఆ జట్టు కొంపముంచుతుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. లంచ్ విరామం సమయానికి (78/3) ఆట ఇంగ్లండ్ వైపే మొగ్గుచూపుతున్నప్పటికీ మరికొద్ది గంటలు గడిచే వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. లంచ్ తర్వాత ఆసీస్ గేర్ మార్చి వేగంగా పరుగులు సాధిస్తుండటంతో మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. 45 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి 148 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఉస్మాన్ ఖ్వాజా (66), ట్రవిస్ హెడ్ (50) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 245 పరుగులు వెనుకపడి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. రెండో రోజు ఆట తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, స్టోక్స్ చెలరేగి.. వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16) వికెట్లు పడగొట్టారు. చదవండి: Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్ -
Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఆసీస్ స్టార్ బ్యాటర్, ఇన్ ఫామ్ ఆటగాడు స్టీవ్ స్మిత్ భరతం పట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న స్మిత్ (16)ను స్టోక్స్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. స్టోక్స్ సంధించిన అద్భుతమైన ఇన్ స్వింగర్‌ను మిస్ అయిన స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. స్మిత్.. రివ్యూకి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎత్తు విషయంలో అనుమానం వ్యక్తం చేసినప్పటికీ.. రీప్లేలో బంతి వికెట్ల టాప్ ఎడ్జ్ తగులుతుందని తేలింది. దీంతో స్మిత్ వెనుదిరగక తప్పలేదు. Ben Stokes delivers a HUGE wicket - Steve Smith lbw for 16!#ENGvAUS | #Ashes pic.twitter.com/whxBbi3x8s — ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2023 స్టోక్స్ గర్జిస్తూ సంబరాలు చేసుకున్నాడు. స్టోక్స్ మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ బౌలింగ్‌కు దిగి కీలకమైన స్మిత్ వికెట్‌ను పడగొట్టాడు. 2019 యాషెస్ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో రెండు సెంచరీలు బాదిన స్మిత్.. ఈ మ్యాచ్‌లో కేవలం 16 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ గడ్డపై స్మిత్‌కు ఉన్న ట్రాక్ రికార్డు చూసి ఇంగ్లండ్ బౌలర్లు వణిపోయారు. అతను ఇక్కడ ఆడిన గత 9 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే స్మిత్ తన భీకర ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కొనసాగించలేకపోయాడు. స్టోక్స్ వ్యూహంలో చిక్కుకుని ఔటయ్యాడు. కాగా, స్మిత్ ఔటయ్యే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసి, కష్టాల్లో పడింది. తొలుత స్టువర్ట్ బ్రాడ్ వరుస బంతుల్లో వార్నర్, లబూషేన్‌ను పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి (392/8) సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిర్మించగా.. జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: నిప్పులు చెరుగుతున్న బ్రాడ్.. వరుస బంతుల్లో వార్నర్, లబూషేన్ ఔట్ -
జో రూట్ సెంచరీ.. ఎన్ని కొట్టినా కోహ్లిని అందుకోవడం కష్టమే..!
యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిన్న (జూన్ 16) మొదలైన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అజేయ సెంచరీ (152 బంతుల్లో 118 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించిన విషయం తెలిసిందే. ఈ సెంచరీ రూట్ టెస్ట్ కెరీర్లో 30వ సెంచరీ కాగా.. అన్ని ఫార్మాట్లలో ఇది అతనికి 46వ శతకం (వన్డేల్లో 16 శతకాలు కలుపుకుని). ఈ సెంచరీతో రూట్.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉండి అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో రెండవ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (అన్ని ఫార్మాట్లలో కలిపి 75 సెంచరీలు) అగ్రస్థానంలో ఉండగా.. రూట్ (46), డేవిడ్ వార్నర్ (45), రోహిత్ శర్మ (43), స్టీవ్ స్మిత్ (43), కేన్ విలియమ్సన్ (41), బాబర్ ఆజమ్ (30) వరుసగా 2 నుంచి 7 స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (100 శతకాలు) అగ్రస్థానంలో ఉండగా..రూట్ 11వ స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. చదవండి: ఇరగదీస్తున్న సామ్ కర్రన్.. ఈసారి బంతితో విజృంభణ -
ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి.. కట్‌చేస్తే సక్సెస్ఫుల్ అంపైర్‌గా
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తొలి టెస్టుకు పాకిస్తాన్ అంపైర్ అహ్సన్ రాజా ఫీల్డ్ అంపైర్‌గా పనిచేయడం ఆసక్తి కలిగించింది. ఎలైట్ ఐసీసీ అంపైర్‌గా అహ్సన్ రాజాకు తొలిసారి యాషెస్ టెస్టు సిరీస్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయం పాక్ అభిమానులను సంతోషపరిచింది. మరి అభిమానుల సంతోషం వెనుక కారణం ఏంటని అనుకుంటున్నారా.. 2009లో శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. బస్సులో స్టేడియానికి వెళ్తున్న లంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగింది. అదే బస్సులో అహ్సన్ రాజా కూడా ఉన్నాడు. పలువురు లంక క్రికెటర్లతో పాటు అహ్సన్ రాజా కూడా ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంలోకి బులెట్ దూసుకెళ్లడంతో బతకడం కష్టమన్నారు. కానీ అహ్సన్ రాజా బతకాలనే పట్టుదల అతన్ని కోలుకునేలా చేసింది. అంతేకాదు అంపైరింగ్ చేయాలన్న కోరికతో క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అహ్సన్ రాజా కోరిక మళ్లీ నెరవేరింది. అంపైరింగ్‌పై ఉన్న ఇష్టంతో అహ్సన్ రాజా క్రికెట్‌కు తొందరగానే రిటైర్మెంట్ ఇచ్చాడు. తన కెరీర్లో అహ్సన్రాజా 21 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, నాలుగు లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇక క్రికెట్లో తాను సక్సెస్ కాలేనని గ్రహించిన అహ్సన్ రాజా ఆటకు గుడ్‌బై చెప్పి అంపైరింగ్‌కు సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు. అలా 2006లో అంపైర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాడు. 2006లో ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ద్వారా అహ్సన్ రాజా అంపైరింగ్ చేవాడు. ఆ తర్వాత 2009లో పీసీబీ కాంట్రాక్ట్ దక్కించుకున్న అహ్సన్ రాజా అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2018లో అండర్-19 వరల్డ్‌కప్, ఆ తర్వాత మహిళల టి20 వరల్డ్‌కప్, 2019 ఐసీసీ టి20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్, 2020 ఐసీసీ మహిళల టి20 వరల్డ్‌కప్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇక 2021లో పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ నిర్వహించాడు. అలా కేవలం నాలుగేళ్లలోనే అత్యంత విజయవంతమైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్న అహ్సన్ రాజా ఐసీసీ ఎలైట్ అంపైర్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. కట్‌చేస్తే.. ఇవాళ ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తిస్తూ టాప్ అంపైర్‌గా పేరు తెచ్చుకున్నాడు. What an inspiring journey from Ahsan Raza. Was one of the victims of SL team attack back in 2009 and there were even rumors that he had expired but he fought through it and made his way to the top from bottom. From umpiring in Bermuda vs Namibia to umpiring in Ashes. pic.twitter.com/WiNjv2slxW — yang goi (@GongR1ght) June 16, 2023 so good to see ahsan raza umpiring in an ashes opener. icc have had always respect for aleem dar & after his retirement, they have passed in it onto ahsan raza. pic.twitter.com/W7PfSR7ppu — Kamran (@kamran_069) June 16, 2023 చదవండి: రెండేళ్ల వ్యవధిలో తొమ్మిది శతకాలు.. కొత్తగా కనిపిస్తున్నాడు -
రెండేళ్ల వ్యవధిలో తొమ్మిది శతకాలు.. కొత్తగా కనిపిస్తున్నాడు
టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు పొందిన జో రూట్ కొత్తగా కనిపిస్తున్నాడు. బజ్‌బాల్ ఆటతీరుతో ఇంగ్లండ్ దూకుడు కనబరుస్తుంటే.. రూట్ కూడా తన మార్క్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. టెస్టు క్రికెట్‌కు కొత్త అర్థం చెబుతున్న రూట్ సెంచరీల మీద సెంచరీలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా యాషెస్‌లో తొలి టెస్టులోనే రూట్ సెంచరీతో మెరిశాడు. 152 బంతుల్లో 118 పరుగులు నాటౌట్‌గా నిలిచిన రూట్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రూట్ టెస్టు కెరీర్లో ఇది 30వ శతకం కావడం విశేషం .టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా(Australia) మాజీ కెప్టెన్,ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్లలో ఒకరైన సర్ డాన్ బ్రాడ్‌మన్‌ను రూట్ అధిగమించాడు. ప్రస్తుతం రూట్ చందర్‌పాల్, మాథ్యూ హెడెన్‌లతో కలిసి 30 సెంచరీలతో సంయుక్తంగా కొనసాగుతున్నాడు. ఇక 2021 నుంచి చూసుకుంటే రూట్ ఆటతీరు ఎంత వేగంగా ఉందో అర్థమవుతుంది. 2021 నుంచి 62 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్ 58.91 సగటుతో 3299 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉంటే.. 13 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 2022 నుంచి ఇప్పటివరకు ఏడు శతకాలు బాదిన రూట్ 2వేల పరుగులు సాధించాడు. ఈ దశాబ్దంలో టెస్టుల్లో రూట్ మినహా మరే ఇతర బ్యాటర్ ఇంత వేగంగా పరుగులు చేసిన దాఖలాలు లేవు. Classic #Bazball😳 England declare on 393/8 #JoeRoot #Ashes2023 #ENGvsAUS #AUSvENG#Ashes23 #Cricket #testcricket#England #Cricketpic.twitter.com/qwo0iFfSa2 — Cricopia.com (@cric_opia) June 16, 2023 చదవండి: #Bazball: మంత్రం పనిచేస్తుందా? విఫలమవుతుందా? -
#Bazball: మంత్రం పనిచేస్తుందా? విఫలమవుతుందా?
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అందరిని ఆశ్చర్యపరించింది. కొన్నాళ్లుగా బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ ఆసీస్‌తో టెస్టులోనూ అదే ఆటతీరు చూపించింది. ఇటీవలే డబ్ల్యూటీసీ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ముందు కనీసం 400 పరుగులైనా ఉంచాల్సిందని అభిమానులు ఆభిప్రాయపడుతున్నారు. బజ్‌బాల్ క్రికెట్‌తో ఇంగ్లండ్‌కు అనూకూల ఫలితాలు వస్తున్నప్పటికి ప్రతీసారి ఆ మంత్రం పనిచేయకపోవచ్చు. ఒకవేళ ఆస్ట్రేలియా ఇంగ్లీష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని రెండురోజుల పాటు బ్యాటింగ్ చేస్తే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. అలా గాకుండా బెన్ స్టోక్స్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు చెలరేగి ఆసీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే మాత్రం ఇంగ్లండ్‌కు ఎదురుండదు. మరొక అంశమేమిటంటే ఇంగ్లండ్ తన దూకుడుతో మ్యాచ్‌ను మూడు రోజుల్లో ముగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే అవతల ఉన్నది పటిష్టమైన ఆస్ట్రేలియా. స్మిత్, లబుషేన్, ట్రెవిస్ హెడ్లతో పాటు ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ క్యారీ లాంటి ఉద్దండులైన బ్యాటర్లు ఉన్నారు. వీరందరిని ఔట్ చేయడం అంత సామాన్య విషయం కాదు. కానీ ఇంగ్లండ్ బజ్‌బాల్ మంత్రం పనిచేస్తే మాత్రం వారి విజయం ఆపడం ఎవరి తరం కాదు. చదవండి: క్రికెట్ చరిత్రలో ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్.. వీడియో వైరల్ -
బజ్‌బాల్ దూకుడు; రూట్ సెంచరీ.. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్
బర్మింగ్హమ్: టెస్టు క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇంగ్లండ్ జట్టు మరో కొత్త సాహసాన్ని ప్రదర్శించింది. ‘బాజ్‌బాల్’ అంటూ దూకుడైన ఆటను ప్రదర్శిస్తూ వచి్చన ఆ జట్టు యాషెస్ సిరీస్‌లోనూ తమ శైలిని చూపించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్, టాప్ బ్యాటర్ ఒకరు అజేయ సెంచరీతో ఇంకా క్రీజ్‌లోనే ఉన్నా మొదటి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపర్చింది. ఆ్రస్టేలియాతో శుక్రవారం ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 393 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (152 బంతుల్లో 118 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో 30వ సెంచరీతో చెలరేగాడు. జానీ బెయిర్‌స్టో (78 బంతుల్లో 78; 5 ఫోర్లు), జాక్ క్రాలీ (73 బంతుల్లో 61; 7 ఫోర్లు) కీలక అర్ధ సెంచరీలు సాధించారు. ‘యాషెస్’లో రూట్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా... 2015 తర్వాత మొదటిది. రూట్, బెయిర్‌స్టో ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. 78 ఓవర్లే ఆడిన ఇంగ్లండ్ ఓవర్‌కు 5.03 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. ఆసీస్ బౌలర్లలో లయన్‌కు 4 వికెట్లు దక్కాయి. అయితే ఇంగ్లండ్ ఆశించినట్లుగా వికెట్ మాత్రం దక్కలేదు. 4 ఓవర్లే ఆడిన ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 14 పరుగులు చేసింది. ఇంగ్లండ్ డిక్లరేషన్ ఎత్తుగడ ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ఇప్పుడే చెప్పలేకపోయినా... ఆస్ట్రేలియా పట్టుదలగా రెండు రోజులు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధిస్తే మాత్రం ఇంగ్లండ్‌కు ఇబ్బందులు తప్పవు. చదవండి: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
విచిత్రకర రీతిలో ఔటైన హ్యరీ బ్రూక్.. అస్సలు ఊహించుండడు! వీడియో వైరల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను దూరదృష్టం వెంటాండింది. తొలి ఇన్నింగ్స్‌లో విచిత్రకర రీతిలో హ్యారీ బ్రూక్ ఔటయ్యాడు. 35 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఏం జరిగిందంటే? ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ మంచి టచ్‌లో కన్పించాడు. వరుసగా ఫోర్లు బాది ఆసీస్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో బ్రూక్‌ను అపేందుకు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ను బౌలింగ్ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో 38 ఇన్నింగ్స్ ఓవర్లో నాథన్ లియాన్ వేసిన ఆఫ్-బ్రేక్ డెలివరీని.. బ్రూక్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి థైపాడ్కు తాకి కొంచెం గాల్లోకి లేచింది. బంతి ఎటువైపు తెలియక బ్యాటర్ తికమకపడ్డాడు. అయితే చాలా సేపు గాల్లో ఉన్న బంతి కింద పడి బ్రూక్ వెనుక కాలికి తగిలి స్టంప్స్‌ను గిరాటేసింది. ఏం జరిగిందో తెలియక నిరాశతో బ్రూక్ పెవిలియన్‌కు చేరాడు. చదవండి: Ashes 2023: తొలి బంతికే ఫోర్ కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్.. కెప్టెన్ స్టోక్స్ రియాక్షన్ వైరల్ A freak dismissal. Live clips/Scorecard: https://t.co/TZMO0eJDwY pic.twitter.com/cIUQaANJ2x — England Cricket (@englandcricket) June 16, 2023 -
తొలి బంతికే ఫోర్ కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్.. కెప్టెన్ స్టోక్స్ రియాక్షన్ వైరల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయం తగ్గట్టుగానే ఇంగ్లీష్ బ్యాటర్లు ఆడుతున్నారు. ప్రస్తుతం టెస్టు క్రికెట్లో 'బాజ్‌బాల్'ను విధానాన్ని అవలంబిస్తున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. వన్డే తరహాలో ఇంగ్లండ్ ఆడుతోంది. ప్రస్తుతం క్రీజులో జోరూట్(38), జానీ బెయిర్‌స్టో(2) పరుగులతో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ జాక్ క్రాలీ(61) పరుగులతో రాణించాడు. తొలి బంతికే ఫోర్ కాగా ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌ను ఫోర్‌తో ప్రారంభించింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వేసిన మొదటి ఓవర్లో తొలి బంతిని ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే బౌండరీకి తరలించాడు. ఆఫ్‌సైడ్ వేసిన బంతిని సెకన్ల వ్యవధిలో క్రాలీ బౌండరీగా మలిచాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. క్రాలీ కొట్టిన షాట్‌ను చూసి వావ్ అని షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సిరీస్‌లో కామెంటేర్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.. బెన్ స్టోక్స్ రియాక్షన్‌పై స్పందించాడు. జాక్ క్రాలీ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విధానం.. స్టోక్స్ ఒక్కడికే కాకుండా అందరిని ఆచ్చర్యపరిచింది. ఆసీస్ మాత్రం నిరాశలో ఉంటుందని కార్తీక్ ట్విట్ చేశాడు. చదవండి: ఆసీస్‌తో సిరీస్ నా చివరిదని భార్యకు చెప్పా.. చాలా కష్టంగా ఉండేది: అశ్విన్ 😅 We were all Stokesy there... Live clips/Scorecard: https://t.co/TZMO0eJDwY pic.twitter.com/rUEOIO7onJ — England Cricket (@englandcricket) June 16, 2023 Stokes reaction will be all of us if England keep batting the way Zak Crawley has started Aussies have started with a deep point 😯#ENGvAUS#Ashes2023 #CricketTwitter pic.twitter.com/dvz7sLI4mo — DK (@DineshKarthik) June 16, 2023 -
యాషెస్ తొలి టెస్టు ప్రారంభం..తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
క్రికెట్లో భారత్-పాకిస్తాన్ తర్వాత అత్యుత్తమ సమరంగా భావించే యాషెస్ సిరీస్ శుక్రవారం(జూలై16) ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక సిరీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదటి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌తో ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ రీ ఎంట్రీ ఇచ్చాడు. గతంలో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అలీ.. యాషెస్ సిరీస్‌కు ముందు తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. దీంతో గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన స్పిన్నర్ జాక్ లీచ్ స్ధానంలో అలీకి చోటు దక్కింది. ఇక తొలి టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ మిచిల్ స్టార్క్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పేసర్ హాజిల్‌వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు: ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్ ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), మోయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్ -
యాషెస్ సమరం.. పరుగుల వరద పారించిన టాప్-10 బ్యాటర్లు
మరికొద్ది గంటల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సమరానికి తెరలేవనుంది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ(జూన్ 16న) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. యాషెస్ ట్రోపీ ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద ఉండగా.. 2015 తర్వాత మళ్లీ యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్‌ను దెబ్బతీయాలని కంకణం కట్టుకుంది. బజ్‌బాల్‌తో దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌ను.. ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రతిష్టాత్మక సిరీస్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు వికెట్లతో బౌలర్లు చెలరేగితే.. మరోపక్క బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకోవాలని చూస్తుంటారు. ఆసీస్ త్రయం స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రెవిస్ హెడ్ సూపర్‌ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. వీరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ చరిత్రలో పరుగుల వరద పారించి టాప్-10 క్రికెటర్లను ఇప్పుడు చూద్దాం. డాన్ బ్రాడ్‌మన్: ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ యాషెస్ సిరీస్‌లో లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్‌లో 37 టెస్టులాడిన బ్రాడ్‌మన్ 5028 పరుగులు సాధించాడు. ఈ దిగ్గజం చేసిన 10వేల పరుగుల్లో సగం పరుగులు యాషెస్ సిరీస్‌లోనే వచ్చాయంటే బ్రాడ్‌మన్ ఎంత కసితో ఆడాడో అర్థమవుతుంది. 90 సగటుతో బ్యాటింగ్ చేసిన బ్రాడ్‌మన్ 1930లో జరిగిన సిరీస్‌లో ఏకంగా 974 పరుగులు సాధించాడు. ఇప్పటికి ఇదే అత్యధికంగా ఉంది. జాక్ హబ్స్: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన జాక్ హబ్స్ యాషెస్‌లో 41 టెస్టులాడి 3636 పరుగులు సాధించాడు. 12 సెంచరీలు బాదిన జాన్ హబ్స్ బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అలెన్ బోర్డర్: ఇంగ్లండ్ దిగ్గజ కెప్టెన్ అలెన్ బోర్డర్‌కు కూడా యాషెస్ సిరీస్‌లో మంచి రికార్డు ఉంది. 28 టెస్టులు ఆడిన అలెన్ బోర్డర్ 55.55 సగటుతో 3222 పరుగులు చేశాడు. స్టీవ్ వా: ఆసీస్ దిగ్గజ కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు కూడా యాషెస్‌లో మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేసిన స్టీవ్ వా 3143 పరుగులు సాధించాడు. ఆసీస్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు యాషెస్‌లో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా రెండుసార్లు యాషెస్ ట్రోపీని నెగ్గడంతో పాటు అతని కెప్టెన్సీలో యాషెస్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయాలు అందుకోవడం విశేషం. స్టీవ్ స్మిత్: ప్రస్తుతం బ్రాడ్‌మన్ రికార్డును అందుకోగల సత్తా కేవలం స్టీవ్ స్మిత్‌కు మాత్రమే ఉంది. ఈ శకంలో బెస్ట్ టెస్టు క్రికెటర్‌గా పేరు పొందిన స్మిత్ యాషెస్‌లో 32 టెస్టుల్లో 3044 పరుగులు బాదాడు. తాజాగా జరగనున్న సిరీస్‌లో స్టీవ్‌స్మిత్ కీలకం కానున్నాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లకు తలనొప్పిగా తయారయ్యాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఔట్ చేయడం మహా కష్టం. డేవిడ్ గోవర్ ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ గోవర్ యాషెస్‌లో 38 టెస్టులాడి 3037 పరుగులు చేశాడు. వాలీ హామండ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వాలీ హామండ్ 33 టెస్టుల్లోనే 3852 పరగులు సాధించాడు. హెర్బర్ట్ సట్‌క్లిఫ్ ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 27 టెస్టుల్లోనే 2741 పరుగులు సాధించాడు. క్లిమెంట్ హిల్: ఆస్ట్రేలియా క్రికెటర్ క్లిమెంట్ హిల్ 41 టెస్టుల్లో 2660 పరుగులు సాధించాడు. జాన్ హెడ్రిచ్: ఇంగ్లండ్‌కు చెందిన జాన్ హెడ్రిచ్ యాషెస్‌లో 32 మ్యాచ్‌లాడి 2644 పరుగులు సాధించాడు. చదవండి: ట్రోల్స్ పట్టించుకోలేదు.. హాలిడే మూడ్‌లో రోహిత్ శర్మ 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
Ashes Series 2023: స్టీవ్ స్మిత్‌ను చూసి వణికిపోతున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు..!
యాషెస్ సిరీస్ 2023 ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లకు స్టీవ్ స్మిత్ భయం పట్టుకుంది. పైకి బజ్‌బాల్ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. లోలోపల వారు వణకిపోతున్నారు. ఇంతకీ వారి భయానికి కారణం ఏంటంటే.. ఇంగ్లండ్‌లో స్టీవ్‌కు ఉన్న అరివీర భయంకరమైన ట్రాక్ రికార్డు. మరి ముఖ్యంగా గడిచిన 9 ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్‌లో స్మిత్ చేసిన పరుగులు. ఇంగ్లండ్ గడ్డపై స్మిత్ గడిచిన 9 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేసి రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నాడు. ఓవల్‌లో ఇటీవలి ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ (121, 34) చేసిన స్మిత్.. దీనికి ముందు 2019 యాషెస్ 5వ టెస్ట్‌లో 80, 24 పరుగులు.. అదే సిరీస్ నాలుగో టెస్ట్‌లో 211, 82 పరుగులు.. రెండో టెస్ట్‌లో 92.. తొలి టెస్ట్‌లో 144, 142 పరుగులు చేసి ఇంగ్లండ్ గడ్డపై తిరుగులేని రికార్డును కలిగి ఉన్నాడు. ఈ ఫామే ప్రస్తుతం ఇంగ్లండ్ ఆటగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. స్మిత్‌కు కట్టడి చేసేందుకు వారు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నప్పటికీ, అవి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి. స్మిత్ ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకున్నాడా.. అతన్ని ఔట్ చేయడం ఇంగ్లండ్ బౌలర్లకు కత్తి మీద సామే అవుతుంది. కాగా, 5 మ్యాచ్‌ల యాషెస్ 2023 సిరీస్ రేపటి (జూన్ 16) నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా, రెండోది లార్డ్స్‌లో, మూడో మ్యాచ్ హెడింగ్లేలో, నాలుగోది ఓల్డ్ ట్రాఫర్డ్‌లో, ఐదో టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతుంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి యాషెస్ సిరీస్‌లో (5 మ్యాచ్‌లు) ఆస్ట్రేలియా 4-0 తేడాతో గెలుపొందింది. యాషెస్ 2023 షెడ్యూల్.. తొలి టెస్ట్: జూన్ 16-20 రెండో టెస్ట్: జూన్ 28-జులై 2 మూడో టెస్ట్: జులై 6-10 నాలుగో టెస్ట్: జులై 19-23 ఐదో టెస్ట్: జులై 27-31 తొలి టెస్టుకు తుది జట్లు(అంచనా).. ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, ఓలీ పోప్ (వికెట్ కీపర్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్ ఆసీస్: ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, బోలాండ్, నాథన్ లైయన్ -జాన్‌పాల్, సాక్షివెబ్‌డెస్క్ -
సరికొత్త వార్నర్‌ను చూస్తాం.. అతడికి చుక్కలు చూపిస్తాడు: ఆసీస్ కెప్టెన్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరిమిత ఓవర్ల క్రికెట్లో పర్వాలేదనపిస్తున్నప్పటికీ.. టెస్టు క్రికెట్లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. అతడు తన చివరి 17 ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. లండన్ వేదికగా భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా డేవిడ్ భాయ్ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఇక ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న వార్నర్‌కు యాషెస్ రూపంలో మరో గట్టి సవాలు ఎదురుకానుంది. జూన్ 16 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 16 నుంచి జూన్ 20 వరకు జరగనుంది. ఇక సిరీస్ ప్రారంభానికి ముందు వార్నర్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మద్దతుగా నిలిచాడు. ఈ చారిత్రాత్మక సిరీస్‌లో సరికొత్త డేవిడ్ వార్నర్‌ను చూస్తామని కమ్మిన్స్ థీమా వ్యక్తం చేశాడు. అయితే వార్నర్‌ను మరో సమస్య కూడా వెంటాడుతోంది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు డేవిడ్ వార్నర్‌పై మంచి రికార్డు ఉంది. 2019 యాషెస్ సిరీస్‌లో వార్నర్‌ను బ్రాడ్ ఏకంగా 7 సార్లు ఔట్ చేశాడు. ఈ సారి వార్నర్ బ్రాడ్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరి. ఈ నేపథ్యంలో కమ్మిన్స్ మాట్లాడుతూ.. "డేవిడ్ కచ్చితంగా బ్రాడ్ గురించి కచ్చితంగా ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే గత నాలుగేళ్లుగా అతడి చేతిలోనే తన వికెట్‌ను కోల్పోతున్నాడు. బ్రాడ్‌కు వ్యతేరేకంగా ఆడేందుకు వార్నర్‌కు ఇప్పుడు మరో అవకాశం దొరికింది. అయితే ఇప్పటివరకు ఒకరకమైన వార్నర్‌ను చూశాం.. కానీ ఈ సారి మాత్రం సరికొత్త డేవీని చూస్తాం. బ్రాడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటాడు" అని పేర్కొన్నాడు. తొలి టెస్టుకు తుది జట్లు(అంచనా) ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, ఓలీ పోప్ (వికెట్ కీపర్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్ ఆసీస్: ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, బోలాండ్, నాథన్ లయాన్ -
యాషెస్ సిరీస్‌లో అత్యుత్తమ రికార్డులు ఇవే..!
141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్‌లో రికార్డులకు కొదవ లేదు. అంతర్జాతీయ క్రికెట్లో నెలకొల్పబడిన రికార్డులన్నీ దాదాపుగా యాషెస్‌లో సాధించినవే ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్‌కీపింగ్.. ఏ విభాగంలో చూసినా టాప్ రికార్డులన్నీ యాషెస్ సిరీస్‌కే దక్కుతాయి.340 టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ చరిత్రలో అత్యుత్తమ రికార్డులపై ఓ లుక్కేద్దాం. అత్యధిక స్కోర్ (టీమ్ టోటల్): 903/7 (ఇంగ్లండ్, 1938) అత్యల్ప స్కోర్: 36 (ఆస్ట్రేలియా, 1902) అత్యధిక పరుగులు: డాన్ బ్రాడ్‌మన్ (5028 పరుగులు, ఆస్ట్రేలియా) అత్యధిక వ్యక్తిగత స్కోర్: లెన్ హటన్ (364, ఇంగ్లండ్) అత్యధిక సెంచరీలు: డాన్ బ్రాడ్‌మన్ (19, ఆస్ట్రేలియా) అత్యధిక హాఫ్ సెంచరీలు: డాన్ బ్రాడ్‌మన్ (31, ఆస్ట్రేలియా) అత్యధిక డకౌట్లు: ఎస్ గ్రెగరీ (11, ఆస్ట్రేలియా) అత్యధిక సిక్సర్లు: బెన్ స్టోక్స్, కెవిన్ పీటర్సన్ (24, ఇంగ్లండ్) అత్యధిక వికెట్లు: షేన్ వార్న్ (36 మ్యాచ్‌ల్లో 195 వికెట్లు) అత్యుత్తమ గణాంకాలు (ఇన్నింగ్స్‌లో): జిమ్ లేకర్ (10/53) అత్యుత్తమ గణాంకాలు (మ్యాచ్‌లో): జిమ్ లేకర్ (19/90) అత్యధిక ఫైఫర్లు (ఇన్నింగ్స్‌లో): ఎస్ బర్న్స్ (12) అత్యధిక సార్లు 10 వికెట్ల ఘనత (మ్యాచ్‌లో): షేన్ వార్న్ (4) అత్యధిక క్యాచ్‌లు (వికెట్‌కీపర్‌గా): ఇయాన్ హీలీ (33 మ్యాచ్‌ల్లో 135 డిస్మిసల్స్) అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్‌గా): ఇయాన్ బోథమ్ (32 మ్యాచ్‌ల్లో 54 క్యాచ్‌లు) -
141 ఏళ్ల యాషెస్ సిరీస్ ప్రస్థానం.. ఎవరిది ఆధిపత్యం, ఏ సిరీస్ అత్యుత్తమం..?
క్రికెట్లో భారత్-పాకిస్తాన్ల మధ్య సమరం తర్వాత, ఆ స్థాయి ఉత్కంఠతతో సాగే మ్యాచ్‌లు ఏవైనా ఉంటాయా అంటే, అవి ఇంగ్లండ్-ఆసీస్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లే అని చెప్పాలి. ఫార్మాట్ ఏదైనా ఇంగ్లండ్-ఆసీస్ మ్యాచ్‌లు.. భారత్-పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లతో సమానంగా ఆసక్తిని రేకెత్తిస్తాయి. దాయాదుల సమరంలో ఏరకంగా అయితే భావోద్వేగాలు ముడిపడి ఉంటాయో.. ఇంచుమించు అదే స్థాయిలో ఇంగ్లండ్-ఆసీస్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ల్లోనూ ఎమోషన్స్ నెలకొని ఉంటాయి. ఇంగ్లండ్-ఆసీస్ మ్యాచ్‌లకు దాయాదుల సమరానికి దక్కిన ఆదరణ దక్కడానికి ప్రధాన కారణం యాషెస్ సిరీస్. ఇంగ్లండ్-ఆసీస్‌ల మధ్య 141 కిందట మొదలైన ఈ ఆధిపత్య పోరులో ఇప్పటివరకు మొత్తం 72 సిరీస్‌లు జరగ్గా ఆస్ట్రేలియా 34 సార్లు, ఇంగ్లండ్ 32 సందర్భాల్లో యాషెస్ ట్రోఫీని సొంతం చేసుకున్నాయి. 6 సందర్భాల్లో సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. మ్యాచ్‌ల ప్రకారం చూస్తే.. యాషెస్‌లో మొత్తం 340 మ్యాచ్‌లు జరగ్గా ఆస్ట్రేలియా 140, ఇంగ్లండ్ 108 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. 92 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. సిరీస్ ప్రారంభమైన కొత్తలో 8 వరుస సిరీస్‌లను ఇంటా బయటా అన్న తేడాతో లేకుండా ఇంగ్లండ్ సొంతం చేసుకోగా.. 1891/92 సీజన్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. స్వదేశంలో జరిగిన ఈ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఆతర్వాత మళ్లీ ఇంగ్లండ్ హ్యాట్రిక్ సిరీస్ విజయాలు సాధించగా.. అనంతరం ఆసీస్ వరుసగా నాలుగు సిరీస్‌ల్లో విజయాలు సాధించి, ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని తగ్గించింది. 1902 తర్వాత యాషెస్ సిరీస్ సాగే తీరులో మార్పు వచ్చింది. ఇంగ్లండ్ ఆధిపత్యానికి ఆసీస్ ఆటగాళ్లు గండికొట్టడం మొదలుపెట్టారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ చాలా మెరుగయ్యింది. తదనంతరం డాన్ బ్రాడ్‌మన్ శకం (1928-48) మొదలు కావడంతో సీన్ రివర్సై ఇంగ్లండ్‌పై ఆసీస్ ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టింది. మధ్యమధ్యలో ఇంగ్లండ్ అడపాదడపా విజయాలు సాధించినప్పటికీ, ఆసీస్‌దే పైచేయిగా నిలిచింది. ఆసీస్ క్రికెట్లో స్వర్ణయుగంగా చెప్పుకునే 1989-2003 మధ్యకాలంలో ఆసీస్ ఏకచత్రాధిపత్యం కొనసాగించింది. ఈ మధ్యకాలంలో జరిగిన 8 సిరీస్‌ల్లో ఆసీసే విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన 2005 సిరీస్.. యాషెస్ చరిత్రలోనే అత్యుత్తమమై సిరీస్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను మైఖేల్ వాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక చివరిగా 2021/22లో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0 తేడాతో గెలుచుకుని యాషెస్ ట్రోఫీని కైవసం చేసుకుంది. యాషెస్ 2023 షెడ్యూల్.. తొలి టెస్ట్: జూన్ 16-20 రెండో టెస్ట్: జూన్ 28-జులై 2 మూడో టెస్ట్: జులై 6-10 నాలుగో టెస్ట్: జులై 19-23 ఐదో టెస్ట్: జులై 27-31 -
యాషెస్ సిరీస్‌కు సర్వం సిద్దం.. ఇరు జట్ల బలాబలాలు ఇలా..!
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో కీలక పోరు సిద్దమైంది. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ వేదికగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 జూన్ 16నుంచి ప్రారంభం కానుంది. ఈ చారిత్రత్మాక సిరీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. దాదాపు 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ ట్రోఫీని సొంతం చేసుకునేందుకు ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. అదే జోరును యాషెస్‌లో కూడా కొనసాగించి ట్రోఫీని మరోసారి ముద్దాడాలని భావిస్తోంది. 'బాజ్‌బాల్ క్రికెట్' మరోవైపు టెస్టు క్రికెట్‌ను కూడా టీ20లా ఆడుతున్న ఇంగ్లండ్.. అదే దూకుడును ఆస్ట్రేలియాపై కూడా ప్రదర్శించాలని యోచిస్తోంది. ఇరు జట్లు మధ్య జరిగిన గత 13 మ్యాచ్‌ల్లో 11 సార్లు ఆసీస్‌పై ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ఈసారి కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని స్టోక్స్ సేన భావిస్తోంది. ఇక సంప్రాదయ టెస్టు క్రికెట్లో దూకుడుగా ఆడేందుకు కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రాండెన్ మెకల్లమ్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు 'బాజ్‌బాల్' విధానాన్ని అవలంబిస్తోంది. ఇటీవలే ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో కూడా ఇంగ్లండ్ ఈ తరహా దూకుడునే ప్రదర్శించి.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఇరు జట్ల బలాబాలాలుపై ఓ లూక్కేద్దం. ఇంగ్లండ్ విషయానికి వస్తే.. బెన్‌స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే ఓపెనర్ జాక్ క్రాలే ఫామ్ మాత్రం ఇంగ్లండ్ జట్టు మెన్జ్మెంట్ను కాస్త కలవరపెడుతోంది. క్రాలీకి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నప్పటికీ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇది ఒక్కటి మినహా ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లో మరి ఎటువంటి సమస్యలేదు. బెన్ డాకెట్, ఓలీ పోప్,జోరూట్, హ్యరీ బ్రూక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి యాషెస్ సిరీస్‌లో పరుగులు వరద పారడం ఖాయం. ఇక బౌలింగ్ విభాగంలో స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, క్రిస్ వోక్స్ వంటి సీనియర్ బౌలర్లు ఉన్నారు. వీరు బంతితో రాణిస్తే ఆసీస్ బ్యాటర్లకు కచ్చితంగా చుక్కలు కన్పిస్తాయి. ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. ఇటీవల టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కమ్మిన్స్ సేన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అయితే ఒక్క సమస్య మాత్రం ఆసీస్ జట్టును వెంటాడుతోంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేలవ ఫామ్ మాత్రం జట్టు మెనెజ్‌మెంట్‌ను తీవ్ర ఆందోళను కలిగిస్తోంది. అదే విధంగా మరోఓపెనర్ ఉస్మాన్ ఖావాజా కూడా డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమయ్యాడు. యాషెస్ సిరీస్‌లో ఉస్మాన్ ఫామ్‌లోకి రావడం ఆస్ట్రేలియాకు ఎంతో అవసరం. మరోవైపు స్టీవ్ స్మిత్, ట్రావెస్ హెడ్ అద్బుతమైన ఫామ్‌లో ఉండడం కంగరూ జట్టుకు కలిసిచ్చే ఆంశం. ఇక బౌలింగ్‌లో అయితే కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, మిచిల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, నాథన్ లయాన్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు. ఆసీస్‌దే పైచేయి ఇప్పటి వరకూ యాషెస్ చరిత్రలో మొత్తం 330 యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 134 టెస్టులు, ఇంగ్లండ్ 106 టెస్టులు గెలవగా.. 90 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. తొలి టెస్టుకు తుది జట్లు(అంచనా) ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, ఓలీ పోప్ (వికెట్ కీపర్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్ ఆసీస్: ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, బోలాండ్, నాథన్ లైయన్ చదవండి: MajorLeagueCricket: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా పొలార్డ్ -
'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్' పదం ఎలా వచ్చిందంటే?
క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. దాయాదులు తలపడుతున్నాయంటే రెండు దేశాల్లోని క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. టీఆర్పీ రేటింగ్‌లు కూడా బద్దలవుతుంటాయి. అచ్చం అలాంటి పోరు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య కూడా ఉంటుంది. అది కూడా సంప్రదాయ టెస్టు క్రికెట్లో. టి20 క్రికెట్ లాంటి వేగవంతమైన ఆట వచ్చాకా కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ టెస్టు సిరీస్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. దాదాపు 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్‌ను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. కేవలం ఒక ట్రోపీలో ఉన్న బూడిద కోసం కొదమసింహాల్లా తలపడే రెండు జట్ల పోరు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రెండేళ్లకు ఒకసారి జరిగే యాషెస్ సిరీస్ మళ్లీ వచ్చేసింది. జూన్ 16 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ జరగనుంది. యాషెస్ సిరీస్‌కు ఈసారి ఇంగ్లండ్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో అసలు యాషెస్ అనే పేరు ఎలా వచ్చింది.. ఈ సిరీస్ ఎందుకు ఇరుదేశాలకు ప్రతిష్టాత్మకం అనేది మరోసారి తెలుసుకుందాం. -సాక్షి, వెబ్‌డెస్క్ 1882లో మొదలైన గొడవ.. 1882లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తొలిసారి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడాయి. ఆ ఏడాది ఇంగ్లండ్‌కు టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది. అప్పటివరకు 22 టెస్టుల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే ఓడిపోయింది. దీంతో సిరీస్‌లో ఫెవరెట్‌గా కనిపించిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఆ సిరీస్‌లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆసీస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ విజయానికి కేవలం 85 పరుగులు మాత్రమే కావాలి. అప్పటికి ఇంగ్లండ్ టీం స్కోరు రెండు వికెట్లకు 51 పరుగులు. క్రికెట్ అంటేనే అన్ ప్రిడిక్టబుల్ కాబట్టి.. అనూహ్యంగా ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాకు ఇది తొలి విజయం. ఆగస్టు 29 న ఇంగ్లండ్ ఓడిపోయింది. ఈ ఓటమి ఇంగ్లండ్ మీడియాను తాకింది. ఇంగ్లండ్‌లోని ప్రతీ వార్తాపత్రిక ఇంగ్లండ్ టీంను దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు వందల్లో వెలువడ్డాయి ఈ ఓటమి తరువాత, స్పోర్టింగ్ టైమ్స్ అనే పత్రిక ఇంగ్లీష్ క్రికెట్ కోసం ఒక సంతాప సందేశాన్ని ప్రచురించింది. “ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది. 29 ఆగస్టు 1882, ఓవల్‌లో ఇంగ్లండ్ టీం అంత్యక్రియల తర్వాత వచ్చిన బూడిదను (యాషెస్) ఆస్ట్రేలియా తీసుకెళ్లింది.. ” అంటూ రాసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని వారాలకే హాన్ ఐవో బ్లిగ్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరింది. ఈ సందర్భంగా బ్లిగ్ మాట్లాడుతూ... యాషెస్‌ను తిరిగి తీసుకొస్తానని శపథం చేశాడు. స్థానిక మీడియా ‘యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ’ మళ్లీ వందల సంఖ్యలో వార్తలు ప్రచురించాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ విల్ మర్దోక్ కూడా ఇలాంటి ప్రకటనే చేశాడు. యాషెస్‌ను ఇంగ్లండ్ పట్టుకెళ్లకుండా అడ్డుకుంటామని పేర్కొన్నాడు. కలశంలో బూడిద.. అయితే ఇంగ్లండ్ ఓటమిని దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు రాసిన వార్తా పత్రికలను ఒక మహిళా బృందం తగలబెట్టింది. దానికి సంబంధించిన బూడిదను కలశం లాంటి పాత్రలో పెట్టి అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ బ్లైగ్కు అందించారు. కాగా ఆ కలశంలో నిజమైన యాషెస్ ఇప్పటికీ ఉపయోగించిన ఒక జత స్టంప్ బెయిల్ల్ను లండన్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి కాగా పెళుసుగా ఉండే అసలైన దానిని లార్డ్స్‌లోని క్రికెట్ మ్యూజియంలో చూడొచ్చు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య టెస్టు సిరీస్‌కు యాషెస్ అని పేరు పెట్టారు. కాగా సిరీస్ గెలుపొందిన జట్లకు కలశం ప్రతిరూపాన్ని అందజేస్తారు.ఆ తర్వాత ఈ సిరీస్ కోసం కలశం రూపంలోనే ప్రత్యేక ట్రోఫీని తయారు చేశారు. దీనిలో మొప్పలను కాల్చిన తర్వాత బూడిదను ఉంచుతారు. ఈ ట్రోఫీని యూఆర్ఎన్ అని కూడా పిలుస్తారు, ఇది బూడిద కలిగిన పాత్ర. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మొదట్లో ఇంగ్లండ్.. ఇప్పుడు ఆసీస్‌దే ఆధిపత్యం ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య 72 యాషెస్ సిరీస్‌లు జరిగితే.. అందులో ఆస్ట్రేలియా 3 సార్లు, ఇంగ్లండ్ 32 సార్లు విజయాలు అందుకోగా.. ఆరు సిరీస్‌లు మాత్రం డ్రాగా ముగిశాయి. ఇక 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్‌లో 356 మ్యాచ్‌లు జరగ్గా ఆస్ట్రేలియా 150.. ఇంగ్లండ్ 110 మ్యాచ్‌లు నెగ్గగా.. 96 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక ప్రస్తుతం యాషెస్ ట్రోపీ ఆస్ట్రేలియా వద్ద ఉంది. 2021-22లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్ 2015 తర్వాత మళ్లీ యాషెస్‌ను గెలవలేకపోయింది. ఈసారి స్టోక్స్ నేతృత్వంలో బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ ఎలాగైనా యాషెస్ ట్రోపీని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఇటీవలే టీమిండియాను ఓడించి ప్రపంచటెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆస్ట్రేలియా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా 73వ సారి జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 16 నుంచి 20 వరకు జరగనుంది. చదవండి: ఎల్పీఎల్ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా? #TNPL2023: రోజుకో విచిత్రం.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్ -
ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం
ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన ఇతను.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు అలీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో ఈసీబీ మొయిన్‌ను జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసిన జట్టులోని జాక్ లీచ్ గాయపడటంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మొయిన్‌ను రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఈసీబీ కోరగా, అందుకు అతను అంగీకరించాడు. కాగా, మొయిన్ 2021లో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక రెడ్ బాల్‌తో కనీసం ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడలేదు. అయినా ఈసీబీ ఇతనిపై నమ్మకంతో రిటైర్మెంట్ను సైతం వెనక్కు తీసుకునేలా చేసి, జట్టులోకి ఆహ్వానించింది. మొయిన్ రాకతో ఇంగ్లండ్ బలం పుంజుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఓ విషయం మాత్రం ఈసీబీని లోలోపల కలవరపెడుతుంది. అదేంటంటే.. మొయిన్‌కు ఆస్ట్రేలియాపై చెత్త రికార్డు ఉండటం. ఆసీస్‌పై 11 టెస్ట్‌లు ఆడిన మొయిన్.. బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతని యావరేజ్ ఆసీస్‌పై ఏకంగా 64.65గా ఉంది. ఇది అతని కెరీర్ యావరేజ్‌కు రెండింతలు. కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్‌లు ఆడిన మొయిన్.. 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు. యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్ జట్టు.. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలే, డేనియల్ లారెన్స్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, జానీ బెయిర్ స్టో, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, మొయిన్ అలీ ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్ వేదికగా జరిగే యాషెస్ సిరీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్, జూన్ 16-20, ఎడ్జ్‌బాస్టన్ రెండో టెస్ట్, జూన్ 28-జులై 2, లార్డ్స్ మూడో టెస్ట్, జులై 6-10, హెడింగ్లే నాలుగో టెస్ట్, జులై 19-23, ఓల్డ్ ట్రాఫర్డ్ ఐదో టెస్ట్, జులై 27-31, ఓవల్ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. చివరి రెండు రోజుల్లో! -
యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
జూన్ 16 నుంచి ప్రారంభం కాబోయే యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాలి ఫ్రాక్చర్ కారణంగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. తాజాగా ఐర్లాండ్‌తో ముగిసిన ఏకైక టెస్ట్ సందర్భంగా లీచ్ ఫ్రాక్చర్ కారణంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. తదనంతరం జరిపిన స్కాన్‌లో లీచ్ పాదంలో పగుళ్లు గుర్తించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. లీచ్ ఐర్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో 4 వికెట్లు పడగొట్టగా.. ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, 31 ఏళ్ల జాక్ లీచ్ 2018లో ఇంగ్లండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి 35 మ్యాచ్‌ల్లో 124 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. బ్యాటింగ్‌లో లీచ్ ఓ హాఫ్ సెంచరీ (92) సాధించాడు. 2019లో లీడ్స్‌లో జరిగిన టెస్ట్‌లో చివరి వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో నెలకొల్పిన భాగస్వామ్యం లీచ్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. ఆ మ్యాచ్‌లో లీచ్ చేసింది ఒక్క పరుగే అయినా వికెట్ పడకుంగా స్ట్రయిక్ రొటేట్ చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. మరో ఎండ్‌లో స్టోక్స్ (135 నాటౌట్) చారిత్రక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో లీచ్ సహకారంతో స్టోక్స్ చివరి వికెట్‌కు ఏకంగా 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇదిలా ఉంటే, 5 టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ జూన్ 16న మొదలై, జులై 31తో ముగుస్తుంది. బిర్మింగ్హమ్ వేదికగా తొలి టెస్ట్ (జూన్ 16-20), లార్డ్స్‌లో రెండో టెస్ట్ (జూన్ 28-జులై 2), లీడ్స్‌లో మూడో టెస్ట్ (జులై 6-10), మాంచెస్టర్‌లో నాలుగో టెస్ట్ (జులై 19-23), ఓవల్ వేదికగా ఐదో టెస్ట్ (జులై 27-31) జరుగుతుంది. చదవండి: WTC Final IND VS AUS: ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని గెలిచారు..? -
ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు
ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌కు ప్రకటించిన జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా ఓ కీలక మార్పు చేసింది. తొలి టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగివెళ్లనున్న జోష్ ఇంగ్లిస్ స్థానంలో ఆన్క్యాప్డ్ ఆటగాడు జిమ్మీ పీర్సన్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో తొలి టెస్టు ముగిసిన వెంటనే ఇంగ్లిస్ స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ముందు జిమ్మీ పీర్సన్ ఆస్ట్రేలియా క్యాంప్‌లో కలవనున్నాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో క్వీన్స్‌లాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పీర్సన్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ క్వీన్స్లాండ్ ఆటగాడు 34.75 సగటుతో 3000 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు ఉన్నాయి. అయితే లోయార్డర్‌లో బ్యాటింగ్ వచ్చి 6 సెంచరీలు సాధించడం విశేషం. ఇక జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాతోతలపడనుంది. అనంతరం జూన్ 16న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టోడిఫై మార్ష్, , మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ చదవండి: IPL 2023: అతడిపై చాలా ఆశలు పెట్టుకున్నా.. ఒక్క శాతం కూడా చేరుకోలేకపోయాడు: సెహ్వాగ్ -
ఆసీస్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్!
England Vs Australia: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ గాయపడ్డాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆండర్సన్.. సోమర్‌సెట్‌తో మ్యాచ్ సందర్భంగా గజ్జల్లో నొప్పితో విలవిల్లాడాడు. ఓల్డ్ ట్రఫోర్డ్‌లో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే నొప్పి కారణంగా వైదొలిగాడు. మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో లంకాషైర్- సోమర్సెట్ మధ్య మ్యాచ్ డ్రా అయిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆండర్సన్ గాయం గురించి ఆదివారం ప్రకటన చేసింది. అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం 40 ఏళ్ల ఆండర్సన్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. అయితే, జూన్ 1న ఐర్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ ఆడనున్న ఏకైక టెస్టు నాటికి అతడు జట్టుతో చేరతాడా లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొంది. విజయవంతమైన ఫాస్ట్‌బౌలర్ ఇదిలా ఉంటే.. ఆండర్సన్ ప్రస్తుత పరిస్థితి గురించి లంకాషైర్ కోచ్ గ్లెన్ చాపెల్ బీబీసీతో మాట్లాడుతూ.. నొప్పి తీవ్రత ఎక్కువగా ఏమీ లేదని, త్వరలోనే అతడు కోలుకుండాటని చెప్పాడు. కాగా జూన్ 16 నుంచి చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఆడనున్న ఐదు మ్యాచ్‌ల యాషెస్ టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా ఆండర్సన్ టెస్టు క్రికెట్లో 685 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన ఫాస్ట్‌బౌలర్‌గా కొనసాగుతున్నాడు. వారితో పాటు తాజాగా ఇక ఇప్పటికే ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, ఓలీ స్టోన్, బ్రైడన్ కార్స్ తదితరులు గాయాల బారిన పడగా.. తాజాగా ఆండర్సన్ సైతం ఈ జాబితాలో చేరిపోయాడు. ఇదిలా ఉంటే 2021-22 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఐదింట నాలుగు విజయాలతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌నైనా డ్రా చేసుకుని ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. ఈ నేపథ్యంలో ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇక యాషెస్ కంటే ముందు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వేదికగా టీమిండియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడనుంది. జూన్ 7-11 వరకు మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా! వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని -
T20 WC: ఆసీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు
ICC Under 19 Womens T20 World Cup 2023 - పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్-19 టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో పోరుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ గ్రేస్ స్రివెన్స్ 20, అలెక్సా స్టోన్‌హౌజ్ 25 మాత్రమే 20కి పైగా పరుగులు స్కోరు చేశారు. దీంతో 19.5 ఓవర్లలో 99 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు దెబ్బకొట్టారు. హన్నా బేకర్ మూడు, గ్రేస్ స్రివెన్స్ రెండు, జోసీ గ్రోవ్స్, రియానా, ఎలీ ఆండర్సన్, అలెక్సా స్టోన్‌హౌజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో 96 పరగులకే ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. హన్నా బేకర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. చరిత్రకు అడుగుదూరంలో ఆసీస్ బ్యాటర్లలో క్లేర్ మూరే 20, అమీ స్మిత్ 26 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. ఇప్పటి వరకు భారత మహిళల క్రికెట్ జట్టు ఏ ఫార్మాట్లోనైనా విశ్వవిజేతగా నిలువలేకపోయింది. వన్డే ప్రపంచకప్‌లో రెండుసార్లు రన్నరప్‌గా, టి20 ప్రపంచకప్‌లో ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. అయితే సీనియర్లకు సాధ్యంకాని ఘనతను సాధించేందుకు భారత జూనియర్ మహిళల జట్టు విజయం దూరంలో నిలిచింది. తొలిసారి నిర్వహిస్తున్న అండర్–19 టి20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు సాధించింది. భారత లెగ్ స్పిన్నర్ పార్శవి చోప్రా (3/20) కివీస్‌ను కట్టడి చేసింది. టిటాస్ సాధు, మన్నత్, షఫాలీ, అర్చన దేవి ఒక్కో వికెట్ తీశారు. అనంతరం భారత్ 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. శ్వేత సెహ్రావత్ (45 బంతుల్లో 61 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీ చేసింది. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: Washington Sundar: స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన సుందర్.. IND Vs NZ: తొలి టి20లో టీమిండియా ఓటమి.. -
టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై
ICC Under 19 Womens T20 World Cup 2023: అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీలో షఫాలీ వర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాలో బుధవారం ‘సూపర్ సిక్స్’ దశ మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్–1లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. సెమీస్ చేరిన జట్లు ఇవే అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత్ (+2.844), ఆస్ట్రేలియా (+2.210) సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఇక గ్రూపు- 2లో ఉన్న ఇంగ్లండ్ వెస్టిండీస్‌పై బుధవారం ఘన విజయం సాధించింది. 95 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇక ఇదే గ్రూపులో ఉన్న న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్తాన్‌పై 103 పరుగుల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్ ఎప్పుడంటే ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 27) జరుగనున్న మొదటి సెమీస్ మ్యాచ్‌లో భారత్- న్యూజిలాండ్ తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో సెమీస్ విజేతల మధ్య ఆదివారం ఫైనల్ జరుగనుంది. కాగా ఈ మెగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకోలేక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. చదవండి: IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! కానీ.. Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి! -
ఇదేం షాట్ రా బాబు.. ఇండియాలో అయితే స్టేడియం బయటపడేది..!
Mitchell Marsh Massive 115 Metre Six: 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (నవంబర్ 22) జరిగిన ఆఖరి వన్డేలో ఆతిధ్య ఆస్ట్రేలియా 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన ఆసీస్.. ఈ గెలుపుతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. Clobbered 115 metres! 💥 Mitch Marsh middled this one! #AUSvENG #Dettol | #PlayOfTheDay pic.twitter.com/QzToL1irbC — cricket.com.au (@cricketcomau) November 22, 2022 తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో 48 ఓవర్లలో (వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు) 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఆ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై, భారీ తేడాతో ఓటమిపాలైంది. మిచెల్ మార్ష్ 115 మీటర్ల భారీ సిక్సర్.. ఆసీస్ ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఆ జట్టు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఓ కళ్లు చెదిరే షాట్ ఆడి మైదానంలోని ప్రేక్షకులదరినీ నోరెళ్ల పెట్టేలా చేశాడు. ఓల్లీ స్టోన్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని మార్ష్ 115 మీటర్ల భారీ సిక్సర్‌గా మలిచాడు. మార్ష్ కొట్టిన ఈ షాట్ నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లి ల్యాండైంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్ స్టేడియం అయిన మెల్బోర్న్ మైదానంలో బంతికి స్టాండ్స్‌లోకి వెళ్లిందంటే.. ఇండియాలోని గ్రౌండ్స్‌లో బంతి మైదానం దాటుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. కాగా, క్రికెట్ చరిత్రలో అత్యంత భారీ సిక్సర్ రికార్డు పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 2013లో సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ స్టేడియంలో ఏకంగా 153 మీటర్ల అత్యంత భారీ సిక్సర్ బాదాడు. -
టి20 ఛాంపియన్స్‌కు కోలుకోలేని షాక్
ఇటీవలే టి20 ప్రపంచకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్ విజయలక్ష్యాన్ని 364 పరుగులుగా నిర్థారించారు. అయితే ఇంగ్లండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి పేలవమైన ఆటతీరు కనబరిచిన ఇంగ్లండ్ 31.4 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. జేసన్ రాయ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జేమ్స్ విన్స్ 22 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, సీన్ అబాట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 48 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. వార్నర్, హెడ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 269 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత వచ్చిన వారెవరు పెద్దగా రాణించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ స్టోన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఇంగ్లండ్, ఆసీస్ మ్యాచ్ అంటేనే తొండి.. మరోసారి నిరూపితం -
ఆస్ట్రేలియా ఓపెనర్ల విధ్వంసం.. వార్నర్, హెడ్ శతక్కొట్టుడు
3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో.. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి శతక్కొట్టుడు ధాటికి ఇంగ్లండ్ బౌలర్లకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. హెడ్, వార్నర్‌లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి.. ఇంగ్లీష్ ఫీల్డర్లను మైదానం నలుమూలలా పరుగులు పెట్టించారు. ముఖ్యంగా హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి. పరుగుల వరద పారించాడు. వార్నర్, హెడ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 269 పరుగులు జోడించారు. అయితే 39 ఓవర్లో పరుగు వ్యవధిలో వీరిద్దరూ ఔటవ్వడంతో ఆతిధ్య జట్టు 400 పరుగుల మైలురాయిని చేరుకునే సువర్ణావకాశాన్ని చేజార్చకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ చివర్లో వర్షం పడటంతో మ్యాచ్‌ను చెరి 48 ఓవర్లకు కుదించగా.. ఆసీస్ తమ కోటా ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓల్లీ స్టోన్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టగా, లియామ్ డాసన్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఆ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై 221 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఆస్ట్రేలియా జట్టే విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్, ఆసీస్ మ్యాచ్ అంటేనే తొండి.. మరోసారి నిరూపితం
క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్‌కు ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఇరుజట్లు ఎక్కడ తలపడ్డా హోరాహోరీగా మ్యాచ్ జరగడం ఖాయం. అయితే అంతేస్థాయిలో తొండి కూడా జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మంగళవారం ఇరుజట్ల మధ్య జరిగిన చివరి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్మిత్ ఔట్ విషయంలో అంపైర్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందిగా కదిలిన స్టీవ్ స్మిత్ ఓలీ స్టోన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి మిస్ చేశాడు. అయితే బంతి స్మిత్ గ్లోవ్స్ తాకుతూ కీపర్ బట్లర్ చేతుల్లో పడింది. అంతే బట్లర్ ఔట్ అంటూ అప్పీల్‌కు వెళ్లాడు. కానీ అంపైర్ మొదట ఔట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో బట్లర్ డీఆర్ఎస్ కోరుతూ టీ-సైన్ చూపించాడు. ఇది గమనించిన అంపైర్ బట్లర్ నిర్ణయానికి మొగ్గుచూపుతూ తన వేలిని పైకి ఎత్తాడు. ఇది చూసిన స్మిత్ మొదట షాక్ అయినప్పటికి అంపైర్ నిర్ణయానికి కట్టుబడి పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు కామెంట్స్ చేశారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ అంటేనే తొండి.. ఇంగ్లండ్ రివ్యూను కాపాడేందుకు అంపైర్ స్మిత్‌ను ఔట్ ఇచ్చాడు.. ఇది చీటింగ్ అంటూ పేర్కొన్నారు. Total comedy of decision at MCG. pic.twitter.com/GSotlJX8cq — Johns. (@CricCrazyJohns) November 22, 2022 చదవండి: IND VS NZ 3rd T20: పంత్.. ఇక మారవా..? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు ఇవ్వాలి..! -
వారెవ్వా స్టార్క్.. మొన్న రాయ్.. ఇప్పుడు మలాన్! వీడియో వైరల్
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ వెటరన్ పేసర్ మిచిల్ స్టార్క్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తొలి ఓవర్లోనే రాయ్, మలాన్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ముఖ్యంగా మలాన్‌ను స్టార్క్ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్టార్క్.. అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మలన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్క్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి స్వింగ్ అయ్యి వికెట్లను గిరాటేసింది. దీంతో ఒక్క సారిగా మలన్ షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. కాగా తొలి వన్డేలో కూడా ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్‌ను అచ్చెం ఇటువంటి బంతితోనే స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. That is a SEED from Starc!#AUSvENG | #PlayOfTheDay | #Dettol pic.twitter.com/XISUPw34Pm — cricket.com.au (@cricketcomau) November 19, 2022 చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాకు అదిరిపోయే స్వాగతం! వీడియో వైరల్ -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. సిరీస్ సొంతం
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో కైవసం చేసుకుంది. 280 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 38.5 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచిల్ స్టార్క్, జంపా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీయగా.. హాజిల్ వుడ్ రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో విన్స్(60), బట్లర్(71) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 94 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు లాబుషేన్(58), మార్ష్(50) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ మూడు, విల్లీ, వోక్స్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక నామమాత్రపు మూడో వన్డే నవంబర్ 22న మెల్బోర్న్ వేదికగా జరగనుంది. చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. మళ్లీ అదే బ్యాడ్ న్యూస్..! -
మనకు రానిది ప్రయత్నిస్తే ఫలితం ఇలాగే ఉంటది!
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మొదలైన రెండో వన్డే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఫ్రీ హిట్‌ను స్విచ్‌హిట్‌గా మలుద్దామనుకొని బొక్కబోర్లా పడ్డాడు ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్. అలా ఒక ఫ్రీ హిట్‌ను అనవసరంగా వృదా చేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. స్మిత్ 57 పరుగుల వద్ద ఉండగా.. 32వ ఓవర్ వేసిన ఆదిల్ రషీద్ ఒక బంతిని నోబాల్ వేశాడు. దీంతో ఆసీస్‌కు ఫ్రీహిట్ లభించింది. అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న స్మిత్ ఎలాగైనా భారీ షాట్ ఆడాలని చూశాడు. నార్మల్‌గా ఆడినా సరిపోయేది.. అనవసరంగా గొప్పలకు పోయిన స్మిత్ స్విచ్ హిట్ ఆడాలని చూశాడు. రషీద్ బంతి విడుదల చేయగానే లైఫ్ట్ హ్యాండ్‌వైపు తిరిగి స్విచ్ హిట్ చేసే ప్రయత్నంలో మిస్సయ్యాడు. ఆ తర్వాత కోపంతో తనను తానే తిట్టుకోవడం కనిపించింది. అందుకే మనకు రానిది ప్రయత్నిస్తే ఇలాంటి ఫలితమే ఎదురవుతుంది స్మిత్ అంటూ అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో స్మిత్ తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 80 పరుగులు చేసిన స్మిత్.. ఈ మ్యాచ్‌లో 114 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అయితే నాలుగు పరుగుల తేడాతో స్మిత్ సెంచరీకి దూరమయ్యాడు. ఇక ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. స్మిత్ 94, లబుషేన్ 58 పరుగులు చేయగా.. చివర్లో మిచెల్ మార్ష్ 50 పరుగులు చేయడంతో ఆసీస్ మంచి స్కోరు సాధించింది. Steve Smith trying something new on the free hit 😂 How's the reaction from him #AUSvENG pic.twitter.com/uPrbZ5ejc7 — cricket.com.au (@cricketcomau) November 19, 2022 చదవండి: రోహిత్ మెడపై కత్తి పెట్టి, హార్ధిక్‌కు పట్టం కట్టి.. ఇవన్నీ జై షా వ్యూహాలేనా..? సెలెక్టర్ల కథ ముగించారు.. రోహిత్ శర్మను ఎప్పుడు?