![Ashes 2023: Pat Cummins Strikes With 4 Wickets-ENG-Big Trouble-3rd-Test - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/7/cummins.jpg.webp?itok=1pBwaf-2)
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ 67 బంతుల్లో 27 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. కమిన్స్‌కు తోడుగా స్టార్క్ రెండు, మిచెల్ మార్ష్ ఒక వికెట్ తీశారు.
కమిన్స్ దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి సతమతమయ్యారు. 68 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు కాసేపటికే రూట్ రూపంలో షాక్ తగిలింది. 19 పరుగులు చేసిన రూట్ కమిన్స్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇంకా ప్రస్తుతం 121 పరుగులు వెనుకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment