యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైంది. లీడ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులు ఓడి 0-2తో వెనుకబడిన ఇంగ్లండ్ మూడో టెస్టులో గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం మూడో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను గెలవాలని చూస్తోంది.
యాషెస్ సిరీస్‌కు ముందు బజ్‌బాల్ ఆటతో ఆసీస్‌కు కళ్లెం వేస్తామని పేర్కొన్న స్టోక్స్ సేన ఆటకు వచ్చేసరికి పూర్తిగా చతికిలపడింది. బజ్‌బాల్ దూకుడు కొనసాగించాలన్న తపనతో చేతులు కాల్చుకున్న ఇంగ్లండ్ కనీసం మూడో టెస్టులోనైనా దానిని పక్కనబెడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు జరగ్గా.. ఇంగ్లండ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. కామెరాన్ గ్రీన్ స్థానంలో మిచెల్ మార్ష్ తుదిజట్టులోకి రాగా.. గాయపడ్డ నాథన్ లియోన్ స్థానంలో టాడ్ మర్ఫీ వచ్చాడు. ఇక ఇంగ్లండ్ జట్టులో అండర్సన్ స్థానంలో మార్క్ వుడ్‌ను తీసుకోగా.. గాయపడ్డ ఓలీపోప్ స్థానంలో మోయిన్ అలీ.. జోష్ టంగ్ స్థానంలో క్రిస్ వోక్స్ తుదిజట్టులోకి వచ్చారు.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్
BREAKING: England choose to bowl after winning the toss ✅ pic.twitter.com/BbHIFZFM2S
— Sky Sports Cricket (@SkyCricket) July 6, 2023
చదవండి: #ManchesterUnited: ఇంగ్లండ్ స్టార్‌కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా!
IND vs WI: అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment