Pat Cummins
-
టాలెంటెడ్ కిడ్.. కానీ.. : నితీశ్ రెడ్డిపై ప్యాట్ కమిన్స్ కామెంట్స్
టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడితో కలిసి ఆడిన జ్ఞాపకాలు మధురమైనవని.. ఆట పట్ల నితీశ్ అంకితభావం అమోఘమని కొనియాడాడు. ఆసీస్ గడ్డపై కూడా అతడు బంతిని స్వింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టుల్లో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ గురువారం మీడియాతో మాట్లాడాడు.మాకు ఎంతో కీలకంబోర్డర్- గావస్కర్ ట్రోఫీ తమకు ఎంతో కీలకమైన సిరీస్ అన్న కమిన్స్.. టీమిండియా వంటి పటిష్ట జట్టుతో తలపడటం కఠినమైన సవాలు అని పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై ఆడటం ఎల్లప్పుడూ ఒత్తిడికి గురిచేస్తుందని.. అయితే, తాము అన్ని రకాలుగా ఈ సిరీస్‌కు సిద్ధమయ్యాం కాబట్టి ఆందోళన చెందడం లేదని తెలిపాడు.టాలెంటెడ్ కిడ్ కానీ..ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘ఎంతో ప్రతిభావంతుడైన కుర్రాడు. కానీ.. సన్‌రైజర్స్ తరఫున అతడికి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఏదేమైనా అతడు టాలెంటెడ్ కిడ్. తన ఆట తీరుతో నన్ను ఇంప్రెస్ చేశాడు. ఇక్కడ కూడా బంతిని కాస్త స్వింగ్ చేయగలడనే అనుకుంటున్నా’’ అని కమిన్స్ కితాబులిచ్చాడు.సన్‌రైజర్స్ గెలుపులోకాగా ఐపీఎల్-2024లో కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత వైఫల్యాలను మరిపించేలా జట్టును ఏకంగా ఫైనల్స్‌కు చేర్చాడు. ఇక కమిన్స్ కెప్టెన్సీలో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.ఈ ఏడాది రైజర్స్ తరఫున 303 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో ఆస్ట్రేలియాతో టెస్టులకు నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. పెర్త్‌లో అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.చదవండి: పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
విరాట్, రోహిత్ వేరు.. నా స్టైల్ వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించి విజయపథంలో నిలుపుతానని పేర్కొన్నాడు. పేసర్లు కెప్టెన్సీలో అత్యుత్తమంగా రాణిస్తారన్న బుమ్రా.. అందుకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ నిదర్శనమని కొనియాడాడు.ఆ పరాభవాన్ని మోసుకురాలేదుఇక న్యూజిలాండ్ చేతిలో పరాభవాన్ని తాము ఆస్ట్రేలియాకు మోసుకురాలేదని.. ఇక్కడ గెలుపే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతామని బుమ్రా పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది.అయితే, వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ బుమ్రా జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన బుమ్రా కెప్టెన్సీ, మొదటి టెస్టులో తొలి టెస్టు కూర్పు తదితర అంశాల గురించి తన మనసులోని భావాలు వెల్లడించాడు.విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు‘‘కెప్టెన్‌గా పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. విరాట్, రోహిత్.. భిన్నమైన కెప్టెన్లు. నాకు కూడా నాదైన ప్రత్యేక శైలి ఉంది. నా స్టైల్లో జట్టును ముందుకు నడిపిస్తా. దీనిని నేను భారంగా భావించను. బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఇష్టమైన పని.ఇంతకు ముందు రోహిత్‌తో కూడా మాట్లాడాను. ఇక్కడ ఎలా జట్టును ముందుకు నడిపించాలో నాకు కాస్త స్పష్టత వచ్చింది. పేసర్లను కెప్టెన్లు చేయాలని నేను తరచూ చెబుతూ ఉంటాను. వ్యూహాత్మకంగా వాళ్లెంతో బెటర్. ప్యాట్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందిగతంలో కపిల్ దేవ్‌తో పాటు చాలా మంది పేసర్లు సూపర్‌గా కెప్టెన్సీ చేశారు. ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందని నేను భావిస్తున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టుల్లో క్లీన్‌స్వీప్ కావడం ప్రస్తావనకు రాగా.. ‘‘మనం గెలిచినపుడు సున్నా నుంచి మొదలుపెడతాం. మరి ఓడినపుడు కూడా అలాగే చేయాలి కదా!న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. అయితే, అక్కడికీ.. ఇక్కడికీ పిచ్ పరిస్థితులు వేరు. ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. తుదిజట్టు ఖరారైంది.. కానీఇక ఇప్పటికే తాము తొలి టెస్టుకు తుదిజట్టును ఖరారు చేశామని.. శుక్రవారం ఉదయమే ఈ విషయం గురించి అందరికీ తెలుస్తుందంటూ బుమ్రా అభిమానులను ఊరించాడు.చదవండి: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు -
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు
క్రికెట్ ప్రపంచంలో యాషెస్ సిరీస్ తర్వాత అంతే స్థాయిలో అభిమానులను ఆకట్టుకునే రైవలరీ టెస్టు సిరీస్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ). ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటే.. బీజీటీలో టీమిండియాతో తలపడుతుంది. 1996లో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సిరీస్.. నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది.బీజీటీలో మనదే పైచేయి.. కానీఇప్పటి వరకు ఈ సిరీస్‌లో టీమిండియాదే పైచేయి. ఇప్పటికి 16 సార్లు జరిగిన బీజీటీలో భారత్ 10 సార్లు ట్రోఫీ కైవసం చేసుకుంది. ఒక్కసారి డ్రాగా ముగియగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలిచింది. ఇక పెర్త్ వేదికగా నవంబరు 22న మరోసారి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ సమరానికి తెరలేవనుంది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తాడు. మరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు గమనిద్దాం.ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా- ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు తలపడిన 107 మ్యాచ్‌లలో ఇండియా 32, ఆస్ట్రేలియా 45 గెలవగా.. 29 డ్రాగా ముగిశాయి.అత్యధిక పరుగుల, వికెట్ల వీరుడు ఎవరంటే?టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు. 39 మ్యాచ్‌లలో అతడు 3630 రన్స్ సాధించాడు. ఇక ఈ భారత్- ఆసీస్ టెస్టు పోరులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లయన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టీమిండియాతో 27 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ స్పిన్నర్ 121 వికెట్లు కూల్చాడు.ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 2024-25షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం👉తొలి టెస్టు👉పెర్త్ స్టేడియం, పెర్త్👉తేదీలు: నవంబర్ 22-26👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ఆరంభం👉రెండో టెస్టు👉ఓవల్ మైదానం, అడిలైడ్(డే, నైట్- పింక్‌బాల్ టెస్టు)👉తేదీలు: డిసెంబరు 6- 10👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆరంభంమూడో టెస్టు👉ది గాబా స్టేడియం, బ్రిస్బేన్👉తేదీలు: డిసెంబరు 14- 18👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 నిమిషాలకు ఆరంభంనాలుగో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)👉మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్👉తేదీలు: డిసెంబరు 26- 30👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంఐదో టెస్టు👉సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉తేదీలు: జనవరి 3- 7👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంవార్మప్ మ్యాచ్👉నవంబరు 30- డిసెంబరు 1👉ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ వర్సెస్ ఇండియా-‘ఎ’ మధ్య వార్మప్ మ్యాచ్- మనుకా ఓవల్, కాన్బెర్రా.ఎక్కడ వీక్షించవచ్చు?👉టీవీ బ్రాడ్‌కాస్టర్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్👉లైవ్ స్ట్రీమింగ్: డిస్నీ+హాట్స్టార్జట్లుఆస్ట్రేలియాతో ఐదు టెస్టులకు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్,ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్టీమిండియాతో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్‌న్యూస్?! -
కోహ్లి, పంత్ కాదు.. అతడితోనే మాకు డేంజర్: ఆసీస్ కెప్టెన్
టీమిండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గత రెండు పర్యాయాలు తమ సొంత గడ్డపై భారత్ చేతిలో సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఇరు జట్ల మధ్య నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్రాడ్‌కాస్టర్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రాకు తనొక బిగ్ ఫ్యాన్ అని కమ్మిన్స్ తెలిపాడు. కాగా బుమ్రాకు ఇది మూడో బీజీటీ ట్రోఫీ కావడం గమనార్హం. ఒకవేళ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమైతే బుమ్రానే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. బుమ్రాకు ఆసీస్ గడ్డపై టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన జస్ప్రీత్.. 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు."నేను జస్ప్రీత్ బుమ్రాకు పెద్ద అభిమానిని. అతడొక అద్భుతమైన బౌలర్. ఈ సిరీస్‌లో భారత జట్టుకు అతడు కీలకం కానున్నాడు. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా బుమ్రాకు ఉంది. అతడితో మా బ్యాటర్లకు ముంపు పొంచి ఉన్నది" అని కమ్మిన్స్ పేర్కొన్నాడు.ఇదే విషయంపై పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. "పుజారా, రహానే జట్టులో లేకపోవడం మాకు కలిసిస్తోంది. వారిద్దరూ గతంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పుజారాకు బౌలింగ్ చేయడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. అతడితో పోటీ అంటే నాకు ఎంతో ఇష్టం. కొన్ని సార్లు గెలిచాను. మరి కొన్ని సార్లు అతడు నాపై పైయి చేయి సాధించాడు. అతడు ఎప్పుడూ ఓటమని అంగీకరించడు" అని చెప్పుకొచ్చాడు.చదవండి: రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి.. మరో 458 పరుగులు చేస్తే! -
Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్ పేసర్.. కుప్పకూలిన ఆసీస్! ఇమ్రాన్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్తాన్ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కంగారూ జట్టును కోలుకోని దెబ్బకొట్టారు. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షాహిన్, రవూఫ్ దెబ్బకు కమిన్స్ బృందం కనీసం 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య శుక్రవారం నాటి రెండో వన్డేకు అడిలైడ్ వేదికగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నమ్మకాన్ని నిలబెడుతూ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ షార్ట్(19), జేక్ ఫ్రేజర్ మెగర్క్(13)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.ఐదు కీలక వికెట్లు అతడి సొంతంవన్డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్(35) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. హస్నైన్ అతడిని అవుట్ చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హ్యారిస్ రవూఫ్ జోస్ ఇంగ్లిస్(18), మార్నస్ లబుషేన్(6), ఆరోన్ హార్డీ(14), గ్లెన్ మాక్స్వెల్(16), ప్యాట్ కమిన్స్(13) రూపంలో ఐదు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. The man of the moment #AUSvPAK pic.twitter.com/t0UJ3iZJLh— cricket.com.au (@cricketcomau) November 8, 2024 మరోవైపు.. టెయిలెండర్లలో మిచెల్ స్టార్క్(1)ను షాహిన్ అవుట్ చేయగా.. ఆడం జంపా (18) కాసేపు పోరాడగా నసీం షా అతడిని బౌల్డ్ చేసి పని పూర్తి చేశాడు.Vintage Smith 👌#AUSvPAK pic.twitter.com/PWKlbk4NgK— cricket.com.au (@cricketcomau) November 8, 2024 ఈ క్రమంలో 35 ఓవర్లకే ఆస్ట్రేలియా కథ ముగిసింది. కేవలం 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆసీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదిస్తుందా? లేదంటే తొలి వన్డే మాదిరి ఈసారీ మ్యాచ్‌ను చేజార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌తో రెండో వన్డేలో హ్యారిస్ రవూఫ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షాహిన్ ఆఫ్రిది మూడు, నసీం షా, మహ్మద్ హస్నైన్ ఒక్కో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన హ్యారిస్ రవూఫ్.. పాక్ తరఫున తొలి పేసర్గాఆసీస్తో రెండో వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అడిలైడ్‌లో వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ పేసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును రవూఫ్ బద్దలు కొట్టాడు.ఇక అడిలైడ్‌లో అంతకు ముందు స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ వన్డేల్లో ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ పాక్ తరఫున ఈ ఘనత నమోదు చేసిన మొదటి బౌలర్‌గా కొనసాగుతున్నాడు.అడిలైడ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాక్ బౌలర్లుహ్యారిస్ రవూఫ్- 5/29*సక్లెయిన్ ముస్తాక్- 5/29ఇజాజ్ ఫాకిహ్- 4/43ఇమ్రాన్ ఖాన్-3/19షాహిన్ ఆఫ్రిది- 2/24.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించింది. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌కు తొలిసారిగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. పాక్‌తో మూడో వన్డేకు కూడా ఇంగ్లిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా నవంబరు 4- నవంబరు 18 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్గాఇక శుక్రవారం(నవంబరు 8) అడిలైడ్ వేదికగా ఆసీస్- పాక్ మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం కీలక ప్రకటన చేసింది. పాక్‌తో ఆఖరి వన్డేతో పాటు.. టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.ప్యాట్ కమిన్స్ అందుకే దూరంకాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఇరుజట్లకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో పాక్‌తో రెండో వన్డే ముగిసిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ తదితరులు జట్టుకు దూరం కానున్నారు.వీరంతా భారత్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కానున్నారు. ఇక వీరి గైర్హాజరీ నేపథ్యంలో పేసర్లు స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ వన్డే జట్టుతో చేరనున్నారు. ఇదిలా ఉంటే.. జోష్ ఇంగ్లిస్‌కు గతంలో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది.వన్డేల్లో 30వ సారథిగాఅయితే, సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం మాత్రమ ఇదే మొదటిసారి. ఇక తాజా నియామకంతో ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లో 30వ, టీ20లకు పద్నాలుగో కెప్టెన్‌గా ఇంగ్లిస్ చరిత్రకెక్కనున్నాడు. ఇంగ్లిస్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడనే నమ్మకం తమకు ఉందని ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు. అదే విధంగా.. జట్టులోని సీనియర్లు ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్ నుంచి ఇంగ్లిస్‌కు పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఆసీస్ టీ20 రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ పాక్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.పాకిస్తాన్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్ - మొదటి రెండు మ్యాచ్‌లకు), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్ - మూడవ మ్యాచ్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ (మూడవ మ్యాచ్ మాత్రమే), కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్ (రెండవ మ్యాచ్ మాత్రమే), స్పెన్సర్ జాన్సన్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మార్నస్ లబుషేన్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే), గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జోష్ ఫిలిప్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే మాత్రమే), మిచెల్ స్టార్క్ (తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే), మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా.పాకిస్తాన్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టుసీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా. -
అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రెండు వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. పాక్ పేసర్లు అద్భుతంగా పోరాడినప్పటకి విజయం మాత్రం వరించలేదు.తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించి పాక్‌ను దెబ్బతీశారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్(44), ఇంగ్లీష్(49) నిలకడగా ఆడటంతో ఆసీస్ సునాయసంగా లక్ష్యాన్ని చేధిస్తుందని అంతా భావించారు.కానీ పాక్ హ్యారీస్ రవూఫ్ మాత్రం మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టేశాడు. ఒక్కసారిగా పాక్ జట్టు మ్యాచ్‌ను తమవైపు మలుపు తిప్పుకుంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(32 నాటౌట్) ఆఖరివరకు క్రీజులో నిలుచోని తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఇక ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందిచాడు. తమ జట్టు పేస్ బౌలర్లపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ ఓటమి మాకు ఎటువంటి నిరాశ కలిగించలేదు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆఖరి వరకు పోరాడాలని ముందే నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్‌లో అదే చేశాము. చివర వరకు పోరాడి ఓడిపోయాం. ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మేము బ్యాటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాలి. హ్యారీస్ రవూఫ్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. మా నలుగురు పేసర్లు కూడా తమ పని తాము చేశారు. తర్వాతి మ్యాచ్‌లో కూడా నలుగురు పేసర్లతోనే ఆడనున్నాం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు కాస్త ఆదృష్టం కలిసొచ్చింది అని పోస్ట్ మ్యాచ్ప్రేజేంటేషన్లో రిజ్వాన్ పేర్కొన్నాడు. -
Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. మెల్బోర్న్ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. ఆసీస్ గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది.చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియాపాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని(204) ఛేదించే క్రమంలో 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఓవర్ ఓవర్‌కు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ గెలుపుతో ఆసీస్ చరిత్ర సృష్టించింది.వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌తో ఆడిన తక్కువ మ్యాచ్‌లలోనే.. ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు పాక్‌తో 109 మ్యాచ్‌లు ఆడిన కంగారూ జట్టు 71 మ్యాచ్‌లలో జయభేరి మోగించింది. ఇక ఈ జాబితాలో వెస్టిండీస్ రెండోస్థానంలో ఉంది. ఆసీస్‌తో సమానంగా 71సార్లు పాక్‌పై గెలుపొందినప్పటికీ.. మ్యాచ్‌ల పరంగా ఆసీస్ కంటే వెనుకబడింది.రిజ్వాన్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమికాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా సోమవారం(నవంబరు 4) ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. పాక్ వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు ఇదే తొలి మ్యాచ్.ఇక మెల్బోర్న్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేసింది. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో రాణించగా.. కమిన్స్ రెండు, ఆడం జంపా రెండు, లబుషేన్, సీన్ అబాట్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో పాక్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులే చేసింది.నసీం షా బ్యాట్ ఝులిపించినాపాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టెయిలెండర్ నసీం షా 40 రన్స్‌తో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఆతిథ్య ఆసీస్ కమిన్స్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడంతో 33.3 ఓవర్లలో పనిపూర్తి చేసింది. పాక్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్లు షఫీక్(12), సయీమ్ ఆయుబ్(1) సహా 19 బంతుల్లోనే 24 రన్స్ చేసిన షాహిన్ ఆఫ్రిదిని అవుట్ చేసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతడు దెబ్బకొట్టాడు. పాకిస్తాన్‌పై వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 71 (109 మ్యాచ్‌లు)వెస్టిండీస్- 71 (137 మ్యాచ్‌లు)శ్రీలంక- 59 (157 మ్యాచ్‌లు)ఇంగ్లండ్- 57 (92 మ్యాచ్‌లు)ఇండియా- 57 (135 మ్యాచ్‌లు)ఆసీస్ వర్సెస్ పాక్ తొలి వన్డే - ప్లేయింగ్ ఎలెవన్ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: ICC: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలకు భారత్ ఆతిథ్యం -
ఉత్కంఠ పోరులో పాక్‌పై ఆస్ట్రేలియా గెలుపు
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (నవంబర్ 4) జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో పాక్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (31 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. కమిన్స్‌కు మిచెల్ స్టార్క్ (2 నాటౌట్) సహకరించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 46.4 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. నసీం షా (39 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (71 బంతుల్లో 44; 2 ఫోర్లు, సిక్స్), బాబర్ ఆజమ్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు), షాహీన్ అఫ్రిది (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (35 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. అబ్దుల్లా షఫీక్ (12), సైమ్ అయూబ్ (1), కమ్రాన్ గులామ్ (5), అఘా సల్మాన్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మెయిడిన్లు ఉన్నాయి. కమిన్స్, జంపా, అబాట్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఓ దశలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లు మధ్యలో పుంజుకోవడంతో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయి, ఓటమి దిశగా పయనించింది. ఈ సమయంలో కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కమిన్స్‌తో పాటు స్టీవ్ స్మిత్ (44), జోష్ ఇంగ్లిస్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆసీస్ 33.3 ఓవర్లలో ఎనిమిది కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 16, లబూషేన్ 16, ఆరోన్ హార్డీ 10, మ్యాక్స్‌వెల్ 0, సీన్ అబాట్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, షాహీన్ అఫ్రిది 2, నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్ నవంబర్ 8న అడిలైడ్ వేదికగా జరుగనుంది. -
IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్‌గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్‌రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.మన లీడర్.. మన కెప్టెన్వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్‌ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్‌లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది. ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్‌రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్లు వదిలేశాయిఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్‌కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక ధర వీరికేఅందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.ఇక ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్‌కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది. పంజాబ్ మరీ ఇద్దరినేపంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న రిషబ్ పంత్‌ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచలేదు. రింకూ సింగ్‌కు జాక్‌పాట్.. ధోనీ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు కోల్‌కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్‌కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్‌పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి. బేబీ మలింగకు రూ. 13 కోట్లుజాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. రాజస్తాన్ రైట్రైట్రిటైనింగ్లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.పూరన్ కోసం అంత అవసరమా?కేఎల్ రాహుల్‌ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది. వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్). చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IPL 2025: ‘కమిన్స్‌ను వదిలేయనున్న సన్‌రైజర్స్! కారణం ఇదే’
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాతను మార్చేశాడు ప్యాట్ కమిన్స్. మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టును తన కెప్టెన్సీ నైపుణ్యాలతో ఏకంగా ఫైనల్ చేర్చాడు. ఆఖరి మెట్టుపై రైజర్స్ తడబడ్డా.. అక్కడి దాకా జట్టు సాగించిన విధ్వంసకర పరుగుల ప్రయాణం ఐపీఎల్ చరిత్రలోనే ఓ అద్బుతం లాంటిది.నిజానికి ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం సన్‌రైజర్స్ ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసినపుడు విమర్శలే ఎక్కువగా వచ్చాయి. ఈ ఫాస్ట్ బౌలర్ కోసం భారీ మొత్తం వెచ్చించడం వల్ల ప్రయోజనం ఉండదని చాలా మంది మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు.సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగాఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కమిన్స్ సారథ్యంలోని జట్టు సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగా వచ్చింది. ఇక బౌలర్‌గానూ, సారథిగానూ కమిన్స్.. ఫ్రాంఛైజీ తనపై పెట్టిన పెట్టుబడికి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. వచ్చే ఏడాది కూడా తానే కెప్టెన్‌గా ఉండాలనేంత బలంగా ముద్ర వేశాడు. ఫ్రాంఛైజీ సైతం కమిన్స్‌నే నాయకుడిగా కొనసాగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. సన్‌రైజర్స్ కమిన్స్‌ను అట్టిపెట్టుకోదని.. వేలానికి ముందు అతడిని టీమ్ నుంచి రిలీజ్ చేస్తుందని జోస్యం చెప్పాడు. తాను ఇలా అనడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు. కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి‘‘ప్యాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానో.. లేదోనన్న అంశంపై స్పష్టత లేదని చెప్పాడు. ఆస్ట్రేలియాకు ఉన్న బిజీ షెడ్యూల్ ఇందుకు కారణం. యాషెస్, వరల్డ్‌కప్స్.. ఇలా కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి.ఒకవేళ ఆసీస్ షెడ్యూల్‌కు ఐపీఎల్ షెడ్యూల్ అడ్డు రానట్లయితే.. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్లో కొత్త నిబంధనలు వచ్చాయని కూడా కమిన్స్ చెప్పాడు. మరి అతడి నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియదు.హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదువేలంలో తన పేరు నమోదు చేసుకుని.. ఆ తర్వాత తప్పుకొన్న సందర్భాలు లేవని కూడా అతడే చెప్పాడు. గతంలో మిచెల్ స్టార్క్ వంటి ఆసీస్ ఆటగాళ్లు ఇలా చేసిన మాట వాస్తవం. అయితే, కమిన్స్ ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నాడు. నా అభిప్రాయం ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదు.ఎందుకంటే.. మొదటి ప్లేయర్‌గా అతడిని తీసుకుంటే 18 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ సీజన్లో కమిన్స్ బౌలర్‌గా.. కెప్టెన్‌గా అద్భుతంగా రాణించినా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడిని రిలీజ్ చేస్తుందనే నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.నిబంధనలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. మొత్తం ఆరుగురి(ఆర్టీఎమ్ కార్డుతో కలిపి)ని తమతో పాటే జట్లు అట్టిపెట్టుకోవచ్చు. ఇందులో ఐదుగురు క్యాప్డ్, కనీసం ఒక్కరు అన్క్యాప్డ్(ఇండియన్ ప్లేయర్స్) ఉండాలి. ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంటే మొదటి మూడు రిటెన్షన్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాలి.మిగతా రెండు రిటెన్షన్లకు రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వేలంలోకి వచ్చి అమ్ముడుపోయి.. సీజన్ ఆరంభానికి ముందు సహేతుక కారణాలు లేకుండా తప్పుకొంటే సదరు ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం విధిస్తారు.చదవండి: T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు -
కెప్టెన్‌గా అదొక్కటే నేను గెలవలేదు.. ఈసారి: కమిన్స్
ప్యాట్ కమిన్స్.. ఈ ఫాస్ట్‌బౌలర్ 2021లో ఆస్ట్రేలియా క్రికెట్ టెస్టు జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23 టైటిల్ గెలిచాడు. ఇక వన్డే ప్రపంచకప్-2023ట్రోఫీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతూ సక్సెస్ఫుల్ సారథిగా తనదైన ముద్ర వేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024 రూపంలో కమిన్స్‌కు కఠిన సవాలు ఎదురుకాబోతోంది. ఆసీస్‌కు ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఎంత ప్రతిష్టాత్మకమో .. టీమిండియాతో జరిగే ఈ టెస్టు సిరీస్ కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కెప్టెన్‌గా అదొక్కటే నేను గెలవలేదుతాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన కమిన్స్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నేను ఇప్పటి వరకు సాధించాలనుకుని.. సాధించలేకపోయింది ఏదైనా ఉందీ అంటే.. అది టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడమే. కెప్టెన్‌గా నేను ఇప్పటి వరకు భారత్‌ను టెస్టు సిరీస్‌లో ఓడించనేలేదు. అయితే, మా జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు మాత్రం ఆ అదృష్టం దక్కింది.సారథిగా మారిన తర్వాత నాలో పెద్దగా మార్పులేమీ రాలేదు. నేను నాలాగే ఉంటూ జట్టును విజయపథంలో ముందుకు నడపడమే లక్ష్యంగా పనిచేస్తున్నా’’ అని తెలిపాడు. నాడు లీడింగ్ వికెట్ టేకర్గాతన కెప్టెన్సీ కెరీర్లో టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడం ముఖ్యమైనదని కమిన్స్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా కమిన్స్ 2017లో తొలిసారిగా టీమిండియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పుడు ఆసీస్ ఓడిపోయింది. అయితే, 2022-21లో భారత్‌తో నాలుగు టెస్టులాడిన ఈ పేసర్.. 21 వికెట్లతో సత్తా చాటాడు.డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రంఇక డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్లో కమిన్స్ బృందం.. టీమిండియాను ఓడించి ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజా సీజన్లోనూ ఈ రెండు జట్లే తుదిపోరుకు అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే, రెండింటిలో ఏది ముందు ఫైనల్ చేరుతుందోనన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. రోహిత్ సేన స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆడనున్న మూడు టెస్టుల్లో గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.టీమిండియాదే ఆధిపత్యంఅలా అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో ఫలితంతో సంబంధం ఉండదు. ఇదిలా ఉంటే.. భారత్- ఆసీస్ మధ్య నవంబరు నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో గెలిచి.. టైటిల్‌ను నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఆస్ట్రేలియా తమ పరాజయ పరంపరకు బ్రేక్ వేయాలని ఉవ్విళ్లూరుతోంది.ఇక గత నాలుగు సందర్భాల్లోనూ ఆసీస్‌ను ఓడించి భారత్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన అక్టోబరు 16 నుంచి కివీస్‌తో సిరీస్‌తో బిజీ కానుండగా.. కమిన్స్ బృందం నవంబరు 4 నుంచి పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనుంది.చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి... -
ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ వచ్చేశాడు! విధ్వంసకర వీరులు దూరం
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌తో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి వన్డేల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. వన్డే ప్రపంచ కప్ 2023 విజయం తర్వాత కమ్మిన్స్ వన్డేల్లో తొలిసారి ఆడనున్నాడు.పాట్ కమిన్స్‌తో పాటు వెటరన్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరోవైపు స్టార్ క్రికెటర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు.గత కొంత కాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న వీరిద్దరికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ ఆటగాళ్లు జాక్ ఫ్రెసర్ ముక్గర్క్, కూపర్ కొన్నోలీలు పాక్ సిరీస్‌కు ఎంపికయ్యారు. కాగా ఈ సిరీస్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. నవంబర్ 4న మెల్బోర్న్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో వన్డే నవంబర్ 8న ఆడిలైడ్‌లో రెండో వన్డే, నవంబర్ 10న పెర్త్‌లో ఆఖరి వన్డే జరగనుంది.ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిష్, జంపా -
మార్క్రమ్కు నో ఛాన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఖారారు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. మెగా వేలానికి ముందు మొత్తం ఆరుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకునే అవకాశాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కల్పించింది.ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అంతేకాకుండా ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్ విలువ రూ.90 కోట్లు ఉండేది. అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని రిటైన్ చేసుకోవాలనకుంటే తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని మొత్తం 10 ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంచైజీలు ఆయా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను దాదాపు ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.మార్క్రమ్కు నో ఛాన్స్?ఇక ఐపీఎల్-2024 సీజన్లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తాము అంటిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్‌ను ఖారారు చేసినట్లు సమాచారం. రెండు సీజన్లలో తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రోటీస్ స్టార్ ప్లేయర్ ఐడైన్ మార్క్రమ్ను వేలంలోకి విడిచిపెట్టాలని ఎస్ఆర్హెచ్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఇక ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(రూ.18 కోట్లు) తొలి ఆటగాటిగా రిటెన్షన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కమ్మిన్స్ ఈ ఏడాది సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలో కూడా ప్యాట్ అదరగొట్టాడు.కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడిని ఏకంగా రూ.20.50 కోట్ల భారీ ధరకు అతడిని ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం ఈ ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ చేశాడు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్(రూ.14 కోట్లు) రెండో ప్లేయర్‌గా, మూడో ఆటగాడిగా అభిషేక్ శర్మ(రూ.11 కోట్లు)లను ఎస్ఆర్హెచ్ అంటిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా నాలుగో ఆటగాడిగా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్(రూ.18 కోట్లు), ఐదో ప్లేయర్‌గా హెన్రిస్ క్లాసెన్(రూ.11 కోట్లు)ను రిటైన్ చేసుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుందంట. ఇక ఆంధ్ర స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తీసుకోవాలని కావ్యా మారన్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
టీమిండియాతో టెస్టులు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరుజట్ల మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్‌లకు ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సిరీస్ మొదలయ్యేనాటికి అతడు అందుబాటులోకి వచ్చినా బౌలింగ్ చేసే అవకాశం మాత్రం లేదని ఆస్ట్రేలియా టీమ్ డాక్టర్ పీటర్ బ్రూక్నర్ వ్యాఖ్యల ద్వారా వెల్లడైంది.ఫైనల్‌కు చేరే దారిలోప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు చేరుకునే టీమిండియా- ఆస్ట్రేలియా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ప్యాట్ కమిన్స్ బృందం రెండోస్థానంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరులో టెస్టు సిరీస్ మొదలుకానుంది.ఇందులో భాగంగా నవంబరు 22- జనవరి 7 వరకు ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆధిపత్యమే కొనసాగుతున్న వేళ.. సొంతగడ్డపై సత్తా చాటాలని కంగారూ జట్టు పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక సిరీస్‌కు ముందు కామెరాన్ గ్రీన్ ఫిట్‌నెస్‌లేమి రూపంలో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది.గ్రీన్‌కు వెన్నునొప్పిఇటీవల ఇంగ్లండ్‌తో వన్డేల సందర్భంగా గ్రీన్‌కు వెన్నునొప్పి వచ్చింది. దీంతో సిరీస్ మొత్తానికి అతడు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నా.. టీమిండియాతో సిరీస్‌లో మాత్రం బౌలింగ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం గురించి ఆసీస్ టీమ్ డాక్టర్ పీటర్ బ్రుక్నర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం గ్రీన్ వెన్నునొప్పి కాస్త తగ్గిందనే చెబుతున్నాడు.బౌలింగ్ చేస్తే మొదటికే మోసంఅయితే, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా గాయం తీవ్రత ఎలా ఉందో అంచనా వేస్తాం. వెన్నుపై ఒత్తిడి ఎక్కువైతే కచ్చితంగా మళ్లీ నొప్పి తిరగబెడుతుంది. ముఖ్యంగా బౌలింగ్ చేస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. అయితే, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడం వల్ల పెద్దగా ప్రభావం పడకపోవచ్చు’’ అని తెలిపాడు. కాగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గ్రీన్ సేవల్ని గనుక ఆసీస్ కోల్పోతే.. స్టార్ బౌలర్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌తో పాటు మిచెల్ మార్ష్ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
Ind vs Ban: అశ్విన్ ఇంకో నాలుగు వికెట్లు తీశాడంటే..
టెస్టు కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటికే భారత్ తరఫున సంప్రదాయ క్రికెట్లో 522 వికెట్లు పూర్తి చేసుకున్న ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా బంగ్లాదేశ్ ఇటీవల జరిగిన తొలి టెస్టులో అశూ అదరగొట్టాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్సొంతమైదానం చెన్నైలోని చెపాక్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి విలువైన శతకం(113) బాదడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా బంగ్లాపై టీమిండియా 280 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత్- బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు(సెప్టెంబరు 27) కాన్పూర్‌లో మొదలుకానుంది.నాలుగు వికెట్లు తీస్తే..ఈ నేపథ్యంలో అశ్విన్ ఓ అరుదై రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాతో రెండో టెస్టులో గనుక ఈ దిగ్గజ స్పిన్నర్ నాలుగు వికెట్లు తీస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సాధిస్తాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌ను అధిగమించి మొదటిస్థానానికి చేరుకుంటాడు. ఈ డబ్ట్యూటీసీ తాజా సీజన్లో హాజిల్‌వుడ్ ఇప్పటి వరకు 51 వికెట్లు తీయగా.. అశూ 48 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ చేరడమే లక్ష్యంగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 51రవిచంద్రన్ అశ్విన్ఇండియా)-48ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 48మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)-48క్రిస్ వోక్స్(ఇంగ్లండ్)-43నాథన్ లియోన్(ఆస్ట్రేలియా)-43.చదవండి: అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే: కమిన్స్ -
అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే: కమిన్స్
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ టెస్టు(బీజీటీ) సిరీస్‌కు సమయం ఆసన్నమవుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు రోహిత్ సేన నవంబరులో కంగారూ దేశంలో పర్యటించనుంది. ఈ ఆసక్తికర పోరుకు ఇంకా దాదాపు రెండు నెలల వ్యవధి ఉన్నా.. ఇప్పటి నుంచే గెలుపోటములపై విశ్లేషకులు, అభిమానుల మధ్య చర్చ మొదలైంది.సీనియర్లు లేకుండానేమరోవైపు.. ఆసీస్ స్టార్లు సైతం టీమిండియాతో సిరీస్‌కు తామెంతగానో నిరీక్షిస్తున్నామని.. యాషెస్ మాదిరి మజా అందించే మరో పోరు ఇదేనంటూ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. కాగా గత నాలుగు పర్యాయాలుగా బీజీటీ సిరీస్ భారత్‌దేనన్న విషయం తెలిసిందే.అయితే, ఆఖరిగా కంగారూ గడ్డపై సిరీస్ గెలిచినపుడు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే వంటి వెటరన్ ప్లేయర్లు జట్టుతో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నం. అయితే, రిషభ్ పంత్ గతంలో మాదిరి బ్యాట్ ఝులిపిస్తే మాత్రం ఆసీస్‌కు తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో కమిన్స్ మాట్లాడుతూ.. టీమిండియాను నిలువరించాలంటే పంత్‌ను కట్టడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే‘‘నాకు తెలిసి భారత ఆటగాళ్లు ఇక్కడా దూకుడుగానే ఆడతారు. ముఖ్యంగా రిషభ్ ఎక్కువగా అద్భుతమైన రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం కూడా! ఈ సిరీస్‌లో అతడు కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి పంత్‌ను కట్టడి చేస్తే మా పని సగం పూర్తవుతుంది’’ అని కమిన్స్ పంత్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు.నాడు పంత్ వీరోచిత ఇన్నింగ్స్2020-21 పర్యటన సందర్భంగా సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ 97 పరుగులతో దుమ్ములేపి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచాడు. ఇక ఆఖరిదైన గాబా టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. టీమిండియా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ఆసీస్ గడ్డపై భారత్ సిరీస్ విజయం సాధించేలా చేశాడు. రీఎంట్రీలో శతక్కొట్టిఇక ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడిన పంత్ 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాత.. దాదాపు రెండేళ్లకు పంత్ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని తొలి టెస్టులో శతకం(109)తో కదం తొక్కాడు. పునరాగమనంలో మొత్తంగా 148 పరుగులు సాధించాడు.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
రెండోసారి తండ్రి కాబోతున్న సన్‌రైజర్స్ కెప్టెన్!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘మా బేబీకి సంబంధించిన శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది!మా జీవితాలను మరింత క్రేజీగా మార్చేందుకు వస్తున్న చిన్నారి కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని బెకీతో పాటు కమిన్స్ ఇన్‌స్టాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య బెకీ, కుమారుడు ఆల్బీ ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో బెకీ బేబీ బంప్‌తో కనిపించగా.. ఆల్బీ తల్లిని ముద్దాడుతున్నాడు.కుమారుడి సమక్షంలో వివాహంకాగా ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ 2020లో బెకీ బోస్టన్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట 2022లో వివాహ బంధంతో ఒక్కటైంది. పెళ్లికి ముందే వీరికి అల్బీ(2021) జన్మించాడు. తాజాగా మరోసారి కమిన్స్- బెకీ తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా కమిన్స్ ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.మూడేళ్లుగా నిరాశాజనక ప్రదర్శనతో డీలా పడ్డ రైజర్స్‌ను ఏకంగా ఫైనల్‌కు చేర్చి ఆరెంజ్ ఆర్మీ హృదయాలు గెలుచుకున్నాడు కమిన్స్. ఐపీఎల్ సమయంలో కమిన్స్‌తో పాటు బెకీ, ఆల్బీ.. ఇతర కుటుంబ సభ్యులు సైతం హైదరాబాద్‌కు విచ్చేశారు.ఎనిమిది వారాల విరామంటీ20 ప్రపంచకప్-2024లో ఆసీస్ సెమీస్‌లోనే నిష్క్రమించగా.. కమిన్స్ అప్పటి నుంచి ఎనిమిది వారాల పాటు విరామం తీసుకున్నాడు. టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు ఈ బ్రేక్ తీసుకున్న కమిన్స్.. ఏ ఆటగాడికైనా విరామం కచ్చితంగా అవసరమని పేర్కొన్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ సైకిల్లో భాగంగా వరుస టెస్టులు ఆడాల్సిన నేపథ్యంలో తాను ఈ మేరకు విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించాడు. View this post on Instagram A post shared by Rebecca Jane Cummins (@becky_cummins) -
భారత్‌తో సిరీస్.. ఆ ఇద్దరు కీలకం: కమిన్స్
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో భారత్‌తో స్వదేశంలో జరగనున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో పేస్ ఆల్‌రౌండర్లు కామెరూన్ గ్రీన్, మిషెల్ మార్ష్ కీలకమవుతారని ఆ్రస్టేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. వీరిద్దరూ అందుబాటులో ఉంటే ప్రధాన పేసర్లపై భారం తగ్గడంతో పాటు... బ్యాటింగ్ లైనప్ బలం పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ‘పేస్ ఆల్‌రౌండర్లు ఉండటం వల్ల అదనపు ప్రయోజనమే. వేసవిలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో గ్రీన్, మార్ష్ కీలకం అవుతారు. గతంలో వారిని పెద్దగా వినియోగించుకోలేదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నం. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ బౌలర్‌గానే కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు తగినంత అనుభవం కూడా సాధించాడు. వీరిద్దరి వల్ల జట్టు సమతుల్యం పెరుగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. నాథన్ లయన్ వంటి సీనియర్ స్పిన్నర్ ఉండటం మా అదృష్టం’ అని కమిన్స్ పేర్కొన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై జరిగిన గత రెండు బోర్డర్–గవాస్కర్ ట్రోఫీల్లో పరాజయం పాలైన ఆసీస్... ఈసారి సిరీస్ ఎలాగైనా సిరీస్ చేజిక్కించుకోవాలని ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. -
ఆసీస్ ప్లేయర్ల కన్నంతా ఆ సిరీస్‌పైనే.. ఈసారి ఎలాగైనా టీమిండియాను ఓడించాలని..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఈ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు గత ఎనిమిది సంవత్సరాలుగా గోతి కాడి నక్కలా కాచుకు కూర్చున్నారు. ఈ విషయం ఆస్ట్రేలియా ఆటగాళ్ల తాజా వ్యాఖ్యల్లో తేటతెల్లమైంది. బీజీటీ 2024-25 నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటి నుంచే టీమిండియాపై మాటల యుద్ధాన్ని మొదలుపెట్టారు. బీజీటీ తమకు యాషెస్ కంటే ముఖ్యమని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు గాయాల బారిన పడకుండా ఉండేందుకు కొంతకాలం క్రికెట్‌కు సైతం దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నాడు. కమిన్స్ కెప్టెన్సీ కెరీర్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒక్కటే లోటు. ఆసీస్ కెప్టెన్‌గా అతను సాధించాల్సివన్నీ సాధించాడు. ప్రస్తుత ఆసీస్ జట్టులోనూ చాలామంది ఆటగాళ్లకు బీజీటీ అందని ద్రాక్షాగానే ఉంది. దీంతో ఈసారి ఎలాగైన దాన్ని దక్కించుకుని తీరాలని ఆసీస్ ఆటగాళ్లంతా కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇందులో భాగంగా కమిన్స్‌తో పాటు హాజిల్‌వుడ్, నాథన్ లయోన్ భారత ఆటగాళ్లతో మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. ఈసారి ఎలాగైనా భారత్‌ను ఓడించి తీరతామని వారు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈసారి బీజీటీ తమ దేశంలోనే జరుగుతుంది కాబట్టి భారత్‌ను సునాయాసంగా మట్టికరిపిస్తామని చెబుకుంటున్నారు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా చివరిసారిగా 2014-15లో కైవసం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా నాలుగు సిరీస్‌ల్లో, ఇంటాబయటా భారతే ఆ ట్రోఫీని చేజిక్కించుకుంది. 2016-17, 2022-23 ఇండియాలో.. 2018-19, 2020-21లో ఆసీస్‌లో టీమిండియా బీజీటీని నెగ్గింది. గతానికి భిన్నంగా ఈసారి బీజీటీ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా సాగనుంది. ఈ సిరీస్ కోసం భారత్ నవంబర్‌లో ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ నవంబర్ 22న, రెండో టెస్ట్ డిసెంబర్ 6న, మూడో టెస్ట్ డిసెంబర్ 14న, నాలుగో టెస్ట్ డిసెంబర్ 26న, ఐదో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3న ప్రారంభం కానున్నాయి. -
భారత్‌తో టెస్టు సిరీస్.. ఆసీస్ కెప్టెన్ కీలక నిర్ణయం!
ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది ఓసారి జరిగే ఈ సిరిస్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు.యాషెస్ సిరీస్ తర్వాత ఆత్యధిక ఫాలోయింగ్ ఉండే సిరీస్ ఇదే. ఈసారి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుండటం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరగా 1991-92లో ఆసీస్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరిగింది. గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు ఈసారి భారత్‌పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్ భావిస్తోంది.కమ్మిన్స్ కీలక నిర్ణయం..ఈ క్రమంలో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశంలో టీమిండియాతో టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని కమ్మిన్స్ ఎనిమిది వారాల పాటు బౌలింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు.తొలుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నద్దమయ్యేందుకు దేశీవాళీ క్రికెట్లో కమ్మిన్స్ ఆడనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతుండడంతో దేశీవాళీ టోర్నీకు దూరంగా ఉండాలని కమ్మిన్స్ భావిస్తున్నాడు."దాదాపుగా 18 నెలల (ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్) నుంచి కంటిన్యూగా బౌలింగ్ చేస్తున్నాను. బాగా ఆలిసిపోయాను. ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏడు నుంచి ఎనిమిది వారాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాను. తద్వారా నా శరీరానికి పూర్తి విశ్రాంతి లభిస్తుంది. అయితే జిమ్‌లో మాత్రం నా సాధనను నేను కొనసాగిస్తాను. ఇప్పటివరకు నా కెరీర్లో గెలవని ట్రోఫీ ఎదైనా ఉందంటే అది బీజీటీనే. నేనే కాదు జట్టులో చాలా మంది ఆటగాళ్లు కూడా ఈ ట్రోఫీని ముద్దాడలేదని" ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
ఇంగ్లండ్ టూర్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా! కెప్టెన్ ఎవరంటే?
ఇంగ్లండ్, స్కాట్లాండ్లతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. ఓవరాల్‌గా యూనైటడ్ కింగడమ్ టూర్‌కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కంగారులు యూకే పర్యటనలో భాగంగా తొలుత స్కాట్లాండ్తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 2న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆసీస్ ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పర్యటన సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లతో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ సెలక్టర్లు రెస్ట్ ఆస. అయితే వీరు ముగ్గురూ వన్డే జట్టులో భాగమయ్యారు.ఈ టూర్లో ఆసీస్ వన్డే, టీ20 జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. కాగా యువ ఆటగాడు కూపర్ కొన్నోలీకి తొలిసారి ఆసీస్ జట్టులో దక్కింది. అదేవిధంగా యువ సంచలనం ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు వన్డే, టీ20 జట్టులో చోటు దక్కింది.స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20లకు ఆసీస్ జట్టుమిచిల్ మార్ష్ (కెప్టెన్),. జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ. టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. కామెరాన్ గ్రీన్. ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచ్ మార్ష్ (కెప్టెన్). సీన్ అబాట్. అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్. ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్. ట్రావిస్ హెడ్. జోష్ ఇంగ్లిస్. మార్నస్ లాబుస్చాగ్నే. గ్లెన్ మాక్స్వెల్. మాథ్యూ షార్ట్. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం.. ఆఫ్ఘన్ల సంబురాలు మామూలుగా లేవుగా..!
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే పెద్దగా జట్టుగా పేరు తెచ్చుకుంటున్న ఆప్ఘనిస్తాన్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లో సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. సూపర్-8 సమరంలో మాజీ జగజ్జేత ఆస్ట్రేలియాకు జీర్ణించుకోలేని ఓటమిని రుచి చూపించింది. Dwayne Bravo 'Champion' celebrations in Afghanistan team bus. 🇦🇫 pic.twitter.com/PQEmnexV4f— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024సూపర్-8 గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో అండర్ డాగ్ ఆఫ్ఘనిస్తాన్.. పటిష్టమైన ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించి పెను సంచనలం సృష్టించింది. ఈ విజయం అనంతరం ఆఫ్ఘన్ ప్లేయర్లు, ఆ జట్టు అభిమానుల సంబురాలు అంతా ఇంతా కాదు. వారి విజయోత్సవాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. బహుశా వారు స్వాతంత్ర్యం పొందినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. THE DRESSING ROOM CELEBRATION OF AFGHANISTAN. 🥶pic.twitter.com/rzVztmrUTp— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024ఆసీస్‌పై చారిత్రక విజయం అనంతరం ఆఫ్ఘన్ హీరో గుల్బదిన్ నైబ్‌ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి మోసుకెళ్లి సంబురాలు చేసుకోగా.. ఆఫ్ఘన్ వీధుల్లో ఆ దేశ పౌరుల సంబురాలు అంబరాన్నంటాయి. ఆ దేశ రాజధాని కాబుల్ వీధుల్లో జనాలు రోడ్లపైకి వచ్చి టపాసులు కాలుస్తూ.. కేరింతలు కొడుతూ సంబురాలు చేసుకున్నారు. ఈ సంబురాలు ఒక్క కాబుల్కే పరిమితం కాలేదు. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఈ విజయాన్ని పండుగలా సెలబ్రేట్ చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలోనే బహుశా ఇంతమంది జనాలు బయటికి వచ్చి సమూహిక సంబురాలు చేసుకుని ఉండరు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆఫ్ఘన్లు సంబరపడిపోతున్నారు. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇది చిరస్మరణీ విజయంగా మిగిలిపోనుంది.Celebrations in Afghanistan. 🇦🇫- A historic victory! pic.twitter.com/wHA1Xl9CgL— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024రాణించిన గుర్బాజ్, జద్రాన్.. వరుసగా రెండో మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్కింగ్స్టౌన్లోని ఆర్నోస్ వేల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు.. ఓపెనర్లు గుర్భాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3, జంపా 2, స్టోయినిస్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. అతనికి ఇది వరుసగా రెండో హ్యాట్రిక్. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించలేదు.రెచ్చిపోయిన ఆఫ్ఘన్ బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 19.2 ఓరవ్లలో 127 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ (4-0-24-4) ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. నవీస్ ఉల్ హక్ 3, ఒమర్జాయ్, నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్ (59) ఒంటిరి పోరాటం చేయగా.. మరో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు (మార్ష్ (12), స్టోయినిస్ (11)) చేశారు. ఆసీస్ బ్యాటర్ల ఈ దుస్థితిని క్రికెట్ అభిమానులు ఇప్పటివరకు చూసి ఉండరు. -
చరిత్ర సృష్టించిన కమ్మిన్స్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
ఆస్ట్రేలియా స్టార్ పేసర్, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా కింగ్స్టౌన్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన కమ్మిన్స్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.తొలుత 18వ ఓవర్ వేసిన కమ్మిన్స్ ఆఖరి బంతికి అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ 20 ఓవర్ వేసిన కమ్మిన్స్.. వరుస బంతుల్లోకరీం జనత్, గుల్బాదిన్ నైబ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.అంతకముందు ఇదే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. దీంతో వరల్డ్‌కప్ చరిత్రలోనే రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. అదేవిధంగా మరో కొన్ని రికార్డులను కూడా కమ్మిన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.కమ్మిన్స్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు.అంతర్జాతీయ టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాతో లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్ సౌతీ (న్యూజిలాండ్), మార్క్ పావ్లోవిక్ (సెర్బియా), వసీం అబ్బాస్ (మాల్టా), పాట్ కమ్మిన్స్ (ఆసీస్) ఉన్నారు. -
కమిన్స్ హ్యాట్రిక్, వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ.. ఆసీస్ చేతిలో చిత్తైన బంగ్లాదేశ్
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్ 21) ఉదయం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుణుడు ఆడ్డు తగలడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం మొదలయ్యే సమయానికి ఆసీస్ స్కోర్ 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులుగా ఉండింది.కమిన్స్ హ్యాట్రిక్ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇది తొలి హ్యాట్రిక్ కాగా.. టీ20 ప్రసంచకప్ టోర్నీల్లో ఆసీస్‌కు ఇది రెండో హ్యాట్రిక్. ఆసీస్ తరఫున తొలి హ్యాట్రిక్ 2007 ప్రపంచకప్ ఎడిషన్‌లో నమోదైంది. ఆ ఎడిషన్‌లో బ్రెట్ లీ బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ సాధించాడు.HAT-TRICK FOR PAT CUMMINS!!- Only the 2nd Australian to claim a hat-trick at the T20 World Cup. 🏆pic.twitter.com/qh0ZCFAkHF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్ (4-0-29-3), ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.వార్నర్ మెరుపు అర్ధ శతకం141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించి, డక్‌వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్‌తో (31) కలిసి ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు.