రెండోసారి తండ్రి కాబోతున్న సన్‌రైజర్స్‌ కెప్టెన్‌! | Pat Cummins Set To Become Father Again Wife Becky Shares Good News | Sakshi
Sakshi News home page

రెండోసారి తండ్రి కాబోతున్న సన్‌రైజర్స్‌ కెప్టెన్‌!

Aug 20 2024 8:55 PM | Updated on Aug 20 2024 9:05 PM

Pat Cummins Set To Become Father Again Wife Becky Shares Good News

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘మా బేబీకి సంబంధించిన శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది!

మా జీవితాలను మరింత క్రేజీగా మార్చేందుకు వస్తున్న చిన్నారి కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని బెకీతో పాటు కమిన్స్‌ ఇన్‌స్టాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య బెకీ, కుమారుడు ఆల్బీ ఫొటోలను షేర్‌ చేశాడు. ఇందులో బెకీ బేబీ బంప్‌తో కనిపించగా.. ఆల్బీ తల్లిని ముద్దాడుతున్నాడు.

కుమారుడి సమక్షంలో వివాహం
కాగా ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ 2020లో బెకీ బోస్టన్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట 2022లో వివాహ బంధంతో ఒక్కటైంది. పెళ్లికి ముందే వీరికి అల్బీ(2021) జన్మించాడు. తాజాగా మరోసారి కమిన్స్‌- బెకీ తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా కమిన్స్‌ ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

మూడేళ్లుగా నిరాశాజనక ప్రదర్శనతో డీలా పడ్డ రైజర్స్‌ను ఏకంగా ఫైనల్‌కు చేర్చి ఆరెంజ్‌ ఆర్మీ హృదయాలు గెలుచుకున్నాడు కమిన్స్‌. ఐపీఎల్‌ సమయంలో కమిన్స్‌తో పాటు బెకీ, ఆల్బీ.. ఇతర కుటుంబ సభ్యులు సైతం హైదరాబాద్‌కు విచ్చేశారు.

ఎనిమిది వారాల విరామం
టీ20 ప్రపంచకప్‌-2024లో ఆసీస్‌ సెమీస్‌లోనే నిష్క్రమించగా.. కమిన్స్‌ అప్పటి నుంచి ఎనిమిది వారాల పాటు విరామం తీసుకున్నాడు. టీమిండియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీకి ముందు ఈ బ్రేక్‌ తీసుకున్న కమిన్స్‌.. ఏ ఆటగాడికైనా విరామం కచ్చితంగా అవసరమని పేర్కొన్నాడు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ సైకిల్‌లో భాగంగా వరుస టెస్టులు ఆడాల్సిన నేపథ్యంలో తాను ఈ మేరకు విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement