Off the field
-
నీరజ్ చోప్రా ప్రేమ పెళ్లి.. ‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఇటీవలే వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. టెన్నిస్ క్రీడాకారిణి హిమానీ మోర్(Himani Mor)తో జనవరి 16న అతడి పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నీరజ్ షేర్ చేసిన తర్వాతే.. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.ఈ నేపథ్యంలో నీరజ్ భార్య హిమానీ మోర్ బ్యాగ్రౌండ్‌తో పాటు.. అత్తామామల నుంచి అతడు తీసుకున్న కట్నకానుకలు, అల్లుడిగా అందుకున్న బహుమతులు ఏమిటన్న అంశాల గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో నీరజ్‌కు పిల్లనిచ్చిన అత్తామామలు చంద్ర మోర్, మీనా మోర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.ప్రేమ పెళ్లి‘‘దేవుడి దయ వల్ల మా అమ్మాయికి మంచి భర్త దొరికాడు. దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తితో నా కూతురి పెళ్లి కావడం సంతోషంగా ఉంది. నీరజ్, హిమానీలకు గత రెండేళ్లుగా పరిచయం ఉంది. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, ఇరు కుటుంబాల అనుమతితోనే పెళ్లి చేసుకున్నారు’’ అని మీనా మోర్ దైనిక్ భాస్కర్‌కు తెలిపారు.‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?అదే విధంగా.. తమ అల్లుడు తమ నుంచి కట్నంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడని హిమానీ తల్లిదండ్రులు వెల్లడించారు. ఇది కాకుండా ఎలాంటి కట్నం, కానుకలు, బహుమతులు.. ఆఖరికి పెళ్లి కూతురికి తల్లిదండ్రులు ఇచ్చే వస్తువులు, దుస్తులను కూడా స్వీకరించలేదని తెలిపారు. తమ కూతురిని అచ్చంగా వాళ్లింటి అమ్మాయిని చేసుకున్నారని సంతోషంతో పొంగిపోయారు.కాగా హర్యానా అథ్లెట్లు నీరజ్- హిమానీల వివాహం హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. ఇక ప్రి వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జనవరి 14న నిశ్చితార్థం జరుగగా.. జనవరి 15న హల్దీ, మెహందీ, సంగీత్ నిర్వహించారు. జనవరి 16 మధ్యాహ్నం పెళ్లి తంతు పూర్తికాగా.. సాయంత్రం అప్పగింతల కార్యక్రమం జరిగింది. కేవలం అరవై మంది అతిథుల సమక్షంలోనే వివాహం జరగడం విశేషం. ఇక కొత్త జంట ఇప్పటికే హనీమూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.ఎవరీ హిమానీ మోర్?హర్యానాలోని లార్సౌలీ హిమానీ స్వస్థలం. సోనిపట్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ అండ్‌ఫిజికల్ సైన్స్‌లో పట్టా పుచ్చుకుంది. ఉన్నత విద్యనభ్యసించేందుకు హిమానీ అమెరికాకు వెళ్లింది.ప్రస్తుతం హిమానీ మెక్‌కోర్మాక్ ఐసెంబర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2018లో హిమానీ ఆలిండియా టెన్సిస్ అసోసియేషన్ ఈవెంట్లలో పాల్గొనడం ప్రారంభించింది. కెరీర్లో ఉత్తమంగా సింగిల్స్ విభాగంలో 42వ, డబుల్స్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంకు సాధించింది.నికర ఆస్తుల విలువ?కాగా హర్యానాలోని పానిపట్ జిల్లాలో గల ఖాంద్రా గ్రామంలో నీరజ్ చోప్రా ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. గతంలో ఆర్మీ సుబేదార్‌గా పనిచేశాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా.. ‘గోల్డెన్ బాయ్’గా ప్రసిద్ధి పొందాడు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నీరజ్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నీరజ్ నికర ఆస్తుల విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం? ఆమె ఎవరంటే?
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్(Cricketer Rinku Singh Engagement) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్(MP Priya Saroj)తో అతడి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రింకూ- ప్రియాల ఎంగేజ్మెంట్కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చెల్లెలితో రింకూ సింగ్బంధువుల కోలాహలంఈ నేపథ్యంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అటు రింకూ గానీ.. ఇటు ప్రియా గానీ నిశ్చితార్థం విషయమై అధికారికంగా స్పందించలేదు. అయితే, రింకూ చెల్లెలు నేహా సింగ్(Neha Singh) తన అన్నతో కలిసి ఉన్న ఫొటోలను తాజాగా షేర్ చేసింది. ఇందులో బంధువుల కోలాహలంతో పాటు.. ఇల్లంతా అలంకరించినట్లుగా కనిపిస్తోంది. దీనిని బట్టి నిశ్చితార్థం జరిగినట్లు నెటిజన్లు అంచనాకు వస్తున్నారు.పేద కుటుంబంలో జన్మించిన రింకూకాగా ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని పేద కుటుంబంలో రింకూ కుమార్ సింగ్ జన్మించాడు. అతడి తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కోసారి రింకూ కూడా తండ్రికి ఆరోగ్యం సహకరించనపుడు సిలిండర్లు వేసేవాడు. ఒకానొక సమయంలో స్వీపర్‌గానూ రింకూ పనిచేశాడు.కోటీశ్వరుడిగా ఎదిగిన రింకూఅయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా రింకూ మాత్రం క్రికెట్‌పై ప్రేమను వదులుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలుత ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అదరగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చి నయా ఫినిషర్‌గా ఎదిగాడు. ఆర్థికంగానూ స్థిరపడ్డాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్ 30 టీ20లు, రెండు వన్డేలు ఆడి 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఎవరీ ప్రియా సరోజ్?ఇక ప్రియా సరోజ్ విషయానికొస్తే.. వారణాసిలో 1998లో జన్మించిన ఆమె.. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంతరం.. అమిటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు.రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్న ప్రియా సరోజ్ 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. మచ్లిశహర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తన ప్రత్యర్థి బీపీ సరోజ్‌పై 35850 ఓట్ల తేడాతో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రియా సరోజ్ నికర ఆస్తుల విలువ రూ. 11.3 లక్షలుగా సమాచారం. ఇక ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేరాకట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, రింకూ- ప్రియల నిశ్చితార్థ వార్తలను తూఫానీ సరోజ్ తాజాగా ఖండించారు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025 -
వామిక, అకాయ్‌లతో బృందావనంలో విరాట్- అనుష్క! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయాడు. సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma), పిల్లలు వామిక(Vamika), అకాయ్(Akaay)లతో కలిసి ప్రేమానంద్ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా కెరీర్ పరంగా కోహ్లి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ విఫలంముఖ్యంగా టెస్టుల్లో నిలకడలేమి ఆట తీరు, వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నాడు కోహ్లి. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తేలిపోయిన ఈ ‘రన్‌మెషీన్’.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియాలోనూ చేతులెత్తేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రధాన కారణమయ్యాడు కోహ్లి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అంతేకాదు.. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి.. ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు.అంతేకాదు.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ప్రతిసారి బోల్తా పడి వికెట్ సమర్పించుకున్నాడు ఇక ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు.. ఈ పరాజయం కారణంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ రేసు నుంచి కూడా భారత జట్టు నిష్క్రమించింది.ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్లుతదుపరి ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానున్నాయి. ఆ తర్వాత వెంటనే చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి కోహ్లి భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మానసిక ప్రశాంతతకై ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఉన్న ప్రేమానంద్ మహరాజ్ దర్శనం చేసుకున్నాడు. ఆ సమయంలో భార్య అనుష్కతో పాటు.. కుమార్తె వామిక, చిన్నారి కుమారుడు అకాయ్ కూడా కోహ్లి వెంట ఉన్నారు.అనుష్క వల్లే కోహ్లి ఇలాఈ సందర్భంగా అనుష్క ప్రేమానంద్ మహరాజ్‌తో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇక్కడికి వచ్చినపుడు నా మనసులోని కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు వేరే వాళ్లు అడిగేశారు. ఈసారి ఇక్కడికి వచ్చినపుడు మాత్రం నా మనసులోని సందేహాలకు సమాధానం పొందాలని భావించాను. అయితే, ఈసారి కూడా వేరేవాళ్ల వల్ల నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇప్పుడు మాకు కేవలం మీ ఆశీస్సులు ఉంటే చాలు’’ అని పేర్కొంది.ఇక విరుష్క దంపతులు తన ముందు ప్రణమిల్లడం చూసి భావోద్వేగానికి గురైన ప్రేమానంద్ మహరాజ్.. ‘‘మీరు చాలా ధైర్యవంతులు. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన తర్వాత కూడా దేవుడి పట్ల ఇంత అణకువగా ఉండటం అందరికీ సాధ్యం కాదు,.భక్తి మార్గంలో నడుస్తున్న అనుష్క ప్రభావమే కోహ్లి మీద కూడా ఉంటుందని మేము అనుకుంటూ ఉంటాం. విరాట్ కోహ్లి తన ఆటతో దేశం మొత్తానికి సంతోషాన్ని పంచుతాడు. అతడు గెలిస్తే దేశమంతా సంతోషంగా ఉంటుంది. అంతలా ప్రజలు అతడిని ప్రేమిస్తున్నారు’’ అంటూ కోహ్లిపై ప్రశంసలు కురిపించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో వామిక, అకాయ్‌ల ముఖాలు కనిపించకుండా విరుష్క జోడీ జాగ్రత్తపడింది. కాగా ఈ జంట ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.చదవండి: భార్యను భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు: గుత్తా జ్వాల ఫైర్Virat Kohli and Anushka Sharma with their kids visited Premanand Maharaj. ❤️- VIDEO OF THE DAY...!!! 🙏 pic.twitter.com/vn1wiD5Lfc— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2025 -
భార్యను.. భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు?
పని గంటల గురించి ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్(SN Subramanyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల బంధాన్ని తక్కువ చేసేలా ఆయన మాట్లాడిన మాటలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎన్ సుబ్రమణ్యన్ కామెంట్లపై భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల(Jwala Gutta) ఘాటుగా స్పందించారు. ఉన్నత విద్యావంతులు కూడా మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ చురకలు అంటించారు.కాగా.. ‘భార్యను భర్త.. భర్తను భార్య ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి.. ఆదివారాలు కూడా ఆఫీసుకు రావాలి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ సుబ్రమణ్యన్ చేసిన కామెంట్లపై మెజారిటీ మంది నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పెట్టుబడిదారులు వేల కోట్లు ఆర్జిస్తూ.. తరతరాలకు సంపాదించిపెట్టడానికి సామాన్యుల శ్రమను దోచుకోవడం కోసం అభివృద్ధి అనే సాకును వాడుకోవడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భార్యను.. భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు?ఈ నేపథ్యంలో గుత్తా జ్వాల సైతం సుబ్రమణ్యన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. ‘‘అసలు నాకొకటి అర్థం కాని విషయం ఏమిటంటే.. భర్త భార్య వైపు తదేకంగా చూస్తూ ఎందుకు ఉండిపోకూడదు? అది కూడా ఆదివారం మాత్రమే ఇలాంటివి ఉంటాయా!!బాగా చదువుకున్న వాళ్లు.. ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ల నుంచి కూడా ఇలాంటి మాటలు వినాల్సి రావడం విచారకరం. ఇలాంటివి ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కావు. మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా.నిరాశ, భయంఅంతేకాదు స్త్రీల పట్ల వారికున్న చిన్నచూపును ఇంత బహిరంగంగా చెప్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. నిరాశగానూ.. భయంగానూ ఉంది’’ అని గుత్తా జ్వాల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదే విధంగా.. ఆదివారాలు కూడా పనిచేయడం అందరికీ ఇష్టం ఉండదని.. మానసిక ప్రశాంతత ఉండాలంటే తగిన విశ్రాంతి అవసరమని నొక్కివక్కాణించారు.ఏదేమైనా బహిరంగ వేదికపైన సుబ్రమణ్యన్ లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విమర్శించారు.డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్గాకాగా మహారాష్ట్రలో జన్మించిన గుత్తా జ్వాల హైదరాబాద్‌లో సెటిలయ్యారు. బాల్యం నుంచే బ్యాడ్మింటన్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. పద్నాలుగుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు. అశ్విని పొన్నప్పతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి జోడీగా జ్వాల- అశ్విని ద్వయం నిలిచింది.ఇక 2011లో లండన్‌లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్స్‌లో కాంస్యం గెలిచిన గుత్తా జ్వాల.. 2010 కామన్వెల్త్ గేమ్స్ వుమెన్ డబుల్స్ విభాగంలో స్వర్ణం, 2014 గేమ్స్‌లో రజతం గెలిచారు. అదే విధంగా.. 2014లో ప్రతిష్టాత్మక ధామస్- ఉబెర్ కప్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 2009 బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్లో డిజు(లండన్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించి చరిత్ర సృష్టించారు.కాగా భారత బ్యాడ్మింటన్ రంగంలో డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్‌గా గుత్తా జ్వాల పేరొందారు. తన సేవలకు గానూ అర్జున అవార్డు పొందారు. కేవలం క్రీడా రంగంలోనే కాకుండా.. విద్య, వైద్య, మహిళా సాధికారికత, లింగ సమానత్వంపై కూడా గుత్తా జ్వాల తన గొంతును బలంగా వినిపిస్తున్నారు.నటుడితో రెండో వివాహంసహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో పెళ్లి చేసుకున్నారు గుత్తా జ్వాల. అయితే, ఆరేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం తమిళనటుడు, డివోర్సీ విష్ణు విశాల్(Vishnu Vishal)తో ప్రేమలో పడ్డ జ్వాల.. 2021లో అతడితో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్.. అవన్నీ నిజం కాకపోవచ్చు! -
అవన్నీ నిజం కాకపోవచ్చు: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో చహల్‌కు విభేదాలు తలెత్తాయని.. త్వరలోనే ఈ జంట విడిపోనుందనేది(Divorce Rumours) వాటి సారాంశం. అందుకు చహల్ సోషల్ మీడియా పోస్టులు ఊతమిచ్చాయి.పెళ్లి ఫొటోలు డిలీట్సతీమణి ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal) డిలీట్ చేశాడు. పెళ్లి ఫొటోలను కూడా తన అకౌంట్ల నుంచి తీసేశాడు. అంతేకాదు.. ఈ దంపతులు సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేశారు. అయితే, ధనశ్రీ ఇన్‌స్టా ఖాతాలో మాత్రం చహల్‌తో దిగిన ఫొటోలు అలాగే ఉన్నాయి.కాగా ధనశ్రీ చహల్‌ను మోసం చేస్తోందంటూ అప్పట్లో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరుతో ఆమె పేరును ముడిపెట్టి దారుణమైన కామెంట్లు, మీమ్స్ చేశారు కొంతమంది నెటిజన్లు. మరోవైపు.. చహల్ ఇటీవల ఓ పెళ్లికి మరో అమ్మాయితో కలిసి హాజరైనట్లు ఫొటోలు బయటకు వచ్చాయి.ఆర్జేతో డేటింగ్?అంతేకాదు.. మహ్వశ్ అనే రేడియో జాకీతో కలిసి చహల్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. వీటికి మహ్వశ్ ఫ్యామిలీ అనే ట్యాగ్ జతచేయడంతో చహల్‌తో ఆమె డేటింగ్ చేస్తుందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో చహల్ కూడా ధనశ్రీకి ద్రోహం చేశాడని.. దొందూ దొందేనంటూ ఈ జంటపై విమర్శల వర్షం కురుస్తోంది.ఈ పరిణామాలపై యజువేంద్ర చహల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ‘‘మీ ప్రేమ, మద్దతు వల్లే నేను ఈస్థాయికి చేరుకోగలిగాను. అందుకు నా అభిమానులందరికీ ఎల్లకాలం రుణపడి ఉంటాను. అయితే, ఇప్పటికి ఈ ప్రయాణం ఈ ముగిసిందా?.. లేదు.. నేను వేయాల్సిన ఓవర్లు ఇంకా మిగిలే ఉన్నాయి. నా దేశం కోసం.. నా జట్టు కోసం.. నా అభిమానుల కోసం నేను ఆడుతూనే ఉంటాను.నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాడిగా ఉండటం నాకెంతో గర్వకారణం. అదే విధంగా.. నేను ఓ కొడుకుని, ఒకరికి సోదరుడిని.. అలాగే చాలా మందికి స్నేహితుడిని. ఈ మధ్యకాలంలో నా వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై చాలా మందికి ఆసక్తి కలిగించడం సహజమే. అయితే, కొన్ని సోషల్ మీడియా పోస్టుల వల్ల పుడుతున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!అందరూ బాగుండాలిఓ కొడుకుగా.. సోదరుడిగా, స్నేహితుడిగా.. మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వదంతులు నా కుటుంబ దుఃఖానికి కారణమవుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎదుటివారికి అంతా మంచే జరగాలని కోరుకునేలా నా కుటుంబం నాకు విలువలు నేర్పించింది. అదే విధంగా.. అడ్డదారుల్లో వెళ్లకుండా.. అంకిత భావం, కఠిన శ్రమతోనే విజయాన్ని అందుకోవాలని చెప్పింది. నేను ఇప్పటికీ ఆ విలువలకే కట్టుబడి ఉన్నాను.ఆ దేవుడి దయ వల్ల మీ అందరి ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. కానీ మీ సానుభూతిని భరించలేను. లవ్ యూ ఆల్’’ అని చహల్ ఇన్‌స్టా స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు. అయితే, ఇందులో ఎక్కడా ధనశ్రీ పేరుగానీ, భర్త అనే పదం కానీ అతడు వాడలేదు. కాబట్టి విడాకుల విషయాన్ని చెప్పకనే చెప్పాడంటూ మరోసారి గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.డాన్స్ టీచర్‌తో ప్రేమలో పడికాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కొరియోగ్రాఫర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ నేర్చుకునే క్రమంలో ఆమెతో ప్రేమల్లో పడ్డ చహల్.. ఇరు కుటుంబాల సమ్మతంతో 2020, డిసెంబరు 20న ఆమెను వివాహం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో స్పిన్నర్‌గా సత్తా చాటాడు. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 అంతర్జాతీయ టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ 205 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది అతడు పంజాబ్ కింగ్స్‌కు ఆడనున్నాడు. చదవండి: వన్డే సిరీస్ నుంచి అతడికి విశ్రాంతి! -
విడాకులకు సిద్ధమైన టీమిండియా క్రికెటర్!
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal ) విడాకులకు సిద్ధమయ్యాడా?.. భార్య ధనశ్రీ వర్మతో అతడు విడిపోనున్నాడా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. చహల్ సోషల్ మీడియా అకౌంటర్లను గమనిస్తే అతడు త్వరలోనే ఈ చేదు వార్తను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది.హర్యానాకు చెందిన 34 ఏళ్ల చహల్ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్. 2016లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన చహల్.. వన్డే, టీ20లలో ప్రధాన స్పిన్ బౌలర్‌గా ఎదిగాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు 72 వన్డేలు, 80లు ఆడిన చహల్ ఆయా ఫార్మాట్లలో 121, 96 వికెట్లు తీశాడు.ఐపీఎల్ వికెట్ల వీరుడుఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనూ చహల్‌కు గొప్ప రికార్డు ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ టీ20 లీగ్‌లో 160 మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఏకంగా 205 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక చహల్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. కోవిడ్ లాక్డౌన్ సమయంలో యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో అతడు ప్రేమలో పడ్డాడు.కొరియోగ్రాఫర్‌తో వివాహంఈ క్రమంలో ఇరు కుటుంబాలను ఒప్పించిన చహల్- ధనశ్రీ డిసెంబరు 20, 2020లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, ధనశ్రీ పేరు మరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు కలిసి వినిపించడం.. గ్లామర్లోనూ ఆమె హీరోయిన్లకు ధీటుగా ఫొటోలు షేర్ చేయడం.. తదితర పరిణామాల నేపథ్యంలో విడాకుల అంశం తెరమీదకు వచ్చింది. విడాకులు తీసుకోవడమే తరువాయి అన్నట్లు వార్తలు రాగా.. చహల్- ధనశ్రీ అప్పట్లో సంయుక్తంగా విడాకుల విషయాన్ని ఖండించారు.అనంతరం ఇద్దరూ కలిసి ట్రిప్పులకు వెళ్లిన ఫొటోలు, ప్రత్యేకమైన సందర్భాలను కలిసి జరుపుకొన్న వీడియోలు షేర్ చేస్తూ.. తమ మధ్య విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు. అయితే, తాజాగా మరోసారి వీరు విడిపోతున్నారనే ప్రచారం(Divorce Rumours) ఊపందుకుంది. ఇందుకు కారణం సోషల్ మీడియాలో చహల్- ధనశ్రీ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేసిన చహల్ఇటీవల తమ వివాహ వార్షికోత్సవం(డిసెంబరు 22)న కూడా ఇద్దరూ ఎటువంటి పోస్ట్ పెట్టలేదు. అంతేకాదు.. చహల్ ధనశ్రీతో తన పెళ్లి ఫొటోలతో పాటు వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు. మరోవైపు.. ధనశ్రీ ఖాతాలో చహల్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు ప్రస్తుతానికి అలాగే ఉన్నా అవి ప్రమోషన్లలో భాగంగా తీసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి బంధం బీటలు వారిందనే సంకేతాలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే.. చహల్ చివరగా టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ మెగా ఈవెంట్ల ఒక్క మ్యాచ్‌లోనూ చహల్ ఆడకపోయినప్పటికీ చాంపియన్‌గా నిలిచిన జట్టులో ఉన్న కారణంగా ట్రోఫీని ముద్దాడాడు. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో చహల్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 18 కోట్ల మొత్తానికి అతడిని సొంతం చేసుకుంది.చదవండి: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఆగ్రహం -
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ
కొత్త సంవత్సరం వచ్చేసింది. నవ వసంతాన్ని తెచ్చింది. చేదు జ్ఞాపకాలను వదిలేసి.. మధురానుభూతులను పదిలం చేసుకుంటూ ముందుకు సాగిపొమ్మంటోంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు అక్కడే కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఐదో టెస్టు కోసం మంగళవారమే సిడ్నీకి చేరుకుని న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది.అనుష్కతో విరాట్ఇక భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మ(Viat Kohli- Anushka Sharma)తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, ప్రసిద్ కృష్ణతో కలిసి కొత్త సంవత్సర వేడులకు హాజరయ్యాడు. మరోవైపు.. యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ తదితరులు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 2024కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. ‘‘ఎన్నో ఎత్తు-పళ్లాలు.. అయినప్పటికీ ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది. థాంక్యూ 2024’’ అంటూ గతేడాదికి సంబంధించిన జ్ఞాపకాలను వీడియో రూపంలో షేర్ చేశాడు.టీ20 ప్రపంచకప్ గెలిచిన సారథిగాకాగా 2024 రోహిత్ శర్మకు ఎన్నో ఆనందాలతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలను ఇచ్చింది. కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్-2024 గెలవడం రోహిత్ కెరీర్లోనే అత్యంత గొప్ప విషయం. అయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవగానే హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు.ఐపీఎల్లో మాత్రం పరాభవంఇక అంతకంటే ముందే.. అంటే ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడిన రోహిత్ బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోయాడు. జట్టు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుగన పదో స్థానంలో నిలిచి ఘోర పరాభవం చవిచూసింది. అయితే, ఆ తర్వాత ప్రపంచ కప్ గెలుపు రూపంలో రోహిత్‌కు ఊరట దక్కింది.అదొక మాయని మచ్చగాఅనంతరం.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ కావడం రోహిత్ శర్మ కెప్టెన్సీ కెరీర్లోనే ఓ మాయని మచ్చగా మిగిలింది. సొంతగడ్డపై ఇంతకు మునుపెన్నడూ భారత టెస్టు జట్టు ప్రత్యర్థి చేతిలో ఇలా 3-0తో వైట్‌వాష్ కాలేదు. అలా అత్యంత చెత్త కెప్టెన్సీ రికార్డు 2024లో రోహిత్ పేరిట నమోదైంది.కుమారుడి రాకఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ రోహిత్ శర్మకు 2024 మరుపురానిదిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. గతేడాదే రోహిత్- రితికా జంట తమ రెండో సంతానం కుమారుడు అహాన్ శర్మకు జన్మనిచ్చారు. ఇక ఈ శుభవార్త తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మకు అక్కడ మాత్రం గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. బ్యాటర్‌గా, సారథిగానూ అతడు విఫలమయ్యాడు.అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్నా.. మెల్బోర్న్లో నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక ఆఖరిదైన సిడ్నీ టెస్టు(జనవరి 3-7)లో గెలిస్తేనే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంటుంది. చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్
PV Sindhu Marries Venkatta Datta Sai: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వ్యాపారవేత్త వెంకట దత్త సాయి(Venkatta Datta Sai)ని ఆదివారం ఆమె వివాహమాడింది. ఈ వేడుకకు సంబంధించిన తొలి ఫొటో సోమవారం బయటకు వచ్చింది.ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రికేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పీవీ సింధు- వెంకట దత్త సాయి పెళ్లి ఫొటోను షేర్ చేశారు. ‘ఉదయర్పూర్లో నిన్న సాయంత్రం.. మన బ్యాడ్మింటన్ చాంపియన్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు- వెంకట దత్త సాయి వివాహానికి హాజరుకావడం సంతోషంగా ఉంది.నూతన దంపతులకు శుభాకాంక్షల వెల్లువజీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలతో పాటు ఆశీర్వాదాలూ అందజేశాను’’ అని గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.కాగా జీవితంలోని ప్రత్యేకమైన ఘట్టంలో సింధు- వెంకట దత్త సాయి వెండి రంగు దుస్తుల్లో తళుక్కుమన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం.రాజస్తాన్‌లో పెళ్లిరాజస్తాన్లోని ఉదయ్‌పూర్‌లోని రాజకోట వంటి వేదికపై సింధు- వెంకట దత్త సాయి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా వరుడు మరెవరో కాదు.. సింధుకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఇరు కుటుంబాల పెద్దల నిర్ణయం మేరకు వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మంగళవారం(డిసెంబరు 24) సింధు- వెంకట దత్త సాయి వివాహ రిసెప్షన్ జరుగనుంది.రెండు ఒలింపిక్ పతకాలుకాగా రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తెలుగు తేజం సింధు.. టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తద్వారా భారత్ తరఫున వరుసగా రెండు ఎడిషన్లలో ఒలింపిక్ పతకాలు గెలిచిన ప్లేయర్‌గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అయితే, ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.ఈ వార్త చదవండి: IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై.. Pleased to have attended the wedding ceremony of our Badminton Champion Olympian PV Sindhu with Venkatta Datta Sai in Udaipur last evening and conveyed my wishes & blessings to the couple for their new life ahead.@Pvsindhu1 pic.twitter.com/hjMwr5m76y— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 23, 2024 -
నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?: మండిపడ్డ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సహనం కోల్పోయాడు. తన అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా భార్యాపిల్లలతో కలిసి ఆసీస్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్ మ్యాచ్‌లు ముగియగా.. తదుపరి భారత్- ఆస్ట్రేలియా మెల్బోర్న్లో తలపడనున్నాయి.వామిక, అకాయ్‌ల వీడియో తీశారనిఇందుకోసం కోహ్లి కుటుంబంతో కలిసి మెల్బోర్న్ వినామాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, ఆ సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కోహ్లితో పాటు అతడి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌ల వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. సదరు వ్యక్తుల దగ్గరకు వెళ్లి మరీ గట్టిగా హెచ్చరించాడు.నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?అనంతరం మరోసారి మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విరాట్ కోహ్లి.. ‘‘నా పిల్లలు ఉన్నపుడు నాకు కాస్త ప్రైవసీ ఇవ్వాలి కదా? నా అనుమతి లేకుండా వాళ్ల ఫొటోలు, వీడియోలు ఎలా తీస్తారు?’’ అని ప్రశ్నించాడు. నిజానికి.. కోహ్లి ఫ్యామిలీతో కలిసి వచ్చేసరికి ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను కొంత మంది విలేకరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు.అయితే, అదే సమయంలో కోహ్లి ఎంట్రీ ఇవ్వడంతో అన్ని కెమెరాలు అతడి వైపు తిరిగాయి. ఇక పిల్లల గురించి హెచ్చరిస్తూ కోహ్లి కాస్త సీరియస్ కావడంతో.. తాము వామిక, అకాయ్‌ల ఫొటోలు, వీడియోలు తీయలేదని వారు సమాధానం ఇచ్చారట. దీంతో శాంతించిన కోహ్లి వారితో కరచాలనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.పెర్త్‌లో సెంచరీ మినహాఇదిలా ఉంటే.. ఆసీస్‌తో పెర్త్ టెస్టులో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టు(డిసెంబరు 26-30) ఇరుజట్లకు మరింత కీలకంగా మారింది. ఇక ఈ సిరీస్‌లో పెర్త్‌లో సెంచరీ చేయడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో అతడి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలుIndian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024 -
పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్‌తో రిలేషన్!.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధుకు పెళ్లి గడియలు సమీపించాయి. వెంకట దత్తసాయి(Venkata DattaSai) అనే వ్యక్తితో ఆమె వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా నిర్దారించారు.ఆసక్తికర విషయాలుఈ నేపథ్యంలో పీవీ సింధుకు కాబోయే భర్త, వరుడు వెంకట దత్తసాయి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటన్న అంశం గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా అందుకున్నారు.అంతకంటే ముందు.. ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఇక బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డాటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో వెంకట దత్తసాయి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.ఢిల్లీ క్యాపిటల్స్తోనూఅనంతరం.. బహుళజాతి సంస్థ జేఎస్‌డబ్ల్యూ(జిందాల్ సౌత్ వెస్ట్)లో వెంకట దత్తసాయి తన కెరీర్ మొదలుపెట్టారు. అక్కడ సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్హౌజ్గా కన్సల్టెంట్‌గా పనిచేశారు. అయితే, తన విధుల్లో భాగంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూపునకు చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ ఆయన కలిసి పనిచేసినట్లు సమాచారం.లింక్డిన్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు.. ‘‘ఐపీఎల్ జట్టు నిర్వహణతో పోలిస్తే నా బీబీఏ డిగ్రీ తక్కువగానే అనిపించవచ్చు. అయితే, ఈ రెండింటి నుంచి నేను కావాల్సినంత విజ్ఞానం పొందాను’’ అని వెంకట దత్తసాయి రాసుకొచ్చారు.కృతజ్ఞతలు సింధుఇక గతంలోనూ వెంకట దత్తసాయి, పీవి సింధుకు లింక్డిన్లో రిప్లై ఇచ్చిన తీరును కూడా నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. దత్తసాయి తండ్రిని ఉద్దేశించి.. ‘‘లింక్డిన్‌లోకి స్వాగతం అంకుల్. ఈ ప్లాట్‌ఫామ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి’’ అని పీవీ సింధు పేర్కొనగా.. ‘‘నాన్నను స్వాగతించినందుకు కృతజ్ఞతలు సింధు’’ అని వెంకట దత్తసాయి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్ వేదికగాకాగా వెంకట దత్తసాయి ప్రస్తుతం ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక పీవీ సింధు వివాహానికి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. డిసెంబరు 22న పెళ్లి జరుగనుంది. రెండురోజుల తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక సింధు- వెంకట దత్తసాయి కుటుంబాలకు ఇది వరకే పరిచయం ఉంది. కాగా సింధు 2016 రియో విశ్వ క్రీడల్లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భార్య అంటే శ్రీకాంత్‌కు ఎంత ప్రేమో!.. చెప్పినట్లే విన్నాడు! వీడియో
Srikanth Kidambi - Shravya Varma Wedding Reception: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లిపీటలెక్కాడు. టాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లో శనివారం అంగరంగ వైభవంగా శ్రీకాంత్- శ్రావ్యల పెళ్లి జరిగింది.రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునబ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌తో పాటు పలువురు క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాగా.. శ్రావ్య తరఫున టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, కీర్తి సురేశ్ తదతర స్టార్లు వీరి పెళ్లిలో సందడి చేశారు. ఇక ఆదివారం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తదితర విశిష్ట అతిథులు తళుక్కుమన్నారు.కాగా కొంతకాలంగా ప్రేమలో ఉన్న శ్రీకాంత్- శ్రావ్య పెద్దల అంగీకారంతో ఒక్కటైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి అన్యోన్య బంధానికి అద్దంపట్టేలా ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రిసెప్షన్ వేడుకలో శ్రావ్య భారీ లెహంగా ధరించిగా.. శ్రీకాంత్ వైట్సూట్లో మెరిసిపోయాడు.నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా!అయితే, పార్టీ మొదలుకావడానికి ముందే నాగార్జున హాల్లో అడుగుపెట్టాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో శ్రావ్యకు ఫోన్ చేశాడు. దీంతో కంగారూపడిన శ్రావ్య.. ‘‘నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా’’అంటూ భర్త శ్రీకాంత్‌కు ఫోన్ చేసింది. వెంటనే శ్రీకాంత్ శ్రావ్యతో కలిసి లిఫ్ట్‌లోకి చేరుకున్నాడు.‘‘నేను వేగంగా వెళ్లాలి కాబట్టి.. నువ్వు నా లెహంగాను పట్టుకోవాలి’’ అంటూ శ్రావ్య భర్తకు ప్రేమపూర్వకంగా ఆర్డర్ వేసింది. అందుకే ఎంచక్కా తలూపిన శ్రీకాంత్ ఆమె చెప్పినట్లుగానే లెహంగాను పట్టుకుని.. భార్య వెనకాలే పరిగెత్తాడు. ఇద్దరూ కలిసి నాగార్జున దగ్గరకు వెళ్లగా.. కొత్త జంటను ఆశీర్వదించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు శ్రీకాంత్‌కు భార్య అంటే ఎంత ప్రేమో.. భయం- భక్తీ రెండూ ఉన్నాయంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడుకాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్ నమ్మాల్వార్ కిదాంబి 1993, ఫిబ్రవరి 7న జన్మించాడు. తొలుత కామన్వెల్త్ యూత్ గేమ్స్-2011లో మెన్స్ డబుల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన శ్రీకాంత్.. మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్నాడు.అదే విధంగా.. 2013లో థాయ్‌లాండ్ ఓపెనర్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ టైటిల్‌ను శ్రీకాంత్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. చారిత్రాత్మక థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా! ఇక ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌గా ఎదిగిన శ్రీకాంత్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ ,అర్జున అవార్డులతో సన్మానించింది.చదవండి: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్‌మనీ View this post on Instagram A post shared by Shravya Varma & Srikanth Kidambi (@weshranth) -
అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. స్త్రీగా మారినందు వల్ల..
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిపోయాడు. తండ్రి బాటలోనే క్రికెటర్‌గా అడుగులు వేసిన అతడు.. తన శరీర ధర్మానికి అనుగుణంగా అనయగా మార్పు చెందాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అనయ బంగర్.. స్త్రీగా మార్పు చెందడంలో తన ప్రయాణం సాగిన తీరును ప్రస్తావిస్తూ తాజాగా వీడియో షేర్ చేసింది.అంతులేని సంతోషాన్ని పొందాను‘‘శారీరకంగా బలాన్ని కోల్పోయినా.. అంతులేని సంతోషాన్ని పొందాను. నా శరీరం మారిపోయింది. అసంతృప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే, వేసే ప్రతీ అడుగు నాకు మరింతగా నచ్చుతోంది’’ అని అనయ తన సంతోషాన్ని పంచుకుంది.టీమిండియా బ్యాటింగ్ కోచ్గానూకాగా మహారాష్ట్రకు చెందిన సంజయ్ బంగర్ కుడిచేతి వాటం బ్యాటర్. అదే విధంగా.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా. 2001- 2004 మధ్య టీమిండియా తరఫున ఈ ఆల్‌రౌండర్ 12 టెస్టులు, 15 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 470, 180 పరుగులు సాధించాడు. అలాగే.. టెస్టుల్లో ఏడు, వన్డేల్లో ఏడు వికెట్లు తీశాడు.టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గానూ పనిచేసిన 52 ఏళ్ల సంజయ్ బంగర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. కశ్మీరతో అతడికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడైన ఆర్యన్ బంగర్ ఇప్పుడు అనయ బంగర్గా మారాడు. కాగా అనయ కూడా క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయంతో ఉంది.గతంలో భారత దేశీ టోర్నీల్లోనూ ఆడిన అనయ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నట్లు సమాచారం. ట్రాన్స్ వుమన్కు క్రికెట్ ఆడే అవకాశం లేనందు వల్ల తన కలకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అనయ ఇటీవల ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ షేర్ చేసింది.మా నాన్న బాటలో నడవాలనున్నాను.. కానీ‘‘నా ప్రేమ.. నా కల.. నా ఆశయం.. నా భవిష్యత్తు.. అంతా క్రికెటే. మా నాన్న టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాదు.. కోచ్‌గానూ పనిచేశాడు. ఆయనను చూస్తూ పెరిగిన నేను ఆయన అడుగుజాడల్లో నడవాలని భావించాను. క్రికెట్లో నా నైపుణ్యాలను పెంచుకునేందుకు కృషి చేశాను.కానీ అర్ధంతరంగా ఆటను ఇలా వదిలేయాల్సి వస్తుందని అనుకోలేదు. అయితే, ఈ చేదు నిజాన్ని అంగీకరించకతప్పదు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసుకున్న తర్వాత ట్రాన్స్ వుమన్‌గా నాలో చాలా మార్పులు వచ్చాయి.కండబలం తగ్గిందినా శరీరం మొత్తం పూర్తిగా మారిపోయింది. నా కండబలం తగ్గింది. శక్తిని కోల్పోయాను. అథ్లెట్లకు ఉండాల్సిన పవర్ మెల్లమెల్లగా తగ్గింది. ట్రాన్స్వుమన్కు కూడా క్రికెట్ ఆడే అవకాశాలు ఇవ్వాలి’’ అని అనయ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం.. ట్రాన్స్జెండర్లకు ఇంటర్నేషనల్ స్థాయిలో మహిళా క్రికెట్ ఆడే వీలు లేదు. 2023లో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ భవితవ్యం, వుమెన్ ప్లేయర్ల భద్రత, సమగ్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? View this post on Instagram A post shared by Anaya Bangar (@anayabangar) View this post on Instagram A post shared by Anaya Bangar (@anayabangar) -
తండ్రైన సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు..
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ రెండో సారి తండ్రయ్యాడు. అతడి భార్య జెస్సికా సోమవారం పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ శుభవార్తను జెస్సికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. తన భర్త హెడ్, కుమార్తె మీలా, కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను జెస్సికా షేర్ చేసింది.హెడ్-జెస్సికా జోడీ తమ కుమారుడికి హారిసన్ జార్జ్ అని నామకరణం చేశారు. "వెల్కమ్ టూ వరల్డ్ హారిసన్ జార్జ్ హెడ్" అంటూ ఆమె క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. కాగా వీరిద్దిరికి తొలి సంతానంగా 2022 ఏడాదిలో మీలా జన్మించింది.బీజీటీతో రీఎంట్రీ?ఇక గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న హెడ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన కుటుంబంతో సమయం గడిపేందుకు పాకిస్తాన్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు హెడ్ దూరమయ్యాడు. అతడు తిరిగి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 22న పెర్త్‌లో ఈ బీజీటీ ట్రోఫీ ప్రారంభం కానుంది.ఎస్ఆర్హెచ్ రిటైన్..ఇక ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ట్రావిస్ హెడ్ విధ్వంసకర ప్రదర్శనలు చేశాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన హెడ్.. 191.55 స్ట్రైక్ రేటుతో 567 పరుగులు చేశాడు. దీంతో హెడ్‌ను ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. View this post on Instagram A post shared by JESSICA DAVIES (@jess_head) -
Akaay: కోహ్లి బర్త్‌డే.. తొలిసారి కుమారుడి ఫొటో షేర్ చేసిన అనుష్క
క్రికెట్ కింగ్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పుట్టినరోజు నేడు(నవంబరు 5). ఈ సందర్భంగా ఈ రన్మెషీన్కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి సహా యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తదితరులు కోహ్లికి విషెస్ తెలిపారు. అభిమానులు సైతం తమ ఆరాధ్య క్రికెటర్‌ను విష్ చేస్తూ కోహ్లి పేరును ట్రెండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో విరాట్ ఫ్యాన్స్‌కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది అతడి సతీమణి అనుష్క శర్మ. తమ ఇద్దరు పిల్లలు వామిక, అకాయ్‌లతో కోహ్లి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో కోహ్లి అకాయ్‌ను ఎత్తుకోవడంతో పాటు తన గారాలపట్టి వామికను ఒంటిచేత్తో మోస్తూ కనిపించాడు. అయితే, అనుష్క ఇక్కడో ట్విస్ట్ ఇచ్చారు.తమ చిన్నారుల ముఖాలు కనిపించకుండా లవ్ సింబల్స్‌తో కవర్ చేశారు. ఏదేమైనా తొలిసారి వామిక, అకాయ్‌లను ఈమాత్రం చూపించినందుకు ‘థాంక్స్ వదినా’ అంటూ కోహ్లి ఫ్యాన్స్ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా ఇదివరకు వామిక ఫొటోలను అడపాదడపా షేర్ చేసినా.. అకాయ్‌కు సంబంధించి మాత్రం ఇదే తొలి ఫొటో. కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి నవంబరు 5, 1988లో ఢిల్లీలో జన్మించాడు. అతడి తండ్రి ప్రేమ్ కోహ్లి క్రిమినల్ లాయర్. తల్లి సరోజ్ గృహిణి. కోహ్లి తోబుట్టువులు అన్న వికాస్ కోహ్లి, అక్క భావనా కోహ్లి ధింగ్రా ఉన్నారు.కెప్టెన్‌గానూ సేవలు2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు కోహ్లి. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగి కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. ఇక వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లి వరల్డ్ రికార్డు సాధించాడు కోహ్లి. సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఘనతలెన్నో సాధించాడు.ఇప్పటి వరకు టీమిండియా తరపున 118 టెస్టులు, 295 వన్డేలు, 125 టీ20లు ఆడిన కోహ్లి 27,134 పరుగులు చేశాడు. ఇందులో 80 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013, టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్లలో కోహ్లి సభ్యుడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న కోహ్లి తదుపరి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు.బాలీవుడ్ హీరోయిన్‌తో పెళ్లిఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటలీలో 2017, డిసెంబరు 11న ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. విరుష్క జోడీకి తొలి సంతానంగా 2021లో కూతురు వామిక జన్మించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు అకాయ్‌కు ఈ జంట జన్మనిచ్చింది. చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) -
భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వార్తల్లోకి వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో ‘మిస్టరీ గర్ల్’తో కలిసి అతడు కెమెరాలకు చిక్కడమే ఇందుకు కారణం. కాగా భారత క్రికెట్ జట్టు ఓపెనర్‌గా అద్భుత రికార్డు కలిగి ఉన్న శిఖర్ ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.శుబ్‌మన్ గిల్ రాకతోఐసీసీ టోర్నీల్లో నిలకడగా రాణించి అభిమానులను అలరించిన ధావన్.. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిసి 269 మ్యాచ్‌లు ఆడి 10867 పరుగులు చేశాడు. ఇందులో 24 శతకాలు.. 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, శుబ్‌మన్ గిల్ రాకతో గబ్బర్ కెరీర్ నెమ్మదించింది. ఒకవైపు తన ఫామ్‌లేమి.. మరోవైపు గిల్ అద్భుత ఆట తీరు కనబరచడంతో సెలక్టర్లు ధావన్‌ను పక్కనపెట్టారు.ఈ క్రమంలో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా గిల్ పాతుకుపోవడమే కాదు.. ఏకంగా టీమిండియా భవిష్య కెప్టెన్ అనేంతగా దూసుకుపోయాడు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా అవకాశాలు కరువైన శిఖర్ ధావన్ ఆగష్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు.ఆయేషా ముఖర్జీతో వివాహంఇక ధావన్ వ్యక్తిగత విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు ఆడపిల్లలు జన్మించగా.. వారిని కూడా తన కూతుళ్లుగానే ధావన్ స్వీకరించాడు. ఇక ఆయేషాతో ధావన్‌కు ఒక కుమారుడు కలిగాడు. అతడికి జొరావర్గా నామకరణం చేశారు.భార్యతో విడాకులు.. కుమారుడు దూరంధావన్- ఆయేషా ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే, అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరడంతో 2023లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో జొరావర్‌ను తీసుకుని ఆయేషా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. అంతేకాదు.. తన కుమారుడితో మాట్లాడేందుకు కూడా ఆమె ఒప్పుకోవడం లేదని.. కొడుకును తనకు పూర్తిగా దూరం చేస్తోందని ధావన్ సోషల్ మీడియా పోస్టుల్లో పరోక్షంగా వెల్లడించాడు.ఆ అమ్మాయి ఎవరు?ఈ క్రమంలో ధావన్ తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఓ అమ్మాయితో కలిసి కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరూ కలిసి ఒకే కారులో రాగా.. ఆ అమ్మాయి మాత్రం ధావన్‌తో కలిసి ఒకే ఫ్రేములో కెమెరా కళ్లకు చిక్కకుండా పక్కకు వెళ్లిపోయింది. అయితే, కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో గబ్బర్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి జంట ముచ్చటగా ఉందని.. ఆ అమ్మాయి ఎవరోగానీ ధావన్ జీవితంలోకి వస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. కాగా ధావన్ బాలీవుడ్‌లోనూ తన అదృష్టం పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె మోడల్ లేదంటే నటి అయి ఉంటుందని.. ఇద్దరూ కలిసి షూటింగ్‌కు వెళ్తున్నారేమోనంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. గబ్బర్ నోరు విప్పితే కానీ.. అసలు విషయం బయటకు రాదు మరి!చదవండి: IPL 2025: మెగా వేలం ముహూర్తం ఖరారు! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక View this post on Instagram A post shared by HT City (@htcity) -
IND vs SA: దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా.. వీడియో వైరల్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు మరో కఠిన సవాల్‌కు సిద్దమైంది. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు సోమవారం సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. డర్బన్‌కు చేరుకున్న భారత జట్టుకు సౌతాఫ్రికా క్రికెట్ ఆధికారులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. కాగా ఈ సిరీస్‌లో భారత జట్టు ప్రధాన కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ లక్ష్మణ్ వ్యహరించనున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్దమవుతుండడంతో రెగ్యూలర్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. నవంబర్ 8న డర్బన్ వేదికగా జరగనున్న తొలి టీ20 ఈ సిరీస్ ప్రారంభం కానుంది.అద్భుత ఫామ్‌లో టీమిండియా..ఇక ఈ ఏడాదిలో టీ20ల్లో భారత్ క్రికెట్ జట్టు అదరగొడుతోంది. 2024 ఏడాదిలో 22 టీ20లు ఆడిన టీమిండియా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూసింది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత జట్టు దూసుకుపోతుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా అదే జోరును కనబరచాలని యంగ్ ఇండియా ఉవ్విళ్లూరుతోంది.భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్. వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వ్యాషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, ర్యాన్ సిమిప్లాన్, ర్యాన్ సిమిప్లామ్టన్, ట్రిస్టన్ స్టబ్స్చదవండి: IPL 2025: రిషబ్ పంత్‌కు రూ. 50 కోట్లు!? Touchdown Durban 🛬🇿🇦How good is #TeamIndia's knowledge of their next destination 🤔#SAvIND pic.twitter.com/m4YjikAw6Y— BCCI (@BCCI) November 4, 2024 -
‘గర్ల్‌ఫ్రెండ్’తో లండన్‌లో టీమిండియా ఓపెనర్.. ఫొటోలు వైరల్
-
ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచం: సూర్య భార్య భావోద్వేగం
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34వ వసంతంలో అడుగుపెట్టాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన చైర్మన్‌గా ఎన్నికైన బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు సూర్యను విష్ చేశారు.నా ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచంఇక సూర్య భార్య దేవిశా శెట్టి తన మనసులోని భావాలు వెల్లడిస్తూ.. భావోద్వేగపూరిత నోట్‌తో హ్యాపీ బర్త్‌డే చెప్పింది. ‘‘నా ప్రాణ స్నేహితుడు, భర్త, ప్రేమికుడు.. నా ప్రపంచం.. నా జీవితంలో నేను తీసుకున్న సరైన నిర్ణయానికి నిదర్శనం.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో నా కోసం కేటాయిస్తున్న ప్రతి ఒక్క రోజుకు నేను రుణపడి ఉంటా!ఈ ప్రపంచాన్ని నాకోసం అందంగా మలిచావు. అసలు నువ్వు లేకుండా నేను ఒక్క పనైనా చేయగలనా? ఇప్పుడూ.. ఎల్లప్పుడూ.. నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది. ఈ సందర్భంగా సూర్యతో దిగిన ఫొటోలను దేవిశా షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక భార్య షేర్ చేసిన పోస్టుకు బదులుగా.. సుకూన్(శాంతి) అంటూ సూర్య బదులిచ్చాడు. కాగా కాలేజీలో తన జూనియర్ అయిన దేవిశాను ప్రేమించిన సూర్య.. పెద్దలను ఒప్పించి 2016, జూలై 7న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.నాలుగు టీ20 సెంచరీలుఇక సూర్య కెరీర్ విషయానికొస్తే... టీమిండియా తరఫున ఇప్పటి వరకు 109 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 3213 పరుగులు చేశాడు. అత్యధికంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగి సత్తా చాటాడు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.టీమిండియా పూర్తిస్థాయి సారథిగాఈ నేపథ్యంలో రోహిత్ శర్మ స్థానంలో సూర్య ఇటీవలే భారత టీ2 జట్టు సారథిగా నియమితుడయ్యాడు. శ్రీలంక పర్యటన సందర్భంగా పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టి.. టీమిండియాకు 3-0తో క్లీన్‌స్వీప్ విజయం అందించాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న సూర్య.. అక్టోబరులో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ' View this post on Instagram A post shared by Devisha Suryakumar Yadav (@devishashetty_) -
నా భార్య వల్లే ఇలా: శుభవార్త చెప్పిన క్రికెటర్
ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సిమ్రన్‌జిత్ సింగ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగిందని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తూ తన భార్యే దాతగా మారిందని.. ఆమె మంచి మనసు, అభిమానుల ప్రార్థన వల్లే ప్రాణాలతో బయటపడ్డాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.పంజాబ్‌కు ఆడిన సిమికాగా సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన అతడు భారత దేశవాళీ క్రికెట్లో అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్ తరఫున ఆడాడు. కానీ ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు.అవకాశాలు లేక ఐర్లాండ్‌కు వెళ్లిఅయితే, క్రికెట్‌పై మక్కువ తగ్గకపోవడంతో 2006లో డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ప్రతిభను చాటుకుంటూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు తీశాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గాఈ క్రమంలో... 2020లో సిమికి ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. కాగా సిమి సింగ్ లివర్ పూర్తిగా పాడైపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల మీడియాకు తెలిపారు. అతడిని ఇండియాకు తీసుకువచ్చామని.. గురుగ్రామ్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిమి సింగ్ స్వయంగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందించాడు.నా భార్య వల్లే ఇదంతా‘‘అందరికీ హాయ్.. నా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తైంది. 12 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తప్పుడు యాంటి బయాటిక్స్, స్టెరాయిడ్స్‌ను కొందరు నాకు ప్రిస్కైబ్ చేశారు. వాటి వల్లే లివర్ పాడయ్యే దుస్థితి తలెత్తింది. నా భార్యే నాకు కాలేయ దాత కావడం నిజంగా నా అదృష్టం. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అని సిమి సింగ్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.నిపుణులు సూచించిన మందులనే వాడాలని తన ఫాలోవర్లను అప్రమత్తం చేశాడు.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
వాళ్లు ఎలా భరిస్తున్నారో భయ్యా!.. రోహిత్ శర్మ వీడియో వైరల్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తనలోని మరో కోణాన్ని అభిమానులతో పంచుకున్నాడు. వ్యాయామ సమయంలో 99 శాతం తాను కష్టపడతానని.. అయితే, మిగిలిన ఒక్క శాతం మాత్రం తన చేష్టలతో సహచరులను ఇబ్బంది పెడతానన్నట్లుగా సరదా వీడియో షేర్ చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.నలభై రోజులకు పైగా విరామంఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం శ్రీలంక పర్యటన సందర్భంగా వన్డే సిరీస్ ఆడిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఎల్లప్పుడూ వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే టీమిండియాకు దాదాపు నలభై రోజులకు పైగా విశ్రాంతి దొరకడంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాడు. అయితే, సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు షెడ్యూల్ ఖరారు కావడంతో రీఎంట్రీ ఇచ్చేందుకు రోహిత్ సిద్ధమవుతున్నాడు.ఈ నేపథ్యంలో ఇప్పటికే జిమ్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్న రోహిత్ శర్మ... ఫిట్నెస్ మరింత మెరుగుపరచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా ‘వన్ పర్సెంట్’ ట్రెండ్‌కు అనుగుణంగా తన వీడియోను షేర్ చేశాడు. స్నేహితులను ఏడిపించిన రోహిత్ఇందులో రోహిత్ వర్కౌట్లు చేస్తున్న సమయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో.. కాస్త విరామం దొరకగానే తన ట్రెయినీలు, స్నేహితులను టీజ్ చేయడం కనిపిస్తుంది. తన సరదా చేష్టలతో వారిని ఉడికిస్తున్నట్లుగా ఆ దృశ్యాలు ఉన్నాయి.ఈ వీడియో రోహిత్ శర్మ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. షేర్ చేసిన గంటల్లోనే మిలియన్ల కొద్దీ లైకులతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో.. ‘‘వాళ్లు ఎలా భరిస్తున్నారో భయ్యా!.. నిజంగా నువ్వింకా చిన్నపిల్లాడిలానే ఫ్రెండ్స్‌ను ఆటపట్టిస్తున్నావు’’ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. వారి రీ ఎంట్రీ కూడా..కాగా సెప్టెంబరు 19న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. అయితే, కెప్టెన్ రోహిత్‌కు డిప్యూటీగా ఎవరు ఉంటారన్నది మాత్రం చెప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌తోనే విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు. మిగతా వాళ్లలో చాలా మంది దులిప్ ట్రోఫీ-2024లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్నారు.చదవండి: హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే..! View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
అగస్త్యను హార్దిక్ ఇంటికి పంపిన నటాషా.. ఫొటో వైరల్!
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో జట్టులోకి వచ్చే అవకాశం లేదు. మరో నెల రోజుల పాటు అతడికి విశ్రాంతి లభించనుంది. దీంతో విరామ సమయాన్ని పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ మనోల్లాసం పొందుతున్నాడు హార్దిక్. ఇక ఇప్పుడు కుమారుడు అగస్త్య కూడా తన దగ్గరికి వచ్చేయడంతో మరింత ఖుషీ ఖుషీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది.తల్లితో సెర్బియా వెళ్లిన అగస్త్యకాగా హార్దిక్ పాండ్యా ఇటీవలే తన భార్య, సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సామరస్యపూర్వకంగానే తాము విడిపోతున్నామని.. అగస్త్యకు తల్లిదండ్రులుగా మాత్రం కొనసాగుతామని ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం కుమారుడిని తీసుకుని నటాషా పుట్టింటికి వెళ్లిపోయింది.అయితే, తాజాగా అగస్త్య తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. సెర్బియా నుంచి ఈ చిన్నారి ముంబైకి చేరుకున్నాడు. హార్దిక్ వదిన, క్రికెటర్ కృనాల్ పాండ్యా భార్య పాంఖురి శర్మ షేర్ చేసిన ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. తన కుమారుడు కవిర్‌తో కలిసి అగస్త్యకు కథలు చెప్తున్నానంటూ పాంఖురి ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేసింది.కెరీర్ పరంగానూ ఒడిదొడుకులుకాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా... జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం అతడే సారథి అవుతాడని విశ్లేషకులు భావించారు. అయితే అనూహ్యం అతడిని వైస్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించింది బీసీసీఐ. శ్రీలంక పర్యటన -2024 సందర్భంగా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంతో పాటు.. శుబ్‌మన్ గిల్‌ను అతడికి డిప్యూటీగా నియమించింది. ఫిట్నెస్ కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో హార్దిక్ పాండ్యా కేవలం వన్డే, టీ20లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు ఆటకు దూరమయ్యాడు. ఇక రోహిత్ సేన సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఆడనుండగా.. అక్టోబరు 6 నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్ సందర్భంగా హార్దిక్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. -
ప్రేమంటే నమ్మకం: హార్దిక్ మాజీ భార్య నటాషా పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత విరామం తీసుకున్న ఈ ఆల్‌రౌండర్ సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. తనకు తాను సమయం కేటాయించుకుని ప్రకృతి అందాల్లో సేద తీరుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు.సింగర్‌తో ప్రేమలో?ఈ క్రమంలో పాండ్యా ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫొటోల్లోని లొకేషన్.. బ్రిటిష్ సింగర్, నటి జాస్మిన్ వాలియా దిగిన ఫొటోల లొకేషన్ ఒకేలా ఉండటంతో వీరిద్దరు కలిసే అక్కడకు వెళ్లారనే వదంతులు వ్యాపించాయి. దీంతో హార్దిక్ మరోసారి ప్రేమలో పడ్డాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ప్రేమను నిర్వచిస్తూ పెట్టిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది.ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు‘‘ప్రేమకు సహనం ఎక్కువ. ప్రేమ దయగలది. ప్రేమలో ద్వేషం, అసూయ ఉండవు. గొప్పలు చెప్పుకోవడాలూ ఉండవు. ఇతరులను కించపరచడం, స్వార్థపూరితంగా వ్యవహరించడం ప్రేమకు తెలియదు. ప్రేమ తప్పొప్పులను లెక్కకడుతూ కోపం ప్రదర్శించదు. ప్రేమంటే నిజం.. నమ్మకం.. ఆశ.. రక్షణ.. ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు’’ అంటూ నటాషా స్టాంకోవిక్ ఉద్వేగపూరిత వాక్యాలు షేర్ చేసింది.అందుకే విడాకులు?అయితే, ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి చేసిందేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి పట్ల నటాషాకు ఇంకా ప్రేమ ఉందని.. కానీ అతడే దానిని నిలబెట్టుకోలేకపోయాడని.. ఏదేమైనా ఎవరి జీవితాల్లో వారు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా హార్దిక్‌కు నచ్చినట్లుగా మారడానికి నటాషా ఎంతో ప్రయత్నించిందని.. అయితే, అతడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో విడాకులు తీసుకుందని ఇటీవల ఆమె సన్నిహితవర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. హార్దిక్‌తో విడిపోయిన తర్వాత నటాషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా సెర్బియాకు చెందిన నటాషా మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఆమె ఓ పార్టీలో హార్దిక్‌ను కలిసింది. స్నేహం కాస్తా ప్రేమగా మారగా పెళ్లిపీటలెక్కారు. అధికారికంగా ప్రకటించిఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. అయితే, ఎంతో అన్యోన్యంగా కనిపించే హార్దిక్- నటాషా కొన్నాళ్ల క్రితం తాము విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, అగస్త్యకు మాత్రం తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇక విడాకుల తర్వాత కొడుకును తీసుకుని నటాషా సెర్బియాకు వెళ్లిపోయింది. అయితే, ఈ మాజీ జంట ఇన్‌స్టాలో తాము కలిసి ఉన్న, తమ పెళ్లి ఫొటోలు డిలీట్ చేయకపోవడం గమనార్హం.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
రెండోసారి తండ్రి కాబోతున్న సన్‌రైజర్స్ కెప్టెన్!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘మా బేబీకి సంబంధించిన శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది!మా జీవితాలను మరింత క్రేజీగా మార్చేందుకు వస్తున్న చిన్నారి కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని బెకీతో పాటు కమిన్స్ ఇన్‌స్టాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య బెకీ, కుమారుడు ఆల్బీ ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో బెకీ బేబీ బంప్‌తో కనిపించగా.. ఆల్బీ తల్లిని ముద్దాడుతున్నాడు.కుమారుడి సమక్షంలో వివాహంకాగా ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ 2020లో బెకీ బోస్టన్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట 2022లో వివాహ బంధంతో ఒక్కటైంది. పెళ్లికి ముందే వీరికి అల్బీ(2021) జన్మించాడు. తాజాగా మరోసారి కమిన్స్- బెకీ తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా కమిన్స్ ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.మూడేళ్లుగా నిరాశాజనక ప్రదర్శనతో డీలా పడ్డ రైజర్స్‌ను ఏకంగా ఫైనల్‌కు చేర్చి ఆరెంజ్ ఆర్మీ హృదయాలు గెలుచుకున్నాడు కమిన్స్. ఐపీఎల్ సమయంలో కమిన్స్‌తో పాటు బెకీ, ఆల్బీ.. ఇతర కుటుంబ సభ్యులు సైతం హైదరాబాద్‌కు విచ్చేశారు.ఎనిమిది వారాల విరామంటీ20 ప్రపంచకప్-2024లో ఆసీస్ సెమీస్‌లోనే నిష్క్రమించగా.. కమిన్స్ అప్పటి నుంచి ఎనిమిది వారాల పాటు విరామం తీసుకున్నాడు. టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు ఈ బ్రేక్ తీసుకున్న కమిన్స్.. ఏ ఆటగాడికైనా విరామం కచ్చితంగా అవసరమని పేర్కొన్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ సైకిల్లో భాగంగా వరుస టెస్టులు ఆడాల్సిన నేపథ్యంలో తాను ఈ మేరకు విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించాడు. View this post on Instagram A post shared by Rebecca Jane Cummins (@becky_cummins) -
లండన్ వీధుల్లో కన్పించిన విరాట్ కోహ్లి( వీడియో)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం కోహ్లి తన భార్య పిల్లలను కలిసేందుకు లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో లండన్ వీధుల్లో కోహ్లి తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.బ్లాక్ డ్రెస్ వేసుకున్న కోహ్లి రోడ్డును దాటుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది. కాగా గత కొంత కాలంగా విరాట్ భార్య అనుష్క శర్మ.. పిల్లలు వామిక, అకాయ్‌తో లండన్‌లో ఉంటుంది. కోహ్లి కూడా ఎక్కువగా ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉంటున్నాడు. కేవలం మ్యాచ్‌లు ఉన్నప్పుడు మాత్రమే జట్టుతో కింగ్ కోహ్లి కలుస్తున్నాడు. మ్యాచ్‌లు మగిసిన వెంటనే మళ్లీ లండన్‌కు పయనవుతున్నాడు. గతకొన్నళ్లగా ఇదే జరుగుతుంది. అయితే రిటైర్మెంట్ తర్వాత విరాట్-అనుష్క లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్కతో పాటు వామిక, అకాయ్లు ఇంగ్లండ్ పౌరసత్వం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక లండన్‌లోనే పుట్టిన ఆకాయ్ను ఇప్పటివరకు కోహ్లి భారత్‌కు తీసుకురాలేదు. విరుష్క జంట లండన్‌లో ఓ లిస్టెడ్ కంపెనీ కలిగి ఉంది. మ్యాజిక్ ల్యాంప్ డైరెక్టర్లుగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు ఉన్నారు. ఈ క్రమంలోనే విరాట్-అనుష్క లండన్‌లో స్ధిరనివాసం ఏర్పరుచుకోనున్నారని ప్రచారం జరగుతోంది. ఇక శ్రీలంతో వన్డే సిరీస్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి.. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు. Virat Kohli on the London streets. 🐐pic.twitter.com/0WvBi9byXZ— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024 -
చీటర్.. అలాంటి వాళ్లతో జాగ్రత్త! హార్దిక్ పాండ్యాను ఉద్దేశించేనా?
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఆటకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటూ క్రికెట్ నుంచి దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. సాగరతీరాన.. స్విమ్మింగ్‌పూల్ ఒడ్డున సేద తీరుతూ.. నీలాకాశాన్ని వీక్షిస్తున్న దృశ్యాలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ‘చీటర్’ అన్న పోస్టుకు లైక్ కొట్టడం నెట్టింట చర్చకు దారితీసింది.నటాషాపై విమర్శలుకాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్నాడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ భార్య నటాషా హార్దిక్‌తో లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు రాగా.. కొన్నిరోజులు తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చింది.తమ దారులు వేరయ్యానని.. తాము విడాకులు తీసుకున్నామని హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ సంయుక్త అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హార్దిక్ అభిమానులు నటాషాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ పేరు, డబ్బు ఉపయోగించుకునేందుకే అతడి జీవితంలోకి వచ్చిందని.. భరణం రూపంలోనూ పెద్ద మొత్తమే తీసుకుందని ఇష్టారీతిన కామెంట్లు చేశారు.ఇక కుమారుడు అగస్త్యను తీసుకుని పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిన నటాషా.. అతడితో ట్రిప్‌నకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ వాటికి హార్ట్ సింబల్ జోడిస్తూ లైక్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటాషాను మర్చిపోలేకపోతున్నాడని.. ఆమె వల్ల హార్దిక్ పాండ్యా చాలా బాధపడుతున్నాడంటూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై నటాషా పరోక్షంగా స్పందించింది.చీటర్.. ఆ పోస్టులకు నటాషా లైక్‘‘చీటర్.. శారీరకంగా, మానసికంగా హింసించే వాళ్లతో బంధం కొనసాగిస్తే ఇలాగే ఉంటుంది.. కొంతమంది తామే సమస్యను సృష్టించి మళ్లీ వారే బాధితులుగా నటిస్తారు.. అందుకు ఇదే ఉదాహరణ... ఇతరుల ముందు మిమ్మల్ని తప్పుగా చూపించేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ బంధాల గురించి చర్చిస్తున్న ఇన్‌స్టా వీడియోలకు నటాషా స్టాంకోవిక్ లైక్ కొట్టింది. ఇందుకు స్పందించిన నెటిజన్లలో మెజారిటీ మంది నటాషాకు మద్దతుగా నిలుస్తున్నారు. హార్దిక్ ఫ్యాన్స్ అని చెప్పుకొనే వాళ్లు ఇప్పటికైనా నటాషాను వేధించడం మానాలని హితవు పలుకుతున్నారు.కాగా ప్రపంచకప్-2024 తర్వాత హార్దిక్ పాండ్యా శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, వన్డే సిరీస్‌కు మాత్రం అతడు ఎంపికకాలేదు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ సిరీస్‌కు అతడు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీలంక టూర్లో 3-0తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 0-2తో ఆతిథ్య శ్రీలంకకు కోల్పోయింది. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)