![Travis Head Welcomes A Baby Boy With Wife Jess](/styles/webp/s3/article_images/2024/11/8/Travis-Head-Welcomes.jpg.webp?itok=Uri8Bkzl)
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఎస్‌ఆర్‌హెచ్ విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ రెండో సారి తండ్రయ్యాడు. అతడి భార్య జెస్సికా సోమవారం పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ శుభవార్తను జెస్సికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. తన భర్త హెడ్, కుమార్తె మీలా, కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను జెస్సికా షేర్ చేసింది.
హెడ్-జెస్సికా జోడీ తమ కుమారుడికి హారిసన్ జార్జ్ అని నామకరణం చేశారు. "వెల్‌కమ్ టూ వరల్డ్ హారిసన్ జార్జ్ హెడ్" అంటూ ఆమె క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. కాగా వీరిద్దిరికి తొలి సంతానంగా 2022 ఏడాదిలో మీలా జన్మించింది.
బీజీటీతో రీఎంట్రీ?
ఇక గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న హెడ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన కుటుంబంతో సమయం గడిపేందుకు పాకిస్తాన్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు హెడ్ దూరమయ్యాడు. అతడు తిరిగి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 22న పెర్త్‌లో ఈ బీజీటీ ట్రోఫీ ప్రారంభం కానుంది.
ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్..
ఇక ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ట్రావిస్ హెడ్ విధ్వంసకర ప్రదర్శనలు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన హెడ్.. 191.55 స్ట్రైక్ రేటుతో 567 పరుగులు చేశాడు. దీంతో హెడ్‌ను ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment