మెల్‌బోర్న్: భారత్‌తో నాలుగో టెస్టుకు ముందుఆ్రస్టేలియాకు ఆందోళన పెంచే విషయమిది! సిరీస్‌లో చెలరేగిపోతున్న ట్రావిస్ హెడ్ ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆడటంపై కొంత సందిగ్ధత కనిపిస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హెడ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో తుది జట్టు ఎంపిక విషయంలో ఆసీస్‌కు ఇంకా స్పష్టత రాలేదు.
మ్యాచ్‌కు ముందు రోజు హెడ్‌కు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అప్పుడే టీమ్‌ను ప్రకటిస్తారు. ఈ సిరీస్‌లో హెడ్ వరుసగా 11, 89, 140, 152, 17 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ సమయంలోనే హెడ్ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత అతను ఫీల్డింగ్‌కు కూడా దిగలేదు. సోమవారం ప్రాక్టీస్‌కు పూర్తిగా దూరంగా ఉన్న అతను...మంగళవారం మాత్రం కాసేపే సాధన చేశాడు.
హెడ్ స్థానం ఇంకా ఖాయం లేదని అంగీకరించిన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్... బ్యాటింగ్ చేయడంలో ఇబ్బంది లేకపోతే కచ్చితంగా బరిలోకి దిగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆసీస్ తుది జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. మెక్‌స్వీనీ స్థానంలో స్యామ్ కొంటాస్ అరంగేట్రం చేయనుండగా... హాజల్‌వుడ్‌కు బదులుగా బోలండ్ జట్టులోకి వస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment