ట్రవిస్ హెడ్ మెరుపు సెంచరీ
డే అండ్ నైట్ టెస్టులో కష్టాల్లో టీమిండియా
రెండో ఇన్నింగ్స్‌లో 128/5
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 337
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్...వన్డే వరల్డ్ కప్ ఫైనల్...గతంలో రెండు కీలక సందర్భాల్లో భారత్ ఓటమిని శాసించిన ట్రవిస్ హెడ్ మరోసారి మనపై చెలరేగిపోయాడు. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడిన అతను మెరుపు సెంచరీతో రెండో టెస్టులో ఆ్రస్టేలియాకు విజయావకాశం కల్పించాడు.
157 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన రోహిత్ సేన ఇంకా ఆ లోటును పూడ్చుకోకుండానే సగం వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతానికి ఆసీస్‌దే పూర్తి ఆధిపత్యం కాగా... పంత్, నితీశ్ పోరాటంపైనే ఆదివారం భారత్ ఆశలు మిగిలి ఉన్నాయి.
అడిలైడ్: గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టులో భారత్ వైఫల్యం రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగింది. ముందుగా తొలి ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియా భారీ ఆధిక్యంతో అదరగొట్టగా... టీమిండియా ఓటమిని తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో రోజు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది.
ట్రవిస్ హెడ్ (141 బంతుల్లో 140; 17 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ సెంచరీతో విజృంభించగా... మార్నస్ లబుషేన్ (126 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం శనివారం ఆట ముగిసే సమయానికి రోహిత్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.
యశస్వి జైస్వాల్ (24; 4 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (28; 3 ఫోర్లు) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. రిషబ్ పంత్ (25 బంతుల్లో 28 బ్యాటింగ్; 5 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (15 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 5 వికెట్లు ఉన్న భారత్... కంగారూల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది.
లబుషేన్ అర్ధ సెంచరీ...
ఓవర్‌నైట్ స్కోరు 86/1తో ఆసీస్ రెండో రోజు ఆటను కొనసాగించింది. మరోసారి బుమ్రా చెలరేగిపోతూ 13 బంతుల వ్యవధిలో మెక్‌స్వీనీ (109 బంతుల్లో 39; 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (2)లను పెవిలియన్ పంపించాడు. అయితే లబుషేన్, హెడ్ భాగస్వామ్యంలో ఆసీస్ కోలుకుంది. భారత బౌలర్లను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హర్షిత్ రాణా భారీగా పరుగులిచ్చుకున్నాడు.
చాన్నాళ్లుగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న మార్నస్ లబుషేన్ ఎట్టకేలకు 114 బంతుల్లో అర్ధ శతకంతో టచ్‌లోకి వచ్చాడు. రాణా ఓవర్లో అతను మూడు ఫోర్లు బాదడం విశేషం. ఎట్టకేలకు లబుషేన్‌ను అవుట్ చేసి నితీశ్ ఈ జోడీని విడదీయగా... మరో ఎండ్‌లో హెడ్ తనదైన శైలిలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన అతను 63 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు.
మిచెల్ మార్‡్ష (9), క్యారీ (15) కొద్ది సేపు హెడ్‌కు అండగా నిలిచారు. అశ్విన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచి్చన మార్‡్ష అంపైర్ నిర్ణయం కోసం కూడా చూడకుండా వెళ్లిపోయాడు. రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని తేలింది! వికెట్లు పడినా మరో వైపు జోరు తగ్గించని హెడ్‌కు హాఫ్ సెంచరీ నుంచి శతకం అందుకునేందుకు 48 బంతులు సరిపోయాయి.
రాణా వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను 111 బంతుల్లో కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం రాణా మరో ఓవర్లో అతను మళ్లీ మూడు ఫోర్లు కొట్టాడు. భారత్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత హెడ్ సహా 27 పరుగుల వ్యవధిలో ఆస్ట్రేలియా చివరి 4 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు 54.3 ఓవర్లు ఆడిన ఆ జట్టు 251 పరుగులు జోడించింది.
కోహ్లి, రోహిత్ విఫలం...
ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. అప్పటికే ప్రత్యరి్థకి భారీ ఆధిక్యం సమర్పించుకున్న భారత్... నాలుగో ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ (7) వికెట్ కోల్పోయింది. అయితే యశస్వి జైస్వాల్, గిల్ నిలకడగా ఆడటంతో మళ్లీ ఆశలు చిగురించగా... బోలండ్ టీమిండియాను దెబ్బకొట్టాడు.
మొదట జైస్వాల్‌ను అవుట్ చేసిన అతడు... కాసేపటికి విరాట్ కోహ్లి (11)ని కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత గిల్‌ను అద్భుత బంతితో స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేయగా...కమిన్స్ వేసిన పదునైన ఇన్‌స్వింగర్ కెపె్టన్ రోహిత్ శర్మ (6) స్టంప్స్‌ను ఎగరగొట్టింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన పంత్, నితీశ్ మరో 19 బంతుల పాటు వికెట్ పడకుండా ఆటను ముగించారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 180; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) రోహిత్ (బి) బుమ్రా 13; మెక్‌స్వీనీ (సి) పంత్ (బి) బుమ్రా 39; లబుõÙన్ (సి) జైస్వాల్ (బి) నితీశ్ రెడ్డి 64; స్మిత్ (సి) పంత్ (బి) బుమ్రా 2; హెడ్ (బి) సిరాజ్ 140; మార్‡్ష (సి) పంత్ (బి) అశ్విన్ 9; క్యారీ (సి) పంత్ (బి) సిరాజ్ 15; కమిన్స్ (బి) బుమ్రా 12; స్టార్క్ (సి) హర్షిత్ (బి) సిరాజ్ 18; లయన్ (నాటౌట్) 4; బోలండ్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (87.3 ఓవర్లలో ఆలౌట్) 337. వికెట్ల పతనం: 1–24, 2–91, 3–103, 4–168, 5–208, 6–282, 7–310, 8–332, 9–332, 10–337, బౌలింగ్: బుమ్రా 23–5–61–4; సిరాజ్ 24.3–5–98–4; హర్షిత్ 16–2–86–0; నితీశ్ రెడ్డి 6–2–25–1; అశ్విన్ 18–4–53–1.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) క్యారీ (బి) బోలండ్ 24; రాహుల్ (సి) క్యారీ (బి) కమిన్స్ 7; గిల్ (బి) స్టార్క్ 28; కోహ్లి (సి) క్యారీ (బి)
బోలండ్ 11; పంత్ (బ్యాటింగ్) 28; రోహిత్ (బి) కమిన్స్ 6; నితీశ్ రెడ్డి (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (24 ఓవర్లలో 5 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–66, 4–86, 5–105, బౌలింగ్: స్టార్క్ 9–0–49–1; కమిన్స్ 8–0–33–2; బోలండ్ 7–0–39–2.
హెడ్ X సిరాజ్
అడిలైడ్ ట్రవిస్ హెడ్ సొంత మైదానం. చుట్టూ 51,642 మంది ప్రేక్షకులు...99.29 స్ట్రైక్‌రేట్‌తో చేసిన మెరుపు సెంచరీతో స్టేడియం ఊగిపోతోంది...ఎట్టకేలకు ఆసీస్ ఆధిక్యం 130 పరుగులకు చేరాక ఒక ఫుల్‌టాస్ యార్కర్‌తో హెడ్‌ను సిరాజ్ బౌల్డ్ చేసి తన ఆవేశాన్ని ప్రదర్శించాడు. అంతటితో ఆగిపోకుండా పెవిలియన్ వైపు వెళ్లమంటూ రెండు సార్లు సైగ కూడా చేశాడు.
హెడ్ కూడా ఏదో చెబుతూ నిష్క్రమించాడు. కానీ ఫ్యాన్స్ ఊరుకోలేదు. తమ బ్యాటర్‌తో తలపడిన సిరాజ్‌ను ఒక్కసారిగా అంత భారీ సమూహం గేలి చేసింది. తర్వాతి బంతికి స్టార్క్ ఫోర్ కొట్టడంతో ఇది మరింత పెరిగింది. ఆ ఓవర్ మాత్రమే కాదు...ఆ తర్వాత అతను వేసిన ప్రతీ అడుగుకు ఇలాగే స్పందించారు.
సిరాజ్ డీప్ థర్డ్‌మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ప్రేక్షకుల హేళన ఇంకా పెరిగిపోవడంతో రోహిత్ అతడిని లోపలి వైపు పాయింట్ వద్దకు మార్చాల్సి వచ్చింది. సిరాజ్ బౌలింగ్‌లో హెడ్ 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఆ సిక్స్ తర్వాతి బంతికే వికెట్ దక్కింది.
హెడ్ 76 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిరాజ్ క్యాచ్ వదిలేశాడు కూడా. దాంతో సహజంగానే హైదరాబాదీ తన భావోద్వేగాన్ని చూపించాడు. అయితే ఏకంగా 140 పరుగులు చేసిన తర్వాత ఇలాంటి సైగలు చేయడాన్ని మాజీ క్రికెటర్ గావస్కర్ కూడా తప్పుపట్టాడు.
2023 నుంచి అన్ని ఫార్మాట్‌లలో కలిపి ట్రవిస్ హెడ్ భారత్‌పై 19 ఇన్నింగ్స్‌లలో 61.9 సగటుతో 1052 పరుగులు చేయడం విశేషం. ఇందులో 3 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇతర జట్లపై మాత్రం 54ఇన్నింగ్స్‌లలో కేవలం 36.8 సగటుతో 1875 పరుగులు మాత్రమే చేయగలిగిన అతను 3 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment