second Test
-
భారత్‌కు ‘హెడ్’పోటు...
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్...వన్డే వరల్డ్ కప్ ఫైనల్...గతంలో రెండు కీలక సందర్భాల్లో భారత్ ఓటమిని శాసించిన ట్రవిస్ హెడ్ మరోసారి మనపై చెలరేగిపోయాడు. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడిన అతను మెరుపు సెంచరీతో రెండో టెస్టులో ఆ్రస్టేలియాకు విజయావకాశం కల్పించాడు. 157 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన రోహిత్ సేన ఇంకా ఆ లోటును పూడ్చుకోకుండానే సగం వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతానికి ఆసీస్‌దే పూర్తి ఆధిపత్యం కాగా... పంత్, నితీశ్ పోరాటంపైనే ఆదివారం భారత్ ఆశలు మిగిలి ఉన్నాయి. అడిలైడ్: గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టులో భారత్ వైఫల్యం రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగింది. ముందుగా తొలి ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియా భారీ ఆధిక్యంతో అదరగొట్టగా... టీమిండియా ఓటమిని తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో రోజు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ (141 బంతుల్లో 140; 17 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ సెంచరీతో విజృంభించగా... మార్నస్ లబుషేన్ (126 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం శనివారం ఆట ముగిసే సమయానికి రోహిత్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (24; 4 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (28; 3 ఫోర్లు) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. రిషబ్ పంత్ (25 బంతుల్లో 28 బ్యాటింగ్; 5 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (15 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 5 వికెట్లు ఉన్న భారత్... కంగారూల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది. లబుషేన్ అర్ధ సెంచరీ... ఓవర్‌నైట్ స్కోరు 86/1తో ఆసీస్ రెండో రోజు ఆటను కొనసాగించింది. మరోసారి బుమ్రా చెలరేగిపోతూ 13 బంతుల వ్యవధిలో మెక్‌స్వీనీ (109 బంతుల్లో 39; 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (2)లను పెవిలియన్ పంపించాడు. అయితే లబుషేన్, హెడ్ భాగస్వామ్యంలో ఆసీస్ కోలుకుంది. భారత బౌలర్లను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హర్షిత్ రాణా భారీగా పరుగులిచ్చుకున్నాడు. చాన్నాళ్లుగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న మార్నస్ లబుషేన్ ఎట్టకేలకు 114 బంతుల్లో అర్ధ శతకంతో టచ్‌లోకి వచ్చాడు. రాణా ఓవర్లో అతను మూడు ఫోర్లు బాదడం విశేషం. ఎట్టకేలకు లబుషేన్‌ను అవుట్ చేసి నితీశ్ ఈ జోడీని విడదీయగా... మరో ఎండ్‌లో హెడ్ తనదైన శైలిలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన అతను 63 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. మిచెల్ మార్‡్ష (9), క్యారీ (15) కొద్ది సేపు హెడ్‌కు అండగా నిలిచారు. అశ్విన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచి్చన మార్‡్ష అంపైర్ నిర్ణయం కోసం కూడా చూడకుండా వెళ్లిపోయాడు. రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని తేలింది! వికెట్లు పడినా మరో వైపు జోరు తగ్గించని హెడ్‌కు హాఫ్ సెంచరీ నుంచి శతకం అందుకునేందుకు 48 బంతులు సరిపోయాయి. రాణా వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను 111 బంతుల్లో కెరీర్లో ఎనిమిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం రాణా మరో ఓవర్లో అతను మళ్లీ మూడు ఫోర్లు కొట్టాడు. భారత్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత హెడ్ సహా 27 పరుగుల వ్యవధిలో ఆస్ట్రేలియా చివరి 4 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు 54.3 ఓవర్లు ఆడిన ఆ జట్టు 251 పరుగులు జోడించింది. కోహ్లి, రోహిత్ విఫలం... ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. అప్పటికే ప్రత్యరి్థకి భారీ ఆధిక్యం సమర్పించుకున్న భారత్... నాలుగో ఓవర్లోనే కేఎల్ రాహుల్ (7) వికెట్ కోల్పోయింది. అయితే యశస్వి జైస్వాల్, గిల్ నిలకడగా ఆడటంతో మళ్లీ ఆశలు చిగురించగా... బోలండ్ టీమిండియాను దెబ్బకొట్టాడు. మొదట జైస్వాల్‌ను అవుట్ చేసిన అతడు... కాసేపటికి విరాట్ కోహ్లి (11)ని కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత గిల్‌ను అద్భుత బంతితో స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేయగా...కమిన్స్ వేసిన పదునైన ఇన్‌స్వింగర్ కెపె్టన్ రోహిత్ శర్మ (6) స్టంప్స్‌ను ఎగరగొట్టింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన పంత్, నితీశ్ మరో 19 బంతుల పాటు వికెట్ పడకుండా ఆటను ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 180; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) రోహిత్ (బి) బుమ్రా 13; మెక్‌స్వీనీ (సి) పంత్ (బి) బుమ్రా 39; లబుõÙన్ (సి) జైస్వాల్ (బి) నితీశ్ రెడ్డి 64; స్మిత్ (సి) పంత్ (బి) బుమ్రా 2; హెడ్ (బి) సిరాజ్ 140; మార్‡్ష (సి) పంత్ (బి) అశ్విన్ 9; క్యారీ (సి) పంత్ (బి) సిరాజ్ 15; కమిన్స్ (బి) బుమ్రా 12; స్టార్క్ (సి) హర్షిత్ (బి) సిరాజ్ 18; లయన్ (నాటౌట్) 4; బోలండ్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (87.3 ఓవర్లలో ఆలౌట్) 337. వికెట్ల పతనం: 1–24, 2–91, 3–103, 4–168, 5–208, 6–282, 7–310, 8–332, 9–332, 10–337, బౌలింగ్: బుమ్రా 23–5–61–4; సిరాజ్ 24.3–5–98–4; హర్షిత్ 16–2–86–0; నితీశ్ రెడ్డి 6–2–25–1; అశ్విన్ 18–4–53–1. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) క్యారీ (బి) బోలండ్ 24; రాహుల్ (సి) క్యారీ (బి) కమిన్స్ 7; గిల్ (బి) స్టార్క్ 28; కోహ్లి (సి) క్యారీ (బి) బోలండ్ 11; పంత్ (బ్యాటింగ్) 28; రోహిత్ (బి) కమిన్స్ 6; నితీశ్ రెడ్డి (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (24 ఓవర్లలో 5 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–66, 4–86, 5–105, బౌలింగ్: స్టార్క్ 9–0–49–1; కమిన్స్ 8–0–33–2; బోలండ్ 7–0–39–2. హెడ్ X సిరాజ్ అడిలైడ్ ట్రవిస్ హెడ్ సొంత మైదానం. చుట్టూ 51,642 మంది ప్రేక్షకులు...99.29 స్ట్రైక్‌రేట్‌తో చేసిన మెరుపు సెంచరీతో స్టేడియం ఊగిపోతోంది...ఎట్టకేలకు ఆసీస్ ఆధిక్యం 130 పరుగులకు చేరాక ఒక ఫుల్‌టాస్ యార్కర్‌తో హెడ్‌ను సిరాజ్ బౌల్డ్ చేసి తన ఆవేశాన్ని ప్రదర్శించాడు. అంతటితో ఆగిపోకుండా పెవిలియన్ వైపు వెళ్లమంటూ రెండు సార్లు సైగ కూడా చేశాడు. హెడ్ కూడా ఏదో చెబుతూ నిష్క్రమించాడు. కానీ ఫ్యాన్స్ ఊరుకోలేదు. తమ బ్యాటర్‌తో తలపడిన సిరాజ్‌ను ఒక్కసారిగా అంత భారీ సమూహం గేలి చేసింది. తర్వాతి బంతికి స్టార్క్ ఫోర్ కొట్టడంతో ఇది మరింత పెరిగింది. ఆ ఓవర్ మాత్రమే కాదు...ఆ తర్వాత అతను వేసిన ప్రతీ అడుగుకు ఇలాగే స్పందించారు. సిరాజ్ డీప్ థర్డ్‌మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ప్రేక్షకుల హేళన ఇంకా పెరిగిపోవడంతో రోహిత్ అతడిని లోపలి వైపు పాయింట్ వద్దకు మార్చాల్సి వచ్చింది. సిరాజ్ బౌలింగ్‌లో హెడ్ 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఆ సిక్స్ తర్వాతి బంతికే వికెట్ దక్కింది. హెడ్ 76 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిరాజ్ క్యాచ్ వదిలేశాడు కూడా. దాంతో సహజంగానే హైదరాబాదీ తన భావోద్వేగాన్ని చూపించాడు. అయితే ఏకంగా 140 పరుగులు చేసిన తర్వాత ఇలాంటి సైగలు చేయడాన్ని మాజీ క్రికెటర్ గావస్కర్ కూడా తప్పుపట్టాడు.2023 నుంచి అన్ని ఫార్మాట్లలో కలిపి ట్రవిస్ హెడ్ భారత్‌పై 19 ఇన్నింగ్స్‌లలో 61.9 సగటుతో 1052 పరుగులు చేయడం విశేషం. ఇందులో 3 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇతర జట్లపై మాత్రం 54ఇన్నింగ్స్‌లలో కేవలం 36.8 సగటుతో 1875 పరుగులు మాత్రమే చేయగలిగిన అతను 3 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు సాధించాడు. -
‘గులాబీ’ గుచ్చుకుంది!
నాలుగేళ్ల క్రితం తమకు అచ్చిరాని అడిలైడ్ మైదానంలో అదే డే అండ్ నైట్ టెస్టులో మరోసారి గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ‘పింక్ బాల్’ స్పెషలిస్ట్ స్టార్క్ పదునైన బంతులతో చెలరేగడంతో రెండు సెషన్లకే భారత బ్యాటర్లు తమ ఇన్నింగ్స్‌ను ముగించారు. ఒక్క నితీశ్ కుమార్ రెడ్డి మాత్రమే తన దూకుడుతో ఆకట్టుకోగలిగాడు. గత టెస్టులో కుప్పకూలిన ఆస్ట్రేలియా టాపార్డర్ ఇప్పుడు కాస్త పట్టుదల కనబర్చడంతో తొలి రోజు ఆధిపత్యం ఆతిథ్య జట్టు ఖాతాలో చేరింది. పెర్త్ టెస్టు తరహాలోనే మన బౌలర్లు ప్రత్యర్థిని పడగొడతారా లేక రెండో రోజు బలమైన బ్యాటింగ్‌తో ఆ్రస్టేలియా పటిష్ట స్థితికి చేరుతుందా చూడాలి. అడిలైడ్: ఆ్రస్టేలియాతో రెండో టెస్టులో భారత బ్యాటింగ్ తడబడింది. గత మ్యాచ్ తరహాలోనే తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (54 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... రాహుల్ (64 బంతుల్లో 37; 6 ఫోర్లు), గిల్ (51 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు.మిచెల్ స్టార్క్ (6/48) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో భారత్‌ను దెబ్బ కొట్టాడు. అనంతరం ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టపోయి 33 ఓవర్లలో 86 పరుగులు చేసింది. మెక్‌స్వీనీ (38 బ్యాటింగ్; 6 ఫోర్లు), లబుషేన్ (20 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆ్రస్టేలియా మరో 94 పరుగులు వెనుకబడి ఉంది. ఈ ఆసక్తికర పోరుకు తొలి రోజు రికార్డు స్థాయిలో 50,186 మంది ప్రేక్షకులు హాజరు కావడం విశేషం. పదేళ్ల క్రితం మైదానంలో గాయపడి మృతి చెందిన ఫిల్ హ్యూస్, ఇటీవల కన్నుమూసిన మాజీ ఆటగాడు ఇయాన్ రెడ్‌పాత్ స్మృతిలో ఆసీస్ ఆటగాళ్లు భుజాలకు నలుపు రంగు బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. కీలక భాగస్వామ్యం... భారత ఇన్నింగ్స్ అనూహ్య రీతిలో మొదలైంది. మ్యాచ్ తొలి బంతికి యశస్వి జైస్వాల్ (0)ను అవుట్ చేసి స్టార్క్ దెబ్బ కొట్టాడు. 140.4 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతికి జైస్వాల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత గిల్ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగా, రాహుల్ కాస్త జాగ్రత్త ప్రదర్శించాడు. బోలండ్ తొలి ఓవర్లో రాహుల్ కొంత ఉత్కంఠను ఎదుర్కొన్నాడు. తొలి బంతికి అతను కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా అది ‘నోబాల్’ అయింది.అయితే ఆ తర్వాత రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని కూడా తేలింది. అదే ఓవర్లో రాహుల్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను ఖ్వాజా వదిలేశాడు. అయితే కొద్ది సేపటి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 12 పరుగుల వ్యవధిలో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. రాహుల్, కోహ్లి (7)లను స్టార్క్ అవుట్ చేయగా... గిల్ వికెట్ బోలండ్ ఖాతాలో చేరడంతో తొలి సెషన్ ముగిసేసరికి స్కోరు 82/4కు చేరింది. బ్రేక్ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఆరో స్థానంలో ఆడిన రోహిత్ శర్మ (3) విఫలం కాగా... రిషభ్ పంత్ (21; 2 ఫోర్లు), అశ్విన్ (22; 3 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హర్షిత్ రాణా (0)ను అవుట్ చేసి స్టార్క్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా, స్టార్క్ బౌలింగ్‌లోనే భారీ షాట్ ఆడే క్రమంలో నితీశ్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. రెండో సెషన్లో భారత్ 21.1 ఓవర్లలో 98 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. వికెట్ కాపాడుకుంటూ... తొలి టెస్టులో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఓటమికి బాటలు పడటంతో ఈసారి ఆసీస్ ఓపెనర్లు జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే 2 పరుగుల వద్ద మెక్‌స్వీనీ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ వదిలేయం కూడా కలిసొచ్చి0ది. పంత్ అడ్డుగా రాకపోతే బంతి నేరుగా రోహిత్ చేతుల్లోకి వెళ్లేది! తొలి 10 ఓవర్లలో ఆసీస్ వికెట్ కోల్పోలేదు. అయితే బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో ఉస్మాన్ ఖ్వాజా (13; 2 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయే స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన లబుషేన్ ఈ సారి కూడా ఆరంభంలో బాగా తడబడ్డాడు. ఎట్టకేలకు 19వ బంతికి అతను ఖాతా తెరిచాడు. మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత మెక్‌స్వీనీ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. 22 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) మెక్‌స్వీనీ (బి) స్టార్క్ 37; గిల్ (ఎల్బీ) (బి) బోలండ్ 31; కోహ్లి (సి) స్మిత్ (బి) స్టార్క్ 7; పంత్ (సి) లబుõÙన్ (బి) కమిన్స్ 21; రోహిత్ (ఎల్బీ) (బి) బోలండ్ 3; నితీశ్ కుమార్ రెడ్డి (సి) హెడ్ (బి) స్టార్క్ 42; అశ్విన్ (ఎల్బీ) (బి) స్టార్క్ 22; హర్షిత్ (బి) స్టార్క్ 0; బుమ్రా (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (44.1 ఓవర్లలో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–0, 2–69, 3–77, 4–81, 5–87, 6–109, 7–141, 8–141, 9–176, 10–180. బౌలింగ్: స్టార్క్ 14.1–2–48–6, కమిన్స్ 12–4– 41–2, బోలండ్ 13–0–54–2, లయన్ 1–0–6– 0, మార్‡్ష 4–0–26–0. ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) రోహిత్ (బి) బుమ్రా 13; మెక్‌స్వీనీ (బ్యాటింగ్) 38; లబుషేన్ (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (33 ఓవర్లలో వికెట్ నష్టానికి) 86. వికెట్ల పతనం: 1–24. బౌలింగ్: బుమ్రా 11–4–13–1, సిరాజ్ 10–3–29–0, హర్షిత్ 8–2–18–0, నితీశ్ 3–1–12–0, అశ్విన్ 1–1–0–0.3 ఆసీస్ ఓపెనర్ ఖ్వాజాను అవుట్ చేయడంతో బుమ్రా ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే ఏడాది 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో భారతీయ పేసర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. గతంలో కపిల్ దేవ్ రెండుసార్లు (1983లో 18 టెస్టుల్లో 75 వికెట్లు; 1979లో 17 టెస్టుల్లో 74 వికెట్లు), జహీర్ ఖాన్ (2002లో 15 టెస్టుల్లో 51 వికెట్లు) ఒకసారి ఈ ఘనత సాధించారు. నితీశ్... తగ్గేదేలే పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లోనూ దానిని పునరావృతం చేశాడు. ఈసారి బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన అతని ఆట వల్లే భారత్ ఈమాత్రం స్కోరు చేయగలిగింది. భారత్ ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లూ అతని ద్వారానే వచ్చాయి. స్టార్క్ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా అద్భుత సిక్స్ కొట్టిన అతను... బోలండ్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో ధాటిని ప్రదర్శించాడు. ఇందులో స్లిప్ కార్డన్ మీదుగా ‘రివర్స్ స్కూప్’తో అతను కొట్టిన సిక్సర్ ఆట మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై పేసర్ల బౌలింగ్‌లో అత్యధిక (5) సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా తన రెండో టెస్టులోనే నితీశ్ గుర్తింపు సాధించడం విశేషం. -
IND Vs NZ: పుణేలోనూ పరేషాన్
తొలి టెస్టులో న్యూజిలాండ్ పేస్ బౌలర్ల ధాటికి దాసోహం అన్న భారత జట్టు... రెండో టెస్టులో స్పిన్నర్లను ఎదుర్కోలేక చేతులెత్తేసింది. ఏడేళ్ల క్రితం ఇక్కడే జరిగిన టెస్టు మ్యాచ్‌లో పూర్తి స్పిన్ పిచ్‌ను సిద్ధం చేసి ఆ్రస్టేలియా చేతిలో భంగపాటుకు గురైన టీమిండియా... ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలోనూ అలాంటి పరిస్థితే ఎదుర్కుంటోంది. స్పిన్‌ను ఆడటంలో సిద్ధహస్తులు అనుకున్న మన బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ బృందం కుప్పకూలగా ... భారత బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డచోట కివీస్ ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఫలితంగా రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా గడ్డు స్థితిలో ఉంది. భారత గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవని న్యూజిలాండ్ ఇప్పటికే 301 పరుగుల ఆధిక్యంతో దూసుకెళ్తుండగా... పుష్కర కాలం నుంచి సొంతగడ్డపై సిరీస్ ఓటమి ఎరుగని టీమిండియా ఇప్పుడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది! ఇక ఈ మ్యాచ్ నుంచి రోహిత్ బృందం గట్టెక్కాలంటే అద్భుతం జరగాల్సిందే! పుణే: దశాబ్ద కాలంగా సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ... ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్న టీమిండియా 12 సంవత్సరాల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి అంచున నిలిచింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ పేసర్ల ధాటికి బెంబేలెత్తి పరాజయం పాలైన టీమిండియా... ఇప్పుడు పుణేలో ప్రత్యర్థి స్పిన్ దెబ్బకు వెనుకంజ వేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన న్యూజిలాండ్ జట్టు శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (133 బంతుల్లో 86; 10 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బ్లన్‌డెల్ (30 బ్యాటింగ్; 2 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. చేతిలో ఐదు వికెట్లు ఉన్న న్యూజిలాండ్... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 103 పరుగులు కలుపుకొని ఓవరాల్‌గా 301 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. బ్లన్డెల్తో పాటు గ్లెన్ ఫిలిప్స్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 16/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 45.3 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా (38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... యశస్వి జైస్వాల్ (30), శుబ్‌మన్ గిల్ (30) ఫర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిషెల్ సాంట్నర్ 7 వికెట్లతో సత్తా చాటగా... గ్లెన్ ఫిలిప్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. లాథమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన చోట... బ్యాటింగ్ ఎలా చేయాలో లాథమ్ ఆచరణలో చూపాడు. అప్పటికే 100 పరుగులకు పైగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన లాథమ్... ఒక్కో పరుగు జోడిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు బోర్డును నడిపించాడు. కాన్వే (17), విల్ యంగ్ (23), రచిన్ రవీంద్ర (9), మిచెల్ (18) ఎక్కువసేపు నిలవకపోయినా... చిన్న చిన్న భాగస్వామ్యాలు నిరి్మస్తూ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. పేసర్లు ప్రభావం చూపకపోవడంతో భారత కెపె్టన్ రోహిత్ శర్మ ఆరంభం నుంచే స్పిన్నర్లను నమ్ముకోగా.. సుందర్ మినహా అశ్విన్, జడేజా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయారు. మరి కాసేపట్లో రెండో రోజు ఆట ముగుస్తుందనగా.. లాథమ్‌ను సుందర్ వికెట్ల ముందు దొరక బుచ్చుకోగా... ఇప్పటికే 301 పరుగుల ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్... టీమిండియా ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం.ఒకరి వెంట ఒకరు.. బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు... స్పిన్‌కు స్వర్గధామంలా కనిపిస్తున్న పుణే పిచ్‌పైనైనా చెలరేగుతుంది అనుకుంటే అదీ సాధ్యపడలేదు. రెండో వికెట్‌కు గిల్, జైస్వాల్ జోడించిన 49 పరుగులే భారత ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం కాగా.. జట్టు స్కోరు 50 వద్ద గిల్ ఔటయ్యాడు.ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. సాంట్నర్ వేసిన ఊరించే బంతికి విరాట్ కోహ్లి (1) క్లీన్ బౌల్డ్ కాగా.. యశస్వి జైస్వాల్, పంత్ (18)ను ఫిలిప్స్ బుట్టలో వేసుకున్నాడు. గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి తన విలువ చాటుకున్న కోహ్లి చెత్త బంతికి పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ (11), అశ్విన్ (4) ఎక్కువసేపు నిలువలేకపోయారు. బెంగళూరులో భారీ సెంచరీతో జట్టులో ఆత్మవిశ్వాసం నింపిన సర్ఫరాజ్ ఈసారి అదే ప్రయత్నం చేయలేకపోయాడు. జడేజా ధాటిగా ఆడగా... సుందర్ (18 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయంగా నిలిచాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 259; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 30; రోహిత్ (బి) సౌతీ 0; గిల్ (ఎల్బీ) (బి) సాంట్నర్ 30; కోహ్లి (బి) సాంట్నర్ 1; పంత్ (బి) ఫిలిప్స్ 18; సర్ఫరాజ్ (సి) రూర్కే (బి) సాంట్నర్ 11; జడేజా (ఎల్బీ) సాంట్నర్ 38; అశ్విన్ (ఎల్బీ) (బి) సాంట్నర్ 4; సుందర్ (నాటౌట్) 18; ఆకాశ్‌దీప్ (బి) సాంట్నర్ 6; బుమ్రా (ఎల్బీ) (బి) సాంట్నర్ 0; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్) 156. వికెట్ల పతనం: 1–1, 2–50, 3–56, 4–70, 5–83, 6–95, 7–103, 8–136, 9–142, 10–156. బౌలింగ్: సౌతీ 6–1–18–1, రూర్కే 3–2–5–0, ఎజాజ్ 11–1–54–0, సాంట్నర్ 19.3–1–53–7, ఫిలిప్స్ 6–0–26–2. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) సుందర్ 86; కాన్వే (ఎల్బీ) (బి) సుందర్ 17; యంగ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 23; రచిన్ (బి) సుందర్ 18; మిషెల్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 18; బ్లన్‌డెల్ (బ్యాటింగ్) 30; ఫిలిప్స్ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (53 ఓవర్లలో 5 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–36, 2–78, 3–89, 4–123, 5–183. బౌలింగ్: అశ్విన్ 17–1–64–1; సుందర్ 19–0–56–4; జడేజా 11–1–50–0; బుమ్రా 6–1–25–0. -
‘సప్త’ సుందర్
వాషింగ్టన్ సుందర్ టెస్టు మ్యాచ్ ఆడి మూడున్నరేళ్లు దాటింది. ఈ సిరీస్ తొలి టెస్టులో అతనికి చోటే లేదు. అయితే రంజీ ట్రోఫీలో ప్రదర్శన కారణంగా జట్టులో నలుగురు రెగ్యులర్ స్పిన్నర్లు ఉన్నా రెండో టెస్టు కోసం 16వ సభ్యుడిగా అతడిని అదనంగా ఎంపిక చేశారు. ఆఫ్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతనికి ఈ అవకాశం కల్పించింది. తొలి రోజు సుందర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఏకంగా ఏడు వికెట్లతో న్యూజిలాండ్‌ను పడగొట్టాడు. సహచర తమిళనాడు సీనియర్ అశ్విన్ తొలి మూడు వికెట్లతో మొదలు పెడితే సుందర్ దానిని కొనసాగించాడు. కివీస్‌ను 259 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా... రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకొని రోజును కాస్త నిరాశగా ముగించింది. పుణే: భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో ఊహించినట్లుగానే తొలి రోజు నుంచే స్పిన్నర్ల జోరు మొదలైంది. ఆఫ్‌స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) ధాటికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 259 పరుగులకే ఆలౌటైంది. డెవాన్ కాన్వే (141 బంతుల్లో 76; 11 ఫోర్లు), రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం ఆట ముగిసేసరికి భారత్ 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... యశస్వి జైస్వాల్ (6 బ్యాటింగ్), శుబ్‌మన్ గిల్ (10 బ్యాటింగ్) తమ దూకుడును కట్టిపెట్టి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, సిరాజ్, కుల్దీప్ యాదవ్ స్థానాల్లో గిల్, ఆకాశ్‌దీప్, సుందర్ జట్టులోకి వచ్చారు. ఈసారీ వారిద్దరే... గత టెస్టు తరహాలోనే ఈ సారి కూడా కివీస్ టాప్–7లో కాన్వే, రచిన్ మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడగా... మిగతా వారంతా విఫలమయ్యారు. పేసర్లు వేసిన తొలి 7 ఓవర్లలో కివీస్ 5 ఫోర్లతో చకచకా 30 పరుగులు రాబట్టింది. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్లోనే అశ్విన్‌ను బౌలింగ్‌కు దించడం ఫలితాన్ని అందించింది. తన ఐదో బంతికే టామ్ లాథమ్ (15)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతను కొద్ది సేపటికే విల్ యంగ్ (18)ను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో కాన్వే, రచిన్ కలిసి జట్టును ఆదుకున్నారు. లంచ్ తర్వాత బుమ్రా వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన కాన్వే 109 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు 62 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం తర్వాత కాన్వేను అవుట్ చేసి అశ్విన్ ఈ జోడీని విడగొట్టాడు. అయితే రచిన్ మాత్రం చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో రెండు వరుస ఫోర్లతో అతను 93 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగా... ఒకదశలో కివీస్ 197/3 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. టపటపా... స్పిన్నర్ సుందర్ కొత్త స్పెల్‌తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చక్కటి బంతితో రచిన్‌ను క్లీన్»ౌల్డ్ చేసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టిన అతను తర్వాతి ఓవర్లో బ్లన్‌డెల్ (3) పని పట్టాడు. టీ విరామం తర్వాత చివరి సెషన్లో మిగిలిన ఐదు వికెట్లు తీసేందుకు సుందర్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అతని బంతులను ఆడలేక బ్యాటర్లంతా వికెట్లు సమర్పించుకున్నారు. ఒక్క మిచెల్ సాన్‌ట్నర్ (51 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే కొద్దిసేపు పోరాడగలిగాడు. తన తొలి 13 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయని సుందర్ తర్వాత 61 బంతుల వ్యవధిలో 7 వికెట్లు పడగొట్టడం విశేషం. ప్రత్యర్థి 10 వికెట్లను ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లే కలిసి పడగొట్టడం భారత్ తరఫున ఇదే తొలిసారి. 62 పరుగుల వ్యవధిలో కివీస్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 15; కాన్వే (సి) పంత్ (బి) అశ్విన్ 76; యంగ్ (సి) పంత్ (బి) అశ్విన్ 18; రచిన్ (బి) సుందర్ 65; మిచెల్ (ఎల్బీ) (బి) సుందర్ 18; బ్లన్‌డెల్ (బి) సుందర్ 3; ఫిలిప్స్ (సి) అశ్విన్ (బి) సుందర్ 9; సాన్‌ట్నర్ (బి) సుందర్ 33; సౌతీ (బి) సుందర్ 5; ఎజాజ్ (బి) సుందర్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (79.1 ఓవర్లలో ఆలౌట్) 259. వికెట్ల పతనం: 1–32, 2–76, 3–138, 4–197, 5–201, 6–204, 7–236, 8–242, 9–252, 10–259. బౌలింగ్: బుమ్రా 8–2–32–0, ఆకాశ్‌దీప్ 6–0–41–0, అశ్విన్ 24–2–64–3, వాషింగ్టన్ సుందర్ 23.1–4–59–7, జడేజా 18–0–53–0. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 6; రోహిత్ (బి) సౌతీ 0; గిల్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టానికి) 16. వికెట్ల పతనం: 1–1. బౌలింగ్: సౌతీ 3–1–4–1, రూర్కే 3–2–5–0, ఎజాజ్ 3–1–5–0, సాన్‌ట్నర్ 2–0–2–0. -
IND Vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు
పూణే వేదికగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 24) ప్రారంభంకానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్‌కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా -
పుణేలో ప్రతీకారానికి సిద్ధం!
సొంతగడ్డపై తొలి టెస్టులో ప్రత్యర్థి చేతిలో ఓడి వెనుకబడటం, ఆ తర్వాత కోలుకొని వరుస విజయాలతో సిరీస్ గెలుచుకోవడం భారత జట్టుకు కొత్త కాదు. ఇటీవల ఆస్ట్రేలియా ఒకసారి, ఇంగ్లండ్ రెండుసార్లు ఇలాగే ముందంజ వేసినా మన టీమ్ మళ్లీ సత్తా చాటి తామేంటో చూపించింది. ఇప్పుడు ఈ విషయంలో న్యూజిలాండ్ వంతు! ప్రతికూల పిచ్ దెబ్బకు అనూహ్యంగా కివీస్ చేతిలో తొలి టెస్టులో ఓడిన టీమిండియా ప్రతీకారానికి సిద్ధమైంది. తమ స్థాయిని ప్రదర్శిస్తూ రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగుతోంది. మరోవైపు గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో న్యూజిలాండ్ కూడా ఎక్కడా తగ్గరాదని పట్టుదలగా ఉంది. పుణే: ‘రెండు గంటలు మినహా మిగతా మ్యాచ్ మొత్తం మేం బాగా ఆడాం’... బెంగళూరు టెస్టులో ప్రదర్శనపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్య ఇది. పిచ్‌పై అంచనా తప్పడంతో 0–1తో సిరీస్‌లో వెనుకబడిన భారత్ ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వ రాదని భావిస్తోంది. అందుకే తమ టీమ్ బలగంతో పాటు స్పిన్ బలాన్ని కూడా నమ్ముకుంటోంది. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ను రూపొందించి ప్రత్యర్థికి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సిరీస్‌లో 1–1తో సమంగా నిలుస్తుంది. బరిలోకి గిల్... గత టెస్టు మ్యాచ్ ఆడిన జట్టులోంచి భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కోలుకున్న టాపార్డర్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాడని మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే గిల్ వస్తే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరం. రాహుల్‌పై విమర్శలు వస్తున్నా... అతను మిడిలార్డర్‌కు మారిన తర్వాత 1 సెంచరీ, 2 అర్ధసెంచరీలతో మెరుగైన ప్రదర్శనే చేశాడు. కానీ గత టెస్టులో ఆటను బట్టి సర్ఫరాజ్‌కే మొగ్గు చూపవచ్చు. ఈ యువ ఆటగాడు తన బ్యాటింగ్ జోరు కొనసాగించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. మరోవైపు సిరాజ్ ఫామ్‌లో లేకపోవడంతో అతనికి బదులుగా ఆకాశ్‌దీప్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఎలాగూ స్పిన్‌తో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు కాబట్టి నాలుగో స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు. రోహిత్, యశస్వి, గిల్, కోహ్లిలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. పంత్ కూడా పూర్తిగా కోలుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన తరహాలో అశ్విన్, జడేజా కూడా ఒక చేయి వేస్తే తిరుగుండదు. బౌలింగ్‌లో వీరిద్దరితో పాటు కుల్దీప్ కివీస్‌ను కుప్పకూల్చాలని టీమ్ కోరుకుంటోంది. సాన్‌ట్నర్‌కు చోటు... తొలి టెస్టులో గెలిచినా... వాస్తవ పరిస్థితి ఏమిటో న్యూజిలాండ్‌కు తెలుసు. గత మ్యాచ్ విజయం తమలో స్ఫూర్తి నింపేందుకు పనికొస్తుందే తప్ప వరుసగా రెండో టెస్టులో భారత్‌ను ఇక్కడ ఓడించడం అంత సులువు కాదనేది నిజం. అందుకే టీమ్ అన్ని రకాలుగా సన్నద్ధమై ఉంది. పూర్తిగా స్పిన్ పిచ్ అయినా సరే ముందే బెదిరిపోమని, దానికి అనుగుణంగా తమ ఆటను మార్చుకుంటామని కెపె్టన్ లాథమ్ చెబుతున్నాడు. తొలి టెస్టులో కీలక బ్యాటింగ్ ప్రదర్శన చేసిన రచిన్, కాన్వే, యంగ్ మరోసారి జట్టుకు భారీ స్కోరు అందించగల సమర్థులు. వీరితో పాటు లాథమ్, మిచెల్, బ్లన్‌డెల్ కూడా రాణించాలని జట్టు ఆశిస్తోంది. దూకుడైన బ్యాటింగ్ చేయగల సమర్థుడైన ఫిలిప్స్ ఇటీవల పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా రాణిస్తుండటం ఆ జట్టుకు సానుకూలాంశం. అయితే బెంగళూరు తరహాలో ముగ్గురు పేసర్లు ప్రభావం చూపించే అవకాశం లేదు కాబట్టి ఒకరిని తప్పించి మరో రెగ్యులర్ స్పిన్నర్ సాన్ట్నర్ను జట్టు బరిలోకి దించనుంది. 2 పుణేలో భారత జట్టు ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడింది. ఒక మ్యాచ్‌లో ఓడి, మరో మ్యాచ్‌లో గెలిచింది. 2017లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిన భారత్... 2019లో దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పిచ్, వాతావరణం తొలి టెస్టు ముగిసిన దగ్గరి నుంచి చెబుతున్నట్లుగా పూర్తిగా పొడిగా ఉండే స్పిన్ వికెట్‌ను సిద్ధం చేశారు. ఆట సాగుతున్నకొద్దీ స్పిన్నర్లు మరింత ప్రభావం చూపగలరు. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్షసూచన ఏమాత్రం లేదు. అయితే 2017లో ఇదే మైదానంలో పూర్తిగా స్పిన్ పిచ్‌ను తయారు చేసిన భారత్... ఆసీస్ స్పిన్ దెబ్బకు 333 పరుగులతో ఓడి భంగపడిన విషయం గమనార్హం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లి, సర్ఫరాజ్/రాహుల్, పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, ఆకాశ్‌దీప్/సుందర్. న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్ ), కాన్వే, యంగ్, రచిన్, మిచెల్, బ్లన్‌డెల్, ఫిలిప్స్, హెన్రీ, ఎజాజ్, సాన్‌ట్నర్, సౌతీ/రూర్కే. -
వారిద్దరూ సిద్ధమే
పుణే: గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుబ్‌మన్ గిల్‌తో పాటు... మోకాలి వాపుతో కీపింగ్ చేసేందుకు ఇబ్బంది పడిన రిషబ్ పంత్ రెండో టెస్టు వరకు అందుబాటులో ఉంటారని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే వెల్లడించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా... భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచి పుణేలో రెండో టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. అనంతరం డస్కటే మీడియాతో మాట్లాడాడు. బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాన్వేను స్టంపౌట్ చేసే ప్రయత్నంలో పంత్ మోకాలికి గాయమైంది. గతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అదే కాలికి శస్త్రచికిత్స జరగడంతో జట్టు మొత్తం ఆందోళనకు గురైంది. గాయం తీవ్రత ఎక్కువ ఉండటంతో వెంటనే పంత్ మైదానాన్ని వీడగా... అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. అనంతరం అత్యవసర పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్... పరిగెత్తడానికి ఇబ్బంది పడుతూనే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్ అనంతరం ‘పంత్‌ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొనడంతో అతడు రెండో టెస్టులో ఆడతాడా లేదా అనే సంశయం నెలకొంది. అయితే తాజాగా డస్కటే ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. ‘పంత్ పూర్తిగా కోలుకున్నాడు. పుణే టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. గిల్ ఆరోగ్యం కూడా కుదుట పడింది. అతడు నెట్ ప్రాక్టీస్ కూడా చేశాడు. మ్యాచ్ వరకు అంతా సవ్యంగా ఉంటుంది అనుకుంటున్నాం’ అని డస్కటే పేర్కొన్నాడు. ఆ ఇద్దరి మధ్యే పోటీ భారత తుది జట్టులో చోటు కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ ఉందని డస్కటే అన్నాడు. తొలి టెస్టులో భారీ సెంచరీతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ మధ్య పోటీ ఉందని అన్నాడు. ‘ఇందులో దాయడానికి ఏమీ లేదు. తుది జట్టులో ఓ బెర్త్ కోసం పోటీ ఉంది. బెంగళూరు టెస్టులో సర్ఫరాజ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ కూడా సంసిద్ధంగా ఉన్నాడు. పిచ్, పరిస్థితులను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. రాహుల్ ఆటతీరును కోచ్ గౌతమ్ గంభీర్ నిశితంగా పరిశీలిస్తున్నాడు. రాహుల్‌పై టీమ్ మేనేజ్మెంట్కు నమ్మకముంది. అదే సమయంలో దేశవాళీలతో పాటు అవకాశం వచ్చిన ప్రతిసారీ జాతీయ జట్టు తరఫున నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సర్ఫరాజ్‌ను కూడా పక్కన పెట్టలేం. అందుకే అందరు ఆటగాళ్లకు అండగా నిలుస్తాం. న్యూజిలాండ్ జట్టులో ఎక్కువ మంది ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండటం వల్లే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టుకు ఎంపిక చేశారు. ఇటీవల రంజీ ట్రోఫీలో అతడి ప్రదర్శన బాగుంది. తమిళనాడు తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ సెంచరీ బాదడంతో పాటు... బౌలింగ్‌లోనూ రాణించాడు’ అని డస్కటే గుర్తు చేశాడు. ఇక స్వదేశంలో జరిగిన టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ను కూడా డస్కటే వెనకేసుకొచ్చాడు. ‘బెంగళూరు టెస్టు ఆఖరి రోజు తొలి గంటలో సిరాజ్ చక్కటి బౌలింగ్ చేశాడు. దురదృష్టవశాత్తు వికెట్ దక్కక పోయినా... అతడి బౌలింగ్‌లో ఎలాంటి లోపం లేదు. నాణ్యమైన బంతులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. పుణేలో పరిస్థితులను బట్టే జట్టు ఎంపిక ఉంటుంది’ అని డస్కటే వివరించాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఎలాంటి సమస్యలు లేవని అతడు అన్నాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టే అతడు తక్కువ బౌలింగ్ చేశాడని తెలిపాడు. టీమిండియా ముమ్మర సాధన తొలి టెస్టులో పరాజయం పాలై సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా... రెండో టెస్టు కోసం కసరత్తులు చేస్తోంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు. పంత్ గాయం నేపథ్యంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్... కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కాసేపటికి మైదానంలోకి వచ్చిన పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో పాటు చివర్లో కీపింగ్ సాధన కూడా చేయడంతో అతడి ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. మరోవైపు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఇక కొత్తగా జట్టుతో కలిసి వాషింగ్టన్ సుందర్ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ సాగించాడు. ఈ మ్యాచ్ కోసం రూపొందించిన పిచ్‌ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెపె్టన్ రోహిత్ శర్మ, బౌలర్లు జడేజా తదితరులు నిశితంగా పరిశీలించారు. రెండో టెస్టు కోసం స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను తయారు చేసినట్లు సమాచారం. -
ఒక్క బంతి పడకుండానే...
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వదిలేలా లేడు. భారీ వర్షానికి తోడు వెలుతురులేమి కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యం కాగా... శనివారం రెండో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది. ఉదయంనుంచి భారీ వర్షం కురుస్తుండటంతో ఆట నిర్ణీత సమయానికి ప్రారంభం కాకపోగా... లంచ్ విరామ సయమంలో వరుణుడు కాస్త శాంతించాడు. దీంతో గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్ధం చేసే పనిలో పడగా... మరోసారి వర్షం ముంచెత్తింది. ఫలితంగా అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం కూడా వర్ష సూచన ఉండటం అభిమానులను కలవరపెట్టే అంశం! కాన్పూర్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కొనసాగుతోంది. న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో సిరీస్‌లకు ముందు బంగ్లాదేశ్‌పై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావించిన టీమిండియాను కాన్పూర్‌లో వరుణుడు అడ్డుకున్నాడు. తొలి రోజు భారీ వర్షం కారణంగా కేవలం 35 ఓవర్ల ఆట సాధ్యం కాగా... శనివారం ఆ కాస్త కూడా తెరిపినివ్వలేదు. అసలు ఆటగాళ్లు మైదానంలోకి వచ్చే అవకాశమే లేకుండా వర్షం ముంచెత్తడంతో పలు సమీక్షల అనంతరం రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. చిరుజల్లులుగా మొదలైన వర్షం ఆ తర్వాత మైదానాన్ని ముంచెత్తింది. మధ్యలో కాసేపు వరుణుడు శాంతించడంతో గ్రౌండ్స్‌మెన్ సూపర్ సాపర్లతో మైదానాన్ని సిద్ధం చేసే ప్రయత్నాలు ప్రారంభించగా... మరోసారి భారీ వాన దంచి కొట్టింది. దీంతో ఆట సాధ్యపడలేదు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆదివారం, సోమవారం కూడా కాన్పూర్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం లాంఛనమే. తొలి రోజు ఆటలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హసన్ (31; 6 ఫోర్లు), షాద్మన్ ఇస్లామ్ (24; 4 ఫోర్లు), జాకీర్ హసన్ (0) ఔట్ కాగా... మోమినుల్ హక్ (81 బంతుల్లో 40 బ్యాటింగ్; 7 ఫోర్లు), ముషి్ఫకర్ రహీమ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. డబ్ల్యూటీసీ 2023–25 సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లాడిన భారత్ అందులో 7 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘డ్రా’తో మొత్తం 71.67 విజయ శాతంతో ‘టాప్’లో కొనసాగుతోంది. 12 మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా (62.50 విజయ శాతం) ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ అనంతరం భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు, ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియాతో 5 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ రెండింట్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే... టీమిండియా వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఖాయమే! బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు వర్షం కారణంగా చివరకు ‘డ్రా’గా ముగిస్తే అది రోహిత్ బృందం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే మార్గంపై స్వల్ప ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఆట సాగితే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. -
Ind vs Ban Day 1: మొదటి రోజు 35 ఓవర్లతో సరి
వర్షం, వెలుతురులేమి కలగలిసి భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి రోజు ఆటను అర్ధాంతరంగా ముగించాయి. తక్కువ వ్యవధిలో మూడు బంగ్లాదేశ్ వికెట్లు తీసి ఆధిక్యం ప్రదర్శించిన టీమిండియా వాన కారణంగా దానిని కొనసాగించలేకపోయింది. ఆట సాగిన 35 ఓవర్లలోనే భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తమ బలహీనతను ప్రదర్శించిన పర్యాటక జట్టుకు ఆట ఆగిపోవడం తెరిపినిచ్చింది. 11 బంతుల తేడాలోనే రెండు కీలక వికెట్లు తీసిన పేసర్ ఆకాశ్‌దీప్ బౌలింగ్ ఈ సంక్షిప్త ఆటలోహైలైట్గా నిలవగా... మ్యాచ్ రెండో రోజు కూడా వర్షసూచన ఉండటం భారత అభిమానులకు నిరాశకలిగించే విషయం. కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు వాన అంతరాయాలతో మొదలైంది. వర్షం కారణంగా ఉదయం ఆట గంట ఆలస్యంగా మొదలు కాగా... చివర్లో వెలుతురు మందగించడంతో నిర్ణీత సమయం కంటే గంటన్నర ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ మొదటి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40 బ్యాటింగ్; 7 ఫోర్లు), నజు్మల్ హసన్ ( 31; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం మోమినుల్తో పాటు ముషి్ఫకర్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఆకాశ్‌దీప్‌కు 2 వికెట్లు దక్కాయి. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని టీమిండియా గత టెస్టు తుది జట్టునే కొనసాగిస్తూ ముగ్గురు పేసర్లను ఎంచుకుంది. దాంతో కాన్పూర్ కే చెందిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. రాణించిన మోమినుల్... పరిస్థితులు పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను జాకీర్ (0), షాద్మన్ జాగ్రత్తగా ప్రారంభించారు. బుమ్రా తన తొలి 3 ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వలేదు. మరీ ఇబ్బంది పడిన జాకీర్ 23 బంతుల్లో సింగిల్ కూడా తీయలేకపోయాడు. ఆపై ఆకాశ్‌దీప్ తన తొలి ఓవర్లోనే అతడిని సాగనంపి భారత్‌కు తొలి వికెట్ అందించాడు.జైస్వాల్ పట్టిన క్యాచ్‌పై కాస్త సందేహం కనిపించినా... వరుస రీప్లేల తర్వాత అంపైర్లు జాకీర్‌ను అవుట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఆకాశ్‌దీప్ మూడో ఓవర్ తొలి బంతికే షాద్మన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా... రివ్యూ కోరిన భారత్ ఫలితం పొందింది. ఈ దశలో నజు్మల్, మోమినుల్ కలిసి జట్టుకు ఆదుకునే ప్రయత్నం చేశారు.సిరాజ్ ఓవర్లో నజు్మల్ ఎల్బీ కోసం రివ్యూ కోరిన భారత్ ఈసారి మాత్రం ప్రతికూల ఫలితం రావడంతో ఒక రివ్యూను కోల్పోయింది. ఇద్దరు బ్యాటర్లూ కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టి సెషన్‌ను ముగించారు. లంచ్ తర్వాత తన రెండో ఓవర్లో అశ్విన్ బంగ్లాదేశ్‌ను దెబ్బ తీశాడు. చక్కటి బంతితో నజు్మల్ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. బంగ్లా కెప్టెన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. నజు్మల్, మోమినుల్ మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు మరింత ఒత్తిడి పెంచారు. దాంతో మరో 6.1 ఓవర్ల పాటు మోమినుల్, ముష్ఫికర్ కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు అనూహ్య ముగింపుతో వారికి కాస్త ఉపశమనం లభించింది. ముందుగా వెలుతురులేమితో ఆటను నిలిపివేసిన అంపైర్లు గంట పాటు వేచి చూసి తుది నిర్ణయం తీసుకున్నారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ఆకాశ్‌దీప్ 0; షాద్మన్ (ఎల్బీ) (బి) ఆకాశ్‌దీప్ 24; మోమినుల్ (బ్యాటింగ్) 40; నజు్మల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 31; ముష్ఫికర్ రహీమ్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (35 ఓవర్లలో 3 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–80. బౌలింగ్: బుమ్రా 9–4–19–0, సిరాజ్ 7–0–27–0, అశ్విన్ 9–0–22–1, ఆకాశ్‌దీప్ 10–4–34–2. -
IND vs BAN: క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...
కాన్పూర్: వరసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న భారత క్రికెట్ జట్టు మరో సమరానికి సన్నద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా అదే జోరు కొనసాగించాలనే లక్ష్యంతో నేటి నుంచి జరిగే రెండో టెస్టులో బరిలోకి దిగనుంది. డబ్ల్యూటీసీ 2023–25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రోహిత్ శర్మ బృందం దాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉండగా... టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు విజయాన్ని కానుకగా ఇవ్వాలని బంగ్లాదేశ్ జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 14 మ్యాచ్‌లు జరగగా... అందులో టీమిండియా 12 విజయాలు సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ఇటీవల పాకిస్తాన్లో పాకిస్తాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్ జట్టు భారత గడ్డపై కూడా సంచలన ప్రదర్శన కొనసాగించాలని భావించినా... రోహిత్ జట్టు దూకుడు ముందు నిలవలేకపోయింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు ఆరంభంలో కాస్త ప్రభావం చూపగలిగిన ఆ జట్టు ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు స్వదేశంలో వరుసగా 17 టెస్టు సిరీస్ విజయాలు సాధించిన టీమిండియా.. ఇది కూడా గెలిస్తే ఆ సంఖ్య 18కి పెరగనుంది. ప్రపంచ క్రికెట్లో ఒక జట్టు స్వదేశంలో వరసగా అత్యధిక సిరీస్ విజయాలు సాధించిన జాబితాలో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా... ఆ్రస్టేలియా రెండుసార్లు స్వదేశంలో వరసగా పదేసి సిరీస్‌లు గెలిచి రెండో స్థానంలో ఉంది. 2012లో ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడిన అనంతరం స్వదేశంలో టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. రోహిత్, కోహ్లి కూడా రాణిస్తే... తొలి మ్యాచ్‌లో భారత జట్టు అదరగొట్టింది. ముఖ్యంగా ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశి్వన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడికి రవీంద్ర జడేజా అండగా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ సెంచరీలతో సత్తా చాటారు. అయితే స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మాత్రమే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో ఈ ఇద్దరు కూడా కదంతొక్కాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన భారత్... ఈసారి ఒక పేసర్‌ను తగ్గించి స్పిన్నర్‌ను తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లో ఒకరు తుది జట్టులోకి రానున్నారు. కాన్పూర్‌లో చివరిసారిగా 2021లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు ఐదు రోజులు సాగి చివరకు ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతం టీమిండియాకు బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యలు లేకపోయినా... మున్ముందు న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో కీలక సిరీస్‌లు ఆడనున్న నేపథ్యంలో ప్లేయర్లంతా ఫామ్ అందుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. బంగ్లాదేశ్ పోటీనిచ్చేనా... పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ విజయంతో భారత్‌లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ ఇక్కడ మాత్రం అదే జోరు కొనసాగించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో సాధారణ ప్రదర్శనతో టీమిండియాకు కనీస పోటీనివ్వలేకపోయింది. ఇక ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు భారత్‌పై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవని బంగ్లాదేశ్ ఆ రికార్డును తిరగరాయాలంటే శక్తికి మించి పోరాడక తప్పదు. 11 మరొక్క వికెట్ తీస్తే భారత ఆల్‌రౌండర్ జడేజా టెస్టు క్రికెట్లో 300 వికెట్లు తీయడంతోపాటు 3000 పరుగులు చేసిన 11వ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. భారత్ నుంచి కపిల్‌దేవ్, అశ్విన్ ఈ ఘనత సాధించారు.23 కాన్పూర్‌లో భారత జట్టు ఇప్పటి వరకు 23 టెస్టులు ఆడింది. 7 విజయాలు సాధించి, మూడింటిలో ఓడిపోయింది. మరో 13 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 129 మరో 129 పరుగులు సాధిస్తే విరాట్ కోహ్లి టెస్టుల్లో 9000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన 18వ క్రికెటర్‌గా నిలుస్తాడు. -
వెస్టిండీస్ విజయ లక్ష్యం 263
ప్రొవిడెన్స్: రెండో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు దక్షిణాఫ్రికా 263 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో 25 ఓవర్లు ముగిసే సరికి విండీస్ 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. అంతకు ముందు దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. కైల్ వెరీన్ (59), ఎయిడెన్ మార్క్రమ్ (51), టోనీ జోర్జీ (39), వియాన్ ముల్డర్ (34) కీలక పరుగులు సాధించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ (6/61) ఆరు వికెట్లతో ప్రత్యరి్థని దెబ్బ తీయగా...వారికాన్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
దక్షిణాఫ్రికా ఆధిపత్యం
ప్రొవిడెన్స్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికా ఆధిక్యం 109 పరుగులకు చేరింది. టోనీ జోర్జి (39) రాణించాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. సఫారీ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే ఆలౌటైంది. జేసన్ హోల్డర్ (88 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరిపోరాటం చేసి అర్ధసెంచరీ సాధించాడు. వియాన్ ముల్డర్ (4/32), బర్గర్ (3/49), కేశవ్ మహరాజ్ (2/8) విండీస్‌ను దెబ్బ తీశారు. దక్షిణాఫ్రికా కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగుల వద్దే 9వ వికెట్ కోల్పోయినా...డీన్ పీట్ (38 నాటౌట్), బర్గర్ (23) కలిసి 63 పరుగుల చివరి వికెట్ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. -
కుప్పకూలిన దక్షిణాఫ్రికా
ప్రొవిడెన్స్: వెస్టిండీస్ పేసర్ల ధాటికి రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు... విండీస్ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.షామర్ జోసెఫ్ (5/33), జైడెన్ సీల్స్ (3/41) ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 134 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. డేవిడ్ బెడింగ్హమ్ (28), ట్రిస్టన్ స్టబ్స్ (26), కైల్ వెరినె (21) ఓ మాదిరిగా ఆడగా.. కెపె్టన్ తెంబా బవుమా (0), మార్క్రమ్ (14), టోనీ డి జోర్జి (1), ముల్డర్ (0), కేశవ్ మహరాజ్ (0) విఫలమయ్యారు. -
241 పరుగులతో నెగ్గిన ఇంగ్లండ్
నాటింగ్హమ్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 241 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. నాలుగో రోజు ఇంగ్లండ్ నిర్దేశించిన 385 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 36.1 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 248/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 92.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (109; 13 ఫోర్లు), జో రూట్ (122; 10 ఫోర్లు) సెంచరీలు సాధించారు. -
నేటి నుంచి ఇంగ్లండ్, విండీస్ రెండో టెస్టు... వుడ్‌కు చోటు
వెస్టిండీస్ జట్టుతో నేడు నాటింగ్‌హామ్‌లో మొదలయ్యే రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టు తర్వాత ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో అండర్సన్ స్థానంలో రెండో టెస్టు కోసం మరో పేస్ బౌలర్ మార్క్ వుడ్‌కు ఇంగ్లండ్ తుది జట్టులో చోటు లభించింది. 34 ఏళ్ల మార్క్ వుడ్ ఇప్పటి వరకు 34 టెస్టులు ఆడి 108 వికెట్లు పడగొట్టాడు. మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలిచింది. -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. విండీస్ తుది జట్టు ప్రకటన
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం వెస్టిండీస్ తుది జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం విండీస్ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించనుంది.ఇంగ్లండ్ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఆండర్సన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ ఆడబోయే తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది.లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన ఆండర్సన్ పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన మరో ఆటగాడు జేమీ స్మిత్ బ్యాటింగ్, వికెట్‌కీపింగ్‌లో ఆకట్టుకున్నాడు. జేమీ డెబ్యూ ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేయడంతో పాటు మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. జేమీతో పాటు జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీలు చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. అట్కిన్సన్ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు ఆలౌటైంది. రేపటి టెస్ట్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్వెస్టిండీస్ ప్లేయింగ్ XI: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్‌కీపర్), జేసన్ హోల్డర్, గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్ -
శ్రీలంక 531 ఆలౌట్
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 159 ఓవర్లలో 531 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 314/4తో రెండో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక మరో 217 పరుగులు సాధించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు దినేశ్ చండీమల్ (59; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధనంజయ డిసిల్వా (70; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కామిందు మెండిస్ (92 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. ఓవరాల్‌గా లంక ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలు చేశారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ నమోదు కాకుండా అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా శ్రీలంక రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు భారత జట్టు (1976లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌పై 524/9 డిక్లేర్డ్) పేరిట ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది. -
BAN VS SL 2nd Test: ఏకంగా మూడు చేతులు మారి, చివరికి..!
చట్టోగ్రామ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫీల్డర్లు నవ్వులు పూయించారు. ఓ క్యాచ్‌ను ఏకంగా ముగ్గురు పట్టుకునేందుకు ప్రయత్నించి చివరికి విజయవంతంగా నేలపాలు చేశారు. శ్రీలంక ఇన్నింగ్స్ 121వ ఓవర్ చివరి బంతికి లంక ఆటగాడు ప్రభాత్ జయసూర్య కవర్స్ దిశగా డ్రైవ్ చేసే ప్రయత్నం చేయగా బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే ఇక్కడే డ్రామా మొదలైంది. Dropped x 3🫥pic.twitter.com/PucY2gbLRV — CricTracker (@Cricketracker) March 31, 2024 తొలుత తొలి స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో నుంచి జారిపోయిన బంతి.. ఆతర్వాత సెకెండ్ స్లిప్ ఫీల్డర్ చేతుల్లో నుంచి, ఆ తర్వాత మూడో స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో నుంచి జారిపోయి విజయవంతంగా నేలపాలైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట నువ్వులు పూయిస్తుంది. కాగా, ఇదే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో క్లియర్‌గా బ్యాట్‌కు తాకిన బంతికి ఎల్బీ కోసం రివ్యూకి వెళ్లి నవ్వుల పాలయ్యాడు. What just happened? 👀 . .#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov — FanCode (@FanCode) March 30, 2024 ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు అర్దసెంచరీలు సాధించారు. నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ 92 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
శ్రీలంక 314/4
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్‌తో మొదలైన రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది. టాపార్డర్ బ్యాటర్లు నిశాన్ మదుష్కా (57; 6 ఫోర్లు), దిముత్ కరుణరత్నే (86; 8 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (93; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. నిశాన్, కరుణరత్నే తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. నిశాన్ అవుటయ్యాక కుశాల్ మెండిస్‌తో కలిసి కరుణరత్నే రెండో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం దినేశ్ చండీమల్ (34 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెపె్టన్ ధనంజయ డిసిల్వా (15 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. నాలుగు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ స్టార్ షకీబ్ అల్ హసన్ 18 ఓవర్లు వేసి 60 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. -
బుమ్రాకు విశ్రాంతి!
రాజ్‌కోట్: భారత ప్రధాన పేపర్ జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో సీనియర్ సీమర్ బుమ్రా రెండో టెస్టును ఒంటిచేత్తో గెలిపించాడు. మూడు మ్యాచ్‌లు ముగిసిన ఈ సిరీస్‌లో అతను 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో 80.5 ఓవర్లు వేశాడు. ఈ నేపథ్యంలో అతనికి రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. బోర్డుకు ఇది కొత్తేం కాదు. ఆటగాళ్లపై పనిఒత్తిడి తగ్గేంచేందుకు బోర్డు కొంతకాలంగా ఇలాంటి వైఖరి అవలంభిస్తోంది. వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి తిరిగి మూడో టెస్టు ఆడించింది. ‘టీమిండియా మంగళవారం రాంచీకి బయలుదేరుతుంది. ఈ మ్యాచ్ నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుని వందశాతం ఫిట్నెస్తో ఉన్న కేఎల్ రాహుల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు చెప్పారు. ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే ఆఖరి టెస్టులో బుమ్రా తాజాగా బరిలోకి దిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ప్రత్యర్థి స్పిన్ ఉచ్చుతో భారత్ ఓడిపోయింది. పాతగాయం తిరగబెట్టడంతో రెండో టెస్టు నుంచి తప్పించారు. మూడో మ్యాచ్‌కు ఎంపిక చేసినప్పటికీ ఫిట్నెస్ సంతరించుకోకపోవడంతో మళ్లీ జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. -
రసపట్టులో రెండో టెస్టు.. గెలుపు తలుపు తట్టేదెవరు!
విశాఖ స్పోర్ట్స్: నేడో రేపో ఫలితం గ్యారంటీ! ఎలాంటి ‘డ్రా’ మలుపులు లేకుండా ఈ టెస్టును బౌలర్లు నడిపిస్తున్నారు. నాలుగో రోజు కూడా బౌలింగ్ కుదిరితే భారత్ గెలుపు తలుపు తట్టడం ఖాయమవుతుంది. అలాగని టెస్టుల్లో ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ ఆటతీరును తక్కువ అంచనా వేస్తే మాత్రం హైదరాబాద్‌లో ఎదురైన చేదు ఫలితం తప్పదు. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే ఇంగ్లండ్ స్పిన్ మ్యాజిక్‌తో ఎలాగైతే భారత రెండో ఇన్నింగ్స్‌ను బోల్తా కొట్టించిందో... మన స్పిన్నర్లు అదే మాయాజాలంతో దెబ్బకుదెబ్బ తీయాల్సిందే! వికెట్ల వేట భారత్‌ను గెలిపిస్తుందా... లేదంటే ఇంగ్లండ్ పరుగుల బాట లక్ష్యానికి చేరుస్తుందా అనేది నాలుగో రోజే తేలుతుంది. రెండు రోజుల ఆతిథ్య జట్టు ఆధిపత్యానికి ఎట్టకేలకు మూడో రోజు బ్రేక్ పడింది. భారత రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ బౌలర్లు సమష్టిగా దెబ్బ తీశారు. చేతిలో 10 వికెట్లున్న టీమిండియా మరో భారీ స్కోరు చేస్తుందనుకుంటే పర్యాటక బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. ఇంగ్లండ్ స్పిన్ సవాలుకు ఎదురు నిలిచిన ఒకే ఒక్కడు శుబ్‌మన్ గిల్ (147 బంతుల్లో 104; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం సాధించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 255 పరుగుల వద్ద ఆలౌటైంది. మిగతా వారిలో అక్షర్ పటేల్ (84 బంతుల్లో 45; 6 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఏమాత్రం అనుభవం లేని స్పిన్‌త్రయం టామ్ హార్ట్లీ (4/77), రేహన్ అహ్మద్ (3/88), షోయబ్ బషీర్ (1/58) భారత్‌ను ఇబ్బందుల్లో పడేయడం ఇక్కడ పెద్ద విశేషం. వెటరన్ సీమర్ అండర్సన్ 2 వికెట్లు తీశాడు. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 143 కలుపుకొని ప్రత్యర్థి ముందు టీమిండియా 399 పరుగుల కఠిన లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. అశ్విన్ బౌలింగ్‌లో ‘లోకల్ బాయ్’ కేఎస్ భరత్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో డకెట్ (28; 6 ఫోర్లు) పెవిలియన్ చేరగా... క్రాలీ (29 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), రేహన్ (9 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 332 పరుగుల దూరంలో ఉంది. శుబ్‌మన్ పోరాటం ఓవర్‌నైట్ స్కోరు 28/0తో ఆదివారం ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా రెండు పరుగుల వ్యవధిలోనే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. పేసర్ అండర్సన్ ఈ రెండు వికెట్లు తీశాడు. అండర్సన్ వేసిన అద్భుత బంతికి రోహిత్ శర్మ (13; 3 ఫోర్లు) బౌల్డ్ అవ్వగా... యశస్వి (17; 3 ఫోర్లు) రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కష్టాలతో మొదలైన రెండో ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ (29; 2 ఫోర్లు ) కాసేపు ఆదుకున్నారు. జట్టు స్కోరు వంద దాటాక అయ్యర్, రజత్ పటిదార్ (9) స్పిన్ ఉచ్చులో పడ్డారు. కుదురుగా ఆడుతున్న గిల్ అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా 130/4 స్కోరు వద్ద తొలి సెషన్ ముగిసింది. రెండో సెషన్లో శుబ్‌మన్, అక్షర్ పటేల్ భాగస్వామ్యం ఊరటనిచ్చింది. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 200 దాటగా... శుబ్‌మన్ శతకాన్ని సాధించాడు. చక్కగా సాగిపోతున్న ఈ జోడీని బషీర్... గిల్ వికెట్ తీసి విడగొట్టాడు. కాసేపటికే అక్షర్‌ను హార్ట్లీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. టీ విరామానికి 227/6 స్కోరుతో ఉన్న భారత్ ఆఖరి సెషన్లో స్పిన్‌కు దాసోహమైంది. అనూహ్యంగా 14.3 ఓవర్లలోనే మిగిలున్న 4 వికెట్లను కోల్పోయి కష్టంగా 28 పరుగులు మాత్రమే చేసింది. సొంతగడ్డపై రెండో ఇన్నింగ్స్‌లోనూ భరత్ (6) నిరాశపరిచాడు. కుల్దీప్ (0), బుమ్రా (0) ఖాతా తెరువకపోయినా... అశ్విన్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) వల్లే భారత్ 250 పైచిలుకు స్కోరు చేయగలిగింది. వైజాగ్‌లో మంచి శకునములే గతంలో వైజాగ్‌లో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారత జట్టే గెలిచింది. ఈ రెండు సందర్భాల్లోనూ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి భారీ విజయాలు నమోదు చేసింది. 2016లో ఇంగ్లండ్‌పై 246 పరుగుల తేడాతో... 2019లో దక్షిణాఫ్రికాపై 203 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 253; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) రూట్ (బి) అండర్సన్ 17; రోహిత్ (బి) అండర్సన్ 13; గిల్ (సి) ఫోక్స్ (బి) బషీర్ 104; అయ్యర్ (సి) స్టోక్స్ (బి) హార్ట్లీ 29; పటిదార్ (సి) ఫోక్స్ (బి) రేహన్ 9; అక్షర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్ట్లీ 45; భరత్ (సి) స్టోక్స్ (బి) రేహన్ 6; అశ్విన్ (సి) ఫోక్స్ (బి) రేహన్ 29; కుల్దీప్ (సి) డకెట్ (బి) హార్ట్లీ 0; బుమ్రా (సి) బెయిర్‌స్టో (బి) హార్ట్లీ 0; ముకేశ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (78.3 ఓవర్లలో ఆలౌట్) 255. వికెట్ల పతనం: 1–29, 2–30, 3–111, 4–122, 5–211, 6–220, 7–228, 8–229, 9–255, 10–255. బౌలింగ్: అండర్సన్ 10–1–29–2, బషీర్ 15–0–58–1, రేహన్ 24.3–5–88–3, రూట్ 2–1–1–0, హార్ట్లీ 27–3–77–4. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బ్యాటింగ్) 29; డకెట్ (సి) భరత్ (బి) అశ్విన్ 28; రేహన్ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో వికెట్ నష్టానికి) 67. వికెట్ల పతనం: 1–50. బౌలింగ్: బుమ్రా 5–1–9–0, ముకేశ్ 2–0– 19–0, కుల్దీప్ 4–0–21–0, అశ్విన్ 2–0–8–1, అక్షర్ 1–0–10–0. -
బుమ్రా కూల్చేశాడు
విశాఖ స్పోర్ట్స్: హైదరాబాద్‌లో మన స్పిన్ కుదర్లేదు. మ్యాచ్ చేతికందలేదు. కానీ వైజాగ్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. మ్యాచ్‌లో పట్టు సాధించేందుకు ఉపయోగపడుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (290 బంతుల్లో 209; 19 ఫోర్లు, 7 సిక్సర్లు) కెరీర్లో తొలి ద్విశతకం సాధించడంతో... ఓవర్‌నైట్ స్కోరు 336/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 112 ఓవర్లలో 396 పరుగుల వద్ద ఆలౌటైంది. అశ్విన్ (20; 4 ఫోర్లు) ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరగా, డబుల్ సెంచరీ పూర్తయ్యాక జైస్వాల్ నిష్క్రమించాడు. కాసేపటికే బుమ్రా (6), ముకేశ్ (0)లు నిష్క్రమించడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అనంతరం ఇంగ్లండ్‌ను బుమ్రా పేస్ (15.5–5–45–6) రెండు సెషన్లలో కూల్చేసింది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 253 పరుగుల వద్ద ఆలౌటైంది. జాక్ క్రాలీ (76; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ స్టోక్స్ (47; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేయడంతో టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 171కి చేరింది. బ్యాట్ వదిలేసి... చేతులెత్తేశాడు! తొలి సెషన్లో ఇంగ్లండ్ కేవలం 6 ఓవర్లే ఆడింది. కానీ ఓపెనర్లు క్రాలీ, డకెట్ ఎదురుదాడికి దిగడంతో చకచకా 32/0 స్కోరు చేసింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికి డకెట్ (21)ను కుల్దీప్ అవుట్ చేయడంతో 59 పరుగుల తొలివికెట్ భాగస్వామ్యం ముగిసింది. జట్టు స్కోరు వంద దాటేవరకు క్రాలీ, ఒలీ పోప్ (23; 2 ఫోర్లు) చక్కగా బ్యాటింగ్ చేశారు. బుమ్రా పేస్‌కు ఎదురునిలిచి వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడిన క్రాలీని అక్షర్ బోల్తా కొట్టించాడు. అక్కడి నుంచి బుమ్రా పేస్ ఆటను మలుపు తిప్పింది. రివర్స్‌స్వింగ్‌తో రూట్ (5), బుల్లెట్లా దూసుకెళ్లిన యార్కర్‌తో ఒలీ పోప్లను బుమ్రా అవుట్ చేయడంతో ఒకదశలో 114/1తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ టీ బ్రేక్‌కు 155/4తో ఆత్మరక్షణలో పడింది. ఆఖరి సెషన్లో కుల్దీప్ స్పిన్ జత కలవడంతో ఇంగ్లండ్ కుదేలైంది. బుమ్రా ఇన్‌స్వింగర్‌కు బెయిర్‌స్టో (25; 4 ఫోర్లు) వికెట్ సమర్పించుకోగా... ఫోక్స్ (6), రేహన్ (6) కుల్దీప్ ఉచ్చులో పడ్డారు. చివరి సెషన్లో కెప్టెన్ స్టోక్స్ వికెట్ హైలైట్‌గా నిలిచింది. బుమ్రా ఆఫ్‌స్టంప్ దిశగా వేసిన కట్టర్‌ను స్టోక్స్ డిఫెన్స్ ఆడలేక క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ క్షణంలో బ్యాట్ వదిలేసి చేతులెత్తేయడం చూస్తే ఆ బంతినెదుర్కోవడం స్టోక్స్ వల్ల కాలేదని స్పష్టమవుతుంది. ఈ వికెట్ల పరంపరలో బుమ్రా... హార్ట్లీ (21), అండర్సన్ (6)లను పడేశాడు. యశస్వి గ్రే ‘టెస్ట్’ ఇన్నింగ్స్.... తొలిరోజు కెప్టెన్ రోహిత్‌తో భారత ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసిన 22 ఏళ్ల యశస్వి రెండో రోజు డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ చేసిన స్కోరు 396 అయితే... అతనిదొక్కడిదే 209! అంటే సగానికిపైగా పరుగులు జైస్వాలే చేశాడు. ఇంకా చెప్పాలంటే మిగతా పది మందిలో ఏ ఒక్కరు కనీసం అర్ధసెంచరీ అయినా చేయలేదు. అయినాసరే తనతో జోడీకట్టిన బ్యాటర్‌తో తన డబుల్ సెంచరీని సాకారం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్లోకి వచ్చిన ఏడు నెలల్లోనే ద్విశతకాన్ని ఓ పటిష్టమైన ప్రత్యర్థిపై సాధించడం విశేషం. వినోద్ కాంబ్లీ (21 ఏళ్లు), సునీల్ గావస్కర్ (21 ఏళ్లు) తర్వాత పిన్న వయసులోనే ద్విశతకం చేసిన మూడో భారత బ్యాటర్ జైస్వాల్. తక్కువ ఇన్నింగ్స్ (10వ)ల్లో డబుల్ సెంచరీ బాదిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో కరుణ్ నాయర్ (3), కాంబ్లీ (4), మయాంక్ (8), పుజారా (9) ముందున్నారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: జాక్ క్రాలీ (సి) అయ్యర్ (బి) అక్షర్ 76; డకెట్ (సి) రజత్ (బి) కుల్దీప్ 21; పోప్ (బి) బుమ్రా 23; రూట్ (సి) గిల్ (బి) బుమ్రా 5; బెయిర్‌స్టో (సి) గిల్ (బి) బుమ్రా 25; స్టోక్స్ (బి) బుమ్రా 47; ఫోక్స్ (బి) కుల్దీప్ 6; రేహన్ (సి) గిల్ (బి) కుల్దీప్ 6; హార్ట్లీ (సి) గిల్ (బి) బుమ్రా 21; అండర్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 6; బషీర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (55.5 ఓవర్లలో ఆలౌట్) 253. వికెట్ల పతనం: 1–59, 2–114, 3–123, 4–136, 5–159, 6–172, 7–182, 8–229, 9–234, 10–253. బౌలింగ్: బుమ్రా 15.5–5–45–6, ముకేశ్ కుమార్ 7–1–44–0, కుల్దీప్ 17–1– 71–3, అశ్విన్ 12–0–61–0, అక్షర్ పటేల్ 4–0–24–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (బ్యాటింగ్) 15; రోహిత్ శర్మ (బ్యాటింగ్) 13; మొత్తం (5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 28. బౌలింగ్: అండర్సన్ 2–0–6–0, బషీర్ 2–0–17–0, రేహన్ 1–0–5–0. -
ఒకే ఒక్కడు.. భారీ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్
తొలి రోజు 336 పరుగులు చేసిన తర్వాత కూడా జట్టు కాస్త అసంతృప్తికి గురి కావడం సాధారణంగా కనిపించదు... కానీ శుక్రవారం భారత్ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. చక్కగా బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తున్న పిచ్‌పై తమకు లభించిన ఆరంభాలను బ్యాటర్లు భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అయితే ఇలాంటి సమయంలో ఒకే ఒక్కడు యశస్వి జైస్వాల్ అద్భుత బ్యాటింగ్‌తో శిఖరాన నిలిచాడు. మైదానం నలుమూలలా చూడముచ్చటైన స్ట్రోక్‌లు కొట్టడంతో పాటు పదునైన డిఫెన్స్‌ను ప్రదర్శిస్తూ భారీ శతకం బాదాడు. మరో వైపు ఆరు వికెట్లు తీసిన ఇంగ్లండ్ ఆనందంగా ఆటను ముగించింది. మిగిలింది బౌలర్లే కాబట్టే యశస్వి, అశ్విన్ జోడి రెండో రోజు భారత్ స్కోరును 400 వరకు తీసుకెళుతుందా లేక ఇంగ్లండ్ ఆలోపు నిలువరిస్తుందా చూడాలి. విశాఖ స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజును భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ముగించింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (257 బంతుల్లో 179 నాటౌట్; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ఆటతో ఒంటరి పోరాటం చేస్తూ ద్విశతకానికి చేరువయ్యాడు. యశస్వి మినహా మిగతా బ్యాటర్లంతా ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతం యశస్వితో పాటు అశ్విన్ (5 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు... భారత్ ఇన్నింగ్స్‌లో వరుసగా 40, 49, 90, 70, 52, 29 పరుగుల భాగస్వామ్యాలు ఉన్నాయి. చూస్తే మెరుగ్గానే అనిపిస్తున్నా... ఇందులో ఒక్కటీ భారీ భాగస్వామ్యంగా మారలేకపోయింది. ఒకే ఒక్కడు యశస్వి ఒంటి చేత్తో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా మిగతా బ్యాటర్ల స్కోర్లన్నీ 14నుంచి 34 పరుగుల మధ్య ఉండటం పరిస్థితిని చూపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (14) తన సహజశైలికి భిన్నంగా జాగ్రత్తగా ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. అయితే 41 బంతుల్లో ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయిన అతను లెగ్‌స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అరంగేట్ర బౌలర్ బషీర్ ఖాతాలో ఈ వికెట్ చేరింది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న శుబ్‌మన్ గిల్ (46 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఒక దశలో ఆరు బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. అయితే అండర్సన్ చక్కటి బంతికి అతను అవుటయ్యాడు. లంచ్ తర్వాత కుదురుకునేందుకు ప్రయత్నించిన శ్రేయస్ అయ్యర్ (59 బంతుల్లో 27; 3 ఫోర్లు) కూడా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడలేక కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం యశస్వికి రజత్ పటిదార్ (72 బంతుల్లో 32; 3 ఫోర్లు), ఆపై అక్షర్ పటేల్ (51 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచారు. టీ విరామ సమయానికి భారత్ స్కోరు 225/3. అయితే చివరి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు మూడు వికెట్లు తీయడంలో సఫలమయ్యారు. రేహన్ బౌలింగ్‌లో తన బ్యాట్‌ను తాకి వికెట్ల వైపు వెళుతున్న బంతిని ఆపడంలో విఫలమైన పటిదార్ పెవిలియన్ చేరాడు. అయితే ఆట ముగియడానికి కొద్ది సేపు ముందు భారత్ అనూహ్యంగా రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ చెత్త షాట్‌తో వెనుదిరగ్గా...సొంత మైదానంలో సత్తా చాటేందుకు వచ్చిన అరుదైన అవకాశాన్ని కేఎస్ భరత్ (23 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) వృథా చేసుకున్నాడు. ఈ టెస్టు కోసం భారత తుది జట్టులో మూడు మార్పులు జరిగాయి. గాయాలతో దూరమైన రాహుల్, జడేజా స్థానాల్లో పటిదార్, కుల్దీప్ యాదవ్ రాగా...సిరాజ్‌కు బదులు ముకేశ్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ఎక్కువ క్రికెట్ ఆడిన సిరాజ్‌కు విరామం ఇస్తూ జట్టునుంచి విడుదల చేశామని...అతను తర్వాతి టెస్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. జైస్వాల్ అలవోకగా... రూట్ తొలి ఓవర్లో 2 ఫోర్లతో బౌండరీల ఖాతా తెరిచిన యశస్వి చివరి వరకు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ అదే జోరును కొనసాగించాడు. బషీర్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టిన యశస్వి 89 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా అతడిని ఇబ్బంది పెట్టడంతో ఇంగ్లండ్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. హార్ట్లీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి ఆధిక్యం ప్రదర్శించిన భారత ఓపెనర్ కొద్ది సేపటికే కెరీర్లో రెండో శతకం (151 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. హార్ట్లీ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా కొట్టిన భారీ సిక్సర్‌తో సెంచరీని అందుకోవడం విశేషం. యశస్వి చక్కటి షాట్లకు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. ఈ క్రమంలో రేహన్ ఓవర్లో భారీ సిక్స్‌తో అతను టెస్టుల్లో తన అత్యధిక స్కోరును నమోదు చేశాడు. ఇండోర్‌కు చెందిన రజత్ పటిదార్ ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 310వ ఆటగాడిగా రజత్ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్ తరఫున టెస్టులు ఆడిన 713వ క్రికెటర్‌గా నిలిచాడు. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (నాటౌట్) 179; రోహిత్ (సి) పోప్ (బి) బషీర్ 14; గిల్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 34; శ్రేయస్ (సి) ఫోక్స్ (బి) హార్ట్లీ 27; రజత్ (బి) రేహన్ 32; అక్షర్ (సి) రేహన్ (బి) బషీర్ 27; భరత్ (సి) బషీర్ (బి) రేహన్ 17; అశ్విన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (93 ఓవర్లలో 6 వికెట్లకు) 336. వికెట్ల పతనం: 1–40, 2–89, 3–179, 4–249, 5–301, 6–330. బౌలింగ్: అండర్సన్ 17–3–30–1, రూట్ 14–0–71–0, హార్ట్లీ 18–2–74–1, బషీర్ 28–0–100–2, రేహన్ 16–2–61–2. -
మన గెలుపు హోరు వినిపించేనా!
కోహ్లి లేడు... కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమయ్యారు. గిల్, శ్రేయస్ బ్యాటింగ్‌లో తడబాటు కనిపిస్తోంది. తొలి టెస్టులో అనూహ్య ఓటమి జట్టు ఆత్మవిశ్వాసాన్ని కాస్త దెబ్బ తీసిన పరిస్థితి. స్పిన్ మన బలం అనుకుంటే గత మ్యాచ్‌లో అరంగేట్ర స్పిన్నర్‌కే ఆటను అర్పించేశాం. ప్రత్యర్థిని చూస్తే దేనికైనా సిద్ధం అన్నట్లుగా దూకుడుతో ‘సై’ అంటోంది. రెండో టెస్టుకు ముందు భారత్ పరిస్థితి ఇది. ఇలాంటి సమయంలో విశాఖ తీరాన మన జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ‘బజ్‌బాల్’కు చెక్ పెట్టి ‘భారత్ బాల్’తో సత్తా చాటాల్సి ఉంది. 2016లో భారత్‌లో ఇంగ్లండ్ సిరీస్... తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆధిక్యం ప్రదర్శించగా మ్యాచ్ ‘డ్రా’ అయింది. తర్వాతి నాలుగు టెస్టులు గెలిచి భారత్ చివరకు సిరీస్‌ను 4–0తో గెలుచుకుంది. 2021లో భారత్‌లో ఇంగ్లండ్ సిరీస్... తొలి టెస్టులో భారత్ ఓటమి. తర్వాతి మూడు టెస్టులు గెలిచి భారత్ 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 2024లో భారత్‌లో ఇంగ్లండ్ సిరీస్... భారత్ తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. గత రెండు సిరీస్‌ల తరహాలోనే టీమిండియా ఈసారీ కోలుకొని తగిన రీతిలో సమాధానమిస్తూ ముందంజ వేస్తుందా! సాక్షి, విశాఖపట్నం: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో 0–1తో వెనుకబడిన భారత జట్టు పోరును సమం చేసే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. హైదరాబాద్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా రోహిత్ శర్మ నేతృత్వంలో ప్రతీకారానికి సిద్ధమైంది. మరోవైపు తమ జోరును కొనసాగిస్తూ సిరీస్‌లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని స్టోక్స్ బృందం పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీసీ–వీడీసీఏ స్టేడియంలో నేటి నుంచి జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌తో పోలిస్తే ఇరు జట్లలోనూ మార్పులు ఖాయమయ్యాయి. పటిదార్ అరంగేట్రం! తొలి టెస్టు ఓటమి తర్వాతి ఇప్పుడు రెండో టెస్టుకు తుది జట్టు ఎంపిక కూడా భారత్ టీమ్ మేనేజ్మెంట్కు పరీక్ష పెడుతోంది. గాయాలతో దూరమైన రాహుల్, జడేజా స్థానాల్లో రెండు మార్పులు తప్పనిసరి. రాహుల్ స్థానంలో ఒక బ్యాటర్ స్థానం కోసం రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. గురువారం టీమ్ ప్రాక్టీస్, ఇతర అంశాలను బట్టి చూస్తే రజత్ వైపే ఎక్కువగా మొగ్గు ఉంది. భారత్ తరఫున పటిదార్ ఒకే ఒక వన్డే ఆడాడు. అశ్విన్, అక్షర్ మళ్లీ కీలకం కానుండగా జడేజా స్థానంలో మరో మాటకు తావు లేకుండా కుల్దీప్ మైదానంలోకి దిగుతాడు. అయితే కుల్దీప్ వస్తే బ్యాటింగ్ బలహీనంగా మారిపోతుంది. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్ తరహాలో ఒకే ఒక పేసర్‌ను ఆడించి బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోవడం అవసరం. అలా చేస్తే సిరాజ్ స్థానంలో సర్ఫరాజ్ అరంగేట్రం చేయవచ్చు. అయితే వీటన్నింటికంటే టాప్–4 బ్యాటింగ్ కీలకం కానుంది. ఓపెనర్లు రోహిత్, యశస్వి కాస్త ఓపిగ్గా ఆడితే భారీ స్కోరుకు కావాల్సిన శుభారంభం లభిస్తుంది. గిల్, అయ్యర్ ఇప్పటికైనా తమకు లభిస్తున్న వరుస అవకాశాలకు న్యాయం చేయాల్సి ఉంది. బరిలోకి బషీర్... ఇంగ్లండ్ తమ తుది జట్టును గురువారమే ప్రకటించింది. గాయపడ్డ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లోకి అడుగు పెడుతున్నాడు. గత మ్యాచ్‌లో భారత్‌ను దెబ్బ కొట్టిన హార్ట్లీ మళ్లీ చెలరేగేందుకు సిద్ధంగా ఉండగా... అన్నింటికి మించి ఏకైక పేసర్ గా సీనియర్ బౌలర్ అండర్సన్ పునరాగమనం చేస్తుండటం విశేషం. వుడ్ స్థానంలో అతడిని ఇంగ్లండ్ ఎంపిక చేసింది. తొలి టెస్టులో ఎప్పటిలాగే తమ దూకుడైన బ్యాటింగే ఇంగ్లండ్‌ను గెలిపించింది. ఓపెనర్లు క్రాలీ, డకెట్ ధాటిగా ఆడుతుండగా పోప్ ఆట ఎలాంటిదో గత మ్యాచ్ చూపించింది. స్టార్ బ్యాటర్ రూట్ అటు బౌలింగ్‌లోనూ ప్రధానపాత్ర పోషించడం జట్టు బలాన్ని పెంచింది. అటు బ్యాటింగ్‌తో, ఇటు కెపె్టన్సీతో స్టోక్స్ విలువైన ఆటగాడు. ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లు ఈసారి భారత్‌ను ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరం. అండర్సన్ @184 41 ఏళ్లు దాటిన పేసర్ అండర్సన్ తన కెరీర్లో 184వ టెస్టులో బరిలోకి దిగుతున్నాడు. అతనికి ఇది అంతర్జాతీయ క్రికెట్లో 22వ ఏడాది కానుండడం విశేషం. తను అరంగేట్రం చేసినప్పుడు ఇంకా పుట్టని రేహన్, బషీర్‌లతో కలిసి అండర్సన్ బౌలింగ్ చేయబోతున్నాడు. ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ తొలిసారి తన సొంత గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. వైజాగ్‌కే చెందిన వికెట్‌కీపర్ భరత్‌కు 6 టెస్టుల స్వల్ప కెరీర్ తర్వాతే ఈ అవకాశం దక్కడం విశేషం. ఈ టెస్టులో జట్టు అవకాశాల గురించి భరత్ మాట్లాడుతూ... ‘అన్ని ప్రణాళికలతో మేము సిద్ధంగా ఉన్నాం. తొలి టెస్ట్ మ్యాచ్‌లో జరిగిన తప్పులపై చర్చించాం. స్వీప్ షాట్లపై సాధన చేశాం. మేం అలాంటి షాట్లన్నీ ఆడగలం. అయితే పరిస్థితిని బట్టే బ్యాటర్లు దానిని అమలు చేస్తారు. గత ఓటమి తర్వాత మేమేం ఆందోళనకు గురి కాలేదు. జట్టులో అంతా బాగుంది. సుదీర్ఘ సిరీస్ కాబట్టి కోలుకునే అవకాశం ఉందని మాకు తెలుసు’ అని అన్నాడు. పిచ్, వాతావరణం మంచి బ్యాటింగ్ వికెట్. కాస్త బౌన్స్‌తో పాటు మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడ జరిగిన రెండు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు నమోదు చేసిన భారత్ రెండు మ్యాచ్‌లూ (ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై) గెలుచుకుంది. వర్ష సూచన లేదు. తుది జట్లు భారత్ (అంచనా): రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, శ్రేయస్, పటిదార్, భరత్, అశ్విన్, అక్షర్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్, హార్ట్లీ, రేహన్, బషీర్, అండర్సన్. -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. అరుదైన రికార్డులపై కన్నేసిన అశ్విన్
విశాఖ వేదికగా రేపటి నుంచి (ఫిబ్రవరి 2) ప్రారంభంకాబోయే (ఇంగ్లండ్‌తో) రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో యాష్ మరో 4 వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 500 వికెట్ల మైలురాయిని తాకిన తొమ్మిదో పురుష క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 496 వికెట్లు (96 మ్యాచ్‌లు) ఉన్నాయి. ఈ రికార్డుతో పాటు రెండో టెస్ట్‌లో అశ్విన్ మరిన్ని రికార్డులు కూడా సాధించే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా.. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా.. భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా.. అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్‌గా పలు రికార్డులు నెలకొల్పుతాడు. ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా.. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ రికార్డు భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ ఇంగ్లండ్‌తో 23 మ్యాచ్‌లు ఆడి 95 వికెట్లు పడగొట్టాడు. రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌లో అశ్విన్ (20 టెస్ట్‌ల్లో 93 వికెట్లు) మరో 3 వికెట్లు తీస్తే ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా.. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్‌ల్లో ఇప్పటివరకు ఏ భారత బౌలర్ కూడా 100 వికెట్లు తీయలేదు. రేపటి నుంచి మొదలయ్యే రెండో టెస్ట్‌లో అశ్విన్ మరో 7 వికెట్లు తీస్తే.. ఇంగ్లండ్‌పై 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఇరు జట్ల మధ్య టెస్ట్‌ల్లో ఇప్పటివరకు జేమ్స్ ఆండర్సన్ (139 వికెట్లు) మాత్రమే 100 వికెట్ల మైలురాయిని దాటాడు. భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా.. అశ్విన్ భారత గడ్డపై ఇప్పటివరకు 56 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 343 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ రెండో టెస్ట్‌లో మరో 8 వికెట్లు తీస్తే భారతగడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లే (350) రికార్డును బద్దలు కొడతాడు. అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్‌గా.. కెరీర్లో ఇప్పటివరకు 34 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన అశ్విన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ఘనతలు సాధిస్తే, అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు (భారత్ తరఫున అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు) బద్దలవుతుంది. వైజాగ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో అశ్విన్ పై పేర్కొన్న రికార్డులన్నీ ఇదే మ్యాచ్‌లో సాధించినా అశ్చర్యపోనక్కర్లేదు. -
Visakha Test Match: రోహిత్ పైనే భారం
విశాఖ స్పోర్ట్స్: ఒకవైపు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తదితర కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం... మరోవైపు అనుభవంలేని యువ ఆటగాళ్లు... తొలి టెస్టులో ఊహించని పరాజయం... ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టులో భారత ప్రదర్శన ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొని ఉంది. ఈ వేదికపై భారత జట్టు ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడింది. ఆ రెండింటిలోనూ భారత జట్టే గెలిచింది. కోహ్లి కెప్టెన్సీలో 2016 నవంబర్ 17 నుంచి 21 వరకు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 246 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం 2019 అక్టోబర్ 2 నుంచి 6 వరకు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కోహ్లి సారథ్యంలోనే భారత జట్టు 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్రితంసారి ఇక్కడ ఆడిన భారత టెస్టు జట్టు నుంచి కేవలం రోహిత్ , అశ్విన్ మాత్రమే ఈసారి ఆడుతున్నారు. నాటి టెస్టులో రోహిత్ రెండు సెంచరీలతో (తొలి ఇన్నింగ్స్‌లో 176; రెండో ఇన్నింగ్స్‌లో 127) అదరగొట్టాడు. ఫలితంగా బ్యాటింగ్ విషయంలో ఈసారీ రోహిత్ శర్మపైనే అధిక భారం పడనుంది. మరోసారి రోహిత్ మెరిసి... యశస్వి, అయ్యర్ ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తే విశాఖపట్నంలో భారత జట్టు ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంటుంది. సంయమనం అవసరం: కోచ్ రాథోడ్ యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. ఒకట్రెండు మ్యాచ్‌లతో వారి సత్తాపై అంచనాకు రావొద్దని ఆయన కోరారు. బుధవారం ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. ప్రాక్టీస్ సెషన్ అనంతరం విక్రమ్ రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ప్రస్తుత భారత జట్టులోని శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. వారి విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. వారిపట్ల సంయమనంతో వ్యవహరించాలి. అయ్యర్ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నా. పిచ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడటం అలవాటు చేసుకోవాలి. పరుగులు చేసేందుకు అవకాశాలు ఉంటే వాటిని సది్వనియోగం చేసుకోవాలి. షాట్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి’ అని రాథోడ్ వ్యాఖ్యానించారు. -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్న టీమిండియా..?
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న రెండో టెస్ట్‌లో (ఫిబ్రవరి 2 నుంచి) టీమిండియా భారీ ప్రయోగాల బాట పట్టనున్నట్లు తెలుస్తుంది. స్పిన్‌కు అనుకూలించే వైజాగ్ ట్రాక్‌పై భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని సమాచారం. రెగ్యులర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా గాయపడిన నేపథ్యంలో అశ్విన్‌తో పాటు అక్షర్ పటేల్ భారత స్పిన్ విభాగాన్ని లీడ్ చేస్తాడని.. వీరిద్దరితో పాటు జడ్డూకు రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటారని సోషల్‌మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుందర్, కుల్దీప్ తుది జట్టులో చేరే క్రమంలో తొలి టెస్ట్‌లో ఆశించినంత ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్‌పై వేటు పడే అవకాశం ఉంది. వైజాగ్ లాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌పై నలుగురు స్పిన్నర్లు, ఓ పేసర్ (బుమ్రా) ఐడియా సబబేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా స్పందించాడు. టీమిండియా ఈ ప్రయోగం చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించాడు. 1970, 80 దశకాల్లో భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు (బిషన్ సింగ్ బేడీ, బీఎస్ చంద్రశేఖర్, ఎర్రపల్లి ప్రసన్న, శ్రీనివాస్ వెంకట్రాఘవన్) కలిసి ఆడిన సందర్భాలను ప్రస్తావించాడు. స్పిన్ వంద శాతం సహకరించే ట్రాక్‌పై నలుగురు స్పిన్నర్ల ఐడియా వర్కౌటవుతుందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు రెండో టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్ విభాగంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. గతకొంతకాలంగా పేలవ ప్రదర్శనతో విసుగు తెప్పిస్తున్న శుభ్‌మన్ గిల్‌పై వేటు పడవచ్చు. గిల్ స్థానంలో రజత్ పాటిదార్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్సస్ మెరుగ్గా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే రెండో టెస్ట్‌లో టీమిండియాలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ -
మళ్లీ స్పిన్ పిచ్‌కు సిద్ధమే!
విశాఖపట్నం: రెండో టెస్టులోనూ స్పిన్ పిచ్‌పై సమరానికి సిద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. స్పిన్నర్ టామ్ హార్లీ మాయాజాలంతో హైదరాబాద్ టెస్టులో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్‌లో మరో పూర్తిస్థాయి స్పిన్ ట్రాక్ ఎదురైనా... తమ దళంలో అందుబాటులో ఉన్న నలుగురు స్పిన్నర్లతో దీటుగా ఎదుర్కొంటామని కోచ్ చెప్పారు. ‘ఒకవేళ తొలి టెస్టులాగే వైజాగ్‌లోని పిచ్ కూడా స్పిన్‌కే అనుకూలిస్తే భయపడం. జట్టులోని స్పిన్నర్లు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. షోయబ్ బషీర్ అబుదాబిలో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆడే సిరీస్‌లోనూ రాణించే నైపుణ్యం అతనికి ఉంది. తప్పకుండా ఇక్కడ కూడా అతను ప్రభావం చూపుతాడు’ అని మెకల్లమ్ అన్నాడు. వైజాగ్ చేరుకున్న ఇరుజట్లు భారత్, ఇంగ్లండ్ జట్లు మంగళవారం సాయంత్రం వైజాగ్ చేరుకున్నాయి. నేరుగా హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు అక్కడి నుంచి బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు. అనంతరం ఆటగాళ్లంతా ప్రయాణ బడలిక దృష్ట్యా పూర్తిగా హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టు జరుగుతుంది. -
IND VS ENG 2nd Test: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..?
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్‌లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ దాదాపుగా ఖరారైపోయింది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడిన నేపథ్యంలో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ రెండో టెస్ట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. సర్ఫరాజ్ ఎంట్రీతో శుభ్‌మన్ గిల్‌పై వేటు పడనుంది. శుభ్‌మన్ గిల్ ఇటీవలి కాలంలో వరుసగా విఫలవుతుండటంతో అతనికి ఇచ్చిన అవకాశాలు చాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. గిల్ స్థానంలో వన్‌డౌన్ ఆటగాడిగా రజత్ పాటిదార్‌ను బరిలోకి దించనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు రెండో టెస్ట్‌లో వాషింగ్టన్ సుందర్ కూడా బరిలోకి దిగడం ఖాయమని సమాచారం. కండరాల సమస్యతో బాధపడుతున్న రవీంద్ర జడేజా స్థానంలో సుందర్ బరిలోకి దిగేందకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. విశాఖ టెస్ట్‌లో భారత్ ఈ మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్, రజత్ పాటిదార్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. మేనేజ్మెంట్ ఏదైనా సాహసం చేయాలని భావిస్తే తప్ప వీరిద్దరి ఎంట్రీని ఎవరూ అడ్డుకోలేరు. దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్న సర్ఫరాజ్ దేశవాలీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న ఈ ఇద్దరూ చాలాకాలంగా టీమిండియాలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కీలక ఆటగాళ్లు గాయపడంతో ఎట్టకేలకు వీరి కలలు సాకారాం కానున్నాయి. 26 ఏళ్ల సర్ఫరాజ్ 2014, 2016 అండర్ వరల్డ్‌కప్‌లలో మెరిసి దేశవాలీ క్రికెట్లో స్టార్‌గా ఎదిగాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇతనికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో సర్ఫరాజ్ 66 ఇన్నింగ్స్‌ల్లో 69.85 సగటున 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 3912 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఇక ఐపీఎల్‌లోనూ సర్ఫరాజ్ తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పటి దాకా మొత్తంగా 37 ఇన్నింగ్స్ ఆడి 585 పరుగులు చేశాడు. గత సీజన్లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. పాటిదార్ ఇలా మరోవైపు పాటిదార్‌కు కూడా దేశీవాళీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు అతను ఆడిన 55 మ్యాచ్‌ల్లో 45.97 సగటున 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీల సాయంతో 4000 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా వీరు సెంచరీలతో కదంతొక్కారు. 30 ఏళ్ల పాటిదార్ ఇటీవలే వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. గతేడాది చివర్లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో పాటిదార్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
IND vs ENG: టీమిండియాకు సంకటం!
హైదరాబాద్: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఎదురైన పరాజయం నుంచి కోలుకోకముందే... భారత్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇప్పటికే తొలి రెండు టెస్టుల నుంచి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు కూడా రెండో టెస్టుకు దూరమవడం జట్టుకు ప్రతికూలంగా పరిణమించనుంది. అయితే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న, ఐపీఎల్లో అడపాదడపా మెరిపిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కింది. రెండో టెస్టు కోసం కొత్తగా సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్‌లను తీసుకోగా... తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. ఆదివారం నాలుగోరోజు ఆటలో పరుగు తీసే ప్రయత్నంలో జడేజా తొడ కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో కేవలం పూర్తిస్థాయిలో బ్యాటింగ్ పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కుడి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. గత ఐపీఎల్లో కూడా రాహుల్ ఇదే విధమైన గాయంతో నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ‘గాయపడిన జడేజా, రాహుల్ ఇద్దరు వచ్చే నెల 2 నుంచి విశాఖపట్నంలో జరిగే రెండో టెస్టులో పాల్గొనడం లేదు. బోర్డు మెడికల్ టీమ్ ఇద్దరి పరిస్థితిని సమీక్షిస్తోంది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సర్ఫరాజ్ గుర్తున్న క్రికెటరే కానీ..! ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ భారత సీనియర్ జట్టుకు కొత్త ముఖమై ఉండొచ్చు కానీ... క్రికెట్ అభిమానులకు తెలియని పేరేమీ కాదు. ఎందుకంటే ఐపీఎల్లో కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున మెరిపించాడు. అతని మెరుపులకు ఒకానొక సందర్భంలో ఫిదా అయిన కోహ్లి... సర్ఫరాజ్ అవుటై పెవిలియన్‌కు చేరుతుంటే రెండు చేతులు జోడించి మరీ జేజేలు పలికాడు. సర్ఫరాజ్ రెండు ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ (2014, 2016)లలో ఆడాడు. భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. రంజీల్లోనూ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అయితే ఇదంతా కూడా అతని ఆటతీరుకు నిదర్శనమైతే... నోటిదురుసుతో సెలక్షన్ కమిటీ పరిశీలనకు అతని పేరు అదేపనిగా దూరమైంది. గత పదేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న 30 ఏళ్ల సౌరభ్ ఇప్పటి వరకు 68 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 2061 పరుగులు సాధించడంతోపాటు 290 వికెట్లు పడగొట్టాడు. -
నిప్పులు చెరుగుతున్న కీమర్ రోచ్.. విలవిలలాడుతున్న ఆస్ట్రేలియా
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ వెటరన్ పేసర్ కీమర్ రోచ్ నిప్పులు చెరుగుతున్నాడు. రోచ్‌తో పాటు మరో పేసర్ అల్జరీ జోసఫ్ కూడా చెలరేగడంతో ఆతిథ్య ఆస్ట్రేలియా విలవిలలాడిపోతుంది. వీరిద్దరి ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రోచ్.. స్టీవ్ స్మిత్ (6), కెమరూన్ గ్రీన్ (8), ట్రవిస్ హెడ్లను (0) పెవిలియన్‌కు పంపగా.. అల్జరీ జోసఫ్ లబూషేన్ (3), మిచెల్ మార్ష్‌లను (21) ఔట్ చేశాడు. 13.2 ఓవర్ల తర్వాత ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 67/5గా ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (15), అలెక్స్ క్యారీ (8) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 266/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించి, 311 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్, అరంగేట్రం ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీ చేసి, విండీస్ పైచేయి సాధించేలా చేశాడు. అతనికి ఆఖర్లో కీమర్ (8), షమార్ జోసఫ్ (3 నాటౌట్) కాసేపు సహకరించారు. దీనికి ముందు మిచెల్ స్టార్క్ (4/82) చెలరేగడంతో విండీస్ టాపార్డర్ పేకమేడలా కూలింది. స్టార్క్ ధాటికి విండీస్ 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్‌కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్‌వైట్ 4, చంద్రపాల్ 21, మెక్కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. హాజిల్‌వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
ఆసీస్‌తో రెండో టెస్ట్.. విండీస్‌ను ఆదుకున్న లోయర్ ఆర్డర్ బ్యాటర్లు
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక విండీస్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్‌కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లోనూ విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్‌వైట్ 4, చంద్రపాల్ 21, మెక్కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. 16 పరుగులతో కెవిన్ సింక్లెయిర్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాశించగా.. హాజిల్‌వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
కోవిడ్ ఉందని తెలిసినా ఆడించడమెందుకు.. ఇలా దూరం పెట్టడమెందుకు..?
క్రికెట్ ఆస్ట్రేలియా తమ చర్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. కోవిడ్ ఉందన్న కారణంగా సొంత ఆటగాడిపైనే వివక్ష చూపించింది. వివరాల్లోకి వెళితే.. విండీస్‌తో రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ కోవిడ్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. విషయం తెలిసి కూడా క్రికెట్ ఆస్ట్రేలియా విండీస్‌తో మ్యాచ్‌లో గ్రీన్‌ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి అంక్షలు లేకపోవడంతో ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు. అయితే గ్రీన్‌కు కోవిడ్ ఉందన్న కారణంగా అతన్ని మిగతా ఆటగాళ్ల నుంచి దూరంగా ఉంచి క్రికెట్ ఆస్ట్రేలియా పెద్ద తప్పిదమే చేసింది. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా గ్రీన్ సహచరులతో పాటు లైన్లో నిలబడకుండా దూరంగా నిల్చున్నాడు. Hazlewood shoos away the Covid-positive Green! 🤪 #AUSvWI pic.twitter.com/iQFbbKfpwV— cricket.com.au (@cricketcomau) January 25, 2024 కోవిడ్ ఉందన్న కారణంగా గ్రీన్ విషయంలో సామాజిక దూరం పాటించాలని ఆసీస్ మేనేజ్మెంట్ తెలిపినట్లు సమాచారం. గ్రీన్ సహచర ఆటగాళ్ల నుంచి దూరంగా నిలబడ్డ ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు ఆసీస్ మేనేజ్మెంట్పై దుమ్మెత్తిపోస్తున్నారు. కోవిడ్ ఉందని తెలిసినా ఆడించడమెందుకు... ఆడించాక పక్కకు పెట్టడమెందుకంటూ విరుచుకుపడుతున్నారు. మొత్తానికి ఈ చర్య వల్ల ఆసీస్ మేనేజ్మెంట్ విమర్శలపాలవుతుంది. కాగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రస్తుతం కోవిడ్ కోరలు చాచింది. ప్రతి పది మందిలో ముగ్గురు కోవిడ్ బారినపడుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇటీవలే న్యూజిలాండ్‌కు చెందిన పలువురు క్రికెటర్లు కూడా కోవిడ్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఆసీస్ జట్టులో గ్రీన్‌తో పాటు హెడ్ కోచ్ మెక్ డోనాల్డ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్-విండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 38/1గా ఉంది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 4 పరుగులు చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ (17), కిర్క్ మెక్కెంజీ (17) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
కేప్‌టౌన్ పిచ్‌పై ‘అసంతృప్తి’
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరిగిన కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐదు సెషన్లలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో వాడిన పిచ్ సంతృప్తికరంగా లేదని అభిప్రాయ పడింది. ఈ టెస్టుకు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ తన నివేదికను ఐసీసీకి అందించారు. దీని ప్రకారం న్యూలాండ్స్ పిచ్‌కు ఒక డీ మెరిట్ రేటింగ్ ఇచ్చారు. -
అదే మా కొంపముంచింది.. మార్క్రమ్ బ్యాటింగ్ తీరు అత్యద్భుతం: సౌతాఫ్రికా కెప్టెన్
కేప్‌టౌన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. అంతిమంగా భారత పేసర్లదే పైచేయిగా నిలిచింది. సిరాజ్ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత భారత్‌ను 153 పరుగులకే పరిమితం చేసి తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది. అనంతరం మార్క్రమ్ కఠినమైన పిచ్‌పై నమ్మశక్యంకాని రీతిలో బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శించి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరపురాని ఇన్నింగ్స్ (106) ఆడాడు. మార్క్రమ్ రెచ్చిపోతుండటంతో ఓ సమయంలో సౌతాఫ్రికా మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపించింది. అయితే బుమ్రా (6/60) మరో ఎండ్‌లో ఎవరినీ కుదురుకోనీయకపోవడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌కు 176 పరుగుల వద్ద తెర పడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని (79) ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూపాడుతూ ఛేదించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా ముగించింది. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో చావుదెబ్బ (55 పరుగులకు ఆలౌట్) తినడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మార్క్రమ్ చిరస్మరణీయ శతకంతో తిరిగి మమ్మల్ని మ్యాచ్‌లోకి తెచ్చాడు. భారత పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఓటమిని జీర్జించుకోవడం కాస్త కఠినమే. 2-0 తేడాతో సిరీస్‌ను గెలిచుంటే బాగుండేది. అయినా పర్లేదు. గెలుపు కోసం మా వంతు పోరాటం చేశాం. మా కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. సిరీస్ ఆధ్యాంతం పేసర్లు బౌలింగ్ చేసిన తీరు.. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ బ్యాటింగ్ చేసిన తీరు అత్యద్భుతం. ఈ పిచ్‌పై ఫలితం అందరి ఊహలకు విరుద్దంగా వచ్చింది. దురదృష్టవశాత్తూ మేమే బాధితులమయ్యాము. ఈ ఫలితం ఓ గుణపాఠం లాంటిది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడంపై స్పందిస్తూ.. రోహిత్ శర్మ సైతం అదే పని చేసేవాడు. అంతిమంగా చూస్తే తొలి రోజు తొలి సెషనే మా కొంపముంచిందని ఎల్గర్ అన్నాడు. -
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ విశేషాలు, రికార్డులు..
కేప్‌టౌన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. దీనికి ముందు సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేప్‌టౌన్ టెస్ట్ రికార్డులు.. 2024లో తొలి టెస్ట్ కేవలం ఒకటిన్నర రోజుల్లో ముగిసింది (నాలుగున్నర సెషన్లు) భారత్.. సౌతాఫ్రికాను కేప్‌టౌన్‌లో తొలిసారి ఓడించింది కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ జట్టుగా భారత్ రికార్డు ధోని తర్వాత సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డు అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్ (55, తొలి ఇన్నింగ్స్) టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు (భారత్) పరుగులేమీ (153 పరుగుల వద్ద) చేయకుండా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. 2024లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ (642 బంతుల్లో) టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్లు (23) పడిన రెండో మ్యాచ్‌గా రికార్డు. మ్యాచ్ విశేషాలు.. సిరాజ్ చెలరేగడంతో (6/15) తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది ఒకే స్కోర్ వద్ద (153, తొలి ఇన్నింగ్స్) టీమిండియా చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. కెరీర్లో తొమ్మిదో ఐదు వికెట్ల ప్రదర్శనతో (6/61) సౌతాఫ్రికా నడ్డివిరిచిన బుమ్రా సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీ (99 బంతుల్లో) చేసిన మార్క్రమ్ సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ టెస్ట్ కెరీర్ ముగిసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్-సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- డీన్ ఎల్గర్, బుమ్రా స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం -
చరిత్ర తిరగరాసిన భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులను కొల్లగొట్టింది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే (నాలుగున్నర సెషన్లు) ముగిసిన ఈ మ్యాచ్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగియగా.. గత రికార్డు 656 బంతులుగా ఉండింది. 1932లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు టెస్ట్‌ల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా ఉండింది. ఈ జాబితాలో వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య 1935లో జరిగిన మ్యాచ్ మూడో స్థానంలో (672 బంతుల్లో) ఉండగా.. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ నాలుగో స్థానంలో (788), ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ (లార్డ్స్) ఐదో స్థానంలో (792) ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేప్‌టౌన్ టెస్ట్‌లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. -
కఠినమైన పిచ్‌పై అద్భుత శతకం.. మార్క్రమ్ ఖాతాలో అరుదైన రికార్డు
కేప్‌టౌన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ అద్బుత శతకంతో (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) అలరించిన విషయం తెలిసిందే. మార్క్రమ్ ఈ సెంచరీని ఎంతో కఠినమైన పిచ్‌పై సాధించడం విశేషం. ప్రత్యర్ధి బ్యాటర్లతో పాటు సొంత బ్యాటర్లు సైతం ఒక్కో పరుగు చేసేందుకు ఇబ్బందిపడ్డ పిచ్‌పై మార్క్రమ్ చిరస్మరణీయ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. పేసర్లకు స్వర్గధామంగా ఉన్న పిచ్‌పై సెంచరీ చేయడమే అద్భుతమనుకుంటే మార్క్రమ్ ఈ సెంచరీని కాస్త సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీగా (99 బంతుల్లో) మలిచాడు. అలాగే మార్క్రమ్ కేప్‌టౌన్‌లో సెంచరీ చేసిన తొలి ప్రొటిస్ బ్యాటర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డులతో పాటు మార్క్రమ్ మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో (సెకెండ్) సౌతాఫ్రికా 176 పరుగులు చేయగా.. మార్క్రమ్ ఒక్కడే 103 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక శాతం పరుగుల రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు చార్లెస్ బ్యానర్‌మ్యాన్ పేరిట ఉంది. 1877లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ ఇన్నింగ్స్‌లో అతను జట్టు స్కోర్‌లో 67.34 శాతం పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఆసీస్ 245 పరుగులు చేయగా.. బ్యానర్‌మ్యాన్ ఒక్కడే 165 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ విభాగంలో ఆసీస్ ఆటగాడు మైఖేల్ స్లేటర్ (66.84), టీమిండియా సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ (63.98) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, మార్క్రమ్ సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులు చేయగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. -
చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం
South Africa Vs India 2nd Test 2024 Day 2 Updates- కేప్‌టౌన్: చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్ 75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్‌లో కోహ్లి (12) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా నాలుగు పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్ 57 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (10) ఔటయ్యాడు. భారత్ గెలుపుకు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. జైస్వాల్ ఔట్ 44 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బర్గర్ బౌలింగ్‌లో జైస్వాల్ (28) ఔటయ్యాడు.భారత్.. దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక గెలుపుకు ఇంకా 35 పరుగుల దూరంలో ఉంది. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్.. లక్ష్యంగా దిశగా దూసుకుపోతున్న టీమిండియా 79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా దూకుడుగా ఆడుతుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ టీ20 తరహాలో విరుచుకుపడుతున్నాడు. అతను కేవలం 21 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. రోహిత్ 6 పరుగులతో అతని జతగా క్రీజ్‌లో ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 35/0గా ఉంది. 176 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. మార్క్రమ్ అద్భుతమైన సెంచరీ సాధించిన అనంతరం సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఆఖరి వికెట్ (ఎంగిడి (8)) కూడా బుమ్రాకే దక్కింది. దీంతో బుమ్రా ఖాతాలో ఆరు వికెట్లు చేరాయి. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, ఈ ఇన్నింగ్స్‌లో ఆరు కలుపుకుని బుమ్రా ఖాతాలో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడ్డాయి. బుమ్రాతో పాటు ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. మ్యాచ్‌కు లంచ్ విరామం ప్రకటించారు. భారత పేసర్ల విజృంభణ.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 32.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన రబడ(2) ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 31.4: సిరాజ్ బౌలింగ్‌లో సెంచరీ హీరో మార్క్రమ్ అవుట్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్.. 60 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా ఓపెనర్‌గా బరిలోకి దిగిన మార్క్రమ్ అత్యంత కఠినమైన పిచ్‌పై అద్బుత సెంచరీతో (99 బంతుల్లో 102 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున ఇది ఆరో వేగవంతమైన సెంచరీ కూడా కావడం విశేషం. ఐదేసిన బుమ్రా.. పట్టుబిగించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 62 పరుగుల స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. బుమ్రా ధాటికి తొలి సెషన్లోనే మరో 4 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా బుమ్రా ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో (5/59) చెలరేగడంతో సౌతాఫ్రికా 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 60 పరుగుల ఆధిక్యంలో ఉంది. మార్క్రమ్ (102 నాటౌట్) అద్భుత శతకంతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా రబాడ (2) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
IND VS SA 2nd Test Day 1: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తమ చివరి ఆరు వికెట్లను ఒకే స్కోర్ వద్ద (153) కోల్పోయి అనవసరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు పరుగులేమీ చేయకుండా ఇలా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఇన్నింగ్స్ 34వ ఓవర్ తర్వాత 153/4గా ఉన్న భారత్ స్కోర్ 11 బంతుల తర్వాత 153 ఆలౌట్‌గా మారింది. భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్లు కాగా.. రోహిత్ శర్మ (39), శుభ్‌మన్ గిల్ (36), విరాట్ కోహ్లి (46) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్ కార్డు చూస్తే అన్నీ సున్నాలే దర్శనమిస్తాయి. బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం టీమిండియా ఆటగాళ్ల స్కోర్లు ఇలా (0, 39, 36, 46, 0, 8, 0, 0, 0, 0, 0 నాటౌట్) ఉన్నాయి. భారత ఇన్నింగ్స్ ఆఖర్లో తొలుత ఎంగిడి (6-1-30-3), ఆతర్వాత రబాడ (11.5-2-38-3) నిప్పులు చెరిగారు. వీరికి నండ్రే బర్గర్ తోడయ్యాడు. అంతకుముందు భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), జస్ప్రీత్ బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్ త్రయం ధాటికి సఫారీల ఇన్నింగ్స్ లంచ్ విరామంలోపే (23.2 ఓవర్లలో) ముగిసింది. సఫారీల ఇన్నింగ్స్‌లో బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత ఇన్నింగ్స్‌లా కాకుండా సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే డకౌటయ్యాడు. మిగతా బ్యాటర్లు కనీసం ఒక్క పరుగైనా చేయగలిగారు. తొలి రోజు ఆటలో ఇరు జట్ల తొలి ఇన్నింగ్స్‌లు 59.3 ఓవర్లలోనే ముగిసాయి. అంటే 60 ఓవర్లలోపే ఇరు జట్లు 20 వికెట్లు కోల్పోయాయి. భారత తొలి ఇన్నింగ్స్ అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసి జాగ్రత్తగా ఆడుతుంది. డీన్ ఎల్గర్ 7, మార్క్రమ్ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఇంకా 76 పరుగులు వెనకపడి ఉంది. తొలి రోజు ఆటలో ఇంకా 20 ఓవర్ల ఆట మిగిలి ఉంది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి టెస్ట్ గెలిచిన విషయం తెలిసిందే. -
55 పరుగులకే ఆలౌట్.. టెస్ట్ క్రికెట్‌ను అవమానించినందుకు తగిన శాస్తి జరిగింది..!
స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసి టెస్ట్ క్రికెట్‌ను ఘోరంగా అవమానించిన క్రికెట్ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలోనే తగిన శాస్తి జరిగింది. ఆ జట్టు స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజే 55 పరుగులకు ఆలౌటై, 135 ఏళ్ల కిందటి చెత్త రికార్డును తిరగరాసుకుంది. 1889 (ఇంగ్లండ్‌పై 84 పరుగులు) తర్వాత స్వదేశంలో టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేస్తూ సౌతాఫ్రికా చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), జస్ప్రీత్ బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరుగుతూ, టెస్ట్ క్రికెట్‌ను అవమానించినందుకు సఫారీలపై ప్రతీకారం తీర్చుకున్నారు. భారత పేస్ త్రయం ధాటికి సఫారీలు లంచ్ విరామంలోపే (23.2 ఓవర్లలో) కుప్పకూలారు. అప్పటివరకు పటిష్టంగా కనిపించిన సౌతాఫ్రికా టెస్ట్‌లను అవమానించిన తర్వాత ఇలా కుప్పకూలడంతో టెస్ట్ క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్‌లంటే గౌరవం లేని వారికి ఇలాంటి శాస్తి జరిగి తీరాల్సిందేనని శాపనార్థాలు పెడుతున్నారు. And this was the Test they actually cared about 😳 Karma strikes as days after disrespecting cricket, South Africa is bowled out before lunch for a 135-year worst >> https://t.co/WRU2aJihX8 pic.twitter.com/zYnjeVrh9W — Fox Cricket (@FoxCricket) January 3, 2024 కాగా, ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (CSA) సీనియర్లను కాదని ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగే లీగ్‌లో (SA20) సీనియర్లను ఆడించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా ఈ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ పర్యటన కోసం CSA ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు, కొత్త కెప్టెన్‌తో కూడిన జట్టును ఎంపిక చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా చేసిన ఈ పని టెస్ట్ క్రికెట్‌ను అవమానించడమేనని మాజీ క్రికెటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై క్రికెట్ సర్కిల్స్‌లో దుమారం రేగుతుండగానే సౌతాఫ్రికా ఇలా 55 పరుగులకు ఆలౌట్ కావడం చర్చనీయాశంగా మారింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్‌లో ఉన్నారు. -
IND VS SA 2nd Test: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్‌టౌన్: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా రెండో టెస్ట్‌లో తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆలౌటయ్యాక, సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 36 పరుగులు వెనుకపడి ఉంది. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 45 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (1) ఔటయ్యాడు. ఇదే రోజు తొలి ఇన్నింగ్స్‌లో కూడా బుమ్రానే స్టబ్స్‌ను ఔట్ చేశాడు. 16 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 49/3గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా రెండో టెస్ట్ తొలి రోజు ఇరు జట్ల పేసర్లు అత్యద్భుతాలు చేస్తున్నారు. ఇరు జట్ల పేసర్ల ధాటికి ఇప్పటికే 22 వికెట్లు నేలకూలాయి. తాజాగా సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో జార్జీ (1) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 56 పరుగులు వెనుకపడి ఉంది. మార్క్రమ్ (25), ట్రిస్టన్ స్టబ్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 37 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఎల్గర్ (12) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌కు విరుద్దంగా ఆడుతున్న సౌతాఫ్రికా 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత టీమిండియాను 153 పరుగులకు ఆలౌట్ చేసి తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అయితే సఫారీలు తమ సెకెండ్ను తొలి ఇన్నింగ్స్‌లో ఆడినట్లు ఆడట్లేదు. ఆ జట్టు ఓపెనర్లు చాలా జాగ్రత్తగా వికెట్లు పడకుండా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 37/0గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఇంకా 61 పరుగులు వెనకపడి ఉంది. ఒకే స్కోర్ వద్ద ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా 153 పరుగుల వద్ద టీమిండియా ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయి, అదే స్కోర్ వద్ద ఆలౌటైంది. 34వ ఓవర్లో ఎంగిడి పరుగులేమీ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆ మరుసటి ఓవర్లోనే రబాడ.. కోహ్లి (46), ప్రసిద్ద్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్లో, అదే స్కోర్ వద్ద (153) సిరాజ్ (0) కూడా రనౌటయ్యాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన ఎంగిడి.. టీమిండియా 153/7 లుంగి ఎంగిడి ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఎంగిడి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. రాహుల్ (8), జడేజా (0), బుమ్రా (0) ఐదు బంతుల వ్యవధిలో ఔటయ్యారు. కోహ్లి (46), సిరాజ్ క్రీజ్‌లో ఉన్నారు. టీ విరామం.. టీమిండియా స్కోర్ 111/4 తొలి రోజు టీ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 111/4గా ఉంది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 110 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (0) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 105 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (36) ఔటయ్యాడు. విరాట్ కోహ్లి (16), శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత శర్మ ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (24), విరాట్ కోహ్లి (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆధిక్యంలోకి వచ్చిన టీమిండియా 10: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య జట్టును 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తొలి పది ఓవర్లలోనే లీడ్ సంపాదించింది. ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 58 పరుగులు సాధించిన టీమిండియా మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 38 పరుగులు సాధించి జోరు మీదున్నాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ ఆరు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్ యశస్వి జైస్వాల్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 20/1గా ఉంది. ఎంగిడి వేసిన రెండో ఓవర్లో మూడు బౌండరీలు బాది రోహిత్ శర్మ జోరుమీదున్నాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. సౌతాఫ్రికా చెత్త రికార్డులు
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత పేస్ బౌలింగ్ త్రయం (సిరాజ్, బుమ్రా, ముకేశ్ కుమార్) ఉగ్రరూపం దాల్చింది. వీరి ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. ఆట తొలి రోజే భారత పేసర్లు సఫారీల భరతం పట్టారు. ముఖ్యంగా సిరాజ్ (9-3-15-6) నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. సిరాజ్‌కు జతగా ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) కూడా విజృంభించడంతో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్‌కు పరిమితం కావడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాక సౌతాఫ్రికాకు టెస్ట్‌ల్లో ఇదే అత్యల్ప స్కోర్ కాగా.. టెస్ట్‌ల్లో భారత్‌పై ఏ ప్రత్యర్ధికైనా ఇదే అత్యల్ప స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ నమోదు చేసిన గణాంకాలు సైతం రికార్డుల్లోకెక్కాయి. అతి తక్కువ పరుగులు సమర్పించుకుని ఐదు వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలో సిరాజ్ నాలుగో స్థానాన్ని (6/15) సాధించాడు. ఈ జాబితాలో బుమ్రా (5/7) టాప్‌లో ఉండగా.. వెంకటపతి రాజు (6/12), హర్భజన్ సింగ్ (5/13) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే ఈ ప్రదర్శనతో సిరాజ్ మరో రికార్డుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శార్దూల్ ఠాకూర్ (7/61) టాప్‌లో ఉండగా.. హర్బజన్ సింగ్ (7/120) ఆతర్వాతి స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కావడంతో కేప్‌టౌన్ సైతం రికార్డుల్లోకెక్కింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 36 సందర్భాల్లో ఆయా జట్టు 55 అంతకంటే తక్కువ స్కోర్లకు ఆలౌట్ కాగా.. అత్యధిక సందర్బాల్లో (7) కేప్‌టౌన్‌లోనే ఈ చెత్త రికార్డులు నమోదయ్యాయి. కేప్‌టౌన్ తర్వాత అత్యధికంగా ఆరుసార్లు ఆయా జట్లు 55 అంతకంటే తక్కువ స్కోర్లను లార్డ్స్ మైదానంలో చేశాయి. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ విషయానికొస్తే.. బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్రమ్ 2, కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ 4, టోనీ జార్జీ 2, ట్రిస్టన్ స్టబ్స్ 3, మార్కో జన్సెన్ 0, కేశవ్ మహారాజ్ 3, రబాడ 5, నండ్రే బర్గర్ 4 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ప్రోటీస్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకే ఇష్టపడతాడు: రోహిత్ శర్మ
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెనకేసుకొచ్చాడు. గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని హిట్‌మ్యాన్ సమర్ధించాడు. బ్యాటింగ్ మార్పు అంశంపై రోహిత్ గిల్‌కు మద్దతుగా నిలిచాడు. ఓపెనింగ్‌కు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి పెద్ద తేడా ఏమీ లేదని, రెండు స్థానాల మధ్య కేవలం ఒక్క బంతి మాత్రమే వ్యతాసముంటుందని అన్నాడు. గిల్‌ను ఓపెనింగ్ కాదని వన్‌డౌన్‌లో దింపడంపై విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్ ఇలా స్పందించాడు. వాస్తవానికి గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకే ఇష్టపడతాడు. అతను ఆ స్థానంలో బరిలోకి దిగితే సత్ఫలితాలు సాధిస్తాడని నమ్ముతాడు. గిల్ చాలా తెలివైన వాడు. అతను పరిస్థితులకు తగ్గట్టుగా తన బ్యాటింగ్‌ను మార్చుకోగల సమర్ధుడని కితాబునిచ్చాడు. కొత్త పాత్రలో గిల్ త్వరలోనే లయను అందుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. గిల్‌కు రంజీల్లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసిన అనుభవం కూడా ఉందని గుర్తు చేశాడు. నా వరకైతే నేను మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడను. నేను ఓపెనర్‌గానే కంఫర్ట్‌గా ఉంటానని రోహిత్ చెప్పుకొచ్చాడు. రెండో టెస్ట్‌కు ముందు మీడియా సమావేశంలో హిట్‌మ్యాన్ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు. కాగా, గతేడాది అన్ని ఫార్మాట్లలో సత్తా చాటిన గిల్ టెస్ట్‌ల్లో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు అతన్ని లయ తప్పేలా చేసిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే గిల్ ఇష్టపూర్వకంగానే బ్యాటింగ్ ఆర్డర్ మారాడని తాజాగా రోహిత్ చెప్పాడు. టెస్ట్‌ల్లో యశస్వి జైస్వాల్ కోసం గిల్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ తొలి టెస్ట్ ఓడిపోయి 0-1తో సిరీస్‌లో వెనుకపడింది. రేపటి నుంచి ప్రారంభంకాబోయే కీలకమైన రెండో టెస్ట్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
కేప్‌టౌన్‌లో అంత ఈజీ కాదు.. ఇక్కడ సెంచరీలు చేసింది నలుగురే..!
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా టీమిండియా రేపటి నుంచి (జనవరి 3) సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ కేప్‌టౌన్‌లోని న్యూల్యాండ్స్ మైదానం వేదికగా జరుగనుంది. ఈ పిచ్‌పై భారత్‌కు చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలే తొలి టెస్ట్‌లో ఓడిపోయి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే న్యూల్యాండ్స్‌లో టీమిండియా ట్రాక్ రికార్డు ప్రస్తుతం అందరినీ కలవరపెడుతుంది. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ ఇరు జట్ల మధ్య మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగగా.. నాలుగింట గెలిచిన సౌతాఫ్రికా, రెండింటిని డ్రా చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా (2022, జనవరి 11-14) ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టీమిండియాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 1993, 2011లో జరిగిన మ్యాచ్‌లు డ్రా కాగా.. 1997, 2007, 2018, 2022 సిరీస్‌ల్లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లను సౌతాఫ్రికా గెలిచింది. న్యూల్యాండ్స్ పిచ్ ఆనవాయితీగా పేసర్లకు స్వర్గధామంగా ఉంటూ వస్తుంది. ఇక్కడ బ్యాటింగ్ చేసేందుకు దిగ్గజాలు సైతం వణికిపోతారు. ఈ మైదానంలో ఇప్పటివరకు కేవలం నలుగురు భారత క్రికెటర్లు మాత్రమే సెంచరీలు చేయగలిగారు. సచిన్ టెండూల్కర్ రెండుసార్లు.. మొహమ్మద్ అజారుద్దీన్, వసీం జాఫర్, రిషబ్ పంత్ తలో సారి న్యూల్యాండ్స్ పిచ్‌పై సెంచరీ మార్కును తాకారు. ఇక్కడ టీమిండియా అత్యధిక స్కోర్ 414గా ఉంది. 2007 సిరీస్‌లో భారత్ ఈ స్కోర్‌ను చేసింది. ఈ పిచ్‌పై టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ ఇక్కడ నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు ఇన్నింగ్స్‌లు ఆడి 489 పరుగులు చేశాడు. ఇక్కడ భారత్ తరఫున అత్యధిక స్కోర్ (169) కూడా సచిన్ పేరిటే ఉంది. కాగా, ప్రస్తుత సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. -
IND VS SA 2nd Test: అరుదైన రికార్డుపై కన్నేసిన బుమ్రా
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా మరో ఏడు వికెట్లు తీస్తే.. కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన విజిటింగ్ బౌలర్‌గా (యాక్టివ్ బౌలర్లలో) రికార్డుల్లోకెక్కుతాడు. ఈ వేదికపై బుమ్రా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. జనవరి 3 నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో అతను మరో ఏడు వికెట్లు తీస్తే ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. కేప్‌టౌన్‌లో ఆండర్సన్ అందరి కంటే ఎక్కువగా (యాక్టివ్ బౌలర్లలో) 16 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా కేప్‌టౌన్ పిచ్‌పై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్ రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన కొలిన్ బ్లైత్ (25 వికెట్లు) పేరిట ఉంది. కేప్‌టౌన్ టెస్ట్‌లో బుమ్రా మరో మూడు వికెట్లు తీసినా మరో రికార్డు అతని ఖాతాలో వచ్చిపడుతుంది. ఈ మ్యాచ్‌లో అతను మూడు వికెట్లు తీస్తే.. కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ (12 వికెట్లు) పేరిట ఉంది. కేప్‌టౌన్‌తో బుమ్రాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం (2018) అతను ఇక్కడే తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో బుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓవరాల్‌గా బుమ్రా తన టెస్ట్ కెరీర్లో 31 మ్యాచ్‌లు ఆడి 21.84 సగటున 132 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత పర్యటనలో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లోనూ బుమ్రా సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అతను 4 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (తొలి ఇన్నింగ్స్‌లో 101), విరాట్ కోహ్లి (సెకెండ్ ఇన్నింగ్స్‌లో 76), జస్ప్రీత్ బుమ్రా (4/69) మినహా భారత ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 245, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ మాత్రమే బ్యాటింగ్ చేసి 408 పరుగుల భారీ స్కోర్ చేసింది. నిర్ణయాత్మకమైన రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. -
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. ఆ ఇద్దరిపై వేటు..?
కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే రెండో టెస్ట్‌లో టీమిండియా పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన ప్రసిద్ద్ కృష్ణ (1/93), శార్దూల్ ఠాకూర్ (1/101) స్థానంలో ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ తుది జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైంది. ప్రసిద్ద్ (0,0), శార్దూల్ (24, 2) తొలి టెస్ట్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు బ్యాటింగ్‌లో నామమాత్రంగా కూడా ప్రభావం చూపలేకపోయారు. దీంతో మేనేజ్మెంట్ ఈ ఇద్దరిని తప్పించి ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ ఇప్పటికే నెట్స్‌లో సాధన చేయడం కూడా మొదలుపెట్టారు. రెండో టెస్ట్ కోసం టీమిండియా ఆదివారం కేప్‌టౌన్‌కు బయల్దేరనుంది. రేపటి నుంచి భారత్ అక్కడే ప్రాక్టీస్ చేయనుంది. సిరీస్ కాపాడుకోవాలంటే రెండో టెస్ట్ తప్పక గెలవాల్సి ఉండటంతో టీమిండియా ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. వ్యక్తిగతంగానూ ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు చాలా కీలకంగా మారింది. టీమిండియా రెండో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాలని పట్టుదలగా ఉంది. కాగా, మొహమ్మద్ షమీ గైర్హాజరీలో ఆవేశ్ ఖాన్ భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్‌లో ఆవేశ్ ఖాన్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఆవేశ్ ఖాన్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 131 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (76) ఒక్కడే ఒంటరిపారాటం చేశాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేష్ ఖాన్ -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న భారత్‌కు ఈ బాధ మర్చిపోకముందే మరో ఎదురదెబ్బ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా భారత జట్టుకు 10 శాతం జరిమానా (మ్యాచ్ ఫీజ్‌లో) విధించబడింది. అలాగే రెండు ముఖ్యమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను సైతం టీమిండియా కోల్పోయింది. కనీస ఓవర్ రేట్‌ను మెయింటైన్ చేయడంలో విఫలం కావడంతో టీమిండియాపై ఈ చర్యలకు ఉపక్రమించినట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ చర్యల ప్రభావం టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌పై భారీ ప్రభావం చూపింది. పెనాల్టీకి ముందు భారత్ 16 పాయింట్లు మరియు 44.44 పాయింట్ల శాతంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా భారత్ ర్యాంక్ ఆరో స్థానానికి (38.89) పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు 66.67 పాయింట్ల శాతంతో తొలిస్దానంలో ఉండిన టీమిండియా ఒక్కసారిగా భారీగా పాయింట్లు కోల్పోయి ఆరో స్థానానికి దిగజారింది. మరోవైపు భారత్‌పై అద్బుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో (12 పాయింట్లు) డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. రెండో టెస్ట్‌లోనూ పాక్‌ను మట్టికరిపించడంతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (50.00) రెండో స్థానంలో.. బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (45.83) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, కేవలం మూడు రోజుల్లో ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత దారణంగా విఫలమై 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (76) ఒంటరిపారాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్‌తో పాటు కేవలం శుభ్‌మన్ గిల్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. -
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. టీమిండియాలోకి యువ పేసర్
జనవరి 3 నుంచి సౌతాఫ్రికాతో జరుగనున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా ఓ మార్పు చేసింది. టెస్ట్ సిరీస్ కోసం తొలుత ఎంపిక చేయబడిన మొహమ్మద్ షమీ.. ఫిట్నెస్ క్లియెరెన్స్ లభించని కారణంగా సిరీస్ మొత్తానికే దూరం కాగా.. 27 ఏళ్ల మధ్యప్రదేశ్ పేసర్ ఆవేశ్ ఖాన్ షమీ స్థానంలో రెండో టెస్ట్ కోసం టీమిండియాలోకి వచ్చాడు. ఈ విషయాన్ని భారత సెలెక్టర్లు ఇవాళ (డిసెంబర్ 29) అధికారికంగా ప్రకటించారు. ఆవేశ్ ఖాన్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 6 వికెట్లతో రాణించిన కారణంగా రెండో టెస్ట్ కోసం అతన్ని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు చెప్పారు. ఆవేశ్ ఖాన్ భారత టెస్ట్ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఆవేశ్.. టీమిండియా తరఫున ఇప్పటివరకు 8 వన్డేలు, 19 టీ20లు ఆడి ఓవరాల్‌గా 27 వికెట్లు పడగొట్టాడు. కాగా, సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత దారణంగా విఫలమై 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (76) ఒంటరిపారాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్‌తో పాటు కేవలం శుభ్‌మన్ గిల్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. వచ్చే ఏడాది (2024) జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), అభిమన్యు ఈశ్వరన్, అవేష్ ఖాన్ -
అలా ఔటైన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ముష్ఫికర్ రహీం
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 6) మొదలైన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్ల తర్వాత ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బంగ్లా టాపార్డర్ బ్యాటర్లంతా (హసన్ జాయ్ (14), జకీర్ హసన్ (8), షాంటో (9), మొమినుల్ హక్ (5)) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. ముష్ఫికర్ రహీం (35), షాదత్ హొసేన్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేసి జట్టును ఆదుకున్నారు. మెహిది హసన్ మీరజ్ (9 నాటౌట్), నురుల్ హసన్ (0 నాటౌట్) బంగ్లాను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా.. బంగ్లాదేశ్ వెటరన్ ఆటగాడు, ఆ జట్టు వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం ఓ అరుదైన పద్దతిలో ఔటయ్యాడు. బంతికి చేతితో అడ్డుకుని ముష్ఫికర్ పెవిలియన్‌కు చేరాడు. హ్యాండిల్ ద బాల్ నిబంధన మేరకు రహీం ఔటైనట్లు అంపైర్లు ప్రకటించారు. జేమీసన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేస్తున్న రహాం బంతిని డిఫెన్స్ ఆడగా అది కాస్త వికెట్లను ముద్దాడే దిశగా వెళ్లింది. దీంతో అప్రమత్తమైన రహీం బంతి వికెట్లు తాకకుండా అడ్డుకున్నాడు. టెస్ట్‌ల్లో హ్యాండిల్ ద బాల్ నిబంధన ద్వారా ఔటైన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రహీం రికార్డుల్లోకెక్కాడు. Mushfiqur Rahim becomes the first Bangladesh player to be dismissed for handling the ball.pic.twitter.com/cMdWVcNpNt— CricTracker (@Cricketracker) December 6, 2023 టెస్ట్‌ల్లో ఓవరాల్‌గా ఈ నిబంధన ద్వారా ఇప్పటివరకు 11 మంది ఔటయ్యారు. రహీం 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రహీంకు ముందు మైఖేల్ వాన్, మహేళ జయవర్ధనే, మర్వన్ ఆటపట్టు, స్టీవ్ వా, గ్రహం గూచ్, డెస్మండ్ హేన్స్, మొహిసిన్ ఖాన్, ఆండ్రూ హిల్డిచ్, రసెల్ ఎండీన్, లియోనార్డ్ హట్టన్ హ్యాండిల్ ద బాల్ నిబంధన ద్వారా ఔటయ్యారు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో ఓటమిపాలై సిరీస్‌లో వెనుకపడి ఉంది. -
భారత్‌తో రెండో టెస్టు: వెస్టిండీస్ నిలకడ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ కుప్పకూలిపోకుండా జాగ్రత్తగా ఆడుతోంది. మ్యాచ్ మూడో రోజు శనివారం టీ విరామ సమయానికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెపె్టన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (235 బంతుల్లో 75; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా...బ్లాక్‌వుడ్ (16 నాటౌట్), అలిక్ అతనజ్ (13 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా మూడో రోజు ఆటకు అంతరాయం కలిగింది. తొలి సెషన్లో 10.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, విండీస్ 31 పరుగులు చేసి కిర్క్ మెకన్జీ (57 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. తొలి టెస్టు ఆడుతున్న మెకన్జీని భారత్ తరఫున అరంగేట్రం చేసిన ముకేశ్ కుమార్ తన తొలి వికెట్‌గా పెవిలియన్ పంపించడం విశేషం. ముకేశ్ వేసిన బంతిని ఆడలేక మెకన్జీ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు మెకన్జీ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఉనాద్కట్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను అశ్విన్ బౌలింగ్‌లో మిడాఫ్ మీదుగా సిక్స్ బాదాడు. లంచ్ విరామ సమయానికి బ్రాత్‌వైట్ 49 పరుగుల వద్ద ఉన్నాడు. రెండో సెషన్ ప్రారంభం కాగానే బ్రాత్‌వైట్ 170 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇదే సెషన్లో అతని వికెట్ తీయడంలో భారత్ సఫలమైంది. అశ్విన్ వేసిన చక్కటి బంతి బ్రాత్‌వైట్ మిడిల్ స్టంప్‌ను తాకింది. ఆ తర్వాత బ్లాక్‌వుడ్, అతనజ్ కలిసి జట్టును నడిపించారు. మరో 13.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన టీమిండియా ఈ జోడీని విడదీయడంలో విఫలమైంది. రెండు రివ్యూలు కూడా భారత్‌కు ప్రతికూలంగా వచ్చాయి. తొలి టెస్టుతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంతో మెరుగ్గా కనిపించింది. రెండో రోజు వెస్టిండీస్ ఓపెనర్లు పట్టుదలగా ఆడి శుభారంభం అందించారు. బ్రాత్‌వైట్, తేజ్ నారాయణ్ చందర్‌పాల్ (95 బంతుల్లో 33; 4 ఫోర్లు) కలిసి 34.2 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచి 71 పరుగులు జోడించారు. జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. షాట్ ఆడబోయిన చందర్‌పాల్ పాయింట్లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే బ్రాత్‌వైట్, మెకన్జీ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 41 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (37 నాటౌట్), మెకన్జీ (14 నాటౌట్) అజేయంగా నిలిచారు. -
500లో 100
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లి 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను సెంచరీతో చిరస్మరణీయం చేసుకున్నాడు. విరాట్ కోహ్లి (206 బంతుల్లో 121; 11 ఫోర్లు) శతకానికి తోడు రవీంద్ర జడేజా (152 బంతుల్లో 61; 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (78 బంతుల్లో 56; 8 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు సాధించారు. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 438 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే భారత్ స్కోరు 300 పరుగులు దాటింది. ఆ వెంటనే కోహ్లి కూడా 180 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్లోనే జడేజా అర్ధ సెంచరీ పూర్తయ్యింది. కొత్త బంతితో కరీబియన్ జట్టు శుక్రవారం ఆట ఆరంభించినప్పటికీ సీమర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. క్రితంరోజు లాగే కోహ్లి–జడేజా తొలిసెషన్లో క్రీజును వీడకుండా విండీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. యథేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో పరుగులు సులువుగానే వచ్చాయి. ఐదో వికెట్‌కు 159 పరుగులు జోడించాక జట్టు స్కోరు 341 వద్ద కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. స్క్వేర్‌లెగ్ దిశగా ఆడిన కోహ్లి సింగిల్ తీసే క్రమంలో కాస్త వెనకడుగు వేశాడు. అయితే ముందుకే వెళ్లినా...జోసెఫ్ డైరెక్ట్ త్రో నాన్స్రై్టకింగ్ ఎండ్ వద్ద వికెట్లను తాకడంతో రనౌటయ్యాడు. మరికొద్దిసేపటికే రోచ్ బౌలింగ్‌లో జడేజా వెనుదిరిగాడు. లంచ్ విరామ సమయానికి 373/6 స్కోరు వద్ద ఇషాన్ కిషన్ (25; 4ఫోర్లు), అశ్విన్ క్రీజ్‌లో ఉన్నారు. అనంతరం టెయిలెండర్లు ఉనాద్కట్ (7), సిరాజ్ (0)లతో కలిసి అశ్విన్ జట్టు స్కోరును 400 దాటించాడు. రోచ్ బౌలింగ్‌లో రెండు వరుస బౌండరీలతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న అశ్విన్ మరో ఫోర్ కొట్టి ఆఖరి బంతికి బౌల్డ్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 128 ఓవర్లలో 438 పరుగుల వద్ద ముగిసింది. వారికన్, రోచ్ చెరో 3 వికెట్లు తీశారు. తొలిరోజు ఆఖరి సెషన్లో... రెండో సెషన్లో వరుస విరామాల్లో 4 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్‌కు ఆఖరి సెషన్లో చుక్కెదురైంది. కోహ్లి, జడేజా క్రీజులో పాతుకుపోవడంతో ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పలేదు. కోహ్లి 97 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు మూడో సెషన్ ఆసాంతం ఆడి అబేద్యమైన ఐదో వికెట్‌కు 106 పరుగులు జతచేశారు. 288/4 స్కోరు వద్ద తొలిరోజు ఆట ముగిసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ కడపటి వార్తలందేసరికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (4 బ్యాటింగ్), తేజ్‌నారాయణ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 29 టెస్టుల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. డాన్ బ్రాడ్‌మన్ (29)ను అతను సమం చేశాడు. 76 అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి శతకాల సంఖ్య 5 భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సెహా్వగ్ (8586) ను దాటి కోహ్లి (8676) ఐదో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), సునీల్ గావస్కర్ (10,122), వీవీఎస్ లక్ష్మణ్ (8781) మాత్రమే కోహ్లికంటే ముందున్నారు. 400 అంతర్జాతీయ క్రికెట్లో కీమర్ రోచ్ 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మెకెంజీ (బి) హోల్డర్ 57; రోహిత్ (బి) వారికన్ 80; శుబ్‌మన్ (సి) జొషువా (బి) రోచ్ 10; కోహ్లి రనౌట్ 121; రహానె (బి) గ్యాబ్రియెల్ 8; జడేజా (సి) జొషువా (బి) రోచ్ 61; ఇషాన్ కిషన్ (సి) జొషువా (బి) హోల్డర్ 25; అశ్విన్ (బి) రోచ్ 56; ఉనాద్కట్ (స్టంప్డ్) జొషువా (బి) వారికన్ 7; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వారికన్ 0; ముకేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (128 ఓవర్లలో ఆలౌట్) 438. వికెట్ల పతనం: 1–139, 2–153, 3–155, 4–182, 5–341, 6–360, 7–393, 8–416, 9–426, 10–438. బౌలింగ్: రోచ్ 22–2–104–3, జోసెఫ్ 22–0– 97–0, గ్యాబ్రియెల్ 18–0–74–1, వారికన్ 39–7–89–3, హోల్డర్ 21–3–57–2, అలిక్ 4–0–12–0, బ్రాత్‌వైట్ 2–1–1–0. -
భారత్ 182/4
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: రెండో టెస్టులోనూ భారత ఓపెనింగ్ జోడీ అదరగొట్టింది. కానీ తొలి సెషన్ వరకే ఈ శుభారంభం పరిమితమైంది. సెషన్ మారగానే వెస్టిండీస్ బౌలింగ్ ప్రతాపం మొదలైంది. ‘టాప్’ లేపింది. ఇరు జట్లు చెరిసగం ఆధిపత్యాన్ని పంచుకోవడంతో ఈ మ్యాచ్ పోటాపోటీగా మొదలైంది. టాస్ నెగ్గిన వెస్టిండీస్ బౌలింగ్‌కే మొగ్గుచూపగా, యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఉదయం సెషన్ అంతా వీళ్లిద్దరు ఆడుతూపాడుతూ పరుగులు సాధించారు. చెత్త బంతుల్ని సిక్సర్లుగా మలిచారు. ఈ క్రమంలో ముందుగా ‘హిట్‌మ్యాన్’ రోహిత్ 74 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 21వ ఓవర్లోనే జట్టు స్కోరు వందకు చేరింది. కాసేపటికే ధాటిగా ఆడుతున్న జైస్వాల్ కూడా 49 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 121/0 వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. భోజన విరామం తర్వాత 30 నుంచి 40 ఓవర్ల మధ్యలో... కేవలం 8 ఓవర్ల వ్యవధిలో కీలకమైన టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ముందుగా యశస్వి జైస్వాల్ (74 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్)కు హోల్డర్ చెక్ పెట్టగా, రోచ్ బౌలింగ్‌లో పేలవమైన షాట్‌కు శుబ్‌మన్ గిల్ (10; 2 ఫోర్లు) నిష్క్రమించాడు. కోహ్లితో కలిసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్ శర్మ (143 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను వారికన్ బోల్తా కొట్టించాడు. అనుభవజ్ఞుడైన రహానే (8) క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో 139/0 స్కోరు కాస్తా 182/4గా మారిపోయింది. టీ విరామానికి భారత్ 50.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోహ్లి (18 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. గాయపడిన శార్దుల్ ఠాకూర్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. విండీస్ తరఫున కిర్క్ మెకెంజి కెరీర్ మొదలు పెట్టాడు. 10 ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా భారత స్టార్ విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పదో క్రికెటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, ధోని, ద్రవిడ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 100వ టెస్టు సందర్భంగా టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మకు జ్ఞాపికను అందజేసిన వెస్టిండీస్ క్రికెట్ అధ్యక్షుడు డాక్టర్ కిశోర్ షాలో, దిగ్గజం బ్రియాన్ లారా -
భారత్‌కు ఎదురుందా!
భారత జట్టుపై టెస్టుల్లో వెస్టిండీస్ గెలిచి 21 ఏళ్లవుతోంది. తొలి టెస్టులో చెలరేగి సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ వయసు అప్పుడు ఐదు నెలలు! ఈ ఉదాహరణ చాలు ఇరు జట్ల మధ్య అంతరం ఎలా ఉందో చెప్పడానికి. ఆ తర్వాత భారత్, విండీస్ 24 సార్లు తలపడితే టీమిండియా 15 టెస్టులు, గెలవగా మరో ‘9’ డ్రా అయ్యాయి. గత మ్యాచ్‌లో విండీస్ ఆట చూస్తే ఏ రకంగానూ భారత్‌కు పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు రెండో టెస్టుకు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌తో పోలిస్తే క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానం పేస్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటం ఆతిథ్య జట్టుకు సానుకూలత. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): ఏకపక్షంగా సాగిన తొలి టెస్టు తర్వాత భారత్, వెస్టిండీస్ తర్వాతి సమరానికి సిద్ధమయ్యాయి. భారత్ 1–0తో సిరీస్‌లో ముందంజగా ఉండగా... నేటి నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. మరో విజయంతో క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుండగా... సొంతగడ్డపై కాస్త మెరుగైన ప్రదర్శనతో పరువు కాపాడుకోవాలని విండీస్ భావిస్తోంది. ఇరు జట్ల మద్య ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. మార్పుల్లేకుండా... తుది జట్టు విషయంలో భారత్‌కు ఎలాంటి సందిగ్ధత లేదు. గెలిచిన జట్టునే కొనసాగించే క్రమంలో అదే 11 మందితో బరిలోకి దిగవచ్చు. కెరీర్ తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్‌పై మరోసారి అందరి దృష్టీ నిలిచింది. అయితే ఎన్నో అంచనాలు ఉన్న శుబ్‌మన్ గిల్ టెస్టుల్లో ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు. 17 టెస్టుల తర్వాత కూడా అతని సగటు 31.96 మాత్రమే ఉంది. పేస్పై నమ్మకం... అరంగేట్ర టెస్టులో అతనాజ్ ప్రదర్శన మినహా గత మ్యాచ్‌లో విండీస్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. పేలవ బ్యాటింగ్, నిస్సారమైన బౌలింగ్ ఆ జట్టును మరీ బలహీన ప్రత్యర్థి గా మార్చాయి. ఈ మ్యాచ్‌లోనైనా విండీస్ ఏమైనా పోరాడుతుందా అనేది చూడాలి. భారత్‌తో పోలిస్తే రోచ్, జోసెఫ్, గాబ్రియెల్ రూపంలో కాస్త అనుభవజు్ఞలైన పేసర్లు జట్టులో ఉన్నారు. పిచ్‌ను సరిగా వాడుకొని వీరు భారత బ్యాటర్లపై ఏమైనా ప్రభావం చూపించగలిగితే మ్యాచ్ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. 100 భారత్, విండీస్ మధ్య ఇది 100వ టెస్టు. ఇప్పటి వరకు జరిగిన 99 టెస్టుల్లో విండీస్ 30 గెలిస్తే, భారత్ 23 గెలిచింది. మరో 46 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 500 కోహ్లికి మూడు ఫార్మాట్లలో కలిపి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్. కెరీర్లో అతను మొత్తం 25,461 పరుగులు సాధించాడు. -
ఇంగ్లండ్ లక్ష్యం 371: ప్రస్తుతం 114/4
లండన్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగడంతో ఇంగ్లండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. 371 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆసీస్ సీమర్లు స్టార్క్ (2/40), కమిన్స్ (2/20) వణికించారు. దీంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్ 31 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. డకెట్ (50 బ్యాటింగ్; 6 ఫోర్లు), స్టోక్స్ (29 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. సీమర్ స్టార్క్ ధాటికి ఓపెనర్ క్రాలీ (3), ఒలీ పోప్ (3) నిలువలేకపోయారు. కమిన్స్... రూట్ (18; 2 ఫోర్లు), బ్రూక్ (4)లను అవుట్ చేశాడు. విజయానికి ఇంకా 257 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్ చేతిలో 6 వికెట్లున్నాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 130/2తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా 101.5 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. డ్రింక్స్ విరామం వరకు ఖ్వాజా (77; 12 ఫోర్లు), స్మిత్ (34; 5 ఫోర్లు) బాగానే ఆడినప్పటికీ తర్వాత స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు హెడ్ (7) వికెట్‌ను కోల్పోయింది. రెండో సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 40 పరుగుల వ్యవ ధిలో మిగతా సగం వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. బ్రాడ్ 4, టంగ్, రాబిన్సన్ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఆసీస్ ప్రత్యర్థి ముందు 371 లక్ష్యాన్ని నిర్దేశించింది. -
ఇంగ్లండ్ పోరాటం...
లండన్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు పోరాటం సాగిస్తోంది. ఒకదశలో 188/1తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు 34 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయి 222/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో మరో రెండు వికెట్లు పడి ఉంటే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కుప్పకూలేది! కానీ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 45 బ్యాటింగ్; 4 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ (57 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) పట్టుదలతో ఆడి ఐదో వికెట్‌కు అజేయంగా 56 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో 4 వికెట్లకు 278 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (48; 5 ఫోర్లు) రెండు పరుగులతో అర్ధ సెంచరీ... డకెట్ (98; 9 ఫోర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నారు. ఓలీ పోప్ (42; 4 ఫోర్లు) రాణించగా, జో రూట్ (10) విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా స్కోరుకు ఇంగ్లండ్ మరో 138 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు స్టోక్స్, బ్రూక్లతోపాటు బెయిర్‌స్టో క్రీజులో నిలబడితే ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్‌పై ఆశలు ఉంచుకోవచ్చు. ఆసీస్ మేటి స్పిన్నర్ నాథన్ లయన్ కాలి పిక్క గాయం కారణంగా మూడో రోజు బౌలింగ్‌కు దిగుతాడో లేదో అనుమానం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 339/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 77 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 416 పరుగులవద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (110; 15 ఫోర్లు) కెరీర్లో 32వ సెంచరీ సాధించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, జోష్ టంగ్ మూడు వికెట్ల చొప్పున తీశారు. 22 టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. ఇప్పటి వరకు స్మిత్ తొలి ఇన్నింగ్స్‌లో 22 సెంచరీలు చేశాడు. 21 సెంచరీలతో రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును స్మిత్ సవరించాడు. -
ఆసీస్‌దే తొలిరోజు
లండన్: బ్యాటర్లు క్రీజులో పాతుకుపోవడంతో రెండో టెస్టు ఆ్రస్టేలియా ఆధిపత్యంతో మొదలైంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (85 బ్యాటింగ్; 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో నిలువగా, ట్రావిస్ హెడ్ (77; 14 ఫోర్లు), వార్నర్ (66; 8 ఫోర్లు, 1 సిక్స్) వన్డేలా ఆడి వేగంగా ఫిఫ్టీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, రూట్ చెరో 2 వికెట్లు తీశారు. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్‌కే మొగ్గు చూపింది. దీనికి తగ్గట్లే బౌలర్లు కూడా ఓపెనర్లను పెవిలియన్‌కు పంపేవారు! కానీ పేలవమైన ఫీల్డింగ్ విలువైన వికెట్ అందిపుచ్చుకోలేకపోయింది. 13వ ఓవర్ ఆఖరి బంతి వార్నర్ బ్యాట్ అంచును తాకుతూ నాలుగో స్లిప్‌లో ఉన్న పోప్ వైపు వెళ్లింది. కానీ సునాయాసమైన ఈ క్యాచ్‌ను అతను నేలపాలు చేశాడు. అప్పటికి వార్నర్ స్కోరు 20 పరుగులే. కాసేపటికి ఉస్మాన్ ఖ్వాజా (17; 2 ఫోర్లు)ను టంగ్ బౌల్డ్ చేయగా, లైఫ్‌తో వార్నర్ ఎంచక్కా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లా ఆడుతున్న అతన్ని కూడా టంగ్ బౌల్డ్ చేయగా, లబుషేన్–స్మిత్ జోడీ ఆతిథ్య బౌలర్లకు మింగుడుపడని భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇద్దరు మూడో వికెట్‌కు 102 పరుగులు జత చేశారు. అనంతరం లబుషేన్ ఆటకు రాబిన్సన్ ముగింపు పలికాడు. అయితే హెడ్ వచ్చాక స్మిత్ తన నిలకడైన బ్యాటింగ్‌ను కొనసాగించడంతో ఆతిథ్య బౌలర్లకు మళ్లీ కష్టాలు తప్పలేదు. ఇద్దరు ఆఖరి సెషన్లో అదరగొట్టారు. ఈ జోడీ ఇంగ్లండ్ పాలిట కొరకరానికొయ్యలా మారింది. నాలుగో వికెట్‌కు 118 పరుగులు జోడించాక రూట్ ఒకే ఓవర్లో హెడ్‌తో పాటు, గ్రీన్ (0)ను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ శిబిరం ఊపిరి పీల్చుకుంది. స్మిత్‌తో పాటు క్యారీ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. 1 ఈ మ్యాచ్‌తో ఆ్రస్టేలియా స్పిన్నర్ నాథన్ లయన్ తన కెరీర్లో 100 టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వరుసగా 100 టెస్టులు ఆడిన తొలి బౌలర్‌గా లయన్ ఘనత సాధించాడు. గతంలో ఆలిస్టర్ కుక్ (159 టెస్టులు), బోర్డర్ (153), మార్క్ వా (107), సునీల్ గావస్కర్ (106), మెకల్లమ్ (101) వరుసగా 100కుపైగా టెస్టులు ఆడినా వారందరూ బ్యాటర్లు కావడం గమనార్హం. -
ఐర్లాండ్ బ్యాటర్ల ఆధిపత్యం.. తేలిపోయిన లంక బౌలర్లు, మరో 20 పరుగులు చేస్తే రికార్డు
గాలె: శ్రీలంకతో సోమవారం మొదలైన రెండో టెస్టులో ఐర్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించింది. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ (163 బంతుల్లో 95; 14 ఫోర్లు) ఐదు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. పాల్ స్టిర్లింగ్ (133 బంతుల్లో 74 రిటైర్డ్‌హర్ట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), లొర్కాన్ టకర్ (102 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు చేశారు. బాల్బిర్నీ, స్టిర్లింగ్ నాలుగో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. టెస్టుల్లో ఐర్లాండ్ జట్టుకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మరో 20 పరుగులు సాధిస్తే ఐర్లాండ్ టెస్టుల్లో తమ అత్యధిక స్కోరును నమోదు చేస్తుంది. టకర్‌కు జతగా ప్రస్తుతం కాంఫెర్ (27 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య రెండు వికెట్లు పడగొట్టాడు. -
డబ్ల్యూటీసీ ఫైనల్ అన్నారు.. ఇప్పుడేమో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని పరిస్థితి..!
NZ VS SL 2nd Test: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడుతున్న లంకేయులు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేశారు. శ్రీలంక.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు (580/4) ఇంకా 303 పరుగులు వెనుకపడి ఉంది. ఓవర్‌నైట్ స్కోర్ 26/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మైఖేల్ బ్రేస్‌వెల్ (3/50), మ్యాట్ హెన్రీ (3/44), సౌథీ (1/22), డౌగ్ బ్రేస్‌వెల్ (1/19), టిక్నర్ (1/21) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే చాపచుట్టేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ దిముత్ కరుణరత్నే (89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ పిలుపు మేరకు ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి ఇన్నింగ్స్ పరాభవాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ కరుణరత్నే (51) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ పోరాడుతున్నాడు. సౌథీ, డౌగ్ బ్రేస్‌వెల్‌లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 580 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్ (215), హెన్రీ నికోల్స్(200 నాటౌట్) డబుల్ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేశాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి, భారత్‌ను వెనక్కునెట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరాలని కలలు కన్న శ్రీలంక ప్రసుత్తం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని స్థితిలో ఉంది. తొలి టెస్ట్‌లో సూపర్ సెంచరీతో శ్రీలంక విజయావకాశాలను దెబ్బకొట్టిన విలియమ్సన్ ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టును గెలవకుండా చేశాడు. -
New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్ ‘డబుల్’ సెంచరీలు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ ఆ దేశం తరఫున అరుదైన ఘనత సాధించారు. ఒకే ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీలు సాధించిన తొలి కివీస్ ద్వయంగా గుర్తింపు పొందారు. వీరిద్దరి జోరుతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్ (296 బంతుల్లో 215; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెన్రీ నికోల్స్ (240 బంతుల్లో 200 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) ద్విశతకాలతో చెలరేగారు. మూడో వికెట్‌కు 363 పరుగులు జోడించిన వీరిద్దరు ఈ క్రమంలో పలు కొత్త రికార్డులు నమోదు చేశారు. టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న విలియమ్సన్... ఈ మైలురాయిని దాటిన తొలి కివీస్ బ్యాటర్‌గా నిలవడంతో పాటు అన్ని ఫార్మాట్లలో కలిపి ఆ దేశం తరఫున అత్యధిక సెంచరీలు (41) సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అనంతరం శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. -
డబుల్ సెంచరీలు బాదిన కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్
వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలొ న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (215), హెన్రీ నికోల్స్ (200 నాటౌట్) ద్విశతకాలతో విరుచుకుపడ్డారు. ఫలింతగా కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. డెవాన్ కాన్వే (78) హాఫ్ సెంచరీతో రాణించగా.. టామ్ లాథమ్ (21), డారిల్ మిచెల్ (17) తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, ధనంజయ డిసిల్వ, ప్రభాత్ జయసూర్య తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కేన్ మామకు ఆరోది, నికోల్స్‌కు తొలి ద్విశతకం.. 285 బంతుల్లో కెరీర్లో ఆరో ద్విశతకం పూర్తి చేసిన విలియమ్సన్.. దిగ్గజ ఆటగాళ్లు మర్వన్ ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావిద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్‌ల రికార్డును సమం చేశాడు. విలియమ్సన్ సహా వీరందరూ టెస్ట్‌ల్లో ఆరు డబుల్ సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అధిక డబుల్ సెంచరీల రికార్డు దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ 52 టెస్ట్‌ల్లో ఏకంగా 12 ద్విశతకాలు బాదాడు. మరోవైపు విలియమ్సన్తో పాటు మూడో వికెట్‌కు 363 పరుగులు జోడించిన హెన్రీ నికోల్స్ కూడా డబుల్ బాదాడు. 240 బంతుల్లో 200 పరుగులతో అజేయంగా నిలిచిన నికోల్స్‌కు ఇది కెరీర్లో తొలి ద్విశతకం. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో సూపర్ సెంచరీతో (121) మెరిసిన కేన్ మామ.. ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా డబుల్ సెంచరీతో (215) చెలరేగాడు. కేన్ మామకు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లోనూ కేన్ మామ శతక్కొట్టాడు (132). -
హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన కేన్ మామ
వెల్లింగ్టన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిధ్య న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. వర్షం, వెలుతురులేమి కారణంగా తొలి రోజు కేవలం 48 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా, రెండో రోజు ఆట నిర్దిష్ట సమయానికి ప్రారంభమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసిన న్యూజిలాండ్.. రెండో రోజు ఆటలో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి టెస్ట్‌లో సూపర్ సెంచరీతో (121) తన జట్టుకు అపురూప విజయాన్నందించిన కేన్ విలియమ్సన్ ఐదు రోజుల వ్యవధిలో మరో సెంచరీతో (188 నాటౌట్) మెరిశాడు. కేన్ మామకు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లోనూ కేన్ మామ శతక్కొట్టాడు (132). మరోవైపు కేన్ మామతో హెన్రీ నికోల్స్ (113 నాటౌట్) సైతం సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ పోటాపోటీ శతకాలతో విరుచుకుపడటంతో 106 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 425/2గా ఉంది. విలియమ్సన్ (188), హెన్రీ నికోల్స్ (114) క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు ఆటలో డెవాన్ కాన్వే (78) హాఫ్ సెంచరీతో రాణించగా.. టామ్ లాథమ్ (21) పర్వాలేదనిపించాడు. 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
NZ VS ENG 2nd Test: శతక్కొట్టి జట్టును గట్టెక్కించిన కేన్ మామ
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఫాలో ఆన్ ఆడిన న్యూజిలాండ్ అనూహ్య రీతిలో పుంజుకుని రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగుల భారీ స్కోర్‌ను సాధించి, ప్రత్యర్ధికి 258 పరుగుల డిఫెండింగ్ టార్గెట్‌ను నిర్ధేశించింది. 258 టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. తమదైన స్టయిల్లో ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. వరుస బౌండరీలతో విరుచుకుపడిన జాక్ క్రాలే (30 బంతుల్లో 24; 5 ఫోర్లు) మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఓటవ్వగా.. బెన్ డక్కెట్ (23), ఓలీ రాబిన్సన్ (1) ఆచితూచి ఆడుతున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసి, లక్ష్యానికి 210 పరుగుల దూరంలో ఉంది. కాగా, ఓవర్‌నైట్ స్కోర్ 202/3తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్.. అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి మ్యాచ్ చేజారకుండా కాపాడుకునే ప్రయత్నం చేసింది. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (132) సూపర్ సెంచరీతో జట్టును ఆదుకోగా.. డారిల్ మిచెల్ (54), టామ్ బ్లండల్ (90) తమ పాత్రలను న్యాయం చేశారు. మూడో రోజు ఆటలో కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ (83), డెవాన్ కాన్వే (61) అర్ధసెంచరీలతో రాణించి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ (176 బంతుల్లో 186; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీతో శివాలెత్తగా.. రూట్ (153 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మ్యాట్ హెన్రీ 4 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్ 2, సౌథీ, వాగ్నర్ తలో వికెట్ దక్కించకున్నారు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. కెప్టెన్ సౌథీ (49 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోతే న్యూజిలాండ్ ఈ మాత్రం కూడా స్కోర్ చేయలేకపోయేది. ఇంగ్లండ్ వెటరన్ పేస్ సింహాలు ఆండర్సన్ (3/37), స్టువర్ట్ బ్రాడ్ (4/61) మరోసారి చెలరేగగా. జాక్ లీచ్ (3/80) పర్వాలేదనిపించాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
పట్టుబిగించిన ఇంగ్లండ్.. భారమంతా కేన్ మామపైనే..!
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ పట్టుబిగించింది. ఫాలో ఆన్ ఆడుతున్న న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (83), డెవాన్ కాన్వే (61) అర్ధసెంచరీలు చేసి ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (25 నాటౌట్), హెన్రీ నికోల్స్ (18) క్రీజ్‌లో ఉన్నారు. జాక్ లీచ్ 2 వికెట్లు పడగొట్టగా.. జో రూట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 24 పరుగులు వెనుకపడి ఉంది. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత పూర్తిగా కేన్ విలియమ్స్న్పై ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ (176 బంతుల్లో 186; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీతో శివాలెత్తగా.. రూట్ (153 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మ్యాట్ హెన్రీ 4 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్ 2, సౌథీ, వాగ్నర్ తలో వికెట్ దక్కించకున్నారు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడుతుంది. కెప్టెన్ సౌథీ (49 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోతే న్యూజిలాండ్ ఈ మాత్రం కూడా స్కోర్ చేయలేకపోయేది. ఇంగ్లండ్ వెటరన్ పేస్ సింహాలు ఆండర్సన్ (3/37), స్టువర్ట్ బ్రాడ్ (4/61) మరోసారి చెలరేగగా. జాక్ లీచ్ (3/80) పర్వాలేదనిపించాడు. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి 24 పరుగులు వెనుకంజలో ఉంది. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
అందుకే కోహ్లి 'కింగ్' అయ్యాడు.. దేశమే అతనికి ముఖ్యం.. ఏం జరిగిందో చూడండి..!
టీమిండియా స్టార్ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ముద్దుగా కింగ్ అని పిలుచుకుంటారన్న విషయం విధితమే. భారత క్రికెట్ అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి కోహ్లి పేరులో కింగ్ అనే బిరుదును కలిపేశారు. కోహ్లికి కింగ్ అనే బిరుదు రావడానికి అతని గ్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఎంత కారణమో, అతని బిహేవియర్ కూడా అంతే కారణం. ఫీల్డ్‌లో దూకుడుగా ఉండే కింగ్ కోహ్లి.. సందర్భానుసారంగా రియాక్ట్ అవుతూ చాలా హుందాగా కూడా కనిపిస్తాడు. ప్రత్యర్ధులు కవ్విస్తే ఉగ్రరూపం దాల్చే కోహ్లి.. అదే వారు కలిసిపోతే సరదాగా డ్యాన్స్‌లు వేస్తూ మైదానంలో ఉన్న ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను హుషారెక్కిస్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత విజయానంతరం కోహ్లి ఇలాగే ఓ పాపులర్ బాలీవుడ్ పాటకు స్టెప్పులేసి అలరించాడు. Crowd was chanting 'RCB, RCB' - Virat Kohli told to stop it and chant 'India, India'. pic.twitter.com/kMd53wbYRU — Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2023 తన ఆన్ ఫీల్డ్ ప్రవర్తనతో నిత్యం వార్తల్లో ఉండే కోహ్లి, న్యూఢిల్లీ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా జరిగిన ఓ విషయంతో మరోసారి టాక్ ఆఫ్ ద సోషల్‌మీడియాగా నిలిచాడు. ఢిల్లీ టెస్ట్ మూడో రోజు ఆటలో విరాట్ కోహ్లి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన కోహ్లి వారిని వారించి, ఆర్సీబీ అని కాకుండా ఇండియా.. ఇండియా అని తమను ఎంకరేజ్ చేయాలంటూ తన జెర్సీపై ఉన్న బీసీసీఐ ఎంబ్లెంని చూపిస్తూ ఫ్యాన్స్‌కు సైగ చేశాడు. కోహ్లి ఇలా చెప్పాడో లేదో.. ఇండియా.. ఇండియా.. అకే కేకలతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కోహ్లి దేశానికి ఇచ్చే ప్రాధాన్యతను కొనియాడుతూ అభిమానులు కామెంట్లతో సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నారు. కింగ్ అనే బిరుదుకు కోహ్లి వంద శాతం అర్హుడని ఆకాశానికెత్తుతున్నారు. కోహ్లి చర్యతో మరోసారి భారత క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడని.. టీమిండియా తర్వాతే తన ఐపీఎల్ జట్టు అని కోహ్లి మరోసారి చాటాడని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, న్యూఢిల్లీ టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జడేజా 10 వికెట్లతో విజృంభించడంతో ఆసీస్ రెండు ఇన్నింగ్స్‌ల్లో పేకమేడలా కూలింది. -
ఆసీస్‌పై రెండో టెస్ట్‌లో విక్టరీ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా
BGT 2023 IND VS AUS 2nd Test: న్యూఢిల్లీ టెస్ట్‌లో ఆసీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించిన అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ బెర్తులు ఒకింత సంక్లిష్టంగా మారాయి. ఈ విజయంతో భారత్ విన్నింగ్ పర్సంటేజ్‌ను 61.67 నుంచి 64.06కు పెంచుకుని, డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో బెర్తు కోసం ఆసీస్-శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకొంది. తాజా ఓటమితో ఆసీస్ విన్నింగ్ పర్సంటేజ్ 70.83 నుంచి 66.67 శాతానికి పడిపోవడంతో శ్రీలంక (53.33) ఆశలు సజీవంగా మారాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఆసీస్ ముందువరుసలో ఉన్నప్పటికీ.. ఆ జట్టుకు ఇప్పటివరకు అధికారికంగా ఫైనల్ బెర్త్ ఖరారు కాలేదు. ఒకవేళ BGT-2023లో కంగారూలు క్లీన్ స్వీప్ (0-4) అయ్యి, ఆ తర్వాత జరిగే సిరీస్‌లో శ్రీలంక.. న్యూజిలాండ్‌ను 2-0 తేడాతో చిత్తు చేస్తే, ఆసీస్ ఇంటిబాట పడుతుంది. అప్పుడు భారత్‌తో పాటు శ్రీలంక ఫైనల్‌కు చేరుతుంది. అయితే ఇది అంతా ఈజీగా జరిగే పనికాదు. ఒకవేళ భారత్.. ఆసీస్‌ను ఊడ్చేసినా, న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం శ్రీలంకకు అంత సులువు కాదు. కివీస్-శ్రీలంక సిరీస్ మార్చి 9 నుంచి మొదలవుతుంది. ఇదిలా ఉంటే, న్యూఢిల్లీ టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించడంతో 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జడేజా (3/68, 7/42), అశ్విన్ (3/57, 3/59) పట్టపగ్గాలు లేకుండా విజృంభించి ఆసీస్ వెన్నువిరిచారు. ముఖ్యంగా జడేజా రెండో ఇన్నింగ్స్‌లో విశ్వరూపం ప్రదర్శించి, ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. జడేజా ధాటికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. 115 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా రోహిత్ (31), కేఎల్ రాహుల్ (1), కోహ్లి (20), శ్రేయస్ అయ్యర్ (12) వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. -
వందో టెస్ట్.. బౌండరీ కొట్టి టీమిండియాను గెలిపించిన పుజారా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెరీర్లో వందో టెస్ట్ ఆడిన పుజారా (31 నాటౌట్).. బౌండరీ కొట్టి మరీ టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. In his 1️⃣0️⃣0️⃣th Test, @cheteshwar1 finishes off the chase in style 🙌🏻#TeamIndia secure a 6️⃣-wicket victory in the second #INDvAUS Test here in Delhi 👏🏻👏🏻 Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8@mastercardindia pic.twitter.com/Ebpi7zbPD0 — BCCI (@BCCI) February 19, 2023 ముఖ్యంగా భారత స్టార్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3/68, 7/42), రవిచంద్రన్ అశ్విన్ (3/57, 3/59) పట్టపగ్గాలు లేకుండా విజృంభించారు. వీరిలో మరీ ముఖ్యంగా జడేజా రెండో ఇన్నింగ్స్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఆసీస్ వెన్ను విరిచాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. జడేజా ధాటికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. For his magnificent all-round performance including a brilliant 7⃣-wicket haul, @imjadeja receives the Player of the Match award 🏆#TeamIndia win the second #INDvAUS Test by six wickets 👌🏻👌🏻 Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8@mastercardindia pic.twitter.com/rFhCZZDZTg — BCCI (@BCCI) February 19, 2023 ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో హెడ్ (43), లబూషేన్ (35) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. ఈ ఇన్నింగ్స్‌లో జడేజా ఏకంగా ఐదుగురిని క్లీన్‌బౌల్డ్ చేయడం ఆసక్తికర విషయం. అనంతరం 115 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా రోహిత్ (31), కేఎల్ రాహుల్ (1), కోహ్లి (20), శ్రేయస్ అయ్యర్ (12) వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. పుజారాతో పాటు శ్రీకర్ భరత్ (23) క్రీజ్‌లో నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ బౌలర్లలో లయోన్ 2, మర్ఫీ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు చాపచుట్టేయగా.. భారత్ 262 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఖ్వాజా (81), హ్యాండ్స్కోంబ్ (72 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. అక్షర్ (74), కోహ్లి (44), అశ్విన్ (37)లు టీమిండియాను గట్టెక్కించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు షమీ 4, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఆసీస్ బౌలర్లలో లయోన్ 5, కున్నేమన్, మర్ఫీ చెరో 2 వికెట్లు, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
Border-Gavaskar Trophy: మలుపు ఎటువైపు?
మనం నమ్ముకున్న ‘స్పిన్’ మంత్రం మనకే బెడిసి కొట్టింది. రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను కూల్చేసింది. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు పరుగు ముందే టీమిండియా ఆలౌటైంది. అక్షర్ పటేల్, అశ్విన్ ఆదుకోకుంటే మాత్రం పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా ఉండేది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ దాకా ప్రధాన బ్యాటర్లను లయన్ తిప్పేస్తుంటే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆపద్భాంధవుడి పాత్ర పోషించాడు. న్యూఢిల్లీ: ఎవరి ఊహకు అందనంతగా స్పిన్ తిరుగుతోంది. మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. రెండు రోజుల్లోనే 21 వికెట్లు కూలాయి. ఇందులో 16 వికెట్లు స్పిన్నర్లవే! ప్రత్యేకించి రెండో రోజు ఆటలో పడిన 11 వికెట్లలో 10 వికెట్లు స్పిన్నర్లే పడేశారు. దీంతో ఢిల్లీ టెస్టు రసవత్తరంగా మారింది. మిగిలిన మూడు రోజుల ఆటలో గెలుపు ఎటు మళ్లుతుందో చెప్పలేని స్థితి! టీమిండియాకు ఎదురులేని ఢిల్లీ కోటలో ఆస్ట్రేలియా ‘స్పిన్’తో ప్రతిదాడి చేసింది. దీంతో రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 83.3 ఓవర్లలో 262 పరుగుల వద్ద ఆలౌటైంది. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ఆసీస్ స్పిన్నర్లలో లయన్ (5/67) చెలరేగాడు. కున్మన్, మర్పీలకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. లయన్ ఉచ్చులో... ఓవర్‌నైట్ స్కోరు 21/0తో శనివారం ఆట కొనసాగించిన భారత్ 7 ఓవర్లపాటు బాగానే ఆడింది. కున్మన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ లాంగాన్ లో భారీ సిక్సర్ బాదాడు. ఇక ఓపెనర్లు కుదురుకున్నట్లే అనుకుంటున్న తరుణంలో లయన్ బౌలింగ్‌కు దిగాడు. తన రెండు వరుస ఓవర్లలో టాపార్డర్‌ను ఎల్బీడబ్ల్యూగా దెబ్బ మీద దెబ్బ తీశాడు. ముందుగా రాహుల్ (17; 1 సిక్స్)ను బోల్తా కొట్టించిన లయన్ తన మరుసటి ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ (32; 2 ఫోర్లు), 100వ టెస్టు ఆడుతున్న పుజారా (0)లను పెవిలియన్ చేర్చాడు. ఇంకో ఓవర్లో అయ్యర్ (4) ఆట ముగించడంతో భారత్ 66 పరుగులకే 4 ప్రధాన వికెట్లను కోల్పోయింది. కోహ్లి క్రీజులో ఉండటమే జట్టుకు కాస్త ఊరట కాగా 88/4 స్కోరు వద్ద తొలి సెషన్ ముగిసింది. అక్షర్ వీరోచితం లంచ్ తర్వాత కోహ్లి, జడేజా జాగ్రత్తగా ఆడటంతో భారత్ వంద పరుగులు పూర్తి చేసుకుంది. అనంతరం స్పిన్నర్లు మర్ఫీ, కున్మన్ కలిసి భారత్‌ను పెద్ద దెబ్బే కొట్టారు. జడేజా (26; 4 ఫోర్లు)ను మర్ఫీ, కోహ్లి (44; 4 ఫోర్లు)ని కున్మన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నారు. శ్రీకర్ భరత్ (6) లయన్ ఉచ్చులో చిక్కాడు. 139/7 స్కోరు వద్ద భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే అశ్విన్ (37; 5 ఫోర్లు) అండతో అక్షర్ జట్టును ఒడ్డున పడేశాడు. అక్షర్ 94 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా... ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు దాకా వెళ్లగలిగింది. వార్నర్ కన్కషన్ ఆసీస్ స్టార్ ఓపెనర్ వార్నర్ రెండో టెస్టు మిగతా ఆటకు దూరమయ్యాడు. తొలిరోజు ఆటలోనే సిరాజ్ పదో ఓవర్లో వార్నర్ మోచేతికి గాయమైంది. కాసేపు ఫిజియో సేవలతో బ్యాటింగ్ చేశాడు. అయితే గాయం తీవ్రత దృష్ట్యా టెస్టు నుంచి తప్పుకోగా... కన్కషన్ (ఆటలో గాయమైతేనే) సబ్‌స్టిట్యూట్‌గా రెన్షాను తీసుకున్నారు. మూడో టెస్టుకల్లా వార్నర్ కోలుకునేది అనుమానంగానే ఉంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) లయన్ 32; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 17; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 0; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) కున్మన్ 44; అయ్యర్ (సి) హ్యాండ్స్కాంబ్ (బి) లయన్ 4; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) మర్ఫీ 26; శ్రీకర్ భరత్ (సి) స్మిత్ (బి) లయన్ 6; అక్షర్ (సి) కమిన్స్ (బి) మర్ఫీ 74; అశ్విన్ (సి) రెన్షా (బి) కమిన్స్ 37; షమీ (బి) కున్మన్ 2; సిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (83.3 ఓవర్లలో ఆలౌట్) 262. వికెట్ల పతనం: 1–46, 2–53, 3–54, 4–66, 5–125, 6–135, 7– 139, 8–253, 9–259, 10–262. బౌలింగ్: కమిన్స్ 13–2–41–1, కున్మన్ 21.3– 4–72–2, లయన్ 29–5–67–5, మర్ఫీ 18–2–53–2, హెడ్ 2–0–10–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖాజా (సి) అయ్యర్ (బి) జడేజా 6; హెడ్ (బ్యాటింగ్) 39; లబుషేన్ బ్యాటింగ్ 16; మొత్తం (12 ఓవర్లలో వికెట్ నష్టానికి) 61. వికెట్ల పతనం: 1–23. బౌలింగ్: అశ్విన్ 6–1–26–0, షమీ 2–0–10–0, జడేజా 3–0–23–1, అక్షర్ 1–0–2–0. -
IND VS AUS 2nd Test: కేవలం ఒక్క పరుగు లీడ్.. 35 ఏళ్ల రికార్డు బద్దలు
న్యూఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేవలం ఒక్క పరుగు దూరంలో (262 ఆలౌట్) నిలిచిపోయింది. దీంతో ఆసీస్ పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత్‌పై లీడ్‌పై పరంగా ఇదీ ఓ రికార్డే. 1958లో కాన్పూర్ వేదికగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఒక్క పరుగు ఆధిక్యం కూడా లేకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు ఒకే స్కోర్ సాధించాయి. ఇదే సీన్ 1986లో జరిగిన బర్మింగ్హమ్ టెస్ట్‌లో మరోసారి రిపీటైంది. భారత్, ఇంగ్లండ్ జట్లు తొలి ఇన్నింగ్స్‌లో సమానమైన స్కోర్లు సాధించాయి. దీని తర్వాత 1988లో ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు 2 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. తాజాగా ఢిల్లీ టెస్ట్‌లో ఆసీస్‌కు ఒక్క పరుగు ఆధిక్యం లభించడంతో పై పేర్కొన్న మూడు టెస్ట్‌ల మధ్యలో చోటు దక్కించుకుంది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 263 పరుగులు చేయగా.. భారత్ 262 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసి 62 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఖ్వాజా (6) జడేజా బౌలింగ్‌లో ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (39 నాటౌట్), లబూషేన్ (16 నాటౌట్) క్రీజ్‌లో కొనసాగుతున్నారు. కాగా, రెండో రోజు ఆటలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను.. అక్షర్ పటేల్ (74), కోహ్లి (44), అశ్విన్ (37), జడేజా (26) ఆదుకున్నారు. వీరిలో ముఖ్యంగా అశ్విన్-అక్షర్ జోడీ 100కి పైగా పరుగుల జోడించి టీమిండియాను తిరిగి మ్యాచ్‌లో నిలబెట్టింది. అక్షర్ స్పెషలిస్ట్ బ్యాటర్లా రెచ్చిపోవడంతో మ్యాచ్‌పై పట్టుసాద్దామనుకున్న ఆసీస్ ఆశలు అడియాసలయ్యాయి. ఆసీస్ బౌలర్లలో లియోన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి 5 వికెట్లు పడగొట్టగా.. కున్నేమన్, మర్ఫీ తలో రెండు వికెట్లు, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు ఖ్వాజా (81), హ్యాండ్స్కోంబ్ (72) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు షమీ 4, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
IND VS AUS 2nd Test Day 2: అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు
Ravichandran Ashwin: టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. న్యూఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగతున్న రెండో టెస్ట్‌లో కష్టాల్లో ఉన్న టీమిండియాను బ్యాట్‌తో ఆదుకున్న యాష్ (32 నాటౌట్) ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 5000 అంతకంటే ఎక్కువ పరుగులు, 700 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఐదవ భారత ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు. యాష్‌కు ముందు వినూ మన్కడ్ (11591 పరుగులు, 782 వికెట్లు), శ్రీనివాస్ వెంకట రాఘవన (6617 రన్స్, 1390 వికెట్లు), కపిల్ దేవ్ (11356, 835), అనిల్ కుంబ్లే (5572, 1136) ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో కష్టాల్లో ఉండిన టీమిండియాను అశ్విన్ (32 నాటౌట్), అక్షర్ పటేల్ (51 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 92 పరుగులు జోడించి ఇంకా క్రీజ్‌లో ఉన్నారు. 77 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 231/7గా ఉంది. ఆశ్విన్ ఆచితూచి ఆడుతుంటే.. అక్షర్ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. అక్షర్ సిక్సర్‌తోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అక్షర్ 6 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు బాదగా.. అశ్విన్ 4 ఫోర్లు కొట్టాడు. టీమిండియా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సోకర్కు ఇంకా 32 పరుగులు వెనుకబడి ఉంది. అక్షర్-అశ్విన్ జోడీకి ముందు కోహ్లి-జడేజా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే 10 పరుగుల వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. కోహ్లి (44) అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలి కాగా.. జడేజా (26) మర్ఫీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 5 వికెట్లు పడగొట్టగా.. టాడ్ మర్ఫీ, మాథ్యూ కున్నేమన్ తలో వికెట్ దక్కించుకున్నారు. లియోన్.. కేఎల్ రాహుల్ (17), రోహిత్ శర్మ (32), పుజారా (0), శ్రేయస్ అయ్యర్ (4), శ్రీకర్ భరత్ (6)లను పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా (81), హ్యాండ్స్కోంబ్ (72) అర్ధసెంచరీలతో రాణించగా.. టీమిండియా బౌలర్లు షమీ 4, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
లియోన్ మాయాజాలం.. ఐదేయడంతో పాటు అరుదైన రికార్డు
Nathan Lyon: ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ మరోసారి రెచ్చిపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. రెండో రోజు ఆట మొదలైనప్పటి నుంచే వీరలెవెల్లో విజృంభించిన లియోన్.. కేఎల్ రాహుల్ (17), రోహిత్ శర్మ (32), పుజారా (0), శ్రేయస్ అయ్యర్ (4), శ్రీకర్ భరత్ (6)లను పెవిలియన్‌కు పంపాడు. తద్వారా టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టడంతో పాటు ఓ అరుదైన క్లబ్లో చేరాడు. స్పిన్‌ను సహకరించే వికెట్‌పై బంతిని గింగిరాలు తిప్పుతూ టీమిండియా ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న లియోన్.. టెస్ట్‌ల్లో భారత్‌పై 100 వికెట్లు తీసిన 3వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లియోన్ 100 వికెట్ల మైలురాయిని కేవలం 24 టెస్ట్‌ల్లో చేరుకోవడం మరో విశేషం. లియోన్‌కు ముందు జేమ్స్ ఆండర్సన్ (139), ముత్తయ్య మురళీథరన్ (105) మాత్రమే భారత్‌పై 100కు పైగా వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. కేవలం 152 మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఓ దశలో కోహ్లి (44), జడేజా (26)లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. 10 పరుగుల వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో టీమిండియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కోహ్లి అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలి కాగా.. జడేజా మర్ఫీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. లియోన్ 5 వికెట్లతో విజృంభించగా.. మర్ఫీ, మాథ్యూ కున్నెమన్ చెరో వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ (4), అశ్విన్ (9) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 111 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా (81), హ్యాండ్స్కోంబ్ (72) అర్ధసెంచరీలతో రాణించగా.. టీమిండియా బౌలర్లు షమీ 4, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియా కాస్త మెరుగ్గా...
ఓపెనర్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం అందించారు. గత మ్యాచ్‌లో విఫలమైన ఇద్దరు బ్యాటర్లు ఈసారి చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చారు. రెండు సందర్భాల్లో జట్టు మెరుగైన స్థితిలో నిలిచి భారీ స్కోరు దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయినా సరే చివరకు వచ్చేసరికి ఆస్ట్రేలియా సాధారణ స్కోరుకే పరిమితమైంది. తొలి టెస్టుతో పోలిస్తే కాస్త ఫర్వాలేదనిపించినా ఓవరాల్‌గా మొదటి రోజే ఆలౌట్ అయిన జట్టు ఆట ఆశలు రేపేలా లేదు! షమీ పదునైన పేస్‌కు తోడు అశ్విన్, జడేజా స్పిన్‌తో ఆసీస్‌ను దెబ్బ కొట్టారు. బ్యాటింగ్‌కు ఏమాత్రం ఇబ్బందిగా లేని పిచ్‌పై రెండో రోజు భారత్ ఎంత స్కోరు సాధిస్తుందనేది ఆసక్తికరం. న్యూఢిల్లీ: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులోనూ మొదటి రోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 78.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖాజా (125 బంతుల్లో 81; 12 ఫోర్లు, 1 సిక్స్), హ్యాండ్స్కాంబ్ (142 బంతుల్లో 72 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. మొహమ్మద్ షమీ (4/60) ప్రత్యర్థిని పడగొట్టగా, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఎలాంటి ఇబ్బంది లేకుండా 9 ఓవర్లు ఎదుర్కొన్న భారత్ ఆట ముగిసే సమయానికి 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (13 బ్యాటింగ్), రాహుల్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నా రు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న భారత సీనియర్ క్రికెటర్ పుజారా ను దిగ్గజం సునీల్ గావస్కర్ సన్మానించారు. స్మిత్ డకౌట్... గత మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి ఆస్ట్రేలియా ఓపెనర్లు తొలి గంట పాటు కాస్త ప్రతిఘటన కనబర్చగలిగారు. ఖాజా ఆత్మవిశ్వాసంతో ఆడగా, వార్నర్ (15; 3 ఫోర్లు)లో తడబాటు కొనసాగింది. 21వ బంతికి గానీ అతను తొలి పరుగు తీయలేకపోయాడు. ఈ క్రమంలో సిరాజ్ బౌలింగ్‌లో మోచేతికి, హెల్మెట్‌కు బంతి బలంగా తగలడంతో వార్న ర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. షమీ ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన వార్నర్ అతని తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగాడు. మరోవైపు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్వీప్ షాట్లతో పరుగులు రాబట్టిన ఖాజా 71 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆసీస్‌కు అసలు దెబ్బ అశ్విన్ ఓవర్లో తగిలింది. 91/1తో మెరుగ్గా ఉన్న స్థితిలో లబుషేన్ (18)ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా... మరో రెండు బంతులకే భరత్ చక్కటి క్యాచ్‌తో స్మిత్ (0) డకౌట్ కావడం ఒక్కసారిగా కంగారూలు వెనక్కి తగ్గేలా చేసింది. రెన్షా స్థానంలో ఈ మ్యాచ్‌లోకి వచ్చిన ట్రవిస్ హెడ్ (12; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేదు. కీలక భాగస్వామ్యాలు... ఆసీస్‌ను గట్టెక్కించే బాధ్యత ఖాజా, హ్యాండ్స్కాంబ్లపై పడింది. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంతసేపు చకచకా పరుగులు జోడించారు. ముఖ్యంగా జడేజాను లక్ష్యంగా చేసుకొని వీరు పరుగులు రాబట్టారు. అయితే స్వీప్ షాట్లతోనే 29 పరుగులు సాధించిన ఖాజా చివరకు అదే షాట్‌కు వికెట్‌ను సమర్పించుకున్నాడు. క్యారీ (0) వెంటనే అవుట్ కాగా... ఈసారి ప్యాట్ కమిన్స్ (33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. మరోవైపు 110 బంతుల్లో హ్యాండ్స్కాంబ్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆసీస్ జోరు పెంచుతున్న దశలో రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో కమిన్స్, మర్ఫీ (0) వికెట్లతో దెబ్బ కొట్టాడు. చివరి రెండు వికెట్ల షమీ ఖాతాలోకి వెళ్లాయి. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) భరత్ (బి) షమీ 15; ఖాజా (సి) రాహుల్ (బి) జడేజా 81; లబుషేన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 18; స్మిత్ (సి) భరత్ (బి) అశ్విన్ 0; హెడ్ (సి) రాహుల్ (బి) షమీ 12; హ్యాండ్స్కాంబ్ (నాటౌట్) 72; క్యారీ (సి) కోహ్లి (బి) అశ్విన్ 0; కమిన్స్ (ఎల్బీ) (బి) జడేజా 33; మర్ఫీ (బి) జడేజా 0; లయన్ (బి) షమీ 10; కున్మన్ (బి) షమీ 6; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (78.4 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–50, 2–91, 3–91, 4–108, 5–167, 6–168, 7–227, 8–227, 9–246, 10–263. బౌలింగ్: షమీ 14.4–4–60–4, సిరాజ్ 10–2–30–0, అశ్విన్ 21–4–57–3, జడేజా 21–2–68–3, అక్షర్ 12–2–34–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 13, రాహుల్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: కమిన్స్ 3–1–7 –0, కున్మన్ 4–1–6–0, లయన్ 2–0–4–0. 13: భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 13వ క్రికెటర్‌గా పుజారా గుర్తింపు పొందాడు. గతంలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్‌దేవ్, సునీల్ గావస్కర్, వెంగ్ సర్కార్, గంగూలీ, కోహ్లి, ఇషాంత్ శర్మ, హర్భజన్æ, సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. 1: అంతర్జాతీయ టి20 ఫార్మాట్ మొదలయ్యాక ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడకుండానే 100 టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్ పుజారా. -
అరుదైన క్లబ్లో చేరేందుకు అడుగు దూరంలో ఉన్న పుజారా.. కోహ్లి తర్వాత..!
టీమిండియా టెస్ట్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా అరుదైన క్లబ్లో చేరేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ పుజారా కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. భారత్ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఘనత కేవలం 12 మంది క్రికెటర్లకు మాత్రమే దక్కింది. ఆసీస్‌తో రెండో టెస్ట్‌లో పక్కాగా తుది జట్టులో ఉండే పుజారా ఈ అరుదైన క్లబ్లో చేరే 13వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న భారత ఆటగాళ్లలో కేవలం విరాట్ కోహ్లి మాత్రమే 100 టెస్ట్‌ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. కోహ్లి తన కెరీర్లో ఇప్పటివరకు 105 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పుజారా 44.16 సగటున 3 ద్విశతకాలు, 19 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 7021 పరుగులు చేశాడు. టెస్ట్‌లతో పాటు 5 వన్డేలు ఆడిన పుజారా 10.2 సగటున 51 పరుగులు మాత్రమే చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అంత ఆశాజనకంగా సాగని పుజారా కెరీర్.. ఐపీఎల్ లాంటి పావులర్ లీగ్‌ల్లోనూ అంతంతమాత్రంగానే సాగింది. క్యాష్ రిచ్ లీగ్‌లో పుజారా ఇప్పటివరకు కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్లో 99.74 స్ట్రయిక్ రేట్ కలిగిన పుజారా.. హాఫ్ సెంచరీ సాయంతో 390 పరుగులు చేశాడు. ఇటీవలకాలంలో టెస్ట్ క్రికెటర్ అన్న ముద్ర తొలగించుకనే ప్రయత్నం చేస్తున్న నయా వాల్.. తాజాగా జరిగిన ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కౌంటీ సీజన్లో అదరగొట్టాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్లో గేర్ మార్చిన పుజారా.. తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2010లో ఆస్ట్రేలియాపైనే టెస్ట్ అరంగేట్రం చేసిన పుజారా అదే ఆస్ట్రేలియాపై తన వందో టెస్ట్ కూడా ఆడటం యాదృచ్చికంగా జరుగనుంది. ఆసీస్‌పై ఘనమైన రికార్డు కలిగిన పుజారా తన వందో టెస్ట్‌లో శతకం బాదాలని ఆశిద్దాం. పుజారా ఆసీస్‌పై 21 మ్యాచ్‌ల్లో 52.77 సగటున 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1900 పరుగులు చేశాడు. -
విండీస్ బౌలర్ ధాటికి విలవిలలాడిన జింబాబ్వే
Gudakesh Motie: వెస్టిండీస్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ధాటికి జింబాబ్వే విలవిలలాడింది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) మొదలైన రెండో టెస్ట్‌లో మోటీ 7 వికెట్లతో విజృంభించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. మోటీతో పాటు జేసన్ హోల్డర్ (2/18), అల్జరీ జోసఫ్ (1/29) రాణించడంతో జింబాబ్వే స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఇన్నోసెంట్ కాలా (38) టాప్ స్కోర్‌గా నిలిచాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కాలాతో పాటు చిబాబ (10), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (22), ట్రిపానో (23 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రేమన్ రీఫర్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ (36), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (22) ఓ మోస్తరుగా రాణించారు. కైల్ మేయర్స్ (8), రోస్టన్ చేజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో బ్రెండన్ మవుటా 2 వికెట్లు పడగొట్టగా.. మసకద్జకు ఓ వికెట్ దక్కంది. రీఫర్ రనౌటయ్యాడు. కాగా, తొలి టెస్ట్ సెంచరీ హీరో, జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవడం విశేషం. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో బ్యాలెన్స్‌తో పాటు విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ సెంచరీలు చేయగా.. శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్‌నరైన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. -
టీమిండియాతో రెండో టెస్ట్.. స్పీడ్ గన్ వచ్చేస్తున్నాడా.. ఆసీస్ మైండ్‌గేమ్ ఆడుతుందా..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. తొలి మ్యాచ్‌లోనే ఎదురైన ఘోర పరాభవం నేపథ్యంలో ఆసీస్ రెండు టెస్ట్‌లో భారీ మార్పులకు వెళ్లనుందని క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక వెబ్సైట్ ద్వారా క్లూ వదిలింది. Mitchell Starc will link up with the Australian squad in Delhi with his recovery progressing well.@LouisDBCameron | #INDvAUS https://t.co/rMqXXpwBgV — cricket.com.au (@cricketcomau) February 11, 2023 తొలి టెస్ట్‌లో ఓటమిపాలైన గంటల వ్యవధిలోనే క్రికెట్ ఆస్ట్రేలియా తమ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రెండో టెస్ట్‌కు సంసిద్ధంగా ఉన్నాడంటూ ట్వీట్ చేసింది. ఇది నిజమో లేక ఆసీస్ టీమ్ మైండ్‌గేమ్‌లో భాగమో తెలీదు కానీ.. తమ స్పీడ్ గన్ వేలి గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, అతను త్వరలోనే న్యూఢిల్లీలో ఆసీస్ క్యాంప్‌లో చేరతాడని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా ప్రకటించింది. రెండో టెస్ట్‌కు వేదిక అయిన అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందా లేక పేసర్లకు సహకరించే అవకాశం ఉందా అన్న కనీస సమాచారం లేకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ప్రకటన చేయడం వెనుక మైండ్‌గేమ్ ఉంటుందని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలోకి ఓసారి వెళ్తే.. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ స్పిన్నర్ ఫ్రెండ్లీగా పిచ్‌గా చూశాం. ఇలాంటి పిచ్‌పై ఏ జట్టైనా అదనపు స్పిన్నర్‌కు తీసుకోవాలని భావిస్తుంది కానీ, హడావుడిగా గాయం నుంచి పూర్తిగా కోలుకోని పేసర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అనుకోదు. తొలి టెస్ట్ కోల్పోయిన బాధలో ఉన్న ఆసీస్.. టీమిండియాను మిస్ లీడ్ చేసే ప్రయత్నంలో స్టార్క్ సంసిద్ధతను పావుగా వాడుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇందుకు తొలి టెస్ట్ అనంతరం ఆసీస్ కెప్టెన్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. మ్యాచ్ అనంతరం కమిన్స్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. రెండో టెస్ట్‌పై ఇప్పటినుంచే డిస్కషన్ చేయడంలో అర్ధం లేదని అన్నాడు. రెండో టెస్ట్ కోసం ఆసీస్ తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయన్న ప్రశ్న ఎదురైనప్పుడు కమిన్స్ ఈ రకంగా స్పందించాడు. న్యూఢిల్లీ టెస్ట్‌కు ఆసీస్ మరో పేసర్ జోష్ హేజిల్‌వుడ్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ అందుబాటులో ఉంటారా..? తొలి మ్యాచ్‌లో విఫలమైన మ్యాట్ రెన్షా, హ్యాండ్స్కోంబ్, పేసర్ బోలాండ్‌లను తప్పిస్తారా అన్న ప్రశ్నలు ఎదురైనప్పుడు కమిన్స్ మాట్లాడుతూ.. తదుపరి మ్యాచ్‌లో పెద్దగా మార్పులు ఉంటాయని నేను అనుకోను అంటూ దాటవేసే ధోరణిలో సమాధానం చెప్పాడు. కమిన్స్ చేసిన ఈ వ్యాఖ్యల బట్టి చూస్తే.. ఆసీస్ టీమ్ టీమిండియాతో మైండ్‌గేమ్ మొదలుపెట్టిందన్న విషయం స్పష్టమవుతోంది. ఏదిఏమైనప్పటికీ ఆసీస్ తుది జట్టులో ఎవరెవరు ఉండబోతున్నారో తెలియాలంటే మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు వరకు ఆగాల్సిందే. రెండో టెస్ట్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభంకానుంది. -
పట్టు బిగించిన కివీస్.. మరో పరాభవం దిశగా పాక్
కరాచీ: పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ విజయంపై న్యూజిలాండ్ గురి పెట్టింది. మూడున్నర రోజుల పాటు చప్పగా సాగిన రెండో టెస్టు గురువారం చివర్లో ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. 319 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పాక్ ఆట ముగిసే సమయానికి 2.5 ఓవర్లలో ఒక్క పరుగు కూడా చేయకుండా 2 వికెట్లు కోల్పోయింది. అబ్దుల్లా షఫీక్ (0), నైట్‌వాచ్‌మన్ మీర్ హమ్జా (0) బౌల్డ్ కాగా, ఇమామ్ ఉల్ హక్ (0 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. బంతి ఇప్పటికే అనూహ్యంగా స్పందిస్తుండగా చివరి రోజు పాక్ విజయాన్ని అందుకోవడం అంత సులువు కాదు! అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటై పాక్ 41 పరుగుల ఆధిక్యం కోల్పోగా, రెండో ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్ 5 వికెట్లకు 277 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్రేస్‌వెల్ (74 నాటౌట్), బ్లన్‌డెల్ (74), లాథమ్ (62) అర్ధ సెంచరీలు చేశారు. కాగా, ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను పాకిస్తాన్ 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఒకవేళ న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లోనూ పాక్ ఓటమిపాలైతే స్వదేశంలో పాక్‌కు ఇది వరుసగా రెండో పరాభవం అవుతుంది. -
సౌద్ షకీల్ శతకం.. కివీస్‌కు ధీటుగా బదులిస్తున్న పాక్
PAK VS NZ 2nd Test 3rd Day: కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ ధీటుగా బదులిస్తుంది. సౌద్ షకీల్ (336 బంతుల్లో 124 నాటౌట్; 17 ఫోర్లు) టెస్ట్‌ల్లో తన తొలి శతకంతో రెచ్చిపోవడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిధ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. షకీల్‌కు జతగా ఇమామ్ ఉల్ హాక్ (83), వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (78) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఘా సల్మాన్ (41) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. ఇష్ సోధీ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే (122) సెంచరీతో చెలరేగగా.. టామ్ లాథమ్ (71), టామ్ బ్లండల్ (51), మ్యాట్ హెన్రీ (68) అర్ధశతకాలతో రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4 వికెట్లతో సత్తా చాటగా.. నసీమ్ షా, అఘా సల్మాన్ 3 వికెట్లతో రాణించారు. కాగా, సప్పగా సాగుతున్న ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీనికి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లు తయారు చేశారని విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వరుస పరాభవాలను తప్పించుకునేందుకు ఈ సిరీస్ కోసం నిర్జీవమైన పిచ్‌లు తయారు చేసింది. ఇంగ్లండ్ చేతిలో పాక్ 0-3 తేడాతో వైట్‌వాష్ అయిన విషయం తెలిసిందే. -
India vs Bangladesh 2nd Test Day 3: కొడతారా...పడతారా..!
పిచ్ ఎంత స్పిన్‌కు అనుకూలిస్తున్నా సరే మన మేటి బ్యాటింగ్ ఆర్డర్ ముందు 145 పరుగుల విజయలక్ష్యం ఒక లెక్కా అనిపించింది... కానీ మైదానంలోకి దిగాక అసలు ఆట మొదలైంది...గింగిరాలు తిరుగుతూ, అనూహ్యంగా వస్తున్న బంతులను ఆడలేక మన బ్యాటర్లు తడబడుతుంటే భారత గడ్డపై విదేశీ బ్యాటర్ల పరిస్థితి గుర్తుకొచ్చింది... రాహుల్, గిల్, పుజారా, కోహ్లి... ఇలా ప్రధాన బ్యాట్స్‌మెన్ వెనుదిరుగుతుంటే 23 ఓవర్లలో ఒక్కో బంతి గండంలా గడిచింది... ఇక మిగిలింది మరో 100 పరుగులు... ఆదివారం డిఫెన్స్‌కు ప్రయత్నించకుండా ఎదురుదాడికి దిగి పంత్, శ్రేయస్ జట్టును గెలిపిస్తారా... లేక అంతా స్పిన్ మాయలో పడి మ్యాచ్‌ను అప్పగిస్తారా చూడాలి... అంతకు ముందు రెండో ఇన్నింగ్స్‌లో ఒక దశలో 113/6తో ఉన్న బంగ్లా జట్టు చివరి నాలుగు వికెట్లకు మరో 118 పరుగులు చేసే అవకాశం ఇచ్చిన భారత్ అనూహ్య సవాల్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితికి మ్యాచ్‌ను చేర్చింది. మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు ఓటమి ప్రమాదం పొంచి ఉంది! చేయాల్సిన పరుగులపరంగా చూస్తే తక్కువగానే కనిపిస్తున్నా శనివారం బంతి స్పిన్ అయిన తీరు చూస్తే ఒక్కో పరుగు సాధించడం కూడా కష్టంగా మారవచ్చు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 45 పరుగులు చేసింది. రాహుల్ (2), గిల్ (7), పుజారా (6), కోహ్లి (1) ఇప్పటికే పెవిలియన్ చేరగా... బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన అక్షర్ పటేల్ (54 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు ) కాస్త పట్టుదల ప్రదర్శించి నిలబడగా, జైదేవ్ ఉనాద్కట్ (3 నాటౌట్) అతనికి తోడుగా క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 7/0తో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (98 బంతుల్లో 73; 7 ఫోర్లు), జాకీర్ హసన్ (135 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. కీలక భాగస్వామ్యాలు... మూడో రోజు ఆటలో రెండో ఓవర్లో నజ్ముల్ (5)ను అశ్విన్ అవుట్ చేయడంతో బంగ్లా వికెట్ల పతనం మొదలైంది. మోమినుల్ (5)ను సిరాజ్ వెనక్కి పంపగా, ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే సీనియర్ బ్యాటర్లు షకీబ్ (13), ముష్ఫికర్ (9) వెనుదిరిగారు. అప్పటికి బంగ్లా భారత్‌కంటే ఇంకా 17 పరుగులు వెనుకబడి ఉంది. ఈ దశలో జాకీర్, దాస్ కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 129 బంతుల్లో జాకీర్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే ఆ వెంటనే జాకీర్‌తో పాటు మెహదీ హసన్ (0)నూ పెవిలియన్ పంపించి టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్‌లో భారత్ ఆధిక్యాన్ని తీసేస్తే ఆ స్థితిలో బంగ్లా స్కోరు 26/6గా చెప్పవచ్చు! అయితే తర్వాతి రెండు భాగస్వామ్యాలు ఆ జట్టు పరిస్థితిని మెరుగ్గా మార్చాయి. అవీ వేగంగా రావడంతో ఆట స్వరూపం మారింది. లిటన్ దాస్... నూరుల్ హసన్ (29 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఏడో వికెట్‌కు 48 పరుగులు, తస్కీన్ అహ్మద్ (46 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు)తో ఎనిమిదో వికెట్‌కు 60 పరుగులు జత చేశాడు. ఎట్టకేలకు దాస్‌ను చక్కటి బంతితో బౌల్డ్ చేసి సిరాజ్ ఊరట అందించగా...చివరి 2 వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ తొలి బంతినుంచే భారత్‌ను కట్టి పడేసింది. దాంతో వికెట్ కాపాడుకోవడానికే పరిమితమైన బ్యాటర్లు పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాహుల్ (2) మళ్లీ విఫలం కాగా, పుజారా (6) అనూహ్యంగా స్టంపౌట్ అయ్యాడు. 35 బంతులు ఆడినా గిల్ (7) ప్రభావం చూపలేకపోగా, ఆదుకుంటాడనుకున్న కోహ్లి (22 బంతుల్లో 1) కూడా అతి జాగ్రత్తకు అవుటయ్యాడు. మరో ఎండ్‌లో అక్షర్ మాత్రమే కొంత ప్రతిఘటించగలిగాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 227; భారత్ తొలి ఇన్నింగ్స్ 314; బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: నజ్ముల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 5; జాకీర్ (సి) సిరాజ్ (బి) ఉమేశ్ 51; మోమినుల్ (సి) పంత్ (బి) సిరాజ్ 5; షకీబ్ (సి) గిల్ (బి) ఉనాద్కట్ 13; ముష్ఫికర్ (ఎల్బీ) (బి) అక్షర్ 9; లిటన్ దాస్ (బి) సిరాజ్ 73; మెహదీ హసన్ (ఎల్బీ) (బి) అక్షర్ 0; నూరుల్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 31; తస్కీన్ (నాటౌట్) 31; తైజుల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 1; ఖాలెద్ (రనౌట్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (70.2 ఓవర్లలో ఆలౌట్) 231. వికెట్ల పతనం: 1–13, 2–26, 3–51, 4–70, 5–102, 6–113, 7–159, 8–219, 9–220, 10–231. బౌలింగ్: ఉమేశ్ 9–1–32–1, అశ్విన్ 22–2–66–2, ఉనాద్కట్ 9–3–17–1, సిరాజ్ 11–0–41–2, అక్షర్ 19.2–1–68–3. భారత్ రెండో ఇన్నింగ్స్: గిల్ (స్టంప్డ్) నూరుల్ (బి) మెహదీ 7; రాహుల్ (సి) నూరుల్ (బి) షకీబ్ 2; పుజారా (స్టంప్డ్) నూరుల్ (బి) మెహదీ 6; అక్షర్ (నాటౌట్) 26; కోహ్లి (సి) మోమినుల్ (బి) మెహదీ 1; ఉనాద్కట్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (23 ఓవర్లలో 4 వికెట్లకు) 45. వికెట్ల పతనం: 1–3, 2–12, 3–29, 4–37. బౌలింగ్: షకీబ్ 6–0–21–1, తైజుల్ 8–4–8–0, మెహదీ హసన్ 8–3–12–3, తస్కీన్ 1–0–4–0. మూడు క్యాచ్‌లు వదిలేసిన కోహ్లి భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన విరాట్ కోహ్లి శనివారం స్లిప్‌లో పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఏకంగా మూడు క్యాచ్‌లు వదిలేయడంతో బంగ్లాదేశ్‌కు కోలుకునే అవకాశం దక్కింది. వాటిని అందుకొని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. రెండు సార్లు బంతి గమనాన్ని అంచనా వేయడంలో కోహ్లి పొరబడ్డాడు. ఒక వైపు అతను క్యాచ్ అందుకునేందుకు సిద్ధం కాగా, బంతి మరో వైపు వెళ్లింది. ఇందులో ఒక సారి పంత్ గ్లవ్‌ను తాకుతూ బంతి స్లిప్ వైపు వచ్చింది. మరో సారి మాత్రం నేరుగా చేతుల్లోకి వచ్చి కింద పడింది. కోహ్లి క్యాచ్ వదిలేసిన సమయాల్లో లిటన్ దాస్ స్కోరు 20, 49 కాగా...నూరుల్ 21 పరుగుల వద్ద ఉన్నాడు. -
IND vs BAN 2nd Test: భారత బౌలర్లదే పైచేయి
ఒకవైపు ఉమేశ్, ఉనాద్కట్ పదునైన పేస్... మరోవైపు అనుభవజ్ఞుడైన అశ్విన్ స్పిన్ తంత్రం... వెరసి రెండో టెస్టులో తొలి రోజే బంగ్లాదేశ్ కుప్పకూలింది. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేని ఆతిథ్య జట్టు కనీస స్కోరు కూడా సాధించలేక చతికిలపడింది. మోమినుల్ హక్ పోరాటం మినహా జట్టు బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ విశేషమేమీ లేకపోయింది. గత టెస్టుతో పోలిస్తే అశ్విన్ మెరుగైన ప్రదర్శన ఇవ్వగా, ఉపఖండం పిచ్‌లపై ఉమేశ్ మళ్లీ సత్తా చాటాడు. పుష్కరకాలం తర్వాత టెస్టు ఆడిన ఉనాద్కట్ కూడా రెండు వికెట్లతో సంతృప్తిగా ముగించాడు. ఆపై టీమిండియా వికెట్ కోల్పోకపోయినా... ఆడిన 9 ఓవర్లలోనే ఎన్నో సార్లు బంతి అనూహ్యంగా స్పందించడంతో ఓపెనర్లు ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని చూస్తే రెండో రోజు ఆట భారత బ్యాటింగ్‌కు సవాల్ విసిరేలా ఉంది. మిర్పూర్: భారత్‌తో గురువారం మొదలైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 73.5 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటైంది. మోమినుల్ హక్ (157 బంతుల్లో 84; 12 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. షకీబ్ విఫలం... బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 40 పరుగులకు పైగా నమోదైన భాగస్వామ్యాలు నాలుగు కాగా, అత్యధికం 48 మాత్రమే! ఇదీ ఆ జట్టు బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. ఒక్కో జోడీ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగానే భారత బౌలర్లు వికెట్ తీసి బంగ్లాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే జట్టు ఇన్నింగ్స్ ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా వెళ్లలేదు. ఓపెనర్లు నజ్ముల్ హొస్సేన్ (24), జాకీర్ హసన్ (15) ఆరంభంలో కొంత జాగ్రత్త ప్రదర్శించినా... అదీ ఎక్కువ సేపు సాగలేదు. ‘0’ వద్ద జాకీర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసినా దాని వల్ల భారత్‌కు పెద్దగా నష్టం జరగలేదు. జాకీర్‌ను అవుట్ చేసి ఉనాద్కట్ టెస్టుల్లో తొలి వికెట్ సాధించాడు. అదే స్కోరు వద్ద నజ్ముల్ కూడా అవుట్ కాగా... లంచ్ సమయానికి బంగ్లా స్కోరు 82/2కు చేరింది. అయితే విరామం తర్వాత తొలి బంతికే చెత్త షాట్ ఆడిన షకీబ్ (16) నిష్క్రమించాడు. మరోవైపు మోమిన్ మాత్రం పట్టుదలగా నిలబడి కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. అతనికి కొద్ది సేపు ముష్ఫికర్ రహీమ్ (26) సహకరించాడు.అశ్విన్ ఓవర్లో ముష్ఫికర్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడం సహా ఒక దశలో పది బంతుల వ్యవధిలో వీరిద్దరు ఆరు ఫోర్లు బాదడం విశేషం. ఈ జోడీని జైదేవ్ ఉనాద్కట్ విడదీయగా... సిరాజ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి దూకుడు ప్రదర్శించిన లిటన్ దాస్ (25) దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి 78 బంతుల్లో మోమినుల్ అర్ధసెంచరీ పూర్తయింది. టీ బ్రేక్ తర్వాత ఒకదశలో బంగ్లా 213/5తో మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే భారత బౌలర్లు చెలరేగడంతో మరో 14 పరుగులకే ఆ జట్టు తర్వాతి ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఎనిమిది ఓవర్ల ఆటలో భారత్ వికెట్ తీయడంలో బంగ్లాదేశ్ బౌలర్లు సఫలం కాలేకపోయారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: నజ్ముల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 24; జాకీర్ (సి) రాహుల్ (బి) ఉనాద్కట్ 15; మోమినుల్ (సి) పంత్ (బి) అశ్విన్ 84; షకీబ్ (సి) పుజారా (బి) ఉమేశ్ 16; ముష్ఫికర్ (సి) పంత్ (బి) ఉనాద్కట్ 26; లిటన్ దాస్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 25; మెహదీ హసన్ (సి) పంత్ (బి) ఉమేశ్ 15; నూరుల్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 6; తస్కీన్ (సి) సిరాజ్ (బి) ఉమేశ్ 1; తైజుల్ (నాటౌట్) 4; ఖాలెద్ (సి) ఉనాద్కట్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (73.5 ఓవర్లలో ఆలౌట్) 227. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–82, 4–130, 5–172, 6–213, 7–219, 8–223, 9–227, 10–227. బౌలింగ్: సిరాజ్ 9–1–39–0, ఉమేశ్ యాదవ్ 15–4–25–4, జైదేవ్ ఉనాద్కట్ 16–2–50–2, అశ్విన్ 21.5–3– 71–4, అక్షర్ 12–3–32–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బ్యాటింగ్) 3; గిల్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 19. బౌలింగ్: తస్కీన్ 4–2–8–0, షకీబ్ 4–2–11–0. -
బౌలర్ల విజృంభణ.. తొలి రోజు టీమిండియా ఆధిపత్యం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు (డిసెంబర్ 22) టీమిండియా ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ఉమేశ్ యాదవ్ (4/25), రవిచంద్రన్ అశ్విన్ (4/71), జయదేవ్ ఉనద్కత్ (2/50) చెలరేగడంతో బంగ్లాదేశ్‌ను 227 పరుగులకే (73.5 ఓవర్లలో) కట్టడి చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (84) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6), తస్కిన్ అహ్మద్ (1), ఖలీద్ అహ్మద్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు (8 ఓవర్లలో) చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (20 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్), కేఎల్ రాహుల్ (30 బంతుల్లో 3 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్ చేసి, వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. -
చెలరేగిన ఉమేశ్, సత్తా చాటిన అశ్విన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన బంగ్లాదేశ్
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 22) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ఉమేశ్ యాదవ్ (4/25), రవిచంద్రన్ అశ్విన్ (4/71), జయదేవ్ ఉనద్కత్ (2/50) చెలరేగడంతో బంగ్లాదేశ్‌ను 227 పరుగులకే (73.5 ఓవర్లలో) ఆలౌట్ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (84) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6), తస్కిన్ అహ్మద్ (1), ఖలీద్ అహ్మద్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్ చేసి, వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అలాగే, ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్‌ను చాలా సిరీయస్‌గా తీసుకుంది. -
IND VS BAN 2nd Test: ఉనద్కత్ ఖాతాలో అసాధారణ రికార్డు
Jaydev Unadkat Plays Test Cricket After 12 Years: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 22) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్.. ఈ మ్యాచ్ కోసం ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఉనద్కత్‌తో పాటు ఉమేశ్ యాదవ్ (3/20), రవిచంద్రన్ అశ్విన్ (2/68) రాణించడంతో బంగ్లాదేశ్ 69 ఓవర్ల తర్వాత 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. మొమినుల్ హాక్ (82 నాటౌట్) అజేయమైన అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతని జతగా తస్కిన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నాడు. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కాగా, అనూహ్య పరిణామాల మధ్య ఈ మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఓ అసాధారణ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2010లో తొలి టెస్ట్ (సౌతాఫ్రికా) ఆడిన ఉనద్కత్.. 12 ఏళ్ల తర్వాత రెండో టెస్ట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పార్థివ్ పటేల్ పేరిట ఉండేది. పార్థివ్.. 8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ రికార్డుతో పాటు ఉనద్కత్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. అత్యధిక టెస్ట్ మ్యాచ్‌ల గ్యాప్ తర్వాత టెస్ట్‌ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో ఉనద్కత్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో గారెత్ బ్యాటీ (142 టెస్ట్‌లు, 2005-16) అగ్రస్థానంలో ఉండగా.. ఉనద్కత్ (118 టెస్ట్‌లు, 2010-22) రెండో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత మార్టిన్ బిక్నెల్ (114, 1993-2003), ఫ్లాయిడ్ రీఫర్ (109, 1999-2009), యూనిస్ అహ్మద్ (104, 1969-87), డెరెక్ షాక్లెటన్ (103, 1951-63) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో నిలిచారు. ఇదిలా ఉంటే, బంగ్లా టూర్‌కు తొలుత ఎంపికైన మహ్మద్ షమీ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో ఉనద్కత్ జట్టులోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శన (10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు) ఆధారంగా సెలెక్టర్లు అతనికి అవకాశం కల్పించారు. -
India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. సిరీస్‌పై కన్నేసిన భారత్
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో భారత్‌కు మరో సవాల్. అందుబాటులో ఉన్న ఆరు టెస్టుల్లో ఐదు గెలిస్తే ఖాయంగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశం ఉన్న టీమిండియా ఇందులో మొదటి అంకాన్ని పూర్తి చేసింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ హోరాహోరీగా సాగే అవకాశం ఉండటంతో దానికి ముందు వీలైనన్ని ఎక్కువ పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో చివరిదైన రెండో టెస్టులోనూ విజయమే లక్ష్యంగా జట్టు బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్ చివర్లో కాస్త పట్టుదల కనబర్చగలిగిన బంగ్లాదేశ్ సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లోనైనా ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి. మిర్పూర్: బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. నేటి నుంచి షేర్–ఎ–బంగ్లా స్టేడియంలో జరిగే రెండో టెస్టులో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. బలబలాల దృష్ట్యా చూస్తే మన జట్టు అన్ని రంగాల్లో ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఉంది. గత మ్యాచ్ తరహాలో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తే ఈ మ్యాచ్ కూడా టీమిండియా ఖాతాలోకి చేరడం ఖాయం. అయితే ఈ సారైనా కాస్త మెరుగైన ప్రదర్శన ఇస్తే సొంతగడ్డపై బంగ్లా పరువు దక్కించుకోగలదు. అదే జట్టుతో... రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకొని ఈ మ్యాచ్‌కు సిద్ధమై ఉంటే తుది జట్టు ఎంపిక కష్టంగా మారేదేమో! కానీ రోహిత్ దూరం కావడంతో మరో మాటకు తావు లేకుండా తొలి టెస్టు ఆడిన టీమ్‌నే భారత్ కొనసాగించవచ్చు. ప్రాక్టీస్‌లో రాహుల్ గాయపడి కొంత చర్చ మొదలైనా... అది తీవ్రమైంది కాదని, రాహుల్ ఆడతాడని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ చెప్పేయడంతో స్పష్టత వచ్చేసింది. నిజానికి ఇప్పుడు అందరికంటే ముందుగా ఆట అవసరం ఉన్నది రాహుల్‌కే. తొలి టెస్టు స్కోరు బోర్డు చూస్తే రాహుల్ వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తోంది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమైన అతను ఈ సారైనా తన బ్యాటింగ్‌తో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం ఎంతో అవసరం. గిల్, పుజారా శతకాలతో సత్తా చాటగా శ్రేయస్, పంత్ రాణించారు. కోహ్లి కూడా తన స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం. బౌలింగ్‌లో అనూహ్యంగా అశ్విన్ నిరాశపర్చాడు. బ్యాటింగ్‌లో రాణించినా, తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌తో సరిపెట్టాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై అతనితో పాటు అక్షర్, కుల్దీప్ చెలరేగితే బంగ్లాకు కష్టాలు తప్పవు. పేస్ విభాగంలో సిరాజ్, ఉమేశ్‌ల స్థానానికి ఢోకా లేదు. అయితే 12 ఏళ్ల తర్వాత టెస్టు జట్టులోకి ఎంపికైన జైదేవ్ ఉనాద్కట్ ఆనందం ఎంపికకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే తుది జట్టులో అతనికి చోటు కష్టమే! తస్కీన్‌కు చోటు... ఇదే పట్టుదల కాస్త మొదటి ఇన్నింగ్స్‌లో కూడా చూపిస్తే ఎలా ఉండేదో... గత టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తమ ఆట చూసిన తర్వాత బంగ్లాదేశ్ బహుశా ఇదే అనుకొని ఉంటుంది. 513 పరుగుల భారీ లక్ష్యం కనిపిస్తున్నా... ఆ జట్టు పూర్తిగా చేతులెత్తేయలేదు. 124 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం సహా 324 పరుగుల వరకు పోరాడగలిగింది. ఇదే స్ఫూర్తితో బ్యాటింగ్ చేస్తే ఈ టెస్టులో కాస్త మెరుగైన ఫలితం రాబట్టవచ్చు. ఓపెనర్లు జాకీర్ హసన్, నజ్ముల్‌తో పాటు బ్యాటింగ్‌లో షకీబ్ అల్ హసన్ కూడా రాణించడం సానుకూలాంశం. అయితే ఇద్దరు ప్రధాన బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ తేలిపోయారు. వీరిద్దరు మిడిలార్డర్లో నిలబడితేనే జట్టు కుప్పకూలి పోకుండా ఉంటుంది. వన్డే సిరీస్ తరహాలో ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ నుంచి బ్యాటింగ్‌లో కూడా మంచి ప్రదర్శనను టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. బౌలింగ్‌లో బంగ్లా కూడా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతోనే దిగనుంది. షకీబ్ పూర్తి ఫిట్‌గా మారాడని, బౌలింగ్ చేస్తాడని కోచ్ డొనాల్డ్ ప్రకటించడం సానుకూలాంశం. గాయంతో ఉన్న పేసర్ ఇబాదత్ స్థానంతో తస్కీన్ తుది జట్టులోకి వస్తాడు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రాహుల్ (కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లి, పంత్, శ్రేయస్, అక్షర్, అశ్విన్, కుల్దీప్, ఉమేశ్, సిరాజ్. బంగ్లాదేశ్: షకీబ్ (కెప్టెన్), నజ్ముల్, జాకీర్, యాసిర్, లిటన్ దాస్, ముష్ఫికర్, నూరుల్, మెహదీ హసన్, తైజుల్, తస్కీన్, ఖాలెద్. పిచ్, వాతావరణం మ్యాచ్‌లో ఎక్కువ భాగం స్పిన్నర్లకే అనుకూలం. అయితే ఆరంభంలో బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తూ స్వేచ్ఛగా పరుగులు చేసేందుకు అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయం. వర్ష సూచన లేదు. 16: పుజారా మరో 16 పరుగులు చేస్తే టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. -
బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. టీమిండియా కెప్టెన్‌కు గాయం..?
బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాకు షాకింగ్ న్యూస్ అందింది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడినట్లు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్వయంగా ప్రకటించాడు. నెట్స్‌లో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా రాహుల్ చేతికి బంతి బలంగా తాకిందని, నొప్పి భరించలేక రాహుల్ సెషన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడని రాథోడ్ తెలిపాడు. అయితే, గాయం అంత తీవ్రమైంది కాదని, రెండో టెస్ట్‌లో రాహుల్ తప్పక బరిలోకి దిగుతాడని డాక్టర్ల పర్యవేక్షణ అనంతరం రాథోడ్ వివరణ ఇచ్చాడు. కాగా, తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ మ్యాచ్‌కు దూరం కావాల్సి వస్తే.. టీమిండియా సారథ్య బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాహుల్ గైర్హాజరీలో అతని డిప్యూటీగా ఎంపికైన పుజారా ఆ బాధ్యతలు చేపడతాడా లేక అనుభవజ్ఞుడైన కోహ్లికి ఆ బాధ్యతలు అప్పజెప్పుతారా అని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. బంగ్లాతో రెండో వన్డే సందర్భంగా రెగ్యలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో తదనంతర పర్యటనలో కేఎల్ రాహుల్‌కు టీమిండియా పగ్గాలు అప్పజెప్పిన విషయం తెలిసిందే. రాహుల్ నేతృత్వంలో టీమిండియా మూడో వన్డేలో, అలాగే తొలి టెస్ట్‌లో ఘన విజయాలు నమోదు చేసింది. ఇదిలా ఉంటే, బంగ్లాతో రెండో టెస్ట్‌లో పుజారా టీమిండియా పగ్గాలు చేపడితే ఈ ఏడాది భారత 8వ కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ ఏడాది ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ భారత కెప్టెన్లుగా వ్యవహరించారు. కెప్టెన్ సరే రాహుల్ స్థానంలో ఎవరు..? గాయం కారణంగా కేఎల్ రాహుల్ జట్టుకు దూరమైతే, అతని స్థానంలో పుజారానో లేక కోహ్లినో ఆ బాధ్యతలు చేపడతారు. మరి, రాహుల్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై ప్రస్తుతం ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. రాహుల్ స్థానంలో మేనేజ్మెంట్ అభిమన్యు ఈశ్వరన్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈశ్వరన్.. బంగ్లా పర్యటనలో భారత ఏ జట్టు తరఫున 2 భారీ సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ గైర్హాజరీలో గిల్‌తో పాటు ఈశ్వరన్ ఓపెనింగ్ చేయవచ్చు. -
బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. అశ్విన్ స్థానంలో సౌరభ్ కుమార్..?
IND VS BAN 2nd Test: ఢాకా వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రేపటి నుంచి (డిసెంబర్ 22) రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వాతావరణం పూర్తిగా అనుకూలిస్తుందని ఢాకా వాతావరణ శాఖ వెల్లడించింది. 2 టెస్ట్‌ల ఈ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్ట్‌లోనూ అదే జోరును కొనసాగించి బంగ్లాను వారి సొంతగడ్డపై ఊడ్చేయాలని పట్టుదలగా ఉంది. అలాగే వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి (1-2) కూడా ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది. పనిలో పనిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే అవకాశాలను కూడా మెరుగుపర్చుకోవాలని రాహుల్ సేన భావిస్తుంది. కాగా, రెండో టెస్ట్‌లో భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. తొలి టెస్ట్ ప్రదర్శన ఆధారంగా ఎలాంటి మార్పులకు అవకాశం లేనప్పటికీ అశ్విన్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ సౌరభ్ కుమార్‌కు అవకాశం కల్పిస్తారని కొందరు భావిస్తున్నారు. షేర్ ఏ బంగ్లా స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో టీమిండియా ముగ్గురు స్పిన్నర్ల ఆప్షన్‌కు కట్టుబడి ఉండటం ఖాయమని తెలిస్తోంది. సౌరభ్ కుమార్.. బౌలింగ్‌తో పాటు ప్రామిసింగ్ బ్యాటర్ కావడంతో అతనికి ఛాన్స్ ఇవ్వడం సబబేనని మరికొందరు భావిస్తున్నారు. ఈ ఒక్క మార్పు మినహాయించి తొలి టెస్ట్ ఆడిన జట్టులో మరో మార్పు చేసే అస్కారం లేదు. జట్టులో ఇదివరకే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి తొలి టెస్ట్‌లో బ్యాట్‌తో రాణించిన అశ్విన్‌ను కొనసాగించాలని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాల నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం ఎలాంటి ప్రయోగాలు చేయరాదని మరికొందరు కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్/ సౌరభ్ కుమార్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ -
IND VS BAN 2nd Test: కెప్టెన్ ఆడతాడు.. క్లారిటీ ఇచ్చిన కోచ్
Shakib Available For Dhaka Test: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టీమిండియాతో రేపటి (డిసెంబర్ 22) నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ అలెన్ డొనాల్డ్ ఇవాళ (డిసెంబర్ 21) స్పందించాడు. షకీబ్ రెండో టెస్ట్‌లో తప్పక బరిలోకి దిగుతాడని, అతను బౌలింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని క్లారిటీ ఇచ్చాడు. పక్కటెముకలు, భుజం నొప్పితో బాధపడిన షకీబ్ ప్రస్తుతం కోలుకున్నాడని, రెండో టెస్ట్ కోసం అతను సెలెక్టర్లకు అందుబాటులో ఉంటాడని పేర్కొన్నాడు. ఒకవేళ షకీబ్ బౌలింగ్ చేయలేకపోతే తుది జట్టు కూర్పులో చాలా సమస్యలు వస్తాయని, అలా జరిగితే అదనంగా స్పిన్నర్‌కు తీసుకోవాల్సి వస్తుందని, ఈ సమస్యకు తావు లేకుండానే షకీబ్ కోలుకోవడం ఆతిధ్య జట్టుకు ఊరట కలిగించే అంశమని డొనాల్డ్ వివరణ ఇచ్చాడు. కాగా, టీమిండియాతో రెండో వన్డే సందర్భంగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో గాయపడిన షకీబ్.. గాయం పూర్తిగా మానకపోయినా తొలి టెస్ట్ బరిలోదిగాడు. కేవలం బ్యాటర్‌గానే తొలి టెస్ట్ ఆడిన షకీబ్.. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద 12 ఓవర్లు బౌలింగ్ చేశాడు. దీంతో గాయం తీవ్రత మరింత పెరిగిందని తొలి టెస్ట్ అనంతరం వైద్యులు తెలిపారు. అయితే షకీబ్.. ఈ మధ్యలో దొరికిన గ్యాప్‌లో పూర్తిగా కోలుకున్నాడని, రెండు టెస్ట్‌లో అతను ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తాడని ఆ జట్టు బౌలింగ్ కోచ్ అలెన్ డొనాల్డ్ పేర్కొనడం విశేషం. ఇదిలా ఉంటే, చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించింది. రెండో టెస్ట్‌కు భారత జట్టు.. కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, రవిచంద్రన్ అశ్విన్, సౌరభ్ కుమార్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ బంగ్లాదేశ్ జట్టు.. మహ్ముదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, మోమినుల్ హాక్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, నురుల్ హసన్, మెహిది హసన్ మీరజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్, జకీర్ హసన్, రెజౌర్ రహ్మాన్ రజా -
బంగ్లాతో రెండో టెస్ట్.. భారీ రికార్డులపై కన్నేసిన పుజారా, అక్షర్
IND VS BAN 2nd Test: మీర్పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్.. రెండో టెస్ట్‌లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును ఊడ్చేయాలని భావిస్తుంది. బంగ్లాను క్లీన్‌స్వీప్ చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగవ్వనున్న నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోనుంది. గాయాల కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ నవ్‌దీప్ సైనీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండరని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. మరోవైపు బంగ్లాదేశ్‌ను సైతం గాయాల బెడద వేధిస్తుంది. వారి కెప్టెన్ షకీబ్ అల్ హసన్, కీలక బౌలర్ ఎబాదత్ హొస్సేన్ రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లా తుది జట్లు కూర్పు ఎలా ఉన్నా.. రాహుల్ సేన మాత్రం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే, బంగ్లాతో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా కీలక ఆటగాళ్లను భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. తొలి టెస్ట్‌లో అదరగొట్టిన చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ భారీ మైల్స్టోన్స్పై కన్నేశారు. రెండో టెస్ట్‌లో నయా వాల్ పుజారా మరో 16 పరుగులు చేస్తే.. టెస్టు క్రికెట్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాటర్‌గా, అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. పుజారా ఇప్పటి వరకు 97 టెస్ట్‌ల్లో 44.43 సగటున 6984 పరుగులు చేశాడు. ఇదే మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రెండో టెస్ట్‌లో అక్షర్ మరో 6 వికెట్లు తీస్తే.. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉంది. అశ్విన్.. 9 టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించగా.. అక్షర్‌కు 8వ టెస్ట్‌లోనే అశ్విన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ప్రస్తుతం అక్షర్ ఖాతాలో 44 వికెట్లు (7 టెస్ట్‌ల్లో 13 సగటున) ఉన్నాయి. పుజారా, అక్షర్‌లతో పాటు ఇదే మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఓ అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఒక్క వికెట్ పడగొట్టినా.. బుమ్రా పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమిస్తాడు. ఈ ఏడాది బుమ్రా అన్ని ఫార్మాట్లలో కలిపి 39 వికెట్లు పడగొట్టి.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా కొనసాగుతుండగా.. అన్నే వికెట్లు పడగొట్టిన సిరాజ్ బంగ్లాతో రెండో టెస్ట్‌లో మరో వికెట్ పడగొడితే బుమ్రా రికార్డును బద్దలు కొడతాడు. -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. కెప్టెన్ సహా కీలక బౌలర్ ఔట్
టీమిండియాతో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ ఓడిపోయి బాధలో ఉన్న బంగ్లాదేశ్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఢాకాలోని మీర్పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ నుంచి ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సహా కీలక బౌలర్ ఎబాదత్ హొస్సేన్ తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. గాయాల కారణంగా వీరిద్దరు తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా వేయలేకపోయారు. టీమిండియాతో రెండో వన్డే సందర్భంగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో గాయపడిన షకీబ్.. గాయం పూర్తిగా మానకపోయినా తొలి టెస్ట్ బరిలోదిగాడు. పక్కటెముకలు, భుజం నొప్పితో బాధపడుతున్న షకీబ్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద 12 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తొలి టెస్ట్ అనంతరం గాయం తీవ్రత పెరగడంతో షకీబ్ రెండో టెస్ట్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్ కూడా చేయలేనని షకీబ్ తేల్చిచెప్పడంతో బీసీబీ అతన్ని తప్పించక తప్పట్లేదు. మరోవైపు వెన్నునొప్పితో బాధపడుతున్న ఎబాదత్ హొస్సేన్ పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో అతన్ని తప్పిస్తున్నట్లు బంగ్లా కోచ్ రస్సెల్ డొమింగో తొలి టెస్ట్ అనంతరమే ప్రకటించాడు. షకీబ్, ఎబాదత్ గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నసుమ్ అహ్మద్‌ను 15 మంది సభ్యుల జట్టులోకి ఇంక్లూడ్ చేసింది. జట్టులోకి మాజీ టెస్ట్ కెప్టెన్ మోమినుల్ హాక్ కూడా చేరాడు. షకీబ్ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు లిట్టన్ దాస్ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించింది. రెండో టెస్ట్‌కు భారత జట్టు.. కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, రవిచంద్రన్ అశ్విన్, సౌరభ్ కుమార్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్ బంగ్లాదేశ్ జట్టు.. మహ్ముదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, మోమినుల్ హాక్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, నురుల్ హసన్, మెహిది హసన్ మీరజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్, జకీర్ హసన్, రెజౌర్ రహ్మాన్ రజా -
రోహిత్ శర్మ ఔట్.. కెప్టెన్‌గా కొనసాగనున్న కేఎల్ రాహుల్
Rohit Sharma Ruled Out Of India Second Test Vs Bangladesh: ఎడమ చేతి బొటన వేలి గాయం కారణంగా బంగ్లాదేశ్ టూర్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన (రెండో వన్డే తర్వాత) టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఢాకాలోని మీర్పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. హిట్‌మ్యాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బీసీసీఐ అతన్ని బంగ్లాతో రెండో టెస్ట్‌కు దూరంగా ఉండాలని కోరినట్లు బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి సమాచారం అందించాడు. బంగ్లా టూర్ తదుపరి టీమిండియాకు కీలకమైన సిరీస్‌లు ఉండటంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా కొనసాగడం దాదాపుగా ఖరారైంది. ఒకవేళ రోహిత్ ఫిట్నెస్ సాధించి ఉంటే రెండో టెస్ట్‌కు జట్టు ఎంపిక మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారేది. తొలి టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించడంతో రోహిత్‌కు జతగా ఓపెనర్‌గా గిల్‌నే బరిలోకి దించాల్సి వచ్చేది. ఇదే జరిగితే వైస్ కెప్టెన్ అయిన రాహుల్‌ను పక్కకు కూర్చోపెట్టాల్సి వచ్చేది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ టూర్లో వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగతున్న విషయం తెలిసిందే. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 188 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను సొంతగడ్డపై మట్టికరిపించింది. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించింది. -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో ఓటమి.. పాకిస్తాన్‌కు మరో భారీ షాక్
ICC World Test Championship 2021-23 Updated Points Table: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో 26 పరుగుల తేడాతో ఓటమిపాలై, స్వదేశంలో 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు వరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలని ఉవ్విళ్లూరిన పాకిస్తాన్.. తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో ఐదో స్థానం నుంచి ఆరో ప్లేస్‌కు పడిపోయి నిరాశగా ఫైనల్ రేసు నుంచి వైదొలిగింది. మరోవైపు 22 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్‌ను వెనక్కునెట్టి ఐదో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని ఇదివరకే కోల్పోయిన ఇంగ్లండ్.. అద్భుతమైన రీతిలో పుంజుకుని మిగతా జట్లకు షాకిస్తుంది. ఇదిలా ఉంటే, విండీస్‌పై స్వదేశంలో 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు రెండు, మూడు స్థానాల్లో ఉండగా, టీమిండియా నాలుగో ప్లేస్‌లో కొనసాగుతుంది. ఈ ఏడిషన్ రెండో ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా.. సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో పోటీపడుతుంది. ఈ ఏడాది టీమిండియా మరో ఆరు టెస్ట్‌లు ఆడాల్సి ఉండగా.. అన్నింటిలో గెలిస్తే ఫైనల్లో ఆసీస్‌తో తలపడుతుంది. -
పాకిస్తాన్‌కు మరో పరాభవం తప్పదా..? సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లండ్
PAK VS ENG 2nd Test Day 3: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. చారిత్రక సిరీస్‌పై కన్నేసింది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ నెగ్గి జోరుమీద ఉన్న స్టోక్స్ సేన.. రెండో టెస్ట్‌పై కూడా పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విజయానికి 6 వికెట్ల దూరంలో ఉన్న ఇంగ్లండ్.. నాలుగో రోజు లంచ్ సమయానికే ఆట ముగించే అవకాశం ఉంది. మరో పక్క ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు పాకిస్తాన్‌కు సైతం అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు మరో 157 పరుగులు చేస్తే, సిరీస్ సమం చేసుకునే అవకాశం ఉంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్ (60), సౌద్ షకీల్ (54 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. షకీల్‌తో పాటు ఫహీమ్ అష్రాఫ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, జాక్ లీచ్, మార్క్ వుడ్, ఆండర్సన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (108) సెంచరీతో చెలరేగగా.. బెన్ డకెట్ (79) అర్ధసెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4, జహీద్ మహమూద్ 3, నవాజ్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు చాపచుట్టేయగా.. ఇంగ్లండ్ 281 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన అబ్రార్ అహ్మద్.. తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే 10 వికెట్ల ఘనత సాధించాడు. -
ఆండర్సన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. పేసర్లలో మొనగాడిగా..!
James Andersdon: దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్ (6/62), ఓలీ రాబిన్సన్ (5/91), స్టువర్ట్ బ్రాడ్ (4/61), బెన్ స్టోక్స్ (4/47) చెలరేగి సఫారీలను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 330 పరుగులకే (151, 179) పరిమితం చేయగా.. బెన్ స్టోక్స్ (103), బెన్ ఫోక్స్ (113 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 415/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, సఫారీలతో జరిగిన రెండో టెస్ట్‌లో 6 వికెట్లతో సత్తా చాటిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ ప్లేయర్ సైమన్ హార్మర్ వికెట్ పడగొట్టడం ద్వారా ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు (951, టెస్ట్‌ల్లో 664, వన్డేల్లో 269, టీ20ల్లో 18) సాధించిన పేస్ బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉండేది. మెక్‌గ్రాత్.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 949 వికెట్లు సాధించాడు. తాజాగా ఆండర్సన్.. మెక్‌గ్రాత్ రికార్డు బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన పేస్ బౌలర్‌గా అవతరించాడు. 40 ఏళ్ల ఆండర్సన్ మరో 5 వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల (పేసర్లు, స్పిన్నర్లు) జాబితాలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను (955 వికెట్లు) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకుతాడు. ఇంగ్లండ్-సఫారీల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్ కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా సెప్టెంబర్ 8న ప్రారంభమవుతుంది. చదవండి: జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు -
ఇంగ్లండ్ ఘనవిజయం
మాంచెస్టర్: పేస్ బౌలర్లు ఓలీ రాబిన్సన్ (4/43), అండర్సన్ (3/30), స్టోక్స్ (2/30), బ్రాడ్ (1/24) అదరగొట్టడంతో... దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 85 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 23/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 85.1 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. పీటర్సన్ (42; 1 ఫోర్), డసెన్ (41; 5 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన స్టోక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 1–1తో సమం చేసింది. -
టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..!
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్‌గా మారాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.. తన వైవిధ్యమైన స్పిన్ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. ఇప్పటివరకు ఆడిన 3 టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్.. తన జట్టును రెండు పర్యాయాలు ఒంటిచేత్తో గెలిపించాడు. Prabath Jayasuriya in Test cricket: 6 for 118 vs Australia. 6 for 59 vs Australia. 5 for 82 vs Pakistan. 4 for 135 vs Pakistan. 3 for 80 vs Pakistan. 5 for 117 vs Pakistan. pic.twitter.com/KcZjHP4lRn — Johns. (@CricCrazyJohns) July 28, 2022 తాజాగా పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) పడగొట్టి.. తన జట్టుకు అపురూప విజయాన్నందించిన (246 పరుగుల భారీ తేడాతో ఘన విజయం) ప్రభాత్.. అంతకుముందు ఆసీస్ సిరీస్‌లో రెండో టెస్ట్‌నూ రెచ్చిపోయి (6/118, 6/59) ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న తన దేశానికి ఊరట కలిగించే విజయాన్నందించాడు. ఈ ప్రదర్శనతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ప్రభాత్.. ఆతర్వాత పాక్‌పై తొలి టెస్ట్‌లోనూ చెలరేగి 9 వికెట్లు (5/82, 4/135) సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160 నాటౌట్) సూపర్ సెంచరీతో రెచ్చిపోవడంతో పాక్ 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శక్తి వంచన లేకుండా బౌలింగ్ చేసిన ప్రభాత్‌కు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో లంక భారీ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆసీస్, పాక్ లాంటి జట్లనే వణికించిన ఈ నయా స్పిన్ సెన్సేషన్.. మున్ముందు మరిన్ని రికార్డులను బద్దలుకొడతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు -
రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు
స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య (3/80, 5/117), రమేశ్ మెండిస్ (5/47, 4/101)లు రెచ్చిపోవడంతో పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక ఘన విజయం సాధించింది. 508 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. లంక స్పిన్నర్ల ధాటికి 261 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 246 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 89/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆట మొదలైన కొద్దిసేపటికే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (49) వెనుదిరగగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (81) , వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (37)లు కాసేపు ప్రతిఘటించారు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఫవాద్ ఆలం (1), అఘా సల్మాన్ (4), మహ్మద్ నవాజ్ (12), యాసిర్ షా (27), హసన్ అలీ (11), నసీమ్ షా (18)లు లంక స్పిన్నర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్క ఫవాద్ ఆలం (రనౌట్) వికెట్ మినహా మిగిలిన వికెట్లన్నిటినీ లంక స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్లాయి. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ 231 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం శ్రీలంక 360/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. భారీ ఛేదనలో పాక్ చేతులెత్తేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన ధనంజయ డిసిల్వాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 17 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్ జయసూర్యకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. కాగా, తొలి టెస్ట్‌లో లంక నిర్ధేశించిన 342 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ సునాయాసంగా ఛేదించి రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. స్కోర్ వివరాలు.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 378 ఆలౌట్ (చండీమల్ (80), నసీమ్ షా (3/58)) పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (అఘా సల్మాన్ (62), రమేశ్ మెండిస్ (5/47)) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 360/8 డిక్లేర్ (ధనంజయ డిసిల్వా (109), నసీమ్ షా (2/44)) పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 231 (బాబర్ ఆజమ్ (81), ప్రభాత్ జయసూర్య (5/117)) చదవండి: డిసిల్వా అద్భుత శతకం.. పాక్ ఓటమి ఖాయం..! -
డిసిల్వా అద్భుత శతకం.. పాక్ ఓటమి ఖాయం..!
పాక్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ ధనంజయ డిసిల్వా (109) సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 360 పరుగుల (8 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్ధికి 508 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (46), కెప్టెన్ బాబర్ ఆజమ్ (26) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రెండో వికెట్‌కు అజేయమైన 47 పరుగులు జోడించారు. ఈ దశలో వెలుతురు లేమి కారణంగా ఆటను కాస్త ముందుగా ఆపేశారు. ఆట ముగిసే సమయానికి పాక్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. చివరి రోజు ఆటలో లంక విజయానికి 9వికెట్లు అవసరం కాగా.. పాక్ గెలుపుకు 419 పరుగులు చేయాల్సి ఉంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ను పాక్ కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు ధనంజయ డిసిల్వాకు తోడుగా కెప్టెన్ కరుణరత్నే (61), టెయిలెండర్ రమేశ్ మెండీస్ (45 నాటౌట్) రాణించడంతో శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించి ప్రత్యర్ధి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. స్కోర్ వివరాలు.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 378 ఆలౌట్ (చండీమల్ (80), నసీమ్ షా (3/58)) పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (అఘా సల్మాన్ (62), రమేశ్ మెండిస్ (5/47)) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 360/8 డిక్లేర్ (ధనంజయ డిసిల్వా (109), నసీమ్ షా (2/44)) పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 89/1 (ఇమామ్ ఉల్ హక్ (46 నాటౌట్), ప్రభాత్ జయసూర్య (1/46)) చదవండి: వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1.. ఇప్పుడు టెస్టు ఫార్మాట్లో! -
పట్టు బిగించిన శ్రీలంక.. పాక్ ముందు కొండంత లక్ష్యం
పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి ఓవరాల్‌గా 323 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కెప్టెన్ కరుణరత్నే (27), ధనంజయ (30) నిలకడగా ఆడుతూ పాక్‌కు కొండంత లక్ష్యాన్ని నిర్ధేశించే పనిలో ఉన్నారు. తొలి టెస్ట్‌లో పాక్ 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊదేసిని నేపథ్యంలో ఈసారి లంక జాగ్రత్త పడుతుంది. మరో 5 వికెట్లు చేతిలో ఉండటంతో కనీసం 450 పరుగుల టార్గెట్‌ను పాక్ ముందుంచాలని భావిస్తుంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఫలితం లంకకు అనుకూలంగా రావడం ఖాయంగా కనిపిస్తుంది. 191/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 40 పరుగులు జోడించి 231 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్ (62) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లంక స్పిన్నర్లు రమేశ్ మెండిస్ (5/47), ప్రభాత్ జయసూర్య (3/80) పాక్ పతనాన్ని శాసించారు. అంతకుముందు ఒషాడో ఫెర్నాండో (50), చండీమల్ (80), డిక్వెల్లా (51) అర్ధసెంచరీలతో రాణించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా మెంటల్ హెల్త్ కోచ్‌గా మళ్లీ అతనే..! -
తిప్పేసిన స్పిన్నర్లు.. రెండో టెస్ట్‌పై పట్టుబిగిస్తున్న లంకేయులు
తొలి టెస్ట్‌లో పాక్ చేతిలో దారుణంగా ఓడి కసితో రగిలిపోతున్న శ్రీలంక.. రెండో టెస్ట్‌పై పట్టుబిగిస్తుంది. లంక స్పిన్నర్లు రెచ్చిపోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో ఉంది. 315 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను (తొలి ఇన్నింగ్స్) ప్రారంభించిన శ్రీలంక.. మరో 63 పరుగులు జోడించి 378 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ డిక్వెల్లా (51) అర్ధసెంచరీతో రాణించగా.. రమేశ్ మెండిస్ (35) పర్వాలేదనిపించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. లంక స్పిన్నర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. తొలి టెస్ట్‌లో అజేయ శతకంతో పాక్‌ను గెలిపించిన అబ్దుల్లా షఫీక్ ఈ ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (32), కెప్టెన్ బాబర్ ఆజమ్ (16), వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (24), ఫవాద్ ఆలం (24) లు విఫలం కాగా.. మిడిలార్డర్ ఆటగాడు అఘా సల్మాన్ (62) లంక స్పిన్నర్లకు కాసేపు ఎదురొడ్డాడు. సల్మాన్‌ను ప్రభాత్ జయసూర్య అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించడంతో రెండో రోజు ఆట ముగిసింది. రమేశ్ మెండిస్ 3, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీసి పాక్‌ను కష్టాల్లోకి నెట్టారు. ప్రస్తుతం పాక్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రోజు లంక ఆటగాళ్లు ఒషాడో ఫెర్నాండో (50), చండీమల్ (80) అర్ధసెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే. చదవండి: సూపర్ ఫామ్‌ను కొనసాగించిన చండీమల్.. తొలి రోజు లంకదే పైచేయి -
సూపర్ ఫామ్‌ను కొనసాగించిన చండీమల్.. తొలి రోజు లంకదే పైచేయి
గాలే వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (జులై 24) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో లంక బ్యాటర్లు సత్తా చాటారు. కుశాల్ మెండిస్ (3) మినహా టాపార్డర్ మొత్తం రాణించడంతో తొలి రోజు శీలంకదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిధ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. పాక్ బౌలర్ల ప్రభావం నామమాత్రంగా ఉండటంతో లంక బ్యాటర్లు సత్తా చాటారు. Dinesh Chandimal scores his 4th consecutive fifty in Tests. What a purple patch he's having, just been too good. pic.twitter.com/b1mDrKM6ev — Mufaddal Vohra (@mufaddal_vohra) July 24, 2022 ఓపెనర్లు ఒషాడో ఫెర్నాండో (50), దిముత్ కరుణరత్నే (40) తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించగా.. ఆ తర్వాత వచ్చిన శతక టెస్ట్‌ల వీరుడు ఏంజెలో మాథ్యూస్ (42), ధనంజయ డిసిల్వా (33) ఓ మోస్తరుగా రాణించారు. గత కొంతకాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న దినేశ్ చండీమల్ (80) వరుసగా నాలుగో ఇన్నింగ్స్‌లోనూ (206*, 76, 94*, 80) హాఫ్ సెంచరీ బాది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆట చివరి సెషన్లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్వెల్లా (42 నాటౌట్) మెరుపు వేగంతో పరుగులు సాధించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. డిక్వెల్లాకు జతగా దునిత్ వెల్లాలగే (6) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, నౌమాన్ అలీ, యాసిర్ షా తలో వికెట్ సాధించారు. కుశాల్ మెండిస్‌ను అఘా సల్మాన్ రనౌట్ చేశాడు. చదవండి: టెస్ట్ క్రికెట్లో అరుదైన మైలురాయిని చేరుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్ -
టెస్ట్ క్రికెట్లో అరుదైన మైలురాయిని చేరుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్
టెస్ట్ క్రికెట్లో శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గాలే వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ ద్వారా మాథ్యూస్ వంద టెస్ట్‌ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో లంక తరఫున 100 టెస్ట్‌లు ఆడిన ఆరో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మాథ్యూస్‌కు ముందు మహేళ జయవర్ధనే (149), సంగక్కర (134), మురళీథరన్ (133), చమింద వాస్ (111), జయసూర్య (110) మాత్రమే లంక తరఫున వంద టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. Angelo Mathews becomes the sixth Sri Lankan player to feature in 100 Tests!#SLvPAK #SriLanka pic.twitter.com/8vtyeLZoNL — CRICKETNMORE (@cricketnmore) July 24, 2022 పాక్‌తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల వద్ద ఔటైన మాథ్యూస్ ఇప్పటివరకు ఆడిన 100 టెస్ట్‌ల్లో 45.2 సగటున 13 సెంచరీలు, 38 అర్ధసెంచరీల సాయంతో 6918 పరుగులు చేశాడు. భుజం గాయం కారణంగా టెస్ట్‌ల్లో బౌలింగ్ చేయడం మానేసిన మాథ్యూస్.. టెస్ట్ కెరీర్లో 33 వికెట్లు పడగొట్టాడు. 35 ఏళ్ల మాథ్యూస్ ఇప్పటికీ వన్డేల్లో, టీ20ల్లో లంక జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, పాక్‌తో రెండో టెస్ట్ ద్వారా అరుదైన మైలురాయిని చేరుకున్న మాథ్యూస్.. దీంతో పాటు పలు అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న వారిలో 100 టెస్ట్‌ల మార్కును అందుకున్న ఏడో ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు. జేమ్స్ అండర్సన్ (172), స్టువర్ట్ బ్రాడ్ (156), జో రూట్ (121), నాథన్ లయన్ (110), ఇషాంత్ శర్మ (105), విరాట్ కోహ్లి (102) మాథ్యూస్‌కు ముందు 100 టెస్ట్‌లు ఆడారు. 2009లో పాకిస్తాన్‌పై టెస్ట్ ఆరంగ్రేటం చేసిన మాథ్యూస్.. తన 25వ, 50వ, 100వ టెస్ట్ మ్యాచ్‌లను అదే ప్రత్యర్థిపై ఆడాడు కెరీర్లో తొలి టెస్ట్, 100వ టెస్ట్ ఒకే వేదికపై (గాలే), ఒకే ప్రత్యర్ధిపై (పాక్) ఆడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మాథ్యూస్‌కు ముందు ఈ ఫీట్‌ను విండీస్ ఆటగాడు కార్ల్ హూపర్ సాధించాడు. హూపర్.. భారత్‌పై ముంబై వేదికగా తొలి, 100వ టెస్ట్‌లను ఆడాడు. చదవండి: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..? -
కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం
ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతూ అట్టుడుకుతున్న ద్వీప దేశం శ్రీలంకకు భారీ ఊరట లభించే వార్త ఇది. గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో లంక జట్టు పటిష్టమైన కంగారూలను ఖంగుతినిపించి 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. దినేశ్ చండీమాల్ (206) అజేయ ద్విశతకంతో, అరంగేట్రం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 12 వికెట్లతో (6/118, 6/59) చెలరేగి శ్రీలంకకు చారిత్రక విజయాన్ని అందించారు. నాలుగో రోజు ఆటలో వీరిద్దరితో పాటు రమేశ్ మెండిస్ (2/47), మహీశ్ తీక్షణ (2/28) కూడా రాణించడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. 10 wicket haul on a debut ✔️Best figures by a Sri Lankan on a debut ✔️Dream debut for Prabath Jayasuriya 🤩#SLvAUS pic.twitter.com/BeAg9pMZNv— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 For his brilliant performance, Dinesh Chandimal has been named the Player of the Series 👏#SLvAUS pic.twitter.com/VZIIFDSNF1— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 జయసూర్య స్పిన్ మాయాజాలం ధాటికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. లబూషేన్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 431/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 123 పరుగులు జోడించి 554 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకుముందు స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంటే, ఆసీస్ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన శ్రీలంక.. ఆతర్వాత వన్డే సిరీస్‌ను 3-2 తేడాతో ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. చదవండి: SL Vs Aus: చండిమాల్ డబుల్ సెంచరీ.. ప్రశంసల జల్లు! ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు! -
టెస్ట్ మ్యాచ్ మధ్యలో కరోనాగా నిర్ధారణ.. బెంబేలెత్తిపోతున్న ఆటగాళ్లు
Pathum Nissanka: శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. ఆతిధ్య శ్రీలంక జట్టుకు చెందిన ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. రెండో టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఓపెనర్ పథుమ్ నిస్సంకకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కోవిడ్ బారిన పడిన లంక ఆటగాళ్ల సంఖ్య ఆరుకు చేరింది. మూడో రోజు ఆట మధ్యలో అస్వస్థతకు గురైన నిస్సంకకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. 🔴 Team Updates: Pathum Nissanka has tested positive for Covid-19. He was found to be positive during an Antigen test conducted on the player yesterday morning, following the player complaining of feeling unwell. #SLvAUS pic.twitter.com/NwTdTLOVFZ — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 దీంతో అతను మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అతని స్థానంలో ఒషాడ ఫెర్నాండో కోవిడ్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు. అంతకుముందు తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లంక స్టార్ ఆటగాడు ఏంజలో మాథ్యూస్ సైతం ఇలానే మ్యాచ్ మధ్యలో కోవిడ్ బారిన పడ్డాడు. ఆ తర్వాత జట్టు మొత్తానికి జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మరో నలుగురికి (ప్రవీణ్ జయవిక్రమ, ధనంజయ డిసిల్వ, జెఫ్రె వాండర్సే, అషిత ఫెర్నాండో) కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శ్రీలంక జట్టులో వరుసగా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నా ప్రత్యర్ధి ఆస్ట్రేలియా జట్టులో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఇదిలా ఉంటే, కోవిడ్ కేసు వెలుగుచూసినా మ్యాచ్ యధాతథంగా కొనసాగుతుంది. నాలుగో రోజు ఆటలో సెంచరీ హీరో దినేశ్ చండీమాల్ మరింత రెచ్చిపోయి డబుల్ బాదడంతో శ్రీలంకకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 431/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 123 పరుగులు జోడించి 554 పరుగుల వద్ద ఆలౌటైంది. చండీమాల్ 206 పరుగులతో అజేయంగా నిలువగా.. కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (85), ఏంజలో మాథ్యూస్ (52), కమిందు మెండిస్ (61)లు లంక భారీ స్కోర్ సాధించడంలో తమవంతు పాత్ర పోషించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4, స్వెప్సన్ 3, లయన్ 2, కమిన్స్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. లంక అరంగేట్రం బౌలర్ ప్రభాత్ జయసూర్య 6 వికెట్లతో ఆసీస్‌ను తిప్పేశాడు. చదవండి: WI Vs Ban: చేదు అనుభవాల నుంచి కోలుకుని.. బంగ్లాదేశ్ ఘన విజయం -
చండీ'క'మాల్ శతకం.. ఆసీస్‌పై లంక పైచేయి
గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శ్రీలంక పైచేయి సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ దినేశ్ చండీమాల్ అజేయ శతకంతో (118) చెలరేగడంతో ఆతిధ్య జట్టు 67 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. చండీమాల్తో పాటు రమేశ్ మెండిస్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్‌లో చండీమాల్ కాకుండా మరో నలుగురు హాఫ్‌సెంచరీలు సాధించారు. 💯Dinesh Chandimal brings up his 13th Test hundred, reaching the mark in 195 balls 🙌#SLvAUS pic.twitter.com/zLiBKUylBI— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 10, 2022 కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (85), ఏంజలో మాథ్యూస్ (52), కమిందు మెండిస్ (61)లు శ్రీలంక భారీ స్కోర్ సాధించడంలో తమవంతు పాత్ర పోషించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, మిచెల్ స్వెప్సన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. లంక అరంగేట్రం బౌలర్ ప్రభాత్ జయసూర్య 6 వికెట్లతో ఆసీస్‌ను తిప్పేశాడు. చదవండి: టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 82 పరుగులు..! -
ఆసీస్‌ను 'ఆరే'సిన జయసూర్య.. అరంగేట్రం మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన లంక స్పిన్నర్
Prabath Jayasuriya: గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో లంక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అదరగొట్టాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆరు వికెట్ల ప్రదనర్శనతో రెచ్చిపోయాడు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను తన స్పిన్ మాయాజాలంతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫలితంగా పర్యాటక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. జయసూర్య తన డెబ్యూ ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 118 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. Outstanding debut figures for Prabath Jayasuriya! 🙌#SLvAUS pic.twitter.com/Df4FcVsczk — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2022 ఓవర్‌నైట్ స్కోర్ 298/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. జయసూర్య మాయాజాలం ధాటికి మరో 66 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయింది. సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ (145 నాటౌట్) ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 36 పరుగులు జోడించి అజేయంగా నిలువగా.. మిగిలిన ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. లంక రెండో రోజు పడగొట్టిన 5 వికెట్లలో జయసూర్యకు 3 వికెట్లు దక్కాయి. లంక బౌలర్లలో జయసూర్య 6, రజిత 2, ఆర్ మెండిస్, తీక్షణ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక జట్టు లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. అంతకుముందు తొలి రోజు ఆటలో స్మిత్‌తో పాటు మార్నస్ లబుషేన్ (156 బంతుల్లో 104; 12 ఫోర్లు) సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరు మూడో వికెట్‌కు 134 పరుగులు జోడిండి ఆసీస్‌ను ఆదుకున్నారు. చదవండి: దినేశ్ కార్తీక్‌కు వింత అనుభవం.. తన డెబ్యూ మ్యాచ్‌లో ప్లేయర్ ఇప్పుడు..! -
లబుషేన్, స్మిత్ సెంచరీలు
గాలె: శ్రీలంకతో శుక్రవారం మొదలైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 298 పరుగులు సాధించింది. మార్నస్ లబుషేన్ (156 బంతుల్లో 104; 12 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (212 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. లబుషేన్ వ్యక్తిగత స్కోరు 28 వద్ద శ్రీలంక కీపర్ డిక్వెల్లా స్టంపింగ్ అవకాశాన్ని వదిలేశాడు. ఉస్మాన్ ఖాజా (37; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... వార్నర్ (5), ట్రావిస్ హెడ్ (12), కామెరాన్ గ్రీన్ (4) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. ప్రస్తుతం స్మిత్‌తో కలిసి అలెక్స్ క్యారీ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు తీయగా, కాసున్ రజిత, రమేశ్ మెండిస్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో కామిందు మెండిస్, మహీశ్ తీక్షణ, ప్రభాత్ జయసూర్య టెస్టుల్లో అరంగేట్రం చేశారు. -
వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌కు మరో షాక్
ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా రెండు టెస్ట్‌ల్లో ఓడి 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. రెండో టెస్ట్‌లో ఆడిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ కరోనా బారిన పడినట్లు న్యూజిలాండ్ క్రికెట్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దీంతో బ్రేస్‌వెల్ చివరిదైన మూడో టెస్ట్ (జూన్ 23) ఆడటం ఆనుమానంగా మారింది.బ్రేస్‌వెల్‌ను వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండేందుకు తరలించినట్లు న్యూజిలాండ్ క్రికెట్ అధికారులు ప్రకటించారు. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన కొలిన్ గ్రాండ్‌హోమ్‌కు బ్రేస్‌వెల్ రీప్లేస్‌మెంట్‌గా వచ్చాడు. BREAKING 🚨: New Zealand's Michael Bracewell has tested positive for Covid-19 following the second Test against England. pic.twitter.com/tZ3V4G57RC — Sky Sports News (@SkySportsNews) June 15, 2022 కాగా, రెండో టెస్ట్‌కు కొన్ని గంటల ముందు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా కోవిడ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. విలియమ్సన్కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ నిర్థాదరణ కావడంతో ఆఖరి నిమిషంలో రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అతను ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు.మరోవైపు రెండో టెస్ట్ సందర్భంగా మరో ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. రెండో టెస్టు ఆఖరి రోజు బౌలింగ్ చేస్తూ జేమీసన్ గాయపడ్డాడని.. అతని గాయం చాలా తీవ్రమైందని సమాచారం. దీంతో జేమీసన్ కూడా మూడో టెస్ట్ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ట్రెంట్ బ్రిడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. రసవత్తరంగా సాగిన ఈ సమరంలో ఇంగ్లండ్ బ్యాటర్లు జూలు విదిల్చి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. బెయిర్‌స్టో సూపర్ శతకంతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136), బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 75) అజేయమైన అర్ధశతకంతో చెలరేగి క్రికెట్ ప్రేమికులకు టీ20 క్రికెట్ మజాను అందించారు. చదవండి: బెయిర్‌స్టో విధ్వంసకర శతకం.. కివీస్‌పై ఇంగ్లండ్ సంచలన విజయం -
బెయిర్‌స్టో విధ్వంసకర శతకం.. కివీస్‌పై ఇంగ్లండ్ సంచలన విజయం
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టో సూపర్ శతకంతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136) చెలరేగడంతో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో చేజిక్కించుకుంది. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలుపుకు 74.3 ఓవర్లలో 299 రన్స్ చేయాల్సి ఉండగా.. బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 75 నాటౌట్), బెయిర్‌స్టో వేగంగా పరుగులు సాధించి, కేవలం 50 ఓవర్లలోనే జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఇంగ్లండ్ ధీటుగా బదులిచ్చి 539 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌కు 299 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. చదవండి: దినేశ్ కార్తీక్‌ను టీ20 ప్రపంచకప్ ఆడనివ్వను.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు -
BAN VS SL: సెంచరీలతో చెలరేగిన ముష్ఫికర్, లిటన్ దాస్
ఢాకా: శ్రీలంకతో సోమవారం మొదలైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్లకు 277 పరుగులు చేసింది. ఒకదశలో బంగ్లాదేశ్ 24 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ముష్ఫికర్ రహీమ్ (115 బ్యాటింగ్; 13 ఫోర్లు), లిటన్ దాస్ (135 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీలతో చెలరేగి బంగ్లాదేశ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 253 పరుగులు జోడించారు. -
Ind Vs Sl Test Series: లంకపై విజయఢంకా
11–0 ఇదీ రోహిత్ లెక్క! ఈ ‘హిట్‌మ్యాన్’ పూర్తిస్థాయి జట్టు పగ్గాలు చేపట్టాక... స్వదేశంలో ఇద్దరు ప్రత్యర్థులతో ఆడిన మూడు ఫార్మాట్లలోనూ భారత్ వైట్‌వాష్ చేసింది. వెస్టిండీస్‌తో మూడేసి చొప్పున టి20, వన్డేలు... తర్వాత శ్రీలంకతో మూడు టి20 పోటీలు, ఇప్పుడు రెండు సంప్రదాయ టెస్టులు అన్నింటా భారత్‌దే జయం. పాపం కరీబియన్, లంక జట్లు కనీస విజయం లేక ‘జీరో’లతో ఇంటిబాట పట్టాయి. రెండో రోజే టెస్టులో విజయానికి బాటలు వేసుకున్న భారత్ సోమవారం రెండో సెషన్లోనే లంక ఆటను ముగించడంలో సఫలమైంది. కెప్టెన్ కరుణరత్నే శతకం మినహా లంక ఈ పర్యటనలో చెప్పుకునేందుకు ఏమీ లేక వెనుదిరిగింది. బెంగళూరు: టీమిండియా బౌలింగ్ ఉచ్చులో చిక్కుకున్న శ్రీలంక మూడో రోజు రెండు సెషన్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. డేనైట్ టెస్టులో భారత్ 238 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత బ్యాటర్లలాగే బౌలర్లూ శ్రీలంక భరతం పట్టారు. 3 వికెట్లు తీసిన స్టార్ సీమర్ బుమ్రా ఈ టెస్టులో మొత్తం 8 వికెట్లను పడేశాడు. స్పిన్నర్లు అశ్విన్ (4/55), అక్షర్ పటేల్ (2/37) లంక బ్యాటర్స్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా తిప్పేశారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో వంద పైచిలుకు పరుగులకే ఆపసోపాలు పడిన లంక... కెప్టెన్ దిముత్ కరుణరత్నే (174 బంతుల్లో 107; 15 ఫోర్లు) వీరోచిత సెంచరీ పుణ్యమాని రెండో ఇన్నింగ్స్‌లో 200 పైచిలుకు పరుగులు చేయడమే ఆ జట్టుకు ఊరట. శ్రేయస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా... 120.12 స్ట్రైక్‌రేట్‌తో సిరీస్‌లో 185 పరుగులు చేసిన రిషభ్ పంత్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ మూడోరోజు 447 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు 28/1 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 59.3 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్, కెప్టెన్ కరుణరత్నే... ఇతనితో పాటు ఓవర్‌నైట్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (60 బంతుల్లో 54; 8 ఫోర్లు) ఆడినంత వరకే ఆట కనిపించింది. వీళ్లిద్దరి బౌండరీలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మెండిస్ వన్డేలాగే ధాటైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ కంటే ముందుగా 57 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ ఉన్నంతసేపు 12 ఓవర్ల పాటు బౌండరీలు, పరుగులతో స్కోరుబోర్డు కదిలింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 97 పరుగులు జతచేసింది. ఎప్పుడైతే జట్టు స్కోరు 97 వద్ద మెండిస్‌ను అశ్విన్ స్టంపౌట్ చేశాడో 9 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు పడ్డాయి. మాథ్యూస్ (1)ను జడేజా బౌల్డ్ చేయగా, ధనంజయ డిసిల్వా (4)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. డిక్వెలా (12) విఫలమయ్యాడు. మరో వైపు కరుణరత్నే 92 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తయింది మరో వికెట్ పడకుండా తొలిసెషన్ 151/4 స్కోరు వద్ద ముగిసింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికే డిక్వెలా, అనంతరం అసలంక(5) అక్షర్ పటేల్ ఉచ్చులో పడ్డారు. 166 బంతుల్లో సెంచరీ (14 ఫోర్లు) పూర్తి చేసుకున్న కరుణరత్నే అవుటయ్యాక 4 పరుగుల వ్యవధిలోనే లంక ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ తొలిఇన్నింగ్స్ 252; శ్రీలంక తొలిఇన్నింగ్స్ 109; భారత్ రెండో ఇన్నింగ్స్: 303/9 డిక్లేర్డ్; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: తిరిమన్నె (ఎల్బీ) (బి) బుమ్రా 0; కరుణరత్నే (బి) బుమ్రా 107; మెండిస్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 54; మాథ్యూస్ (బి) జడేజా 1; ధనంజయ (సి) విహారి (బి) అశ్విన్ 4; డిక్వెలా (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 12; అసలంక (సి) రోహిత్ (బి) అక్షర్ 5; ఎంబుల్డెనియా (ఎల్బీ) (బి) అశ్విన్ 2; లక్మల్ (బి) బుమ్రా 1; ఫెర్నాండో (సి) షమీ (బి) అశ్విన్ 2; జయవిక్రమ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (59.3 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–0, 2–97, 3–98, 4–105, 5–160, 6–180, 7–204, 8–206, 9–208, 10–208. బౌలింగ్: బుమ్రా 9–4–23–3, షమీ 6–0–26–0, అశ్విన్ 19.3–3–55–4, జడేజా 14–2–48–1, అక్షర్ పటేల్ 11–1–37–2. 442: టెస్టుల్లో అశ్విన్ వికెట్ల సంఖ్య. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అతను...దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ (439)ను అధిగమించి ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. -
మాతృదేశంపై సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ అరుదైన ఘనత
Usman Khawaja: కరాచీ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (127; 13 ఫోర్లు, సిక్స్) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు 3 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఖ్వాజాకు తోడుగా స్టీవ్ స్మిత్ (72) అర్ధ సెంచరీతో రాణించగా, డేవిడ్ వార్నర్ (48 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. లబూషేన్ డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్ తలో వికెట్ దక్కించుకోగా, లబుషేన్ రనౌటయ్యాడు. తొలి టెస్ట్‌లో 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న ఖ్వాజా, ఈ మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి కెరీర్లో పదో శతకాన్ని నమోదు చేశాడు. పాక్‌లోనే జన్మించిన 35 ఏళ్ల ఖ్వాజా.. తన మాతృదేశంపై సెంచరీ సాధించడంతో పాకిస్థాన్ అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఇరు జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ నిర్జీవమైన పిచ్ కారణంగా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. జీవం లేని పిచ్‌ను తయారు చేసిందుకు గాను పాక్ క్రికెట్ బోర్డుపై ఇరు దేశాల మాజీ క్రికెటర్లు, అభిమానుల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాసిరకం పిచ్‌ను తయారు చేసి టెస్టు క్రికెట్‌కున్న గొప్పతనాన్ని నాశనం చేశారంటూ దుమ్మెత్తి పోశారు. ఈ పిచ్‌పై ఐసీసీ కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్ అని.. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా నాసిరకమైన పిచ్ తయారు చేశారంటూ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే ఫైరయ్యాడు. చదవండి: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్' -
Ind Vs Sl 2nd Test: విహారికి ఛాన్స్.. మరి సిరాజ్?
India Vs Sri Lanka 2nd Test- బెంగళూరు: మూడు రోజుల్లోపే తొలి టెస్టులో శ్రీలంక ఆట ముగించిన భారత్ ఇప్పుడు అదే ప్రదర్శనను పునరావృతం చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తాజా ఫామ్, బలాబలాల దృష్ట్యా ప్రత్యర్థికంటే ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియాకు ఇక్కడా అడ్డు ఉండకపోవచ్చు. తొలి పోరులో ఘోర వైఫల్యం తర్వాత రెండో టెస్టులో లంక ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఫ్లడ్ లైట్ల వెలుగులో ‘డే అండ్ నైట్’గా గులాబీ బంతితో జరగనున్న ఈ మ్యాచ్‌కు మైదానంలో ప్రేక్షకులను 100 శాతం అనుమతిస్తుండటం చెప్పుకోదగ్గ విశేషం. సిరాజ్‌కు అవకాశం ఇస్తారా! మొహాలీలో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత సహజంగానే తుది జట్టులో మార్పులకు అవకాశం కనిపించదు. రోహిత్‌తో పాటు సొంతగడ్డపై మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. మూడో స్థానంలో హనుమ విహారికి మళ్లీ అవకాశం ఖాయం కాగా... కోహ్లి ఈ మ్యాచ్‌లోనైనా సెంచరీ సాధించి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతాడా చూడాలి. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా ఆ తర్వాత అశ్విన్ కూడా సత్తా చాటగలడు. బుమ్రా, షమీ ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించడంపై టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. అయితే ‘పింక్ బంతి’ బాగా స్వింగ్ అయ్యే అవకాశం ఉండటంతో దాదాపు సొంత మైదానంలాంటి చిన్నస్వామిలో మూడో పేసర్‌గా హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు చాన్స్ లభిస్తుందేమో చూడాలి. తుది జట్టులో ఎవరు? మొదట టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయి తొలి టెస్టులోనూ ఓడిన శ్రీలంక ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం తుది జట్టును సిద్ధం చేసుకోవడమే కష్టంగా మారింది. గత మ్యాచ్‌లో ఆడిన కుమార, నిసాంకా గాయాలతో దూరం కాగా, ఆడే అవకాశం ఉన్న చమీరా కూడా గాయపడ్డాడు. కుశాల్ మెండిస్ కోలుకోవడం ఆ జట్టుకు ఊరట. అసలంక స్థానంలో చండిమాల్‌కు అవకాశం దక్కవచ్చు. మరోసారి టీమ్ బ్యాటింగ్ సీనియర్లు కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్లపైనే ఆధారపడి ఉంది. ఎంబుల్డెనియాతో పాటు కొత్తగా వస్తున్న చమిక కరుణరత్నే భారత్‌ను ఏమాత్రం కట్టడి చేయగలరో చూడాలి. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న సురంగ లక్మల్ ఆటపై అందరి దృష్టీ ఉంది. 4:భారత్‌కు ఇది నాలుగో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్... స్వదేశంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లపై గెలిచిన భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ఓడింది. 400: మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్‌కిది 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. #TeamIndia vice-captain @Jaspritbumrah93 on the mental changes that need to be made for a Pink Ball Test.@Paytm #INDvSL pic.twitter.com/PCfrY6sJe7 — BCCI (@BCCI) March 11, 2022 -
విరాట్ కోహ్లికి పొంచి ఉన్న పెను ప్రమాదం.. మరో 43 పరుగులు చేయకపోతే..?
ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చ లేక సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి సంబంధించి ఓ అరుదైన రికార్డు ప్రమాదంలో పడింది. బెంగళూరు వేదికగా ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌లో (శ్రీలంకతో) విరాట్ మరో 43 పరుగులు చేయకపోతే టెస్ట్‌ల్లో ఆరేళ్ల తర్వాత తొలిసారిగా 50 సగటు మార్కును కోల్పోతాడు. 23rd November 2019: Virat Kohli’s 70th century. The last time he scored a ton. It’s been two years and counting… pic.twitter.com/ZwOf4Qiwrp — Prajakta (@18prajakta) November 23, 2021 ప్రస్తుతం కోహ్లి అన్ని ఫార్మాట్లలో 50కిపైగా సగటుతో(కనీసం 90 మ్యాచ్‌ల్లో) కొనసాగుతూ, ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకతో జరగబోయే రెండో టెస్ట్‌లో ఇదే రికార్డుకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కును అందుకోలేక ఇబ్బంది పడుతున్న కోహ్లి ఈ రికార్డును కూడా కోల్పోతే మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాడని విశ్లేషకులతో పాటు అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కోహ్లి 100 టెస్ట్‌ల్లో 50.35, 260 వన్డేల్లో 58.07, 97 టీ20ల్లో 51.50 సగటుతో కొనసాగుతున్నాడు. కోహ్లి తన 52వ టెస్ట్‌లో(ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో) తొలిసారిగా సుదీర్ఘ ఫార్మాట్లో 50 సగటును అందుకున్నాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 235 పరుగులు చేశాడు. ఇక టెస్ట్ ఫార్మాట్లో అతని అత్యుత్తమ సగటు 2019లో పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో కోహ్లి 254పరుగులు చేయడంతో అతని యావరేజ్ 55.10కు చేరింది. నాటి నుంచి అది తగ్గుతూ వస్తూ ప్రస్తుతం 50 దిగువకు పడిపోయే ప్రమాదంలో పడింది. కోహ్లి చివరిసారిగా 2019లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో సెంచరీ (70వ శతకం) చేశాడు. ఆ టెస్ట్ తర్వాత 28 నెలల కాలంలో కోహ్లి తానాడిన 29 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 28.75 సగటుతో పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో కోహ్లి కేవలం 45 పరుగులు మాత్రమే చేసి అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. చదవండి: మటన్ రోల్స్ తినేందుకు వెళ్లి చిక్కుల్లో పడిన విరాట్ కోహ్లి..! -
IND VS SL 2nd Test: టీమిండియా కెప్టెన్ ఖాతాలో చేరనున్న మరో అరుదైన రికార్డు
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరబోతుంది. మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌తో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో 400 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించనున్న 35వ అంతర్జాతీయ క్రికెటర్‌గా, 9వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లతో టాప్‌లో ఉండగా, లంక మాజీ ప్లేయర్లు మహేల జయవర్థనే (652), సంగక్కర (594), జయసూర్య (586) వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో ఉన్నారు. భారత్ తరఫున సచిన్ తర్వాత ధోని (538), రాహుల్ ద్రవిడ్ (509), విరాట్ కోహ్లి (457), మహ్మద్ అజహారుద్దీన్ (433), సౌరవ్ గంగూలీ (424), అనిల్ కుంబ్లే (403), యువరాజ్ సింగ్ (402) రోహిత్ (399) కంటే ముందున్నారు. 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్.. తన 15 ఏళ్ల కెరీర్లో 44 టెస్ట్ మ్యాచ్‌లు, 230 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. ఈ క్రమంలో 41 సెంచరీలు, 84 హాఫ్ సెంచరీల సాయంతో 15672 పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగే రోహిత్.. ఈ ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లు (125), అత్యధిక పరుగులు (3313) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. చదవండి: Rohit Sharma: కలలో కూడా ఊహించలేదు: రోహిత్ శర్మ భావోద్వేగం -
ఎగిరెగిరిపడకండి.. ఇంకో మ్యాచ్ ఉంది.. సఫారీలకు బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్
Bumrah Warning To South Africa Players Recorded In Stump Mic: జొహానెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఫలితంగా మూడు టెస్ట్‌ల సిరీస్‌లో చెరో విజయంతో ఇరు జట్లు సమానంగా నిలిచాయి. కేప్ టౌన్ వేదికగా జనవరి 11న నిర్ణయాత్మక మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ నాలుగో రోజు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియా వైరలవుతోంది. దక్షిణాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా కొట్టిన ఓ బంతి హనుమ విహారి చేతికి బలంగా తాకడంతో ఫిజియో నితిన్ పటేల్ మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. ఈ సమయంలో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. సఫారీలను ఉద్దేశంచి చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. "ఎంత ఎగురుతారో ఎగరండి, మరో మ్యాచ్ ఉంది, మేమేంటో చూపిస్తాం.." అంటూ బుమ్రా చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. We will be back pic.twitter.com/J4nL7mxtqd — Subash (@subashpoudel905) January 6, 2022 ఇదిలా ఉంటే, ఇప్పటివరకు దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో టీమిండియా పేసు గుర్రం బుమ్రా కేవలం ఆరు వికెట్లు మాత్రమే పడగొట్టి టీమిండియా అభిమానులను దారుణంగా నిరుత్సాహపరిచాడు. ఓ పక్క దక్షిణాఫ్రికా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుండగా భారత సీమర్లు మాత్రం నామమాత్రంగా రాణిస్తున్నారు. సఫారీ పేసర్లు రబాడా 13 వికెట్లు, మార్కో జన్సెన్ 12, ఎంగిడికి 11 వికెట్లు పడగొట్టగా.. భారత బౌలర్లు షమీ 11, శార్దూల్ ఠాకూర్ 10, అశ్విన్, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీశారు. -
కేఎల్ రాహుల్ వల్లే టీమిండియా ఓడింది..!
టీమిండియా తాత్కాలిక టెస్ట్ సారధి కేఎల్ రాహుల్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. జొహానెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో జట్టు ఓటమికి రాహుల్ కెప్టెన్సీ వైఫల్యమే కారణమని మండిపడ్డాడు. రాహుల్ చెత్త నిర్ణయాల వల్లే టీమిండియా ఓటమిపాలైందని ఫైరయ్యాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్(ఛేదన)లో రాహుల్ ఫీల్డ్ సెటప్ దారుణంగా ఉందని, అతని అనుభవరాహిత్యం కారణంగా భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆరోపించాడు. సాధారణంగా బంతిని హుక్ చేయని ఎల్గర్‌కు డీప్‌లో ఫీల్డర్లను మొహరించి, రాహుల్ చాలా పెద్ద తప్పిదం చేశాడని, దీన్ని సద్వినియోగం చేసుకున్న ఎల్గర్ సులభంగా సింగిల్స్ రాబట్టి క్రీజులో పాతుకుపోయాడని అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సన్నీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, వెనునొప్పి కారణంగా ఆఖరి నిమిషంలో కోహ్లి తప్పుకోవడంతో రెండో టెస్ట్‌లో కేఎల్ రాహుల్ టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ (188 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా మూడు దశాబ్దాల కలకు బ్రేకులు పడ్డాయి. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టెస్ట్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: కోహ్లికి బ్యాటింగ్‌లో విఫలమయ్యే హక్కు ఉంది.. -
మీ అరుపులకు గుండెపోటు వచ్చేలా ఉంది.. టీమిండియా ఆటగాళ్లపై అంపైర్ అసహనం
జొహనెస్‌బర్గ్: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో టీమిండియా 266 పరుగులకు ఆలౌటై ఆతిధ్య జట్టుకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. అయితే వర్షం కారణంగా నాలుగో రోజు ఆటకు అంతరాయం ఏర్పడడంతో ఇరు జట్ల ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. వరుణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడితే తప్ప మ్యాచ్ ఫలితాన్ని ఎవరూ ఆపలేరు. Marais Erasmus 🤣 pic.twitter.com/xAC0yT8Uef — Benaam Baadshah (@BenaamBaadshah4) January 5, 2022 ఇదిలా ఉంటే, మూడో రోజు ఆటలో టీమిండియా బౌలింగ్ చేస్తున్న సందర్భంగా చోటు చేసుకున్న ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 10వ ఓవర్లో మార్క్రమ్కు బౌలింగ్ చేస్తున్న శార్ధూల్.. పదే పదే ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ మరియాస్ ఎరాస్మస్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అతను టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి.. ‘మీ అప్పీలకు గుండెపోటు వచ్చేలా ఉంది..’ అంటూ గొణిగాడు. ఈ వ్యాఖ్యలు వికెట్లకు అమర్చిన మైక్‌లో రికార్డు కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, అంతకుముందు బుమ్రా, జన్సెన్ల మధ్య వాగ్వాదం సందర్భంగా కూడా ఎరాస్మస్ ఇద్దరికి సర్ధి చెప్పడం మనం చూసాం. చదవండి: జబర్దస్త్ కెప్టెన్ ఎల్గర్.. కేవలం తన గురించే: పంత్ కామెంట్స్ వైరల్ -
టెంపర్ కోల్పోయిన బుమ్రా.. ఆరున్నర అడుగుల బౌలర్‌పైకి దూసుకెళ్లాడు..!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా పేసర్ బుమ్రా.. ఆరున్నర అడుగుల దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జన్సెన్పైకి దూసుకెళ్లాడు. భారత రెండో ఇన్నింగ్స్ 54వ ఓవర్లో చోటు చేసుకున్న ఘటనలో ఈ ఇద్దరు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు బాహాబాహికి దిగినంత పని చేశారు. అయితే అంపైర్ జోక్యంతో ఇద్దరు సర్దుకుపోయారు. pic.twitter.com/g3g0gjZnHo — Addicric (@addicric) January 5, 2022 వివరాల్లోకి వెళితే.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 230/8 వద్ద ఉండగా జన్సెన్.. బుమ్రాను టార్గెట్ చేస్తూ వరుస బౌన్సర్లను సంధించాడు. ఈ క్రమంలో వరుసగా కొన్ని బంతులు బుమ్రా శరీరాన్ని బలంగా తాకాయి. దీంతో చిర్రెతిపోయిన భారత పేసు గుర్రం.. జన్సెన్ వైపు దూసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఇరువురు మాటామాటా అనుకున్నారు. అయితే అంపైర్ సర్ధిచెప్పడంతో ఇద్దరు మిన్నకుండిపోయారు. ఈ కోపంతో రబాడ వేసిన మరుసటి ఓవర్లో బుమ్రా సిక్సర్ బాదాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, ఇంగ్లండ్ సిరీస్‌లోనూ బుమ్రా- ఆండర్సన్‌ల మధ్య ఇలాంటి బాహాబాహి సన్నివేశాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, మూడో రోజు ఆటలో టీమిండియా నిర్ధేశించని 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు.. ఆఖరి సెషన్ ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. చదవండి: Ind vs Sa: కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై వివాదం... కెప్టెన్ల మధ్య వాగ్వాదం.. వైరల్! -
కుంబ్లే సరసన శార్దూల్.. అరుదైన ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు
IND Vs SA 2nd Test Day 2: దక్షిణాఫ్రికాతో జొహనెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో చెలరేగాడు. రెండో రోజు లంచ్ విరామానికి ముందు స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టిన అతను.. రెండో సెషన్లోనూ వరుస ఓవర్లలో రెండు వికెట్లు సాధించి తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. దీంతో జొహనెస్‌బర్గ్ వేదికగా ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ వేదికపై భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే (6/53) తొలుత ఈ ఫీట్‌ను నమోదు చేయగా, ఆతర్వాత జవగళ్ శ్రీనాథ్ (5/104), శ్రీశాంత్ (5/40), జస్ప్రీత్ బుమ్రా (5/54), మహ్మద్ షమీ (5/29)లు ఈ మార్క్‌ని అందుకున్నారు. తాజాగా శార్దూల్ (5/37) వీరి సరసన చేరాడు. కెరీర్లో ఆరో టెస్ట్ ఆడుతున్న శార్ధూల్‌కి ఇదే తొలి 5 వికెట్ల ఘనత కావడం విశేషం. ఇదిలా ఉంటే, రెండో రోజు ఆటలో శార్ధూల్ చెలరేగడంతో టీమిండియా పట్టుబిగించింది. టీ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. క్రీజ్‌లో జన్సెన్(2), కేశవ్ మహారాజ్(11) ఉన్నారు. శార్ధూల్‌తో పాటు షమీ(2/52) కూడా రాణించాడు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Sa: అనవసరంగా బలైపోయాం.. కెప్టెన్ రాహుల్ అతడిని వెనక్కి పిలవొచ్చు! -
బ్యాటింగ్ తడబడింది
కఠినమైన పిచ్‌పై భారత జట్టు రోజంతా నిలవలేకపోయింది. సఫారీ బౌలర్లు పరిస్థితులను సమర్థంగా వాడుకొని టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. కేఎల్ రాహుల్, అశ్విన్ పట్టుదలగా ఆడినా ఇతర బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే ఆ తర్వాత మన బౌలర్లు కూడా ప్రభావం చూపడంతో 18 ఓవర్ల పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రెండో రోజూ ఇదే ఒత్తిడిని కొనసాగిస్తే భారత్ సాధించిన 202 పరుగులు కూడా విజయానికి బాటలు వేయవచ్చు. మూడేళ్ల క్రితం ఇదే మైదానంలో మొదటి ఇన్నింగ్స్‌లో 187 పరుగులు చేసి కూడా టీమిండియా గెలవగలగడం మానసికంగా ప్రేరణనిచ్చే అంశం! జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో సోమవారం మొదలైన రెండో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్ వైఫల్యంతో మన ఇన్నింగ్స్ 63.1 ఓవర్లకే ముగిసింది. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (133 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... అశ్విన్ (50 బంతుల్లో 46; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. కీగన్ పీటర్సన్ (14 బ్యాటింగ్), డీన్ ఎల్గర్ (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 167 పరుగులు వెనుకబడి ఉంది. పుజారా, రహానే విఫలం... ఆట తొలి గంటలో 36 పరుగులు చేసిన భారత్ బ్రేక్ ముగిసిన వెంటనే తొలి బంతికే మయాంక్ అగర్వాల్ (26) వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో 13 పరుగుల తర్వాత జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. ఫామ్‌లో లేని పుజారా (3), రహానే (0)లను ఒలీవియర్ వరుస బంతుల్లో పెవిలియన్ పంపించాడు. ఈ దశలో రాహుల్, విహారి (53 బంతుల్లో 20; 3 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడటంతో తొలి సెషన్ తర్వాత భారత్ స్కోరు 53/3 వద్ద నిలిచింది. అయితే లంచ్ తర్వాత 9 పరుగుల వద్ద బవుమా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన విహారి దానిని ఉపయోగించుకోలేకపోయాడు. రబడ బౌలింగ్‌లో అనూహ్యంగా లేచిన బంతిని విహారి ఆడబోగా, షార్ట్‌లెగ్‌లో వాన్ డర్ డసెన్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. అర్ధసెంచరీ సాధించిన వెంటనే రాహుల్ వెనుదిరగ్గా... పంత్ (17), శార్దుల్ (0) ప్రభావం చూపలేకపోయారు. అయితే అశ్విన్ పట్టుదలగా ఆడి జట్టు కుప్పకూలిపోకుండా కాపాడాడు. టీ విరామ సమయానికి 21 బంతులు ఆడిన అశ్విన్ 4 ఫోర్లతో 24 పరుగులు చేయడం విశేషం. మూడో సెషన్లో భారత్ ఇన్నింగ్స్ మరో 12.1 ఓవర్ల పాటు సాగింది. చూడచక్కటి షాట్లు ఆడిన అశ్విన్ అర్ధ సెంచరీ చేజార్చుకోగా, రబడ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన బుమ్రా (14 నాటౌట్) భారత్ స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్క్రమ్ (7)ను ఆరంభంలోనే అవుట్ చేసి షమీ దెబ్బ కొట్టగా... ఎల్గర్, పీటర్సన్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. బుమ్రా బౌలింగ్‌లో 12 పరుగుల వద్ద పీటర్సన్ మొదటి స్లిప్‌లోకి సులువైన క్యాచ్ ఇవ్వగా... కీపర్ పంత్ అడ్డుగా వెళ్లి దానిని అందుకునే ప్రయత్నంలో వదిలేయడంతో సఫారీ టీమ్ ఊపిరి పీల్చుకుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) రబడ (బి) జాన్సెన్ 50; మయాంక్ (సి) వెరీన్ (బి) జాన్సెన్ 26; పుజారా (సి) బవుమా (బి) ఒలీవియర్ 3; రహానే (సి) పీటర్సన్ (బి) ఒలీవియర్ 0; విహారి (సి) డసెన్ (బి) రబడ 20; పంత్ (సి) వెరీన్ (బి) జాన్సెన్ 17; అశ్విన్ (సి) పీటర్సన్ (బి) జాన్సెన్ 46; శార్దుల్ (సి) పీటర్సన్ (బి) ఒలీవియర్ 0; షమీ (సి అండ్ బి) రబడ 9; బుమ్రా (నాటౌట్) 14; సిరాజ్ (సి) వెరీన్ (బి) రబడ 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (63.1 ఓవర్లలో ఆలౌట్) 202. వికెట్ల పతనం: 1–36, 2–49, 3–49, 4–91, 5– 116, 6–156, 7–157, 8–185, 9–187, 10–202. బౌలింగ్: రబడ 17.1–2–64–3, ఒలీవియర్ 17–1–64–3, ఎన్గిడి 11–4–26–0, జాన్సెన్ 17–5–31–4, కేశవ్ మహరాజ్ 1–0–6–0. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (బ్యాటింగ్) 11; మార్క్రమ్ (ఎల్బీ) (బి) షమీ 7; పీటర్సన్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో వికెట్ నష్టానికి) 35. వికెట్ల పతనం: 1–14. బౌలింగ్: బుమ్రా 8–3–14–0, షమీ 6–2–15–1, సిరాజ్ 3.5–2–4–0, శార్దుల్ 0.1–0–0–0. -
IND Vs SA 2nd Test: ఆరు టెస్ట్‌లు, ఆరుగురు వేర్వేరు కెప్టెన్లు..!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌కు వేదికైన జొహనెస్‌బర్గ్‌లో టీమిండియాకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఈ వేదికపై టీమిండియా ఇప్పటి వరకు ఆడిన ఆరు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆరుగురు వేర్వేరు కెప్టెన్లతో బరిలో దిగింది. 1992లో తొలిసారి భారత జట్టు ఈ వేదికపై ఆడినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం వహించగా..1997లో సచిన్ టెండూల్కర్, 2006లో రాహుల్ ద్రవిడ్, 2013లో ధోని, 2018లో విరాట్ కోహ్లి కెప్టెన్లుగా వ్యవహరించారు. ప్రస్తుత మ్యాచ్‌లో కోహ్లి అనూహ్యంగా తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో చిక్కుకుంది. తొలి రోజు టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(133 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(37 బంతుల్లో 26; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. పుజారా(3), రహానే(0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. కోహ్లి స్థానంలో జట్టులోకి వచ్చిన విహారి(53 బంతుల్లో 20; 3 ఫోర్లు) నిలదొక్కుకునే సమయంలో అవుటయ్యాడు. క్రీజ్‌లో అశ్విన్(21 బంతుల్లో 24; 4 ఫోర్లు), పంత్(32 బంతుల్లో 13; ఫోర్) ఉన్నారు. సఫారీ బౌలర్లలో ఒలివర్, జన్సెన్ తలో రెండు వికెట్లు, రబాడ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: రహానే వికెట్‌తో రికార్డుల్లోకెక్కిన సఫారీ బౌలర్ -
రహానే వికెట్‌తో రికార్డుల్లోకెక్కిన సఫారీ బౌలర్
వాండరర్స్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ లంచ్ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. రాహుల్(74 బంతుల్లో 19; 4 ఫోర్లు), విహారి(12 బంతుల్లో 4) క్రీజ్‌లో ఉన్నారు. మయాంక్ అగర్వాల్ (37 బంతుల్లో 26; 5 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించినా, పుజారా (3), రహానే (0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్ ఒలివర్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత ఇన్నింగ్స్ 24వ ఓవర్ మూడో బంతికి పుజారాను ఔట్ చేసిన అతను.. నాలుగో బంతికి రహానేను గోల్డెన్ డక్‌గా వెనక్కు పంపాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఒలీవర్ 1486 బంతుల్లో 50 వికెట్ల మార్కును చేరుకోగా.. దక్షిణాఫ్రికాకే చెందిన వెర్నాన్ ఫిలాండర్ 1240 బంతుల్లోనే ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ లీ (1844), న్యూజిలాండ్ బౌలర్ కైల్ జెమీసన్ (1865), ఫ్రాంక్ టైసన్ (1880), షేన్ బాండ్ (1943) ఉన్నారు. చదవండి: ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ను కాదని విహారి ఎందుకు..? -
ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ను కాదని విహారి ఎందుకు..?
వాండరర్స్: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్నునొప్పి కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో తాత్కాలిక సారధిగా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జట్టు యాజమాన్యం కోహ్లి స్థానాన్ని ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో కాకుండా హనుమ విహారితో భర్తీ చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తున్న వేళ బీసీసీఐ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు రోజు అయ్యర్.. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, అందుకే రెండో టెస్ట్ సెలక్షన్‌కి అతను అందుబాటులో లేడని వివరించింది. దీంతో విదేశాల్లో ఆడిన అనుభవం ఉన్న విహారి.. కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడని పేర్కొంది. కాగా, విహారి.. సరిగ్గా ఏడాది తర్వాత అనూహ్యంగా తిరిగి జట్టులోకి రావడం విశేషం. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో(జనవరిలో జరిగిన సిడ్నీ టెస్ట్‌లో) విహారి చివరిసారి టీమిండియా తరఫున ఆడాడు. మరోవైపు అరంగేట్రం టెస్టులోనే సెంచరీ, హాఫ్ సెంచరీతో అదరగొట్టిన అయ్యర్.. మరో అవకాశం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు లంచ్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. పుజారా(3), రహానే(0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. మయాంక్(37 బంతుల్లో 26; 5 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించినా నిలదొక్కుకునే సమయంలో అవుటయ్యాడు. క్రీజ్‌లో రాహుల్(74 బంతుల్లో 19; 4 ఫోర్లు), విహారి(12 బంతుల్లో 4) ఉన్నారు. సఫారీ బౌలర్లలో ఒలివర్ 2, జన్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: రానున్న దశాబ్ద కాలం రాహుల్‌దే.. కెప్టెన్‌గా అతనికి తిరుగుండదు..! -
రానున్న దశాబ్ద కాలం రాహుల్‌దే.. కెప్టెన్‌గా అతనికి తిరుగుండదు..!
వాండరర్స్: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చివరి నిమిషంలో అనూహ్యంగా తప్పుకోవడంతో తాత్కాలిక సారధిగా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్‌పై భారత మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశంసల వర్షం కురింపించాడు. రాహుల్ ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా అద్భుతంగా రాణిస్తున్నాడని, టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టేందుకు అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని పొగడ్తలతో ముంచెత్తాడు. రానున్న దశాబ్ద కాలం రాహుల్‌దేనని కొనియాడాడు. భవిష్యత్తులో అతను తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్లు కోహ్లి(టెస్ట్), రోహిత్(వన్డే, టీ20)ల గైర్హాజరీలో రాహుల్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. టెక్నిక్‌తో పాటు దూకుడును ప్రదర్శించడంలో రాహుల్ దిట్ట అని.. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ దశలో కొనసాగుతున్నాడని, ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో అతనికి తిరుగుండదని ఆకాశానికెత్తాడు. బ్యాటర్‌గానే కాకుండా సారధిగా కూడా అతను ఇదివరకే నిరూపించుకున్నాడని, ఐపీఎల్లో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరంచిన తీరే ఇందుకు నిదర్శమన్నాడు. భవిష్యత్తులో రాహుల్‌ను అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే.. జట్టును తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో పాటు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు నెలకొల్పుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లి స్ధానంలో విహారి జట్టులోకి వచ్చాడు. తొలి రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. పుజారా(3), రహానే(0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. మయాంక్(37 బంతుల్లో 26; 5 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించినా నిలదొక్కుకునే సమయంలో అవుటయ్యాడు. క్రీజ్‌లో రాహుల్(74 బంతుల్లో 19; 4 ఫోర్లు), విహారి(12 బంతుల్లో 4) ఉన్నారు. సఫారీ బౌలర్లలో ఒలివర్ 2, జన్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. ఇది ప్రతి ఆటగాడి కల! -
ఇది గెలిస్తే... ప్రపంచాన్నే గెలిచినట్లు
‘టీమిండియా ఇంట్లో పులి... విదేశాల్లో పిల్లి’ అనే వ్యాఖ్య ఏళ్ల తరబడి భారత క్రికెట్ జట్టు ఘనవిజయాలను తక్కువ చేసేది. ఇప్పుడదే విమర్శకులు ‘భారత్ ఇంట్లో పులి... విదేశాల్లో బెబ్బులి’ అనే స్థాయికి టీమిండియా ఎదిగింది. ఇదంతా ఒక్క రోజులో రాలేదు. ఒకరిద్దరితో సాకారమవ్వలేదు. భారత్ పేసర్లు మన స్పిన్నర్లకు దీటుగా కొన్నేళ్లుగా శ్రమించడం వల్లే సాధ్యమైంది. ఇప్పుడు కూడా పేసర్ల ప్రతాపంతో ‘వాండరర్స్’లో ఈ ఒక్కటీ గెలిస్తే భారత టెస్టు చరిత్ర ఘనచరితగా మారనుంది. అంతర్జాతీయ టెస్టుల్లో విదేశీ పర్యటనల్లో అన్నింటా టెస్టు సిరీస్‌లు సాధించిన జట్టుగా నిలువనుంది. జొహన్నెస్‌బర్గ్: టెస్టుల్లో ‘గ్రేటెస్ట్’ అయ్యే అరుదైన అవకాశం కోహ్లి సేన ముందర ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)కు మించిన చరిత్ర లిఖించేందుకు ఒకే ఒక్క గెలుపు చాలు. ఈ దెబ్బకు సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ విజయమే కాదు... ప్రపంచ టెస్టు చరిత్రలో అన్ని దేశాలపై వారి సొంతగడ్డపై సిరీస్ విజయం సాధించిన అద్వితీయ రికార్డును భారత జట్టు సొంతం చేసుకుంటుంది. ఇంతకుముందే ఇంగ్లండ్, న్యూజిలాండ్ సహా ఆస్ట్రేలియాను కంగారూ పెట్టించినప్పటికీ దక్షిణాఫ్రికాపై మాత్రం దశాబ్దాలుగా సమర శంఖం పూరిస్తున్నా గెలిచే అవకాశం టీమిండియాకు దక్కలేదు. ఇప్పుడా సువర్ణావకాశం చేజిక్కించుకునేందుకు వాండరర్స్ మైదానం ఆహ్వానిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి రెండో టెస్టు జరుగుతుంది. ఇందులో విరాట్ సేన విజయం సాధిస్తే మూడో టెస్టు దాకా సిరీస్ ఫలితం కోసం ఎదురు చూడాల్సిన పనే ఉండదు. సిరీస్ విజేతగా మరో చరిత్రను ఇక్కడే లిఖించవచ్చు. ఆత్మ విశ్వాసంతో భారత్... తొలి టెస్టు విజయం, సీమర్ల బలం భారత్‌ను పటిష్టస్థితిలో నిలిపింది. అలాగని బ్యాటింగ్‌లో తక్కువేం లేదు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌ల ఓపెనింగ్ జోడీకి ఫామ్‌లోకి వచ్చిన రహానే అనుభవం తోడయ్యింది. దీంతో భారత్ జట్టులో కండబలమే కాదు... గుండె బలం కూడా పెరిగిందని గట్టిగా చెప్పొచ్చు. పైగా వాండరర్స్‌లో ఏన్నడూ ఒడింది కూడా లేదు. ఇక్కడ ఐదు మ్యాచ్‌లాడిన భారత్ రెండు గెలిచి, మరో మూడు టెస్టుల్ని ‘డ్రా’గా ముగించింది. ఈ నేపథ్యంలో 2022 ఏడాదిలో కూడా మనకు శుభారంభం ఖాయమనుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్ దళం మునుపెన్నడూ లేనంత దుర్భేద్యంగా తయారైంది. ఇంటాబయటా... వేదిక ఏదైనా మన పేసర్లకు ఎదురే లేకుండా పోతోంది. హైదరాబాదీ సీమర్ సిరాజ్... అనుభవజ్ఞులైన షమీ, బుమ్రాలతో పోటీపడి మరీ కీలక వికెట్లను పడగొట్టడం టీమిండియా సంతోషాన్ని రెట్టింపు చేసింది. బ్యాటింగ్‌లో కోహ్లి, పుజారా, రిషభ్ పంత్‌లు రాణిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకుండదు. కానీ ఇక్కడ ప్రత్యర్థి కంటే వాతావరణంతోనే సమస్య ఎదురుకానుంది. టెస్ట్ జరిగే ఐదు రోజుల్లో నాలుగు రోజులపాటు వర్షం ముప్పు పొంచి ఉండటం కాస్త ఆందోళన పరిచే అంశం. డికాక్ చేసిన గాయంతో... ఉన్నపళంగా సిరీస్ మధ్యలోనే సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ చేసిన రిటైర్మెంట్ గాయం జట్టు గత టెస్టు పరాజయానికంటే ఎక్కువగా ఉంది. అనుభవజ్ఞుల కొరతతో తల్లడిల్లుతున్న దక్షిణాఫ్రికా జట్టు పాలిట ఇది మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. తొలి టెస్టులో కెప్టెన్ ఎల్గర్ చక్కని పోరాటం చేశాడు. ఇతనికి మార్క్రమ్ తోడయితేనే శుభారంభమైనా... ఇంకేదైనా! లేదంటే ఆరంభంలోనే తడబడితే భారత సీమర్లు... తమకు కలిసొచ్చే బౌన్సీ వికెట్‌పై సఫారీ బ్యాటర్స్‌ను త్వరగానే కట్టేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జట్టు ఒకరిద్దరిపై ఆధారపడితే కుదరనే కుదరదు. సిరీస్ పోరాటం ఆఖరి టెస్టుదాకా సాగాలంటే కచ్చితంగా ఎల్గర్ సేన సమష్టిగా పోరాడాల్సిందే. బ్యాటింగ్‌లో బవుమా, వాన్ డెర్ డసెన్ బాధ్యత పంచుకోవాలి. బౌలింగ్‌లో నోర్జే గైర్హాజరీ లోటే అయినా ఎన్గిడి, రబడ, ఒలివర్ చక్కని ప్రభావం చూపుతున్నారు. తమకు కంచుకోటలాంటి ‘సెంచూరియన్’లో ఎదురైన చేదు ఫలితానికి గట్టి బదులు తీర్చుకోవాలంటే తప్పకుండా సీమర్లంతా సర్వశక్తులు ఒడ్డాలి. భారత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌కు తూట్లు పొడిస్తేనే సఫారీ ఆటలు వాండరర్స్‌లో సాగుతాయి. లేదంటే సెంచూరియన్ కథే పునరావృతమైన ఆశ్చర్యం లేదు. పిచ్, వాతావరణం వాండరర్స్ అంటేనే పేస్, బౌన్సీ వికెట్. గత మ్యాచ్‌లాగే ఇక్కడా సీమర్లు మ్యాచ్ విన్నర్లు కావొచ్చు. ఈ నేపథ్యంలో బ్యాటర్స్‌కు సవాళ్లు తప్పవు. అయితే వర్షం ముప్పు మ్యాచ్‌పై ఆందోళన పెంచుతోంది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, మయాంక్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, శార్దుల్, షమీ, బుమ్రా, సిరాజ్. దక్షిణాఫ్రికా: ఎల్గర్ (కెప్టెన్), మార్క్రమ్, పీటర్సన్, డసెన్, బవుమా, కైల్ వెరినె, ముల్డర్/జాన్సెన్, రబడ, కేశవ్ మహరాజ్, ఒలీవర్, ఎన్గిడి. -
రెండో టెస్ట్‌కు ముందు నాలుగు రికార్డులపై కన్నేసిన కోహ్లి
వాండరర్స్: దక్షిణాఫ్రికాతో రేపటి(జనవరి 3) నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లిని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్నందించిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కడంతో పాటు టెస్ట్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఆసీస్ దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా(41) సరసన నిలుస్తాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 40 టెస్ట్ విజయాలున్నాయి. ఇక వ్యక్తిగత రికార్డుల విషయానికొస్తే.. వాండరర్స్‌లో కోహ్లి తానాడిన రెండు మ్యాచ్‌ల్లో 310 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు జాన్ రీడ్ 316 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. రేపటి మ్యాచ్‌లో విరాట్ మరో ఏడు పరుగులు చేస్తే రీడ్ రికార్డును బద్దలు కొడతాడు. 2013లో జరిగిన మ్యాచ్‌లో(119, 96) అదరగొట్టిన ఈ రన్ మెషీన్.. 2018 పర్యటనలో (54, 41) సైతం రాణించాడు. దీంతో పాటు ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న మరో రికార్డుపై సైతం కోహ్లి కన్నేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్(11 మ్యాచ్‌లు, 624 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. కోహ్లి(6 మ్యాచ్‌ల్లో 611 పరుగులు) మరో 14 పరుగులు చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని భావిస్తున్నాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్ సచిన్ (15 మ్యాచ్‌ల్లో 1161 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా, సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా భారీ విజయాన్ని సాధించి, మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియాకు షాకివ్వడమే గతేడాదికి అత్యుత్తమం.. పాక్ కెప్టెన్ -
Ashes 2nd Test: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన ఘనత..
Australia vs England: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 150 మ్యాచ్‌లు ఆడిన మూడో ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బ్రాడ్‌కు ముందు జేమ్స్ ఆండర్సన్(167 టెస్ట్‌లు), అలిస్టర్ కుక్(161) ఇంగ్లండ్ తరఫున ఈ ఘనతను సాధించారు. Congratulations on an incredible achievement, @StuartBroad8! 👏#Ashes | 🇦🇺 #AUSvENG 🏴 pic.twitter.com/ySqWgT2Dcb — England Cricket (@englandcricket) December 16, 2021 ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్(200) పేరిట ఉండగా.. బ్రాడ్ 10వ స్థానంలో నిలిచాడు. 35 ఏళ్ల బ్రాడ్ ప్రస్తుతం 525 అంతర్జాతీయ టెస్ట్ వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్(708), జేమ్స్ ఆండర్సన్(632)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రసుత్తం ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లబూషేన్ (95 నాటౌట్), తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ (18 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(95) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్, బ్రాడ్‌కు తలో వికెట్ పడగొట్టారు. చదవండి: విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్‌గా ‘టెన్’ రికార్డు
ఒకటి, రెండు, మూడు, నాలుగు... భారత ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నారు... న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ వికెట్ల లెక్క కూడా మారుతోంది... తొలి రోజు ఆట ముగిసేసరికి పడిన నాలుగు వికెట్లూ అతని ఖాతాలోనే... ఎజాజ్ సంబరపడ్డాడు. తాను పుట్టిన ఊర్లో ఒక గుర్తుంచుకునే ప్రదర్శన వచ్చినందుకు అందరి ముందు సంతోషాన్ని ప్రదర్శించాడు. శనివారం ఉదయం సాహా అవుట్ కాగానే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత... ఇదీ చెప్పుకోదగ్గ విశేషమే! తర్వాతి బంతికే ఆరో వికెట్. కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కూడా వచ్చేసింది. టెస్టుల్లో భారత జట్టు తొలి ఆరు వికెట్లు ఒక స్పిన్నర్‌కు కోల్పోవడం ఇదే తొలిసారి. అయినా సరే అద్భుతం జరగవచ్చని ఎవరూ ఊహించడం లేదు. ‘ఆ ఘనత’ సాధ్యమా అనే చర్చ కూడా వినిపించలేదు. దాదాపు 28 ఓవర్ల పాటు మరో వికెట్ పడకపోవడంతో ఎజాజ్ బౌలింగ్‌పై విశ్లేషణ కూడా దాదాపుగా ఆగిపోయింది. కానీ ఎజాజ్ మాత్రం యంత్రంలా అలుపెరుగకుండా బౌలింగ్ చేస్తూనే పోయాడు. మయాంక్ వికెట్‌తో ఒక్కసారిగా కదలిక... ఏదైనా సాధ్యమే అనిపించింది! కొద్ది సేపటి తర్వాత ఆ సమయం రానే వచ్చింది. 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు... అంతే! పదికి పది.. ఎజాజ్ యూనుస్ పటేల్ టెస్టు క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 144 ఏళ్లు... 2,438 టెస్టుల చరిత్రలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. పాతికేళ్లు తిరిగే సరికి... శుక్రవారం తొలి రోజు 4 వికెట్లు తీసిన ఎజాజ్ పటేల్ ఆట ముగిసిన తర్వాత వాంఖెడే స్టేడియం నుంచి బయటకు వెళుతూ అక్కడి ‘ఆనర్స్ బోర్డ్’ వద్ద క్షణకాలం పాటు ఆగి బోర్డు వైపు చూస్తూ నిలబడ్డాడు. ఈ మైదానంలో సెంచరీలు సాధించిన, ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా దానిపై ఉంది. రేపు మరో వికెట్ తీసి తన పేరు అక్కడ చేర్చాలని అతను అనుకున్నాడు. అయితే ఐదు వికెట్లే కాదు... మరికొన్ని గంటల్లో ఏకంగా 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టిస్తానని అతను ఊహించి ఉండకపోవచ్చు! ► ముంబైలోనే పుట్టిన ఎజాజ్ ఎనిమిదేళ్ల వయసులో ఉపాధి కోసం అతని కుటుంబం న్యూజిలాండ్‌కు తరలి వెళ్లింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకో, ఇక్కడే ఉండిపోయిన బంధుమిత్రులను కలిసేందుకో గతంలోనూ ఎజాజ్ చాలా సార్లు వచ్చాడు. కానీ ఈసారి మాత్రం పుట్టిన గడ్డపై ఒక అద్భుతాన్ని సృష్టించేందుకే వచ్చినట్లున్నాడు. బాంబేను వీడిన సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మరో జట్టు తరఫున ఆడేందుకు వచ్చి భారత్‌పైనే అతను అత్యంత అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ పాతికేళ్ల ప్రస్థానం అతని కళ్ల ముందు కచ్చితంగా సినిమా రీళ్లలా కదలాడి ఉంటుంది! ► ముంబై టెస్టుకు ముందు మూడేళ్ల కెరీర్లో ఎజాజ్ పటేల్ ఆడినవి 10 మ్యాచ్‌లే! 32.48 పరుగుల సగటుతో 29 వికెట్లు తీసిన సాధారణ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్. టీమ్ మేనేజ్మెంట్ లెక్కల్లో అతను ఆ జట్టు నంబర్‌వన్ స్పిన్నర్ కూడా కాదు. సాన్‌ట్నర్, ఇష్ సోధిల తర్వాతే అతనికి ప్రాధాన్యం. వీరిలో ఎవరైనా తప్పుకుంటేనే మ్యాచ్ దక్కే అవకాశం. కెరీర్ తొలి టెస్టులోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచినా అది అతని కెరీర్ జోరుగా సాగేందుకు ఏమాత్రం పనికి రాలేదు. సరిగ్గా చెప్పాలంటే తాజా ప్రదర్శనకు ముందు 33 ఏళ్ల ఎజాజ్‌కు పెద్దగా గుర్తింపూ లేదు. కానీ ఇకపై ఎవరూ మరచిపోలేని విధంగా తన పేరును అతను చరిత్రలో చెక్కుకున్నాడు! ► న్యూజిలాండ్ వెళ్లిన తర్వాతే క్రికెట్‌పై ఎజాజ్‌కు ఆసక్తి కలిగింది. అయితే ఆటను అతను లెఫ్టార్మ్ పేస్ బౌలర్‌గా మొదలు పెట్టాడు. స్వింగ్ బౌలర్‌గా రాణించిన అతను ఆక్లాండ్ తరఫున అండర్–19 స్థాయిలో సౌతీతో సమానంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయినా సరే న్యూజిలాండ్ అండర్–19 టీమ్‌లో అతనికి చోటు దక్కలేదు. 5 అడుగుల 8 అంగుళాల తన ఎత్తు పదునైన పేస్ బౌలింగ్‌కు పనికి రాదని కూడా అతను గుర్తించాడు. భవిష్యత్తులో కివీస్ తరఫున ఆడాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అర్థమైంది. తన క్లబ్ తరఫున ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్లిన ఎజాజ్‌కు న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ దీపక్ పటేల్ మార్గదర్శిగా నిలువగా... స్పిన్నర్‌గా ఎదిగేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని భావించి కఠోర సాధన చేశాడు. వరుసగా మూడేళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడంతో జాతీయ జట్టు పిలుపు లభించింది. 30 ఏళ్ల వయసులో న్యూజిలాండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ► ఈ పది వికెట్ల జాతరలో ఎజాజ్ ప్రయోగాలేమీ చేయలేదు. సాంప్రదాయ లెఫ్టార్మ్ స్పిన్నర్ వేసే బంతులతోనే సత్తా చాటాడు. ‘లెన్త్’ మాత్రం తప్పకుండా జాగ్రత్త పడ్డాడు. సహచర బౌలర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోవడం కూడా అతనికి మేలు చేసింది. చివరకు రచిన్ రవీంద్ర పట్టిన క్యాచ్‌తో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. అయితే దురదృష్టవశాత్తూ గత రెండు సందర్భాలకు భిన్నంగా ఇంత గొప్ప ఆట తర్వాత కూడా ఎజాజ్ ఓటమి పక్షానే నిలవాల్సి వస్తుందేమో! నా క్రికెట్ కెరీర్లో ఇదే అత్యుత్తమ రోజు. ఇక ముందు కూడా ఇదే ఉంటుందేమో. అన్నీ కలిసి రావడంతోనే నేను ముంబైలో ఈ ఘనత సాధించగలిగాను. ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నాకు, నా కుటుంబానికి ఇదో ప్రత్యేక క్షణం. ఇంకా నేను ఆనందం నుంచి తేరుకోలేకపోయాను. ఇలాంటి ఘనతకు అందించిన దేవుడికి కృతజ్ఞతలు. ‘10’ వికెట్ల క్లబ్లో చేరడం గర్వకారణం. కుంబ్లే ఘనత నాకు బాగా గుర్తుంది. ఎన్నోసార్లు ఆ వీడియో చూశా. ఇలాంటి క్షణాలు కెరీర్లో ఎప్పుడో గానీ రావు కాబట్టి చివరి వికెట్‌కు ముందు చాలా ఒత్తిడిలో ఉన్నా. ఆఖరి వికెట్ సమయంలో బంతి గాల్లోకి లేచినప్పుడు అందరం ఎంతో ఉత్కంఠ అనుభవించాం. పదో వికెట్ కోసం ఇతర బౌలర్లు వైడ్ బంతులు వేయాలనే చర్చే మాలో జరగలేదు. తొమ్మిది వికెట్లతో కూడా నేను సంతృప్తి చెందేవాడిని. –ఎజాజ్ పటేల్ 10 వికెట్ల క్లబ్‌లోకి ఎజాజ్‌కు స్వాగతం. పర్ఫెక్ట్10. చాలా బాగా బౌలింగ్ చేశావు. టెస్టు తొలి, రెండో రోజు ఇలాంటి ఘనత సాధించడం ఎంతో ప్రత్యేకం. –అనిల్ కుంబ్లే , భారత మాజీ కెప్టెన్ మొత్తం టీమ్‌ను మన జేబులో వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇదో అసాధారణ ప్రదర్శన. –రవిశాస్త్రి, భారత మాజీ హెడ్ కోచ్ టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ ఎజాజ్ పటేల్. గతంలో ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ (1956 జూలైలో ఆస్ట్రేలియాపై మాంచెస్టర్‌లో 10/53)... భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (1999 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌పై ఢిల్లీలో; 10/74) మాత్రమే ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా ఇదే. రిచర్డ్ హ్యాడ్లీ (9/52) రికార్డును ఎజాజ్ బద్దలుకొట్టాడు. -
సెంచరీతో చెలరేగిన మయాంక్ అగర్వాల్..
కెప్టెన్ కోహ్లి డకౌట్, పట్టుదలకు మారుపేరైన పుజారా డకౌట్, గత మ్యాచ్ హీరో శ్రేయస్ విఫలం... అయినా సరే న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో తొలి రోజును భారత్ మెరుగైన స్థితిలో ముగించగలిగింది. అందుకు కారణం మయాంక్ అగర్వాల్! ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదలగా క్రీజ్‌లో నిలబడిన అతను ఆకట్టుకునే షాట్లతో అజేయ శతకం సాధించాడు. మొత్తం స్కోరులో సగంకంటే ఎక్కువ పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. మరోవైపు భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లనూ తనే పడగొట్టి కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ తొలి రోజు ఆటపై తనదైన ముద్ర వేశాడు. ముంబై: న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన రెండో టెస్టులో ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 4 వికెట్లకు 221 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (246 బంతుల్లో 120 బ్యాటింగ్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేయగా, శుబ్‌మన్ గిల్ (71 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం మయాంక్‌తో పాటు సాహా (25 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఎజాజ్ పటేల్‌కు 4 వికెట్లు దక్కాయి. మోచేతి గాయం కారణంగా న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. పుజారా, కోహ్లి డకౌట్... ఓపెనర్లు మయాంక్, గిల్ జట్టుకు శుభారంభం అందించారు. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేశారు. అయితే తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన తర్వాత గిల్‌ను అవుట్ చేసి ఎజాజ్ కివీస్‌కు తొలి వికెట్ అందించాడు. ఆపై అదే స్కోరు వద్ద భారత్ అనూహ్యంగా మరో రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఎజాజ్ ఒకే ఓవర్లో పుజారా (0), కోహ్లి (0)లను పెవిలియన్ పంపించి ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇలాంటి స్థితిలో మయాంక్‌కు శ్రేయస్ అయ్యర్ (18) కొద్ది సేపు అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 80 పరుగులు జోడించిన అనంతరం అయ్యర్ వికెట్ కూడా ఎజాజ్ ఖాతా లోనే చేరింది. ఈ దశలో జాగ్రత్తగా ఆడిన మయాంక్, సాహా అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మయాంక్ జోరు... గత 13 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధసెంచరీ సాధించి జట్టులో స్థానం ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలో మయాంక్ ఓపెనర్‌గా తన విలువేంటో చూపించాడు. సహచరులంతా విఫలమైన చోట అద్భుత బ్యాటింగ్‌తో అతను సత్తా చాటాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అతను చివరి వరకు అదే జోరును కొనసాగించాడు. ఇతర బ్యాటర్లు ఇబ్బంది పడ్డ ఎజాజ్ బౌలింగ్‌లో మయాంక్ రెండు సిక్సర్లు సహా అలవోకగా పరుగులు రాబట్టడం విశేషం. మిచెల్ బౌలింగ్‌లో కొట్టిన కవర్‌డ్రైవ్ బౌండరీతో టెస్టుల్లో అతని నాలుగో సెంచరీ పూర్తయింది. తొలి సెషన్ వృథా... ఊహించినట్లుగానే తొలి రోజు ఆటను వర్షం ఇబ్బంది పెట్టింది. ఉదయం అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో నిర్ణీత సమయానికి ఆట ప్రారంభం కాలేదు. దాదాపు తొలి సెషన్ సమయం అంతా వృథా అయింది. మొత్తంగా మొదటి రోజు 20 ఓవర్లు తక్కువగా పడ్డాయి. అవుటా...నాటౌటా! కెప్టెన్ కోహ్లి నిష్క్రమణపై శుక్రవారం తీవ్ర చర్చ జరిగింది. ఎజాజ్ బౌలింగ్‌లో బంతి ప్యాడ్లకు తాకగా, బౌలర్ అప్పీల్ చేయడంతో అంపైర్ అనిల్ చౌదరి అవుట్‌గా ప్రకటించాడు. దాంతో కోహ్లి ‘రివ్యూ’ కోరాడు. ఎన్నిసార్లు రీప్లేలు చూసినా థర్డ్ అంపైర్ వీరేంద్ర శర్మకు కూడా స్పష్టత రాలేదు. బంతి ముందుగా ప్యాడ్‌కు తగిలిందా లేక బ్యాట్‌కు తగిలి ఆపై ప్యాడ్ వైపు మళ్లిందా అనేది అర్థం కాలేదు. ఒక కోణంనుంచి చూస్తే బంతి బ్యాట్, ప్యాడ్‌కు ఒకేసారి తగిలినట్లుగా కనిపించింది. చివరకు ‘కన్‌క్లూజివ్ ఎవిడెన్స్’ లేదంటూ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే అతను మద్దతు పలికాడు. దాంతో మరో అంపైర్ నితిన్ మీనన్ ముందు తన అసంతృప్తిని ప్రదర్శించి మైదానం వీడిన కోహ్లి వెళుతూ వెళుతూ అసహనంతో బౌండరీ కుషన్స్‌ను బ్యాట్‌తో కొట్టాడు. థర్డ్ అంపైర్ కూడా ఆ సమయంలో కొంత ఆందోళనకు లోనయ్యాడేమో... ‘బాల్ ట్రాకింగ్’ కూడా చూడకుండానే తన నిర్ణయాన్ని వెలువరించాడు. చివరకు అనిల్ చౌదరినే దానిని గుర్తు చేయాల్సి వచ్చింది. పాపం రహానే! కాన్పూర్ టెస్టు నవంబర్ 29న ముగిసింది. కానీ ఆ టెస్టు ఆఖరి రోజు రహానేకు కూడా స్వల్ప గాయమైందని, రెండో టెస్టు ప్రారంభానికి కొద్ది సేపు ముందు గానీ బీసీసీఐ ప్రకటించలేదు! ఆ మ్యాచ్‌లో చివరి రోజు 90 ఓవర్లూ ఫీల్డింగ్ చేసి, గురువారం నెట్‌ప్రాక్టీస్ చేసి, శుక్రవారం ఉదయం బ్రహ్మాండంగా ఫీల్డింగ్ సాధన చేసిన రహానేకు ‘కాస్త’ ఎడమ తొడ కండరాలు పట్టేశాయంటూ మ్యాచ్ నుంచి తప్పించింది. సరిగ్గా చెప్పాలంటే ఫామ్‌లో లేని రహానేను కోహ్లి కోసం పక్కన పెట్టేందుకు ‘వేటు’ అనకుండా మర్యాదపూర్వకంగా ‘గాయం’ సాకును వాడుకున్నట్లు అనిపించింది. 79 టెస్టుల కెరీర్లో సొంత మైదానం ముంబైలో ఒక్క టెస్టూ ఆడని రహానేకు ఇప్పుడూ అవకాశం చేజారింది. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా కూడా గాయాలతో మ్యాచ్‌కు దూరం కావడంతో వీరిద్దరి స్థానాల్లో సిరాజ్, జయంత్ యాదవ్‌లకు అవకాశం దక్కింది. నాలుగేళ్ల తర్వాత జయంత్‌కు మళ్లీ టెస్టు ఆడే చాన్స్ లభించింది. ముంబైలో ముంబైకర్ జోరు! 33 ఏళ్ల ఎజాజ్ పటేల్ ముంబైలో పుట్టాడు. ఎనిమిదేళ్ల వయసులో అతని కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. ఇప్పుడు అదే ముంబైలో భారత్‌పై టెస్టు మ్యాచ్ ఆడిన అతను ‘సొంత’ గడ్డపై సత్తా చాటాడు. ముంబైతో పలు జ్ఞాపకాలు ఉన్నాయంటూ పదే పదే చెబుతూ వచ్చిన పటేల్, ఇప్పుడు తన ఆటతోనూ దానిని చిరస్మరణీయం చేసుకున్నాడు. ‘అంతా కలలా ఉంది. ఇక్కడ ఆడటమే కాదు తొలి రోజు నాలుగు వికెట్లు తీయడం ఎంతో ప్రత్యేకం. నా సొంత ఊరు, వాంఖెడే మైదానంలో ఈ ప్రదర్శన రావడం నా అదృష్టం’ అంటూ ఎజాజ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (బ్యాటింగ్) 120; గిల్ (సి) టేలర్ (బి) ఎజాజ్ 44; పుజారా (బి) ఎజాజ్ 0; కోహ్లి (ఎల్బీ) (బి) ఎజాజ్ 0; శ్రేయస్ (సి) బ్లన్‌డెల్ (బి) ఎజాజ్ 18; సాహా (బ్యాటింగ్) 25; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (70 ఓవర్లలో 4 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–80, 2–80, 3–80, 4–160. బౌలింగ్: సౌతీ 15–5–29–0, జేమీసన్ 9–2–30–0, ఎజాజ్ పటేల్ 29–10–73–4, సోమర్‌విలే 8–0–46–0, రచిన్ రవీంద్ర 4–0–20–0, మిచెల్ 5–3–9–0. -
IND vs NZ 2nd Test: కోహ్లి వచ్చేశాడు.. రహానేకు మరో అవకాశం!
IND vs NZ 2nd Test.. అన్ని అనుకూలతలు ఉన్నా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో చేతులదాకా వచ్చిన విజయాన్ని చేజిక్కించుకోలేకపోయిన భారత్ ఈసారి అలాంటి తప్పును పునరావృతం చేయరాదని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలుపుతో పాటు సిరీస్‌ను కూడా సొంతం చేసుకునేందుకు టీమిండియా సన్నద్ధమైంది. నేటినుంచి వాంఖెడే మైదానంలో జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి ఈ టెస్టులో అందుబాటులోకి రావడం భారత జట్టు బలాన్ని పెంచింది. మరోవైపు పర్యాటక న్యూజిలాండ్ జట్టు కూడా తీసికట్టుగా ఏమీలేదు. ఒక్క వికెట్ చేతిలో పెట్టుకొని 11 మంది ఆటగాళ్లతో ఓ ఆటాడుకున్న కివీస్ అంతే ఆత్మవిశ్వాసంలో సమరానికి సన్నద్ధమైంది. ఈ రెండు జట్ల ఉత్సాహంపై చినుకులు కురిపించేందుకు వానా కూడా కాచుకుంది. గురువారం ముంబైలో వర్షం కురిసింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఇండోర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సివచ్చింది. సాహా ఫిట్... వచ్చీ రాగానే భారత కెప్టెన్ కోహ్లికి జట్టు కూర్పు పెను సవాలు విసురుతోంది. మైదానంలో దిగే తుది 11 మంది కోసం పెద్ద కసరత్తే చేయాల్సిన కష్టం వచ్చింది. కోహ్లి గైర్హాజరీలో కాన్పూర్‌లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ సెంచరీ, అర్ధ సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. దీంతో అతన్ని తప్పించడం విరాట్‌తో పాటు జట్టు మేనేజ్మెంట్కు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఫామ్‌లో లేని రహానే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌లలో ఒకరిపై వేటు ఖాయం. అయితే సీనియర్‌గా రహానేకు సొంతగడ్డపై మరో అవకాశం దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. టెస్టు స్పెషలిస్టు కీపర్, అనుభజ్ఞుడైన సాహా ఫిట్‌గా ఉండటంతో ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ అరంగేట్రం చేసే అవకాశాలు తగ్గిపోయాయి. పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఇషాంత్ స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి రావచ్చు. భారత బ్యాటింగ్ లైనప్‌ను పుజారా, రహానేల వైఫల్యం కలవరపెడుతోంది. వీళ్లిద్దరు అనుభవజ్ఞులు తమ బ్యాట్లకు పని చెబితే భారత్‌కు భారీస్కోరు ఖాయమవుతుంది. వర్షంతో తేమ ఉన్నప్పటికీ సీమర్లకంటే ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్‌లపైనే టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుంది. కివీస్ గెలుపు ఆశలు! టి20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను కోల్పోయేందుకు సిద్ధంగా లేదు. భారత్‌కు తగ్గట్టే స్పిన్ అస్త్రాలు, భారత్ కంటే మెరుగైన పేస్ బౌలర్లున్న కేన్ విలియమ్సన్ సేన ఈ టెస్టు విజయంతో సిరీస్‌ను ఎగరేసుకుపోవాలని చూస్తోంది. బౌలర్లకు అండగా బ్యాట్స్‌మెన్ కూడా నిలకడగా రాణిస్తే కివీస్ అనుకున్నది సాధిస్తుంది. ఓపెనర్లు యంగ్, లాథమ్‌లతో పాటు అనుభవజ్ఞుడైన రాస్ టేలర్ ఈ మ్యాచ్‌లో రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. అయితే మిడిలార్డర్లో నికోల్స్, వికెట్ కీపర్ బ్లన్‌డేల్ సత్తా చాటాల్సి ఉంది. రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. ఉదయం బౌన్స్‌కు అనుకూలించే వికెట్‌పై జేమీసన్, సౌతీ చెలరేగడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో భారత టాపార్డర్ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), శుబ్‌మన్, పుజారా, రహానే, అయ్యర్, సాహా, జడేజా, అశ్విన్, అక్షర్, సిరాజ్, ఉమేశ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), విల్ యంగ్, లాథమ్, టేలర్, నికోల్స్, బ్లన్‌డేల్, రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్, టిమ్ సౌతీ, సోమర్‌విలే /వాగ్నర్, ఎజాజ్ పటేల్. పిచ్, వాతావరణం తొలి రోజైతే వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో తేమ కారణంగా వాంఖెడే పిచ్ పేసర్లకు అనుకూలించవచ్చు. మూడు, నాలుగు రోజుల్లో ఆటపై స్పిన్ ప్రభావం ఉంటుంది. -
ఫవాద్ ఆలమ్ అజేయ శతకం.. పటిష్ట స్థితిలో పాక్
కింగ్స్టన్: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఫవాద్ ఆలమ్(213 బంతుల్లో 124 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ శతకానికి, కెప్టెన్ బాబర అజామ్(174 బంతుల్లో 75; 13 ఫోర్లు) అర్థశతకం తోడవడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ 302/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వీరికి తోడు మహమ్మద్ రిజ్వాన్(115 బంతుల్లో 31), ఫహీమ్ అష్రఫ్ (78 బంతుల్లో 28) మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జైడన్ సీల్స్ మూడేసి వికెట్లు తీయగా, జేసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే సాధించి ఎదురీదుతోంది. ఓపెనర్లు క్రైగ్ బ్రాత్ వైట్(4), కీరన్ పోవెల్(5), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోస్టన్ చేజ్(10) తీవ్రంగా నిరాశపర్చగా.. క్రీజులో బోన్నర్(18 బ్యాటింగ్), అల్జారీ జోసెఫ్(0 బ్యాటింగ్) ఉన్నారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. ఫహీమ్ అష్రఫ్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. తొలి రోజు కొన్ని ఓవర్ల ఆటకు అంతరాయం కలగగా.. రెండో రోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మూడో రోజైన ఆదివారం కూడా వర్షం మధ్య మధ్యలో అంతరాయం కలిగించింది. కాగా, రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టు వికెట్ తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. -
‘లార్డ్స్’లో భారత ఘనవిజయం
రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ.... ఈ ఇద్దరు ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌లో పంత్ ఒక్కడే స్పెషలిస్టు బ్యాట్స్‌మన్. అతడు అవుటైతే ఇంకో ఐదో పదో పరుగులకు కూలిపోవచ్చనే సందేహం... ఇషాంత్‌కు ముందే పంత్ ఔటయ్యాడు. తర్వాత ఇషాంత్ కూడా పెవిలియన్ చేరాడు. కానీ అనుకున్నట్లుగా ఇన్నింగ్స్ కూలలేదు సరికదా అసలు మరో వికెటే పడలేదు! బంతులతో చెలరేగే బౌలర్లు షమీ, బుమ్రా బ్యాటింగ్‌తో అద్భుతమే చేశారు. వికెట్ పతనాన్ని అక్కడితోనే ఆపేసి... పరుగులకు బాట వేశారు. తర్వాత మళ్లీ వాళ్లిద్దరే ఇంగ్లండ్ ఓపెనర్లను డకౌట్ చేసి పతనానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్ ఆఖరి వికెట్ తీసి శుభం కార్డు వేయడంతో లార్డ్స్ మైదానంలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. లండన్: ‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’...ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు తన సహచరులతో కోహ్లి చెప్పిన మాట ఇది! అతను అన్నట్లుగానే మన బౌలర్లు ప్రత్యర్థిని ఒక్కో ఓవర్లో, ఒక్కో బంతికి గుండెలాగిపోయేలా చేస్తూ చివరకు గెలిచే వరకు ఆగలేదు. భారత్‌కు లార్డ్స్‌లో అద్భుత విజయాన్నిచ్చారు. రెండో టెస్టులో ఆఖరి రోజు మొదట భారత బౌలర్లు బ్యాటింగ్‌లో ‘కింగ్’లయ్యారు. తిరిగి బౌలింగ్‌తో బెంబేలెత్తించారు. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు. రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కష్టాల్లో ఉన్న భారత్‌ను షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌ను 109.3 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. ఆట ముగియడానికి మరో 9.1 ఓవర్లు మాత్రమే ఉండగా, ఇంగ్లండ్ చేతిలో 3 వికెట్లు ఉండటంతో డ్రా అవుతుందేమో అనిపించింది. కానీ రాబిన్సన్ (9)ను అవుట్ చేసి బుమ్రా బాట వేయగా...ఒకే ఓవర్లో బట్లర్ (25), అండర్సన్ (0)లను పెవిలియన్ పంపించి సిరాజ్ ముగిం చాడు. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 181/6తో సోమవారం ఆట ప్రారంభించిన అనం తరం రిషభ్ పంత్ (22) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాంత్ (16) త్వరగానే ఔటయ్యాడు. ఈ దశలో షమీ–బుమ్రా భాగస్వామ్యం అద్భుతాన్నే చేసింది. సిరాజ్‌కు 4 వికెట్లు భారత్ నిర్దేశించిన లక్ష్యం 272. రెండు సెషన్లు, 60 ఓవర్లు. ఓపెనింగ్ సహా టాపార్డర్ నిలబడితే, దీనికి వేగం జతయితే ఓవర్‌కు 4 పరుగులు చేయడం ఏమంత కష్టం కాదు. కానీ బుమ్రా, షమీ వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు. ఇద్దరు ప్రారంభ ఓవర్లలోనే బర్న్స్ (0), సిబ్లీ (0)లను ఖాతా తెరువనీయలేదు. వీళ్లిద్దరికి తోడుగా ఇషాంత్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. హమీద్ (9), బెయిర్ స్టో (2)ల పనిపట్టాడు. కెప్టెన్ రూట్ (60 బంతుల్లో 33; 5 ఫోర్లు) జట్టును కాపాడాలనుకున్నా బుమ్రా ఆ అవకాశం అతనికి ఇవ్వలేదు. ఈ స్థితిలో డ్రా చేసుకోవడం కూడా ఇంగ్లండ్‌కు కష్టమే! అయినా సరే బట్లర్ (96 బంతుల్లో 25; 3 ఫోర్లు) ప్రయత్నిద్దామనుకున్నాడు. కానీ సీన్లోకి ఈ సారి సిరాజ్ వచ్చాడు. వరుస బంతుల్లో మొయిన్ అలీ (13), స్యామ్ కరన్ (0)లను ఔట్ చేశాడు. తర్వాత బట్లర్‌ను తనే పెవిలియన్ చేర్చాడు. షమీ–బుమ్రా బ్యాటింగ్ సత్తా మనం డ్రా చేసుకుంటే చాలనుకునే పరిస్థితి నుంచి ప్రత్యర్థి డ్రాతో గట్టెక్కితే చాలనే స్థితికి తీసుకొచ్చిన మహ్మద్ షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టారు. బంతులేసే బౌలర్లు ప్రధాన బ్యాట్స్‌మెన్ కంటే బాగా ఆడారు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ అందుబాటులో ఉన్న అస్త్రాల్ని ప్రయోగించాడు. మార్క్‌వుడ్, రాబిన్సన్, స్యామ్ కరన్ ఇలా ఎవరిని దించినా బుమ్రా, షమీ తగ్గలేదు. అలా అని టిక్కుటిక్కు అని డిఫెన్స్‌కే పరిమితం కాలేదు. క్రీజులో పాతుకుపోయే కొద్దీ షాట్లపై కన్నేశారు. బంతిని బౌండరీలైనును దాటించారు. ఇద్దరు టెస్టు ఆడినా... పరుగుల వేగం వన్డేలా అనిపించింది. ముఖ్యంగా 40 పరుగుల వద్ద ఉన్న షమీ వరుస బంతుల్లో 4, 6 కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేయడం విశేషం. మొదట లాంగాన్‌లో బౌండరీ బాదిన షమీ మరుసటి బంతిని ముందుకొచ్చి డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అది కాస్తా ప్రేక్షకుల గ్యాలరీలో పడింది. ఈ ఇద్దరి సమన్వయం కుదరడంతో ఇంగ్లండ్ బౌలింగ్ దళం చెదిరింది. ఈ జోడీని విడగొట్టే ప్రయత్నం ఫలించక, అటు పరుగులకు అడ్డుకట్ట వేయలేక ఆపసోపాలు పడ్డారు. అబేధ్యమైన భాగస్వామ్యం ఎంతకీ ముగియకపోగా, చివరకు భారత్ డిక్లేర్ చేసింది. అజేయమైన తొమ్మిదో వికెట్‌కు 20 ఓవర్లలోనే షమీ, బుమ్రా 89 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 364 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391 భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజార (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లి (సి) బట్లర్ (బి) కరన్ 20; రహానే (సి) బట్లర్ (బి) అలీ 61; పంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 22; జడేజా (బి) మొయిన్ అలీ 3; ఇషాంత్ (ఎల్బీ) (బి) రాబిన్సన్ 16; షమీ నాటౌట్ 56; బుమ్రా నాటౌట్ 34; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (109.3 ఓవర్లలో) 298/8 డిక్లేర్డ్ వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175, 7–194, 8–209. బౌలింగ్: అండర్సన్ 25.3–6–53–0, రాబిన్సన్ 17–6–45–2, వుడ్ 18–4–51–3; కరన్ 18–3–42–1, అలీ 26–1–84–2, రూట్ 5–0–9–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 0; సిబ్లీ (సి) పంత్ (బి) షమీ 0; హమీద్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 9; రూట్ (సి) కోహ్లి (బి) బుమ్రా 33; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) ఇషాంత్ 2; బట్లర్ (సి) పంత్ (బి) సిరాజ్ 25; అలీ (సి) కోహ్లి (బి) సిరాజ్ 13; కరన్ (సి) పంత్ (బి) సిరాజ్ 0; రాబిన్సన్ (ఎల్బీ) (బి) బుమ్రా 9; వుడ్ నాటౌట్ 0; అండర్సన్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (51.5 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–44, 4–67, 5–67, 6–90, 7–90, 8–120, 9–120, 10–120. బౌలింగ్: బుమ్రా 15–3–33–3; షమీ 10–5–13–1, జడేజా 6–3–5–0, సిరాజ్ 10.5–3–32–4, ఇషాంత్ 10–3–13–2. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Ind Vs Eng: రెండో రోజు బౌలర్లదే...
లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆటను భారత్, ఇంగ్లండ్ బౌలర్లు పది వికెట్లతో శాసించారు. పటిష్ట స్థితిలో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్, ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి మరో వంద పరుగులు కూడా జోడించలేకపోయింది. టీమిండియా పేసర్లకు తలవంచిన ఇంగ్లండ్ 108 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తరఫున అండర్సన్, భారత ఆటగాళ్లలో సిరాజ్ శుక్రవారం హీరోలుగా నిలిచారు. ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... రూట్ నేతృత్వంలో ఇంగ్లండ్ మూడో రోజు ఎలాంటి పోరాట పటిమ ప్రదర్శించి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోసం ప్రయత్నిస్తుందో చూడాలి. లండన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. జో రూట్ (75 బంతుల్లో 48 బ్యాటింగ్; 6 ఫోర్లు), బెయిర్‌స్టో (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్ 2 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులవద్ద ఆలౌటైంది. తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 2 పరుగులే జోడించిన కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, 1 సిక్స్) టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 86 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగడం విశేషం. 36.1 ఓవర్లలో 88 పరుగులు... తొలి రోజు ప్రదర్శించిన ఆట, చేతిలో ఉన్న వికెట్లను చూస్తే భారత్ స్కోరు కనీసం 500 పరుగుల వరకు చేరగలదనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో టీమిండియాను కట్టడి చేశారు. శుక్రవారం తొలి ఓవర్ రెండో బంతికే రాహుల్‌ను రాబిన్సన్ అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ అజింక్య రహానే (1) తర్వాతి ఓవర్ తొలి బంతికే వెనుదిరిగాడు. ఈ స్థితిలో రవీంద్ర జడేజా (120 బంతుల్లో 40; 3 ఫోర్లు), రిషభ్ పంత్ (58 బంతుల్లో 37; 5 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 49 పరుగులు జోడించగా... తనదైన శైలిలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన పంత్, పేలవ షాట్ ఆడి నిష్క్రమించాడు. ఆ తర్వాత ముగ్గురు బౌలర్లు షమీ (0), ఇషాంత్ (8), బుమ్రా (0) వికెట్లను తీసేందుకు ఇంగ్లండ్‌కు ఎంతోసేపు పట్టలేదు. సిరాజ్ జోరు... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను రోరీ బర్న్స్ (136 బంతుల్లో 49; 7 ఫోర్లు), డామ్ సిబ్లీ జాగ్రత్తగా ప్రారంభించారు. టీ సమయానికి 14 ఓవర్లలో 23 పరుగులు జత చేశారు. అయితే విరామం తర్వాత హైదరాబాదీ పేసర్ సిరాజ్ చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. వరుస బంతుల్లో సిబ్లీ, హసీబ్ హమీద్ (0)లను సిరాజ్ పెవిలియన్ పంపించాడు. 2016 నవంబర్‌లో తన చివరి టెస్టు ఆడిన హమీద్... 1717 రోజుల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులో స్థానం సంపాదించి తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో బర్న్స్, రూట్లపై జట్టును ఆదుకునే భారం పడింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించి అంతా సాఫీగా సాగుతున్న సమయంలో షమీ.. బర్న్స్‌ను అవుట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. మరో వికెట్ పడకుండా రూట్, బెయిర్‌స్టో రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83; రాహుల్ (సి) సిబ్లీ (బి) రాబిన్సన్ 129; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 42; రహానే (సి) రూట్ (బి) అండర్సన్ 1; పంత్ (సి) బట్లర్ (బి) వుడ్ 37; జడేజా (సి) అండర్సన్ (బి) వుడ్ 40; షమీ (సి) బర్న్స్ (బి) అలీ 0; ఇషాంత్ (ఎల్బీ) (బి) అండర్సన్ 8; బుమ్రా (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (126.1 ఓవర్లలో ఆలౌట్) 364. వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267, 4–278, 5–282, 6–331, 7–336, 8–362, 9–364, 10–364. బౌలింగ్: అండర్సన్ 29–7–62–5, రాబిన్సన్ 33–10–73–2, స్యామ్ కరన్ 22–2–72–0, మార్క్ వుడ్ 24.1–2–91–2, మొయిన్ అలీ 18–1–53–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) (బి) షమీ 49; సిబ్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 11; హమీద్ (బి) సిరాజ్ 0; రూట్ (బ్యాటింగ్) 48; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45 ఓవర్లలో 3 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1–23, 2–23, 3–108. బౌలింగ్: ఇషాంత్ శర్మ 11–2–32–0, బుమ్రా 9–3–23–0, షమీ 8–2–22–1, సిరాజ్ 13–4–34–2, జడేజా 4–1–6–0. -
విలేకరి ప్రశ్నకు సలాం చేసిన రోహిత్.. ఎందుకో చూడండి..!
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం రెండో టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ సేన 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(127) అజేయ సెంచరీతో అదరగొట్టగా, రోహిత్ శర్మ(83), కోహ్లీ(42)లు రాణించారు. తొలి రోజు ఆట అనంతరం ఓపెనర్ రోహిత్ శర్మ పాల్గొన్న వర్చువల్ మీడియా సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. ఈ సమావేశంలో విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు రోహిత్ సెల్యూట్ చేశాడు. 😂😂😂😂 pic.twitter.com/7Jrga8FNcd — Amey Pethkar 🇮🇳🇦🇪 (@ameyp9) August 13, 2021 భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోయే పంద్రాగస్టు నాడు విజయాన్ని గిఫ్ట్‌గా ఇస్తారా అని సదరు రిపోర్టర్ ప్రశ్నించగా, పై విధంగా స్పందించాడు. అలా జరగాలనే కోరుకుంటున్నాము.. అదే జరిగితే అది భారత క్రికెట్‌కు గొప్ప గౌరవంగా నిలుస్తుందని బదులిచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి రోహిత్ శర్మ టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. అయితే, 83 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆండర్సన్ బౌలింగ్ క్లీన్‌బౌల్డ్ అయ్యి సెంచరీ చేసే ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. రోహిత్, రాహుల్ జోడీ తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించడంతో లార్డ్స్ మైదానంలో 69 ఏళ్ల రికార్డు బద్దలయ్యింది. -
టెస్ట్ క్రికెట్లో ఏదో మాయ ఉంది: మంత్రి కేటీఆర్
లార్డ్స్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. క్రికెట్‌పై అమితాసక్తి కనబర్చే మంత్రి.. సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్‌పై పలు కామెంట్లు చేశారు. టెస్ట్ క్రికెట్లో ఏదో మాయ ఉందని, ఈ ఫార్మాట్లో ఉన్న మజానే వేరని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అందులోనూ బంతి విపరీతంగా స్వింగ్ అయ్యే మైదానాల్లో టెస్ట్ క్రికెట్ ఆడితే ఆ గమ్మత్తే వేరుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. There is something truly magical about Test cricket & that too when it’s played in seaming conditions Best; Kohli versus Andreson is as riveting as it can get & of course scintillating performance of Rohit just adds to the glory of the game#INDvENG — KTR (@KTRTRS) August 12, 2021 ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. ఇంగ్లీష్ బౌలర్ అండర్సన్ స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్న తీరు అత్యుత్తమమని కొనియాడాడు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తన అమోఘ ప్రదర్శనతో మ్యాచ్‌కు వైభవాన్ని తీసుకొచ్చాడని పేర్కొన్నాడు. కాగా, గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ సేన 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(127) అజేయ సెంచరీతో అదరగొట్టగా, రోహిత్ శర్మ(83), కోహ్లీ(42)లు రాణించారు. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ పుజారా(9) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం రాహుల్‌తో పాటు రహానే(1) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 2, రాబిన్సన్కు ఓ వికెట్ దక్కింది. -
కంగ్రాట్స్ రాహుల్ బాబా.. థ్యాంక్స్: సునీల్ శెట్టి
KL Rahul 100@ Cricket Mecca: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అజేయమైన సెంచరీ(248 బంతుల్లో 127; 12 ఫోర్లు, సిక్స్)తో అదరగొట్టాడు. క్రికెట్ మక్కాగా పేరొందిన ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన మూడో భారత ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సందర్భంగా రాహుల్‌పై సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేయసి అతియా శెట్టితో పాటు ఆమె తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారి జాబితాలో ఉన్నారు. View this post on Instagram A post shared by Suniel Shetty (@suniel.shetty) కాగా, రాహుల్ శతకొట్టిన క్లిప్‌ను జోడిస్తూ.. సునీల్ శెట్టి ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. 100@ క్రికెట్ మక్కా.. కంగ్రాట్స్ అండ్ గాడ్ బ్లెస్ యు బాబా.. నా బర్త్‌డే(ఆగస్ట్ 11)కు నువ్విచ్చిన గిఫ్ట్ చాలా అపురూపమంటూ అతను చేసిన కామెంట్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్శించింది. సునీల్ శెట్టి.. రాహుల్‌కు శుభాకాంక్షలు తెలపిన విధానం, రాహుల్‌ను బాబా అని సంబోదిస్తూ ఆశీర్వదించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు అతియా శెట్టి కూడా రాహుల్ సెంచరీపై పోస్ట్ చేసింది. కేఎల్ రాహుల్‌ను ట్యాగ్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎరుపు రంగు హార్ట్ ఐకాన్‌ను పోస్ట్ చేసింది. కాగా, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం రాహుల్‌తో పాటు అతియా కూడా ఇంగ్లండ్‌కు వెళ్లింది. రాహుల్ అతియాను తన పార్ట్నర్ అని బీసీసీఐకి చెప్పడం విశేషం. ఈ ఇద్దరూ గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. పిల్లలు ఆనందంగా ఉంటే చాలు అంటూ గతంలో సునీల్ శెట్టి దంపతులు కూడా వీళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్ అజేయమైన శతకంతో పాటు రోహిత్ శర్మ(83), కోహ్లీ(42)లు రాణించడంతో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ పుజారా(9) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం రాహుల్‌తో పాటు రహానే(1) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 2, రాబిన్సన్కు ఓ వికెట్ దక్కింది. -
ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని..
లండన్: ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తానూ ఒకడినని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. తాను దేన్నీ అంత తేలిగ్గా తీసుకోనని, తనది నిరంతర ప్రయాణమని, ప్రస్తుతం ఆట, ఫిట్నెస్లపైనే తన దృష్టంతా ఉందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిజమే.. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని. ఇందుకోసం నేను విపరీతంగా కసరత్తులు చేస్తాను. తరచూ పరుగెత్తుతాను. అలా కష్టపడతాను కాబట్టే నా ఫీల్డింగ్ బాగుంటుంది. క్రెడిట్ గోస్ టూ విరాట్ కోహ్లీ. అతను ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అతడిని చూసే జట్టు సభ్యుందరూ తమ ఫిట్నెస్ ప్రమాణాలు పెంచుకున్నారు. ప్రతి ఒక్కరు శారీరకంగా శ్రమిస్తున్నారు కాబట్టే మైదానంలో ఇప్పుడు తేడా కనిపిస్తోంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పాడు. త్వరలో యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపేందుకు తనవంతు కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ 2021 ఆడటం ఉపయోగకరమని అభిప్రాయపడ్డాడు. కాగా, ప్రస్తుతం జడ్డూ మూడు ఫార్మాట్లలో దుమ్మురేపుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తనదైన ముద్ర వేశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ, లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు చేస్తున్నాడు. సరైన సమయంలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును ఆదుకుంటూ 3డీ ఆటగాడిగా సేవలందిస్తున్నాడు. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(127), రహానే(1) క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ(83), కోహ్లీ(42) రాణించగా.. పుజారా(9) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. -
Ind Vs Eng: రోహిత్ జోరు.. రాహుల్ హుషారు
రెండో టెస్టుపై కూడా చినుకులే! ఆట వానతో ఆలస్యమై, ఆరంభమైంది. తర్వాత రోహిత్ శర్మ జోరు మొదలైంది. చూడచక్కని స్ట్రోక్స్‌తో అతని బౌండరీలు భారత స్కోరు బోర్డును పరుగెత్తించాయి. లోకేశ్ రాహుల్‌తో కలిసి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. అతను అవుటయ్యాక మరో ఓపెనర్ రాహుల్ పరుగుల బాధ్యత తీసుకున్నాడు. సెంచరీతో తొలిరోజు భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. రెండో రోజు మిగతా బ్యాట్స్‌మెన్ కూడా భాగమైతే భారీ స్కోరు ఖాయమవుతుంది. లండన్: చినుకులు పడ్డాయి... నెమ్మదించిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ వికెట్లను ఎంచక్కా పడగొట్టొచ్చు అనుకున్న ఇంగ్లండ్ ఎత్తుగడ పారలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రూట్ నిర్ణయం బెడిసికొట్టింది. భారత ఓపెనర్లు జోరు ప్రత్యర్థి ఆశల్ని, అవకాశాల్ని దెబ్బతీశాయి. పట్టుదలగా క్రీజ్‌లో నిలిచిన లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 127 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్), ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించగా...దూకుడైన ఆటతో రోహిత్ శర్మ (145 బంతుల్లో 83; 11 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరుకు పునాది వేశాడు వీళ్లిద్దరు ఇంగ్లండ్ బౌలర్లపై అవలీలగా పరుగులు చేయడంతో భారత్ మొదటి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు రహానే (1 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అండర్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత తుది జట్టులోకి శార్దుల్ స్థానంలో ఇషాంత్‌ను తీసుకోగా... అశ్విన్ మళ్లీ పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. కష్టంగా మొదలై... భారత ఓపెనర్లు ఆరంభంలో పరుగులు చేసేందుకు కష్టపడ్డారు. రోహిత్, రాహుల్ ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. అలా మొదటి పది ఓవర్లలో ఓపెనింగ్ జోడి 11 పరుగులే చేయగలిగింది. 13వ ఓవర్లో తొలిసారి బంతి బౌండరీ లైను దాటింది. 8 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 11 పరుగులే ఇచ్చాడు. అయితే భారత్ పుంజుకునేందుకు స్యామ్ కరన్ బౌలింగ్ దోహదం చేసింది. అనుభవజ్ఞుడైన అండర్సన్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన రోహిత్... స్యామ్‌ను చితగ్గొడుతూ ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టాడు. వర్షం అంతరాయం కల్పించడంతో 18.4 ఓవర్ల వద్ద ఆట ఆగింది. అప్పటికి భారత్ స్కోరు 46/0. వర్షం ఆగకపోవడంతో లంచ్ విరామం ప్రకటించారు. రోహిత్ ఫిఫ్టీ రెండో సెషన్లోనూ భారత్ హవానే కొనసాగింది. హిట్‌మ్యాన్ రోహిత్ ఆటలో వేగం పెంచాడు. ఆఫ్ స్టంప్‌పై పడిన బంతులను జాగ్రత్తగా ఆడిన ఈ ఓపెనర్... గతి తప్పిన బంతులకు తన స్ట్రోక్ ప్లే దెబ్బ రుచి చూపించాడు. రాహుల్ మాత్రం ఓపిగ్గా నిలబడ్డాడు. ఆచితూచి ఆడుతూ సహచరుడి వేగాన్ని ఆస్వాదించాడు. రోహిత్ 8 బౌండరీలతో అర్ధసెంచరీ (83 బంతుల్లో) అధిగమించాడు. అనంతరం మార్క్‌వుడ్ బౌలింగ్‌లో చెలరేగిన రోహిత్, హుక్‌షాట్‌తో సిక్సర్, పుల్, లాఫ్టెడ్ షాట్లతో బౌండరీలు రాబట్టాడు. జట్టు 100 పరుగుల్లో రోహిత్‌వే 75 పరుగులు కావడం విశేషం. మరోవైపు వంద బంతులాడినా ఒక్క ఫోర్ కొట్టని రాహుల్... ఎట్టకేలకు మొయిన్ అలీ ఓవర్లో సిక్సర్‌తో తొలిసారి బంతిని బౌండరీ దాటించాడు. అజేయంగా సాగిపోతున్న ఓపెనింగ్ జోడీని అండర్సన్ విడదీశాడు. సెంచరీ ఊపుమీదున్న రోహిత్‌ను బోల్తా కొట్టించడంతో 126 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్ సెంచరీ క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా (9) మళ్లీ విఫలమయ్యాడు. కెప్టెన్ కోహ్లి జత కలిశాక రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 157/2 స్కోరు వద్ద టీ విరామానికి వెళ్లారు. ఆఖరి సెషన్లో అండర్సన్ బౌలింగ్‌లోనూ బౌండరీలు కొట్టడం ద్వారా రాహుల్ స్కోరు పెంచే బాధ్యత తన భుజాన వేసుకున్నాడు. కోహ్లినేమో జాగ్రత్తపడ్డాడు. పది బంతులాడాకే ఖాతా తెరిచిన కోహ్లి తొలి బౌండరీ కోసం 48 బంతులు ఆడాల్సి వచ్చింది. ఈ జోడీ క్రీజులో కుదురుకోవడంతో భారత్ మరో వికెట్ కోల్పోకుండా 200 మార్క్‌ను దాటింది. తొలి టెస్టులో పూర్తి చేయలేకపోయిన సెంచరీని రాహుల్ ‘క్రికెట్ మక్కా’లో చేశాడు. అలీ, మార్క్‌వుడ్, రాబిన్సన్ల బౌలింగ్ల్లో యథే చ్ఛగా ఫోర్లు కొట్టాడు. వుడ్ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ దిశగా బాదిన బౌండరీతో 212 బంతుల్లో రాహుల్ శతకం పూర్తి చేసుకున్నాడు. 80 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. ఈ బంతి విరాట్ వికెట్ బలిగొంది. రాబిన్సన్ బౌలింగ్‌లో కోహ్లి (42; 3 ఫోర్లు) అవుటవడంతో 117 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83; రాహుల్ (నాటౌట్) 127; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 42; రహానే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (90 ఓవర్లలో 3 వికెట్లకు) 276. వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267. బౌలింగ్: అండర్సన్ 20–4–52–2, రాబిన్సన్ 23–7–47–1; స్యామ్ కరన్ 18–1–58–0 మార్క్‌వుడ్ 16–1–66–0, మొయిన్ అలీ 13–1–40–0. -
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. నిలకడగా టీమిండియా
లండన్: ఇంగ్లండ్‌తో ఇక్కడ లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 83 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈరోజు(గురువారం) ఆరంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్‌లు ప్రారంభించారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్నారు. రోహిత్ కాస్త దూకుడగా ఆడినా, కేఎల్ రాహుల్ అత్యంత సంయమనంతో ఆడుతున్నాడు. 74 బంతుల్లో రాహుల్ 15 పరుగులు చేశాడు. 27 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. భారత్ గెలిచే అవకాశం ఉన్న ఆ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కల్గించడంతో డ్రా అయ్యింది. టీమిండియా-ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనున్న సంగతి తెలిసిందే. -
‘లార్డ్స్’ సమరానికి సై: ఇటు శార్దూల్.. అటు స్టువర్ట్ బ్రాడ్ అవుట్!
వర్షం పడకపోతే తొలి టెస్టులో ఎవరు గెలిచేవారు? మంచి అవకాశం కోల్పోయామని కోహ్లి చెప్పగా... ఆ సమయంలో మ్యాచ్ తమ చేతుల్లోనే ఉందని రూట్ కూడా వ్యాఖ్యానించాడు. సిరీస్‌లో శుభారంభం చేసే అవకాశం చేజారినా... సుదీర్ఘ సిరీస్‌లో మరోసారి సత్తా చాటి ముందంజలో నిలిచేందుకు ఇరు జట్లకు రెండో అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు టీమ్‌లలోనూ బ్యాటింగ్ బలహీనతలు గత మ్యాచ్‌లో కనిపించగా... వాటిని ఎవరు అధిగమిస్తారనేది చూడాలి. లండన్: ఇంగ్లండ్ గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉన్న భారత క్రికెట్ జట్టు మరో సమరానికి తమ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. గురువారం నుంచి ‘లార్డ్స్’లో జరిగే రెండో టెస్టులో కోహ్లి సేన... ఆతిథ్య ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఒకే ఒక మార్పు మినహా టీమిండియా బృందంలో సమస్యలేమీ లేకపోగా... ఇద్దరు ప్రధాన పేసర్ల గాయాలతో ఇంగ్లండ్ ఇబ్బంది పడుతోంది. స్వల్ప బ్యాటింగ్ సమస్యను మినహాయిస్తే మొత్తంగా ఇంగ్లండ్‌పై ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. శార్దుల్ అవుట్ నాటింగ్‌హామ్‌లో ‘డ్రా’గా ముగిసిన తొలి టెస్టు నుంచి భారత తుది జట్టులో ఒక మార్పు ఖాయమైంది. పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో మరో పేస్ బౌలర్ ఇషాంత్ లేదా ఉమేశ్‌లకు అవకాశం ఇవ్వాలనేది టీమ్ మేనేజ్మెంట్ ముందున్న ఒక ప్రత్యా మ్నాయం. అయితే ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంతో పోలిస్తే కొంత పొడిగా ఉండే లార్డ్స్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుంటే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ తుది జట్టులోకి సరిగ్గా సరిపోతాడు. పైగా కొంత బ్యాటింగ్‌ను బలంగా మార్చాలనే కారణంతోనే శార్దుల్‌కు తొలి టెస్టులో అవకాశం దక్కింది. అలా చూస్తే మంచి బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఉన్న అశ్విన్‌వైపే మొగ్గు ఎక్కువగా ఉంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తలకు తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే అతని స్థానంలో గత మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ చక్కటి బ్యాటింగ్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దాంతో మయాంక్ తన చాన్స్ కోసం మళ్లీ వేచి చూడాల్సిందే. మరోవైపు భయపడినట్లుగానే భారత ప్రధాన బ్యాటింగ్ త్రయం పుజారా, కోహ్లి, రహానే గత టెస్టులోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో వీరు వరుసగా 4, 0, 1 పరుగులు చేశారు. ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరు రాణిస్తే తప్ప భారత్ భారీ స్కోరుకు అవకాశం ఉండదు. జడేజా ఆదుకోవడంతో సరిపోయింది కాబట్టి భారత్ కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఇక్కడ వీరు ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూ టీసీ) ఫైనల్లో విఫలమైన బుమ్రా 9 వికెట్లతో మళ్లీ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. షమీ కూడా కీలక వికెట్లతో సత్తా చాటాడు. వీరికి అశ్విన్ పదునైన స్పిన్ జత కలిస్తే భారత్‌కు ఎదురుండదు. పిచ్, వాతావరణం: బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. మంచి ఎండ కాయడంతో పాటు పోలిస్తే వర్ష సూచన లేకపోవడం సానుకూలాంశం. టాస్ గెలిచిన టీమ్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టె న్), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, జడేజా, అశ్విన్, షమీ, బుమ్రా, సిరాజ్. ఇంగ్లండ్: రూట్, బర్న్స్, సిబ్లీ, హసీబ్ హమీద్, బెయిర్‌స్టో, బట్లర్, అలీ, స్యామ్ కరన్, రాబిన్సన్, వుడ్, ఒవర్టన్/సాఖిబ్. స్టువర్ట్ బ్రాడ్ అవుట్ రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు భారీ దెబ్బ తగిలింది. సీనియర్ పేస్ బౌలర్, కెరీర్లో 150వ టెస్టు ఆడాల్సి ఉన్న స్టువర్ట్ బ్రాడ్ గాయం కారణంగా మ్యాచ్‌తో పాటు పూర్తిగా సిరీస్‌కే దూరమయ్యాడు. అతని స్థానంలో మార్క్ వుడ్‌ను ఇంగ్లండ్ ఎంపిక చేసింది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అయిన వుడ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది చెప్పలేం. ఇక మరో సీనియర్ అండర్సన్ ఫిట్‌నెస్‌పై కూడా సందేహాలున్నాయి. ఈసీబీ అధికారికంగా ప్రకటించలేదు కానీ గాయం తీవ్రంగా ఉండి అండర్సన్ కూడా దూరమైతే ఇంగ్లండ్ ఒక్కసారిగా బలహీనంగా మారిపోవడం ఖాయం. అండర్సన్ స్థానంలో ముందు జాగ్రత్తగా సాఖిబ్ మహమూద్‌ను జట్టులోకి తీసుకున్నారు. బౌలింగ్ ఇలా ఉండగా బ్యాటింగ్‌లో ఆ జట్టు పరిస్థితి మరీ పేలవంగా ఉంది. తొలి టెస్టులో రూట్ ఆదుకోకపోయుంటే ఇంగ్లండ్ ఎప్పుడో కుప్పకూలి సునాయాసంగా ఓడిపోయేది. సరిగ్గా చెప్పాలంటే గత కొన్నేళ్లలో ఇంగ్లండ్ బ్యాటింగ్ బృందం స్వదేశంలో ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదు. బర్న్స్, సిబ్లీ, క్రాలీ, లారెన్స్... ఇలా అంతా విఫలం కావడంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు! ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి మళ్లీ టెస్టు టీమ్‌లో స్థానం లభించింది. భారత్‌పై మంచి రికార్డు ఉన్న అలీ అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో కూడా ప్రభావం చూపించగలడు. క్రాలీ స్థానంలో హమీద్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. తొలి టెస్టులో ‘స్లో ఓవర్ రేట్’ను నమోదు చేసిన భారత్, ఇంగ్లండ్ జట్లపై ఐసీసీ చర్య తీసుకుంది. ఇరు జట్లకు డబ్ల్యూటీసీ పాయింట్లనుంచి చెరో 2 పాయింట్లు కోత విధించారు. అంటే నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయితే దక్కే 4 పాయింట్లలో ఒక్కో జట్టుకు ఇప్పుడు రెండేసి పాయిట్లు మాత్రమే లభిస్తాయి. దీంతో పాటు మ్యాచ్ ఫీజులో ఒక్కో జట్టుకు 40 శాతం జరిమానా కూడా ఐసీసీ విధించింది. -
సిరీస్‌తోపాటు ‘టాప్’ ర్యాంక్ సొంతం
బర్మింగ్హమ్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 38 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 10.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసి గెలిచింది. 1999లో స్టీఫెన్ ఫ్లెమింగ్ నాయకత్వంలోని న్యూజి లాండ్ బృందం ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌కు దక్కిన తొలి టెస్టు సిరీస్ విజయం ఇదే కావడం విశేషం. మరోవైపు 2014 తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం ఇంగ్లండ్‌కు ఇదే మొదటిసారి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 122/9తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్... రోజు తొలి బంతికే మిగిలిన వికెట్‌ను కోల్పోయి ఆలౌటైంది. హెన్రీ, వ్యాగ్నర్ చెరో మూడు వికెట్లు తీశారు. అగ్ర స్థానంలోకి: ఇంగ్లండ్‌పై సిరీస్ విజయంతో న్యూజిలాండ్ జట్టు ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకుంది. ఈ సిరీస్‌కు ముందు భారత్ 121 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో, న్యూజిలాండ్ 120 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాయి. అయితే తాజా విజయంతో న్యూజిలాండ్ 123 పాయింట్లతో అగ్రస్థానంలోకి వెళ్లగా... భారత్ రెండో స్థానానికి పడిపోయింది. -
Eng Vs Nz: ప్రయోగాత్మకంగా 18 వేల మందితో...
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో కరోనా తగ్గుముఖం పట్టడంతో వివిధ బహిరంగ కార్యక్రమాల్లో నెమ్మదిగా సాధారణ స్థితి చోటు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడే అవకాశం ఉన్న చోట ఎలాంటి కరోనా ఆంక్షలు పెట్టకుండా ఎక్కువ మందిని అనుమతిస్తే ఎలా ఉంటుంది? అసలు కరోనా తీవ్రత ఏమిటో, తాజా స్థితి ఏమిటో తెలిసిపోతుంది కదా! బ్రిటన్ ప్రభుత్వం ఇదే ఆలోచనతో కొన్ని పైలట్ కార్యక్రమాలు తీసుకొని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జూన్ 10 నుంచి జరిగే రెండో టెస్టులో స్టేడియం సామర్థ్యం లో 70 శాతాన్ని అనుమతించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగే ఈ టెస్టుకు ప్రతీరోజు కనీసం 18 వేల మంది వరకు హాజరు కావచ్చు. మ్యాచ్‌కు వచ్చే వారంతా 16 ఏళ్లకంటే ఎక్కువ వారై ఉండి, కరోనా నెగెటివ్ రిపోర్టు ఉంటే చాలు. మ్యాచ్ జరిగే సమయంలో మాస్క్‌లు వేసుకోవడం మినహా మరే ఇతర ఆంక్షలు ఉండవు. 2020 సీజన్ మొత్తం ప్రేక్షకులు లేకుండానే ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్లకు కూడా ఇది కొత్త ఉత్సాహం ఇస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఏర్పాట్లకు తగినంత సమయం లేకపోవడంతో లార్డ్స్‌లో జరిగే తొలి టెస్టులో మాత్రం ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం 25 శాతం మందినే అనుమతిస్తారు. గత కొద్ది రోజుల్లో బ్రిటన్ ప్రభుత్వం ఎఫ్ఏ కప్ ఫైనల్ (20 వేలు), స్నూకర్ ఫైనల్ (ఇండోర్‌లో వేయి మంది), కొన్ని మ్యూజిక్ కన్సర్ట్లు కలిపి మొత్తం 58 వేల మంది వరకు అనుమతించగా... చివరకు 15 మంది మాత్రమే ఇందులో కోవిడ్–19 పాజిటివ్‌గా తేలారు. -
జింబాబ్వే పోరాటం
అబుదాబి: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జింబాబ్వే ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 24/0తో ఆట కొనసాగించిన జింబాబ్వే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. కెప్టెన్ సీన్ విలియమ్స్ (106 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా... తిరిపానో (63 బ్యాటింగ్; 11 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు 8వ వికెట్‌కు అజేయంగా 124 పరుగులు జోడించారు. రషీద్ ఖాన్ 5 వికెట్లు తీశాడు. ప్రస్తుతం జింబాబ్వే కేవలం 8 పరుగుల ఆధిక్యంలో ఉంది. అఫ్గానిస్తాన్‌కు పరుగు పెనాల్టీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన అఫ్గాన్ జట్టుకు అంపైర్లు అనూ హ్య రీతిలో ఒక పరుగు పెనాల్టీగా విధించారు. మ్యాచ్ మూడో రోజు అఫ్గాన్ ఫీల్డర్ హష్మతుల్లా... ప్రత్యర్థి జట్టు టెయిలెండర్‌కు స్ట్రయికింగ్ రా వాలనే వ్యూహంతో బంతిని ఆపే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఒక కాలును బౌండరీ అవతల పెట్టాడు. ఓవర్ చివరి బంతికి రజా షాట్ ఆడగా సింగిల్ మాత్రమే వచ్చే అవకాశం కనిపించింది. అయితే మళ్లీ రజాకు స్ట్రయికింగ్ రాకుండా పదో నంబర్ బ్యాట్స్‌మన్ ముజరబానికి బ్యాటింగ్ రావాలని హష్మతుల్లా ఆశించాడు. అయితే దీనిని గుర్తించిన అంపైర్లు అదనపు పరుగు ఇవ్వడంతో పాటు రజాకే బ్యాటింగ్ అవకాశం కల్పించారు. -
మూడో కన్నే పొరపాటు చేస్తే ఎలా?
మ్యాచ్‌ల్లో అప్పుడప్పుడూ ఫీల్డ్ అంపై‘రాంగ్’ అవుతుంది. క్రికెట్లో ఇది సహజం. కానీ ఈ అంపైరింగ్‌ను సరిదిద్దే మూడో కన్నే (థర్డ్ అంపైర్) పొరపాటు చేస్తే... ఇంకో కన్ను ఉండదుగా! అయితే ఈ ఫలితం అనుభవించిన జట్టుకు మాత్రం శాపంగా మారుతుంది. చెన్నై రెండో టెస్టులో జరిగింది కూడా ఇదే. అందుకేనేమో రూట్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఇది గ్రహించిన రిఫరీ నిబంధనల మేరకు రివ్యూను పునరుద్ధరించారు. వివరాల్లోకెళితే... ఇన్నింగ్స్ 75వ ఓవర్లో స్పిన్నర్ జాక్ లీచ్ డెలివరీ రహానే గ్లౌజులను తాకుతూ ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఉన్న ఓలీ పోప్ చేతుల్లో పడింది. ఇంగ్లండ్ చేసిన ఈ అప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోలేదు. దీంతో కెప్టెన్ రూట్ రివ్యూకు వెళ్లాడు. టీవీ రీప్లేలు చూసిన థర్డ్ అంపైర్ అనిల్ చౌదరీ కూడా పొరపాటు చేశారు. ఆయన రీప్లేలన్నీ ఎల్బీడబ్ల్యూ కోసం పరిశీలించారు. కానీ క్యాచ్ ఔట్ అనే సంగతి మరిచారు. ఎల్బీ కాకపోవడంతో నాటౌట్ ఇచ్చారు. దీనిపై అప్పుడే రూట్ గ్లౌజులను తాకుతూనే వెళ్లిందిగా అన్నట్లు సంజ్ఞలు చేసి అసంతృప్తి వెళ్లగక్కాడు. మొత్తానికి రివ్యూ సఫలం కాకపోవడంతో ఒక రివ్యూను ఇంగ్లండ్ కోల్పోయింది. తదనంతర పరిశీలనలో కోల్పోయిన ఈ రివ్యూను పునరుద్ధరించారు. పిచ్ ఎలా ఉందో మాకు తెలుసు. ఇది బాగా టర్న్ అవుతుందని కూడా తెలుసు. అందుకే ప్రాక్టీస్ సెషన్లలో దీనికి తగ్గట్లే కసరత్తు చేశాం. ముఖ్యంగా టర్నింగ్ అయ్యే పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ చురుకైన ఆలోచనలతో ఆడాలి. ఇక్కడ నిష్క్రియా పరత్వం ఏ మాత్రం పనికిరాదు. మనముందు దీటైన బౌలర్ ఉంటే మనం తనకంటే దీటైన ఆట ఆడాలి. క్రీజులో ఉన్నప్పుడు షాట్ ఆడాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఆ షాట్‌నే బాదేస్తాం. అలాగే నేను స్వీప్ షాట్ ఆడదామనుకునే స్వీప్ చేశాను అంతే! దీనికి ఔటైనంత మాత్రాన భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. –రోహిత్ శర్మ, భారత ఓపెనర్ ఇంగ్లండ్కెప్టెన్ జో రూట్ -
భారత్-ఇంగ్లండ్ రెండో టెస్ట్; మనవైపు తిరుగుతుందా!
నాలుగేళ్ల క్రితం భారత జట్టు సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ తొలి టెస్టులో అనూహ్యంగా ఓడింది. అయితే వెంటనే కోలుకొని తర్వాతి టెస్టును, ఆపై సిరీస్‌ను కూడా గెలుచుకుంది. ఇప్పుడు కూడా టీమిండియా సరిగ్గా అలాంటి స్థితిలోనే నిలిచింది. ఇంకా చెప్పాలంటే గత 22 ఏళ్లలో స్వదేశంలో భారత్ ఎప్పుడూ వరుసగా రెండు టెస్టులు ఓడలేదు. తొలి టెస్టు పరాభవాన్ని వెనక్కి తోసి కోహ్లి సేన మరింత పట్టుదలతో చెలరేగితే ఈ మ్యాచ్‌లో తుది ఫలితం మారవచ్చు. మరోవైపు ఇంగ్లండ్ కూడా తమకు దక్కిన ఆధిక్యాన్ని చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. వేదిక అదే అయినా మరో పిచ్‌పై మ్యాచ్ జరుగుతుండటం, దానిపై తొలి రోజు నుంచే బంతి గింగిరాలు తిరుగుతుందని వినిపిస్తున్న నేపథ్యంలో ఏ జట్టు స్పిన్నర్లు ఎలా వాడుకుంటారనేది ఆసక్తికరం. అయితే మన జట్టుకు అనుకూలంగా తయారు చేయిస్తున్న స్పిన్ పిచ్ 2017 తరహాలో మనకే వ్యతిరేకంగా ‘బూమరాంగ్’ కాకుంటే మంచిది! చెన్నై: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పరాజయాన్ని మరచి కోహ్లి సేన మరో సమరానికి సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇక్కడి ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో శనివారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే సిరీస్‌లో కనీసం రెండు టెస్టులు గెలవాల్సిన భారత్ దానిని ఇక్కడే మొదలు పెట్టాల్సి ఉంది. మరోవైపు ఈ టెస్టునూ నెగ్గితే సిరీస్ చేజార్చుకునే ప్రమాదం నుంచి రూట్ సేన సురక్షితంగా బయపడుతుంది. అయితే తొలి మ్యాచ్ జోరును ఇంగ్లండ్ ఇక్కడా కొనసాగించగలదా అనేది చూడాలి. కరోనా కాలం తర్వాత ప్రేక్షకులను అనుమతిస్తున్న తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో అభిమానులు మైదానంలోకి అడుగు పెట్టనున్నారు. అక్షర్ పటేల్‌కు చోటు... అశ్విన్ మినహా మిగిలిన ఇద్దరు స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం కూడా తొలి టెస్టులో భారత జట్టు పరాజయానికి కారణాల్లో ఒకటి. ఆ మ్యాచ్‌కు అనూహ్యంగా గాయపడి ఆటకు దూరమైన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకొని ఈ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. అతను టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమైంది. షాబాజ్ నదీమ్ స్థానంలో అక్షర్ ఆడతాడు. అయితే కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటుపైనే ఉత్కంఠ నెలకొంది. గత మ్యాచ్‌లాగే బ్యాటింగ్ అవసరమని భావిస్తే వాషింగ్టన్ సుందర్ తన స్థానం నిలబెట్టుకుంటాడు. మిగిలిన జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగనుంది. కొన్నాళ్ల క్రితం దక్షిణాఫ్రికాపై తొలిసారి ఓపెనర్‌గా ఆడినప్పుడు చెలరేగిన రోహిత్ శర్మ మరోసారి భారీగా పరుగులు సాధించాలని జట్టు కోరుకుంటోంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూకుడైన బ్యాటింగ్ జట్టుకు అదనపు బలం. సొంత మైదానంలో సత్తా చాటిన అశ్విన్ దానిని పునరావృతం చేయాలని కోరుకుంటున్నాడు. సీనియర్ పేసర్లు ఇషాంత్, బుమ్రా అందుబాటులో ఉండటంతో మరోసారి హైదరాబాద్ బౌలర్ సిరాజ్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. దాదాపు అదే జట్టు ఆడుతోంది కాబట్టి తొలి టెస్టు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే టీమిండియా మరోసారి తన స్థాయిని ప్రదర్శించగలదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), గిల్, రోహిత్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్, ఇషాంత్, బుమ్రా, సుందర్/ కుల్దీప్. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), సిబ్లీ, బర్న్స్, లారెన్స్, స్టోక్స్, పోప్, ఫోక్స్, అలీ, బ్రాడ్, లీచ్, వోక్స్/స్టోన్. పిచ్, వాతావరణం తొలి టెస్టుతో పోలిస్తే భిన్నమైన పిచ్. మొదటి రోజు నుంచే స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. అయితే ఐదు రోజులు ఇలాంటి పిచ్ మనగలదా అనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో టాస్ మరోసారి కీలకం కానుంది. మ్యాచ్‌కు వర్షం నుంచి ముప్పు లేదు. నాలుగు మార్పులతో... ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు తమ 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మొదటి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయంలో సీనియర్ పేసర్ అండర్సన్ రెండో ఇన్నింగ్స్‌లో వేసిన అద్భుత స్పెల్ పాత్ర ఎంతో ఉంది. ఆ ప్రదర్శన అనంతరం రెండో టెస్టులో కూడా తాను ఆడాలని ఉత్సాహంగా ఉన్నట్లు అండర్సన్ చెప్పాడు. అయితే ఇంగ్లండ్ బోర్డు మాత్రం తమ ‘రొటేషన్ పాలసీ’ని ఏమాత్రం మార్చేది లేదని కచ్చితంగా చెప్పేసింది. అతని స్థానంలో మరో సీనియర్ స్టువర్ట్ బ్రాడ్ జట్టులోకి వస్తాడు. గాయపడ్డ ఆర్చర్ స్థానంలో అదే స్థాయి వేగంతో బౌలింగ్ చేసే ఒలీ స్టోన్ లేదా ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్లలో ఒకరు జట్టులోకి వస్తారు. బట్లర్ తిరిగి స్వదేశం వెళ్లడంతో ఫోక్స్ వికెట్ కీపర్‌గా జట్టులోకి రాగా... బెస్ స్థానంలో మొయిన్ అలీకి అవకాశం లభించింది. అయితే ఈసారి కూడా ఇంగ్లండ్ అవకాశాలు రూట్ బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. -
అండర్సన్ అదరహో
గాలె: శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (6/40) గాలెలో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. దీంతో ఓవర్‌నైట్ స్కోరు 229/4తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 381 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ (110; 11 ఫోర్లు), డిక్వెలా (92; 10 ఫోర్లు) వికెట్లను దక్కించుకున్న అండర్సన్ కెరీర్లో 30వసారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను దక్కించుకున్నాడు. తర్వాత సురంగ లక్మల్ (0)ను పెవిలియన్ పంపించి ఈ మైదానంలో తన అత్యుత్తమ ప్రదర్శన (2012లో; 5/75)ను సవరించడంతో పాటు, ఉపఖండంలో 5 వికెట్లు దక్కించుకున్న పెద్ద వయస్కుడిగా 38 ఏళ్ల అండర్సన్ ఘనత వహించాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేసర్ రిచర్డ్ హ్యాడ్లీ (37 ఏళ్లు) పేరిట ఉండేది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 30 ఓవర్లలో 2 వికెట్లకు 98 పరుగులు చేసింది. -
మొదటి రోజు మనదే
అడిలైడ్ అపజయాన్ని అల్లంత దూరాన పెడుతూ మెల్బోర్న్ టెస్టును భారత జట్టు మెరుగైన రీతిలో ఆరంభించింది. మన బౌలర్లు మరోసారి మెరవడంతో ఆస్ట్రేలియా మళ్లీ 200 పరుగులు కూడా దాటలేకపోయింది. బుమ్రా పదునైన బౌలింగ్, అశ్విన్ అనుభవ ప్రదర్శనకు తోడు అరంగేట్రం టెస్టులో హైదరాబాదీ సిరాజ్ కూడా ఆకట్టుకోవడంతో ఆసీస్ జట్టులో ఒక్కరూ కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయారు. బదులుగా మరోసారి సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... గత మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మిగిల్చిన స్కోరు (36) వద్దే మొదటి రోజు ఆట ముగించింది. అయితే మెల్లగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతున్న పిచ్ రెండో రోజు మన ఆటగాళ్ల ప్రదర్శనపై ఆశలు రేపుతోంది. మెల్బోర్న్: ఉదయం 11 మిల్లీ మీటర్ల పచ్చికపై, కాస్త తేమ కూడా ఉన్న పిచ్‌పై బ్యాటింగ్ ఎంచుకొని ఆస్ట్రేలియా చేసిన సాహసం ఆ జట్టుకు పనికి రాలేదు. భారత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 72.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌటైంది. మార్నస్ లబ్‌షేన్ (132 బంతుల్లో 48; 4 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (38), మాథ్యూ వేడ్ (30) మాత్రమే కొద్దిగా పరుగులు చేయగలిగారు. బుమ్రాకు 4 వికెట్లు దక్కగా, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 36 పరుగులు చేసింది. మయాంక్ ‘డకౌట్’కాగా... శుబ్‌మన్ గిల్ (28 బ్యాటింగ్), పుజారా (7 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. కీలక భాగస్వామ్యం... భారత బౌలింగ్ పదునుకు తోడు కొన్ని చెత్త షాట్లు ఆసీస్ స్కోరును 200 లోపే పరిమితం చేశాయి. జట్టుకు సరైన ఓపెనింగ్ కూడా లభించలేదు. తన పేలవ ఫామ్‌ను కొనసాగించిన జో బర్న్స్ (0) బుమ్రా వేసిన చక్కటి బంతిని ఆడలేక కీపర్ పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. కొంత దూకుడు ప్రదర్శించిన వేడ్ తాను టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయాన్ని మరచిపోయినట్లుగా అశ్విన్ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడి వెనుదిరిగాడు. ఆ వెంటనే టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్ (0) కూడా డకౌట్‌గా వెనుదిరగడంతో జట్టు కష్టాలు పెరిగాయి. ఈ దశలో లబ్‌షేన్, హెడ్ 86 పరుగుల భాగస్వామ్యం ఆసీస్‌ను ఆదుకుంది. బుమ్రా బౌలింగ్‌లో లబ్‌షేన్ (స్కోరు 6) అవుట్ కోసం ఎల్బీ అప్పీల్ చేసిన భారత్... రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 26 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... ఈసారి తాను రివ్యూ కోరి లబ్‌షేన్ బయటపడ్డాడు. లంచ్ సమయానికి జట్టు 65 పరుగులు చేసింది. రెండో సెషన్లోనూ లబ్‌షేన్, హెడ్ సాధికారికంగా, చక్కటి సమన్వయంతో ఆడారు. తొలి గంటలో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో పరుగులు కూడా చకచకా వచ్చాయి. భాగస్వామ్యం మరింత పటిష్టంగా మారుతున్న దశలో మరో పదునైన బంతితో హెడ్‌ను అవుట్ చేసి బుమ్రా ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే లబ్‌షేన్‌ను అవుట్ చేసి టెస్టుల్లో తొలి వికెట్ సాధించిన సిరాజ్... కామెరాన్ గ్రీన్ (12)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. గత టెస్టు తరహాలో ఈసారి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ జట్టును ఆదుకోలేకపోయాడు. అశ్విన్ బంతిని సమర్థంగా ఎదుర్కోలేక పైన్ (13) బ్యాక్వర్డ్ షార్ట్ లెగ్‌లో విహారికి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. గిల్ అదృష్టం... సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు ఇదే మైదానంలో అరంగేట్రం చేసి అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్‌కు ఈసారి కలిసి రాలేదు. స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే మయాంక్ (0) వెనుదిరగడంతో స్కోరు బోర్డులో పరుగులు చేరకుండానే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే గిల్, పుజారా కలిసి జాగ్రత్తగా ఆడారు. తమ పదునైన బంతులతో ఆసీస్ పేసర్లు టీమిండియా ఓపెనర్లను కొంత ఇబ్బంది పెట్టారు. కమిన్స్ బౌలింగ్‌లో 5 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మూడో స్లిప్‌లో లబ్‌షేన్ వదిలేశాడు. అయితే ఆ తర్వాత గిల్ కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. ముఖ్యంగా స్టార్క్ ఓవర్లో కొట్టిన రెండు ఫోర్లు అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించాయి. అవుటా... నాటౌటా! ఆసీస్ కెప్టెన్ పైన్ రనౌట్ విషయంలో భారత్‌కు ప్రతికూల ఫలితం రావడం కొంత చర్చకు దారి తీసింది. అశ్విన్ బౌలింగ్‌లో గ్రీన్ షాట్ ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. కొంత సందిగ్ధంతో పైన్ అవతలి ఎండ్‌కు పరుగు తీయగా... అదే సమయంలో కవర్స్ నుంచి ఉమేశ్ విసిరిన త్రోను అందుకున్న పంత్ స్టంప్స్‌ను పడగొట్టాడు. దాంతో మూడో అంపైర్‌ను సంప్రదించాల్సి వచ్చింది. రీప్లేలలో పైన్ బ్యాట్ లైన్పైనే ఉన్నట్లు కనిపించింది. అలా చూస్తే అతను అవుట్. అయితే థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ పదే పదే రీప్లేలు చూసిన అనంతరం నాటౌట్‌గా ప్రకటించారు. మరో కోణంలో బ్యాట్ కాస్త లోపలికి వచ్చినట్లు కనిపించడం కూడా అందుకు కారణం కావచ్చు. అయితే దీనిపై కెప్టెన్ రహానే అంపైర్ ముందు అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది. నువ్వా...నేనా! మాథ్యూ వేడ్ క్యాచ్‌ను అందుకునే విషయంలో భారత ఫీల్డర్లు గిల్, జడేజా మధ్య సాగిన పోటీ కొంత ఉత్కంఠను రేపింది. అశ్విన్ బౌలింగ్‌లో వేడ్ కొట్టిన షాట్‌కు బంతి గాల్లోకి లేవగా మిడ్ వికెట్ నుంచి గిల్, మిడాన్ నుంచి జడేజా పరుగెత్తుకుంటూ వచ్చారు. బంతిపై మాత్రమే దృష్టి పెట్టిన వీరిద్దరు ఒకరిని మరొకరు చూసుకోలేదు. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత జడేజా ఆగమంటూ సైగ చేసినా గిల్ పట్టించుకోలేదు. చివరి క్షణంలో జడేజా కాస్త ఎత్తులోనే బంతిని అందుకొని పదిలం చేసుకోగా, గిల్ మాత్రం జారుతూ జడేజా సమీపంలోనే కింద పడ్డాడు. జడేజా ఏకాగ్రత, సరైన నియంత్రణ వల్ల ఇద్దరూ ఢీకొనలేదు గానీ లేదంటే ప్రమాదమే జరిగేది! డీన్ జోన్స్‌కు నివాళి మూడు నెలల క్రితం కన్నుమూసిన ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్‌కు అతని సొంత మైదానం ఎంసీజీలో రెండో టెస్టు సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు నివాళులు అర్పించారు. మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ తోడు రాగా... జోన్స్ భార్య, ఇద్దరు కూతుళ్లు మైదానంలోకి వచ్చి అతను ఉపయోగించిన బ్యాట్, బ్యాగీ గ్రీన్, సన్‌గ్లాసెస్‌ను వారు స్టంప్స్‌పై ఉంచారు. అనంతరం వాటిని బౌండరీ బయట సీట్‌పై పెట్టారు. జోన్స్‌ను గుర్తు చేసే విధంగా కొందరు ఆసీస్ క్రికెటర్లు తమ పెదవులపై అతనిలాగే జింక్ బామ్ పూసుకొని వచ్చారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాల్సిన రాడ్ టకర్...తన తల్లి మరణించడంతో చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఆక్సెన్‌ఫర్డ్ అంపైర్‌గా వచ్చారు. టకర్ తల్లికి నివాళిగా అంపైర్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (సి) పంత్ (బి) బుమ్రా 0; వేడ్ (సి) జడేజా (బి) అశ్విన్ 30; లబ్‌షేన్ (సి) గిల్ (బి) సిరాజ్ 48; స్మిత్ (సి) పుజారా (బి) అశ్విన్ 0; హెడ్ (సి) రహానే (బి) బుమ్రా 38; గ్రీన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 12; పైన్ (సి) విహారి (బి) అశ్విన్ 13; కమిన్స్ (సి) సిరాజ్ (బి) జడేజా 9; స్టార్క్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 7; లయన్ (ఎల్బీ) (బి) బుమ్రా 20; హాజల్‌వుడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (72.3 ఓవర్లలో ఆలౌట్) 195 వికెట్ల పతనం: 1–10, 2–35, 3–38, 4–124, 5–134, 6–155, 7–155, 8–164, 9–191, 10–195. బౌలింగ్: బుమ్రా 16–4–56–4, ఉమేశ్ యాదవ్ 12–2–39–0, అశ్విన్ 24–7–35–3, జడేజా 5.3–1–15–1, సిరాజ్ 15–4–40–2. భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; శుబ్‌మన్ గిల్ (బ్యాటింగ్) 28; పుజారా (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టానికి) 36 వికెట్ల పతనం: 1–0. బౌలింగ్: స్టార్క్ 4–2–14–1, కమిన్స్ 4–1–14–0, హాజల్‌వుడ్ 2–0–2–0, లయన్ 1–0–6–0. -
జోరుగా భారత్ ప్రాక్టీస్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో చిత్తుగా ఓడిన భారత జట్టు కోలుకునే ప్రయత్నంలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. జట్టు ఆటగాళ్లంతా గురువారం కూడా తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. ‘కన్కషన్’నుంచి కోలుకుంటున్న రవీంద్ర జడేజా బ్యాట్ పట్టుకొని వికెట్ల మధ్య పరుగు తీస్తూ ఫిట్నెస్ను నిరూపించుకునే ప్రయత్నంలో పడగా...యువ బౌలర్ నటరాజన్ తన పదునైన బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాడు. రహానే, పుజారాలు అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. రాహుల్, పంత్ కూడా ఎక్కువ సమయం నెట్స్‌లో చెమటోడ్చారు. చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ భారత ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించారు. అనంతరం రాహుల్, పృథ్వీషాలకు తగు సూచనలిచ్చిన రవిశాస్త్రి... కెప్టెన్ రహానేతో సుదీర్ఘ సమయం పాటు చర్చించాడు. మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టు? టెస్టు సిరీస్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు జనవరి 7నుంచి సిడ్నీలో జరగాల్సి ఉంది. అయితే నగరంలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణ సందేహంలో పడింది. ఇలాంటి స్థితిలో అవసరమైతే మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టును నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాల్సి వచ్చిందని... మెల్‌బోర్న్‌లోనే రెండో టెస్టు ముగిసేలోపు తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. -
న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్
వెల్లింగ్టన్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి 2–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం నాలుగోరోజు 85 పరుగుల లోటుతో 244/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 317 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ జోషువా సిల్వా (57; 6 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా... టెయిలెండర్లలో అల్జారి జోసెఫ్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో చకచకా 24 పరుగులు చేశాడు. వాగ్నర్, బౌల్ట్ చెరో 3 వికెట్లు, సౌతీ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 460 పరుగులు చేస్తే విండీస్ 131 పరుగులకే కుప్పకూలడంతో ఫాలోఆన్ ఆడా ల్సివచ్చింది. నికోల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... జేమీసన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. అయినా... ఆసీసే ‘టాప్’ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియానే అగ్రస్థానంలో ఉందని ఐసీసీ ప్రకటించింది. కివీస్ 2–0తో కరీబియన్లను వైట్‌వాష్ చేసినప్పటికీ, 116 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియాతో సమంగా ఉన్నప్పటికీ డెసిమల్ పాయింట్ల వ్యత్యాసంతో న్యూజిలాండ్ రెండో స్థానంలోనే ఉందని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆసీస్ 116.461 పాయింట్లతో ఉండగా... కివీస్ 116.375 పాయింట్లతో ఉందని వివరణ ఇచ్చింది. టీమిండియా 114 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో కొనసాగుతుంది. -
ఇన్నింగ్స్ ఓటమి దిశగా విండీస్
వెల్లింగ్టన్: విండీస్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం దాదాపుగా ఖాయమైనట్లే. వెలుతురులేమితో మూడోరోజు ఆదివారం ఆట నిలిచి పోయే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 6 వికెట్లకు 244 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే విండీస్ ఇంకా 85 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 124/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ మరో 7 పరుగులే జోడించి 131 పరుగులవద్ద ఆలౌటైంది. న్యూజి లాండ్ బౌలర్లు జేమీసన్ (5/34), సౌతీ (5/32) విండీస్ వికెట్ల పతనాన్ని శాసించారు. 329 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా విండీస్‌ను ఫాలోఆన్ ఇన్నింగ్స్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ విండీస్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. కివీస్ బౌలర్లు బౌల్ట్ (3/75), జేమీసన్ (2/43) విజృంభించగా... జాన్ క్యాంప్‌బెల్ (109 బంతుల్లో 68; 8 ఫోర్లు), కెప్టెన్ జేసన్ హోల్డర్ (89 బంతుల్లో 60 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో విండీస్‌ను ఆదుకున్నారు. చివర్లో సిల్వా (25 బ్యాటింగ్)తో కలిసి హోల్డర్ ఏడో వికెట్‌కు అజేయంగా 74 పరుగుల్ని జోడించాడు. అనంతరం దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఆటను నిలిపివేశారు. -
సమమా... సంచలనమా!
ఇంగ్లండ్ గడ్డపై వెస్టిండీస్ టెస్టు సిరీస్ గెలిచి 32 ఏళ్లయింది. జట్టులో దిగ్గజాలు ఉన్న కాలంలో 1988లో ఈ ఘనత సాధించింది. ఇప్పుడు ఆ జట్టు ముందు బంగారు అవకాశం నిలిచింది. తొలి టెస్టు విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో గెలుపు అందుకుంటే ఈ సిరీస్ చిరస్మరణీయంగా మారిపోతుంది. అయితే అనూహ్యంగా గత మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్ సొంతగడ్డపై మళ్లీ కోలుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌కు ముందు వరుసగా నాలుగు సిరీస్‌లలో తొలి టెస్టులో ఓడి కూడా ముందంజ వేసిన ఇంగ్లండ్ దానినే పునరావృతం చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్: ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు అంతా కరోనాకు సంబంధించిన హంగామాయే. మ్యాచ్ ఫలితంకంటే ఆట జరగడంపైనే అందరి దృష్టీ నిలిచింది. అయితే ఇప్పుడు అదంతా గతం. కరోనా ప్రస్తావన లేకుండా క్రికెట్ గురించి చర్చ మొదలైంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానం వేదికగా రెండో టెస్టు జరగనుంది. సౌతాంప్టన్‌లో తొలి మ్యాచ్ గెలిచిన విండీస్ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో ఉంది. డెన్లీపై వేటు... అండర్సన్, వుడ్లకు విశ్రాంతి సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్ తుది జట్టును మ్యాచ్ రోజే ప్రకటించనుంది. అయితే తొలి టెస్టులో ఆడిన ముగ్గురిని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ జో రూట్ మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. దాంతో జో డెన్లీని తుది జట్టు నుంచి తప్పించారు. నిజానికి రూట్ స్థానంలో తొలి టెస్టులో క్రాలీ ఆడినా... రెండో ఇన్నింగ్స్‌లో అతను బాగా ఆడటం, డెన్లీ రెండుసార్లు కూడా విఫలం కావడంతో వేటు తప్పలేదు. తొలి టెస్టులో ఆడిన బౌలర్లు అండర్సన్, మార్క్ వుడ్లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్థానాల్లో స్టువర్ట్ బ్రాడ్, ఒలీ రాబిన్సన్లను 13 మందితో ప్రకటించిన జట్టులోకి తీసుకున్నారు. తొలి టెస్టులో తనను తుది జట్టు నుంచి తప్పించడంపై స్టువర్ట్ బ్రాడ్ బహిరంగంగానే అసంతృప్తిని ప్రకటించాడు. మొత్తంగా చూస్తే బ్యాటింగ్ వైఫల్యం గత మ్యాచ్‌లో ఓటమికి కారణమైంది. కాబట్టి బ్యాట్స్‌మెన్‌పై ఈసారి బాధ్యత మరింత పెరిగింది. రూట్ రాకతో లైనప్ పటిష్టంగా మారింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ సొంతగడ్డపై ఇంగ్లండ్ స్థాయికి తగిన స్కోర్లు రాలేదు. కీపర్ బట్లర్ వైఫల్యం కూడా జట్టును దెబ్బతీస్తోంది. టాప్ ఆల్‌రౌండర్ స్టోక్స్ కెప్టెన్సీ సత్తా చాటితే ఇంగ్లండ్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. అదే విధంగా అండర్సన్ నుంచి కూడా జట్టు మరింత మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మార్పుల్లేకుండానే... తొలి టెస్టు విజయంలో విండీస్ ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు కీలకపాత్ర పోషించారు. అవసరమైన సందర్భంలో పట్టుదలగా ఆడి సమష్టితత్వంతో గెలిపించారు. కాబట్టి సహజంగానే అదే తుది జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కాస్త ఉదాసీనత ప్రదర్శించకుండా ఉంటే మరో గెలుపు సాధించేందుకు టీమ్‌కు అన్ని రకాలుగా అర్హత ఉంది. నలుగురు పేస్ బౌలర్ల మంత్రం గత మ్యాచ్‌లో ఫలించింది. ముఖ్యంగా హోల్డర్, గాబ్రియెల్ ప్రత్యర్థిని బాగా దెబ్బ కొట్టారు. వీరికి తోడు రోచ్ కూడా చెలరేగాల్సి ఉంది. ఏకైక స్పిన్నర్ ఛేజ్ తన విలువేంటో మళ్లీ చూపించాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్ శుభారంభం అందిస్తే విండీస్ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. తనలో ప్రతిభను బ్లాక్‌వుడ్ ఒక్క ఇన్నింగ్స్‌తో బయటపెట్టాడు. విడివిడిగా చూస్తే ఏ ఒక్కరూ స్టార్ కాకపోయినా జట్టుగా విండీస్ చెలరేగింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తే మరో గెలుపు అసాధ్యం కాబోదు. ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటివరకు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య 15 టెస్టులు జరిగాయి. 6 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, 5 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ గెలిచాయి. 4 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ఈ వేదికలో ఇంగ్లండ్‌పై విండీస్ చివరిసారి 1988లో టెస్టు గెలిచింది. ఇంగ్లండ్ మాత్రం విండీస్‌తో ఇక్కడ జరిగిన చివరి నాలుగు టెస్టుల్లో మూడింటిలో గెలిచి, మరో దానిని ‘డ్రా’ చేసుకుంది.