Gudakesh Motie: వెస్టిండీస్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ధాటికి జింబాబ్వే విలవిలలాడింది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) మొదలైన రెండో టెస్ట్‌లో మోటీ 7 వికెట్లతో విజృంభించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది.
మోటీతో పాటు జేసన్ హోల్డర్ (2/18), అల్జరీ జోసఫ్ (1/29) రాణించడంతో జింబాబ్వే స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఇన్నోసెంట్ కాలా (38) టాప్ స్కోర్‌గా నిలిచాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కాలాతో పాటు చిబాబ (10), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (22), ట్రిపానో (23 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రేమన్ రీఫర్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ (36), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (22) ఓ మోస్తరుగా రాణించారు. కైల్ మేయర్స్ (8), రోస్టన్ చేజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో బ్రెండన్ మవుటా 2 వికెట్లు పడగొట్టగా.. మసకద్జకు ఓ వికెట్ దక్కంది. రీఫర్ రనౌటయ్యాడు.
కాగా, తొలి టెస్ట్ సెంచరీ హీరో, జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవడం విశేషం. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో బ్యాలెన్స్‌తో పాటు విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ సెంచరీలు చేయగా.. శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్‌నరైన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు.
Comments
Please login to add a commentAdd a comment