Tagenarine Chanderpaul
-
IND VS WI 1st Test: బాలీవుడ్ సినిమాలో ప్రస్తుత వెస్టిండీస్ క్రికెటర్.. ఎవరంటే..?
ప్రస్తుతం భారత్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విండీస్ క్రికెట్ జట్టులోని ఓ సభ్యుడు ఓ ప్రముఖ బాలీవుడ్ సినిమాలో నటించాడన్న విషయం మనలో చాలామందికి తెలీకపోవచ్చు. 1983లో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ నేతృత్వంలో భారత్ వరల్డ్‌కప్ సాధించిన ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడిన 83 సినిమాలో విండీస్ లెజండరీ క్రికెటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ తనయుడు, ప్రస్తుత విండీస్ ఓపెనర్ తేజ్‌నరైన్ చంద్రపాల్ అతిధిపాత్రలో నటించాడు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్, అతని భార్య పాత్రలో దీపికా పదుకోన్ నటించారు. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో తేజ్‌నరైన్ అప్పటి విండీస్ ప్లేయర్ లారీ గోమ్స్ పాత్రలో నటించాడు. లండన్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రణ్వీర్, దీపికాలతో తేజ్‌నరైన్ తీసుకున్న ఓ సెల్ఫీ ప్రస్తుతం నెటింట్ట వైరలవుతుంది. I think he’s the first actor with a professional movie experience to play test cricket for Windies 😂😂 Tagenarine played Larry Gomes in 83. https://t.co/jiV1esjaj8 pic.twitter.com/6nQiBKIX5T — Gaurav Nandan Tripathi 🜃 (@Cric_Beyond_Ent) November 30, 2022 ఇదిలా ఉంటే, ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. యశస్వి జైస్వాల్ (143), విరాట్ కోహ్లి (36) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 150 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ (5/60), జడేజా (3/26) విండీస్ పతనాన్ని శాసించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజే (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తేజ్‌నరైన్ చంద్రపాల్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. -
తండ్రీ కొడుకులిద్దరిని ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా
టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఇదే టెస్టులో రెండు వికెట్లు తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన అశ్విన్ మరో ఘనత కూడా అందుకున్నాడు. మ్యాచ్ ద్వారా తండ్రీ కొడుకులిద్దరినీ టెస్టు క్రికెట్లో అవుట్ చేసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011లో తన తొలి టెస్టులో శివ్‌నారాయణ్ చందర్‌పాల్ వికెట్ తీసిన అశ్విన్.. తాజాగా తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను అవుట్ చేశాడు. గతంలో బోథమ్, వసీమ్ అక్రమ్, మిచెల్ స్టార్క్, సైమన్ హార్మర్ ఇలాంటి ఫీట్‌ను నమోదు చేశారు. ఇయాన్ బోథమ్:లాన్స్ కెయిన్స్, క్రిస్ కెయిన్స్ వసీం అక్రమ్:లాన్స్ కెయిన్స్, క్రిస్ కెయిన్స్ మిచెల్ స్టార్క్: శివనరైన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్ సైమన్ హార్మర్: శివనరైన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్ ఆర్ అశ్విన్: శివనరైన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్ The moment Ravi Ashwin created history! The first Indian to pick the wicket of father (Shivnarine) and son (Tagenarine) in Tests. pic.twitter.com/nvqXhLz0ze — Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2023 33వ సారి ఐదు వికెట్ల హాల్.. అండర్సన్ రికార్డు బద్దలు ఇక టెస్టు క్రికెట్లో అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 33వ సారి. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్‌ను అధిగమించాడు. అండర్సన్ 32 సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఇక అశ్విన్ కంటే ముందు ఐదుగురు బౌలర్లు ఎక్కువసార్లు ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్నారు. తొలి స్థానంలో ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు(133 టెస్టులు), షేన్ వార్న్ 37 సార్లు(145 మ్యాచ్‌లు), రిచర్డ్ హడ్లీ 36 సార్లు(86 మ్యాచ్‌లు), అనిల్ కుంబ్లే 35 సార్లు(132 మ్యాచ్‌లు), రంగనా హెరాత్ 34 సార్లు( 93 మ్యాచ్‌లు) ఉన్నారు. చదవండి: అశ్విన్ పాంచ్ పటాకా.. ఆకట్టుకున్న జైశ్వాల్, తొలిరోజు టీమిండియాదే -
Ind Vs WI: చెలరేగిన అశ్విన్.. అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు బద్దలు
West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన సిరాజ్ ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం (జూలై 12) తొలి టెస్టు ఆరంభమైంది. డొమినికా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కరేబియన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. తొలి వికెట్‌ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు అశ్విన్. స్పిన్ మాయాజాలంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అద్భుత బౌలింగ్‌తో తగెనరైన్ చందర్‌పాల్‌ను బోల్తా కొట్టించాడు. తన స్పిన్ మాయాజాలంతో చందర్‌పాల్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో విండీస్వీ మ్యాచ్‌లో తొలి వికెట్ కోల్పోగా.. అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. కాగా తగెనరైన్ చందర్‌పాల్‌ను అవుట్ చేసిన అశూ.. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు బౌల్డ్ చేయడం ద్వారా సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. కుంబ్లేను అధిగమించి ఇక దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 94 సార్లు ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బౌల్డ్ చేయగా.. అశ్విన్.. చందర్‌పాల్ వికెట్‌తో తన నెంబర్‌ను 95గా నమోదు చేశాడు. ఇక మహ్మద్ షమీ 66 సార్లు, కపిల్ దేవ్ 88 సార్లు ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను బౌల్డ్ చేశారు. కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్ 17వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ వికెట్‌ను కూడా పడగొట్టాడు. ఈ క్రమంలో 17 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా ఇషాన్ కిషన్, యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేశారు. ఈ ఇద్దరు లెఫ్టాండ్ బ్యాటర్లలో యశస్వి ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. ఇషాన్ వికెట్ కీపర్‌గా సేవలు అందించనున్నాడు. మరోవైపు.. ఇషాన్ రాకతో ఆంధ్ర క్రికెటర్ శ్రీకర్ భరత్‌పై వేటు పడింది. చదవండి: మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విహారి! ఫైనల్లో జట్టును.. -
విండీస్ బౌలర్ ధాటికి విలవిలలాడిన జింబాబ్వే
Gudakesh Motie: వెస్టిండీస్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ధాటికి జింబాబ్వే విలవిలలాడింది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) మొదలైన రెండో టెస్ట్‌లో మోటీ 7 వికెట్లతో విజృంభించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. మోటీతో పాటు జేసన్ హోల్డర్ (2/18), అల్జరీ జోసఫ్ (1/29) రాణించడంతో జింబాబ్వే స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఇన్నోసెంట్ కాలా (38) టాప్ స్కోర్‌గా నిలిచాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కాలాతో పాటు చిబాబ (10), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (22), ట్రిపానో (23 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రేమన్ రీఫర్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ (36), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (22) ఓ మోస్తరుగా రాణించారు. కైల్ మేయర్స్ (8), రోస్టన్ చేజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో బ్రెండన్ మవుటా 2 వికెట్లు పడగొట్టగా.. మసకద్జకు ఓ వికెట్ దక్కంది. రీఫర్ రనౌటయ్యాడు. కాగా, తొలి టెస్ట్ సెంచరీ హీరో, జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవడం విశేషం. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో బ్యాలెన్స్‌తో పాటు విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ సెంచరీలు చేయగా.. శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్‌నరైన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. -
Zim Vs WI: జింబాబ్వే- వెస్టిండీస్ టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత
Zimbabwe vs West Indies, 1st Test- బులవాయో: వెస్టిండీస్, జింబాబ్వే మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు వెస్టిండీస్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 5 వికెట్లకు 203 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. బ్రాత్‌వైట్ (25; 3 ఫోర్లు), తేజ్‌నరైన్ (15) టెస్టు మ్యాచ్‌లో వరుసగా ఐదు రోజులు ఆడిన తొలి ఓపెనింగ్ జోడీగా గుర్తింపు పొందింది. ఇక ఈ మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ(207)తో మెరిసిన తేజ్‌నరైన్ చందర్‌పాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు 2023 మ్యాచ్ స్కోర్లు వెస్టిండీస్- 447/6 డిక్లేర్డ్ & 203/5 డిక్లేర్డ్ జింబాబ్వే- 379/9 డిక్లేర్డ్ & 134/6 చదవండి: Gary Ballance: రెండు దేశాల తరఫున సెంచరీలు.. ఎన్నో ఆసక్తికర విశేషాలు -
చరిత్ర సృష్టించిన తేజ్‌నరైన్ చంద్రపాల్.. తండ్రిని మించిపోయాడు..!
టెస్ట్ క్రికెట్లో వెస్టిండీస్ యువ ఓపెనర్ తేజ్‌నరైన్ చంద్రపాల్, తన తండ్రి శివ్‌నరైన్ చంద్రపాల్‌తో కలిసి ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ క్రమంలో తేజ్‌నరైన్ తన తండ్రిని కూడా వెనక్కునెట్టాడు. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తేజ్‌నరైన్ అజేయ డబుల్ సెంచరీ (467 బంతుల్లో 207 నాటౌట్; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచాడు. The moment Tagenarine Chanderpaul complete his maiden double hundred in Test cricket - The future of West Indies cricket.pic.twitter.com/2ZRmKZ7ZUV — CricketMAN2 (@ImTanujSingh) February 6, 2023 కెరీర్లో మూడో టెస్ట్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన తేజ్.. అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ విభాగంలో తండ్రి శివ్నరైన్నే మించిపోయాడు. శివ్‌నరైన్ 164 టెస్ట్‌ల కెరీర్లో 203 నాటౌట్ అత్యధిక స్కోర్ కాగా.. తేజ్ తన మూడో టెస్ట్‌లో తండ్రి అత్యధిక స్కోర్‌ను అధిగమించి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల జోడీ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ ఓ యూనిక్ రికార్డును సొంతం చేసుకుంది. టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధించిన తొట్టతొలి తండ్రి కొడుకుల జోడీగా శివ్-తేజ్ జోడీ రికార్డుల్లోకెక్కింది. క్రికెట్ చరిత్రలో ఏ తండ్రి కొడుకులు ఈ ఘనత సాధించలేదు. భారత్‌కు చెందిన తండ్రి కొడుకులు లాలా అమర్నాథ్-మొహిందర్ అమర్నాథ్, విజయ్ మంజ్రేకర్-సంజయ్ మంజ్రేకర్, ఇఫ్తికార్ (ఇంగ్లండ్)-మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ టెస్ట్‌ల్లో సెంచరీలు చేసినప్పటికీ తండ్రి కొడుకులు ఇద్దరూ డబుల్ సెంచరీలు మాత్రం సాధించలేకపోయారు. తేజ్‌నరైన్ కెరీర్లో 5 ఇన్నింగ్స్‌లు ఆడి హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ సాయంతో 91.75 సగటున 367 పరుగులు చేశాడు. మరోపక్క తేజ్ తండ్రి శివ్‌నరైన్ 1994-15 మధ్యకాలంలో 164 టెస్ట్‌ల్లో 51.4 సగటున 30 సెంచరీలు, 66 హాఫ్‌సెంచరీల సాయంతో 11867 పరుగులు చేశాడు. అలాగే 268 వన్డేల్లో 11 సెంచరీలు, 59 హాఫ్‌సెంచరీల సాయంతో 8778 పరుగులు, 22 టీ20ల్లో 343 పరుగులు చేసి విండీస్ దిగ్గజ బ్యాటర్ అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విండీస్ టీమ్.. తొలి టెస్ట్‌లో 447/6 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తేజ్నరైన్తో పాటు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (182) సెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది.