ప్రస్తుతం భారత్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విండీస్ క్రికెట్ జట్టులోని ఓ సభ్యుడు ఓ ప్రముఖ బాలీవుడ్ సినిమాలో నటించాడన్న విషయం మనలో చాలామందికి తెలీకపోవచ్చు. 1983లో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ నేతృత్వంలో భారత్ వరల్డ్‌కప్ సాధించిన ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడిన 83 సినిమాలో విండీస్ లెజండరీ క్రికెటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ తనయుడు, ప్రస్తుత విండీస్ ఓపెనర్ తేజ్‌నరైన్ చంద్రపాల్ అతిధిపాత్రలో నటించాడు.
ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్, అతని భార్య పాత్రలో దీపికా పదుకోన్ నటించారు. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో తేజ్‌నరైన్ అప్పటి విండీస్ ప్లేయర్ లారీ గోమ్స్ పాత్రలో నటించాడు. లండన్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రణ్‌వీర్, దీపికాలతో తేజ్‌నరైన్ తీసుకున్న ఓ సెల్ఫీ ప్రస్తుతం నెటింట్ట వైరలవుతుంది.
I think he’s the first actor with a professional movie experience to play test cricket for Windies 😂😂 Tagenarine played Larry Gomes in 83. https://t.co/jiV1esjaj8 pic.twitter.com/6nQiBKIX5T
— Gaurav Nandan Tripathi 🜃 (@Cric_Beyond_Ent) November 30, 2022
ఇదిలా ఉంటే, ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. యశస్వి జైస్వాల్ (143), విరాట్ కోహ్లి (36) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 150 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ (5/60), జడేజా (3/26) విండీస్ పతనాన్ని శాసించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజే (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తేజ్‌నరైన్ చంద్రపాల్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment