
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ దుమ్మురేపుతున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఈ హైదరాబాదీ.. రెండో టీ20లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 41 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 51 పరుగులు చేశాడు. ఈ భారత్ ఓటమిపాలైనప్పటికీ.. తిలక్ మాత్రం అందరిని తన ఆటతీరుతో మంత్రముగ్దులను చేశాడు.
అంతర్జాతీయ కెరీర్‌లో తిలక్ వర్మకు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ వెరైటీగా జరపుకున్నాడు. మొదటి బ్యాట్ పైకెత్తి, రెండు బొటనవేళ్లను డ్రెసింగ్ రూమ్‌వైపు చూపిస్తూ చిన్న పిల్లాడిలా తన తొలి హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సెలబ్రేషన్స్ గత కారణాన్ని మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ వెల్లడించాడు.
నా హాఫ్ సెంచరీ ఆమెకే అంకితం..
తన అంతర్జాతీయ కెరీర్‌లో చేసిన తొలి హాఫ్ సెంచరీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గారాల పట్టి సమైరా(సామీ)కి అంకితమిస్తున్నట్లు వర్మ తెలిపాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో తిలక్ మాట్లాడుతూ.. నా తొలి హాఫ్ సెంచరీని రోహిత్ భాయ్ ముద్దుల కూతురు సామీకి అంకితమిస్తున్నా.
నేను సామీతో చాలా క్లోజ్‌గా ఉంటాను. నా కెరీర్‌లో నేను చేసే తొలి సెంచరీ అయినా.. తొలి హాఫ్ సెంచరీ అయినా తనకే అంకితమిస్తానని ప్రామిస్ చేశా. అందుకే ఈ సెలబ్రేషన్స్. మేమిద్దరం కూడా ఫన్నీగా ఈ విధంగానే ఆడుకుంటమని పేర్కొన్నాడు.
చదవండి: ODI WC 2023: ఆసీస్ ప్రపంచకప్ జట్టులో టాక్సీ డ్రైవర్ కొడుకు.. ఎవరీ తన్వీర్ సంగా? భారత్‌తో ఏంటి సంబంధం?
𝐖𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 𝐨𝐧 🔁 😍
— Mumbai Indians (@mipaltan) August 6, 2023
Tilak's solid Maiden International FIFTY 👏#OneFamily #WIvIND @TilakV9 pic.twitter.com/D1qBZhJJyl