టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన సంగతి తెలిసిందే. విండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 22 బంతుల్లో 3సిక్స్‌లు, 2 ఫోర్లు సాయంతో 39 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇంటర్ననేషనల్ క్రికెట్‌లో అతడు ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లో రెండింటిని సిక్సర్లగా మలిచాడు.
ఈ మ్యాచ్‌లో భారత ఓటమి పాలైనప్పటికీ తిలక్ వర్మ మాత్రం తన ఆటతీరుతో అందరిని అకట్టుకున్నాడు. ఇక డెబ్యూ మ్యాచ్‌లోనే సంచలన ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మపై భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కచ్చితంగా భవిష్యత్తులో భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారుతాడు.
ప్రస్తుతం భారత జట్టులో లెఫ్ట్‌హ్యాండర్లు తక్కువగా ఉన్నారు. జట్టు మెనెజ్‌మెంట్ కూడా ఎడమచేతి వాటం బ్యాటర్ల కోసం వెతుకుతోంది. ఇటువంటి సమయంలో తిలక్ వర్మ వంటి అణిముత్యం దొరికాడు. సిక్స్‌తో తన అరంగేట్రాన్ని చాటుకున్న తిలక్ బ్యాటింగ్ స్టైల్ నన్ను ఎంతోగానే అకట్టుకుంది. అతడు ఎక్స్‌ట్రా కవర్ దిశగా కొట్టిన సిక్స్ మాత్రం అద్భుతమని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. కాగా ఆర్పీ సింగ్ యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, కిషన్, జైశ్వాల్‌ను కాకుండా తిలక్‌ను టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా పేర్కొనడం గమానార్హం.
చదవండి: IND vs WI: 'ఒకే మ్యాచ్‌లో 1000 కొట్టినా.. జట్టులో చోటుకు గ్యారంటీ లేదు'
Comments
Please login to add a commentAdd a comment