టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ మరో సారి సత్తాచాటాడు. గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో తిలక్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హైదరాబాదీ.. సూర్యకుమార్‌తో కలిసి 83 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను బౌండరీలుగా మలిచి తన ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించాడు.
ఇక అద్భుత ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మ.. అయితే తృటిలో తన రెండో హాఫ్ సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. 37 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 49 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆఖరిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే తిలక్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోపోవడానికి టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే కారణమని పలువరు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
భారత్ విజయానికి 2 పరుగులు మాత్రమే అవసరమైన నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు స్ట్రైక్ వెళ్లింది. ఆ ఓవర్‌లో ఇంకా రెండు బంతులు మిగిలిండడంతో హార్దిక్ సింగిల్ తీసి తిలక్ వర్మకు స్ట్రైక్ ఇస్తాడని అంతా భావించారు. దీంతో తిలక్ తన హాఫ్ సెంచరీని పూర్తిచేసుకుంటాడని కామెంటేటర్‌లు సైతం చెప్పుకొచ్చారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం ఎవరూ ఊహించని విధంగా సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. దీంతో తిలక్ 49 పరుగులతో నాన్‌స్ట్రైక్‌లో ఉండిపోవాల్సి వచ్చింది.
ధోనిని చూసి నేర్చుకో..
ఇక హార్దిక్ సిక్స్‌తో మ్యాచ్ ఫినిష్ చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. హార్దిక్ చాలా స్వార్థపరుడని, నాయకత్వ లక్షణాలు అతడికి లేవంటూ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మరి కొంత మంది ధోనిని చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో సందర్భాల్లో ధోని.. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న బాట్లర్లు ఏదైనా మైలురాయికి దగ్గరగా ఉన్నప్పుడు ఢిఫెన్స్ ఆడి వారికి స్ట్రైక్ వచ్చేలా చేసేవాడు.
2014 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో.. భారత విజయానికి ఆఖరి 7 బంతుల్లో ఒక్క పరుగు కావాలి. 19 ఓవర్ ఆఖరి బంతికి స్ట్రైక్‌లో ఉన్న ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడని అంతా భావించారు. కానీ ధోని విన్నింగ్ షాట్ కొట్టకుండా ఢిపెన్స్ ఆడి కోహ్లికి స్ట్రైక్ ఇచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికే కోహ్లి ఫోర్ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 72 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. మా సత్తా చూపించాం! అతడు మరోసారి: హార్దిక్
Most Punchable Face Right now!
— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) August 8, 2023
Hardik Pandya is the most SELFISH Player i have ever seen!
Oh Tilak 💔 pic.twitter.com/abNhCAP73a
Most hated 6 by #HardikPandya #INDvsWI #TilakVarma #BCCI pic.twitter.com/U7WVQrN4xC
— Lexicopedia (@lexicopedia1) August 8, 2023
When MS Dhoni let Virat Kohli lay the finishing touch 📹
— ICC (@ICC) December 23, 2020
Revisit the sweet gesture by captain Dhoni from the 2014 T20 World Cup semi-final against South Africa 🇮🇳 pic.twitter.com/EKcWsCh9r1
Comments
Please login to add a commentAdd a comment