hardhik pandya
-
'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ సడన్‌గా ఏమైందో మరి'
ఐపీఎల్-2025కు సమయం అసన్నమవుతోంది. మార్చి 22 నుంచి ఈ క్రికెట్ పండగ ప్రారంభం కానుంది. ఈ టైటిల్ వేటలో మొత్తం పది జట్లు మరోసారి తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలు అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ ఏడాది సీజన్లో అందరి దృష్టి ఐదు సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌పైనే ఉంది.గతేడాది సీజన్లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. రోహిత్ శర్మను తప్పించి మరి హార్దిక్‌కు ముంబై యాజమాన్యం తమ జట్టు పగ్గాలను అప్పగించింది. అప్పటిలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిచిన పాండ్యా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఐపీఎల్ 18వ సీజన్లో హార్దిక్ పాండ్యా ఎలా రాణిస్తాడో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. "కెప్టెన్‌గా తనను తను నిరూపించుకోవడానికి హార్దిక్ పాండ్యాకు ఇదొక అద్భుత అవకాశం. ఒకప్పుడు అతడు రోహిత్ శర్మ వారుసుడిగా కొనసాగాడు. రోహిత్ శర్మ గైర్హజారీలో భారత జట్టు కెప్టెన్‌గా అతడు వ్యవహరించేవాడు. వైట్‌బాల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుతాడని అంతా ఊహించారు.కానీ సడన్‌గా కెప్టెన్సీ జాబితా నుంచి పాండ్యాను తప్పించారు. హార్దిక్ గురించి ప్రస్తుతం ఎవరూ చర్చించడం లేదు. అతడిని కనీసం వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపిక చేయలేదు. పాండ్యా అద్బుతమైన ఆటగాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి తను ముందుకు వచ్చి అదుకునేవాడు. కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్‌ను అందించాడు. వరుసగా రెండోసారి ఫైనల్‌కు కూడా చేర్చాడు.ఈ సీజన్లో హార్దిక్ కెప్టెన్‌గా తన తను నిరూపించుకుంటే మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించే అవకాశముంది" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్ -
హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్
హార్దిక్ పాండ్యా(Hardhik Pandya).. భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. వైట్‌బాల్ ఫార్మాట్లో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో టీమిండియాకు అద్బుతమైన విజయాలను అందిస్తున్నాడు. బంతితో మ్యాజిక్, బ్యాట్‌తో విధ్వంసం చేయగల సత్తా అతడిది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలోనూ హార్ధిక్‌ది కీలక పాత్ర.బౌలింగ్, బ్యాటింగ్‌లో పాండ్యా అదరగొట్టాడు. అంతకుముందు టీ20 వరల్డ్‌కప్-2024లోనూ ఈ బరోడా ఆల్‌రౌండర్ సత్తాచాటాడు. ఈ క్రమంలో పాండ్యాను పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ హఫీజ్ ప్రశంసించారు. పాండ్యా తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అద్బుతాలు చేస్తున్నాడని వారిద్దరూ కొనియాడారు."హార్దిక్ పాండ్యా ఏమి.. మాల్కం మార్షల్, వాకార్ యూనిస్, జవగల్ శ్రీనాథ్, బ్రెట్ లీ కాదు. ఈ లెజెండ్స్ లాంటి స్కిల్స్ పాండ్యాకు లేవు. కానీ బంతితో మాత్రం అద్బుతాలు సృష్టిస్తున్నాడు. కొత్త బంతితో చాలా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన సత్తాచూపిస్తున్నాడు. హార్దిక్ అంత పెద్ద హిట్టర్ కూడా కాదు. కానీ తన టెక్నిక్‌తో భారీ షాట్లు ఆడుతున్నాడు. నిజంగా అతడిని మెచ్చుకోవాల్సిందే. 2000లో పాకిస్తాన్ జట్టులో హార్దిక్ లాంటి ఆటగాళ్లు చాలా మంది ఉండేవారు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. కాగా అక్తర్ చేసిన వ్యాఖ్యలను మరో మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ఏకీభవించాడు."అక్తర్ భాయ్ చెప్పింది అక్షరాల నిజం. అబ్దుల్ రజాక్ వంటి ఆల్‌రౌండర్ ప్రదర్శనలను చూస్తే మనకు ఆర్దమవుతోంది. అతడు హార్దిక్ పాండ్యా కంటే చాలా బెటర్. అతడొక మ్యాచ్ విన్నర్. కానీ పాకిస్తాన్ క్రికెట్లో అతడికి సరైన గౌరవం దక్కలేదు. రజాక్లో కూడా స్కిల్స్ తక్కువగా ఉన్నప్పటికి.. అద్బుతమైన ప్రదర్శన చేసే వాడని" హాఫీజ్ చెప్పుకొచ్చాడు.కాగా రజాక్.. తన కెరీర్లో పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లో వరుసగా 1946, 5080, 393 పరుగులు చేశాడు. వన్డేల్లో అతడి పేరిట 269 వికెట్లు ఉన్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలవగా.. పాకిస్తాన్ మాత్రం దారుణ ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.చదవండి: WC 2027: రోహిత్ శర్మ ప్లానింగ్ ఇదే!.. అతడి మార్గదర్శనంలో సన్నద్ధం! -
Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం
భారత క్రికెట్ జట్టు.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ను సొంతం చేసుకున్న టీమిండియా.. న్యూజిలాండ్‌పై పాతికేళ్ల నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్‌కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో తొలిసారిగా ఈ మెగా టోర్నీ టైటిల్‌ను భారత్‌కు సౌరవ్ గంగూలీ అందించగా.. ఆ తర్వాత 2013 ఎంస్ ధోని సారథ్యంలో తిరిగి మళ్లీ ఛాంపియన్స్‌గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ట్రోఫీ భారత్ సొంతమైంది. టీమిండియా ఛాంపియన్స్‌గా నిలవడంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)ది కీలక పాత్ర. ఈ టోర్నీ అసాంతం తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు వెన్నముకగా నిలిచాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి అభిమానులకు గుర్తుండిపోతుంది. అంతేకాకుండా పాకిస్తాన్‌పై కూడా సంచలన స్పెల్‌ను పాండ్యా బౌల్ చేశాడు. ఇక ఈ విజయాన్ని తన దివంగత తండ్రికి హార్దిక్ పాండ్యా అంకితమిచ్చాడు. తను సాధించిన ప్రతీ విజయం వెనుక తన తండ్రి దీవెనలు ఉన్నాయి పాండ్యా చెప్పుకొచ్చాడు."నేను, నా సోదరుడు ఏ స్ధాయి నుంచి ఇక్కడికి చేరుకున్నామో మాకు బాగా తెలుసు. ఇప్పటికీ మాకు ఇది ఒక కలలానే ఉంది. కానీ ఈ విషయం గురుంచి మేము ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించలేదు. ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, కష్టపడి పనిచేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము సాధించిన విజయాలను చూసి మా తల్లిదండ్రులు సంతోషించారు. మా నాన్న బౌతికంగా మాకు దూరమైనప్పటికి.. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పటికి ఉంటాయి. ఆయన పై నుంచి అన్ని చూస్తున్నారు" అంటూ హార్దిక్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా హార్దిక్, కృనాల్ తండ్రి 2021లో గుండెపోటుతో మరణించారు.అదేవిధంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమిపై కూడా హార్దిక్ మాట్లాడాడు. "ఈ ఎనిమిదేళ్ల కాలంలో భారత క్రికెట్ జట్టు చాలా విజయాలు సాధించింది. ఏదేమైనప్పటికి ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతంచేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ స్వదేశానికి తిరిగి వెళ్లి సంబరాలు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. భారత జట్టులో సీనియర్లు, జూనియర్లు అంటూ తారతామ్యాలు ఉండవు.. డ్రెసింగ్ రూమ్‌లో అందరం కలిసిమెలిసి ఉంటాము. నా పదేళ్ల కెరీర్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటివరకు నేను నేర్చుకున్నది, నా అనుభవాలను కొత్తగా వచ్చిన ఆటగాళ్లతో పంచుకుంటూ ఉంటాను. అది అతడికి మాత్రమే కాకుండా జట్టుకు కూడా ఉపయోగపడుతుందని పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి చూసిన సంగతి తెలిసిందే.339 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా చతికలపడింది. హార్దిక్ పాండ్యా 76 పరుగులతో ఫైటింగ్ నాక్ ఆడినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్‌ను చిత్తు చేసి గత ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది.చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్ -
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్..
ఐపీఎల్-2025(IPL-2025) ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు భారీ షాక్ తగలింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు.ఈ క్రమంలోనే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. అతడు తన పూర్తి ఫిట్నెస్ సాధించడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ భారత స్పీడ్ స్టార్ ఏప్రిల్‌లో ముంబై ఇండియన్స్ శిబిరంలో చేరే అవకాశం ఉంది."బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు. అతడి మెడికల్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తిరిగి తన బౌలింగ్ ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. అయితే ఐపీఎల్లో బౌలింగ్ చేసే ఫిట్నెస్ మాత్రం ఇంకా సాధించలేదు. ఏప్రిల్ మొదటి వారంలో బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశముంది. అది కూడా మేము కచ్చితంగా చెప్పలేము. మా వైద్య బృందం అతడిపై క్రమంగా వర్క్‌లోడ్ పెంచుతుంది.అతడు ఎటువంటి అసౌకర్యం లేకుండా బౌలింగ్ చేయగలిగితేనే వైద్య బృందం క్లియరన్స్ ఇస్తోంది. అప్పటివరకు అతడు సీఓఈలోనే ఉండనున్నాడని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నైసూపర్ కింగ్స్‌తో తలపడనుంది. హార్దిక్ కూడా..ఈ మ్యాచ్‌కు ముంబై రెగ్యూలర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం దూరం కానున్నాడు. గతేడాది సీజన్లో స్లో ఓవర్ రేటు కారణంగా పాండ్యాపై ఒక్క మ్యాచ్ నిషేధం పడింది. హార్దిక్ గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్‌కు కారణమయ్యాడు.దీంతో వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్‌ను మెయింటేన్ చేయడంతో ఐపీఎల్ నిర్వహకులు అతడిపై ఆడకుండా ఒక్క మ్యాచ్ నిషేదం విధించారు. ఆ బ్యాన్‌ను పాండ్యా ఈ ఏడాది సీజన్లో ఎదుర్కొన్నాడు. తొలి మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. కాగా గతేడాది సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో లీగ్ స్టేజికే పరిమితమైన సంగతి తెలిసిందే.చదవండి: BCCI: శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!? -
శుబ్‌మన్ గిల్ కాదు.. ఫ్యూచర్ టీమిండియా కెప్టెన్ అతడే?!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం భారత క్రికెట్ జట్టు తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ ప్రిపేరేషన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. మిగిలిన రెండు వన్డేలకు సిద్దమవుతోంది.ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఫిబ్రవరి 15న రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు దుబాయ్ పయనం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా.. యూఏఈ లేదా బంగ్లాదేశ్‌తో వామాప్ మ్యాచ్ ఆడనుంది. కాగా ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటుపై మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.కెప్టెన్‌గా హార్దిక్..!ఇక ఇది ఇలా ఉండగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో భారత్ విఫలమైతే రోహిత్ శర్మ స్ధానంలో వన్డే కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఉన్నాడు. అయితే గిల్‌ను వైస్ కెప్టెన్‌గానే కొనసాగించి జట్టు పగ్గాలను మాత్రం హార్దిక్‌కు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది వరకు టీ20ల్లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగాడు.రోహిత్ శర్మ గైర్హజారీలో చాలా మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్‌గా పాండ్యా వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా రోహిత్ శర్మ డిప్యూటీగా ఈ బరోడా ఆల్‌రౌండర్ ఉన్నాడు. కానీ రోహిత్ శర్మ రిటైరయ్యాక భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ను కాదని సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసి సెలక్షన్ కమిటీ అందరికి షాకిచ్చింది. అయితే సూర్య కెప్టెన్‌గా రాణిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం విఫలమవుతున్నాడు.రోహిత్ రిటైర్మెంట్..!కాగా ఈ మెగా టోర్నీ అనంతరం రోహిత్ శర్మ కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై రోహిత్ శర్మ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. "నా ప్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడటానికి ఇది సందర్భం కాదు. ప్రస్తుతం నా దృష్టి అంతా ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ పైనే ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం" అంటూ హిట్‌మ్యాన్ బదులిచ్చాడు. దీంతో రిటైర్మెంట్ పై క్లారిటీ ఇవ్వకుండా దాటవేసేలా రోహిత్ మాట్లాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. రోహిత్ భవితవ్యం తేలాలంటే మరో నెల రోజులు అగాల్సిందే.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
బుమ్రా, భువనేశ్వర్‌ను దాటేసిన హార్దిక్ పాండ్యా..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya ) ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో భారత బౌలర్‌గా పాండ్యా రికార్డులకెక్కాడు. బుధవారం కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు పడగొట్టిన హార్దిక్.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హార్దిక్ ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడి 91 వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లను హార్దిక్ అధిగమించాడు. బుమ్రా 70 మ్యాచ్‌ల్లో 89 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అగ్రస్ధానంలో ఉన్నాడు.అర్ష్‌దీప్ 61 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సైతం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. అర్ష్‌దీప్ తర్వాత స్ధానంలో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(96) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పర్యాటక ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్‌లతో 79 పరుగులు చేసి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
కోల్కత్తా టీ-20లో భారత్ ఘన విజయం
కోల్‌కాతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్‌ను 12.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. ఈ విజయంతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 79(5 ఫోర్లు, 8 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.స్కోర్లు: ఇంగ్లాండ్132(20) భారత్ 133/3(12.5)ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల దాటికి కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. తొలి ఓవర్లోనే విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ భారత్‌కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్లో బెన్ డకెట్‌ను అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఓవరాల్‌గా భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.తుది జట్లుభారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. ఒకే ఓవర్లో 28 పరుగులు! వీడియో వైరల్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాండ్యా మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.త్రిపుర బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా త్రిపుర స్పిన్నర్ పర్వేజ్ సుల్తాన్‌ను ఈ బరోడా ఆల్‌రౌండర్ ఊతికారేశాడు. బరోడా ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన పర్వేజ్ బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో పాండ్యా 28 పరుగులు పిండుకున్నాడు.ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా బరోడా 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో చేధించింది. బరోడా బ్యాటర్లలో పాండ్యాతో పాటు మితీష్ పటేల్ 37 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. త్రిపుర బ్యాటర్లలో కెప్టెన్ మన్దీప్ సింగ్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బరోడా బౌలర్లలో అభిమన్యు సింగ్ మూడు వికెట్లు, కెప్టెన్ కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 115.50 సగటుతో 231 పరుగులు చేశాడు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? Hardik Pandya was on fire again 🔥🔥The Baroda all-rounder went berserk smashing 6⃣,6⃣,6⃣,4⃣,6⃣ in an over on his way to a whirlwind 47(23) against Tripura 🙌🙌#SMAT | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/1WPFeVRTum pic.twitter.com/xhgWG63y9g— BCCI Domestic (@BCCIdomestic) November 29, 2024 -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో బరోడా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఇండోర్ వేదికగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి చేధించింది.ఈ భారీ లక్ష్య చేధనలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర ఫిప్టీతో చెలరేగాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ముఖ్యంగా తమిళనాడు పేసర్ గుర్జప్నీత్ సింగ్‌కు హార్దిక్ చుక్కలు చూపించాడు. బరోడా ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన గుర్జప్నీత్ బౌలింగ్‌లో పాండ్యా 4 సిక్స్‌లు, ఒక ఫోర్ బాది ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు.ఓవరాల్‌గా 30 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 69 పరుగులు చేసి రనౌటయ్యాడు. హార్దిక్‌తో పాటు భాను పానియా 42 పరుగులతో రాణించాడు. ఫలితంగా బరోడా 7 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. తమిళనాడు బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి మూడు, సాయికిషోర్ రెండు వికెట్లు సాధించారు.జగదీశన్ హాఫ్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. తమిళనాడు బ్యాటర్లలో ఓపెనర్ జగదీశన్(57) హాఫ్ సెంచరీతో మెరవగా.. విజయ్ శంకర్(42), షరూఖ్ ఖాన్(39) పరుగులతో రాణించాడు. బరోడా బౌలర్లలో మెరివాలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహేష్ పతియా, నినాంద్ రత్వా తలా వికెట్ సాధించారు.చదవండి: ఏమి తప్పుచేశానో ఆర్ధం కావడం లేదు.. చాలా బాధగా ఉంది: టీమిండియా ఓపెనర్ 6⃣,6⃣,6⃣,6⃣,4⃣One goes out of the park 💥Power & Panache: Hardik Pandya is setting the stage on fire in Indore 🔥🔥Can he win it for Baroda? Scorecard ▶️ https://t.co/DDt2Ar20h9#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/Bj6HCgJIHv— BCCI Domestic (@BCCIdomestic) November 27, 2024 -
హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్
సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బౌలర్లు అద్భతంగా పోరాడినప్పటికి బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రోటీస్‌తో జరిగిన తొలి టీ20లో విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయారు. మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంజూ శాంసన్ తొలి ఓవర్లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అభిషేక్ శ్మ (4), సూర్యకుమార్ యాదవ్ (4) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు తిలక్ వర్మ(20), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27) పర్వాలేదన్పించారు.పాండ్యా సెల్పిష్ ఇన్నింగ్స్.. !ఇక భారత ఇన్నింగ్స్ 8 ఓవర్లోనే బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు స్కోర్ 120 పరుగుల మార్క్ దాటేలా చేశాడు. ఓ వైపు వికెట్లు క్రమం తప్పకుండా పడతుండడంతో హార్దిక్ సింగిల్స్ తీస్తూ భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.ఆఖరి మూడు ఓవర్లలో హిట్టింగ్‌కు హార్దిక్ ప్రయత్నించాడు. కానీ ఆఖరిలో కూడా పాండ్యా ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్లో స్ట్రైక్ తన వద్దే అంటిపెట్టుకున్న పాండ్యా కేవలం బౌండరీ మాత్రమే బాదాడు. ఓవరాల్‌గా 45 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. స్ట్రైక్ రేట్ 86.67తో 39 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఓ సిక్స్ మాత్రమే ఉన్నాయి. అయితే స్లో స్ట్రైక్ రేట్‌తో ఆడిన పాండ్యాపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చేరాడు. పాండ్యాను ఉద్దేశించి అతడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ జట్టు అవసరాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాడని అలీ ఆరోపించాడు."పాండ్యా సార్ ఆజేయంగా నిలిచి 45 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అతడు ఈ ఇన్నింగ్స్ జట్టు కోసం కాదు తన కోసం ఆడాడు. హార్దిక్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ సెల్ఫిష్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఆడిన తీరు క్షమించరానిది. అర్ష్‌దీప్ సింగ్ సిక్సర్ కొట్టినప్పటికి అతడు హార్దిక్ స్ట్రైక్ కూడా ఇవ్వలేదు. భారత్ చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నప్పటికి పాండ్యా సింగిల్స్‌ను తిరష్కరించాడు. స్ట్రైక్ తనవద్దే అంటిపెట్టుకుని ఏమి సాధించాడు. అతడి కంటే అక్షర్ పటేల్ ఎంతో బెటర్. పాండ్యా కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లో 27 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు" అని అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? -
వారెవ్వా హార్దిక్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! వీడియో
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను టీమిండియా చిత్తు చేసింది.దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో యంగ్ ఇండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో బంగ్లా బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను పాండ్యా పెవిలియన్‌కు పంపాడు.సూపర్ మ్యాన్‌లా..221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషద్ హొస్సేన్ భారత బౌలర్లను ఆడటానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వరుసగా రెండు బౌండరీలు బాది టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు.ఈ క్రమంలో బంగ్లా ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి మూడో బంతిని రిషద్‌కు ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆబంతిని రిషద్ లాంగాన్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు. అయితే దాదాపు డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో తన ఎడమవైపు పరుగెత్తుకుంటూ వచ్చి ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పాండ్యా బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి బంతిని మాత్రం విడిచిపెట్టలేదు.అతడి క్యాచ్ చూసిన బంగ్లా బ్యాటర్ బిత్తర పోయాడు. మైదానంలో ప్రేక్షకులు సైతం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాండ్యాను అభినంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Athleticism at its best! 😎An outstanding running catch from Hardik Pandya 🔥🔥Live - https://t.co/Otw9CpO67y#TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/ApgekVe4rB— BCCI (@BCCI) October 9, 2024 -
అలా ఎలా కొట్టావు హార్దిక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే( వీడియో)
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.తొలుత బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టిన పాండ్యా.. తర్వాత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హార్దిక్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అయితే హార్దిక్ ఆడిన ఓ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది.పాండ్యా నో లుక్ షాట్.. భారత ఇన్నింగ్స్ 12 ఓవర్లో మూడో బంతిని హార్దిక్‌కు బంగ్లా పేసర్ టాస్కిన్ అహ్మద్ షార్ట్ పిచ్ బాల్ డెలివరీగా సంధించేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం తను ఆశించిన మేరకు బౌన్స్ కాలేదు. అయితే ఇక్కడే హార్దిక్ తన యూటిట్యూడ్ను చూపించాడు. బంతిని చూడకుండానే నో లుక్ ర్యాంప్ షాట్ ఆడాడు.ఆడిన తర్వాత కనీసం బంతి ఎటువైపు వెళ్లింది అన్నది కూడా పాండ్యా చూడలేదు. బంతి కీపర్ తలపై నుంచి మెరుపు వేగంతో బౌండరీకి దూసుకెళ్లింది. ఆ తర్వాత బౌలర్ వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. పాండ్యా షాట్ చూసిన బంగ్లా ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు షాట్ ఆఫ్ ది ఇయర్‌గా అభివర్ణిస్తున్నారు. 𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎!The shot. The reaction. The result ➡️ EPIC 😎WATCH 🎥🔽 #TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank https://t.co/mvJvIuqm2B— BCCI (@BCCI) October 6, 2024 -
తొలి టీ20.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఊదిపడేసింది. కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా ( 39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(29), సంజూ శాంసన్(29) పరుగులతో రాణించారు. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.ఇక బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మాన్, మెహాది హసన్ మిరాజ్ తలా వికెట్ సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా, సుందర్, మయాంక్ యాదవ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మెహదీ హసన్(35 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు. -
హార్దిక్ రీ ఎంట్రీ చాలా కష్టం.. ఒకవేళ అదే జరగాలంటే?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు పాండ్యా తీవ్రంగా శ్రమిస్తున్నాడన్న ఊహాగానాలు ఊపుందుకున్నాయి. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు హార్దిక్ ఫిట్‌గా లేడని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు.హార్దిక్ పాండ్యా టెస్టుల్లో రీఎంట్రీ ఇస్తాడని నేను అనుకోవడం లేదు. బహుశ వైట్ బాల్ అందుబాటులో లేపోవడంతో అతడు ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేసి ఉంటాడు. నాలుగు రోజులు లేదా ఐదు రోజుల పాటు టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడి శరీరం సహకరించదు.ఒకవేళ హార్దిక్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలంటే అంతకంటేముందు కనీసం ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్ అయినా ఆడాలి. అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదని ఓ ఇంటర్వ్యూలో పార్ధివ్ పేర్కొన్నాడు.హార్దిక్ పాండ్యా 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్ భారత్ తరపున ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకే కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఫిట్నెస్ లేమి కారణంగా పాండ్యా కేవలం వైట్-బాల్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి సారించాడు. గత ఆరేళ్లగా అతడిని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మధ్యలో ఓసారి పాండ్యా వెన్నుముక సర్జరీ కూడా చేసుకున్నాడు. ఈ కారణాలతో అతడు రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు తిరిగి మళ్లీ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో భారత జట్టులోకి రానున్నాడు.చదవండి: SA vs IRE: దక్షిణాఫ్రికా ఓపెనర్ విధ్వంసం.. చిత్తుగా ఓడిన ఐర్లాండ్ -
టీమిండియా స్టార్ ప్లేయర్ రీఎంట్రీ..?
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రెడ్ బాల్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న రంజీ ట్రోఫీ సీజన్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో పాండ్యా పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. నెట్స్‌లో రెడ్ బాల్‌తో బౌలింగ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో పోస్ట్ చేశాడు.దీంతో అతడు మళ్లీ భారత టెస్టు జట్టులోకి కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో బరోడాకు హార్దిక్ ప్రాతినిథ్యం వహించే అవకాశముంది.చివరి టెస్టు ఎప్పుడు ఆడడంటే?హార్దిక్ పాండ్యా 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్ భారత్ తరుపన ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకే కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఫిట్నెస్ లేమి కారణంగా పాండ్యా కేవలం వైట్-బాల్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి సారించాడు. గత ఆరేళ్లగా అతడిని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మధ్యలో ఓసారి పాండ్యా వెన్నుముక సర్జరీ కూడా చేసుకున్నాడు. ఈ కారణాలతో అతడు రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. అయితే పాండ్యా ప్రస్తుతం గతంతో పోలిస్తే ఫిట్నెస్ పరంగా మెరుగయ్యాడు. దీంతో అతడు టెస్టుల్లో రీ ఎంట్రీ దిశగా అడుగులు వేస్తున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు తిరిగి మళ్లీ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో భారత జట్టులోకి రానున్నాడు.చదవండి: పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
మళ్లీ ప్రేమలో పడ్డ హార్దిక్ పాండ్యా.. సింగర్‌తో డేటింగ్!?
సెర్బియా నటి, తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో వివాహ బంధానికి ముగింపు పలికిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ తిరిగి ప్రేమలో పడ్డాడా? మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. హార్దిక్ పాండ్యా.. బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులగా జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం గ్రీస్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కొద్ది రోజుల కిందట గ్రీస్‌లోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ దిగిన ఫోటోలను జాస్మిన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా హార్దిక్ కూడా అదే స్పాట్లో దిగిన ఫోటోలను షేర్ చేయడం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. అంతేకాకుండా వీరిద్దరూ ఒకొరి పోస్ట్‌కు ఒకరు లైక్ కూడా చేయడంతో హార్దిక్-జాస్మిన్ ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. గతంలో కూడా వాలియా పెట్టిన పలు పోస్ట్‌లకు హార్దిక్ లైక్ కొట్టాడు.కాగా జాస్మిన్‌తో హార్దిక్ రిలేషన్లో ఉండడంతోనే నటాషా స్టాంకోవిచ్ విడిపోవాలని నిర్ణయించుకుందని జోరుగా ప్రచారం సాగుతోంది. నటాషా సైతం చీటింగ్ కు సంబంధించిన రీల్స్ ను సోషల్ మీడియాలో తరుచుగా పోస్ట్ చేస్తుంది.ఇక శ్రీలంకతో టీ20 సిరీస్ అనంతరం హార్దిక్ పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని హార్దిక్ నిర్ణయించుకున్నాడు. -
హార్దిక్ పాండ్యాకు షాక్!.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పగ్గాలను ముంబై మెనెజ్‌మెంట్ హార్దిక్‌కు అప్పగించింది. రోహిత్ శర్మ స్ధానంలో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపపట్టిన హార్దిక్.. తన మార్క్‌ను చూపించలేకపోయాడు.అతడి సారథ్యంలో దారుణ ప్రదర్శరన కనబరిచిన ముంబై కనీసం లీగ్ స్టేజిని కూడా దాటలేకపోయింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ఆటగాడిగా కూడా పాండ్యా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని రిటైన్ చేసుకోకూడదని ముంబై నిర్ణయించుకున్నట్లు వినికిడి. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ముంబై ఫ్రాంచైజీ యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఇటీవలే భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. హార్దిక్ పాండ్యాను కాదని రోహిత్ శర్మ వారసుడిగా సూర్యను బీసీసీఐ ఎంపిక చేసింది. శ్రీలంక టీ20 సిరీస్‌తో భారత జట్టు కెప్టెన్‌గా సూర్య తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే సూర్య ఆకట్టుకున్నాడు. లంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది. -
IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. గిల్ వచ్చేశాడు! ఆ నలుగురికి రెస్ట్
పల్లెకెలె వేదికగా మూడో టీ20లో భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆఖరి టీ20కు భారత జట్టు మెనెజ్‌మెంట్ ఏకంగా నలుగురు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరమమయ్యారు. వారి స్ధానాల్లో శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్, శుబ్‌మన్ గిల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు శ్రీలంక కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. షనక స్థానంలో ఆల్‌రౌండర్ విక్రమసింఘే అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది.తుది జట్లుభారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), చమిందు విక్రమసింఘే, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో -
గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా!
భారత్-శ్రీలంక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. జూలై 27న పల్లెకెలె వేదికగా ఇరు జట్లు మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లురూతున్నాయి. తొలి టీ20 కోసం తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. అయితే భారత జట్టు మాత్రం కొత్త హెడ్‌కోచ్ గంభీర్ నేతృత్వంలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. గంటల సమయం పాటు సూర్య అండ్ కో నెట్స్‌లో చెమటోడ్చారు. అయితే నెట్ ప్రాక్టీస్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పిన్నర్‌గా అవతరెమెత్తాడు. సాధరణంగా మీడియం పేసర్ బౌలర్ అయిన పాండ్యా.. లెగ్ స్పిన్ బౌలింగ్ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు గంభీర్ కొత్త ప్రయోగం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది భారత జట్టుకు కొత్త స్పిన్నర్ వచ్చాడని పోస్ట్‌లు పెడుతున్నారు.కాగా పాండ్యా కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. లంకతో వన్డే సిరీస్‌కు వ్యక్తిగత కారణాల వల్ల హార్దిక్ దూరమయ్యాడు. అదేవిధంగా పాండ్యాను కాదని భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం విధితమే. ఇక పర్యటలో భాగంగా భారత్ లంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.Hardik pandya bowling practice in net session at Colombo!!!!!New lege spinner in team india 🥰♥️#SLvIND #Cricket #IndianCricketTeam#hardikpandya pic.twitter.com/D2d21J8prh— Ashok BANA (@AshokBana_11) July 25, 2024 -
హార్దిక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది.. అది చూసి నేను షాకయ్యా: నితీష్
ఆంధ్రా స్టార్ ఆల్‌రౌండర్, ఎస్ఆర్హెచ్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్-2024 తర్వాత స్పోర్ట్స్ హెర్నియా గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్న నితీష్ కుమార్.. సెప్టెంబర్ 9 నుంచి జరగనున్న దులీప్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో సీజన్లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో నితీష్‌కు భారత జట్టు నుంచి తొలిసారి పిలుపువచ్చింది. జింబాబ్వే సిరీస్‌కు నితీష్ కుమార్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు నితీష్ దూరమయ్యాడు. అయితే తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇష్టమైన ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఒకడని, తనకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నాడని నితీష్ చెప్పుకొచ్చాడు."టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహాకాల్లో బీజీగా ఉన్నప్పటకి హార్దిక్ భాయ్ నాకు ఓ మెసేజ్ చేశాడు. ఫీల్డ్‌లో నా ఎఫక్ట్, ఎనర్జీ, ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు పాండ్యా ఆ మెసేజ్‌లో రాసుకొచ్చాడు. త్వరలోనే మనం కలిసి ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.నిజంగా అతడి మెసెజ్‌ను చూసి షాక్ అయ్యాను. ఎందకంటే ఓ మెగా టోర్నీకి సన్నద్దమవుతున్న సమయంలో కూడా నన్ను గుర్తుపెట్టుకోవడం నిజంగా చాలా గ్రేట్. వెంటనే పాండ్యా భయ్యాకు ధన్యవాదాలు తెలుపుతూ రిప్లే ఇచ్చాను.అదే విధంగా ఓ ఆల్‌రౌండర్‌గా బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యాలను నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నానని" ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో 11 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్.. 303 పరుగులతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డును సైతం ఈ ఆంధ్ర స్టార్ ఆల్‌రౌండర్ గెలుచుకున్నాడు. -
'అదే హార్దిక్ కొంపముంచింది'.. అగార్కర్ అస్సలు ఒప్పుకోలేదంట!?
టీమిండియా నూతన టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. టీ20ల్లో రోహిత్ శర్మ వారుసుడిగా సూర్యకుమార్ భారత జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి భారత ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా సూర్య ప్రస్ధానం మొదలు కానుంది. అయితే హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్‌ను టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే విషయం క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఐపీఎల్‌లోనూ, భారత జట్టు తత్కాలిక సారథిగా మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటకి కెప్టెన్‌గా పాండ్యాను ఎంపిక చేయలేదన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న.ఇందుకు ఒక్కొక్కరు ఒక్క కారణం చెబుతున్నారు. కొంత మంది ఫిట్నెస్ వాళ్లే అతడిని ఎంపిక చేయలేదని, మరికొంత మంది శ్రీలంకతో వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోనే పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించలేదని అభిప్రాయపడుతున్నారు. కాగా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా పాండ్యాను తప్పించడం అందరని విస్మయానికి గురిచేసింది.ఒప్పుకోని అగార్కర్..కాగా హార్దిక్ పాండ్యాకు భారత జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ ఒప్పుకోలేదంట. పాండ్యా కెప్టెన్సీపై తనకు నమ్మకం లేదంటూ అగార్కర్ బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అందుకు ఐపీఎల్లో పాండ్యా కెప్టెన్సీనే కారణమని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పాండ్యా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌ను వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేర్చినప్పటకి.. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాక తన మార్క్‌ను మాత్రం చూపించలేకపోయాడు. ఐపీఎల్-2024లో అతడి సారథ్యంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుస ఓటములతో లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అగార్కర్ అండ్ కో సైతం పాండ్యా కెప్టెన్సీ స్కిల్స్‌పై సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసినట్లు వినికిడి. మరోవైపు భారత కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం పాండ్యా కెప్టెన్సీపై విముఖత చూపినట్లు తెలుస్తోంది. -
#Hardhikpandya: అయ్యో హార్దిక్.. నీకే ఎందుకిలా! నీకు మేము ఉన్నాము
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు ప్రొఫెషనల్‌గాను హార్దిక్ గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలకడంతో భారత తదుపురి టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అంతా భావించారు.కానీ బీసీసీఐ మాత్రం పాండ్యాకు ఊహించని షాకిచ్చింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీమిండియా టీ20 కెప్టెన్‌గా పాండ్యాను కాదని స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ను నియమించింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.అయితే శ్రీలంక పర్యటనకు జట్టు ప్రకటించిన కొద్ది సేపటికే హార్దిక్ మరో బాంబు పేల్చాడు. గత కొన్ని నెలలగా తమ వైవాహిక జీవితానికి సంబంధించి వస్తున్న రూమర్స్‌ను హార్దిక్ పాండ్యా, అతడి భార్య నటాషా స్టాంకోవిచ్ నిజం చేశారు. హార్దిక్ పాండ్య- నటాషా తామిద్దరూ విడిపోతున్నట్లు ఉమ్మడి ప్రకటన ద్వారా తెలియజేశారు. "మా 4 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాము. మేము కలిసిండేందుకు అన్ని విధాల ప్రయత్నం చేశాము. కానీ విడిపోవడమే ఉత్తమమని మేమిద్దరం భావించాము. పరస్పర గౌరవం, ఆనందంతో కలిసి ఒక కుటంబంగా ఎదిగిన తర్వాత విడిపోవడం నిజంగా కష్టమే. కానీ ఈ కఠినమైన నిర్ణయం తీసుకొక తప్పట్లలేదు. మా ఇద్దరి జీవితాల్లోనూ అగస్త్య భాగంగా ఉంటాడు. అగస్త్యకు కో పెరెంట్‌గా మేము కొనసాగుతాం. అతని ఆనందం కోసం మేం ఏమైనా చేస్తాం. ఈ క్లిష్టమైన సమయంలో మాకు మీ మద్దతు కావాలి. మా గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని ప్రకటనలో హార్దిక్, నటాషా పేర్కొన్నారు. అయితే ఈ క్టిష్టసమయంలో హార్దిక్‌కు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. కమాన్ హార్దిక్.. నీకు మేము ఉన్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. మరి కొందరు అయ్యో హార్దిక్.. నీకేందుకు ఇన్ని కష్టాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఐపీఎల్-2024 సమయంలోనూ పాండ్యా దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పాండ్యా అటు సారథిగా, ఇటు ఆటగాడిగా విఫలయ్యాడు. దీంతో పాండ్యాను దారుణంగా ట్రోలు చేశారు. అయితే టీ20 వరల్డ్‌కప్-2024లో పాండ్యా దుమ్ములేపడంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. తిట్టిన నోళ్లే అతడిని ప్రశించాయి. Stay strong 🥺💔 #HardikPandya pic.twitter.com/aByDFMkRqH— rj facts (@rj_rr1) July 18, 2024 -
శ్రీలంకతో వన్డే సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్ దూరం
శ్రీలంక పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో లంకతో వన్డే సిరీస్ దూరంగా ఉండాలని పాండ్యా నిర్ణయించకున్నట్లు సమాచారం.ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకు హార్దిక్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. బీసీసీఐ కూడా హార్దిక్ నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే శ్రీలంకతో వన్డేలకు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దూరం కానున్నాడు.ఈ క్రమంలో లంకతో వన్డే సిరీస్‌లలో భారత జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యకు అప్పగించాలని సెలక్టర్లు భావించారు. కానీ అంతలోనే హార్దిక్ కూడా వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి అప్పగించాలని సెలక్టర్లు సతమతవుతున్నట్లు వినికిడి. ఈ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించే అవకాశముంది. లంకేయులతో వన్డే సిరీస్‌లో భారత జట్టు సారథిగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను నియమించాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సిరీస్‌లో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల్లో శ్రీలంకతో తలపడనుంది. పల్లెకెలె వేదికగా జూలై 27న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. -
శ్రీలంకతో వన్డే సిరీస్.. రోహిత్ శర్మకు రెస్ట్! టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ టూర్ ముగిసిన వెంటనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.జూలై 27న జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శ్రీలంక టూర్‌కు రెండు వేర్వేరు జట్లను వచ్చే వారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లంకతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. లంకతో టీ20ల్లో హార్దిక్ పాండ్యాకు, వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్‌కు జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 వరల్డ్‌కప్-2024కు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తిరిగి ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమన్పిస్తోంది."శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించకున్నాం. రాబోయే షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని వీరికి రెస్ట్ ఇచ్చాము. వీరిముగ్గురూ తిరిగి సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌లకు జట్టులో చేరతారని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత పొట్టి క్రికెట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఈ పర్యటనతోనే భారత జట్టుకు కూడా కొత్త హెడ్‌కోచ్ వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: WCL 2024: యువరాజ్ ఫెయిల్..బెంగాల్ ఎంపీ తుపాన్ ఇన్నింగ్స్! వీడియో వైరల్ -
దటీజ్ హార్దిక్ పాండ్యా.. అవమానపడ్డ చోటే జేజేలు! వీడియో వైరల్
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టుకు అభిమానులు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. బార్బోడస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న టీమిండియాకు అభిమానులు, బీసీసీఐ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్లే అంతవరకు జేజేలు కొడుతూ అభినందించారు. ఇప్పుడు ముంబై వంతు. ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ ప్రారంభమైంది. క్రికెట్ అభిమానులతో ముంబై తీరం పోటెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఓపెన్ బస్ విక్టరీ పరేడ్ జరగనుంది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో వరల్డ్ ఛాంపియన్స్‌కు సన్మానం జరగనుంది.హార్దిక్‌కు సారీ చెప్పిన అభిమానిఇక టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎక్కడైతే కిందపడి అవమానాలు పొందాడో అక్కడే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. ఐపీఎల్-2024లో సమయంలో ఏ వాంఖడే స్టేడియంలో అయితే విమర్శలు ఎదుర్కొన్నాడో.. ఇప్పుడు అదే మైదానంలో నీరాజనాలు అందుకుంటున్నాడు. భారత ఆటగాళ్ల సన్మాన వేడుక చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వాంఖడే స్టేడియంకు తరలివచ్చారు. హార్దిక్ హార్దిక్ అంటూ జేజేలు కొడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని లైవ్‌లో హార్దిక్ క్షమాపణలు చెప్పింది."మొట్టమొదట నేను హార్దిక్ పాండ్యాకి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఐపీఎల్లో నేను కూడా అతడిని ట్రోల్ చేశాను. అలా ఎందుకు ట్రోల్ చేశానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. అతడు టీ20 వరల్డ్‌కప్‌లో హీరోగా మారాడు. అతడు వేసిన చివరి ఒక అద్భుతం. అతడికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని" సదరు అభిమాని ఇండియా టూడేతో పేర్కొంది. Hardik Pandya is Zlatan Ibrahimovic of Indian Cricket 🏏 who has turned his "haters into fans" 👏🏻The Best All Rounder of ICC T20 World Cup 2024 - @hardikpandya7 💥#IndianCricketTeampic.twitter.com/cNcK2zPiwq— Richard Kettleborough (@RichKettle07) July 4, 2024 -
నిజంగానే విడిపోతున్నారా? హార్దిక్ పాండ్యా సతీమణి పోస్టు వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. అతడి భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరూ విడిపోతున్నారంటూ గత కొన్ని నెలలగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు పాండ్యా గానీ, నటాషా గానీ ఈ విషయంపై స్పందించలేదు. అయితే తాజాగా నటాషా పెట్టిన ఓ పోస్టు ఈ విడాకుల వార్తలకు మరింత ఊతమిచ్చేలా ఉంది."జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉండి నిరుత్సాహానికి లోనవుతుంటాం. అటువంటి పరిస్థితుల్లో మీరు భయపడవద్దు. ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా ఆ దేవుడు మాత్రం మీకు తోడుగా ఉంటాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు" అని నటాషా ఓ వీడియోను పోస్టు చేశారు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. సగర్వంగా భారత గడ్డపై అడుగు పెట్టింది. అయితే భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనూ సత్తాచాటిన హార్దిక్ భారత్‌కు రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను అందించాడు. విజయనంతరం పాండ్యా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. గత కొన్ని కొన్ని నెలల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాని పాండ్యా కన్నీటి పర్యంతమయ్యాడు. భారత విజయం తర్వాత కోహ్లి, రోహిత్ సతీమణిలు తమ భర్తలపై ప్రశంసల వర్షం కురిపించగా.. పాండ్య ప్రదర్శనపై మాత్రం నటాషా ఇప్పటివరకు కనీసం ఒక్క పోస్టు కూడా చేయలేదు. -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన హార్దిక్ పాండ్యా.. నెం1 ఆల్‌రౌండర్‌గా
ఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సత్తాచాటాడు. టీ20ల్లో నెం1 ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా అవతరించాడు. రెండు స్థానాలు ఎగబాకి శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని హార్దిక్ పంచుకున్నాడు.ప్రస్తుతం వీరిద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్-2024లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పాండ్యా.. భారత్ రెండో సారి టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనూ పాండ్యా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ప్రోటీస్ విధ్వంసకర బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌ను ఔట్ చేసి భారత్‌ను విజేతగా నిలిపాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో పాండ్యా 6 ఇన్నింగ్స్‌లలో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 11 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ సమయంలో ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానంలో ఉన్న అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఏకంగా ఆరో స్థానానికి పడిపోయాడు. అదే విధంగా ఈ పొట్టి ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ ఒక్క స్ధానం ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వరుసగా నాలుగు ఐదు స్ధానాల్లో నిలిచారు. -
భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. జై షా ఏమన్నాడంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా నిలిచిన అనంతరం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. రోహిత్ ఇకపై కేవలం వన్డేలు, టెస్టుల్లో భారత సారథిగా కొనసాగనున్నాడు.ఈ క్రమంలో టీ20ల్లో భారత జట్టు తదపరి కెప్టెన్ ఎవరన్న ప్రశ్న అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. అయితే రోహిత్ వారసుడిగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారత జట్టు పగ్గాలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పాండ్యాకు కెప్టెన్‌గా అనుభవం ఉంది.గతంలో రోహిత్ గైర్హాజరీలో చాలా సిరీస్‌లో భారత జట్టు తాత్కాలిక సారథిగా పాండ్యా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా పొట్టి ఫార్మాట్లో భారత జట్టు సారథ్య బాధ్యతలను హార్దిక్‌కే అప్పజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా భారత టీ20 కెప్టెన్సీపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించాడు. కెప్టెన్ ఎవరన్నది ఇంకా నిర్ణయంచలేదని జై షా తెలిపాడు."భారత జట్టు టీ20 కెప్టెన్ ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయిస్తారు. సెలక్టర్లతో చర్చించిన తర్వాత అధికారికంగా మేము ప్రకటిస్తాము. హార్దిక్ పాండ్యా గురించి చాలా మంది తమను అడిగారని, వరల్డ్‌కప్‌నకు ముందు అతడి ఫామ్‌పై చాలా ప్రశ్నలు వినిపించాయి. కానీ సెలెక్టర్లు అతనిపై విశ్వాసం ఉంచారు. అతడిని తనను తాను నిరూపించుకున్నాడు. ఏదేమైనప్పటికి కెప్టెన్సీ విషయంలో సెలక్టర్లదే తుది నిర్ణయమని" జై షా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక ఈ నెలలో భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి.శ్రీలంక పర్యటన సమయానికి భారత జట్టుకు కొత్త టీ20 కెప్టెన్ వచ్చే అవకాశముంది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో పాండ్యా కీలక పాత్ర పోషించాడు.చదవండి: రో.. నీలాంటి వ్యక్తి నా సొంతమైనందకు చాలా గర్విస్తున్నా: రితికా -
జట్టులో చోటు ఎందుకన్నారు.. కట్ చేస్తే అతడే వరల్డ్‌కప్ హీరో
ఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు హీరోగా మారిపోయాడు. అతడిని విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అని పొగుడుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్-2024 ఎంపిక చేసిన భారత జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడం పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్‌లో లేని ఆటగాడికి ఛాన్స్ ఎందుకు ఇచ్చారని సెలక్టర్లపై కూడా చాలా మంది మాజీలు ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే తనపై వచ్చిన విమర్శలన్నింటకి హార్దిక్ తన ఆటతోనే సమాధానమిచ్చాడు. టీ20 వరల్డ్‌కప్‌లో పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆల్‌రౌండ్ షోతో హార్దిక్ అదరగొట్టాడు.కీలకమైన ఫైనల్లో సైతం పాండ్యా సత్తాచాటాడు. బ్యాటింగ్‌లో తన మార్క్ చూపించే అవకాశం పెద్దగా రాకపోయినప్పటికి బౌలింగ్‌లో మాత్రం దుమ్ములేపాడు. ఓటమి తప్పదనుకున్న పాండ్యా మ్యాజిక్ చేశాడు. 17 ఓవర్ వేసిన పాండ్యా.. చేలరేగి ఆడుతున్న క్లాసెన్‌ను అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. క్లాసెన్ వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అనంతరం ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను కూడా రోహిత్.. హార్దిక్ పాండ్యాకే అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టకున్నాడు. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్ విజయం సాధించగానే పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జెండా పట్టుకుని స్టేడియం మొత్తం పాండ్యా తిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడి 144 పరుగులతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పాండ్యాపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
ఫైనల్లో విజయం.. వెక్కి వెక్కి ఏడ్చిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్ అవతరించింది. శనివారం బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన టీమిండియా.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టైటిల్ పోరులో 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఓటమి తప్పదనకున్న చోట భారత బౌలర్లు అద్బుతం చేసి తమ జట్టును మరోమారు విశ్వవిజేతగా నిలిపారు.177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోహ్లి(76), అక్షర్ పటేల్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.కన్నీళ్లు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా..ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను రోహిత్.. హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. రోహిత్ నమ్మకాన్ని పాండ్యా ఒమ్ము చేయలేదు. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.ఆఖరి బంతి ముగిసిన వెంటనే భారత ఆటగాళ్లు తీవ్ర బావోద్వేగానికి లోనయ్యారు. రోహిత్ శర్మ నేలను ముద్దాడాడు. హార్దిక్ పాండ్యా అయితే వెక్కి వెక్కి ఏడ్చాడు. పాండ్యాను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. వీరిద్దరితో పాటు విరాట్ కోహ్లి, సిరాజ్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. मुहब्बत जिंदाबाद रहे❤️🇮🇳#HardikPandya #T20WorldCupFinal #ViratKohli𓃵pic.twitter.com/Rj2PK6wWKc— RaGa For India (@RaGa4India) June 30, 2024 -
అప్పుడు యువరాజ్.. ఇప్పడు హార్దిక్! సేమ్ టూ సేమ్: శ్రీశాంత్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు తనపై ఉన్న అపవాదును చెరిపేసుకున్నాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటుతున్నాడు.ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ 116 పరుగులతో పాటు 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్‌పై భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ అద్భుతమైన ఆల్‌రౌండర్‌ని, భారత్‌ను ఛాంపియన్స్‌గా నిలబెడతాడని శ్రీశాంత్ కొనియాడాడు."హార్దిక్ పాండ్యాకు అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. భారత జట్టులో అతడు కీలకమైన ఆటగాడు. ఇదే విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పలుమార్లు చెప్పాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్ ఏ విధమైన ప్రదర్శన చేశాడో మనకు ఇప్పటికి బాగా గుర్తుంది.బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సత్తాచాటి భారత్‌కు టైటిల్‌ను అందించాడు. ఇప్పుడు హార్దిక్ కూడా నాకౌట్స్‌లో యువీ లాంటి ప్రదర్శనే చేస్తాడని నేను భావిస్తున్నాను. భారత్ కచ్చితంగా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ పేర్కొన్నాడు. కాగా భారత్ రెండో సెమీఫైనల్లో గురువారం గయానా వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. 17 ఏళ్ల ధోని రికార్డు బద్దలు
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సత్తాచాటుతున్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టుకు అద్బుతమైన విజయాలు అందిస్తున్నాడు.తాజాగా ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో ఆజేయ అర్ధశతకం సాధించిన పాండ్యా.. బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో హార్దిక్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.హార్దిక్ సాధించిన రికార్డులు ఇవే..→టీ20 ప్రపంచకప్ చరిత్రలో 300 పరుగులు, 20+ వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా హార్దిక్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ .. 137.89 స్ట్రైక్‌రేట్‌తో 302 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో పాండ్యా ఐదో స్ధానంలో నిలిచాడు.షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 853 పరుగులు, 50 వికెట్లుషాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)- 546 పరుగులు, 39 వికెట్లుషేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)- 537 పరుగులు, 22 వికెట్లుడ్వేన్ బ్రావో (వెస్టిండీస్)- 530 పరుగులు, 27 వికెట్లు→టీ20 ప్రపంచకప్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా పాండ్యా రికార్డు సృష్టించాడు.ఇప్పటివరకు ఈ రికార్డు సురేశ్ రైనా (45 పరుగులు), ధోనీ (45) పేరిట ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసి 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు.2012 టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతోనే జరిగిన మ్యాచ్‌లో ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన సురేశ్ రైనా 34 బంతుల్లో 45 పరుగులే చేశాడు. కాగా తాజా మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన పాండ్యా వారిద్దరి రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
అతడి సత్తా ఏంటో మాకు తెలుసు.. చాలా సంతోషంగా ఉంది: రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా జోరును కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ బెర్త్ లాంఛనమైనట్లే. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 196 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. ఆ తర్వాత బౌలింగ్‌లో ప్రత్యర్ధిని 146 పరుగులకే కట్టడి చేసింది.భారత విజయంలో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్.. బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు."టీ20ల్లో దూకుడుగా ఆడటం గురించి నేను చాలా రోజులుగా మాట్లాడుతున్నాను. ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో మేము అనుకున్నది చేసి చూపించాము. అన్ని విభాగాల్లో సత్తాచాటాము. ఓవరాల్‌గా మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. పరిస్థితులను వేగంగా అందిపుచ్చుకున్నాము. ఈ మైదానంలో గాలులు వీచాయి. కానీ పరిస్థితులకు తగ్గట్టు మేము తెలివిగా వ్యవహరించాం. బ్యాట్, బాల్‌తో అద్బుతంగా రాణించాము. ఏది ఏమైనా జట్టులోని 8 మంది బ్యాటర్లు తమ పాత్ర షోషించాలి. ఈ మ్యాచ్‌లో ఒక్క ప్లేయర్ హాఫ్ సెంచరీ చేసినప్పటకి మేము 197 పరుగులు చేసాము. టీ20ల్లో భారీ స్కోర్ సాధించాలంటే హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేయాల్సిన అవసరం లేదు. జట్టులో బ్యాటర్లు సమిష్టిగా రాణించి ప్రత్యర్ధి బౌలర్లపై ఒత్తిడి తెస్తే చాలు.ప్రపంచంలో అందరూ ఇలానే ఆడుతున్నారు. మేం కూడా అలానే ఆడాలనుకుంటున్నాం. మా జట్టులో చాలా మంది అనుభవిజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లకు జట్టు మెనెజ్‌మెంట్ కూడా సపోర్ట్గాఉంది. ఇక హార్దిక్ బ్యాట్‌తో రాణించడం ఎంత ముఖ్యమో అఫ్గాన్‌తో మ్యాచ్ అనంతరం కూడా చెప్పాను. అతడి బ్యాటింగ్ మమ్మల్ని పటిష్ట స్థితిలో ఉంచుతుంది. హార్దిక్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడి సత్తా ఎంటో మాకు బాగా తెలుసు. అతడు మా జట్టుకు చాలా ముఖ్యమైన ఆటగాడు. హార్దిక్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రాబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా మేము మంచి పొజిషేన్‌లో ఉంటాము.ఈ మ్యాచ్‌లో బౌలర్లతో నేను మాట్లాడిన ప్రతీ సారి మాకు మంచి ఫలితమే వచ్చింది. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. -
T20 WC 2024: బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. సెమీస్‌కు టీమిండియా?
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ తమ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖారారు చేసుకుంది. ఇక 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగల్గింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(37), పంత్(36), శివమ్ దూబే(34) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్, రిషద్ హోస్సేన్ తలా రెండు వికెట్లు సాధించారు. -
హార్దిక్ పాండ్యా మెరుపు హాఫ్ సెంచరీ.. వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హార్దిక్.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. హార్దిక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బౌలింగ్‌లో కూడా ఓ కీలక వికెట్ హార్దిక్ పడగొట్టాడు. పాండ్యా బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు శెభాష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో హార్దిక్ దారుణ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శల ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.pic.twitter.com/DCYcATgnIS— Azam Khan (@AzamKhan6653) June 22, 2024 -
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి ప్లేయర్‌గా రికార్డు
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి రుజువు చేసింది. టీ20 ప్రపంచకప్-2024లో ఆదివారం న్యూయర్క్ వేదికగా పాక్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.ఈ విజయంతో టీమిండియా సూపర్-8కు అడుగు దూరంలో నిలవగా.. పాకిస్తాన్ మాత్రం వరుస ఓటములతో తమ సూపర్-8 ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇక భారత విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో విఫలమైన పాండ్యా.. బౌలింగ్‌లో మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.జస్ప్రీత్ బుమ్రాతో కలిసి పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేశాడు. హార్దిక్ తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పాండ్యా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్‌పై టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హార్దిక్ రికార్డులకెక్కాడు.పాక్‌పై ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా.. 13 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీ రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు. అదే విధంగా ఓవరాల్‌గా పాక్-భారత్ మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కూడా పాండ్యానే కావడం గమనార్హం. పాండ్యా తర్వాత ఉమర్ గుల్(11), భువనేశ్వర్ కుమార్(11) ఉన్నారు. -
ఐర్లాండ్‌పై అద్బుత ప్రదర్శన.. హార్దిక్‌పై గవాస్కర్ ప్రశంసలు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫామ్‌ను తిరిగి పొందాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారథిగా దారుణ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్-2024లో సత్తాచాటుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా అదరగొట్టాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటకి బౌలింగ్‌లో మాత్రం హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్యా అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడని గవాస్కర్ కొనియాడాడు."హార్దిక్ పాండ్యా తిరిగి తన రిథమ్‌ను పొందడం చాలా సంతోషంగా ఉంది. హార్దిక్ తన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. హార్దిక్ గతంలో రెండు ఓవర్లు వేసి బ్రేక్ తీసుకునే వాడు.కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం వరుసగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి ఔరా అనిపించుకున్నాడు. హార్దిక్‌కు ఐపీఎల్ తర్వాత వరల్డ్‌కప్ అనేది ఒక పరీక్ష వంటి. నా వరకు అయితే ఈ పరీక్షలో హార్దిక్ పాసైడని నేను భావిస్తున్నాని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. -
నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన హార్దిక్ పాండ్యా.. గంటకు పైగా బౌలింగ్
టీ20 వరల్డ్ కప్-2024లో పాల్గోనేందుకు భారత జట్టు ఇప్పటికే అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. జూన్ 1న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఆదివారం న్యూయర్క్ వేదికగా బంగ్లాదేశ్‌తో వార్మాప్ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈ వార్మాప్ మ్యాచ్‌కు ముందు టీమిండియా న్యూయర్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం తమ మొదటి ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించింది. ఈ కొత్త స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ పిచ్‌లపై రోహిత్ అండ్ కో తీవ్రంగా శ్రమించారు. అయితే బుధవారం న్యూయార్క్‌లో వర్షం భారీగా కురిసినప్పటికి.. నేడు(గురువారం) మాత్రం భారత ప్రాక్టీస్‌కు వరుణుడు ఎటువంటి ఆటంకం కలిగించలేదు.చెమటోడ్చిన హార్దిక్ పాండ్యా..ఈ క్రమంలో మిగిలిన ఆటగాళ్ల కంటే టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తీవ్రంగా చెమటోడ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిని హార్దిక్ ప్రాక్టీస్ చేశాడు. జట్టుతో ఇటీవలే కలిసిన పాండ్యా.. తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దాదాపు నెట్స్‌లో గంటకు పైగా హార్దిక్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్ కూడా ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేశాడు. కాగా ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా దారుణ ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ పాండ్యా విఫలయ్యాడు. అయినప్పటికి తనకు ఉన్న అనుభవం దృష్ట్యా సెలక్టర్లు వరల్డ్‌కప్ జట్టులో చోటిచ్చారు. కానీ సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది మాజీలు విమర్శల వర్షం కురిపించారు. ఫామ్‌లో లేని ఆటగాడిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సెలక్టర్ల నమ్మకాన్ని హార్దిక్ ఎంత వరకు నిలబెట్టుకుంటాడో మరో 5 రోజు ఎదురు చూడాల్సిందే.టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. -
భార్యతో విడాకులు?.. విదేశాల్లో హార్దిక్ పాండ్యా ఒక్కడే!
టీ20 వరల్డ్‌కప్-2024 కోసం టీమిండియా తొలి బ్యాచ్ అమెరికా గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు మొదటి విడతగా ఆదివారం అమెరికాకు చేరుకున్నారు. ఇక రెండో బ్యాచ్‌లో భారత స్టార్ విరాట్ కోహ్లి, రింకూ సింగ్, సంజూ శాంసన్, చాహల్ మంగళవారం అమెరికా వెళ్లే విమానం ఎక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం రెండో బ్యాచ్‌తో కూడా అమెరికాకు వెళ్లేందుకు సిద్దంగా లేనిట్లు సమాచారం. పాండ్యా జట్టుతో కలిసేందుకు మరి కొంత సమయం పట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్యా-తన భార్య నటాసా స్టాంకోవిక్ విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై హార్దిక్ గానీ, నటాసా గానీ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఐపీఎల్-2024లో ఆటగాడిగా, కెప్టెన్‌గా ఘోర పరాభావం పొందిన పాండ్యా.. ప్రస్తుతం ఒంటరిగా విదేశాలకు వెకేషన్‌కు వెళ్లినట్లు ప్రముఖ క్రీడా వెబ్సైట్ క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. హార్దిక్ ఎక్కడ ఉన్నాడో తెలియదు గానీ ఫారెన్‌లో సేదతీరుతున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. హార్దిక్ కూడా సైతం తన స్విమ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఎక్కడ ఉన్నాన్నది హార్దిక్ చెప్పలేదు. అయితూ హార్దిక్ షేర్ చేసిన ఫోటోలలో తనక్కొడే ఉండడంతో విడాకుల రూమర్స్‌కు మరింత ఊతమిచ్చినట్లైంది. పాండ్యా ఫారెన్‌లో ఉన్నప్పటికి నేరుగా త్వరలోనే న్యూయర్క్‌లో ఉన్న భారత జట్టుతో కలవనున్నట్లు మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు విడ్కోలు పలకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని బీసీసీఐకు వెల్లడించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీ20ల్లో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే హార్దిక్‌ను టీ20 వరల్డ్‌కప్-2024లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేసినట్లు వినికిడి. అంతేకాకుండా ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టులో హార్దిక్‌కు చోటు దక్కాలని సెలక్టర్లపై బీసీసీఐ ప్రత్యేక ఒత్తిడి తీసుకువచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.కాగా ఇప్పటివరకు రోహిత్ శర్మ గైర్హజరీలో టీ20ల్లో భారత జట్టును హార్దిక్ పాండ్యానే నడిపిస్తున్నాడు. రోహిత్ తర్వాత హార్దిక్ భవిష్యత్తు కెప్టెన్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఐపీఎల్-2024 సీజన్ తర్వాత అందరి అభిప్రాయం మారిపోయింది.ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ చూపించలేకపోయాడు. రోహిత్ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్దిక్‌కు ముంబై ఫ్రాంచైజీ అప్పగించింది.జట్టును విజయం నడిపించడంలో హార్దిక్ విఫలమయ్యాడు. అంతేకాకుండా ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు వర్గాలగా కూడి చీలిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది రోహిత్ శర్మ వర్గంలో ఉంటే మరి కొంతమంది పాండ్యాకు సపోర్ట్‌గా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్లో కెప్టెన్‌గా తన మార్క్ చూపించడంలో విఫలమవుతున్న హార్దిక్.. ఒక వేళ పూర్తి స్దాయిలో భారత జట్టు పగ్గాలు చేపడితే ఏ మెరకు విజయవంతమవుతాడో చూడాలి. -
చాలా బాధగా ఉంది.. ఆ తప్పే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం తీరలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ ఏడాది సీజన్లో ముంబైకు ఇది తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై.. ఆఖరి మ్యాచ్‌లలోనూ తమ మార్కును చూపించలేకపోతుంది. ఈ మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(32) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని హార్దిక్ తెలిపాడు."ఈ ఓటమిని జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. లక్ష్య చేధనలో మాకు అద్బుతమైన ఆరంభం లభించినప్పటికి మేము సద్వినియోగపరుచుకోలేకపోయాము. వాతవారణ పరిస్ధితుల కారణంగా పిచ్ కొంచెం మేము అనుకున్నదాని కంటే కొంచెం భిన్నంగా ఉంది. అయితే బ్యాటింగ్‌కు మరి అంత కష్టమైన వికెట్(ఈడెన్ పిచ్) అయితే కాదు. పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. 158 పరుగుల టార్గెట్ అనేది మరి అంత పెద్ద లక్ష్యమేమి కాదు. తొలుత మేము బౌలింగ్ చేసే టప్పుడు మా బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. బంతి బౌండరీకి వెళ్లిన ప్రతీసారి పూర్తిగా తడిగా మారి వెనుక్కి వచ్చేది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రత్యర్ధి బ్యాటర్లు బౌండరీలను అలవోకగా బాదారు.ఇక మా చివరి మ్యాచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలలు ఏమీ లేవు. వీలైనంతవరకు టోర్నీని విజయంతో ముగించేందుకు ప్రయ"త్నిస్తాము. ఏదమైనప్పటికి ఈ ఏడాది సీజన్లో మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. -
కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కు వర్షం అడ్డంకి..
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఈడెన్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని భావిస్తోంది.11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా.. ఎనిమిదింట విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో నిలిచింది. -
'హార్దిక్ ఒక అద్బుతమైన కెప్టెన్.. అందరి కంటే డిఫరెంట్'
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ముంబై కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా..తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా హార్దిక్ నిరాశపరుస్తున్నాడు. అదే విధంగా ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విడిపోయినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఉద్దేశించి ముంబై యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్ అంటూ కోయెట్జీ పొగడ్తలతో ముంచెత్తాడు."హార్దిక్ పాండ్యా నిజంగా సూపర్ కెప్టెన్. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ప్రతీ కెప్టెన్‌కు ఒక స్టైల్ ఉంటుంది. ఏ కెప్టెన్ కూడా ఒకేలా ఉండడు. హార్దిక్ జట్టులో ప్రతీఒక్క ఆటగాడికి సపోర్ట్‌గా ఉంటాడు. ఫీల్డ్‌లో సరైన ప్రణాళికలలు రచించడంలో హార్దిక్ దిట్ట.నా వరకు అయితే అతడొక అసాధారణమైన కెప్టెన్. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి టోర్నీ ఘనంగా ముగించేందుకు ప్రయత్నిస్తామని" ఓ ఇంటర్వ్యూలో కోయెట్జీ పేర్కొన్నాడు. -
SRH Vs MI: రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు. -
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. వాంఖడేలో కేకేఆర్ చేతిలో ముంబై జట్టు ఓడిపోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్రమంలో ముంబై జట్టును విజయం పథంలో నడిపించలేక విఫలమవుతున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం హార్దిక్ పాండ్యా కెప్టెన్స్‌పై మండిపడ్డాడు. "ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. పేపర్‌పై ముంబై జట్టు చాలా బలంగా ఉంది. కానీ మైదానంలో మాత్రం పూర్తిగా తేలిపోతున్నారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తోంది. బౌలింగ్‌లో ముంబైకి మంచి ఆరంభం లభించింది. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కేకేఆర్ కష్టాల్లో పడింది.అటువంటి సమయంలో 6వ బౌలర్‌గా నమన్ ధీర్ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? చావ్లాతో ఫుల్ ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి కేకేఆర్‌కు మంచి స్కోర్ అందించారు. క్రికెట్లో ఏ జట్టుకైనా కెప్టెన్సీ చాలా ముఖ్యం. కాబట్టి కెప్టెన్సీ విషయంలో మేనేజ్మెంట్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ముంబై జట్టు ఒక యూనిటీగా ఆడడం లేదు. హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడం ముంబై ఆటగాళ్లకు సైతం ఇష్టం లేనట్లుందని" స్టార్‌స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. -
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
ఐపీఎల్-2024లో దాదాపుగా ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. దీంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను ముంబై మరింత సంక్లిష్టం చేసుకుంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(56) ఒక్కడే పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్, రస్సెల్, చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో అయ్యర్ 70 పరుగులు చేశాడు. అయ్యర్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే కూడా తన వంతు పాత్ర పోషించాడు. 31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులు చేశాడు. ఇక ముంబై బౌలర్లలోతుషారా, బుమ్రా తలా 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన కేవలం 3 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించిన ముంబై.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో నిలిచింది. -
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తమ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ముంబై మాత్రం ఒకే ఒక మార్పు చేసింది. ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ స్ధానంలో నమాన్ ధీర్ వచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో ఉన్న ముంబై.. ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే.తుది జట్లుముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారకోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. టీమిండియా వైస్ కెప్టెన్‌గా పంత్!?
టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తమ జట్టును మే 1న ప్రకటించనుంది. ఇక ఇప్పటికే వరల్డ్‌కప్ కోసం తుది జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్‌కప్ జట్టు ఎంపిక చేసే క్రమంలో బీసీసీఐ సెలక్టర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు అప్పగించేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రోహిత్ డిప్యూటీగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాపై సెలక్టర్లు వేటు వేసినట్లు సమాచారం. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు హార్దిక్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక 14 నెలల తర్వాత తిరిగి రీ ఎంట్రి ఇచ్చిన రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో పంత్ ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లలో 371 పరుగులు చేశాడు. కెప్టెన్సీ పరంగా కూడా పంత్ ఆకట్టుకుంటున్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది. -
ఆ తప్పే మా కొంపముంచింది.. అతడు మాత్రం ఒక సంచలనం: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ముంబై మరో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలింగ్ పరంగా విఫలమైనప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం అద్భుతంగా పోరాడింది. 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(63), హార్దిక్ పాండ్యా(46), టిమ్ డేవిడ్(37) కీలక ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఈ ఏడాది సీజన్లో ఇది ముంబైకు ఆరో ఓటమి కావడం గమనార్హం. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "ఈ మ్యాచ్‌లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఇంతకుముందు ఒకట్రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవి. కానీ ఇప్పుడు ఒకట్రెండు బంతులు చాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. కాబట్టి మేము బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాం. కానీ మేము చిన్న చిన్న తప్పులు చేశాం.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాం. గేమ్ మిడిల్ ఒకటిరెండు ఓవర్లను టార్గెట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేసేటప్పుడు మా ఎడమచేతి వాటం బ్యాటర్లు అతడి టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం.ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తున్నాను. మా ముందు ఒక లక్ష్యముంటే ఛేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మేము అనుకున్నాము. కానీ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ మా అంచనాలను తారుమారు చేశాడు. అతడొక అద్బుతమైన ఆటగాడు. అతడు ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. ఏ బాల్‌ను ఎటాక్ చేయాలో అతడికి బాగా తెలుసు. అతను బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానం నలుమూలలగా షాట్లు ఆడాడని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. -
ఆ తప్పే మా కొంపముంచింది.. అతడు మాత్రం ఒక సంచలనం: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ముంబై మరో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలింగ్ పరంగా విఫలమైనప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం అద్భుతంగా పోరాడింది. 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(63), హార్దిక్ పాండ్యా(46), టిమ్ డేవిడ్(37) కీలక ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఈ ఏడాది సీజన్లో ఇది ముంబైకు ఆరో ఓటమి కావడం గమనార్హం. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "ఈ మ్యాచ్‌లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఇంతకుముందు ఒకట్రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవి. కానీ ఇప్పుడు ఒకట్రెండు బంతులు చాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. కాబట్టి మేము బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాం. కానీ మేము చిన్న చిన్న తప్పులు చేశాం.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాం. గేమ్ మిడిల్ ఒకటిరెండు ఓవర్లను టార్గెట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేసేటప్పుడు మా ఎడమచేతి వాటం బ్యాటర్లు అతడి టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం.ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తున్నాను. మా ముందు ఒక లక్ష్యముంటే ఛేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మేము అనుకున్నాము. కానీ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ మా అంచనాలను తారుమారు చేశాడు. అతడొక అద్బుతమైన ఆటగాడు. అతడు ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. ఏ బాల్‌ను ఎటాక్ చేయాలో అతడికి బాగా తెలుసు. అతను బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానం నలుమూలలగా షాట్లు ఆడాడని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. -
T20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే..? ఊహించని ప్లేయర్‌కు చోటు!
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగమయ్యే భారత జట్టును బీసీసీ సెలక్షన్ కమిటీ మరో నాలుగు, ఐదు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో భాగమయ్యే ఆ జట్లు తమ వివరాలను మే 1లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. దీంతో భారత జట్టును ఎంపిక చేసే పనిలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పడింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు టీ20 వరల్డ్‌కప్ కోసం బారత జట్టును అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా టీమిండియా మాజీ స్సిన్నర్ హార్భజన్ సింగ్ చేరాడు. టీ20 ప్రపంచకప్ కోసం తన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును భజ్జీ ఎంపిక చేశాడు. ఈ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శుబ్‌మన్ గిల్, పేసర్ మహ్మద్ సిరాజ్‌లకు భజ్జీ ఛాన్స్ ఇవ్వలేదు.వీరితో పాటు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను సైతం హార్భజన్ ఎంపిక చేయలేదు. అయితే అనూహ్యంగా ఈ జట్టులో భజ్జీ పేసర్ అవేష్ ఖాన్‌కు చోటివ్వడం గమనార్హం. ప్రస్తుత ఐపీఎల్లో సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అవేష్ ఖాన్ డెత్ ఓవర్లలో తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.ఈ క్రమంలోనే హార్భజన్ అవేష్‌కు చోటిచ్చాడు. ఇక భజ్జీ ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్లో అదరగొడుతున్న మయాంక్ యాదవ్, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్‌కు చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్‌ను హార్భజన్ ఎంచుకున్నాడు.అదేవిధంగా స్పెషలిస్టు స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌ను హార్భజన్ ఎంపిక చేశాడు.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం హర్భజన్ సింగ్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ -
రోహిత్ కూడా విఫలం.. ట్రోఫీ గెలవలేదు కదా!
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ఆ జట్టుకు తెలుసునని.. అయితే, సమిష్టిగా రాణిస్తేనే అది సాధ్యపడుతుందని పేర్కొన్నాడు. అదే విధంగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్లో తనను తాను ప్రమోట్ చేసుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని సూచించాడు. అతడు గనుక బ్యాట్ ఝులిపించగలిగితే ఆత్మవిశ్వాసం పెరిగి.. బౌలర్‌గా, కెప్టెన్‌గానూ రాణించగలడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్-2024లో రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఒత్తిడిలో చిత్తవుతున్న హార్దిక్ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లలో ముంబై ఓడింది.ఆ తర్వాత గెలుపుబాట పట్టినా నిలకడ ఉండటం లేదు. రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ పరాజయం పాలై ఎనిమిదింట ఐదో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. గత రెండు- మూడు సీజన్లలో రోహిత్ శర్మ కూడా టైటిల్ సాధించలేకపోయాడని.. స్థాయికి తగ్గట్లు పరుగులు కూడా రాబట్టలేకపోయాడని పేర్కొన్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా ఇవన్నీ పట్టించుకోకుండా.. ఆట మీద మాత్రమే దృష్టి పెట్టాలని సూచించాడు.‘‘తన వ్యక్తిగత ప్రదర్శన గురించి హార్దిక్ పెద్దగా ఆందోళన చెందడం లేదనే అనుకుంటున్నా. కానీ తనపై ఉన్న భారీ అంచనాల కారణంగా ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇక జట్టుగా ముంబై ఇండియన్స్ విషయానికొస్తే.. గతేడాది కూడా వాళ్ల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. వాళ్లకు ఇదేం కొత్త కాదు. ఆరంభంలో తడబడ్డా నిలదొక్కుకోగలరు. గతంలో కెప్టెన్‌గా ఉన్నపుడు రోహిత్ శర్మ కూడా పరుగులు చేయలేదు. గత రెండు- మూడేళ్లుగా టైటిల్ కూడా గెలవలేదు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. సమిష్టిగా రాణిస్తే ముందుకు వెళ్లగలరు. అయితే, హార్దిక్ పాండ్యా మాత్రం ఒత్తిడికి లోనుకాకూడదు. ముఖ్యంగా కెప్టెన్సీని భారంగా భావించకూడదు. బ్యాటింగ్ ఆర్డర్లో తనను ప్రమోట్ చేసుకున్నా తప్పేం లేదు. కానీ లోయర్ ఆర్డర్లో వచ్చినా అతడు పరుగులు చేయడం లేదంటూ విమర్శించడం సరికాదు. తను కాస్త ముందుగా వస్తే బాగుంటుంది. బ్యాటింగ్ మెరుగుపడిందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. బౌలింగ్ కూడా చేయగలడు. కెప్టెన్‌గానూ తనను తాను నిరూపించుకోగలడు’’ అని సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. -
IPL 2024 PBKS vs MI: ఉత్కంఠపోరులో పంజాబ్ ఓటమి..
IPL 2024 PBKS vs MI Live Updates: ఉత్కంఠపోరులో పంజాబ్ ఓటమి.. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 9 పరుగులతో ఓటమి పాలైంది. 192 పరుగుల భారీలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 183 పరుగులకే ఆలౌలైంది. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో హర్‌ప్రీత్ బ్రార్, రబాడ ఉన్నారు. అటు ముంబై విజయానికి కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆకాశ్ మధ్వాల్‌కు అప్పగించాడు. తొలి బంతిని మధ్వాల్ వైడ్‌గా సంధించాడు. ఈ క్రమంలో పంజాబ్ విజయసమీకరణం ఆరు బంతుల్లో 11 పరుగులుగా మారింది. తొలి బంతిని రబాడ ఆఫ్ సైడ్ డీప్ పాయింట్ దిశగా ఆడి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే మహ్మద్ నబీ వికెట్ కీపర్‌వైపు సూపర్త్రో వేశాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ స్టంప్స్‌ను గిరాటేశాడు. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా రీప్లేలో రనౌట్‌గా తేలింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ ఆఖరి వరకు రావడంలో ఆ జట్టు ఆటగాడు అశుతోష్ కీలక పాత్ర పోషించాడు. 28 బంతుల్లో 7 సిక్సర్లు,2 ఫోర్లతో అశుతోష్ ఫైటింగ్ నాక్ ఆడాడు. ఓ దశలో మ్యాచ్‌ను ఈజీగా గెలిపించేలా కన్పించిన అశుతోష్.. అనూహ్యంగా ఔటయ్యి తన జట్టును గెలిపించలేకపోయాడు. పంజాబ్ ఎనిమిదో వికెట్ డౌన్.. అశుతోష్ ఔట్ 168 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 61 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్.. కోయిట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అశుతోష్ సిక్సర్ల వర్షం.. విజయానికి చేరువలో పంజాబ్ పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అశుతోష్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 16 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజులో ఆశుతోష్ శర్మ(59), హర్‌ప్రీత్ బ్రార్(10) పరుగులతో అన్నారు. పంజాబ్ విజయానికి 24 బంతుల్లో 28 పరుగులు కావాలి. 15 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 141/7 15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. క్రీజులో ఆశుతోష్ శర్మ(47), హర్‌ప్రీత్ బ్రార్(10) పరుగులతో అన్నారు. పంజాబ్ ఏడో వికెట్ డౌన్.. శశాంక్ ఔట్ శశాంక్ సింగ్ రూపంలో పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన శశాంక్ సింగ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 120/7. క్రీజులో అశుతోష్ శర్మ(36) పరుగులతో ఉన్నాడు. పంజాబ్ ఆరో వికెట్ డౌన్.. జితేష్ ఔట్ 77 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జితేష్ శర్మ.. ఆకాష్ మధ్వాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 87/6. క్రీజులో శశాంక్ సింగ్(37), అశుతోష్ శర్మ(9) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 60/5 8 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. క్రీజులో జితేష్ శర్మ(7), శశాంక్ సింగ్(21) పరుగులతో ఉన్నారు. 14 పరుగులకే 4 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్ 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బుమ్రా,కోయిట్జీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. పంజాబ్ బ్యాటర్లు ప్రబ్ సిమ్రాన్(0), రోసో(1), సామ్ కుర్రాన్(6), లివింగ్ స్టోన్(1) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. పంజాబ్ రెండో వికెట్ డౌన్.. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రోసో క్లీన్ .. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. తొలి వికెట్ డౌన్.. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. కోయిట్జీ బౌలింగ్‌లో ఫ్రబ్ సిమ్రాన్ సింగ్ పెవిలియన్‌కు చేరాడు. తొలి ఓవర్ ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. సూర్యకుమార్ విధ్వంసం.. పంజాబ్ టార్గెట్ 193 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(36), తిలక్ వర్మ(34) పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కుర్రాన్ రెండు, రబాడ ఓ వికెట్ సాధించారు. ముంబై నాలుగో వికెట్ డౌన్.. హార్దిక్ పాండ్యా ఔట్ 167 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు ముంబై స్కోర్: 167/4 ముంబై మూడో వికెట్ డౌన్.. సూర్యకుమార్ ఔట్ 148 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 78 పరుగులు చేసిన సూర్య.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు 15 ఓవర్లకు ముంబై స్కోర్: 130/2 15 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(67), తిలక్ వర్మ(17) పరుగులతో ఉన్నారు. ముంబై రెండో వికెట్ డౌన్.. రోహిత్ శర్మ ఔట్ రోహిత్ శర్మ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్(59), తిలక్ వర్మ(5) పరుగులతో ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ ఫిప్టీ.. సూర్యకుమార్ యాదవ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 34 బంతుల్లో సూర్య తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్(51), రోహిత్ శర్మ(36) పరుగులతో ఉన్నారు 10 ఓవర్లకు ముంబై స్కోర్: 86/1 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్(49), రోహిత్ శర్మ(29) పరుగులతో ఉన్నారు 7 ఓవర్లకు ముంబై స్కోర్:58/1 7 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్(24), రోహిత్ శర్మ(26) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్య కుమార్ యాదవ్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(10), సూర్యకుమార్ యాదవ్(9) పరుగులతో ఉన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో సామ్ కుర్రాన్ సారథ్యం వహిస్తున్నాడు. తుది జట్లు: ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ , జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిలీ రుసో, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, అశుతోష్ శర్మ -
అతడే మా ఓటమిని శాసించాడు.. అస్సలు ఊహించలేదు: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవిచూసింది. తమ సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో తేలిపోయిన ముంబై.. అనంతరం బ్యాటింగ్‌లోనూ రోహిత్ శర్మ మినహా(103నాటౌట్) మిగితా బ్యాటర్లంతా బ్యాట్లత్తేశారు. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో పతిరాన అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఓటమిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "హోం గ్రౌండ్లో ఓడిపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. 207 టార్గెట్ అనేది కచ్చితంగా చేధించగల్గే లక్ష్యమే. కానీ చెన్నై బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పతిరనా తన బౌలింగ్‌తో మా ఓటమిని శాసించాడు. సీఎస్కే వారు ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. వికెట్ల వెనక ధోని ఉన్నాడు. తన విలువైన సూచనలు ఎప్పటికప్పుడు తన జట్టుకే ఇస్తూనే ఉన్నాడు. ధోని లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉంటే 100 శాతం కలిసిస్తోంది. పిచ్ బ్యాటింగ్‌కు కొంచెం కష్టంగా ఉంది. కానీ ఈ వికెట్‌పై మేము పాజిటివ్ బ్యాటింగ్ చేయాలకున్నాం. అందుకే తగ్గట్టు గానే మా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాం. కానీ పతిరాన బౌలింగ్ ఎటాక్‌లోకి వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అక్కడే మా రిథమ్‌ను మేము కోల్పోయాం. ఇది మేము అస్సలు ఊహించలేదు. ఇక దూబే స్పిన్నర్ల కంటే సీమర్లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడతున్నందన నేను బౌలింగ్ చేయాల్సి వచ్చింది. మా రాబోయే మ్యాచ్‌లపై దృష్టిసారించి.. భారీ విజయాలను నమోదు చేసేందుకు ప్రయత్నిస్తామని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. -
CSK Vs MI: ధోని హ్యాట్రిక్ సిక్స్‌లు.. దద్దరిల్లిన స్టేడియం! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ ఎంస్ ధోని మరోసారి ఫినిషర్ అవతరమెత్తాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని వరుసగా హ్యాట్రిక్ సిక్స్‌లు బాది ఔరా అనిపించాడు. తన ఎదుర్కొన్న తొలి బంతిని లాంగాఫ్ మీదగా భారీ సిక్సర్ బాదిన మిస్టర్ కూల్, ఆ తర్వాత బంతులను లాంగాన్, డీప్ స్వ్కెర్ లెగ్ దిశగా సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 4 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తలైవా.. మూడు సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధోని సిక్స్‌లు కొట్టగానే స్టేడియం అభిమానుల అరుపులతో దద్దరిల్లోపోయింది. ధోని బ్యాటింగ్ చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఫినిషర్ అంటూ ధోనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(66 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(69) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. . ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
టీ20 వరల్డ్‌కప్ జట్టులో హార్దిక్‌కు నో ఛాన్స్.. అతడికే అవకాశం?
ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన వెంటనే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జాన్ 1 నుంచి టీ20 వరల్డ్‌కప్-2024 షురూ కానుంది. ఈ ఏడాది పొట్టిప్రపంచకప్నకు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారత టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఎవరుండాలన్న అన్న విషయంపై మాజీలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేరాడు. వరల్డ్‌కప్ జట్టులో హార్దిక్ పాండ్యాకు కాకుండా ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు ఛాన్స్ ఇవ్వాలని తివారీ సూచించాడు. "హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్‌గా భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ చేయాలి. గత మూడు మ్యాచ్‌ల నుంచి హార్దిక్ బౌలింగ్ చేయడం లేదు. అంతకముందు బౌలింగ్ చేసినా దాదాపు 11 పైగా ఏకనామీతో పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమనే చెప్పుకోవాలి. అగార్కర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా ఉన్నాడు కాబట్టి కచ్చితంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. శివమ్ దూబే కచ్చితంగా సెలక్టర్ల దృష్టిలో ఉంటాడని నేను భావిస్తున్నాను. ఒక వేళ టీ20 ప్రపంచకప్ జట్టులో దూబేకు చోటు దక్కకపోతే అందుకు బాధ్యత సీఎస్కే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై అతడికి బౌలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వడం లేదు. హార్దిక్‌కు ప్రత్నామ్యాయంగా దూబేను సెలక్టర్లు ఎంపిక చేస్తారని నేను ఆశిస్తున్నానని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో శివమ్ దూబే దుమ్ములేపుతున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లలో బ్యాటింగ్‌కు వచ్చి సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
ఇషాన్ కిషన్‌తో కలిసి హార్దిక్ పాండ్యా పూజలు (ఫొటోలు)
-
RCB Vs MI: అది కదా కింగ్ కోహ్లి అంటే.. హార్దిక్‌ను హేళన చేయద్దంటూ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన మంచి మనసును చాటుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కోహ్లి సపోర్ట్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ ఔట్ కాగానే హార్దిక్ క్రీజులోకి వచ్చినప్పడు అభిమానులు స్టాండ్స్ నుంచి గట్టిగా అరుస్తూ బూయింగ్(హేళన) చేశారు. వెంటనే కోహ్లి ప్రేక్షుకుల వైపు చూస్తూ హేళన చేయవద్దని కోరాడు. దయచేసి ఆపండి అన్నట్లు కోహ్లి సైగలు చేశాడు. స్టాండ్స్ వైపు కింగ్ కోహ్లి చూస్తూ ఏంటి ఇది అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. వెంటనే అభిమానులు హార్దిక్ హార్దిర్ అంటూ చీర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి హార్దిక్‌కు అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురువుతూనే ఉంది. అంతకు తొడు తొలి మూడు మ్యాచ్‌ల్లో ముంబై ఓడిపోవడంతో ఆ వ్యతిరేకత మరింత తీవ్రమైంది. హార్దిక్ మైదానంలో కన్పించడం చాలు అతడిని అభిమానులు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అయితే ముంబై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలవడంతో ముంబై ఫ్యాన్స్ కాస్త శాంతించే ఛాన్స్ ఉంది. ఇకనైన హార్దిక్‌ను ముంబై ఫ్యాన్స్ ఇష్టపడతారా లేదా మళ్లీ ట్రోలు చేస్తారా? అన్నది వేచి చూడాలి. Only a heartless man can hate Virat Kohli pic.twitter.com/H09lRy4XIc — ` (@chixxsays) April 11, 2024 -
MI Vs DC: మేము చాలా కష్టపడ్డాము.. మా విజయానికి కారణం అతడే: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(49) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టిమ్ డేవిడ్(45), ఇషాన్ కిషన్(42), హార్దిక్ పాండ్యా(39), రొమారియో షెపర్డ్(38) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఢిల్లీ కూడా పోరాడింది. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(25 బంతుల్లో 71, 7 సిక్స్‌లు, 3 ఫోర్లు) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు పృథ్వీషా(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక ఈ ఏడాది సీజన్లో తొలి విజయంపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. మొదటి విజయం కోసం చాలా కష్టపడ్డామని హార్దిక్ తెలిపాడు. "ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి మేము చాలా కష్టపడ్డాము. తొలి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనప్పటికి మేము ఎటువంటి దిగులు చెందలేదు. ఎందుకంటే ఒక జట్టుగా మాపై మాకు నమ్మకం ఉంది. ఈ మ్యాచ్‌లో మేము పాజిటివ్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగాం. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాం. ఈ మ్యాచ్‌తో పాటు ప్రతీ మ్యాచ్‌లోనూ కొన్ని వ్యూహాత్మక మార్పులు చేశాం. అయితే మా 12 ప్లేయర్ కాంబినేషన్ సెట్ అవ్వడం చాలా ముఖ్యం. మా డ్రెసింగ్ రూమ్ వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒక్క విజయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశాం. అది మాకు ఈ రోజు వచ్చింది. ఇక మ్యాచ్‌లో ఓపెనర్లు మాకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్లో ప్లేలో 70 పరుగులు పైగా సాధించడం అంత సులభం కాదు. ప్రతీ ఒక్కరు ఈ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రొమారియో తన పవర్ చూపించాడు. అతడి ఆడిన ఇన్నింగ్స్ కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. అతడే మాకు విజయాన్ని అందించాడు. రోమారియో ఆడిన ఇన్నింగ్సే మా విజయానికి, ఢిల్లీ ఓటమి ప్రధాన కారణం. ఇక ఈ మ్యాచ్‌లో నేను బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. కచ్చితంగా జట్టుకు అవసరమైనప్పుడు నేను బౌలింగ్ చేస్తా" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. -
హార్దిక్‌ది తప్పు కాదు.. దయ చేసి హేళన చేయవద్దు: గంగూలీ
ఐపీఎల్-2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లకు చాలా కీలకం. ఢిల్లీ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించగా.. ముంబై అయితే ఇంకా బోణే కొట్టలేదు. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి గాడిలో పడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ నూతన సారథి హార్దిక్ పాండ్యాకు గంగూలీ మద్దతుగా నిలిచాడు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను ఎవరూ హేళన చేయవద్దని అభిమానులను దాదా కోరాడు. కాగా రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఎంపికైనప్పటి నుంచి అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలో సైతం హార్దిక్‌కు ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. హార్దిక్ ఎక్కడ కన్పించిన రోహిత్ రోహిత్ అంటూ అభిమానులు బోయింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో హార్దిక్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోవడం కూడా అతడి కష్టాలను రెట్టింపు చేసింది. వెంటనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. "దయచేసి అభిమానులు హార్దిక్ పాండ్యాను బూయింగ్(హేళన) చేయవద్దు. అది కరెక్ట్ కాదు. ముంబై ఫ్రాంచైజీ హార్దిక్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది. అటువంటిప్పుడు అతడేం తప్పు చేశాడు. ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయానికి హార్దిక్‌ను తప్పుబట్టడం సరికాదు. క్రీడల్లో కెప్టెన్సీ మార్పు సహజం. భారత జట్టుకైనా కావచ్చు ఫ్రాంచైజీలకైనా ఏ ఆటగాడు తన ఇష్టానుసారం కెప్టెన్ కాలేడు. అది మెనెజ్‌మెంట్ నిర్ణయం. రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ఆటగాడు. అతని పెర్ఫార్మెన్స్ వేరే స్ధాయిలో ఉంటుంది.కెప్టెన్‌గా ఒక ఆటగాడిగా రోహిత్ ఒక అద్బుతమని" ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంగూలీ పేర్కొన్నాడు. -
సోమనాథ్ ఆలయంలో పూజలు చేసిన హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తొలి విజయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే వరుస మూడు ఓటముల చవిచూసిన ముంబై ఇండియన్స్.. తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ముందు ముంబై జట్టుకు ఆరు రోజుల విరామం లభించింది. దీంతో ముంబై జట్టు మొత్తం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు టూర్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లిన ముంబై జట్టు ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించాడు. ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు చేశాడు. శివలింగానికి పాండ్యా పాలాభిషేకం నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఏ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ముంబై ఇండియన్స్ నూతన సారధిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. #WATCH | Gujarat: Indian Cricket Team all-rounder Hardik Pandya offers prayers at Somnath Temple. Source: Somnath Temple Trust pic.twitter.com/F8n05Q1LSA — ANI (@ANI) April 5, 2024 -
కెప్టెన్సీ లేదు.. చెలరేగిపోతాడు! అతడిదే ఆరెంజ్ క్యాప్: శ్రీశాంత్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ముంబై ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ముంబై కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. రోహిత్ శర్మను తప్పించి మరి జట్టు తనకు పగ్గాలను అప్పగించిన ముంబై యాజమన్యం నమ్మకాన్ని హార్దిక్ నిలబెట్టుకోలేకపోయాడు. ఎంఐ కెప్టెన్‌గా ఎంపికైనప్పటి నుంచి హార్దిక్‌కు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆఖరికి ముంబై హోం గ్రౌండ్ వాంఖడేలో కూడా హార్దిక్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాడు. అతడిని తప్పించి ముంబై జట్టు పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ స్వేచ్ఛగా ఆడటానికి ఇష్టపడతాడని శ్రీశాంత్ తెలిపాడు. "సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని నాయకత్వంలో ఆడటం మనం చూశాం. మేము అందరం కలిసి వన్డే వరల్డ్‌కప్‌ను కూడా గెలిచాము. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కింద రోహిత్ ఆడటానికి ఇష్టపడటం లేదని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ ఆ వాస్తవం. రోహిత్ హార్దిక్ కెప్టెన్సీలో ఆడటానికి కచ్చితంగా ఇష్టపడతాడు. నా వరకు అయితే రోహిత్ ఎలాంటి కెప్టెన్సీ భారం లేదు కాబట్టి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ సీజన్లో రోహిత్ మంచి రిథమ్‌లో కన్పిస్తున్నాడు. రోహిత్‌కు ఐదు సార్లు ముంబైని విజేతగా నిలిపాడు. అయితే ఇప్పుడు జట్టును రోహిత్ వెనుకుండి నడిపిస్తాడని నేను అనుకుంటున్నానని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. ముంబై ఇండియన్స్‌కు గుడ్ బై!?
ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది. కాగా గుజరాత్ టైటాన్స్‌ను ఓసారి ఛాంపియన్‌గా, మరోసారి రన్నరప్ నిలిపిన హార్దిక్ పాండ్యా.. ముంబైని మాత్రం విజయ పథంలో నడిపించలేకపోతున్నాడు. రోహిత్ శర్మ స్ధానంలో ముంబై ఇండియన్స్ నూతన సారధిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్.. తన కెప్టెన్సీ మార్క్ చూపించడంలో విఫలమవుతున్నాడు. హార్దిక్ కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరుస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పట్ల ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఆసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాండ్యాతో రోహిత్‌కు విభేదాలు ఏర్పడినట్లు సమాచారం. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీరుపై కూడా హిట్‌మ్యాన్ గుర్రుగా ఉన్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీని వీడనున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. న్యూస్24 స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం .. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఐపీఎల్-2025 మెగా వేలంలో పాల్గోవాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు గ్రూపులు వున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కొంత మంది రోహిత్ సపోర్ట్‌కు ఉంటే మరి కొంత మంది హార్దిక్‌కు మద్దుతు పలుకుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. -
రాజస్తాన్ చేతిలో ఓటమి.. ఒంటరిగా వెళ్లి కూర్చున్న హార్దిక్! ఫోటోలు వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ అతడి సారథ్యంలో వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. సోమవారం(ఏప్రిల్ 1)న రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. అయితే రాజస్తాన్‌తో ఓటమి అనంతరం హార్దిక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ పూర్తియ్యాక సహాచర ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తే.. పాండ్యా మాత్రం డౌగట్‌లో ఒంటరిగా కూర్చోని ఉండిపోయాడు. పాండ్యా ఏదో కోల్పోయినట్లు ముఖంం పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా హార్దిక్ కెప్టెన్సీ పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి తిరిగి రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
IPL 2024: ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్.. ? రియాక్ట్ అయిన సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌ను ఓసారి ఛాంపియన్, మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్.. ఈసారి మాత్రం తన కెప్టెన్సీ మార్క్ చూపించలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవాలని పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. మళ్లీ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా చేరాడు. ఈ మెగా ఈవెంట్లో తమ తదుపరి మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్సీ నుంచి వైదొలగతాడని తివారీ జోస్యం చెప్పాడు. అంతేకాకుండా రోహిత్ శర్మనే తిరిగి మళ్లీ ముంబై సారథ్య బాధ్యతలు చేపడతాడని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ విరామంలోనే ముంబై కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని తివారీ చెప్పుకొచ్చాడు. "హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తీవ్రమైన ఒత్తడిలో ఉన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో బౌలర్లను హార్దిక్ సరిగ్గా ఉపయోగించలేకపోయాడు. ఆరంభంలో బౌలర్లు విఫలమవుతున్నప్పటికి మళ్లీ వారినే ఎటాక్‌లో తీసుకువచ్చి హార్దిక్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ముంబై ఇండియన్స్‌లో అద్బుతమైన బౌలర్లు ఉన్నారు. సరిగ్గా రోటాట్ చేయడంలో పాండ్యా విఫలమయ్యాడు. స్వింగ్ అవుతున్న పిచ్‌లపై బుమ్రాను కాదని తొలుత తను బౌలింగ్ చేయడం కూడా హార్దిక్ తప్పిదమే అని చెప్పుకోవాలి. హార్దిక్ కూడా బంతిని స్వింగ్ చేయగలడు. కానీ ముంబై తరపున ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో హార్దిక్ బౌలర్‌గా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనుంది. ఈ విరామంలో ముంబై ఫ్రాంచైజీ నుంచి ఓ బిగ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించేస్తాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా చాలా ఫ్రాంచైజీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు ముంబై కెప్టెన్సీ విషయంలో కూడా అదే జరిగే అవకాశముందని" క్రిక్‌బజ్ షోలో తివారీ పేర్కొన్నాడు. ఇదే షోలో పాల్గోన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. మనోజ్ తివారీ కామెంట్స్‌పై స్పందించాడు. "హార్దిక్ కెప్టెన్సీపై మనోజ్ కాస్త తొందపడి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కూడా జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఆ ఏడాది సీజన్లో వారు ఛాంపియన్లుగా నిలిచారు. కాబట్టి మనం కాస్త ఓపిక పట్టాలి. మనం మరో రెండు మ్యాచ్‌ల కోసం వేచి ఉండాలి. ఆ తర్వాతే మన అభిప్రాయాలను వెల్లడిస్తే బాగుంటుందని సెహ్వాగ్ రిప్లే ఇచ్చాడు. -
నేను అనుకున్నది జరగలేదు.. కానీ వారు మాత్రం అద్బుతం: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కథ ఏ మాత్రం మారలేదు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబై వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తమ సొంత గ్రౌండ్ వాంఖడేలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. బ్యాటింగ్ పరంగా ముంబై దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రాజస్తాన్ బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్తాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, స్పిన్నర్ చాహల్ చెరో మూడు వికెట్లలో ముంబైని దెబ్బతీయగా.. బర్గర్ రెండు, అవేష్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(54 నాటౌట్) మరోసారి అదరగొట్టాడు. ఇక వరుసగా మూడో ఓటమిపై ఈ మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్‌లో తాము అనుకున్నవిధంగా రాణించలేకపోయామని పాండ్యా తెలిపాడు. "ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా బాధగా ఉంది. తొలుత మాకు మంచి ఆరంభం లభించలేదు. కానీ నేను బ్యాటింగ్ వచ్చాక ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడి చేయాలనుకున్నాను. నేను తిలక్ క్రీజులో ఉన్నప్పుడు మా స్కోర్ 150 నుంచి 160 పరుగులకు చేరుతుందని భావించాను. కానీ నేను ఔటయ్యాక రాజస్తాన్ తిరిగి మళ్లీ గేమ్‌లోకి వచ్చింది. నేను మరో కొన్ని ఓవర్ల పాటు క్రీజులో ఉండాల్సింది. ఇక ఈ రోజు వాంఖడే వికెట్ మేము ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది. ఓ ఓటమి ఇది నేను సాకుగా చెప్పాలనకోవడం లేదు. ఎందుకంటే ఒక బ్యాటర్‌గా ఎటువంటి వికెట్‌పైనైనా ఆడటానికి సిద్దంగా ఉండాలి. ఏదమైనప్పటికి ప్రత్యర్ధి బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. మేము అనుకున్న విధంగా ఫలితాలు రావడం లేదు. కానీ ఒక టీమ్‌గా మాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇటువంటి సమయంలోనే ఎక్కువ ధైర్యంలో ముందుకు వెళ్లాలి. తర్వాతి మ్యాచ్‌ల్లో మేము తిరిగి కమ్‌బ్యాక్ ఇస్తామని" హార్దిక్ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో తెలిపాడు. -
ఇదేం చెత్త కెప్టెన్సీ బాబు.. రోహిత్‌కు ఇచ్చేయ్!లేదంటేనా?
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో ఓటమి చవి చూసింది. వాంఖడే వేదికగా రాస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా ముంబై దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ రాజస్తాన్ బౌలర్ల దాటికి గజగజలాడింది. రాజస్తాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, స్పిన్నర్ చాహల్ చెరో మూడు వికెట్లలో ముంబైని దెబ్బతీయగా.. బర్గర్ రెండు, అవేష్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ 32 పరుగులతో పర్వాలేదన్పించాడు. అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(54 నాటౌట్) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ముంబై ఓటమి పాలవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను నెటిజన్లు మరోసారి దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక చాలు హార్దిక్ వెంటనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ముంబై సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఘెర ఓటములను చవిచూసింది. కెప్టెన్‌గా తన వ్యూహాలను అమలు చేయడంలో హార్దిక్ విఫలమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించి మళ్లీ రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేదంటే ఈ ఏడాది సీజన్లో ముంబై ఒక్క మ్యాచ్‌లోనూ గెలవదంటూ పలువరు అభిప్రాయపడుతున్నారు. Caption this 😌#hardikpandya #MIvRR #RohitSharma #IPL2024 pic.twitter.com/VehA7QAgFx — Tanay (@tanay_chawda1) April 1, 2024 Aankh hai bhari bhari aur tum bakloli kar ke mja le rhe ho 😭😂 don't know if Mumbai Indians win any match this season. But fans are finding ways to entertain themselves.#MIvRR #MIvsRR #MumbaiIndians #RohitSharma #HardikPandyapic.twitter.com/nQL2c4LiHO — RanaJi🏹 (@RanaTells) April 1, 2024 -
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా
ముంబై ఇండియన్స్ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన మొదటి జట్టుగా ముంబై రికార్డులకెక్కింది. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఈ అరుదైన ఫీట్ సాధించింది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబై తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్ధానంలో ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు 244 మ్యాచ్‌లు ఆడింది. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్లు ఇవే.. ముంబై ఇండియన్స్ -250 మ్యాచ్‌లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 244 మ్యాచ్‌లు ఢిల్లీ క్యాపిటల్స్- 241 మ్యాచ్‌లు కోల్‌కతా నైట్ రైడర్స్- 239 మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్- 235 మ్యాచ్‌లు చెన్నై సూపర్ కింగ్స్- 228 మ్యాచ్‌లు -
IPL 2024: ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన రాజస్తాన్..
IPL 2024 MI vs RR Live updates: ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన రాజస్తాన్.. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో ఓటమి చవి చూసింది. వాంఖడే వేదికగా రాస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, చాహల్ తలా 3 వికెట్లు పడగొట్టగా.. బర్గర్ రెండు, అవేష్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(54 నాటౌట్) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో వికెట్ డౌన్.. అశ్విన్ ఔట్ అశ్విన్ రూపంలో రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్ : 101/4 12 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్ : 87/3 12 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసిది. క్రీజులో పరాగ్(23), అశ్విన్(16) పరుగులతో ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 48 బంతుల్లో 39 పరుగులు కావాలి. మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. బట్లర్ ఔట్ 48 పరుగుల వద్ద రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన బట్లర్.. మధ్వాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్ : 50/3 రెండో వికెట్ డౌన్.. సంజూ శాంసన్ ఔట్ 42 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన కెప్టెన్ సంజూ శాంసన్.. ఆకాష్ మధ్వాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు రాజస్తాన్ స్కోర్ : 44/1 4 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్ : 41/1 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(12), జోస్ బట్లర్(10) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. మఫాక బౌలింగ్‌లో ఔటయ్యాడు. చెలరేగిన బౌల్ట్, చాహల్.. రాజస్తాన్ టార్గెట్ 126 పరుగులు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. రాజస్తాన్ బౌలర్ల దాటికి ముంబై కేవలం 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, చాహల్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బర్గర్ రెండు, అవేష్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొమ్మిదో వికెట్ డౌన్.. టిమ్ డేవిడ్ ఔట్ టిమ్ డేవిడ్ రూపంలో ముంబై తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన డేవిడ్.. బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు ముంబై స్కోర్: 115/9 15 ఓవర్లకు ముంబై స్కోర్: 102/7 15 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజులో టిమ్ డేవిడ్(10), కోయిట్జీ(3) పరుగులతో ఉన్నారు. ఆరో వికెట్ డౌన్.. చావ్లా ఔట్ 83 పరుగుల వద్ద ముంబై ఆరో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన పీయూష్ చావ్లా.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో తిలక్ వర్మ(32), టిమ్ డేవిడ్(6) పరుగులతో ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. హార్దిక్ ఔట్ 76 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. చాహాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పీయూష్ చావ్లా వచ్చాడు. 6 ఓవర్లకు ముంబై స్కోర్: 46/4 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(16), తిలక్ వర్మ(12) ఉన్నారు. నిప్పులు చేరుగుతున్న బౌల్ట్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ట్రెంట్ బౌల్ట్ చుక్కలు చూపిస్తున్నాడు. బౌల్ట్ దెబ్బకు ముంబై వరుస క్రమంలో 3 వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ట్రెంట్ బౌల్ట్ చుక్కలు చూపిస్తున్నాడు. బౌల్ట్ దెబ్బకు ముంబై వరుస క్రమంలో 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, నమాన్ ధార్, బ్రెవిస్ ఖాతా తెరవకుండానే పెవిలయన్‌కు చేరారు. ముంబై 3 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. రాజస్తాన్ మాత్రం ఒకే ఒక మార్పు చేసింది. సందీప్ శర్మ స్దానంలో నండ్రీ బర్గర్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ -
హార్దిక్ పై వేటు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!?
ఐపీఎల్-2024 సీజన్‌ను ముంబై ఇండియన్స్ పేలవంగా ఆరంభించింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో అయితే ముంబై దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఏకంగా 277 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. ముంబై ఓటములకు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. రోహిత్ శర్మ నుంచి ముంబై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ చూపించడంలో విఫలమవుతున్నాడు. పాండ్యా కెప్టెన్స్ పరంగానే కాకుండా ఆటగాడిగా కూడా తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. చాలా మంది మాజీలు సైతం హార్దిక్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాండ్యాను వెంటనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ముంబై కెప్టెన్సీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హార్దిక్ పాండ్యా పట్ల ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని తమ జట్టు పగ్గాల నుంచి తప్పించే ఆలోచనలో ముంబై ఫ్రాంచైజీ ఉన్నట్టు వినికిడి. అతడి స్ధానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తమ జట్టు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు వినిస్తున్నాయి. మరి రాబోయే మ్యాచ్‌ల్లో ఏమి జరుగుతుందో వేచి చూడాలి. -
'వెంటనే ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్‌ను తీసేయండి'.. క్లారిటీ ఇచ్చిన ఆకాష్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఏకంగా 277 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తన వ్యూహాలను అమల చేయడంలో విఫలమయ్యాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో పాండ్యా చేతులేత్తేశాడు. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సద్వినియోగం చేసుకోవడంలో హార్దిక్ ఇబ్బంది పడుతున్నాడు. తొలి 10 ఓవర్లలో బుమ్రాతో హార్దిక్ కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశాడు. నాలుగో ఓవర్ వేసిన బుమ్రా.. మళ్లీ 13 ఓవర్లో ఎటాక్‌లోకి వచ్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిషేక్, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సైతం హార్దిక్ పాండ్యాపై సీరియస్ అయినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. "ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇటువంటి చెత్త కెప్టెన్సీని నేను చూడలేదు. హార్దిక్ పాండ్యా తన సారథ్యాన్ని వదిలేయాలి. లేకపోతే ముంబై ఫ్రాంచైజీ అయినా అతడి తొలగించాలి’ అంటూ జియో సినిమా షోలో చోప్రా పేర్కొన్నట్లు ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. తాజాగా ఇదే విషయంపై చోప్రా క్లారిటీ ఇచ్చాడు. తను అటువంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, అవన్నీ రూమర్సే అని చోప్రా చెప్పుకొచ్చాడు. "అసలు ఏమి జరుగుతుందో నాకు అర్దం కావడం లేదు. మీకేం అయింది? అబద్ధాలను ప్రచారం చేయొద్దు బ్రదర్. మీ స్టేట్మెంట్ తప్పు. అలాగే నా పేరును ప్రస్తావించారు. కానీ, నా పేరులోనూ అక్షర దోషాలు ఉన్నాయి" అంటూ ఓ యూజర్ ట్వీట్‌కు చోప్రా రిప్లే ఇచ్చాడు. -
ఏంటి హార్దిక్ ఇది.. అంపైర్‌ను కూడా వదలవా! వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి భారత క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాడు. ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా.. తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తన సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఓటమి పాలవ్వగా.. తాజాగా సన్‌రైజర్స్ జరిగిన మ్యాచ్‌లోనూ ఘోర పరాభవం ఎదురైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ కెప్టెన్సీ పరంగానే కాకుండా.. వ్యక్తిగత ప్రదర్శన పరంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. అతడి చెత్త కెప్టెన్సీ వల్లే ముంబై ఓటమి పాలైందని మాజీ క్రికెటర్లు సైతం మండిపడుతున్నారు. అంపైర్‌పై సీరియస్.. కాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ తన సహనాన్ని కోల్పోయాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ సందర్భంగా హార్దిక్.. అంపైర్‌పై కోపంతో ఊగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మొదటి ఓవర్ నుంచే వీరిద్దరి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో వారిద్దరి దూకుడును కట్టడి చేయడానికి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. పేసర్ గెరాల్డ్ కోయెట్జీని ఎటాక్‌లోకి తీసువచ్చాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన కోయెట్జీ.. తొలి బంతినే అభిషేక్ శర్మకు హై ఫుల్ టాస్‌గా సంధించాడు. ఇది చూసిన లెగ్ అంపైర్ హైట్ నోబాల్‌గా ప్రకటించాడు. లెగ్ అంపైర్ నిర్ణయం పట్ల హార్దిక్ పాండ్యా ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అంపైర్‌తో హార్దిక్ వాగ్వాదానికి దిగాడు. అంపైర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి పాండ్యా మాత్రం వినిపించుకోలేదు. తన రివ్యూకు వెళతానని హార్దిక్ పట్టుబట్టాడు. అంపైర్లు చేసేదిమి లేక అతడి కోరిక ప్రకారం డీఆర్ఎస్కు వెళ్లారు. థర్డ్ అంపైర్ సైతం నో బాల్‌గానే ప్రకటించింది. దీంతో హార్దిక్‌కు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరి కొత్త చరిత్ర.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (62; 24 బంతుల్లో) మొదలుపెట్టిన విధ్వంసాన్ని అభిషేక్ శర్మ (63; 23 బంతుల్లో) కొనసాగించాడు. మార్క్రమ్ (42 నాటౌట్; 28 బంతుల్లో)తో కలిసి క్లాసెన్ (80 నాటౌట్; 34 బంతుల్లో) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డులకెక్కింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ (64; 34 బంతుల్లో), టిమ్ డేవిడ్ (42 నాటౌట్; 22 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34; 13 బంతుల్లో) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 523 పరుగులు నమోదు చేశాయి. pic.twitter.com/jWWtlqhagQ — Sitaraman (@Sitaraman112971) March 27, 2024 -
కన్నీరు పెట్టుకున్న హార్దిక్.. ఏమైందంటే? వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూశాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అనూహ్యంగా ముంబై ఓటమి పాలైంది. ఆఖరి ఓవర్లో ముంబై ఇండియన్స్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. గుజరాత్ కెప్టెన్ గిల్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు అప్పగించాడు. మరోవైపు క్రీజులో హార్దిక్ పాండ్యా ఉండడంతో ముంబై డగౌట్లో ఇంకా తాము గెలుస్తామన్న థీమా కన్పించింది. అందుకు తగ్గట్టే హార్దిక్ తొలి రెండు బంతులను వరుసగా సిక్స్, ఫోర్‌గా మలిచాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం ముంబై ఇండియన్స్ వైపు మలుపు తిరిగింది. కానీ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన ఉమేశ్.. సూపర్ డెలివరీతో హార్దిక్‌ను బోల్తా కొట్టించాడు. మూడో బంతిని స్లో బౌన్సర్‌గా యాదవ్ సంధించాడు. ఈ క్రమంలో హార్దిక్ మరో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా రాహుల్ తెవాటియా చేతికి వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా హార్దిక్ షాక్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో డౌగౌట్‌కు నడిచివెళ్తుండగా హార్దిక్ భావద్వోగానికి లోనయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను హార్దిక్ ఆపున్కుంటూ డగౌట్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ను రోహిత్ శర్మ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. టాస్ సమయంలో హార్దిక్ మైదానంలో రాగానే రోహిత్ రోహిత్ అంటూ బోయింగ్ చేశారు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఫీల్డింగ్ పోజిషన్‌ను హార్దిక్ పాండ్యా పదేపదే మారుస్తూ అభిమానుల అగ్రహానికి గురయ్యాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ పరంగా దారుణంగా విఫలయయ్యాడు. ఈ క్రమంలో పాండ్యాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఆటే అనుకున్నాము.. సీనియర్లకు గౌరవం కూడా ఇవ్వడం రాదా అంటూ తెగ పోస్టులు చేస్తున్నారు. ఇక ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తమ జట్టు పగ్గాలను రోహిత్ శర్మ నుంచి హార్దిక్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి హార్దిక్‌ను తమ జట్టు కెప్టెన్‌గా ముంబై నియమించింది. అప్పటి నుంచి ముంబై ఫ్రాంచైజీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఐదు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ పట్ల ముంబై వ్యవహరించిన తీరును అభిమానులు ఇప్పటికి తప్పుబడుతున్నాడు. ఇప్పటిలో ఈ కెప్టెన్సీ వివాదం సద్దుమణిగేలా కన్పించడం లేదు. pic.twitter.com/AIwDmPH9yO — True Fan (@indiafanofrohit) March 25, 2024 -
MI Vs GT: అదే మా కొంపముంచింది.. తిలక్ ఆలోచన సరైనదే: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ -2024 సీజన్‌ను ముంబై ఇండియన్స్‌తో ఓటమితో ఆరంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై పరాజయం చవిచూసింది. ఆఖరి 6 ఓవర్లలో ముంబై విజయానికి 48 పరుగులు అవసరమవ్వగా.. వరుసక్రమంలో వికెట్లు కోల్పోయి ఓటమి కొనితెచ్చుకుంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో బ్రెవిస్(46), రోహిత్ శర్మ(43) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఆఖరి ఓవర్లలో వరుసగా వికెట్ల కోల్పోవడంతో ఓటమి పాలైమని హార్దిక్ తెలిపాడు. "ఆఖరి వరకు మేము గేమ్‌లోనే ఉన్నాం. చివరి 5 ఓవర్లలో మా విజయానికి 42 పరుగులు అవసరమయ్యాయి. మా చేతిలో 6 వికెట్ల ఉండడంతో ఈజీగా గెలుస్తామని భావించాము. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అదే మా కొంపముంచింది. చివరి ఐదు ఓవర్లలో ముంబై ఇంత తక్కువ స్కోర్ ఛేదించకపోయిన మ్యాచ్‌ల్లో కచ్చితంగా ఇదొకటి. అహ్మదాబాద్‌లో మళ్లి తిరిగి వచ్చి ఆడినందుకు సంతోషంగా ఉంది. అహ్మదాబాద్ స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజు మొత్తం అభిమానులతో నిండిపోయింది. గుజరాత్ కూడా అద్భుతంగా ఆడింది. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తిలక్ వర్మ సింగిల్‌ను తిరష్కరించడం సరైన నిర్ణయమే. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ స్ట్రైక్‌లో ఉంటే బెటర్ అని తిలక్ భావించాడు. నేను కూడా అతడికి ఫుల్ సపోర్ట్‌గా నిలిచాను. ఇంకా మాకు 13 మ్యాచ్‌లు ఉన్నాయి. తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా మేము తిరిగి కమ్‌బ్యాక్ ఇస్తామని" హార్దిక్ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు. కాగా హార్దిక్ ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమిని ఎదుర్కోవడం గమనార్హం. -
MI Vs GT: ఏంటి హార్దిక్ ఇది.. రోహిత్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా? వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై సారధిగా హార్దిక్ పాండ్యా బరిలోకి దిగాడు. హార్దిక్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఘోర అవమానం ఎదురైంది. టాస్ సందర్భంగా హార్దిక్ మైదానంలో వచ్చినప్పుడు అభిమానులు రోహిత్ రోహిత్ అంటూ ఎగతాళి చేశారు. కాగా ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను జట్టు కెప్టెన్గాముంబై ఇండియన్స్ నియమించిన సంగతి తెలిసిందే. హార్దిక్‌ను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పగ్గాలను ముంబై అప్పగించింది. ముంబై తీసుకున్న ఈ నిర్ణయాన్ని హిట్‌మ్యాన్ అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో హార్దిక్ ఆటలు ఆడుకున్నాడు. పదేపదే రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్‌ను హార్దిక్ మారుస్తూ అభిమానుల అగ్రహానికి గురయ్యాడు. సాధరణంగా 30 యార్డ్ సర్కిల్లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ కన్పించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన గెరాల్డ్ కోయెట్జీ బౌలింగ్‌లో రోహిత్‌ను తొలుత మిడాన్‌లో ఫీల్డింగ్‌లో చేయమని హార్దిక్ ఆదేశించాడు. అయితే బౌలర్‌తో మాట్లాడిన హార్దిక్ వెంటనే రోహిత్‌ను మళ్లీ లాంగ్-ఆన్ పొజిషన్‌కు వెళ్లమని సూచించాడు. హార్దిక్ ఆర్డర్స్ ఇవ్వడంతో రోహిత్ పరిగెత్తుకుంటూ లాంగ్ ఆన్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హార్దిక్ కావాలనే రోహిత్ ఫీల్డింగ్‌ను పొజిషన్‌ను మార్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. Rohit in 2024 is being treated like Advani in 2014 pic.twitter.com/Ys82JW3svu — Sagar (@sagarcasm) March 24, 2024 -
MI Vs GT: ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ ఘన విజయం
ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ ఘన విజయం ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో బ్రెవిస్(46), రోహిత్ శర్మ(43) టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సెన్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(41) రాహుల్ తెవాటియా(22) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ రెండు, చావ్లా తలా రెండు వికెట్లు పడగొట్టారు. 18 ఓవర్లకు ముంబై స్కోర్: 142/5 18 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ముంబై విజయానికి 12 బంతుల్లో 27 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. రోహిత్ ఔట్ 107 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సాయి కిషోర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ముంబై విజయానికి 42 బంతుల్లో 57 పరుగులు కావాలి. 10 ఓవర్లకు ముంబై స్కోర్: 88/2 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(40), బ్రెవిస్(26) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ముంబై.. నమాన్ ధీర్ ఔట్ 30 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన నమాన్ ధీర్.. ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 40/2. క్రీజులో రోహిత్ శర్మ(18), బ్రెవిస్(0) ఉన్నారు. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు. ఒమర్జాయ్ బౌలింగ్‌లో కిషన్ ఔటయ్యాడు. రాణించిన గుజరాత్ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ 169 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(41) రాహుల్ తెవాటియా(22) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ రెండు, చావ్లా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్.. గుజరాత్ టైటాన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ తెవాటియా(17), విజయ్ శంకర్(1) ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్.. మిల్లర్ ఔట్ 133 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మిల్లర్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విజయ్ శంకర్ వచ్చాడు. మూడో వికెట్ డౌన్.. ఒమర్జాయ్ ఔట్ 104 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అజ్మతుల్లా ఓమర్జాయ్.. గెరాల్డ్ కోయిట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో వికెట్ డౌన్.. 66 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అజ్ముతుల్లా ఒమర్జాయ్ వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. 31 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన వృద్దిమన్ షా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి సాయి సుదర్శన్ వచ్చాడు. 3 ఓవర్లకు ముంబై స్కోర్ 27/0 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్(11) , వృద్దిమన్ షా(15) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్ ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్ -
మనమంతా ఒకటే.. రోహిత్‌ను కౌగిలించుకున్న హార్దిక్! వీడియో
ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో వాంఖడేలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో ముంబై జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే కెప్టెన్‌గా ముంబైను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. ఈ ఏడాది సీజన్లో సాధరణ ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. రోహిత్ శర్మ స్ధానంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టు కెప్టెన్‌గా ముంబై ఫ్రాంచైజీ నియమిచింది. ఈ ఏడాది సీజన్ మినీ వేలం తర్వాత గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పగ్గాలను ముంబై ఇండియన్స్ అప్పగించింది. ముంబై తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐదు సార్లు టైటిల్స్‌ను అందించిన హిట్‌మ్యాన్ ముంబై ఫ్రాంచైజీ వ్యవహరించిన తీరును చాలా మంది మాజీలు సైతం తప్పుబట్టారు. అంతేకాకుండా ముంబై నిర్ణయం పట్ల రోహిత్ శర్మ కూడా ఆసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను సోషల్ మీడియాలో హిట్‌మ్యాన్ ఆన్ ఫాలో చేసేశాడని ఊహగానాలు వినిపించాయి. అయితే తాజాగా వీటిన్నటికి హిట్‌మ్యాన్, హార్దిక్ ఇద్దరూ చెక్ పెట్టారు. ప్రాక్టీస్ సెషన్లో ఇద్దరూఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2024 సీజన్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. శుక్రవారం(మార్చి22) చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడన్నాయి. చదవండి: అరంగేట్రంలో అదరగొట్టేందుకు! 𝟰𝟱 🫂 𝟯𝟯#OneFamily #MumbaiIndians | @hardikpandya7 @ImRo45 pic.twitter.com/eyKSq7WwCV — Mumbai Indians (@mipaltan) March 20, 2024 -
ఐపీఎల్‌కు ముందు సిక్సర్ల వర్షం కురిపించిన తిలక్ వర్మ..
ఐపీఎల్-2024 సీజన్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుది. మార్చి 22న చెపాక్ వేదికగా తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ క్యాష్‌రిచ్ లీగ్ కోసం ఇప్పటికే మొత్తం అన్ని జట్లు తమ అస్త్ర, శాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు తిలక్ వర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. వాంఖడేలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఐపీఎల్-2022 సీజన్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 25 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ యువ సంచలనం.. 740 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలోనూ వర్మ సత్తాచాటాడు. ఏకంగా మూడు సెంచరీలను తిలక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అదే దూకుడును ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఈ హైదరాబాదీ ఊవ్విళ్లరుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 24 అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. చదవండి: Hardik Pandya: అప్పటికే ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాకు ఆడకపోవడానికి కారణం ఇదే! Tilak’s bat striking the 𝐩𝐞𝐫𝐟𝐞𝐜𝐭 chord in the nets 🎶🤌#OneFamily #MumbaiIndians #NetSetGo @TilakV9 pic.twitter.com/jcsT3NfYBX — Mumbai Indians (@mipaltan) March 18, 2024 -
IPL 2024: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!?
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో రోహిత్ తెగదింపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా రెండు నెలల క్రితం తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ తొలిగించిన సంగతి తెలిసిందే. రోహిత్ స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి జట్టు పగ్గాలను ముంబై అప్పగించింది. ఈ నిర్ణయం రోహిత్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ పట్ల ముంబై వ్యవహరించిన తీరుపై విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. తాజాగా ఇదే విషయంపై ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మార్క్ బౌచర్ మాట్లాడుతూ.. ఇది పూర్తిగా క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయం. రోహిత్ శర్మపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. రోహిత్‌పై వర్క్ లోడ్ తగ్గిస్తే.. అతడు స్వేచ్చగా బ్యాటింగ్ చేయగలడని మేము భావిస్తున్నాముని చెప్పుకొచ్చాడు. అయితే బౌచర్ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే స్పందించింది. ఇందులో చాలా వరకు తప్పులే మాట్లాడారంటూ ఆమె కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రితికాతో పాటు హిట్‌మ్యాన్ కూడా ముంబై ఫ్రాంచైజీ పట్ల ఆసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఫ్రాంచైజీ మారాలని రోహిత్ భావిస్తున్నట్లు వినికిడి. ఐపీఎల్-2024 మినీ వేలం తర్వాత తిరిగి ట్రేడింగ్ విండో ఓపెన్ అయింది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ఒక నెల ముందు వరకు ట్రేడిండ్ విండో అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంఛైజీలు హిట్‌మ్యాన్‌తో సంప్రదింపులు జరిపే ఛాన్స్ ఉంది. మరోవైపు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య కూడా విభేదాలు తలెత్తినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఒకరినొకరు సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్స్‌లో ఆన్ ఫాలో కూడా చేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. చదవండి: 'ప్లీజ్.. నా కొడుకును జడేజాతో పోల్చవద్దు' -
జిమ్‌లో చెమటోడ్చుతున్న హార్దిక్.. రీ ఎంట్రీ అప్పుడే! వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీ మధ్యలో తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జట్టుకు హార్దిక్ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు , దక్షిణాఫ్రికా పర్యటనకు పాండ్యా దూరమయ్యాడు. అదే విధంగా జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో లేడు. హార్దిక్ చీలమండ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు. అతడు ఐపీఎల్-2024 సీజన్‌తో రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ఉన్న హార్దిక్.. పూర్తి ఫిట్నెస్ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. బరువులు ఎత్తుతూ కఠోర సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాతో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవరించనున్నాడు. ఐపీఎల్-2024 సీజన్ మినీ వేలానికి ముందు హార్దిక్‌ను గుజరాత్ నుంచి ముంబై ఫ్రాంచైజీ ట్రేడ్ చేసి అందరని ఆశ్చర్యపరిచింది. చదవండి: IND vs SA: రోహిత్ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్.. చర్యలకు సిద్దం!? -
'హార్దిక్ తిరిగొచ్చినా రోహిత్ శర్మనే కెప్టెన్.. రాసిపెట్టుకోండి'
టీ20ల్లో మరోసారి భారత జట్టును నడిపించేందుకు రోహిత్ శర్మ సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జజట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. రోహిత్‌తో పాటు మరో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి అవకాశం లభించింది. దాదాపు 4 నెలల తర్వాత రోహిత్, కోహ్లి తిరిగి టీమిండియా టీ20 జట్టులో చేరారు. ఈ సీనియర్లు ఇద్దరూ టీ20 ప్రపంచకప్-2024లో కూడా భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే ఈ సిరీస్‌కు భారత టీ20 తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే హార్దిక్ గాయం నుంచి తిరిగి కోలుకుంటే రోహిత్ భారత జట్టుకు సారథ్యం వహిస్తాడా లేదా సెలక్టర్లు పాండ్యా వైపే మొగ్గు చూపుతారన్నది ప్రస్తుతం అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చినా టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మనే జట్టుకు నాయకత్వం వహిస్తాడని చోప్రా తెలిపాడు. టీ20ల్లో రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా చూడడం చాలా సంతోషంగా ఉంది. రోహిత్ అఫ్గాన్ సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత జట్టును నడిపిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. హార్దిక్ తిరిగి వచ్చిన తర్వాత కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది రాసిపెట్టుకోండి. రోహిత్ జట్టులో ఉంటే హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు చాలా తక్కువ అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Ind vs Eng: మహ్మద్ షమీ మరికొన్నాళ్లు.. ఇప్పట్లో కష్టమే! -
IND vs AFG: సెలక్టర్ల నిర్ణయం సరైనదే! హార్దిక్ స్ధానంలో అతడే బెటర్
అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు 16 మంది సభ్యలతో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20ల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. 14 నెలల తర్వాత వీరిద్దరూ టీ20ల్లో భారత జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. ఇక సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుత్‌రాజ్ గాయం కారణంగా దూరం కాగా.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక హార్దిక్ పాండ్యా స్ధానంలో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. గతేడాది ఐర్లాండ్‌తో టీ20 సిరీస్, ఆసియా క్రీడల్లో అద్భుతంగా రాణించిన దూబేకు ఎట్టకేలకు జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో దూబేను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "శివమ్ దూబే తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చాడు. సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు. సెలక్టర్ల నిర్ణయం నన్ను ఏమి ఆశ్చర్యపరచలేదు. జట్టుకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడి కావాలి. ఆ సత్తా దూబేకు ఉంది. అతడిని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారని భావించాను. అతడిని సౌతాఫ్రికాకు తీసుకువెళ్లి ఉంటే విదేశీ పిచ్‌లపై ఎలా ఆడేవాడన్నది మేనెజ్మెంట్కు ఒక అవగహన వచ్చి ఉండేది. కానీ సెలక్షన్ కమిటీ అతడిని పరిగణలోకి తీసుకోలేదు. స్వదేశంలో ఆసీస్ సిరీస్‌లో కూడా అదే పరిస్థితి. జట్టులో ఉన్నప్పటికి సిరీస్ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు. కచ్చితంగా జట్టుకు ఆరో బౌలర్ అవసరం. కాబట్టి దుబేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందని ఆశిస్తున్నాను" అని చోప్రా తన యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా భారత తరపున ఇప్పటివరకు 18 టీ20లు ఆడిన దూబే.. 152 పరుగులతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: Ind vs Eng: మహ్మద్ షమీ మరికొన్నాళ్లు.. ఇప్పట్లో కష్టమే! -
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేస్తున్నాడు!?
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న హార్దిక్ వేగంగా కోలుకుంటున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా అఫ్గానిస్తాన్ సిరీస్‌కు, ఐపీఎల్ సీజన్‌కు దూరమవుతాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ సమయానికి పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని సమాచారం. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్ సిరీస్‌లో భారత జట్టును హార్దికే సారధిగా నడిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. స్వదేశంలో జనవరి 11 నుంచి అఫ్గాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌లో బ్యాటర్ కొట్టిన షాట్‌ను ఆపేందుకు విఫలయత్నం చేసిన పాండ్యా.. అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతడి చీలమండకు గాయమైంది. అప్పటి నుంచి ఆటకు హార్దిక్ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు హార్దిక్ దూరమయ్యాడు. ఇక ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది. అంతేకాకుండా రోహిత్ శర్మను తప్పించి తమ జట్టు పగ్గాలను కూడా అప్పగించింది. చదవండి: IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం..!? సురేష్ రైనాకు.. -
నిన్న రోహిత్... తాజాగా సచిన్ గుడ్‌బై... ముంబై ఇండియన్స్‌లో ఏమవుతోంది?
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి ముంబై ఇండియన్స్ వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. రోహిత్ స్ధానంలో హార్దిక్ పాండ్యాను తమ జట్టు కొత్త సారథిగా ముంబై ఫ్రాంచైజీ నియమించింది. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్‌టాపిక్. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలిగించడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ముంబై ఫ్రాంచైజీకి సంబంధించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల ఆసంతృప్తిగా ఉన్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ మెంటార్ పదవికి రాజీనామా చేయనున్నాడన్నది ఆ వార్త సారంశం. సచిన్ తన నిర్ణయాన్ని ముంబై యాజమాన్యానికి తెలియజేసినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. క్లారిటీ ఇదిగో.. ఇక ఇదే విషయంపై మాస్టర్ బ్లాస్టర్‌ను ఓ జాతీయ మీడియా ఛానల్ సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అవన్నీ వట్టి రూమర్సే అని సచిన్ కొట్టిపారేసినట్లు సమాచారం. వచ్చే సీజన్లో కూడా ముంబై మెంటార్‌గా సచిన్ కొనసాగనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా 2014 సీజన్ నుంచి ముంబై ముంబై మెంటార్‌గా సచిన్ తన సేవలు అందిస్తున్నాడు. అదే విధంగా 5 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు సచిన్ ప్రాతినిథ్యం వహించాడు. తన ఐపీఎల్ కెరీర్లో 78 మ్యాచ్‌లు ఆడిన టెండూల్కర్.. 2334 పరుగులు చేశాడు. చదవండి: Asia Cup 2023: సెమీస్‌లో భారత్‌ను ఓడించి.. కట్‌చేస్తే ఇప్పుడు ఏకంగా ఛాంపియన్స్‌గా 🚨Breaking News🚨 Sachin Tendulkar stepped down from mentor role of Mumbai Indians. RIP MUMBAI INDIANS pic.twitter.com/qKq17TQF60 — Shubham 𝕏 (@DankShubhum) December 16, 2023 -
కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను ముంబై ఫ్రాంచైజీ యాజమన్యం తప్పించింది. అతడి స్ధానంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు తమ జట్టు పగ్గాలు అప్పగించింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏకంగా 5 ఐపీఎల్ టైటిల్స్‌ను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ముంబై ఇండియన్స్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "షేమ్ ఆన్ ముంబై ఇండియన్స్"(#ShameOnMI) అనే హ్యాష్‌ట్యాగ్‌ను తెగ ట్రేండ్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ప్రకటించిన కొన్ని గంటలలోపే ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలో భారీగా తమ ఫాలోవర్లను ముంబై ఫ్రాంచైజీ కోల్పోయింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్(ట్విటర్)లో ముంబై అధికారిక పేజిని 4 లక్షల మంది అన్‌ఫాలో చేశారు. అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 1.5 లక్షల మంది ఫాలోవర్లను ముంబై ఇండియన్స్ కోల్పోయింది. రోహిత్ ను విపరీతంగా అభిమానించే అభిమానులు ముంబై జట్టును అన్ ఫాలో కొట్టడంతో ఇప్పుడు ఆ జట్టు బ్రాండ్ వాల్యూ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన -
గుండె బద్దలైంది.. నిన్ను మించిన నాయకుడు లేడు! ఎప్పటికీ నీవు మా కెప్టెన్‌వే
ఐపీఎల్ చరిత్రలో అత్యంతవిజయవంతమైన జట్టు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ముంబై ఇండియన్సే. సచిన్ టెండూల్కర్, హర్భజన్ వంటి దిగ్గజాల సారథ్యంలో కూడా గుర్తింపురాని ముంబై ఇండియన్స్.. ఒకరి నాయకత్వంలో మాత్రం సంచలనాలు సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడి.. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. దీనికి కారణం ఒకే ఒక్కడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్లోనే ముంబైను ఛాంపియన్స్‌గా నిలిపి.. 5 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఘనత అతడిది. తన వ్యూహాలతో ప్రత్యర్ధి జట్లను చిత్తు చేసే మాస్టర్‌మైండ్ అతడిది. తన హావభావాలతో అభిమానులను అకట్టుకునే నైజం అతడిది. ఇకపై ఐపీఎల్లో అతడి నాయకత్వాన్ని మరి చూడలేం. ఒక మాజీ కెప్టెన్‌గా, సాధరణ ఆటగాడి గానే చూడా బోతున్నాం. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది ఈ ఉపోద్ఘాతం అంత ఎవరు కోసమే. అవును మీరు అనుకుంటుంది నిజమే. ఇదింతా టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసమే. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ అభిమానుల గుండె బద్దలయ్యే నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి హిట్‌మ్యాన్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తప్పించింది. అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌గా సారథిగా రోహిత్ శర్మ జర్నీపై ఓ లుక్కేద్దాం. 2013లో తొలిసారి.. ఐపీఎల్-2011 సీజన్ వేలంలో రూ. 13 కోట్లకు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే 2013లో తమ జట్టు పగ్గాలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం అప్పగించింది. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి హిట్‌మ్యాన్ జట్టును విజయ పథంలో నడిపించాడు. నాయకుడిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో కూడా అందరిని అకట్టుకున్నాడు. ఈ క్రమంలో మొత్తంగా 11 సీజన్లలో సారథ్యం వహించి అందులో 5 సార్లు తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ మొత్తంగా ముంబై ఇండియన్స్ జట్టు తరఫున 163 మ్యాచులకు సారధ్యం వహించగా.. 91 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 68 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. గుండె బద్దలైంది.. ఇక కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదిగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జట్టు కోసం ఎంతో కష్టపడి.. అద్భుతమైన ఫలితాలు అందించిన వ్యక్తికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. 'నా గుండె బద్దలైంది.. ఏదేమైనప్పటికీ నీవు మా కెప్టెన్‌వే' అంటూ కామెంట్ చేశారు. కాగా రోహిత్ కెప్టెన్సీ తప్పించిన తర్వాత ముంబైకు బిగ్ షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్‌ను 1.5 లక్షల మంది ఆన్ ఫాలో చేశారు. చదవండి: IND vs SA: అర్ష్‌దీప్‌పై కోపంతో ఊగిపోయిన సూర్య.. వేలు చూపిస్తూ! వీడియో వైరల్ -
'అందుకే రోహిత్‌ను తప్పించాం.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు'
ముంబై ఇండియన్స్‌లో ఒక శకం ముగిసింది. ముంబైను ఐదు సార్లు చాంపియన్స్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. ఇకపై ఒక సాధరణ ఆటగాడిగానే కొనసాగనున్నాడు. ఐపీఎల్- 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తప్పించింది. అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టు కొత్త నాయకుడిగా ముంబై నియమించింది. ఇక కెప్టెన్సీ మార్పుపై ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే స్పందించాడు. 2024 సీజన్ నుంచే హార్దిక్‌కు కెప్టెన్సీ అప్పగించాలని తాము భావించినట్లు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే తెలిపాడు. ‘ఎప్పుడైనా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ముంబై ఇండియన్స్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది కూడా అందులో భాగమే. రోహిత్‌తో పాటు గతంలోనూ సచిన్, హర్భజన్, పాంటింగ్ కెప్టెన్లగా జట్టును సమర్థంగా నడిపించడంతో పాటు ముందు చూపుతోనూ వ్యవహరించారు. వచ్చే సీజన్ నుంచే హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు అత్యుత్తమ ఫలితాలు సాధించింది. అతని నాయకత్వ పటిమకు మా అభినందనలు. ఐపీఎల్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా రోహిత్ అనుభవం మైదానంలోనూ, మైదానం బయటా జట్టుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అని జయవర్ధనే ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. -
హార్దిక్ ఎంట్రీ.. ముంబై ఇండియన్స్‌కు బుమ్రా గుడ్‌బై!?
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లి అందరని షాక్‌కు గురిచేయగా.. ఇప్పుడు మరో భారత స్టార్ ఆటగాడు ఫ్రాంచైజీ మారనున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్‌లో హార్దిక్ పాండ్యా రావడం పట్ల బుమ్రా ఆసంతృప్తిగా ఉన్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే బుమ్రా ముంబై ఇండియన్స్ నుంచి గుజరాట్ టైటాన్స్‌లోకి వెళ్లనునున్నాడని తెలుస్తోంది. కాగా బుమ్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ‘కొన్నిసార్లు నిశ్శబ్దమే అత్యుతమ సమాధానంగా నిలుస్తుంది’’ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో కూడా ముంబై ఇండియన్స్‌ను బుమ్రా అన్‌ఫాలో చేసినట్లు సమాచారం. దీంతో ఫ్రాంచైజీ మారాలని అతడు ఫిక్స్ అయిపోయినట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా 2013లో ముంబై ఇండియన్స్ తరపున బుమ్రా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 9 సీజన్ల పాటు ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు. గాయం కారణంగా బుమ్రా గత సీజన్‌కు దూరమయ్యాడు. చదవండి: ఇదేమి బుద్దిరా బాబు.. ఔటైనా గ్రౌండ్లో నుంచి వెళ్లలేదు! వీడియో వైరల్ -
హార్దిక్ ఒక్కడే కాదు.. గతంలోనూ కెప్టెన్ల ట్రేడింగ్! ఎవరెవరంటే?
ఐపీఎల్-2024 సీజన్‌కు ఇంకా 5 నెలల సమయం ఉన్నప్పటికి.. ఇప్పటినుంచే సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఈ ఐపీఎల్-17వ సీజన్‌కు వేలానికి ముందు ఓ అనుహ్య మార్పు చోటు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి చేరాడు. క్యాష్ ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. తొలి రెండు సీజన్లలో గుజరాత్‌ను ఓ సారి ఛాంఫియన్స్‌గా.. మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యా అనూహ్యంగా ఫ్రాంచైజీ మారడంపై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. 2015 సీజన్లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో వేలంలో అతడినికి కనీస ధర రూ.10లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. ఆ తర్వాత 6 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్‌ను.. ఐపీఎల్-2022 వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రూ.15 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసి జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో అరంగేట్ర సీజన్లోనే తన జట్టును విజేతగా నిలిపాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ట్రేడింగ్ ద్వారా కెప్టెన్ ఫ్రాంచైజీ మారడం ఇదేమి తొలిసారి కాదు. హార్దిక్ కంటే ముందు మరో ఇద్దరు కెప్టెన్లు క్యాష్ ట్రేడింగ్ ద్వారా ఫ్రాంఛైజీలు మారారు. ఎవరెవరంటే? అజింక్యా రహానే.. ట్రేడింగ్ రూపంలో ఫ్రాంచైజీ మారిన తొలి కెప్టెన్ టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే. ఐపీఎల్-2020 సీజన్‌కు ముందు రాజస్తాన్ నుంచి రహానేను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్-2011లో రాజస్తాన్ రాయల్స్‌కు రహానే సారథ్యం వహించాడు. రవిచంద్రన్ అశ్విన్.. ఈ లిస్ట్‌లో రహానే తర్వాతి స్ధానంలో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. అశ్విన్‌ను ఐపీఎల్-2020 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ నుంచి అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడింగ్ ద్వారానే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి హార్దిక్ కూడా చేరాడు. -
గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి.. స్పందించిన హార్దిక్ పాండ్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ సొంత గూటికి చేరాడు. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడు. ఐపీఎల్-2024 మినీ వేలానికి ముందు క్యాష్ ట్రేడింగ్ పద్దతి ద్వారా గుజరాత్ నుంచి ముంబై ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఇక ఈ విషయంపై హార్దిక్ పాండ్యా తొలిసారి స్పందించాడు. తన అరంగేట్ర ఫ్రాంచైజీకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని హార్దిక్ ట్విట్ చేశాడు. "ముంబై ఇండియన్స్‌లోకి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను తిరిగి పొందనున్నాను. ముంబై, వాంఖడే, పల్టాన్ వంటి ఎన్నో మధుర జ్ఞాపకాలు ముంబైతో ఉన్నాయి" అని ట్విటర్లో రాసుకొచ్చాడు. అయితే అతడు చేసిన ట్విట్లో రెండు సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కాగా హార్దిక్ పాండ్యా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి 2021 సీజన్‌కు వరకు ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2022 మేగా వేలానికి ముందు ముంబై అతడిని విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన అతడిని కొత్త ప్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. అంతేకాకుండా ఐపీఎల్-2022లో తమ జట్టు పగ్గాలు కూడా అప్పగించింది. ఈ క్రమంలో అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు. అంతేకాకుండా ఐపీఎల్-2023లో అతడి సారథ్యంలోనూ గుజరాత్ రన్నరప్‌గా నిలిచింది. కాగా పాండ్యా తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 123 మ్యాచ్‌లు ఆడి 2309 పరుగులతో పాటు 53 వికెట్లు సాధించాడు. చదవండి: IPL 2024: గుజరాత్ టైటాన్స్ నయా కెప్టెన్ అతడే..! This brings back so many wonderful memories. Mumbai. Wankhede. Paltan. Feels good to be back. 💙 #OneFamily @mipaltan pic.twitter.com/o4zTC5EPAC — hardik pandya (@hardikpandya7) November 27, 2023 -
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా: ఏబీ డివిలియర్స్
ఐపీఎల్-2024కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లో చేరనున్నాడని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా లెజెండ్, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఎబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ హార్దిక్ ముంబైలోకి వెళ్తే కచ్చితంగా రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడని డివిలియర్స్ జోస్యం చెప్పాడు. కాగా హార్దిక్ పాండ్యా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి 2021 సీజన్‌కు వరకు ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2023 మేగా వేలానికి ముందు ముంబై అతడిని విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన అతడిని కొత్త ప్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. అంతేకాకుండా ఐపీఎల్-2022లో తమ జట్టు పగ్గాలు కూడా అప్పగించింది. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపి హార్దిక్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2023లో కూడా గుజరాత్‌ను రన్నరప్‌గా నిలిపాడు.హార్దిక్ తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లనున్నాడని తెలుస్తోంది. నిజంగా ముంబై ఇండియన్స్ ఇది పెద్ద వార్త. హార్దిక్ వరల్డ్ క్లాస్ క్రికెటర్. అతడు చాలా కాలంగా ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. వాంఖడే స్టేడియంలో ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అయితే రోహిత్ తన కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించేస్తాడని నేను అనుకుంటున్నాను. రోహిత్‌పై కెప్టెన్సీ పరంగా చాలా ఒత్తిడి కలిగి ఉన్నాడు. ఎందుకంటే టీమిండియా కెప్టెన్‌గా కూడా అతడు కొనసాగుతున్నాడు. రోహిత్ వర్క్‌లోడ్‌ను తగ్గించేందుకే ముంబై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా పాండ్యా తన కెరీర్లో ఇప్పటివరకు 123 మ్యాచ్‌లు ఆడి 2309 పరుగులతో పాటు 53 వికెట్లు సాధించాడు. చదవండి: మంచి మనసు.. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్ షమీ! వీడియో వైరల్ -
హార్దిక్ నిజంగా ముంబై ఇండియన్స్‌లోకి వెళ్తాడా? ఒకవేళ వెళ్లినా గానీ..
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ రూపంలో గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోనుందన్నది ఆ వార్త సారాంశం. క్యాష్ ట్రేడింగ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌కు రూ. 15 కోట్లు చెల్లించి హార్దిక్ పాండ్యాను ముంబై కొనుగోలు చేయనున్నట్లు వినికిడి. ఇప్పటికే ఇరు ఫ్రాంచైజీల మధ్య క్యాష్ డీల్ కూడా పూర్తి అయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఇవ్వకపోతే హార్దిక్ ప్రాంఛైజీ మారడంలో అర్థం లేదని ఆకాశ్ చోప్రా తెలిపాడు. "హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళుతున్నాడని ఓ వార్త తెగ చెక్కర్లు కొడుతోంది. అయితే ఇంకా ముంబై గానీ, గుజరాత్ ఫ్రాంచైజీ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతడు తమ ఫ్రాంచైజీని విడిచి వెళ్లాలంటే ముందుగా గుజరాత్ టైటాన్స్ ఒప్పుకోవాలి. ఎందుకంటే అతడు ఇప్పటికే గుజరాత్‌ను ఒక్కసారి విజేతగా, మరోసారి రన్నరప్‌గా నిలిచాడు. ఒకవేళ ముంబై ఇండియన్స్‌కు వెళ్లినా, వారు తమ జట్టుకు కెప్టెన్‌గా చేస్తారా? కెప్టెన్సీ ఇవ్వకపోతే ఫ్రాంఛైజీ మారడం దండుగ. అయితే నాకు ఇంకా ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. అందుకే త్వరలో ఏం జరగనుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కానీ నిప్పు లేనిదే పొగ రాదు. హార్దిక్ నిజంగా ముంబైకు వెళ్లనున్నాడా? అసలు అది సాధ్యమేనా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడాలి తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: IND vs AUS 2nd T20: ఆస్ట్రేలియాతో రెండో టీ20.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!? -
వరల్డ్‌కప్‌లో టీమిండియాకు బ్యాడ్ న్యూస్..
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకువెళ్తున్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడానికి మరికొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా నేరుగా సెమీఫైనల్స్‌కు అందుబాటులోకి రానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టిన పాండ్యా.. నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో జరిగే టీమిండియా చివరి లీగ్ మ్యాచ్‌కు అందబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ సెమీఫైనల్స్ దృష్ట్యా డచ్తో మ్యాచ్‌లో హార్దిక్‌ను ఆడించి రిస్క్ తీసుకోకూడదని జట్టు మేనెజ్మెంట్ భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మిగిలిన లీగ్ మ్యాచ్‌లకు హార్దిక్ దూరం కానున్నాడు. హార్దిక్ ప్రస్తుతం బాగా కోలుకుంటున్నాడు. అతడు తిరిగి సెమీఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. హార్దిక్ స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగించే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023: వరల్డ్ నెంబర్ 1 బౌలర్‌గా షాహిన్ అఫ్రిది.. -
World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 29న లక్నో వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో భారత తలపడనుంది. వరుసగా ఊహించని అపజయాలతో సతమతవుతున్న ఇంగ్లండ్.. టీమిండియా మ్యాచ్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ కోలుకున్నప్పటికి టోర్నీ సెకెండాఫ్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ లో ఉన్న పాండ్యా.. ఒకట్రెండు రోజుల్లో లక్నోలో జట్టుతో కలవనున్నాడు. కాగా ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ ఎడమ కాలికి గాయమైంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కూ పాండ్యా దూరమయ్యాడు. చదవండి: బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా భారీ విజయం -
ఊర్వశి రౌతేలా చేసింది ఆరు సినిమాలు.. ఆస్తి రూ. 300 కోట్లు ఎలా?
బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరు ఊర్వశి రౌతెలా.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తూ యువతలో మంచి క్రేజ్‌ను అందుకుంది.. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ బ్యూటీ 15 సంవత్సరాల వయస్సులోనే తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. అలా మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 టైటిల్‌ను కూడా గెలుచుకుంది, ఈ పోటీలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. అలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్పంతి, మరెన్నో చిత్రాలలో నటించి అలరించింది. కానీ ఆమెకు పెద్దగా సినిమా ఛాన్స్‌లు దక్కలేదు. దీంతో చేతిలో అంతగా డబ్బులేదు.. సినిమా ఛాన్స్‌లు ఇస్తామని ఆమెను మోసం చేసిన వారే ఎక్కువ కావడంతో అలా ఆమె సినీ కెరీయర్ ముగిసిపోయిందని అనుకుంది. (ఇదీ చదవండి: తప్పని పరిస్థితిలో నేడు మీడియా ముందుకు హీరో రవితేజ) సరిగ్గా అదే సమయంలో ఊర్వశికి భారత క్రికెటర్ హర్థిక్ పాండ్యాతో పరిచయం కావడమే కాకుండా ఆయనతో డేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో సినిమా ఛాన్స్‌ల కోసం బాలీవుడ్ నిర్మాత సమీర్ నాయర్‌తో కూడా ఆమె డేట్ చేస్తున్నట్లు తెరపైకి వచ్చింది. ఆమె కంటే సమీర్ వయసులో చాలా పెద్దవాడు అయినా సినిమా అవకాశాల కోసం ఆయనతో టచ్‌లో ఉండేదని సమాచారం. కానీ అతను మాత్రం ఆమెకు ఛాన్స్‌లు ఇస్తానంటూ కాలయాపన చేస్తున్నట్లు గ్రహించిన ఊర్వశి నెమ్మదిగా అతనికి గుడ్‌బై చెప్పేసింది. ఎలాగైనా బాలీవుడ్లో ఒక్క ఛాన్స్ వస్తే తన టాలెంట్‌తో లైఫ్‌లో సెటిల్ కావచ్చని ఆమె కలలు కనేది. అలా టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయన ఊర్వశికి పాగల్ పంథీ సినిమాలో ఒక హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అయినా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అలా ఆయనతో కూడా ఊర్వశి డేట్ చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. సినిమా గ్లామర్ ఫీల్డ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఆమెకు రిషబ్ పంత్ ఒక ఫంక్షన్లో పరిచయం కావడం ఆపై కొంత కాలం డేట్ చేసినట్లు వార్తలు వచ్చినా రిషబ్ తిప్పికొట్టాడు. మొదట రిషబ్ తన సోషల్ మీడియాలో ఊర్వశిని బ్లాక్ చేయడంతో వీరిద్దరూ మీడియాలో ప్రధాన వార్తలుగా మిగిలారు. తర్వాత కొద్దిరోజుల పాటు ఇద్దరూ పరోక్షంగా ఒకరిపైమరొకరు సోషల్ మీడియాలో కామెంట్లు,స్టేటస్లు పెట్టుకోవడంతో వారిద్దరి మధ్య ఎఫైర్ నిజమేనని వార్తలు వచ్చాయి. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఊర్వశి రౌతెలా ఇప్పటి వరకు ప్రధాన హీరోయిన్గా కేవలం 6 సినిమాలు మాత్రమే చేసింది. అవి కూడా అంతగా చెప్పుకోతగినవి కాదు. అడపాదడపా ఐటమ్ సాంగ్స్‌లలో కనిపించేది. దీంతో ఆమెకు పెద్దగా ఇన్కమ్ సోర్స్ కనిపించలేదు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లలోనే ఆమె రూ. 150 కోట్లు పెట్టి ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొనింది. ఈ డబ్బంతా దుబాయ్,యూకే,కెనడా వంటి దేశాల్లో ఈ బ్యూటీ గ్లామర్‌తో కొల్లగొట్టిందని ప్రచారం ఉంది. అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలకు దుబాయ్‌లో ఎక్కువ క్రేజ్ అట. అక్కడి షేక్స్ కూడా ఎక్కువగా వారినే ఇష్టపడి ట్రాప్ చేస్తారట. అలా అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిల్ని దక్కించుకునేందుకు వారు ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారట. ఇలా ఊర్వశి కేవలం 11 ఏళ్ల సినిమా కెరియర్లో సంపాదించలేనిది కేవలం రెండు సంవత్సరాల్లోనే సుమారు రూ. 300 కోట్లు వెనుకేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సినిమా ఛాన్స్‌ల కోసం ఆమె శ్రీదేవి భర్త బోణీ కపూర్‌తో డేట్ చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ కలిసి పార్టీలు,వెకేషన్లు అంటూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. -
న్యూజిలాండ్‌తో మ్యాచ్.. ధర్మశాలకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో మరో రసవత్తరపోరుకు టీమిండియా సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్‌తో ఆదివారం భారత్ తలపడనుంది. ఆక్టోబర్ 20న ధర్శశాల వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం రోహిత్ సేన ధర్మశాలలో శుక్రవారం అడుగుపెట్టింది. పూణే నుంచి ప్రత్యేక విమానంలో భారత జట్టు ధర్మశాలకు చేరుకుంది. భారత క్రికెటర్లు విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ధర్మశాలకు చేరుకున్న భారత జట్టు శనివారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోనుంది. మరోవైపు తమ ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై విజయం సాధించిన న్యూజిలాండ్ ఇప్పటికే ధర్మశాలలో తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేసింది. హార్దిక్ దూరం.. కాగా కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా కాలికి గాయమైంది. గాయం తీవ్రమైనది కావడంతో అతడు వారం రోజుల పాటు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో గడపనున్నాడు. అతడు తిరిగి మళ్లీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. చదవండి: India vs New Zealand: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. హార్దిక్ దూరం! జట్టులోకి విధ్వంసకర ఆటగాడు Team India arrives in Dharamshala to take on New Zealand.pic.twitter.com/KY0ms9qUAB — Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2023 -
పాక్ ఓపెనర్‌ను ఔట్ చేసిన హార్దిక్.. సెలబ్రేషన్స్ వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో భారత్ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి తన బౌలింగ్‌తో జట్టును అదుకున్నాడు. 36 పరుగులతో క్రీజులతో పాతుకుపోయే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్-హక్‌ను అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. తన వేసిన తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న హార్దిక్.. తన మూడో ఓవర్లో మాత్రం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. పాక్ ఇన్నింగ్స్ 13 ఓవర్లో మూడో బంతిని వైడ్ ఆఫ్‌స్టంప్ దిశగా వేశాడు. ఇమామ్ కవర్ డ్రైవ్ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రాహుల్ చేతికి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లిపోయింది. వెంటనే హార్దిక్ కూడా స్పెషల్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. బంతిని చేతిలో పట్టుకుని నమస్కారం పెడుతూ ఇమామ్‌కు సెండాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: WC 2023- Ind vs Pak: పాక్ గుండు సున్నా.. రోహిత్ ఒక్కడే 27! ఇదీ మీ లెవల్ అంటూ.. If God doesn't exist, explain this atheistspic.twitter.com/ve3VXJ3cE8 — Sagar (@sagarcasm) October 14, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. టీమిండియాకు మరో బిగ్ షాక్!
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆక్టోబర్ 8న చెన్నైవేదికగా తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు మరో బిగ్‌షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. రేవ్‌స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా పాండ్యా కుడి చేతి వేలికి గాయమైనట్లు సమాచారం. అతడు తీవ్రనొప్పితో బాధపడుతూ.. తర్వాత బ్యాటింగ్ కూడా మరి చేయలేదని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఆసీస్‌తో మ్యాచ్ సమయానికి హార్దిక్ కోలుకోకపోతే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే స్టార్ ఓపెనర్ శబ్‌మన్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. అతడి తొలి మ్యాచ్‌కు అందుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా చెమటడ్చుతోంది. చదవండి: Asian Games 2023: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి బంగ్లాదేశ్ గెలుపు! పాక్‌కు బిగ్ షాక్ -
ఇదేమి బంతిరా బాబు.. దెబ్బకు బాబర్ ఆజం ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సూపర్-4 పాయింట్ల పట్టికలో తొలి స్ధానానికి భారత్ చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. విరాట్ కోహ్లి(122), కేఎల్ రాహుల్(111) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగులకే పాకిస్తాన్ ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇక భారత తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకతో తలపడనుంది. హార్దిక్ సూపర్ డెలివరీ.. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్బుతమైన బంతితో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను బోల్తా కొట్టించాడు. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హార్దిక్ బంతితో మ్యాజిక్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్ 10 ఓవర్లో హార్దిక్ వేసిన ఇన్‌స్వింగర్‌కు బాబర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆఫ్‌సైడ్ పడిన బంతిని ఆజం ఢిపెన్స్ ఆడడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన బాబర్ ఆజం బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అతడికి 5 నిమిషాల ముందు చెప్పాం.. కానీ! వాళ్లందరికీ చాలా థ్యాంక్స్: రోహిత్ What a delivery from Hardik Pandya to get Pakistani captain Babar Azam. pic.twitter.com/RjW11ThM3K — Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2023 2nd wicket of Pakistan gone as #BabarAzam #INDvPAK #IndiaVsPakistan #HardikPandya pic.twitter.com/eer3ax2Dul — Be Real (@ec12hcst) September 11, 2023 -
జట్టులో అందరికంటే నాకే వర్క్‌లోడ్ ఎక్కువ.. ఎందుకంటే?: హార్దిక్
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 10) భారత్-పాకిస్తాన్ జట్లు కొలంబో వేదికగా తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ బ్లాక్‌బ్లాస్టర్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో తన రోల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ అయినందున మిగితా వారికంటే తనపై వర్క్‌లోడ్ ఎక్కువ ఉంటుందని హార్దిక్ తెలిపాడు. కాగా ఈ మెగా టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 87 పరుగులతో హార్దిక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్ విఫలమైన చోట హార్దిక్ సత్తాచాటాడు. మరోసారి సూపర్-4లో కూడా పాక్‌పై అదరగొట్టేందుకు హార్దిక్ సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్ ఫాలో ది బ్లూస్ షోలో హార్దిక్ మాట్లాడుతూ.. "ఒక ఆల్‌రౌండర్‌గా నా పనిభారం అందరికంటే డబుల్ లేదా ట్రిపుల్ ఉంటుంది. జట్టులోని ఒక బ్యాటర్ బ్యాటింగ్ చేసే అంతవరకే తన పని. కానీ నేను మాత్రం బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ కూడా చేయాలి. కాబట్టి అందుకు తగ్గట్టు నేను ముందే సిద్దమవుతాను. ప్రీ-క్యాంప్ సీజన్లో మొత్తం ట్రైనింగ్ తీసుకుంటాను. అయితే ఏదైనా మ్యాచ్‌కు ముందు జట్టుకు ఏదో అవసరం దానిపై ఎక్కువగా దృష్టి సారిస్తాను. ఒకవేళ నేను 10 ఓవర్లు చేయాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయిస్తే.. 10 ఓవర్లు పూర్తి చేస్తా. అవసరం లేదంటే నాకు అప్పగించిన కోటా పూర్తి చేస్తాను. జట్టు అవసరం బట్టి ముందుకు వెళ్తా. నేను ఎప్పుడు కూడా మ్యాచ్ పరిస్థితిని ఆర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. విజయం సాధించాలంటే మనపై మనంకు నమ్మకం ఉండాలి. ఈ వరల్డ్‌లో నీకు నీవే బెస్ట్ అని భావించాలి. నీ గెలుపుకు నీవే కారణం కావాలి" అని పేర్కొన్నాడు. చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి అందుబాటులోకి పంత్?; అలాంటి బ్యాటర్ కావాలి: రోహిత్ -
అంపైర్‌ను కౌగిలించుకున్న హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్!
ఆసియాకప్-2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సూపర్-4కు భారత అర్హత సాధించింది. ఇక వర్షం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన చర్యతో నవ్వులు పూయించాడు. కాగా నేపాల్ ఇన్నింగ్స్ సందర్భంగా పలుమార్లు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం గ్రౌండ్ స్టాప్‌కు కూడా చుక్కలు చూపించింది. అంపైర్‌ను హగ్ చేసుకున్న హార్దిక్.. నేపాల్ ఇన్నింగ్స్ 34 ఓవర్ ఆఖరిలో వర్షం ఒక్కసారిగా కురిసింది. దీంతో వెంటనే గ్రౌండ్ స్టాప్ కవర్లు తీసుకుని మైదానంలోకి వచ్చారు. అంపైర్లు కూడా స్టంప్స్‌ను తొలిగించారు. కానీ వర్షం మాత్రం ఆగిపోయింది. ఈ క్రమంలో కవర్లు తీసుకుని వచ్చిన గ్రౌండ్ స్టాప్ కూడా మైదానం మధ్యలో ఆగిపోయారు. దీంతో మళ్లీ వారు వెనక్కి తీసుకువెళ్లాలని నిర్ణయించకున్నారు. వారు వెనక్కి వెళ్లాలనుకున్న సమయంలో మళ్లీ వర్షం వచ్చింది. ఇది చూసిన హార్దిక్ పాండ్యా గట్టిగా నవ్వుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ పక్కనే ఉన్న అంపైర్‌ను నవ్వుతూ కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక భారత్ సూపర్-4 దశలో సెప్టెంబర్ 10న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మరోసారి తలపడనుంది. చదవండి: World Cup 2023: నేడు భారత ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఎవరూ ఊహించని ఆటగాడి ఎంట్రీ! pic.twitter.com/bczp26fgN4 — Nihari Korma (@NihariVsKorma) September 4, 2023 -
మనసులు గెలుచుకున్నాడు.. హార్దిక్ షూ లేస్ కట్టిన పాక్ స్టార్ క్రికెటర్
ఆసియాకప్-2023లో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. భారత ఇన్నింగ్స్ తర్వాత ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. మ్యాచ్ రద్దైనప్పటికీ ఇరు జట్లకు కొన్ని సానుకూల ఆంశాలు ఉన్నాయి. భారత టాపర్డర్ విఫలమైనచోట హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి అందరని ఆకర్షించగా.. పాక్ పేసర్లు అఫ్రిది, రౌఫ్, నసీం షా సంచలన ప్రదర్శన చేశారు. శభాష్ షాదాబ్.. ఇక వర్షం కారణంగా రద్దైన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ తన క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. భారత ఇన్నింగ్స్ సందర్భంగా హార్దిక్ పాండ్యా షూ లేస్‌లను కట్టి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తలు ఉన్నప్పటికీ.. ఆటగాళ్ల మధ్య మాత్రం మంచి స్నేహబంధం ఉంది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 4న నేపాల్‌తో తలపడనుంది. Pakistani cricketer Shadab Khan ties Indian batter Hardik Pandya's shoelaces, exemplifying the true spirit of sportsmanship. This heartwarming moment is sure to make your day and is truly the best thing on the internet today. #PAKvIND #PakVsIndia #ShadabKhan #AsiaCup2023 pic.twitter.com/fb7cR8aunj — Anokhay (@AnokhayOfficial) September 2, 2023 చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్ -
హార్దిక్ పాండ్యాకు బిగ్‌షాక్.. టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ అతడే!
ఆసియాకప్-2023కు భారత జట్టును బీసీసీఐ సోమవారం(ఆగస్టు21) ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరగనున్న సమావేశంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ మెగా ఈవెంట్‌కు జట్టును ఎంపిక చేయనుంది. కాగా మీటింగ్‌లో ఈ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పాల్గోనున్నట్లు సమాచారం. కాగా ఈ మెగా టోర్నీకి 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసియాకప్‌తో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు ఏన్సీఐ వర్గాలు వెల్లడించాయి. హార్దిక్‌పై వేటు.. ఇక ఆసియాకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వైస్‌కెప్టెన్‌గా స్టార్‌పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ డిప్యూటీగా ఉన్న హార్దిక్పాండ్యాపై వేటువేయనున్నట్లు పలునివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా దృవీకరించాయి. "ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ డిప్యూటీగా బుమ్రాను ఎంపిక చేసే అవకాశం ఉంది. అందుకే ఐర్లాండ్ సిరీస్‌లో రుత్‌రాజ్ బదులుగా బుమ్రాకు నాయకత్వ బాధ్యతలు ఇచ్చాము. కెప్టెన్సీ సీనియారిటీ పరంగా చూస్తే హార్దిక్ కంటే బుమ్రా ముందు వరుసలో ఉన్నాడు. అతడు 2022లో టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా వన్డే పర్యటనలో వైస్‌కెప్టెన్‌గా పనిచేశాడని" బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. బుమ్రా ప్రస్తుతం ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. ఐరీష్‌తో తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. అదే విధంగా ఈ మ్యాచ్‌లో బుమ్రా కూడా రెండు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. చదవండి: NZ vs UAE: న్యూజిలాండ్‌కు బిగ్‌షాకిచ్చిన పసికూన.. 7 వికెట్ల తేడాతో సంచలన విజయం -
ఓవరాక్షన్ చేస్తే అలానే ఉంటుంది.. హార్దిక్‌ను ఉతికారేసిన పూరన్! వీడియో వైరల్
టీమిండియాపై టెస్టు, వన్డే సిరీస్‌ల ఓటమికి వెస్టిండీస్ ప్రతీకారం తీర్చుకుంది. ఫ్లోరిడా వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో కరేబియన్ జట్టు కైవసం చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత భారత్‌పై విండీస్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం గమానార్హం. విండీస్ విజయంలో పేసర్ షెఫార్డ్, బ్యాటర్లు కింగ్, పూరన్ కీలక పాత్ర పోషించారు. హార్దిక్‌కు చుక్కలు చూపించిన పూరన్.. ఇక టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ బదులు తీర్చుకున్నాడు. నాలుగో టీ20కు ముందు హార్దిక్ పాండ్యా.. పూరన్‌కు ఓ సవాలు విసిరాడు. "పూరన్ కొడితే నా బౌలింగ్‌లోనే కొట్టాలి. మా ప్లాన్స్ మాకు ఉన్నాయి. నాకు ఇటువంటి పోటీ అంటే చాలా ఇష్టం. నా మాటలు పూరన్ విని నాలుగో టీ20లో నన్ను టార్గెట్ చేస్తాడని" మూడో టీ20 అనంతరం హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నాలుగో టీ20లో పూరన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో హార్దిక్ బౌలింగ్‌ను ఎదుర్కొనే ఛాన్స్ పూరన్‌కు రాలేదు. కానీ నిర్ణయాత్మక ఐదో టీ20లో మాత్రం హార్దిక్ బౌలింగ్ ఆడే అవకాశం నిక్కీకి వచ్చింది. ఈ క్రమంలో హార్దిక్‌కు పూరన్ చుక్కలు చూపించి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. పూరన్ వచ్చిరాగానే మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అందులో రెండు సిక్సర్లు హార్దిక్ ఓవర్లో కొట్టినివే. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన హార్దిక్ బౌలింగ్‌లో ఆఖరి రెండు బంతులను పూరన్ సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 18 బంతులు ఆడి 14 పరుగులు చేసిన పాండ్యా.. అనంతరం బౌలింగ్‌లో అయితే ఘోరప్రదర్శన కనబరిచాడు. 3 ఓవర్లు వేసి 32 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్ In 3rd T20I - Hardik pandya Gave an Overconfident Statement about Nicholas pooran. In 5th T20I - Nicholas Pooran Smashed him all over the park for 6 and 4. This is what I don't like About Hardik Pandya! pic.twitter.com/7XL2X97rn8 — ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) August 13, 2023 Six or nothing for Nicholas Pooran 🔥 A power-packed start for the Calypso batter 👊#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/DLKUNzRUZr — JioCinema (@JioCinema) August 13, 2023 -
ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్?
కరేబియన్ పర్యటనను భారత జట్టు నిరాశతో ముగించింది. ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణాయత్మక ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2తో విండీస్‌కు అప్పగించేసింది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో హార్దిక్ సేన విఫలమైంది. బ్యాటింగ్ అనుకూలించే పిచ్‌పై సూర్యకుమార్, తిలక్ మినహా మిగితాందరూ తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అతడితో పాటు తిలక్ వర్మ(27) పరుగులతో రాణించాడు. ఇక బౌలింగ్‌లో అయితే భారత జట్టు దారుణ ప్రదర్శన కనబరిచారు. విండీస్ బ్యాటర్లు ఓపెనర్ బ్రాండన్ కింగ్(85 నాటౌట్), నికోలస్ పూరన్(47) టీమిండియా బౌలర్లను ఊచకోత కోశారు. భారత బౌలర్లు కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టారు. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. హార్దిక్ చెత్త కెప్టెన్సీ.. ఇక విండీస్‌పై సిరీస్ కోల్పోవడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. హార్దిక్ చెత్త కెప్టెన్సీ వల్లే భారత్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ సైతం దారుణ ప్రదర్శన కనబరిచాడు. India have lost their first T20i series in 25 months. pic.twitter.com/YFhQ8qGuPq — Mufaddal Vohra (@mufaddal_vohra) August 13, 2023 తొలుత బ్యాటింగ్‌లో 18 బంతులు ఆడి 14 పరుగులు చేసిన పాండ్యా.. అనంతరం బౌలింగ్‌లో అయితే ఘోరంగా విఫలమయ్యాడు. 3 ఓవర్లు వేసి 32 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా ఇదేనా నీ ఆట? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొంత మంది ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఓడిపోవడం మంచిదే.. మా బాయ్స్ అద్భుతం! చాలా సంతోషంగా ఉన్నా: హార్దిక్ Hardik Pandya 🤬🤬#IndvsWI pic.twitter.com/Szxd83kwSo — Sachin Tripathi (@sachintrilko95) August 13, 2023 -
ఓడిపోవడం మంచిదే.. మా బాయ్స్ అద్భుతం! చాలా సంతోషంగా ఉన్నా: హార్దిక్
వెస్టిండీస్ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్ మాత్రం ప్రత్యర్ధి జట్టుకు అప్పగించేసింది. ఫ్లోరిడా వేదికగా విండీస్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో భారత్ కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అతడితో పాటు తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు మెరుపులు మెరిపించాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 4 వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బతీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ తలా వికెట్ మాత్రమే సాధించారు. ఇక ఈ సిరీస్ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ ఓటమి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని హార్దిక్ తెలిపాడు. "మేము మొదట్లో వికెట్లు కోల్పోయినప్పటికీ.. సూర్య, తిలక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నేను బ్యాటింగ్‌కు వచ్చే అంతవరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత మేము మా రిథమ్‌ను కోల్పోయాము. స్కోరు వేగాన్ని పెంచడంలో విఫలమయ్యాం. అక్కడ పరిస్థితిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాము. రాబోయే సిరీస్‌ల్లో మేము మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము. ఇక ఈ ఓటమి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఓడిపోవడం కూడా మంచిదవుతుంది. ఎందుకంటే ఈ సిరీస్‌లో మాకు చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. మేము ఈ సిరీస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. యువ ఆటగాళ్ల టాలెంట్‌ను గుర్తించడానికి మాకు చాలా ఉపయోగపడింది. ఈ సిరీస్‌లో మా బాయ్స్ ప్రదర్శన బాగానే ఉంది. మా బాయ్స్ తమ సత్తా ఎంటో చూపించారు. వారి ప్రదర్శన పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతీ ఒక్క ఆటగాడు కొత్తగా ట్రై చేశారు. మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు . వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కూడా ఇక్కడే జరగనుంది. అప్పుడు మరింత మంది అభిమానులు రావడం ఖాయమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: ఐదో టీ20లో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి -
వెస్టిండీస్‌తో ఐదో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! స్పీడ్ స్టార్‌కు ఛాన్స్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో రెండు వరుస విజయాలతో ఊపుందుకున్న టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫోరిడా వేదికగా శనివారం జరిగిన నాలుగో టీ20లో విండీస్‌ను భారత్ చిత్తు చేయడంతో సిరీస్ 2-2 సమమైంది. ఈ క్రమంలో ఇదే వేదికలో ఆదివారం జరగనున్న సిరీస్ డిసైడర్ ఐదో టీ20లో భారత్-విండీస్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు కరేబియన్లు ఈ మ్యాచ్‌లో గెలిచి కనీసం టీ20 సిరీస్‌నైనా తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. చాహల్‌పై వేటు.. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒకే మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ స్ధానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అదే విధంగా ఫ్లోరిడా పిచ్ పేసర్లకు కాస్త అనుకూస్తుంది కాబట్టి ఉమ్రాన్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విండీస్ కూడా ఒకే ఒక మార్పుతో ఆడనున్నట్లు సమాచారం. నాలుగో టీ20లో విఫలమైన ఓడియన్ స్మిత్ స్ధానంలో అల్జారీ జోసఫ్‌ను తిరిగి తీసుకురావాలని విండీస్ జట్టు మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. వెస్టిండీస్ జట్టు (అంచనా): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, రావ్‌మెన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమేరియో షెఫర్డ్, జేసన్ హోల్డర్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఓబెడ్ మెకాయ్ భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ చదవండి: ఇదే నేను ఆశించా.. చాలా సంతోషంగా ఉంది! వారిద్దరూ అద్భుతం: హార్దిక్ -
ఇదే నేను ఆశించా.. వారిద్దరూ అద్భుతం! ఆఖరి మ్యాచ్‌లో కూడా: హార్దిక్
రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్‌కు.. టీమిండియా తమ బ్యాటింగ్ పవర్ చూపించింది. ఫ్లోరిడా వేదికగా విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. 179 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు అలోవకగా ఛేదించింది. భారత విజయంలో ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ కీలక పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో వీరిద్దరూ తొలి వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యశస్వీ జైశ్వాల్(84 నాటౌట్), శుబ్‌మన్ గిల్(77) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో షిమ్రాన్ హెట్‌మైర్(61), షై హోప్(45) పరుగులతో రాణించారు. . భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు, ముఖేష్ కుమార్, చాహల్ తలా వికెట్ సాధించారు. ఇక అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిచాడు. వారిద్దరూ అద్భుతం.. "ఫోరిడాలో ఎక్కువ మంది భారత అభిమానులు మాకు సపోర్ట్ చేయడానికి స్టేడియంకు వచ్చారు. మేము వికెట్ తీసినా, బౌండరీలు బాదినా వారు చప్పట్లు కొట్టి మాకు మద్దతుగా నిలిచారు. మేము కూడా వారికి పూర్తిస్ధాయిలో క్రికెట్ మజాను అందించాము. ఇక ఈమ్యాచ్‌లో గిల్-జైశ్వాల్ ఆడిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. వారిద్దరికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. వారు మ్యాచ్ ఫినిష్ చేసిన విధానం నన్నో ఎంతోగానో అకట్టుకుంది. ముఖ్యంగా జైశ్వాల్.. టీ20ల్లో కూడా తన ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటికే ఐపీఎల్లో అతడి టాలెంట్ ఎంటో చూశాం. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ గెలవాలంటే మేము ఒక యూనిట్‌గా రాణించాలని నేను పదేపదే చెబుతున్నా. బ్యాటింగ్ యూనిట్ బౌలర్లకు సపోర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే బౌలర్లు నిజమైన మ్యాచ్ విన్నర్లు. వారు ఒక రెండు వికెట్లు పడగొడితే చాలు మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఒక కెప్టెన్‌గా మా బాయ్స్ నుంచి ఇటువంటి ప్రదర్శనే నేను ఆశిస్తాను. కెప్టెన్‌గా నా ఆలోచనకే తగ్గట్టే నేను ముందకు వెళ్లాలి అనుకుంటా. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి కాస్త నిరాశ చెందాము. ఎందుకంటే తొలి మ్యాచ్‌ను చిన్నచిన్న తప్పిదాల వల్ల కోల్పోయాము. కానీ మేము ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. ఈ రెండు మ్యాచ్‌ల విజయాలు మాకు చాలా కాన్ఫిడెన్స్ కలిగించాయి. ఆఖరి మ్యాచ్‌లో కూడా ఇదే దూకుడు కనబరిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నామని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన జైశ్వాల్-గిల్ జోడీ.. ఐదేళ్ల తర్వాత! -
వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. గిల్‌పై వేటు! విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్
వెస్టిండీస్‌తో మూడో టీ20లో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫ్లోరిడా వేదికగా శనివారం విండీస్‌తో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని హార్దిక్ సేన భావిస్తోంది. నాలుగో టీ20లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన శుబ్‌మన్ గిల్‌పై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్‌ను తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకురావాలని కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, కోచ్ రాహుల్ ద్రవిడ్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గిల్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇక నాలుగో టీ20 జరిగే ఫ్లోరిడా మైదానం ఫాస్ట్‌బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలో అదనపు పేసర్‌తో టీమిండియా ఆడనున్నట్లు తెలుస్తోంది. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్ధానంలో పేసర్ అవేష్ ఖాన్‌కు తుది జట్టులొ ఛాన్స్ ఇవ్వనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదేవిధంగా అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌ను కొనసాగించే ఛాన్స్ ఉంది. పిచ్ రిపోర్డు ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ మైదానం బ్యాటర్లకు స్వర్గదామం. స్పిన్నర్లకు కాకుండా పేసర్లకు ఈ వికెట్ కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది ఇదే వేదికలో మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ వేదికపై 14 మ్యాచ్‌లు జరగ్గా.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 11 సందర్భాల్లో విజయం సాధించాయి. ఈ నేపధ్యంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. భారత తుది జట్టు(అంచనా) ఇషాన్ కిషన్ ,యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్ చదవండి: Rohit- Virat: నేను, కోహ్లి అందుకే ఆడటం లేదు.. అయినా జడ్డూ గురించి ఎందుకు అడగరు: రోహిత్ -
రన్‌రేట్ అవసరం లేదు.. హార్దిక్ చేసింది ముమ్మాటికీ తప్పే!
వెస్టిండీస్‌తో మూడో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించినప్పటికీ.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కరొంటున్నాడు. యువ సంచలనం తిలక్ వర్మను హాఫ్ సెంచరీ చేయనీవ్వకుండా హార్దిక్ మ్యాచ్ ఫినిష్ చేయడమే ఇందుకు కారణం. తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా.. హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించడం పట్ల ఫ్యాన్స్ ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. తిలక్ వర్మకు తన హాఫ్ సెంచరీని పూర్తి చేసే అవకాశం హార్దిక్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో 49 పరుగులు చేసిన తిలక్ వర్మ.. తన హాఫ్ సెంచరీ మార్క్‌కు కేవలం ఒక్క రన్ దూరంలో ఉండిపోయాడు. తిలక్ వర్మ ఒక అద్భుతం. అతడు బ్యాటింగ్ స్టైల్, దూకుడు నన్ను ఎంతో అకట్టుకుంది. తొలి మూడు ఇన్నింగ్స్‌లో 30కి పైగా పరుగులు చేసిన రెండో భారత ఆటగాడు కూడా. తన రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే విధంగా మూడో మ్యాచ్‌లో కూడా దగ్గరకు వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తూ తన రెండో ఫిప్టీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. సూర్య ఔటైన వెంటనే హార్దిక్ బ్యాటింగ్‌కు వచ్చాడు. నాటౌట్ ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని తిలక్‌కు హార్దిక్ చెప్పాడు. అటువంటి అప్పుడు హార్దిక్ ఎందుకు పెద్ద షాట్లకు ప్రయాత్నించాడో నాకు అర్ధం కావడం లేదు. అక్కడ నెట్రన్ రేట్ కూడా అవసరం లేదు. 13 బంతుల్లో 2 పరుగులు అవసరం. అటువంటి సమయంలో సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. నావరకు అయితే సింగిల్ తీసి తిలక్‌కు హార్దిక్ ఇవ్వాల్సింది. అయితే వ్యక్తిగత మైలురాళ్ల గురించి పట్టించుకోకూడదని హార్దిక్ అలా చేశాడమో" అని తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: IND Vs WI 3rd T20I: మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది? పాపం తిలక్ వర్మ -
మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది?
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ మరో సారి సత్తాచాటాడు. గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో తిలక్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హైదరాబాదీ.. సూర్యకుమార్‌తో కలిసి 83 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను బౌండరీలుగా మలిచి తన ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఇక అద్భుత ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మ.. అయితే తృటిలో తన రెండో హాఫ్ సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. 37 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 49 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆఖరిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే తిలక్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోపోవడానికి టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే కారణమని పలువరు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే.. భారత్ విజయానికి 2 పరుగులు మాత్రమే అవసరమైన నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు స్ట్రైక్ వెళ్లింది. ఆ ఓవర్లో ఇంకా రెండు బంతులు మిగిలిండడంతో హార్దిక్ సింగిల్ తీసి తిలక్ వర్మకు స్ట్రైక్ ఇస్తాడని అంతా భావించారు. దీంతో తిలక్ తన హాఫ్ సెంచరీని పూర్తిచేసుకుంటాడని కామెంటేటర్లు సైతం చెప్పుకొచ్చారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం ఎవరూ ఊహించని విధంగా సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. దీంతో తిలక్ 49 పరుగులతో నాన్‌స్ట్రైక్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. ధోనిని చూసి నేర్చుకో.. ఇక హార్దిక్ సిక్స్‌తో మ్యాచ్ ఫినిష్ చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. హార్దిక్ చాలా స్వార్థపరుడని, నాయకత్వ లక్షణాలు అతడికి లేవంటూ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మరి కొంత మంది ధోనిని చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో సందర్భాల్లో ధోని.. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న బాట్లర్లు ఏదైనా మైలురాయికి దగ్గరగా ఉన్నప్పుడు ఢిఫెన్స్ ఆడి వారికి స్ట్రైక్ వచ్చేలా చేసేవాడు. 2014 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో.. భారత విజయానికి ఆఖరి 7 బంతుల్లో ఒక్క పరుగు కావాలి. 19 ఓవర్ ఆఖరి బంతికి స్ట్రైక్‌లో ఉన్న ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడని అంతా భావించారు. కానీ ధోని విన్నింగ్ షాట్ కొట్టకుండా ఢిపెన్స్ ఆడి కోహ్లికి స్ట్రైక్ ఇచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికే కోహ్లి ఫోర్ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 72 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. మా సత్తా చూపించాం! అతడు మరోసారి: హార్దిక్ Most Punchable Face Right now! Hardik Pandya is the most SELFISH Player i have ever seen! Oh Tilak 💔 pic.twitter.com/abNhCAP73a — ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) August 8, 2023 Most hated 6 by #HardikPandya #INDvsWI #TilakVarma #BCCI pic.twitter.com/U7WVQrN4xC — Lexicopedia (@lexicopedia1) August 8, 2023 When MS Dhoni let Virat Kohli lay the finishing touch 📹 Revisit the sweet gesture by captain Dhoni from the 2014 T20 World Cup semi-final against South Africa 🇮🇳 pic.twitter.com/EKcWsCh9r1 — ICC (@ICC) December 23, 2020 -
చాలా సంతోషంగా ఉంది.. మా సత్తా చూపించాం! అతడు మరోసారి: హార్దిక్
గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ గెలిచే అవకాశాలను భారత జట్టు సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను కట్టడి చేసిన భారత్.. ఆ తర్వాత సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో బ్రెండన్ కింగ్(42), రావ్మన్ పావెల్(40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. సూర్య ప్రతాపం.. ఇక 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. అరంగేట్ర ఆటగాడు యశస్వి జైస్వాల్ (1) ప్రభావం చూపలేకపోగా గిల్ (6) నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. అతడితో పాటు యువ బ్యాటర్ తిలక్ వర్మ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లో 49 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని హార్దిక్ సేన ఛేదించింది. దీంతో సిరీస్ అధిక్యాన్ని 1-2 భారత్ తగ్గించింది. కీలక మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఆఖరి మూడు మ్యాచ్‌లు మాకు చాలా ముఖ్యమని బాయ్స్‌కు ముందే చెప్పాను. వరుసగా రెండు ఓటములు మా జట్టుపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అలా అని మా ప్రణాళికలు కూడా మేము మార్చుకోలేదు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లలో మేము ఎలా ఆడాతామన్నది చూపించాం. పూరన్ కాస్త ఆలస్యంగా బ్యాటింగ్ రావడం మాకు చాలా సహాయపడింది. ఎందుకంటే మా పేసర్లను డెత్ బౌలింగ్ వరకు ఉంచగల్గాను. పూరన్ క్రీజులో లేకపోవడంతో అక్షర్ కూడా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. పూరన్‌కు వ్యతేరేకంగా మేము పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాం. అతడు క్రీజులో ఉన్నప్పుడు నేనే బౌలింగ్ చేయాలని నిర్ఱయించుకున్నాం. కాబట్టి నిక్కీ(పూరన్) హిట్టింగ్ చేయలాంటే నా బౌలింగ్‌లోనే చేయాలి. ఇటువంటి పోటీని నేను ఆనందిస్తాను. ఈ మాటలు పూరన్ వింటాడని నాకు తెలుసు. బహుశా నాలుగో టీ20లో నన్ను టార్గెట్ చేయవచ్చు. ఈ మ్యాచ్‌లో మేము ఏడుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాము. బ్యాటర్లు కలిసికట్టుగా రాణిస్తే ఎనిమిదో నంబర్లో ఎవరున్న అవసరం లేదు. సూర్య మరోసారి తనంటో చూపించాడు. సూర్యకుమార్ లాంటి ఆటగాడు జట్టులో వుంటే ఇతరలకు ఆదర్శంగా నిలుస్తాడు. ఇక తిలక్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడని హార్దిక్ పోస్ట్ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: సూర్య సంచలన ఇన్నింగ్స్.. మూడో టీ20లో భారత ఘన విజయం -
వెస్టిండీస్‌తో మూడో టీ20.. కిషన్‌పై వేటు! యువ సంచలనం ఎంట్రీ
గయానా వేదికగా వెస్టిండీస్‌తో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. మంగళవారం విండీస్‌తో జరగనున్న మూడో టీ20లో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైతే సిరీస్‌ను కోల్పోతుంది. ఎందుకంటే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ ఇప్పటికే 2-0 అధిక్యంలో ఉంది. దీంతో ఈ కీలక మ్యాచ్‌లో సరైన కాంబనేషన్తో బరిలోకి దిగాలని భారత జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టి, యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా తొలి రెండు టీ20ల్లో విఫలమైన సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సంజూ వికెట్ కీపింగ్ బాధ్యతలు చెపట్టే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. గత మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. కుల్దీప్ జట్టులోకి వస్తే మరో స్పిన్నర్ బిష్ణోయ్ బెంచ్‌కే పరిమితమవ్వల్సి వస్తుంది. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా అకట్టుకోపోయిన ముఖేష్ కుమార్‌ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను అవకాశం ఇవ్వాలని హార్దిక్ పాండ్యా, కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రెండు మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంతో వెస్టిండీస్ సిరీస్‌పై కన్నేసింది. మూడో టీ20లో ఎటువంటి మార్పులు లేకుండా విండీస్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక విండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్‌ను భారత బౌలర్లు ఎంతవరకు అడ్డుకుంటారో వేచి చూడాలి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. తుది జట్లు(అంచనా) భారత్: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్ విండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ చదవండి: Global T20 Canada: ఇదెక్కడి అవార్డురా బాబు?.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అర ఎకరం భూమి -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. తొలి భారత క్రికెటర్‌గా!
టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 4000 పరుగులతో పాటు 150 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా హార్దిక్ చరిత్ర సృష్టించాడు. గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో బ్రాండన్ కింగ్‌ను ఔట్ చేసిన హార్దిక్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో ఇప్పటివరకు హార్దిక్ ఇప్పటివరకు 4391 పరుగులతో పాటు 152 వికెట్లు పడగొట్టాడు. కాగా టీ20ల్లో హార్దిక్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015 ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ సారధిగా వ్యవహరిస్తున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 123 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా, 30.38 సగటుతో 2309 పరుగులు చేశాడు. అదే విధంగా 2016లో ఎంస్ ధోని సారధ్యంలో అంతర్జాతీయ క్రికెట్లోకి హార్దిక్ అడుగుపెట్టాడు. అనంతరం భారత జట్టులో కీలక ఆటగాడిగా ఈ గుజరాత్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వరుసగా రెండో ఓటమి.. కరేబియన్ పర్యటనలో టీమిండియా మరో ఓటమి చవిచూసింది. గయానా వేదికగా విండీస్‌తో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్‌తో 51 పరుగులు చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్(27), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(24) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్ దారుణంగా విఫలం అయ్యారు. విండీస్ బౌలర్లలో అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, చహల్ రెండు, అర్ష్‌దీప్, ముఖేష్ కుమార్ తలా వికెట్ సాధించారు. చదవండి: #Sarfaraz Khan: కశ్మీర్ యువతిని పెళ్లాడిన ముంబై క్రికెటర్.. ఫోటోలు, వీడియోలు వైరల్! -
'అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి'
కరేబియన్ గడ్డపై టీమిండియాకు మరో షాక్ తగిలింది. గయనా వేదికగా స్టిండీస్తో జరిగిన రెండో టీ20లో కూడా భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం చవి చూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి అతిథ్య విండీస్ దూసుకువెళ్లింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, చహల్ రెండు, అర్ష్‌దీప్, ముఖేష్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఇక వరుసగా రెండో ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిచాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని హార్దిక్ చెప్పుకొచ్చాడు. కొంచెం బాధ్యత తీసుకోవాలి "ఈ మ్యాచ్‌లో మా స్ధాయికి తగ్గట్టు బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయాం. మేము ఇంతకన్న బాగా బ్యాటింగ్ చేయగలము. ఈ పిచ్‌పై 160 పైగా పరుగులు చేసి ఉంటే కచ్చితంగా పోటీ ఇచ్చే వాళ్లం. మాకు బౌలింగ్‌లో అద్భుతమైన ఆరంభం వచ్చింది. 2 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌పై ఒత్తిడి పెంచాము. కానీ పూరన్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ఇది మేము అస్సలు ఊహించలేదు. స్పిన్నర్లను రోటాట్ చేయడం చాలా కష్టం. పూరన్ స్పిన్నర్లనే టార్గెట్ చేశాడు. మేము ఈ మ్యాచ్‌లో 7 మంది బ్యాటర్లతో బరిలోకి దిగాము. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఆడాలి. అప్పుడే మనం విజయం సాధించగలం. మేము తదుపరి మ్యాచ్‌లో సరైన బ్యాలెన్స్‌తో బరిలోకి దిగుతాం. ఇక తిలక్ వర్మ గురించి ఎంత చెప్పిన తక్కువే. నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. తిలక్‌కు ఇది రెండో అతర్జాతీయ మ్యాచ్‌గా నాకు అనిపించలేదు. అతడి బ్యాటింగ్ చూస్తే ఏదో వందో మ్యాచ్ ఆడుతున్నట్లు అనిపించింది పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. రెండో భారత ఆటగాడిగా! పంత్ రికార్డు బద్దలు -
విండీస్‌తో రెండో టీ20.. శుబ్‌మన్ గిల్‌పై వేటు! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. ఆగస్టు 6న గయానా వేదికగా భారత్-విండీస్ మధ్య రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా తమ తుది జట్టులో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన శుబ్‌మన్ గిల్‌ను రెండో టీ20కు పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటిన యశస్వీ.. టీ20ల్లో అరంగేట్రం కోసం అతృతగా ఎదురుచూస్తున్నాడు. అదే విధంగా తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన ముఖేష్‌కుమార్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడి స్ధానంలో మరోపేసర్ అవేష్ ఖాన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు విండీస్ మాత్రం తొలి టీ20లో బరిలోకి దిగిన జట్టుతోనే ఈ మ్యాచ్ కూడా ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పిచ్ రిపోర్ట్: గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. వికెట్ ప్లాట్‌గా ఉంటుంది కాబట్టి బ్యాటర్లు చెలరేగడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే వికెట్ పాతబడ్డకొద్ది కాస్త స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా) భారత్: యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్. విండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ చదవండి: ING vs ENG: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పంత్ వచ్చేస్తున్నాడు!140 కి.మీ. వేగంతో -
వెస్టిండీస్‌తో తొలి టీ20.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్! వీడియో వైరల్
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆరంభానికి ముందు టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం ఆలపించే సమయంలో ఉబికి వస్తున్న కన్నీరును హార్దిక్ ఆపుకోలేకపోయాడు. తన చేతులతో కన్నీటిని తుడుచుకుంటూ హార్దిక్ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విండీస్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ దూరంకావడంతో హార్దిక్ పాండ్యా భారత జట్టు సారధిగా వ్యవహరిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్ చేతిలో 4 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత్ విజయానికి ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరమవ్వగా.. విండీస్ బౌలర్ షెపర్డ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ(39) మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. విండీస్ బౌలరల్లో మెకాయ్, హోల్డర్, షెపర్డ్ తలా రెండు వికెట్లు సాధించగా, అకేల్ హోసేన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. కెప్టెన్ పావెల్(48), పూరన్(41) పరుగులతో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక భారత్-విండీస్ మధ్య రెండో టీ20 ఆగస్టు6న గయానా వేదికగా జరగనుంది. చదవండి: #Tilak Varma: అరంగేట్రంలోనే అదుర్స్.. తొలి 3 బంతుల్లోనే 2 సిక్స్‌లు! వీడియో వైరల్ Hardik Pandya got emotional during the national anthem. pic.twitter.com/5VH2kM8cdf — Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2023 -
అస్సలు నేను ఊహించలేదు.. కొన్ని తప్పులు చేశాం! అతడొక సంచలనం: హార్దిక్ పాండ్యా
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. ట్రినిడాడ్ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత్ విజయానికి ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరమవ్వగా.. షెపర్డ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక భారత బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. తిలక్ మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. విండీస్ బౌలరల్లో మెకాయ్, హోల్డర్, షెపర్డ్ తలా రెండు వికెట్లు సాధించగా, అకేల్ హోసేన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. కెప్టెన్ పావెల్(48), పూరన్(41) పరుగులతో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ తొలి టీ20లో ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయామని హార్దిక్ తెలిపాడు. అతడొక సంచలనం.. కొంచెం కూడా భయపడలేదు లక్ష్యమేమి మరి అంత పెద్దది కాదు. మేము టార్గెట్‌ను సునాయసంగా ఛేజ్ చేస్తామని భావించాను. మా ఇన్నింగ్స్ మధ్య వరకు గెలుపు దిశగానే సాగింది. కానీ మేము కొన్ని తప్పులు చేశాం. అందుకే మేము ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైం. మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ఎక్కడైనా యువ జట్టు చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. టీ20 క్రికెట్లో వరుసగా వికెట్లు కోల్పోతే లక్ష్యాన్ని ఛేదించడం కొంచెం కష్టమవుతుంది. సరిగ్గా మా విషయంలో కూడా అదే జరిగింది. ఆ సమయంలో ఒకట్రెండు భారీ షాట్లు మా నుంచి వచ్చి వుంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఇక ఇక్కడి పరిస్ధితులకు అనుగుణంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాం. కుల్దీప్, చాహల్ మణికట్టు స్పిన్నర్లగా, అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకున్నాం. ముఖేష్ కుమార్ టీ20ల్లో కూడా అరంగేట్రం చేశాడు. అతడు వికెట్లు సాధించికపోయినప్పటికీ డెత్ ఓవర్లలో అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడు మూడు ఫార్మాట్లలోనూ డెబ్యూ చేశాడు. అదే విధంగా తిలక్ వర్మ ఒక యువ సంచలనం. తొలి మ్యాచ్‌లో తిలక్ ఆడిన ఇన్నింగ్స్ నన్ను ఎంతోగానే అకట్టుకుంది. అతడు సిక్సర్లతో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. అతడిలో కొంచెం కూడా భయం కనపడలేదు. కచ్చితంగా అతడు భారత్ తరపున అద్భుతాలు సృష్టిస్తాడు. ఇక ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలిన్నాయి. మా తదుపరి మ్యాచ్‌లో మెరుగ్గా రాణిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు -
వెస్టిండీస్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్
వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటన చివరి అంకానికి చేరుకుంది. కరేబియన్ టూర్లో చివరి సిరీస్ ఆడేందుకు భారత జట్టు సిద్దమైంది. ట్రినిడాడ్ వేదికగా గురువారం నుంచి భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. బ్రియాన్ లారా స్టేడియంలో జరగనున్న తొలి టీ20లో సత్తా చాటేందుకు హార్దిక్ పాండ్యా సారధ్యంలోని యువ భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఈ సిరీస్‌కు రోహిత్, కోహ్లిలకు సెలక్టర్లు ముందే విశ్రాంతి ఇచ్చారు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ మరో రెండు వికెట్ల సాధిస్తే.. టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలు రాయిని అందుకుంటాడు. తద్వారా టీ20 క్రికెట్లో 4000 పరుగులతో పాటు 150 వికెట్లు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. టీ20 క్రికెట్లో హార్దిక్ ఇప్పటివరకు 4348 పరుగులతో పాటు 148 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఓ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ మరో నాలుగు వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్ల పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో చేరుతాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా యుజువేంద్ర చాహల్‌ను కుల్దీప్ అధిగమిస్తాడు. చాహల్ 34 మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించాడు. కుల్దీప్ ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడి 46 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ! హైదరాబాదీ కూడా -
చాలా బాధగా ఉంది.. మా ఓటమికి కారణం అదే! అతడొక అద్భుతం: హార్దిక్
వెస్టిండీస్ టూర్లో టీమిండియా జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. బార్బోడస్ వేదికగా విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్, గుడకేశ్ మోతీ తలా మూడో వికెట్లతో భారత జట్టును దెబ్బతీయగా..అల్జారి జోసెఫ్ రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలకు విశ్రాంతి ఇచ్చారు. దీంతో హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు నాయకత్వం వహించాడు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ (63 నాటౌట్), కార్టీ(48) పరుగులతో రాణించారు. ఇక దారుణ పరాజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమనేని హార్దిక్ అంగీకరించాడు. "ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరించింది. మేము బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాం. అయితే తొలి ఇన్నింగ్స్ తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలించింది. కానీ అది ప్రధాన సమస్య కాదు. మేము ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. మా ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా కిషన్ బ్యాటింగ్ తీరు నన్ను ఎంతో ఆకట్టుకుంది. కిషన్ తన ఫామ్‌ను కొనసాగించడం భారత క్రికెట్ చాలా ముఖ్యం. ఇక బౌలింగ్‌లో ఠాకూర్ తన వంతు ప్రయత్నం చేశాడు. ఆరంభంలో రెండు వికెట్లు పడగొట్టి మా ఆశలను సజీవంగా నిలిపాడు. కానీ హోప్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను మా నుంచి లాగేసాడు. వరల్డ్‌కప్‌కు మేము సన్నద్దమవుతున్నాము కాబట్టి నేను కూడా మరిన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మా ప్రపంచ సన్నహాకాలు అంతా సవ్యంగా సాగుతాయి అని ఆశిస్తున్నా. ఇది కుర్రాళ్లను పరీక్షించే సమయం. ఇక ప్రస్తుతం 1-1తో సిరీస్ సమమైంది. కాబట్టి ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంటామని అశిస్తున్నా" అని హార్దిక్ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో చెప్పుకొచ్చాడు. -
అయ్యో హార్దిక్.. దురదృష్టమంటే నీదే! అస్సలు అది ఔటా! వీడియో వైరల్
బార్బోడస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను దురదృష్టం వెంటాడింది. ఊహించని రీతిలో హార్దిక్ రనౌటయ్యాడు. ఏం జరిగిందంటే? భారత ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన విండీస్ స్పిన్నర్ యాన్నిక్ కరియా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ స్ట్రైట్‌గా ఆడాడు. ఈ క్రమంలో కార్నియా క్యాచ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే బంతి అతడి చేతుల్లోంచి బౌన్స్ అయి నేరుగా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో స్టంప్స్‌ను తాకింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా కాస్త క్రీజు నుంచి ముందు ఉన్నట్లు అన్పించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే తొలుత రిప్లేలో హార్దిక్ క్రీజుకు చేరుకున్నప్పటికీ, బెయిల్స్ పడినప్పుడు మాత్రం బ్యాట్ గాలిలో ఉన్నట్లు కన్పించింది. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ పాండ్యాను రనౌట్‌గా ప్రకటించాడు. దీంతో 5 పరుగులు చేసిన హార్దిక్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అస్సలు పాండ్యాది ఔటా? ఇక పాండ్యాపై రనౌట్‌పై బిన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాండ్యాది నౌటాట్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ఐసీసీ కొత్త రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ పరుగు తీసే సమయంలో డైవ్ కొడుతూ బ్యాట్‌ను ముందుగా ఒకసారి గ్రౌండ్‌ను తాకి ఉంచితే చాలు. ఆ తర్వాత అదే బ్యాట్ గాలిలో ఉంచినప్పటికీ తొలుత జరిగిన చర్యనే పరిగిణలోకి తీసుకోవాలి. అంటే బ్యాట్ గాలిలో ఉండగా స్టంప్ప్‌ను గిరాటేసినప్పటికీ.. బ్యాటర్ మందుగా క్రీజులో బ్యాట్‌ను ఉంచాడు కాబట్టి నాటౌట్‌గా ప్రకటించాలి. కానీ హార్దిక్ విషయంలో మాత్రం విండీస్‌కు ఫేవర్ థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. చదవండి: నేను అస్సలు ఊహించలేదు.. కానీ క్రెడిట్ మొత్తం వాళ్లకే! అతడు సూపర్: రోహిత్ శర్మ ☝️dismissed by a whisker🤏#Windies secure the big wicket of #HardikPandya 🫤 Keep watching #WIvIND - LIVE & FREE on #JioCinema in 11 languages ✨ #SabJawaabMilenge pic.twitter.com/00TiGVvFhs — JioCinema (@JioCinema) July 27, 2023 -
రోహిత్ వద్దు.. ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హజరీలో పాండ్యానే టీమిండియాకు సారధ్యం వహిస్తున్నాడు. టీ20ల్లో అయితే గత కొన్ని సిరీస్‌ల నుంచి నాయకత్వం వహిస్తున్న హార్దిక్.. జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. ఐపీఎల్లో కూడా కెప్టెన్‌గా హార్దిక్ విజయవంతమయ్యాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత వైట్‌బాల్ క్రికెట్లో రోహిత్ శర్మను తప్పించి టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా హార్దిక్‌ను నియమించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. రోహిత్‌ను కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రోహిత్ భారత జట్టు పగ్గాలు చేపట్టాక...వరుసగా ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఈ క్రమంలో రోహిత్‌ను తప్పించి మరోక ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది మాజీలు బీసీసీఐకి సూచిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి తన అభిప్రాయాలను వెల్లడించాడు. "వన్డే ప్రపంచకప్ తర్వాత వైట్-బాల్ క్రికెట్లో టీమిండియా కెప్టెన్సీని హార్దిక్ పాండ్యా చేపట్టాలని నేను భావిస్తున్నాను. ప్రపంచకప్‌లో మాత్రం భారత్ జట్టుకు రోహిత్ శర్మనే నాయకత్వం వహించాలి. రోహిత్ కూడా అద్భుతమైన లీడర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడం అంత సులభం కాదు. ఒత్తడి ఎక్కువగా ఉంటుంది. అది అతడి వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపిస్తోంది" అని ది వీక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: భారత జట్టులో నో ఛాన్స్.. సెలక్టర్లకు కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ -
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ!
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత జట్టు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది. అనంతరం వచ్చే నెలలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు బీసీసీఐ వచ్చే వారంలో భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తిరిగి మళ్లీ టెస్టులకు పిలుపునివ్వాలి భారత సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా వెన్ను గాయం కారణంగా 2018 తర్వాత ఇప్పటి వరకూ హార్దిక్ పాండ్యా టెస్టు మ్యాచ్ ఆడలేదు. "టెస్టులకు హార్దిక్ మాకు కచ్చితంగా మంచి ఎంపిక. కానీ తను ఫిట్‌గా ఉన్నాని, తిరిగి టెస్టుల్లో రీ ఎంట్రీ ఇస్తానని పాండ్యానే స్వయంగా ముందుకు రావల్సి ఉంటుంది. సెలక్టర్లు మాత్రం అతడిని రెడ్‌బాల్ క్రికెట్‌కు ఎంపిక చేయాలని ఆసక్తిగా ఉన్నారు. కానీ తుది నిర్ణయం మాత్రం పాండ్యానే తీసుకోవాల్సి ఉంటుంది. హార్దిక్ ఫిట్నెస్ టెస్టు క్రికెట్‌కు సరిపోతుందో లేదో తనకే తెలియాలి" ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నాడు. చదవండి: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎవరి సాయం లేకుండా మెట్లెక్కేసిన పంత్! వీడియో వైరల్ -
విండీస్‌తో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా హార్దిక్! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ! రింకూ కూడా
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అనంతరం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిధ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.ఈ సిరీస్‌లు జూలై-ఆగస్టులో జరగనున్నాయి. అయితే టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీకి భారత సెలెక్టర్లు విశ్రాంతినివ్వబోతున్నట్లు సమాచారం. వీరి స్థానంలో ఐపీఎల్లో అదరగొట్టిన రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ వంటి యవ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్లో సత్తాచాటిన వెటరన్ పేసర్ మొహిత్ శర్మ కూడా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. అదే విధంగా హార్దిక్ డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో యువ క్రికెటర్లను తయారు చేసి పనిలో బీసీసీఐ పడింది. చదవండి: WTC Final 2023: మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు, ఒక వేళ ఓడినా: ద్రవిడ్ -
WTC Final: అతడు భారత జట్టులో ఉండాల్సింది.. ఎక్స్ ఫ్యాక్టర్ అయి ఉండేవాడు: పాంటింగ్
జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన ప్రాక్టీస్‌లో బీజీబీజీగా గడుపుతోంది. ఈ మెగాఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టె్న్ రికీ పాంటింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండి బాగుండేదని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా పాండ్యా గత కొంత కాలంగా కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. వెన్ను గాయం కారణంగా 2018 తర్వాత ఇప్పటి వరకూ హార్దిక్ పాండ్యా టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఎక్స్ ఫ్యాక్టర్ అయి ఉండేవాడు.. "డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో హార్దిక్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్ ఉండాల్సింది. అతడిని ఎంపికచేసి ఉంటే భారత జట్టు మరింత బలంగా ఉండేది. అయితే టెస్టు క్రికెట్ తన శరీరంపై మరింత భారాన్ని మోపుతుందని గతంలో హార్దిక్ చెప్పాడన్న సంగతి నాకు తెలుసు. కానీ ఇది కేవలం ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే కదా. అతడు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్-2023లో ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు బౌలింగ్ చేశాడు. అదే విధంగా అతడి బౌలింగ్‌లో మంచి పేస్ కూడా ఉంది. హార్దిక్ జట్టులో ఉండి ఉంటే కచ్చితంగా ఎక్స్ ఫ్యాక్టర్ అయి ఉండేవాడు" అని దిఐసీసీ రివ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: ఇటువంటి అద్భుతాలు సర్ జడేజా ఒక్కడికే సాధ్యం.. చాలా సంతోషంగా ఉంది: రైనా -
ముంబైతో కీలక పోరు.. గుజరాత్ జట్టులోకి స్టార్ బౌలర్! అతడు కూడా
ఐపీఎల్-2023లో క్వాలిఫియర్-2 సమరానికి రంగం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే28న అహ్మదాబాద్ వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. ఇక క్వాలిఫియర్-1లో సీఎస్కే చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్.. ఎలాగైనా క్వాలిఫియర్-2లో విజయం సాధించి రెండో సారి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు లక్నోపై విజయంతో గెలుపుజోష్లో ఉన్న ముంబై.. అదే జోరును గుజరాత్‌పై కొనసాగించి ఆరో సారి ఫైనల్‌కు చేరాలని యోచిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. దసున్ షనక స్థానంలో ఐరీష్ పేసర్ జాషువా లిటిల్ తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. అదే విధంగా దర్శన్ నల్కండే స్థానంలో యువ బ్యాటర్ సాయిసుదర్శన్‌ను తీసుకురావాలని గుజరాత్ మెనెజ్‌మెంట్ భావిస్తన్నట్లు సమాచారం. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం లక్నోపై ఆడిన టీమ్‌తో బరిలోకి దిగనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ మ్యాచ్ శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. తుది జట్లు(అంచనా) గుజరాత్ టైటాన్స్: శబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్ ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆకాష్ మధ్వల్ చదవండి: AFG vs IND: ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ -
ఓడిపోయాం అంతే.. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు! మళ్లీ సీఎస్కేతోనే: హార్దిక్
ఐపీఎల్-2023లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫియర్-1లో 15 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 157 పరుగులకు ఆలౌటైంది. కాగా తొలి క్వాలిఫియర్‌లో ఓటమిపాలైన గుజరాత్‌కు ఫైనల్‌కు చేరేందుకు మరో అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. మే26న అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫియర్-2లో లక్నో లేదా ముంబైతో గుజరాత్ తలపడనుంది. 'Twas a well-contested match. Well-played, @ChennaiIPL 🤝#GTvCSK | #PhariAavaDe | #TATAIPL 2023 | #Qualifier1 pic.twitter.com/7F2QtnpDtE — Gujarat Titans (@gujarat_titans) May 23, 2023 ఇక సీఎస్కే చేతిలో ఓటమిపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. మళ్లీ ఫైనల్లో ధోని సారథ్యంలో సీఎస్కేతో తలపడాలని భావిస్తున్నట్లు హార్దిక్ తెలిపాడు. "తొలుత బౌలింగ్‌లో మేము అంతగా రాణించలేకపోయాం. అదనంగా 15 పరుగులు ఇచ్చామని నేను అనుకుంటున్నాను. మా ప్లాన్స్‌ను సరిగ్గానే అమలు చేశాం. మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా రాణించి పరుగులను కట్టడి చేశారు. కానీ డెత్ ఓవర్లలో మాత్రం పరుగులు సమర్పించుకున్నారు. What #CaptainPandya said 💪🏻⚡@hardikpandya7 | #PhariAavaDe | #TATAIPL 2023 Playoffs pic.twitter.com/WWcT67rv1T — Gujarat Titans (@gujarat_titans) May 24, 2023 ఇక దోని తన మాస్టర్ మైండ్‌ను మరోసారి ఉపయోగించాడు. తన బౌలర్లను మార్చి మార్చి ఉపయోగిస్తూ.. మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయేలా చేశాడు. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం ఎంఎస్కే దక్కుతుంది. ఇక ఈ ఓటమి గురించి పెద్దగా ఆలోచించాలల్సిన అవసరం లేదు. మళ్లీ మేము రెండు రోజుల తర్వాత క్వాలిఫియర్-2లో ఆడబోతున్నాం. "𝐖𝐞 𝐚𝐫𝐞 𝐠𝐨𝐢𝐧𝐠 𝐭𝐨 𝐥𝐞𝐚𝐫𝐧 𝐟𝐫𝐨𝐦 𝐨𝐮𝐫 𝐦𝐢𝐬𝐭𝐚𝐤𝐞𝐬." 💪🏻 Plenty of positives to takeaways as Rashid Khan reflects on a tough night for the Titans and pledges to give it their all ahead of Qualifier 2! @rashidkhan_19 | #PhariAavaDe #TATAIPL 2023 Playoffs pic.twitter.com/6qVINbrW6h — Gujarat Titans (@gujarat_titans) May 24, 2023 మాకు ఫైనల్ చేరేందుకు మంచి అవకాశం. ఇక్కడ గెలిచి మళ్లీ ఫైనల్లో సీఎస్కేతో తలపడేందుకు ప్రయత్నిస్తాం. అదే విధంగా నా సోదరుడు కృనాల్ సారథ్యంలోని లక్నో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతోంది. అహ్మదాబాద్‌లో సెకెండ్ క్వాలిఫియర్‌లో మేము ఇద్దరం తలపడాలని ఆశిస్తున్నాను" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 10వ సారి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఫైనల్‌కు చేరింది. కాగా మే28న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరగనుంది. చదవండి: IPL 2023 QF 1: ఎవరి తరం కాలేదు గుజరాత్ మెడలు వంచడం.. సీఎస్కే చేసి చూపించింది..! -
గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఎవరి బలమెంత..?
-
చాలా సంతోషంగా ఉంది.. అతడొక అద్భుతం! కొత్తగా కనిపించాడు: హార్దిక్
ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ జైత్ర యాత్ర కొనసాగుతుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం ఇర్ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే గుజారాత్ ఛేదించింది. గుజరాత్ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కాగా ఇదే మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(101) కూడా సెంచరీతో చెలరేగాడు. ఇక ఈ అద్భుత విజయంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. సెంచరీతో చెలరేగిన గిల్‌పై పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ మ్యాచ్‌ను మా బాయ్స్ అద్భుతంగా ఫినిష్ చేశారు. మా రిథమ్‌ను కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. ఇక గిల్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన షాట్లు అద్భుతమైనమైనవి. ఈ రోజు సరికొత్త గిల్‌ను చూశాను. అతడు స్టేడియం నలుమూలలా షాట్లు ఆడాడు. బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా హిట్టింగ్ చేశాడు. ఒక ఎండ్‌లో గిల్ ఇటువంటి ఇన్నింగ్స్ ఆడుతుంటే మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్లో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అయితే మేము బౌలింగ్‌లో విఫలమయ్యాం. విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. డెత్ ఓవర్లలో విరాట్‌ను కట్టడి చేయలేకపోయాం. మా ప్రణాళికలు విఫలమయ్యాయి. గతేడాది మేము అద్భుతంగా రాణించాం. కానీ ఏడాది సీజన్లో ప్రతీ మ్యాచ్ మాకు సవాలుగా మారింది. అయినప్పటికీ మా బాయ్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు చదవండి: #Shubman Gill: కాస్తైనా సిగ్గుపడండి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారాలా.. Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
IPL 2023: ఎస్ఆర్హెచ్పై ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు గుజరాత్
ఎస్ఆర్హెచ్పై ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు గుజరాత్ ఐపీఎల్-2023లో ప్లేఆఫ్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా నిష్క్రమించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 150 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(64) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో షమీ, మొహిత్ శర్మ చెరో నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్‌ను దెబ్బతీయగా.. యష్ దయాల్ ఒక్క వికెట్ సాధించాడు. అదే విధంగా ఈ ఏడాది సీజన్లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా గుజరాత్ నిలిచింది. 13 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 97/7 13 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 13 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 97 పరుగులుచేసింది. క్లాసెన్(48), భువనేశ్వర్ కుమార్(11) పరుగులతో ఉన్నారు. 50 పరుగులకే 6 వికెట్లు ఎస్ఆర్హెచ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతోంది. కేవలం 50 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. మొహిత్ శర్మ బౌలింగ్‌లో సన్విర్ సింగ్, అబ్దుల్ సమద్ పెవిలియన్‌కు చేరారు. 29 పరుగులకే 4 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్ 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ కేవలం 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మార్క్రమ్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో మార్క్రమ్(10) ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 29/3 4 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(10), క్లాసెన్(7) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన అభిషేక్.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన అన్మోల్ప్రీత్ సింగ్.. షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సెంచరీతో చెలరేగిన గిల్.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 189 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(58 బంతుల్లో 101) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు సాయిసుదర్శన్(47) పరుగులతో రాణించాడు. కాగా ఓ దశలో గుజరాత్ స్కోర్ బోర్డు 200 పరుగులు ఈజీగా దాటుతుందని అంతా భావించారు. కానీ డెత్ ఓవర్లలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ మరోసారి తన అనుభవాన్ని కనబరిచాడు. ఆఖరి ఓవర్ వేసిన భువీ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు సాధించాడు. సెంచరీతో చెలరేగిన గిల్ ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజకాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా గిల్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ. 19 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 186/5 నాలుగో వికెట్ డౌన్ గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్‌లో 7 పరుగులు చేసిన డెవిడ్ మిల్లర్ పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 171/4 మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. గుజరాత్ టైటాన్స్ మరో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(8) పెవిలియన్‌కు చేరాడు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు వికెట్ సాధించింది. 47 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. జానెసన్ బౌలింగ్‌లో నటరాజన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 147 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 154/2 12 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ స్కోర్: 131/1 12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో గిల్(77), సాయి సుదర్శన్(43) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 89/1 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ దూకుడుగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. శుబ్మాన్ గిల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 22 బంతుల్లో గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడితో పాటు క్రీజులో సాయిసుదర్శన్(23) పరుగులతో ఉన్నాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 65/1 ఆరు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో గిల్(36), సాయిసుదర్శన్(21) పరుగులతో ఉన్నారు. 3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 32/1 మూడు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో గిల్(10), సాయిసుదర్శన్(14) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా డకౌట్‌గా వెనుదిరగాడు. ఐపీఎల్-2023 సీజన్ లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరాయి. ఈ క్యాష్ రిచ్లో లీగ్‌లో భాగంగా సోమవారం ఆహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక శ్రీలంక కెప్టెన్ దసున్ షనక గుజరాత్ టైటాన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. తుది జట్లు: సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, సన్విర్ సింగ్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, టి నటరాజన్ గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, బి సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్ -
మేమంతా విఫలమయ్యాం.. అతడొక్కడే అదరగొట్టాడు! టర్న్ చేస్తాడని అనుకున్నా: హార్దిక్
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ముంబై గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ మూడో స్థానాన్ని చేరుకుంది. ఇక మ్యాచ్‌లో గుజరాత్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ మాత్రం అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలుత బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన రషీద్.. అనంతరం బ్యాటింగ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్‌కు భారీ ఓటమి ఖాయం అనుకున్న వేళ రషీద్.. 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్స్‌లతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా ఈఏడాది సీజన్లో ముంబై చేతిలో గుజరాత్ ఓటమి చెందడం ఇది రెండో సారి కావడం గమానర్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "మేము బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాం. మా జట్టులో రషీద్ ఒక్కడే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు బౌలింగ్ చేసిన విధానం, బ్యాటింగ్ గురించి ఎంత చెప్పకున్న తక్కువ. మ్యాచ్‌ను రషీద్ భాయ్ టర్న్ చేస్తాడని నేను భావించాను. అతడికి సపోర్ట్‌గా మరొక బ్యాటర్ ఉండి ఉంటే మ్యాచ్ కచ్చితంగా టర్న్ అయ్యేది. బౌలింగ్‌లో కూడా విఫలమయ్యం. సరైన ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. వికెట్ చాలా ఫ్లాట్‌గా ఉంది. అయినప్పటికీ మేము ఒక 25 పరుగులు అదనంగా ఇచ్చాం. సూర్య గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీ20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. అతడి విషయంలో సరైన ప్లాన్స్ అమలు చేయకపోతే సూర్య విధ్వంసం సృష్టిస్తాడు. అది కేవలం బౌలర్ల చేతిలో మాత్రం ఉంది. ఎందుకంటే నేను ఫీల్డ్ సెట్ చేయడం తప్ప ఇంకా ఏమి చేయలేను. ముంబై చివరి 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. మేము వారిలా చేయడంలో విఫలమయ్యం. అందుకు తగ్గ ఫలితం అనుభవించాం. ఈ మ్యాచ్ ఫలితాన్ని మర్చిపోయి మా తదుపరి మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. చదవండి: #RashidKhan: భారీ ఓటమి తప్పదనుకున్నవేళ రషీద్ సంచలన ఇన్నింగ్స్.. పలు రికార్డులు బద్దలు -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన పాండ్యా బ్రదర్స్
ఐపీఎల్లో భారత ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ప్రత్యర్థి జట్లకు కెప్టెన్లగా వ్యవహరించిన సోదరులుగా హార్దిక్, కృనాల్ నిలిచారు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తుండగా.. లక్నో సూపర్ జెయింట్స్‌కు కృనాల్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, లక్నో జట్లు తలపడతున్నాయి. ఈ క్రమంలో పాండ్యా బ్రదర్స్ ఈ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు. కాగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టోర్నీ మధ్యలో తప్పుకోవడంతో కృనాల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. చదవండి: IPL 2023: హ్యారీ బ్రూక్‌ను పక్కన పెట్టండి.. అతడికి ఛాన్స్ ఇవ్వండి! అయినా కష్టమే -
మిల్లర్, విజయ్ శంకర్ విధ్వంసం.. గుజరాత్ ఘన విజయం
మిల్లర్, విజయ్ శంకర్ విధ్వంసం.. గుజరాత్ ఘన విజయం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. విజయ్ శంకర్ 24 బంతుల్లో 51 నాటౌట్, విజయ్ శంకర్ 18 బంతుల్లో 32 నాటౌట్ విధ్వంసం సృష్టించి గుజరాత్‌ను గెలిపించారు. గిల్ 49 పరుగులతో రాణించాడు. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. 180 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మూడో వికెట కోల్పోయింది. 49 పరుగులు చేసిన గిల్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రసెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు కెప్టెన్ హార్దిక్ పాండ్యా(26 పరుగులు) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రానా బౌలింగ్‌లో పాండ్యా ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 41 పరుగులు వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 13/0 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్ ఉన్నారు. గుజరాత్ టార్గెట్ 180 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్( 39 బంతుల్లో 81 పరుగులు) రస్సెల్ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. గుర్బాజ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. లిటిల్, నూర్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 156 పరుగుల వద్ద కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన రింకూ సింగ్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 135 పరుగుల వద్ద కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 39 బంతుల్లో 81 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్బాజ్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రస్సెల్ వచ్చాడు. 13 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 105/4 13 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 4 వికెట్లు నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో రహ్మానుల్లా గుర్బాజ్(67), రింకూ సింగ్(2) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 84 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్.. లిటిల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ శార్దూల్ ఠాకూర్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 61/2 తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 23 పరుగులు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన జగదీశన్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ►గుజరాత్ టైటాన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఐపీఎల్- 2023లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. కేకేఆర్ మాత్రం రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా జాసన్ రాయ్ దూరం కావడంతో అతడి స్థానంలో రహ్మానుల్లా గుర్బాజ్ తుది జట్టులోకి వచ్చాడు. అదే విధంగా ఉమేష్ యాదవ్ స్థానంలో పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం దక్కింది. తుది జట్లు: గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్ కోల్‌కతా నైట్ రైడర్స్: నారాయణ్ జగదీశన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి -
షమీపై సీరియస్ అయిన హార్దిక్.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? వీడియోవైరల్
ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 178 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో ఈ ఏడాది సీజన్లో హార్దిక్ సేన రెండో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీరియస్ అయ్యాడు. ఏం జరిగిందంటే? రాజస్తాన్ రాయల్స్ విజయానికి 12 బంతుల్లో 23 పరుగులు కావల్సిన నేపథ్యంలో బంతిని హార్దిక్ షమీ చేతికి ఇచ్చాడు. అయితే తొలి మూడు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ.. తన ఆఖరి ఓవర్లో మాత్రం విఫలమయ్యాడు. 19 ఓవర్లో షమీ తన వేసిన తొలి బంతినే దృవ్ జురెల్ స్టాండ్స్‌కు తరలించాడు. ఆ తర్వాతి బంతికే జురెల్ భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ను కోల్పోయాడు. అనంతరం క్రీజులోకి అశ్విన్ తాను ఎదుర్కొన్న ఫస్ట్ బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. ఈ క్ర,మంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న పాండ్యా.. షమీపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 19 ఓవర్లో షమీ రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ.. ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్ రాజస్తాన్‌కు మరింత చేరువైంది. కాగా హార్దిక్ ప్రవర్తనను నెటిజన్లు తప్పుబడుతున్నారు. హార్దిక్‌కు ఇది ఏమి కొత్త కాదు.. సీనియర్లకు విలువ ఇవ్వడం రాదంటూ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. చదవండి: RCB VS CSK: భారీ రికార్డులపై కన్నేసిన ధోని, కోహ్లి -
అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. క్రెడిట్ మొత్తం వాళ్లకే: హార్దిక్
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన హార్దిక్ సేన.. 6వికెట్ల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించిన గుజరాత్.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే మ్యాచ్ ఇంత దగ్గరగా వెళ్తుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఈ మ్యాచ్ నుంచి మేము నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఆటలో ఇటువంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. జోషఫ్, మొహిత్ శర్మ మిడిల్ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మొహాలీ వంటి డ్రైవికెట్ పై బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ మొహిత్ చాలా కష్టపడి తన అనుభవం ఎంటో చూపించాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే గిల్ తన రిథమ్‌ను కొనసాగిస్తున్నాడు. మా బాయ్స్ మిడిల్ ఓవర్లలో కొన్ని రిస్క్ షాట్లు ఆడి పరుగులు రాబట్టారు. అయితే మ్యాచ్‌ను ముందే ఫినిష్ చేయాలి అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తూ మ్యాచ్ ఆఖరి వరకు వచ్చింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ రావడం నాకు పెద్దగా నచ్చదు" అని పేర్కొన్నాడు. చదవండి: కోహ్లి, బాబర్, సూర్య కాదు.. అతడే ప్రపంచ నెం1 ఆటగాడు! -
ఏంటి హార్దిక్.. ఎంత కెప్టెన్ అయితే? మరీ చెత్త బ్యాటింగ్!
ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలూండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(67) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు తెవాటియా(2 బంతుల్లో5) కీలక సమయంలో ఫోర్ బాది గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బ్యాటర్లలో షార్ట్ 36 పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ రెండు వికెట్లు, షమీ, లిటల్, జోషఫ్,రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. వరుసగా విఫలమవుతున్న హార్దిక్ ఇక గుజరాత్ టైటాన్స్ విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఆజట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గతేడాది సీజన్లో అద్భుతంగా రాణించిన హార్దిక్.. ఈ సీజన్లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాండ్య.. 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు 21 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హార్దిక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అదృష్టం బాగుంది కాబట్టి గెలుస్తున్నావు.. నీ చెత్త బ్యాటింగ్‌తో కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది మరి కొంత మంది కెప్టెన్‌గా ఇదేనా నీ ఆట? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: Mohit Sharma: మూడేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన ధోని నమ్మిన బౌలర్ Wannabe captain cool, the beast all-rounder who doesn't bowl is in sublime form with the bat these days, Hardik Pandya visited the academy with his masterclass inning of 8(11) alongwith newbie Sai Sudharsan ❤️ #PBKSvGT pic.twitter.com/OCIUEdJwuA — TukTuk Academy (@TukTuk_Academy) April 13, 2023 -
GT Vs CSK: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రుతురాజ్.. తొలి భారత క్రికెటర్‌గా!
Gujarat Titans vs Chennai Super Kings: ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓటమిపాలైనప్పటికీ.. ఆ జట్టు ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ మాత్రం తన అద్బుత ఇన్నింగ్స్‌తో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తృటిలో తన తొలి ఐపీఎల్ సెంచరీ అవకాశాన్ని రుత్‌రాజ్ కోల్పోయాడు. 50 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 92 పరుగులు సాధించాడు. అదే విధంగా గైక్వాడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 23 బంతుల్లోనే అందుకున్నాడు. సచిన్ రికార్డు బ్రేక్.. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రుత్‌రాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 37 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రుత్‌రాజ్ నిలిచాడు. ఇప్పటి వరకు 37 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్.. 1299 పరుగులు సాధించాడు. అయితే ఇప్పటి వరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ముంబై ఇండియన్స్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 37 ఇన్నింగ్స్‌లలో 1271 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును గైక్వాడ్ బ్రేక్ చేశాడు. ఇక సచిన్ తర్వాతి స్థానంలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(1184) ఉన్నాడు. చదవండి: IPL 2023: వారిద్దరూ అద్భుతం.. క్రెడిట్ వారికే ఇవ్వాలి! అది మాత్రం చాలా కష్టం -
వారిద్దరూ అద్భుతం.. క్రెడిట్ వారికే ఇవ్వాలి! అది మాత్రం చాలా కష్టం
ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టైటాన్స్.. 5వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్ విజయంలో శుబ్‌మన్ గిల్(63), రషీద్ ఖాన్( 3బంతుల్లో 10) కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబరిచిన రషీద్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్‌ధి మ్యాచ్ అవార్డు లభిచింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. వారిద్దరూ అద్భుతం.. హార్దిక్ మాట్లాడుతూ.. "తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు అద్భుతమైన శుభారంభం. కాగా ఛేజింగ్‌లో మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితిలో పడ్డాము. ఇటువంటి సమయంలో రషీద్, రాహుల్ తెవాటియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కాబట్టి విన్నింగ్ క్రెడిట్ వీరిద్దరికి ఇవ్వాలి అనుకుంటునున్నాను. శుబ్‌మన్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలుత సీఎస్కే ఓ దశలో 200 పైగా పరుగులు సాధిస్తుందని నేను భావించాను. కానీ మిడ్ఇన్నింగ్స్లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. రెండు కీలక వికెట్లు పడగొట్టి సీస్‌ఎస్‌కే జోరుకు అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా రుత్‌రాజ్ వికెట్ మాకు చాలా కీలకం. అదే విధంగా రషీద్ ఖాన్ మాకు దొరికిన నిజమైన ఆస్తి. అతడు మాకు రెండు కీలక వికెట్లు అందించాడు. బ్యాటింగ్‌లో కూడా రషీద్ అదరగొట్టాడు. ఇక జోషఫ్ కూడా ఆఖరిలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఈ మ్యాచ్‌లో నేను, గిల్ అనవసర షాట్ ఆడి వికెట్లు కోల్పోయాము. అదే విధంగా ఇంపాక్ల్ ప్లేయర్ రూల్‌ను ఉపయోగించుకోవడం చాలా కష్టం. మా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఉపయోగించుకోవాలో నిర్ణయించడం చాలా కష్టమవుతుంది" అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు! -
IPL 2023: గిల్ సూపర్ ఇన్నింగ్స్.. సీఎస్కేపై గుజరాత్ ఘన విజయం
IPL 2023 CSK Vs GT Live Updates: గిల్ సూపర్ ఇన్నింగ్స్.. సీఎస్కేపై గుజరాత్ ఘన విజయం ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్( 36 బంతుల్లో 63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రషీద్ ఖాన్ మాత్రం ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం మూడు బంతుల్లోనే 10 పరుగులు సాధించాడు. ఇక సీఎస్కే బౌలర్లలో అరంగేట్ర బౌలర్ హంగర్గేకర్ మూడు వికెట్లతో అదరగొట్టాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చెన్నై బ్యాటర్లలో రుత్‌రాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్.. 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో 92 పరుగులు చేశాడు. ఆఖరిలో కెప్టెన్ ధోని(7 బంతుల్లో 14 పరుగులు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ,రషీద్ ఖాన్, జోషఫ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్.. గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 27 పరుగులు చేసిన విజయ్ శంకర్.. హంగర్గేకర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 12 బంతుల్లో 23 పరుగులు అవసరం. గిల్ ఔట్.. 138 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 36 బంతుల్లో 63 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రుత్‌రాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హార్దిక్ ఔట్.. గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 11 బంతుల్లో 8 పరుగులు చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. దీంతో 111 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. గిల్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో దూసుకుపోతున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 17 బంతుల్లో 22 పరులుగు చేసిన సాయి సుదర్శన్.. హంగర్గేకర్ బోలింగ్లో ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రసుత్తు గిల్(38), హార్దిక్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 82/1 8 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(33), సాయిసుదర్శన్(19) పరుగులతో ఉన్నారు. గుజరాత్ విజయానికి 72 బంతుల్లో 97 పరుగులు కావాలి. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సాహా.. రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్ క్రీజులోకి వచ్చాడు. 3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 29/0 179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 3 ఓవర్లు ముగిసే సరికి 29 పరుగులు చేసింది. క్రీజులో వృద్ధిమాన్ సాహా(20), శుబ్‌మన్ గిల్(8) పరుగులతో ఉన్నారు. రుత్‌రాజ్ విధ్వంసం.. గుజరాత్ టార్గెట్ 179 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చెన్నై బ్యాటర్లలో రుత్‌రాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్.. 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో 92 పరుగులు చేశాడు. ఆఖరిలో కెప్టెన్ ధోని(7 బంతుల్లో 14 పరుగులు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ,రషీద్ ఖాన్, జోషఫ్ తలా రెండు వికెట్లు సాధించారు. Photo Credit : IPL Website వరుస క్రమంలో వికెట్లను కోల్పోయిన సీఎస్కే వరుస క్రమంలో జడేజా, దుబే వికెట్లను సీఎస్కే కోల్పోయింది. 19 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 165/7. క్రీజులో ధోని, శాంట్నర్ ఉన్నారు. Photo Credit : IPL Website ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్కే సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 92 పరుగులు చేసిన రుత్‌రాజ్ గైక్వాడ్.. జోషఫ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దూకుడుగా ఆడుతున్న రుత్‌రాజ్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. Photo Credit : IPL Website నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 121 పరుగుల వద్ద చెన్నై నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రాయుడు.. లిటిల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులో గైక్వాడ్(76), దుబే ఉన్నారు. Photo Credit : IPL Website రుత్‌రాజ్ హాఫ్ సెంచరీ.. సీఎస్కే ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 23 బంతుల్లోనే రుత్‌రాజ్‌ను అర్ధశతకాన్ని అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే స్కోర్: 93/3. క్రీజులో రుత్‌రాజ్(57), రాయుడు(3) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన బెన్ స్టోక్స్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో గైక్వాడ్(37),అంబటి రాయుడు(1) ఉన్నారు. 8 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 72/3 Photo Credit : IPL Website రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే 50 పరుగుల వద్ద సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన మొయిన్ అలీ.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే 14 పరుగుల వద్ద చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన డెవాన్ కాన్వే.. షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మొయిన్ అలీ వచ్చాడు. Photo Credit : IPL Website 2 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 13/0 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో కాన్వే(1), రుత్‌రాజ్ గైక్వాడ్(11) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2023 సీజన్ తొలి మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు: చెన్నై సూపర్ కింగ్స్ డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని (కెప్టెన్ కమ్ వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, దీపక్ చాహర్, రాజవర్ధన్ హంగర్గేకర్ గుజరాత్ టైటాన్స్ వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, జాషువా లిటిల్ ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ సెర్మనీ అదిరిపోయింది. ఆరంభ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్, పాన్ ఇండియా బ్యూటీలు రష్మిక మంధాన, మిల్కీ బ్యూటీ తమన్నాలు తమ డాన్స్‌తో అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సహా కార్యదర్శి జై షా తదితరులు హాజరయ్యారు. -
'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా అత్యుత్తమ ఆటగాడు'
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌కు సిద్దమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది భారత ఆటగాళ్లు ఆయా జట్లతో చేరారు. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ ఏడాది సీజకు ప్రారంభానికి ముందు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, ఆర్సీబీ ఆటగాడు దినేష్ కార్తీక్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గోన్నాడు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీకు ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత భారత జట్టులో కీలక ఆటగాడు ఎవరన్న ప్రశ్న కార్తీక్‌కు ఎదురైంది. టీమిండియాలో హార్దిక్ పాండ్యా అత్యంత ముఖ్యమైన ఆటగాడు అంటూ కార్తీక్ బదులిచ్చాడు. "ప్రస్తుత భారత జట్టులో హార్దిక్ పాండ్యా చాలా కీలకమైన ఆటగాడు. ఎందుకంటే హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణించగలడు. పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. భారత జట్టులో ఇద్దురు ముగ్గరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్-రౌండర్లు చాలా అరుదుగా ఉంటారు. వారిలో హార్దిక్ ఒకడు. పాండ్యా మిడిలార్డర్లో చాలా ముఖ్యమైన ఆటగాడు. చాలా మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. ఇక బౌలింగ్‌లో కూడా చాలా తెలివగా వ్యవహరిస్తాడు. ఎక్కువ షార్ట్ బాల్స్ వేసి బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. ఆస్ట్రేలియా సిరీస్ ఆఖరి వన్డే మిచిల్ మార్ష్‌ను ఓ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అదేవిధంగా ట్రావిస్ హెడ్‌ని కూడా పుల్ షాట్ ఆడించి వికెట్ కోల్పోయేలా చేశాడు. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు భారత జట్టుకు చాలా అవసరం. అతడు జట్టులో లేకపోతే టీమిండియా రాణించడం చాలా కష్టం" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: మరో కొత్త అవతారమెత్తనున్న బాలయ్య.. ఐపీఎల్ కామెంటేటర్‌గా..! -
అయ్యో స్మిత్.. ఇలా జరిగింది ఏంటి? ప్రతీకారం తీర్చుకున్న హార్దిక్! వీడియో వైరల్
చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 3 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఓ అద్భుతమైన బంతితో స్మిత్‌ను బోల్తా కొట్టించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 12 ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన ఆఫ్‌సైడ్ బంతిని స్మిత్ కవర్ డ్రైవ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని నేరుగా వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. దీంతో చేసేదేమి లేక స్మిత్ తన బ్యాట్‌ను చూసుకుంటూ పెవిలియన్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో స్మిత్ ఓ అద్భుతమైన క్యాచ్‌తో హార్దిక్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇప్పుడు మూడో వన్డేలో స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపిన హార్దిక్.. ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. కాగా వన్డేల్లో ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా చేతిలో స్మిత్ ఔట్ కావడం ఇది ఐదో సారి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా.. 44 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(47), కారీ(38), హెడ్(33) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు సాధించగా..అక్షర్ పటేల్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: IND vs AUS: కుల్దీప్పై కోపంతో ఊగిపోయిన రోహిత్, కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ Steve Smith registered his first duck in ODIs since Feb 2017.#INDvAUS pic.twitter.com/btiuBW1VUu — CricTracker (@Cricketracker) March 22, 2023 Steve Smith vs Hardik Pandya Runs - 72 Dismissed - 5 times Avg - 14.20#champion #WPL2023 #IPL2023 #ViratKohli #RohitSharma #MSDhoni #HardikPandya #PatnaJunction #INDvsAUS #75thCentury #PunjabPolice #BCCI pic.twitter.com/Yg2Y193oD1 — Slayer (@pervy_slayer) March 22, 2023 .@hardikpandya7 picks up two quick wickets as Travis Head and Steve Smith depart. Watch the two dismissals here 👇👇#INDvAUS @mastercardindia pic.twitter.com/65yyVrPR2f — BCCI (@BCCI) March 22, 2023 -
హర్దిక్ సూపర్ డెలివరీ.. పాపం మార్ష్! మిడిల్ స్టంప్ ఎగిరిపోయిందిగా..
చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిప్పులు చెరుగుతున్నాడు. స్టార్ పేసర్లు షమీ, సిరాజ్ చేతులెత్తేసిన చోట.. హార్దిక్ ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హెడ్, మిచెల్ మార్ష్ అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్ని విధాల ప్రయత్నించాడు. పవర్‌ప్లేలో ముగ్గురు బౌలర్లనుమార్చినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటువంటి సమయంలో బంతిని రోహిత్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేతికి ఇచ్చాడు. అయితే రోహిత్ నమ్మకాన్ని హార్దిక్ వమ్ము చేయలేదు. వేసిన తొలి ఓవర్లోనే దూకుడుగా ఆడుతున్న హెడ్‌ను పాండ్యా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను కూడా ఓ అద్భుతమైన బంతితో పాండ్యా ఔట్ చేశాడు. హార్దిక్ సూపర్ డెలివరి.. మిచెల్ మార్ష్ క్లీన్ బౌల్డ్ ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియాకు మరో బిగ్ వికెట్‌ను హార్దిక్ అందించాడు. 47 పరుగులతో భారీ ఇన్నింగ్స్ దిశగా దూసుకుపోతున్న మిచెల్ మార్ష్‌ను ఓ అద్భుతమైన బంతితో హార్దిక్ క్లీన్ బౌల్డ్ చేశాడు. హార్దిక్ ఔట్ సైడ్ ఆఫ్ వేసిన బంతిని మార్ష్ కవర్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి థిక్ ఎడ్జ్ తీసుకుని స్టంప్స్‌ను గిరాటేసింది. కాగా ఆ ముందు బంతినే మార్ష్ బౌండరీకి తరలించాడు. తర్వాతి బంతిని కూడా ఫోర్ బాదాలని ప్రయత్నించిన మార్ష్ తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక మ్యాచ్‌లో ఇప్పటివరకు 4 ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. #INDvsAUS3rdODI pic.twitter.com/UyUDAkZFa1 — Sanju Here 🤞👻 (@me_sanjureddy) March 22, 2023 .@hardikpandya7 picks up two quick wickets as Travis Head and Steve Smith depart. Watch the two dismissals here 👇👇#INDvAUS @mastercardindia pic.twitter.com/65yyVrPR2f — BCCI (@BCCI) March 22, 2023 చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. కోహ్లి లుంగీ డ్యాన్స్ అదిరిపోయిందిగా! వీడియో వైరల్ -
హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. శుక్రవారం ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. ఈ విజయంలో కేఎల్ రాహుల్(75), రవీంద్ర జడేజా(45) కీలక పాత్ర పోషించారు. కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫ్రీహిట్ బంతిని ఉపయోగించుకోవడంలో విఫలమైన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విరాట్ కోహ్లి సీరియస్ అయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన స్టోయినిస్ బౌలింగ్‌లో హార్దిక్ ఫ్రీ హిట్ లభించింది. ఫ్రీ-హిట్ డెలివరీని ఆడడంలో విఫలమైన హార్దిక్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే రాబట్టాడు. అయితే హార్దిక్ షాట్ సెలక్షన్ పట్ల కోహ్లి నిరాశను వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూంలో కూర్చోని ఉన్న కోహ్లి గ్రౌండ్ వైపు చేయి చూపిస్తూ ఏదో అన్నాడు. కోహ్లి పక్కన కిషన్‌తో పాటు కోచింగ్ స్టాప్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి కేవలం 4పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు హార్దిక్ 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే విశాఖ వేదికగా మార్చి19న జరగనుంది. చదవండి: IND Vs AUS: ఏంటి హార్దిక్ ఇది.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? పాపం కోహ్లి! వీడియో వైరల్ pic.twitter.com/SAyHtsHCFG — Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) March 17, 2023 pic.twitter.com/ntb3VOGkMZ — Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) March 17, 2023 -
ఏంటి హార్దిక్ ఇది.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? పాపం కోహ్లి!
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో భారత స్టార్ ఆటగాళ్లు కేల్ రాహుల్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పట్ల హార్దిక్ పాండ్యా వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏం జరిగిందంటే? టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లు ముగిసేసరికి 129 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 21వ ఓవర్ బౌలింగ్ చేయడానికి కుల్దీప్ యాదవ్ వచ్చినప్పుడు.. విరాట్ కోహ్లీ ఫీల్డ్‌లో మార్పు చేయాలని హార్దిక్‌కు సూచించాడు. అయితే హార్దిక్ మాత్రం విరాట్ మాటలను కొంచెం కూడా పట్టించుకోకుండా దూరంగా వెళ్లిపోయాడు. వెంటనే కోహ్లి కూడా హార్దిక్‌ను ఉద్దేశించి కోపంగా ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా నిలిచిన కోహ్లిని.. హార్దిక్ ఈ విధంగా అవమానించడాన్ని విరాట్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఎంత కెప్టెన్ అయినా, సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. చదవండి: IND vs Aus: ఓడిపోయే మ్యాచ్ గెలిచాం.. వారిద్దరి వాళ్లే ఇదంతా! చాలా గర్వంగా ఉంది pic.twitter.com/SH6qjx889V — CricAddaa (@cricadda) March 17, 2023 #TeamIndia go 1⃣-0⃣ up in the series! 👏 👏 An unbeaten 1⃣0⃣8⃣-run partnership between @klrahul & @imjadeja as India sealed a 5⃣-wicket win over Australia in the first #INDvAUS ODI 👍 👍 Scorecard ▶️ https://t.co/BAvv2E8K6h @mastercardindia pic.twitter.com/hq0WsRbOoC — BCCI (@BCCI) March 17, 2023 -
ఓడిపోయే మ్యాచ్ గెలిచాం.. వారిద్దరి వల్లే ఇదంతా! చాలా గర్వంగా ఉంది
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. ముంబై వాంఖడే వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత విజయంలో కేఎల్ రాహుల్(75), రవీంద్ర జడేజా(45) కీలక పాత్ర పోషించాడు. 189 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. కేవలం 39 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాహుల్.. కెప్టెన్ హార్దిక్ పాండ్య సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. అయితే 25 పరుగులు చేసిన హార్దిక్‌ను స్టోయినిస్ ఓ అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. దీంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలో 84 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి మరింత ఇబ్బందుల్లో భారత జట్టు పడింది. ఇటువంటి సమయంలో క్రీజులోకి వచ్చిన జడేజాతో కలసి రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డ్ వేగాన్ని పెంచారు. ఆఖరికి మరో వికెట్ కోల్పోకుండా టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఓడిపోయే మ్యాచ్ గెలిచాం.. వారిద్దరి వాళ్లే ఇదంతా! "మేము బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ తీవ్ర ఒత్తిడికి గురయ్యాము. ముఖ్యంగా బ్యాటింగ్‌లో క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి మ్యాచ్‌లో నిలిచేందుకు మార్గాలను కనుగొన్నాం. ఎప్పుడైతే మ్యాచ్ మా వైపు మలుపు తిరిగిందో.. ప్రత్యర్ధికి మరో అవకాశం ఇవ్వకుండా మా బాయ్స్ మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్‌లో మా జట్టు ఆట తీరు పట్ల నేను నిజంగా గర్విస్తున్నాను. ఫీల్డ్‌లో కూడా అద్భుతంగా రాణించారు. జడ్డూ, గిల్ అయితే సూపర్ క్యాచ్‌లు అందుకున్నారు. ముఖ్యంగా లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను రవీంద్ర జడేజా పట్టిన తీరు ఎంత చెప్పుకున్న తక్కువే. అయితే వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఈ మ్యాచ్‌లో మేము విజయం సాధిస్తామని నేను అనుకోలేదు. ఇటువంటి సమయంలో రాహుల్, జడేజా ఆసాధారణ ప్రదర్శన కనబరిచారు. వారి పోరాట పటిమ మాలో ఆత్మ విశ్వాసం పెంపొందించింది.. జడ్డూ అయితే రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు" అని హార్దిక్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. చదవండి: KL Rahul: రాహుల్ అద్భుత ఇన్నింగ్స్.. కారణమిదే అంటున్న ఫ్యాన్స్! కోహ్లి కూడా.. -
హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా హార్దిక్ నిలిచాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా.. టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్ (17 కోట్లు) రోజర్ ఫెదరర్ (11 కోట్లు), ప్రముఖ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్(9.5), ఎర్లింగ్ హాలాండ్(24 కోట్లు)లను పాండ్యా అధిగమించాడు. 29 ఏళ్ల వయస్సులో హార్దిక్ ఈ ఘనత సాధించాడు. కాగా హార్దిక్ సోషల్ మీడియాలో చాలా ఎక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో హార్దిక్ పంచుకుంటూనే ఉంటాడు. ఇటీవలే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను హార్దిక్ షేర్ చేశాడు. అవి సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇక ఇన్‌స్టాలో 25 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను చేరుకోవడంపై హార్దిక్ స్పందించాడు. ఇక సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు హార్దిక్ కృతజ్ఞతలు తెలిపాడు. "నాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు. ప్రతీ ఒక్క అభిమాని నాకు చాలా ప్రత్యేకం. ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలిచిన నా ఫ్యాన్స్ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. కాగా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ సిరీస్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా హార్దిక్ వ్యవహరించనున్నాడు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) చదవండి: ENG vs BAN: షకీబ్ ఆల్‌రౌండ్ షో.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టీ20ల్లో భారీ విజయం
అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 168 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1లో హార్దిక్ సేన సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కివీస్ ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(126 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 66 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు, ఉమ్రాన్, అర్ష్‌దీప్, మావి తలా రెండు వికెట్లు సాధించారు. చరిత్ర సృష్టించిన టీమిండియా.. కివీస్‌పై 168 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. టీ20ల్లో సరి కొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో పరుగుల తేడా పరంగా భారత్‌కిదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 70 పరుగులకు ఆలౌటైంది. ఇక టీ20ల్లో 100కు పైగా పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించడం ఇది మూడో సారి కావడం గమానార్హం. చదవండి: IND vs NZ: గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్ బయటపడ్డ బెయిల్స్! ఉమ్రాన్‌తో అట్లుంటది మరి -
IND Vs NZ T20: ఆపసోపాలు పడి...
లక్నో: భారత్ విజయలక్ష్యం 100 పరుగులు... పిచ్ ఎలా ఉన్నా ఇది మన లైనప్‌కు సులువైన లక్ష్యంలాగే అనిపించింది... కానీ న్యూజిలాండ్ అంత సులువుగా ఓటమిని అంగీకరించలేదు. చివరి వరకు పోరాడింది. ఎట్టకేలకు ఒక బంతి మిగిలి ఉండగా మ్యాచ్‌ను ముగించి భారత్ ఊపిరి పీల్చుకుంది. రెగ్యులర్, పార్ట్‌టైమ్ స్పిన్నర్లు కూడా హవా చూపించిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. మిచెల్ సాన్‌ట్నర్ (19 నాటౌట్)దే అత్యధిక స్కోరు కాగా... అర్‡్షదీప్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులు చేసింది. కఠిన పరిస్థితుల్లో తన శైలికి భిన్నంగా ఆడిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా నమోదు కాకపోవడం విశేషం. తాజా ఫలితంతో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా...సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్‌లో జరుగుతుంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (బి) చహల్ 11; కాన్వే (సి) ఇషాన్ (బి) సుందర్ 11; చాప్మన్ (రనౌట్) 14; ఫిలిప్స్ (బి) హుడా 5; మిచెల్ (బి) కుల్దీప్ 8; బ్రేస్‌వెల్ (సి) అర్‡్షదీప్ (బి) పాండ్యా 14; సాన్‌ట్నర్ (నాటౌట్) 19; సోధి (సి) పాండ్యా (బి) అర్‡్షదీప్ 1; ఫెర్గూసన్ (సి) సుందర్ (బి) అర్‡్షదీప్ 0; డఫీ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1–21, 2–28, 3–35, 4–48, 5–60, 6–80, 7–83, 8–83. బౌలింగ్: పాండ్యా 4–0–25–1, సుందర్ 3–0–17–1, చహల్ 2–1–4–1, హుడా 4–0–17–1, కుల్దీప్ 4–0–17–1, అర్‡్షదీప్ 2–0–7–2, మావి 1–0–11–0. భారత్ ఇన్నింగ్స్: గిల్ (సి) అలెన్ (బి) బ్రేస్‌వెల్ 11; ఇషాన్ (రనౌట్) 19; త్రిపాఠి (సి) ఫిలిప్స్ (బి) సోధి 13; సూర్యకుమార్ (నాటౌట్) 26; సుందర్ (రనౌట్) 10; పాండ్యా (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 101. వికెట్ల పతనం: 1–17, 2–46, 3–50, 4–70. బౌలింగ్: డఫీ 1–0–8–0, బ్రేస్‌వెల్ 4–0–13–1, సాన్‌ట్నర్ 4–0–20–0, ఫిలిప్స్ 4–0–17–0, సోధి 4–0–24–1, చాప్మన్ 1–0–4–0, ఫెర్గూసన్ 1–0–7–0, టిక్నర్ 0.5–0–7–0. -
చెలరేగిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 100
లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత బౌలర్లు విజృంబించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. చాహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సుందర్, హుడా తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో మిచెల్ శాంట్నర్ 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. ఉమ్రాన్ ఔట్! చాహల్ ఇన్
లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో యజువేంద్ర చహల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు కివీస్ తొలి టీ20 జట్టునే రెండో మ్యాచ్‌లో కూడా కొనసాగించింది. తుది జట్లు: భారత్ : శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఇష్ సోధీ, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్ చదవండి: ఈ సారి వన్డే ప్రపంచకప్ టీమిండియాదే: గంగూలీ