వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. ఆగస్టు 6న గయానా వేదికగా భారత్-విండీస్ మధ్య రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా తమ తుది జట్టులో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
తొలి మ్యాచ్‌లో విఫలమైన శుబ్‌మన్ గిల్‌ను రెండో టీ20కు పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటిన యశస్వీ.. టీ20ల్లో అరంగేట్రం కోసం అతృతగా ఎదురుచూస్తున్నాడు.
అదే విధంగా తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన ముఖేష్‌కుమార్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడి స్ధానంలో మరోపేసర్ అవేష్ ఖాన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు విండీస్ మాత్రం తొలి టీ20లో బరిలోకి దిగిన జట్టుతోనే ఈ మ్యాచ్ కూడా ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పిచ్ రిపోర్ట్:
గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. వికెట్ ప్లాట్‌గా ఉంటుంది కాబట్టి బ్యాటర్లు చెలరేగడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే వికెట్ పాతబడ్డకొద్ది కాస్త స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది.
తుది జట్లు(అంచనా)
భారత్: యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్.
విండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
చదవండి: ING vs ENG: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పంత్ వచ్చేస్తున్నాడు!140 కి.మీ. వేగంతో
Comments
Please login to add a commentAdd a comment