India vs West Indies
-
టీమిండియా సరికొత్త చరిత్ర.. వన్డేల్లో అత్యధిక స్కోరు
ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన విధ్వంసానికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా రాణించడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత యాభై ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన స్మృతి సేన ఏకంగా 435 పరుగులు సాధించింది. నాటి రికార్డు బ్రేక్తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు(Highest ODI total) సాధించిన భారత జట్టుగా నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు భారత పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉండేది. ఇండోర్ వేదికగా 2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. తాజాగా స్మృతి సేన ఆ రికార్డును బద్దలు కొట్టి.. ఈ మేర సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది.ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సొంతగడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు ఐర్లాండ్(India Women Vs Ireland Women)తో తలపడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే.. రాజ్‌కోట్ వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు గెలిచిన భారత్.. సిరీస్‌ను 2-0తో గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డేలోనూ స్మృతి సేన ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ల ధనాధన్ శతకాలుటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి, ప్రతికా రావల్(Pratika Rawal) శతక్కొట్టి అదిరిపోయే ఆరంభం అందించారు. స్మృతి 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు సాధించగా.. ప్రతికా భారీ సెంచరీతో దుమ్ములేపింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని ఇరవై ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఏకంగా 154 పరుగులు రాబట్టింది.హాఫ్ సెంచరీతో మెరిసిన రిచాఇక వన్‌డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. 42 బంతులు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(25 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్ 15 రన్స్ చేసింది. జెమీమా రోడ్రిగెస్ 4, దీప్తి శర్మ 11 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా రికార్డు స్థాయిలో 435 పరుగులు స్కోరు చేసింది. ఐరిష్ బౌలర్లలో ఓర్లా ప్రెండెర్గాస్ట్కు రెండు వికెట్లు దక్కగా.. అర్లెనీ కెల్లీ, ఫ్రెయా సార్జెంట్, జార్జియానా డెంప్సీ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఐర్లాండ్‌తో మూడో వన్డే సందర్భంగా స్మృతి సేన సాధించిన రికార్డులువుమెన్స్ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు బాదిన జట్లలో మూడో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 712. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 593. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్‌కోట్- 57వుమెన్స్ వన్డేల్లో 400కిపైగా స్కోర్లు సాధించిన జట్లలో నాలుగో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 491/42. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- 1997- క్రైస్ట్‌చర్చ్- 455/53. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 440/34. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్‌కోట్- 435/5.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
వాళ్లంతా గ్రేట్.. కోచ్ చెప్పినట్లే చేశాం.. కానీ: భారత కెప్టెన్
భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్(India Women vs West Indies Women)తో మూడో వన్డేలోనూ గెలుపొంది.. సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించింది. సమిష్టి ప్రదర్శనతోనే విజయం సాధ్యమైందని పేర్కొంది.రెండు సిరీస్‌లు భారత్వేకాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు వెస్టిండీస్ మహిళా జట్టు భారత్ వచ్చింది. తొలుత నవీ ముంబై వేదికగా జరిగిన పొట్టి సిరీస్‌లో హర్మన్ సేన.. హేలీ మాథ్యూస్ బృందంపై 2-1తో నెగ్గింది. అనంతరం వడోదర వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.చెలరేగిన రేణుక.. దీప్తి విశ్వరూపంఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. పేసర్ రేణుకా ఠాకూర్ సింగ్(Renuka Thakur Singh) నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ దీప్తి శర్మ(Deepti Sharma) ఆరు వికెట్లతో దుమ్ములేపింది.వెస్టిండీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ షెమానే కాంప్‌బెల్(46), చినెల్లె హెన్రీ(61), అలియా అలెనె(21) మాత్రమే రాణించారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో వెస్టిండీస్ 38.5 ఓవర్లలో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది.ఆరంభంలో తడబడ్డా.. ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్‌తో ఇక స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగినప్పటికీ టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన 4 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ ప్రతికా రావల్(18) నిరాశపరిచింది. వన్‌డౌన్‌లో వచ్చిన హర్లీన్ డియోల్(1) కూడా విఫలమైంది.ఇలా టాపార్డర్ కుదేలైన వేళ.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధనాధన్ దంచికొట్టింది. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. అదే విధంగా.. జెమీమా రోడ్రిగ్స్(29), దీప్తి శర్మ(39 నాటౌట్) రాణించారు. ఇక ఆఖర్లో రిచా ఘోష్ మెరుపులు మెరిపించింది. కేవలం 11 బంతుల్లోనే 23 పరుగులు చేసి.. జట్టును విజయతీరాలకు చేర్చింది.𝐑𝐢𝐜𝐡𝐚 𝐆𝐡𝐨𝐬𝐡 𝐟𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐬 𝐢𝐭 𝐨𝐟𝐟 𝐢𝐧 𝐬𝐭𝐲𝐥𝐞 🔥#TeamIndia win the 3rd ODI by 5 wickets & cleansweep the series 3-0 🙌🙌Scorecard ▶️ https://t.co/3gyGzj5fNU#INDvWI | @IDFCFIRSTBank | @13richaghosh pic.twitter.com/XIAUChwJJ2— BCCI Women (@BCCIWomen) December 27, 2024 ఆ ముగ్గురూ గ్రేట్ఈ క్రమంలో 28.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించిన భారత్.. ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రేణుకా సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘రేణుక అద్బుతంగా బౌలింగ్ చేసింది. మానసికంగా మనం ఎంత బలంగా ఉన్నామో ఇలాంటి ప్రదర్శన ద్వారా తెలుస్తుంది.ఇక దీప్తి శర్మ, జెమీమా బాగా బ్యాటింగ్ చేశారు. ఆఖర్లో రిచా అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. అంతా కలిసి కట్టుగా ఉంటే.. ఇలాంటి సానుకూల ఫలితాలు వస్తాయి. జట్టులోని ప్రతి ఒక్కరికీ విజయంలో భాగం ఉంది.అయితే, ఒక్క తప్పు లేకుండా వంద శాతం ఫలితాలు కావాలని మా ఫీల్డింగ్ కోచ్ పదే పదే చెప్తారు. కానీ.. ఈరోజు ఒకటీ రెండుసార్లు మేము విఫలమయ్యాం. వచ్చే ఏడాది ఈ తప్పులను పునరావృతం కానివ్వము’’ అని పేర్కొంది.చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం 𝙏𝙝𝙖𝙩 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜! 🤩 Captain @ImHarmanpreet receives the @IDFCFIRSTBank Trophy 🏆#TeamIndia win the ODI series 3-0 💪 pic.twitter.com/glblLcPBc7— BCCI Women (@BCCIWomen) December 27, 2024 -
భారత్‌తో సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్టును ప్రకటించింది. హేలీ మాథ్యూస్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను గురువారం వెల్లడించింది. కాగా భారత్- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లకు షెడ్యూల్ ఖరారైంది.డిసెంబరు 15న టీ20తో మొదలునవీ ముంబై వేదికగా డిసెంబరు 15న టీ20తో మొదలుకానున్న విండీస్ ఇండియా టూర్.. డిసెంబరు 27న మూడో వన్డేతో ముగియనుంది. పొట్టి సిరీస్‌కు నవీ ముంబై వేదికకాగా... బరోడా వన్డే సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రకటించిన విండీస్ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ స్టెఫానీ టేలర్ పేరు మిస్ అయింది.మహిళల టీ20 ప్రపంచకప్ -2024 సందర్భంగా స్టెఫానీ మోకాలికి గాయమైంది. ఆ తర్వాత మళ్లీ ఆమె మైదానంలో దిగలేదు.ఇప్పుడు ఇండియా టూర్‌కు కూడా స్టెఫానీ దూరమైంది. మరోవైపు.. మాజీ కెప్టెన్ డియాండ్ర డాటిన్ దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే క్రికెట్లో పునరాగమనం చేయనుంది. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో విండీస్ సెమీస్ చేరగా.. భారత జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది.భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు వెస్టిండీస్ మహిళా జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ కాంప్‌బెల్ (వైస్ కెప్టెన్), ఆలియా అల్లీన్, షమీలియా కాన్నెల్, నెరిస్సా క్రాఫ్టన్, డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, షబికా గజ్నాబి, చినెల్ హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మిని మునిసర్, కరిష్మా రాంహారక్, రషదా విలియమ్స్ .భారత్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్టీ20 సిరీస్👉మొదటి టీ20- డిసెంబరు 15- ఆదివారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉రెండో టీ20- డిసెంబరు 17- మంగళవారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉మూడో టీ20- డిసెంబరు 19- గురువారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబైవన్డే సిరీస్👉తొలి వన్డే- డిసెంబరు 22- ఆదివారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉రెండో వన్డే- డిసెంబరు 24- మంగళవారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉మూడో వన్డే- డిసెంబరు 27- శుక్రవారం- ఉదయం తొమ్మిదిన్నర గంటలకు- బరోడా. -
అందుకు నువ్వే కారణమవుతావని కోహ్లితో చెప్పాను: భజ్జీ
ఆధునిక తరంలో అసాధారణ ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న అతికొద్ది మంది క్రికెటర్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో సమకాలీన ఆటగాళ్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఎనభై శతకాలు సాధించిన ఘనత ఈ రన్‌మెషీన్ సొంతం. టీమిండియా దిగ్గజం, వంద సెంచరీల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేయగల సత్తా ఉన్న ఏకైక బ్యాటర్.అయితే, కెరీర్ ఆరంభంలో అసలు తను జట్టులో స్థానం సుస్థిరం చేసుకోగలనా? లేదా అన్న సందిగ్దంలో కొట్టుమిట్టాడట కోహ్లి. భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నిరాశలో కూరుకుపోయిన కోహ్లికి తాను చెప్పిన మాటలను తాజాగా గుర్తుచేసుకున్నాడు.తీవ్ర నిరాశకు లోనయ్యాడు‘‘కోహ్లి గురించి చెప్పాలంటే.. ముఖ్యంగా టెస్టుల్లో అతడి ప్రయాణాన్ని ముందుగా తెలుసుకోవాలి. అప్పుడు మేము వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాము. ఫిడెల్ ఎడ్వర్డ్స్ తన బౌలింగ్‌తో కోహ్లిని చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రతిసారి అతడే తన వికెట్ తీసుకున్నాడు. దీంతో కోహ్లి సహజంగానే తీవ్ర నిరాశకు లోనయ్యాడు.ఆత్మన్యూనతభావంతో కుంగిపోయాడు. అప్పుడు తను నా దగ్గరికి వచ్చి.. ‘నేను బాగానే ఆడుతున్నానా?’ అని అడిగాడు. నేను వెంటనే అందుకు బదులిస్తూ.. ‘ఒకవేళ టెస్టు క్రికెట్లో గనుక నువ్వు 10 వేల పరుగులు చేయకపోతే.. అందుకు నిన్ను నువ్వే నిందించుకోవాల్సి వస్తుంది’ అని చెప్పాను. అది కేవలం నీ తప్పే అవుతుందని చెప్పాను‘నీకు ఆ సత్తా ఉంది. అయినప్పటికీ నువ్వు ఆ మైలురాయి చేరుకోలేకపోయావంటే అందుకు కేవలం నువ్వే కారణం అవుతావు అని గుర్తుపెట్టుకొమ్మని కోహ్లితో అన్నాను’’’ అంటూ భజ్జీ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ఒక్కోమెట్టు ఎక్కుతూ కోహ్లి తారస్థాయికి చేరుకున్నాడని హర్షం వ్యక్తం చేశాడు.ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గు ర్తింపుఇక ఫిట్నెస్, డైట్ విషయంలోనూ కోహ్లికి శ్రద్ధ ఎక్కువని.. అందుకే తను గుంపులో గోవిందలా కాకుండా ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడని భజ్జీ తెలిపాడు. కోహ్లి చాలా మొండివాడని.. అనుకున్న పని పూర్తి చేసేంతవరకు పట్టువదలడని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌పై కోహ్లి చెరగని ముద్ర వేశాడంటూ భజ్జీ ప్రశంసలు కురిపించాడు. తరువార్ కోహ్లి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా 2011లో వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా కోహ్లి టెస్టుల్లో అడుగుపెట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 19 పరుగులే చేసి నిరాశపరిచాడు. అయితే, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన కోహ్లి ప్రస్తుతం 8848 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి.చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు -
అతడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే ఇలా!
టీమిండియాలోకి ఎంత ‘వేగం’గా దూసుకువచ్చాడో.. అంతే త్వరగా జట్టుకు దూరమయ్యాడు కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్.. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.అత్యంత వేగంగా బంతులు విసురుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు.అనంతరం వన్డేల్లోనూ అడుగుపెట్టాడు ఈ స్పీడ్‌గన్. అయితే, నిలకడలేమి ప్రదర్శన కారణంగా మేనేజ్మెంట్ నమ్మకం పోగొట్టుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. చివరగా గతేడాది వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో ఆడాడు.ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే ఉమ్రాన్ మాలిక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు కెప్టెన్ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని.. అందుకే జట్టుకు దూరమైపోయాడని పేర్కొన్నాడు.కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు‘‘మనలోని ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలి. ఓ బౌలర్ ఎక్స్‌ప్రెస్ పేస్ కలిగి ఉండటం అరుదైన అంశం. అతడి శక్తిసామర్థ్యాలకు నిదర్శనం.అతడు గంటకు 145- 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసినపుడు.. అంతకంటే వేగంగా బంతులు విసరగలడని భావించాం. కానీ అలా జరుగలేదు.కానీ తన బౌలింగ్‌లోని పేస్ మాత్రమే తన బలం. అంతేగానీ బౌల్ చేసేటపుడు లైన్ అండ్ లెంగ్త్ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా టీ20లలో పూర్తి కంట్రోల్ ఉండాలి.అందులో విఫలమైతే కచ్చితంగా కష్టాలు మొదలవుతాయి. బ్యాటర్ బాల్‌ను బాదుతూ ఉంటే.. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం. అలాంటపుడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోవడం ఖాయం.రంజీలు ఆడమని పంపించాంఅతడికి బౌలింగ్‌పై పూర్తి నియంత్రణ రావాలనే ఉద్దేశంతోనే రంజీలు ఆడమని పంపించాం. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ కచ్చితంగా నైపుణ్యాలు ప్రదర్శించగలగాలి’’ అని పారస్ మాంబ్రే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించాడు.కాగా ఉమ్రాన్ మాలిక్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఎనిమిది టీ20లు, పది వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు. -
నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా?
సచిన్ టెండుల్కర్.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో అరుదైన ఘనతలెన్నో సాధించి క్రికెట్ దేవుడిగా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. నభూతో న భవిష్యతి అన్న రీతిలో అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా వంద సెంచరీలు సాధించి శిఖరాగ్రాన నిలిచాడు. అయితే, సచిన్ వ్యక్తిగతంగా లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టినా ఒక్కటంటే ఒక్క వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడటానికి 22 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తాను భాగమైన భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంతో సచిన్ టెండుల్కర్ చిరకాల కల నెరవేరింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సచిన్ టెండుల్కర్ అప్పట్లో తనలో స్ఫూర్తిని నింపాడంటూ తాజాగా గుర్తుచేసుకున్నాడు.. నాటి అరంగేట్ర, ‘యువ’ బౌలర్. ‘‘ఆరోజు మేము వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. వికెట్ ఫ్లాట్‌గా ఉంది. వెస్టిండీస్ స్కోరు అప్పటి బహుశా 500/4 అనుకుంటా. నాలో.. వికెట్ తీయలేకపోతున్నాననే అసహనం పెరిగిపోతోంది. అప్పటికి నా వయసు 21 ఏళ్లు. ఇరవై ఒక్క ఓవర్ల పాటు వికెట్ తీయలేకపోవడం అదే మొదటిసారి. ఆ సమయంలో సచిన్ టెండుల్కర్ మిడాఫ్‌లో తన ఫీల్డింగ్ పొజిషన్లో నిలబడి ఉన్నాడు. నన్ను చూసి... ‘ఏమైంది అలా ఉన్నావు? ఎందుకంత నిరాశ?’ అని అడిగాడు. అందుకు బదులిస్తూ.. ‘పాజజీ.. నా బౌలింగ్‌లో ఇప్పటివరకు 21 ఓవర్లు అయినా వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి తెలుసా?.. అలాంటిది అరంగేట్రంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు’ అని వాపోయాను. అప్పుడు వెంటనే.. ఓవర్ మధ్యలోనే.. నన్ను తన దగ్గరికి రమ్మని పిలిచి.. ‘నీకు తెలుసా.. నేను తొలి వరల్డ్‌కప్ అందుకోవడానికి 22 ఏళ్ల పాటు ఎదురుచూశాను. మరి నువ్వు నీ తొలి వికెట్ కోసం కనీసం 21 ఓవర్లపాటు వెయిట్ చేయలేవా? అంతగా నిరాశపడొద్దు. గతంలో ఏం జరిగిందన్నది అప్రస్తుతం. ఇప్పుడు ఏం చేయగలవో ఆలోచించు’ అన్నాడు. అవును.. కదా పాజీ చెప్పింది నిజమే కదా అనిపించింది. ఆ మరుసటి బంతికే నేను డారెన్ బ్రావో(166)ను అవుట్ చేసి తొలి వికెట్ అందుకున్నా. ఆ తర్వాత కార్ల్టన్, డారెన్ సామీ వికెట్లు తీశాను. నా అరంగేట్రం అలా ప్రత్యేకంగా మారిపోయింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. బీసీసీఐ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకుంటూ.. మన ఆలోచనా విధానాన్ని, అంతకు ముందున్న పరిస్థితులను మార్చడానికి ఒక్క మాట చాలని తనకు ఆరోజు తెలిసిందన్నాడు. సచిన్ టెండుల్కర్ చెప్పిన ఆ స్పూర్తిదాయక మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ పేరు చెప్పలేదు కదూ! వరుణ్ ఆరోన్.. జంషెడ్‌పూర్‌కు చెందిన 34 ఏళ్ల రైటార్మ్ పేసర్. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 9 టెస్టులు, 9 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే.. -
వరల్డ్‌కప్ జట్టులో ఉంటాడనుకుంటే.. కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా?!
It seemed like he could be in the World Cup team: టీమిండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచకప్-2024 జట్టులో ఉంటాడనుకున్న ఆటగాడిని అకస్మాత్తుగా ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. ఒకప్పుడు ప్రతి సిరీస్‌కు ఎంపికైన ఆ ప్లేయర్‌కు ఇప్పుడు కనీసం భారత్-‘ఏ’ జట్టులో కూడా చోటు దక్కకపోవడం ఏమిటని వాపోయాడు. నెట్‌బౌలర్ నుంచి టీమిండియా స్థాయికి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతుల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఒకడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్‌గా మొదలైన అతడి ప్రయాణం.. టీమిండియాకు ఎంపిక అయ్యే స్థాయికి చేరుకుంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా 2022లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన పదునైన, వేగవంతమైన డెలివరీలతో బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో ఉమ్రాన్ మాలిక్ దిట్ట. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక సభ్యుల్లో ఒకడిగా మారాడు ఈ ఫాస్ట్‌బౌలర్. అయితే, ఐపీఎల్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత ఒక్కసారిగా ఉమ్రాన్ మాలిక్ రాత తలకిందులైంది. వాళ్లిద్దరికి మాత్రం ఛాన్స్‌లు ఫామ్‌లేమితో సతమతమవుతున్న అతడికి వెస్టిండీస్ టూర్ రూపంలో టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరేబియన్ దీవుల్లో ఆడిన రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుని జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు ఉమ్రాన్. అయితే, ఉమ్రాన్ మాలిక్ మాదిరే అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు కూడా వైఫల్యం చెందినా బీసీసీఐ సెలక్టర్లు వారికి అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోనూ ఉమ్రాన్‌కు స్థానం దక్కకపోగా.. వీరిద్దరు మాత్రం చోటు దక్కించుకోవడం విశేషం. మొన్నటిదాకా ఎక్కడ చూసినా అతడే ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘కొంతకాలం క్రితం ఎక్కడ చూసినా ఉమ్రాన్ మాలికే కనబడ్డాడు. అతడిని వెస్టిండీస్ పర్యటనకు తీసుకువెళ్లారు. ఒకానొక సందర్భంలో అతడు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. ఇటీవల వరుస సిరీస్‌లలో అతడికి మొండిచేయే చూపారు. కనీసం ఇండియా-ఏ జట్టుకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. మూడు నెలల కాలంలోనే అంత పెద్ద మార్పులేం జరిగిపోయాయి. టీమిండియాలో అడుగుపెట్టి.. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న తర్వాత.. అకస్మాత్తుగా అతడు కనిపించకుండా పోయాడు. అసలు ఉమ్రాన్ మాలిక్ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అతడి విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది అన్న విషయాలను మనం తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. ఉమ్రాన్ మాలిక్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో టీ20లో ఉమ్రాన్ మాలిక్ తన అత్యుత్తమ గణాంకాలు (2/9- 2.1 ఓవర్లలో) నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు ఆడిన 10 వన్డేల్లో 13, 8 టీ20లలో 11 వికెట్లు తీశాడు ఉమ్రాన్ మాలిక్. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
IPL 2023: నేనొక ఇడియట్.. సెంచరీ తర్వాత అలా మాట్లాడినందుకు: బ్రూక్
IPL 2023- SRH- Harry Brook: భారత క్రికెట్ అభిమానుల గురించి తాను అలా మాట్లాడకపోవాల్సిందంటూ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో సెంచరీ చేసిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఏదేమైనా సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉన్న తర్వాతే తన మానసిక స్థితి మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 13.25 కోట్ల రూపాయాల భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, 24 ఏళ్ల ఈ మిడిలార్డర్ బ్యాటర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. నోళ్లు మూయించానంటూ ఘాటు వ్యాఖ్యలు వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో శతకం బాదిన తర్వాత.. తనను ట్రోల్ చేసిన వాళ్ల నోళ్లు మూయించాను అంటూ బ్రూక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పశ్చాత్తాపంతో ఈ విషయం గురించి తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్న హ్యారీ బ్రూక్.. ‘‘అప్పుడు నేను ఓ ఇడియట్‌లా ప్రవర్తించాను. ఇంటర్వ్యూలో అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ తర్వాత దాని గురించి పశ్చాత్తాపపడ్డాను. హోటల్ గదిలో కూర్చుని సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయగానే.. చూడకూడని కామెంట్లు ఎన్నో చూశాను. అప్పటి నుంచి నెట్టింటికి కొంతకాలం పాటు దూరం కావాలని నిర్ణయించుకున్నాను. భారీ మొత్తానికి న్యాయం చేయలేక నెగిటివిటీ గురించి పట్టించుకోకుండా.. కేవలం ఆట మీదే దృష్టిసారించాను. తద్వారా నా మానసిక ఆరోగ్యం మరింత మెరుగైంది’’ అని తెలిపాడు. కాగా ఐపీఎల్-2023 కోసం సన్‌రైజర్స్ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 ఇన్నింగ్స్‌లో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్-2024 వేలానికి ముందు బ్రూక్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అతడు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. విండీస్‌తో తొలి మ్యాచ్‌లో అతడు 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విండీస్ చేతిలో ఓటమిపాలైంది. చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్‌లో పాకిస్తాన్..
ICC World Test Championship 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ టాప్-2లోకి దూసుకువచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ టీమిండియాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. కాగా బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం ముగిసిన మొదటి మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్.. న్యూజిలాండ్‌పై విజయం సాధించడం ఇదే మొదటిసారి. చారిత్మక విజయంతో బంగ్లాదేశ్ ఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్‌గా నజ్ముల్ షాంటో తొలి ప్రయత్నంలోనే చారిత్రాత్మక విజయం అందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023- 25 సీజన్ నడుస్తోంది. అగ్రస్థానం ఇంకా పాకిస్తాన్‌దే తాజా సైకిల్లో భాగంగా పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టును ఓడించి 24 పాయింట్లతో టాప్‌లో ఉంది. మరోవైపు.. జూలైలో వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా రెండింట ఒక మ్యాచ్ గెలిచి.. మరొకటి డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 16 పాయింట్లతో రెండో స్థానం(66.67 శాతం)లో ఉండేది. అయితే, తాజాగా న్యూజిలాండ్‌పై గెలుపుతో విజయశాతం(100 శాతం) విషయంలో మెరుగ్గా ఉన్న బంగ్లా ఇప్పుడు టీమిండియాను వెనక్కినెట్టింది. PC: ICC మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా ఈక్రమంలో రోహిత్ సేన ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా 18 పాయింట్లు(విజయశాతం 30)తో నాలుగు, వెస్టిండీస్ 4 పాయింట్లు(16.67 శాతం)తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ కేవలం 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉండగా.. శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తదితర జట్టు ఇంకా తాజా సైకిల్లో పాయింట్ల ఖాతా తెరవనే లేదు. రెండుసార్లు చేదు అనుభవమే కాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ గెలిస్తే 12, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు వస్తాయి. ఇక సీజన్ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ట్రోఫీని తొలుత న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఈ రెండు పర్యాయాలు ఫైనల్ వరకు చేరిన టీమిండియాకు ఆఖరి పోరులో ఓటమి తప్పలేదు. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
టీమిండియాతో మ్యాచ్.. వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఐసీసీ!
India tour of West Indies, 2023 Test Series: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాకిచ్చింది. ఇటీవల టీమిండియా- విండీస్ టెస్టు కోసం విండ్సర్ పార్కులో తయారు చేసిన పిచ్‌కు సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చింది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత జట్ట జూలై- ఆగష్టులో కరేబియన్ దీవిలో పర్యటించిన విషయం తెలిసిందే. స్పిన్నర్ల విజృంభణతో విండీస్ కుదేలు ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జూలై 12న డొమినికాలోని రొసోవ్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆతిథ్య వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ 5, రవీంద్ర జడేజా 3 వికెట్లతో విండీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే వెస్టిండీస్ ఆలౌటైంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 421 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తదుపరి లక్ష్య ఛేదనకు దిగిన కరేబియన్ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కు ఏడు, జడ్డూకు రెండు వికెట్లు దక్కాయి. చెత్త పిచ్ అంటూ విమర్శలు ఈ నేపథ్యంలో టర్నింగ్ పిచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంతో చెత్త పిచ్ అంటూ కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో ఐసీసీ తాజాగా.. విండ్సర్ పిచ్‌కు బిలో ఆవరేజ్ రేటింగ్‌తో విండీస్ బోర్డును పనిష్ చేసింది. దీంతో వెస్టిండీస్ ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ చేరింది. అయితే, ఈ విషయంపై బోర్డు అప్పీలు వెళ్లే అవకాశం ఉంది. ఆ పిచ్‌కు రేటింగ్ ఇలా ఇదిలా ఉంటే.. టీమిండియా- వెస్టిండీస్ మధ్య రెండో టెస్టుకు వేదికైన.. జమైకాలోని క్వీన్స్ పార్క్ ఓవల్‌కు ఆవరేజ్ రేటింగ్ ఇచ్చింది. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత జట్టు 1-0తో సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే. కాగా.. వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం 3-2 తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. చదవండి: పాక్‌ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే.. -
సత్తా చాటిన శుబ్‌మన్, కుల్దీప్.. కెరీర్లోనే బెస్ట్ ర్యాంక్
ఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సత్తాచాటాడు. తన టీ20 కెరీర్లో ఉత్తమ ర్యాంక్‌ను గిల్ సాధించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ 43 స్ధానాలు ఎగబాకి 25వ స్ధానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో గిల్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గిల్ 77 పరుగులు సాధించాడు. ఈ అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా గిల్ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. మరోవైపు నాలుగో టీ20లో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన యువ సంచలనం యశస్వీ జైశ్వాల్ ఏకంగా 1000 స్ధానాలు ఎగబాకి 88వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జైశ్వాల్ 84 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అద్బతప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ 907 రేటింగ్ పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సెకెండ్ ర్యాంక్‌లో పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్(811) ఉన్నాడు. బౌలర్ల విషయానికి వస్తే.. భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 23 స్థానాలు మెరుగుపర్చుకుని 28వ ప్లేస్‌కు చేరుకున్నాడు. చదవండి: IND vs WI: ఐర్లాండ్‌తో తొలి టీ20.. సంజూ శాంసన్‌పై వేటు! సిక్సర్ల కింగ్ ఎంట్రీ -
దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ: భారత మాజీ క్రికెటర్
Hardik Pandya underwhelming all-round performances: టీమిండియా ‘స్టార్’ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. ఇటీవలి కాలంలో వన్డేల్లో అతడి ప్రదర్శన ఆశించదగ్గ రీతిలో లేదని విమర్శించాడు. వన్డే ప్రపంచకప్-2023 వంటి మెగా ఈవెంట్‌కు ముందు కీలక ఆటగాడు ఇలా విఫలం కావడం ఆందోళనకు గురిచేసే అంశం అన్నాడు. తాత్కాలిక కెప్టెన్‌గా కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ పాండ్యా భారత జట్టును ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆఖరి రెండు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పాండ్యా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలం అయితే, ఆల్‌రౌండర్‌గా.. కెప్టెన్‌గానూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలిచినప్పటికీ.. పాండ్యా సారథ్యంలో టీ20 సిరీస్‌లో మాత్రం విండీస్ చేతిలో 3-2తో పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక వెస్టిండీస్ టూర్ తర్వాత హార్దిక్ ఆసియా వన్డే కప్-2023 టోర్నీలోనే మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అటుపై భారత్ వేదికగా ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యట్యూబ్ చానెల్ వేదికగా హార్దిక్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ ‘‘దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో ఫినిషర్‌గా అదరగొట్టగలిగిన వాడు. బౌలింగ్.. బ్యాటింగ్.. అదో ప్యాకేజ్! అయితే.. హార్దిక్ ఈ రెండింటిలోనూ ఇంకా మెరుగ్గా రాణించగలడు. నిజానికి వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టీమిండియా ఓడినపుడు అందరూ యువ ఆటగాళ్ల గురించే మాట్లాడారు. కానీ పాండ్యా గురించి ఇంతవరకు పెద్దగా చర్చించడమే లేదు. వాస్తవానికి హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాడిపైనే ఎక్కువ ఫోకస్ ఉండాలి. గత 10 వన్డేల్లో అతడి ప్రదర్శన చెప్పుకోదగినదిగా లేదు. స్ట్రైక్‌రేటు గురించి కూడా మాట్లాడాలి వెస్టిండీస్‌తో మూడో వన్డేలో 52 బంతుల్లో 70 పరుగులు చేశాడు. కానీ ఆ ఇన్నింగ్స్ ఎంత పేలవంగా ఆరంభమైందో తెలిసిందే! అయితే, ఆఖర్లో మాత్రం బ్యాట్ ఝులిపించాడు. ఇక మరో మ్యాచ్‌లో 12 బంతుల్లో 14 పరుగులు.. కేవలం రెండు ఇన్నింగ్స్‌లో మాత్రమే అతడు ఎదుర్కొన్న బంతుల కంటే పరుగులు ఎక్కువగా ఉన్నాయి. ఫినిషర్‌గానే కీలక పాత్ర వాస్తవానికి హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషించాలి. కాబట్టి స్ట్రైక్‌రేటు గురించి చర్చించక తప్పదు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫినిషర్‌గా తన నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నా’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా గత 10 వన్డే ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 97.22 స్ట్రైక్‌రేటుతో 280 పరుగులు చేయగలిగాడు. గత నాలుగేళ్లుగా 100కు స్ట్రైక్‌రేటు మెయింటెన్ చేస్తున్న అతడి ప్రస్తుత గణాంకాలు ఆశించిన రీతిలో లేవన్నది వాస్తవం. ఇదిలా ఉంటే... ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా ఆసియా కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
అలా అనుకుంటే సంజూను తీసిపడేయండి.. అతడికి ఛాన్స్ ఇవ్వండి!
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని జట్టు నుంచి తొలగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కాగా కరేబియన్ పర్యటనలో సంజూ తీవ్ర నిరాశపరిచాడు. వన్డే సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీతో కాస్త పర్వాలేదనపించిన శాంసన్.. టీ20లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. 32 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 13 పరుగులు అత్యధిక స్కోర్‌గా ఉండటం గమానార్హం. ఈ నేపథ్యంలో జట్టు మెన్జ్మెంట్ను ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్ కీలక వాఖ్యలు చేశాడు. శాంసన్‌ను లోయార్డర్‌లో బ్యాటింగ్ పంపడాన్ని అభిషేక్ నాయర్ తప్పుబట్టాడు. కాగా సాధారణంగా ఐపీఎల్లో సంజూ 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. "సంజూ శాంసన్‌ని సేవలను ఉపయోగించుకోవాలనుకుంటే అతడికి మూడో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వండి. అతడు ఆ బ్యాటింగ్ పొజిషన్‌కు బాగా అలవాటు పడ్డాడు. అతడు ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు కూడా. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎటాక్ చేసే సత్తా సంజూకు ఉంది. ఆ స్ధానంలో అతడిని పంపకపోతే పూర్తిగా జట్టులోనే ఛాన్స్ ఇవ్వవద్దు. సంజూని ఐదు లేదా ఆరో స్ధానంలో ఆడించాలనుకుంటే, అతడికి బదలుగా రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వండని జియో సినిమాతో నాయర్ అన్నాడు. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. ! -
సంజూను ప్లాన్ చేసి ఔట్ చేశాం.. సూర్యను కూడా! చాలా సంతోషంగా ఉంది
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. వెస్టిండీస్ టూర్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీ సాధించిన ఈ కేరళ బ్యాటర్.. టీ20 సిరీస్‌లో మాత్రం పూర్తిగా తెలిపోయాడు. నిర్ణయాత్మక ఐదో టీ20లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ.. 9 బంతుల్లో 13 పరుగులు చేసి రొమారియో షెఫార్డ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఫైనల్ టీ20లో పక్కా ప్రాణాళికతో శాంసన్‌ను ఔట్ చేసినట్లు విండీస్ పేసర్ రొమారియో షెఫార్డ్ తెలిపాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో షెఫార్డ్ మాట్లాడుతూ.. "గత రెండు నెలలగా మేము గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నాము. ఇటువంటి సమయంలో భారత్ వంటి జట్టును ఓడించి సిరీస్ సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.ఆఖరి టీ20లో అద్భుతంగా ఆడిన నికోలస్ పూరన్, బ్రాడన్ కింగ్‌లకు ధన్యవాదాలు. నా బౌలింగ్ స్ట్రైల్‌ను కూడా నేను మార్చుకున్నాను. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేసి బ్యాటర్లకు ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌ను ఔట్‌చేయడానికి ముందుగానే ప్రణాళికలు సిద్దం చేశాం. సంజూకు వికెట్ల దగ్గర బౌలింగ్ చేసి పెవిలియన్‌కు పంపాలనుకున్నాను. అదేవిధంగా సూర్యకు లాంగాన్ దిశగా షాట్ ఆడించి ఔట్ చేయడమే మా టార్గెట్. అందులో మేము విజయం సాధించామని పేర్కొన్నాడు. కాగా శాసంన్ షెఫార్డ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. సూర్య హోల్డర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. ! -
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్
విండీస్‌తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన సూర్యకుమార్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను అధిగమించాడు. 50 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత స్కై ఖాతాలో 104 సిక్సర్లు ఉండగా.. గేల్ పేరిట 103 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో విండీస్ ఆటగాడు ఎవిన్ లెవిస్ 111 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లెవిస్, స్కై, గేల్ల తర్వాత కివీస్ కొలిన్ మున్రో (92), ఆరోన్ ఫించ్ (79) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ స్కై నాలుగో స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో ఐదో టీ20లో 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్.. 50 ఇన్నింగ్స్‌ల అనంతరం 1841 పరుగులు చేసి ఈ విభాగంలో విరాట్ కోహ్లి (1943), బాబర్ ఆజమ్ (1942), మహ్మద్ రిజ్వాన్ (1888) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో స్కై తర్వాత కేఎల్ రాహుల్ (1751) ఐదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఫ్లోరిడా పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఐదో టీ20లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఫలితంగా భారత్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను (2-3) కూడా కోల్పోయింది. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను తృటిలో చేజార్చుకుంది. -
IND VS WI 5th T20: చెత్త రికార్డు మూటగట్టుకున్న చహల్
టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో విండీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను విండీస్‌కు అప్పగించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ (61) మినహా అందరూ చేతులెత్తేయగా.. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (4-0-18-0) మినహా భారత బౌలర్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకోగా.. అర్షదీప్ 2 ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చిన ఘనత టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన చహల్ ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ప్రత్యర్ధులు 5 సిక్సర్లు బాదారు. ఈ చెత్త గణాంకాలు నమోదు చేసే క్రమంలో చహల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాధించుకున్న బౌలర్‌గా న్యూజిలాండ్ స్పిన్నర్ ఐష్ సోధి సరసన చేరాడు. సోధి తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 129 సిక్సర్లు సమర్పించుకోగా.. చహల్ ఈ మ్యాచ్‌లో అతని రికార్డును సమం చేశాడు. ఈ విభాగంలో సోధి, చహల్ తర్వాత ఆదిల్ రషీద్ (119) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను కోల్పోయింది. -
‘టీమిండియా విజయం నల్లేరు మీద నడకే’! మరీ అధ్వాన్నంగా..
West Indies vs India, 5th T20I: ‘‘టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీలో క్వాలిఫయర్స్‌లోనే ఇంటిముఖం పట్టిన జట్టు.. వన్డే వరల్డ్‌కప్-2023కి అర్హత సాధించని ‘బలహీన జట్టు’... ఇలాంటి టీమ్‌పై పటిష్ట టీమిండియా సునాయాసంగా గెలుస్తుంది.. టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేయడం నల్లేరు మీద నడకలాంటిదే!.. టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేముందు వ్యక్తమైన అభిప్రాయాలు. వన్డేల్లో గట్టెక్కారు.. కానీ.. స్కాట్లాండ్ వంటి పసికూనల చేతిలో ఓటమిపాలైన విండీస్.. భారత జట్టుతో సై అంటే సై అంది. టెస్టు సిరీస్‌లో 1-0తో ఓడినా.. వన్డేల్లో గట్టిపోటీనిచ్చింది. 50 ఓవర్ల సిరీస్‌లో 2-1తో టీమిండియా గట్టెక్కగా.. టీ20లలో మాత్రం కరేబియన్ జట్టు సత్తా చాటింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వంటి మేటి ఆటగాళ్లు లేని టీమిండియాపై సునాయాసంగా సిరీస్ గెలిచింది. కోలుకోలేని షాక్ హార్దిక్ పాండ్యా సేనకు సవాళ్ల మీద సవాళ్లు విసురుతూ.. నిర్ణయాత్మక ఐదో టీ20లో గెలిచి ఏకంగా సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. యువ జట్టుతో ప్రయోగాలు చేస్తూ.. తమకు తిరుగులేదనుకున్న భారత జట్టుకు కోలుకోలేని షాకిచ్చింది. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను విండీస్‌కు అర్పించుకుని విమర్శల పాలవుతున్న టీమిండియా చెత్త రికార్డులు మూటగట్టుకుని ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతోంది. అమెరికాలో ఆదివారం నాటి ఫ్లోరిడా మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓటమి సందర్భంగా భారత జట్టు నమోదు చేసిన చెత్త రికార్డులివే! 1. గత 25 నెలల్లో టీమిండియా టీ20 సిరీస్ కోల్పోవడం ఇదే మొదటిసారి. 2. వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లలో గత 17 ఏళ్లలో టీమిండియా ఓటమి పాలవడం ఇదే తొలిసారి. 3. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు ఒక టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో ఓడిపోయిన సందర్భాలే లేవు. కానీ టీమిండియా చరిత్రలో తొలిసారి వెస్టిండీస్‌పై తొలిసారి ఈ చెత్త ఫీట్ నమోదైంది. చదవండి: Ind Vs WI: హార్దిక్ సేనపై మాజీ పేసర్ ఘాటు వ్యాఖ్యలు.. కెప్టెన్ వెర్రిమొహం వేస్తున్నాడు! వాళ్లేమో అలా! Catch the extended highlights from the 5th T20I T20I only on FanCode 👉 https://t.co/6EDO1Ijfiw . .#INDvWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/lHj2sAbLsn — FanCode (@FanCode) August 13, 2023 -
అసలు గెలవాలన్న కసి లేనేలేదు.. కెప్టెన్ వెర్రిమొహం వేస్తున్నాడు! ఇకనైనా..
West Indies vs India, 5th T20I: టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ హార్దిక్ సేనపై విమర్శలు సంధించాడు. వెస్టిండీస్‌తో ఐదో టీ20లో గెలవాలన్న కసి భారత జట్టులో ఏమాత్రం కనిపించలేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లలో ఏకాగ్రత లోపించిందని.. గుడ్డిగా ముందుకు వెళ్తే ఇలాంటి పరాభవాలే ఎదురవుతాయని అభిప్రాయపడ్డాడు. కాగా విండీస్ పర్యటనలో 1-0తో టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం అనూహ్య రీతిలో ఘోర ఓటమిపాలైంది. 3-2తో ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకుంది. అమెరికాలో ఫ్లోరిడాలో ఐదో టీ20లో సమిష్టి వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకోంది. వాళ్లు మినహా.. మిగతా వాళ్లంతా భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(61) అర్ధ శతకంతో రాణించగా.. తిలక్ వర్మ 27 పరుగులు చేయగలిగాడు. మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు మార్కు అందుకోలేదు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. దంచికొట్టారు లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్(85- నాటౌట్), వన్‌డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్(47)కు తోడు షాయీ హోప్(22- నాటౌట్) దంచికొట్టారు. దీంతో 18 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేసిన వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది టీమిండియాపై చేయి సాధించింది. పాండ్యా పూర్తిగా విఫలం ఇక ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాట్, బంతితోనూ విఫలమయ్యాడు. 18 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. మూడు ఓవర్లలో ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు. అదే విధంగా కెప్టెన్‌గానూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ఎనిమిది మందితో బౌలింగ్ బ్రాండన్- పూరన్ జోడీని విడగొట్టడానికి పదే పదే బౌలర్లను మార్చాడు. యువ బ్యాటర్లు తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్‌తో కలిపి మొత్తంగా ఎనిమిది మంది ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేశారు. అర్ష్‌దీప్‌తో పాటు తిలక్ ఒక వికెట్ తీయగలిగాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ వేదికగా హార్దిక్ పాండ్యా, జట్టుపై విమర్శలు గుప్పించాడు. ‘‘టీమిండియా కచ్చితగా తన నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాలి. అసలు గెలవాలన్న తపన వారిలో కనబడలేదు. గుడ్డిగా వెళ్లొద్దు కెప్టెన్ అయితే ఎప్పుడూ వెర్రిమొహం వేస్తున్నాడు. నిజానికి బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు. బ్యాటర్లు బౌలింగ్ చేయలేరు కదా! కానీ.. మనకు ఓ ప్లేయర్ ఇష్టమైనంత మాత్రాన గుడ్డిగా వాళ్లతో ప్రయోగాలు చేస్తే ఎలా? జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ల సేవలను వినియోగించుకోవాలి’’ అంటూ తనదైన శైలిలో చురకలు అంటించాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా అత్యంత సాధారణ జట్టులా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. గత టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించని జట్టు చేతిలో కూడా ఓటమి పాలయ్యారని విమర్శించాడు. గతంలో బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయారు కూడా! కాబట్టి.. సిల్లీ కామెంట్లు చేసే బదులు ఆటపై దృష్టిపెడితే బాగుంటుందని హార్దిక్ పాండ్యాకు చురకలు వేశాడు. ఇప్పటికైనా భ్రమల్లోంచి బయటకు రావాలని సెటైర్లు వేశాడు. చదవండి: IND VS WI 5th T20: విండీస్ గెలిచినా.. పూరన్‌కు కమిలిపోయింది..! India needs to improve their skillset. Their is a hunger & intensity deficiency & often the captain looked clueless. Bowler’s can’t bat, batsmen can’t bowl. It’s important to not look for yes men and be blinded because someone is your favourite player but look at the larger good — Venkatesh Prasad (@venkateshprasad) August 13, 2023 Catch the extended highlights from the 5th T20I T20I only on FanCode 👉 https://t.co/6EDO1Ijfiw . .#INDvWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/lHj2sAbLsn — FanCode (@FanCode) August 13, 2023 -
IND VS WI 5th T20: విండీస్ గెలిచినా.. పూరన్‌కు కమిలిపోయింది..!
5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియాపై దాదాపు 17 ఏళ్ల తర్వాత లభించిన విజయం (సిరీస్) కావడంతో విండీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విక్టరీని విండీస్ ప్లేయర్లు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవలి కాలంలో విండీస్‌కు ఈ స్థాయి విజయం దక్కడంతో ఆ దేశ మాజీలు సైతం రోవ్‌మన్ సేనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచిన నికోలస్ పూరన్‌ను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సిరీస్‌లో పూరన్ 141.94 స్ట్రయిక్ రేట్‌తో 176 పరుగులు చేసి తన జట్టు సాధించిన విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. The after effects 😂 thank you brandon king and arsdeep. pic.twitter.com/7jOHS46NSr — NickyP (@nicholas_47) August 14, 2023 అయితే ఇంత చేసి తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని అందించిన పూరన్‌కు మాత్రం శారీరక ప్రశాంతత లభించలేదు. ఐదో టీ20 సందర్భంగా పూరన్ సహచరుడు బ్రాండన్ కింగ్, ప్రత్యర్ధి అర్షదీప్ సింగ్ ధాటికి గాయాలపాలయ్యాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉండగా కింగ్ కొట్టిన ఓ షాట్ నేరుగా వచ్చి పూరన్ ఎడమ చేతిని బలంగా తాకగా.. అతని చేయి విరిగినంత పనైయ్యింది. అప్పటికప్పుడు ఆ నొప్పి తెలియలేదు కానీ, మ్యాచ్ అనంతరం పరిశీలించగా.. గాయమైన భాగం పూర్తిగా కమిలిపోయి, బంతి అచ్చు కనిపించింది. పూరన్ ఇదే మ్యాచ్‌లో అర్షదీప్ బౌలింగ్‌లోనూ గాయపడ్డాడు. కింగ్ దెబ్బ మరువక ముందే అర్షదీప్ వేసిన ఓ వేగవంతమైన బంతి నేరుగా వచ్చి పూరన్ కడుపుపై బలంగా తాకింది. ఆ క్షణం పూరన్ నొప్పితో విలవిలలాడిపోయాడు. అయితే వెంటనే తేరుకుని తిరిగి బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అయితే ఈ దెబ్బను సైతం మ్యాచ్ అనంతరం పరిశీలించగా.. గాయమైన ప్రాంతం పూర్తిగా కమిలిపోయి ఉండి, బంతి అచ్చు స్పష్టంగా కనిపించింది. ఈ దెబ్బలకు సంబంధించిన ఫోటోను పూరన్ మ్యాచ్ అనంతరం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి కింగ్, అర్షదీప్‌లను థ్యాంక్స్ చెప్పాడు. అనంతర ప్రభావాలు.. కింగ్, అర్షదీప్‌లను ధన్యవాదాలు అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Six or nothing for Nicholas Pooran 🔥 A power-packed start for the Calypso batter 👊#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/DLKUNzRUZr — JioCinema (@JioCinema) August 13, 2023 ఇదిలా ఉంటే, ఈ గాయాలు తగిలిన అనంతరం కూడా పూరన్ తన బ్యాటింగ్‌ను కొనసాగించి, తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కింగ్‌తో అతను రెండో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి తన జట్టు గెలుపుకు గట్టి పునాది వేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పూరన్ 35 బంతులు ఎదుర్కొని బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు, 85 పరుగులతో అజేయంగా నిలిచిన కింగ్.. షాయ్ హోప్ (22) సహకారంతో విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. విండీస్ మరో 2 ఓవర్లు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 -
క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. తిలక్ వర్మ మైండ్ బ్లాక్! వీడియో వైరల్
ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మను రిటర్న్ క్యాచ్‌తో ఛేజ్ పెవిలియన్‌కు పంపాడు. తన క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే ఛేజ్ మార్చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ అదిలోనే ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన జోషఫ్ బౌలింగ్‌లో తిలక్ వర్మ.. ఏకంగా 19 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో తిలక్‌ను అడ్డుకునేందుకు విండీస్ కెప్టెన్ స్పిన్నర్ ఛేజ్‌ను తీసుకువచ్చాడు. అస్సలు ఊహించలేదు.. అయితే రోవ్‌మన్ పావెల్ నమ్మకాన్ని ఛేజ్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్లోనే సంచలన ఫామ్‌లో ఉన్న తిలక్‌ను పెవిలియన్‌కు పంపాడు. 7 ఓవర్ వేసిన ఛేజ్ బౌలింగ్‌లో ఐదో బంతిని వర్మ లాంగ్‌ఆఫ్ దిశగా ఫ్లిక్ చేశాడు. ఈ క్రమంలో ఛేజ్ అద్భుతంగా డైవ్‌చేస్తూ రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. అయితే అది బంప్బాల్ అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటుచేసుకుంది. బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకి నేరుగా ఛేజ్ చేతికి వెళ్లి నట్లు తేలింది. దీంతో 27 పరుగులు చేసిన తిలక్ వర్మ నిరాశతో మైదానాన్ని వీడాడాడు. ఛేజ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సిరీస్‌ను 3-2 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. చదవండి: #Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? Roston Chase that was an absolutely fantastic catch! pic.twitter.com/tfa7X55Ttm — Q Sports Sport Reporter🇹🇹 (@yannickatnite) August 13, 2023 -
మా ఓటమికి కారణమదే.. ఆ విషయంలో మేము ఇంకా మెరుగుపడాలి: ద్రవిడ్
టీ20 క్రికెట్లో నెం1గా ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ భారీ షాకిచ్చింది. స్వదేశంలో భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2తో విండీస్ సొంతం చేసుకుంది. ఫ్లోరిడా వేదికగా ఆఖరి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన వెస్టిండీస్.. ఆరేళ్ల తర్వాత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక సిరీస్ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే సిరీస్‌ను కోల్పోయామని ద్రవిడ్ తెలిపాడు. "తొలుత టెస్టు, వన్డే సిరీస్‌లో మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అదే విధంగా టీ20 సిరీస్‌లో కూడా మేము తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయాం. అయినప్పటికీ మేము అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి సిరీస్‌ను సమం చేశాం. కానీ ఆఖరి మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను కోల్పోయాం. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు, ఐదో టీ20లో మేము కొన్ని తప్పులు చేశాం. ఈ మూడు మ్యాచ్‌ల్లో కూడా బ్యాటింగ్ బాగా చేయలేదు. అయితే జట్టు మొత్తం యువ ఆటగాళ్లతో కూడి ఉన్నది. కాబట్టి కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు ఛాన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించకున్నాం. అదేవిధంగా సరికొత్త కాంబనేషన్స్ను కూడా ప్రయత్నించాం. ఈ విషయంలో అయితే కొంతమెరకు మేము విజయం సాధించాం. జైశ్వాల్, తిలక్ వంటి యువ ఆటగాళ్లు తమ సత్తాచాటారు. నాలుగో టీ20లో జైశ్వాల్ తన టాలెంట్ చూపించాడు. తిలక్ కూడా బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. అయితే విండీస్ పర్యటనలో మాకు కొన్ని పాజిటివ్ అంశాలతో పాటు ప్రతికూల విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో మేము ఈ విషయాల్లో మెరుగవ్వాలన్నది ఈ కరేబియన్ టూర్లో తెలుసుకున్నాం. ముఖ్యంగా మా బ్యాటింగ్ డెప్త్‌ను ఇంకా పెంచుకోవాలి. బౌలింగ్ అయితే మరి అంత బలహీనంగా లేదు. మాకు ముందు ఇంకా చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. అందుకు తగట్టు సిద్దం కావడమే మా పని అని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ద్రవిడ్ పేర్కొన్నాడు. చదవండి: Ind vs WI: కొరకరాని కొయ్య.. తిలక్ వర్మ నుంచి ఇది ఊహించలేదు! వీడియో వైరల్ -
Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్! నోర్ముయ్..
West Indies vs India, 5th T20I - Nicholas Pooran: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీమిండియాతో టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. మేజర్ క్రికెట్ లీగ్-2023 ఫామ్‌ను కొనసాగిస్తూ.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నిక్కీ వరుసగా 41, 67(ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), 20, 1, 47 పరుగులు సాధించాడు. పాండ్యా బౌలింగ్‌లో.. ముఖ్యంగా నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో ఓపెనర్ బ్రాండన్ కింగ్(85- నాటౌట్)తో కలిసి విండీస్‌ను గెలుపుబాట పట్టించడంలో కీలకంగా వ్యవహరించాడు. 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇందులో రెండు సిక్స్‌లు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బాదినవే! చాలెంజ్‌కు ప్రతీకారంగా అయితే, ఆట తీరుతో ఆకట్టుకున్న నికోలస్ పూరన్.. హార్దిక్ పాండ్యాకు మించిన ఆటిట్యూడ్‌తో టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మూడో టీ20 ముగిసిన తర్వాత హార్దిక్.. ‘‘నిక్కీ నా బౌలింగ్‌ను టార్గెట్ చేస్తాడేమో! మరేం పర్లేదు.. నాకిలాంటివి ఇష్టమే. అతడు నా మాటలు విని నన్ను లక్ష్యంగా చేసుకున్నా.. ఆఖర్లో నాకు వికెట్ సమర్పించుకోవాల్సిందే!’’ అని చాలెంజ్ విసిరాడు. నోరు మూసుకోండి అయితే, ఐదో టీ20లో ఇది బ్యాక్‌ఫైర్ అయింది. పాండ్యా బౌలింగ్‌లోనే పూరన్ మంచి షాట్లు ఆడాడు. కానీ.. తిలక్ వర్మ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్ 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది. విజయానంతరం వెంటనే విండీస్‌కు బయల్దేరిన నికోలస్ పూరన్ షేర్ చేసిన రీల్ టీమిండియా ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. అకీల్ హొసేన్తో కలిసి.. ‘‘నోరు మూసుకోవాలి’’ అన్నట్లు అభినయించాడు. అక్కడ చూపించు నీ సత్తా ‘‘ఒకవేళ దీని గురించి మీకు తెలిస్తే.. తెలుసనే అనుకోండి’’ అని క్యాప్షన్ జతచేశాడు. దీంతో నిక్కీ హార్దిక్‌నే టార్గెట్ చేశాడని.. భారత జట్టును కూడా అవమానించే విధంగా వ్యవహరించాడంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మేజర్ ఈవెంట్లో నీ సత్తా చూపించు.. అప్పుడు నమ్ముతాం గొప్ప బ్యాటర్‌వి అని ట్రోల్ చేస్తున్నారు. చదవండి: నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్ Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 View this post on Instagram A post shared by Nicholas Pooran (@nicholaspooran) -
Ind vs WI: కొరకరాని కొయ్య.. తిలక్ వర్మ నుంచి ఇది ఊహించలేదు! వీడియో
West Indies vs India, 5th T20I: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓడిపోయి ఘోర పరాభవం మూటగట్టుకుంది టీమిండియా. పసికూనలతో పోటీ పడి ఐసీసీ మెగా ఈవెంట్లకు అర్హత సాధించలేక చతికిలపడ్డ విండీస్ చేతిలో ఓటమిపాలైంది. అయితే, ఈ పర్యటన ద్వారా యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ రూపంలో ఇద్దరు యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. అరంగేట్రంలో అదరగొట్టి కేవలం ఐపీఎల్‌కు మాత్రమే తమ ఆట పరిమితం కాదని.. అంతర్జాతీయ క్రికెట్లోనూ సత్తా చాటగలమని నిరూపించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే విలువైన ఇన్నింగ్స్ ఆడి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టారు. టెస్టులో సెంచరీతో యశస్వి మెరవగా.. తిలక్ తొలి టీ20లోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్ కూడా.. ఇక వెస్టిండీస్‌తో నాలుగో టీ20కి ముందు భవిష్యత్తులో వీరిద్దరితో బౌలింగ్ కూడా చేయిస్తామంటూ టీమిండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే పేర్కొన్న విషయం తెలిసిందే. నైపుణ్యాలకు పదును పెడితే కచ్చితంగా బౌలర్లుగా కూడా రాణించలగరని విశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి వికెట్‌గా బిగ్ హిట్టర్ అందుకు తగ్గట్లుగానే తిలక్ వర్మ ఐదో టీ20లో 2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. నికోలస్ పూరన్ వంటి బిగ్ హిట్టర్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రాండన్ కింగ్‌తో మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి కొరకరాని కొయ్యగా మారిన పూరన్ ఆట కట్టించాడు. 35 బంతుల్లో 47 పరుగులతో జోరు మీదున్న అతడిని బోల్తా కొట్టించాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13.2 ఓవర్లో తిలక్ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన పూరన్.. స్విచ్ హిట్‌కు యత్నించి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. అయితే, విండీస్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ అవుటివ్వడంతో పూరన్ పెవిలియన్ చేరాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నికోలస్ పూరన్ రూపంలో తిలక్ వర్మ తన తొలి అంతర్జాతీయ వికెట్ దక్కించుకున్నాడు. బ్యాట్ ఝులిపించి.. బౌలింగ్‌లోనూ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆతిథ్య కరేబియన్ జట్టు 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తిలక్ తొలి మూడు టీ20లలో వరుసగా 39,51,49 పరుగులు సాధించాడు. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో ఈ హైదరాబాదీ 27 పరుగులు చేయగలిగాడు. చదవండి: ఓవరాక్షన్ చేస్తే అలానే ఉంటుంది.. హార్దిక్‌ను ఉతికారేసిన పూరన్! వీడియో వైరల్ Whatever he touches turns to gold 👌🔥 Tilak Varma 👊 can't do no wrong as he picks up the big wicket of Nicholas Pooran ☝️ #WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/5lFHAP4lml — JioCinema (@JioCinema) August 13, 2023 -
ఓవరాక్షన్ చేస్తే అలానే ఉంటుంది.. హార్దిక్‌ను ఉతికారేసిన పూరన్! వీడియో వైరల్
టీమిండియాపై టెస్టు, వన్డే సిరీస్‌ల ఓటమికి వెస్టిండీస్ ప్రతీకారం తీర్చుకుంది. ఫ్లోరిడా వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో కరేబియన్ జట్టు కైవసం చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత భారత్‌పై విండీస్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం గమానార్హం. విండీస్ విజయంలో పేసర్ షెఫార్డ్, బ్యాటర్లు కింగ్, పూరన్ కీలక పాత్ర పోషించారు. హార్దిక్‌కు చుక్కలు చూపించిన పూరన్.. ఇక టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ బదులు తీర్చుకున్నాడు. నాలుగో టీ20కు ముందు హార్దిక్ పాండ్యా.. పూరన్‌కు ఓ సవాలు విసిరాడు. "పూరన్ కొడితే నా బౌలింగ్‌లోనే కొట్టాలి. మా ప్లాన్స్ మాకు ఉన్నాయి. నాకు ఇటువంటి పోటీ అంటే చాలా ఇష్టం. నా మాటలు పూరన్ విని నాలుగో టీ20లో నన్ను టార్గెట్ చేస్తాడని" మూడో టీ20 అనంతరం హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నాలుగో టీ20లో పూరన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో హార్దిక్ బౌలింగ్‌ను ఎదుర్కొనే ఛాన్స్ పూరన్‌కు రాలేదు. కానీ నిర్ణయాత్మక ఐదో టీ20లో మాత్రం హార్దిక్ బౌలింగ్ ఆడే అవకాశం నిక్కీకి వచ్చింది. ఈ క్రమంలో హార్దిక్‌కు పూరన్ చుక్కలు చూపించి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. పూరన్ వచ్చిరాగానే మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అందులో రెండు సిక్సర్లు హార్దిక్ ఓవర్లో కొట్టినివే. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన హార్దిక్ బౌలింగ్‌లో ఆఖరి రెండు బంతులను పూరన్ సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 18 బంతులు ఆడి 14 పరుగులు చేసిన పాండ్యా.. అనంతరం బౌలింగ్‌లో అయితే ఘోరప్రదర్శన కనబరిచాడు. 3 ఓవర్లు వేసి 32 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్ In 3rd T20I - Hardik pandya Gave an Overconfident Statement about Nicholas pooran. In 5th T20I - Nicholas Pooran Smashed him all over the park for 6 and 4. This is what I don't like About Hardik Pandya! pic.twitter.com/7XL2X97rn8 — ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) August 13, 2023 Six or nothing for Nicholas Pooran 🔥 A power-packed start for the Calypso batter 👊#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/DLKUNzRUZr — JioCinema (@JioCinema) August 13, 2023 -
నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్
స్వదేశంలో టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కరేబియన్ జట్టు సొంతం చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత భారత్‌పై విండీస్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం గమానార్హం. విండీస్ చివరగా 2017లో టీమిండియాపై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక చారిత్రత్మక సిరీస్ విజయంపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ స్పందించాడు. "టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో ఏమి మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించడానికి చాలా కష్టపడ్డాం. మ్యాచ్‌కు ముందు రోజు సాయంత్రం మేము ఓ మీటింగ్ పెట్టుకున్నాం. కరేబియన్ ప్రజలు మన నుంచి గెలుపు ఆశిస్తున్నారని మా బాయ్స్‌కు చెప్పా. మేము విజయం సాధించడంలో కోచింగ్ స్టాప్‌ది కీలక పాత్ర. మేము వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందడంతో కాస్త నిరాశ చెందాము. కానీ మా కోచింగ్ స్టాప్ మాత్రం మాకు మద్దతుగా నిలిచారు. ఈ సిరీస్‌లో మా జట్టు నుంచి చాలా మంది ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనతో అకట్టుకున్నారు. జట్టులో ఎవరో ఒకరు రాణించినా కొన్ని సందర్భాల్లో మేలు జరుగుతుంది. ముఖ్యంగా నికోలస్ పూరన్ ఈ సిరీస్‌లో మాకు కీలక విజయాలు అందించాడు. అతడు మా జట్టులో ముఖ్యమైన ఆటగాడు. పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉన్న మా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలనకుంటున్నాను. అదే విధంగా మాకు సపోర్ట్‌గా నిలిచిన విండీస్ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పావెల్ పేర్కొన్నాడు. చదవండి: #Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? Drought broken 👏 The West Indies claim T20I series bragging rights over India in Florida! More from #WIvIND 👇https://t.co/dvEJ9cwGIw — ICC (@ICC) August 14, 2023