వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తీవ్ర నిరాశపరిచాడు. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో శాంసన్ విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన కీలక ఐదో టీ20లో కూడా శాంసన్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన సంజూ.. 9 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. 32 పరుగులు మాత్రమే చేసశాడు. అంతకుముందు వన్డే సిరీస్‌లో కూడా ఒక హాఫ్‌సెంచరీ మినహా పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఎప్పటి నుంచో జట్టులో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న సంజూ.. ఇటువంటి ప్రదర్శన చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సంజూ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనని, ఐపీఎల్‌లో ఆడుకోవడమేనని నెటిజన్లు సెటైర్‌లు వేస్తున్నారు.
Thankyou sanju samson 🙏 pic.twitter.com/SOFhyRWGNr
— Arun Singh (@ArunTuThikHoGya) August 13, 2023
కాగా ఐపీఎల్‌లో 3800పైగా పరుగులు చేసిన సంజూ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన శాంసన్ 18.62 సగటుతో కేవలం 333 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ క్రమంలో అతడికి ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో చోటు దక్కే అవకాశం లేదు. ఇక ఆఖరి టీ20లో ఓటమి పాలైన టీమిండియా 3-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.
చదవండి: ఓడిపోవడం మంచిదే.. మా బాయ్స్ అద్భుతం! చాలా సంతోషంగా ఉన్నా: హార్దిక్
Samson in T20I (So far)
— hitman Hargun godara (@GodaraHargun) August 13, 2023
19, 6, 8, 2, 23, 15, 10, 27, 7, 0, 39, 18, 77, 30*, 15, 5, 12, 7, 13
Average : 18.50
should he get more chances in this format?? #SanjuSamson #INDvsWI pic.twitter.com/dr9kZLsQD6
Comments
Please login to add a commentAdd a comment