భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్టును ప్రకటించింది. హేలీ మాథ్యూస్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను గురువారం వెల్లడించింది. కాగా భారత్- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లకు షెడ్యూల్ ఖరారైంది.
డిసెంబరు 15న టీ20తో మొదలు
నవీ ముంబై వేదికగా డిసెంబరు 15న టీ20తో మొదలుకానున్న విండీస్ ఇండియా టూర్.. డిసెంబరు 27న మూడో వన్డేతో ముగియనుంది. పొట్టి సిరీస్‌కు నవీ ముంబై వేదికకాగా... బరోడా వన్డే సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రకటించిన విండీస్ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ స్టెఫానీ టేలర్ పేరు మిస్ అయింది.
మహిళల టీ20 ప్రపంచకప్ -2024 సందర్భంగా స్టెఫానీ మోకాలికి గాయమైంది. ఆ తర్వాత మళ్లీ ఆమె మైదానంలో దిగలేదు.ఇప్పుడు ఇండియా టూర్‌కు కూడా స్టెఫానీ దూరమైంది. మరోవైపు.. మాజీ కెప్టెన్ డియాండ్ర డాటిన్ దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే క్రికెట్‌లో పునరాగమనం చేయనుంది. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో విండీస్ సెమీస్ చేరగా.. భారత జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది.
భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు వెస్టిండీస్ మహిళా జట్టు
హేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ కాంప్‌బెల్ (వైస్ కెప్టెన్), ఆలియా అల్లీన్, షమీలియా కాన్నెల్, నెరిస్సా క్రాఫ్టన్, డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, షబికా గజ్నాబి, చినెల్ హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మిని మునిసర్, కరిష్మా రాంహారక్, రషదా విలియమ్స్ .
భారత్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్
టీ20 సిరీస్
👉మొదటి టీ20- డిసెంబరు 15- ఆదివారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై
👉రెండో టీ20- డిసెంబరు 17- మంగళవారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై
👉మూడో టీ20- డిసెంబరు 19- గురువారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై
వన్డే సిరీస్
👉తొలి వన్డే- డిసెంబరు 22- ఆదివారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా
👉రెండో వన్డే- డిసెంబరు 24- మంగళవారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా
👉మూడో వన్డే- డిసెంబరు 27- శుక్రవారం- ఉదయం తొమ్మిదిన్నర గంటలకు- బరోడా.
Comments
Please login to add a commentAdd a comment