Baroda
-
వందేళ్ల నాటి పైథానీ చీరలో బరోడా మహారాణి రాధికా రాజే..!
డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ఫేమస్ బ్రాండ్ సబ్యసాచి(Sabyasachi) 25వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొనేవాళ్లంతా రాయల్టీకి అద్దం పట్టేలా డ్రెస్ లుక్ ఉండాలి. తప్పనిసరిగా నలుపు రంగు డ్రెస్‌కోడ్ అనుసరించాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ నిబంధనలకు అనుగుణంగా రాజరికదర్పంతో అద్భుతంగా కనిపించారు మహారాష్ట్ర మహారాణి రాధికా రాజే గైక్వాడ్(Radhika Raje Gaekwad ). ఆమె ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన భవంతుల్లో ఒకటైన గుజరాత్ వడోదరలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో నివశిస్తోంది. ఈ వేడుకలో ఆమె నాటి రాజరికపు చరిత్రను గుర్తు చేసేలా శతాబ్దాల నాటి పురాతన చీరలో మెరిసింది. ఇది వందేళ్ల నాటి పైథానీ నౌవారీ(Black Paithani Nauvari Saree) నలుపు రంగు చీర. చెప్పాలంటే తొమ్మిది గజాల కాటన్ పైథానీ చీర ఇది. ఈ చీర జరీని స్వచ్ఛమైన బంగారంతో తయారు చేస్తారు. View this post on Instagram A post shared by Radhikaraje Gaekwad (@radhikaraje) ఇది మహారాష్ట్ర సంప్రదాయ చీర. రాధిక రాజేకు మన భారతీయ వారసత్వ చీరలంటే ఆమెకు మహా ప్రీతి. ఎవరికైన పురాతన కాలం నాటి చారిత్రక నేపథ్యంతో ముడిపడి ఉన్న చీరల గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఆమె ఇన్స్టాగ్రామ్ ఓ నిధిలా ఉంటుంది. అంతలా పురాతన చీరల కలెక్షన్ రాధిక రాజే వద్ద ఉంది. అందుకు సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అలాగే పోస్ట్‌లో తొమ్మిది గజాల లేదా నౌవారీ చీర గురించి రాశారు. టిష్యూలు, షిఫాన్లు విస్పీడ్రేప్, సున్నితమైన జరీ మోటిఫ్‌లు, గోసమర్ టచ్‌తో కూడిన కాటన్ చందేరీలు మహారాష్ట్ర మహిళలకు ఎంతో ఇష్టమైనవి. ప్రస్తుతం అలాంటి తొమ్మిది గజాల చీర కొనడం అనేది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. పైగా వీటిని ఎక్కువగా సీనియర్ మహిళలు(అమ్మమ్మలు, బామ్మలు) ధరిస్తున్నారు. ఇలాంటి తొమ్మది గజాల చీరలను మాత్రం ముంబైలోని పనిమనుషులు, మత్స్యకారుల ఒంటిపై దర్శనమిస్తున్నాయి." అని పేర్కొన్నారు రాధికా రాజే. View this post on Instagram A post shared by Radhikaraje Gaekwad (@radhikaraje) (చదవండి: కోడలికి గిఫ్ట్‌గా 'ఖందానీ హార్'ఇచ్చిన నీతా అంబానీ..! ప్రత్యేకత ఇదే) -
కేకేఆర్‌కు గుడ్ న్యూస్.. అరివీర భయంకరమైన ఫామ్‌లో రహానే
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు కేకేఆర్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీఫైనల్లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ టోర్నీలో రహానే గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.మహారాష్ట్రతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో రహానే పరుగుల ప్రవాహం మొదలైంది. ఆ మ్యాచ్‌లో అతను 34 బంతుల్లో 52 పరుగుల చేశాడు. ఆతర్వాత కేరళతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అనంతరం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు.రహానే విశ్వరూపం ఆంధ్రతో జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌తో మొదలైంది. ఈ మ్యాచ్‌లో రహానే 53 బంతుల్లో 95 పరుగులు చేశాడు. అనంతరం విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీస్‌లో 57 బంతుల్లో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.ప్రస్తుత సీజన్లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ) రహానే లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో రహానే 8 మ్యాచ్‌లు ఆడి 172 స్ట్రయిక్ రేట్‌తో 366 పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన సెమీస్‌లో రహానే రఫ్ఫాడించడంతో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు చేరింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (33), కృనాల్ పాండ్యా (30), శివాలిక్ శర్మ (26 నాటౌట్), అథీత్ సేథ్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్ అయ్యర్ (46) కూడా కాసేపు మెరుపు మెరిపించాడు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు డిసెంబర్ 15న జరిగే అంతిమ పోరులో ముంబైతో తలపడనుంది. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో అజింక్య రహానేను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.1.5 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. -
హార్దిక్ పాండ్యా విఫలం
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగింపు దశకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా శుక్రవారం రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో బరోడాతో ముంబై జట్టు తలపడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.బరోడా నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లలో శశ్వత్ రావత్(33) ఫర్వాలేదనిపించినా.. అభిమన్యు రాజ్‌పుత్(9) విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కృనాల్ పాండ్యా 24 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ భాను పనియా(2) నిరాశపరిచాడు.ఈ దశలో శివాలిక్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక హార్దిక్ పాండ్యా ఐదు పరుగులకే నిష్క్రమించగా.. ఆల్‌రౌండర్ అతిత్ సేత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 22 పరుగులతో.. శివాలిక్ శర్మకు సహకారం అందించాడు.పాండ్యాను అవుట్ చేసిన దూబేఇక బరోడా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి మహేశ్ పితియా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్థి, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను శివం దూబే అవుట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ల మధ్య పోరులో దూబే పైచేయి సాధించాడు. దూబే బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి హార్దిక్ అవుటయ్యాడు. కాగా ఫామ్‌లో ఉన్న ముంబై బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సులువుగానే పూర్తి చేస్తుందని ఆ జట్టు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదుక్వార్టర్ ఫైనల్లో విదర్భ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ముంబై సెమీస్‌కు చేరితే... బెంగాల్‌పై గెలిచి బరోడా ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ముంబై తరఫున సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే ఫుల్ ఫామ్‌లో ఉండగా... గత మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీ షా కూడా రాణించాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెగ్డె, శార్దూల్ ఠాకూర్ ఇలా ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు.ఢిల్లీతో మధ్యప్రదేశ్..మరోవైపు బరోడా జట్టుకు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రూపంలో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా బ్యాటింగ్ పరంగా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక రెండో సెమీఫైనల్లో ఆయుశ్ బదోనీ సారథ్యంలోని ఢిల్లీ జట్టు... మధ్యప్రదేశ్‌తో తలపడనుంది. ఢిల్లీకి అనూజ్ రావత్, యశ్ ధుల్ కీలకం కానుండగా... రజత్ పాటిదార్, వెంకటేశ్ అయ్యర్‌పై మధ్యప్రదేశ్ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. pic.twitter.com/DrAAm9Ubd1— Sunil Gavaskar (@gavaskar_theman) December 13, 2024 -
షాబాజ్ అహ్మద్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా.. సెమీస్‌లో బరోడా
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో మరో సెమీ ఫైనలిస్టు ఖరారైంది. బెంగాల్‌పై 41 పరుగుల తేడాతో గెలిచిన బరోడా టాప్-4లో అడుగుపెట్టింది. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టుకు కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక అతడి తమ్ముడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఈసారి దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు.ప్రపంచ రికార్డుకాగా కృనాల్ సారథ్యంలో బరోడా జట్టు ఈసారి అద్భుతాలు సృష్టించింది. లీగ్ దశలో భాగంగా సిక్కిం జట్టుపై పరుగుల విధ్వంసానికి పాల్పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.ఇదే జోరులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న బరోడా జట్టు.. బుధవారం బెంగాల్ జట్టుతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.రాణించిన ఓపెనర్లుపాండ్యా బ్రదర్స్ హార్దిక్(10), కృనాల్(7) పూర్తిగా విఫలమైనా.. ఓపెనర్లు శశ్వత్ రావత్(40), అభిమన్యు సింగ్(37) ఆకట్టుకున్నారు. వీరికి తోడు శివాలిక్ శర్మ(24), భాను పనియా(17), విష్ణు సోలంకి(16 నాటౌట్) రాణించారు. ఇక బెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ తలా రెండు వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన బెంగాల్‌కు ఓపెనర్ అభిషేక్ పోరెల్(13 బంతుల్లో 22) మెరుపు ఆరంభం అందించినా.. మరో ఓపెనర్ కరణ్ లాల్(6), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సుదీప్ కుమార్ ఘరామి(2) పూర్తిగా విఫలమయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన రితిక్ ఛటర్జీ సైతం డకౌట్‌గా వెనుదిరిగాడు.షాబాజ్ మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలో రిత్విక్ చౌదరి(18 బంతుల్లో 29)తో కలిసి టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 36 బంతుల్లోనే 55 పరుగులతో షాబాజ్ చెలరేగాడు. అయితే, రితిక్‌ను హార్దిక్ పాండ్యా, షాబాజ్‌ను అతిత్ సేత్ అవుట్ చేయడంతో బెంగాల్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. బరోడా బౌలర్ల ధాటికి.. మిగతా వాళ్లలో ప్రదీప్త 3, సాక్షిమ్ చౌదరి 7, షమీ 0, కనిష్క్ 5(నాటౌట్), సయాన్ ఘోష్(0) చేతులెత్తేశారు.ఫలితంగా 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయిన బెంగాల్.. 41 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు.. బరోడా సెమీ ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది. సెమీస్‌లో బరోడాబరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లుక్మాన్ మెరివాలా, అతిత్ సేత్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. అభిమన్యు ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ సౌరాష్ట్రను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.చదవండి: అతడికి ఆసీస్ జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్ -
హార్దిక్ పాండ్యా విఫలం.. షమీకి రెండు వికెట్లు
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్ ముగింపునకు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌కు చేరే క్రమంలో ఎనిమిది జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్, బరోడా- బెంగాల్, ముంబై- విదర్భ, ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి.ఇందులో భాగంగా తొలుత సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్(క్వార్టర్ ఫైనల్-3) మ్యాచ్ ఫలితం వెలువడింది. కర్ణాటకలోని ఆలూర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్రపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచింది. తద్వారా సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.బరోడా ఓపెనర్లు భళాఇక క్వార్టర్ ఫైనల్-1లో భాగంగా బరోడా బెంగాల్‌తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు శశ్వత్ రావత్(26 బంతుల్లో 40), అభిమన్యు సింగ్ రాజ్‌పుత్(34 బంతుల్లో 37) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు.పాండ్యా బ్రదర్స్ విఫలంమొత్తంగా 11 బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేశాడు హార్దిక్ పాండ్యా. ఇక అతడి అన్న, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా సైతం పూర్తిగా నిరాశపరిచాడు. పదకొండు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేసి నిష్క్రమించాడు. శివాలిక్, విష్ణు మెరుపు ఇన్నింగ్స్మిగతా వాళ్లలో శివాలిక్ శర్మ(17 బంతుల్లో 24), భాను పనియా(11 బంతుల్లో 17), విష్ణు సోలంకి(7 బంతుల్లో 16 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగలిగింది. బెంగాల్ బౌలర్లలో టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గెలుపు కోసం నువ్వా- నేనా అన్నట్లు పోటీపడిన ఈ మ్యాచ్‌లో బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన హార్దిక్ మూడు వికెట్లతో మెరిశాడు.బరోడా వర్సెస్ బెంగాల్ తుదిజట్లుబెంగాల్అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరణ్ లాల్, సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), రిటిక్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, రిత్విక్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కనిష్క్ సేథ్, మహ్మద్ షమీ, సాక్షిమ్ చౌదరి, సయన్ ఘోష్.బరోడాశశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్, భాను పనియా, శివాలిక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విష్ణు సోలంకి (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), అతిత్ షేత్, మహేష్ పితియా, లుక్మాన్ మేరీవాలా, ఆకాష్ మహరాజ్ సింగ్చదవండి: SMAT 2024: వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్ -
షమీ మళ్లీ మాయ చేస్తాడా?.. నేటి నుంచే ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్స్ పోరు
శస్త్రచికిత్స అనంతరం తిరిగి మైదానంలో అడుగు పెట్టిన భారత సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ... దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో పోరుకు సిద్ధమయ్యాడు. రంజీ ట్రోఫీలో రాణించి ఫిట్నెస్ చాటుకున్న షమీ... ముస్తాక్ అలీ ట్రోఫీలో అటు బంతితో ఇటు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. చండీగఢ్‌తో కీలక ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆల్‌రౌండ్ మెరుపులతో షమీ బెంగాల్ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో నేడు నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. బరోడాతో బెంగాల్, మధ్యప్రదేశ్‌తో సౌరాష్ట్ర, ముంబైతో విదర్భ, ఢిల్లీతో ఉత్తరప్రదేశ్ తలపడనున్నాయి. గాయం నుంచి కోలుకున్న అనంతరం షమీ దేశవాళీల్లో 64 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 16 వికెట్లు పడగొట్టాడు. ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చివరి రెండు టెస్టుల కోసం షమీ ఆసీస్ వెళ్లనున్నాడనే వార్తల నేపథ్యంలో... అతడికి ముస్తాక్ అలీ టోర్నీ క్వార్టర్ ఫైనల్ మరో అవకాశం ఇస్తోంది.మరోవైపు ఇటీవల సిక్కింపై 20 ఓవర్లలో 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన బరోడా జట్టు... అదే జోష్‌లో సెమీఫైనల్లో అడుగు పెట్టాలని భావిస్తోంది. బరోడా బ్యాటింగ్ సామర్థ్యానికి... బెంగాల్ బౌలింగ్ నైపుణ్యానికి మధ్య తీవ్ర పోటీ ఖాయం. రింకూ మెరిసేనా?ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ నుంచి రింకూ సింగ్‌పై అందరి దృష్టి నిలవనుంది. మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్, రజత్ పాటిదార్ కీలకం కానుండగా...విదర్భతో పోరులో ముంబై జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు.చదవండి: సిరాజ్‌ను సీనియర్లే నియంత్రించాలి: ఆసీస్ మాజీ కెప్టెన్ -
టీ20 క్రికెట్లో పెను సంచలనం.. హార్దిక్ పాండ్యా లేకుండానే ప్రపంచ రికార్డు!
టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. కృనాల్ పాండ్యా కెప్టెన్సీలోని బరోడా జట్టు 349 పరుగులతో ప్రపంచ రికార్డు సాధించింది. భారత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా ఈ ఫీట్ నమోదు చేసింది. ఇండోర్ వేదికగా సిక్కింపై ఈ మేర పరుగుల విధ్వంసం సృష్టించింది.ఆది నుంచే దంచికొట్టారుఈ నేపథ్యంలో జింబాబ్వే పేరిట ఉన్న ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన బరోడా.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో రంగంలోకి దిగకుండానే.. బరోడా ప్లేయర్లు తమ వీరబాదుడుతో ఈ అరుదైన ఘనతను జట్టు ఖాతాలో వేశారు.కాగా ఇండోర్‌లోని ఎమరాల్డ్ హై స్కూల్ గ్రౌండ్లో గురువారం సిక్కిం జట్టుతో బరోడా తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బరోడాకు ఓపెనర్లు శశ్వత్ రావత్(16 బంతుల్లో 43), అభిమన్యు సింగ్(53) అదిరిపోయే ఆరంభం అందించారు.ఊచకోత.. 15 సిక్సర్లువీళ్లిద్దరు మెరుపు ఇన్నింగ్స్ ఆడితే.. వన్‌డౌన్‌లో వచ్చిన భాను పనియా మాత్రం తుఫాన్ ఇన్నింగ్స్‌తో సిక్కిం బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 51 బంతులు ఎదుర్కొని ఏకంగా 134 పరుగులతో అజేయంగా నిలిచాడు. భాను పనియా ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు ఉంటే.. సిక్సర్లు ఏకంగా 15 ఉండటం విశేషం.మిగతా వాళ్లలో శైవిక్ శర్మ(17 బంతుల్లో 55), వికెట్ కీపర్ విష్ణు సోలంకి(16 బంతుల్లో 50) బ్యాట్‌తో వీరవిహారం చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన బరోడా జట్టు 349 పరుగులు చేసింది. సిక్కిం బౌలర్లలో పల్జోర్ తమాంగ్, రోషన్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. తరుణ్ శర్మ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే రికార్డు బ్రేక్కాగా టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా జింబాబ్వే ఇటీవల గాంబియాపై 344-4 స్కోరు చేసింది. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో ఇదే అత్యధిక స్కోరు. అయితే, ఈ రికార్డును ఇప్పుడు బరోడా అధిగమించింది.చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
హ్యాట్రిక్ తీసిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. డకౌటైన పాండ్యా బ్రదర్స్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ గోపాల్ ఈ ఘనత సాధించాడు. గోపాల్ సాధించిన హ్యాట్రిక్‌లో టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వికెట్లు ఉన్నాయి. పాండ్యా సోదరులను గోపాల్ ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపాడు. వరుస బంతుల్లో గోపాల్.. హార్దిక్, కృనాల్ వికెట్లతో పాటు శాశ్వత్ రావత్ వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో గోపాల్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. గోపాల్ బంతితో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఓటమిపాలైంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ (34 బంతుల్లో 56; 6 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. స్మరన్ రవిచంద్రన్ (38), కృష్ణణ్ శ్రీజిత్ (22), శ్రేయస్ గోపాల్ (18), మనీశ్ పాండే (10) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలమయ్యాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, అతీత్ సేథ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. లుక్మన్ మేరీవాలా, ఆకాశ్ మహారాజ్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా.. శ్రేయస్ గోపాల్ (4-0-19-4) దెబ్బకు మధ్యలో ఇబ్బంది పడింది. 15 పరుగుల వ్యవధిలో గోపాల్ నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు. అయితే శివాలిక్ శర్మ (22), విష్ణు సోలంకి (28 నాటౌట్), అతీత్ సేథ్ (6 నాటౌట్) కలిసి బరోడాను విజయతీరాలకు చేర్చారు. మరో ఏడు బంతులు మిగిలుండగానే బరోడా లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). బరోడా ఇన్నింగ్స్‌లో శాశ్వత్ రావత్ (63), భాను పూనియా (42) రాణించారు.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ గోపాల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గోపాల్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. గోపాల్‌కు ఐపీఎల్‌లోనూ హ్యాట్రిక్ తీసిన ఘనత ఉంది. -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. ఒకే ఓవర్లో 28 పరుగులు! వీడియో వైరల్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాండ్యా మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.త్రిపుర బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా త్రిపుర స్పిన్నర్ పర్వేజ్ సుల్తాన్‌ను ఈ బరోడా ఆల్‌రౌండర్ ఊతికారేశాడు. బరోడా ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన పర్వేజ్ బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో పాండ్యా 28 పరుగులు పిండుకున్నాడు.ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా బరోడా 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో చేధించింది. బరోడా బ్యాటర్లలో పాండ్యాతో పాటు మితీష్ పటేల్ 37 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. త్రిపుర బ్యాటర్లలో కెప్టెన్ మన్దీప్ సింగ్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బరోడా బౌలర్లలో అభిమన్యు సింగ్ మూడు వికెట్లు, కెప్టెన్ కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 115.50 సగటుతో 231 పరుగులు చేశాడు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? Hardik Pandya was on fire again 🔥🔥The Baroda all-rounder went berserk smashing 6⃣,6⃣,6⃣,4⃣,6⃣ in an over on his way to a whirlwind 47(23) against Tripura 🙌🙌#SMAT | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/1WPFeVRTum pic.twitter.com/xhgWG63y9g— BCCI Domestic (@BCCIdomestic) November 29, 2024 -
భారత్‌తో సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్టును ప్రకటించింది. హేలీ మాథ్యూస్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను గురువారం వెల్లడించింది. కాగా భారత్- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లకు షెడ్యూల్ ఖరారైంది.డిసెంబరు 15న టీ20తో మొదలునవీ ముంబై వేదికగా డిసెంబరు 15న టీ20తో మొదలుకానున్న విండీస్ ఇండియా టూర్.. డిసెంబరు 27న మూడో వన్డేతో ముగియనుంది. పొట్టి సిరీస్‌కు నవీ ముంబై వేదికకాగా... బరోడా వన్డే సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రకటించిన విండీస్ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ స్టెఫానీ టేలర్ పేరు మిస్ అయింది.మహిళల టీ20 ప్రపంచకప్ -2024 సందర్భంగా స్టెఫానీ మోకాలికి గాయమైంది. ఆ తర్వాత మళ్లీ ఆమె మైదానంలో దిగలేదు.ఇప్పుడు ఇండియా టూర్‌కు కూడా స్టెఫానీ దూరమైంది. మరోవైపు.. మాజీ కెప్టెన్ డియాండ్ర డాటిన్ దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే క్రికెట్లో పునరాగమనం చేయనుంది. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో విండీస్ సెమీస్ చేరగా.. భారత జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది.భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు వెస్టిండీస్ మహిళా జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ కాంప్‌బెల్ (వైస్ కెప్టెన్), ఆలియా అల్లీన్, షమీలియా కాన్నెల్, నెరిస్సా క్రాఫ్టన్, డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, షబికా గజ్నాబి, చినెల్ హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మిని మునిసర్, కరిష్మా రాంహారక్, రషదా విలియమ్స్ .భారత్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్టీ20 సిరీస్👉మొదటి టీ20- డిసెంబరు 15- ఆదివారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉రెండో టీ20- డిసెంబరు 17- మంగళవారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉మూడో టీ20- డిసెంబరు 19- గురువారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబైవన్డే సిరీస్👉తొలి వన్డే- డిసెంబరు 22- ఆదివారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉రెండో వన్డే- డిసెంబరు 24- మంగళవారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉మూడో వన్డే- డిసెంబరు 27- శుక్రవారం- ఉదయం తొమ్మిదిన్నర గంటలకు- బరోడా. -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో బరోడా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఇండోర్ వేదికగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి చేధించింది.ఈ భారీ లక్ష్య చేధనలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర ఫిప్టీతో చెలరేగాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ముఖ్యంగా తమిళనాడు పేసర్ గుర్జప్నీత్ సింగ్‌కు హార్దిక్ చుక్కలు చూపించాడు. బరోడా ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన గుర్జప్నీత్ బౌలింగ్‌లో పాండ్యా 4 సిక్స్‌లు, ఒక ఫోర్ బాది ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు.ఓవరాల్‌గా 30 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 69 పరుగులు చేసి రనౌటయ్యాడు. హార్దిక్‌తో పాటు భాను పానియా 42 పరుగులతో రాణించాడు. ఫలితంగా బరోడా 7 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. తమిళనాడు బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి మూడు, సాయికిషోర్ రెండు వికెట్లు సాధించారు.జగదీశన్ హాఫ్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. తమిళనాడు బ్యాటర్లలో ఓపెనర్ జగదీశన్(57) హాఫ్ సెంచరీతో మెరవగా.. విజయ్ శంకర్(42), షరూఖ్ ఖాన్(39) పరుగులతో రాణించాడు. బరోడా బౌలర్లలో మెరివాలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహేష్ పతియా, నినాంద్ రత్వా తలా వికెట్ సాధించారు.చదవండి: ఏమి తప్పుచేశానో ఆర్ధం కావడం లేదు.. చాలా బాధగా ఉంది: టీమిండియా ఓపెనర్ 6⃣,6⃣,6⃣,6⃣,4⃣One goes out of the park 💥Power & Panache: Hardik Pandya is setting the stage on fire in Indore 🔥🔥Can he win it for Baroda? Scorecard ▶️ https://t.co/DDt2Ar20h9#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/Bj6HCgJIHv— BCCI Domestic (@BCCIdomestic) November 27, 2024 -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్ల వర్షం
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కేవలం 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్‌పై బరోడా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.🚨 HARDIK PANDYA SMASHED 74* (35) IN SMAT...!!! 🚨- The No.1 T20 All Rounder...!!! 🙇♂️pic.twitter.com/z1Wo4P1p0s— Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆర్య దేశాయ్ 52 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో హేమంగ్ పటేల్ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు), రిపల్ పటేల్ (7 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించారు. బరోడా బౌలర్లలో అతీత్ సేథ్ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, కృనాల్, మహేశ్ పితియా తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడాను హార్దిక్ పాండ్యా ఒంటిచేత్తో గెలిపించాడు. హార్దిక్‌కు జతగా శివాలిక్ శర్మ (43 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. హార్దిక్, శివాలిక్ చెలరేగడంతో బరోడా మరో మూడు బంతులు మిగిలుండగానే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. హార్దిక్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి బరోడాను విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు.. చింతన్ గజా, అర్జన్ నగస్వల్లా, తేజస్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. -
Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ టోర్నీలో హార్దిక్ తన అన్న కృనాల్ పాండ్యా సారథ్యంలో బరోడా జట్టుకు ఆడనున్నాడు. తొలుత ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో హార్దిక్ పేరు లేదు. అయితే హార్దిక్ స్వయంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడేందుకు ఆసక్తి కనబర్చాడని తెలుస్తుంది. జాతీయ జట్టుకు ఆడని సమయంలో దేశవాలీ క్రికెట్లో ఆడతానని హార్దిక్ బీసీసీఐకి చెప్పాడట. దీంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ హార్దిక్‌ను తమ జట్టులో చేర్చుకుంది. సహజంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి 18 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తారు. తాజాగా హార్దిక్ చేరికతో బరోడా టీమ్ సంఖ్య 18కి పెరిగింది. ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో బరోడాతో పాటు తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం, త్రిపుర జట్లు ఉన్నాయి. హార్దిక్ త్వరలో ఇండోర్‌లో జరిగే ట్రైనింగ్ క్యాంప్‌లో బరోడా జట్టుతో జాయిన్ అవుతాడు. బరోడా తమ టోర్నీ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం (నవంబర్ 23) జరుగుతుంది.కాగా, హార్దిక్ ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత టీ20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ 59 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది.ముంబై ట్రైనింగ్ క్యాంప్లోన కనిపించిన హార్దిక్హార్దిక్ దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే నవీ ముంబైలోని ఏర్పాటు చేసిన ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ సెషన్స్‌లో కనపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.బరోడా జట్టుకు బూస్టప్హార్దిక్ చేరికతో బరోడా జట్టు బలపడింది. ఈ టోర్నీలో ఆ జట్టు విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. హార్దిక్ ఎనిమిదేళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొంటున్నాడు. -
జైస్వాల్ సొంత అన్న.. తొలి హాఫ్ సెంచరీ! టీమిండియా ఓపెనర్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సోదరుడు తేజస్వి జైస్వాల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొలి అర్ధ శతకం బాదినందుకు అతడిని అభినందించాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన యశస్వి జైస్వాల్‌కు ముగ్గురు తోబుట్టువులు.. ఇద్దరక్కలు, ఓ అన్న ఉన్నారు.ఇటీవలే అరంగేట్రంయశస్వి సోదరుడు తేజస్వి కూడా క్రికెటర్‌గా రాణించాలనే ఆశయంతో ఉన్నాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో ఇటీవలే అరంగే ట్రం చేవాడు. త్రిపుర జట్టుకు ఆడుతూ.. తాజా రంజీ ట్రోఫీ సీజన్లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. బరోడాతో మ్యాచ్‌లో 159 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 82 పరుగులు రాబట్టాడు.అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్‌ను కూడా తేజస్వి జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రిపుర- బరోడా మ్యాచ్‌కు సంబంధించిన స్కోరు కార్డును యశస్వి జైస్వాల్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. అన్న తేజస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను హైలైట్ చేసి అతడిని అభినందించాడు.డ్రాగా ముగిసిన మ్యాచ్‌కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా అగర్తల వేదికగా త్రిపుర- బరోడా జట్ల మధ్య నవంబరు 6న మ్యాచ్ మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన త్రిపుర తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బరోడా జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందుకు బదులుగా ఆతిథ్య త్రిపుర తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 482 పరుగుల వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. అయితే, ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో శనివారమే చివరి రోజు. ఈ క్రమంలో వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డ బరోడా.. ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 241 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఫలితం తేలక మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఒకే ఒక్క విజయంకాగా తేజస్వి జైస్వాల్ తమ్ముడు యశస్వి మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్. అయితే, ఆల్‌రౌండర్ అయిన తేజస్వి రైటార్మ్ మీడియం పేసర్ కావడం విశేషం. ఇక ఈ సీజన్లో త్రిపుర తొలుత ఒడిశాతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తర్వాతి మ్యాచ్‌లో మేఘాలయపై ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో గెలిచింది.టీమిండియా ఓపెనర్‌గా పాతుకుపోయిన యశస్విఅనంతరం.. ముంబైతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తాజాగా బరోడా జట్టుతో మ్యాచ్‌లోనూ ఫలితం తేల్చలేకపోయింది. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ప్రస్తుతం టీమిండియాలో టెస్టు, టీ20 ఓపెనర్‌గా పాతుకుపోయాడు.ముఖ్యంగా టెస్టు అరంగేట్రం(2023)లోనే 23 ఏళ్ల యశస్వి భారీ శతకం(171) బాదాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు ఆడి 1407 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు ఉండటం విశేషం. ఇక భారత్ తరఫున 23 టీ20లు ఆడిన యశస్వి ఓ శతకం సాయంతో 723 రన్స్ చేశాడు. తదుపరి అతడు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీకానున్నాడు.చదవండి: స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్! -
కృనాల్ పాండ్యా సెంచరీ.. హ్యాట్రిక్ విజయాలు.. హార్దిక్ పోస్ట్ వైరల్
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. తాజాగా శతకంతో మెరిశాడు. ఒడిశాతో మ్యాచ్‌లో 143 బంతులు ఎదుర్కొని 119 పరుగులు సాధించాడు. కృనాల్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.ఇక ఈ మ్యాచ్‌లో బరోడా ఒడిషాపై ఏకంగా ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన అన్న కృనాల్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘మా అన్నయ్య.. ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. టాప్ సెంచరీ.. నీ శ్రమకు తగ్గ ఫలితం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా రంజీ తాజా సీజన్లో కృనాల్ పాండ్యా సారథ్యంలోని బరోడా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో ముంబైని 84 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో సర్వీసెస్‌ను 65 రన్స్ తేడాతో ఓడించింది. ఈ క్రమంలో వడోదర వేదికగా ఒడిశా జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బౌలింగ్ చేసింది.అయితే, బరోడా బౌలర్ల ధాటికి ఒడిశా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడాకు ఓపెనర్ శైవిక్ శర్మ(96) శుభారంభం అందించగా.. మిడిలార్డర్లో విష్ణు సోలంకి(98) దుమ్ములేపాడు. ఇక వీరికి తోడుగా కృనాల్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఫలితంగా బరోడా మొదటి ఇన్నింగ్స్‌లో 456 పరుగులు చేసి.. 263 పరుగులు ఆధిక్యంలో నిలిచింది.అయితే, బరోడా బౌలర్లు మరోసారి చెలరేగడంతో ఒడిశా 165 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆటలోనే ఫలితం తేలింది. బరోడా ఒడిశాపై ఇన్నింగ్స్ 98 రన్స్ తేడాతో జయభేరి మోగించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. కాగా హార్దిక్ పాండ్యా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా పునరాగమనం చేయనున్నాడు.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ View this post on Instagram A post shared by Krunal Himanshu Pandya (@krunalpandya_official) -
Ranji Trophy 2024: డిఫెండింగ్ ఛాంపియన్స్‌కు షాక్
రంజీ ట్రోఫీ 2024 సీజన్ ఆరంభంలోనే సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైకు బరోడా జట్టు షాకిచ్చింది. వడోదరా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైపై బరోడా 84 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. మితేశ్ పటేల్ (86), అతిత్ సేథ్ (66) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో తనుశ్ కోటియన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. షమ్స్ ములానీ మూడు, శార్దూల్ ఠాకూర్ రెండు, మోహిత్ అవస్తి ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే (52) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. స్టార్ ఆటగాళ్లు పృథ్వీ షా 7, ఆజింక్య రహానే 29, శ్రేయస్ అయ్యర్ 0, శార్దూల్ ఠాకూర్ 27 పరుగులకు ఔటయ్యారు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ నాలుగు, అభిమన్యు సింగ్ మూడు, మహేశ్ పితియా రెండు, కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టారు.76 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బరోడా.. తనుశ్ కోటియన్ ఐదేయడంతో (5/61) 185 పరుగులకే ఆలౌటైంది. హిమాన్షు సింగ్ 3, మోహిత్ అవస్తి, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. బరోడా ఇన్నింగ్స్‌లో కృనాల్ పాండ్యా (55) అర్ద సెంచరీతో రాణించాడు. 262 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. భార్గవ్ భట్ (6/55) మాయాజాలం ధాటికి 177 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా చిన్న జట్టు చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ముంబై ఇన్నింగ్స్‌లో సిద్దేశ్ లాడ్ ఒక్కడే (59) అర్ద సెంచరీతో రాణించాడు. చదవండి: చరిత్రపుటల్లోకెక్కిన కమిందు మెండిస్ -
హార్దిక్‌ను ఎందుకలా పిలుస్తారో?: బరోడా మాజీ కోచ్ విమర్శలు
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవ్ వాట్మోర్ విమర్శలు గుప్పించాడు. అతడిని బరోడా ఆటగాడని సంబోంధించడం సరికాదన్నాడు.హార్దిక్ దేశవాళీ క్రికెట్ ఆడి ఎన్నో ఏళ్లు గడిచిపోయిందని.. అతడికి ఐపీఎల్ వంటి లీగ్‌లపై మాత్రమే శ్రద్ధ ఎక్కువని సెటైర్లు వేశాడు. అయినా తన గురించి ప్రస్తావన వచ్చినపుడు బరోడా ఆల్‌రౌండర్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నాడు వాట్మెన్.కాగా భారత వన్డే, టీ20 క్రికెట్ జట్టులో కీలక సభ్యుడైన హార్దిక్ పాండ్యా స్వస్థలం గుజరాత్. తన అన్న కృనాల్ పాండ్యాతో కలిసి బరోడా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన హార్దిక్.. 2018 తర్వాత మళ్లీ అక్కడ కనిపించలేదు.అయితే, ఇటీవల బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ కారణాల వల్ల జట్టుకు దూరమైన ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్లో ఆడిన తర్వాతే టీమిండియా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.అంతేకాదు.. శ్రీలంక పర్యటనకు జట్టును ప్రకటించినపుడు కూడా ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. దీంతో హార్దిక్ పాండ్యాకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇప్పటికే ఫిట్నెస్ సమస్యల వల్ల కెప్టెన్సీకి దూరమైన హార్దిక్.. వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి.ఈ నేపథ్యంలో.. బరోడా జట్టు కోచ్‌గా పనిచేసిన ఆసీస్ మాజీ క్రికెటర్ డేవ్ వాట్మోర్ ఓ పాకిస్తానీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘‘చాలా మంది దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడరు. నేను రెండేళ్ల పాటు బరోడా జట్టుతో ఉన్న సమయంలో పాండ్యా ఒక్కసారి కూడా ఆడలేదు.అయినప్పటికీ తనను బరోడా ఆల్‌రౌండర్ అని పిలుచుకోవడం సరికాదనిస్తుంది. చాలా ఏళ్ల పాటు అతడు ఆ జట్టుకు దూరంగా ఉన్నా ఇంకా అక్కడి ఆటగాడిగా గుర్తించడం ఏమిటో?!ఇటీవల బీసీసీఐ తెచ్చిన నిబంధనలు నాకు నచ్చాయి. రంజీ ట్రోఫీలో అందరూ ఆడాలని.. మిగిలిన రెండు ఫార్మాట్లలో కూడా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని చెప్పింది. 4-డే క్రికెట్‌ను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లకు కోచ్‌గా వ్యవహరించి విజయవంతమైన శిక్షకుడిగా పేరొందాడు వాట్మోర్. 2021-22, 2022- 23 సీజన్లలో బరోడా కోచ్‌గా సేవలు అందించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో టీమిండియా టీ20 సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. వన్డేల్లో మొండిచేయి చూపారు. -
ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
విలాసవంతమైన భవనం అనగానే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ నివాసం ఆంటిలియా గుర్తొస్తుంది కదా. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసంగా గుర్తింపు పొందిన మరోకటి ఉంది తెలుసా. అది ఎక్కడ ఉంది? అందులో ఎవరుంటారు.. ఈ వివరాలు తెలుసుకుందాం రండి..!దాదాపు 600 ఎకరాల్లో ఉండే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ మన దేశంలోనే ఉంది. బరోడాలోని గైక్వాడ్ కుటుంబానికి చెందిన గుజరాత్‌లోని వడోదరలో ఉన్న ఈ రాజభవనాన్ని వీక్షించాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. దాని పేరు లక్ష్మీ విలాస్ ప్యాలెస్.1890లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు దీన్ని నిర్మించారు. శిల్పి మేజర్ చార్లెస్ మాంట్ ఇండో-సారసెనిక్ శైలిలో దీన్ని నిర్మించారు. 176 లగ్జరీ గదులు, కళ్లు చెదిరిపోయేలా హాళ్లు, తోటలు, ఫౌంటెన్ ఇలా సర్వ హంగులూ దీని సొంతం.ప్యాలెస్‌లో గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. బరోడా పాలకులుగా ఉన్న సమయంలో 1890లో మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్ - III దీన్ని నిర్మించారు. ఈ రాజప్రాసాదాన్ని నిర్మించడానికే సుమారు పన్నెండేళ్లు పట్టిందట. ఇంతకీ ఈ అందమైన రాజభవనం విలువ ఎంతో తెలుసా? రూ.24,000 కోట్లకు పైమాటే. విశేషాలు3,04,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది లక్ష్మీ విలాస్ ప్యాలెస్. బకింగ్‌హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులుమాత్రమే. మహారాజా ఫతే సింగ్ మ్యూజియంలో రాజా రవివర్మకు సంబంధించిన అనేక అరుదైన పెయింటింగ్స్ ఉన్నాయి. అంతేకాదు రాజభవనంలో ప్రపంచంలోని ఇతర ప్యాలెస్‌ల కంటే ఎక్కువ గాజు కిటికీలు ప్రత్యేక ఆకర్ణణ అని చెబుతారు. వీటిలో ఎక్కువ గాజు కిటికీలను బెల్జియం నుంచి తీసుకొచ్చారు.అందమైన రాణి రాధిక రాజే గైక్వాడ్ప్రస్తుతం గైక్వాడ్ వంశ కుటుంబానికి సారధి సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ భార్య, మహారాణి మహారాణి రాధికరాజే గైక్వాడ్ దేశంలోని అత్యంత అందమైన , ఆధునిక రాణులలో ఒకటి గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్‌లోని వాంకనేర్‌కు చెందిన రాధిక రాజే 1978, జూలై 19న జన్మించారు. తండ్రి డా. MK రంజిత్‌సిన్హ్ ఝాలా.ఈయన ఐఏఎస్ అధికారికావడానికి రాజ్షాహి బిరుదును వదులు కున్నారట.రాధికారాజే గైక్వాడ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి భారతీయ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2002లో మహారాజా సమర్జిత్సింగ్ గైక్వాడ్‌తో వివాహానికి ముందు, ఆమె జర్నలిస్టుగా పనిచేశారు. 2012లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో జరిగిన సంప్రదాయ వేడుకలో సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ బరోడా కిరీటాన్ని స్వీకరించారు. ఈ దంపతులకు నారాయణి ,పద్మజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చేతివృత్తుల కళాకారులు,మహిళల కోసం అనేక ప్రాజెక్టులను చేపడుతూ, వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు రాధికా రాజే -
ఇంట్లో డబ్బు సంచులు.. పోలీసులకు చిక్కిన మాజీ క్రికెటర్
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ ఆరోథే మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి ఇంట్లో కోటి రూపాయల నగదు పట్టుబడటంతో వడోదర పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కాగా గుజరాత్‌కు చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ తుషార్ ఆరోథే. 1985- 2004 మధ్య రంజీల్లో బరోడా జట్టు తరఫున వందకు పైగా మ్యాచ్‌లు ఆడాడు ఈ స్పిన్ ఆల్‌రౌండర్. కెప్టెన్‌గానూ వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది. అయితే, ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం తుషార్ ఆరోథే కోచ్‌గా అవతారమెత్తాడు. ఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగి భారత మహిళా జట్టుకు కోచ్‌గా 2013లో నియమితుడయ్యాడు. ఆ మరుసటి ఏడాదే మళ్లీ బరోడా కోచ్‌గా వచ్చి.. 2015లో రాజీనామా చేశాడు. తుషార్ ఆరోథే కుమారుడు రిషి ఆరోథే కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెటరే. ఇదిలా ఉంటే.. వివాదాలతో సావాసం చేయడం తుషార్ ఆరోథేకు అలవాటు. 2019లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ కేఫ్‌లో బెట్టింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో బెయిల్ మీద విడుదలైన అనంతరం.. క్రికెట్ మాత్రమే తనకున్న ఉపాధి అని, ఇలాంటి చెత్త పనులు చేయనంటూ తుషార్ ఆరోథే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, తాజాగా మరోసారి పోలీసులకు చిక్కడం గమనార్హం. తుషార్ కొడుకు రిషి అపార్ట్‌మెంట్‌కు భారీ మొత్తంలో నగదు తరలినట్లు తమకు సమాచారం అందిందని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇన్స్పెక్టర్ వీఎస్ పాటిల్ జాతీయ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో తుషార్ ఆరోథేకు చెందిన ప్రతాప్గంజ్ నివాసంలోనూ సోదాలు జరుపగా కోటికి పైగా నగదు పట్టుబడిందని.. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. డబ్బులన్నీ సంచుల్లో కుక్కి పెట్టారని.. ఈ లావాదేవీల గురించి వివరణ అడుగగా తుషార్ సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాగా ఆదివారం నాటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
‘శత’క్కొట్టిన తనుష్, తుషార్
ముంబై: బరోడా, ముంబై జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతం చోటు చేసుకుంది. ముంబై జట్టుకు చెందిన చివరి వరుస బ్యాటర్లు తనుష్ కొటియన్ (129 బంతుల్లో 120 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), తుషార్ దేశ్‌పాండే (129 బంతుల్లో 123; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకాలతో అదరగొట్టారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో (మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు జరిగే మ్యాచ్‌లు) ఒకే ఇన్నింగ్స్‌లో పదో నంబర్, పదకొండో నంబర్ బ్యాటర్లిద్దరూ సెంచరీలు చేయడం కేవలం ఇది రెండోసారికాగా, రంజీ ట్రోఫీలో మాత్రం తొలిసారి. 1946లో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా సర్రే కౌంటీ జట్టుతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున పదో నంబర్ ప్లేయర్ చందూ సర్వాతే (124 నాటౌట్), పదకొండో నంబర్ ప్లేయర్ శుతె బెనర్జీ (121) సెంచరీలు చేశారు. బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఓవర్‌నైట్ స్కోరు 379/9తో ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై 132 ఓవర్లలో 569 పరుగులకు ఆలౌటైంది. తనుష్, తుషార్ సెంచరీలు చేయడంతోపాటు పదో వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఒక పరుగు తేడాతో రంజీ రికార్డును సమం చేసే అవకాశం కోల్పోయారు. 1992 రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అజయ్ శర్మ–మణీందర్ సింగ్ పదో వికెట్‌కు 233 పరుగులు జత చేశారు. ముంబై నిర్దేశించిన 606 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో టీ సెషన్ తర్వాత రెండు జట్ల కెపె్టన్లు ‘డ్రా’కు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబై జట్టు సెమీఫైనల్ చేరుకుంది. విదర్భ విజయం నాగ్‌పూర్‌లో కర్ణాటకతో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో విదర్భ 127 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. విదర్భ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 62.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లు హర్‡్ష దూబే (4/65), ఆదిత్య సర్వాతే (4/78) కర్ణాటకను దెబ్బ తీశారు. మార్చి 2 నుంచి జరిగే సెమీఫైనల్స్‌లో మధ్యప్రదేశ్‌తో విదర్భ; తమిళనాడుతో ముంబై తలపడతాయి. -
Ranji Trophy: ఆంధ్ర సహా క్వార్టర్ ఫైనల్ చేరిన జట్లు ఇవే
Ranji Trophy 2023-24- Quarter Finals: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు సోమవారంతో ముగిశాయి. ఎలైట్ డివిజన్లో మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా (ఎ, బి,సి,డి; 8 జట్ల చొప్పున) విభజించారు. గ్రూప్ ‘బి’లో ముంబై జట్టు 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... ఆంధ్ర జట్టు 26 పాయింట్లతో (3 విజయాలు, 3 ‘డ్రా’, 1 ఓటమి) రెండో స్థానంలో నిలిచింది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌కంటే ముందే ఈ రెండు జట్లకు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ (33 పాయింట్లు), సౌరాష్ట్ర (28 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి తమిళనాడు (28 పాయింట్లు), కర్ణాటక (27 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి మధ్యప్రదేశ్ (32 పాయింట్లు), బరోడా (26 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఎలైట్ డివిజన్‌కు హైదరాబాద్ అర్హత కాగా 32 జట్లలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన మణిపూర్, గోవా జట్లు వచ్చే సీజన్‌కు ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోగా... ‘ప్లేట్’ డివిజన్లో ఫైనల్ చేరిన హైదరాబాద్, మేఘాలయ ఎలైట్ డివిజన్‌కు అర్హత పొందాయి. ఫిబ్రవరి 23 నుంచి క్వార్టర్ ఫైనల్స్ ►ఇక ఈనెల 23 నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటకతో విదర్భ (నాగ్‌పూర్‌లో- Vidarbha vs Karnataka, 1st Quarter Final) ►ముంబైతో బరోడా (ముంబైలో- Mumbai vs Baroda, 2nd Quarter Final) ►తమిళనాడుతో సౌరాష్ట్ర (కోయంబత్తూరులో- Tamil Nadu vs Saurashtra, 3rd Quarter Final) ►మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర (ఇండోర్‌లో- Madhya Pradesh vs Andhra, 4th Quarter Final ) తలపడతాయి. ఆటకు వీడ్కోలు ఇక రంజీ తాజా సీజన్ సందర్భంగా ఐదుగురు క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికారు. మనోజ్ తివారి(బెంగాల్), ధవళ్ కులకర్ణి(ముంబై), సౌరభ్ తివారి(జార్ఖండ్), ఫైజ్ ఫజల్(విదర్భ), వరుణ్ ఆరోన్(జార్ఖండ్) ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో? -
నేపాల్ క్రికెట్‌కు బీసీసీఐ చేయూత.. భారత్‌లో ట్రై సిరీస్ నిర్వహణ
నేపాల్ క్రికెట్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చేయూతనందించేందుకు ముందుకు వచ్చింది. ఆర్దికంగా వెనుకపడిన నేపాల్ క్రికెట్ బోర్డుకు లబ్ది చేకూరే విధంగా ఆ దేశ క్రికెట్ జట్టుతో ట్రైయాంగులర్ సిరీస్‌ను ప్లాన్ చేసింది. భారత దేశవాలీ ఛాంపియన్ జట్లైన్ బరోడా, గుజరాత్ జట్లు మార్చి 31-ఏప్రిల్ 7 మధ్యలో నేపాల్ టీమ్‌తో ట్రై సిరీస్ ఆడనున్నాయి. ఈ టోర్నీ మొత్తం గుజరాత్‌లోని వాపి క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ఈ ట్రై సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను నేపాల్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఫిబ్రవరి 19) విడుదల చేసింది. అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లతో టోర్నీమెంట్ ఆడటం ద్వారా నేపాల్ జట్టుకు అంతర్జాతీయ అనుభవం వచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్ 2024 నేపథ్యంలో ఈ టోర్నీ నేపాల్ జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రన్నరప్ అయిన బరోడా టీమ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా సారథ్యం వహించనుండగా.. గుజరాత్ జట్టులో పియూష్ చావ్లా, రవి బిష్ణోయ్ లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు. ఈ ట్రై సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. నేపాల్ జట్టు మార్చి 31న గుజరాత్‌తో, ఏప్రిల్ 2న బరోడాతో, ఏప్రిల్ 3న మళ్లీ గుజరాత్‌తో, ఏప్రిల్ 5న మరోసారి బరోడాతో తలపడనుంది. ఏప్రిల్ 7న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా, నేపాల్ జట్టు ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
టీమిండియా మాజీ కెప్టెన్ కన్నుమూత..
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్(95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అతని పూర్తి పేరు దత్తాజీరావు కృష్ణారావు. ఆయనను అందరూ ముద్దుగా దత్తా గైక్వాడ్ అని పిలుచుకునేవారు. భారత తరపున 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్.. 18.42 సగటుతో 350 పరుగులు చేశారు. 1959 ఇంగ్గండ్ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా దత్తాజీ వ్యవహరించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓటమి పాలైంది. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా 1947 నుంచి 1961 కాలంలో బరోడాకు ప్రాతినిథ్యం వహించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 47.56 సగటుతో 3139 పరుగులు చేశారు. అందులో 14 సెంచరీలు ఉన్నాయి. -
CJI Chandrachud: నేటి యువత సామర్థ్యం అద్భుతం
వడోదర: అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఎన్నో సవాళ్లను పరిష్కరిస్తున్న నేటి యువత సామర్థ్యం చూసి తనకు ఆశ్చర్యం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని అభివృద్ధికి బాటగా మలుచుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. జీవితమంటే మారథాన్(సుదీర్ఘ 42 కిలోమీటర్ల పరుగు పందెం) వంటిదే తప్ప 100 మీటర్ల స్ప్రింట్(స్వల్ప దూరం పరుగు పందెం) కాదని ఆయన పేర్కొన్నారు. బరోడా లోని మహారాజా శాయాజీరావ్ యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆదివారం జస్టిస్ డీవై చంద్రచూడ్ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ ఏడాది యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకోవడాన్ని మన దేశం మారుతోందనడానికి నిజమైన గుర్తుగా ఆయన అభివరి్ణంచారు. ‘చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన సమయం. మునుపెన్నడూ లేనంతగా టెక్నాలజీ నేడు ప్రజలను అనుసంధానం చేస్తోంది. అదే సమయంలో వారిలో భయాలు, ఆందోళనలకు సైతం కారణమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి సంప్రదాయ వృత్తులతో సంబంధం లేనివి. వీటిల్లో ఎవరికి వారు తమ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో పట్టభద్రులుగా బయటికి వస్తున్న మీ అందరికీ ఇది ఉత్తేజకర సమ యం. అదే సమయంలో అనిశి్చతిని, గందరగోళాన్నీ సృష్టిస్తాయి’అని హెచ్చరించారు. -
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా పంజాబ్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023 విజేతగా పంజాబ్ జట్టు నిలిచింది. సోమవారం మొహాలీ వేదికగా జరిగిన ఫైనల్లో బరోడాను ఓడించిన పంజాబ్.. తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేయగల్గింది. బరోడా బ్యాటర్లలో అభిమన్యు సింగ్(61), కెప్టెన్ కృనాల్ పాండ్యా(45) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో అదరగొట్టగా.. కౌల్, బ్రార్, మార్కండే తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో అన్మోల్ప్రీత్ సింగ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 113 పరుగులు చేశాడు. అతడితో పాటు వాదేరా(61) పరుగులతో ఆఖరిలో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, సోపారియా, సేథ్ చెరో వికెట్ పడగొట్టారు. -
ముంబైకు చుక్కెదురు
ముల్లన్పూర్ (చండీగఢ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు కథ క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా జట్టు మూడు వికెట్ల తేడాతో ముంబైను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసింది. శివమ్ దూబే (36 బంతుల్లో 48; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సర్భరాజ్ ఖాన్ (22 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం బరోడా జట్టు 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి నెగ్గింది. విష్ణు సోలంకి (30 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బరోడా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌పై, ఢిల్లీ 39 పరుగుల తేడాతో విదర్భ జట్టుపై, కేరళ జట్టుపై అస్సాం ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ చేరుకున్నాయి. -
తిలక్ వర్మ సెంచరీ వృథా
జైపూర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి దూసుకెళ్తున్న హైదరాబాద్‌కు తొలి పరాజయం ఎదురైంది. బరోడా జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (69 బంతుల్లో 121 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ సెంచరీతో అలరించాడు. అనంతరం బరోడా జట్టు 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బరోడా జట్టును కెపె్టన్ కృనాల్ పాండ్యా (36 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), విష్ణు సోలంకి (37 బంతుల్లో 71 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీలతో గెలిపించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 70 బంతుల్లో 138 పరుగులు జోడించడం విశేషం. -
అస్థిరతల్లో స్థిరమైన పనితీరు
గతేడాది మొదలైన అస్థిరతలు మార్కెట్లలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈక్విటీ మార్కెట్లు అంటేనే అస్థిరతలకు నిలయం అని ఇన్వెస్టర్లకు తెలిసిన విషయమే. ఇలాంటి అస్థిరతలు, అధిక, చౌక వ్యాల్యూషన్ల మధ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే అందుకు బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనుకూలమని చెప్పుకోవాలి. ఈ విభాగంలో బరోడా బీఎన్పీ పారిబాస్ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఒక మోసర్తు రిస్క్ తీసుకునే వారికి ఇది అనుకూలం. పెట్టుబడుల విధానం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ పథకాలు ఈక్విటీతోపాటు, డెట్‌లోనూ పెట్టుబడులు పెడుతుంటాయి. మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ పథకాల్లో నష్టాలు తక్కువగా ఉంటాయి. కొంత డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. రాబడులు బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగంలో టాప్ పథకాల్లో ఇది కూడా ఒకటి. స్థిరమైన పనితీరు చూపిస్తోంది. నిఫ్టీ 50 హైబ్రిడ్ కాంపోజిట్ డెట్ 50:50 ఇండెక్స్‌ను మించి పనితీరు చూపిస్తోంది. ఈ పథకం 2018 నవంబర్‌లో మొదలైంది. అంటే నాలుగేళ్ల చరిత్రే ఉంది. అయినా కానీ ఆరంభం నుంచి చూస్తే వార్షికంగా 12.73 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 8 శాతంగా ఉంటే, మూడేళ్ల కాలంలో వార్షికంగా 13 శాతానికి పైనే రాబడుల చరిత్ర ఉంది. పెట్టుబడుల విధానం ఈ పథకం ఈక్విటీ, డెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. పరిస్థితులు, మార్కెట్ అవకాశాలకు తగ్గట్టు డెట్‌లో గరిష్టంగా 35 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీలకు 86–87 శాతం వరకు కేటాయింపులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా మారాయని భావించినప్పుడు ఈక్విటీల పెట్టుబడులు తగ్గించి, డెట్ పెట్టుబడులను ఫండ్ మేనేజర్ పెంచుతారు. ఈక్విటీలు కరెక్షన్కులోనై ఆకర్షణీయ స్థాయికి చేరినప్పుడు డెట్‌లో పెట్టుబడులు తగ్గించుకుని, ఈక్విటీలకు పెంచుకోవడం చేస్తుంటారు. ఉదాహరణకు 2020 మార్చి సమయంలో మార్కెట్లు కరోనా భయంతో భారీ దిద్దుబాటుకు గురి కావడం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఈక్విటీ పెట్టుబడులను మొత్తం పోర్ట్‌ఫోలియోలో 87 శాతానికి చేర్చుకోవడాన్ని గమనించొచ్చు. తిరిగి 2020 సెప్టెంబర్ నుంచి ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకోవడం మొదలు పెట్టారు. కనిష్టాల నుంచి సెప్టెంబర్ నాటికి మార్కెట్లు ర్యాలీ చేయడంతో ఈ విధానాన్ని అమలు చేశారు. 2022 జూన్–జూలైలోనూ ఈక్విటీలు దిద్దుబాటుకు గురికాగా, అప్పుడు ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెంచుకుని, తిరిగి ఇటీవలి కాలంలో తగ్గించుకున్నారు. పీఈ, బుక్ వ్యాల్యూ, డివిడెండ్ ఈల్డ్ ఆధారంగా స్టాక్స్, మార్కెట్ల వ్యాల్యూషన్లను ఫండ్ పరిశోధక బృందం ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియో.. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.3,146 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 67 శాతం ఈక్విటీలో, 29.59 శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంది. 3 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 40 స్టాక్స్ ఉన్నాయి. డెట్ పెట్టుబడుల్లో దాదాపు మొత్తం కూడా క్రెడిట్ రేటింగ్ మెరుగ్గా ఉన్న సాధనాల్లో ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ 23 శాతం కేటాయింపులు చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు 7.50 శాతం, ఇంధన, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు చెరో 6 శాతంపైనే కేటాయింపులు చేసింది. -
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోచ్ కన్నుమూత
మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కోచ్.. బరోడా మాజీ రంజీ ఆటగాడు నారాయణ్ రావు సాథమ్(73) కన్నుమూశారు. ఆదివారం ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. 1970,80వ దశకంలో బరోడా తరపున దేశవాలీ క్రికెట్లో బెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్‌జోన్‌కు ఆడుతున్న సమయంలో సునీల్ గావస్కర్, అశోక్ మన్కడ్, అజిత్ వాడేకర్‌లతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్ షేర్ చేసుకున్నాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారిన నారాయణ్ సాథమ్ ఎంతో మంది క్రికెటర్లను వెలుగులోకి తెచ్చాడు. అలా వచ్చినవారే కిరణ్ మోరే, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్లు. కాగా నారాయణ్ సాథమ్ మృతిపై మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ఎమోషన్ అయ్యాడు. ట్విటర్ వేదికగా కిరణ్ మోరే స్పందించాడు. ''నా జీవితంలో ఈరోజు చాలా దుర్దినం. నా మెంటార్, కోచ్, గురువు నారాయణ్ రావు సాథమ్ కన్నుమూశారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆయనే కారణం. నా గురువును చాలా మిస్సవుతున్నా.. బరోడా జట్టుకు ఇది పెద్ద నష్టం అని చెప్పుకోవాలి'' అంటూ ట్వీట్ చేశాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో నారాయణ్ సాథమ్ 84 మ్యాచ్‌లాడి 3119 పరుగులతో పాటు 193 వికెట్లు పడగొట్టాడు. Today is a very sad day for me personally. My mentor, coach and Guru, Narayan Rao Satham, has passed away. What I have achieved till today was all because of him. I am going to miss him and this is a big loss for Baroda #cricket #OmShanti pic.twitter.com/wG6rdrC4Nu — Kiran More (@JockMore) February 12, 2023 చదవండి: మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఫకర్ జమాన్ ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథ -
Syed Mushtaq Ali Trophy: ఓటమితో ఆంధ్ర ముగింపు
ఇండోర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 11 పరుగుల తేడాతో బరోడా చేతిలో ఓడిపోయింది. ఏడు జట్లున్న గ్రూప్ ‘డి’లో ఆంధ్ర రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో ఆంధ్ర 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. కరణ్ షిండే (26 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (26 బంతుల్లో 37; 6 ఫోర్లు) రాణించారు. అంతకుముందు బరోడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ఐదు గ్రూపుల్లో ‘టాపర్’గా నిలిచిన ముంబై, పంజాబ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, బెంగాల్ నేరుగా క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాయి. మూడు ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచిన మరో మూడు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. -
మహిళల క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు!
విశాఖపట్నం: మహిళల సీనియర్ టీ20 మ్యాచ్‌లు ముగించుకుని వెళ్తున్న బరోడా క్రికెటర్లు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు.. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో దానిని ఢీకొంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విశాఖ వేదికగా మహిళా సీనియర్ టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. చదవండి: West Indies: 'హెట్‌మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి' -
బరోడా జట్టు తరపున ఆడనున్న అంబటి రాయుడు
టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు రాబోయే దేశవాళీ సీజన్లో బరోడా జట్టు తరపున ఆడునున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. రాయుడు ఇప్పటికే బరోడా క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా రాయుడు తన కెరీర్లో ఇప్పటికే బరోడా తరఫున నాలుగు సీజన్లు ఆడాడు. కాగా జూన్‌లో బరోడా సన్నాహక శిబిరంలో రాయుడు చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతేడాది సీజన్లో బరోడా సారథి కృనాల్ పాండ్యాతో విభేదాలు ఏర్పాడిన తర్వాత.. దీపక్ హుడా బరోడా జట్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దీపక్ హుడా ప్రస్తుతం రాజస్థాన్ తరపున ఆడుతున్నాడు. అయితే అతడి స్థానంలో రాయుడును భర్తీ చేయాలని బరోడా క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. ఉమ్రాన్, డీకేలకు అవకాశం -
కూతురు.. ఆ వెంటే తండ్రి మరణం.. అయినా జట్టు వెంటే!
Vishnu Solanki Sad Story: బరోడా క్రికెటర్ విష్ణు సోలంకిను విధి వెంటాడింది. కన్న కూతురు మరణించిందన్న బాధను దిగమింకముందే.. మరో విషాదం తన కుటుంబం చోటు చేసుకుంది. విష్ణు సోలంకి తండ్రి ఆదివారం మరణించాడు. ఈ క్రమంలో అంత్యక్రియలకు హాజరు కాకుండా జట్టుతోనే ఉండి మరోసారి సోలంకి రియల్ హీరో అనిపించుకున్నాడు. జట్టుతో పాటు బయో బబుల్‌లోనే సోలంకి ఉన్నాడు. తన తండ్రి అంత్యక్రియలకు సోలంకి వీడియో కాల్లో మాత్రమే హాజరయ్యాడు. దీంతో సోలంకిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిస్తోంది. కాగా, రంజీట్రోఫీలో భాగంగా చంఢీగఢ్తో జరిగిన మ్యాచ్‌లో విష్ణు సోలంకి అద్భుతమైన సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌కు కొద్ది రోజులు ముందు విష్ణు సోలంకి కూతురు మరణించింది. ఆ బాధను దిగమింగుతూ కఠిన పరిస్థితుల్లో అద్భుతమైన సెంచరీ చేశాడు. కాగా తన కుమార్తె మరణించిన తర్వాత కుటుంబంతో ఉండమని సూచించినట్లు బరోడా క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఆట మీద మక్కువతో జట్టును విడిచిపెట్టడానికి సోలంకీ ఇష్టపడలేదని అతడు పేర్కొన్నారు. ఇక బరోడా జట్టు మార్చి 4న హైదరాబాద్‌తో తల పడనుంది. చదవండి: Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే.. -
కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..
-
కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..
Baroda Player Vishnu Solanki: బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి రంజీ ట్రోఫీ 2022 సీజన్లో సెంచరీతో మెరిశాడు. చంఢీఘర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సోలంకి ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇందులో వింతేముంది.. అందరి క్రికెటర్ల లాగే తాను సెంచరీ బాదాడనుకుంటే పొరపాటే అవుతుంది. విష్ణు సోలంకి సెంచరీ వెనుక విషాధగాథ ఉంది. కొన్ని రోజుల క్రితం విష్ణు సోలంకి కూతురు చనిపోయింది. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో ఆ పసికందు కన్నుమూసింది. ఆ సమయంలో విష్ణు రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సోలంకి.. హుటాహుటిన బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించాడు. ఆట మీద మక్కువతో బాధను దిగమింగుకొని మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. వస్తూనే సోలంకి చంఢీఘర్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. పుట్టిన బిడ్డను కోల్పోయి కూడా సెంచరీతో మెరిసి ఔరా అనిపించిన విష్ణు సోలంకిని మెచ్చుకోకుండా ఉండలేము. ''అంత బాధను దిగమింగి సూపర్ ఇన్నింగ్స్ ఆడావు.. నీ ఆటకు సలామ్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బరోడా ఆల్‌రౌండర్ 161 బంతులెదుర్కొని 12 బౌండరీల సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సోలంకి సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ఆట రెండో రోజు పూర్తైంది. ప్రస్తుతం బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. అంతకముందు చంఢీఘర్ తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగుల ఆధిక్యంలో ఉండడం విశేషం. చదవండి: Rohit Sharma: టీమిండియా సరికొత్త చరిత్ర.. తొలి కెప్టెన్‌గా రోహిత్! Ranji Trophy 2022: తమిళనాడు కవల క్రికెటర్ల సరికొత్త చరిత్ర.. ఒకే ఇన్నింగ్స్‌లో.. What a player . Has to be the toughest player i have known. A big salute to vishnu and his family by no means this is easy🙏 wish you many more hundreds and alot of success 🙏🙏 pic.twitter.com/i6u7PXfY4g — Sheldon Jackson (@ShelJackson27) February 25, 2022 -
కీలక టోర్నీ నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్యా.. కారణం అదేనా?
త్వరలో జరగనున్న రంజీ ట్రోఫీ నుంచి బరోడా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తప్పుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిసారించి తిరిగి భారత జట్టులోకి వచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పాండ్యా రంజీ ట్రోఫీలో ఆడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో హార్ధిక్ బౌలింగ్ కూడా చేస్తాడని గంగూలీ పేర్కొన్నాడు. పాండ్యా టోర్నీ నుంచి వైదొలగడంతో బరోడా జట్టుకు కేదార్ దేవ్‌ధర్ నాయకత్వం వహించనున్నాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన రంజీ ట్రోఫీ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుంది. కాగా ఐపిఎల్‌లో కొత్త జట్టుగా అవతరించిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. హార్ధిక్ పాండ్యాతో అహ్మదాబాద్ 15 కోట్లకు ఒప్పందం కుదుర్చకుంది. బరోడా జట్టు: కేదార్ దేవ్‌ధర్ (కెప్టెన్), విష్ణు సోలంకి, ప్రత్యూష్ కుమార్, శివాలిక్ శర్మ, కృనాల్ పాండ్యా, అభిమన్యుసింగ్ రాజ్‌పుత్, ధ్రువ్ పటేల్, మితేష్ పటేల్, లుక్మాన్ మేరీవాలా, బాబాసఫిఖాన్ పఠాన్ (వికెట్ కీపర్), అతిత్ షేత్, భార్గవ్ భట్, పార్త్ కోహ్లీ, శశ్వత్ రావత్, కార్తీక్ కకడే, గుర్జీందర్‌సింగ్ మన్, జ్యోత్స్నిల్ సింగ్, నినాద్ రథ్వా, అక్షయ్ మోర్. -
మొసళ్ల కన్నీళ్లు తుడిచారు.. మీరు భేషుగ్గా ఈ నదిలో ఉండవచ్చు!
Tide Turners Plastic Challenge: గుజరాత్‌లోని బరోడా నగరం గుండా ‘భూఖీ’ అనే నది ప్రవహిస్తుంటుంది. ఇది ఒకప్పుడు మొసళ్లకు ఆవాస కేంద్రంగా ఉండేది. నది ప్రవాహంలో ఎక్కడో ఒకచోట మొసళ్లు కనిపించేవి. రానురానూ ఈ నది కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భూఖీ ఉన్నచోట ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు! ఈ దెబ్బతో ఎటు వెళ్లాయో, ఎప్పుడు వెళ్లాయో, ఎక్కడికి వెళ్లాయో తెలియదు. ఎంత వెదికినా ఒక్క మొసలి కూడా కనిపించేది కాదు. కేవలం జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి! అయితే ఒక చాలెంజ్ నిర్జీవమైన భూఖీకి జీవాన్ని ఇచ్చింది. చైతన్యం చేసింది. గతంలో కనిపించినంత కనిపించకపోయినా... ఇప్పుడు ఎనిమిది నుంచి పది మొసళ్లు ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. కాలుష్యం భరించలేక కన్నీళ్లు పెట్టుకొని పారిపోయిన మొసళ్ల కన్నీరు తుడిచింది ఎవరు? ‘ఇప్పుడు మీరు భేషుగ్గా ఈ నదిలో ఉండవచ్చు’ అని ధైర్యం ఇచ్చింది ఎవరు? రోజుకో సరదా చాలెంజ్‌ల గురించి వినిపిస్తున్న రోజుల్లో ఆఫ్రికా నుంచి ఆసియా వరకు ఎన్నో దేశాల యువతను అమితంగా ఆకట్టుకుంది... టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ చాలెంజ్. యూఎన్ ఎన్విరాన్మెంటల్ ప్రొగ్రామ్‌లో భాగంగా వచ్చిన ఈ చాలెంజ్... సముద్రాలు, నదులు, కాలువల్లో తిష్ఠ వేసిన కాలుష్య భూతంపై మోగించిన సమరభేరి. ఎంట్రీ, చాంపియన్, లీడర్... ఇలా విభిన్న స్థాయిలో ఈ చాలెంజ్‌కు రూపకల్పన చేశారు. ఇది సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (సీయియి) ద్వారా ఇండియాకు కూడా వచ్చింది. మహారాజా షాయజీరావు యూనివర్శిటీ ఆఫ్ బరోడాకు ఈ చాలెంజ్ వచ్చినప్పుడు ఎంఏ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ స్టూడెంట్ అయిన స్నేహ షాహీలాంటి ఒక్కరు ఇద్దరు తప్ప పెద్దగా ఉత్సాహం ప్రదర్శించిన వారు లేరు. తొలి సంతకం చేసిన స్నేహ అక్కడితో ఆగిపోలేదు. ఈ చాలెంజ్ చేసే మేలు గురించి యూనివర్శిటీలో విస్తృతంగా ప్రచారం చేసింది. అలా ఈ చాలెంజ్‌లో 300 మంది విద్యార్థులు భాగం అయ్యారు. ముందుగా తమ యూనివర్శిటి నాలాలలో నుంచి కిలోల కొద్దీ చెత్తను ఎత్తిపారేసారు. ఇక భూఖీ ప్రక్షాళన ప్రారంభించారు. భూఖీ నదికి ఒకనాటి పాతకళను తెచ్చారు. నది నుంచి వెలికి తీసిన ప్లాస్టిక్, థర్మకోల్ వ్యర్థాలను శుభ్రం చేసి స్మాల్ ప్లాంటర్స్, వాల్హ్యాంగిగ్స్ తయారుచేసి వినియోగంలోకి తెచ్చారు. గ్లాస్బాటిల్స్ను రీసైకిలింగ్‌కు పంపించారు. అవగాహన ఆచరణకు దారి చూపుతుంది. అదే ఆచరణ ఎంతోమందికి అవగాహన కలిగిస్తుంది. ప్రస్తుతం స్నేహ, ఆమె బృందం ఇదే పనిలో ఉంది. ‘అవర్ కామన్ ఫ్యూచర్’ అనే పేరుతో బృందంగా ఏర్పడి పర్యావరణానికి మేలు చేసే పనులు చేస్తున్నారు. ‘జలాల్లో కాలుష్యానికి మనమే కారణం. ఆ తప్పును సరిదిద్దుకోవాలి’ అంటూ ఎంతోమందిని దిద్దుబాటు బాటలోకి నడిపిస్తున్నారు. -
తొలి సెంచరీ.. లవ్ యూ అన్నయ్య: పాండ్యా
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ-2021 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా తొలిసారిగా సెంచరీ నమోదు చేశాడు. బరోడా జట్టు తరఫున ఆడుతున్న అతడు 90 బంతుల్లో 127 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు త్రిపురపై 6 వికెట్ల తేడాతో బరోడా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా తన తండ్రి హిమాన్షు పాండ్యాను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఒకవేళ ఇప్పుడు ఆయన బతికి ఉంటే ఎంతో సంతోషించే వారని, తను గతంలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసినప్పుడు తనను అభినందించిన తీరును జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు... ‘‘గత నెలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నేను 76 పరుగులు చేసినపుడు, నాన్న నాతో చివరిసారిగా క్రికెట్ గురించి మాట్లాడారు. ‘‘నా ప్రియమైన కుమారుడా.. ఇప్పుడు నీ టైం స్టార్ట్ అయ్యింది’’ అని నన్ను ప్రోత్సహించారు. ఇక ఇప్పుడు నేను తొలిసారి సెంచరీ చేశాను. కానీ భౌతికంగా ఆయన మాతో లేరు. అయితే, నిన్న నేను పరుగు తీస్తున్న ప్రతిసారీ ఆయన నన్ను చీర్ చేసి ఉంటారని నా హృదయం బలంగా నమ్ముతోంది. ‘‘శభాష్ కృనాల్ శభాష్’’ అని ఆయన అని ఉంటారు! నా ఈ ప్రత్యేక ఇన్నింగ్స్ నాన్నకే అంకితం. నా కలలు నిజం చేసకునే క్రమంలో క్షణక్షణం తోడున్న నీకు ధన్యవాదాలు. లవ్ యూ పప్పా’’అంటూ కృనాల్ ఇన్‌స్టాలో ఎమోషల్ పోస్టు షేర్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన అతడి సోదరుడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ‘‘నాన్న నిన్ను చూసి గర్వపడుతూనే ఉంటాడు అన్నయ్యా.. లవ్ యూ’’అని ప్రేమ చాటుకున్నాడు. కాగా జనవరి 16న హార్దిక్ తండ్రి హిమాన్షు పాండ్యా గుండెపోటుకు గురై మరణించిన విషయం విదితమే. View this post on Instagram A post shared by Krunal Pandya (@krunalpandya_official) -
ధోని తరహాలో.. చివరి బంతికి సిక్స్ కొట్టి
అహ్మదాబాద్: టీ20 అంటేనే ఉత్కంఠకు పేరు... ఇన్నింగ్స్ చివరి బంతి వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడుతూనే ఉంటుంది. అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్, బిగ్‌బాష్ వంటి టోర్నీలలో జరిగిన కొన్ని మ్యాచ్‌లు అభిమానులకు థ్రిల్ కలిగించడమే గాక వారిని మునివేళ్లపై నిలబెట్టేలా చేశాయి. తాజాగా దేశవాలీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బుధవారం బరోడా, హర్యానాల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. బరోడా బ్యాట్స్‌మన్ విష్ణు సోలంకి చివరి బంతికి ధోని తరహాలో హెలికాప్టర్ సిక్స్ కొట్టి జట్టును సెమీస్ చేర్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బరోడా జట్టు ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్ స్మిత్ పటేల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విష్ణు సోలంకి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 46 బంతుల్లోనే 71 పరుగులతో వీరవిహారం చేశాడు. సోలంకి దాటిని చూస్తే మాత్రం బరోడా ఈజీగానే మ్యాచ్‌ను గెలవాల్సి ఉండేది. కానీ ఇదే సమయంలో 19వ ఓవర్ వేసిన హర్యానా బౌలర్ మోహిత్ శర్మ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మోహిత్ వేసిన ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే రావడంతో చివరి ఓవర్‌కు బరోడా జట్టు విజయానికి 6 బంతుల్లో 18 పరుగులు కావాల్సి వచ్చింది.చదవండి: 'పైన్‌ను తీసేయండి.. అతన్ని కెప్టెన్ చేయండి' ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన సుమిత్ కుమార్ వేయగా.. మొదటి బంతికి సింగిల్ వచ్చింది. రెండో బంతిని విష్ణు సోలంకి ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను సుమీత్ వదిలేశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ రావడంతో బరోడాకు 3 బంతుల్లో 15 పరుగులు కావాల్సి వచ్చింది. నాలగో బంతిని సిక్స్ కొట్టిన సోలంకి.. ఐదో బంతిని ఫోర్‌గా మలిచాడు. ఇక చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సోలంకి.. ధోని ఫేవరెట్ షాట్ అయిన హెలికాప్టర్ సిక్స్‌తో జట్టును ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోలంకి ఆడిన హెలికాప్టర్ షాట్‌ను చూస్తే ధోని మెచ్చుకోకుండా ఉండలేడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.చదవండి: టాప్‌లో కోహ్లి.. రెండుకే పరిమితమైన రోహిత్ — varun seggari (@SeggariVarun) January 27, 2021 -
సస్పెన్షన్ తొలగించినా కోచ్‌గా నియమించలేదు
వడోదరా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ అతుల్ బెదాడేపై విధించిన సస్పెన్షన్‌ను బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) తొలగించింది. అయితే సీనియర్ మహిళా జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి అతన్ని తప్పించింది. ఆరోపణల నేపథ్యంలో అతనిపై ప్రాథమిక విచారణ చేశాం. ఉన్నతస్థాయి కమిటీ... అతనిపై వచ్చిన ఆరోపణలు, జరిగిన విచారణపై చర్చించింది. అనంతరం ఈ సమస్యకు ముగింపు పలికిన కమిటీ బెదాడేపై సస్పెన్షన్‌ను తొలగించింది. అయితే సున్నితమైన ఈ అంశంపై వివాదం రేపకూడదన్న ఉద్దేశంతో మహిళా క్రికెట్ జట్టుకు కోచ్‌గా అతన్ని తప్పించింది’ అని బీసీఏ కార్యదర్శి అజిత్ లెలె తెలిపారు. త్వరలోనే బరోడా మహిళా జట్టుకు అంజూ జైన్‌ను హెడ్ కోచ్‌గా నియమించనున్నారు. (ఇక టెస్టులు ఆడటం నాకు సవాలే) -
‘ఔట్ కాదు.. నేను వెళ్లను’
ముంబై: గత కొంతకాలంగా క్రికెట్లో అంపైరింగ్ ప్రమాణాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. పదేపదే తప్పుడు నిర్ణయాలతో అటు ఆటగాళ్లకు.. ఇటు అభిమానులకు విసుగు తెప్పిస్తున్నారు. తాజాగా రంజీ ట్రోఫీలో భాగంగా ముంబైతో మ్యాచ్ సందర్భంగా బరోడా ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. ముంబై నిర్దేశించిన 533 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా 169 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. ఈ క్రమంలో దీపక్ హుడాతో కలిసి పఠాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ 48 ఓవర్లో ముంబై స్పిన్నర్ శశాంక్ వేసిన బంతిని పఠాన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో పఠాన్ ఛాతికి తగిలి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జయ్ బిస్తా చేతుల్లో పడింది. దీంతో ముంబై ఫీల్డర్లు బ్యాట్‌కు తగిలిందనుకోని అప్పీల్ చేశారు. అయితే అంపైర్ కాసేపు సంకోచించి అనూహ్యంగా పఠాన్ అవుటని ప్రకటించాడు. దీంతో ముంబై క్రికెటర్లు సంబరాల్లో మునిగితేలగా.. పఠాన్ షాక్‌కు గురయ్యాడు. అంతేకాకుండా క్రీజు వదిలి పోవడానికి నిరాకరించాడు. అంపైర్ల వైపు అసంతృప్తితో చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ అజింక్యా రహానే పఠాన్ దగ్గరికి వచ్చి అది ఔటని సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో చేసేదేమిలేక పఠాన్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. అంపైర్లపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబైపై బరోడా 309 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనే ముంబై ఆటగాడు పృథ్వీ షా డబుల్ సెంచరీతో సాధించాడు. -
వాటే స్టన్నింగ్ క్యాచ్
విశాఖ: యూసఫ్ పఠాన్ అనూహ్యంగా భారత్ జట్టులోకి దూసుకొచ్చి అంతే వేగంగా దూరమైన పోయిన క్రికెటర్. 2012లో చివరిసారి భారత్ తరఫున ఆడిన యూసఫ్ పఠాన్.. ఇంకా దేశవాళీ మ్యాచ్‌లు మాత్రం ఆడుతూనే ఉన్నాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ టీ20లో భాగంగా యూసఫ్ పఠాన్ అద్భుతమైన క్యాచ్ పట్టి మళ్లీ వార్తల్లో నిలిచాడు. బరోడా తరఫున ఆడుతున్న యూసఫ్.. శుక్రవారం గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఒక స్టన్నింగ్ క్యాచ్‌తో అలరించాడు. గోవా కెప్టెన్ దర్శన్ మిశాల్ కవర్స్ మీదుగా షాట్ ఆడగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న యూసఫ్ ఒక్కసారిగా గాల్లోకి డైవ్ కొట్టి క్యాచ్ అందుకున్నాడు. గోవా ఇన్నింగ్స్ 19 ఓవర్‌ను అరోథి వేయగా దర్శన్ భారీ షాట్ కొట్టబోయాడు. అది కవర్స్ మీదుగా గాల్లోకి లేచిన సమయంలో యూసఫ్ మెరుపు ఫీల్డింగ్‌తో అతన్ని పెవిలియన్‌కు పంపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గోవా 4 వికెట్ల తేడాతో గెలిచింది. బరోడా నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను గోవా 19.4 ఓవర్లలో ఛేదించింది. కాగా, యూసఫ్ బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. రెండు బంతులు ఆడి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. తన సోదరుడు క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఇర్ఫాన్ పఠాన్ ట్వీటర్లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. అదొక అద్భుతమైన క్యాచ్ అంటూ కొనియాడాడు. Is it a bird ? No this is @yusuf_pathan Great catch today lala.All ur hard work in pre season is paying off #hardwork @BCCI @StarSportsIndia pic.twitter.com/bcpO5pvuZI — Irfan Pathan (@IrfanPathan) November 8, 2019 -
500 మ్యాచ్ లో పరువు నిలుపుకున్నారు!
ముంబై: భారత క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యంకాని రీతిలో 500వ రంజీ మ్యాచ్ ను ఆడిన ముంబై ఎట్టకేలకు డ్రాతో గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. గ్రూప్-సిలో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్ లో ఆద్యంతం పేలవ ప్రదర్శన చేసిన ముంబై జట్టును ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సిద్దేశ్ లడ్డా ఆదుకున్నాడు. దాదాపు ఐదు గంటల పాటు క్రీజ్ లో నిలబడ్డ సిద్దేశ్ లడ్డా..238 బంతుల్ని ఎదుర్కొని 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి రోజు ఆటలో సిద్దేశ్ చలవతో ఏడు వికెట్లు మాత్రమే కోల్పోయి 260 పరుగులు చేసిన ముంబై డ్రాతో సరిపెట్టుకుంది. వాంఖేడ్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ ను డ్రా చేసుకున్న ముంబై పరువు నిలుపుకుంది. ఓటమి దిశగా పయనించి చివరకు మ్యాచ్ ను డ్రా చేసుకోవడంలో సఫలం కావడంతో ముంబై శిబిరంలో పండుగ వాతావరణం నెలకొంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 171 పరుగులకే కుప్పకూలగా.. బరోడా 575/9 పరుగుల భారీ స్కోరు సాధించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వాఘ్ మోడ్ (138), స్వప్నిల్ సింగ్ (164) శతకాలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. ఆపై రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ముంబై తడబాటుకు గురైంది. 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి ప్రమాదంలో పడింది. ఆ తరుణంలో సిద్దేశ్ లడ్డాకు జతగా రహానే(45; 134 బంతుల్లో 4 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్(44;132 బంతుల్లో 4 ఫోర్లు) పోరాడి మ్యాచ్ డ్రా కావడంలో సహకరించారు. -
ఆంధ్ర దీటైన జవాబు
వడోదర: కెప్టెన్ హనుమ విహారి (118 బంతుల్లో 71 బ్యాటింగ్; 11 ఫోర్లు), రికీ భుయ్ (102 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో బరోడాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర రెండో రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (38 బంతుల్లో 40; 5 ఫోర్లు) ధాటిగా ఆడి వెనుదిరగ్గా, డీబీ ప్రశాంత్ (14) విఫలమయ్యాడు. విహారి, భుయ్ మూడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 128 పరుగులు జత చేశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 247/7 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన బరోడా ఆటను తొందరగా ముగించడంలో ఆంధ్ర బౌలర్లు విఫలమయ్యారు. బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటైంది. స్వప్నిల్ సింగ్, అతీత్ సేఠ్ ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 139 పరుగులు జోడించడం విశేషం. అయ్యప్పకు 4 వికెట్లు దక్కగా... కార్తీక్, భార్గవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఆంధ్ర మరో 183 పరుగులు వెనుకబడి ఉంది. మరోవైపు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగాల్సిన రంజీ మ్యాచ్ వరుసగా రెండో రోజూ రద్దయింది. మైదానం చిత్తడిగా ఉండటంతో ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. -
బరోడాను కట్టడి చేసిన ఆంధ్ర
వడోదర: తొలి మ్యాచ్‌లో పటిష్టమైన తమిళనాడును దాదాపు ఓడించినంత పనిచేసిన ఆంధ్ర జట్టు రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది. రంజీ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘సి’లో మాజీ చాంపియన్ బరోడాతో శనివారం మొదలైన మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్లు రాణించారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి బరోడా జట్టు 90 ఓవర్లలో 7 వికెట్లకు 247 పరుగులు చేసింది. పేస్ బౌలర్ బండారు అయ్యప్ప 46 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... కార్తీక్ రామన్‌కు రెండు వికెట్లు దక్కాయి. విజయ్ కుమార్, భార్గవ్ భట్ ఒక్కో వికెట్ తీశారు. భారత జట్టు మాజీ సభ్యులు యూసుఫ్ పఠాన్ (1), ఇర్ఫాన్ పఠాన్ (0) విఫలమయ్యారు. ఓపెనర్ కేదార్ దేవ్‌ధర్ (93; 11 ఫోర్లు) త్రుటిలో సెంచరీని కోల్పోగా... విష్ణు సోలంకి (61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం స్వప్నిల్ సింగ్ (30 బ్యాటింగ్), అతీత్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్, యూపీతొలి రోజు ఆట రద్దు మరోవైపు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్ల మధ్య గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తొలి రోజు ఆట రద్దయింది. రాత్రి కురిసిన వర్షం కారణంగా మైదానం అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. -
ఏడేళ్ల తర్వాత ఫైనల్‌కు...
టైటిల్ పోరుకు తమిళనాడు అర్హత సెమీస్‌లో బరోడాపై విజయం న్యూఢిల్లీ: తొలుత బౌలర్లు... ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ రాణించడంతో... విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో తమిళనాడు జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తమిళనాడు మరో విజయం సాధిస్తే అత్యధికంగా ఐదుసార్లు ఈ టైటిల్ నెగ్గిన జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో తమిళనాడు 2002–03; 2004–05; 2008–09, 2009–10 సీజన్లలో విజేతగా నిలిచింది. బరోడా జట్టుతో గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో తమిళనాడు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బరోడా జట్టు 49.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో రెండు వికెట్లకు 123 పరుగులతో పటిష్టంగా కనిపించిన బరోడా జట్టును తమిళనాడు బౌలర్ సాయికిశోర్ (4/59) దెబ్బతీయగా... అశ్విన్ క్రిస్ట్, వాషింగ్టన్ సుందర్, రాహిల్ షా రెండేసి వికెట్లు పడగొట్టారు. 220 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు జట్టు 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. దినేశ్ కార్తీక్ (77; 4 ఫోర్లు), విజయ్ శంకర్ (53 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి తమిళనాడు విజయంలో కీలకపాత్ర పోషించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. దినేశ్ కార్తీక్ అవుటయ్యాక వాషింగ్టన్ సుందర్ (26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి విజయ్ శంకర్ తమిళనాడు విజయాన్ని ఖాయం చేశాడు. బరోడా బౌలర్లలో అతీత్ మూడు వికెట్లు తీసుకున్నాడు. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో బెంగాల్‌తో జార్ఖండ్ తలపడుతుంది. -
సెమీస్‌లో తమిళనాడు, బరోడా
న్యూఢిల్లీ: విజయ్ హజారే వన్డే క్రికెట్ టోర్నమెంట్లో తమిళనాడు, బరోడా జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో తమిళనాడు జట్టు 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ జట్టును ఓడించింది. తొలుత గుజరాత్ 49.4 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. రజుల్ భట్ (83 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. అనంతరం తమిళనాడు 42.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 217 పరుగులు చేసి గెలిచింది. శ్రీధర్ రాజు (85; 12 ఫోర్లు) రాణించాడు. మరో మ్యాచ్‌లో కర్ణాటక జట్టుపై బరోడా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట కర్ణాటక 233 పరుగులకు ఆలౌటవ్వగా... బరోడా 45.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి నెగ్గింది. క్రునాల్ పాండ్యా (70; 5 ఫోర్లు, 1 సిక్సర్), కేదార్ (78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలు చేశారు. -
ఒకే రోజు 23 వికెట్లు పడ్డాయి..
లాహ్లీ (హరియాణా): రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్, బరోడా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. సోమవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో తొలిరోజే మొత్తం 23 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులకు కుప్పకూలింది. బెంగాల్ బౌలర్ అశోక్ దిండా (6/45) అద్భుతంగా బౌలింగ్ చేసి బరోడాను చావు దెబ్బతీశాడు. కాగా అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగాల్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. అతిత్ సేథ్ (7/36) ధాటికి బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే చాపచుట్టేసింది. ఇదేరోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బరోడా ఆట ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. బరోడా ఓవరాల్‌గా 84 పరుగులు ఆధిక్యంలో ఉంది. మంగళవారం కూడా వికెట్లపతనం ఇలాగే కొనసాగితే మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం ఖాయం. -
22 పరుగుల వ్యవధిలో తొమ్మిది వికెట్లు
రాయ్‌పూర్:దేశవాళీ లీగ్‌ల్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బరోడా కుప్పకూలింది. గ్రూప్-ఎలో తమిళనాడుతో శనివారం ఆరంభమైన మ్యాచ్‌లో బరోడా తొలి ఇన్నింగ్స్ లో 93 పరుగులకే చాపచుట్టేసింది. 71 పరుగుల వరకూ వికెట్ మాత్రమే కోల్పోయి పోటీనిస్తున్నట్లు కనబడిన బరోడా.. ఆపై మరో 22 పరుగులు చేసి మిగతా తొమ్మిది వికెట్లను నష్టపోయింది. తమిళనాడు మీడియం పేసర్లు కృష్ణమూర్తి విఘ్నేష్, అశ్విన్ క్రిష్ట్లు బరోడాను చావు దెబ్బ తీశారు. విఘ్నేష్ ఐదు వికెట్లు సాధించగా, అశ్విన్ క్రిష్ట్కు నాలుగు వికెట్లు తీశాడు. బరోడా ఆటగాళ్లలో దేవ్ ధార్(26), మిస్త్రీ(23), సోలంకి(14)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా, మరో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్లుగా వెనుదిరిగారు. ఆ తరువాత 79/1 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్న తమిళనాడు లంచ్ ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. తమిళనాడు ఆటగాడు అభినవ్ ముకుంద్(100)శతకం సాధించాడు. -
చెలరేగిన యువరాజ్
ఢిల్లీ: రంజీ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ యువరాజ్ సింగ్ చెలరేగిపోయాడు. గ్రూప్-ఎ మ్యాచ్‌లో భాగంగా బరోడాతో మ్యాచ్‌లో యువరాజ్ సింగ్(260:370 బంతుల్లో 26 ఫోర్లు, 4 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. శనివారం మూడో రోజు ఆటలో 179 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన యువరాజ్.. చివరి రోజు ఆటలో కూడా మరోసారి అదే స్థాయిలో బ్యాట్ ఝుళిపించాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో యువీ కొన్ని కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. 452/2 ఓవర్ నైట్ స్కోరుతో ఈ రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్ కు యువరాజ్ మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు మరో పంజాబ్ ఆటగాడు వోహ్రా(224) డబుల్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత యువీ డబుల్ సెంచరీ కూడా తోడవడంతో పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 670 పరుగులు చేసింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన బరోడా చివరి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. బరోడా తన తొలి ఇన్నింగ్స్‌లో 529 పరుగులు చేసింది.ఆ ఇన్నింగ్స్ లో దీపక్ హుడా(293) డబుల్ సెంచరీ సాధించాడు. -
ఫైనల్లో బరోడా, యూపీ
ముంబై: ముస్తాక్ అలీ టి20 టోర్నీ ఫైనల్లో బరోడా, ఉత్తర ప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. సూపర్ లీగ్ గ్రూప్ ‘ఎ’లో బరోడా అగ్రస్థానంలో నిలవగా... గ్రూప్ ‘బి’ నుంచి యూపీ టాప్‌లో నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో బ రోడాతో పాటు కేరళ, ముంబై కూడా ఎనిమిది పాయింట్లు సాధించినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా బరోడా ముందుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో యూ పీ 12 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఫైనల్ బుధవారం జరుగుతుంది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బరోడా ముంబైపై వికెట్ తేడాతో గెలిచింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 57 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఫైనల్‌కు చేరాలంటే బరోడా 19.1 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించాలి. ఈ జట్టు 19 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసి నెగ్గింది. దీపక్ హుడా (35 బంతుల్లో 53; 5 ఫోర్లు; 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. మరో మ్యాచ్‌లో యూపీ జట్టు మూడు వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 158 పరుగులు చేసింది. ఉన్ముక్త్ (35 బంతుల్లో 48; 3 ఫోర్లు; 3 సిక్సర్లు), పవన్ నేగి (23 బంతుల్లో 41; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించారు. యూపీ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. ద్వివేది (35 బంతుల్లో 49; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో కేరళ 2 వికెట్ల తేడాతో విదర్భపై, గుజరాత్ 6 వికెట్లతో జార్ఖండ్‌పై నెగ్గాయి. -
నాకౌట్‌కు బరోడా, ఢిల్లీ
► ఆంధ్రకు మరో ఓటమి ► ముస్తాక్ అలీ టి20 టోర్నీ వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో గ్రూప్ ‘సి’ నుంచి బరోడా, ఢిల్లీ జట్లు నాకౌట్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. లీగ్‌లో ఐదేసి మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు జట్లూ అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి 20 పాయింట్ల చొప్పున సాధించాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో బరోడా జట్టు ఆంధ్రపై మూడు వికెట్లతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 91 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ భరత్ (30) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. బౌలర్ అయ్యప్ప (24) చివర్లో పోరాడటంతో ఆంధ్రకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. బరోడా బౌలర్లలో పాండ్య, ఆరోధ్, భట్ రెండేసి వికెట్లు తీశారు. బరోడా జట్టు 16.5 ఓవర్లలో ఏడు వికెట్లకు 93 పరుగులు చేసి నెగ్గింది. 72 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినా ఇర్ఫాన్ పఠాన్ (28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. మరో మ్యాచ్‌లో ఢిల్లీ 2 పరుగులతో గోవాపై గెలిచింది. తొలుత ఢిల్లీ 91 పరుగులకు ఆలౌట్ కాగా... గోవా 20 ఓవర్లలో 9 వికెట్లకు 89 పరుగులు మాత్రమే చేసింది. ఇదే టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి కేరళ 20 పాయింట్లతో నాకౌట్ స్థానాన్ని ఖరారు చేసుకోగా... జార్ఖండ్ 16 పాయింట్లతో ఉంది. సౌరాష్ట్ర, పంజాబ్ 12 పాయింట్లతో ఉన్నాయి. ఈ మూడింటిలో ఒక జట్టు కేరళతో పాటు నాకౌట్‌కు చేరుతుంది. అందరికీ ఒక్కో మ్యాచ్ మిగిలుంది. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ 16 పాయింట్లతో దాదాపుగా నాకౌట్ బెర్త్ సాధించింది. తమిళనాడు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ 12 పాయింట్లతో ఉన్నాయి. అన్ని జట్లకూ ఒక్కో మ్యాచ్ మిగిలుంది. -
సింగిల్ డిజిట్స్ 10.. ఎక్సట్రాలు 16.. జట్టు స్కోరు 58
ఢిల్లీ: 2,2,3,1,10,6,5,0,3,6,4..ఇవేమి మ్యాజికల్ నంబర్స్ కాదు. దేశవాళీ లీగ్ సందర్భంగా ఒక జట్టులోని ఆటగాళ్లు వరుసగా నమోదు చేసిన పరుగులు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా గ్రూప్-సిలో ఇక్కడ గురువారం బరోడాతో జరిగిన మ్యాచ్ లో త్రిపుర జట్టు ఘోర ప్రదర్శన ఇది. త్రిపుర కెప్టెన్ మురాన్ సింగ్ నమోదు చేసిన 10 పరుగులే అత్యధిక స్కోరు కాగా, కేవలం 22.2 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టులో 16 పరుగులు ఎక్సట్రాలు రూపంలో రావడం గమనార్హం. బరోడా బౌలరల్లో స్వప్నిల్ సింగ్ ఐదు , యూసఫ్ పఠాన్ మూడు వికెట్లు తీసి త్రిపుర బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన బరోడా కూడా ఆదిలో తడబడి 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే అంబటి రాయుడు(31 నాటౌట్), హార్థిక్ పాండ్యా(5 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో బరోడా 6.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్ లో విజయంతో బరోడా 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఐదు మ్యాచ్ ల్లో ఓటమి చవిచూసిన త్రిపుర పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. -
ఆంధ్ర దీటైన జవాబు
తొలి ఇన్నింగ్స్‌లో 96/0 బరోడా 302 ఆలౌట్ విజయనగరం: సొంతగడ్డపై గత రెండు మ్యాచ్‌ల్లో విశేషంగా రాణించిన ఆంధ్ర రంజీ జట్టు మూడో మ్యాచ్‌లోనూ అదే ఆటతీరును కనబరుస్తోంది. బరోడాతో జరుగుతున్న గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో రెండో రోజు ఆంధ్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 96 పరుగులు సాధించింది. కేఎస్ భరత్ (127 బంతుల్లో 50 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్రశాంత్ కుమార్ (102 బంతుల్లో 38 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 234/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బరోడా జట్టు 302 పరుగులకు ఆలౌటైంది. స్వప్నిల్ సింగ్ (159 బంతుల్లో 74; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్‌కు నాలుగు వికెట్లు దక్కగా... అయ్యప్ప, శివకుమార్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. హైదరాబాద్ భారీ స్కోరు మరోవైపు ధర్మశాలలో హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 252/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 434 పరుగులకు ఆలౌటైంది. అనిరుధ్ (99 బంతుల్లో 62; 5 ఫోర్లు), వికెట్ కీపర్ కొల్లా సుమంత్ (113 బంతుల్లో 53; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... ఆశిష్ రెడ్డి (59 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో రిషి ధావన్ మూడు వికెట్లు తీయగా, రోనిత్ మోరె నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హిమాచల్‌ప్రదేశ్ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. అంకుశ్ బైన్స్ (51 బ్యాటింగ్), ప్రశాంత్ చోప్రా (33 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. -
ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత బరోడా
రెండో సారి టైటిల్ కైవసం ఫైనల్లో ఉత్తర ప్రదేశ్‌పై గెలుపు ముంబై: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ ఫైనల్ మ్యాచ్... ఉత్తరప్రదేశ్ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉంది. బరోడా తరఫున లెఫ్టార్మ్ పేసర్ రిషీ అరోథ్ బౌలర్ కాగా...ప్రవీణ్ కుమార్, ఉపేంద్ర యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. రిషీ చక్కటి బంతులతో కట్టడి చేయడంతో ప్రవీణ్ తొలి మూడు బంతులకు ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. ఐదో బంతిని ఉపేంద్ర సిక్సర్‌గా మలిచాడు. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేస్తే గెలుస్తుందనగా, ఫుల్ టాస్‌ను ఆడబోయి అతను అవుటయ్యాడు. ఫలితంగా 3 పరుగుల తేడాతో నెగ్గిన బరోడా దేశవాళీ టి20 టోర్నీని కైవసం చేసుకుంది. 2012 తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీని బరోడా మరో సారి గెలుచుకోవడం విశేషం. రాణించిన వాఘ్‌మోడ్... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కెప్టెన్ ఆదిత్య వాఘ్‌మోడ్ (31 బంతుల్లో 42; 8 ఫోర్లు) ధాటిగా ఆడగా, కేదార్ దేవ్‌ధర్ (32 బంతుల్లో 26; 2 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 22; 1 ఫోర్) అతనికి అండగా నిలిచారు. యూపీ బౌలర్లలో ప్రవీణ్ కుమార్, ముర్తజా చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారీ భాగస్వామ్యం... ముకుల్ దాగర్ (3) ఆరంభంలోనే వెనుదిరిగినా...ప్రశాంత్ గుప్తా (53 బంతుల్లో 68; 8 ఫోర్లు, 1 సిక్స్), ఏకలవ్య ద్వివేది (47 బంతుల్లో 56; 6 ఫోర్లు) భారీ భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్‌ను గెలుపు దిశగా నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 81 బంతుల్లో 98 పరుగులు జోడించారు. వీరి జోరుతో బరోడా 116/1 స్కోరుతో నిలిచింది. అయితే మేరివాలా బౌలింగ్‌లో గుప్తా అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఈ దశలో గెలిచేందుకు చేతిలో 8 వికెట్లతో 26 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన యూపీ 25 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు మాత్రమే చేయగలిగింది.