సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కేవలం 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్‌పై బరోడా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
🚨 HARDIK PANDYA SMASHED 74* (35) IN SMAT...!!! 🚨
- The No.1 T20 All Rounder...!!! 🙇♂️pic.twitter.com/z1Wo4P1p0s— Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2024
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆర్య దేశాయ్ 52 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో హేమంగ్ పటేల్ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు), రిపల్ పటేల్ (7 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించారు. బరోడా బౌలర్లలో అతీత్ సేథ్ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, కృనాల్, మహేశ్ పితియా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడాను హార్దిక్ పాండ్యా ఒంటిచేత్తో గెలిపించాడు. హార్దిక్‌కు జతగా శివాలిక్ శర్మ (43 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. హార్దిక్, శివాలిక్ చెలరేగడంతో బరోడా మరో మూడు బంతులు మిగిలుండగానే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. హార్దిక్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి బరోడాను విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు.. చింతన్ గజా, అర్జన్ నగస్వల్లా, తేజస్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment