Syed Mushtaq Ali T20 tournament
-
చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్
టీ20 ఫార్మాట్లో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. సారథిగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) టైటిల్ గెలిచిన ఈ ముంబై బ్యాటర్.. దేశీ టీ20 టోర్నీలోనూ ట్రోఫీ గెలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) ఫైనల్లో అయ్యర్ కెప్టెన్సీలోని ముంబై జట్టు ఆదివారం మధ్యప్రదేశ్‌ను చిత్తు చేసింది.ఆల్‌రౌండ్ ప్రదర్శనతోటోర్నీ ఆసాంతం రాణించిన శ్రేయస్ సేన టైటిల్ పోరులో మధ్యప్రదేశ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. సమష్టి ప్రదర్శనతో ఫైనల్‌కు వచ్చిన ముంబై.. ఆఖరి మెట్టుపై కూడా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై మధ్యప్రదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) కారణంగా మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అయితే, పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ రెండు వికెట్ల చొప్పున తీసుకున్నారు.ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది. 174 పరుగులతో స్కోరు సమమయ్యాక ముంబై బ్యాటర్ అథర్వ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (37; 4 ఫోర్లు) రాణించాడు.చివర్లో సూర్యాంశ్ షెగ్డే (15 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అథర్వ అంకొలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేశ్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. సూర్యాంశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అజింక్య రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబై సొంతమైంది.ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన తొలి సారథిగాఈ నేపథ్యంలో భారత్‌లో ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన అతడు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా అందుకోవడం విశేషం. కాగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అయ్యర్‌ను ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే.భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్రంజీల్లో ఆడకుండా తప్పించుకునేందుకు గాయం తగ్గినప్పటికీ.. దానిని సాకుగా చూపాడని తేలడంతో బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేసినట్లు తెలిసింది. అయితే, ఐపీఎల్లో తనను తాను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్‌కు మళ్లీ టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. కానీ.. టీ20 జట్టులో మాత్రం అతడికి స్థానం ఇవ్వడం లేదు.టీమిండియా తరఫున గతేడాది డిసెంబరులో చివరగా శ్రేయస్ అయ్యర్ టీ20 మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే, తాజాగా దేశీ టీ20 టోర్నీలోనూ సత్తా చాటి.. టీమిండియా సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్ పంపించాడు.వచ్చే ఏడాది పంజాబ్ జట్టుకుఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్‌కతా శ్రేయస్ అయ్యర్‌ను రిలీజ్ చేయగా.. పంజాబ్ కింగ్స్ వేలంపాటలో అతడిని కొనుక్కుంది. ఈ స్టార్ ప్లేయర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. రూ. 27 కోట్ల ధర పలికిన రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్) అయ్యర్ కంటే ముందున్నాడు.చదవండి: ‘రోహిత్, గంభీర్ మధ్య విభేదాలు?.. ద్రవిడ్‌తో చక్కగా ఉండేవాడు.. కానీ’ -
సుర్యాంశ్ షేడ్గే ఊచకోత.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబైదే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని ముంబై జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన ఫైనల్లో ముంబై మధ్యప్రదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్.. కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి మధ్యప్రదేశ్‌కు ఫైటింగ్ టోటల్ అందించాడు. ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లలో పాటిదార్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సుభ్రాన్షు సేనాపతి (23), హర్‌ప్రీత్ సింగ్ (15), వెంకటేశ్ అయ్యర్ (17), రాహుల్ బాథమ్ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆర్పిత్ గౌడ్ (3), హర్ష్ గావ్లి (2), త్రిపురేశ్ సింగ్, శివమ్ శుక్లా (1) సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్, శివమ్ దూబే, సుయాంశ్ షేడ్గే తలో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన రహానే, స్కై.. షేడ్గే, అంకోలేకర్ ఊచకోత175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఆదిలోనే పృథ్వీ షా (10) వికెట్ కోల్పోయింది. అయితే రహానే (30 బంతుల్లో 37), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9 బంతుల్లో 16) ఏమాత్రం తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48) తనదైన స్టయిల్లో విరుచుకుపడ్డాడు. చివర్లో శివమ్ దూబే (6 బంతుల్లో 9), అథర్వ అంకోలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్), సూర్యాంశ్ షేడ్గే (15 బంతుల్లో 36 నాటౌట్) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ముంబైని గమ్యానికి చేర్చారు. ముఖ్యంగా షేడ్గే మధ్యప్రదేశ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అంకోలేకర్ సిక్సర్ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దేశవాలీ క్రికెట్లో ముంబైకు ఇది 63వ టైటిల్. రెండో సయ్యద్ ముస్తాక్ అలీ టైటిల్. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన రహానేకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు, ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్యాంశ్ షేడ్గేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు లభించాయి. సూర్యాంశ్ షేడ్గేను ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కేవలం 30 లక్షలకు సొంతం చేసుకుంది. -
SMAT Final: రజత్ పాటిదార్ విధ్వంసం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్లో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసం సృష్టించాడు. మధ్యప్రదేశ్, ముంబై జట్ల మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ (డిసెంబర్ 15) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యప్రదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రజత్ పాటిదార్ చివరి రెండు ఓవర్లలో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సుయాంశ్ షేడ్గే వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన పాటిదార్.. శార్దూల్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టాడు. అంతకుముందు మధ్యప్రదేశ్‌కు ఇన్నింగ్స్ 18వ ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్లో రాయ్స్టన్ డయాస్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. ఆ ఓవర్లో మొదటి రెండు బంతులకు రాహుల్ బాథమ్ సిక్సర్, బౌండరీ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే రాయ్స్టన్ డయాస్ బౌలింగ్‌లో బాథమ్ ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ ఒంటరిపోరాటం చేశాడు. ఓ పక్క సహచరులంతా పెవిలియన్‌కు చేరుతున్నా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాటిదార్ ఆతర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సుభ్రాన్షు సేనాపతి (23), హర్‌ప్రీత్ సింగ్ (15), వెంకటేశ్ అయ్యర్ (17), రాహుల్ బాథమ్ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆర్పిత్ గౌడ్ (3), హర్ష్ గావ్లి (2), త్రిపురేశ్ సింగ్, శివమ్ శుక్లా (1) సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్, శివమ్ దూబే, సుయాంశ్ షేడ్గే తలో వికెట్ దక్కించుకున్నారు. -
రెచ్చిపోయిన రజత్ పాటిదార్.. ఫైనల్లో మధ్యప్రదేశ్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మధ్యప్రదేశ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ (డిసెంబర్ 13) సాయంత్రం జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. అనుజ్ రావత్ (33 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియాన్ష్ ఆర్య 29, యశ్ ధుల్ 11, ఆయుశ్ బదోని 19, హిమ్మత్ సింగ్ 15, మయాంక్ రావత్ 24, హర్ష్ త్యాగి 9 (నాటౌట్) పరుగులు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్ 2, కుమార్ కార్తికేయ, ఆవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. రెచ్చిపోయిన రజత్ పాటిదార్147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. రజత్ పాటిదార్ రెచ్చిపోవడంతో 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రజత్ పాటిదార్ 29 బంతుల్లో 4 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాటిదార్‌కు హర్‌ప్రీత్ సింగ్ భాటియా (46 నాటౌట్) సహకరించాడు. ఆదిలో ఓపెనర్ హర్ష్ గావ్లి (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హిమాన్షు చౌహాన్ ఓ వికెట్ తీశాడు.ఫైనల్లో మధ్యప్రదేశ్ఢిల్లీపై గెలుపుతో మధ్యప్రదేశ్ ఫైనల్లోకి ప్రవేశించింది. డిసెంబర్ 15న జరిగే ఫైనల్లో మధ్యప్రదేశ్ ముంబైని ఢీకొంటుంది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బరోడాపై గెలిచి ముంబై ఫైనల్‌కు చేరింది. రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించి ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు. -
బంతితో రాణించిన వెంకటేశ్ అయ్యర్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ఆటగాడు, టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ బంతితో రాణించాడు. ఢిల్లీతో ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయ్యర్‌తో పాటు కుమార్ కార్తికేయ (3-0-23-1), ఆవేశ్ ఖాన్ (4-0-36-1), త్రిపురేశ్ సింగ్ (3-0-18-1) వికెట్లు తీయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. అనుజ్ రావత్ (33 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియాన్ష్ ఆర్య 29, యశ్ ధుల్ 11, ఆయుశ్ బదోని 19, హిమ్మత్ సింగ్ 15, మయాంక్ రావత్ 24, హర్ష్ త్యాగి 9 (నాటౌట్) పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బరోడాపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (33), కృనాల్ పాండ్యా (30), శివాలిక్ శర్మ (26 నాటౌట్), అథీత్ సేథ్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్ అయ్యర్ (46) కూడా కాసేపు మెరుపులు మెరిపించాడు.భీకర ఫామ్‌లో రహానేముంబై వెటరన్ అజింక్య రహానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న రహానే.. ఈ టోర్నీలో గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.గత ఆరు మ్యాచ్‌ల్లో రహానే చేసిన స్కోర్లు..- 52(34) vs మహారాష్ట్రపై- 68(35) vs కేరళపై - 22(18) vs సర్వీసెస్‌పై- 95(53) vs ఆంధ్రపై- 84(45) vs క్వార్టర్ ఫైనల్లో విదర్భపై- 98(57) vs సెమీస్‌లో బరోడాపై -
కేకేఆర్‌కు గుడ్ న్యూస్.. అరివీర భయంకరమైన ఫామ్‌లో రహానే
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు కేకేఆర్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీఫైనల్లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ టోర్నీలో రహానే గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.మహారాష్ట్రతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో రహానే పరుగుల ప్రవాహం మొదలైంది. ఆ మ్యాచ్‌లో అతను 34 బంతుల్లో 52 పరుగుల చేశాడు. ఆతర్వాత కేరళతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అనంతరం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు.రహానే విశ్వరూపం ఆంధ్రతో జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌తో మొదలైంది. ఈ మ్యాచ్‌లో రహానే 53 బంతుల్లో 95 పరుగులు చేశాడు. అనంతరం విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీస్‌లో 57 బంతుల్లో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.ప్రస్తుత సీజన్లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ) రహానే లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో రహానే 8 మ్యాచ్‌లు ఆడి 172 స్ట్రయిక్ రేట్‌తో 366 పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన సెమీస్‌లో రహానే రఫ్ఫాడించడంతో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు చేరింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (33), కృనాల్ పాండ్యా (30), శివాలిక్ శర్మ (26 నాటౌట్), అథీత్ సేథ్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్ అయ్యర్ (46) కూడా కాసేపు మెరుపు మెరిపించాడు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు డిసెంబర్ 15న జరిగే అంతిమ పోరులో ముంబైతో తలపడనుంది. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో అజింక్య రహానేను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.1.5 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. -
రఫ్పాడించిన రహానే.. విధ్వంసకర సెంచరీ మిస్.. అయితేనేం..
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ అజింక్య రహానే పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బరోడా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన రహానే సెంచరీ దిశగా పయనించాడు.శతకానికి రెండు పరుగుల దూరంలోఅయితే, దురదృష్టవశాత్తూ శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు రహానే. అయితేనేం తన మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబైకి విజయం అందించి.. ఫైనల్‌కు చేర్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ముంబై జట్టు బరోడాతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. బరోడాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది.రాణించిన శివాలిక్ శర్మబరోడా ఇన్నింగ్స్‌లో శివాలిక్ శర్మ(36 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ శశ్వత్ రావత్(33), కెప్టెన్ కృనాల్ పాండ్యా(30), ఆల్‌రౌండర్ అతిత్ సేత్(14 బంతుల్లో 22) ఫర్వాలేదనిపించారు. ఇక ముంబై బౌలర్లలో పేసర్లు సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. శివం దూబే, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి ఒక్కో వికెట్ తీశారు. ఇక స్పిన్ బౌలర్లు తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టిన రహానేఇక బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలో షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఓపెనర్ పృథ్వీ షా(8) అవుటయ్యాడు. అయితే, ఆ ఆనందం బరోడాకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ అజింక్య రహానే బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టాడు.కేవలం 56 బంతుల్లోనే 11 ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో ఏకంగా 98 పరుగులు రాబట్టాడు. అయితే, అభిమన్యు సింగ్ బౌలింగ్‌లో విష్ణు సోలంకికి క్యాచ్ ఇవ్వడంతో రహానే విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది. తృటిలో సెంచరీ అతడి చేజారింది. సూర్య విఫలంమిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లో 46 పరుగులతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. ఏడు బంతులు ఆడిన స్కై కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. శివం దూబే 0, సూర్యాంశ్ షెడ్గే 6 పరుగులతో అజేయంగా నిలిచారు.ఇక రహానే ధనాధన్ బ్యాటింగ్ కారణంగా ముంబై 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో బరోడాను ఓడించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఫైనల్ చేరింది.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
హార్దిక్ పాండ్యా విఫలం
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగింపు దశకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా శుక్రవారం రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో బరోడాతో ముంబై జట్టు తలపడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.బరోడా నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లలో శశ్వత్ రావత్(33) ఫర్వాలేదనిపించినా.. అభిమన్యు రాజ్‌పుత్(9) విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కృనాల్ పాండ్యా 24 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ భాను పనియా(2) నిరాశపరిచాడు.ఈ దశలో శివాలిక్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక హార్దిక్ పాండ్యా ఐదు పరుగులకే నిష్క్రమించగా.. ఆల్‌రౌండర్ అతిత్ సేత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 22 పరుగులతో.. శివాలిక్ శర్మకు సహకారం అందించాడు.పాండ్యాను అవుట్ చేసిన దూబేఇక బరోడా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి మహేశ్ పితియా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్థి, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను శివం దూబే అవుట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ల మధ్య పోరులో దూబే పైచేయి సాధించాడు. దూబే బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి హార్దిక్ అవుటయ్యాడు. కాగా ఫామ్‌లో ఉన్న ముంబై బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సులువుగానే పూర్తి చేస్తుందని ఆ జట్టు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదుక్వార్టర్ ఫైనల్లో విదర్భ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ముంబై సెమీస్‌కు చేరితే... బెంగాల్‌పై గెలిచి బరోడా ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ముంబై తరఫున సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే ఫుల్ ఫామ్‌లో ఉండగా... గత మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీ షా కూడా రాణించాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెగ్డె, శార్దూల్ ఠాకూర్ ఇలా ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు.ఢిల్లీతో మధ్యప్రదేశ్..మరోవైపు బరోడా జట్టుకు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రూపంలో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా బ్యాటింగ్ పరంగా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక రెండో సెమీఫైనల్లో ఆయుశ్ బదోనీ సారథ్యంలోని ఢిల్లీ జట్టు... మధ్యప్రదేశ్‌తో తలపడనుంది. ఢిల్లీకి అనూజ్ రావత్, యశ్ ధుల్ కీలకం కానుండగా... రజత్ పాటిదార్, వెంకటేశ్ అయ్యర్‌పై మధ్యప్రదేశ్ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. pic.twitter.com/DrAAm9Ubd1— Sunil Gavaskar (@gavaskar_theman) December 13, 2024 -
SMAT: టీమిండియా స్టార్ల మెరుపులు.. సెమీస్ చేరిన జట్లు, షెడ్యూల్
ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ తదితరులు ఈ టోర్నీలో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇక ఈ టీ20 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. మధ్యప్రదేశ్, బరోడా, ముంబై, ఢిల్లీ జట్లు టాప్-4లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్స్ తదితర అంశాలను గమనిద్దాం. అంతకంటే ముందు.. ఈ నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తీరుపై ఓ లుక్కేద్దాం.పృథ్వీ షా, సూర్యాంశ్, శివమ్ దూబే మెరుపులు గ్రూప్ ‘ఇ’ టాపర్‌గా క్వార్టర్స్‌లో అడుగు పెట్టిన ముంబై అదే జోరు కొనసాగిస్తూ విదర్భను మట్టికరిపించింది. ఆలూరులో బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలుపొందింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అథర్వ తైడె (41 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), అపూర్వ్ వాంఖడె (33 బంతుల్లో 51; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించగా... శుభమ్ దూబే (19 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలిచింది.సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి బంతి నుంచే ఓపెనర్లు విరుచుకుపడటంతో 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 83 పరుగులు చేసింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) విఫలం కాగా... ఆఖర్లో శివమ్ దూబే (37 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సూర్యాంశ్ (36 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షోఆలూరు: పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (33 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు; 2/23) ఆకట్టుకోవడంతో... సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట సౌరాష్ట్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసింది. చిరాగ్ జానీ (45 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. అరి్పత్ గౌడ్ (42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చివర్లో హర్‌ప్రీత్ సింగ్ (9 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, 3 క్యాచ్‌లు బెంగళూరు: బెంగాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా 41 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ చేరింది. బరోడాకు ఆడుతున్న భారత స్టార్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టడంతోపాటు 3 క్యాచ్‌లు తీసుకున్నాడు. మొదట బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.శాశ్వత్ రావత్ (40; 1 ఫోర్, 3 సిక్స్‌లు), అభిమన్యు సింగ్ (37; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెంగాల్ బౌలర్లలో షమీ, కనిష్క్ సేత్, ప్రతీప్తా ప్రమాణిక్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగాల్ తడబడింది. 18 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, లుక్మన్ మెరివాలా, అతిత్ సేత్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. అనూజ్ అదుర్స్బెంగళూరు: వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర అర్ధశతకంతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు ముస్తాక్ అలీ టోర్నీ సెమీఫైనల్‌కు చేరింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టుపై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది.అనూజ్ రావత్‌తో పాటు ఓపెనర్లు యశ్ ధుల్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు ప్రియం గార్గ్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో పోరాడగా... రింకూ సింగ్ (10), నితీశ్ రాణా (2) విఫలమవడంతో ఉత్తరప్రదేశ్‌కు పరాజయం తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3... ఆయుష్ బదోనీ, సుయాశ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదిక, టైమింగ్స్తొలి సెమీ ఫైనల్:👉ముంబై వర్సెస్ బరోడా- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- ఉదయం 11 గంటలకు ఆరంభం.రెండో సెమీ ఫైనల్: 👉మధ్యప్రదేశ్ వర్సెస్ ఢిల్లీ- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- సాయంత్రం 4.30 నిమిషాలకు ఆరంభం.ఇప్పటి వరకు అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు సాధించింది వీరేసకీబుల్ గనీ ఈ సీజన్లో 353 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా ఉండగా.. కరణ్ లాల్ 338, అభిషేక్ పోరెల్ 335, అజింక్య రహానే 334, తిలక్ వర్మ 327 పరుగులు సాధించారు.మరోవైపు.. జగ్జీత్ సింగ్ 18 వికెట్లతో టాప్ బౌలర్‌గా ఉండగా.. కుమార్ కార్తికేయ 15, ముకేశ్ చౌదరి 15చ శ్రేయస్ గోపాల్ 14, కేవీ శశికాంత్ 14 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్‌లో ఆర్సీబీ పేసర్ -
అనుజ్ రావత్ ఊచకోత.. సెమీస్‌లో ఢిల్లీ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఢిల్లీ సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీ.. ఉత్తర్ప్రదేశ్పై 19 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (44), యశ్ ధుల్ (42) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. అనంతరం ఆయుశ్ బదోని (25) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడగా.. ఆతర్వాత వచ్చిన అనుజ్ రావత్ చెలరేగిపోయాడు. అనుజ్ కేవలం 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనుజ్ విధ్వంసం ధాటికి యూపీ బౌలర్లు విలవిలలాడిపోయారు. యూపీ బౌలర్లలో మొహిసిన్ ఖాన్, వినీత్ పన్వర్, నితీశ్ రాణా తలో వికెట్ పడగొట్టారు.194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ.. ఢిల్లీ బౌలర్లు తలో చేయి వేయడంతో 174 పరుగలకే ఆలౌటైంది. ప్రిన్స్ యాదవ్ 3, ఆయుశ్ బదోని, సుయాశ్ శర్మ చెరో 2, ఇషాంత్ శర్మ, సిమ్రన్‌జీత్ సింగ్, హర్ష్ త్యాగి తలో వికెట్ పడగొట్టారు. యూపీ ఇన్నింగ్స్‌లో ప్రియం గార్గ్ (54) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సమీర్ రిజ్వి 26, భువనేశ్వర్ కుమార్ 20 పరుగులు చేశారు. టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ (10), నితీశ్ రాణా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.సెమీస్‌లో బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ఇవాళ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ సెమీస్‌కు చేరాయి. డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో బరోడా, ముంబై.. అదే రోజు జరిగే రెండో సెమీఫైనల్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. -
విధ్వంసం సృష్టించిన షా, రహానే, దూబే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో ముంబై విదర్భపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు చేరుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. అథర్వ తైడే (66), వాంఖడే (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో శుభమ్ దూబే (43 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.THE SIX HITTING MACHINE - SHIVAM DUBE 🥶 pic.twitter.com/Qy2uhlXKBp— Johns. (@CricCrazyJohns) December 11, 2024అనంతరం బరిలోకి దిగిన ముంబై.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. ఆఖర్లో శివమ్ దూబే (22 బంతుల్లో 37 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), సూర్యాంశ్ షేడ్గే (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృస్టించారు. MUMBAI INTO SEMIS OF SMAT...!!!Suryansh Shedge with another masterclass. 🙇♂️👌 pic.twitter.com/6FxuxENHc4— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2024ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపుపై ఆశలు వదులుకున్న తరుణంలో శివమ్ దూబే, సూర్యాంశ్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై విజయానికి షా, రహానే బీజం వేసినప్పటికీ.. మధ్యలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.సూపర్ ఫామ్‌లో రహానేఈ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజింక్య రహానే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రహానే గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 52, 68, 22, 95, 84 పరుగులు స్కోర్ చేశాడు. విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రహానే కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. -
SMAT 2024: ముంబైతో క్వార్టర్ ఫైనల్.. భారీ స్కోర్ చేసిన విదర్భ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఇవాళ (డిసెంబర్ 11) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. క్వార్టర్ ఫైనల్-3లో సౌరాష్ట్రపై మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందగా.. క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్‌పై బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆలుర్ వేదికగా ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్-4 మ్యాచ్ జరుగుతుంది. ముంబైతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విదర్భ తొలుత బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బరిలోకి దిగిన విదర్భ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అథర్వ తైడే (66), అపూర్వ్ వాంఖడే (51) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. శుభమ్ దూబే (43 నాటౌట్) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. ఓపెనర్ కరుణ్ నాయర్ 26, పార్థ్ రేఖడే 1, కెప్టెన్ జితేశ్ శర్మ 11, మందార్ మహలే 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శుభమ్ దూబే, మందార్ మహలే కలిసి 24 పరుగులు పిండుకున్నారు. మొహిత్ అవస్తి వేసిన ఈ ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ బౌండరీ వచ్చాయి. అంతకుముందు 19వ ఓవర్లోనూ 16 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌ను సూర్యాంశ్ షెడ్గే వేశాడు. ముంబై బౌలర్లలో సూర్యాంశ్ షెడ్గే, అథర్వ అంకోలేకర్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తనుశ్ కోటియన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
షాబాజ్ అహ్మద్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా.. సెమీస్‌లో బరోడా
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో మరో సెమీ ఫైనలిస్టు ఖరారైంది. బెంగాల్‌పై 41 పరుగుల తేడాతో గెలిచిన బరోడా టాప్-4లో అడుగుపెట్టింది. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టుకు కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక అతడి తమ్ముడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఈసారి దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు.ప్రపంచ రికార్డుకాగా కృనాల్ సారథ్యంలో బరోడా జట్టు ఈసారి అద్భుతాలు సృష్టించింది. లీగ్ దశలో భాగంగా సిక్కిం జట్టుపై పరుగుల విధ్వంసానికి పాల్పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.ఇదే జోరులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న బరోడా జట్టు.. బుధవారం బెంగాల్ జట్టుతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.రాణించిన ఓపెనర్లుపాండ్యా బ్రదర్స్ హార్దిక్(10), కృనాల్(7) పూర్తిగా విఫలమైనా.. ఓపెనర్లు శశ్వత్ రావత్(40), అభిమన్యు సింగ్(37) ఆకట్టుకున్నారు. వీరికి తోడు శివాలిక్ శర్మ(24), భాను పనియా(17), విష్ణు సోలంకి(16 నాటౌట్) రాణించారు. ఇక బెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ తలా రెండు వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన బెంగాల్‌కు ఓపెనర్ అభిషేక్ పోరెల్(13 బంతుల్లో 22) మెరుపు ఆరంభం అందించినా.. మరో ఓపెనర్ కరణ్ లాల్(6), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సుదీప్ కుమార్ ఘరామి(2) పూర్తిగా విఫలమయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన రితిక్ ఛటర్జీ సైతం డకౌట్‌గా వెనుదిరిగాడు.షాబాజ్ మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలో రిత్విక్ చౌదరి(18 బంతుల్లో 29)తో కలిసి టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 36 బంతుల్లోనే 55 పరుగులతో షాబాజ్ చెలరేగాడు. అయితే, రితిక్‌ను హార్దిక్ పాండ్యా, షాబాజ్‌ను అతిత్ సేత్ అవుట్ చేయడంతో బెంగాల్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. బరోడా బౌలర్ల ధాటికి.. మిగతా వాళ్లలో ప్రదీప్త 3, సాక్షిమ్ చౌదరి 7, షమీ 0, కనిష్క్ 5(నాటౌట్), సయాన్ ఘోష్(0) చేతులెత్తేశారు.ఫలితంగా 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయిన బెంగాల్.. 41 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు.. బరోడా సెమీ ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది. సెమీస్‌లో బరోడాబరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లుక్మాన్ మెరివాలా, అతిత్ సేత్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. అభిమన్యు ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ సౌరాష్ట్రను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.చదవండి: అతడికి ఆసీస్ జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్ -
హార్దిక్ పాండ్యా విఫలం.. షమీకి రెండు వికెట్లు
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్ ముగింపునకు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌కు చేరే క్రమంలో ఎనిమిది జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్, బరోడా- బెంగాల్, ముంబై- విదర్భ, ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి.ఇందులో భాగంగా తొలుత సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్(క్వార్టర్ ఫైనల్-3) మ్యాచ్ ఫలితం వెలువడింది. కర్ణాటకలోని ఆలూర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్రపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచింది. తద్వారా సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.బరోడా ఓపెనర్లు భళాఇక క్వార్టర్ ఫైనల్-1లో భాగంగా బరోడా బెంగాల్‌తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు శశ్వత్ రావత్(26 బంతుల్లో 40), అభిమన్యు సింగ్ రాజ్‌పుత్(34 బంతుల్లో 37) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు.పాండ్యా బ్రదర్స్ విఫలంమొత్తంగా 11 బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేశాడు హార్దిక్ పాండ్యా. ఇక అతడి అన్న, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా సైతం పూర్తిగా నిరాశపరిచాడు. పదకొండు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేసి నిష్క్రమించాడు. శివాలిక్, విష్ణు మెరుపు ఇన్నింగ్స్మిగతా వాళ్లలో శివాలిక్ శర్మ(17 బంతుల్లో 24), భాను పనియా(11 బంతుల్లో 17), విష్ణు సోలంకి(7 బంతుల్లో 16 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగలిగింది. బెంగాల్ బౌలర్లలో టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గెలుపు కోసం నువ్వా- నేనా అన్నట్లు పోటీపడిన ఈ మ్యాచ్‌లో బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన హార్దిక్ మూడు వికెట్లతో మెరిశాడు.బరోడా వర్సెస్ బెంగాల్ తుదిజట్లుబెంగాల్అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరణ్ లాల్, సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), రిటిక్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, రిత్విక్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కనిష్క్ సేథ్, మహ్మద్ షమీ, సాక్షిమ్ చౌదరి, సయన్ ఘోష్.బరోడాశశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్, భాను పనియా, శివాలిక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విష్ణు సోలంకి (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), అతిత్ షేత్, మహేష్ పితియా, లుక్మాన్ మేరీవాలా, ఆకాష్ మహరాజ్ సింగ్చదవండి: SMAT 2024: వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్ -
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 9) జరిగిన రెండో ప్రీ క్వార్టర్ ఫైనల్లో యూపీ ఆంధ్రప్రదేశ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు విప్రాజ్ నిగమ్ (ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిగమ్‌ను 50 లక్షలకు కొనుగోలు చేసింది) ఆల్‌రౌండ్ షోతో (4-0-20-2, 8 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టి యూపీని గెలిపించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఏపీ ఇన్నింగ్స్‌లో ఎస్డీఎన్వీ ప్రసాద్ (34 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేవీ శశికాంత్ (23 నాటౌట్), కెప్టెన్ రికీ భుయ్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీకర్ భరత్ (4), అశ్విన్ హెబ్బర్ (11), షేక్ రషీద్ (18), పైలా అవినాశ్ (19), త్రిపురణ విజయ్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. మొహిసిన్ ఖాన్, శివమ్ మావి చెరో వికెట్ దక్కించుకున్నారు.157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్.. మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరణ్ శర్మ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్సర్), విప్రాజ్ నిగమ్ (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి యూపీని గెలిపించారు. కే సుదర్శన్ (4-1-23-3), త్రిపురణ విజయ్ (4-0-21-2), సత్యనారాయణ రాజు (4-0-30-1) మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ ఏపీని గెలిపించలేకపోయారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు డిసెంబర్ 11న జరుగనున్నాయి. -
బ్యాట్‌తో రాణించిన షమీ.. క్వార్టర్ ఫైనల్లో బెంగాల్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 9) ఉదయం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ చండీఘడ్‌పై 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మొహమ్మద్ షమీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 17 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 33 పరుగులు చేసిన కరణ్ లాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదిప్త ప్రమాణిక్ 30, వ్రిత్తిక్ చట్టర్జీ 28 పరుగులు చేశారు. చండీఘడ్ బౌలర్లలో జగ్జీత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్ బవా 2, నిఖిల్ శర్మ, అమృత్ లుబానా, భగ్మేందర్ లాథర్ తలో వికెట్ తీశారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చండీఘడ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. సయాన్ ఘోష్ నాలుగు వికెట్లు తీసి చండీఘడ్ను దెబ్బకొట్టాడు. కనిష్క్ సేథ్ 2, షాబాజ్ అహ్మద్, షమీ తలో వికెట్ పడగొట్టారు. చండీఘడ్ ఇన్నింగ్స్‌లో రాజ్ బవా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదీప్ యాదవ్ (27), మనన్ వోహ్రా (23), నిఖిల్ శర్మ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కాగా, డిసెంబర్ 11న జరిగే క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ బరోడాను ఢీకొంటుంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు రెండో ప్రీ క్వార్టర్ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఉత్తర్ ప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్‌తో తలపడనుంది. -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న రహానే.. 54 బంతుల్లో..!
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు నాకౌట్ దశకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీకర్ భరత్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా.. అశ్విన్ హెబ్బర్ (52), రికీ భుయ్ (68) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై.. అజింక్య రహానే వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రహానే 5 పరుగుల స్వల్ప తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా (34), శ్రేయస్ అయ్యర్ (25), శివమ్ దూబే (34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో సుయాంశ్ షేడ్గే 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 30 పరుగులు చేసి ముంబైని విజయతీరాలు దాటించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024 ఎడిషన్‌లో ఆంధ్రకు ఇది తొలి పరాజయం. -
ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. ఇవాళ (నవంబర్ 5) జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తర్ ప్రదేశ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొలి హ్యాట్రిక్ నమోదు చేయగా.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా బౌలర్ ఫెలిక్స్ అలెమావో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. భువీ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. ఈ మ్యాచ్‌లో భువీతో పాటు మిగతా బౌలర్లు కూడా చెలరేగడంతో జార్ఖండ్‌పై యూపీ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.రెండో హ్యాట్రిక్ విషయానికొస్తే.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా బౌలర్ ఫెలిక్స్ అలెమావో ఇన్నింగ్స్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఫెలిక్స్ మొత్తంగా 5 వికెట్లు తీశాడు. ఫెలిక్స్‌తో పాటు మోహిత్ రేడ్కర్ (4/18) కూడా చెలరేగడంతో నాగాలాండ్‌పై గోవా 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గోవా.. దర్శన్ మిసాల్ (91), సూయాశ్ ప్రభుదేశాయ్ (69) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నాగాలాండ్ నిర్ణీత ఓవర్లలో 129 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో చేతన్ బిస్త్ (63) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. -
శివాలెత్తిన అక్షర్ పటేల్.. ఒకే ఓవర్లో..!
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాడు, గుజరాత్ ప్లేయర్ అక్షర్ పటేల్ చెలరేగిపోయాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో అక్షర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ 20 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో అజేయమైన 56 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విద్యాధర్ అనే వ్యక్తి బౌలింగ్‌లో అక్షర్ పేట్రేగిపోయాడు. ఈ ఓవర్లో అతను ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. ఇందులో 3 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. అక్షర్ విజృంభించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 251 పరుగుల భారీ స్కోర్ చేసింది. AXAR PATEL SMASHED 6,2,6,4,0,6 - 24 RUNS IN THE FINAL OVER. 🤯 pic.twitter.com/lTV3Of4CLV— Mufaddal Vohra (@mufaddal_vohra) December 5, 2024ఓపెనర్ ఆర్య దేశాయ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ఓపెనర్, ఈ సీజన్లో రెండు వేగవంతమైన సెంచరీలు చేసిన ఉర్విల్ పటేల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. అభిషేక్ దేశాయ్ 32 బంతుల్లో 47.. హేమంగ్ పటేల్ 12 బంతుల్లో 30 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో కౌశిక్, భాండగే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. విద్యాధర్ పాటిల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కర్ణాటక గెలుపు కోసం చివరి వరకు పోరాడింది. ఆ జట్టు 19.1 ఓవర్లలో 203 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్మరన్ రవిచంద్రన్ (49), మయాంక్ అగర్వాల్ (45), మనీశ్ పాండే (30), కృష్ణణ్ శ్రీజిత్ (26) కర్ణాటకను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, నగస్వల్లా చెరో 2, చింతన్ గజా, విశాల్ జేస్వాల్, ఆర్య దేశాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
సంజూ సేనను మట్టికరిపించిన ఆంధ్ర.. వరుసగా ఐదో విజయం
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆంధ్ర క్రికెట్ జట్టు జోరు కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలు సాధించిన ఆంధ్ర.. తాజాగా ఐదో విజయం నమోదు చేసింది. కేరళతో ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సంజూ సేనను ఆంధ్ర బౌలర్లు 87 పరుగులకే (18.1 ఓవర్లలో) మట్టికరిపించారు. కేవి శశికాంత్ 3, కే సుదర్శన్, సత్యనారాయణ రాజు, బోధల కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టారు. కేరళ ఇన్నింగ్స్‌లో జలజ్ సక్సేనా (27) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అబ్దుల్ బాసిత్ (18), నిధీశ్ (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. టీమిండియా ఆటగాడు, కేరళ సారధి సంజూ శాంసన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు.. 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. శ్రీకర్ భరత్ అజేయమైన అర్ద శతకంతో (56) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ హెబ్బర్ 12, షేక్ రషీద్ 5, పైలా అవినాశ్ 0, రికీ భుయ్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 3 వికెట్లు పడగొట్టగా.. నిధీశ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తాజా ఓటమితో కేరళ గ్రూప్-ఈ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఆంధ్ర గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుంది. -
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. శివమ్ దూబే ఊచకోత
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు, ముంబై ప్లేయర్లు శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయారు. సర్వీసెస్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో స్కై విధ్వంసం సృష్టిస్తే.. శివమ్ దూబే ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. స్కై 46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేయగా.. దూబే 36 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. The Surya-Dube show for Mumbai. 🤯pic.twitter.com/wNgwqLA7Cd— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2024దూబే సిక్సర్ల వర్షానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. గాయం కారణంగా గత మూడు నెలలుగా కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న దూబే ఈ మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలోనే దూబే అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో దూబే బంతితోనూ రాణించాడు. 3 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై సూర్యకుమార్ యాదవ్ (70), శివమ్ దూబే (71) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అజింక్య రహానే 18 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 22 పరుగులు చేశాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 14 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. సర్వీసెస్ బౌలర్లలో పూనియా, విశాల్ గౌర్, వికాస్ యాదవ్, శుక్లా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సర్వీసెస్ 19.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటై, 39 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీసి సర్వీసెస్ పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ 3, మోహిత్ అవస్తి, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో మోహిత్ అహ్లావత్ (54) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఈ గెలుపుతో ముంబై గ్రూప్-ఈ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. -
భీకర ఫామ్‌లో తిలక్ వర్మ.. హ్యాట్రిక్ సెంచరీలు.. ఇప్పుడు..!
టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ నవంబర్ నెలలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ నెలలో తిలక్ ఏకంగా మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. నవంబర్ 13న సౌతాఫ్రికాపై సెంచరీ (107 నాటౌట్ (56 బంతుల్లో)) చేసిన తిలక్.. ఆతర్వాత నవంబర్ 15న ఆదే సౌతాఫ్రికాపై మరో సెంచరీ (120 నాటౌట్ (47 బంతుల్లో)) బాదాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తిలక్ ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. నవంబర్ 23న మేఘాలయతో జరిగిన తొలి మ్యాచ్‌లో 67 బంతుల్లో శతక్కొట్టిన (151) తిలక్.. ఆతర్వాతి మ్యాచ్‌లో (నవంబర్ 25) బెంగాల్‌పై హాఫ్ సెంచరీ (57) చేశాడు. దీని తర్వాత ఒక్క మ్యాచ్‌లో విఫలమైన తిలక్, తిరిగి ఇవాళ (నవంబర్ 29) బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీతో (51 నాటౌట్) మెరిశాడు. మొత్తంగా నవంబర్ మాసం తిలక్‌కు అచొచ్చినట్లుంది. ఈ నెలలో తిలక్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా తిలక్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఫీట్‌ను కూడా తిలక్ నవంబర్లోనే సాధించాడు.ఇదిలా ఉంటే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ అజేయమైన సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో బీహార్‌పై హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తెలకపల్లి రవితేజ 4 వికెట్లు తీసి బీహార్‌ను దెబ్బకొట్టాడు. మిలింద్, అజయ్ దేవ్ గౌడ్ తలో 2, నితిన్ సాయి యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు. బీహార్ ఇన్నింగ్స్‌లో కుమార్ రజనీశ్ (22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ 12.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి విజయతీరాలకు చేరింది. తిలక్ వర్మ (31 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), రోహిత్ రాయుడు (33 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) హైదరాబాద్‌ను గెలిపించారు. -
తిలక్ వర్మ విఫలం.. హైదరాబాద్‌కు మరో ఓటమి
రాజ్‌కోట్: బ్యాటర్ల వైఫల్యంతో దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 24 పరుగుల తేడాతో రాజస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (27 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకోగా... దీపక్ హుడా (46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 97 పరుగుల జోడించడంతో రాజస్తాన్ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అనికేత్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో విజృంభించిన హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ (13) ఈసారి విఫలం కాగా... తన్మయ్ అగర్వాల్ (33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తనయ్ త్యాగరాజన్ (32 నాటౌట్; 3 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్తాన్ బౌలర్లలో మానవ్ సుతార్, అనికేత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తాజా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు పరాజయాలు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ జట్టు 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో రేపు బిహార్‌తో హైదరాబాద్ ఆడుతుంది. -
రికీ భుయ్, కేఎస్ భరత్ మెరుపులు.. గోవాపై ఆంధ్ర ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: కెప్టెన్ రికీ భుయ్ (38 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (38 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకాలతో మెరిశారు. ఫలితంగా సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో గోవాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గోవా నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ప్రభుదేశాయ్ (51 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా... అర్జున్ టెండూల్కర్ 9 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్, శ్రీకర్ భరత్ ధనాధన్ షాట్లతో కట్టిపడేశారు. అశ్విన్ హెబర్ (13), షేక్ రషీద్ (8) విఫలం కాగా... భరత్, భుయ్ మూడో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆంధ్ర జట్టు 8 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర ఆడుతుంది. -
రాణించిన రహానే.. దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. శ్రేయస్‌తో పాటు వెటరన్ ఆజింక్య రహానే (34 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో మహారాష్ట్రపై ముంబై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ నిఖిల్ నాయక్ (47), అజిమ్ ఖాజీ (32) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. అర్శిన్ కులకర్ణి (19), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (19), త్రిపాఠి (16), రామకృష్ణ ఘోష్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి తలో 2, రాయ్స్టన్ డయాస్, సూర్యాంశ్ షెడ్గే చెరో వికెట్ పడగొట్టారు.172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. శ్రేయస్, రహానే రాణించడంతో 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో అంగ్క్రిష్ రఘువంశీ 21, షమ్స్ ములానీ 14 (నాటౌట్), హార్దిక్ తామోర్ (9 నాటౌట్) పరుగులు చేయగా.. పృథ్వీ షా, సూర్యాంశ్ షెడ్గే డకౌట్ అయ్యారు. మహా బౌలర్లలో ముకేశ్ చౌదరీ 4 వికెట్లు పడగొట్టగా.. అర్శిన్ కులకర్ణి ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో కూడా శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, నవంబర్ 24న జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ రికార్డు స్థాయిలో 26.75 కోట్లకు అమ్ముడుపోయాడు. అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో భారీ ధర. ఇదే వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. గత 5 ఇన్నింగ్స్‌ల్లో ముంబై తరఫున శ్రేయస్ చేసిన స్కోర్లు..142- రంజీ ట్రోఫీ233- రంజీ ట్రోఫీ47- రంజీ ట్రోఫీ130 నాటౌట్ (57)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ71 (39)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో బరోడా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఇండోర్ వేదికగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి చేధించింది.ఈ భారీ లక్ష్య చేధనలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర ఫిప్టీతో చెలరేగాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ముఖ్యంగా తమిళనాడు పేసర్ గుర్జప్నీత్ సింగ్‌కు హార్దిక్ చుక్కలు చూపించాడు. బరోడా ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన గుర్జప్నీత్ బౌలింగ్‌లో పాండ్యా 4 సిక్స్‌లు, ఒక ఫోర్ బాది ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు.ఓవరాల్‌గా 30 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 69 పరుగులు చేసి రనౌటయ్యాడు. హార్దిక్‌తో పాటు భాను పానియా 42 పరుగులతో రాణించాడు. ఫలితంగా బరోడా 7 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. తమిళనాడు బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి మూడు, సాయికిషోర్ రెండు వికెట్లు సాధించారు.జగదీశన్ హాఫ్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. తమిళనాడు బ్యాటర్లలో ఓపెనర్ జగదీశన్(57) హాఫ్ సెంచరీతో మెరవగా.. విజయ్ శంకర్(42), షరూఖ్ ఖాన్(39) పరుగులతో రాణించాడు. బరోడా బౌలర్లలో మెరివాలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహేష్ పతియా, నినాంద్ రత్వా తలా వికెట్ సాధించారు.చదవండి: ఏమి తప్పుచేశానో ఆర్ధం కావడం లేదు.. చాలా బాధగా ఉంది: టీమిండియా ఓపెనర్ 6⃣,6⃣,6⃣,6⃣,4⃣One goes out of the park 💥Power & Panache: Hardik Pandya is setting the stage on fire in Indore 🔥🔥Can he win it for Baroda? Scorecard ▶️ https://t.co/DDt2Ar20h9#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/Bj6HCgJIHv— BCCI Domestic (@BCCIdomestic) November 27, 2024 -
SMT 2024: చెలరేగిన బౌలర్లు.. 32 పరుగులకే ఆలౌట్! టోర్నీ చరిత్రలోనే
సయ్యద్ ముస్తాల్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ కేవలం 32 పరుగులకే కుప్పకూలింది.జమ్మూ బౌలర్ల దాటికి అరుణాచల్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కనీసం ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం పట్టుమని పది నిమిషాలు క్రీజులో నిలవలేకపోయారు. జట్టు మొత్తంలో ఏ ఒక్క బ్యాటర్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌ను దాటలేకపోయారు.అరుణాచల్ సాధించిన 32 పరుగులలో 8 రన్స్ ఎక్స్‌ట్రాస్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. జమ్మూ బౌలర్లలో స్పిన్నర్ అబిడ్ ముస్తాక్ 4 వికెట్లతో అరుణాచల్ పతనాన్ని శాసించగా.. ఫాస్ట్ బౌలర్లు అకీబ్ నబీ మూడు, యుధ్వీర్ సింగ్ రెండు, రసిఖ్ దార్ సలీం ఒక్క వికెట్ పడగొట్టారు. కాగా ఇటీవలే జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో జమ్మూ ఫాస్ట్ బౌలర్లు రసిఖ్ దార్ సలీం,యుధ్వీర్లకు జాక్‌పాట్ తగిలింది. రసిఖ్ దార్‌ను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు (RCB) రూ. 6 కోట్లకు సొంతం చేసుకోగా.. యుధ్వీర్ను రూ.30 లక్షలకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.అరుణాచల్ చెత్త రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన అరుణాచల్ ప్రదేశ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. సయ్యద్ ముస్తాల్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన రెండో జట్టుగా ఏపీ నిలిచింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో త్రిపుర తొలి స్ధానంలో ఉంది. 2009లో జార్ఖండ్‌పై త్రిపుర కేవలం 30 పరుగులకే ఆలౌటైంది.చదవండి: ICC Rankings: వరల్డ్ నెం1 బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా.. -
టీ20ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. గేల్, పంత్ రికార్డులు బద్దలు
టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్.. 28 బంతుల్లోనే (త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో) శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో ఇది ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డైంది.గేల్, పంత్ రికార్డులు బద్దలుటీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్‌ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీటీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రిషబ్ పేరిట ఉండగా.. తాజాగా ఉర్విల్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్ 7 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ ఫాస్టెస్ట్ సెంచరీభారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రీదమ్ పాల్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో నగస్వల్లా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన గుజరాత్ 10.2 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఉర్విల్ సునామీ శతకంతో విరుచుకుపడగా.. ఆర్య దేశాయ్ (38) మరో ఎండ్ నుంచి ఉర్విల్‌కు సహకరించాడు.ఎవరీ ఉర్విల్ పటేల్..?26 ఏళ్ల ఉర్విల్ బరోడాలోని మెహసానాలో జన్మించాడు. 2018లో అతను బరోడా తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అతను లిస్ట్-ఏ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టాడు. అయితే ఆతర్వాత ఉర్విల్‌కు ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసేందుకు ఆరేళ్లు పట్టింది. ఉర్విల్ గతేడాదే రంజీల్లోకి అడుగుపెట్టాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్‌ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్‌ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. రెండు రోజుల కిందట జరిగిన మెగా వేలంలో ఉర్విల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఉర్విల్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మనసు మార్చుకుంటాయేమో వేచి చూడాలి. -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్ల వర్షం
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కేవలం 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్‌పై బరోడా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.🚨 HARDIK PANDYA SMASHED 74* (35) IN SMAT...!!! 🚨- The No.1 T20 All Rounder...!!! 🙇♂️pic.twitter.com/z1Wo4P1p0s— Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆర్య దేశాయ్ 52 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో హేమంగ్ పటేల్ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు), రిపల్ పటేల్ (7 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించారు. బరోడా బౌలర్లలో అతీత్ సేథ్ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, కృనాల్, మహేశ్ పితియా తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడాను హార్దిక్ పాండ్యా ఒంటిచేత్తో గెలిపించాడు. హార్దిక్‌కు జతగా శివాలిక్ శర్మ (43 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. హార్దిక్, శివాలిక్ చెలరేగడంతో బరోడా మరో మూడు బంతులు మిగిలుండగానే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. హార్దిక్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి బరోడాను విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు.. చింతన్ గజా, అర్జన్ నగస్వల్లా, తేజస్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. -
సన్‌రైజర్స్ వదిలేసింది. . కట్ చేస్తే! అక్కడ సిక్సర్ల వర్షం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో జమ్మూ కాశ్మీర్ శుభరంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో జమ్మూ కాశ్మీర్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ 9 వికెట్లు కోల్పోయి 199 పరుగుల మాత్రమే చేయగల్గింది.జమ్మూ బౌలర్లలో అబిడ్ ముస్తాక్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రషీక్ ధార్ సలీం, మురగన్ అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించారు. జార్ఖండ్ బ్యాటర్లలో ఉత్క్రాష్ సింగ్(54), పంకజ్ కిషోర్ కుమార్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అయితే మిగితా ఆటగాళ్లు రాణించకపోవడంతో జార్ఖండ్ ఓటమి చవిచూసింది.అబ్దుల్ సమద్ విధ్వంసం..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ కాశ్మీర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. జమ్మూ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్ విధ్వంసం సృష్టించాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమద్ అద్బుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సమద్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు కమ్రాన్ ఇక్బాల్(61) హాఫ్ సెంచరీతో రాణించాడు.సమద్‌ను వదిలేసిన సన్‌రైజర్స్..కాగా ఐపీఎల్లో అబ్దుల్ సమద్ గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలోకి వచ్చాడు. అయితే అతడికి అద్బుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉండడంతో వేలంలో భారీ ధర దక్కినా ఆశ్చర్యపోనక్కర్లలేదు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ.. టీ20 ఫార్మాట్లోనే తొలి బ్యాటర్‌గా.. వరల్డ్ రికార్డు!
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా మూడు శతకాలు బాదిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున వెలుగులోకి వచ్చిన ఈ హైదరాబాదీ.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.ముంబై తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన తిలక్ వర్మ.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే గతేడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 20 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్ వర్మ ఆయా ఫార్మాట్లలో 68, 616 పరుగులు చేశాడు.సౌతాఫ్రికా గడ్డపై వరుసగా రెండు శతకాలుఇక అంతర్జాతీయ టీ20లలో తిలక్ వర్మకు ఇటీవలే రెండు సెంచరీలు బాదడం విశేషం. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై ఈ ఘనత సాధించాడు. తాజాగా అతడు దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగాడు.ఫోర్లు, సిక్సర్ల వర్షం ఇక్కడా.. తిలక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 51 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మేఘాలయతో మ్యాచ్‌లో ఫోర్లు(14), సిక్సర్ల(10) వర్షం కురిపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 67 బంతుల్లోనే 151 పరుగులతో దుమ్ములేపి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి హైదరాబాద్‌కు 248 పరుగులు భారీ స్కోరు అందించాడు.సహచర బ్యాటర్ తన్మయ్ అగర్వాల్(55)తో కలిసి 122 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో పాటు.. రాహుల్ బుద్ధి(30)తో కలిపి 84 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మేఘాలయ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు అజేయంగాఓపెనర్ రాహుల్ సింగ్ డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ తన్మయ్ సహకారం అందించగా కెప్టెన్ తిలక్ వర్మ ఈ మేర సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 248 రన్స్ చేసింది.హైదరాబాద్ భారీ విజయంఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ హైదరాబాద్ బౌలర్ల ధాటికి 69 పరుగులకే కుప్పకూలింది. 15.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. దీంతో హైదరాబాద్ ఏకంగా 179 పరుగులతో భారీ విజయం సాధించింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి నాలుగు, తనయ్ త్యాగరాజన్ మూడు, మికిల్ జైస్వాల్, సరణు నిషాంత్, తెలకపల్లి రవితేజ ఒక్కో వికెట్ పడగొట్టారు.చదవండి: Ind vs Aus 1st Test: ఎవరు అవుట్?.. రాహుల్ ద్రవిడ్ మనసంతా ఇక్కడే..!Tilak Varma becomes the FIRST ever player to score 3 back-to-back T20 centuries.2 for India vs South AfricaToday in SMAT pic.twitter.com/ctVqGgm1wd— Kausthub Gudipati (@kaustats) November 23, 2024 -
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో పాల్గొననున్న టీమిండియా స్టార్లు వీరే..! (ఫొటోలు)
-
SMT 2024: ఒకే జట్టులో మహ్మద్ షమీ బ్రదర్స్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2024-25 కోసం బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సుదీప్ కుమార్ ఘరామి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దాదాపు ఏడాదిగా వైట్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇండియన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఈ జట్టులో చోటు దక్కింది.షమీ ఇటీవలే రంజీ ట్రోఫీ 2024-25లో తిరిగి మైదానంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే 6 వికెట్లతో ఈ సీనియర్ బౌలర్ సత్తచాటాడు. ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు ఈ బెంగాల్ స్టార్ సిద్దమయ్యాడు. కాగా ఈ జట్టులో మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్‌కు కూడా బెంగాల్ సెలక్టర్లు చోటిచ్చారు. నవంబర్ 23 నుంచి ఈ దేశవాళీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బెంగాల్ జట్టు హైదరాబాద్, మేఘాలయ, మధ్యప్రదేశ్, మిజోరాం, బీహార్, రాజస్థాన్, పంజాబ్‌లతో పాటు గ్రూప్-ఎలో ఉంది.బెంగాల్ జట్టు: సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, రిటిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, షకీర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), రంజోత్ సింగ్ ఖైరా, ప్రయాస్ రే బర్మన్ (వికెట్ కీపర్), అగ్నివ్ పాన్ (వికెట్ కీపర్), ప్రదీప్త ప్రమాణిక్, సాక్షం చౌదరి, మహ్మద్ షమీ, ఇషాన్ పోరెల్, మహ్మద్ కైఫ్, సూరజ్ సింధు జైస్వాల్, సయన్ ఘోష్, కనిష్క్ సేథ్ మరియు సౌమ్యదీప్ మండల్.చదవండి: IPL 2025 Mega Auction:'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే' -
కెప్టెన్‌గా అజింక్య రహానే.. మా స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఎడిషన్ నవంబరు 23న మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) తమ కెప్టెన్ పేరును వెల్లడించింది. టీ20 టోర్నమెంట్లోనూ టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానేనే తమ సారథిగా కొనసాగుతాడని స్పష్టం చేసింది.స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!అదే విధంగా.. తమ కీలక పేసర్ తుషార్ దేశ్‌పాండే ఫిట్నెస్ గురించి అప్డేట్ అందించింది. చీలమండ శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న అతడు.. కోలుకున్నాడని.. త్వరలోనే పునరాగమనం చేస్తాడని వెల్లడించింది. కాగా ముంబై జట్టు దేశీ క్రికెట్లో సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.గత రంజీ సీజన్లో చాంపియన్‌గా నిలవడంతో పాటు.. ఇరానీ కప్-2024లో రెస్టాఫ్ ఇండియాను ఓడించి ట్రోఫీ గెలిచింది. ఇక ఈ రెండు సందర్భాల్లోనూ అజింక్య రహానే ముంబై కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఇక తాజా రంజీ ట్రోఫీ ఎడిషన్‌లోనూ రహానేనే ముంబైని ముందుండి నడిపిస్తున్నాడు.అందుకే అతడే కెప్టెన్ఈ నేపథ్యంలో విజయవంతమైన సారథిగా పేరొందిన రహానేనే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా కొనసాగిస్తామని ఎంసీఏ చెప్పడం విశేషం. ‘‘ఇరానీ కప్‌తో పాటు తాజా రంజీ సీజన్లోనూ అతడి సారథ్యంలో మా జట్టు అద్బుతంగా రాణిస్తోంది. ఈసారి కూడా టీ20 టోర్నీలో అతడే మా కెప్టెన్. ఇక తుషార్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.రంజీ ట్రోఫీ సెకండ్ లెగ్ నుంచి అతడు అందుబాటులోకి వస్తాడు. అతడి సేవలు మా జట్టుకు ఎంతో కీలకం. శార్దూల్, జునేద్, మోహిత్‌తో పాటు తుషార్ కూడా ఉంటే మా పేస్ బౌలింగ్ లైనప్ మరింత పటిష్టంగా తయారవుతుంది’’ అని ఎంసీఏ అధికారులు వార్తా ఏజెన్సీ ఐఏఎన్ఎస్తో పేర్కొన్నారు.పృథ్వీ షా సైతంకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024తో టీమిండియా మాజీ ఓపెనర్ పృథ్వీ షా సైతం ముంబై జట్టులో తిరిగి చేరనున్నాడు. ఇటీవల.. అనుచిత ప్రవర్తన కారణంగా రంజీ జట్టు నుంచి ఎంసీఏ అతడిని తొలగించింది. అయితే, టీ20 టోర్నీలో మాత్రం పృథ్వీని ఆడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది సయ్యద్ ముస్తాన్ అలీ ట్రోఫీ నవంబరు 23- డిసెంబరు వరకు జరుగనుంది.ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25 తొలి మ్యాచ్‌లో ముంబై బరోడా చేతిలో ఓడింది. తర్వాత మహారాష్ట్రపై విజయం సాధించి.. త్రిపురతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తర్వాత ఒడిషాపై గెలుపొందింది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: బ్యాట్‌తోనూ సత్తా చాటిన షమీ -
స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్!
టీమిండియా ఓపెనర్, తమ స్టార్ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ శుభవార్త అందించింది. ఇటీవల రంజీ జట్టు నుంచి అతడిని తొలగించిన యాజమాన్యం.. దేశీ టీ20 టోర్నీ కోసం మళ్లీ పిలుపునిచ్చేందుకు సిద్ధమైంది. కాగా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో టీమిండియాలోకి దూసుకువచ్చిన పృథ్వీ షా.. తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయినిలకడలేని ఆటతీరుతో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పోటీలో వెనుకబడి టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయాడు. 2018లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పృథ్వీ.. 2021లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 5 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఈ ముంబై బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 339, 189 పరుగులు చేశాడు.ముంబై తరఫున ఆడుతూఅదే విధంగా.. టీమిండియా తరఫున ఒకే ఒక్క టీ20 ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మళ్లీ డొమెస్టిక్ క్రికెట్‌పై దృష్టిపెట్టిన పృథ్వీ షా.. ముంబై తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు.. విజయ్ హజారే ట్రోఫీ(వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20)లో ఆడుతూనే.. ఐపీఎల్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకంటున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై రాణిస్తూఅలాగే ఇంగ్లండ్ దేశీ టోర్నీల్లోనూ పాల్గొంటున్న పృథ్వీ షా.. అక్కడ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25లో తొలుత పృథ్వీ షాకు అవకాశం ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్.. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టింది. ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా పృథ్వీపై వేటు వేసింది.శ్రేయస్ అయ్యర్ కూడాఈ నేపథ్యంలో తాజాగా ముంబై ప్రాబబుల్స్ జట్టులో పృథ్వీ పేరు కనిపించడం విశేషం. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో పాల్గొనే అవకాశం ఉన్న ఆటగాళ్ల పేరును ముంబై క్రికెట్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో పృథ్వీ షాతో పాటు టీమిండియా స్టార్, ప్రస్తుతం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లతో పాటు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.అతడు మాత్రం మిస్‌అయితే, ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్ మాత్రం ఈ లిస్టులో మిస్సయ్యాడు. ఇటీవల భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కానీ.. అక్కడ ఆసీస్-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. కాగా నవంబరు 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానుంది. ఇందులో రంజీ సారథి రహానేనే ముంబైకి నాయక త్వం వహించే అవకాశం ఉంది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
రింకూ సింగ్ విధ్వంసం.. 33 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో..!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా యువ చిచ్చరపిడుగు రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్‌తో ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న క్వార్టర్‌ఫైనల్-1లో రింకూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు. రింకూ విధ్వంసం ధాటికి పంజాబ్ ఆఖరి రెండు ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుంది. ఆఖరి ఓవర్లో రింకూ టీమిండియా సహచరుడు అర్షదీప్ సింగ్‌ను టార్గెట్ చేశాడు. ఈ ఓవర్లో రింకూ 3 సిక్సర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు. రింకూ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర్‌ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రింకూతో పాటు సమీర్ రిజ్వి (29 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించాడు. యూపీ ఇన్నింగ్స్‌లో గోస్వామి (16), కరణ్ శర్మ (14), నితీశ్ రాణా (17) తక్కువ స్కోర్లకే ఔటైనా సమీర్ అండతో రింకూ చెలరేగిపోయాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో సిద్దార్థ్ కౌల్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టగా.. నితీశ్ రాణా రనౌటయ్యాడు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (42 నాటౌట్), నేహల్ వధేరా (21 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ (12), ప్రభసిమ్రన్ సింగ్ (0), మన్దీప్ సింగ్ (1) నిరాశపరచగా.. అన్మోల్ప్రీత్, నేహల్ జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ పొదుపుగా (2 ఓవర్లలో 3 పరుగులు) బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. మోహిసిన్ ఖాన్‌కు మరో వికెట్ దక్కింది. -
రాణించిన నితీశ్ రాణా.. చెలరేగిన భువనేశ్వర్ కుమార్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, నితీశ్ రాణా సత్తా చాటారు. నిన్న గుజరాత్‌తో జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్-1లో ఈ ఇద్దరు ఉత్తర్‌ప్రదేశ్ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో రాణించారు. తొలుత బౌలింగ్‌లో భువీ.. ఆతర్వాత బ్యాటింగ్‌లో రాణా చెలరేగారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ను భువనేశ్వర్ కుమార్ (4-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. భువీతో పాటు మోహిసిన్ ఖాన్ (4-0-13-2), నితీశ్ రాణా (1-0-9-1), ధన్కర్ (3-0-21-1), కార్తీక్ త్యాగి (4-0-27-1) రాణించడంతో గుజరాత్ 127 పరుగులకు (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సౌరవ్ చౌహాన్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ.. రాణా (49 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాణాతో పాటు సమీర్ రిజ్వి (30) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. చింతన్ గజా, హేమంగ్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరిగిన క్వార్టర్‌ఫైనల్-2లో బెంగాల్‌పై అస్సాం 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నవంబర్ 2న మరో రెండు ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
పొట్టి క్రికెట్లో కొనసాగుతున్న రియాన్ పరాగ్ విధ్వంసకాండ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ (ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్) డ్రీమ్ రన్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో అతను వరుసగా ఏడో హాఫ్ సెంచరీ బాదాడు. గత మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు (టీ20ల్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా వార్నర్, సెహ్వాగ్, బట్లర్‌ల పేరిట ఉన్న రికార్డు బద్దలు) నెలకొల్పిన రియాన్.. తాజాగా హాఫ్ సెంచరీతో తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. బెంగాల్‌తో నిన్న (అక్టోబర్ 31) జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-2లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన రియాన్.. తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో అస్సాం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో రియాన్ 2 వికెట్లు పడగొట్టడంతో పాటు 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 50 పరుగులు చేశాడు. Riyan Parag celebration myan 😭😭😭.He fucking just said, these guy's aren't on my level. I am fucking couple level ahead of them 😭😭😭Proper Chad pic.twitter.com/Gd8fbECfM7— HS27 (@Royal_HaRRa) October 31, 2023 టీమిండియాలో చోటు దక్కేనా..? ముస్తాక్ అలీ టోర్నీలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు బాది జోరుమీదున్న రియాన్.. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో భారత జట్టులో చోటుపై కన్నేశాడు. ముస్తాక్ అలీ ట్రోఫీకి ముందు నుంచే భీకరమైన ఫామ్‌లో ఉన్న రియాన్.. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణిస్తూ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అస్సాం బౌలర్లు ఆకాశ్ సేన్‌గుప్తా 3, రియాన్ పరాగ్ 2, మ్రిన్మోయ్ దత్తా, శివ్‌శంకర్ రాయ్, సౌరవ్ డే తలో వికెట్ పడగొట్టారు. బెంగాల్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ఆటగాడు కరణ్ లాల్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అస్సాం.. రిశవ్ దాస్ (31), బిషల్ రాయ్ (45 నాటౌట్), రియాన్ పరాగ్ (50 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నిన్ననే జరిగిన మరో ప్రీక్వార్టర్ ఫైనల్లో గుజరాత్‌పై ఉత్తర్‌ప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. నవంబర్ 2న మరో రెండు ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో రియాన్ పరాగ్ గణాంకాలు.. 45(19) & 0/53(4) 61(34) & 2/25(4) 76(37) & 3/6(4) 53(29) & 1/17(4) 76(39) & 1/37(4) 72(37) & 1/35(3) 57(33) & 1/17(4) 50(31) & 2/23(4) -
చరిత్ర సృష్టించిన రియాన్.. ఓవరాక్షన్ స్టార్ కాస్త సూపర్ స్టార్ అయ్యాడు..!
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతూ, ఆటకంటే ఓవరాక్షన్ ద్వారా ఎక్కువ పాపులర్ అయిన రియాన్ పరాగ్ ఇటీవలికాలంలో అతిని పక్కకు పెట్టి ఆటపై మాత్రమే దృష్టి సారిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు. వ్యక్తిగత ప్రవర్తనతో పాటు ఫామ్‌లేమి కారణంగా గత ఐపీఎల్లో సరైన అవకాశాలు రాని రియాన్.. ఆతర్వాత జరిగిన అన్ని దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీలో (సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ-2023) ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న రియాన్.. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణిస్తూ మ్యాచ్ విన్నర్‌గా మారాడు. ఈ టోర్నీలో అస్సాం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రియాన్.. వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో రియాన్‌కు ముందు ఏ ఇతర ఆటగాడు వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించలేదు. ఈ టోర్నీలో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొడుతున్న రియాన్.. ప్రతి మ్యాచ్‌లో వికెట్లు కూడా తీసి పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ ప్రదర్శనలతో ఓవరాక్షన్ స్టార్ కాస్త సూపర్ స్టార్‌గా మారిపోయాడు. ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా కేరళతో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసిన రియాన్.. తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా (17 పరుగులు) బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ తీసుకుని తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ ప్రదర్శనకు ముందు రియాన్ వరసగా 102 నాటౌట్, 95 (దియోదర్ ట్రోఫీ), 45, 61, 76 నాటౌట్, 53 నాటౌట్, 76, 72 పరుగులు స్కోర్ చేశాడు. ఈ ప్రదర్శనలతో రియాన్ త్వరలో జరుగనున్న ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంటుంది. ఒకవేళ రియాన్‌ను రాయల్స్ టీమ్ రిలీజ్ చేయకపోతే.. ఆ జట్టులోనే మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంటుంది. -
T20 Cricket: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 11 బంతుల్లోనే.. తొలి భారత బ్యాటర్‌గా!
SMAT 2023- Ashutosh Sharma breaks Yuvraj Singh's record: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)-2023 సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు బద్దలైంది. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఓవరాల్ భారత బ్యాటర్ల జాబితాలో యువీని వెనక్కి నెట్టి అశుతోశ్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అశుతోష్ సంచలన ఇన్నింగ్స్ దేశవాళీ టీ20 టోర్నీ SMAT సోమవారం(అక్టోబరు 16) ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు షెడ్యూల్లో భాగంగా రాంచి వేదికగా అరుణాచల్ ప్రదేశ్- రైల్వేస్ జట్లు మంగళవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రైల్వేస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ఉపేంద్ర యాదవ్(103) అజేయ సెంచరీతో మెరవగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అశుతోష్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే కేవలం 11 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా మధ్యప్రదేశ్ ఆటగాడు అశుతోష్ యువీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. 53 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన రైల్వేస్.. అరుణాచల్ ప్రదేశ్‌ను 119 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 127 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువీ నాటి టీ20 వరల్డ్‌కప్‌లో టీ20 వరల్డ్‌కప్-2007లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా యువరాజ్ సింగ్ సిక్సర్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. స్టువర్ట్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యువీ రికార్డు బ్రేక్ చేసిన నేపాల్ బ్యాటర్ అయితే, ఇటీవలే యువీ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలైన విషయం తెలిసిందే. చైనాలో ఆసియా క్రీడలు-2023 సందర్భంగా నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ మంగోలియాపై 9 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో యువీ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసి తన పేరు చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. చదవండి: మెకానికల్ ఇంజనీర్! పాక్‌ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి! ఒకే ఒక్కసారి కెప్టెన్‌గా.. -
కెప్టెన్లుగా టీమిండియా స్టార్లు తిలక్, సంజూ, భరత్.. పొట్టి క్రికెట్ టోర్నీ షురూ
Syed Mushtaq Ali Trophy 2023- జైపూర్: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నేడు మొదలవుతుంది. 22 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 38 జట్ల మధ్య 135 మ్యాచ్‌లు జరుగుతాయి. 38 జట్లను ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్, డిఫెండింగ్ చాంపియన్ ముంబై, బరోడా, హరియాణా, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కశ్మీర్, మిజోరం, మేఘాలయ ఉన్నాయి. ఇక గ్రూప్ ‘సి’లో ఆంధ్ర, రైల్వేస్, సౌరాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్ జట్లకు చోటు కల్పించారు. అక్టోబర్ 27 వరకు గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఐదు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 10 జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. కాగా సోమవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లలో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు మేఘాలయతో... కోన శ్రీకర్ భరత్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు గోవాతో తలపడతాయి. ఈ టోర్నీ మ్యాచ్‌లను జియో సినిమా యాప్, స్పోర్ట్స్ 18 ఖేల్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో కోన శ్రీకర్ భరత్(ఆంధ్ర), తిలక్ వర్మ(హైదరాబాద్)తో మరో టీమిండియా స్టార్ సంజూ శాంసన్(కేరళ) సైతం.. హిమాచల్ ప్రదేశ్ అక్టోబరు 16 నాటి మ్యాచ్‌తో కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. గ్రూప్ ఎ: హర్యానా, బరోడా, ఛత్తీస్ గఢ్, మేఘాలయ, హైదరాబాద్, మిజోరం, ముంబై, జమ్ముకశ్మీర్. గ్రూప్ బి: అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, బీహార్, చండీగఢ్, ఒడిశా, సిక్కిం, సర్వీసెస్. గ్రూప్ సి: ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్, రైల్వేస్, సౌరాష్ట్ర. గ్రూప్ డి: బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తరాఖండ్, విదర్భ. గ్రూప్ ఇ: ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, నాగాలాండ్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్. -
బీసీసీఐ నుంచి బిగ్‌న్యూస్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి ఇవాళ (ఏప్రిల్ 11) ఓ బిగ్‌న్యూస్ వెలువడింది. 2023-24 భారత దేశవాలీ సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జూన్ 2023-మార్చి 2024 మధ్యలో సాగే ఈ సీజన్లో మొత్తం 1846 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 2023 జూన్ 28న మొదలయ్యే దులీప్ ట్రోఫీతో ఈ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ జులై 16, 2023న ముగుస్తుంది. ఆ వెంటనే జులై 24-ఆగస్ట్ 3 మధ్యలో దియోధర్ ట్రోఫీ జరుగుతుంది. ఈ రెండు టోర్నీల్లో ఆరు జోన్ల జట్లు (సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్-ఈస్ట్) పాల్గొంటాయి. ఈ రెండు టోర్నీ తర్వాత అక్టోబర్ 1 నుంచి రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర-రెస్ట్ ఆఫ్ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ మొదలవుతుంది. ఈ మూడు మల్టీ డే ఫార్మాట్ (టెస్ట్ ఫార్మాట్) టోర్నీల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20 ఫార్మాట్), విజయ్ హజారే ట్రోఫీ (వన్డే ఫార్మాట్) లు మొదలవుతాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుండగా.. విజయ్ హజారే ట్రోఫీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగుతుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల టోర్నీల్లో మొత్తం 38 జట్లు పోటీపడతాయి. అనంతరం 2024 జనవరి 5 నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ మొదలుకానుంది. మార్చి 14 వరకు సాగే ఈ టోర్నీలోనూ మొత్తం 38 జట్లు పాల్గొంటాయి. ఇక మహిళల క్రికెట్ విషయానికొస్తే.. సీనియర్ వుమెన్స్ టీ20 ట్రోఫీతో మహిళల డొమెస్టిక్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు సాగుతుంది. ఆతర్వాత నవంబర్ 24-డిసెంబర్ 4 మధ్యలో సీనియర్ వుమెన్స్ ఇంటర్ జోనల్ ట్రోఫీ జరుగుతుంది. దీని తర్వాత జనవరి 4, 2024 నుంచి సీనియర్ వుమెన్స్ వన్డే ట్రోఫీ మొదలవుతుంది. ఈ టోర్నీ జనవరి 26 వరకు సాగుతుంది. -
కీలక ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత ముంబై
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 విజేతగా ముంబై జట్టు నిలిచింది. ఇవాళ (నవంబర్ 6) జరిగిన ఫైనల్లో ముంబై.. హిమాచల్‌ప్రదేశ్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (31 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడగా, తనుష్ కోటియన్ తొలుత బౌలింగ్‌లో (3/15, 5 బంతుల్లో 9 నాటౌట్; సిక్స్), ఆతర్వాత బ్యాటింగ్‌లో ఉత్కంఠ సమయంలో సిక్సర్ కొట్టి ముంబైని గెలిపించాడు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి (3/15), అమన్ హకీం ఖాన్ (1/24), శివమ్ దూబే (1/16) బంతితో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఏకాంత్ సేన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే తడబడినప్పటికీ.. యశస్వి జైస్వాల్ (27), శ్రేయస్ అయ్యర్ (34), సర్ఫరాజ్ ఖాన్ ఓ మోస్తరుగా రాణించి ముంబైని విజేతగా నిలిపారు. 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన సమయంలో సర్ఫరాజ్ ఖాన్ 2 ఫోర్లు, సిక్సర్ బాది జట్టును గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. ఆఖరి ఓవర్లో ముంబై గెలుపుకు 8 పరుగులు అవసరం కాగా.. తనుష్ కోటియన్.. రిషి ధవన్ వేసిన మూడో బంతికి సిక్పర్ బాది ముంబై చాన్నాళ్ల కలను సాకారం చేశాడు. -
శివాలెత్తిన శుభ్‌మన్ గిల్.. 11 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసకర శతకం
SMAT 2022 Quarter Final 1 PUN VS KAR: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022లో భాగంగా ఇవాళ (నవంబర్ 1) జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో పంజాబ్-కర్ణాటక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 9 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకుంది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 126) విధ్వంసకర శతకంతో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు భారీ స్కోర్ చేసింది. గిల్‌కు జతగా అన్మోల్ప్రీత్ సింగ్ (43 బంతుల్లో 59; 9 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. కేవలం 49 బంతుల్లోనే కెరీర్లో తొలి టీ20 శతకం బాదిన గిల్.. 11 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంసం సృష్టించాడు. కర్ణాటక బౌలర్లలో విధ్వత్ కావేరప్ప 3 వికెట్లు పడగొట్టగా.. కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 💯 for @ShubmanGill! 👏 👏 What a cracking knock this has been from the right-hander in the #QF1 of the #SyedMushtaqAliT20! 👌 👌 #KARvPUN | @mastercardindia Follow the match ▶️ https://t.co/be91GGi9k5 pic.twitter.com/OaECrucM6g — BCCI Domestic (@BCCIdomestic) November 1, 2022 అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆతర్వాత గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అభినవ్ మనోహర్ (29 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మనీశ్ పాండే (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మనోజ్ భాండగే (9 బంతుల్లో 25; ఫోర్, 3 సిక్సర్లు), కృష్ణప్ప గౌతమ్ (14 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), చేతన్ (25 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరి పోరాటంతో కర్ణాటక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో రమన్‌దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. సిద్ధార్ధ్ కౌల్, బల్తేజ్ సింగ్, అశ్వనీ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇవాళే జరిగిన మరో రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో ఢిల్లీపై విధర్భ.. బెంగాల్‌పై హిమాచల్ ప్రదేశ్ గెలుపొందాయి. హిమాచల్.. బెంగాల్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందగా.. ఢిల్లీపై విధర్భ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. సాయంత్రం 4:30 గంటలకు ముంబై-సౌరాష్ట్ర జట్ల మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. -
ఐదేసిన సిద్ధార్థ్ కౌల్.. పంజాబ్ ఘన విజయం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022 ఎలైట్ గ్రూప్-బిలో పంజాబ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. జైపూర్ వేదికగా పుదుచ్చేరితో ఇవాళ (అక్టోబర్ 20) జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన పంజాబ్.. 20 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్.. ప్రత్యర్ధిని కేవలం 86 పరుగులకే కట్టడి చేసింది. వెటరన్ పేసర్ సిద్ధార్థ్ కౌల్ (5/12) ఐదు వికెట్లతో చెలరేగడంతో పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. సిద్దార్థ్‌కు జతగా బల్తేజ్ సింగ్ (1/17), హర్‌ప్రీత్ బ్రార్ (1/16), మార్కండే (2/17) రాణించారు. పుదుచ్చేరి ఇన్నింగ్స్‌లో పరమేశ్వరన్ శివరామన్ (25), అంకిత్ శర్మ (23), అరుణ్ కార్తీక్ (15) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ శర్మ (29), శుభ్‌మన్ గిల్ (21), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (23 నాటౌట్), హర్‌ప్రీత్ బ్రార్ (13 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ ఉదేషికి ఓ వికెట్ దక్కింది. -
'ఎంపిక చేయలేదన్న కోపమా.. కసిని చూపించాడు'
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా టీమిండియా పేసర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన ఒక బంతి సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. 150 కిమీ స్పీడ్‌తో వచ్చిన బంతి మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టడమే కాదు.. వికెట్‌ను పిచ్ బయటకి పడేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఎస్ఆర్హెచ్ జట్టు తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదన్న కోపమో లేక బాధ తెలియదో కానీ ఉమ్రాన్‌లో కసి మాత్రం స్పష్టంగా కనిపించిందని అభిమానులు కామెంట్ చేశారు. జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇతని ఖాతాలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కూడా ఉంది. ఇక తొలుత నెట్ బౌలర్‌గా టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఉమ్రాన్ ఆస్ట్రేలియాకు కూడా వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో ఉమ్రాన్ మాలిక్‌ను పంపడం లేదని బీసీసీఐ తెలిపింది. దీంతో అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ పవరేంటో చూపిస్తున్నాడు. The #JammuExpress has hit max speed in #SMAT2022, shattering the wickets consistently 🔥#OrangeArmy #SunRisersHyderabad | @umran_malik_01 pic.twitter.com/aVlnNjlCcI — SunRisers Hyderabad (@SunRisers) October 18, 2022 చదవండి: 'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తాం' 40 పరుగులకే ఆలౌట్.. టోర్నీ చరిత్రలో చెత్త రికార్డు -
40 పరుగులకే ఆలౌట్.. టోర్నీ చరిత్రలో చెత్త రికార్డు
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ చరిత్రలో మణిపూర్ అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూఫ్-బిలో పంజాబ్‌తో మ్యాచ్‌లో 40 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బౌలర్ల దాటికి విలవిలలాడిని మణిపూర్ బ్యాటర్స్‌లో 10 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రెక్స్ సింగ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జట్టు స్కోరు 40 అంటే అందులో రెక్స్‌వి 25 పరుగులు.. మిగతా 10 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందునా ముగ్గురు బ్యాటర్స్ డకౌట్‌గా వెనుదిరిగారు. మార్కండే 4 వికెట్లతో చెలరేగగా.. రమణ్‌దీప్ సింగ్ రెండు వికెట్లు, అభిషేక్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బల్తేజ్ సింగ్, హర్‌ప్రీత్ బార్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 5.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అభిషేక్ శర్మ 28 నాటౌట్ జట్టును గెలిపించాడు. -
వరల్డ్‌కప్‌కు పక్కనబెట్టడంతో సయ్యద్ ముస్తాక్ టోర్నీకి..
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ బీసీసీఐ ప్రత్యేక అనుమతితో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొననున్నాడు. ఈ సీజన్లో ముంబై తరపున శ్రేయాస్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా జట్టులో 16వ అనధికారిక ఆటగాడిగా అయ్యర్ కొనసాగనున్నాడు. వాస్తవానికి జట్టుకు 15 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. అయితే బీసీసీఐ స్పెషల్ పర్మిషన్ ఇవ్వడంతో ముంబై జట్టు శ్రేయాస్‌ను 16వ ఆటగాడిగా తీసుకుంది. ఇక అంతకముందు శార్దూల్ ఠాకూర్ టి20 ప్రపంచకప్‌కు స్టాండ్ బైగా ఎంపికవడంతో అతని స్థానంలో సూర్యాన్ష్ హెగ్డేను జట్టులోకి తీసుకుంది. ఇక అక్టోబర్ 20 రాజ్‌కోట్ వేదికగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే తొలుత శ్రేయాస్ అయ్యర్‌ను టి20 ప్రపంచకప్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. జట్టులో అదనపు బ్యాటర్‌గా రాణించగల సత్తా ఉన్న అయ్యర్‌ను ఆస్ట్రేలియాకు పంపకపోవడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే జట్టులో అదనపు బ్యాటర్స్ అవసరం పెద్దగా లేదని గుర్తించినందునే అయ్యర్‌ను ఆసీస్‌కు పంపలేదని బీసీసీఐ వివరణ ఇచ్చింది. చదవండి: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్ .. టీమిండియా గెలిచేనా! -
తిలక్ వర్మ జోరు.. హైదరాబాద్‌కు హ్యాట్రిక్ విజయం
జైపూర్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ మూడో విజయం నమోదు చేసింది. త్రిపుర జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ నాలుగో లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. యువ బ్యాటర్ తిలక్ వర్మ తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీ సాధించాడు. త్రిపుర నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సరిగ్గా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తిలక్ వర్మ 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. మికిల్ జైస్వాల్ (21 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తనయ్ త్యాగరాజన్ (11 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడి హైదరాబాద్ విజయానికి బాటలు వేశారు. అంతకుముందు త్రిపుర 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. రవితేజ, తనయ్ త్యాగరాజన్ రెండేసి వికెట్లు తీశారు. -
అదరగొట్టిన తిలక్ వర్మ.. హైదరాబాద్‌కు మరో విజయం
జైపూర్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసింది. గోవా జట్టుతో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 37 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. తిలక్ వర్మ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు. గోవా తరఫున ఆడుతున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ 4 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. అనంతరం గోవా 18.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లు టి.రవితేజ 20 పరుగులిచ్చి 4 వికెట్లు.. అనికేత్ రెడ్డి 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి గోవా జట్టును దెబ్బ తీశారు. చదవండి: సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. ముంబై భారీస్కోరు -
సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. ముంబై భారీస్కోరు
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా ముంబై కెప్టెన్ పృథ్వీ షా సెంచరీతో చెలరేగాడు. శుక్రవారం ఎలైట్ గ్రూఫ్-ఏలో భాగంగా అస్సాంతో మ్యాచ్‌లో ఈ ముంబై ఓపెనర్ శతకం సాధించాడు. 61 బంతుల్లోనే 13 ఫోర్లు, 9 సిక్సర్లతో 134 పరుగులు బాదాడు. ఫలితంగా ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై చేసిన 230 పరుగుల్లో 134 పరుగులు పృథ్వీ షావే ఉన్నాయంటే అతని విధ్వంసం ఎంతలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. యశస్వి జైశ్వాల్ 42 పరుగులతో పృథ్వీకి సహకరించాడు. సర్ఫరాజ్ ఖాన్ 15, శివమ్ దూబే 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్, రోషన్ అస్లామ్, రాజ్కుద్దీన్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. ఇక మ్యాచ్‌లో 134 పరుగులు నాటౌట్‌గా నిలిచిన పృథ్వీ షా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ 147 పరుగులు, పునిత్ బిస్త్ 146 నాటౌట్, మహ్మద్ అజారుద్దీన్ 137 నాటౌట్ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. Maiden hundred for Captain Prithvi Shaw in T20 format, hundred from 46 balls including 10 fours and 6 sixes, A knock to remember, What a player. pic.twitter.com/bokhoHDAPQ — Johns. (@CricCrazyJohns) October 14, 2022 చదవండి: 'భయపడితే పనులు కావు.. పరుగులు చేయడమే' గంగూలీపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు -
అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్ వాగ్వాదం.. వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, యంగ్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్ మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే ఎలైట్ గ్రూఫ్ డిలో బుధవారం బరోడా, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న షెల్డన్ జాక్సన్‌తో అంబటి రాయుడు ఏదో విషయమై మాట్లాడుతున్నాడు. చూస్తుండగానే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి కొట్టుకునే దాకా వెళ్లిపోయారు. ఇంతలో అంపైర్లతో పాటు ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే వీరి గొడవకు గల కారణం మాత్రం ఏంటనేది తెలియరాలేదు. మాములుగానే అంబటి రాయుడు దూకుడు స్వభావం కలిగిన ఆటగాడు. ఇంతకముందు కూడా రాయుడు చాలా సందర్భాల్లో సహనం కోల్పోయి ఆటగాళ్లతో గొడవ పడిన దాఖలాలు ఉన్నాయి. టీమిండియాలో సరైన అవకాశాలు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన రాయుడు జూలై 2, 2019న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. టీమిండియా తరపున అంబటి రాయుడు 55 వన్డేలు ఆడి 1695 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో మూడు సెంచరీలతో పాటు 10 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. మితేష్ పటేల్ 60, విష్ణు సోలంకి 51 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సమరత్ వ్యాస్ 52 బంతుల్లో 97 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ మార్క్‌ను చేజార్చుకున్నాడు. pic.twitter.com/twhRAM0o2Y — cricket fan (@cricketfanvideo) October 12, 2022 చదవండి: ఏకకాలంలో నలుగురు పరిగెత్తుకొచ్చారు.. ఏం లాభం! తిలక్ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు -
తిలక్ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు
జైపూర్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా పాండిచ్చేరితో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. తిలక్‌వర్మ (41 బంతుల్లో 57; 1 ఫోర్, 4 సిక్స్‌లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ చేశాడు. మికిల్ జైస్వాల్ (25 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా రాణించాడు. కాగా తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం తన అర్థసెంచరీతో జట్టుకు విజయం అందించేదాకా వదల్లేదు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాండిచ్చేరి 20 ఓవర్లలో 4 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడిపోయింది. హైదరాబాద్ తరఫున భగత్ వర్మ, తిలక్ వర్మ, సీవీ మిలింద్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరోవైపు ఇండోర్‌లో ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చదవండి: భారత సంతతి క్రికెటర్‌పై 14 ఏళ్ల నిషేధం -
క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కొత్త నిబంధన అమల్లోకి
సాధారణంగా క్రికెట్లో సబ్‌స్టిట్యూట్ అంటే ఫీల్డర్ గాయపడితే అతని స్థానంలో మైదానంలోకి వస్తాడు. కానీ అతనికి ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండదు. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడికి బ్యాటింగ్, బౌలింగ్ చేసేలా బీసీసీఐ ''ఇంపాక్ట్ ప్లేయర్'' పేరిట కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన జట్టు కెప్టెన్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. బ్యాటింగ్‌లో చెలరేగిన ఒక ఆటగాడు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు అతని స్థానంలో ఒక బౌలర్‌ను తీసుకునే అవకాశం కెప్టెన్‌కు ఉంటుంది. తాజాగా బీసీసీఐ తెచ్చిన ''ఇంపాక్ట్ ప్లేయర్'' నిబంధనను సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో తొలిసారి ఉపయోగించారు. టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూఫ్-బిలో ఢిల్లీ, మణిపూర్ మధ్య మ్యాచ్‌లో హృతిక్ షోకీన్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. త్వరలోనే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఐపీఎల్లో కూడా అమలు చేయనున్నారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ హితెన్ దలాల్(27 బంతుల్లో 47 పరుగులు, 7 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. యష్ దుల్ 24, హిమ్మత్ సింగ్ 25 పరుగులు చేశారు. అయితే బ్యాట్‌తో రాణించిన హితెన్ దలాల్ బౌలింగ్ చేయలేడు కాబట్టి కెప్టెన్ నితీష్ రాణా అతని స్థానంలో బౌలర్ హృతిక్ షోకీన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చాడు. ఇది ఢిల్లీ జట్టుకు లాభం చేకూర్చింది. బౌలింగ్‌లో షోకీన్(3-0-13-2) చెలరేగడంతో ఢిల్లీ విజయాన్ని అందుకుంది. షోకీన్‌తో పాటు మయాంక్ యాదవ్ కూడా రెండు వికెట్లు తీయడం.. నితీష్ రాణా, లలిత్ యాదవ్‌లు చెరొక వికెట్ తీయడంతో మణిపూర్ 96 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత కాసేపటికే మణిపూర్ కెప్టెన్ లాంగ్లోన్యాంబ కీషాంగ్బామ్ కూడా బౌలర్ బిష్వోర్జిత్ స్థానంలో బ్యాటర్ అహ్మద్ షాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చాడు. చదవండి: 'ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా' గంగూలీ కథ ముగిసినట్లే..! -
కొత్త రూల్ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ.. ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చేయవచ్చు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెలలో (అక్టోబర్) ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నుంచి 'ఇంపాక్ట్ ప్లేయర్' అనే నయా రూల్‌ను అమల్లోకి తేనుంది. ఈ రూల్ అమల్లోకి వస్తే ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు లభిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం.. ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక 14 ఓవర్ల లోపు ఇరు జట్లు ఒక్కో ఆటగాడిని మార్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మ్యాచ్ మధ్యలో ఆటగాడికి గాయమైనా లేక ఆనారోగ్యం బారిన పడినా అతని స్థానంలో మరో ఆటగాడు (సబ్‌స్టిట్యూట్) బరిలోకి దిగుతాడు. ఇక్కడ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం అయితే బౌలింగ్ చేసే జట్టులో ఇన్నింగ్స్ 14 ఓవర్లలోపు ఆటగాడు గాయపడినా లేదా మ్యాచ్ అప్పటి స్థితిగతులను బట్టి ఓ ఆటగాడిని మార్చుకోవాలని భావించినా ఓవర్ ముగిశాక కెప్టెన్ లేదా హెడ్ కోచ్ లేదా మేనేజర్లలో ఎవరో ఒకరు ఫీల్డ్ అంపైర్ లేదా ఫోర్త్ అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్‌తో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. అదే బ్యాటింగ్ చేసే జట్టు వికెట్ పడ్డాక ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ గురించి అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు ఉంటుంది. ఇందుకోసం ఇరు జట్లు టాస్ సమయంలో ప్లేయింగ్ ఎలెవెన్‌తో పాటు నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. తప్పనిసరి కాని ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ప్రకారం ఒక్కసారి జట్టును వీడిన ఆటగాడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం (ఆ మ్యాచ్ వరకు) ఉండదు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో మాత్రమే అమల్లో ఉన్న ఈ రూల్ త్వరలో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ అమల్లోకి రానుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లో సైతం ప్రవేశ పెట్టాలని బీసీసీఐ యోచిస్తుంది. క్రికెట్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో కూడా అమల్లో ఉంది. ఈ రూల్ అమల్లోకి వస్తే క్రికెట్ మరింత రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
Ind Vs WI: ఆ ఇద్దరికి బంపరాఫర్.. ఒకరు వన్డే, మరొకరు టీ20 సిరీస్‌కు ఎంపిక!
India Vs West Indies Series 2022: దక్షిణాఫ్రికా పర్యటనతో పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానుండగా.. దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. సౌతాఫ్రికాతో టూర్లో తుది జట్టు కూర్పు.. తదనంతర ఫలితాలు దృష్టిలో పెట్టుకుని సమతౌల్యమైన జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఆల్‌రౌండర్ రిషి ధావన్, షారుఖ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 458 పరుగులు.. 17 వికెట్లు.. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ అద్భుత ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే. బ్యాటర్‌గా.. బౌలర్‌గా రిషి ధావన్ అత్యుత్తమంగా రాణించాడు.ఈ టోర్నీలో మొత్తంగా 458 పరుగులు చేయడంతో పాటుగా 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలతో పాటు ఒక 4 వికెట్ హాల్ కూడా ఉండటం విశేషం. ఇలా ఆటగాడిగా.. సారథిగా హిమాచల్ ప్రదేశ్ మొట్టమొదటి సారిగా ఈ మెగా ఈవెంట్లో విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రిషి సుదీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. విండీస్‌తో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #VijayHazareTrophy winners. 🏆 Congratulations and a round of applause for Himachal Pradesh on their triumph. 👏 👏#HPvTN #Final pic.twitter.com/bkixGf6CUc — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. మరోవైపు... తమిళనాడు ఆటగాడు షారుఖ్ ఖాన్ సైతం దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రాణించాడు. ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి తమిళనాడును విజేతగా నిలిపి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఈ ప్రదర్శన దృష్ట్యా విండీస్ టీ20 సిరీస్‌కు షారుఖ్‌ను సెలక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా... దక్షిణాఫ్రికా టూర్లో ఘోరంగా వైఫల్యం చెందిన వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ తదితరులపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గాయం కారణంగా టూర్‌కు దూరమైన అక్షర్ పటేల్, కరోనా కారణంగా వన్డే సిరీస్ మిస్సైన వాషింగ్టన్ సుందర్.. వీరితో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 చదవండి: రాహుల్, పంత్‌కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్! -
ఆఖరి ఓవర్లో అద్భుతం.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు
Darshan Nalkande Pics 4 Wkts In Four Consecutive Balls.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా శనివారం ఒక అద్భుత ఘటన జరిగింది. విదర్భ, కర్ణాటక మధ్య జరిగిన సెమీఫైనల్లో మ్యాచ్‌లో విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అందులోనూ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. చదవండి: Syed Mustaq Ali T20: ఓటమి నుంచి తృటిలో తప్పించుకొని ఫైనల్‌కు ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన దర్శన్ నల్కండే.. తొలి బంతికి అనిరుద్ద జోషిని వెనక్కిపంపాడు. తర్వాత వరుస బంతుల్లో శరత్ బీఆర్, జగదీష్ సుచిత్‌లు పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక చివరగా నాలుగో బంతికి ఇన్ఫాం బ్యాటర్ అభినవ్ మనోహర్‌ను ఔట్ చేసి నాలుగో వికెట్ సాధించాడు. ఈ నలుగురిలో అభివన్ మనోహర్ వికెట్ పెద్దది. దీంతో దర్శన నల్కండే అద్భుత ప్రదర్శనపై ట్విటర్లో ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక చేతిలో విదర్భ పరాజయం పాలైంది. ఇక ఫైనల్ చేరిన కర్ణాటక నవంబర్ 22న తమిళనాడుతో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి స్టీవ్ స్మిత్! pic.twitter.com/hAios7nHR0 — Simran (@CowCorner9) November 20, 2021 -
ఓటమి నుంచి తృటిలో తప్పించుకొని ఫైనల్‌కు
Karnataka Enters Final Beat Vidarbha By 4 Runs.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఓటమి నుంచి తృటిలో తప్పించుకున్న కర్ణాటక ఫైనల్లో ప్రవేశించింది. విదర్భతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 4 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన సెమీస్‌లో విదర్భ గెలుపు ముంగిట బోల్తా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కదమ్(56 బంతుల్లో 87 పరుగులు, 7 సిక్సర్లు, 4 ఫోర్లు) కదం తొక్కడం.. కెప్టెన్ మనీష్ పాండే 54 పరుగులతో సహకరించాడు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు రికార్డు స్థాయిలో 132 పరుగులు జోడించారు. ఆ తర్వాత అభినవ్ మనోహర్ 27 మినహా మిగతావరు పూర్తిగా విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే 4, లలిత్ యాదవ్ 2, యష్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు. చదవండి: Syed Mustaq Ali T20: హైదరాబాద్ ఘోర ఓటమి.. ఫైనల్లో తమిళనాడు అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ ఇన్నింగ్స్‌లో పెద్దగా స్కోర్లు నమోదు కానప్పటికి బ్యాట్స్‌మన్ తలో చెయ్యి వేశారు. అథర్వ తైడే 32, గణేష్ సతీష్ 31 పరుగులు చేశారు. కర్ణాటక బౌలింగ్‌లో కెసి కరియప్ప 2, విద్యాదర్ పాటిల్, దర్శన్ ఎంబి, జగదీష్ సుచిత్, కరుణ్ నాయర్ తలా ఒక వికెట్ తీశారు. ఫైనల్లో ప్రవేశించిన కర్ణాటక.. తమిళనాడుతో అమితుమీ తేల్చుకోనుంది. ఇక 2019 సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్ జరగింది. అప్పుడు తమిళనాడుపై గెలిచి కర్ణాటక ట్రోఫీని అందుకుంది. చదవండి: Shaheen Afridi: సిక్స్ కొట్టాడని కసితీరా కొట్టాడు.. క్షమాపణ ఎందుకు షాహిన్? -
Syed Mustaq Ali T20: హైదరాబాద్ ఘోర ఓటమి.. ఫైనల్లో తమిళనాడు
Tamil Nadu Enters Final Beat Hyderabad By 8 Wickets.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది.తనయ్ త్యాగరాజన్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా 10 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమ్యారు. తమిళనాడు బౌలర్ శరవణ కుమార్ 5 వికెట్లతో దుమ్మురేపగా.. ఎం అశ్విన్, మహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ విజయ్‌శంకర్ 43 పరుగులు నాటౌట్.. సాయి సుదర్శన్ 34 నాటౌట్ గెలిపించారు. ఈ విజయంతో తమిళనాడు ఫైనల్లో ప్రవేశించింది. ఇక విదర్భ, కర్ణాటక మధ్య జరగనున్న సెమీఫైనల్ విజేతతో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: chris gayle: క్రిస్ గేల్ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే.. -
తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్.. సెమీ ఫైనల్లో హైదరాబాద్
Syed Mushtaq Ali Trophy-Hyderabad Enter Into Semi-Finals: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో హైదరాబాద్ 30 పరుగుల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఠాకూర్ తిలక్ వర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా...కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (21 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ బుద్ధి (16 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. రిపాల్ పటేల్ (24 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టి. రవితేజ (3/27), సీవీ మిలింద్ (2/28) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. కర్నాటక సూపర్ ఓవర్‌తో... కర్నాటకతో క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ విజయలక్ష్యం 161 పరుగులు...చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, 2 సిక్స్‌లు, ఫోర్ సహా తొలి ఐదు బంతుల్లో బెంగాల్ 19 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించిన ఆకాశ్ దీప్‌ను మనీశ్ పాండే డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. దాంతో స్కోరు సమమైన మ్యాచ్ ‘సూపర్ ఓవర్’కు వెళ్లింది. బెంగాల్ 5 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోగా...కర్నాటక 2 బంతుల్లో ఆట ముగించింది. అంతకు ముందు కర్నాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (29 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం రితిక్ ఛటర్జీ (51) అర్ధసెంచరీ సహాయంతో బెంగాల్ కూడా 160 పరుగులు చేయగలిగింది. తమిళనాడు, విదర్భ కూడా... కేరళపై 5 వికెట్లతో గెలిచిన తమిళనాడు సెమీస్ చేరింది. ముందుగా కేరళ 4 వికెట్లకు 181 పరుగులు చేయగా, తమిళనాడు 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు సాధించింది. మరో క్వార్టర్స్‌లో విదర్భ 9 వికెట్లతో రాజస్తాన్‌ను చిత్తు చేసింది. రాజస్తాన్ 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితం కాగా...విదర్భ 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసి విజయాన్నందుకుంది. శనివారం జరిగే తొలి సెమీ ఫైనల్లో తమిళనాడుతో హైదరాబాద్...విదర్భతో కర్నాటక తలపడతాయి. -
ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్.. సూపర్ ఓవర్ ద్వారా సెమీస్‌కు
Karnataka Beats Bengal In Super Over Enter Semis.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా కర్ణాటక, బెంగాల్ మధ్య గురువారం క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆఖరి ఓవర్‌దాకా ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో అద్భుత విజయం సాధించిన కర్ణాటక సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరగులు చేసింది. కరుణ్ నాయర్ 55 పరుగులు నాటౌట్.. టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ రోహన్ కడమ్ 30, కెప్టెన్ మనీష్ పాండే 29 పరుగులు చేశారు. చదవండి: Ind Vs Nz 1st T20: సిరాజ్‌ను ‘కొట్టిన’ రోహిత్ శర్మ.. ‘ఏంటి భయ్యా ఇది’.. వీడియో వైరల్! అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగాల్ 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో బెంగాల్ విజయానికి 20 పరుగులు కావాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను విద్యాదర్ పాటిల్ వేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న రిత్విక్ చౌదరీ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో.. నాలుగు బంతుల్లో 8 పరుగులుగా సమీకరణాలు మారాయి. మూడో బంతికి ఒక పరుగు రాగా.. నాలుగో బంతికి ఆకాశ్ దీప్ బౌండరీ బాదడంతో రెండు బంతుల్లో మూడు పరుగులు కావాలి. ఐదో బంతికి ఆకాశ్ దీప్ రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే బెంగాల్ విజయం సాధిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. పాటిల్ వేసిన బంతిని ఆకాశ్ దీప్ డీప్‌మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న కెప్టెన్ మనీష్ పాండే డైరెక్ట్ హిట్ చేయడంతో ఆకాశ్ దీప్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నాలుగు బంతుల్లో 5 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.ఇక 6 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటకను మనీష్ పాండే రెండు బంతుల్లోనే 8 పరుగులు కొట్టి విజయం అందించి జట్టును సెమీఫైనల్ చేర్చాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో మిగిలిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌ల్లో కేరళపై తమిళనాడు, గుజరాత్‌పై హైదరాబాద్, రాజస్తాన్‌పై విదర్భలు విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక సెమీస్‌లో తమిళనాడుతో హైదరాబాద్.. కర్ణాటకతో విదర్భ అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: Ricky Ponting: హెడ్‌కోచ్‌గా ఆఫర్.. ద్రవిడ్‌ను ఎంపికచేయడం ఆశ్చర్యపరిచింది 🎯 #KARvBEN pic.twitter.com/pFdOtIkB5Y — Rohan (@itzz_Rohan) November 18, 2021 Manish pandey hits the winning six in the super over helped Karnataka to qualify for semis.#SyedMushtaqAliTrophy#SyedMushtaqAliT20pic.twitter.com/cjPAigDFLC — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) November 18, 2021 -
బ్యాటింగ్ వీడియో షేర్ చేశాడు.. 'నన్ను ఆల్‌రౌండర్‌గా పరిగణించండి'
Jayadev Unadkat Shares Batting Video Ask Selectors Indirectly Consider For All Rounder.. జైదేవ్ ఉనాద్కట్.. టీమిండియాకు 2010లోనే టెస్టు క్రికెట్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఒక టెస్టు, 7 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన ఉనాద్కట్ బౌలర్‌గానే ఎంపికయ్యాడు. ఆ తర్వాత క్రమంగా టీమిండియాకు దూరమయ్యాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఉనాద్కట్ సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఉనాద్కట్ తన బ్యాటింగ్ వీడియోనూ షేర్ చేస్తూ.. ''జాతీయ జట్టులో ఆల్‌రౌండర్‌గా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా.. నన్ను పరిగణలోకి తీసుకోండి.'' అంటూ కామెంట్ చేశాడు. చదవండి: Syed Musthaq Ali T20: సయ్యద్ ముస్తాక్ టి20లో దుమ్మురేపుతున్న దేశవాలీ ఆటగాళ్లు కాగా ప్రస్తుతం టీమిండియాలో పేస్ ఆల్‌రౌండర్ అవసరం చాలా ఉంది. హార్దిక్ పాండ్యా రూపంలో ఆ భర్తీ జరిగిందని భావించినప్పటికీ.. అతను ఫామ్ కోల్పోయి జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఇటీవలే టి20 ప్రపంచకప్ 2021లో హార్దిక్ టీమిండియాకు ఆల్‌రౌండర్‌గా ఏ మాత్రం ఉపయోగపడలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌కు సెలక్టర్లు హార్దిక్‌ను పక్కనబెట్టారు. ఇక అతని స్థానంలో వెంకటేశ్ అయ్యర్ పేస్ ఆల్‌రౌండర్‌గా చోటు కల్పించినప్పటికీ అతనికి ఇదే డెబ్యూ సిరీస్ కావడం విశేషం. ఇక టీమిండియా తరపున 2018లో చివరి వన్డే ఆడిన ఉనాద్కట్ అప్పటినుంచి దేశవాలీ లీగ్‌లతో పాటు ఐపీఎల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. 2018 ఐపీఎల్ సీజన్‌కు రాజస్తాన్ రాయల్స్‌కు ఉనాద్కట్ రూ. 11.5 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. చదవండి: IND vs NZ Test Series: కరుణ్ నాయర్ అయిపోయాడు.. ఇప్పుడు విహారి వంతు Just another pace bowler who can bat.. 😉 pic.twitter.com/FlIEns2JB6 — Jaydev Unadkat (@JUnadkat) November 12, 2021 -
సయ్యద్ ముస్తాక్ టి20లో దుమ్మురేపుతున్న దేశవాలీ ఆటగాళ్లు
Syed Mushtaq Ali Trophy 2021.. దేశవాలీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. వరుస సెంచరీలతో విజృంభిస్తూ ఐపీఎల్‌తో టీమిండియా తలుపు తట్టడానికి ఎదురుచూస్తున్నారు. తాజాగా మంగళవారం జరిగిన మ్యాచ్‌ల్లో టాప్-3 ప్రదర్శన ఒకసారి పరిశీలిద్దాం. యష్ నాయర్: ఈ మహారాష్ట్ర ఓపెనర్ గోవాతో మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో మెరిశాడు. (68 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు నాటౌట్) విజృంభించాడు. కాగా మ్యాచ్‌లో గోవాపై 73 పరుగులతో విజయం అందుకున్న మహారాష్ట్ర ఎలైట్ గ్రూఫ్ ఏ నుంచి నాకౌట్ దశకు క్వాలిఫై అయింది. నారాయణ్ జగదీష్: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు బ్యాటర్ నారాయణ్ జగదీష్ సూపర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు పవర్ ప్లే ముగిసేలోపే రెండు వికెట్లు కోల్పోయింది. 47 బంతుల్లో 67 పరుగులు చేసిన జగదీష్ నారాయణ్.. కెప్టెన్ విజయ్ శంకర్‌తో కలిసి మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. పారస్ డోగ్రా: పాండిచ్చేరి ఆటగాడు పరాస్ డోగ్రా ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో విన్నింగ్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలుత బౌలింగ్‌లో శుభోద్ భాతీ(/27)తో మెరవడంతో ఒడిశా 132 పరుగులకే పరిమితమైంది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాండిచ్చేరి 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ఓపెనర్ శుభోత్ బాతీ గోల్డెన్ డక్ కాగా.. ఆ తర్వాత కెప్టెన్ దామోదరన్ రోహిత్ 8 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఈ దశలో పారస్ డోగ్రా 44 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అతనికి రఘుపతి(39) సహకరించాడు. -
వారెవ్వా సూపర్ త్రో.. రుతురాజ్ గైక్వాడ్ రనౌట్
Ruturaj Gaikwad Run Out Syed Mustak Ali T20 Trophy.. ఐపీఎల్ 2021 హీరో రుతురాజ్ గైక్వాడ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూపర్ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఐపీఎల్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్న రుతురాజ్ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలోనూ రెచ్చిపోతున్నాడు. ఇక గోవాతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన రుతురాజ్.. గోవా ఆటగాడు దీప్రాజ్ గోవాంకర్ డైరెక్ట్ త్రోకు బలయ్యాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతిని రుతురాజ్ లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. తొలి పరుగు పూర్తి చేసి రెండో పరుగుకోసం వెళ్లగా.. అప్పటికే బంతిని అందుకున్న దీప్రాజ్ త్రో వేయగా.. బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో రుతురాజ్ క్లియర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: James Pattinson: బాగా ఆడుతున్నాడని మండినట్టుంది.. కోపంతో బంతిని లాగిపెట్టి ఇక మ్యాచ్‌లో మహారాష్ట్ర గోవాపై 73 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. యష్ నాయర్(68 బంతుల్లో 103, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన గోవా 18.1 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. https://www.bcci.tv/videos/155606/deepraj-gaonkar-s-brilliant-direct-hit-to-run-out-ruturaj-gaikwad?fbclid=IwAR1V4uPNxKpQMKRekqJzNUELZ20lOXj9BsU1Ak0AVaRlaPU0OZLX9qL_VlY -
శతక్కొట్టిన పంజాబ్ కింగ్స్ ఆటగాడు.. 61 బంతుల్లో 119 నాటౌట్
Prabhsimran smashes Cracking Century Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి 2021-22 సీజన్లో భాగంగా గోవాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్(61 బంతుల్లో 119; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా పంజాబ్ 81 పరుగుల తేడాతో గోవాపై భారీ విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రభ్‌సిమ్రన్ సహా శుభ్‌మన్ గిల్(36 బంతుల్లో 40; 2 ఫోర్లు), అభిషేక్ శర్మ(17 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం ఛేదనలో పంజాబ్ బౌలర్లు సిద్దార్ధ్ కౌల్(3/21), హర్‌ప్రీత్ బ్రార్(2/12), మయాంక్ మార్కండే(2/29) రాణించడంతో గోవా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 116 పరుగులకే పరిమితమైంది. గోవా ఇన్నింగ్స్‌లో సుయాశ్ ప్రభుదేశాయ్(30), శుభమ్ రాంజనే(19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్(ముస్తాక్ అలీ ట్రోఫి)లో ఐపీఎల్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్(చెన్నై), దీపక్ హుడా(పంజాబ్ కింగ్స్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(పంజాబ్ కింగ్స్) చెలరేగి ఆడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో రుతురాజ్ 70.67 సగటుతో 212 పరుగులు చేయగా.. దీపక్ హుడా 195 సగటుతో 195, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 71 సగటుతో 142 పరుగులు స్కోర్ చేశారు. చదవండి: T20 World Cup 2021: ఆసీస్ చేతిలో విండీస్ కచ్చితంగా గెలవాలి.. లేదంటే..! -
Ruturaj Gaikwad: బ్యాటింగ్ సంచలనం రుతురాజ్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా
Ruturaj Gaikwad: చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ ఓపెనర్, బ్యాటింగ్ యువ సంచలనం రుతురాజ్ గైక్వాడ్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఐపీఎల్-2021 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుని ఆరెంజ్ క్యాప్ అందుకున్న అతడికి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ నేపథ్యంలో 24 ఏళ్ల రుతురాజ్‌ను మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. కాగా ఈ దేశవాళీ టీ20 లీగ్ నవంబరు 4 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూపు-ఏలో ఉన్న మహారాష్ట్ర లీగ్ స్టేజ్‌లో లక్నోలో మ్యాచ్‌లు ఆడనుంది. తమిళనాడు జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో రుతురాజ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇక నౌషద్ షేక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాల గురించి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రియాజ్ బాగ్బన్ మాట్లాడుతూ... ‘‘రాహుల్ త్రిపాఠి, సిద్దేశ్ వీర్, రాజ్వర్ధన్ స్థానాలను స్వప్నిల్ గుగాలే, పవన్ షా, జగదీశ్ జోపేతో భర్తీ చేశాం. వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన త్రిపాఠి గాయం నుంచి కోలుకోకపోవడంతో నౌషద్ షేక్ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తాడు’’ అని పేర్కొన్నారు. ఇక రుతురాజ్ విషయానికొస్తే... చెన్నై సూపర్‌కింగ్స్ నాలుగో సారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంలో రుతురాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 సీజన్లో 16 మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్ ఆడిన ఈ ఓపెనర్.. మొత్తంగా 635 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 4 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు.. 101 నాటౌట్. ఇక అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర జట్టు: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), నౌషద్ షేక్(వైస్ కెప్టెన్), కేదార్ జాదవ్, యశ్ నహర్, అజీమ్ కాజీ, రంజీత్ నికామ్, సత్యజీత్ బచ్చవ్, తరంజిత్‌సింగ్ ధిల్లాన్, ముకేశ్ చౌదరి, ఆశయ్ పాల్కర్, మనోజ్ ఇంగ్లే, ప్రదీప్ దాఢే, షంషుజమా కాజీ, స్వప్నిల్ ఫల్పాగర్, దివ్యాంగ్, సునీల్ యాదవ్, ధనరాజ్సింగ్ పరదేశి, స్వప్నిల్ గుగాలే, పవన్ షా, జగదీష్ జోపే. చదవండి: T20 World Cup Pak Vs NZ: 24 టీ20లలో తలపడిన పాక్- కివీస్.. ఎవరిది పైచేయి అంటే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నిప్పులు చెరిగిన శాంత మూర్తి
ముంబై: ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఆదివారం సంచలన ఫలితం నమోదైంది. ఎలైట్ గ్రూప్ ‘ఇ’లో భాగంగా పుదుచ్చేరి ఆరు వికెట్ల తేడాతో పటిష్ట ముంబై జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. శుక్రవారం ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అబ్బురపరిచిన పుదుచ్చేరి... ఆదివారం ముంబై జట్టును 19 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌట్ చేసి ఆశ్చర్యపరిచింది. 41 ఏళ్ల 129 రోజుల వయస్సున్న పుదుచ్చేరి మీడియం పేస్ బౌలర్ శాంత మూర్తి నిప్పులు చెరిగే బంతులతో ముంబై బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. శాంత మూర్తి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దాంతో ముంబై 42 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్, ఆదిత్య తారే, సూర్యకుమార్ యాదవ్, సిద్ధేశ్ లాడ్, సుజీత్ నాయక్‌లను శాంత మూర్తి అవుట్ చేశాడు. శాంత మూర్తి స్పెల్ ముగిశాక ముంబై మరో 52 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. 95 పరుగుల లక్ష్యాన్ని పుదుచ్చేరి 19 ఓవర్లలో నాలుగు వికెట్లు చేజార్చుకొని అందుకుంది. ఈ టోర్నీలో ముంబైకిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. 19న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో ముంబై ఆడుతుంది. టి20 క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన పెద్ద వయస్కుడిగా శాంత మూర్తి ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు కెనూటి టులోచ్ (కేమన్ ఐలాండ్స్–41 ఏళ్ల 7 రోజులు) పేరిట ఉండేది. 2006 జూలైలో స్టాన్‌ఫర్డ్ టి20 టోర్నీలో భాగంగా సెయింట్ లూసియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టులోచ్ 21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. -
కేరళకు ఆంధ్ర షాక్
ముంబై: వరుసగా మూడు పరాజయాలు చవిచూశాక... నాకౌట్ అవకాశాలు గల్లంతయ్యాక... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తేరుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఇ’లో ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరుమీదున్న కేరళ జట్టును ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. టాస్ నెగ్గిన ఆంధ్ర ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ 20 ఓవర్లలో 4 వికెట్లకు 112 పరుగులే చేసింది. ఆంధ్ర స్పిన్నర్లు జి.మనీశ్ (2/19), లలిత్ మోహన్ (1/21), షోయబ్ మొహమ్మద్ ఖాన్ (1/12) కేరళ జట్టును కట్టడి చేశారు. రాబిన్ ఉతప్ప (8), మొహమ్మద్ అజహరుద్దీన్ (12), సంజూ సామ్సన్ (7), విష్ణు వినోద్ (4) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో కేరళ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సచిన్ బేబీ (34 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్స్‌లు), జలజ్ సక్సేనా (34 బంతుల్లో 27 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయంగా 74 పరుగులు జోడించడంతో కేరళ స్కోరు 100 పరుగులు దాటింది. 113 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీకర్ భరత్ (9), మనీశ్ (5), రికీ భుయ్ (1) వెంటవెంటనే అవుటవ్వడంతో ఆంధ్ర 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. అయితే ఓపెనర్ అశ్విన్ హెబర్ (46 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (27 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) నాలుగో వికెట్‌కు 48 పరుగులు జత చేసి ఆదుకున్నారు. శ్రీశాంత్ బౌలింగ్‌లో అశ్విన్ అవుటయ్యాక... ప్రశాంత్ కుమార్ (9 నాటౌట్)తో కలిసి రాయుడు ఆంధ్రను విజయతీరాలకు చేర్చాడు. -
ముంబై సీనియర్ జట్టులో అర్జున్ టెండూల్కర్
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారి ముంబై సీనియర్ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 10 నుంచి ఆరంభమయ్యే దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం 22 మంది సభ్యులతో ఎంపిక చేసిన జట్టులో అర్జున్‌కు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) చోటు కల్పించింది. దాంతో ముంబై తరఫున ఇప్పటి వరకు అండర్–14, 16, 19 టోర్నీల్లో పాల్గొన్న అర్జున్... తొలిసారి సీనియర్లతో కలిసి ఆడనుండటం విశేషం. ఈ టోర్నీలో 21 ఏళ్ల అర్జున్ రాణిస్తే అతడి ఐపీఎల్ ఎంట్రీ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఏడాదే ఉండే అవకాశం ఉంది. ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
దేశవాళీ సీజన్‌కు ముహూర్తం
న్యూఢిల్లీ : కరోనా కారణంగా చాలా ఆలస్యమైన దేశవాళీ క్రికెట్ టోర్నీల నిర్వహణపై కదలిక వచ్చింది. కొత్త సంవత్సరం ఆరంభంలో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీతో దేశవాళీ సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. బయో సెక్యూర్ హబ్‌లను ఏర్పాటు చేసి ఆరు రాష్ట్రాల్లో జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్ అలీ టోర్నీని నిర్వహించనున్నట్లు బీసీసీఐ అనుబంధ సంఘాలకు జై షా మెయిల్ ద్వారా తెలిపారు. ‘టోర్నీలో పాల్గొనాలనుకునే రాష్ట్ర జట్లు జనవరి 2వ తేదీన సంబంధిత వేదికల వద్దకు రావాల్సి ఉంటుంది. 10 నుంచి పోటీలు జరుగుతాయి. 31న ఫైనల్ నిర్వహిస్తాం. ఈ టోర్నీ గ్రూప్ దశ పోటీలు ముగిశాకే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలపై ఓ నిర్ణయం తీసుకుంటాం. ముస్తాక్ అలీతో పాటు మరో టోర్నీ నిర్వహణను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సంఘాలు ఏర్పాట్లు చేసుకోవాలి’ అని జై షా సూచనప్రాయంగా తెలిపారు. -
రంజీ, ముస్తాక్ అలీ టోర్నీలకే ఓటు
ముంబై: కరోనాతో పాటు ఐపీఎల్ నిర్వహణ కారణంగా పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉండటంతో బీసీసీఐ దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌ను కుదించింది. ఈ సీజన్లో రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలు మాత్రమే నిర్వహించేందుకే బీసీసీఐ సిద్ధమైంది. ఈ మేరకు బ్యాటింగ్ దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, ఐపీఎల్ తాత్కాలిక సీఈవో హేమంగ్ అమీన్లతో కూడిన బృందం షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 17 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, డిసెంబర్ 13 నుంచి మార్చి 10 మధ్య రంజీ ట్రోఫీలను బీసీసీఐ నిర్వహించనుంది. ఈసారి దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలపై వేటు వేసింది. అయితే జూనియర్, మహిళల క్రికెట్లో అన్ని టోర్నీల నిర్వహణకూ మొగ్గు చూపింది. సీకే నాయుడు అండర్–23 ట్రోఫీ (డిసెంబర్ 15– 9 మార్చి 2021), కూచ్ బెహర్ ట్రోఫీ (నవంబర్ 1– 22 జనవరి 2021), విజయ్ మర్చంట్ (నవంబర్ 1– 7 జనవరి 2021)లు, మహిళల క్రికెట్లో టి20 లీగ్ (నవంబర్ 1–20), అండర్–23 వన్డే లీగ్ (నవంబర్ 30–డిసెంబర్ 23), అండర్–23 టి20 లీగ్ (జనవరి 27–ఫిబ్రవరి 15), అండర్–19 వన్డే లీగ్ (డిసెంబర్ 29–జనవరి 21), అండర్–19 టి20 ట్రోఫీ (ఫిబ్రవరి 21–మార్చి 11), వన్డే లీగ్ (మార్చి 17–ఏప్రిల్ 12)లు నిర్వహించనుంది. -
హైదరాబాద్ మళ్లీ విఫలం
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ జాతీయ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో త్రిపుర జట్టుపై గెలుపొంది విజయాల బాట పట్టినట్లే కనిపించిన హైదరాబాద్... సర్వీసెస్ జట్టు చేతిలో విఫలమైంది. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో గురువారం జరిగిన గ్రూప్ ‘ఇ’ మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టు చేతిలో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌కిది ఐదో పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు చేసింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి (31 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్), టి. రవితేజ (19 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో మోహిత్ కుమార్, రజత్ చెరో 2 వికెట్లు దక్కించుకోగా... సచిదానంద్ పాండే, వికాస్ యాదవ్ చెరో వికెట్ తీశారు. అనంతరం సర్వీసెస్ జట్టు 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. వికాస్ హథ్వాలా (40 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో చెలరేగాడు. రజత్ (27; 2 ఫోర్లు) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. సీవీ మిలింద్, టి. రవితేజ చెరో వికెట్ తీశారు. శుభారంభం దక్కినా... త్రిపురపై గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగిన ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (17; 3 ఫోర్లు), కెప్టెన్ అక్షత్ రెడ్డి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించారు. తిలక్ వర్మ (10) ఎల్బీగా పెవిలియన్ చేరగా.. కొద్దిసేపటికే కె. రోహిత్ రాయుడు (1), అక్షత్‌రెడ్డి రనౌట్‌గా వెనుదిరిగారు. దీంతో 66 పరుగులకే జట్టు 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. బావనక సందీప్ (19; 1 సిక్స్) కాసేపు క్రీజులో నిలిచాడు. మరో ఎండ్‌లో సుమంత్ కొల్లా (8) విఫలమయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రవితేజ దూకుడు కనబరిచాడు. సందీప్ సహకారంతో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఈ జంట ఆరో వికెట్‌కు 20 పరుగులు జోడించాక సందీప్‌ను ఔట్ చేసి రజత్ ఈ జోడీని విడదీశాడు. తర్వాత సాకేత్ (5), సీవీ మిలింద్ (6), మెహదీహసన్ (2 నాటౌట్) కాసేపు సందీప్‌కు అండగా నిలిచారు. అనంతరం హైదరాబాద్ బౌలర్లపై వికాస్ విరుచుకుపడటంతో సర్వీసెస్ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) రాహుల్ సింగ్ (బి) మోహిత్ కుమార్ 17; అక్షత్ రెడ్డి రనౌట్ 34; తిలక్ వర్మ ఎల్బీడబ్ల్యూ (బి) వికాస్ యాదవ్ 10; రోహిత్ రాయుడు రనౌట్ 1; సందీప్ (స్టంప్డ్) వర్మ (బి) రజత్ 19; సుమంత్ (స్టంప్డ్) వర్మ (బి) రజత్ 8; రవితేజ నాటౌట్ 31; సాయిరామ్ (సి) శర్మ (బి) మోహిత్ కుమార్ 5; మిలింద్ (సి) వర్మ (బి) సచిదానంద పాండే 6; మెహదీహసన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–32, 2–50, 3–57, 4–66, 5–80, 6–100, 7–114, 8–125. బౌలింగ్: దివేశ్ పథానియా 4–0–22–0, సచిదానంద పాండే 3–0–20–1, మోహిత్ కుమార్ 4–0–31–2, అర్జున్ శర్మ 3–0–18–0, వికాస్ యాదవ్ 4–0–35–1, రజత్ 2–0–9–2. సర్వీసెస్ ఇన్నింగ్స్: నకుల్ వర్మ (సి) మెహదీహసన్ (బి) మిలింద్ 14; రవి చౌహాన్ (సి) సిరాజ్ 11; మోహిత్ అహ్లావత్ (బి) సిరాజ్ 0; రజత్ ఎల్బీడబ్ల్యూ (బి) రవితేజ 27; వికాస్ హాథ్వాల్ నాటౌట్ 61; జి. రాహుల్ సింగ్ (సి) సుమంత్ (బి) సిరాజ్ 19; అర్జున్ శర్మ (సి) తిలక్ వర్మ (బి) సిరాజ్ 0; దివేశ్ పథానియా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–26, 2–26, 3–32, 4–71, 5–120, 6–120. బౌలింగ్: మెహదీహసన్ 3.4–0–31–0, సిరాజ్ 4–0–20–4, మిలింద్ 4–0–28–1, రవితేజ 3–0–29–1, సాయిరామ్ 4–0–25–0, సందీప్ 1–0–7–0. -
హైదరాబాద్‌కు తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో ఎట్టకేలకు హైదరాబాద్ విజయాన్ని నమోదు చేసింది. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో త్రిపురపై 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. ఇప్పటివరకు టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన త్రిపురను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. సీవీ మిలింద్ (3/11), మెహదీహసన్ (2/11), టి.రవితేజ (2/11), సిరాజ్ (2/20)ల ధాటికి త్రిపుర 17 ఓవర్లలో 9 వికెట్లకు 79 పరుగులు చేసింది. నిరుపమ్‌సేన్ చౌధరి (16) టాప్‌స్కోరర్. హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో త్రిపుర బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవలేకపోయారు. రెండో వికెట్‌కు ఉదియన్ బోస్ (8), నిరుపమ్ నెలకొల్పిన 14 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. టోర్నీలో తొలి విజయం కోసం తపిస్తోన్న హైదరాబాద్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. 80 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 13.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (41 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సుమంత్ కొల్లా (20; 2 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ అక్షత్ రెడ్డి (7) జట్టు స్కోరు 20 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరగగా, 56 పరుగుల వద్ద సుమంత్ వికెట్‌ను హైదరాబాద్ కోల్పోయింది. అయితే బి. సందీప్ (12 నాటౌట్) సహాయంతో తన్మయ్ మిగతా పనిని పూర్తిచేశాడు. ప్రత్యర్థి బౌలర్లలో మణిశంకర్ మురా సింగ్, సంజయ్ మజుందార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నేడు జరిగే మ్యాచ్‌లో సర్వీసెస్‌తో హైదరాబాద్ ఆడుతుంది. -
హైదరాబాద్‌కు వరుసగా నాల్గో పరాజయం
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్లో హైదరాబాద్ రాత మారడం లేదు. పరాజయాల బాట వీడలేదు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో మహారాష్ట్ర చేతిలో ఓడింది. ఈ టోర్నీలో ఇప్పటికి ఇంకా బోణీ చేయని హైదరాబాద్ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ పరాజయాన్నే చవిచూసింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. మిడిలార్డర్లో రోహిత్ రాయుడు (34 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించగా, సందీప్ 25, తన్మయ్ అగర్వాల్ 21 పరుగులు చేశారు. ఎవరూ ధాటిగా ఆడలేకపోవడంతో వికెట్లున్నా జట్టు భారీస్కోరు చేయలేకపోయింది. మహారాష్ట్ర బౌలర్లలో విశాల్ గిటే 2, సమద్ ఫల్లా, సత్యజీత్, నౌషద్ షేక్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం సునాయాస లక్ష్యాన్ని మహారాష్ట్ర 18 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చగా... నౌషద్ షేక్ (29 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కెప్టెన్ త్రిపాఠి 16 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో సాయిరామ్‌కు 2 వికెట్లు దక్కగా... సిరాజ్ ఒక వికెట్ తీశాడు. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) షేక్ (బి) విశాల్ గిటే 21; అక్షత్ రెడ్డి (స్టంప్డ్) నిఖిల్ (బి) షేక్ 8; రాయుడు (సి) హింగానెకర్ (బి) అజిమ్ కజి 15; రోహిత్ రాయుడు (నాటౌట్) 47; సందీప్ (ఎల్బీడబ్ల్యూ బి) సత్యజీత్ 25; ఆశిష్ రెడ్డి (బి) విశాల్ గిటే 6; సుమంత్ (సి) త్రిపాఠి (బి) సమద్ ఫల్లా 0; మిలింద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–21, 2–44, 3–46, 4–93, 5–113, 6–116. బౌలింగ్: విశాల్ గిటే 4–0–30–2, సమద్ ఫల్లా 4–0–29–1, సత్యజీత్ 4–0–19–1, నౌషద్ షేక్ 4–0–20–1, అజిమ్ కజి 3–0–19–1, హింగానెకర్ 1–0–6–0. మహారాష్ట్ర ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) సందీప్ (బి) సాకేత్ సాయిరామ్ 54; విజయ్ జోల్ (సి) సుమంత్ (బి) సాయిరామ్ 8; త్రిపాఠి (బి) సిరాజ్ 16; నౌషద్ షేక్ (నాటౌట్) 42, అజిమ్ కాజీ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 3 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–18, 2–60, 3–103. బౌలింగ్: మెహదీ హసన్ 3–0–20–0, మిలింద్ 3–0–19–0, ఆశిష్ రెడ్డి 2–0–21–0, సాయిరామ్ 4–0–38–2, సందీప్ 2–0–8–0, సిరాజ్ 4–0–18–1. -
తొలి భారత క్రికెటర్‌గా రైనా..
ఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా అరుదైన ఘనతను సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ తరఫున ఆడుతున్న రైనా.. పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రైనా 12 పరుగులు సాధించాడు. ఫలితంగా టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని చేరాడు. ప్రస్తుతం రైనా 8001 పరుగులతో ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఎనిమిది వేల పరుగుల్ని సాధించిన ఆరో క్రికెటర్‌గా రైనా నిలిచాడు. మరొకవైపు రైనాకు ఇది 300 టీ20 మ్యాచ్. దాంతో మూడొందల టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో భారత క్రికెటర్‌గా రైనా గుర్తింపు సాధించాడు. ఇప్పటికే 300 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఘనతను ధోని సాధించగా, ఆ తర్వాత స్థానంలో రైనా ఉన్నాడు. ఇక టీ20 ఫార్మాట్లో పరుగుల విషయానికొస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే 168 పరుగులతో ముందంజలో ఉన్నాడు రైనా. ఇప్పటివరకూ 251 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 7,833 పరుగులు నమోదు చేశాడు. -
హైదరాబాద్ హ్యాట్రిక్ పరాజయం
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఒక్క విజయాన్నీ అందుకోలేకపోయింది. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో ఆదివారం బరోడాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (4) పెవిలియన్ చేరాడు. అనంతరం అక్షత్ రెడ్డి (44 బంతుల్లో 46; 5 ఫోర్లు)కి జతకూడిన హిమాలయ్ అగర్వాల్ (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. బి. సందీప్ (34 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) అండతో అక్షత్ రెడ్డి స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించాక అక్షత్‌ను ఔట్ చేసి సేథ్ ఈ జంటను విడదీశాడు. అంబటి రాయుడు (17; 2 ఫోర్లు) సహకారంతో సందీప్ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. వీరిద్దరూ కుదురుకుంటోన్న సమయంలో అరోథె ఒక పరుగు తేడాలో సందీప్, సుమంత్ కొల్లా (0)లను పెవిలియన్ చేర్చాడు. మరుసటి బంతికే రాయుడు కూడా ఔటవడంతో జట్టు సాధారణ స్కోరు చేయగలిగింది. ఆకాశ్ భండారి (2) ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. ప్రత్యర్థి బౌలర్లలో రిషి తుషార్ (ఆర్టీ) అరోథె 4 వికెట్లతో చెలరేగగా, అతీత్ సేథ్ 2 వికెట్లు దక్కించు కున్నాడు. అనంతరం బరోడా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసి గెలుపొందింది. మ్యాచ్ ఆరంభంలోనే మెహదీహసన్ ఓపెనర్లు కేదార్ దేవ్‌ధర్ (9), మోహిత్ మోంగియా (7)లను ఔట్ చేసి బరోడాపై ఒత్తిడి పెంచాడు. అయితే విష్ణు సోలంకీ (38 బంతుల్లో 40; 4 ఫోర్లు), దీపక్ జగ్బీర్ హుడా (30 బంతుల్లో 35; 5 ఫోర్లు) పట్టుదలగా ఆడి మూడో వికెట్‌కు 52 పరుగుల్ని జోడించి జట్టును ఆదుకున్నారు. తర్వాత దీపక్, యూసుఫ్ పఠాన్ (0) వెంటవెంటనే ఔటైనా.... మిగతా బ్యాట్స్‌మెన్ సహకారంతో స్వప్నిల్ కె సింగ్ (36 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్‌ను ముగించాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్, సీవీ మిలింద్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఆకాశ్ భండారి ఒక వికెట్ పడగొట్టాడు. నేడు జరిగే మ్యాచ్‌లో మహారాష్ట్రతో హైదరాబాద్ తలపడుతుంది. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బి) ఆర్టీ అరోథె 4; అక్షత్ రెడ్డి (సి) యూసుఫ్ పఠాన్ (బి) సేథ్ 46; హిమాలయ్ అగర్వాల్ (సి) కేదార్ దేవ్‌ధర్ (బి) ఆర్టీ అరోథె 8; బి. సందీప్ (సి) మేరీవాలా (బి) ఆర్టీ అరోథె 39; రాయుడు (సి) కుమార్ (బి) సేథ్ 17; సుమంత్ (బి) ఆర్టీ అరోథె 0; ఆకాశ్ భండారి (సి) కుమార్ (బి) మేరీవాలా 2; సాకేత్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–13, 2–32, 3–80, 4–119, 5–120, 6–120, 7–131. బౌలింగ్: అతీత్ సేథ్ 4–0–37–2, ఆర్టీ అరోథె 4–0–18–4, భార్గవ్ భట్ 4–0–23–0, స్వప్నిల్ 4–0–24–0, లుక్మాన్ ఇక్బాల్ మేరీవాలా 4–0–22–1. బరోడా ఇన్నింగ్స్: కేదార్ దేవ్‌ధర్ (సి) రోహిత్ రాయుడు (బి) మెహదీ హసన్ 9; మోహిత్ మోంగియా (బి) మెహదీ హసన్ 7; విష్ణు సోలంకీ (సి) సుమంత్ (బి) మిలింద్ 40; దీపక్ (రనౌట్) 35; యూసుఫ్ పఠాన్ (సి) అక్షత్ రెడ్డి (బి) ఆకాశ్ భండారి 0; స్వప్నిల్ సింగ్ (నాటౌట్) 36; మితేశ్ పటేల్ (సి) ఆకాశ్ (బి) మిలింద్ 2; సేథ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1–16, 2–17, 3–69, 4–72, 5–119, 6–121. బౌలింగ్: సిరాజ్ 2–0–34–0, మెహదీ హసన్ 4–0–28–2, సందీప్ 4–0–17–0, మిలింద్ 3.4–0–18–2, ఆకాశ్ భండారి 4–0–25–1, సాకేత్ 2–0–12–0. -
ఆంధ్ర అదరహో
సాక్షి, విజయవాడ: ముందు బ్యాట్స్‌మెన్ వీరవిహారం... ఆ తర్వాత బౌలర్ల విజృంభణ... వెరసి టి20 చరిత్రలోనే ఆంధ్ర క్రికెట్ జట్టు అతి పెద్ద విజయం నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించింది. దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం స్థానిక మూలపాడు మైదానంలో నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 179 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. పరుగుల పరంగా టి20 చరిత్రలో ఇది పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక జట్టు పేరిట ఉండేది. 2007లో తొలి టి20 ప్రపంచకప్‌లో భాగంగా కెన్యాతో జొహన్నెస్‌బర్గ్‌లో సెప్టెంబరు 14న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 172 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఆ రికార్డును ఆంధ్ర జట్టు శుక్రవారం బద్దలు కొట్టింది. 38 బంతుల్లోనే రికీ సెంచరీ... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 108 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 38 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టి20ల్లో భారత్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో), రిషభ్ పంత్ (32 బంతుల్లో), రోహిత్ శర్మ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) ముందున్నారు. రికీ భుయ్తోపాటు గిరినాథ్ రెడ్డి (31 బంతుల్లో 62; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా హడలెత్తించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 10 ఓవర్లలో 150 పరుగులు జోడించడం విశేషం. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ హనుమ విహారి (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడాడు. నాగాలాండ్ జట్టు కెప్టెన్ రంగ్సెన్ జొనాథన్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను బరిలోకి దించినా ఆంధ్ర జోరును నిలువరించలేకపోయాడు. సూపర్ శశికాంత్... 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నాగాలాండ్ 13.1 ఓవర్లలో 65 పరుగులకు కుప్పకూలి ఓడిపోయింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్ (3/8), షేక్ ఇస్మాయిల్ (3/25), కరణ్ శర్మ (3/14) మూడేసి వికెట్లు తీశారు. ముఖ్యంగా పేస్ బౌలర్ శశికాంత్ హడలెత్తించాడు. తాను వేసిన రెండో ఓవర్లో శశికాంత్ ఐదు బంతుల తేడాలో మూడు వికెట్లు తీయడం విశేషం. నాగాలాండ్ జట్టులో జొనాథన్ (25 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్), పారస్ షెరావత్ (11 బంతుల్లో 13; 3 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు దాటలేకపోయారు. -
టీ20లో రెచ్చిపోయిన పుజారా
ఇండోర్: తాను పొట్టి ఫార్మాట్‌కు సరిపోననే వాళ్లకు దీటైన సమాధానం చెప్పాడు చతేశ్వర్ పుజారా. టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిన పుజారా టీ20 మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. తన సహజసిద్ధమైన బ్యాటింగ్‌ను పక్కను పెట్టి బౌండరీలతో చెలరేగిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కేవలం 61 బంతుల్లో అజేయ శతకం బాదేశాడు. ఇందులో 14 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. తొలి దశలో గ్రూప్-సిలో భాగంగా గురువారం రైల్వేస్, సౌరాష్ట్ర తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (34)తో కలిసి పుజారా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప (46; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి రెచ్చిపోయాడు. ఫలితంగా సౌరాష్ట్ర తరఫున టీ20 శతకం బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరొకవైపు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ, లిస్-ఎ క్రికెట్లో 150కు పైగా స్కోరు, టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా చేరిపోయాడు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ మొదట ఈ రికార్డు అందుకున్నారు. ఇప్పుడు పుజారా వీరి సరసన చేరాడు. కాగా ప్రస్తుత మ్యాచ్‌లో పుజారా ప్రాతినిథ్యం వహిస్తున్న సౌరాష్ట్ర ఓటమి పాలవ్వడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా, రైల్వేస్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. -
పంత్ ఒడిసిపట్టుకున్నాడు: సాహా
న్యూఢిల్లీ: మోచేతి గాయం కారణంగా దాదాపు పది నెలలుగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్ సాహా.. మళ్లీ తన పునరాగమనంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం తిరిగి కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన సాహా, తనకు రిషభ్ పంత్‌తో ఎటువంటి పోటీ లేదని అంటున్నాడు. ‘గాయం తర్వాత ఆటగాళ్లతో కలవడం గొప్పగా అనిపిస్తోంది. ఒక ఆటగాడిగా తిరిగి జట్టులోకి అడుగుపెట్టడం కన్నా ఆనందం ఏముంటుంది. చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్నట్టు నేను భావించలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌కు సాయం చేయడంపైనే దృష్టి పెడుతున్నా. నేను జట్టుకు దూరమైనప్పుడు రిషబ్ పంత్ అవకాశం అందుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని ఎవరైనా అందిపుచ్చుకోవాలనే ప్రయత్నిస్తారు. రిషబ్ పంత్ కూడా అలాగే చేశాడు. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు. అతడిని నాకు పోటీదారుగా భావించను. నిజానికి పంత్ ఎన్సీఏకు వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి చాలా సమయం గడిపాం’ అని సాహా తెలిపాడు. గతేడాది ఐపీఎల్లో గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్ సాహా .. ఇంగ్లండ్‌లో మోచేతికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా బెంగాల్ జట్టు తరుపున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. -
రోడ్స్‌ను మరిపించిన వినయ్