అశుతోష్ శర్మ- యువరాజ్ సింగ్ (ఫైల్ ఫొటోలు- PC- BCCI)
SMAT 2023- Ashutosh Sharma breaks Yuvraj Singh's record: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)-2023 సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు బద్దలైంది. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఓవరాల్ భారత బ్యాటర్ల జాబితాలో యువీని వెనక్కి నెట్టి అశుతోశ్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
అశుతోష్ సంచలన ఇన్నింగ్స్
దేశవాళీ టీ20 టోర్నీ SMAT సోమవారం(అక్టోబరు 16) ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు షెడ్యూల్‌లో భాగంగా రాంచి వేదికగా అరుణాచల్ ప్రదేశ్- రైల్వేస్ జట్లు మంగళవారం తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రైల్వేస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ఉపేంద్ర యాదవ్(103) అజేయ సెంచరీతో మెరవగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అశుతోష్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 11 బంతుల్లోనే
కేవలం 11 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా మధ్యప్రదేశ్ ఆటగాడు అశుతోష్ యువీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. 53 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్, 8 సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన రైల్వేస్.. అరుణాచల్ ప్రదేశ్‌ను 119 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 127 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
యువీ నాటి టీ20 వరల్డ్‌కప్‌లో
టీ20 వరల్డ్‌కప్-2007లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా యువరాజ్ సింగ్ సిక్సర్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. స్టువర్ట్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
యువీ రికార్డు బ్రేక్ చేసిన నేపాల్ బ్యాటర్
అయితే, ఇటీవలే యువీ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలైన విషయం తెలిసిందే. చైనాలో ఆసియా క్రీడలు-2023 సందర్భంగా నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ మంగోలియాపై 9 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో యువీ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసి తన పేరు చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు.
చదవండి: మెకానికల్ ఇంజనీర్! పాక్‌ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి! ఒకే ఒక్కసారి కెప్టెన్‌గా..
Comments
Please login to add a commentAdd a comment