Ashutosh Sharma
-
టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్.. సిక్సర్ల కింగ్‌లు ఎంట్రీ!?
ఈ ఏడాది జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024 అనంతరం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ జూలై 6న ప్రారంభమై అదే నెల 14న ముగియనుంది. ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. అయితే ఈ జింబాబ్వే పర్యటనకు భారత తృతీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఒకరిద్దరూ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికి ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీలో అదరగొడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు ఈ సిరీస్‌లో భారత జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట. కాగా పంత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పునరాగమనంలో కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా సత్తాచాటుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పంత్ 210 పరుగులు చేశాడు. మరోవైపు ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, సాయిసుదర్శన్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లను సైతం జింబాబ్వే టూర్‌కు పంపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అశుతోష్.. యువరాజ్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృస్టించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అశుతోష్ సుడిగాలి ఇన్నింగ్స్ విరుచుకుపడినప్పటికీ పంజాబ్‌కు పరాభవం తప్పలేదు. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యానికి పంజాబ్ 10 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. కాగా, అశుతోష్ పేరిట టీ20ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఉన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. సరిగ్గా ఆరు నెలల కిందట సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో అశుతోష్ 11 బంతుల్లో ఫిఫ్టి కొట్టాడు. ఆ టోర్నీలో రైల్వేస్‌కు ఆడిన అశుతోష్.. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో 11 బంతుల్లో బౌండరీ, ఎనిమిది సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత అశుతోష్.. యువరాజ్ సింగ్ పేరిట ఉండిన సెకెండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో యువరాజ్ ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దాదాపు 16 ఏళ్ల పాటు టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా కొనసాగింది. అయితే అశుతోష్ 11 బంతులు హాఫ్ సెంచరీ చేయడానికి నెల ముందు ఈ రికార్డుకు బీటలు పడ్డాయి. 2023 ఏషియన్ గేమ్స్‌లో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్.. మంగోలియాపై కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇదిలా ఉంటే, 25 ఏళ్ల అశుతోష్ తన తొలి ఐపీఎల్ సీజన్లో (2024) చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో అశుతోష్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 205.3 స్ట్రయిక్‌రేట్‌తో 52 సగటున 156 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అశుతోష్ ఇప్పటివరకు 13 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. ఐపీఎల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అశుతోష్ స్కోర్లు ఇలా ఉన్నాయి. - 31(17). - 33*(15). - 31(26). - 61(28). -
IPL 2024: బుమ్రాను భయపెట్టిన అశుతోష్.. ఊహలకందని సిక్సర్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి ముచ్చెమటలు పట్టించారు. 184 పరుగుల లక్ష్య ఛేదనలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని పంజాబ్‌ను అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో తిరిగి మ్యాచ్‌లో నిలబెట్టారు. అయితే ఆఖర్లో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. - He is 25-Year old. - He's playing debut IPL. - He scored 61(28) in today's match. - 156 runs, 52 ave, 205.3 SR in this IPL. - He hits 13 Sixes & 9 Fours. ASHUTOSH SHARMA - THE FUTURE OF INDIAN CRICKET. ⭐ pic.twitter.com/JgVu4UsDab — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా ఆశుతోష్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆశుతోష్ ఆడిన కొన్ని షాట్లు క్రికెట్ పండితులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించాయి. బుమ్రా బౌలింగ్‌లో ఆడిన ఓ షాట్ అయితే న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంది. ప్రపంచ బ్యాటర్లనంతా గడగడలాడించే బుమ్రా బౌలింగ్‌లో అశుతోష్ ఊహలకందని స్వీప్ షాట్ సిక్సర్ కొట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇలాంటి షాట్ ఆడటం దాదాపుగా అసాధ్యం. ASHUTOSH SHARMA PLAYED ONE OF THE BEST SHOT IN IPL 2024. 🥶 pic.twitter.com/WhO7RgfNEF — Johns. (@CricCrazyJohns) April 18, 2024 అయితే అశుతోష్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ఈ షాట్‌ను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. అశుతోష్ ఈ షాట్ ఆడిన విధానం చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నోరెళ్లబెట్టాడు. మ్యాచ్ అనంతరం ఈ సిక్సర్ గురించి మాట్లాడుతూ నమ్మశక్యంగా లేదని అన్నాడు. ఈ షాట్ చూసిన క్రికెట్ అభిమానులైతే బుమ్రా బౌలింగ్ ఇలా కూడా సిక్సర్ కొట్టొచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అశుతోష్ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్‌లో దాదాపు ప్రతి షాట్ అణిముత్యమే అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. టీమిండియా నయా 360 ప్లేయర్లంటున్నారు. అశుతోష్ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. From sweeping Bumrah for six, to soaking pressure and consistantly delivering when team needs, taking Punjab almost par yesterday. The new 360 player in town, Ashutosh Sharma pic.twitter.com/SsniN2ad13 — Jahazi (@Oye_Jahazi) April 19, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (25 బంతుల్లో 36;2 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో పంజాబ్.. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగినప్పటికీ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా (4-0-21-3), గెరాల్డ్ కొయెట్జీ (4-0-32-3), అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ ఓటమిని అడ్డుకున్నారు. Hardik Pandya said - "The way Ashutosh Sharma middle every ball and played unbelievable knock. I'm happy for him for future". pic.twitter.com/gOTmHmphiQ — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 -
IPL 2024: ఆ ఇద్దరు ముంబైని వణికించారు.. ఇలా మూడోసారి..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించారు. 184 పరుగుల లక్ష్య ఛేదనలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని పంజాబ్‌ను అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో తిరిగి లైన్లో నిలబెట్టారు. అయితే ఆఖర్లో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఇలా చేజారిందనున్న మ్యాచ్‌లలో తిరిగి తమ జట్టును రేస్‌లో నిలబెట్టడంతో శశాంక్, అశుతోష్ జోడీకి ఇది కొత్తేమీ కాదు. ఈ సీజన్లోనే ఈ జోడీ ఇలా చేయడం ఇది మూడోసారి. ఓ సందర్భంగా తమ జట్టును విజయతీరాలకు చేర్చిన ఈ జోడీ.. రెండు మ్యాచ్‌ల్లో గెలుపు అంచుల దాకా తీసుకెళ్లగలిగింది. ఈ సీజన్లో పంజాబ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో చివరి ఓవర్లో ఓటములను ఎదుర్కొవడం ఇది నాలుగో సారి (ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్, ముంబై). ఈ సీజన్లో శశాంక్-అశుతోష్ జోడీ దాదాపు ప్రతి మ్యాచ్‌లో అద్బుతమైన పోరాటపటిమ కనబరుస్తున్నప్పటికీ మిగతా సభ్యుల తోడ్పాటు లభించకపోవడంతో పంజాబ్ వరుస ఓటములు ఎదుర్కొంటుంది. జట్టులో పెద్ద స్టార్లు లేకపోయినా ఈ సీజన్లో శశాంక్, అశుతోషే వారి పాలిట స్టార్లయిపోయారు. విచిత్రమేమిటంటే శశాంక్‌ను పంజాబ్ వేలంలో పొరపాటున తీసుకుంది. ఇంకో శశాంక్ అని ఈ శశాంక్‌ను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ సహా యజయాని ప్రీతి జింటా అప్పట్లో తెగ బాధ పడిపోయింది. ఇప్పుడు వద్దనుకున్న ఆ శశాంకే పంజాబ్‌ను కనీసం రేస్‌లో అయిన నిలబెట్టగలుగుతున్నాడు. ఈ సీజన్ మొత్తంలో శశాంక్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ తన జట్టును గెలుపు రేస్‌లో నిలబెడుతున్నాడు. ఇతనికి ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ తోడవుతున్నాడు. అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్ అన్న పదానికి సరైన న్యాయం చేస్తున్నాడు. ఎక్కడో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా తన జట్టును గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నిస్తున్నాడు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అయితే అశుతోష్ పంజాబ్‌ను గెలిపించినంత పని చేశాడు. అశుతోష్ దెబ్బకు ముంబై బౌలర్లు వణికిపోయారు. గెలుపు ఆశలు సైతం వదులుకున్నారు. ఈ సీజన్ మొత్తంలో శశాంక్, అశుతోష్ పోరాటం చాలా స్పూర్తిదాయకం. వీరిద్దరు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రత్యర్దులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ సీజన్లో శశాంక్, అశుతోష్ చేసిన స్కోర్లు.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్: 193 పరుగుల లక్ష్య ఛేదన- శశాంక్ (41), అశుతోష్ (61)- 9 పరుగుల తేడాతో చివరి ఓవర్లో పంజాబ్ ఓటమి రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్: తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్- శశాంక్ (9), అశుతోష్ (16 బంతుల్లో 31; ఫోర్, 3 సిక్సర్లు)- చివరి ఓవర్లో 3 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి సన్‌రైజర్స్‌తో మ్యాచ్: 183 పరుగుల లక్ష్య ఛేదన- శశాంక్ (25 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), అశుతోష్ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)- 2 పరుగుల తేడాతో చివరి ఓవర్లో పంజాబ్ ఓటమి. గుజరాత్‌తో మ్యాచ్: 200 పరుగుల లక్ష్య ఛేదన-శశాంక్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్)- మరో బంతి మిగిలుండగా పంజాబ్ గెలుపు లక్నోతో మ్యాచ్: 200 పరుగుల లక్ష్య ఛేదన- శశాంక్ (7 బంతుల్లో 9 నాటౌట్; ఫోర్)- 21 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి ఆర్సీబీతో మ్యాచ్: తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్- శశాంక్ (8 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు)-4 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్: 175 పరుగుల లక్ష్య ఛేదన- తొలి బంతికే ఔటైన శశాంక్ - అయినా 4 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు -
PBKS Vs MI Highlights Photos: అశుతోష్ మెరుపులు వృథా ..9 పరుగులతో ముంబై గెలుపు (ఫొటోలు)
-
PBKS Vs MI: గట్టెక్కిన ముంబై
ముల్లాన్‌పూర్: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన పెద్ద లక్ష్యం ముందు పంజాబ్ కింగ్స్ 14/4 స్కోరుతో ఆరంభంలోనే మోకరిల్లింది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మల మెరుపులు కింగ్స్‌ను గెలుపు ట్రాక్‌లో పడేశాయి. కానీ వికెట్లు అందుబాటులో లేక 6 బంతుల్లో సులువైన 12 పరుగుల్ని చేయలేక చివరకు పంజాబ్ ఆలౌటైంది. దీంతో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై 9 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ (53 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హర్షల్ పటేల్ 3, స్యామ్ కరన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), శశాంక్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆశలు రేపారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా, కొయెట్జీ చెరో 3 వికెట్లు తీశారు. సూర్య ప్రతాపం... ఆరంభంలోనే ఇషాన్ (8) అవుట్ కాగా... కెరీర్లో 250వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ (25 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ పవర్ ప్లేలో జట్టు స్కోరును 54/1కు తీసుకెళ్లారు. తర్వాత సూర్య దూకుడు కొనసాగడంతో పరుగుల వేగం పెరిగింది. సగం ఓవర్లు ముగిసేసరికి ముంబై 86/1 స్కోరు చేసింది. ఆ మరుసటి ఓవర్లోనే సూర్యకుమార్ 34 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. అయితే 12వ ఓవర్ వేసిన స్యామ్ కరన్... రోహిత్ ఆట ముగించడంతో రెండో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్లో ముంబై వంద పరుగులను చేరుకుంది. 14 ఓవర్లలో 115/2 స్కోరు చేసిన ముంబై... సూర్య, తిలక్ ధాటిగా ఆడటంతో మిగిలిన 6 ఓవర్లలో 77 పరుగుల్ని సాధించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10) తక్కువే చేసినా... తిలక్ మెరుపులు ముంబై జోరుకు దోహదం చేశాయి. హర్షల్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ (14), షెఫర్డ్ (1), నబీ (0) అవుట్ కావడంతో కేవలం 7 పరుగులే వచ్చాయి. 14/4 అయినా... వణికించిన అశుతోష్! పంజాబ్ ఇన్నింగ్స్ ఇలా మొదలైందో లేదో... అలా కుదేలైంది. 2.1 ఓవర్లలోనే 14/4 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడింది. అటు కొయెట్జీ, ఇటు బుమ్రా ధాటికి ఓపెనర్లు స్యామ్ కరన్ (6), ప్రభ్‌సిమ్రన్ (0), రోసో (1), లివింగ్‌స్టోన్ (1) పెవిలియన్‌కు దారి కట్టారు. ఈ దశలో శశాంక్, అశుతోష్ సిక్సర్లతో అలరించారు. కానీ 12.1 ఓవర్లలో 111/7 వద్ద శశాంక్ నిష్క్రమించడంతో పంజాబ్‌కు ఓటమి ఖాయమైంది. ఈ దశలో అశుతోష్, హర్‌ప్రీత్ బ్రార్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎనిమిదో వికెట్‌కు చకచకా 57 పరుగుల జోడించడంతో ఊహించని ఉత్కంఠ వచ్చేసింది. కానీ 168 పరుగుల వద్ద అశుతోష్ ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించడంతో పంజాబ్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) హర్‌ప్రీత్ (బి) రబడ 8; రోహిత్ (సి) హర్‌ప్రీత్ (బి) స్యామ్ కరన్ 36; సూర్యకుమార్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) సామ్ కరన్ 78; తిలక్ వర్మ (నాటౌట్) 34; హార్దిక్ పాండ్యా (సి) హర్‌ప్రీత్ (బి) హర్షల్ 10; డేవిడ్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 14; షెఫర్డ్ (సి) శశాంక్ (బి) హర్షల్ 1; నబీ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–18, 2–99, 3–148, 4–167, 5–190, 6–192, 7–192. బౌలింగ్: లివింగ్‌స్టోన్ 2–0–16–0, అర్‡్షదీప్ 3–0–35–0, రబడ 4–0–42–1, హర్షల్ 4–0–31–3, స్యామ్ కరన్ 4–0–41–2, హర్‌ప్రీత్ బ్రార్ 3–0–21–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: స్యామ్ కరన్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 6; ప్రభ్‌సిమ్రన్ (సి) ఇషాన్ (బి) కొయెట్జీ 0; రోసో (బి) బుమ్రా 1; లివింగ్‌స్టోన్ (సి అండ్ బి) కొయెట్జీ 1; హర్‌ప్రీత్ సింగ్ (సి అండ్ బి) గోపాల్ 13; శశాంక్ (సి) తిలక్ వర్మ (బి) బుమ్రా 41; జితేశ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆకాశ్ 9; అశుతోష్ (సి) నబీ (బి) కొయెట్జీ 61; హర్‌ప్రీత్ బ్రార్ (సి) నబీ (బి) పాండ్యా 21; హర్షల్ (నాటౌట్) 1; రబడ (రనౌట్) 8; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 183. వికెట్ల పతనం: 1–10, 2–13, 3–14, 4–14, 5–49, 6–77, 7–111, 8–168, 9–174, 10–183. బౌలింగ్: కొయెట్జీ 4–0–32–3, బుమ్రా 4–0–21–3, ఆకాశ్ మధ్వాల్ 3.1–0–46–1, పాండ్యా 4–0–33–1, శ్రేయస్ గోపాల్ 2–0–26–1, షెఫర్డ్ 2–0–20–0. ఐపీఎల్లో నేడు లక్నో X చెన్నై వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. పంజాబ్ ఓడినా ఆ ఇద్దరు అభిమానుల మనసుల్ని గెలిచారు..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో శశాంక్ సింగ్ (25 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), అశుతోష్ శర్మ (15 బంతుల్లో 33 నాఔట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి పంజాబ్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా శశాంక్, అశుతోష్ అభిమానుల మనసుల్ని గెలిచారు. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని పంజాబ్‌ను శశాంక్, అశుతోష్ దాదాపుగా గెలిపించినంత పని చేశారు. తమ జట్టును గట్టెక్కించడం కోసం ఈ ఇద్దరు చేసిన పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పంజాబ్‌ను గెలిపించేందుకు ఈ ఇద్దరు చేయాల్సిందంతా చేశారు. అయినా పంజాబ్‌కు స్వల్ప తేడాతో ఓటమి తప్పలేదు. ఉనద్కత్ వేసిన చివరి ఓవర్లో పంజాబ్ గెలుపుకు 29 పరుగులు అవసరం కాగా.. శశాంక్, అశుతోష్ 26 పరుగులు పిండుకున్నారు. వీరిద్దరి దెబ్బకు అనుభవజ్ఞుడైన ఉనద్కత్ లయ తప్పి మూడు వైడ్లు కూడా వేశాడు. ఆఖరి బంతికి శశాంక్ సిక్సర్ కొట్టినప్పటికీ అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. చివరి బంతికి పంజాబ్‌కు 9 పరుగులు కావల్సి ఉండింది. ఈ ఓవర్లో అశుతోష్ రెండు, శశాంక్ ఓ సిక్సర్ బాది సన్‌రైజర్స్ శిబిరంలో ఆందోళన రేకెత్తించారు. 19వ ఓవర్లో ఈ ఇద్దరు అదనంగా ఓ బౌండరీ బాది ఉంటే పంజాబ్ గెలిచుండేది. ఆ ఓవర్లో నటరాజన్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి శశాంక్, అశుతోష్‌లను కట్టడి చేశాడు. అంతింగా పంజాబ్ మ్యాచ్ ఓడినా శశాంక్, అశుతోష్ అద్బుతమైన పోరాటపటిమ కనబర్చి అభిమానులకు కావాల్సిన అసలుసిసలు టీ20 మజాను అందించారు. శశాంక్, అశుతోష్ ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో పోరాటం చేశారు. ఆ మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఈ ఇద్దరి పోరాటం కారణంగా పంజాబ్ విజయవంతంగా ఛేదించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌తో మ్యాచ్ తరహాలోనే పంజాబ్‌కు గెలుపుపై ఆశలు లేవు. SHASHANK SINGH IS A HERO...!!!! - He is still in pain after missing the game by a narrow margin 💔 pic.twitter.com/OYf6ZxJl1t — Johns. (@CricCrazyJohns) April 10, 2024 అలాంటి స్థితి నుంచి శశాంక్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ రెండు ప్రదర్శనల కారణంగా శశాంక్, అశుతోష్ రాత్రికిరాత్రి హీరోలైపోయారు. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఓడినా క్రికెట్ అభిమానులు వీరిద్దరికి పోరాటాన్ని కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే, పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. యువ ఆటగాడు నితీశ్ రెడ్డి (37 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్ (4-0-29-4) సన్‌రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేశాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో శశాంక్, అశుతోష్ చివరి నిమిషం వరకు పోరాడినా పంజాబ్ లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
నరాలు తెగే ఉత్కంఠ: ఆఖరి ఓవర్లో ‘భయపెట్టిన’ ఉనాద్కట్! వీడియో
ఆఖరి ఓవర్.. మ్యాచ్ గెలవాలంటే ఆరు బంతుల్లో 29 పరుగులు కావాలి.. ఇదీ సమీకరణం.. ఇంతలో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు బౌలర్.. విజయావకాశం మీకే అన్నట్లుగా.. మొదటి బంతికే సిక్సర్.. ఆ తర్వాత వైడ్.. మళ్లీ వైడ్.. ఇప్పుడు గెలుపు సమీకరణం ఐదు బంతుల్లో 21 పరుగులు... ఫీల్డర్ తప్పిదం కారణంగా మళ్లీ సిక్సర్.. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు... ఫలితంగా గెలుపు సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులు... ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు.. మిగిలినవి ఆఖరి రెండు బంతులు.. ఇందులో మొదటిది వైడ్... రెండో బంతికి ఒక్క పరుగు.. ఇప్పటిదాకా డ్రామా నడిపించిన బ్యాటర్ కథ అప్పుడే ముగిసిపోవాల్సింది.. కానీ ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అతడు బతికిపోయాడు. గెలవడానికి ఒక్క బంతికి తొమ్మిది పరుగులు కావాలి.. ఏమో మళ్లీ వైడ్ బాల్స్ పడతాయేమోనన్న ఉత్కంఠ.. కానీ ఈసారి అలా జరుగలేదు.. ఆఖరి బంతికి సిక్స్ బాదడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెండు పరుగుల తేడాతో ప్రత్యర్థి విజయం సాధించింది. A Fantastic Finish 🔥 Plenty happened in this nail-biter of a finish where the two teams battled till the end🤜🤛 Relive 📽️ some of the drama from the final over ft. Jaydev Unadkat, Ashutosh Sharma & Shashank Singh 👌 Watch the match LIVE on @starsportsindia and @JioCinema… pic.twitter.com/NohAD2fdnI — IndianPremierLeague (@IPL) April 9, 2024 ఓడిపోతామేమో.. భయపెట్టిన ఉనాద్కట్.. ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ మధ్య ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన ఈ హోరాహోరీ పోరులో విజయం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది. ఆఖరి ఓవర్లో రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. జయదేవ్ ఉనాద్కట్ చేతికి బంతినివ్వగా.. పంజాబ్ బ్యాటర్ అశుతోశ్ శర్మ వరుసగా.. 6, వైడ్, వైడ్, 6, 2, 2, వైడ్, 1.. ఇలా 20 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి శశాంక్ సింగ్ సిక్స్ బాది స్కోరుకు మరో ఆరు పరుగులు జత చేశాడు. మధ్యలో రాహుల్ త్రిపాఠి ఓసారి క్యాచ్ జారవిడిచాడు. ఇలా సన్‌రైజర్స్ బౌలర్, ఫీల్డర్ తప్పిదాలు చేసినా ఆఖరికి విజయం వారినే వరించింది. ఫలితంగా తాజా ఎడిషన్‌లో హైదరాబాద్ జట్టు ఖాతాలో మూడో గెలుపు చేరింది. అదరగొట్టిన నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్ కాగా ముల్లన్‌పూర్‌లో మంగళవారం జరిగిన పంజాబ్- సన్‌రైజర్స్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి రేపింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (37 బంతుల్లో 64), అబ్దుల్ సమద్(12 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 189 రన్స్ స్కోరు చేసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇక లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడిన పంజాబ్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ధనాధన్ ఇన్నింగ్స్‌తో పాటు ఒక వికెట్ తీసిన నితీశ్ రెడ్డిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక అభిమానులకు అసలైన టీ20 మజా అందించిన పంజాబ్- సన్‌రైజర్స్ ఆఖరి ఓవర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. So close, yet so far for Shashank and #PBKS 💔#IPLonJioCinema #TATAIPL #PBKSvSRH pic.twitter.com/F51V0OzroY — JioCinema (@JioCinema) April 9, 2024 -
IPL 2024 GT VS PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 200 అంతకు పైగా లక్ష్యాలను ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. నిన్న గుజరాత్‌పై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో పంజాబ్ కింగ్స్ ఈ రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్లో పంజాబ్ ఇప్పటివరకు ఆరుసార్లు 200 అంతకంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించింది. పంజాబ్ తర్వాత ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు (5) 200 ఆపైచిలుకు లక్ష్యాలను ఛేదించింది. PUNJAB KINGS NOW HAVE MOST 200 OR MORE TOTALS CHASED DOWN IN IPL HISTORY. 🤯💥pic.twitter.com/Jz56stB8kB — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మరో బంతి మిగిలుండగానే విజయవంతంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాహా (11), విజయ్ శంకర్ (8) నిరాశపర్చగా.. కేన్ విలియమ్సన్ (26), సాయి సుదర్శన్ (33) పర్వాదేనిపించారు. ఆఖర్లో రాహుల్ తెవాటియా (8 బంతుల్లో 23 నాటౌట్) గిల్‌తో కలిసి మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 2, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. Most successful 200 or more run chases in IPL history: Punjab Kings - 6*. Mumbai Indians - 5. pic.twitter.com/ego8rhdFWq — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన శాశంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. శశాంక్‌తో పాటు అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) కూడా అద్భుతమై ఇన్నింగ్స్ ఆడాడు. అశుతోష్.. శశాంక్‌తో కలిసి ఏడో వికెట్‌కు మెరుపు వేగంతో 43 పరుగులు సమకూర్చి పంజాబ్‌కు ఊహించని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి పంజాబ్ పాలిట గెలుపు గుర్రంగా మారాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శశాంక్, అశుతోష్‌తో పాటు ప్రభ్‌సిమ్రన్ (35), బెయిర్‌స్టో (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే తలో వికెట్ దక్కించుకున్నారు. -
IPL 2024: గుజరాత్‌కు గెలుపు దూరం చేసిన ఈ అశుతోష్ రాంబాబు ఎవరు..?
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గెలుపుపై ఆశలు లేని పంజాబ్‌ను శాశంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు మెరుపు వేగంతో 43 పరుగులు సమకూర్చి పంజాబ్‌కు ఊహించని విజయాన్ని అందించారు. PUNJAB KINGS NOW HAVE MOST 200 OR MORE TOTALS CHASED DOWN IN IPL HISTORY. 🤯💥pic.twitter.com/Jz56stB8kB — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో శశాంక్.. 27 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన దశలో అశుతోష్ అంచనాలు లేకుండా బరిలోకి దిగి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఓటమి తప్పతనుకున్న వేళ వీరిద్దరూ తమ బ్యాటింగ్ విన్యాసాలతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. శశాంక్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగి విధ్వంసం సృష్టిస్తే.. అశుతోష్ బాధ్యతమైన షాట్లు ఆడి స్ట్రయిక్‌ను రొటేట్ చేశాడు. Ashutosh Sharma said "I should thank Dhawan Paji, Sanjay Bangar & Punjab Kings for trusting me a lot". pic.twitter.com/EhOvU3m298 — Johns. (@CricCrazyJohns) April 4, 2024 ఎవరీ అశుతోష్..? పంజాబ్ గెలుపులో శశాంక్ పాత్ర ఎంత కీలకమైందో అశుతోష్ పాత్ర కూడా అంతే వెల కట్టలేనిది. అరంగేట్రం మ్యాచ్‌లోనే అశుతోష్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి మరీ ఇరగదీశాడు. 25 ఏళ్ల అశుతోష్ రాంబాబు శర్మ.. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే ఈ రేంజ్లో చెలరేగుతాడని ఎవరూ ఊహించ లేదు. - IPL Debut. - Impact player. - Came when PBKS needed 50 from 27 balls. Ashutosh Sharma smashed 31 runs from just 17 balls, A clean ball striker. 🔥 pic.twitter.com/wWW4osw3BR — Johns. (@CricCrazyJohns) April 4, 2024 దేశవాలీ క్రికెట్లోనూ పెద్దగా ట్రాక్ రికార్డు లేని అశుతోష్‌ను పంజాబ్ కింగ్స్ తన బేస్ ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అశుతోష్.. 4 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్-ఏ, 16 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అశుతోష్.. టీ20ల్లో 4 అర్దసెంచరీలు నమోదు చేశాడు. పొరపాటున ఎంపిక చేసుకున్నవాడే గెలుపు గుర్రమయ్యాడు.. శశాంక్ విషయానికొస్తే.. ఐపీఎల్ 2024 వేలంలో పంజాబ్ కింగ్స్ ఇతగాడిని పొరపాటున ఎంపిక చేసుకుందని వార్తలు వచ్చాయి. వేలంలో ఇద్దరు శశాంక్ సింగ్‌లు ఉండటంతో పొరపాటున ఈ శశాంక్ సింగ్‌ను తీసుకున్నట్లు పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా అప్పట్లో తెగ బాధపడిపోయింది. SHASHANK SINGH MASTERCLASS! A fifty in just 23 balls against GT in Ahmedabad. He's keeping Punjab Kings in the chase, a knock to remember. 💥 pic.twitter.com/nYuWif1luJ — Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2024 పొరపాటున తీసుకున్నాయని భావించిన ఆ శశాంక్ సింగే ఇప్పుడు పంజాబ్ పాలిట గెలుపు గుర్రంగా అవతరించడం విశేషం. చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఈ శశాంక్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ 2024 వేలంలో రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35) రాణించడంతో 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. -
T20 Cricket: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 11 బంతుల్లోనే.. తొలి భారత బ్యాటర్‌గా!
SMAT 2023- Ashutosh Sharma breaks Yuvraj Singh's record: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)-2023 సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు బద్దలైంది. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఓవరాల్ భారత బ్యాటర్ల జాబితాలో యువీని వెనక్కి నెట్టి అశుతోశ్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అశుతోష్ సంచలన ఇన్నింగ్స్ దేశవాళీ టీ20 టోర్నీ SMAT సోమవారం(అక్టోబరు 16) ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు షెడ్యూల్లో భాగంగా రాంచి వేదికగా అరుణాచల్ ప్రదేశ్- రైల్వేస్ జట్లు మంగళవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రైల్వేస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ఉపేంద్ర యాదవ్(103) అజేయ సెంచరీతో మెరవగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అశుతోష్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే కేవలం 11 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా మధ్యప్రదేశ్ ఆటగాడు అశుతోష్ యువీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. 53 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన రైల్వేస్.. అరుణాచల్ ప్రదేశ్‌ను 119 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 127 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువీ నాటి టీ20 వరల్డ్‌కప్‌లో టీ20 వరల్డ్‌కప్-2007లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా యువరాజ్ సింగ్ సిక్సర్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. స్టువర్ట్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యువీ రికార్డు బ్రేక్ చేసిన నేపాల్ బ్యాటర్ అయితే, ఇటీవలే యువీ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలైన విషయం తెలిసిందే. చైనాలో ఆసియా క్రీడలు-2023 సందర్భంగా నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ మంగోలియాపై 9 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో యువీ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసి తన పేరు చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. చదవండి: మెకానికల్ ఇంజనీర్! పాక్‌ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి! ఒకే ఒక్కసారి కెప్టెన్‌గా.. -
అనుమతి ఇస్తే ఆర్మీలో చేరతా..
జైపూర్: భారత్ కోసం రక్తం చిందించి భరతమాతకు వీరతిలకం దిద్దిన సైనికుడు కల్నల్ అశుతోష్ శర్మ. ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని హంద్వారాలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో కల్నల్ సహా ఇద్దరు మేజర్ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నేలకొరిగిన విషయం తెలిసిందే. మంగళవారం జైపూర్‌లోని మిలిటరీ స్టేషన్లో కల్నల్ ఆశుతోష్ శర్మ అంత్యక్రియలు సైనిక వందనంతో ముగిశాయి. ఈ సందర్భంగా కల్నల్ భార్య పల్లవి శర్మ మాట్లాడుతూ.. తన భర్త పోరాటం గర్వకారణమని, కన్నీళ్లు రాల్చబోమని పేర్కొన్నారు. అంతేకాకుండా తాను సైతం భారతావనిని రక్షించేందుకు పాటుపడతానంటున్నారు. (కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) "నేను ఆర్మీలో చేరాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఇప్పుడు నా వయస్సు అనుకూలిస్తే, మంత్రిత్వ శాఖ అనుమతి ఇస్తే యూనిఫాం ధరించాలనుకుంటున్నాను" అని పల్లవి శర్మ తన మనసులోని మాటను బయటపెట్టారు. అటు ఆమె పదకొండేళ్ల కూతురు తమన్నా కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరాలనుకుంటోందని చెప్పుకొచ్చారు. రెండు రోజులుగా తన కళ్ల ముందు జరుగుతున్నన వాటిని నిశితంగా పరిశీలిస్తున్న కూతురుకు ఇప్పుడిప్పుడే సైన్యంలో చేరాలన్న కోరిక బలపడుతోందన్నారు. ఆమె కోరికకు తాను అడ్డు చెప్పనని స్పష్టం చేశారు. అయితే ముందు తను బాధ్యతాయుత పౌరురాలిగా ఎదగడం ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. (13సార్లు ప్రయత్నించి సైన్యంలో చేరిన ఆయన...) -
కల్నల్ పార్ధివ దేహానికి సీఎం నివాళులు
జైపూర్ : జమ్మూ కశ్మీర్‌లోని హంద్వారాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన కల్నల్ ఆశుతోష్ శర్మ పార్ధివ దేహానికి జైపూర్‌లోని మిలిటరీ స్టేషన్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాళులు అర్పించారు. సీఎంతో సహా, కల్నల్ శర్మ భార్య పల్లవి, కూతురు తమన్నా, ఇతర కుటుంబ సభ్యులు ఆశుతోష్ పార్ధివ దేహానికి సెల్యూట్ చేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ నివాళులు అర్పించారు. (13సార్లు ప్రయత్నించి సైన్యంలో చేరిన ఆయన...) ఆదివారం కశ్మీర్‌లోని హాంద్వారా ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో ఒక కల్నల్, ఒక మేయర్, ఇద్దరు జవాన్లతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసు ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. (కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) -
వీర సైనికా నీకు వందనం
జైపూర్: ఆరున్నర సంవత్సరాలు కష్టపడి 13 సార్లు ప్రయత్నించి ఆర్మీలో చేరారు ఆయన. దేశం కోసం పోరాడాలి అన్న ఆలోచన తప్ప మరే ఆలోచన లేని ఆయన ఎట్టకేలకు ఎంతో కష్టపడి భారత సైన్యంలో చేరారు. భారత సైన్యం నిర్వహించిన ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆర్మీలో చేరిన తరువాత వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా అంచెలంచెలుగా ఎదిగి కల్నల్‌స్థాయికి చేరారు. ఆయన మరెవరో కాదు ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఉగ్రదాడిలో అమరులైన కల్నల్ ఆశుతోష్ శర్మ. ఆయన మృతదేహాన్నిస్వగ్రామమైన జైపూర్‌కు తీసుకురానున్నారు. సోమవారం సాయంత్రం కల్లా ఆయన శరీరాన్ని జైపూర్‌లో ఉంటున్న ఆయన తల్లిదండ్రులకు అందించనున్నారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు సైనికవందనంతో జరగనున్నాయి. (కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) కల్నల్ శర్మ భార్య పల్లవి, కూతురు తమన్నాతో కలిసి ఉంటున్నారు. ఆయన భార్య పల్లవి మాట్లాడుతూ తన భర్త ఒక గొప్ప కారణంతో ప్రాణాలు త్యాగం చేశారని, అశుతోష్‌ని చూసి గర్వపడుతున్నానని తెలిపారు. ఆయనని చూసి ఏడవనని తెలిపారు. చివరిగా కల్నల్‌తో మే 1 న మాట్లాడానని చెప్పారు. ఆయన కూతురు తమన్నా మాట్లాడుతూ ఆపరేషన్ ముగియగానే ఇంటికి తిరిగి వస్తానని చెప్పిన నాన్నకి ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అయ్యింది. అశుతోష్ తల్లి దండ్రులు మాట్లాడుతూ తమ కొడుకుని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. (హంద్వారా అమరులకు మహేష్ నివాళి) ఆయన సోదరుడు పీయూష్ శర్మ మాట్లాడుతూ ‘మా సోదరుడు చాలా ధైర్యవంతుడు, దేశభక్తి కలవాడు. నా సోదరుడి లాగానే నా కొడుకు కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. ఆయన మా అందరికి ఆదర్శం’ అని తెలిపారు. కల్నల్ అశుతోష్ శర్మ స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షహర్ కాగా ఆయన అంత్యక్రియలు మాత్రం జైపూర్‌లో జరగనున్నట్లు ఆయన సోదరుడు తెలిపారు. ఆదివారం కశ్మీర్‌లోని హాంద్వారా ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో ఒక కల్నల్, ఒక మేయర్, ఇద్దరు జవాన్లతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసు ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. -
కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం
శ్రీనగర్: దేశమంతటా లాక్డౌన్ అమలవుతున్న వేళ..కశ్మీర్లో సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో కల్నల్, మేజర్ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు నేలకొరిగారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువజాము వరకు కొనసాగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ముష్కరులు కూడా హతమయ్యారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలుగా ఉంచుకున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో కల్నల్ శర్మ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఆ ఇంటిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జవాన్లు ప్రాణాలకు తెగించి బందీలను, గ్రామస్తులను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. అనంతరం కల్నల్ శర్మ నేతృత్వంలోని బృందం లోపలికి చొచ్చుకెళ్లింది. కానీ, లోపలే పొంచి ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే నేలకొరిగారు. వెలుపల వేచి చూస్తున్న బలగాలకు కల్నల్ శర్మ బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వారికి చేసిన ఫోన్ కాల్స్‌కు ఉగ్రవాదులు సమాధానం ఇవ్వడంతో ప్రమాదాన్ని శంకించారు. ఆ వెంటనే లోపలికి వెళ్లిన పారాట్రూపర్లు ఇద్దరు ఉగ్రవాదులను మట్టికరిపించారు. నేలకొరిగిన కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్‌లు 21 రాష్ట్రీయ రైఫిల్స్‌లోని గార్డ్స్ రెజిమెంట్‌కు చెందిన వారు. వీరితోపాటు లోపలికి వెళ్లిన జమ్మూకశ్మీర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ షకీల్ కాజీ కూడా బలయ్యారు. ఉగ్రహతుల్లో ఒకరిని లష్కరే తోయిబా కమాండర్, పాక్‌కు చెందిన హైదర్ కాగా, గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నాడు. కాల్పులు జరుగుతుండగా మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. వీరంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా చొరబడే ఉగ్రవాదుల కోసం అక్కడ వేచి ఉన్నట్లు అనుమానిస్తున్నామని సైన్యం తెలిపింది. ఇదే ఉగ్రవాదుల ముఠాతో గురువారం సాయంత్రం కూడా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయనీ, అనంతరం వీరంతా అటవీ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపింది. అప్పటి నుంచి ఇక్కడ గాలింపు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నేలకొరిగిన జవాన్ల అంత్యక్రియలు సోమవారం వారివారి స్వస్థలాల్లో జరగనున్నాయని పేర్కొంది. కల్నల్ అశుతోష్ శర్మ భౌతిక కాయాన్ని సొంతూరు జైపూర్‌కు, మేజర్ అనూజ్ సూద్ భౌతిక కాయాన్ని పుణేకు అధికారులు తరలించారు. కాగా, కశ్మీర్‌లోయలో కల్నల్ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం 2015 తర్వాత ఇదే ప్రథమం. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భద్రతాబలగాల త్యాగాలు జాతి మరువలేనివని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎ.ఖాజీ (ఫైల్ ఫొటోలు, ఎడమ నుంచి కుడికి) -
మూడో అతిపెద్ద దేశంగా భారత్
సాక్షి, హైదరాబాద్: భారత్–ఆఫ్రికాల మధ్య పరస్పర సహకారం అవసరమని భారత శాస్త్ర, సాంకేతికశాఖ కార్యదర్శి అశుతోష్ శర్మ అన్నారు. ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, ఫిక్కీ ఆధ్వర్యంలో 2 రోజులపాటు జరగనున్న గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సమ్మిట్–2019ను ఆయన గురు వారం ప్రారంభించారు. భారత్– ఆఫ్రికా దేశాలమధ్య విద్య, వైద్య రంగాల్లో పర స్పర సహకారం అవసరమని అశుతోష్ అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రానున్న కాలంలో ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా ఉంటుందని తెలిపారు. యువత ఎక్కువగా సాంకేతిక స్టార్టప్స్‌ను ప్రారంభించడానికి ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపి రెడ్డి, ఫిక్కీ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ సంగీతారెడ్డి, జాంబియా, ఇథియోపియా, రువాండా మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. -
‘పరిశోధన’ కొనసాగించేందుకు నిధులిస్తాం
న్యూఢిల్లీ: మేధోవలసలను నిరోధించడానికి కేంద్రం ‘నేషనల్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్’ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పీహెచ్డీ పూర్తి చేసిన సైన్స్ స్కాలర్లు తమ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్‌ను కొనసాగించేందుకు నిధులు అందజేయాలని నిర్ణయించింది. పరిశోధన కొనసాగించే స్కాలర్లకు మూడేళ్లపాటు నెలకు రూ.50 వేలు ఇస్తామని, ఏడాదికి రూ.7 లక్షలు బేసిక్ గ్రాంట్ ఇస్తామని శాస్త్రసాంకేతిక కార్యదర్శి అశుతోశ్ శర్మ తెలిపారు. -
‘సేవ్’కు విశేష స్పందన!
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు, నగర పోలీసులు విధిస్తున్న ఆంక్షల కారణంగా సిటీ నైట్‌లైఫ్ నాశనమైపోతోందని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. రోజంతా ఆఫీసులు, కంపెనీల్లో బిజీబిజీగా గడిపే ఉద్యోగులు కాస్త విశ్రాంతి కోసం సరదాగా గడిపేందుకు పబ్బులకు, క్లబ్బులకు వస్తుంటారని, పబ్బులు, క్లబ్బులపై ఆంక్షలు విధించడం వల్ల నైట్‌లైఫ్‌ను డేలైఫ్గానే ఆదరాబాదరాగా గడిపేయాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ డిమాండ్‌కు మద్దతు కూడగట్టేందుకు ఏకంగా ఓ ఫేస్బుక్ పేజీని తెరిచారు. అంతటితో ఆగారా...? లేదు.. ఆంక్షలను ఎత్తి వేయాలని..., రాత్రంతా పబ్బులు, క్లబ్బులు తెరిచి ఉంచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రాష్ట్రపతి, లెఫ్టినెంట్ గవర్నర్, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులకు పిటిషన్ పెట్టుకు న్నారు. వివరాల్లోకెళ్తే... చీకటిని అవకాశంగా చేసుకొని అఘాయిత్యాలకు పాల్పడుతున్నని, నగరంలోని క్లబ్బులను, పబ్బులను నిర్ణీత సమయానికే మూసివేయాలనే డిమాండ్ మేరకు క్లబ్బులు, పబ్బుల నిర్వహణ సమయంపై ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధించింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 12.30 గంటల వరకు మాత్రమే వీటిని తెరిచి ఉంచేందుకు అనుమతిని ఇవ్వగా మరికొన్నింటికి రాత్రి 1 గంట వరకు అనుమతిని ఇచ్చారు. క్లబ్బుల్లో తప్పతాగి.. తాగిన మత్తులో వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఘటనలు రోజూ ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటివి కొన్నయితే చీకటిని అవకాశంగా మలుచుకొని అబలలపై, అమాయకులపై కామాంధులు ఆకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు మరికొన్ని. దీంతో ఆంక్షల కారణంగా కొంతమేరకైనా నేరాలు తగ్గుతాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ఈ దేశాలను జారీ చేసింది. అయితే నేరాలకు పాల్పడే మనస్తత్వం ఉన్నవారు ఎప్పుడైనా పాల్పడతారని, ప్రజల మైండ్ సెట్లలో మార్పు రావాలని నెటిజన్లు చెబుతున్నారు. నగరానికి చెందిన అశుతోష్ శర్మ.. సామాజిక మాధ్యమాలను ఆయుధంగా చేసుకొని ఈ విషయమై తన స్వరాన్ని వినిపించాడు. నగరంలోని చాలా ప్రాంతాల్లో నైట్ క్లబ్బులు, పబ్బులు రాత్రి 1 గంటకే మూతడడంతో తాము ఆహ్లాదంగా గడపలేకపోతున్నామని, తనలాగే చాలామంది సరదాగా సమయాన్ని గడపలేకపోతున్నారంటూ ఓ కామెంట్‌ను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. జూలై 30న చేసిన ఆయన పోస్ట్‌లకు చాలామంది నుంచి స్పందన రావడంతో ‘సేవ్ ఢిల్లీస్ నైట్‌లైఫ్’ పేరుతో ఫేస్బుక్లో ఓ పేజీని తెరిచాడు. దేశ రాజధాని నైట్‌లైఫ్‌ను కాపాడాలంటూ ఏకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆన్లైన్లోనే ఓ పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. ఈ పిటిషన్‌కు నగరవాసుల నుంచి విశేష స్పందన కనిపించింది. పిటిషన్ పెట్టిన కొన్ని గంటల్లోనే దాదాపు 1,500 మంది మద్దతుగా సంతకాలు చేశారు. 6,000 మందికిపైగా నెటిజన్లు లైక్ చేశారు. కొన్ని రోజుల్లోనే ఈ పిటిషన్‌కు వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. అంతేసంఖ్యలో మద్దతు పలుకుతూ సంతకాలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌ను శర్మ ఊరికే వదిలేయకుండా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు పంపాడు. కొంతమంది పార్లమెంట్ సభ్యులకు, సీనియర్ ప్రభుత్వ అధికారులకు కూడా పంపాడు.