
జైపూర్ : జమ్మూ కశ్మీర్‌లోని హంద్వారాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన కల్నల్ ఆశుతోష్ శర్మ పార్ధివ దేహానికి జైపూర్‌లోని మిలిటరీ స్టేషన్‌లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాళులు అర్పించారు. సీఎంతో సహా, కల్నల్ శర్మ భార్య పల్లవి, కూతురు తమన్నా, ఇతర కుటుంబ సభ్యులు ఆశుతోష్ పార్ధివ దేహానికి సెల్యూట్ చేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ నివాళులు అర్పించారు. (13సార్లు ప్రయత్నించి సైన్యంలో చేరిన ఆయన...)
ఆదివారం కశ్మీర్‌లోని హాంద్వారా ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో ఒక కల్నల్, ఒక మేయర్, ఇద్దరు జవాన్లతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసు ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. (కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం)
Comments
Please login to add a commentAdd a comment