Rajyavardhan Singh Rathore
-
రాహుల్జీ.. మీ ఫోన్ సమర్పించే దమ్ముందా?
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్ రాథోడ్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. ఫోన్ నిజంగా హ్యాకింగ్ అయ్యిందని రాహుల్ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో చట్టవిరుద్ధంగా ఎవరి ఫోన్‌నూ హ్యాక్ చేయడం లేదని తేల్చిచెప్పారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. ఒక జూనియర్ కాపీ రైటర్ కూడా రాహుల్ గాంధీ ఫోన్లోని కంటెంట్‌ను కాపీ చేయాలని కోరుకోడని రాజ్యవర్దన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని, దేశానికి వ్యతిరేకంగా పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని, ఇది ముమ్మాటికీ రాజద్రోహమేనని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ బాధ్యతారాహితంగా మాట్లాడుతున్నారని రాజ్యవర్దన్ రాథోడ్ మండిపడ్డారు. ఆయన తన ఫోన్‌ను దర్యాప్తు సంస్థకు అప్పగించాలని, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారమే దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఫోన్ల హ్యాకింగ్ జరుగుతోందని భావిస్తే చట్ట ప్రకారం ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. -
Rajasthan: రౌడీయిజం కనిపించడం లేదా..!
జైపూర్: రాజస్థాన్‌లో పెరుగుతున్న నేరాలపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు కనిపించడం లేదా అని శనివారం బీజేపీ ప్రశ్నించింది. అశోక్ గెహ్లాత్ డబ్బులు సంపాదించడంలో బిజీగా ఉన్నారంటూ తీవ్ర విమర్షలు చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ప్రతినిధులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, నూపూర్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అత్యారాలు, ఇతర నేరాలు జరగడం ‘‘కాంగ్రెస్ సంస్కృతి’’ పర్యాపదాలుగా మారాయని దుయ్యబట్టారు. దేశంలో కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బందుల పడుతుంటే.. రాజస్థాన్‌లో మహిళలు గుండాలకు భయపడాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనలపై రాజస్థాన్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందంటూ విమర్షలు గుప్పించారు. -
నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల హత్య.. ప్రతీకారంగానే!
తన సోదరి, ఆమె బిడ్డను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని కసి పెంచుకున్న ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకున్నాడు. రాజస్థాన్‌లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న ఓ జంటను అడ్డగించిన ఇద్దరు దుండగులు తుపాకులతో కాల్చి చంపేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటన సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా ఆ వీడియో సోషల్ మీడియాలో గ్రూపులలో వైరల్ అవుతోంది. అయితే ఇవి ప్రతీకారహత్యలేనని పోలీసులు చెప్తున్నారు. జైపూర్: నడిరోడ్డులో పట్టపగలు ఓ జంటను దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. భరత్పూర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని సెంట్రల్ బస్టాండ్ సర్కిల్ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు కారును అడ్డగించి.. అందులో ఉన్న జంటపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆ జంట అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత నిందితులు బైక్‌పై ఉడాయించారు. మృతులను సుదీప్ గుప్తా, సీమా గుప్తాలుగా గుర్తించిన పోలీసులు, వాళ్లు డాక్టర్లని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భరత్పూర్ ఐజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రతీకారంగానే.. కాగా, నిందితులను అనుజ్, మహేష్లుగా గుర్తించిన పోలీసులు.. ఇది ప్రతీకార హత్యలేనని భావిస్తున్నారు. డాక్టర్ సుదీప్‌కు గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కొన్నాళ్ల తర్వాత ఆ మహిళ, ఆమె ఐదేళ్ల బిడ్డ ఉన్న ఇంటికి నిప్పంటుకుని వాళ్లు నిపోయారు. అయితే అది ప్రమాదం కాదని, సుదీప్ కుటుంబమే ఆ దాష్టీకానికి పాల్పడిందని కేసు నమోదు అయ్యింది. దీంతో 2019లో సుదీప్, అతని తల్లి, భార్య సీమాలు జైలుకు వెళ్లొచ్చారు. ఈ కేసులో బాధితురాలి సోదరుడే ఇప్పుడు నిందితుల్లో ఒకడైన అనుజ్. కాబట్టే ఇది ప్రతీకార హత్యగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేత రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ తన ట్విట్టర్లో ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి.. కాంగ్రెస్ పాలనలో నేరగాళ్లు విజృంభిస్తున్నారని ఆక్షేపించాడు. చదవండి: శాడిస్ట్ రేపిస్ట్.. శిక్ష ఎంతంటే.. -
కల్నల్ పార్ధివ దేహానికి సీఎం నివాళులు
జైపూర్ : జమ్మూ కశ్మీర్‌లోని హంద్వారాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన కల్నల్ ఆశుతోష్ శర్మ పార్ధివ దేహానికి జైపూర్‌లోని మిలిటరీ స్టేషన్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాళులు అర్పించారు. సీఎంతో సహా, కల్నల్ శర్మ భార్య పల్లవి, కూతురు తమన్నా, ఇతర కుటుంబ సభ్యులు ఆశుతోష్ పార్ధివ దేహానికి సెల్యూట్ చేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ నివాళులు అర్పించారు. (13సార్లు ప్రయత్నించి సైన్యంలో చేరిన ఆయన...) ఆదివారం కశ్మీర్‌లోని హాంద్వారా ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో ఒక కల్నల్, ఒక మేయర్, ఇద్దరు జవాన్లతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసు ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. (కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) -
రాజ్యవర్థన్ రాజసం
జైపూర్: కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మరోసారి ఘన విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో రాజస్తాన్ లోని జైపూర్ రూరల్ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన రాజ్యవర్థన్ మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి భారీ గెలుపును అందుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యవర్థన్ సింగ్ ఎనిమిది లక్షల పదకొడు వేలకు పైగా ఓట్లు సాధించి అఖండ విజయం సాధిస్తే, కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన మాజీ అథ్లెట్ కృష్ణ పూనియా నాలుగు లక్షలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానానికే పరిమితమయ్యారు. వీరిద్దరే మధ్య ప్రధాన పోటీ జరగగా రాజ్యవర్థన్ తన గత మెజారిటీని మరింత పెంచుకోవడం విశేషం. షూటర్ గా క్రీడాజీవితం ప్రారంభించిన రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. భారత సైన్యాధికారి పదవికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి 2013లో బీజేపీ చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొదటిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. క్రీడామంత్రిగా సేవలందించిన రాజ్యవర్థర్.. బికనీర్ లోని రాజ్‌ఫుత్ వంశానికి చెందిన వారు. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ లో డబుల్ ట్రాప్ విభాగంలో వ్యక్తిగతంగా రజత పకతం గెలవడం ద్వారా పాపులర్ అయ్యారు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్ తరఫున తొలి రజత పతకం సాధించిన క్రీడాకారిణుగా ఘనత సాధించారు. అగ్రశ్రేణి షూటర్ గా ఎదిగిన రాజ్యవర్థన్.. కామన్వెల్త్, ఆసియా క్రీడలతో ప్రధాన టోర్నమెంట్లలో పతకాలు సాధించారు. మొత్తంగా 25 అంతర్జాతీయ పతకాలను రాజ్యవర్థన్ సాధించారు.పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు అందుకున్నారు. క్రీడాకారునిగా దేశానికి ప్రాతినిథ్యం వహించిన రాజ్యవర్థన్.. ఇప్పుడు దేశానికి క్రీడా మంత్రిగా పని చేశారు. ఫలితంగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి బాధ్యతలు దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఘనతకెక్కారు. రాజ్యవర్థన్పై కాంగ్రెస్ తరఫున పోటికి దిగిన కృష్ణ పూనియా మాజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. -
రాజ్యవర్ధన్ నయా ఛాలెంజ్
న్యూఢిల్లీ: గతంలో క్రీడాకారులు, బాలీవుడ్ తారలకు ఫిట్నెస్ చాలెంజ్ విసిరిన కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తాజాగా మరో సవాల్‌కు శ్రీకారం చుట్టారు. బుధవారం పుణేలో ‘ఖేలో ఇండియా’ క్రీడాపోటీలను ప్రారంభించిన ఆయన #5MinuteAur పేరుతో చేసిన కొత్త చాలెంజ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆయన రెండు చేతులతోనూ టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించారు. ‘చిన్నప్పుడు మనం హోమ్‌వర్క్ చేసుకోకుండా ఆడుకుంటూ ఉంటే అమ్మ మనల్ని వారించేది. వచ్చి హోమ్‌వర్క్ చేసుకోవాలని హెచ్చరించేది. అప్పుడు మనం ‘ఇంకో ఐదు నిమిషాలే’ అని అనే ఉంటాం. ఈ అనుభవం దాదాపు అందరికీ ఎదురయ్యే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఐదు నిమిషాల పాటు క్రీడల గురించి ఆలోచించండి. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే పంచుకోండి’ అంటూ ఈ వీడియో సందేశాన్ని ఆయన వినిపించారు. ఈ చాలెంజ్ ప్రాముఖ్యాన్ని చెబుతూ భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌ను ట్యాగ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్రీడా అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషి పట్ల నెటిజన్లు ఫిదా అవుతూ.. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. Bas #5MinuteAur-haven't v all asked fr it-in playgrounds,exam halls or on the phone? Let's b the voice of our young athletes & say it loud- #5MinuteAur #KheloIndia Aur Khelenge Toh Aur Jitenge! Share ur story of #5MinuteAur @imVkohli @NSaina @deepikapadukone @BeingSalmanKhan pic.twitter.com/dg91JfzN7z — Rajyavardhan Rathore (@Ra_THORe) 9 January 2019 -
ఏషియాడ్ విజేతలకు సత్కారం
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలు గెలుచుకున్న భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో వారిని నగదు పురస్కారంతో ప్రోత్సహించింది. స్వర్ణం గెలిచిన ఆటగాళ్లకు రూ.30 లక్షలు చొప్పున లభించగా... రజతానికి రూ. 20 లక్షలు, కాంస్యానికి రూ.10 లక్షల చొప్పున అందజేశారు. 2018 ఆసియా క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు కలిపి మొత్తం 69 పతకాలు గెలుచుకున్నది. క్రీడల చరిత్రలో ఇది మన దేశానికి అత్యుత్తమ ప్రదర్శన. సన్మాన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా... క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు కూడా పాల్గొన్నారు. ‘మన ఆటగాళ్ల ప్రదర్శన చాలా సంతోషాన్ని కలిగించింది. భవిష్యత్తులో భారత్ క్రీడల్లో కూడా సూపర్ పవర్‌గా ఎదుగుతుంది. విజేతలకు నా అభినందంతో పాటు ఆశీర్వాదాలు. క్రీడల పట్ల మంత్రి రాథోడ్‌కు ఉన్న అంకితభావం వెలకట్టలేనిది. ఇది భారతీయులందరికీ గర్వకారణం’ అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. -
49 మంది ఖర్చులు భరించం
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే 804 మందితో కూడిన భారత బృందానికి ఆమోదం తెలిపిన కేంద్ర క్రీడా శాఖ ఇందులో 49 మంది సహాయ సిబ్బంది ఖర్చుల్ని మాత్రం భరించమని స్పష్టం చేసింది. వీరిలో ముగ్గురు కోచ్‌లు కాగా, 26 మంది మేనేజర్లు, 20 మంది అధికారులున్నారు. వీరిని కూడా భారత ఒలింపిక్ సంఘమే (ఐఓఏ) సిఫార్సు చేసినప్పటికీ రోజువారీ ఖర్చులు మాత్రం సంబంధిత సమాఖ్యలే భరించాలని క్రీడాశాఖ తెలిపింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ఆధ్వర్యంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి వీడ్కోలు కార్యక్రమం జరిగిన మరుసటి రోజు క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండోనేసియా పయనమయ్యే బృందంలో 755 మంది ఖర్చుల్ని ప్రభుత్వం భరిస్తుందని క్రీడాశాఖ తెలిపింది. భారత బృందంలో 572 మంది అథ్లెట్లు కాగా, 232 మంది కోచ్‌లు, ఫిజియోలు, మేనేజర్లు ఉన్నారు. అథ్లెట్లు, కోచ్‌ల ఖర్చుల కోసం రోజుకు 50 అమెరికా డాలర్లు (రూ. 3,454), డాక్టర్లకు 25 డాలర్లు (రూ. 1,727) చొప్పున చెల్లిస్తారు. జకార్తా వెళ్లినప్పటి నుంచి ఈవెంట్ ముగిసిన మరుసటి రోజు దాకా ఈ చెల్లింపులు ఉంటాయి. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఉదంతంతో ఈసారి క్రీడాకారుల తల్లిదండ్రులకు ఈ బృందంలో చోటులేదు. -
సోషల్ మీడియా: వెనక్కి తగ్గిన కేంద్రం
సాక్షి, గాంధీనగర్ : ఆన్లైన్ డేటాపై నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుకోవడంలేదని కేంద్ర సమాచార, ప్రసార సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రకటించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ కట్టడికి, ఖాతాదారులు పంపించే సందేశాలను పరీశీలించడానికి సోషల్ మీడియా హబ్ ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కొందరూ వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అత్యన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం సోషల్ మీడియా హబ్ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పౌరుల కదలికలు, సంబంధాలపై పూర్తి నిఘా ఉండే రాజ్యాంలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారా? అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని కర్ణావతి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన యూత్ పార్లమెంట్లో పాల్గొన్న రాజ్యవర్థన్ సింగ్ సుప్రీం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. ప్రతి వ్యక్తి ఎవరికివారే సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ.. దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పౌరుల వాక్ స్వాతంత్రంపై ఆంక్షలు విధించిన చర్రితదేశతొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూదే అని, అదే పద్దతిని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కూడా అనుసరించారని విమర్శించారు. అఖండ భారతదేశం కోసం పాటుపడిన జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు స్యామ్ ప్రసాద్ ముఖర్జీపై కూడా కాంగ్రెస్ పార్టీ ఆంక్షలు విధించిందని విమర్శించారు. -
త్వరలోనే ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్
ముంబై : త్వరలోనే ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు పాల్గొంటుందనీ కేంద్ర క్రీడాశాఖమంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. ఆ సత్తా భారత ఆటగాళ్లకు ఉందని పేర్కొన్నాడు. ఓ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఐపీఎల్ టోర్నీలానే ఫిఫా వరల్డ్‌కప్‌ను చూసేందుకు సిద్దంగా ఉన్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ పాల్గొనకపోయినప్పటికీ ఆ టోర్నీలో పాల్గొనే సత్తా మనకు ఉంది. ఆటగాళ్లకు వచ్చే అవకాశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. త్వరలోనే ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ ఆడనుంది. ఫుట్‌బాల్ లేక ఏ క్రీడలోనైనా పోటీ ఇచ్చే సత్తా భారత్‌కు ఉంది’ అని పేర్కొన్నారు. ఆటగాళ్ల శిక్షణ పొందే అవకాశాలు, వారికి లభించే మద్దతు గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగుందన్నారు. పాఠశాలలు కేవలం చదువులపై కాకుండా ఆటల్లో ప్రోత్సాహం కలిగించేలా దృష్టి సారించాలని కోరారు. ఖేలో ఇండియాలో భాగంగా అండర్-17నే కాకుండా ఈ సారి అండర్-21 కాలేజీ గేమ్స్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల నిబద్దత పరంగా కొన్నిసార్లు బ్రెజీల్, మరి కొన్ని సార్లు అర్జెంటీనా జట్లు ఇష్టమని, కానీ భారత్‌కే తాను అతిపెద్ద అభిమానినని రాథోడ్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరో మూడు రోజుల్లో (జూన్ 14న) ఫిఫా సంగ్రామం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక భారత్ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ ఆవేదనతో ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇంటర్ కాంటినెంటల్ టోర్నీలో భాగంగా భారత్ ఆడిన అన్ని ఫుట్ బాల్ మ్యాచ్‌లకు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఆదివారం కెన్యాతో జరిగిన ఫైనల్లో భారత్ 2-0తో విజయం సాధించింది. -
రాయని డైరీ
దేశంలోని జాతీయ సమస్యల కన్నా, పార్టీలోని జాతీయ నాయకుల సంఖ్యే ఎక్కువగా ఉంది! అది ఈ దేశం చేసుకున్న అదృష్టం. ఒక్కో సమస్యను ఒక్కో నాయకుడు పంచుకున్నా, ఇంకా కొంతమంది నాయకులు సమస్యల కోసం మిగిలే ఉంటారు. ‘సమస్యలు తక్కువై, నాయకులు ఎక్కువైతే ఎలా?!’ అని మొన్నటి ఇండోర్ జాతీయ పార్టీ సమావేశంలో సీనియర్ లీడర్ ఒకాయన కంగారుపడ్డారు! నాకనిపించింది, ఐదేళ్లు పూర్తి కాబోతున్నా, ఆ కంగారు పడిన మనిషి పూర్తి స్థాయి జాతీయ నాయకుడిగా ఎదగలేదని. నాయకులు తగ్గిపోతే కంగారు పడాలి కానీ, సమస్యలు తగ్గిపోతే కంగారెందుకు? దేశాన్ని నడపడానికి కావలసినంత మంది నాయకులుంటే, దేశం నడవడానికి కావలసినన్ని సమస్యలు వాటంతటవే ఉత్పన్నమౌతాయి. ప్రజలకు ఇంతకన్నా భరోసా ఏం కావాలి! సమస్యలు లేవు అనుకుంటున్నప్పుడు సమస్యల్ని తెచ్చిపెట్టే నాయకులు వాళ్లకై వాళ్లే ఆవిర్భవిస్తుంటారు. వాళ్లకై వాళ్లే అవతరిస్తుంటారు. బీజేపీలో ఉన్న ఒక మంచి విషయమిది. మోదీజీని అడగరు. అమిత్‌షాకు చెప్పరు. సమస్యను పుష్పగుచ్ఛంలా తెచ్చి ఎవరూ చూడకుండా పార్టీ ఆఫీస్‌లో పెట్టేసి వెళ్లిపోతారు. యూపీ డిప్యూటీ సీఎం కొత్తగా ఓ గుచ్ఛాన్ని వదిలివెళ్లాడు. సీతమ్మవారిని టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నాడు ఆయన. కొత్త సమస్య! ‘‘శర్మగారూ ఏంటిది? సమస్య దేశానికి అవ్వాలి కానీ, పార్టీకి అవకూడదు’’ అన్నాను ఫోన్ చేసి. ‘‘ఏదో అనుకోకుండా అలా వచ్చేసింది కైలాశ్జీ’’ అన్నాడు! ‘‘శర్మగారూ.. మనమెప్పుడూ రాముడికే కదా కన్ఫైన్ అవుతాం. సీతమ్మవారి దగ్గరకు సడన్‌గా ఎందుకెళ్లారు మీరు?’’ అన్నాను. ‘‘లంక గురించి, రాముడి గురించి, పుష్పక విమానం గురించీ మాట్లాడుతుంటే సీతమ్మవారి మాట కూడా నోటికి వచ్చేసింది కైలాశ్జీ’’ అన్నాడు! ఆయన్తో మాట్లాడుతుంటే ఐ అండ్ బీ మినిస్టర్ ఫోన్ చేశాడు. ‘‘ఏంటి రాజ్యవర్థన్! ఏంటి సమస్య?’’ అన్నాను. ‘‘బాలీవుడ్‌కి, బాలీవుడ్ అని కాకుండా ఇంకేదైనా పేరు మార్చమని చెప్పారు కదా.. దాని గురించి మాట్లాడదామని..’’ అన్నాడు. ‘‘మాటలెందుకు రాజ్యవర్థన్. మార్చెయ్. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఈ ఉడ్‌ల దరిద్రం మనకెందుకు? క్రియేటివ్‌గా మంచి పేరు పెట్టు’’ అన్నాను. ‘‘అదే సార్.. సమస్య ’’ అన్నాడు! ‘‘అదే అంటే?’’ అన్నాను. ‘‘సమస్యే సార్.. సమస్య’’ అన్నాడు. ‘‘అర్థం కాలేదు రాజ్యవర్థన్’’ అన్నాను. ‘‘మనవాళ్లెవరికీ ఐడియాలు రావట్లేదు సార్. సమస్యల్నైతే క్రియేట్ చెయ్యగలం గానీ, సొల్యూషన్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం అని అడుగుతున్నారు సార్’’ అన్నాడు! మాధవ్ శింగరాజు, వ్యాసకర్త -
ఫిట్నెస్ చాలెంజ్: సైనా పేరెంట్స్‌పై ప్రశంసలు
హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తల్లిదండ్రులపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పిలుపునిచ్చిన ఫిట్నెస్ చాలెంజ్‌కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దిగ్గజ క్రీడాకారుల నుంచి సినీ తారలు, సామన్య ప్రజల అందరూ.. తమ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. సన్నిహితులకు సవాల్ విసురుతున్నారు. రాథోడ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన సైనా సైతం జిమ్ వర్కౌట్స్ వీడియోను షేర్ చేస్తూ.. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, క్రికెటర్ గౌతం గంభీర్‌లను చాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫిట్ నెస్ చాలెంజ్‌ను సైనా తల్లిదండ్రులు స్వీకరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సైనా తల్లి ఉషా నెహ్వాల్ ఏకంగా జిమ్‌లో పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ ..ఎంతో మంది యువతీ, యువకులకు స్పూర్తిగా నిలిచారు. సైనా తండ్రి సైతం జిమ్‌లో సైక్లింగ్ చేస్తూ ‘హమ్‌ఫిట్‌తో ఇండియా ఫిట్’ కార్యక్రమంలో భాగమయ్యాడు. వీరి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను సైనానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో సైనా తల్లితండ్రులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్పూర్తినికలిగిస్తున్నారని కొందరంటే.. ‘ఫిట్ ఫాదర్.. ఫిట్ మదర్.. ఫిట్ డాటర్.. ఫిట్ ఇండియా’ అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. -
సైనా పేరెంట్స్ ఫిట్నెస్ చాలెంజ్
-
ఫిట్నెస్ చాలెంజ్‌కు అనూహ్య స్పందన: రాథోడ్
తాను ప్రతిపాదించిన ఫిట్నెస్ చాలెంజ్‌కు అద్భుత స్పందన రావడం పట్ల కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఫిట్‌నెస్‌పై ఈ తరహా ప్రచారం అందరిలో ఆసక్తి రేపుతోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వీడియోలు పంపిస్తున్నారు’ అని రాథోడ్ అన్నారు. ‘మనందరి ఫిట్నెస్ దేశం ఫిట్నెస్’ అంటూ ఇటీవల తాను పుషప్స్ తీస్తున్న వీడియోను రాథోడ్ ట్విట్టర్లో పెట్టి... భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లి, బ్యాడ్మింటన్ స్టార్ సైనా, బాలీవుడ్ హీరో హృతిక్లకు సవాల్ విసిరారు. దీంతో వారంతా తమ కసరత్తుల వీడియోలను పోస్ట్ చేశారు. -
హృతిక్ ఫిట్నెస్ చాలెంజ్.. నెటిజన్లు సెటైర్లు
-
ఫిట్నెస్ చాలెంజ్.. హృతిక్‌కు చేదు అనుభవం
కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఫిట్నెస్ చాలెంజ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. రాజ్యవర్ధన్‌తో మొదలై విరాట్, హృతిక్ రోషన్, అనుష్క శర్మ, సింధు, సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించిన వారిలో ఉన్నారు. అయితే రాజ్యవర్థన్ సవాల్‌ను పూర్తిచేసిన హృతిక్ రోషన్ ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ‘ఇదెంతో గర్వకారణంగా ఉంది! నేను ప్రతిరోజూ ఆఫీస్‌కి ఇలాగే వెళ్తాను. కదలకుండా కార్లో కూర్చొని వెళ్లడం వేస్ట్. వాకింగ్, సైక్లింగ్, జాగింగ్ చేయడం ద్వారా అసలైన భారతదేశాన్ని చూడవచ్చు. ఫిట్‌గా ఉండండి’ అంటూ సైకిల్‌పై ఆఫీస్‌కు వెళ్తున్న ఫొటోలు, సెల్ఫీ వీడియోను హృతిక్ ట్విటర్లో పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అవడంతో.. హృతిక్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సైక్లింగ్ చేస్తూ సెల్ఫీ వీడియో షూట్ చేయడం బాధ్యతారాహిత్యం. సెల్ఫీల వల్లే రోజుకు ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయంటూ’ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా... ‘ఇది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే. ముంబై పోలీసులు ఇప్పుడు మీరేం చేయబోతున్నారంటూ మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హృతిక్ నువ్వు ఇలా బిజీ రోడ్డులో సైక్లింగ్ చేసే కంటే ఏదైనా గ్రౌండ్లో చేయాల్సిందంటూ’ సలహా కూడా ఇచ్చారు. ‘హెల్మెట్ ధరించు.. నువ్వే ఇలా చేస్తే మిగతా వాళ్ల సంగతేంటి? ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు’ అంటూ మరొకరు హితవు పలికారు. This is called violation of traffic rules. @MumbaiPolice what you are going to do now?@iHrithik you should have done it in open ground rather than on busy road. — DuttRisky (@duttrisky) May 23, 2018 irresponsible example to be shooting video while cycling, so many selfie deaths are a case in point @iHrithik — priyanka jain (@priyankajain1) May 23, 2018 -
పారదర్శకత పాటిస్తే...
న్యూఢిల్లీ: దేశంలో క్రీడా రంగ ప్రగతికి నిధులు ఇచ్చేందుకు కార్పొరేట్ రంగం సిద్ధంగానే ఉందని, వాటిని పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లు హామీ ఇవ్వాలని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. ‘నిధుల కోత గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. ఇది మా పరిధిలోనిదే. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇచ్చేందుకు సిద్ధం. కానీ... సమాఖ్యలు సొంతంగా నిలదొక్కుకోవాలన్నదే మా ఆలోచన. లీగ్‌ల ద్వారా రెజ్లింగ్, హాకీ, బ్యాడ్మింటన్ సమాఖ్యలు డబ్బు సమీకరిస్తున్నాయి. అయినా వీటికి కేంద్రం సాయం చేస్తోంది కదా?’ అని చెప్పుకొచ్చారు. ప్రతిపాదిత ‘జాతీయ క్రీడాభివృద్ధి నియమావళి’ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకొచ్చేదిగా ఉంటుందని మంత్రి వివరించారు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌ను అనుమతించడాన్ని కాలమే నిర్ణయిస్తుందని రాజ్యవర్ధన్ అన్నారు. కామన్వెల్త్ పోటీల్లో భారత క్రీడాకారులు ఎన్ని పతకాలు గెలవగలరన్న సంఖ్యను చెప్పేందుకు ఇష్టపడని మంత్రి... సన్నాహాలకు చక్కటి వసతులు సమకూర్చుతున్నామని, దేశ ప్రతినిధులుగా వారు క్రమశిక్షణతో కూడిన ఆటను ప్రదర్శించాలని ఆకాంక్షించారు. -
ఉర్రూతలూగిస్తోన్న క్రీడా గీతం.. వైరల్ వీడియో
న్యూ ఢిల్లీ: పాఠశాల క్రీడా పోటీల నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక గీతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంబించిన ‘ఖేలో ఇండియా’ ప్రచారంలో భాగంగా ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ జరుగనున్నాయి. జనవరి15న కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఆవిష్కరించిన క్రీడా గీతాన్ని గంటల వ్యవధిలోనే సుమారు 20కోట్ల మంది వీక్షించారు. అమితాబ్, సచిన్ టెండూల్కర్, పలువురు రాజకీయనేతలు సైతం ఈ పాటకు కితాబిచ్చారు. నిర్వాణ ఫిల్మ్స్ సంస్థ రూపొందించిన ఈ ప్రత్యేక గీతాన్ని ప్రముఖ సంగీతకారుడు లూయిస్ బ్యాంక్ స్వరపర్చారు. ఏమిటీ క్రీడా గీతం? : పాఠశాల స్థాయిలో ఆటలను ప్రోత్సహించానే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 8 వరకు ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ను నిర్వహించనుంది. 17 ఏళ్లలోపు బాలబాలికలకు అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ, ఖొఖో, షూటింగ్, వాలీబాల్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల ద్వారా వెయ్యి మంది క్రీడాకారులను ఎంపిక చేసి వరుసగా ఎనిమిది సంవత్సరాల పాటు ఐదు లక్షల స్కాలర్షిప్ను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ అందజేస్తుంది. -
ఉర్రూతలూగిస్తోన్న క్రీడా గీతం..
-
కేంద్ర క్రీడల మంత్రిని కలిసిన శాట్స్ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం కేంద్ర కీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను కలిసి సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణ ప్రతిపాదన పత్రాలు అందజేశారు. గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన నేషనల్ యూత్ ఫెస్టివల్– 2018 ముగింపు కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రిని కలిసిన వెంకటేశ్వర్ రెడ్డి వరంగల్ (అర్బన్), సరూర్‌నగర్ స్టేడియాలలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటుకు నిధులు మం జూరు చేయాలని కోరారు. ‘ఖేలో ఇండియా’ కింద ఉస్మానియా వర్సిటీలో క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించాలని కోరారు. -
‘పాకిస్తాన్‌ది ఉగ్రవిధానం’
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదం.. పాకిస్తాన్ దేశ విధానం అని చెప్పడానికి ఆదేశ మాజీ అధ్యక్షుడు ముషరాఫ్ వ్యాఖ్యలే నిదర్శనమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. లష్కేరే తోయిబా, హఫీజ్ సయీద్‌పై ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమని ఆయన అన్నారు. లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్‌పై ముషారఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ముషారఫ్.. పాకిస్తాన్‌లోని ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. లష్కరేతోయిబా, హఫీజ్ సయీద్‌కు తాను అభిమాననింటూ చెప్పుకున్నారు. అదే సమయంలో కశ్మీర్ వేర్పాటు వాదం, ఉగ్రవాదాలను సమర్థిస్తున్నట్లు ముషారఫ్ చెప్పుకోచ్చారు. ముషారఫ్ ఇంటర్వ్యూపై రాథోర్ ట్విటర్లో స్పందించారు. పాకిస్తాన్.. ఉగ్రవాదాన్ని దేశ విధానంగా అనుసరిస్తున్నట్లు అనిపస్తోందని రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ట్వీట్ చేశారు. Pervez Musharraf has openly endorsed terror as state policy, says @Ra_THORe https://t.co/X59vAmqwUj — Rajyavardhan Rathore (@Rathore_Fans) November 30, 2017 -
'క్రికెటర్ల సంగతి వాడా చూసుకుంటుంది'
న్యూఢిల్లీ:భారత క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ సంస్థ(వాడా) చూసుకుంటుందని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో క్రికెటర్లకు డోపింగ్ పరీక్ష నిర్వహిం చేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సుముఖంగా లేని నేపథ్యంలో ఆ వ్యవహారాన్ని వాడానే చూసుకుంటుందన్నారు. కాగా, క్రికెటర్లు ఓ ప్రైవేటు సంస్థతో డోపింగ్ పరీక్షలు చేయించుకునేందుకు అంగీకరించడం సంతోషంగా ఉందంటూ దేశంలోని అన్ని క్రీడాసంఘాలు నాడా పరీక్షలను ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 'క్రికెటర్లను డోపింగ్ పరిధిలోకి తీసుకొస్తారా లేదా అనేది వాడాకు వదిలేస్తున్నాం. వాడా డోపింగ్ నిబంధనలకు లోబడే ఐసీసీ నమోదైంది. క్రికెటర్లకు డోప్ పరీక్షలు చేయాలా..వద్దా అనేది వాడా నిర్ణయించాలి. డోపింగ్ జరిగినప్పుడు ఆటగాళ్లు, కోచ్‌లే కాదు అభిమానులపై ప్రభావం ఉంటుంది. అందుకే ప్రతి సంస్థలోనూ డోపింగ్ లేకుండా చూసుకోవాలి. క్రికెట్ దానికి మినహాయింపు కాదు' అని రాథోడ్ అన్నారు. -
ఎందుకలా చేశారు..?
గువాహటి : ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై దాడిని టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఖండించాడు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాడు. ఇటువంటి చర్యలతో దేశానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించాడు. ‘ఆసీస్ క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు విసరడం మంచిపని కాదు. ఇలాంటి పనులు దేశానికి అపకీర్తి తెచ్చిపెడతాయి. మనమంతా బాధ్యతాయుతంగా ఉండాల’ని అశ్విన్ ట్వీట్ చేశాడు. గువాహటిలో రెండో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తున్న ఆసీస్ క్రికెటర్ల బస్సుపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు రాయి విసిరారు. క్రికెట్ బంతి పరిమాణంలో ఉన్న రాయిని విసరడంతో బస్సు కుడివైపు అద్దం ధ్వంసమైంది. ఎవరికి గాయాలు అయినట్టు సమాచారం లేదు. ఈ ఘటనపై అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ క్షమాపణ చెప్పారు. తమ రాష్ట్ర ప్రజలు ఇటువంటి దుశ్చర్యలను సహించబోరని, దోషులను శిక్షిస్తామని అన్నారు. ఆసీస్ క్రికెటర్ల బస్సుపై దాడిని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కూడా ఖండించారు. భద్రత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. -
అదొక అద్భుతమైన నిర్ణయం: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కు అప్పజెప్పడాన్ని భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్వాగతించారు. రాజ్యవర్థన్ కు ఆ పదవి ఇవ్వడం ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఈ మేరకు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. 'ఒక టాప్ స్పోర్ట్స్ పర్సన్‌కు క్రీడల శాఖ దక్కడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది మోదీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమే కాదు.. గర్వించదగ్గ సమయం కూడా' అని రవిశాస్త్రి తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి బాధ్యతలు దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఘనతకెక్కారు. ఒక క్రీడాకారుడు ఈ శాఖను దక్కించుకోవడం ఇదే ప్రథమం. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో డబుల్ ట్రాప్ షూటింగ్లో వెండి పతకం సాధించారు. దశాబ్ధంపైగా షూటర్‌గా కొనసాగిన ఆయన పలు పతకాలు గెల్చుకున్నారు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లోనూ మెడల్స్ సాధించారు. 2005లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పదశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. క్రీడాకారుడైన రాజ్యవర్థన్‌కు సంబంధిత మంత్రిత్వ శాఖ అప్పగించడంతో దేశంలో క్రీడారంగానికి మంచి జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘ప్రాధాన్య శాఖ ఇచ్చారు.. థ్యాంక్స్’
న్యూఢిల్లీ: క్రీడాకారులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని స్పోర్ట్స్ ఫెడరేషన్లకు కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ విజ్ఞప్తి చేశారు. ఆటగాళ్లను అత్యంత ప్రముఖులుగా పరిగణించాలని సూచించారు. క్రీడల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై విశ్వాసం ఉంచి, ప్రాధాన్యత కలిగిన శాఖ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, కేంద్ర క్రీడల శాఖ మంత్రి బాధ్యతలు దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఘనతకెక్కారు. ఒక క్రీడాకారుడు ఈ శాఖను దక్కించుకోవడం ఇదే ప్రథమం. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో డబుల్ ట్రాప్ షూటింగ్లో వెండి పతకం సాధించారు. దశాబ్ధంపైగా షూటర్‌గా కొనసాగిన ఆయన పలు పతకాలు గెల్చుకున్నారు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లోనూ మెడల్స్ సాధించారు. 2005లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పదశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. క్రీడాకారుడైన రాజ్యవర్థన్‌కు సంబంధిత మంత్రిత్వ శాఖ అప్పగించడంతో దేశంలో క్రీడారంగానికి మంచి జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కట్టప్ప సీక్రెట్ బయటపడిందోచ్!
ఓ వాణిజ్య ప్రకటనలో ‘మరక మంచిదే’ అన్నట్లు... ఒక్కోసారి లీకులు సినిమాకు మంచి చేస్తున్నాయి. ‘బాహుబలి-2’ విజువల్ ఎఫెక్ట్స్ బృందంలోని ఓ వ్యక్తి (గ్రాఫిక్ డిజైనర్) 9 నిమిషాల యుద్ధ సన్నివేశాన్ని స్నేహితులకు వాట్సాప్‌లో పంపడం, అక్కణ్ణుంచి ఇంటర్నెట్కి... చివరకు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కేసుల వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ, లీకైన వీడియో క్లిప్‌లో క్లైమాక్స్ పోర్షన్ కొంత ఉన్నా, కథకు సంబంధించిన అసలు సస్పెన్స్ బయటపడకపోవడంతో ‘బాహుబలి-2’ చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. లీకైన వీడియో క్లిప్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. విజువల్ ఎఫెక్ట్స్ పూర్తై తర్వాత ఎలా ఉంటుందో? అనే ఆసక్తిని కలిగించింది. ఏమైనా ఈ చేదు అనుభవంతో సినిమా విడుదలయ్యే వరకూ చిన్న దృశ్యం కూడా బయటకు రాకుండా ఉండేలా దర్శక, నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దగ్గర సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం చేశారట. అయితే, ఇన్నాళ్లూ రాజమౌళి రహస్యంగా దాచిన ఓ విషయం ఇప్పుడు లీకైంది. ఇప్పుడు ప్రపంచమంతా అడుగుతున్న ప్రశ్న ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు?కు ఆన్సర్ నాకు తెలుసని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రకటించారు. ఇంతకీ, ఈ విషయాన్ని లీక్ చేసింది ఎవరో తెలుసా? సాక్షాత్తూ రాజమౌళియే. ‘అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ) ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి గారు మనందరిలానే ఉత్కంఠ ఆపుకోలేక రాజమౌళిని ఆ సస్పెన్స్ ముడి విప్పమని అడిగారట. ఆ వేడుకలో పాల్గొనేందుకు గోవా వెళ్ళిన రాజమౌళి, రహస్యంగా మంత్రిగారి చెవిలో అసలు సస్పెన్స్ ఊదారు. ‘‘ఈ ప్రభుత్వం రహస్యాలను ఎవరికీ చెప్పదని రాజమౌళికీ తెలుసు. ఆయన అందుకే ఆ గుట్టు నాతో విప్పారు’’ అని నవ్వుతూ రాథోడ్ అన్నారు. మంత్రి గారికి కాబట్టి, రాజమౌళి ఆ చిక్కుముడి విప్పారు కానీ, మామూలు ప్రేక్షకులందరూ మాత్రం అదేంటో తెలుసుకోవడానికి వచ్చే ఏప్రిల్ 28 దాకా ఆగాల్సిందే. -
సినీ పరిశ్రమలో ఆ నగదు లేనేలేదు!
పనాజి : సినీ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ రంగంలో బ్లాక్‌మనీ లేదంటే ఒకింత ఆశ్చర్యమే. ఈ పరిశ్రమలో బ్లాక్‌మనీ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుంది. అలాంటిది సినీ పరిశ్రమలో అసలు బ్లాక్మనీనే లేదంట. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో సినీ పరిశ్రమలోకి బ్లాక్‌మనీని చొప్పించారంటూ వస్తున్న నెగిటివ్ ప్రచారానికి తెరవేయాలని ఆయన కోరారు. పెద్ద నోట్ల రద్దుతో సినీ పరిశ్రమ లాభపడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. బ్లాక్‌మనీని సినీ పరిశ్రమలోకి చొప్పిస్తారని మనం వింటూ వస్తున్నాం..కానీ ఈ స్టేజ్‌లో బ్లాక్‌మనీ ఫిల్మ్ ఇంటస్ట్రీలో వస్తుందని తాను భావించడం లేదని రాథోర్ తెలిపారు. ఫిల్మ్ ఫండింగ్ పారదర్శకత ఉండటం వల్ల మంచి సినిమాలకు మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఫ్మిల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ''సినిమాను రూపొందించడం ఓ టీమ్ వర్క్. బాయ్ నుంచి మొదలుకుంటే ఫిల్మ్ స్టార్ వరకు అందరు పనిచేస్తేనే సినిమా తెరకెక్కుతుంది. ఒకవేళ వారికి చెల్లించే జీతాన్ని డైరెక్ట్‌గా వారి అకౌంట్లలోకి వేస్తే, వారు సరియైన జీతాలు పొందుతారు. పాత నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇండస్ట్రికి మద్దతు లభిస్తుంది'' అని చెప్పారు. -
కేంద్ర మంత్రి దృష్టికి సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత అంశం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన విషయాన్ని జర్నలిస్టులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను బుధవారం జర్నలిస్టులు కలిసి ఈ అంశాన్ని వివరించారు. ఏపీ ప్రభుత్వం ఎంఎస్‌వోలను బెదిరించి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిందని జర్నలిస్టులు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి స్పందిస్తూ ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. -
'జైట్లీనేకాదు ఆయన కుటుంబాన్నీ తిట్టారు'
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఇంతకుముందే విచారణ జరిగిందని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తెలిపారు. ఎటువంటి అక్రమాలు జరగలేదని విచారణలో తేలిందని చెప్పారు. తన ముఖ్యకార్యదర్శిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా అసభ్య పదజాలంతో అరవింద్ కేజ్రీవాల్ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. అవినీతిపరుడైన అధికారిని దగ్గర పెట్టుకుని అవినీతిరహిత పాలన అందిస్తామని కేజ్రీవాల్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపైనే కాకుండా ఆయన కుటుంబంపైనా అసభ్య పదజాలంతో ఢిల్లీ సీఎం విమర్శలు చేశారని రాథోడ్ ఆరోపించారు. డీడీసీఏ ఆర్థిక అవకతవకల వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కేజ్రీవాల్, మరో ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. -
ఏ క్షణంలోనైనా దావూద్ ఫినిష్
-
ఏ క్షణంలోనైనా దావూద్ ఫినిష్
- భారత్ తన శత్రువుల పట్ల నిర్లక్ష్యంగా ఉండదు - కోవర్ట్ కాదు.. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా మాఫియా డాన్‌ను పనిపడతాం - కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ: మాఫియా డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను నిర్వీర్యం చేసేందుకు కోవర్ట్ ఆపరేషన్ లేదా స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. కోవర్ట్ ఆపరేషన్ నిర్వహిస్తే దానికి సంబంధించిన వివరాలను ప్రజలకు వెల్లడించడం కుదరదని, అందుకే ప్రత్యేక ఆపరేషన్ ద్వారా భారత ప్రభుత్వం దావూద్ పనిపడుతుందని , ఆ పని ఏ క్షణమైన జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 'సామ, దాన, బేధ, దండోపాయాల సంగతి తెలుసుకదా.. దావూద్ విషయంలో వాటిలో కొన్నింటిని ఇప్పటికే ప్రయోగించాం. మిగిలినవాటిని త్వరలోనే ప్రయోగిస్తాం. ఆ వార్త మీకూ అందుతుంది' అని రాథోడ్ అన్నారు. ఒక జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నప్పటికీ దావూద్‌ను పట్టుకునే విషయంలో ముందడుగు వేయకపోవడమేమిటన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'భారత్ తన శత్రువుల విషయంలో ఎన్నడూ నిర్లక్ష్యం వహించదు. ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ అతని కదలికలపై మాకు పూర్తి సమాచారం ఉంది. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి ఏదో ఒక సందర్భంలో డీ పని ముగించేస్తాం' అని సమాధానమిచ్చారు. కాగా, గతంలోనూ ఇదే మాదిరిగా దావూద్‌ను అంతం చేసేందుకు ఆపరేషన్లు నిర్వహించామని వెల్లడించిన పలువురు విశ్రాంత అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ తరహా వ్యాఖ్యలు.. ఎలాంటి విచారణ చేపట్టకుండా భారత్ తన పౌరులను తానే చంపుకొంటుందనే పాక్ విమర్శలకు బలం చేకూర్చుతాయని దౌత్యవర్గాలు సైతం అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యవర్ధన్ తాజా వ్యాఖ్యలపై ఎలాంటి దుమారం చెలరేగుతుందో చూడాలి! -
నన్ను పిచ్చోడన్నారు!
న్యూఢిల్లీ: గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ పెదవి విప్పాడు. ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన తనను.. అంతకుముందు ప్రజలు పిచ్చోడు అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలను తాజాగా నెమరవేసుకున్నాడు.'నా మొదటి కల ఒలింపిక్స్.'నేను ఆ మెగా ఈవెంట్ లో పాల్గొంటానంటే ప్రజలు పిచ్చోడన్నారు. అటు తరువాత ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి చూపించా' అని రాథోడ్ తెలిపాడు. గురువారం రాత్రి టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు హాజరైన రాథోడ్.. ఆ మరిచపోలేని అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తాను ఒలింపిక్స్ లో పతకం సాధించి దేశం యొక్క పేరును నిలబెట్టడమే కాకుండా అనంతరం కేంద్ర మంత్రిని కూడా అయిన విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.2004 లో ఏథేన్స్ లో జరిగిన ఒలింపిక్స్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. -
‘బిగ్‌బాస్’కు పెద్దల హెచ్చరిక!
ఒకవైపు కలర్స్‌లో ‘బిగ్‌బాస్-8’ కొనసాగుతుండగా, మరోవైపు దీని గురించి రాజ్యసభలో వేడివేడి చర్చ జరిగింది. ఈ కార్యక్రమం చాలా అసభ్యకరంగా ఉంటోందని కొంతమంది ఎంపీలు కేంద్ర ప్రసారమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. ‘కెమెరాలు పెట్టి అమ్మాయిలు స్నానం చేయడాన్ని చూపుతున్న ఇలాంటి కార్యక్రమాల ప్రసారాన్ని ఎందుకు ఆపడం లేదు?’ అని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసభ్యతతో సాగే ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ఆపివేయాలని సభ్యులు ఆ శాఖమంత్రి రాజవర్ధన్‌సింగ్ రాథోడ్‌ను కోరారు. ఈ సందర్భంగా మంత్రి సమాధానం ఇస్తూ... దేశంలో భావస్వేచ్ఛ ఉందనీ, ఎవరైనా పరిధి దాటినట్టుగా అనిపిస్తే వారిని నియంత్రిస్తామనీ అన్నారు. బిగ్‌బాస్ విషయంలోనే కాకుండా టెలివిజన్ చానళ్లలో ప్రసారం అయ్యే వివిధ రియాలిటీ షోల పోకడలు సమాచార శాఖ దృష్టిలోనే ఉన్నాయని కూడా మంత్రి తెలిపారు. ఈ విధంగా ఆయన రియాలిటీషోల నిర్వాహకులకు ఒక హెచ్చరిక జారీ చేశారు. -
ఒకే వేదికపై సూపర్స్టార్లు కలిసేవేళ!
న్యూఢిల్లీ: భారతీయ సినిమా పరిశ్రమలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఈ నెల 20న గోవాలో జరిగే 45వ భారత్ అంతర్జాతీయ సినిమా పండుగ(ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2014)లో పాల్గొంటారు. అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. చలన చిత్ర ప్రముఖులకు ఇచ్చే ప్రత్యేక సెంటెనరీ అవార్డు ఈ ఏడాది రజనీకాంత్‌కు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ** -
మంత్రి పదవిపై 'గురి' కుదిరింది!
కల్నల్ రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. షూటర్ గా క్రీడాజీవితం ప్రారంభించిన 44 ఏళ్ల రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. భారత సైన్యాధికారి పదవికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి 2013లో బీజేపీ చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో రాజస్థాన్ లోని జైపూర్ రూరల్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొదటిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించడం విశేషం. బికనీర్ లోని రాజ్‌ఫుత్ వంశానికి చెందిన రాజ్యవర్థన్ 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ లో డబుల్ ట్రాప్ విభాగంలో వ్యక్తిగతంగా రజత పకతం గెలవడం ద్వారా పాపులర్ అయ్యారు. అగ్రశ్రేణి షూటర్ గా ఎదిగిన రాజ్యవర్థన్- కామన్వెల్త్, ఆసియా క్రీడలతో ప్రధాన టోర్నమెంట్లలో పతకాలు సాధించారు. పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు అందుకున్నారు. క్రీడాకారునిగా దేశానికి ప్రాతినిథ్యం వహించిన రాజ్యవర్థన్- ఇప్పుడు దేశానికి మంత్రి అయ్యారు. -
ముగ్గురే గెలిచారు
ఐదుగురు మాజీ క్రీడాకారులకు నిరాశ అజహర్, కైఫ్లకూ తప్పని ఓటమి న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో క్రీడా ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఏథెన్స్ ఒలింపిక్ మెడలిస్ట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించగా... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన రాథోడ్ జైపూర్(రూరల్) నుంచి 3.32 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ కురువృద్ఢుడు సీపీ జోషిపై విజయ దుందుభి మోగించారు. అర్మీలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన రాథోడ్ గత సెప్టెంబర్‌లో బీజేపీలో చేరి తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వంలో రాజ్యవర్ధన్‌కు క్రీడల మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ‘జైపూర్(రూరల్) నియోజకవర్గానికి సేవలందించడమే నా తొలి ప్రాధాన్యం. మా కెప్టెన్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏ బాధ్యతనైనా స్వీకరించేందుకు నేను సిద్ధం’ అని రాథోడ్ ప్రకటించారు. ఇక మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫూల్పూర్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యాడు. -
రాథోడ్ కుమారుడికి కాంస్యం
న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేత, వెటరన్ షూటర్ రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ కుమారుడు మానవాదిత్య ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్‌లో మెరిశాడు. కజకిస్థాన్‌లోని అల్మతిలో జరుగుతున్న ఈ పోటీల్లో మానవాదిత్య జూనియర్ ట్రాప్ ఈవెంట్లో కాంస్య పతకం గెలుపొందాడు. సీనియర్ ట్రాప్ టీమ్ ఈవెంట్లో మానవ్‌జిత్ (124 పాయింట్లు), జోరవర్ సింగ్ సంధు (121), మన్షీర్ సింగ్ (120)లతో కూడిన జట్టు పసిడి పతకం సాధించింది. 375 పాయింట్లకు గాను ఈ జట్టు 365 పాయింట్లు సాధించింది. సీనియర్ ట్రాప్ వ్యక్తిగత విభాగంలోనూ మానవ్‌జిత్ సింగ్ సంధు కాంస్య పతకంతో సత్తాచాటాడు. ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, పలు రజతాలతో పాటు మూడు కాంస్య పతకాలు గెలుపొందింది. మహిళల సీనియర్ ట్రాప్ టీమ్ విభాగంలో సీమా తోమర్, షాగన్ చౌదరి, శ్రేయసి సింగ్ రజతం సాధించింది. -
బిజెపిలో చేరిన ఒలంపిక్ హీరో