
జైపూర్: రాజస్థాన్‌లో పెరుగుతున్న నేరాలపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు కనిపించడం లేదా అని శనివారం బీజేపీ ప్రశ్నించింది. అశోక్ గెహ్లాత్ డబ్బులు సంపాదించడంలో బిజీగా ఉన్నారంటూ తీవ్ర విమర్షలు చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ప్రతినిధులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, నూపూర్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
అత్యారాలు, ఇతర నేరాలు జరగడం ‘‘కాంగ్రెస్ సంస్కృతి’’ పర్యాపదాలుగా మారాయని దుయ్యబట్టారు. దేశంలో కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బందుల పడుతుంటే.. రాజస్థాన్‌లో మహిళలు గుండాలకు భయపడాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనలపై రాజస్థాన్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందంటూ విమర్షలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment