rajasthan
-
హత్య కేసులో నలుగురికి జైలు.. ఏడాదిన్నరకు తిరిగొచ్చిన 'మృతురాలు'
భోపాల్: చనిపోయిందని భావించి అంత్యక్రియలు పూర్తి చేశాక ఓ మహిళ సజీవంగా తిరిగిరావడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. రాజస్తాన్ (Rajasthan) వాసికి తనను అమ్మేశారని, ఏడాదిన్నరపాటు అక్కడే ఉండి, చివరికి తప్పించుకుని వచ్చానని చెబుతోంది. అయితే, ఆమెను హత్య చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వ్యక్తులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. పలు ట్విస్టులున్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జల్లాలో చోటుచేసుకుంది. లలితా బాయి అనే మహిళకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అయితే, షారుఖ్ అనే వ్యక్తితో జిల్లాలోని (Mandsaur district) భాన్‌పుర పట్టణానికి వెళ్లిపోయింది. అక్కడ ఇద్దరూ రెండు రోజులున్నారు. లలితా బాయిని తీసుకెళ్లిన షారుఖ్.. రాజస్తాన్‌కు చెందిన షారుఖ్ అనే మరో వ్యక్తికి ఆమెను రూ.5 లక్షలకు అమ్మేశాడు. షారుఖ్ వెంట రాజస్తాన్‌లోని కోటా వెళ్లిన లలితా బాయి అక్కడ దాదాపు ఏడాదిన్నరపాటు గడిపింది. చివరికి తప్పించుకుని ఇటీవల సొంతూరులోని తండ్రి రమేశ్ నానురాం దగ్గరికి చేరుకుంది. ఆమె సజీవంగా రావడంతో ఆశ్చర్యపోయిన తండ్రి వెంటనే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసులు ఆమె వద్ద ఉన్న ఆధార్ కార్డును, ఓటర్‌ఐడీని పరిశీలించి ఆమె చెప్పింది నిజమేనని తేల్చారు. కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. లలితా బాయి సజీవంగానే ఉన్నట్లు ధ్రువీకరించుకున్నారు.అయితే, లలితా బాయి కనిపించకపోవడంతో వెదుకుతున్న కుటుంబ సభ్యులకు గ్రామ పరిసరాల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఛిద్రమైన స్థితిలో కనిపించింది. చేతిపై పచ్చబొట్టు, కాలికి ఉన్న నల్లదారం వంటి ఆధారాలను బట్టి లలితా బాయిగా భావించి, అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆమెను హత్య చేసిన ఆరోపణలపై గ్రామానికి చెందిన ఇమ్రాన్, షారుఖ్, సోను, ఎజాజ్ అనే వారిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.చదవండి: భర్తను వదిలేస్తే పోయేది కదా.. ఎందుకలా చేసింది! -
పట్టాలపై ఎస్‌యూవీని ఈడ్చుకెళ్లిన రైలు
సూరత్‌గఢ్: రాజస్థాన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. సూరత్‌గఢ్ థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలోని ఒక లెవెల్ క్రాసింగ్‌పై కేంద్ర పోలీసు బలగాలకు చెందిన ఎస్‌యూవీని ఒక రైలు బలంగా ఢీకొంది(Rajasthan Hits SUV). ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో ఎస్యూవీ కారులో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్)నకు చెందిన ముగ్గురు జవానులు ఉన్నారు. ఈ కారు పట్టాలపైకి చేరుకోగానే రైలు బలంగా ఢీకొని కొంత దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. దీనికి కారణమేమిటన్నదీ ఇంకా వెల్లడికాలేదు. అయితే సీసీటీవీ ఫుటేజీ(CCTV footage)లో ఉన్న దృశ్యాన్ని చూస్తే ఈ పట్టాల మీదుగా రైళ్ల రాకపోకలు సాగించే సమయంలో అటు రోడ్డు మీదుగా వచ్చే వాహనాలను నిలువరించేందుకు ఎటువంటి గేటు లేదు. 📍Rajasthan | #Watch: An SUV of a central police force was rammed by a train at a level crossing near Suratgarh Super Thermal Power Plant in Rajasthan.CCTV footage of the accident has gone viral on social media.Local reports said there were three personnel of the Central… pic.twitter.com/Zw7GiJbd51— NDTV (@ndtv) March 22, 2025వీడియోను పరిశీలనగా చూస్తే ఎస్‌యూవీని నడుపుతున్న డ్రైవర్‌కు అటుగా రైలు వస్తున్న సంగతి తెలియలేదు. ప్రమాదాన్ని గుర్తించిన ఒక సీఐఎస్ఎఫ్ జవాను కారు నుంచి బయటకు దూకి పారిపోయారు. ఇంతలో రైలు ఆ ఎస్‌యూవీని ఢీకొంది. కారులోని ఇద్దరు జవానులు బయటపడేంతలో ఆ రైలు వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆన్లైన్ గేమింగ్‌కు రూ. 3.26 కోట్ల ప్రభుత్వ సొమ్ము.. పంచాయతీ అధికారి అరెస్టు -
Rajasthan: కారుపై డంపర్ బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
బికనీర్: రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓవర్ బ్రిడ్జిపై వెళుతున్న కారుపై డంపర్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్నవారంతా పెళ్లికి వెళ్లి వస్తుండగా, ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన బుధవారం అర్థరాత్రి దాటాక దేశ్నోక్ ఓవర్‌బ్రిడ్జిపై చోటుచేసుకుంది. అత్యంత వేగంగా వెళుతున్న ఒక డంపర్ ఉన్నట్టుండి నియంత్రణ(Control) కోల్పోయి, పక్కనే ఉన్న కారుపై బోల్తా పడింది. భారీగా ఉన్న డంపర్ పడటంతో కారు నుజ్జునుజ్జయిపోయింది. ఈ సమయంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం దరిమిలా ఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఓవర్ బ్రిడ్జిపై కారు, డంపర్ ఒక దిశలో వెళుతున్నాయి. డంపర్ ఒక్కసారిగా కారుపై తిరగబడగానే కారులో ఉన్నవారికి తప్పించుకునే మార్గం లేకపోయింది. ప్రమాద ఘటన గురించి తెలియగానే దేశ్నాక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో జేసీబీని వినియోగించి డంపర్‌ను రోడ్డుకు ఒక పక్కగా తీసుకువచ్చారు. మృతులలో ఒక మహిళతో పాటు ఆరుగురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాలో హిందువుల దాడులపై అమెరికా నిఘా -
బట్టమేక.. కష్టాల కేక
పొడవైన తెల్లటి మెడ.. దాని చుట్టూ తెలుపు–నలుపు ఈకల హారం.. బంగారు/గోధుమ వర్ణపు వీపు.. తలపై నల్లని టోపీతో ఇట్టే ఆకర్షించే రూపం బట్టమేక పక్షుల సొంతం. విమానం మాదిరిగా నేలపై పరుగులు తీసి గాల్లోకి లేచి.. స్థిమితంగా.. లయబద్ధంగా విశాలమైన రెక్కలు కదిలిస్తూ గగన విహారం చేయడం వీటి ప్రత్యేకత.సాక్షి, అమరావతి: అరుదైన బట్టమేక పక్షులు (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) మన దేశంలో అంతరించిపోయే స్థితికి చేరాయి. కొన్నేళ్లుగా చాలాచోట్ల వీటి జాడ కనిపించడం లేదు. 2008లో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 300 బట్టమేక పక్షులు ఉండగా.. ప్రస్తుతం వాటిసంఖ్య దేశవ్యాప్తంగా 150కి పడిపోయినట్టు తేలింది. వాటిలోనూ ఎక్కువ పక్షులు రాజస్థాన్‌లోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20కిపైగా బట్టమేక పక్షి జాతులు ఉండగా.. మన దేశంలో 4 జాతులున్నాయి. వాటిలో మన రాష్ట్రంలో కనిపించేవి ఇంకా అరుదైన జాతి పక్షులు.మీటరు పొడవు.. 15 కిలోలకు పైగా బరువుబట్టమేక పక్షుల్లో అత్యంత బలిష్టమైనవి మన ప్రాంతంలోనే ఉండేవి. ఈ పక్షి మీటరు పొడవు, 15 నుండి 20 కిలోల బరువు, పొడవాటి మెడ కలిగి ఉంటుంది. వీటిసంతతి చాలా అరుదుగా వృద్ధి చెందుతూ కేవలం ఏడాదికి ఒక గుడ్డు మాత్రమే పెట్టి దట్టమైన పొదల్లో 27 రోజులపాటు పొదుగుతుంది. దీని జీవిత చక్రం సుమారు 12 ఏళ్లు. ఒక్కో ఆడ పక్షి జీవిత కాలంలో కేవలం ఐదారు గుడ్లు మాత్రమే పెడతాయి. ఏవి దొరికినా తిని కడుపు నింపుకోవడం వీటి ప్రత్యేకత. ధాన్యం గింజలు, పంటల కోత తర్వాత మిగిలిన మోళ్లు, వేళ్లు, పొలాల్లోని మిడతలు, పురుగులు, జెర్రులు, బల్లులు, తొండలు వంటివి వీటి ఆహారం. ఎగిరే పక్షుల్లో రెండవ అతి భారీ పక్షులుగా గుర్తింపు పొందినా.. నివాసానికి అనుకూల వాతావరణం లేక అంతరించిపోతున్నాయి.సంరక్షణ చర్యలున్నా.. ప్రయోజనం సున్నామన దేశంలో కనిపించే అత్యంత అరుదైన బట్టమేక పక్షి జాతుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం కలగడం లేదు. వీటికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాల్లోనూ వాటి జాడ అరుదుగా మాత్రమే కనిపిస్తోంది. గత ఏడాది కర్ణాటకలోని బళ్లారి సమీపాన సిరిగుప్పలో రెండు, మహారాష్ట్ర లోని బీదర్‌లో ఒకటి కనిపించినట్టు అటవీ శాఖ నిర్ధారించింది. ఆ తర్వాత వీటి జాడ ఎక్కడా కానరాలేదు. మన రాష్ట్రంలోనూ వీటి కోసం నంద్యాల జిల్లా నందికొట్కూరు సమీపంలోని రోళ్లపాడులో 600 హెక్టార్లలో బట్టమేక పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా అక్కడ కూడా ఈ పక్షులు కనిపించడంలేదు. వేటగాళ్ల ఉచ్చులకు బలైపోవడం, ఆవాసాలు తగ్గిపోవడం, ఎగిరే సమయంలో గాలి మరలు, విద్యుత్ లైన్లకు తగిలి మృత్యువాత పడటం, వాహనాల రణగొణ ధ్వనులే ఇవి అంతరించిపోవడానికి ప్రధాన కారణాలని వన్యప్రాణుల నిపుణులు చెబుతున్నారు.గడ్డి భూములు తగ్గిపోవడంతో..|పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో గడ్డి భూముల పాత్ర కీలకం. బట్టమేకల పక్షుల ఉనికి పర్యావరణానికి మేలు చేసే గడ్డి భూములపైనే ఆధారపడి ఉంది. విశాలమైన గడ్డి మైదానాలే వాటి ఆవాసాలు. అందుకే బట్ట మేక పక్షులను గడ్డి భూముల జీవనాడిగా చెబుతారు. ఈ భూములు పశువులకు మేత అందించడంతోపాటు పశువులపై ఆధారపడి జీవించే జాతుల మనుగడకు ప్రధానమైనవి. వాతావరణంలో ప్రాణవాయువును పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. తద్వారా పర్యావరణం, జీవ వైవిధ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహానాన్ని గడ్డి భూములు క్రమబద్ధీకరిస్తాయి. అలాంటి గడ్డి భూములు తగ్గిపోతుండడం బట్టమేక పక్షులు అంతరించిపోతుండటానికి ప్రధాన కారణమైంది. మన దేశంలో 2005 నుంచి 35 శాతం మేర గడ్డి భూములు తగ్గిపోయినట్టు అంచనా. వ్యవసాయ విస్తరణ, పశువుల మేత ఎక్కువవడం, భూముల నిర్వహణ సరిగా లేకపోవడంతో జీవ వైవిధ్యం కోల్పోయి గడ్డి భూములు క్షీణిస్తున్నాయి. గతంలోని గడ్డి భూములు ప్రస్తుతం బంజరు భూములుగా మారిపోయాయి. ఫలితంగా ఆవాసాలు లేక బట్టమేక పక్షులు అంతరించిపోతున్నాయి.కృత్రిమ గర్భధారణపైనే ఆశలుబట్టమేక పక్షుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ పక్షులను మళ్లీ పునరుద్ధరించే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికోసం సురక్షితమైన గడ్డి మైదానాలను సృష్టించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. కృత్రిమ గర్భధారణ ద్వారా బట్టమేక పక్షి పిల్లలను పుట్టించి.. గడ్డి భూముల్లో వదలాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్ల క్రితం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని జాతీయ పరిరక్షణ పెంపక కేంద్రం (నేషనల్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్) కృత్రిమ గర్భధారణ ద్వారా బట్టమేక పక్షుల్ని పునరుద్ధరించింది. వాటిని గడ్డి మైదానాల్లో వదిలి సంరక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంతమేరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాలి. -
ప్యాలెస్‌లో ప్రయాణం రాజస్థాన్ విహారం
ప్యాలెస్ ఆన్ వీల్స్‌లో వారం రోజుల ప్రయాణం. ఇది ప్రయాణం మాత్రమే కాదు... ఒక అనుభూతి. రాజస్థాన్ కోటలను చూడాలి... థార్ ఎడారిలో విహరించాలి. రాజపుత్రులు మెచ్చిన జానపద కళల ప్రదర్శనలను ఆస్వాదించాలి.ఇవన్నీ మామూలుగా కాదు... సకల మర్యాదలతో రాజసంగా ఉండాలి.పర్యటన ఆద్యంతం కాలు కింద పెట్టకుండా సౌకర్యంగా ఉండాలి. రాజస్థాన్ టూరిజం... సామాన్యులకు రాజలాంఛనాలను అందిస్తోంది. ఇందుకోసం ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ పేరుతో ఒక రైలునే సిద్ధం చేసింది. ఇది టూర్ మాత్రమే కాదు... ఇది ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్.ఇంకెందుకాలస్యం... ట్రైన్ నంబర్ 123456... ప్లాట్ మీదకు వస్తోంది... లగేజ్‌తో సిద్ధంగా ఉండండి.రాజస్థాన్ పర్యాటకం రాజసంగా ఉంటుంది. సాధారణ ప్యాకేజ్‌లు క్లస్టర్లుగా కొన్ని ప్రదేశాలనే కవర్ చేస్తుంటాయి. పింక్‌సిటీ, బ్లూ సిటీ, గోల్డెన్ సిటీ, లేక్ సిటీలన్నింటినీ కవర్ చేయాలంటే ప్యాలెస్ ఆన్ వీల్స్ సౌకర్యంగా ఉంటుంది. 7 రాత్రులు 8 రోజుల ప్యాకేజ్‌లో రైలు న్యూఢిల్లీ సఫ్దర్ గంజ్ స్టేషన్లో మొదటి రోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరుతుంది. 8 రోజు ఉదయం ఏడున్నరకు అదే స్టేషన్లో దించుతుంది.ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తయ్యే ఈ ప్యాకేజ్‌లో జయ్‌పూర్, సవాయ్ మాధోపూర్, చిత్తోర్ఘర్, ఉదయ్‌పూర్, జై సల్మీర్, జో«ద్‌పూర్, భరత్పూర్, ఆగ్రాలు కవర్ అవుతాయి. ఈ పర్యాటక రైలు 1982, జనవరి 26 నుంచి నడుస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో టూరిజమ్ ప్రమోషన్ కోసం ఇండియన్ రైల్వేస్– రాజస్థాన్ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ టూర్ విదేశీయులే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు మనవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పర్యటిస్తున్నారు.తొలిరోజు: ఢిల్లీ టూ జయ్పూర్పర్యాటకులకు రాజపుత్రుల సంప్రదాయ రాచమర్యాదలందిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు రైల్వే స్టేషన్‌కి చేరగానే రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతారు. పూలమాల వేసి, బొట్టు పెట్టి, గంధం రాస్తారు. షెహనాయ్ రాగం, కచ్చీఘోదీ నాట్యం, ఏనుగు అంబారీల మధ్య రిఫ్రెష్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింకులు, బార్) తో వెల్కమ్ చెబుతారు. పర్యాటకులు ఎవరికి కేటాయించిన గదిలోకి వాళ్లు వెళ్లిన తర్వాత ఆరున్నరకు రైలు ఢిల్లీ స్టేషన్ నుంచి పింక్‌సిటీ జయ్‌పూర్‌కు బయలుదేరుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు రైల్లో విందు భోజనం ఇస్తారు.రెండవ రోజు: జయ్‌పూర్ టూ సవాయ్ మాధోపూర్అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు ట్రైన్ జయ్‌పూర్‌కి చేరుతుంది. పర్యాటకులు నిద్రలేచి రిఫ్రెష్ అయిన తర్వాత ఏడు గంటలకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ఎనిమిది గంటలకు రైలు దిగి (లగేజ్ రైల్లోనే ఉంటుంది) సైట్ సీయింగ్ కోసం ఏర్పాటు చేసిన వాహనాల్లోకి మారాలి. నగరంలో ఆల్బర్ట్ హాల్, హవామహల్, సిటీ ప్యాలెస్, జంతర్‌మంతర్ (ఖగోళ పరిశోధనాలయం)ని చూడడం. మధ్యాహ్నం లోహగర్ ఫోర్ట్‌లోని రిసార్ట్‌కు తీసుకెళ్తారు. లంచ్ అక్కడే. ఆ తర్వాత సూర్యాస్తమయంలోపు అమేర్ ఫోర్ట్ విజిట్, షాపింగ్ పూర్తి చేసుకుని ఆరు గంటలకు ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. ఏడు గంటల తర్వాత రాజస్థాన్ సంప్రదాయ వంటకాలతో డిన్నర్. ప్రయాణం సవాయ్ మాధోపూర్‌కు సాగుతుంది.మూడవ రోజు: మాధోపూర్ టూ చిత్తోర్ఘర్తెల్లవారు జామున ఐదు గంటల లోపు సవాయ్ మాధోపూర్ చేరుతుంది. రిఫ్రెష్ అయి ఆరు గంటలకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్క్, రణతంబోర్ ఫోర్ట్ విజిట్‌కి వెళ్లాలి. నేషనల్ పార్క్ పర్యటన పూర్తి చేసుకుని పదింటికి ట్రైన్ ఎక్కాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. రైలు చిత్తోర్ఘర్ వైపు సాగిపోతుంది. లంచ్ రైల్లోనే. సాయంత్రం నాలుగు గంటలకు చిత్తోర్ఘర్ చేరుతుంది. రైలు దిగి సైట్ సీయింగ్‌కి వెళ్లాలి. ఆరు గంటలకు కోట లోపల టీ తాగి, లైట్ అండ్ సౌండ్ షో ను ఆస్వాదించి ఏడున్నరకు రైలెక్కాలి. ఎనిమిది గంటలకు రైల్లోనే డిన్నర్.నాలుగవ రోజు: చిత్తోర్ఘర్ టూ జై సల్మీర్ వయా ఉదయ్పూర్రెండు గంటలకు చిత్తోర్ఘర్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం ఏడున్నరకు బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిదిన్నరకు లేక్‌సిటీ ఉదయ్‌పూర్ చేరుతుంది. రైలు దిగి తొమ్మిదింటికి వాహనంలోకి మారి సైట్‌సీయింగ్, షాపింగ్ చేసుకోవాలి. మధ్యాహ్నం ఒకటిన్నరకు బోట్ రైడ్, ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం. మూడు గంటలకు తిరిగి ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగు గంటలకు జై సల్మీర్‌కు ప్రయాణం. రాత్రి భోజనం రైల్లోనే ఎనిమిది గంటలకు.ఐదవ రోజు: జై సల్మీర్ టూ జోద్పూర్రైలు ఉదయం తొమ్మిదిన్నరకు జై సల్మీర్కి చేరుతుంది. రైలు దిగి గడిసిసార్ సరస్సు. జై సల్మీర్ కోట, నగరంలోని హవేలీలు చూసుకుని షాపింగ్ చేసుకుని తిరిగి రైలెక్కాలి. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత నాలుగు గంటలకు రైలు దిగి ఎడారిలో విహారం, క్యామెల్ రైడ్ ఆస్వాదించాలి. రాజస్థాన్ సంప్రదాయ జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాల వినోదం, రాత్రి భోజనం కూడా అక్కడే చేసుకుని రాత్రి పది గంటలకు రైలెక్కాలి. పన్నెండు గంటలలోపు రైలు జై సల్మీర్ నుంచి బ్లూ సిటీ జో«ద్‌పూర్‌కు బయలుదేరుతుంది.ఆరవ రోజు: జో«ద్‌పూర్ టూ భరత్పూర్రైలు ఉదయం ఏడు గంటలకు జో«ద్‌పూర్‌కు చేరుతుంది. ఏడున్నరకు బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎనిమిదిన్నరకు సైట్ సీయింగ్ కోసం రైలు దిగాలి. మెహరాన్‌ఘర్ ఫోర్ట్, జస్వంత్ థాడా, ఉమైద్ భవన్ ప్యాలెస్ మ్యూజియం చూసుకున్న తర్వాత షాపింగ్. ఒకటిన్నరకు బాల్ సమంద్ లేక్ ప్యాలెస్‌లో రాజలాంఛనాలతో విందు భోజనం చేసిన తర్వాత ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగన్నరకు రైలు జో«ద్‌పూర్ నుంచి భరత్‌పూర్‌కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.ఏడవ రోజు: భరత్పూర్ టూ ఆగ్రారైలు ఉదయం ఆరు గంటలకు భరత్‌పూర్‌కి చేరుతుంది. వెంటనే సైట్ సీయింగ్‌కి బయలుదేరాలి. ఘనా బర్డ్ సాంక్చురీ విజిట్ తర్వాత ఎనిమిది గంటలకు మహల్ ఖాజ్ ప్యాలెస్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి రైలెక్కాలి. పది గంటలకు రైలు ఆగ్రాకు బయలుదేరుతుంది. పదకొండు గంటలకు ఆగ్రా రెడ్ ఫోర్ట్ చూసుకుని ఫైవ్ స్టార్ హోటల్లో లంచ్ తర్వాత మూడు గంటలకు తాజ్‌మహల్ వీక్షణం. ఐదున్నర నుంచి షాపింగ్, ఏడున్నరకు రైలెక్కి డిన్నర్ తర్వాత ఎనిమిది ముప్పావుకి ఢిల్లీకి బయలుదేరాలి.ఎనిమిదవ రోజు: ఆగ్రా టూ ఢిల్లీఉదయానికి రైలు ఢిల్లీకి చేరుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసి, లగేజ్ సర్దుకుని ఏడున్నరకు దిగి ప్యాలెస్ ఆన్ వీల్స్‌కి వీడ్కోలు పలకాలి.తరగతుల వారీగా ట్రైన్ టికెట్ వివరాలు:⇒ ప్రెసిడెన్షియల్ సూట్లో క్యాబిన్‌కి... 2,67,509 రూపాయలు⇒ సూపర్ డీలక్స్‌లో క్యాబిన్‌కి... 2,18,207 రూపాయలు⇒ డీలక్స్ క్యాబిన్ సింగిల్ ఆక్యుపెన్సీ... 1,10,224 రూపాయలు⇒ డీలక్స్ క్యాబిన్ డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి... 71,712 రూపాయలు⇒ ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచితం. పన్నెండేళ్ల లోపు పిల్లలకు సగం చార్జ్.⇒ ఒక క్యాబిన్లో ఇద్దరికి అనుమతి. పిల్లలను పేరెంట్స్తోపాటు అదే క్యాబిన్లో అనుమతిస్తారు.ప్యాలెస్ ఆన్ వీల్స్ మరిన్ని వివరాల కోసం...Email : palaceonwheels.rtdc@rajasthan.gov.in Website: Palaceonwheels.rajasthan.gov.inపులి కనిపించిందా!ఈ టూర్లో రాజస్థాన్ సంప్రదాయ సంగీతం, స్థానిక ఘూమర్, కల్బేలియా జానపద నృత్యాలను ఆస్వాదిస్తూ సాగే కామెల్ సఫారీ, డెజర్ట్ సఫారీలు, క్యాంప్‌ఫైర్ వెలుగులో ఇసుక తిన్నెల మీద రాత్రి భోజనాలను ఆస్వాదించవచ్చు. భరత్‌పూర్‌లోని కెలాడియా నేషనల్ పార్క్‌కి సైబీరియా నుంచి వచ్చిన కొంగలను చూడవచ్చు. ఈ పక్షులు ఏటా సైబీరియా నుంచి ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నవంబర్‌లో ఇక్కడికి వలస వస్తాయి.మార్చి వరకు ఇక్కడ ఉండి ఏప్రిల్ నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి. ఈ కొంగలతోపాటు వందల రకాల పక్షులుంటాయి. రణతంబోర్ నేషనల్ పార్క్‌కు వెళ్లి జీప్ సఫారీ లేదా ఎలిఫెంట్ సఫారీ చేస్తూ పులి కనిపిస్తుందేమోనని రెప్పవేయకుండా కళ్లు విప్పార్చి బైనాక్యులర్‌లో చూసి చూసి... దూరంగా ఎక్కడో పులి అలికిడి కనిపించగానే భయంతో కూడిన థ్రిల్‌తో బిగుసుకు పోవచ్చు.ఏడు హెరిటేజ్ సైట్లను చూడవచ్చుప్యాలెస్ ఆన్ వీల్స్ ప్యాకేజ్‌లో యునెస్కో గుర్తించిన ఏడు వరల్డ్ హెరిటేజ్ సైట్లు కవర్ అవుతాయి. అవేంటంటే... జయ్‌పూర్‌లోని జంతర్ మంతర్, రణతంబోర్లో రణతంబోర్ కోట, చిత్తోర్‌ఘర్‌లో చిత్తోర్ఘర్ కోట, జై సల్మీర్‌లో జై సల్మీర్ కోటతోపాటు థార్ ఎడారి, భరత్పూర్ కెలాడియో నేషనల్ పార్క్, ఆగ్రాలో తాజ్ మహల్. ఇవన్నీ యునెస్కో గుర్తింపు పొందిన హెరిటేజ్ సైట్లు. ఈ గౌరవంతోపాటు తాజ్‌మహల్‌కి ప్రపంచంలోని ఏడు వింతల జాబితాలో కూడా స్థానం ఉంది. -
రాజవంశీకుడైన మాజీ క్రికెటర్ మృతి
రాజస్థాన్ రంజీ జట్టు మాజీ కెప్టెన్, మేవార్ పూర్వ రాజకుటుంబ సభ్యుడు, రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు, హెచ్ఆర్హెచ్ (HRH) గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ అయిన అరవింద్ సింగ్ మేవార్ (81) ఇవాళ (మార్చి 16) తెల్లవారుజామున ఉదయపూర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. మేవార్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఉదయపూర్‌లోని సిటీ ప్యాలెస్‌లో చికిత్స పొందారు. అరవింద్ సింగ్ మేవార్ మహారాణా భగవత్ సింగ్ మేవార్ మరియు సుశీలా కుమారి మేవార్ దంపతుల చిన్న కుమారుడు. అరవింద్‌కు భార్య విజయ్‌రాజ్ కుమారి, కుమారుడు లక్ష్యరాజ్ సింగ్ మేవార్, కుమార్తెలు భార్గవి కుమారి మేవార్, పద్మజ కుమారి పర్మార్ ఉన్నారు. అరవింద్ సింగ్ మేవార్ మృతికి గౌరవ సూచకంగా ఉదయపూర్‌లోని సిటీ ప్యాలెల్ను ఆది, సోమవారాల్లో మూసివేయబడుతుంది.మేవార్ అజ్మీర్‌లోని ప్రతిష్టాత్మక మాయో కళాశాలలో విద్యనభ్యసించారు. UK, USAలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేశారు. తదనంతరం వివిధ అంతర్జాతీయ హోటళ్లలో శిక్షణ పొందాడు. ఆసక్తిగల క్రికెటర్ అయిన మేవార్ 1945-46లో రాజస్థాన్ రంజీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. మేవార్ రెండు దశాబ్దాల పాటు క్రికెటర్‌గా కెరీర్‌ను కొనసాగించాడు. మేవార్ ప్రొఫెషనల్ పోలో ఆటగాడు కూడా. UKలో అతను కేంబ్రిడ్జ్ మరియు న్యూమార్కెట్ పోలో క్లబ్లో 'ది ఉదయపూర్ కప్'ను స్థాపించాడు. 1991లో మేవార్ పోలో జట్టు 61వ కావల్రీ ఆటగాళ్లను ఓడించి ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కప్‌ను కైవసం చేసుకుంది.ఆసక్తిగల పైలట్ కూడా అయిన మేవార్.. మైక్రోలైట్ విమానంలో భారతదేశం అంతటా సోలో విమానాలు నడిపారు. మేవార్ ఉదయపూర్‌లోని మహారాణా ఆఫ్ మేవార్ ఛారిటబుల్ ఫౌండేషన్‌కు ఛైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. -
రాళ్లతో హోలీ.. 42 మందికి గాయాలు.. ఎక్కడంటే?
దుంగార్పూర్: రాజస్థాన్‌లోని దుంగార్పూర్లో హోలీవేడుకలను రంగులతో కాకుండా రాళ్లతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత 20 ఏళ్లుగా దుంగార్పూర్లోని భిలుడా గ్రామస్తులు రాళ్లతో హోలీని జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో 42 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రెండు వర్గాలుగా విడిపోయిన స్థానికులు.. రాళ్లతో హోలీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురికి గాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.గిరిజనులు ఎక్కువగా నివసించే భిలుడా గ్రామంలో రాళ్ల దాడిలో నేలపై పడే రక్తం ఏడాది పొడవునా గ్రామంలో జరిగే అవాంఛనీయ సంఘటనల నుంచి రక్షిస్తుందనే నమ్మకంతో దశాబ్దాలుగా ఇక్కడ హోలీ జరుపుకుంటున్నారు. హోలీని జరుపుకోవడానికి గ్రామంలోని రఘునాథ్జీ ఆలయం దగ్గర ప్రజలు హాజరై.. డ్రమ్స్ వాయిద్యాలతో నృత్యం చేశారు అనంతరం రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.Believe me, this is not a clash; it is a Holi celebration!In Bhiluda village in Rajasthan, Holi is celebrated by pelting stones. Every year on Holi, in the evening, instead of colors and gulal, stones are pelted between two groups#Holi#Holi2025 #HoliCelebration pic.twitter.com/MVOQZll6TF— Pirzada Shakir (@pzshakir6) March 14, 2025 -
ఇక్కడ పురుషులు హోలీ ఆడరు...
హోలీ.. రంగుల పండుగ. దేశమంతా ఉత్సాహంగా జరుపుకొనే ఈ వేడుకకు మార్కెట్లు రంగులతో కళకళలాడతాయి. వీధులన్నీ రంగులద్దుకుంటాయి. హోలీలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో సంప్రదాయం ఉండగా.. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో పురుషులు మాత్రం ఈ వేడుకకు దూరంగా ఉంటారు. స్త్రీలు స్వేచ్ఛగా హోలీ ఆడుకుంటారు. ఈ ఆసక్తికర ఆచారం 500 ఏళ్లుగా కొనసాగుతోంది. ధిక్కరిస్తే బహిష్కరణే... ఈ సంప్రదాయం కొన్ని తరాలుగా కొనసాగుతోంది. 500 ఏళ్లుగా గ్రామస్తులు ఆచారాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. మహిళలు బయట తిరగకుండా ఉంచిన పర్దా వ్యవస్థ నుంచి ఈ సంప్రదాయం వచ్చిందని స్థానికులు చెబతారు. పురుషులు ఉండరు కాబట్టి మహిళలు స్వేచ్ఛగా వేడుకలు చేసుకుంటారు. ఈ సంప్రదాయాన్ని ధిక్కరించి పురుషులు గ్రామంలో ఉండిపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. వారిని వెంటనే గ్రామం నుంచి బహిష్కరిస్తారు. ఇక పురుషులకు హోలీ పండుగే ఉండదా అంటే.. ఉంటుంది. కాకపోతే తరువాతి రోజు పురుషులు, స్త్రీలు కలిసి ఈ వేడుకలు జరుపుకొంటారు. కేవలం రంగులు జల్లుకోవడం కాదు.. పురుషులను స్త్రీలు కొరడాలతో కొట్టడంతో పుండుగ ముగుస్తుంది. పురుషులు ఆలయానికి.. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో నాగర్ గ్రామంలో ఈ అసాధారణ సంప్రదాయం ఉంది. హోలీ రోజున ఉదయం 10 గంటలు కాగానే.. నాగర్‌కు చెందిన ఐదేళ్లు దాటిన పురుషులంతా గ్రామాన్ని వదిలి శివార్లలో ఉన్న చాముండేశ్వరీ దేవీ ఆలయానికి వెళ్తారు. అక్కడ జాతర చేసుకుంటారు. భక్తిగీతాలు వింటూ రోజంతా భక్తిశ్రద్ధలతో గడుపుతారు. పురుషుల వేషధారణలో స్త్రీలు.. ఇంకేముంది ఊరంతా మహిళలదే. రోజంతా పండుగే. గ్రామాన్నంతా అలంకరించి రంగులు జల్లుకుంటూ శోభాయమానంగా మారుస్తారు. వయసుతో తేడా లేకుండా మహిళలంతా ఆనందోత్సహాల్లో మునిగిపోతారు. ప్రత్యేక ఆచారం కావడంతో అంతగా ఇష్టపడనివారు సైతం కచి్చతంగా హోలీ ఆడతారు. కొందరు స్త్రీలు పురుషుల వేషధారణతో వేడుకల్లో పాల్గొంటారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
రంగులు వేయకండని బ్రతిమాలాడు.. అయినా చంపేశారు..!
జైపూర్: రాజస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడ్ని కొట్టి చంపేశారు రాల్వాస్ గ్రామంలో ముగ్గురు యువకులు. హోలీ పండుగ పేరుతో హన్స్ రాజ్ అనే యువకుడిపై రంగులు చల్లేందుకు ముగ్గురు యువకులు వచ్చారు. లైబ్రరీలో బుక్స్ చదువుకుంటున్న తరుణంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.వారు రంగులు చల్లే క్రమంలో హన్స్ రాజ్ వద్దని వారించాడు. తనపై చల్లవద్దని, ప్రస్తుతం కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నానని విన్నవించాడు. అయితే రంగులు చల్లించుకోవడానికి నిరాకరిస్తావా అంటూ హన్స్ రాజ్ ను చావబాదారు సదరు యువకులు. బెల్ట్ లతో, స్టిక్స్ తో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేకపోయిన హన్స్ రాజ్.. ప్రాణాలు కోల్పోయాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని అశోక్, బబ్లూ, కలుకరణ్ గా గుర్తించారు. వీరిని వెంటనే అరెస్టు చేసినట్లు అడిషనల్ ఏఎస్సీ దినేశ్ అగర్వాల్ స్పష్టం చేశారు.నేషనల్ హైవే దిగ్బంధనం.. పెద్ద ఎత్తున ఆందోళనఈ అమానుష ఘటనపై హన్స్ రాజ్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హన్స్ రాజ్ భౌతిక కాయాన్ని తీసుకుని నేషనల్ హైవేను బ్లాక్ చేశారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వారు ఆందోళన విరమించారు. హన్స్ రాజ్ కుటుంబానికి రూ. 50 లక్షల తక్షణ పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసుల నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీని నేషనల్ తొలగించి, ఆందోళన విరమించారు రాల్సాస్ గ్రామస్థులు. -
రాజస్తాన్‌లో సింగరేణి పాగా
గోదావరిఖని: విద్యుదుత్పత్తి.. వ్యాపార విస్తరణ కోసం సింగరేణి కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ రంగంలో ముందుకు సాగుతోంది. 3,100 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం రాజస్తాన్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఒడిశా రాష్ట్రంలోని నైనీబ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తికి నడుం బిగించింది. తాజాగా రాజస్తాన్‌లో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. సింగరేణి ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్, 245.5 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తోంది. తాజా ఒప్పందంతో మరో 1,600 మెగావాట్ల థర్మల్, 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ (Solar Power) అందుబాటులోకి వస్తుంది.మరో మైలురాయి పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార విస్తరణపై సింగరేణి దృష్టి పెట్టింది. రాజస్తాన్ విద్యుత్ సంస్థతో కలిసి సింగరేణి 74 శాతం, రాజస్తాన్ 26 శాతం పెట్టుబడితో ఒప్పందం చేసుకుంది. లాభాల్లో కూడా ఇవే వాటాలు ఉంటాయి. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో వ్యాపార విస్తరణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అపార బొగ్గు నిల్వలతో థర్మల్ విద్యుత్‌కు కేంద్రంగా నిలిచింది. ఒప్పందం ప్రకారం 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ (Thermal Power) ప్లాంట్ల ఏర్పాటుతోపాటు 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. పెట్టుబడిలో సింగరేణి 74 శాతం, రాజస్తాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ 26 శాతం వాటాను చెల్లించనున్నాయి.రాజస్తాన్ ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన 26 శాతం సొమ్మును సౌర, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన స్థలాలు, మౌలిక సదుపాయాల రూపంలో అందించనుంది. సింగరేణి తన వాటాగా అంగీకరించిన 74 శాతాన్ని ధన రూపంలో చెల్లించనుంది. ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని అన్ని రకాల అనుమతులతో సింగరేణికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కొనుగోలుకు డిస్కంలతో ఒప్పందాలు (పీపీఏ) తదితర అంశాలను రాజస్తాన్ ప్రభుత్వ విద్యుత్ శాఖ ద్వారా చేపట్టేలా అంగీకరించారు.మారిపోనున్న సింగరేణి ముఖచిత్రం సింగరేణి ఇప్పటివరకు కేవలం తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమై తన బొగ్గు ఉత్పత్తి, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లో అడుగుపెట్టి విద్యుదుత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేయగా.. అదే ప్రదేశంలో మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 245.5 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తున్న సింగరేణి.. 2026 నాటికి 450 మెగావాట్లకు పైగా సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి బొగ్గు సంస్థల్లో నెట్ జీరో కంపెనీగా నిలవాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.చదవండి: చేనేత కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్వ్యాపార విస్తరణలో భాగంగా.. ఒడిశా రాష్ట్రంలోని నైనీ వద్ద ఏటా కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఇది మరో 30 రోజుల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనుంది. తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఇదే ప్రాంతంలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.200 ఏళ్ల భవిష్యత్ దిశగా.. సింగరేణి సంస్థకు మరో 200 ఏళ్ల భవిష్యత్ దిశగా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. 2070 నాటి జీరోనెట్ దిశగా ప్రపంచం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నాం. రాబోయే రోజుల్లో బొగ్గు బ్లాకులు, థర్మల్ విద్యుదుత్పత్తి కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కొత్తవ్యాపారాల దిశగా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ముందుకు సాగుతాం.– ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి -
గంజాయి కేసులో ఐఐటీ బాబా అరెస్ట్!
జైపూర్: మహా కుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా(IIT Baba) అభయ్ సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయి కేసులో తాజాగా ఆయన్ని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ బాబానే ధృవీకరించడం విశేషం. ఐఐటీ బాబా సూసైడ్ చేసుకుంటానన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైపూర్ షిప్రా పాథ్ పోలీసులు ఓ హోటల్లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఆ టైంలో ఆయన నుంచి గంజాయి సేవిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీన్నారు. ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ &సైకోట్రోపిక్ సబ్స్టానెన్స్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. VIDEO | Amid reports of his arrest, Maha Kumbh fame Abhay Singh, alias 'IIT Baba' was seen celebrating his birthday with followers in Jaipur. pic.twitter.com/WhA8aTIUv2— Press Trust of India (@PTI_News) March 3, 2025అయితే.. ఆయన అరెస్ట్ ప్రచారం నడుమ అనూహ్యంగా ఆయన తన భక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కనిపించారు. దీంతో మీడియా ఆయన్ని అరెస్ట్‌పై ఆరా తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారాయన. అయితే తాను గంజాయి తీసుకున్న మాట వాస్తవమేనని.. అయితే పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఓప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనపై దాడి జరిగిందంటూ నోయిడా పీఎస్ వద్ద ఐఐటీ బాబా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చివరకు పోలీసులు ఆయన్ని శాంతపర్చి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇంటర్వ్యూకు ముందు ఆయనే సదరు ఛానెల్ యాంకర్‌పై దాడి చేశారంటూ ప్రచారం జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఐఐటీ బాబాగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా(Prayagraj Maha Kumbh) అభయ్ సింగ్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూతో పాపులారిటీ సంపాదించుకున్నారు. హర్యానా చెందిన అభయ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తిచేసినట్లు చెబుతున్నారు. కొంతకాలం ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసిన ఆయన.. దాన్ని వదిలేశారట. ఆపై కొంతకాలం ఫొటోగ్రఫీ.. అటు నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారట. -
తీవ్ర విషాదం.. ప్రాక్టీస్‌లో భారీ బరువులెత్తబోయి 17 ఏళ్ల యస్తిక..
యువ పవర్ లిఫ్టర్(Powerlifter) మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకుంది. రాజస్తాన్‌కు చెందిన 17 ఏళ్ల యస్తిక ఆచార్య(Yashtika Acharya) పవర్లిఫ్టర్గా జాతీయ స్థాయిలో రాణిస్తోంది. గత ఏడాది సబ్ జూనియర్ విభాగంలో (ప్లస్ 84 కేజీలు) జాతీయ బెంచ్ ప్రెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కూడా సాధించింది.270 కేజీల బరువును ఎత్తే క్రమంలోతన రెగ్యులర్ ప్రాక్టీస్‌లో భాగంగా జిమ్‌లో ఆమె కోచ్‌తో కలిసి సాధన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 270 కేజీల బరువును ఎత్తే క్రమంలో పట్టు జారి ఆమె వెనక్కి పడిపోయింది. రాడ్ ఆమె మెడ వెనకభాగంలో పడటంతో మెడ విరిగిపోయి యస్తిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఇంత భారీ బరువు ఎత్తుతున్నప్పుడు సాధారణంగా వెనక నిలబడి కోచ్ సహకరిస్తాడు. కానీ అతను కూడా నిలువరించలేకపోవడంతో యువ క్రీడాకారిణి జీవితం ముగిసింది. ఈ క్రమంలో కోచ్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.యస్తిక దుర్మరణంపైఈ విషాదం గురించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే యస్తిక ఆచార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. అయితే, ఈ యస్తిక దుర్మరణంపై ఆమె కుటుంబ సభ్యులు ఇంత వరకు ఫిర్యాదు మాత్రం చేయలేదని చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.కాగా పవర్‌లిఫ్టింగ్‌లో స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్ అనే మూడురకాల లిఫ్ట్స్ ఉంటాయి. కాగా ఈనెల 19 నుంచి 23 వరకు పురుషుల,మహిళల క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌నకు పంజాబ్‌లో గల జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇస్తోంది. చదవండి: ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్ -
‘ప్లీజ్ మామ నాకు కట్నం వద్దు’.. సోషల్ మీడియాలో పెళ్లి కుమారుడి ఫొటోలు వైరల్
మామ బంగారంలాంటి మీ అమ్మాయే నాకు పెద్ద కట్నం.. ఇంక నాకు ఈ కట్నకానుకలు ఎందుకు చెప్పు. ఇదిగో నువ్విచ్చిన కట్నం నువ్వే తీసుకో. ఆచార ప్రకారం ఒక కొబ్బరికాయ, ఒక రూపాయి మాత్రమే ఇస్తే చాలు’ అంటూ పిల్లనిచ్చిన మామ తనకు ఇచ్చిన రూ.5,51,00 కట్నాన్ని వెనక్కి ఇచ్చాడు. దీంతో పెళ్లి కుమార్తె తండ్రి మా అల్లుడు వెరిగుడ్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాకు చెందిన పరంవీర్ రాథోర్ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ తరుణంలో ఫిబ్రవరి 14న కరాలియా అనే గ్రామంలో పిజీ చదువుతున్న నికితా భాటిను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత వధువు తండ్రి పలు బహుమతులతో పాటు ఎర్రటి గుడ్డను అలంకరించిన ప్లేట్లో రూ. 5,51,000 నగదు తెచ్చాడు. ఆ మొత్తాన్ని అల్లుడికి ఇచ్చాడు. కానీ అల్లుడు వెంటనే ఆ డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చాడు. కట్నం ఇస్తే.. ఎందుకు తిరిగిచ్చారని పరంవీర్‌ను ప్రశ్నిస్తే.. నా పెళ్లి జరిగే సమయంలో కట్నం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, ఇలాంటి దురాచారాలు సమాజంలో ఇంకా కొనసాగుతుండటం చూసి నాకు బాధ కలిగింది. అందుకే పెళ్లి జరిగిన తర్వాత నా తండ్రితో, కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.నేను సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నా. నిజమైన మార్పు తెచ్చే బాధ్యత చదువుకున్న మన మీద ఉంది. విద్యావంతులైన మనం మార్పు కోసం ముందుకు రాకపోతే మరెవరు రారు? మార్పు ఎక్కడో ఒకచోట ప్రారంభమవ్వాలి. ఆ మార్పు నా నుంచే మొదలవ్వాలి. నేను తీసుకున్న నిర్ణయాన్ని నా తల్లిదండ్రులు సమర్ధించారు. మనం ఈ తప్పుడు సంప్రదాయాలను ఆపకపోతే సమాజంలో మార్పు ఎలా వస్తుంది?’అని అన్నారు. పరంపవీర్ తండ్రి ఈశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. నేను రైతును. ఆచార ప్రకారం ఒక కొబ్బరికాయ, ఒక రూపాయి మాత్రమే తీసుకున్నాను. వరకట్న వ్యవస్థను పూర్తిగా నశింపజేయాలి’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఏడేళ్ల లోపు కేసు కావడంతో 41సీ నోటీసులు మాత్రమే ఇవ్వాలి: లక్ష్మీ తరపు లాయర్
-
రోడ్డు ప్రమాదం: 8 మంది దుర్మరణం
జైపూర్: రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఓ బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టడంతో భారీ సంఖ్యలోప్రాణనష్టం వాటిల్లింది. రాజస్థాన్‌లోని దుడు రీజియన్లజజైపూర్-అజ్మీర్ హైవేపై మౌంఖపూరాకు అతి దగ్గర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయ్యాలయ్యాయి.బస్సు ముందు టైర్ పేలిపోవడంతో అది కాస్తా అదుపు తప్పింది. ఆ సమయంలో బస్సును కంట్రోల్ చేయడానికి యత్నించిన డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. దాంతో కారులో ఉన్న వారు పలువురు ప్రాణాలు కోల్పోగా, కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
ఎన్కౌంటర్లో ట్విస్ట్.. కంగుతిన్న పోలీసులు
కోట: రాజస్థాన్‌లోని కోటలో జరిగిన ఎన్కౌంటర్ ఊహించని మలుపుతిరిగింది. ఎన్కౌంటర్లో మృతిచెందాడని భావిస్తున్న 24 ఏళ్ల నేరస్తుడు బతికే ఉన్నాడని, ఇప్పటికీ పరారీలో ఉన్నాడని తేలిడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆదివారం నాడు పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టినప్పుడు అతను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు భావించారు. అయితే ఈ ఉదంతంలో చోటుచేసుకున్న మలుపును పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరస్తుడు రుద్రేష్ అలియాస్ ఆర్డీఎక్స్ ఆదివారం నాడు కోట పరిధిలోని నయా నోహ్రాలోని ఒక ఇంట్లో దాక్కున్నప్పుడు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో రుద్రేష్ తనను తాను కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నడని పోలీసులు భావించారు. కాగా ఆ సమయంలో రుద్రేష్ సహచరుడు కూడా అదే ఇంట్లో ఉన్నాడు.ఈ ఘటన అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే సోమవారం రుద్రేష్ కుటుంబ సభ్యులు మృతుడిని ప్రీతమ్ గోస్వామి అలియాస్ టీటీగా గుర్తించారు. అతను కూడా పేరుమోసిన నేరస్తుడేనని డిఎస్పీ లోకేంద్ర పలివాల్ తెలిపారు. ఇంతలో రుద్రేష్ తన స్నేహితుల్లో ఒకరికి పోన్ చేసి, తాను బతికే ఉన్నానని తెలియజేశాడు. ఈ విషయాన్ని ఆ మిత్రుడు రుద్రేష్ కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.సీసీటీవీ ఫుటేజ్‌లోని ఫీడ్ ప్రకారం పోలీసు బృందం రాకముందే రుద్రేష్ అక్కడి నుంచి పారిపోయాడని డీఎస్పీ తెలిపారు. అతని ముఖం ఛిద్రమై ఉండటం, గదిలో అతని వస్తువులు కొన్ని కనిపించడంతో, ఆ మృతదేహాన్ని పోలీసులు రుద్రేష్గా గుర్తించారు. పోలీసులు రుద్రేష్ ఇంటి నుంచి మూడు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రుద్రేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: Delhi Assembly Election: అణువణువునా గస్తీ.. 35 వేల పోలీసులు మోహరింపు -
మన 'బుల్లెట్ బండి' రేంజులో స్టెప్పులేసిన రాజస్థానీ జంట
వివాహ ఘడియలు మొదలయ్యితే వధూవరుల కుటుంబాల్లో చెప్పలేని ఆనందం నిండి ఉంటుంది. ఆ సంతోష సమయంలో వారు నాలుగు స్టెప్పులేస్తే వేడుకలో మరింత సందడి వాతవారణం నెలకొంటుంది. పెళ్లి సమయంలో నవవధువు ఏదైన పాటకు డ్యాన్స్ చేస్తే ఆ వీడియో వెంటనే నెట్టింట వైరల్ అవుతుంది. భాషతో సంబంధం లేకుండా వాటిని నెటిజన్లు కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇలా తాజాగా రాజస్థాన్‌లో జరిగిన పెళ్లిలో నూతన దంపతులు వేసిన డ్యాన్స్ వీడియో ట్రెండ్ అవుతుంది. పెళ్లిలో మొదట ఆమె అద్భుతమైన నృత్యం చేసి అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. అతిథులు కూడా చప్పట్లు కొడుతూ మరింత జోష్ నింపారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.అప్పుడు బుల్లెట్టు బండి‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా.. అందాల దునియానే చూపిస్తపా’ అంటూ తెలుగింటి అమ్మాయి మోహన భోగరాజు పాడిన ఈ పాట ఒకప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేసింది. పెళ్లి సమయంలో వధువు అభిరుచులు తెలిపేలా ఈ పాట లిరిక్స్ ఉంటాయి. గతంలో ఇదే పాటతో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాయి అనే నవవధువు పెళ్లి తర్వాత తన భర్తను సర్ప్రైజ్ చేసింది. పెళ్లి తంతులో భాగంగా జరిగిన బరాత్‌లో ‘బుల్లెట్టు బండి’ పాటకు ఆమె అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ సాంగ్‌తో వారికి ఫుల్ క్రేజ్ వచ్చింది. the amount of times i watched this reel is unhealthy 😭 pic.twitter.com/wgtQL5lme7— akshi 𐙚 (@hrudayamaxx) February 1, 2025 -
రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో
ప్రతిష్టాత్మక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ( UPSC ) పరీక్షలో విజయం సాధించడం అంటే సాధారణ విషయంకాదు. దానికి కఠోర సాధన పట్టుదల ఉండాలి. ఈవిషయంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా కథ చాలా స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.కోటి రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగ ఆఫర్‌ను కాదని తన తొలి ప్రయత్నంలోనే 2018 UPSC పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1ని సాధించాడు. ఈ ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది అదేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా : రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అదుర్స్!)ప్రతి ఏటా లక్షలాది మంది అభ్యర్థులు సివిల్స్‌కోసం ప్రిపేర్ అవుతారు. అందులో కొద్ది మంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా. ఐఐటీ బొంబాయి పూర్వ విద్యార్థి అయిన ఆయన కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ సంపాదించి తన రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతుడిగా ఎదిగాడు. ఆ తరువాత దక్షిణ కొరియాలోని శామ్సంగ్ కంపెనీలో సంవత్సరానికి కోటి రూపాయల జీతంతో ఉద్యోగ ఆఫర్ కూడా వచ్చింది. అయితే, వ్యక్తిగత లాభాల కంటే దేశానికి సేవ చేయాలనే కోరిక అతనిలో బాగా నాటుకుపోయింది. అందుకే ఆ ఆఫర్‌ను మరీ తన కలలసాకారంకోసం పరీక్షకు సిద్ధం అయ్యాడు.ఇదీ చదవండి: అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!దృఢ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన అతని ప్రయత్నం వృధాకాలేదు. 2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంలో తన కృషి, పట్టుదలతోపాటు, కుటుంబ మద్దతు సహకారం చాలా ఉందని చెబుతాడు ఆనందంగా కనిషక్. స్పష్టమైన లక్ష్యం, సానుకూల మనస్తత్వంతో ఎలాంటి సవాళ్లనైనా అధిగమించివచ్చని నిరూపించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.మరోవిశేషం.. కుటుంబానికి గర్వకారణమైన క్షణాలు కనిషక్ విజయగాథలో మరో ఆసక్తికర విషయం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. 2024 సెప్టెంబర్ 30ప రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో డివిజనల్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశాడు కనిషక్ తండ్రి సన్వర్ మల్ వర్మ. తండ్రి రాజీనామా ఉత్తర్వులపై సంతకం చేసింది మాత్రం కనిషక్. ఈ ప్రత్యేకమైన క్షణాలు ఆ కుటుంబానికి గర్వించ దగ్గ క్షణాలుగామారాయి. అంతేకాదు. కుటుంబం అందించిన సేవ ,అంకితభాం మరింత ప్రత్యేకంగా నిలిచింది.వ్యక్తిగత శ్రేయస్సు, సంపద కంటే సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే అతని నిర్ణయం కనిషక్ను ప్రత్యేకంగా నిలిపింది. శామ్సంగ్లో డేటా సైన్స్‌లో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని తిరస్కరించి, సమాజంలో అర్థవంతమైన మార్పును సృష్టించాలనే కోరికతో నడిచే సివిల్ సర్వీసెస్‌లో కెరీర్‌ను ఎంచుకోవడం విశేషం. దేశంకోసం దేశసేవకోసం ఆర్థికంగా గొప్ప అవకాశాన్నిఉద్యోగాన్ని వదులుకొని, అతను భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచాడు. కృషి, అంకితభావం, స్పష్టమైన దృక్పథం ఉంటే ఏ కల కూడా సాధించలేనిది లేదని మరోసారి నిరూపించాడు. -
తరగతి గదిలో మొబైల్ నిషిద్ధం.. పూజలు, నమాజ్‌కు పర్మిషన్ నో!
భిల్వారా: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పాఠశాల విద్యావిధానంలో నూతన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. భిల్వారాలో జరుగుతున్న హరిత్ సంగం జాతర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర విద్య పంచాయతీరాజ్ మంత్రి మదన్ దిలావర్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఏ ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోనికి మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని, పాఠశాల సమయంలో ప్రార్థన లేదా నమాజ్ పేరుతో ఏ ఉపాధ్యాయుడు కూడా పాఠశాలను వదిలి వెళ్లకూడదని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో విద్యా రంగాభివృద్ధికి విద్యా శాఖ(Department of Education) జారీ చేసిన ఆదేశాలను అమలయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని మదన్ దిలావర్ పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని, తరగతి గదిలో బోధించేటప్పుడు ఏ ఉపాధ్యాయుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదన్నారు. తరగతి గదిలో ఫోన్ మోగితే, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఫలితంగా చదువులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.ఇదేవిధంగా పాఠశాల జరుగుతున్న సమయంలో మతపరమైన ప్రార్థనల పేరుతో ఏ ఉపాధ్యాయుడు పాఠశాల నుండి బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఇటువంటి ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు(Complaints) వచ్చిన దరిమిలా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నదన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థులకు 20కి 20 మార్కులు ఇస్తున్నారని, అలా ఇవ్వడం సరైనది కాదన్నారు. బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్ ప్రచార దాడి -
త్యాగమయి చిత్తోర్ఘర్ పన్నా దాయి : ఆసక్తికర విశేషాలు
రాజస్థాన్, చిత్తోర్ఘర్... పేరు వినగానే మేవార్‌రాజుల ఘనచరిత్ర కళ్ల ముందు మెదులుతుంది. రాణి పద్మిని త్యాగం గుర్తు వస్తుంది. పద్మావత్ సినిమా తర్వాత చిత్తోర్ ఘర్ పేరు అనేక వివాదాలకు, విచిత్ర భాష్యాలకు నెలవైంది. సినిమాలో చూసిన చిత్తోర్ఘర్ కోటను స్వయంగా చూడడం కూడా అవసరమే. చిత్తోర్ఘర్ చరిత్రలో ఉన్న మహిళ రాణి పద్మినిది మాత్రమే కాదు. ఈ కోటలో చరిత్ర సృష్టించిన ముగ్గురు. భక్త మీరాబాయి, రాణి పద్మిని, పన్నాదాయి. భక్త మీరాబాయి... కృష్ణుడి భక్తురాలిగా సుపరిచతమే. ఇక పన్నా దాయి (Panna Dhai) మాత్రం సినిమాటిక్ అట్రాక్షన్ లేని పాత్రకావడంతో చరిత్రపుటల్లో అక్షరాలుగా మాత్రమే మిగిలిపోయింది. త్యాగమయి పన్నారాజపుత్ర రాజు రాణా సంగా భార్య రాణి కర్ణావతి దగ్గర దాదిగా పని చేసింది పన్నాదాయి. పిల్లల్ని పెంచే బాధ్యత ఆమెది. రెండవ ఉదయ్ సింగ్ చంటిబిడ్డగా ఉన్నప్పుడు కోట మీద దాడి జరిగింది. ఉదయ్ సింగ్‌ను కాపాడడానికి శత్రువుల దృష్టి మళ్లించడానికి ఊయలలో తన బిడ్డను పెట్టి ఉదయ్‌సింగ్‌ను భద్రంగా కోట నుంచి బయటకు పంపించింది. రాజ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమకు, త్యాగానికి గుర్తుగా కోట లోపల ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కోటలో రాణా కుంభ కట్టిన విజయ్ స్తంభ్, రాణి పద్మిని ప్యాలెస్ ముఖ్యమైనవి. అల్లావుద్దీన్ ఖిల్జీ అద్దంలో రాణిని చూసిన ప్రదేశం ముఖ్యమైనది. పద్మిని తన ప్యాలెస్ మెట్ల మీద కూర్చుంటే, ఆమె ప్రతిబింబం... ప్యాలెస్ మెట్లకు అభిముఖంగా ఉన్న చిన్న బిల్డింగ్‌లోని అద్దంలో కనిపిస్తుంది. ఖిల్జీ ఆ ప్రతిబింబాన్ని చూసిన అద్దం ఇప్పటికీ ఉంది. జోవార్ గద్దెరాణి పద్మిని అందచందాలను విని ఆశ్చర్యపోయిన ఖిల్జీ ఆమె కోసమే దండెత్తి యుద్ధం చేశాడు. రాజ్యాన్ని ధ్వంసం చేశాక కూడా కోట స్వాధీనం కాకపోవడంతో రాణి పద్మినిని ఒకసారి చూసి వెళ్లిపోతానని కోరాడని, అప్పుడు మంత్రివర్గ ప్రముఖులు ఆమెను స్వయంగా చూపించకుండా అద్దంలో చూపించారని గైడ్లు చె΄్తారు. చూసి వెళ్లిపోతానన్న ఖిల్జీ ఆ తర్వాత మాటతప్పి కోటలోకి ఆహార పదార్థాలు అందకుండా దిగ్బంధించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు పద్మినితో పాటు నాలుగు వేల మంది మహిళలు నిప్పుల్లో దూకి ప్రాణత్యాగం(జోవార్) చేసిన ఆ స్థలాన్ని చూపించి ఈ వివరాలన్నీ చెబుతారు. కోట లోపల శివాలయం, జైనమందిరం ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాలు, ప్యాలెస్‌లు, గార్డెన్లు, జ్ఞాపక నిర్మాణాలు ఏవైనా సరే అందులో ఇమిడిన నైపుణ్యానికి తలవంచి నమస్కరించాల్సిందే. -
వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన వృధా.. క్వార్టర్ ఫైనల్లో రాజస్థాన్, హర్యానా
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో రాజస్థాన్, హర్యానా జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. ఇవాళ (జనవరి 9) జరిగిన ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్స్‌లో రాజస్థాన్, హర్యానా జట్లు విజయం సాధించాయి. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 19 పరుగుల తేడాతో గెలుపొందగా.. బెంగాల్‌పై హర్యానా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన వృధాప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్-2లో రాజస్థాన్, హర్యానా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు (9-0-52-5) తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు.రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్‌తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 47.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లు తలో చేయి వేసి తమిళనాడు ఇంటికి పంపించారు. అమన్ సింగ్ షెకావత్ మూడు వికెట్లు పడగొట్టగా.. అనికేత్ చౌదరీ, అజయ్ సింగ్ తలో రెండు, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో ఎన్ జగదీశన్ (65) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బాబా ఇంద్రజిత్ (37), విజయ్ శంకర్ (49), మహ్మద్ అలీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.బెంగాల్ భరతం పట్టిన హర్యానాబెంగాల్తో జరిగిన మ్యాచ్‌లో (ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్-1) హర్యానా ఆటగాళ్లు కలిసికట్టుగా పోరాడారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో క్రమశిక్షణతో వ్యవహరించారు. ఫలితంగా సునాయాస విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో పార్థ్ వట్స్ (62), నిషాంత్ సంధు (64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ రెండు, సుయాన్ ఘోష్, ప్రదిప్త ప్రమాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగాల్ 43.1 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ సుదిప్ కుమార్ ఘరామీ (36), మజుందార్ (36), కరణ్ లాల్‌కు (28) ఓ మోస్తరు ఆరంభాలు లభించినప్పటికీ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. పార్థ్ వట్స్ 3, నిషాంత్ సంధు, అన్షుల్ కంబోజ్ చెరో 2, అమన్ కుమార్, సుమిత్ కుమార్, అమిత్ రాణా తలో వికెట్ పడగొట్టి బెంగాల్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. -
విజయ్ హజారే టోర్నీ బరిలో ప్రసిధ్ కృష్ణ, పడిక్కల్, సుందర్
బెంగళూరు: ‘అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుంటే ప్రతి ఒక్కరూ దేశవాళీల్లో ఆడాల్సిందే’ అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్న మాటలను భారత ఆటగాళ్లు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరాజయం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లలో పలువురు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నారు. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరుగనున్న ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌తో తమిళనాడు, హరియాణాతో బెంగాల్ తలపడనున్నాయి. వీటితో పాటు ఇక మీద జరగనున్న మ్యాచ్‌ల్లో పలువురు భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన ప్రసిధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, సుందర్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆడిన కేఎల్ రాహుల్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే ఆ తర్వాత ఈ నెలాఖరున తిరిగి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌ల్లో రాహుల్ పాల్గొనే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆటగాళ్లు రేపటి నుంచి వారివారి రాష్ట్రాల జట్లతో కలవనున్నారు. తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరితే స్పిన్ ఆల్‌రౌండర్ సుందర్ బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌లాడిన సుందర్ 114 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సిడ్నీ వేదికగా కంగారూలతో జరిగిన చివరి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన ప్రసిధ్ కృష్ణ కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.రంజీ ట్రోఫీలో నితీశ్ రెడ్డి...‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో అద్వితీయ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి... రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఆడనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోవడంతో అతడికి వన్డే టోర్నీలో ఆడే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశలో పోటీల్లో ఆంధ్ర జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. వాటిలో నితీశ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ప్రతికూల పరిస్థితుల మధ్య చక్కటి సెంచరీతో సత్తా చాటిన నితీశ్ రెడ్డి... ఈ నెల 23 నుంచి పుదుచ్చేరితో, 30 నుంచి రాజస్తాన్‌తో ఆంధ్ర జట్టు ఆడే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆంధ్ర జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. -
బోరుబావిలో బాలిక.. విషాదంగా ముగిసిన ఘటన
-
కారుకు డ్రైవర్లుగా మారిన ఎద్దులు
-
పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్
PV Sindhu Marries Venkatta Datta Sai: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వ్యాపారవేత్త వెంకట దత్త సాయి(Venkatta Datta Sai)ని ఆదివారం ఆమె వివాహమాడింది. ఈ వేడుకకు సంబంధించిన తొలి ఫొటో సోమవారం బయటకు వచ్చింది.ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రికేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పీవీ సింధు- వెంకట దత్త సాయి పెళ్లి ఫొటోను షేర్ చేశారు. ‘ఉదయర్పూర్లో నిన్న సాయంత్రం.. మన బ్యాడ్మింటన్ చాంపియన్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు- వెంకట దత్త సాయి వివాహానికి హాజరుకావడం సంతోషంగా ఉంది.నూతన దంపతులకు శుభాకాంక్షల వెల్లువజీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలతో పాటు ఆశీర్వాదాలూ అందజేశాను’’ అని గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.కాగా జీవితంలోని ప్రత్యేకమైన ఘట్టంలో సింధు- వెంకట దత్త సాయి వెండి రంగు దుస్తుల్లో తళుక్కుమన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం.రాజస్తాన్‌లో పెళ్లిరాజస్తాన్లోని ఉదయ్‌పూర్‌లోని రాజకోట వంటి వేదికపై సింధు- వెంకట దత్త సాయి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా వరుడు మరెవరో కాదు.. సింధుకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఇరు కుటుంబాల పెద్దల నిర్ణయం మేరకు వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మంగళవారం(డిసెంబరు 24) సింధు- వెంకట దత్త సాయి వివాహ రిసెప్షన్ జరుగనుంది.రెండు ఒలింపిక్ పతకాలుకాగా రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తెలుగు తేజం సింధు.. టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తద్వారా భారత్ తరఫున వరుసగా రెండు ఎడిషన్లలో ఒలింపిక్ పతకాలు గెలిచిన ప్లేయర్‌గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అయితే, ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.ఈ వార్త చదవండి: IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై.. Pleased to have attended the wedding ceremony of our Badminton Champion Olympian PV Sindhu with Venkatta Datta Sai in Udaipur last evening and conveyed my wishes & blessings to the couple for their new life ahead.@Pvsindhu1 pic.twitter.com/hjMwr5m76y— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 23, 2024 -
రాయల్‌గా రాజస్తానీ టచ్‌తో
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ఆదివారం వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. పారిశ్రామికవేత్త వెంకట దత్తసాయిని సింధు పెళ్లాడుతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో ఈ పెళ్లి జరుగు తోంది. ఉదయ్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ ‘రఫల్స్’ను సింధు పెళ్లి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రాజసం ఉట్టిప డేలా పెళ్లి వేదికను అలంకరించారు. అతిధులను వేదికకు తీసుకువచ్చే పడవలను కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. డెకరేషన్ అంతా రాజస్తానీ శైలిలో సంప్రదాయం, రాజసాల మేళవింపుగా ఉందని చెబుతున్నారు. విందులోనూ మేవారీ రుచులతో కూడిన రాజస్తానీ వంటకాలను వడ్డించినట్లు తెలిసింది. వధూవరుల కుటుంబ సభ్యు లు, అత్యంత సన్నిహితుల మధ్య మూడు రోజులపాటు సాగే ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ‘హల్దీ’సంబరాలు నిర్వహించగా, శనివారం ‘మెహందీ, సంగీత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ‘వరమాల’కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 11.30 గంటల ముహూర్త సమయాన సంప్రదాయ రీతిలో పెళ్లి తంతును నిర్వహిస్తామని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. తమ వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను సింధు కుటుంబం ఆహ్వానించింది. అయితే పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆత్మీ యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.మంగళవారం నాడు హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడ ల్లో రెండు పతకాలు, వరల్డ్ చాంపియన్‌షిప్ సహా పలు అగ్రశ్రేణి టోర్నీల్లో విజేతగా నిలిచిన సింధు.. భారత బ్యాడ్మింటన్‌లో అతి పెద్ద స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలంగా స్నేహం..సింధు, దత్తసాయి కుటుంబాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఇటీవలే వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు ఖాయం చేశాయి. హైదరా బాద్‌కు చెందిన డేటా మేనేజ్మెంట్ సొల్యూ షన్ సంస్థ ‘పొసి డెక్స్ టెక్నాలజీస్’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దత్తసాయి పని చేస్తున్నారు. ఆయన తండ్రి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ ఎస్)లో ఉన్నతాధికారిగా పని చేసి రిటైర్ అయిన జీటీ వెంకటేశ్వర రావు.. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. పొసిడెక్స్ టెక్నాలజీస్ ఇటీవలి వరకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ‘ధరణి’పోర్టల్‌ను నిర్వహించింది. డేటా సైన్స్‌లో మాస్టర్స్ చేసిన దత్తసాయి స్వయంగా క్రీడాభిమాని. జేఎస్ డబ్ల్యూ సంస్థలో పని చేసినప్పుడు ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన ఆపరే షన్స్‌ను దత్తసాయి పర్యవేక్షించాడు. జనవరి నుంచి సింధు వరుసగా వేర్వేరు టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం ఉండటంతో డిసెంబర్లోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. -
మౌంట్ అబూపై చంపేస్తున్న చలి.. అయినా తగ్గని పర్యాటక జనం
జైపూర్: రాజస్థాన్‌లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. పలు జిల్లాల్లో గడ్డకట్టేంత చలి ఉంటోంది. రాజధాని జైపూర్‌లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల దిగువకు పడిపోయింది. ఇక్కడి హిల్ స్టేషన్ మౌంట్ అబూలో ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇంతటి చలిలోనూ మౌంట్ అబూను సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇంతకీ మౌంట్ అబూలో చూసేందుకు ఏమున్నాయి?రాజస్థాన్‌లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. అక్కడి సంస్కృతి, ప్రజల జీవనశైలి, సంప్రదాయ వారసత్వం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోని మౌంట్ అబూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్. నిత్యం ఇక్కడ పర్యాటకుల సందడి కనిపిస్తుంది. చరిత్రలోని వివరాల ప్రకారం సిరోహి మహారాజు ఒకప్పుడు మౌంట్ అబూను బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చాడు. దీంతో బ్రిటీషర్లు మౌంట్ అబూను తమ వేసవి విడిదిగా మార్చుకుని, అభివృద్ధి చేశారు. అచల్‌ఘర్ కోటమౌంట్ అబూలోని అచల్‌ఘర్ కోట ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. హిల్ స్టేషన్‌కు ఈ కోట అందాన్ని తీసుకువస్తుంది. ఈ కోటను మావద్ రాణా కుంభ్ నిర్మించాడు. ఈ కోట ఒక కొండపై ఉంది. ఇక్కడ నుండి కిందనున్న పట్టణాన్ని చూడవచ్చు. కోటలో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఆలయంలో కొలువైన శివునికి ఇక్కడికి వచ్చే పర్యాటకులు పూజలు నిర్వహిస్తుంటారు.సన్‌సెట్ పాయింట్హిల్ స్టేషన్లలో సూర్యోదయం- సూర్యాస్తమయం పాయింట్లు ఎంతో ముచ్చటగొలుపుతాయి. ఇదేవిధంగా మౌంట్ అబూపై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం మధురానుభూతులను అందిస్తుంది. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.టోడ్ రాక్మౌంట్ అబూలో తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి టోడ్ రాక్. ఇదొక భారీ రాయి. ఈ రాయి ఆకారం కప్ప మాదిరిగా ఉంటుంది. ఈ రాతికప్ప నదిలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. టోడ్ రాక్‌ను చూసినవారు ఆశ్చర్యానికి గురవుతుంటారు. నక్కీ సరస్సుఈ సరస్సును దేవతలు స్వయంగా తవ్వారని చెబుతుంటారు. ఈ సరస్సులోని నీరు శీతాకాలంలో ఘనీభవిస్తుంది. నీటిపై మంచు ఒక షీట్ మాదిరిగా విస్తరించివుంటుంది. ఎత్తైన కొండపై ఉన్న ఈ సరస్సు ఇక్కడి ప్రకృతి అందాలకు పరాకాష్టగా నిలుస్తుంది. సాయంత్రం సమయాన ఈ సరస్సును చూడటం ప్రత్యేక అనుభూతని అందిస్తుంది.ఎలా వెళ్లాలి?మౌంట్ అబూకు పలు రవాణా మార్గాలలో చేరుకోవచ్చు. ఇక్కడికి 185 కి.మీ దూరంలో ఉదయపూర్ విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీని పట్టుకుని మౌంట్ అబూను చేరుకోవచ్చు. అలాగే ఇక్కడికి సమీపంలో అబూ రోడ్ రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఢిల్లీ నుంచి నేరుగా మౌంట్ అబూకు బస్సులు ఉన్నాయి. ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
వాళ్లు చెయ్యరు.. ఇతరుల్ని చెయ్యనివ్వరు..!
జైపూర్: రైతులకు అండగా ఉంటామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నేతలు.. వాస్తవానికి అన్నదాతల కోసం ఏమీ చేయలేదని, ఇతరులను కూడా చేయనివ్వరని ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించడానికి బదులుగా ఆ పార్టీ రెచ్చగొడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరికి ఈస్టర్న్ రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్సీపీ) ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈఆర్సీపీ అసంపూర్తిగా ఇంతకాలం నిలిచిపోవడానికి కాంగ్రెస్సే కారణన్నారు. చంబల్ నదీ పరివాహక ప్రాంతం నుంచి రాజస్తాన్‌లోని 13 జిల్లాలకు నీటిని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ‘నీటి వివాదాలకు పరిష్కారం వెదకాలని కాంగ్రెస్ ఏనాడూ భావించలేదు. మన నదుల్లోని నీరు సరిహద్దులు దాటి వెళుతోంది. కానీ, మన రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీనికి పరిష్కారం చూపడం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల మధ్య నీటి పంపకం వివాదాలను ప్రేరేపిస్తోంది’అని ఆయన అన్నారు. రాజస్తాన్‌లోని బీజేపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం జైపూర్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పైవ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రూ.46,300 కోట్ల విలువైన ఇంధనం, రహదారులు, రైల్వేలు, జల సంబంధం 24 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గుజరాత్ సీఎంగా ఉండగా నర్మదా నదీ జలాలను సద్వినియోగం చేసుకునేలా పలు ప్రాజెక్టులను తలపెడితే కాంగ్రెస్, కొన్ని ఎన్జీవోలు వాటిని అడ్డుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాయన్నారు. -
11 నదుల అనుంధానానికి రూ. 40 వేల కోట్లు
దేశంలో నదుల అనుసంధానం వివిధ ప్రాంతాలు తాగు,సాగునీటి అవసరాలను తీరుస్తుందనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం. దీనిని రాజస్థాన్‌లో సాకారం చేసేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది.రాజస్థాన్‌లోని 11 నదులను అనుసంధానం చేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజస్థాన్‌ను నీటి మిగులు రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్లో జరిగిన సుచి సెమికాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ, భవిష్యత్తులో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటర్ హార్వెస్టింగ్‌పై కృషి చేయాలని ఆయన వివిధ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.రాజస్థాన్‌లో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని, నరేంద్ర మోదీ ప్రారంభించనున్న 11 నదులను అనుసంధానించే ప్రాజెక్టుతో రాష్టంలో తలెత్తుతున్న నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రాజస్థాన్-మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు ద్వారా ఆయా రాష్ట్రాలలో నీటి ఎద్దడి తగ్గుతుందన్నారు. నూతనంగా చంబల్, దాని ఉపనదులైన పార్వతి, కలిసింద్, కునో, బనాస్, బంగంగా, రూపారెల్, గంభీరి, మేజ్ తదిర ప్రధాన నదులను అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఫలితంగా ఝలావర్, కోట, బుండి, టోంక్, సవాయి మాధోపూర్, గంగాపూర్, దౌసా, కరౌలి, భరత్పూర్, రాజస్థాన్‌లోని అల్వార్ మధ్యప్రదేశ్‌లోని గుణ, శివపురి, షియోపూర్, సెహోర్‌లతో సహా కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
చలి గుప్పెట ఉత్తరాది
న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లతో పాటు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలి తీవ్రతతో గజగజ లాడుతున్నాయి. చాలా చోట్ల ఆదివారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కంటే ఇది 0.2 డిగ్రీలు తక్కువ. అయితే, కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 4.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సాధారణం కంటే ఇది 3.1 డిగ్రీలు తక్కువ. ప్రస్తుతానికి శీతల గాలులు లేవని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. పంజాబ్, హరియాణాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగానే ఉందని ఐఎండీ పేర్కొంది. అత్యల్పంగా ఫరీద్‌కోట్‌లో 1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, భటిండాల్లో కనీస ఉష్ణోగ్రతలు వరుసగా 2 డిగ్రీలు, 4.6 డిగ్రీలు నమోదయ్యాయి. హరియాణాలోని హిస్సార్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 1.7 డిగ్రీలుగా ఉంది. రాజస్తాన్‌లోని ఫతేపూ ర్లో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని కొండ ప్రాంతంలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉనాలో శీతల గాలుల ప్రభా వంతో 0.2 డిగ్రీలు, సుందర్‌నగర్‌లో 0.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో, సొలాన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 24.7 డిగ్రీలు, సిమ్లాలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో –3.4 డిగ్రీలు, గుల్మార్గ్లో –4.8 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నట్లు వెల్లడించింది. -
బోరు బావిలో పడ్డ బాలుడు
-
ఇది టెక్, డేటా శతాబ్ది సంస్కరణలు..
జైపూర్: సంస్కరణలు, పనితీరు, పారదర్శ కతలను పాటిస్తూ భారత్ సాధించిన అభివృద్ధి ఇప్పుడు ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం జైపూర్‌లోని ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్లో మొదలైన ‘రైజింగ్ రాజస్తాన్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రధాని ప్రసంగించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారుడు, నిపుణుడు భారత్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. గత పదేళ్లలో భారత్ పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగింది. సంక్షోభాల సమయంలోనూ నిరాటంకంగా ఉత్పత్తిని కొనసాగించే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను ప్రపంచం కోరుకుంటోంది. అలాంటి భారీ ఉత్పత్తి క్షేత్రంగా భారత్ ఎదగాలి. భారత్ వంటి వైవిధ్యభరిత దేశంలో ప్రజా స్వామ్యం పరిఢవిల్లడం కలిసొచ్చే అంశం. ప్రజాస్వామ్యయుతంగా మానవాళి సంక్షేమం కోసం పాటుపడటం భారత విధానం. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్నే ఎన్నకుంటున్నారు. ఈ సంస్కృతిని యువశక్తి మరింత ముందుకు తీసుకెళ్తోంది. యువభా రతంగా మనం ఇంకా చాన్నాళ్లు మనం కొనసా గబోతున్నాం. భారత్‌లో అత్యంత ఎక్కువ మంది యువత, అందులోనూ నైపుణ్యవంతులైన యువత అందుబాటులో ఉన్నారు. డిజిటల్ సాంకేతికతను ప్రజాస్వామీకరణ చేయడం ద్వారా ప్రయోజనాలు ప్రజలందరికీ దక్కుతాయని భారత్ నిరూపించింది. ఈ శతాబ్దిని టెక్నాలజీ, డేటాలే ముందుకు నడిపిస్తాయి’’ అన్నారు. -
కోటా జోరుకు కళ్లెం
కోటా: రాజస్తాన్‌లోని కోటా. పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రంగా దేశంలోనే అగ్రగామిగా పేరున్న నగరం. విద్యార్థులతో కళకళలాడుతూ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులకు కాసులు కురిపించే ఈ నగరం కళ తప్పుతోందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలి కాలంలో కోటాకు శిక్షణ కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు? శిక్షణ కోసం వచ్చే విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు, కోచింగ్ సెంటర్లను వేరే ప్రాంతాలకు విస్తరించడం వంటి కారణాలూ దీని వెనుక ఉన్నాయని చెబుతున్నారు. కోచింగ్ సెంటర్లు 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోరాదనే నిబంధన వల్ల ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు.వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోటాకు ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు విద్యార్థులు వస్తుంటారు. వీరి వల్ల నగరంలోని అన్ని రంగాలకు కలిపి ఏటా సుమారు రూ.7 వేల కోట్ల వరకు ఆదాయం ఉండేది. అయితే, ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 85 వేల నుంచి లక్ష వరకు తగ్గిపోయింది. ఫలితంగా ఆదాయం కూడా ఈసారి ఒక్కసారిగా సగానికి సగం, రూ.3,500 కోట్లకు పడిపోయింది.నిర్వాహకుల ధీమాఅత్యుత్తమ శిక్షణకు కోటాకు ఉన్న విశ్వసనీయత ఏమాత్రం చెక్కుచెదరలేదని, విద్యార్థులకు ఇతర నగరాల్లో లేనటువంటి అనుకూల వాతావరణం ఇక్కడ ఉన్నందున ఈ తగ్గుదల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, మున్ముందు తిరిగి పుంజుకుంటామని కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులు ధీమాతో ఉన్నారు. వచ్చే ఏడాదిలో తమ నష్టాలు పూడ్చుకుంటామని రాజస్తాన్ ఇండస్ట్రీస్ యునైటెడ్ కౌన్సిల్ జోనల్ చైర్ పర్సన్ గోవింద్రామ్ మిట్టల్ బల్లగుద్ది చెబుతున్నారు. బెంగళూరులో మాదిరిగా కోటాలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు గల ప్రత్యామ్నాయ అవకాశాలనూ పారిశ్రామిక వేత్తలు పరిశీలిస్తున్నారని వివరించారు. ప్రైవేట్ కంపెనీల్లో మేనేజ్మెంట్ పోస్టుల్లో సగానికి సగం, నాన్ మేనేజ్మెంట్ పోస్టుల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ పారిశ్రామికవేత్తలు..ఐటీ హబ్‌లను కోటాకు మార్చాలంటూ బెంగళూరులోని ఐటీ కంపెనీల అధిప తులను కోరడం, కొందరు ఓకే అనడం జరిగిపోయాయని ఆయన అన్నారు. లోక్‌సభ స్పీకర్, కోటా–బుండి ఎంపీ ఓం బిర్లా ఆదేశాల మేరకు కోటాలో ఐటీ హబ్‌ల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపుల ప్రక్రియ మొదలైందని ఆయన వివరించారు.వాయిదాలకు సైతం కష్టంగా ఉంది‘గతేడాది వరకు రోజులో 60 మంది వరకు విద్యార్థులు నా ఆటోలో ప్రయాణించే వారు. మంచి ఆదాయం ఉండటంతో కుటుంబ పోషణ ఏమాత్రం ఇబ్బందిలేకుండా ఉండేది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 20కి తగ్గింది. ఆదాయం కూడా పడిపోయింది. రుణంపై కొనుగోలు చేసిన వాహనానికి కిస్తీలు చెల్లించేందుకు సైతం ఇబ్బందవుతోంది’అని స్థానిక ఆటో డ్రైవర్ ఒకరు చెప్పారు.ఇబ్బందుల్లో హాస్టళ్ల యజమానులుకోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల పరిశ్రమ సంక్షోభంలో పడిన మాట నిజమేనని కోటా హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్టల్ ఒప్పుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కోటాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా 30 శాతం నుంచి 40 శాతం మేర పడిపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు తెచ్చి పలు హాస్టళ్లను ఏర్పాటు చేసుకున్న కొందరు యజమానులు వాయిదాలు చెల్లించలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. నగరంలో ఉన్న 4,500 హోటళ్లలో చాలా చోట్ల విద్యార్థుల ఆక్యుపెన్సీ రేటు 40–50 శాతానికి మధ్య పడిపోయిందన్నారు. ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఆత్మహత్యల పరంగా చూసే దేశంలోని 50 నగరాల తర్వాత దిగువన కోటా ఉంది. అయితే, ఆత్మహత్య ఘటనల ప్రచారంతో ప్రతికూల ప్రభావం పడింది’అని నవీన్ అన్నారు. హాస్టళ్లలో రూం అద్దెలు నెలకు రూ.15వేలుండగా ఇప్పుడది రూ.9 వేలకు తగ్గిందని, చాలా హాస్టళ్లు ఖాళీగానే ఉన్నాయని స్థానిక కోరల్‌పార్క్ ప్రాంతంలోని హాస్టల్ యజమాని ఒకరన్నారు. -
వీడు మాములోడు కాదు.... ఖతర్నాక్!’ ఇదొక ఎమోషనల్ క్రైం స్టోరీ
ఓ ప్రొఫెషనల్ కిల్లర్ చేయని హత్యకు పోలీసుల నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్పైడర్‌మ్యాన్ మాదిరి జంప్ చేసి రైలెక్కుతాడు. ఆ రైల్లో ‘బేసిక్‌గానే బ్యాడ్ జాతకం’ ఉన్న ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. ఇంటి నుంచి చిన్నప్పుడే పారిపోయిన ఆ వ్యక్తి.. తిరిగి కుటుంబాన్ని కలుసుకునే ఎగ్జైట్మెంట్లో ఉంటాడు. ఇంతలో బుల్లెట్ ప్రాణం ఆ వ్యక్తి తీసేస్తుంది. దీంతో అసలు పార్థు బదులు ‘అతడు’ బాసర్లపూడికి వెళ్లాల్సి వస్తుంది. ఇదో సినిమా కథ.. కానీ, ఇక్కడ నిజజీవితంలో కొడుకు కాని కొడుకు ఒకడు ఓ కుటుంబాన్ని మోసం చేయాలనుకున్న తీరు గురించి తెలిస్తే.. మీరు కూడా ‘వీడు మాములోడు కాదు.. ఖతర్నాక్’ అనుకోవడం ఖాయం!.ఊరు: యూపీ ఘజియాబాద్ స్థలం: ఖోడా పోలీస్ స్టేషన్.. తేదీ నవంబర్ 21, టైం.. సరిగ్గా తెలియదు.మూడు పదుల వయసులో ఉన్న ఓ వ్యక్తి పీఎస్‌కు వచ్చాడు. తనను చిన్నప్పుడే ఎవరో ఎత్తుకెళ్లారని.. కన్నవాళ్లకు దూరమై ఇన్నాళ్లు నరకయాతన అనుభవించానని.. వాళ్ల కోసం ఎక్కడెక్కడో తిరిగానని.. తన కుటుంబాన్ని ఎలాగైనా వెతికిపెట్టమని పోలీసులను బతిమిలాడాడు. ఆ కన్నీళ్లకు పోలీసులు జాలిపడ్డారు. బట్టలు, చెప్పులు కొనిచ్చి.. తిండి పెట్టి స్టేషన్లోనే ఉండనిచ్చారు. ఈలోపు అతనిచ్చిన సమాచారంతో మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రయత్నం ఫలించి చివరకు ఓ కుటుంబం అతడి కోసం స్టేషన్‌కు వచ్చింది.అది 1993 సంవత్సరం.. తేదీ సెప్టెంబర్ 08సమయం: పిల్లలు బడుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంస్కూల్ నుంచి షాహిబాబాద్(ఢిల్లీ)లోని ఇంటికి తన సోదరితో బయల్దేరిన ఏడేళ్ల రాజును.. ఎవరో బలవంతంగా తమ వాహనంలో ఎత్తుకెళ్లారు. ఆ చిన్నారి పరుగున వచ్చి అన్నను ఎవరో ఎత్తుకెళ్లారని ఇంట్లో విషయం చెప్పింది. ఆందోళనతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఊరంతా జల్లెడ పట్టారు. లాభం లేకపోయింది. అయితే అటు కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్ లేకపోవడం.. పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో ఇన్నేళ్లుగా ఆ కేసు ఓ మిస్టరీగానే ఉండిపోయింది.చివరకు.. ఇన్నేళ్ల తర్వాత తానే ఆ రాజునంటూ ఓ వ్యక్తి వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. తనను రాజస్థాన్‌కు తీసుకెళ్లి హింసించారని, ఓ ఇంట్లో బంధించి పనులు చేయించుకున్నారని, ఆ ఇంట్లో ఓ పాప తనకు ధైర్యం చెబుతూ వచ్చిందని, ఎలాగోలా తప్పించుకుని ఊరు దాటానని, ఇన్నేళ్లు ఏవేవో పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడో తిరిగానని.. కన్నీళ్లతో చెప్పాడు రాజు. హనుమాన్ దయవల్లే తాను బతికి బట్టకట్టానని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలతో చలించిపోయిన వాళ్ల అమ్మ.. అతన్ని అక్కున చేర్చుకుంది. ఇన్నేళ్ల తర్వాత కొడుకు తిరిగి వచ్చాడన్న ఆనందంలో అంతా మునిగిపోయారు. అక్కడి మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఈ ఎమోషనల్ రీయూనియన్ మీద వరుసబెట్టి కథనాలు ఇచ్చింది. ఇక్కడితో కథ సుఖాంతం అయ్యిందనుకునేరు!.ఇంటికి చేరుకున్నవాడు తిన్నగా ఉంటే ఫర్వాలేదు. కానీ, ఆస్తుల గురించి, ఇంట్లో దాచిన బంగారం.. డబ్బు గురించి పదే పదే ఆరా తీయడం మొదలుపెట్టాడట. దీంతో వారం తిరగకముందే ఆ కుటుంబం మళ్లీ ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. అనుమానాల నడుమ.. డీఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తే అతను వాళ్ల కొడుకే కాదని తేలింది. దీంతో పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. తమ స్టైల్ ఇంటరాగేషన్ చేసి నిజాలు కక్కించారు.రాజస్థాన్‌కు చెందిన రాజు అలియాస్ భీమ్ అలియాస్ ఇంద్రరాజ్ అలియాస్.. చిన్నప్పటి నుంచే దొంగతనం అలవర్చుకున్నాడు. బంధువుల ఇళ్లను సైతం వదల్లేదు. దీంతో వాళ్ల శాపనార్థాలు భరించలేక ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఊరూరా తిరుగుతూ చోరీలు చేస్తూ పోయాడు. ఈ క్రమంలో.. అతనికో ఆలోచన వచ్చింది.తన ఐడెంటిటీని మార్చుకుంటూ ఊర్లు తిరగసాగాడు. తన తల్లి చనిపోయిందని, తాను అనాథనంటూ పని కావాలంటూ.. ఎమోషనల్ డ్రామాలు ఆడేవాడు. దీంతో కరిగిపోయి వాళ్లు అతన్ని చేరదీసేవారు. అయితే చెప్పాపెట్టకుండా ఏదో ఒక రాత్రి.. ఆ ఇంట్లోని నగదు, బంగారంతో ఉడాయించేవాడు. అలా.. ఇప్పటిదాకా 9 కుటుంబాలను అతను మోసం చేసినట్లు ఘజియాబాద్ పోలీసులు నిర్ధారించారు.ఈ క్రమంలో.. ఘజియాబాద్‌లో ఓ ధనికుల కుటుంబంలో పిల్లాడు.. చిన్నవయసులోనే ఇంట్లోంచి పారిపోయాడని తెలుసుకున్నాడు. పోలీసులనే ఏమార్చి ఆ ఇంటికి కన్నం వేయాలనుకున్నాడు. కానీ, చివరకు అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నాడు ఈ కొడుకు కాని కొడుకు.गाजियाबाद में 30 साल पहले अगवा हुआ बेटा लौटा था घर, वो निकला धोखेबाज, इस तरह का अपराध कई बार कर चुका है; परिवारों को बताया कि वो उनका लापता परिजन है#Ghaziabad #Police #GhaziabadPolice #kidnapped #lostrelative @ghaziabadpolice #imposter #Jantv_BM #jantvdigital #jantvreel pic.twitter.com/gcnPLT77lU— JAN TV (@JANTV2012) December 7, 2024 Video Credits: JAN TV -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్ ఐ–లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు రెండో విజయం నమోదు చేసింది. డెక్కన్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ యునైటెడ్ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున ఏంజెల్ ఒరెలీన్ (21వ, 86వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. రాజస్తాన్ యునైటెడ్ జట్టుకు మన్చోంగ్ (57వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు ఆరు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఈనెల 9న ఢిల్లీ ఎఫ్‌సీతో శ్రీనిధి డెక్కన్ జట్టు తలపడుతుంది. -
రాజస్థాన్‌లో పెళ్లి పార్టీ.. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ అన్‌సీన్ ఫోటోలు
-
పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్‌తో రిలేషన్!.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధుకు పెళ్లి గడియలు సమీపించాయి. వెంకట దత్తసాయి(Venkata DattaSai) అనే వ్యక్తితో ఆమె వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా నిర్దారించారు.ఆసక్తికర విషయాలుఈ నేపథ్యంలో పీవీ సింధుకు కాబోయే భర్త, వరుడు వెంకట దత్తసాయి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటన్న అంశం గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా అందుకున్నారు.అంతకంటే ముందు.. ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఇక బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డాటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో వెంకట దత్తసాయి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.ఢిల్లీ క్యాపిటల్స్తోనూఅనంతరం.. బహుళజాతి సంస్థ జేఎస్‌డబ్ల్యూ(జిందాల్ సౌత్ వెస్ట్)లో వెంకట దత్తసాయి తన కెరీర్ మొదలుపెట్టారు. అక్కడ సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్హౌజ్గా కన్సల్టెంట్‌గా పనిచేశారు. అయితే, తన విధుల్లో భాగంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూపునకు చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ ఆయన కలిసి పనిచేసినట్లు సమాచారం.లింక్డిన్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు.. ‘‘ఐపీఎల్ జట్టు నిర్వహణతో పోలిస్తే నా బీబీఏ డిగ్రీ తక్కువగానే అనిపించవచ్చు. అయితే, ఈ రెండింటి నుంచి నేను కావాల్సినంత విజ్ఞానం పొందాను’’ అని వెంకట దత్తసాయి రాసుకొచ్చారు.కృతజ్ఞతలు సింధుఇక గతంలోనూ వెంకట దత్తసాయి, పీవి సింధుకు లింక్డిన్లో రిప్లై ఇచ్చిన తీరును కూడా నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. దత్తసాయి తండ్రిని ఉద్దేశించి.. ‘‘లింక్డిన్‌లోకి స్వాగతం అంకుల్. ఈ ప్లాట్‌ఫామ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి’’ అని పీవీ సింధు పేర్కొనగా.. ‘‘నాన్నను స్వాగతించినందుకు కృతజ్ఞతలు సింధు’’ అని వెంకట దత్తసాయి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్ వేదికగాకాగా వెంకట దత్తసాయి ప్రస్తుతం ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక పీవీ సింధు వివాహానికి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. డిసెంబరు 22న పెళ్లి జరుగనుంది. రెండురోజుల తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక సింధు- వెంకట దత్తసాయి కుటుంబాలకు ఇది వరకే పరిచయం ఉంది. కాగా సింధు 2016 రియో విశ్వ క్రీడల్లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బీసీసీఐ మ్యాచ్.. 10కి 10 వికెట్లు సాధించిన 18 ఏళ్ల యువ కెరటం
పట్నా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న కూచ్ బెహార్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో బిహార్ ఎడంచేతి వాటం స్పిన్నర్ సుమన్ కుమార్ అద్భుతం చేశాడు. రాజస్తాన్‌తో ఇక్కడి మొయిన్ ఉల్ హఖ్ స్టేడియంలో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో 18 ఏళ్ల సుమన్ ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసుకున్నాడు. సుమన్ 33.5 ఓవర్లలో 20 మెయిడెన్లు వేసి 53 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. సుమన్ ధాటికి రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. బిహార్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులకు ఆలౌటైంది. 285 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన బిహార్ జట్టు రాజస్తాన్‌ను ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో రాజస్తాన్ జట్టు బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మొత్తం 137.5 ఓవర్లలో రాజస్తాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.కూచ్ బెహార్ ట్రోఫీ చరిత్రలో ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా సుమన్ కుమార్ గుర్తింపు పొందాడు. గతంలో ఆంధ్ర బౌలర్ మెహబూబ్ బాషా (2010లో త్రిపురపై 44 పరుగులకు 10 వికెట్లు), మణిపూర్ పేస్ బౌలర్ రెక్స్ రాజ్‌కుమార్ సింగ్ (2018లో అరుణాచల్ ప్రదేశ్‌పై 11 పరుగులకు 10 వికెట్లు) ఈ ఘనత సాధించారు. -
అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం
అజ్మీర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ప్రఖ్యాత అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం మొదలైంది. ప్రస్తుతం దర్గా ఉన్న స్థలంలో గతంలో శివాలయం ఉండేదని పేర్కొంటూ కొందరు స్థానిక సివిల్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. శివాలయాన్ని కూల్చివేసి, సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ పేరిట దర్గా నిర్మించారని వారు పేర్కొన్నారు. దర్గా ప్రాంగణాన్ని దేవాలయంగా గుర్తించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బుధవారం అజ్మీర్ దర్గా కమిటీకి, మైనార్టీ వ్యవహారాల శాఖకు, భారత పురావస్తు సర్వే విభాగానికి(ఏఎస్ఐ)కి నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో షాహీ జామా మసీదు సర్వే వ్యవహారంలో ఘర్షణ జరిగి నలుగు మృతిచెందిన కొన్ని రోజులకే అజ్మీర్ దర్గాపై కోర్టు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అజ్మీర్ సైతం మత ఘర్షణలకు కేంద్రంగా మారుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో అలజడి సృష్టించడానికే పిటిషన్ ఇదిలా ఉండగా, అజ్మీర్ దర్గా వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. మతాల పేరిట చిచ్చురేపి, సమాజంలో అలజడి సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని అజ్మీర్ దర్గాను పర్యవేక్షించే అంజుమన్ సయీద్ జద్గాన్ కార్యదర్శి సయీద్ సర్వర్‌చిïÙ్త ఆరోపించారు. మతాలవారీగా సమాజాన్ని ముక్కలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మత సామరస్యానికి, లౌకికవాదానికి ప్రతీక అయిన అజ్మీర్ దర్గా మైనార్టీ వ్యవహారాల శాఖ పరిధిలోకి వస్తుందని, దీంతో ఏఎస్ఐకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏమిటీ వివాదం?: అజ్మీర్ దర్గాను సంకట్ మోచన్ మహాదేవ్ ఆలయంగా ప్రకటించాలని కోరుతూ సెప్టెంబర్ నెలలో అజ్మీర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్కడ పూజలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింన తర్వాత తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. అజ్మీర్ దర్గాకు ఏదైనా రిజి్రస్టేషన్ ఉంటే వెంటనే రద్దు చేయాలని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా డిమాండ్ చేశారు. ఏఎస్ఐ ద్వారా అక్కడ సర్వే చేపట్టాలని, దర్గా ప్రాంగణంలో పూజలు చేసుకొనే హక్కు హిందువులకు కల్పించాలని పేర్కొన్నారు. దర్గా ఉన్నచోట శివాలయం ఉండేదని, హరవిలాస్ సర్దా రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారని గుర్తుచేశారు. సర్వే చేస్తే నష్టమేంటి? గిరిరాజ్ సింగ్ అజ్మీర్ దర్గాలో సర్వే చేయాలని కోర్టు ఉత్తర్వు ఇచ్చింందని, సర్వే చేస్తే వచ్చిన సమస్య ఏమిటి? కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. మొఘల్ రాజులు మన దేశంపైకి దండెత్తి వచ్చారని, ఇక్కడి ఆలయాన్ని కూల్చేశా రని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చే స్తోందని విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ 1947లోనే ఈ బుజ్జగింపు రాజకీయాలు ఆపేసి ఉంటే ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు: ఒవైసీ అజ్మీర్ దర్గా 800 ఏళ్లుగా ఉందని ఐఎంఐ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఉర్స్ సందర్భంగా ప్రధానమంత్రి అక్కడ చాదర్ సమరి్పంచడం సంప్రదాయంగా వస్తోందని, ఇప్పటిదాకా పనిచేసిన ప్రధానులంతా ఈ సంప్రదాయం పాటించారని వెల్లడించారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలతో దేశానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం–1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలను యథాతథంగా కొనసాగించాలని, వాటిలో ఎలాంటి మార్పులు చేయరాదని ఒవైసీ తేల్చిచెప్పారు. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం: కపిల్ సిబల్ అజ్మీర్ దర్గా విషయంలో రగడ జరుగుతుండడం బాధాకరమని ఎంపీ కపిల్ సిబల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మన దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ఇదంతా ఎందుకు? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాకపోవడంతో కొందరు వ్యక్తులు ఓ వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకొని, గొడవలు సృష్టిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మొహిబుల్లా నద్వీ ఆరోపించారు. సివిల్ కోర్టు ఉత్తర్వును పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జాద్‌గనీ లోన్ తప్పుపపట్టారు. -
ఉదయ్పూర్ప్యాలెస్లో ఉద్రిక్తతలు.. మహారాజుకు నో ఎంట్రీ
జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్‌సమంద్ బీజేపీ ఎమ్మెల్యే, విశ్వరాజ్ సింగ్ మేవార్ను.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లోకి రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని పలువురు గాయపడ్డారు. ఈ పరిణామంతో మేవార్ రాజ కుటుంబంలో ఉన్న విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్‌ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాడ్ రాజ్య 77వ మహారాజుగా విశ్వరాజ్ సింగ్ సోమవారం పట్టాభిషికం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టాభిషేకం అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. అయితే ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్.. కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఉదయ్‌పుర్‌లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.ఉదయ్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం ఈయన నియంత్రణలోనే నడుతుస్తున్నాయి. దీంతో మహారాజు విశ్వరాజ్ సింగ్‌ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు వెళ్లిన మహారాజును , అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని లోనికి రాకుండా అడ్డుకుంది. విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను దాటుకొని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే విశ్వరాజ్ తన మద్దతుదారులతో కలిసి ప్యాలెస్ ముందు గత రాత్రి 5 గంటల పాటు నిలుచున్నారు. అనంతరం ఆయన అభిమానులు, మద్దుతుదారులు ప్యాలెస్‌పై రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్యాలెస్ లోపల ఉన్న వ్యక్తులు కూడా రాళ్లతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. మంగళవారం ఉదయపూర్ ప్యాలెస్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. -
ట్రక్కును ఢీకొట్టిన కారు.. అయిదుగురు మృత్యువాత
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయపూర్ జిల్లాలో ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అయిదుగురు వ్యక్తులు కారులో అంబేరి నుంచి దేవరీ వైపు వెళుతుండగా వారి వాహనం ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాలను అదుపులోకి తీసుకొని, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఉదయపూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి హిమాన్షు సింగ్ రాజావత్ తెలిపారు. -
Rajasthan By-Election: ‘ఫలితాల’తో నాలుగు నిర్ణయాలకు ముడిపెట్టి..
జైపూర్: రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నేడు (బుధవారం) ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇది కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షరాష్ట్రంలో జరిగిన ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాలా వద్దా అనే దానిపై న్యాయ మంత్రి జోగారామ్ పటేల్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. దీనిని సీఎం భజన్‌లాల్ శర్మకు అందించింది. దీనిపై సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నివేదికపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.కొత్త జిల్లాలపై నిర్ణయంగత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 17 కొత్త జిల్లాల భవిష్యత్తుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ నివేదిక రూపొందించింది. ఐదు చిన్న జిల్లాలను మళ్లీ పాత జిల్లాల్లో కలపవచ్చని సమాచారం. డిసెంబరు 31లోగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.గత ప్రభుత్వ నిర్ణయాలు రద్దు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు వైద్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వసర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదికను రూపొందించింది. దీనిని త్వరలో ప్రభుత్వానికి సమర్పించనుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న భూకేటాయింపులతోపాటు పలు నిర్ణయాలను కమిటీ పరిశీలించింది.ఒకే రాష్ట్రం- ఒకే ఎన్నికలురాష్ట్ర ప్రభుత్వం కూడా వన్ స్టేట్- వన్ ఎలక్షన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి కొంత సమయం అవసరం ఉంటుంది. దీనిపై చర్చించేందుకు ఒక కమిటీని నియమించి. ఆ తర్వాత ఒక రాష్ట్రం- ఒక ఎన్నికల అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన -
పలు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు
న్యూఢిల్లీ: ఇప్పుడు దేశమంతటా చలి వాతావరణం నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వీస్తున్న చలి గాలులు జనాలను గజగజ వణికిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.రాజధాని ఢిల్లీలో ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో పాటు విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. వాయుకాలుష్యంతో ఢిల్లీ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఉత్తర భారతదేశంలో రానున్న రోజుల్లో పొగమంచు, చలి పెరుగుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతుందనేది వాతావరణశాఖ తెలియజేసింది. Daily Weather Briefing English (17.11.2024)YouTube : https://t.co/E2s6UfbRiBFacebook : https://t.co/ql3wumSRyL#weatherupdate #rainfall #rainalerts #rain #IMDWeatherUpdate@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/0ZRZYLNQZl— India Meteorological Department (@Indiametdept) November 17, 2024వాతావరణ శాఖ అందించిన తాజా అప్డేట్ ప్రకారం హర్యానా, చండీగఢ్, ఉత్తర రాజస్థాన్, బీహార్, ఉత్తర, పంజాబ్, చండీగఢ్, ఉత్తర ఉత్తరప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ అస్సాం, మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో ఉదయం తీవ్రమైన చలి ఉంటుంది.Dense to very dense fog conditions very likely to prevail in isolated pockets of Haryana & Chandigarh in late night of 17th November and early morning of 18th November and dense fog for subsequent 24 hours#imdweatherupdate #visibilityalert #fogalert #densefog #verydensefog… pic.twitter.com/1E9GkQwqCZ— India Meteorological Department (@Indiametdept) November 17, 2024మాల్దీవుల మీదుగా దిగువ ట్రోపోస్పియర్లో, భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంలో తుఫాను సూచనలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు భారత ప్రాంతంలో ద్రోణి ఏర్పడింది. ఫలితంగా దక్షిణ భారతదేశంలో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో మెరుపులు వచ్చే అవకాశం ఉంది.Dense to very dense fog conditions very likely to prevail in isolated pockets of North Uttar Pradesh in late night of 17th November and early morning of 18th November and dense fog for subsequent 24 hours#imdweatherupdate #visibilityalert #fogalert #densefog #verydensefog #up… pic.twitter.com/bY61NZfrJM— India Meteorological Department (@Indiametdept) November 17, 2024తూర్పు అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ మీదుగా బలమైన గాలులతో టైఫూన్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు(సోమవారం)రేపు(మంగళవారం) తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఇది కూడా చదవండి: Gujarat: ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి -
ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!
రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు మహిపాల్ లోమ్రార్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (360 బంతుల్లో 300; 25 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు టీ విరామం సమయానికి రాజస్థాన్ స్కోర్ 660/7గా ఉంది. లోమ్రార్‌తో పాటు కుక్నా అజయ్ సింగ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో లోమ్రార్‌కు జతగా మరో ఆటగాడు సెంచరీ చేశాడు. కార్తీక్ శర్మ 115 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. టెయిలెండర్లు భరత్ శర్మ 54, దీపక్ చాహర్ 35 పరుగులు చేయగా.. అభిజిత్ తోమర్ 20, రామ్మోహన్ చౌహాన్ 29, జుబైర్ అలీ ఖాన్ 26, దీపక్ హూడా 10 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో దీపక్ దాపోలా, స్వప్నిల్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకిత్ మనోర్, అభయ్ నేగి, అవనీశ్ సుధ తలో వికెట్ దక్కించుకున్నారు.ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!24 ఏళ్ల మహిపాల్ లోమ్రార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇటీవల వదిలేసింది. 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో లోమ్రార్‌కు చోటు దక్కలేదు. ఆర్సీబీ వదిలేసిందన్న కసితో చెలరేగిపోయిన లోమ్రార్ ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో లోమ్రార్ మరెన్ని పరుగులు చేస్తాడో వేచి చూడాలి. లోమ్రార్ ఆర్సీబీ వదిలేసిన నాటి నుంచి కసితో రగిలిపోతున్నాడు. తాజా ట్రిపుల్ సెంచరీకి ముందు మ్యాచ్‌లో లోమ్రార్ సెంచరీ చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 111 పరుగులు చేశాడు. ఇదే రంజీ సీజన్లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ లోమ్రార్ చెలరేగి ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. లోమ్రార్ అరివీర భయంకర ఫామ్‌ను చూసి ఆర్సీబీ అతన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేస్తుందేమో వేచి చూడాలి. లోమ్రార్‌ను ఆర్సీబీ 2022 సీజన్లో 95 లక్షలకు దక్కించుకుంది. లోమ్రార్ 2018లో ఐపీఎల్ అరంగేట్రం చేసి వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. -
రాజస్థాన్‌లో చెలరేగిన హింస.. 60 మంది అరెస్ట్
టోంక్: రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలోని డియోలీ ఉనియారాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నరేష్ మీనా ఎన్నికల విధుల్లో ఉన్న ఎస్‌డిఎం అమిత్ చౌదరిని చెప్పుతో కొట్టారు. అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. #WATCH | Rajasthan by-poll independent candidate from Deoli-Uniara, Naresh Meena allegedly physically assaulted SDM at a polling station in Samravata villageVehicles vandalised and torched in Samravata village after the incident. pic.twitter.com/dv8jLnymh2— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 13, 2024ఈ ఉదంతంపై ఫిర్యాదు అందిన దరిమిలా పోలీసులు నరేష్ మీనాను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, సంరవత గ్రామస్తులు పోలీసులపై దాడి చేసి, దౌర్జన్యానికి దిగారు. నరేష్ మీనా మద్దతుదారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఉదంతంలో ఇప్పటి వరకు 60 మందిని అరెస్ట్ చేసినట్లు అజ్మీర్ రేంజ్ ఐజీ ఓం ప్రకాశ్ తెలిపారు. టోంక్ హింసాకాండపై జిల్లా అదనపు ఎస్పీ బ్రిజేంద్ర సింగ్ భాటి మాట్లాడుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు నరేష్ మీనా కోసం వెతుకుతున్నామని తెలిపారు. గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. Rajasthan: 60 people have been arrested so far in the case of ruckus, stone pelting, and arson incident in Samravata village last night, when police tried to apprehend Naresh Meena, independent candidate for Deoli Uniara assembly constituency by-polls in Tonk district, after he…— ANI (@ANI) November 14, 2024ఇది కూడా చదవండి: కార్తీకమాసంలో ఉసిరిని పూజిస్తే... -
ఓడితే మీసం తీసేసి, గుండు కొట్టించుకుంటా’
జైపూర్: మహారాష్ట్ర-జార్ఖండ్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే కోవలో రాజస్థాన్‌లోని ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు విరివిగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాజస్థాన్ బీజేపీ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్సర్ సంచలన ప్రకటన చేశారు.ఈ ఎన్నికల్లో రాజస్థాన్‌లో బీజేపీ ఓటమిపాలు కాదని, ఒకవేళ ఓడిపోతే తాను మీసాలు తీసేసి, గుండు కొట్టించుకుంటానని అన్నారు. ఖిన్వ్సర్లోని సదర్ బజార్ చౌక్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. తాను ఖిన్వసర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనకు 95 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు.ఈ ఎన్నికలు గ్రామ అభివృద్ధి కోసం దోహదపడతాయన్నారు. తాను తొలిసారి ఎన్నికల్లో గెలిచి నప్పుడు తనను నాటి సీఎం వసుంధర రాజే మంత్రిని చేశారన్నారు. ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఈ ఎన్నికల సభలో బీజేపీ అభ్యర్థి రేవంత్రం దంగా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతి మిర్ధా పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఖిన్వ్సర్, డియోలీ-ఉనియారా, దౌసా, జుంఝును, రామ్‌గఢ్, సాలంబెర్ చౌరాసి అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. ఇది కూడా చదవండి: Jharkhand Polls: ఐదుగురు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న ఒక బ్లాక్ ఓటర్లు -
అసలు హీరో అనిల్‌ను వదిలేసి.. లారెన్స్‌కు ప్రాధాన్యం.. కరెక్ట్ కాదు!
ఒక లక్ష్యం కోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ, పని చేస్తున్నవారు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. 48 ఏళ్ల అనిల్ బిష్ణోయ్ అటువంటివాడే. ఆయన విద్యావంతుడే కాదు రైతు కూడా! ఆవాలు, పత్తి పండించేవాడు. వన్యప్రాణుల ప్రేమికుడు, జంతువులు... ముఖ్యంగా కృష్ణ జింకలు అంటే ఆయనకు చిన్నతనం నుంచీ ప్రేమ ఎక్కువ! జంతువులను వేటాడేవారిని అతడు తీవ్రంగా నిరసిస్తాడు. హనుమాన్‌గఢ్‌లోని శ్రీగంగానగర్‌లో జంతువులను రక్షించే మిషన్‌ను ప్రారంభించడానికి వేటగాళ్లే కారణం అంటాడు అనిల్.బిష్ణోయ్ కమ్యూనిటీ వారికి కృష్ణ జింక పవిత్ర జంతువు. ఈ కమ్యూనిటీ వారి గురువైన భగవాన్ జాంబేశ్వర్ అడవినీ, వన్యప్రాణులనూ రక్షించాలనీ, తద్వారా మాత్రమే పర్యావరణ పరి రక్షణ ఉంటుందనీ చెప్పేవారు! ఆ బోధనల ప్రభావం బిష్ణోయ్ కమ్యూ నిటీపై ఎక్కువ ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మీద ఇదే ప్రాంతంలో జింకను చంపిన కేసు నమోదు అవ్వడం గమనార్హం. ఇప్పుడు ఆయనకు చంపుతామనే బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి బిష్ణోయ్ సమాజానికి చెందినవారు సల్మాన్‌ను తమ మందిర్‌కు వచ్చి క్షమాపణ కోరమన్నారు. దీనిని ఆసరా చేసుకుని జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగస్టర్ ముఠా బెదిరింపులకు దిగిందని అంటారు. జాతీయ మీడియా అసలు హీరో అనిల్‌ను వదిలేసి లారెన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు.హనుమాన్ గఢ్ జిల్లా శ్రీగంగా నగర్‌కు చెందిన అనిల్ చిన్న నాటి నుంచే జింకల వేటగాళ్ల పట్ల కోపంగా ఉండేవాడు! వారిని పోలీస్‌లకు పట్టించేవాడు, సాక్ష్యం చెప్పి వారికి శిక్షలు పడే విధంగా చూసేవాడు! 30 ఏళ్లుగా ఈ సంరక్షకుడు 10 వేల కృష్ణ జింకలను వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడాడు! వాటి రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. గత మూడు దశా బ్దాలుగా జింకల రక్షణ కోసం ప్రచారం చేస్తున్నాడు. చదవండి: ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!50 పంచాయతీలలో కృష్ణ జింకల సహజ అవాసాలకు కలిగిన నష్టం, వేటగాళ్ల దుశ్చర్యల గురించి ప్రచార కార్యక్రమం చేపట్టాడు. కృష్ణ జింకలకు నీరు వంటి కనీస వసతులు కల్పించడానికి పూనుకుని... తన గ్రామ ప్రజల నుంచి రెండు లక్షల రూపాయలు చందా పోగు చేశాడు. దానికి తన సొంత డబ్బు కొంత జతచేసి కృష్ణ జింకల అవసరాలను తీర్చడానికి 60కి పైగా చిన్న, మధ్య తరహా నీటి వనరులను ఏర్పాటు చేశాడు. వాటికి గాయాలు అయినపుడు చికిత్స ఏర్పాట్లు కూడా చేశాడు.చదవండి: వ్యక్తిగా రతన్ టాటా ఎలా ఉండేవారు?1990లో సూరత్ గఢ్‌లో కళాశాల చదువు చదువుతున్న కాలంలోనే అటవీ రక్షణ, వన్య ప్రాణుల రక్షణ మీద జరిగిన ఒక సదస్సులో అనిల్ పాల్గొన్నాడు. ‘ఈ సదస్సు నా మనస్సుపై చాలా ప్రభావాన్ని చూపింది’ అంటాడు అనిల్! బీఏ. బీఈడీ చదువు పూర్తి కాగానే గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. రాజస్థాన్ లోని 12 జిల్లాలలో 3,000 మంది వివిధ ఉద్యోగాలు చేసుకునే వారితో కలిసి వన్యప్రాణ రక్షణ మీద, శాంతి ర్యాలీలు, సమావేశాలు పెట్టడం మొదలు పెట్టాడు. ఇప్పటి దాకా వేటగాళ్ల మీద 200లకు పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో 30 కేసులు ముగింపు దశకు చేరాయి. కొందరికి జరిమానాలు పడ్డాయి. అనిల్ బిష్ణోయ్ తుంహే సలాం! – ఎండి. మునీర్సీనియర్ జర్నలిస్ట్ -
హైదరాబాద్, రాజస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
జైపూర్: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో రాజస్తాన్‌తో మ్యాచ్‌ను హైదరాబాద్ ‘డ్రా’చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఒక విజయం, 2 ఓటములు, ఒక ‘డ్రా’తో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానానికి చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 36/0తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.హిమతేజ (176 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... తన్మయ్ అగర్వాల్ (126 బంతుల్లో 79; 2 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకంతో మెరిశాడు. అభిరత్ రెడ్డి (46; 7 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణీత సమయం కంటే ముందే ‘డ్రాకు అంగీకరించారు. అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగులు చేయగా... రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన రాజస్తాన్ మూడు పాయింట్లు ఖాతాలో వేసుకొని ఓవరాల్‌గా 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టుకు ఒక పాయింట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు సెంచరీ బాదిన రాజస్తాన్ బ్యాటర్ శుభమ్ గర్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు లభించింది.స్కోరు వివరాలు:హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 410; రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్ 425; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (ఎల్బీ) (బి) అజయ్ సింగ్ 79; అభిరత్ రెడ్డి (సి) కునాల్ సింగ్ రాథోడ్ 46; రోహిత్ రాయుడు (సి) కునాల్ సింగ్ రాథోడ్ (బి) అనికేత్ చౌధరి 0; హిమతేజ (నాటౌట్) 101; రాహుల్ సింగ్ (నాటౌట్) 47; ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (65 ఓవర్లలో 3 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–56, 2–57, 3–196, బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–0, అజయ్ సింగ్ 22–0–84–1, దీపక్ హుడా 6–2–17–0, మహిపాల్ లొమ్రోర్ 18–0–86–0, అరాఫత్ ఖాన్ 5–1–18–1, అనికేత్ చౌధరి 6–0–18–1, అభిజీత్ తోమర్ 6–0–39–0 -
ఆధిక్యం కోల్పోయిన హైదరాబాద్
జైపూర్: పసలేని బౌలింగ్.. ఫీల్డర్ల తడబాటు.. వెరసి దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం చేజారింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న పోరులో మహిపాల్ లొమ్రోర్ (150 బంతుల్లో 111; 12 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభమ్ గర్వాల్ (107 బంతుల్లో 108; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలు బాదడంతో రాజస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 117/1తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రాజస్తాన్ చివరకు 108.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది.ఐపీఎల్లో మంచి ఇన్నింగ్స్‌లతో గుర్తింపు తెచ్చుకున్న మహిపాల్ లొమ్రోర్ చక్కటి శతకం నమోదు చేసుకోగా.. శుభమ్ గర్వాల్ విధ్వంసం సృష్టించాడు. హైదరాబాద్ బౌలర్ల భరతం పడుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. జుబైర్ అలీ (57; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కెప్టెన్ దీపక్ హుడా (1), వికెట్ కీపర్ కునాల్ సింగ్ రాథోడ్ (9), దీపక్ చహర్ (5) విఫలమయ్యారు. ఆఖర్లో అరాఫత్ ఖాన్ (32; 4 ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ జట్టుకు 15 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పెట్టాడు.హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3.. చామా మిలింద్, రోహిత్ రాయుడు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిరత్ రెడ్డి (28 బ్యాటింగ్; 4 ఫోర్లు), తన్మయ్ అగర్వాల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా.. చేతిలో 10 వికెట్లు ఉన్న హైదరాబాద్ ఓవరాల్‌గా 21 పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఆధిక్యం సాధించినందుకు రాజస్తాన్‌కు 3 పాయింట్లు, హైదరాబాద్‌కు ఒక పాయింట్ లభిస్తుంది. స్కోరు వివరాలుహైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 410; రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్: అభిజిత్ తోమర్ (బి) తనయ్ త్యాగరాజన్ 60; రామ్ చౌహాన్ (సి) రాహుల్ రాదేశ్ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 11; మహిపాల్ లొమ్రోర్ (సి) రాహుల్ రాదేశ్ (బి) రక్షణ్ రెడ్డి 111; దీపక్ హుడా (సి) రాహుల్ రాదేశ్ (బి) చామా మిలింద్ 1; జుబైర్ అలీ (ఎల్బీ) (బి) తనయ్ త్యాగరాజన్ 57; శుభమ్ గర్వాల్ (సి) రాహుల్ సింగ్ (బి) చామా మిలింద్ 108; కునాల్ సింగ్ రాథోడ్ (ఎల్బీ) (బి) రోహిత్ రాయుడు 9; దీపక్ చహర్ (ఎల్బీ) (బి) రోహిత్ రాయుడు 5; అజయ్ సింగ్ (బి) తనయ్ త్యాగరాజన్ 13; అరాఫత్ ఖాన్ (సి) హిమతేజ (బి) అనికేత్ రెడ్డి 32; అనికేత్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (108.2 ఓవర్లలో ఆలౌట్) 425.వికెట్ల పతనం: 1–27, 2–150, 3–169, 4–216, 5–285, 6–302, 7–334, 8–374, 9–405, 10–425. బౌలింగ్: చామా మిలింద్ 19–3–73–2, రక్షణ్ రెడ్డి 18–5–36–1, అజయ్‌దేవ్ గౌడ్ 15–1–65–1; తనయ్ త్యాగరాజన్ 25–2–104–3; రోహిత్ రాయుడు 18–5–65–2; అనికేత్ రెడ్డి 13.2–2–75–1.హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బ్యాటింగ్) 8; అభిరత్ రెడ్డి (బ్యాటింగ్) 28; మొత్తం (7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 36. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–0, అజయ్ సింగ్ 3–0–14–0, దీపక్ హుడా 1–0–6–0, మహిపాల్ లొమ్రోర్ 1–0–5–0. -
Rajasthan Bypoll: రెబల్ నేతను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మరో వారం రోజుల్లో (నవంబర్ 13న) ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్టీ రెబల్ నేత నరేష్ మీనాను కాంగ్రెస్ గురువారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సుఖ్జీందర్ సింగ్ రంధావా ఉత్తర్వులు జారీ చేశారు.ఉప ఎన్నికల్లో డియోలి-ఉనియారా అసెంబ్లీ స్థానం నుంచి నరేష్ మీనా పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కేసీ మీనాను బరిలోకి దింపింది. దీంతో పార్టీ టికెట్‌నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తి చెందిన నరేష్ మీనా.. భారత్ ఆదివాసీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హస్తం పార్టీ నరేష్ మీనాపై సస్పెండ్ వేటు వేసింది .ఇదిలా ఉండగా కాగా రాజస్థాన్‌తోపాటు తొ మ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న48 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. -
హైదరాబాద్ 261/5
జైపూర్: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీలో గత మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యంతో ఘనవిజయం సాధించిన హైదరాబాద్ జట్టు... మరోసారి స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. బుధవారం రాజస్తాన్‌తో ప్రారంభమైన గ్రూప్ ‘బి’ నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లందరూ బాధ్యతాయుతంగా ఆడారు. ఫలితంగా హైదరా బాద్ గౌరవప్రద స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. కెపె్టన్ రాహుల్ సింగ్ (100 బంతుల్లో 66; 7 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. వికెట్ కీపర్ రాహుల్ రాదేశ్ (43 బ్యాటింగ్; 3 ఫోర్లు), ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (40; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అభిరత్ రెడ్డి (21; 4 ఫోర్లు), రోహిత్ రాయుడు (21; ఒక సిక్స్), హిమతేజ (24; 3 ఫోర్లు) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు.కెప్టెన్ రాహుల్ సింగ్ మాత్రం ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తీసు కొచ్చాడు. అంతర్జాతీయ క్రికెటర్లు దీపక్ చహర్, దీపక్ హుడా వంటి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. రాజస్తాన్ బౌలర్లలో అజయ్ సింగ్ 3, దీపక్ చహర్, అరాఫత్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. ఆట ముగిసే సమయానికి రాహుల్ రాదేశ్తో పాటు అజయ్ దేవ్ గౌడ్ (34 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. -
సఫారీ విహారానికి కేరాఫ్ సుజన్ జవాయీ
సాక్షి, సెంట్రల్ డెస్క్: సుజన్ జవాయీ.. రాజస్థాన్‌లోని జవాయీ అరణ్యంలో కేవలం పది విలాసవంతమైన గుడారాలు, ఒక రాయల్ టెంటెడ్ సూట్లో ఏర్పాటుచేసిన సఫారీ క్యాంప్. కానీ ఇక్కడ అందుబాటులో ఉండే సేవలు, అద్భుతమైన ప్రకృతి అందాల కారణంగా ఇది ప్రపంచంలోని 50 అత్యుత్తమ హోటల్స్‌లో ఇది ఒకటిగా స్థానం సంపాదించింది. జైసల్, అంజలీసింగ్ అనేవారు 2014లో పాలీ జిల్లాలో ఈ జంగిల్ క్యాంప్‌ను డిజైన్ చేశారు. పెద్ద సంఖ్యలో చిరుతపులులు సంచరించే సుందరమైన గడ్డి మైదానాలు, పచ్చదనం పులుముకున్న పర్వత శ్రేణులు, జవాయీ నది మధ్యలో ఇసుక తిన్నెలు కవర్ చేసేలా ఈ క్యాంపును డిజైన్ చేశారు. ఈ ప్రాంతంలో 60 వరకు చిరుతలు సంచరిస్తుంటాయి. వేటగాళ్ల ఊసే లేని ఈ ప్రాంతంలో స్థానికులు చిరుతలతో జీవిస్తుంటారు. ఇక్కడ టెంట్ బయట కూర్చొని అధ్బుతమైన పరిసరాలను ఆస్వాదించవచ్చు. అడవుల్లో చేసే సాహసాలు, చిరు™è ల ట్రాకింగ్, పొదల్లో బ్రేక్‌ఫాస్ట్, రాత్రిపూట ఆరుబయట డిన్నర్ పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఈ ఆధునిక కాలంలో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి సుజన్ జవాయీ క్యాంప్ ఒక మంచి అవకాశం. టూర్లో భాగంగా సమీపంలోని గ్రామాలకూ తీసుకువెళ్లి అక్కడి గ్రామీణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను, పరిశీలించే అవకాశం కూడా కలి్పస్తారు. చిరుతలను వాటి సహజ ఆవాసాల్లో చూసేందుకు ఉదయం, సాయంత్రం సఫారీ ఉంటుంది. కొండపైన టెంట్ ముందు కూర్చొని జువాయీ సరస్సు అందాలు, చుట్టుపక్కల పొలాలను సాగుచేసుకునే రైతులను చూస్తూ సూర్యాస్తమయాలను ఆస్వాదించవచ్చు. పెరగనున్న విదేశీ పర్యాటకులు ప్రపంచంలోని అత్యుత్తమ హోటళ్ల జాబితాలో సుజన్ జవాయీకి స్థానం లభించడంతో మరింత పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే టూరిస్ట్ డెస్టినీగా ఉన్న రాజస్థాన్‌కు ఇది మరింత ఊపు తీసుకువస్తుంది. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగడం ద్వారా దేశ పర్యాటక రంగానికి ఆదాయం పెరుగుతుంది. ఎలా చేరుకోవచ్చు?⇒ ఈ క్యాంప్ ఉదయ్‌పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్లు, జోద్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 172 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ⇒ మోరీ బెరా రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది.అనుకూల సమయం⇒ అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్య సందర్శనకు అత్యంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉండి ఉష్ణోగ్రతలు 10 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి.⇒ విడిది చేయాల్సిన సమయం: ఇక్కడి అందాలను పూర్తిగా ఆస్వాదించాలంటే కనీసం రెండు రాత్రులు, 3 పగళ్లు విడిది చేయాల్సి ఉంటుంది. 50 అత్యుత్తమ హోటల్స్‌లో స్థానంప్రపంచ వ్యాప్తంగా ఆరు ఖండాల్లో అత్యుత్తమ వసతులు కలిగిన 50 హోటల్స్‌లో సుజన్ జవాయీ హోటల్ స్థానం సంపాదించింది. 2024 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని 50 అత్యుత్తమ హోటల్స్ జాబితాను ‘50 బెస్’ అనే సంస్థ ఇటీవల లండన్‌లో ప్రకటించింది. ఈ జాబితాలో సుజన్ జవాయీ 43వ స్థానం సంపాదించింది. ట్రావెల్ జర్నలిస్ట్‌లు, ఆతిథ్యరంగ ప్రముఖులు, ట్రావెల్ స్పెషలిస్ట్‌లతో కూడిన 600 మంది గ్లోబల్ ఓటర్లు ఈ జాబితాను సెలెక్ట్ చేశారు. ఈ జాబితాలో థాయిలాండ్‌లోని చావో ఫ్రయా నదికి ఎదురుగా ఉన్న కాపెల్లా బ్యాంకాక్ అనే విలాసవంతమైన హోటల్ ప్రపంచంలో బెస్ట్ హోటల్‌గా నిలిచింది. ఇటలీలో లేక్ కోమోలోని 18 శతాబ్ధానికి చెందిన విల్లా పసలాక్వా రెండో స్థానంలో నిలిచింది. హాంకాంగ్‌కు చెందిన విలాసవంతమైన హోటల్ రోజ్‌వుడ్ హాంకాంగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కూల్చివేత బాధితులు కోర్టుకు రావొచ్చు
న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేక్ వేసినా.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ అధికారులు దీన్ని ఉల్లంఘించారని, ఈ మూడు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ అభియోగాలు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. పిటిషనర్‌కు కూల్చివేత బాధితుడు కాదని, ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వాటితో ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం పేర్కొంది. తేనెతుట్టను కదల్చాలని తాము అనుకోవడం లేదని, కూల్చివేత బాధితులు ఎవరైనా ఉంటే కోర్టుకు రావొచ్చని స్పష్టం చేసింది. నిందితులు అయినంత మాత్రాన వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూల్చవద్దని సుప్రీంకోర్టు బుల్డోజర్ న్యాయానికి బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది. దీనిపై తాముదేశవ్యాప్తంగా అమలయ్యేలా మార్గదర్శకాలు జారీచేస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే.. అది గుడి అయినా, మసీదు అయినా కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా కూల్చివేత చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కాన్పూర్, హరిద్వార్, జైపూర్లలో అధికారులు కూల్చివేతలకు దిగారని, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషనర్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఒకచోట అయితే ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కూల్చివేతకు పాల్పడ్డారని తెలిపారు. ఫుట్‌పాత్ ఆక్రమణనను మాత్రమే తొలగించారని, పిటిషనర్‌కు నేరుగా దీనితో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయనకు వాస్తవాలు తెలియవని ఉత్తరప్రదేశ్ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషనర్ సుప్రీంకోర్టుకు వచ్చారని అన్నారు. ఈ కూల్చివేతలతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి... పిటిషన్‌ను అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పైన పేర్కొన్న మూడు ఘటనల్లో ఇద్దరు జైళ్లో ఉన్నారని పిటిషనర్ తెలుపగా.. వారి కుటుంబీకులు కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం బదులిచి్చంది. -
సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం ఇదే..!
సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు? ఈ సందేహాలకు సమాధానమిస్తుంది పుష్కర్ పుణ్యక్షేత్రం, ఆ క్షేత్ర స్థలపురాణం. రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్‌కు 11 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న సరస్సు పుష్కర్. క్రమంగా ఆ ప్రాంతం ఈ సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు చెంతనే ఉంది సృష్టికర్త బ్రహ్మ ఆలయం. ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం ఇది. మన దేశంలోని అతి ముఖ్యమైన తీర్ధాల్లో ఒకటైన పుష్కర్‌ను దర్శించుకోకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తి కానట్టేనని పెద్ద లంటారు. అందుకే దీన్ని తీర్థరాజ్ అంటారు. పౌరాణికంగా ఎంతో ప్రాశస్త్యం చెందిన మహాభారత, రామాయణాల్లోనూ ఆదితీర్థంగా ప్రస్తావించబడింది ఈ తీర్థం. కార్తీక పౌర్ణమి రోజున ఇందులో ఓసారి మునిగితే వందల సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుందట. స్థలపురాణంపద్మపురాణం ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోనే తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో ఆ తామరపూపు నుంచి రేకులు మూడు చోట్ల రాలి, మూడు సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ట పుష్కర్, మధ్యపుష్కర్, కనిష్టపుష్కర్ అని పిలుస్తున్నారు. పైగా సృష్టికర్త తాను భూలోకంలో అడుగిడినప్పుడు తన చేతి (కరం)నుంచి పుష్పం రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్ అని పేరు పెట్టినట్లు మరో కథనం కూడా వినిపిస్తుంది.సరస్వతీదేవి శాపం.. ఏకైక ఆలయంవజ్రనాభ సంహారం అనంతరం లోకకల్యాణం కోసం ఇక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించాడట సృష్టికర్త. సుముహూర్తం ఆసన్నమవుతుండటంతో సరస్వతీదేవిని తీసుకుని రమ్మని తన కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ. కానీ నారదుడి కలహప్రియత్వం కారణంగా బయలుదేరేందుకు తాత్సారం చేస్తుంది సావిత్రీ దేవి. (ఈమెనే సరస్వతీ దేవి అని కూడా పిలుస్తారు) ఇవతల ముహూర్తం మించిపోతుండటంతో, అనుకున్న సమయానికే యజ్ఞం పూర్తి కావాలన్న తలంపుతో ఇంద్రుడి సహకారంతో గాయత్రిని పెళ్లాడి నిర్ణీత సమయానికి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు.యజ్ఞం సమాప్తం అవుతుండగా అక్కడికి చేరుకున్న సరస్వతీదేవి బ్రహ్మ దేవుడి పక్కన మరో స్త్రీని చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న దేవతలందరినీ శపిస్తుంది. భర్తను వృద్ధుడై పొమ్మని, ఆయనకు ఒక్క పుష్కర్‌లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపిస్తుంది. అనంతరం బ్రహ్మదేవుడి అభ్యర్థనను మన్నించి శాప తీవ్రతను తగ్గిస్తుందట. బ్రహ్మదేవాలయం పుష్కర్‌లో మాత్రమే ఉండటానికి కారణం ఇదేనట. పుష్కర్‌లో సావిత్రీమాత ఆలయంతో పాటు ఓ చిన్న నీటి ప్రవాహం ఉంది. దీన్ని సావిత్రీనది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్య సుమంగళి వరాన్నిస్తుందన్న నమ్మకంతో పుష్కర్‌ను సందర్శించిన భక్తులంతా ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు.ఇతర విశేషాలుపుష్కర్లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సుమారు 400 పురాతన ఆలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆప్తేశ్వర్, రంగ్జీ, ఏకలింగజీ దేవాలయాలు. వీటిలో రంగ్జీ ఆలయం దక్షిణాది శైలిలో కట్టబడి ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగ్‌జీగా పూజలందుకుంటున్నాడు. రాజస్తాన్‌లోని సుప్రసిద్ధ శివక్షేత్రం ఏకలింగజీ దేవాలయం. ఇక్కడ శివలింగం కేవలం లింగాకారంగా కాక నలుపక్కలా నాలుగు ముఖాలను కలిగి ఉండటం విశేషం. ఇవి కాక గోవిందాజీ ఆలయం, నక్షత్రశాల, హవామహల్, చట్రిస్, గాలోటా, ఖవాసాహిబ్ దర్గా, అధాన్ దిన్ కా జూన్ ప్రా, అనాసాగర్, జగ్‌నివాస్ భవనం, జగదీష్ ఆలయం, అహర్, నక్కి సరస్సు, జోథ్‌పూర్ పట్టణం, అజ్మీరు, ఉదయ్‌పూర్, అబూశిఖరం, పింక్‌సిటీగా పేరుగాంచిన జైపూర్లు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు.ఎలా వెళ్లాలంటే..?పుష్కర్‌కు వెళ్లడానికి దగ్గరలోని అజ్మీర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఢిల్లీ, జోద్పూర్, జైపూర్, ఆగ్రా, ముంబాయ్. అహ్మదాబాద్‌ల నుంచి రైళ్లున్నాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బెస్ట్. అజ్మీర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని పుష్కర్‌కు చేరుకోవాలంటే లోకల్ బస్సులు, ఆటోలు ఉన్నాయి. విమాన మార్గం సంగనీర్ ఏర్పోర్ట్. అయితే అక్కడినుంచి పుష్కర్ వెళ్లాలంటే 127 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అన్ని ప్రధాన నగరాలనుంచి పుష్కర్‌కు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఏఐ సాయంతో అరుదైన బట్టమేక పిట్ట పిల్ల జననం
జైసల్మేర్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల సుదాసరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బ్రీడింగ్ సెంటర్లో శాస్త్రవేత్తలు ఏఐ సాయంతో కృత్రిమ గర్భధారణ పద్ధతిని అనుసరించి, అరుదైన బట్టమేక పిట్ట పిల్లకు జన్మనిచ్చారు. ప్రపంచంలో ఇటువంటి ఘనత సాధించిన దేశంగా భారత్ నిలిచిందని, ఇకపై అంతరించి పోతున్న అరుదైన బట్టమేకపిట్ట పక్షి జాతికి రక్షణ లభిస్తుందని సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బట్టమేక పిట్ట స్మెర్మ్‌ను సేవ్ చేసేందుకు బ్యాంకును ఏర్పాటు చేయడం ద్వారా ఈ అరుదైన పక్షి జాతి కాపాడుకోగలుగుతామని శాస్త్రవేత్త ఆశిష్ వ్యాస్ తెలిపారు.ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ హౌబారా కన్జర్వేషన్ ఫౌండేషన్ అబుదాబి (ఐఎఫ్హెచ్సీ)లో టైలర్ పక్షిపై ఈ తరహా పరీక్ష నిర్వహించామని, అది విజయవంతమైందని ఆశిష్ వ్యాస్ తెలిపారు. ఇండియాస్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి చెందిన శాస్త్రవేత్తలు గత ఏడాది అక్కడికి వెళ్లి ఈ టెక్నిక్ నేర్చుకున్నారన్నారు. తదనంతరం బట్టమేక పిట్ట పిల్లను సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. సెప్టెంబర్ 20న టోనీ అనే ఆడ బట్టమేక పిట్టకు కృత్రిమ గర్భధారణ చేశామన్నారు.అది సెప్టెంబరు 24న గుడ్డు పెట్టిందని, ఆ గుడ్డును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పర్యవేక్షించారు. అంతిమంగా శాస్త్రవేత్తల కృషి ఫలించి, అక్టోబర్ 16న గుడ్డులోంచి బట్టమేక పిట్ట పిల్ల బయటకు వచ్చిందని వ్యాస్ తెలిపారు. ఆ పిల్లను వారం రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి, అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు బట్టమేక పిట్ట పిల్ల ఆరోగ్యంగా ఉందని వ్యాస్ తెలిపారు. ఈ పద్ధతిని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ (ఏఐ)గా పిలుస్తారన్నారు. ఈ బట్టమేక పిట్ట పిల్లకు ఏఐ అనే పేరు పెట్టాలకుంటున్నామని వ్యాస్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: లోదుస్తులు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు -
దేశంలో కొత్తగా 10 అణు విద్యుత్కేంద్రాలు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా పది అణువిద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. సోమవారం శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల సంబంధ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీలో ఈ వివరాలను సభ్యులకు అందజేసింది. 700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో గుజరాత్, రాజస్తాన్, హరియాణాల్లో వీటిని నెలకొల్పారు. గుజరాత్‌లోని కాక్రపార్‌లో రెండు అణు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి మొదలైందని కేంద్రం పేర్కొంది. అయితే వీటి నిర్మాణం చాలా ఆలస్యమవుతోందని కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘2007లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి కావస్తుండటం గ్రేట్. ‘సుప్రీం నేత’ కనుసన్నల్లో అభివృద్ధి వేగానికిది నిదర్శనం’’ అని ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందించారు. కాక్రపార్–3, కాక్రపార్–4 రియాక్టర్లు కాంగ్రెస్ హయాంలోనే ఆమోదం పొందాయన్నారు. -
గార్ధభ సంరంభం
గాడిదల సంతలు దేశంలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి గాని, రాజస్థాన్‌లో జైపూర్ సమీపంలోని లునియావాస్ గ్రామంలో జరిగేది మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద గాడిదల సంత. ఏటా దసరా నవరాత్రుల్లో ఇక్కడ గాడిదల సంత జరుగుతుంది. దాదాపు ఐదువందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న పురాతనమైన గాడిదల సంతగా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ సంత జైపూర్–ఆగ్రా రహదారిపై ఏకంగా 22 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. నవరాత్రుల రోజుల్లో ఈ మార్గంలో ప్రయాణించేవారికి ఎటుచూసినా గాడిదలే కనిపిస్తాయి. ఈ సంతకు వివిధ రాష్ట్రాలకు చెందిన వర్తకులు తమ గాడిదలను తీసుకు వస్తారు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ సంతను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు రాజస్థాన్ పర్యాటక శాఖ ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ప్రారంభించింది. దీనివల్ల ఈ సంతకు దేశ విదేశాల పర్యాటకులు కూడా వస్తుండటం విశేషం. మొఘల్ సామ్రాజ్య కాలంలో అప్పటి రాజస్థాన్ పాలకుడు దులేరాజ్ సింగ్ హయాం నుంచి ఇక్కడ గాడిదల సంత జరుగుతూ వస్తోందని చెబుతారు. ఈ సంత జరిగే సమయంలో ‘ఖాలాకానీ’ అని స్థానికులు పిలుచుకునే ‘కాళరాత్రి’ అమ్మవారి పూజ కూడా విశేషంగా జరుపుతారు. కాళరాత్రి అమ్మవారి వాహనం గార్ధభం కనుక ఇక్కడ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.ఈ సంతలో గాడిదల అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే కాకుండా, గాడిదల అందాల పోటీలు, గాడిదల పరుగు పందేలు, గాడిదలు లాగే బళ్ల పందేలు కూడా జరుగుతాయి. ఈ సంతలో స్వదేశీ జాతులకు చెందిన కథియవాడీ, మార్వాడీ గాడిదలకు, అఫ్గాన్ గాడిదలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. విచిత్రంగా ఈ సంతలో గాడిదలకు బాలీవుడ్ హీరో హీరోయిన్ల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు పెట్టి మరీ అమ్ముతుంటారు. గత ఏడాది ప్రియంకా చోప్రా పేరు ఉన్న గాడిదకు ఏడువేల రూపాయల ధర పలికినట్లు ఒక వర్తకుడు చెప్పాడు. ఈ సంతలోని గాడిదల ధరలు మూడువేల రూపాయల నుంచి పదిహేనువేల రూపాయల వరకు ఉంటాయి. అఫ్గాన్ గాడిదలు ఎక్కువ ధర పలుకుతుంటాయి. గాడిదల అందాల పోటీలు, పరుగు పందేలు వంటి వేర్వేరు పోటీల్లో విజేతలుగా నిలిచిన గాడిదల యజమానులకు వేర్వేరు దశల్లో ఐదువందల నుంచి పదివేల రూపాయల వరకు నగదు బహుమతులు కూడా ఉంటాయి. -
వేదాంత రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న వేదాంత గ్రూప్ రాజస్తాన్‌లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. యూకేలో జరిగిన రైజింగ్ రాజస్తాన్ రోడ్‌షోలో రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మతో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ భేటీ అయి తాజాగా పెట్టుబడి ప్రతిపాదనలు చేశారు. వేదాంత కంపెనీ అయిన హిందుస్తాన్ జింక్ రూ.30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. జింక్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 1.2 మిలియన్ టన్నుల నుంచి 2 మిలియన్ టన్నులకు, వెండి ఉత్పత్తిని 800 నుంచి 2,000 టన్నులకు చేరుస్తారు. ఒక మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఫెర్టిలైజర్ ప్లాంటు నెలకొల్పుతారు. రోజుకు 3 లక్షల బ్యారెల్స్‌కు సామర్థ్యం పెంచేందుకు కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ రూ.35,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. 10,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేసేందుకు సెరెంటికా రెన్యూవబుల్స్ రూ.50,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఉదయ్‌పూర్ సమీపంలో లాభాపేక్ష లేకుండా ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పనున్నట్టు వేదాంత గ్రూప్ ప్రకటించింది. తాజా పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే కొత్తగా రెండు లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఇప్పటికే రాజస్తాన్‌లో వేదాంత గ్రూప్ కంపెనీలు రూ.1.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు చేయడం విశేషం. దేశంలో ఉత్పత్తి అవుతున్న ముడి చమురులో కెయిర్న్ వాటా 25% ఉంది. హిందుస్తాన్ జింక్, కెయిర్న్ ప్రధాన కార్యకలాపాలకు రాజస్తాన్ కేంద్రంగా ఉంది. కాగా ఒడిశాలో రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ శుక్రవారం తెలిపింది. -
బంజరు భూమిని బంగరు భూమి చేసింది
‘కలిసి ఉంటేనే కాదు కష్టపడితే కూడా కలదు సుఖం’ అని అనుభవపూర్వకంగా తెలుసుకుంది సంతోష్ దేవి.తన రెక్కల కష్టంతో బంజరు భూమిని బంగరు భూమిగా మార్చింది. ఎంతోమంది రైతులను తన మార్గంలో నడిపిస్తోంది.రాజస్థాన్‌లోని సికార్ జిల్లా బేరి గ్రామంలో... 1.25 ఎకరాల బంజరు భూమితో సంతోష్ దేవి ఖేదార్ ప్రయాణం ప్రారంభమైంది. కుటుంబం వీడిపోవడంతో తన భర్త వాటాగా 1.25 ఎకరం భూమి వచ్చింది. భర్త రామ్ కరణ్ హోంగార్డ్. చాలీచాలని జీతం. దీంతో వ్యవసాయం వైపు మొగ్గు చూపింది సంతోష్‌దేవి.‘పది, ఇరవై ఎకరాలు ఉన్నవారికే దిక్కు లేదు. ఎకరంతో ఏం సాధిస్తావు? అప్పులు తప్ప ఏం మిగలవు!’ అన్నారు చాలామంది. ఈ నేపథ్యంలో ‘వ్యవసాయం లాభసాటి వ్యాపారం’ అని నిరూపించడానికి రంగంలో దిగింది సంతోష్ దేవి.‘నేను చదువుకోవాలని మా నాన్న కోరుకున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడే నాకు చదువుల కంటే వ్యవసాయం అంటేనే ఇష్టం’ అంటుంది సంతోష్‌దేవి. తాతగారి పొలంలో ఎప్పుడూ రసాయనిక ఎరువులు వాడకున్నా మంచి దిగుబడి వచ్చేది. ఇక్కడ మాత్రం భిన్నమైన పరిస్థితి. చాలా ఏళ్లుగా రసాయనాలు వాడడం వల్ల పొలం నిస్సారంగా మారింది. చుట్టు పక్కల నీటి వనరులు లేకపోవడంతో జొన్న, సజ్జలాంటి సంప్రదాయ పంటలే పండించేవారు.కలుపు మొక్కలతో గందరగోళంగా ఉన్న పొలాన్ని ఒక దారికి తేవడంతో మొదటి అడుగు వేసింది. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు వాడాలని నిర్ణయించుకుంది. దానిమ్మ పండించమని, తక్కువ భూమిలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని సికార్ వ్యవసాయ అధికారి సలహా ఇచ్చాడు. ఆ సలహా వారి జీవితాన్నే మార్చేసింది.220 దానిమ్మ మొక్కలను కొనడానికి గేదెను అమ్మేయాల్సి వచ్చింది. మొక్కలు కొనగా మిగిలిన డబ్బుతో పొలంలో గొట్టపు బావిని వేయించింది. నీటి ఎద్దడి ఉన్న ఆప్రాంతంలో బిందు సేద్య పద్ధతిని నమ్ముకుంది. చుక్క నీరు కూడా వృథా చేయవద్దని నిర్ణయించుకుంది. జనరేటర్‌ను అద్దెకు తీసుకుంది. గ్రామంలోని ఎంతోమంది రైతుల సలహాలు తీసుకొని సేంద్రియ ఎరువు తయారీ మొదలుపెట్టింది. లేయర్ కటింగ్, సేంద్రియ పురుగు మందులకు బెల్లం కలపడంలాంటి రకరకాల టెక్నిక్‌ల గురించి తెలుసుకుంది. మూడేళ్ల కఠోర శ్రమ ద్వారా దానిమ్మ పండ్ల తొలి దిగుబడితో మూడు లక్షల లాభం వచ్చింది. సేంద్రియ ఎరువును ఎక్కువగా వాడడం వల్ల నేల సారవంతంగా మారింది.భర్త పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన తరువాత, పిల్లలు స్కూలు నుంచి వచ్చిన తరువాత నేరుగా పొలానికే వెళ్లేవాళ్లు. ‘ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదు. కాని బాగా కష్టపడాలనుకున్నాం’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంది సంతోష్‌దేవి. పండ్లతోటను నిర్వహించే అనుభవం రావడంతో యాపిల్‌లాంటి ఇతర పండ్లను పండించడంపై దృష్టి పెట్టింది.దానిమ్మ మొక్కల మధ్య నిర్దిష్టమైన దూరం ఉండాలి. ఆ ఖాళీ స్థలంలో కలుపు లేకుండా చూడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీల మధ్య మోసంబి మొక్కలు నాటింది. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత నిమ్మ నుంచి బెల్‌లాంటి ఎన్నో మొక్కలను నాటింది. పొలంలో సోలార్ ΄్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడంతో ఖర్చు తగ్గింది.‘మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలకు కారణం వారు పండిస్తున్న దానికి సరైన ధర లభించకపోవడమే. దళారులు లాభాలన్నీ అనుభవిస్తున్నారు’ అంటున్న సంతోష్‌దేవి ఒక్క పండును కూడా దళారులకు అమ్మదు. అన్ని పండ్లూ నేరుగా పొలంలోనే అమ్ముతారు.సంతోష్ సాధించిన విజయాన్ని చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా దానిమ్మ మొక్కలను పెంచడంప్రారంభించారు. అయితే చాలామంది విఫలమయ్యారు. అలాంటి వారు సంతోష్‌దేవిని సలహా అడిగేవారు. నాణ్యమైన మొక్కల కొరత వల్లే వారు విఫలమవుతున్నారు అని గ్రహించిన సంతోష్ దేవి ఆ లోటును భర్తీ చేయడానికి కొత్త మొక్కల కోసం ‘షెకావది కృషి ఫామ్ అండ్ నర్సరీ’ప్రారంభించింది.కష్టఫలంనేను, నా భర్త, పిల్లలు మాత్రమే పొలంలో పనిచేసేవాళ్లం. కూలీలతో పనిచేయించే స్థోమత మాకు లేదు. అయితే ఎప్పుడూ కష్టం అనుకోలేదు. ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటామో, పొలంలో అలాగే ఉండేవాళ్లం. కబుర్లు చెప్పుకుంటూనే కష్టపడేవాళ్లం. మా కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉంది.– సంతోష్‌దేవి -
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్..కట్‌చేస్తే నేడు ఆమె..!
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయికి ‘ఐఏఎస్’ కలలు ఉంటాయా? ‘సాధ్యం కాదు’ అనుకున్నదాన్ని ‘సాధ్యం’ చేయవచ్చా? ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పే పేరు....రుక్మిణి రియర్. ఆరో తరగతి ఫెయిలైన రుక్మిణి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో రెండో ర్యాంకు సాధించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్ మున్సిపల్ కమిషనర్‌గా ‘ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి’ అనుకునేలా పనిచేస్తోంది... స్కూల్ రోజుల్లో రుక్మిణి బ్రైట్ స్టూడెంట్ కాదు. రుక్మిణి ఆరో తరగతి ఫెయిల్ కావడం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అయితే ఆ ఫెయిల్యూరే తనను సక్సెస్‌కు దగ్గర చేసింది. ‘ఫెయిల్యూర్ అంటే మొదలైన భయం ఎలాగైనా సక్సెస్ కావాలనే పట్టుదలను పెంచింది’ అంటుంది రుక్మిణి. అమృత్‌సర్‌లోని ‘గురునానక్ యూనివర్శిటీ’లో సోషల్ సైన్స్‌లో డిగ్రీ చేసిన రుక్మిణి ముంబైలోని ‘టాటా ఇనిస్టిట్యూట్’లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.ఆ తరువాత ముంబై, మైసూర్‌లలో కొన్ని స్వచ్ఛందసంస్థలలో పనిచేసింది. స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న క్రమంలో అంకితభావం, వృత్తి నిబద్ధత ఉన్న ఎంతోమంది ఐఏఎస్ అధికారుల గురించి విన్నది. వారి గురించి విన్నప్పుడల్లా ‘ఐఏఎస్’ వైపు మనసు మళ్లేది. చివరికది అది తన కలగా మారింది.‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అని రంగంలోకి దిగింది.కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించింది. ‘ఆరోతరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్ సాధించింది’... రుక్మిణి గురించి ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది విద్యార్థులు ఆమెను కలుసుకొని మాట్లాడి సలహాలు తీసుకునేవారు.కట్ చేస్తే...ఇప్పుడు రుక్మిణి రియర్ రాజస్థాన్‌లోని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కమిషనర్. యూపీఎస్సీలో సెకండ్ ర్యాంక్‌తో ఎలా వార్తల్లో నిలిచిందో మున్సిపల్ కమిషనర్‌గా కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం అక్రమార్కుల పాలిట ఆమె సింహస్వప్నం కావడమే. డిసెంబర్లో జరగబోయే ‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. విమానాశ్రయం నుంచి 22 గోదాముల వరకు ప్రధాన రోడ్లను పరిశీలిస్తూ వెళ్లింది.నగర పరిశుభ్రత, సుందరీకరణ గురించి స్థానికులతో మాట్లాడింది. సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చెయ్యాలని, పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫ్లైవోవర్లు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి పెయింటింగ్, లైటింగ్‌ల కోసం సూచనలు ఇచ్చింది. గోడలకు పెయింటింగ్ వేయడం నుంచి పబ్లిక్ టాయిలెట్లు, చెత్త కుండీలు శుభ్రం చేయడం వరకు ప్రతి పని దగ్గర ఉండి చేయిస్తుంది. నగర సుందరీకరణతో పాటు ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ ద్వారా జైపూర్‌ను గ్లోబల్ సిటీగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. దీని కోసం జైపూర్ అద్భుతంగా కనిపించకపోయినా... పరిశుభ్రంగా, ఆక్రమణలు లేకుండా కనిపించాలి. ఇది అనుకున్నంత సులువైన పనేమీ కాదు. ఎందుకంటే సమ్మిట్‌కు ఎన్నో నెలలు లేదు. అయినా సరే వెనక్కి తగ్గకుండా కష్టపడుతూ ప్రజల నుంచి శభాష్ అనిపించుకుంటోంది రుక్మిణి. ‘పని చెయ్యకపోయినా ఫరవాలేదు. చేస్తే మాత్రం శ్రద్ధగా, భక్తిగా చేయాలి’ అని అమ్మ అంటుండేది. ఆ మాటలే రుక్మిణి రియర్కు వేదవాక్కు.(చదవండి: దసరాలో ట్రెడిషనల్‌గా ఉండే స్టైలిష్ డిజైనర్ వేర్స్ ధరించండి ఇలా..!) -
నవరాత్రి సందడిలో కారు ప్రమాదం.. 12 మందికి గాయాలు
బరాన్: నవరాత్రి సందడి మధ్య కారు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్రు పట్టణంలోని ఖేద్లిగంజ్ కూడలి వద్ద మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ నవరాత్రి సందడిలో మునిగితేలుతున్న జనాలపైకి కారును పోనిచ్చాడు.ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలుస్తోంది. కానిస్టేబుల్ మనోజ్ గుర్జార్ మాట్లాడుతూ కారు డ్రైవర్ హనీ హెడా నుండి రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో బస్టాండ్ నుండి వేగంగా కారులో వస్తున్నాడన్నారు. ఖేద్లిగంజ్ కూడలిలో అమ్మవారి హారతి కార్యక్రమంలో పాల్గొన్న జనంపైకి కారును పోనిచ్చాడు. ఆ కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టి ఆగిందన్నారు. ఈ ఘటనలో ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సమాచారం అందుకున్న వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ మెహతా, పోలీస్‌స్టేషన్ హెడ్ రామ్‌ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న భజరంగ్ దళ్ జిల్లా కోఆర్డినేటర్ హిమాన్షు శర్మ, టికం ప్రజాపతి, అడ్వకేట్ హరీష్ గలావ్, ఏబీవీపీ రాహుల్ వర్మ సహా వందలాది మంది ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర -
‘రక్తపు కన్నీరు కారుస్తారు’.. పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్
జైపూర్: మాజీ మంత్రి, హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే బుండీ అశోక్ చందనా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ‘మీరు రక్తపు కన్నీరు కారుస్తారు’ అంటూ హెచ్చరించారు. రాజస్థాన్‌లోని కోటాలో బుండి నియోజకవర్గంలో బుధవారం కోటాలో జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ప్రసంగింస్తూ పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నదని ఆరోపించారు. ‘ఈ ప్రభుత్వం త్వరలో మారుతుంది. కాబట్టి ఎవరి ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలను వారు (పోలీసులు) ఇబ్బంది పెట్టకూడదు. వారు ఎంతగా హింసిస్తారో.. అంతగా రక్తంతో కన్నీళ్లు పెట్టుకుంటారు’ అని పోలీసులను హెచ్చరించారు.తాజా వ్యాఖ్యలపై రాజస్థాన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మోతీ లాల్ మీనా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలీసు, రెవెన్యూ అధికారులను పిలిపించి వారి పార్టీ పని కోసం వినియోగించారని విమర్శించారు. అయితే ఇప్పుడు పరిపాలన కోసం, ప్రజల మేలు కోసం అధికార యంత్రాంగం పని చేస్తోందని తెలిపారు. బీజేపీ సుపరిపాలనకు ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. ‘ఇది స్పష్టంగా కాంగ్రెస్‌కు బాగా నచ్చదు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆదేశం లేకపోతే ఆ పార్టీ ఏమి చెబుతుంది. అప్పుడు స్థానిక నాయకుల నుంచి మీరు ఏమి ఆశిస్తారు?’ అని మండిపడ్డారు.కాగా, అశోక్ గహ్లోత్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అశోక్ చందనా.. ఈ విధంగా వ్యాఖ్యానించడం తొలిసారి కాదు. గతేడాది చంద్రయాన్ మిషన్ ప్రయోగించిన సమయంలో వ్యోమగాములకు అభినందనలు అంటూ పేర్కొన్నారు. వాస్తవానికి అది మానవ రహిత మిషన్ అని అతనికి తెలీదు. -
అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ!
ఇవాళ నుంచే శరన్నవరాత్రులు ప్రారంభం. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు వివిధ అలంకారాలతో, స్తోత్ర పారాయణాలతో అమ్మవారిని భక్తులు కొలుచుకుంటారు. ఈ పర్వదనాల్లో పలువురు అమ్మవారి శక్తి పీఠాలను దర్శించి తరిస్తారు. ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆలవలం అయిన ఈ పుణ్యభూమిలో స్వయంగా అమ్మవారే వచ్చి కొలువై భక్తులను రక్షిస్తున్న అద్భుత ఆలయాలు కూడా ఉన్నాయి. వాటి వైభవం అంత ఇంత కాదు. అలాంటి అద్భుత పుణ్యక్షేత్రాల్లో ఒకటి రాజస్థాన్‌కి చెందిన ఇడాన మాత ఆలయం. ఈ ఆలయంలో జరిగే అద్భుతం సైన్సుకే అంతు చిక్కని మిస్టరిగా చెప్పొచ్చు. ఈ నవరాత్రులు పురస్కరించుకుని ఆ ఆలయ విశిష్టత గురించి సవివరంగా తెలుసుకుందామా..!. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాయత్రి శక్తి పీఠ్ ఆలయంలో దుర్గమ్మ ఇడాన మాతగా పూజలందుకుంటోంది. ఈ అమ్మవారికి చైత్రమాసంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో జరిగే అద్భతం తిలకించేందుకు భక్తులు బారులు తీరి ఉంటారు. ఆ నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారు అగ్నిస్నాన మాచరిస్తుందట. ఉన్నట్టుండి సడెన్‌గా దానంతట అవే అగ్నికీలలపు పుట్టి అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్లుగా సర్వత్రా మంటలు వ్యాపిస్తాయి. అయితే ఇక్కడ అమ్మవారి ఆలయం చత్రుస్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. దాదాపు 10 నుంచి 20 అడుగులు మేర అగ్నికీలలు దానంతట అవిగా ఉద్భవిస్తాయట. ఆ సమయంలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు, వస్త్రాలు బూడిద అవుతాయే తప్ప అమ్మవారి విగ్రహం చెక్కు చెదరదట. అంతేగాదు ఈ విగ్రహం వేల ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఏటా ఈ నవరాత్రుల ప్రారంభమయ్యే తొలి రోజునే అగ్ని స్నానమాచరిస్తారట. అప్పటి దాక ఆలయంలో పూజల జరుగుతూ కోలహాలంగా ఉంటుందట. ఎప్పుడు సంభవిస్తుందో.. ఎలా జరుగుతుందో.. తెలయదు గానీ, ఉన్నట్టుండి హఠాత్తుగా ఆలయం చుట్టూ అగ్నికీలలు వ్యాపిస్తాయని చెబుతున్నారు స్థానికులు. ఇలా ఎందుకు జరుగుతుందనేది సైన్సుకే అంతు చిక్కని మిస్టరీలా మిగిలింది. దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోదనలు చేస్తున్న శాస్త్రవేత్తలు సైతం కారణం ఏంటనేది నిర్థారించలేకపోయారు. విచిత్రం ఏంటంటే అక్కడ మంటలు అంటుకునేలా అగరబత్తులు వంటివి ఏం వెలిగించరట. ఇక పురాణల ప్రకారం..వనవాస సమయంలో పాండవులు ఈ అమ్మవారిని దర్శించి పూజించారని కథనం. అలాగే మరో కథనం ప్రకారం ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు "జైసమంద్"ను నిర్మించే క్రమంలో రాజస్తాన్ రాజు జై సింగ్ ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారని అప్పటి నుంచే ఈ అమ్మవారు "ఇడానా మాత"గా పూజలు అందుకుంటోందని చెబుతుంటారు. చాలామంది భక్తులు ఈ వింత చేసేందుకు ఈ ఆలయానికి తరలివస్తుంటారని చెబుతున్నారు.త్రిశూలం విశిష్టత..పక్షవాత రోగులు, మానసిక విలాంగులు ఈ ఆలయాన్ని దర్శిస్తే రోగం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో అనేక త్రిశూలాలు దర్శనమిస్తాయి. అవి ఆ అద్భుతం జరిగినప్పుడూ..మంటలు పూర్తయిన తర్వాత భక్తులు అమ్మవారికి త్రిశూలాన్ని సమర్పిస్తారట. అయితే ఈ త్రిశూలాన్ని సంతానం లేని మహిళలు పూజిస్తే.. సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.उदयपुर शहर से 60 किलोमीटर दूर स्थित ईडाणा माता ने नवरात्रि के पहले दिन अंग स्नान किया है. माता ने अपना अग्नि स्वरूप दिखाया. हजारों साल से यहां प्रतिमा है. यहां माता ईडाणा अग्नि स्नान करतीं है. पिछला अग्नि स्नान पिछले वर्ष इन्ही दिनों में किया था.@abplive #idanamatamandir pic.twitter.com/nMx9sfKTC4— vipin solanki (@vipins_abp) April 9, 2024 (చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!) -
రాజస్థాన్ లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల భారీ ఆపరేషన్
-
రాజస్థాన్‌లో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు
జైపూర్: దేశంలో రోజూ ఎక్కడో ఓ చోట బాంబు బెదిరింపు వస్తూనే ఉంది. స్కూళ్లు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు ఇలా దేన్నీ వదలకుండా ఫోన్లు, మెయిళ్లు, లేఖల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని పలు రైల్వేస్టేషన్లకు బుధవారం(అక్టోబర్2) బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు.రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జంక్షన్‌లోని స్టేషన్ సూపరింటెండెంట్‌కు గుర్తుతెలియని నుంచి ఓ లేఖ వచ్చింది. లేఖ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉంది. బికనీర్, శ్రీరంగానగర్, జోధ్‌పుర్, బుందీ, కోట, జైపూర్, ఉదయర్‌పుర్ సహా పలు రైల్వేస్టేషన్లలో బాంబు దాడులు జరగనున్నాయనేది లేఖ సారాంశం.లేఖ చదవిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. బీఎస్ఎఫ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు రైల్వేస్టేషన్లను జల్లెడ పట్టాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: పుణెలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి -
హడలెత్తిస్తున్న చిరుత.. 11 రోజుల్లో ఏడుగురిపై దాడి, మృతి
రాజస్థాన్‌లో ఓ చిరుత ప్రజలను హడలెత్తిస్తోంది. స్థానికులను వేటాడి చంపి తింటూ.. వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. తాజాగా ఉదయ్‌పూర్‌లోని ఓ గ్రామంలో పూజారి ప్రాణాన్ని బలిగొంది. సోమవారం తెల్లవారుజామున పూజారి విష్ణుగిరి(65) మృతదేహాన్ని స్థానిక అడివిలో గుర్తించారు. చిరుత అతనిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.మృతదేహాన్ని ఆలయానికి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.అయితే చిరుత దాడిలో గత 11 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. చిరుత దాడులు ఎక్కువవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా పలు చిరుతలు చిక్కాయని చెబుతున్న అధికారులు.. మరోవైపు వాటి దాడులు మాత్రం ఆగడం లేదని పేర్కొంటున్నారు.చిరుతపులి భయంతో పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో ఉచ్చులు బిగించారు. గత కొన్ని రోజులుగా కొన్ని పాంథర్లు పట్టుబడుతుండగా, చిరుతపులి దాడి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. చిరుత దాడులు క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఆ ప్రాంతంలో పాఠశాలలు మూతపడ్డాయి. సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే ఒంటరిగా రావొద్దని.. గుంపులుగా రావాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు ర్రలు లేదా ఇతర ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లాలని గ్రామస్థులను అధికారులు కోరారు. అయితే అందరిపై దాడి చేసింది ఒకే చిరుతనా అనేది తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అయిఏ అన్ని ఘటనల్లో జంతువు కదలికలు ఒకే రకంగా ఉన్నాయని.. దాడి స్వభావం కూడా ఒకే విధంగా ఉన్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను గమనిస్తున్నట్లు చెప్పారు. -
మెడను పక్కకు తిప్పి, కత్తి దూయనున్న రావణుడు
కోటా: రాజస్థాన్‌లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత ప్రత్యేకంగా కనిపించనున్నాడని నిర్వాహకులు చెబుతున్నారు.500 వెదులు బొంగులను ఉపయోగించిన తయారు చేస్తున్న ఈ రావణుని బొమ్మ 80 అడుగుల ఎత్తు ఉండనుంది. ఈ రావణుని బొమ్మ తన మెడను పక్కకు తిప్పి, కత్తిని ప్రయోగించనుంది. ఈ బొమ్మను తయారు చేసేందుకు కళాకారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అక్టోబర్ 12న దసరా సందర్భంగా రావణ దహనం జరగనుంది. అలాగే ఇక్కడ దసరా జాతరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.రావణునితో పాటు మేఘనాథుడు, కుంభకర్ణుని బొమ్మలను కూడా దహనం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. కోటా మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీకి చెందిన కళాకారులకు ఈ బొమ్మల తయారీ పనులను అప్పగించింది. 15 మంది కళాకారుల బృందం రావణుడి వంశాన్ని సిద్ధం చేస్తోంది. రావణుని బొమ్మ 80 అడుగుల ఎత్తు ఉండగా, మేఘనాథుడు, కుంభకర్ణుని బొమ్మలు 60 అడుగుల ఎత్తున ఉంటాయి. రావణుడి వంశం తయారు చేసేందుకు రూ.7.30 లక్షలు ఖర్చు అవుతున్నదని నిర్వాహకులు తెలిపారు.ఇది కూడా చదవండి: కుక్కల బీభత్సం.. రోజుకు వెయ్యిమందిని కరుస్తూ.. -
రాణాల ప్రతాపానికి ప్రతీక
రాజ్ మహల్... తాజ్ మహల్ కాదు, రాజ్ మహలే. రాజస్థాన్‌లో చల్లటి నగరం ఉదయ్‌పూర్‌లో ఉందీ రాజ్‌మహల్. రాజస్థాన్ అనగానే విస్తారమైన ఎడారి, ఇసుక తిన్నెలు, ఎండకు మిలమిల మెరుస్తున్న ఇసుకలో సుదూర ప్రయాణం చేస్తున్న ఒంటె అడుగు జాడలు గుర్తొస్తాయి. దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఉదయ్‌పూర్. నగరంలో ఎటు వెళ్లినా ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది. కనుచూపు మేరలో ఆరావళి పర్వతాలు పచ్చగా ఉంటాయి. ఆ పచ్చదనానికి దీటుగా నగరంలో కోటలోపల ప్యాలెస్‌ల మీద కూడా చెట్లు ఉంటాయి. వాటిని చెట్లు అనకూడదు, మహావృక్షాలవి. కొండ శిఖరం, వాలును ఆసరాగా చేసుకుని నిర్మించిన ప్యాలెస్‌లో చెట్ల మొదళ్లు మూడో అంతస్థులో ఉంటాయి. రాజ్‌మహల్ పేరుతో నిర్మించినప్పటికీ సిటీప్యాలెస్గా వ్యవహారంలోకి వచ్చింది. ఈ ప్యాలెస్ గురించి చెప్పుకునే ముందు పద్మావత్ సినిమాలో చూసిన చిత్తోరగఢ్ను గుర్తు చేసుకోవాలి. మహారాణా ఉదయ్ సింగ్ (రాణాప్రతాప్ తండ్రి) పుట్టిన కోట అది. అది అన్యాక్రాంతమైన తర్వాత ఉదయ్‌సింగ్ ఈ నగరాన్ని నిర్మించి ఇక్కడి నుంచే పాలన కొనసాగించాడు. నగరం శత్రుదుర్భేద్యంగా ఉండాలి, అదే సమయంలో నీటికి ఇబ్బంది లేకుండానూ ఉండాలనే ఉద్దేశంతో కొండలు, సరస్సుల మధ్య నిర్మించాడు. అందుకే దీనిని లేక్ సిటీ, కశ్మీర్ ఆఫ్ రాజస్థాన్ అంటారు.వంట పాత్రలు... ఇనుప కవచాలుసిటీ ప్యాలెస్... పిచోలా సరస్సు ఒడ్డున ఉంది. సిటీ ప్యాలెస్ ఎక్స్టీరియర్ వ్యూ అది కూడా ఒక వైపు కవర్ చేయాలంటే పిచోలా లేక్‌లో బోట్ షికారు చేయాలి. రాణి వంట గది ప్యాలెస్ లోపల ఉంటుంది. సిసోడియా రాజ వంశీయులు సూర్యుడిని ఆరాధిస్తారు. రోజూ సూర్యుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. ప్యాలెస్లోపల అనేక చోట్ల సూర్యుడి లోహపు రూ΄ాలుంటాయి. శీతాకాలంలో మబ్బు పట్టి సూర్యుడు కనిపించని రోజుల్లో లేత కిరణాలు ఆ లోహపు సూర్యుడి ప్రతిమ మీద ప్రతిబింబిస్తాయి. ఆ ప్రతిబింబానికి నమస్కారం చేసి వంటకాలు నివేదన చేస్తారు. సూర్యుడికి నివేదించే వంటలను ప్యాలెస్ లోపలి వంటగదిలో రాణి స్వయంగా చేయడం ఆనవాయితీ. ప్యాలెస్ ద్వారాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయా అనిపిస్తాయి. తల పైకెత్తి చూడాలి. కొన్ని గదుల్లోకి మాత్రం నడుము వరకు వంగి వెళ్లాలి. శత్రువులు దాడి చేసినప్పుడు రక్షణ కోసం ఆ ఏర్పాటు. కొన్ని గదుల్లో యుద్ధ సామగ్రి ఉంటుంది. మహారాణా ప్రతాప్ భుజాల నుంచి మోకాళ్ల వరకు ధరించిన ఇనుప కవచం మన ఎత్తు ఉంటుంది. దానిని చూస్తూ ఆశ్చర్యపోయే లోపు గైడ్ పక్కనే ఉన్న గుర్రాన్ని చూపిస్తాడు. అది చేతక్ నమూనా. మహారాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు చేతక్. తెల్లగా ఉంటుంది. ఆ గుర్రం నమూనా తయారు చేసి చేతక్ ధరించిన కవచాన్ని ధరింపచేశారు. రాజు ఒక్క ఉదుటున ఆ గుర్రం మీదకు ఎక్కాలంటే రాజు ఎత్తు ఎంత ఉంటుంది! అనే సందేహాన్ని ఎదురుగా ఉన్న కవచం నివృత్తి చేస్తుంది. ప్యాలెస్‌లో రాణి గది ఎదురుగా ΄ాలరాతి బెంచ్ ఉంటుంది. రాజు మందిరానికి వచ్చినప్పటికి రాణి అలంకరణ పూర్తి కాకపోతే, అలంకరణ పూర్తయ్యే వరకు రాజు ఆ ఆసనం మీద కూర్చుని ఎదురు చేసేవాడని గైడ్ చెప్పినప్పుడు పర్యాటకుల పెదవుల మీద ఓ చిరునవ్వు విరుస్తుంది. ప్యాలెస్ లోపల కొంత భాగంలో రాజకుటుంబం నివసిస్తోంది. కొంత భాగంలోనే పర్యాటకులను అనుమతిస్తారు. -
Rajasthan: రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది మృతి
సిరోహి: రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా పిండ్వారా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సిరోహి ఎస్పీ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జీపు రాంగ్ డైరెక్షన్లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో జీపు ప్రయాణికులతో నిండివుంది.జీపులో ప్రయాణిస్తున్నవారంతా పాలి జిల్లాలోని నాడోల్ ఆలయాన్ని సందర్శించి, ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కంటల్ సమీపంలోకి రాగానే ఆ జీపు ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో జీపు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు పురుషులు, ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు మృతిచెందారని పిండ్వారా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి హమీర్ సింగ్ తెలిపారు. మృతులు, గాయపడినవారు ఉదయపూర్ జిల్లాలోని గోగుండా, ఝడోల్కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి -
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
బుండి: రాజస్థాన్‌లోని బుండిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎకో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో హిడోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ నేషనల్ హైవేలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైవేపై ఉన్న కెమెరాలు, టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన గురించి బుండి ఏఎస్పీ ఉమా శర్మ మాట్లాడుతూ సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. కాగా రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఓ కారు రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ఘటనలో కూడా ఆరుగురు మృతి చెందారు.ఇది కూడా చదవండి: రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి -
Rajasthan: ధార్మిక ఊరేగింపులో ఉద్రిక్తత
భిల్వారా: రాజస్థాన్‌లోని షాపురా జిల్లాలో గల జహజ్‌పూర్‌లో జల్ఝులానీ ఏకాదశి ఊరేగింపులో రాళ్ల దాడి చోటుచేసుకుంది. కోట నుండి వస్తున్న పీతాంబర్ రాయ్ మహారాజ్ ఊరేగింపుపై ఒక మతపరమైన స్థలం వెలుపల రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు, కొందరు యువకులు, బీజేపీ ఎమ్మెల్యే గాయపడ్డారు. రాళ్లదాడి అనంతరం ఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జహజ్‌పూర్ బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఈ ఘటన నేపధ్యంలో పలు దుకాణాలు మూతపడ్డాయి. పట్టణంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి షాపురా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ కన్వత్ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టణంలో మత సామరస్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ రాజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ఏదైనా పండుగ నిర్వహించే ముందుగా ఇరు వర్గాల సమావేశం నిర్వహించాలని ఎస్‌డిఎం, పరిపాలనాధికారులకు సూచించారు. ఘటన ఎలా జరిగిందనే విషయమై విచారణ జరుపుతున్నామన్నారు. సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. ఇది కూడా చదవండి: నిమజ్జనానికి 2,500 వాహనాలు -
ఏకంగా 6110! కడుపా? రాళ్ల గుట్టా? డాక్టర్లే ఆశ్చర్యపోయిన వైనం
రాజస్థాన్‌లోని కోటాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. 70 ఏళ్ల వ్యక్తి పిత్తాశయం (గాల్‌బ్లాడర్) నుండి ఒకటీ రెండూ కాదు ఏకంగా 6,110 రాళ్లను తొలగించడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. బుండి జిల్లా పదంపురకు చెందిన ఒక పెద్దాయన కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడేవారు. దాదాపు సంవత్సర కాలంగా చికిత్స తీసుకుంటున్నా, ఫలితంలేదు. దీంతో ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా అతనికి నిర్వహించిన స్కానింగ్‌లో అతిపెద్ద రాళ్లను గుర్తించారు. గ్లాల్ బ్లాడర్ సైజు సాధారంగా 7x4 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ 12x4 సెం.మీకి పెరిగిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో అతనికి సర్జరీ నిర్వహించి అతని ప్రాణాలను కాపాడారు.పిత్తాశయం పూర్తిగా రాళ్లతో నిండిపోయిందని, అదే అతని అసౌకర్యానికి ప్రధాన కారణమని లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు .ఎండో-బ్యాగ్‌ని ఉపయోగించి పిత్తాశయాన్ని తొలగించి, మరిన్ని వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు. సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఆపరేషన్‌కు దాదాపు 30 -40 నిమిషాలు పట్టిందట. అంతేకాదు ఈ రాళ్లను లెక్కించేందుకు రెండున్నర గంటలు సమయం పెట్టింది. ఆపరేషన్ తర్వాత ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. పిత్తాశయంలో రాళ్లు ఎందుకు వస్తాయి?జీర్ణక్రియకు తోడ్పడేలా కాలేయం ఉత్పత్తి చేసే ద్రవం అయిన పిత్తాన్ని తయారు చేసే పదార్థాలలో అసమతుల్యత ఉన్నప్పుడు పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి. కాలేయం క్రింద ఉన్న చిన్న అవయవం పిత్తాశయంలో రాళ్లు సాధారణంగా కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ ఎక్కువైనపుడు రాళ్లు వస్తాయి. తయారవుతాయి. ఇవి ఇసుక రేణువులంత చిన్న పరిమాణం నుండి గోల్ఫ్ బాల్ అంత పెద్ద పరిమాణంలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా జన్యుపరమైన కారణాల వల్ల పిత్తాశయంలో చాలా రాళ్లు వస్తాయి. అతి వేగంగా బరువు తగ్గడం లేదా యో-యో డైటింగ్ కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే జీవనశైలి, ఆహార అలవాట్లు, అంటే ఫాస్ట్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ , కొలెస్ట్రాల్ కొవ్వు అధికంగా ఉండే ఆహారం ప్రధాన కారణమని డాక్టర్ జిందాల్ అభిప్రాయపడ్డారు. వీటినిసకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరమైన కేన్సర్‌కు దారి తీయవచ్చని డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు. -
తండ్రి చితికి నిప్పు పెట్టేంతలో కుమారుని మృతి
బివార్: విధి రాతను ఎవరూ తప్పించలేరని అంటారు. కొన్ని ఉదంతాలు చూసినప్పుడు ఇది ముమ్మాటికీ నిజం అనిపిస్తుంది. రాజస్థాన్‌లోని బివార్ జిల్లాలో గల జాలియా గ్రామంలో విధి ఆడిన వింత నాటకం స్థానికులను కంటతడి పెట్టించింది. తండ్రి మృతదేహాన్ని స్మశాన వాటికవరకూ తీసుకెళ్లిన కుమారుడు హఠాత్తుగా కన్నుమూశాడు.వివరాల్లోకి వెళితే జాలియా గ్రామంలోని బ్రహ్మపురి ప్రాంతంలో నివసిస్తున్న రాధాకృష్ణ నాగ్లా అనే వృద్ధుడు మృతిచెందాడు. తండ్రి మరణంతో అతని కుమారుడు మహావీర్ ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. బంధువుల సహాయంతో తండ్రి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లాడు. తండ్రి చితికి నిప్పు పెట్టేంతలో స్పృహ తప్పిపడిపోయాడు. అతనిని గమనించినవారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహావీర్ ప్రసాద్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులంతా షాకయ్యారు. చివరికి వారే తొలుత రాధాకృష్ణకు, ఆ తరువాత మహావీర్ ప్రసాద్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. మహావీర్ ప్రసాద్ సోదరుడు రాజ్ కుమార్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. ఇప్పుడు రాధాకృష్ణ, మహావీర్ ప్రసాద్‌లు మృతిచెందడంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి అనాథగా మారింది. -
Haryana: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
హర్యానాలోని జింద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నర్వానాలోని బిధరానా గ్రామ సమీపంలో హిసార్-చండీగఢ్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.కురుక్షేత్రలోని మార్చేడి గ్రామం నుంచి రాజస్థాన్‌లోని గోగమేడికి వెళ్తున్న టాటా ఏస్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మార్చేడి గ్రామానికి చెందిన 15 మంది రాజస్థాన్‌లోని గోగమేడికి టాటా కారులో వెళుతున్నారు.వీరి వాహనం నర్వానాలోని బిధరానా గ్రామం సమీపంలోకి చేరుకున్న సమయంలో హిసార్-చండీగఢ్ జాతీయ రహదారిపై బిధరానా- సిమ్లా మధ్య కలపతో కూడిన ట్రక్కు.. టాటా కారును వెనుక నుండి ఢీకొంది. దీంతో టాటా కారు ఒక గుంతలో బోల్తా పడింది. ఆ సమయంలో హైవే మీదుగా వెళుతున్న కొందరు డ్రైవర్లు బాధితులకు సహాయం అందించారు. అనంతరం నర్వాణ పోలీసులు ఏడు అంబులెన్సులను సంఘటనా స్థలానికి పంపారు. బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితులలో ఏడుగురు మరణించినట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆగ్రోహ ఆస్పత్రికి తరలించారు. -
Rajasthan: కూలిన మిగ్ 29 యుద్ధ విమానం.. పైలట్లకు తప్పిన ప్రమాదం
బార్మర్: రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఓలానియోక్లోని ధాని సమీపంలో యుద్ధ విమానం మిగ్ 29కు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నాగనా పోలీస్‌స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం నుంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.మిగ్ 29 యుద్ధ విమానం భారతదేశంలోని ముఖ్యమైన విమానాలలో ఒకటి. ఈ జెట్ విమానం బార్మర్‌లో రాత్రిపూట సాధారణ శిక్షణ మిషన్‌లో సాంకేతిక లోపానికి గురైందని వైమానిక దళం తెలిపింది. ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. మిగ్ 29 విమానంలో మంటలు చెలరేగిన వీడియోను డిఫెన్స్ కోర్ అనే ఖాతా నుంచి షేర్ చేశారు. During a routine night training mission in Barmer sector, an IAF MiG-29 encountered a critical technical snag, forcing the pilot to eject. The pilot is safe and no loss of life or property was reported. A Court of Inquiry has been ordered.— Indian Air Force (@IAF_MCC) September 2, 2024మిగ్ 29 విమానం 1987 నుండి అంటే దాదాపు 36 సంవత్సరాలుగా భారత వైమానిక దళం సేవలో ఉంది. సోవియట్ యూనియన్ నుంచి భారత్ ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. ఈ విమానాన్ని పలుమార్లు నవీకరించారు. విమానంలోని ప్రాథమిక నిర్మాణం మినహా దాదాపు ప్రతిదీ మార్చారు. ఇందులో కొత్త కాక్‌పిట్, నూతన రాడార్, కొత్త ఇంధన ట్యాంక్ ఉన్నాయి. కొత్త ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ కూడా అమర్చారు. కొత్త క్షిపణులను అమర్చడం ద్వారా దీనికి పూర్తిగా ఆధునిక రూపాన్నిచ్చారు.మిగ్ 29 వేగంగా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఆరు నిమిషాల్లో లక్ష్యన్ని ఛేదించగలదు. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ విమానం కీలక పాత్ర పోషించింది. బాలాకోట్ ఘటన సమయంలో కూడా తీవ్రవాద శిబిరంపై వైమానిక దాడిలో మిగ్ 29 పాల్గొంది. ఈ విమానంలో రెండు ఇంజన్లు ఉంటాయి. పరిమాణంలో చిన్నదిగా ఉన్నా చాలా చురుకైనది. ఇది నాల్గవ తరం యుద్ధ విమానం. గంటకు దాదాపు 2,500 కిలోమీటర్ల వేగంతో ఎగిరే సామర్థ్యం దీని సొంతం.Another crash this time IAF's MIG-29 in Barmer, Rajasthan. Pilot is safe, and no damage reported on the ground. More details to follow. pic.twitter.com/5hkXpUt9lY— Defence Core (@Defencecore) September 2, 2024 -
సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువు తీరాడు పార్వతీ తనయుడు.రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్‌కు ఏం చెయ్యాలో పాలు΄ోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు.ఒక రోజు రాత్రి అతను నిద్ర΄ోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరి΄ోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసి΄ోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు.ఇదీ విశిష్టత..ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ్రపార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి?రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్‌లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్‌కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్‌కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్ లో ఉంది.ఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
ప్రభుత్వాసుపత్రిలో ఘోరం
జోధ్‌పూర్: రాజస్తాన్‌లోని మహాత్మాగాంధీ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం చోటుచేసుకుంది. జోధ్‌పూర్ నగరంలోని ఈ ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఒకరు ఈ ఆస్పత్రిలో మాజీ ఉద్యోగి కావడం గమనార్హం. జోధ్‌పూర్ సిటీ(వెస్ట్) ఏసీపీ అనిల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం బాలికను ఇంట్లో అమ్మ బాగా కోప్పడింది. దీంతో అలిగిన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి దగ్గర్లోని మహాత్మాగాంధీ ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది. అక్కడ ఒంటరిగా తిరుగుతున్న బాలికతో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు మాటలు కలిపారు. తర్వాత బాలికను ఆస్పత్రి వెనుకభాగంలో ఆస్పత్రి బయోవ్యర్థాలను నిల్వఉంచిన డంపింగ్ యాడ్ వద్దకు తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారు. అమ్మాయి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు బాగా వెతికి చివరకు సోమవారం సూరసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రి సమీపంలో బాలిక జాడ కనిపెట్టారు. అమ్మాయి దొరికిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు వచ్చాక ముందురోజు తాను ఎదుర్కొన్న భయానక ఘటనను తల్లిదండ్రులు, పోలీసులకు అమ్మాయి విడమరిచి చెప్పింది. దీంతో అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి నిందితుల జాడ కోసం వేట మొదలెట్టారు. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్‌చేసి ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం డంపింగ్‌యార్డ్‌లోని ఘటనాస్థలికి వెళ్లి ఫోరెన్సిక్ బృందం సాక్ష్యాధారాలను సేకరించిందని ఏసీపీ చెప్పారు. ‘‘ పోలీసులు ఆస్పత్రికి వచ్చారుగానీ అసలేం జరిగిందో మాకు చెప్పలేదు. మేం అంతర్గతంగా వివరాలు రాబట్టగా నిందితుల్లో ఒకడు మా ఆస్పత్రిలో గతంలో కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగం చేశాడని తెల్సింది’’ అని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫతాసింగ్ భాటి చెప్పారు. రాత్రిళ్లు ఆస్పత్రి పరిసరాల్లో ఎక్కడా చీకటి ఉండొద్దు. లైట్లు బిగించండి. చీకటి ప్రాంతం కనిపించొద్దు’ అని సిబ్బందిని ఆయన ఆదేశించారు. విమర్శలు ఎక్కుపెట్టిన విపక్షాలుబీజేపీ హయాంలో రాష్ట్రంలో ఆటవికపాలన నడుస్తోందని విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘‘ ఆటవిక ఏలుబడికి తాజా ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. శాంతిభద్రతల అంశం అటు ప్రజా ప్రతినిధులకు, ఇటు పోలీసులకు ఏమాత్రం పట్టట్లేదు. దీంతో నేరస్తులకు భయం లేకుండా పోయింది. ఒకప్పుడు నేరాలే జరగని జోధ్‌పూర్‌లో ఇప్పుడు బీజేపీ అస్తవ్యస్థపాలనతో నగరంలో అమ్మాయిలకు రక్షణ కరువైంది’’ అని కాంగ్రెస్ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అన్నారు. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు అనేవే లేవని రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్‌సింగ్ దోస్తారా అన్నారు. -
నేడు జల్గావ్కు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగే కార్యక్రమంలో 11 లక్షల నూతన ‘లఖ్పతి దీదీస్’ను ఆయన సన్మానిస్తారు. ఇదే కార్యక్రమంలో 4.3 లక్షల స్వయం సహాయక బృందాలకు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.2,500 కోట్లను విడుదల చేస్తారు. మరో రూ.5 వేల కోట్ల రుణాలను పంపిణీ చేస్తారు. అనంతరం, ఆయన రాజస్తాన్‌లోని జోథ్‌పూర్ వెళ్తారు. అక్కడ జరిగే రాజస్తాన్ హైకోర్టు ప్లాటినం జూబిలీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరవుతారని పీఎంవో తెలిపింది. -
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి
జైపూర్: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానం గాల్లో దూసుకెళ్తుండగా అనూహ్యమైన సంఘటన జరిగింది. సాంకేతిక సమస్యతో పలురకాల వైమానిక సామగ్రి జారిపడింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. యుద్ధ విమానం అనుకోకుండా నిర్మానుష్య ప్రాంతంలో సామగ్రిని జారవిడిచినట్లు అధికారులు తెలియజేశారు. ప్రాణ, ఆస్తి నష్టమేమీ జరగలేదన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జారిపడిన సామగ్రి ఏమిటన్నది బయటపెట్టలేదు. సైనిక భాషలో బాంబు, క్షిపణులు, ఆయుధాలు, చమురు ట్యాంక్‌లను కూడా వైమానిక సామగ్రిగా పిలుస్తుంటారు. -
చై- శోభితల పెళ్లి ఎప్పుడంటే?
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లల నిశ్చితార్థం ఈ నెల 8న జరిగిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ వీరి వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే చర్చ ఆరంభమైంది. కాగా నాగచైతన్య, శోభితల వివాహం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మార్చిలో రాజస్థాన్‌లో జరిగే అవకాశం ఉందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఇద్దరి సినిమా కాల్షీట్స్, వీరి కుటుంబంలోని ముఖ్య సభ్యులు అందుబాటులో ఉండే సమయం వంటి అంశాలు చర్చించుకుని పెళ్లి తేదీ, వివాహ వేదికపై ఇద్దరి కుటుంబ సభ్యులు ఓ స్పష్టతకు వస్తారట. మరి... ఈ ఏడాది చివర్లో నాగచైతన్యతో శోభిత ఏడడుగులు వేస్తారా? లేక వచ్చే ఏడాది మార్చిలో శోభిత మెడలో చైతన్య మూడు ముళ్లు వేస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. -
Rajasthan: బంద్‌తో విద్యాసంస్థల మూసివేత.. ఇంటర్నెట్ నిలిపివేత
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు (బుధవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ ప్రభావం రాజస్థాన్‌లోని విద్యాసంస్థలపై కనిపించింది.బంద్ పిలుపు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. చిత్తోర్‌గఢ్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భరత్‌పూర్‌లో భారత్ బంద్ దృష్ట్యా ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసు బలగాలను మోహరించారు. చిత్తోర్‌గఢ్‌లో షెడ్యూల్డ్ కులాలు- తెగల మహార్యాలీ నిర్వహిస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా వీరు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తారు. రాజస్థాన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో బుధవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు. -
Rajasthan: రెండు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్.. తనిఖీలు ముమ్మరం
రాజస్థాన్‌లోని జైపూర్లోగల రెండు ప్రముఖ ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ఆస్పత్రులకు చేరుకున్నారు. బాంబ్ స్క్యాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. రోగులను ఆస్పత్రి నుంచి బయటకు తరలించి, వైద్య సేవలు అందిస్తున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం జైపూర్‌లోని సీకే బిర్లా, మోనిలెక్ ఆసుపత్రులలో బాంబులు ఉన్నాయనే సమాచారం అందుకోగాగానే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ఆస్పత్రులలో పెద్ద సంఖ్యలో రోగులు, వారి బంధువులు ఉన్నారు. దీంతో పోలీసులు రోగులను బయటకు తరలించారు. వైద్యులు బయటనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్‌గా మారింది.ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనిఖీల అనంతరం అవి ఫేక్ అని తేలుతోంది. అయితే ఇలాంటి వదంతుల వలన సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. जयपुर के सीके बिरला और मोनीलेक हॉस्पिटल में बम की सूचना पर बड़ी संख्या में पहुंची पुलिस. बम स्क्वायड वहां मरीजो को बाहर निकाल कर रहा है जांच @BhajanlalBjp @abplive pic.twitter.com/swl1p0s6Id— Santosh kumar Pandey (@PandeyKumar313) August 18, 2024 -
డ్రగ్స్ దందాలో రాజస్తాన్ వ్యాపారులు
గచ్చిబౌలి: నగరంలో స్థిరపడిన రాజస్తాన్‌కు చెందిన కొందరు వ్యాపారుల ద్వారా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వినీత్ ఆ కేసు వివరాలు వెల్లడించారు. ఘట్కేసర్కు చెందిన దినేశ్‌చౌదరి, మంగళారంచౌదరి హెరాయిన్ పేస్ట్ కోసం రాజస్తాన్‌కు చెందిన సవర్‌ఝట్‌కు రూ.48 వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు.ఈ నెల 7వ తేదీన రాజస్తాన్ నుంచి ఓ కారులో సైనిక్‌పురికి హెరాయిన్ పేస్ట్ తీసుకొచ్చారు. ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డులోని ఓ హోటల్లో మంగరామ్, దినేశ్, గణేశ్‌లు రమేశ్‌చంద్, సురేశ్‌చంద్‌లను కలిశారు. హెరాయిన్ ఎలా విక్రయించాలో వివరించారు. ఆ తర్వాత మరో కారులో గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని ప్రకాశ్ లైట్‌హౌస్‌లో హెరాయిన్ పేస్ట్‌ను దాచేందుకు తీసుకొచ్చారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంలో ఎస్ఓటీ మాదాపూర్, రాయదుర్గం పోలీసులు 14న రాత్రి 11 గంటల సమయంలో లైట్‌హౌస్‌పై దాడి చేశారు.హెరాయిన్ పేస్ట్‌తోపాటు పెడ్లర్స్ మంగళారంచౌదరి, దినేశ్ చౌదరి, గణేశ్ చౌదరిలతోపాటు వినియోగదారులు నితిన్‌గుర్జార్, ప్రకాశ్ లైట్‌హౌస్ యజమాని ప్రకాశ్ చౌదరితోపాటు అమీన్‌పూర్‌కు చెందిన జైవత్రం వసనారం దేవసి, సైనిక్‌పురికి చెందిన ప్రకాశ్æచౌదరి, భువనగిరికి చెందిన బానారాం చౌదరిలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సవర్‌ఝట్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.4.34 కోట్ల విలువైన హెరాయిన్ పేస్ట్, రెండు కార్లు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించగా అందరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు.ప్రకాశ్ లైట్‌హౌస్ యజమాని మధ్యప్రదేశ్‌లోని ఓ పీఎస్‌లో ఎన్డీపీఎస్ చట్టం కింద ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. రాజస్తాన్‌కు చెందిన ప్రధాన పెడ్లర్ సవర్‌ఝట్ ఎక్కడి నుంచి హెరాయిన్ తీసుకొస్తున్నారనే విషయంపై దర్యాప్తు కొనసాగిస్తామని డీసీపీ తెలిపారు. నగరంలో స్థిరపడిన రాజస్తాన్‌కు చెందిన వ్యాపారులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. డ్రగ్ సరఫరా చేసినా, కొనుగోలు చేసినా, వాడుతున్నట్టు తెలిసినా డయల్ 100, 9490617444 ఫోన్నంబర్లకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీలు జయరాం, శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ శ్రీకాంత్, ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ విక్రయించే రాజస్తానీ అరెస్ట్8 గ్రాములు హెరాయిన్, 34 గ్రాములు ఓపీఎం స్వాధీనంపటాన్చెరు టౌన్: మాదకద్రవ్యాలు విక్రయించే ఓ రాజస్తానీ వ్యక్తిని అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో అదనపు ఎస్పీ సంజీవరావు ఆ వివరాలు వెల్లడించారు. పటాన్ చెరు మండల పరిధిలోని చిట్కుల్ రాధమ్మ కాలనీలో మాదకద్రవ్యాలు నిల్వ ఉన్నాయనే సమాచారం మేరకు టీనాబ్, ఎస్ఓటీ, పటాన్చెరు పోలీసులు సంయుక్తంగా ఓ ఇంటిపై దాడులు చేశారు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజస్తాన్‌కు చెందిన రెయిలింగ్ పనులు పనిచేసే బుధారామ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.దీంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీడీఎల్‌లో ఉంటున్న చిన్నాన్న కొడుకు కోశాలరామ్ డ్రగ్స్ తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవాడని, తొలుత తమకు అలవాటు అయ్యిందని, ఆ తర్వాత వ్యాపారంగా మార్చుకున్నట్టు నిందితుడు తెలిపాడు. అతని నుంచి 8 గ్రాములు హెరాయిన్, 34 గ్రాములు ఓపీఎం, సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
ఫోన్లో తలాక్ చెప్పాడు... ఫిక్స్ అయిపోయాడు!
రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం కువైట్‌కు వెళ్లి జీవిస్తున్నాడు. అయితే అతనికి పాకిస్థాన్‌కు చెందిన మహిళ పరిచయం అవ్వగా.. ఆమెను వివాహం చేసుకునేందుకు భారత్‌లోని తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అయితే సోమవారం అతడు జైపూర్ భారత ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు.. రాజస్థాన్‌లోని చురుకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ కువైట్‌లో పనిచేస్తున్నాడు. అతడికి హనుమాన్‌గఢ్‌లోని భద్ర ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఫరీదా బానోతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, రెహ్మాన్‌కు పాకిస్థాన్‌కు చెందిన మెహ్విష్ అనే మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది.ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెహ్మాన్ కువైట్ నుంచి భారత్‌లో ఉంటున్న తన భార్యకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ చెప్పాడు. అనంతరం సౌదీ అరేబియాలో పాక్ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె గత నెల టూరిస్ట్ వీసాపై చురుకు వచ్చి రెహ్మాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో మొదటి భార్య ఫరీదా బానో తన భర్త రెహ్మాన్‌పై కేసు పెట్టింది. తనను అధిక కట్నం కోసం వేధించారని, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రెహ్మాన్‌ను హనుమాన్‌ఘర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు హనుమాన్‌గఢ్ డిప్యూటీ ఎస్పీ రణ్వీర్ సింగ్ తెలిపారు. -
ఎంత అమానుషం: భార్యను తాడుతో కట్టేసి.. బైక్‌పై ఈడ్చుకెళ్లిన భర్త
రాజస్థాన్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. తాగిన మైకంలో ఓ భర్త తన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు. భార్య కాళ్లకు తాడు వేసి దానిని బైక్‌కు కట్టి కొంతదూరం లాక్కెళ్లాడు. ఈ ఘోర దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో.. మట్టి, రాళ్లు కలిగిన నేల మీద మహిళను ఈడ్చుకెళ్తుండే.. ఆమె నొప్పితో బాధపడుతూ సాయం కోసం అరవడం వినిపిస్తోంది. అక్కడే ఓ మహిళ, మరో వ్యక్తి (వీడియో తీస్తున్న అతను) ఉన్నప్పటికీ దీనిని ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. నాగౌర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.మహిళను కొంతదూరం లాక్కెళ్లిన తర్వాత అతడు బైక్ దిగి ఓ సాధించినట్లు నడుం మీద చేయి వేసి దర్జాగా నిల్చొని ఉన్నాడు. గాయాలపాలైన భార్య మెల్లగా లేచి ఏడుస్తూ నిలబడి ఉంటుంది. అయితే ఈ 40 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు చెందిన ఘటన గత నెలలో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలోషేర్ చేయడంతో చక్కర్లు కొడుతోంది. అయితే జైసల్మేర్‌లో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లాలని భార్య అనుకోగా..భర్త ఆమెపై ఈ విధంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిని ప్రేమ్ రామ్ మేఘ్వాల్గా(32) గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మేఘ్వాల్ నిరుద్యోగి, డ్రగ్స్ బానిసైనట్లు పంచౌడీ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ సురేంద్ర కుమార్ తెలిపారు. ప్రస్తుతం మహిళ పంజాబ్‌లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు సమాచారం.Shocking incident in Nagaur: A man, under the influence of alcohol,tied his wife to the back of a bike and dragged her on the road.The video went viral, leading to the man's arrest. Prior to this, the wife was reportedly held captive at home. She is now with her mother in Punjab. pic.twitter.com/Nfik4CJpqj— Smriti Sharma (@SmritiSharma_) August 13, 2024 -
Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది
ఆ అమ్మాయి స్కూల్‌కు వచ్చినన్ని రోజులు ఎడమ చేతిని ఎవరూ చూళ్లేదు. దానిని స్కర్ట్ జేబులో పెట్టుకుని ఉంటే అదామె అలవాటనుకున్నారు. కాని అసలు రహస్యం ఏమిటంటే ఎడమ అర చెయ్యి లేకుండా పుట్టింది తనీషా. స్కూల్లో ఎగతాళి చేయకుండా ఉండడానికి మణికట్టుకు దుపట్టా చుట్టి జేబులో దాచేది. కాని ఇప్పుడు దాచడం లేదు. గత నెల బెంగళూరులో జరిగిన 13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన రజత పతకం ఆమె చేతికి గౌరవాన్ని ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.ఆరావళి పర్వతాలు చుట్టుముట్టిన రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం. తన వైకల్యాన్ని చూసి ఇతర పిల్లలు ఆట పట్టించడంతో స్కూల్‌కు వెళ్లకుండా తనీషా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేది. దీంతో ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న వేరే పాఠశాలలో చేర్పించారు. అక్కడ కూడా వెక్కిరింపులు ఎదురు కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులకు, తోటిపిల్లలకు తెలియకుండా తన అంగవైకల్యాన్ని జేబులో దాచిపెట్టింది. అంగవైకల్యాన్ని దాచి పెట్టడం అంటే... ఒంటరితననానికి దగ్గర కావడమే.గెలుపుతో విముక్తి‘ఇప్పుడు నా ఎడమ చెయ్యిని దాచాల్సిన అవసరం లేదు’ అంటోంది తనీషా. అద్భుతమైన బెంగళూరు విజయంతో ఆమె ఎడమ చేయి జేబు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది అంగవైకల్యంలా అనిపించడం లేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. ఒకప్పుడు తనీషాకు నలుగురితో కలవడం తెలియదు. నలుగురితో కలిసి నవ్వడం తెలియదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛా జీవితపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ‘ఇప్పుడు నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్ చేయడం లేదు’ చిరునవ్వుతో అంది తనీషా. గత ఏడాదిలో రాష్ట్ర, జాతీయ చాంపియన్‌షిప్‌లలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో సహా అయిదు పతకాలు సాధించింది. ‘ఈ పతకాలు నా జీవితాన్ని మార్చేసాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది’ అంటుంది తనీషా.తొలిసారి పట్టుదల‘నాకు 1,500 మీటర్ల తొలి పరుగు పందెం గుర్తుంది. పోటీలో నన్ను చూసి ఇతర పోటీదారులు నవ్వుతున్నారు. దాంతో పోటీలో పాల్గొనడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. మా నాన్నమాత్రం ఎలాగైనా సరే, పాల్గొనాల్సిందే అన్నాడు. దాంతో సర్వశక్తులు ఒడ్డి పరుగెత్తాను.నాలుగోస్థానంలో నిలిచినప్పుడు అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగింది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంది తనీషా.జూలైలో పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియానికి వెళ్లిన తనీషా వందలాది మంది ప్రేక్షకులను చూసి కంగారు పడింది. ‘ఇప్పుడు సాధించకపోతే సంవత్సరం శ్రమ వృథా అయిపోతుంది’ అనుకుంది మనసులో. అనుకోవడమే కాదు 400 మీటర్ల రేసును విజయవంతంగా పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది. ‘ఇప్పుడు ఉన్నంత సంతోషంగా నా కూతురు ఎప్పుడూ లేదు. ఆటలు ఆమెను పూర్తిగా మార్చివేసాయి’ అంటోంది తల్లి భన్వారీదేవి. నాన్న నిలబడ్డాడుపుట్టినప్పుడు ఎడమ అర చెయ్యి లేకపోవడంతో తనీషాను తండ్రి ఇంద్రజ్ బాజియా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ అమ్మాయి మీకు దేవుడు ఇచ్చిన వరం. ప్రేమగా చూసుకోండి... అన్నాడు ఆ డాక్టర్. ఆయన మాటలు తండ్రిలోని దిగులును మాయం చేశాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి వివక్షత చూపకుండా ఆమెను ఆటల్లో ప్రోత్సహించాడు తండ్రి. ‘తనీషా బాగా పరుగెడుతుంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించే సామర్థ్యం ఆమెలో ఉంది. తనీషాకు శిక్షణ ఇవ్వడానికి ప్రతివారం ఆమె గ్రామానికి వెళుతుంటాను’ అంటుంది తనీషా కోచ్ సరితా బవేరియా. నేషనల్ లెవల్ ప్లేయర్ అయిన సరిత బవేరియా దివ్యాంగులైన పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటుంది. -
రాజస్థాన్‌లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!
-
ఆ ఊరి పేరు ఐఏఎస్ ఫ్యాక్టరీ... స్త్రీ విద్యతో ఆ ఊరి పేరే మారింది!
ఒకప్పుడు ఆ ఊరి పేరు వినబడగానే ‘వామ్మో’ అనుకునేవారు. దొంగతనాలు, అక్రమ మద్యం వ్యాపారానికి పేరు మోసిన రాజస్థాన్‌లోని నయాబస్ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆదర్శ గ్రామం అయింది. అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి కారణం ఈ గ్రామానికి చెందిన మహిళలు ఐపీఎస్ నుంచి జడ్జీ వరకు ఉన్నత ఉద్యోగాలు ఎన్నో చేయడం. జడ్జీగా ఎంపికైన అభిలాష జెఫ్ విజయాన్ని ఊరు ఊరంతా సెలబ్రెట్ చేసుకుంది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు అభిలాష రోల్ మోడల్...ఒక ఇంట్లో పెద్ద ఉద్యోగం వస్తే... ఆ సంతోషం ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. కానీ అభిలాష జెఫ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె జడ్జీగా ఎంపికైన సందర్భం ఊరంతటికీ పండగ అయింది. అభిలాషను వీధుల్లో ఊరేగిస్తూ డీజే, డ్యాన్స్‌లతో ఆమె విజయాన్ని గ్రామస్థులు సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్నారు.ఈ ఊరేగింపులో పాల్గొన్న సరితా మీనా ఇలా అంటుంది... ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను. ఏదో ఒకరోజు మా అమ్మాయి అభిలాషలాగే పెద్ద ఉద్యోగం చేస్తుంది’ సరితా మీనాలాగే కలలు కన్న తల్లులు, ఎన్ని కష్టాలు వచ్చినా తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివిస్తామని ప్రతిజ్ఞ చేసిన తల్లులు ఆ ఊరేగింపులో ఎంతోమంది ఉన్నారు. రాజస్థాన్‌లోని నీమ్ కా ఠాణా జిల్లాలోని నయాబస్ గ్రామంలోని యువతులకు ఆ సంతోషకరమైన రోజు ఒక మలుపు.‘అభిలాషలాంటి అమ్మాయిల వల్ల ఊరికి జరిగిన మేలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివించాలనుకుంటారు. పది చాలు, పై చదువులు ఎందుకు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది కర్ణిక అనే గృహిణి.అభిలాషకు ముందు అల్కా మీనాను కూడా ఇలాగే ఊరేగించారు. ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా ఐపీఎస్ పంజాబ్‌లో డిఐజీగా విధులు నిర్వహిస్తోంది. అల్కా మీనా నుంచి అభిలాష వరకు ఎంతోమంది మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే నయాబస్ను ఇప్పుడు ‘ఐఏఎస్ ఫ్యాక్టరీ’ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరి నుంచి ఐఏఎస్‌లాంటి ఉన్నత సర్వీసులకు ఎంపికైన వారు కూడా ఉన్నారు.ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా అల్కా మీనా, అభిలాషలాంటి విజేతల పోస్టర్లు కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. కోచింగ్ సెంటర్ల వారు అంటించిన ఈ పోస్టర్లలో ‘ఇలాంటి విజేతలు మీ ఇంట్లో కూడా ఉన్నారు’ అని ఉంటుంది.ఈ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు వారి ప్రపంచంలో మాత్రమే ఉండిపోకుండా ఎప్పుడూ ఊరితో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుకు సంబంధించి చొరవ తీసుకుంటారు. ఒకప్పుడు ఈ ఊళ్లో ఒకే స్కూల్ ఉండేది. అమ్మాయిల సంఖ్య అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం ‘బాలికల పాఠశాల’తో కలిసి మూడు స్కూల్స్ ఉన్నాయి.చదువు వల్ల నయాబస్ ఆదర్శగ్రామం కావడం ఒక కోణం అయితే, స్త్రీ సాధికారత మరో కోణం. చదువు వల్ల అమ్మాయిలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం నుంచి ఆర్థిక భద్రత, ఉన్నత ఉద్యోగం వరకు ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంటున్నారు. తమ కలలను నిజం చేసుకుంటున్నారు.ఆటల్లోనూ...ఉన్నత చదువు, ఉద్యోగాలలోనే కాదు ఆటల్లో రాణిస్తున్న వారు కూడా నయాబస్లో ఎంతోమంది ఉన్నారు. దీనికి ఉదాహరణ... సలోని మీనా. గత ఏడాది ఇండో–నేపాల్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఇరవై ఏళ్ల మీనా మూడోసారి స్వర్ణం గెలుచుకొని ఊళ్లో సంబరం నింపింది. రాబోయే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడాలనేది తన లక్ష్యం అని చెబుతుంది మీనా. భవిష్యత్‌కు సంబంధించి సలోని మీనాకు భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఊరు అండ ఉంది. ఇంకేం కావాలి! చదువు అనేది వజ్రాయుధం, తిరుగులేని మహా ఉద్యమం అని మరోసారి నయాబస్ గ్రామం విషయంలో నిరూపణ అయింది. ఇల్లే ప్రపంచంగా మారిన ఎంతోమంది అమ్మాయిలు చదువుల తల్లి దయ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారు. -
Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో..
థార్‌లోని ఇసుక దిబ్బల గుండె సవ్వడి విన్నది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పర్వతశ్రేణులతో ఆత్మీయ స్నేహం చేసింది. అస్పాంలోని వరద మైదానాలలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న కనీళ్లను చూసింది. కేరళ, గోవా తీరాలలో ఎన్నో కథలు విన్నది. కొద్దిమందికి ప్రయాణం ప్రయాణం కోసం మాత్రమే కాదు. ఆనందమార్గం మాత్రమే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అన్వేషణ. తన అన్వేషణలో అందం నుంచి విధ్వంసం వరకు ప్రకృతికి సంబంధించి ఎన్నో కోణాలను కళ్లారా చూసింది బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్, రైటర్, ఆర్టిస్ట్ ఆరతి కుమార్ రావు....రాజస్థాన్‌లో ఒక చిన్న గ్రామానికి చెందిన చత్తర్‌సింగ్ గుక్కెడు నీటి కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పశ్చిమబెంగాల్లో ఒక బ్యారేజ్ నిర్మాణం వల్ల నిర్వాసితుడు అయిన తర్కిల్ భాయి నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు తక్కువేమీ కాదు. సుందర్బన్ప్రాంతానికి చెందిన ఆశిత్ మండల్ వేట మానుకొని వ్యవసాయం వైపు రావడానికి ఎంతో కథ ఉంది. బంగ్లాదేశ్‌లోని మత్స్యకార్మికుడి పిల్లాడిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేస్తే ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడ్చే దృశ్యం ఎప్పటికీ మరవలేనిది.ఒకటా... రెండా ఆరతి కుమార్ ఎన్నెన్ని జీవితాలను చూసింది! ఆ దృశ్యాలు ఊరకే ΄ోలేదు. అక్షరాలై పుస్తకంలోకి ప్రవహించాయి. ఛాయాచిత్రాలై కళ్లకు కట్టాయి. ఒక్కసారి గతంలోకి వెళితే... ‘ఉద్యోగం మానేస్తున్నావట ఎందుకు?’ అనే ప్రశ్నకు ఆరతి కుమార్ నోట వినిపించిన మాట అక్కడ ఉన్నవాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది.‘ప్రకృతి గురించి రాయాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం మానేస్తున్నాను’ అని చెప్పింది ఆమె. యూనివర్శిటీ ఆఫ్ పుణెలో ఎంఎస్సీ, థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్–ఆరిజోనాలో ఎంబీఏ, ఆరిజోనా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన ఆరతి అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఇన్‌టెల్‌లో ఉద్యోగం చేసింది. కొంత కాలం తరువాత తనకు ఉద్యోగం కరెక్ట్ కాదు అనుకుంది. సంచారానికే ప్రాధాన్యత ఇచ్చింది.బ్రహ్మపుత్ర నది పరివాహకప్రాంతాలకు సంబంధించిన అనుభవాలను బ్లాగ్‌లో రాసింది. పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఎన్నోప్రాంతాలు తిరిగిన ఆరతి ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ పేరుతో రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ప్రకృతి అందాలే కాదు వివిధ రూ΄ాల్లో కొనసాగుతున్న పురా జ్ఞానం వరకు ఎన్నో అంశాల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతికి సంబంధించిన అందం నుంచి వైవిధ్యం వరకు, వైవిధ్యం నుంచి వైరుధ్యం వరకు తన ప్రయాణాలలో ఎన్నో విషయాలను తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను అక్షరాలు, ఛాయాచిత్రాలతో ప్రజలకు చేరువ చేస్తోంది ఆరతి కుమార్ రావు.భూమాత మాట్లాడుతోంది విందామా!ఆరతి కుమార్ రావు రాసిన‘మార్జిన్‌ల్యాండ్స్’ పుస్తకం కాలక్షేప పుస్తకం కాదు. కళ్లు తెరిపించే పుస్తకం. ఇది మనల్ని మనదైన జల సంస్కృతిని, వివిధ సాంస్కృతిక కళారూ΄ాలను పరిచయం చేస్తుంది.– ‘ప్రకృతి దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం తగినంత సమయాన్ని తప్పకుండా వెచ్చించాలి. దానిలో జీవించాలి. దానితో ఏకం కావాలి’ అంటుంది ఆరతి.– ఈ పుస్తకం ద్వారా మన సంస్కృతిలోని అద్భుతాలను మాత్రమే కాదు తెలిసో తెలియకో మనం అనుసరిస్తున్న హానికరమైన విధానాలు, ప్రకృతి విపత్తుల గురించి తెలియజేస్తుంది.– ‘మన సంప్రదాయ జ్ఞానంలో భూమిని వినండి అనే మాట ఉంది. భూమాత చెప్పే మాటలు వింటే ఏం చేయకూడదో, ఏం చేయాలో తెలుస్తుంది’ అంటుంది ఆరతి కుమార్ రావు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
ఉత్తరాన వరుణాగ్రహం
డెహ్రాడూన్/సిమ్లా/న్యూఢిల్లీ/జైపూర్: కేరళ కొండల్లో బురద, బండరాళ్లు సృష్టించిన విలయ విషాద ఘటన మరువకముందే ఉత్తరాదిపై వరుణుడు తన ప్రకోపం చూపించాడు. ఉత్తరాఖండ్ మొదలు రాజస్థాన్దాకా ఉత్తరభారత రాష్ట్రాల్లో ఎడతెగని వానలు పడ్డాయి. దీంతో ఏడు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లో 12 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు, ఢిల్లీలో ఆరుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, హరియాణాలో ముగ్గురు, రాజస్థాన్‌లో ముగ్గురు, బిహార్‌లో ఐదుగురు చనిపోయారు. చాలా మంది జాడ గల్లంతైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప జనావాసాలను తమలో కలిపేసుకున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండప్రాంతాల్లోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, పోలీసులు, స్థానికులు ముమ్మర సహాయక చర్యల్లో మునిగిపోయారు. ఉత్తరాఖండ్‌లో ఎక్కువ మరణాలు ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి కారణంగా 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప ఇళ్లను నేలమట్టంచేశాయి. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, ఛమోలీ జిల్లాలో వర్షపాత ప్రభావం ఎక్కువగా ఉంది. హరిద్వార్‌లోని రోషనాబాద్‌లో 210 మిల్లీమీటర్లు, డెహ్రాడూన్‌లో 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెహ్రీ జిల్లా జఖన్యాలీ గ్రామంలో రోడ్డ పక్కన రెస్టారెంట్‌పై కొండచరియలు పడటంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మట్టిపెళ్లల కింద సజీవసమాధి అయ్యారు. గౌరీకుండ్–కేదార్నాథ్ కొండమార్గంలో పాతిక మీటర్ల దారి వర్షాలకు కొట్టుకుపోవడంతో భీమ్బలీ చౌక్ వద్ద చిక్కుకుపోయిన 1,525 మందిలో 425 మందిని సురక్షితంగా తీసుకొచ్చామని సీఎం చెప్పారు. 1,100 మందిని సోనప్రయాగ్కు సురక్షితంగా తీసుకొచ్చామని విపత్తు కార్యదర్శి వినోద్ సుమన్ చెప్పారు. మిగతా వారిని హెలీకాప్టర్లలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిమాచల్‌లో 50 మంది జాడ గల్లంతు హిమాచల్ ప్రదేశ్‌నూ వర్షాలు ముంచెత్తాయి. వర్ష సంబంధ ఘటనల్లో ఐదుగురు మరణించారు. వేర్వేరు జిల్లాల్లో మొత్తంగా 50 మంది జాడ గల్లంతైంది. పలు వంతెనలు, రోడ్లు, ఇళ్లు వరదనీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. మండీ, రాంపూర్, సిమ్లా జిల్లాల్లో వర్షప్రభావం ఎక్కువగా ఉంది. మనాలీ–చండీగఢ్ జాతీయ రహదారిపై చాలాచోట్ల కొండచరియలు పడటంతో రాకపోకలు స్తంభించాయి. గల్లంతైన వారి జాడ కోసం ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసులు డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. కూలూలోని మలానా డ్యామ్ పై నుంచి నీరు కిందకు ప్రవహిస్తోంది. దీంతో భారీఎత్తున నీరు దిగువ ప్రాంతాలను ముంచేసింది. దీంతో ఎగువ ప్రాంతాలకు తక్షణం వెళ్లిపోవాలని స్థానికులకు అధికారులు హెచ్చరికలు పంపారు. ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం గురువారం ఢిల్లీలో వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 14 ఏళ్లలో ఢిల్లీలో జూలై నెలలో ఒక్కరోజులో ఇంతటి వర్షం పడటం ఇదే తొలిసారి. ముఖ్యంగా మయూర్‌విహార్ వద్ద 147 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. -
యూపీ, రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు
లక్నో/జైపూర్: యూపీ, రాజస్థాన్‌లలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 11 మంది మృతి చెందారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతులంతా హర్యానాకు చెందిన వారని సమాచారం. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జవడంతో అందులో ఇరుక్కున్నవారి మృతదేహాలను బయటికి తీయడం కష్టంగా మారింది. ప్రమాద తీవ్రతకు కారులో నుంచి ఇద్దరు దూరంగా పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఉన్నావోలో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్నావో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక స్కార్పియో వాహనం వేగంగా ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. స్కార్పియో ఢిల్లీ నుంచి అయోధ్య వెళుతున్నట్లు పోలీసులు చెప్పారు. -
ప్రాణాంతక చండీపురా వైరస్ : అసలేంటీ వైరస్, లక్షణాలు
వర్షాకాలంలో వివిధ రకాల అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. తాజాగా గుజరాత్, రాజస్థాన్‌లలో ‘చండీపురా’ వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్కారణంగా చిన్నారుల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుజరాత్ లోని ఆరావళి సబర్ కాంతా జిల్లాలో ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలువురు చిన్నారులు మృతిచెందారు. చండీపురా వైరస్ ఎంత ప్రమాదకరమైనది? లక్షణాలేంటి? దీని బారినుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.చండీపురా వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి సోకిన పిల్లవాడు సకాలంలో చికిత్స పొందకపోతే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ వైరస్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.చండీపురా వైరస్ లక్షణాలు సాధారణం ఫ్లూతో సమానంగా ఉంటాయి లక్షణాలు. దీంతో మామూలుగా జ్వరమే అనుకోవడంతో ప్రమాదం పెరుగుతోంది. చిన్నారుల మరణాలకు కారణమవుతోంది. అధిక జ్వరం, జ్వరం వేగంగా పెరగడం. వాంతులు, విరేచనాలు , తలనొప్పి, ఒక్కోసారి తలనొప్పితో పాటు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకంగా మారుతోంది కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.చండీపురా వైరస్ అంటే ఏమిటి?చండీపురా వ్యాధి అనేది ఫ్లూ నుండి మెదడు జ్వరం వరకు తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే వైరస్. ఈ వైరస్ తొలి కేసులు 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో కనిపించింది. అందుకే దీనికి చండీపురా అని పేరు పెట్టారు. ఈ వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన RNA వైరస్. ఇది కీటకాలు, దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది.ఏ వయస్సు పిల్లలకు ప్రమాదంచండీపురా వైరస్ ఎక్కువగా 9 నెలల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుంది. ఈ వైరస్ పిల్లలపై దాడి చేసినప్పుడు, సోకిన పిల్లలకి హై ఫీవర్, జ్వరం, విరేచనాలు, వాంతులు, బ్రెయిన్ ఫీవర్ ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. కనుక అప్రమత్తత చాలా అవసరం. చండీపురా వైరస్‌ను ఎలా నివారించాలి?దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది కనుగ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఆహారం విషయంలో జ్రాగ్రత్త వహించాలి. చండీపురా వైరస్‌ను నివారించడానికి, దోమలు, ఈగలు , కీటకాలను నివారించడం ముఖ్యం. పిల్లలకు రాత్రిపూట పూర్తిగా కప్పే దుస్తులు ధరించేలా జాగ్రత్తపడాలి. దోమ తెరలు వాడాలి. దోమల నివారణ మందు వాడండి. దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు , తలుపులు మూసి ఉంచాలి. -
Chandipura Virus: గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రమాదకర వైరస్ కలకలం
అంత్యంత ప్రమాదకర చాందిపురా వైరస్ ఇప్పుడు గుజరాత్‌ను దాటి రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో చాందిపురా వైరస్ కేసులు నమోదైన దరిమిలా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.ఉదయపూర్ జిల్లాలోని ఖేర్వారా బ్లాక్‌లోని రెండు గ్రామాలలో చాందిపురా వైరస్ కేసులు నమోదయ్యాయి. వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖేర్వాడా బ్లాక్‌లోని నల్ఫాలా, అఖివాడ గ్రామాలకు చెందిన ఇద్దరు చిన్నారులు ఈ వైరస్ బారినపడి హిమ్మత్‌నగర్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు గ్రామాలు గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందినవారు ఉపాధి కోసం గుజరాత్ సరిహద్దు ప్రాంతాలకు వలస వెళుతుంటారు. ఈ వైరస్ బారినపడిన చిన్నారులలో ఒకరు మృతి చెందారని తాజా సమాచారం.మీడియాకు అందిన వివరాల ప్రకారం గుజరాత్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ ఈ వైరస్ నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపింది. చాందిపురా వైరస్ దోమలు, పురుగులు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది. బాధితులకు చికిత్స అందించడంలో ఆలస్యమైతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
ఫోటో షూట్ పిచ్చి: లోయలోకి దూకేసిన కొత్త జంట వీడియో వైరల్
ఫోటోలు, రీల్స్ పిచ్చి ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన అనేక విషాదకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, ప్రమాదకరమని తెలిసినప్పటికీ కొంతమంది తీరుమారడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని పాలిలో ఫోటో షూట్ సమయంలో జరిగిన ప్రమాదం సంచలనం రేపింది. ఇరుకుగా ఉన్న రైలు పట్టాలపై ఫోటోషూట్ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన షాకింగ్‌గా మారింది.వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని పాలి సమీపంలోని గోర్మ్ ఘాట్ వద్ద పురాతన రైల్వే వంతెన ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతితో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి చాలామంది సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రాజస్థాన్‌లోని బాగ్దీ నగర్‌కు చెందిన కొత్త జంట రాహుల్ మేవాడ (22), భార్య జాహ్నవి (20) కూడా ఈ ప్రదేశానికి వచ్చారు. వీరికి తోడుగా రాహుల్ సోదరి, ఆమె భర్త వచ్చారు. నలుగురూ కలిసి బ్రిడ్జిపై ఫొటో షూట్ చేసుకునే ఉత్సాహంతో మీటర్ గేజ్ ట్రాక్‌పైకి చేరుకున్నారు. పరిసరాలను మైమరిచి ఫోటోలకు ఫోజులిస్తుండగా రైలు దూసుకొచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన రాహుల్ సోదరి, ఆమె భర్త ట్రాక్‌పై నుంచి పక్కకు వచ్చేసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొత్త జంట మాత్రం రైలు సమీపానికి వచ్చేదాకా విషయాన్ని గమనించలేదు.राजस्थान के पाली जिले में एक बड़ा हादसा हुआ। राहुल मेवड़ा अपनी पत्नी जाह्नवी संग हेरिटेज पुल पर फोटो शूट करा रहे थे। तभी ट्रेन आ गई। ट्रेन से बचने को दोनों 90 फीट गहरी खाई में कूद गए। दोनों का इलाज जारी है।🚨Disturbing Visual🚨 pic.twitter.com/WwDSTd5jrW— Sachin Gupta (@SachinGuptaUP) July 14, 2024ఇక ఏం చేయాలో అర్థంకాక, రైలు పట్టాలకింద నుజ్జు నుజ్జు కావడం ఖాయం, పక్కనున్న లోయలోకి దూకడం తప్ప వేరే మార్గం లేదని గమనించిన ఆ జంట చేయి చేయి పట్టుకొని 90 అడుగుల లోయలోకి దూకేసింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాహుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జోధ్‌పూర్ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
లోకల్ టాలెంట్ కాదు అమెరికాస్ గాట్ టాలెంట్
కాళ్ల కింద రెండు గ్లాసులు, తల మీద గ్లాస్‌పై గ్లాస్ పద్దెనిమిది గ్లాస్లు పెట్టుకొని వాటిపై కుండ పెట్టుకొని రెండడుగులు వేయడమే కష్టం. అలాంటిది డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు కదా! రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ నిన్న మొన్నటి వరకు లోకల్ టాలెంట్. ఇప్పుడు మాత్రం అమెరికాస్ గాట్ టాలెంట్. ఫోక్ డ్యాన్సర్ అయిన ప్రవీణ్‌కు అమెరికాస్ గాట్ టాలెంట్ (ఏజీటి)లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ‘స్టాండింగ్ ఒవేషన్’ అందుకున్నాడు. కాళ్ల కింద 2 గ్లాసులు(డ్యాన్స్ ప్రారంభంలో) తల మీద 18 గ్లాస్లు వాటిపై ఒక కుండతో ప్రవీణ్ చేసిన ‘మట్కా భవ’ డ్యాన్స్ ఆడిటోరియంను ఉర్రూతలూగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
రుతు పవనాల రాకతో గత మూడు నాలుగు రోజులుగా రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోటా జిల్లా నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్లే రహదారి తెగిపోయింది. ఇక్కడి పార్వతి నది ఉప్పొంగుతుండటంతో రోడ్డుపై నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా షియోపూర్, గ్వాలియర్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఇక్కడికి సమీప గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మోకాళ్లలోతు నీటి మధ్య వివిధ గ్రామాల ప్రజలు కాలం వెళ్తదీస్తున్నారు. టోంక్ జిల్లాలో భారీ వర్షం కారణంగా బిసల్పూర్ డ్యామ్ నీటిమట్టం 310.09 ఆర్ఎల్ మీటర్లకు చేరుకుంది. వరద ముప్పు పొంచివున్న నేపధ్యంలో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.జైపూర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం మేవార్ ప్రాంతంలో జూలై 8 నుండి 10 వరకు భారీ వర్షాలు కురియనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురియనున్నాయి. జులై 10 నాటికి రుతుపవనాలు మరింత బలపడతాయని, అప్పడు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
రాజస్తాన్‌లో సింగరేణి సోలార్ ప్లాంట్
గోదావరిఖని (రామగుండం): రాజస్తాన్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి సన్నా హాలు చేస్తోంది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.బలరాం గురువారం రాజస్తాన్ రాజధా ని జైపూర్‌లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. ఆ రాష్ట్ర ఇంధన శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, ట్రాన్స్‌కో సీఎండీ అలోక్‌ను కలిశారు. సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే రాజస్తాన్ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని అలోక్ తెలిపినట్లు వెల్లడించారు. అనంతరం రాజస్తాన్ జెన్కో సీఎండీ దేవేంద్రశ్రింగి, రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నథ్‌మల్, డిస్కమ్స్ చైర్మన్ భానుప్రకాశ్ ఏటూరును కలిసి ప్లాంట్ ఏర్పాటు, తర్వాత విద్యుత్ కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సంస్థ చైర్మన్ బలరాం.. రాజస్తాన్ ఉన్నతాధికారులకు వివరించారు. సోలార్ పార్కులో సింగరేణి ప్లాంట్‌కు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించిన తర్వాత పూర్తి ప్రతిపాదనలతో మరోసారి సమావేశం అవుతామని బలరాం తెలిపారు. సీఎండీ వెంట డైరెక్టర్ సత్యనారాయణరావు, సోలా ర్ ఎనర్జీ జీఎం జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు ఉన్నారు. -
కోటాలో జేఈఈ విద్యార్ధి ఆత్మహత్య.. ఏడాదిలో 12వ ఘటన
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్ధి ప్రాణాలు విడిచాడు. బిహార్‌కు చెందిన జేఈఈ విద్యార్ధి సందీప్ కుమార్ తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్లో నివసిస్తున్న ఇతర విద్యార్ధులు కిటికీలోంచి మృతదేహాన్ని చూసి వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.మరణించిన విద్యార్థి బిహార్‌లోని నలందకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సందీప్ కుమార్ గత రెండేళ్లుగా కోటాలో ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. సందీప్ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే చనిపోవడంతో మేనమామ చదువుల ఖర్చులు భరిస్తున్నాడని చెప్పారు. అతన్ని (సందీప్) కోటా ఇన్స్టిట్యూట్లో మేనమామే చేర్పించాడని తెలిపారు. విద్యార్ధి చనిపోయే ఒక రోజు ముందు మామ అతని ఖాతాలో డబ్బు జమ చేసినట్లు తెలిసిందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని,అతడి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ‘కోచింగ్ హబ్’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది పన్నెండవ ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు. -
మధ్యప్రదేశ్-రాజస్థాన్ల మధ్య ఆధ్యాత్మిక కారిడార్
భోపాల్: మధ్యప్రదేశ్, రాజస్థాన్లలోని పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ ఆధ్యాత్మిక కారిడార్ నిర్మించనున్నారు. దీనిలో భాగంగా రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్ మందిరం, నాథ్‌ద్వార్ మందిరం.. మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వరంల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఎలక్ట్రికల్ బస్సు నడపనున్నారు.ఈ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కారిడార్ నిర్మితం కానుంది. దీనిలో భాగంగా శ్రీక్షృష్ట గమన్ పథాన్ని కూడా నిర్మించనున్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని శ్రీకృష్ట మందిరాల అనుసంధానం జరగనుంది.భోపాల్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మల సంయుక్త సమావేశంలో ఆధ్మాత్మిక కారిడార్ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు పార్వతీ-కాళీసింధ్- చంబల్ పరీవాహక యోజనపై ఇరు రాష్ట్రాల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.ఈ సందర్భంగా రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ మాట్లాడుతూ పార్వతీ-కాళీసింధ్- చంబల్ ప్రాజెక్టు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉందని, ప్రధాని మోదీ సారధ్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనున్నదని అన్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 17 ఆనకట్టలు నిర్మితం కానున్నాయని తెలిపారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు సోదరభావంతో అభివృద్ధికి బాటలు వేస్తున్నాయన్నారు. -
ప్రాణాలు తీసిన వైరల్ వీడియోలు.. మనస్తాపంతో వృద్దుడి ఆత్మహత్య
ట్రోల్స్, మీమ్స్, వీడియోలు వైరల్చేయడం వల్ల తాత్కాలికంగా నవ్వుకోవచ్చేమో కానీ.. కొంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరదాకు చేసిన పనుల వల్ల ఆందోళన, మనస్తాపానికి గురై చివరకు ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీటి కారణంగా ఎంతో మంది మరణించగా.. తాజాగా వ్యర్థాలను సేకరించే ఓ వృద్ధుడు తన వీడయోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవమానంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.వివరాలు.. ప్రతాప్ సింగ్ అనే వృద్దుడు రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి అమ్ముకుంటూ బతికేవాడు. ఆయా వ్యర్థాలను ఓ హ్యాండ్‌కార్ట్ లో వేసుకుని వెళ్లేవాడు. గ్రమంలో అందరకీ సుపరిచితుడు కావడంతో అందరూ అతన్ని బాబాజీ* అని పిలిచేవారు.అయితే అతడిపై లొహావత్ గ్రామ యువకులు వీడియోలు తీయడం ప్రారంభించారు. వాటిని మీమ్స్‌గా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోస్టు చేసిన వీడియోల్లో కొంతమంది వ్యక్తులు అతనిని వెంబడించి తన చేతి బండిని తోసుకుంటూ వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తుంది.ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. .తనను ఎగతాళి చేస్తూ తీసిన వీడియోల పట్ల ఆ వృద్ధుడు మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ఓ హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తన వీడియోలు వైరల్ అవ్వడం, అమానించడం, మీమ్స్ కారణంగానే ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అక్రమాలకు పాల్పడిన టీచర్ల జంట.. రూ. 9 కోట్లు రికవరీకి చర్యలు
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే అక్రమాలకు పాల్పడితే.. అది కూడా తమకు ఉద్యోగాన్నిచ్చిన ప్రభుత్వాన్నే మోసగించాలని చూస్తే.. దాని పర్యవసానం ఎలా ఉంటుందో రాజస్థాన్‌లో వెల్లడయ్యింది. తమ స్థానంలో డమ్మీ టీచర్లను నియమించి, ఉద్యోగ విధులను చేస్తున్నట్లు నాటకమాడిన ఉపాధ్యాయ దంపతులపై ఇప్పుడు కోలుకోలేని దెబ్బ పడింది.రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో తమ స్థానంలో డమ్మీ టీచర్లను ఏర్పాటు చేసి, వారి చేత పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్న ఉపాధ్యాయ దంపతుల అక్రమాలపై విద్యాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి నుంచి రూ.9 కోట్ల 31 లక్షల 50 వేల 373 రికవరీ చేయాలని విద్యాశాఖ తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం విష్ణు గార్గ్ 1996 నుండి, అతని భార్య మంజు గార్గ్ 1999 నుంచి బరన్ జిల్లా పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు తమ బదులు డమ్మీ టీచర్లను నియమించి, వారిచేత విద్యార్థులకు బోధన సాగేలా చూస్తున్నారు. 2017లోనే వీరి వ్యవహారం బయటపడింది. అయితే రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉచ్చు బిగించింది.పోలీసులు, విద్యా శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి, ఈ ఇద్దరు ఉపాధ్యాయుల స్థానంలో నియమితులైన ముగ్గురు డమ్మీ ఉపాధ్యాయులను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఆ ఉపాధ్యాయ దంపతులు అరెస్టుకు భయపడి పరారయ్యారు. అక్రమాలకు పాల్పడిన ఈ ఇద్దరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తెలిపారు. -
యూఎస్ మహిళను బురిడి.. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మి
విదేశీ మహిళను ఓ నగల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు, నాణ్యమైన బంగారు నగలపేరుతో ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డాడు. ఈ ఘోరం రాజస్థాన్‌లో వెలుగుచూసింది. వివరాలు..అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్‌లోని జోహ్రీ బజార్‌లోని బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్‌తో కూడిన బెండి అభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాల రూ. 6 కోట్లు వెచ్చించింది. డాది ఏప్రిల్‌లో యూఎస్‌లో జరిగిన ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం రూ. 300 మాత్రమేనని తెలిసి షాక్‌కు గురైంది. వెంటనే సదరు మహిళ జైపూర్‌కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది.అయితే దుకాణం యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపాడేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు.కాగా 2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం ₹ 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రాజస్థాన్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు
రాజస్థాన్‌లో శనివారం అర్థరాత్రి కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. సికార్, చురు, నాగౌర్ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. భూకంప కేంద్రం సికార్ జిల్లాలోని హర్ష పర్వతం అని తెలుస్తోంది. భూకంపం కారణంగా జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం శనివారం అర్థరాత్రి 11.47 గంటలకు ఈ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రియాక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. భూకంపానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం చాలాసేపు ఇళ్ల బయటనే ఉండిపోయారు. పరిస్థితి కుదుటపడ్డాక వారంతా తిరిగి తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. -
Rajasthan: జీరో నుంచి హీరోగా కాంగ్రెస్?
2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో ఎన్డీఏ మెజారిటీ మార్కును దాటింది. ఎన్డీఏ 288 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ 240 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఇండియా అలయన్స్ కూడా మంచి ఫలితాలను రాబడుతోంది. మొదటి రెండు గంటల్లో 211 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక్కటే 92+ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ప్రారంభ పోకడలు పలు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీని చూపాయి. ఇందులో రాజస్థాన్ కూడా ఉంది. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.రాజస్థాన్ ట్రెండ్స్ చూస్తుంటే భారీ తిరోగమనం కనిపిస్తోంది. బీజేపీకి పెద్ద దెబ్బ తగులుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 25 స్థానాలకు గానూ గతసారి బీజేపీ 24 సీట్లు గెలుచుకుంది. నాడు కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే ఈసారి కాంగ్రెస్ ఊహించని రీతిలో దూసుకుపోతూ తొలి ట్రెండ్స్‌లో బీజేపీ కంటే ముందుంది.గతంలో మోదీ హవాతో రాజస్థాన్‌లో కాంగ్రెస్ దెబ్బతింది. 2014లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. 2019లో 34.22 శాతం ఓట్లు సాధించింది. అయితే ఈసారి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే రాజ్‌సమంద్, జైపూర్, పాలి, అల్వార్ స్థానాలలో బీజేపీ ముందుంది. కరౌలి, బార్మర్, జైపూర్ రూరల్, సవాయ్ మాధోపూర్, టోంక్, భరత్పూర్ తదితర స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. -
రాజస్థాన్‌లో బీజేపీ ముందస్తు సంబరాలు
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. 543 స్థానాలకు 7 దశల్లో ఓటింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ అలయన్స్ రెండూ తమ తమ విజయాలను ప్రకటించుకుంటున్నాయి.ఫలితాలు వెలువడకముందే విజయోత్సవ సంబరాలు జరుపుకునేందుకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఎగ్జిట్ పోల్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ నేతల, కార్యకర్తల ఉత్సాహం తారా స్థాయికి చేరింది. అదే సమయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎగ్జిట్ పోల్స్‌ను తాము అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నాయి.మరోవైపు ఓట్ల లెక్కింపునకు ముందే రాజస్థాన్‌లోని బీజేపీ కార్యాలయాన్ని అందంగా అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు 13 వేల మందికి పైగా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. #WATCH | BJP party office in Rajasthan's Jaipur is decorated ahead of the Lok Sabha polls result, today.Vote counting of #LokSabhaElections to begin at 8 am.(Video Source: BJP, Rajasthan) pic.twitter.com/pq8MuZEemD— ANI (@ANI) June 4, 2024 -
‘మూల్‌చంద్’ పాన్ షాప్.. పాన్ ప్రియులకు ఫుల్ క్రేజ్
జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ పట్టణం సట్టాబజార్‌లో ఉన్న ముల్సా-పుల్సా పాన్ షాపుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈపాన్షాపు ఓనర్ పూల్‌చంద్ కట్టే రుచికరమైన పాన్ల కోసమే కాకుండా ఆయన ధరించే బంగారు ఆభరణాలు చూడడానికి కూడా ఎక్కువ మంది కస్టమర్లు వస్తుంటారు.పూల్‌చంద్ కట్టే వివిధ రకాల పాన్లు రుచిచూసేందుకు బికనీర్ వాసులే కాకుండా దూర ప్రాంతాల నుంచి పాన్‌ప్రియులు విచ్చేస్తారు. పూల్‌చంద్ స్వయంగా పాన్లు కట్టడమే కాకుండా కస్టమర్లను నవ్వుతూ పలకరిస్తుండటం షాపుకు ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో పాన్లు కట్టడంలో పూల్‌చంద్‌కు ఆయన కుమారుడు కూడా సాయం చేస్తున్నాడు. షాపు ఉదయాన్నే 5 గంటలకు మొదలై అర్ధరాత్రి 2 గంటల వరకు కస్టమర్లతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ముల్సాపుల్సా పాన్‌షాపులో పాన్లు రూ.20 నుంచి మొదలుపెట్టి రూ.200 వరకు దొరుకుతాయి. VIDEO | Bikaner is home to a unique 'Paan' seller. His shop in the Satta Bazar area of the city has been attracting customers not just for the Paan but also for the gold ornaments he adorns with grace. Phoolchand owns the Mulsa-Phulsa paan shop, which sells various flavours of… pic.twitter.com/Ou3U6zsvDZ— Press Trust of India (@PTI_News) June 2, 2024 -
'కోటా ఫ్యాక్టరీ' సీజన్ 3 విడుదల ప్రకటన వచ్చేసింది
ఓటీటీలలో కొన్ని వెబ్ సిరీస్‌లకు భారీ క్రేజ్ ఉంటుంది. ఒక సీజన్ పూర్తి అయిన తర్వాత మరో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో చాలా రోజులుగా ఎదురుచూస్తున్న 'కోటా ఫ్యాక్టరీ' వెబ్ సిరీస్ సీజన్ 3 జూన్‌లో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్ కోసం రాజస్థాన్‌లోని కోటా అనే ప్రాంతానికి వెళ్తుంటారు. ఐఐటీ కోచింగ్ కోసం ఎక్కువగా విద్యార్థులు అక్కడికి చేరుకుంటారు. సీటు సాధించే క్రమంలో వారు ఎక్కువగా ఒత్తిడికి గురికావడం జరుగుతుంది. కొందరైతే దానిని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అక్కడ ఉన్న విద్యార్థుల జీవితాల ఆధారంగా 2019లోనే 'కోటా ఫ్యాక్టరీ' మొదటి సీజన్ వచ్చింది.. 2021లో రెండో సీజన్ వచ్చింది. ఆ రెండు సీజన్స్ భారీ హిట్ అందుకోవడంతో.. జూన్ 20న మూడో సీజన్ రానుంది. ఈమేరకు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. కోటా ఫ్యాక్టరీలో అందరినీ మెప్పించే పాత్ర జీతూ భయ్యా.. అందులో జితేంద్ర కుమార్ జీవించేశాడు.సౌరభ్ కన్నా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కు రాఘవ్ సుబ్బు దర్శకత్వం వహించారు. అహ్సాస్ చన్నా, మయూర్ మోర్, రేవతి పిళ్లై ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీవీఎఫ్ సంస్థ నిర్మించిన ఈ సీరిస్ జూన్ 20న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
India Meteorological Department: రాజస్తాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా రాజస్తాన్‌లో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నా యి. రాజస్తాన్‌లోని ఫలోదీలో తాజాగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత రికా ర్డు కావడం ఐదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2019 జూన్ 1న రాజస్తాన్‌లోని చురూలో 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఈశాన్యంలోని అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ ఎండల ధాటికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాజస్తాన్‌లోని బార్మర్‌లో 48.8, జైసల్మేర్‌లో 48, బికనెర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. పశి్చమ బెంగాల్‌లోని కూచ్ బెహార్లో 40.5 డిగ్రీలు, అస్సాంలోని సిల్చార్‌లో 40, లుమిడింగ్‌లో 43, అరుణాచల్‌లోని ఈటానగర్‌లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
Lok Sabha Election 2024: ఫలోదీ సట్టా బజార్లో... తగ్గిన బీజేపీ హవా
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై రాజస్తాన్‌లోని ఫలోదీ సట్టా బజార్ తాజా అంచనాలు ఎలా ఉన్నాయి? కచి్చతమైన అంచనాలు, బెట్టింగ్‌లకు దేశమంతటా పేరొందిన ఫలోదీ మార్కెట్ ఇప్పటికీ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని నమ్ముతోంది. అక్కడి పంటర్లు మోదీ సర్కారుపైనే బెట్టింగులు కడుతున్నారు. కానీ నెలక్రితం అంచనాలతో పోలిస్తే బీజేపీ నెగ్గబోయే స్థానాల సంఖ్య బాగా తగ్గడం విశేషం. బీజేపీ 330 నుంచి 333 స్థానాలు నెగ్గుతుందని తొలి విడత పోలింగ్‌కు ముందు దాకా ఇక్కడ జోరుగా పందేలు సాగాయి. కానీ ఇప్పుడది 296 నుంచి 300 సీట్లకు పరిమితమైంది...! క్రమంగా తగ్గుదల.. ఒక్కో విడత పోలింగ్ జరుగుతున్న కొద్దీ ఫలోదీ బజార్లో బీజేపీకి అంచనాలు తగ్గుతూ వస్తున్నాయి. 307 నుంచి 310 స్థానాలు గెలుస్తుందంటూ మే 13న నాలుగో విడత పోలింగ్‌కు ముందు పందేలు నడిచాయి. నాలుగో దశ ముగిశాక తాజాగా 296 నుంచి 300కు తగ్గాయి. ఎన్డీఏకు 350 దాటుతాయని తొలుత పేర్కొనగా, 329 నుంచి 332 మధ్య రావచ్చని తాజాగా పందేలు సాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. ఇక కాంగ్రెస్‌కు 41 నుంచి 43 సీట్ల కన్నా రావని నెల క్రితం అంచనా వేసిన ఫలోదీ పందెంరాయుళ్లు కాస్తా, 58 నుంచి 62 స్థానాలు గెలుస్తుందని తాజాగా బెట్లు కడుతున్నారు. 2019లో కాంగ్రెస్‌కు 52 స్థానాలొచ్చాయి. ఈసారి నాలుగు విడతల్లో పోలింగ్ 2019 ఎన్నికలతో పోలిస్తే కాస్త తగ్గడం తెలిసిందే. తదనుగుణంగా ఫలోదీ మార్కెట్ కూడా బీజేపీ విషయంలో అంచనాలను సవరించుకున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రాలవారీగా.. ఫలోదీ సట్టా బజార్ తాజా బెట్టింగ్‌ల ప్రకారం బీజేపీ గుజరాత్లో క్లీన్‌స్వీప్ చేస్తుంది. 26 స్థానాలూ గెలుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని 29కి 27–28 రావచ్చు. రాజస్తాన్‌లో 2019లో 24 గెలవగా ఈసారి 18–20తో సరిపెట్టుకోవచ్చు. ఒడిశాలోని మరో 4 స్థానాలు అదనంగా 11 నుంచి 12 రావచ్చు. పంజాబ్‌లో 2019లో రెండు గెలవగా ఈసారీ 2 నుంచి 3 రావచ్చు. మొత్తం 10 స్థానాలూ గెలిచిన హరియాణాలో 5 నుంచి 6తో సరిపెట్టుకోవచ్చు. తెలంగాణలో 4 గెలవగా ఈసారి 5 నుంచి 6 రావచ్చు. ఛత్తీస్‌గఢ్‌లోని 11, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4, ఉత్తరాఖండ్‌లోని 5 స్థానాలనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుంది. జార్ఖండ్‌లో మళ్లీ 10 నుంచి 11 దాకా రావచ్చు. 2019లో ఒక్క సీటూ నెగ్గని తమిళనాడులో 3 నుంచి 4 స్థానాలు రావచ్చని బెట్టింగులు నడుస్తున్నాయి. కీలకమైన పశి్చమబెంగాల్లో 2019లో 18 చోట్ల గెలవగా ఈసారి 21 నుంచి 22 దాకా రావచ్చు. యూపీలో 63 చోట్ల గెలిచిన బీజేపీ ఈసారి మరో రెండు సీట్లు పెంచుకోవచ్చని సట్టా బజార్ అంచనా. కచ్చితత్వం ఎక్కువ... ఎన్నికల ఫలితాల విషయంలో ఫలోదీ మార్కెట్ ఏం చెబితే అదే జరుగుతుందన్న నమ్మకముంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఫలోదీ బుకర్ల అంచనాలే అక్షరాలా నిజమయ్యాయి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ విషయంలో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తలకిందులు కాగా సట్టా బజార్ అంచనాలు మాత్రమే నిజమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలిమినేటర్ మ్యాచ్
-
ఎలిమినేట్ అయ్యేదెవరో?
-
గని ప్రమాదం.. 14 మంది అధికారులు సేఫ్.. ఒకరు మృతి
రాజస్థాన్‌లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన గనిలో మంగళవారం రాత్రి చిక్కుకున్న 15 మంది అధికారులలో 14 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఒక అధికారి మరణించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. నాలుగు దశల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. వారిని జైపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గనిలో 1,875 అడుగుల లోతులో లిఫ్ట్ చైన్ తెగిపోవడంతో ప్రమాదం సంభవించింది. #WATCH झुंझुनू, राजस्थान: कोलिहान खदान में लिफ्ट गिरने से 14 लोगों के फंसे होने की आशंका है, बचाव अभियान जारी है।वीडियो आज सुबह की है। pic.twitter.com/gIuVYnRsbd— ANI_HindiNews (@AHindinews) May 15, 2024ఈ ప్రమాదంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఉపేంద్ర పాండే మరణించారు. అతని మృతదేహాన్ని కేసీసీ ఆస్పత్రికి తరలించారు. కాగా గనిలోని లిఫ్ట్‌లో ఏదో లోపం ఉందని, మరమ్మతులు చేయించాలని ఎనిమిది రోజుల క్రితం కెసిసి యాజమాన్యానికి ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ స్వయంగా దృష్టి సారించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
రాజస్థాన్‌లోని నీమ్ కా థానా జిల్లాలో మంగళవారం రాత్రి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ప్రమాదం సంభవించింది. సంస్థకు చెందిన 14 మంది అధికారులు, విజిలెన్స్ బృందం సభ్యులు గనిలో చిక్కుకున్నారు.ఉద్యోగులను గని లోపలికి, బయటికి తరలించేందుకు ఉపయోగించే వర్టికల్ షాఫ్ట్ పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైనింగ్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం గనిలో చిక్కుకున్న అధికారులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోలిహన్ గని వద్ద విజిలెన్స్ బృందం కంపెనీ సీనియర్ అధికారులతో కలిసి తనిఖీలు చేసేందుకు వందల మీటర్ల మేర గనిలోకి దిగింది. వారు పైకి వస్తున్న సమయంలో షాఫ్ట్ (కేజ్) వైర్ తెగిపోయింది. దీంతో గని లోపల తనిఖీ చేయడానికి వెళ్లిన 14 మంది అధికారులు లోపలే చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న వెంటనే ఖేత్రికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ధరంపాల్ గుర్జార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో పలువురు అధికారులతో పాటు ఏడు అంబులెన్స్‌లు ఉన్నాయి. అధికారులను బయటకు తీసుకువచ్చే పనిలో రెస్క్యూ టీమ్ నిమగ్నమైంది. ప్రస్తుతానికి ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. -
51 ఏళ్ల వయసులో మరోసారి ప్రభుత్వ ఉద్యోగం!
రాజేంద్ర సింగ్.. మొదట భారత ఆర్మీలో సైనికుడు. తరువాత బ్యాంకులో సెక్యూరిటీ గార్డు. ఇప్పుడు బ్యాంకులో క్లర్కు. 51 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి.. విజయానికి వయసు అడ్డంకి కాదని నిరూపించాడు.వయసు మీదపడ్డాక మరోసారి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన రాజేంద్ర సింగ్ రాజస్థాన్‌లోని సికార్ జిల్లా లక్ష్మణగఢ్ పట్టణంలో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. రాజేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులలోని ఐదుగురు భారతీయ సైన్యంలో చేరారని, మొదట తన తండ్రి, తరువాత ముగ్గురు సోదరులు, ఇప్పుడు తన పెద్ద కుమారుడు సైన్యంలో చేరారన్నారు.ఇండియన్ ఆర్మీలో 18 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత రాజేంద్ర సింగ్ వీఆర్ఎస్ తీసుకున్నారు. తర్వాత 2014లో ఎస్బీఐ లక్ష్మణ్‌గఢ్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఆల్వార్ అండ్ సికార్ జోన్‌లోని బ్యాంకులో క్లర్క్ పోస్ట్ దక్కించుకున్నారు. ఇందుకు నిర్వహించిన పోటీ పరీక్షలో రాజస్థాన్‌లో నాల్గవ ర్యాంక్ సాధించారు.సైన్యం నుంచి రిటైర్ అయ్యాక చాలామంది ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే రాజేంద్ర సింగ్ తన భార్య అమృతా దేవి ప్రోత్సాహంతో 51 ఏళ్ల వయస్సులో మరోమారు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. ఇందుకోసం ఎస్బిఐ నిర్వహించిన పోటీ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తన సక్సెస్ క్రెడిట్ అంతా తన భార్యకే దక్కుతుందని రాజేంద్ర సింగ్ తెలిపారు. రాజేంద్ర సింగ్ 1991లో భారత సైన్యంలో సైనికుడిగా నియమితులయ్యారు. సైన్యంలో 18 ఏళ్లపాటు సేవలందించిన తర్వాత 2009లో హవల్దార్ పదవి నుంచి వీఆర్ఎస్ తీసుకున్నారు. 2014లో ఎస్బీఐలో గార్డ్‌గా నియమితులయ్యారు. 2024, మార్చి 28న జరిగిన ఎస్బీఐ బ్యాంక్ క్లర్క్ పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించారు. రాజేంద్ర సింగ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నితేష్ బీఎస్ఎఫ్లో సైనికుడు. చిన్న కుమారుడు కార్తీక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు. -
పతంగుల పోటీలో ఘోరం.. గొంతు తెగి ఆరుగురు విలవిల.. 35 మందికి గాయాలు!
రాజస్థాన్‌లో అక్షయ తృతీయ వేళ విషాదం చోటుచేసుకుంది. ఈ పండుగను రాష్ట్రంలో అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా బికనీర్‌లో గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ఉంది. అయితే వీటిని ఎగువేసేందుకు వినియోగించే చైనీస్ మాంజాలు పలువురిని గాయాలపాలు చేస్తున్నాయి.చైనీస్ మాంజా తగలడంతో 35 మంది గాయపడ్డారు. ఆరుగురి గొంతులు కోసుకుపోయాయి. మాంజా బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బికనీర్ జిల్లా ఆరోగ్య యంత్రాంగం బాధితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. బికనీర్‌లోని పీబీఎం ఆస్పత్రిలో కూడా గాలి పటాల బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.గాలిపటాల మాంజాల కారణంగా గాయపడిన 35 మందికి పీబీఎం ఆస్పత్రిలోని ట్రామా సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గొంతు తెగిన ఆరుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ట్రామా సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ కపిల్ తెలిపారు. మరోవైపు నగరానికి చెందిన పలువురు తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గాలిపటాలు ఎగరవేయడంతో ఆకాశం నిండా గాలిపటాలు కనిపిస్తున్నాయి. చైనా మాంజా కారణంగా పక్షులు కూడా చనిపోతున్నట్లు తెలుస్తోంది. आखातीज और बीकानेर स्थापना दिवस पर आइए कभी हमारे बीकानेर और देखिए यहां कि पतंगबाजी इतनी धूप में 🔥🎉#Bikaner pic.twitter.com/QdvPW0R66q— MAHENDARA GODARA (@MAHENDRAJAAT010) May 10, 2024 -
తమ్ముడి ‘నీట్’ రాసేందుకు ఎంబీబీఎస్ అన్న.. తరువాత?
దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ దేశవ్యాప్తంగా ఆదివారం జరిగింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో గల అంత్రి దేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ కేంద్రంలో చీటింగ్ కేసు వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న భగీరథ్ రామ్ తన తమ్ముడి స్థానంలో నీట్ పరీక్ష రాయడానికి అంత్రి దేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలకు వచ్చాడు. అతనిని చూసిన ఎగ్జామినర్‌కు అనుమానం రావడంతో ఆరా తీశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు భగీరథరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన తమ్ముడు గోపాల్ రామ్ స్థానంలో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చానని తన తప్పును ఒప్పుకున్నాడు.నీట్ పరీక్ష నిర్వహణకు బార్మర్‌లోని ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని ఆంత్రి దేవి స్కూల్లో నకిలీ అభ్యర్థిని గుర్తించినట్టు తమకు సమాచారం అందిందని బార్మర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ జస్రామ్ బోస్ తెలిపారు. పోలీసులు పరీక్షా కేంద్రానికి చేరుకుని నకిలీ అభ్యర్థిని విచారించగా, నిందితుడు డమ్మీ అభ్యర్థి అని తేలింది. ఈ ఉదంతంలో పోలీసులు భగీరథ్ రామ్, అతని తమ్ముడు గోపాల్‌రామ్‌లను అరెస్ట్ చేశారు.భగీరథ రామ్ జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి. తమ్ముడిని డాక్టర్ని చేసేందుకు మున్నా భాయ్ తరహాలో నకిలీ అభ్యర్థిగా పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చాడు. అయితే ఇంతలోనే పోలీసులకు పట్టబడ్డాడు. ప్రస్తుతం పోలీసులు ఈ సోదరులిద్దరినీ విచారిస్తున్నారు. -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో తొమ్మిదో ఘటన
దేశంలోనే ‘కోచింగ్ హబ్’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్‌పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు.హర్యానా రోహ్తక్కు చెందిన సుమిత్ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్ సిటీలో ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఆదివారం సుమిత్‌కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ చేశారు. సిబ్బంది సుమిత్ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్ లాక్ చేసుకొని రూమ్‌లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగాా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు. -
మా అభ్యర్థికి ఓటేయకండి: కాంగ్రెస్ ప్రచారం
జైపూర్: రాజస్థాన్‌లోని గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా-దుంగార్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో విచిత్రంగా సాగుతోంది . ఇక్కడ కాంగ్రెస్ తన సొంత అభ్యర్థికి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్థిస్తోంది. అలాగని అక్కడి అభ్యర్థి రెబల్ అనుకుంటే పొరపాటే. వివరాల్లోకి వెళ్తే.. ఎస్టీ రిజర్వ్డ్ అయిన బన్స్వారా-దుంగార్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అరవింద్ దామోర్‌ను తన సొంత అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీకి ఒక రోజు ముందు భారత్ ఆదివాసీ పార్టీ (BAP) అభ్యర్థి రాజ్‌కుమార్ రోట్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.బీఏపీకి మద్దతివ్వాలని పార్టీ చేసిన ప్రకటనకు అనుగుణంగా దామర్ తన నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉంది. కానీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ముగిసే వరకు ఆయన ఎక్కడా కనిపించలేదు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన దామర్.. జరిగిన పరిణామాలేవీ తనకు తెలియనట్లు నటించి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.దీంతో బీజేపీ, కాంగ్రెస్-బీఏపీ కూటమి మధ్య ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోరుగా మారింది. దామర్ పోటీ కాంగ్రెస్ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఇది బీజేపీ అభ్యర్థి మహేంద్రజిత్ సింగ్ మాల్వియాకు ప్రయోజనం కలిగించనుంది. బన్స్వారా-దుంగార్పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి రెండవ దశలో శుక్రవారం పోలింగ్ జరగనుంది.కాంగ్రెస్ స్థానిక నాయకత్వం తమ సొంత అభ్యర్థికి బదులు రోట్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయగా, బీఏపీతో పొత్తుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నాయకులలోని ఒక వర్గం తనకు మద్దతు ఇస్తున్నట్లు దామోర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి నాయకుడు వికాస్ బమ్నియా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్జున్ బమ్నియా కుమారుడు రోట్‌కు పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దక్షిణ రాజస్థాన్‌లో స్థాపించిన బీఏపీకి రోట్తో సహా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. -
కూరగాయలు విక్రయిస్తున్న మాజీ సీఎం కోడలు!
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏడు దశల్లో జరిగే ఓటింగ్‌కు ముందు అనేక వింతలు, విశేషాలు కనిపిస్తున్నాయి. ఇవి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జలోర్‌లో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు కూరగాయలు అమ్ముతూ కనిపిస్తున్నారు. జలోర్ సిరోహి సీటుపై పోటీకి దిగిన భర్త వైభవ్ గెహ్లాట్‌కు మద్దతుగా అతని భార్య, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమార్తె హిమాన్షి గెహ్లాట్ ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాన్షి గెహ్లాట్ జలోర్‌లో కూరగాయలు అమ్ముతూ కనిపించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్‌లో అనుభవజ్ఞుడైన నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అతని కుమారుడు వైభవ్ గెహ్లాట్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కోడలు హిమాన్షి గెహ్లాట్ జలోర్-జైసల్మేర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన భర్త వైభవ్ గెహ్లాట్ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆమె గతంలో సిడ్నీలో చదువును పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగుల కోసం స్వ్ఛంద సంస్థను నడుపుతున్నారు. వైభవ్, హిమాన్షి దంపతులకు కాశ్వని అనే కుమార్తె ఉంది. హిమాన్షి లాగే కాశ్వనికి కూడా పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టమట. -
దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు!
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాడు రాజస్థాన్‌కు చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ యువకుడు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చక్కని వాగ్ధాటి, అగర్గళమైన, చురుకైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాలే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నాడు. బార్మర్- పశ్చిమ రాజస్థాన్, ముఖ్యంగా బార్మర్-జైసల్మేర్-బలోత్రా నియోజకవర్గం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో కేంద్ర బిందువుగా మారింది. ఇది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 1.9 మిలియన్ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 7 లక్షల మంది జాట్లు, 2.5 లక్షల రాజ్‌పుత్ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నికల రణరంగం ముక్కోణపు పోటీని చూస్తోంది. వివిధ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి కైలాష్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమేరామ్ బేనివాల్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి పోటీలో ఉండటంతో అందిరి దృష్టి ఈ నియోజక వర్గంపై పడింది. ఆకట్టుకునే ప్రసంగాలు బార్మర్ జిల్లాలోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయాన్ని రుచి చూసిన రవీంద్ర, ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే సాంప్రదాయ ద్విముఖ భావాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా భాటి ప్రజాదరణ ఆయన సొంత నియోజకవర్గానికి మించి విస్తరించింది. ఈయన ఆకర్షణ, ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించాయి. ప్రచారం ముమ్మరం కావడంతో భాటి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక పర్యటనను ప్రారంభించారు. రవీంద్ర భాటి బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఆయన ప్రసంగాన్ని వినడానికి అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. అదేవిధంగా హైదరాబాద్‌లోనూ ప్రజాదరణ లభించింది. ఆయన విమానాశ్రయానికి రాకముందే జనాలను ఆకర్షించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకున్నప్పుడు అతని పేరు కొన్ని మైళ్ల వరకు ప్రతిధ్వనించింది. రవీంద్ర భాటి నేపథ్యం రవీంద్ర సింగ్ భాటి బార్మెర్లోని దుధోడా అనే గ్రామానికి చెందిన రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించిన రవీంద్ర భాటి తన పాఠశాల విద్యను ప్రభుత్వ స్కూల్లో పూర్తి చేశారు. జై నారాయణ్ వ్యాస్ యూనివర్శిటీలో 2019 విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రవీంద్ర భాటి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ నుంచి మొదట టికెట్‌ను కోరినప్పటికీ, చివరికి తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో అతని విజయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విశ్వవిద్యాలయం 57 సంవత్సరాల చరిత్రలో విద్యార్థి సంఘం అధ్యక్ష పదవిని గెలుచుకున్న మొదటి స్వతంత్ర అభ్యర్థిగా రవీంద్ర సింగ్ బాటీ నిలిచాడు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో భాటి రాజకీయ పథం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను ఎదుర్కొని భాటి విజయం సాధించారు. సుమారు 4 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో లోక్‌సభ బరిలో నిలిచారు. #संबोधन pic.twitter.com/4CU0fnZTwe — Ravindra Singh Bhati (@RavindraBhati__) April 9, 2024 -
17మందికి ఒకేసారి పెళ్లి..ఒకే శుభలేఖ.. హాట్ టాపిక్‌గా తాతగారు
ఒకరికి పెళ్లి చేయడమే చాలా ఖరీదైన మారిన ప్రస్తుత రోజుల్లో 17 పెళ్లిళ్లంటే మాటలా అనుకున్నాడో ఏమోగానీ రెండంటే రెండు రోజుల్లో వరుసపెట్టి మనవళ్లు, మనవరాళ్లకు సామూహిక వివాహ వేడుక జరిపించాడు. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఈ వివాహాలు జరిగాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పెద్దాయన పేరు రాజస్థాన్‌లోని నోఖా మండలం లాల్‌మదేసర్ గ్రామానికి చెందిన సుర్జారామ్. ఆయన గ్రామపెద్ద కూడా. సుర్జారామ్ వారసులు ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. ఈయనకు 17 మంది మనవళ్లు, పెళ్లికి ఎదిగి ఉన్నారు. వీరందరికీ విడివిడిగా పెళ్లి చేయడం ఖరీదవుతుందని భావించి కేవలం రెండు రోజుల్లో పన్నెండు మంది మనవరాలు, ఐదుగురు మనవళ్లు పెళ్లి చేశారు. వింతగా అనిపించినా ఇదే జరిగింది. వీరందరికి భాగస్వాములను వెతకడం కూడా విశేషమే. అంతేకాదు వీరందరికీ కే శుభలేఖను ముద్రించడం మరో విశేషం. బంధుమిత్రుల సమక్షంలో ఐదుగురు మనుమలకు ఏప్రిల్ 1న, 12 మంది మనుమరాళ్ల ముళ్ల వేడుక కాస్తా ముగించాడు.ఒకే ఇంట్లో, ఒకే వెడ్డింగ్ కార్డ్‌తో జరిగిన ఈ సామూహిక వివాహ తంతుకు అందరూ ఆశ్చర్యపోవడం గ్రామస్తుల వంతైంది. ఒకే కుటుంబంలో సామూహిక వివాహాలు జరగడం ఈ ప్రాంతంలో ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. -
Lok sabha elections 2024: ‘రాజ’సం ఎవరిదో...!
రాజస్థాన్‌లో రాజకీయ పోరు దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారమూ ఈ రెండు పార్టీల మధ్యే మారుతూ వస్తోంది. కమలనాథులు హిందుత్వ, ఆర్థికాభివృద్ధిపైనే ఫోకస్ చేస్తుండగా సంక్షేమ హామీలు, మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకతను కాంగ్రెస్ నమ్ముకుంటోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో లోక్‌సభ బరిలోకి దిగుతోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలో క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉంది. ఎంపీ ఎన్నికల్లో పుంజుకుని ఎలాగైనా సత్తా చాటే ప్రయత్నాల్లో కాంగ్రెస్ తలమునకలుగా ఉంది... పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, హిందుత్వ సిద్ధాంత దన్నుతో రాజస్థాన్ బీజేపీ బలమైన పునాదులు వేసుకుంది. తొలుత భైరాన్‌సింగ్ షెకావత్, అనంతరం వసుంధరా రాజె సింధియా వంటివారి నాయకత్వమూ పారీ్టకి కలిసొచి్చంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బాగా పట్టుంది. కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో బలమైన శక్తిగా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వంటి నాయకుల సారథ్యానికి తోడు గ్రామీణ ఓటర్ల మద్దతు పారీ్టకి పుష్కలంగా ఉంది. ఈ ఎడారి రాష్ట్రంలో 25 లోక్‌సభ సీట్లున్నాయి. 4 ఎస్సీలకు, 3 ఎస్టీలకు కేటాయించారు. బీజేపీకి బేనీవాల్ బెంగ! 2014 లోక్‌సభ ఎన్ని కల్లో మొత్తం 25 సీట్లనూ ఎగరేసుకుపోయిన బీజేపీ 2019లో సైతం క్లీన్‌స్వీప్ చేసింది. 24 సీట్లను బీజేపీ, మిగతా ఒక్క స్థానాన్ని ఎన్డీఏ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) గెలుచుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చతికిలపడింది. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. అదే ఊపులో లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి క్లీన్‌స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. అందుకు తగ్గట్టే ప్రచారాన్ని మోదీ పీక్స్‌కు తీసుకెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సభలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయాలు, అవినీతికి పెట్టింది పేరంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలనూ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న హనుమాన్ బేనీవాల్ సారథ్యంలోని ఆర్ఎల్పీ ఈసారి కాంగ్రెస్‌తో జతకట్టడం కమలం పార్టీకి కాస్త ప్రతికూలాంశమే. జాట్ నేత అయిన బేనీవాల్‌కు ఉన్న ఆదరణ షెకావతీ, మార్వార్ ప్రాంతాల్లో బీజేపీ అవకాశాలను ప్రభావితం చేయవచ్చంటున్నారు. పార్టీ తరఫున కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్‌పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనేర్), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (కోట) వంటి హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. నలుగురు సిట్టింగులకు బీజేపీ మొండిచేయి చూపడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన ఇద్దరు నేతలకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. వీరిలో బలమైన గిరిజన నేతగా పేరున్న మహేంద్రజీత్‌సింగ్ మాలవీయ ఉన్నారు. పారాలింపిక్స్‌లో పసిడి సాధించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత దేవేంద్ర ఝజారియాకు బీజేపీ అనూహ్యంగా చురు టికెటిచ్చింది. వసుంధరా రాజె కుమారుడు దుష్యంత్ సింగ్ ఝలావర్–బరన్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో అదే వర్గ పోరు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు సార్వత్రిక సమరంలో నెగ్గుకురావడం సవాలే. మాజీ సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య వర్గ పోరు మళ్లీ రాజుకుంటుండటం తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల్లో గహ్లోత్ ఓటమి నేపథ్యంలో రాష్ట్ర పారీ్టపై పూర్తిగా పట్టు బిగించే వ్యూహాల్లో పైలట్ వర్గం ఉంది. జాలోర్ నుంచి గహ్లోత్ కుమారుడు వైభవ్ బరిలో ఉన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు న్యాయాలు, 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. కుల గణన, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధత హామీల ద్వారా పేదలు, మధ్య తరగతి వర్గాలు, కారి్మకులు, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామని రాహుల్ చెబుతున్నారు. ఆర్ఎల్పీ ఈసారి ఇండియా కూటమిలోకి రావడం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. జాట్లలో బాగా ఆదరణ ఉన్న బెనీవాల్ ప్రభావం షెకావతీ, మార్వార్ ప్రాంతాల్లో... ముఖ్యంగా నాగౌర్, సికర్, ఛురు, జుంఝును వంటి లోక్‌సభ స్థానాల్లో కలిసొస్తుందని పార్టీ ఆశలు పెట్టుకుంది. కుల సమీకరణాలు కీలకం రాజస్థాన్ రాజకీయాల్లో కులాలది కీలక పాత్ర. ప్రధానంగా జాట్లు, రాజ్‌పుత్‌లు, మీనాలు, గుజ్జర్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతున్నారు. 10% జనాభా ఉన్న జాట్ వర్గానికి మార్వార్, షెకావతీ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. రాష్ట్ర జనాభాలో రాజ్‌పుత్‌ల వాటా 6–8%. రాజ కుటుంబీకులైన వసుంధరా రాజె, భైరాన్ సింగ్ షెకావత్ సీఎం పదవి చేపట్టినవారే. జాట్లు అప్పుడప్పుడూ ఊగిసలాడినా రాజ్‌పుత్‌ల మద్దతు కమలనాథులకు దండిగా ఉంటుందని గత ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. 5 శాతమున్న గుజ్జర్లు గతంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. వారిప్పుడు బీజేపీ వైపు మళ్లవచ్చంటున్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గం 8% దాకా ఉంది. అగ్రవర్ణ పార్టీగా పేరొందిన బీజీపీ అనూహ్యంగా బ్రాహ్మణుడైన భజన్‌లాల్ శర్మను సీఎం చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీపీ జోషిదీ ఇదే సామాజికవర్గం. ఇక ఎస్టీ సామాజిక వర్గమైన మీనాలు జనాభాలో 5% ఉన్నారు. వీరికి తూర్పు రాజస్థాన్‌లో పట్టుంది. 18% ఉన్న ఎస్టీ సామాజిక వర్గంలోని ఉప కులాలు పరిస్థితులను బట్టి ఇరు పారీ్టలకూ మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ కుల గణన హామీ ప్రభావం చూపవచ్చంటున్నారు. సర్వేలు ఏమంటున్నాయి... ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హిందీ బెల్ట్‌లో కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఘన విజయం సాధించడం ఆ పార్టీలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ క్వీన్‌స్వీప్ చేస్తుందని, కాంగ్రెస్‌కు వైట్‌వాష్ తప్పదని తాజా సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో 25 సీట్లనూ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందనేది మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒకే వేదికపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు.. ఆసక్తికర చర్చ!
రాజస్థాన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మేవార్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికార బీజేపీకి చెందిన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, గత కాంగ్రెస్ ప్రభుత్వ మాజీ సీఎంతో సహా ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు నేతలు ఒకే వేదికపై కనిపించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇదే సందర్భంలో వారు ఒకరిపై ఒకరు విరుచుకుపడటం గమనార్హం. ఈ ఘటన రాజకీయ వేదికమీద జరగలేదు. మేవార్‌లో మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన మహనీయులకు నివాళులర్పించే కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి దియా కుమారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తోర్‌గఢ్ బీజేపీ అభ్యర్థి సీపీ జోషి హాజరయ్యారు. అలాగే నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత చిత్తోర్‌గఢ్ కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్‌లాల్ అంజన, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రీతీ శక్తావత్, చిత్తోర్‌గఢ్ స్వతంత్ర ఎమ్మెల్యే చంద్రభన్ సింగ్ అక్యాతో పాటు పలువురు నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సీపీ జోషి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. చరిత్రలో మహారాణా ప్రతాప్‌కు బదులు అక్బర్ గొప్పవాడని అభివర్ణించారు. తమ ప్రభుత్వం దానిని సరిదిద్దిందన్నారు. శిలాఫలకాలలోని తప్పుడు సమాచారాన్ని తొలగించిందన్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్‌లాల్ అంజనా మాట్లాడుతూ ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడటం తగదని, గత ప్రభుత్వం తప్పు చేస్తే విచారణ జరిపించాలని అన్నారు. -
PM Narendra Modi: అసలైన అభివృద్ధి ముందుంది
జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీ తమ పదేళ్లకాలంలో దేశంలో జరిగిన అభివృద్ధిని ఆకలి పుట్టించే స్టార్టర్‌గా అభివరి్ణంచారు. అసలైన అభివృద్ధి భోజనం ముందుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజస్థాన్‌లోని చురులో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. భారత సైన్యాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ఇదే కాంగ్రెస్ అసలైన మనస్తత్వమని విపక్ష పార్టీపై మోదీ విమర్శలు గుప్పించారు. ‘ ఇప్పుడున్న నయా భారత్ శత్రువును ఇంట్లోకి చొరబడి మరీ దెబ్బ కొట్టగలదు. శత్రువు గడ్డపైనా దాడి చేసే సరికొత్త భారత్ ఆవిష్కృతమైంది’ అని అన్నారు. ‘‘ గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమే. అది భోజనాల వేళ ఆకలి పుట్టించే స్టార్టర్ మాత్రమే. అసలైన మెయిన్ కోర్సు భోజనం(అభివృద్ధి) ముందుంది. చేయాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉంది. ఇంకా ఎన్నో కలలున్నాయి. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి మనం’ అని అన్నారు. -
చదువులతల్లి పట్ల దారుణం: చైల్డ్ లైన్ ఫిర్యాదుతో వెలుగులోకి!
అత్యాచార బాధితురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారానికి గురైన బాలికను 12వ తరగతి పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ఒకప్రైవేట్ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు చైల్డ్ హెల్ప్లైన్నంబర్కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 12 బోర్డు పరీక్షలకు తనను హాజరుకానివ్వలేదంటూ అజ్మీర్‌లోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఆరోపించింది. గత ఏడాది సామూహిక అత్యాచారానికి గురయ్యావు కాబట్టి, పరీక్షకు హాజరైతే వాతావరణం చెడిపోతుందని పాఠశాల అధికారులు చెప్పారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. అడ్మిట్ కార్డ్ ఇవ్వ లేదని బాధితురాలు తెలిపింది. అడ్మిట్ కార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు, అధికారులు ఇకపై పాఠశాల విద్యార్థిని కాదని తెలిపారు. అయితే దీనిపై మరో టీచర్‌ను సంప్రదించగా, ఆమె చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయమని సూచించింది. అయితే బాధిత విద్యార్థిని గత నాలుగు నెలలుగా పాఠశాలకు రాకపోవడంతో ఆమెను పరీక్షకు అనుమతించడం లేదని పాఠశాల అధికారులు వాదించారు. అయితే ఆమె స్కూలుకు హాజరుకావడాన్ని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను లోపలికి రానీయకుండా నిషేధించారని ఇంటి నుండే చదువుకోవాలని సూచించిందని అందుకే ఇంట్లో ఉండే పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు అంజలీ శర్మతో వాపోయింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అజ్మీర్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (సిడబ్ల్యుసి) కేసు నమోదు చేసింది, విచారణ తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అంజలి శర్మ వెల్లడించారు. శిశు సంక్షేమ శాఖ కూడా కేసు నమోదు చేసింది. 10వ తరగతి పరీక్షలలో 97 శాతం స్కోర్ సాధించిన బాధితురాలు ఇపుడు కూడామంచి మార్కులు తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. కానీ పాఠశాల నిర్లక్ష్యం వల్ల ఏడాది సమయం వృథా అవుతుందేమోనని భయపడుతోంది. కాగా గతేడాది అక్టోబర్‌లో విద్యార్థినిపై ఆమె మామ, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.దీనిపై విచారణ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికా విద్య, మహిళల భద్రత గురించి ఎంత మాట్లాడు తున్నా, ఎంత ప్రచారం కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదనీ, మరీ ముఖ్యంగా విద్య నేర్పే పాఠశాల్లో ఇలాంటి దారుణం ఏమిటి అనే విమర్శలకు తావిస్తోంది. -
ఇంటి వద్ద ఓటింగ్ నేటి నుంచే..
జైపూర్: రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి ప్రారంభమవుతోంది. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో 58,000 మందికి పైగా ఓటర్లు ఇంటి వద్ద ఓటింగ్‌ను ఎంచుకున్నారని, వీరిలో 35,542 మంది మొదటి దశ లోక్‌సభ ఎన్నికల కోసం నమోదు చేసుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా ఇటీవల తెలిపారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లకు ఇంటి ఓటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. రాజస్థాన్‌లో మొదటి దశ లోక్‌సభ ఎన్నికల కోసం నమోదైన 35,542 మంది ఓటర్లలో 26,371 మంది సీనియర్ సిటిజన్లు ఉండగా 9,171 మంది దివ్యాంగులు ఉన్నారు. "ఇప్పటి వరకు, 58,000 మంది అర్హతగల ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు. వీరిలో 43,638 మంది సీనియర్ సిటిజన్లు, 14,385 మంది దివ్యాంగులు ఉన్నారు" అని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. రాజస్థాన్‌లో రెండు దశల్లో ఏప్రిల్ 19, 26 తేదీలలో పోలింగ్ జరుగుతుంది. -
Lok Sabha Elections 2024: అబద్ధాల సర్దార్ మోదీ: ఖర్గే
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముమ్మాటికీ అబద్ధాల సర్దార్ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మన దేశ భూభాగంలోకి చైనా ప్రవేశిస్తుంటే మోదీ నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు. గురువారం రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే మాట్లాడారు. దేశ క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రధానమంత్రి.. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని దూషించడంలో తీరిక లేకుండా ఉంటున్నారని ధ్వజమెత్తారు. 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకుంటున్న మోదీ మన దేశ భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఖర్గే ఆరోపించారు. మోదీ గ్యారంటీల డ్రామా సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత ఏమీ ఉండదన్నారు. ఓటమి భయంతోనే విపక్షాలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. -
గ్రామీణ యువతికి ఆరు నెలల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంత యువతులు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము యువకులకు ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కల్పన దీనికి ఉదాహరణగా నిలిచారు. రాజస్థాన్‌లోని ఫతేపూర్ షెఖావతి పరిధిలోని రినౌ గ్రామానికి చెందిన కల్పనా బిర్దా ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి. ఆమె తొలుత సీహెచ్ఎస్ఎల్లో క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. తరువాత ఆడిటర్‌గా ఉద్యోగం దక్కించుకుంది. ఇప్పుడు సీజీఎస్టీలో ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేజిక్కించుకుంది. కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో కల్పన పెద్దది. బనస్థలి విద్యాపీఠ్‌లో చదువు పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. కల్పన తండ్రి మహిపాల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె తల్లి పొలం పనులతో పాటు ఇంటిపనులకు కూడా చేస్తుంది. కల్పన ఇన్స్పెక్టర్గా ఎంపికకావడంతో వారి ఇంటిలో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కల్పన మీడియాతో మాట్లాడుతూ తాను పోటీపరీక్షల కోసం తొలుత ఢిల్లీలో కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నానని, ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నానని తెలిపింది. చదువుతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ కూడా చేసుకునేదానినని, ఈ రివిజన్ కారణంగానే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగానని తెలిపింది. -
అసెంబ్లీ ఉప ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలతోపాటు జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్‌లోని బగిదోర అసెంబ్లీ నుంచి సుభాష్ తంబోలియాకు టికెట్ ఇవ్వగా, గాండే అసెంబ్లీ నుంచి దిలీప్ కుమార్ వర్మను పోటీకి దింపింది. ఏప్రిల్ 26న రాజస్థాన్‌లోని బగిదోర అసెంబ్లీలో ఉప ఎన్నిక జరగనుండగా, గాండే అసెంబ్లీకి మే 20న ఉప ఎన్నిక జరగనుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దాదాపు 96.8 కోట్ల మంది ప్రజలు 12 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్లలో రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫేజ్ 1లో ఏప్రిల్ 19న 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 స్థానాలకు రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాషాయ పార్టీ 24 సీట్లు గెలుచుకోగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే పొందగలిగింది. -
ముఖేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ : ఆనంద్ మహీంద్ర ఫిదా!
కొందరు వ్యక్తులు నిస్వార్థంగా జనం కోసం చేసే పనులు విశేషంగా నిలుస్తాయి. ప్రకృతిమీద, మానవాళి మీద వారి ప్రేమను చెప్పకనే చెబుతాయి. రాజస్థాన్‌కు చెందిన ముఖేష్ అలాంటి కోవలోకే వస్తారు. బోగన్ విల్లా మొక్కలతో అందమైన షెల్టర్ తయారుచేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెటర్ ఇండియా షేర్ చేసిన ఈ వీడియో పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్రను కూడా ఆకట్టుకుంది. రాజస్తాన్‌లోని భిల్ వారాకుచెందిన ముఖేష్ జనానికి చక్కటి గిఫ్ట్ అందించాడు. 12 సంవత్సరాలకు పైగా కష్టపడి బోగన్విల్లా మొక్కలతో షెల్టర్‌ను అందంగా తీర్చి దిద్దాడు. గులాబీ రంగులో విరబూసిన ఈ పువ్వులు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది అందంగా ఉండటమే కాదు అందరికీ నీడను పంచుతోంది. Over 12 years, Mukesh turned a Bougainvillea shrub into, literally, a pavilion, giving shade to all travellers. One individual, passionately built a thing of beauty. Sustainability may eventually come from the collection of such individual deeds…pic.twitter.com/l2XhN918UY — anand mahindra (@anandmahindra) March 28, 2024 -
తొలిసారి ఆ రెండు వర్గాలకు కాంగ్రెస్ టిక్కెట్లు నిల్!
రాజస్థాన్‌లో లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ తొలిసారిగా ప్రత్యేక వైఖరి అవలంబించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో ఎక్కడా కూడా బ్రాహ్మణ, ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించలేదు. అయితే కుల, మతాల ప్రాతిపదికన కాకుండా సర్వే ఆధారంగానే టిక్కెట్లు కేటాయించామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ గతంలో చాలాసార్లు బ్రాహ్మణ కార్డును ప్లే చేసింది. ఇప్పడు పార్టీ తన వైఖరిని మార్చుకోవడం పలువురు నేతలకు ఆగ్రహం తెప్పించింది. రాజస్థాన్ చరిత్రలో ముస్లిం, బ్రాహ్మణ అభ్యర్థికి కూడా కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం ఇదే తొలిసారి. సర్వ బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు సురేశ్ మిశ్రా మాట్లాడుతూ కాంగ్రెస్‌కు బ్రాహ్మణుల ఓట్లు అక్కర్లేదని తెలుస్తోంది. జైపూర్ నుంచి బ్రాహ్మణ నేతకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారున్నారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత వరుణ్ పురోహిత్ మాట్లాడుతూ బ్రాహ్మణ వర్గానికి కాంగ్రెస్ గౌరవం ఇవ్వనప్పుడు ఓటమిని చవిచూసిందన్నారు. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్‌రూమ్ అధ్యక్షుడు జస్వంత్ సింగ్ గుర్జార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సర్వే, ఫీడ్‌బ్యాక్, డిమాండ్ మేరకు టిక్కెట్లు ఇచ్చామన్నారు. కులం, సంఘం లేదా తరగతి ఆధారంగా టిక్కెట్లు ఇవ్వలేదన్నారు. -
రాజసమంద్ బరిలో మేవార్ రాజ కుటుంబీకురాలు
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో రాజసమంద్ సీటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మహిమా విశేష్వర్ సింగ్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఈ స్థానం నుంచి దియా కుమారి ఎంపీగా ఉన్నారు. 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈ స్థానానికి సుదర్శన్ రావత్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఎవరీ మహిమా విశేష్వర్ సింగ్? మేవార్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్ సతీమణే ఈ మహిమా విశేష్వర్ సింగ్. మహిమా సింగ్ భర్త విశ్వరాజ్ సింగ్ మేవార్ నాథ్‌ద్వారా బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో మహిమ తన భర్త విజయానికి విశేష కృషి చేశారు. రాజ్‌సమంద్ పార్లమెంటరీ సీటులో 2019లో జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారిని పోటీకి దింపిన బీజేపీ ఇప్పుడు మేవార్ రాజకుటుంబానికి మహిమా సింగ్ బరిలోకి దించింది. జగదీశ్వరి ప్రసాద్ సింగ్ ఇంట్లో 1972 జూలై 22న జన్మించిన మహిమా సింగ్ మేవార్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఉన్న సింధియా కన్యా విద్యాలయంలో చదివారు. కాలేజీ విద్యను ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో పూర్తి చేశారు. ఆమె మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
రసాయన కర్మాగారంలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం!
రాజస్థాన్‌లోని జైపూర్ పరిధిలో గల బస్సీలోని షాలిమార్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. గాయపడిన ఇద్దరిని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళానికి చెందిన వాహనాలు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మృతులను మనోహర్, హీరాలాల్, కృష్ణలాల్ గుర్జార్, గోకుల్ హరిజన్లుగా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన వారిని ఇంకా గుర్తించలేదు. పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక దళం, రెస్క్యూ టీం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. -
సగం టార్గెట్ ఇవే.. నిలిచేదెవరు.. గెలిచేదెవరు?
దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల కాక మొదలైంది. వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకుని హాట్రిక్ కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటే ఈసారి ఎలాగైనా ఎన్డీఏ కూటమి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ సహా ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కువ లోక్‌సభ సీట్లు ఏ కూటమి గెలుచుకుంటే ఆ కూటమికే అధికారం ఖాయమని చెప్పవచ్చు. ఉత్తర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్‌లో 80 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 1, బీజేపీ 62, ఎస్పీ 5, ఇతరులు 12 సీట్లు గెలుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్, మాయావతి కీలక నేతలు. వారణాసీ, రాయ్‌బరేలి, మైన్‌పురీ కీలక నియోజకవర్గాలు. అయోధ్య రామాలయం, కుల సమీకరణాలు, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. బిహార్ బిహార్‌లో 40 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 39 స్థానాలను, యూపీఏ 1 సీటు గెలుచుకున్నాయి. బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ మోదీ, తేజస్వీ యాదవ్ కీలక నేతలు. హాజీపూర్, పట్నా సాహిబ్, పాటలీపుత్ర కీలక నియోజకవర్గాలు. కుల సమీకరణాలు, హిందూత్వ వాదం, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. రాజస్థాన్ రాజస్థాన్‌లో 25 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 25 స్థానాలనూ ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. భజన్‌లాల్ శర్మ, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ కీలక నేతలు. జోధ్‌పూర్, కోటా-బూందీ కీలక నియోజకవర్గాలు. కుల సమీకరణాలు, రైతుల సమస్యలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. పంజాబ్ పంజాబ్‌లో 13 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 8 స్థానాలు, ఎన్డీఏ కూటమి 4, ఆప్ 1 సీటు గెలుచుకున్నాయి. పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. భగవంత్‌మాన్, సుఖ్బీర్సింగ్ బాదల్, సునీళ జాఖడ్ కీలక నేతలు. అమృత్సర్, గురుదాస్‌పుర్ కీలక నియోజకవర్గాలు. రైతు సమస్యలు, శాంతి భద్రతలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. హరియాణా హరియాణాలో 10 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హరియాణా అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. మనోహర్‌లాల్ ఖట్టర్, నాయబ్‌సింగ్ సైనీ, భూపీందర్ హుడా, కుమారి శెల్జా, ఓంప్రకాశ్ చౌతాలా కీలక నేతలు. రోహ్తక్, కురుక్షేత్ర కీలక నియోజకవర్గాలు. రైతుల సమస్యలు, హిందూత్వ వాదం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. ఢిల్లీ ఢిల్లీలో 7 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 7 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్, వీరేందర్ సచ్దేవ, అర్విందర్ సింగ్ కీలక నేతలు. న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ కీలక నియోజకవర్గాలు. సీఏఏ, ఆప్-కాంగ్రెస్ జట్టు కట్టడం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్‌లో 5 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 5 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. పుష్కర్‌సింగ్ ధామీ, కరణ్ మాహరా కీలక నేతలు. హరిద్వార్, నైనిటాల్-ఉద్దమ్ సింగ్ నగర్ కీలక నియోజకవర్గాలు. యూసీసీ, నిరుద్యోగం, మహిళలపై నేరాల పెరుగుదల ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లో 4 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 4 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 68 స్థానాలు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. సుఖ్విందర్ సింగ్ సుఖ్ఖూ, రాజీవ్ బిందల్ కీలక నేతలు. హమీర్పుర్, మండి కీలక నియోజకవర్గాలు. అయోధ్య రామాలయం, కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో 5 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 2 స్థానాలు, నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకున్నాయి. భారతీయ జనతా పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కీలక నేతలు. ఆర్టికల్ 370 రద్దు, తగ్గుతున్న ఉగ్రవాద ఘటనలే ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఇంకా కొలిక్కిరాకపోవడంతో అధికారికంగా ఇంకా అసెంబ్లీ సీట్ల సంఖ్య ఖరారు కాలేదు. -
చార్భుజనాథ్ ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఒకరు మృతి!
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగిన చార్భుజనాథ్ ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనతో ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒక వర్గానికి చెందినవారు ఈ రాళ్లదాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తోర్‌గఢ్ జిల్లాలోని రష్మీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహూనా గ్రామంలో దశమి సందర్భంగా చార్భుజనాథ్ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు పట్టణంలోని ప్రధాన మార్కెట్ సమీపంలోకి రాగానే ఏదో ఒక విషయమై వాగ్వాదం జరిగి రాళ్లదాడి చోటచేసుకుంది. ఈ ఘటనలో శ్యామ్ చిపా అనే వ్యక్తి మృతి చెందాడు. నవీన్ జైన్ అనే మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం. -
యువరాజ్ సింగ్ పోరాటం వృధా.. లెజెండ్స్ టైటిల్ నెగ్గిన ఉతప్ప జట్టు
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న తొలి లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీని రాజస్థాన్ కింగ్స్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో రాబిన్ ఉతప్ప సారధ్యం వహిస్తున్న రాజస్థాన్.. యువరాజ్ సింగ్ నాయకత్వంలోని న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రయికర్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూయార్క్‌ను గెలిపించేందకు యువరాజ్ సింగ్ చివరివరకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఆష్లే నర్స్ (41 బంతుల్లో 97), హ్యామిల్టన్ మసకద్జ (30 బంతుల్లో 56) చెలరేగడంతో నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూయార్క్ బౌలర్లలో జేరోమ్ టేలర్ 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ ప్రదీప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూయార్క్.. యువరాజ్ సింగ్ మెరుపు అర్దశతకంతో (22 బంతుల్లో 54) మెరిసినప్పటికీ ఓటమిపాలైంది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో కపుగెదెర (30), గుణరత్నే (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో పర్విందర్ అవానా, జకాతి, బిపుల్ శర్మ, చతురంగ డిసిల్వ, ఆష్లే నర్స్ తలో వికెట్ పడగొట్టారు. -
పట్టాలు తప్పిన సబర్మతి రైలు
జైపూర్: రాజస్థాన్‌లో సబర్మతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అజ్మీర్‌లోని మడర్ రైల్వేస్టేషన్లో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సబర్మతి రైలులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. #WATCH | Rajasthan: Four coaches including the engine of a passenger train travelling from Sabarmati-Agra Cantt derailed near Ajmer. Further details awaited. pic.twitter.com/fX9VeLKw2e — ANI (@ANI) March 18, 2024 సబర్మతి సూపర్‌ఫాస్ట్ డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అది గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనపై నార్త్ వెస్టర్న్ రైల్వే ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేసింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. ప్రమాదానికి సంబంధించి వివరాల కోసం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇదీ చదవండి.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం -
ప్రమాద గాయాలతోనే పరీక్షలకు..
ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి విద్యార్థులకు ఎంతో కీలకమైనవి. అందుకే ఈ పరీక్షలను మిస్సవ్వకూడదని భావిస్తారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ముగ్గురు ప్రమాదం బారినపడినా పరీక్షలను ఎంతో ధైర్యంగా రాశారు. జైపూర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరారు. అయితే దారిలో వారి బైక్ ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యేందుదుకు ఆ విద్యార్థులు ఉదయం 7:45 గంటలకు బైక్‌పై బయలుదేరారు. అయితే సెంటర్‌కు చేరుకునేలోగా వారి బైక్‌ను ప్రయాణికుల వ్యాన్ ఢీకొంది. దీంతో ఆ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వారి గాయాలకు డ్రెస్సింగ్ చేశారు. అదే పరిస్థితిలో వారు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. తమకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అక్కడి ఉపాధ్యాయులను అభ్యర్థించాక వారికి అందుకు అనుమతిచ్చారు. వారి కాళ్ల నుంచి రక్తం కారుతున్నా వారు పరీక్ష రాయడం విశేషం. తరువాత వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విద్యార్థుల ధైర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలియజేస్తూ ఈ విద్యార్థులు ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వారని తెలిపారు. వీరిని మన్పురా మచాడీ నివాసి లోకేష్ యాదవ్, ఉదయపురియా నివాసి అంకిత్ గుర్జార్, ఏకలవ్య ఫుల్వాడియాగా గుర్తించారు. ముగ్గురూ ఒకే బైక్‌పై పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రయాణికులు వాహనం వీరి బైక్‌ను ఢీకొన్నదని పోలీసులు తెలిపారు. -
Bharat Shakti: అబ్బురపర్చిన ‘భారత్ శక్తి’ విన్యాసాలు..వీక్షించిన మోదీ (ఫొటోలు)
-
విషాదం.. కరెంట్ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు
జైపూర్: మహాశివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని కోటాలో శివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేసిన వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి 14 మంది చిన్నారులు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు వాళ్ల కుటుంబీకులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరికి 100శాతం శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కరెంట్ షాక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే విద్యుత్ షాక్‌కు హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరు పిల్లలకు 50 నుంచి 100 శాతం కాలిన గాయాలు, మిగిలిన వారు 50 శాతం కంటే తక్కువ కాలిన గాయాలు తగిలినట్లు పేర్కొన్నారు. -
లైంగిక కోరిక.. కాదన్నందుకు వ్యక్తిని హత్య చేసిన స్నేహితులు
సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. మంచి, మర్యాద మరిచి నీచానికి తెగబడుతున్నారు. అసభ్యంగా ప్రవర్తించి మానవత్వానికి మాయని మచ్చగా మారుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. లైంగిక కోరిక(ఓరల్ సెక్స్) తీర్చలేదని తోటి స్నేహితులే ఓ వ్యక్తిని హత్య చేశారు.. ఈ దారుణం బరన్ జిల్లాలో తొమ్మిది రోజుల క్రితం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 26న ఓం ప్రకాష్ బైర్వా(40), అతని స్నేహితులు మురళీధర్ ప్రజాపతి, సురేంద్ర యాదవ్‌తో కలిసి మద్యం సేవించారు. అనంతరం ముగ్గురు ప్రజాపతి సోదరుడిని చూడటానికి సమీపంలోని గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ప్రజాపతి, మురళీధర్ తమతో ఓరల్ సెక్స్ చేయాలని బైర్వాను బలవంతం చేశారు. అందుకు అతను ససేమిరా అనడంతో బలమైన ఆయుధంతో నరికి చంపారు. అనంతరం మృతదేహాన్ని ఓ చెరువులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు సురేంద్ర యాదవ్, మురళీధర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని విచారిస్తుండగా.. మరొరకు అరెస్ట్ భయంలో విషం తాగడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బరన్ ఎస్పీ రాజ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. కాగా ప్రజాపతి రోడ్డు పక్కన దాబా నడుపుతుండగా, సరేంద్ర యాదవ్ దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు అని బరన్ సిటీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాంవిలాస్ తెలిపారు. చదవండి: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంట్లోనే వరుడి హత్య.. తండ్రి పనేనా? -
820 కోట్ల స్కామ్! 67 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: ఐఎంపీఎస్ లావాదేవీల ముసుగులో జరిగిన భారీ కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో తాజాగా సీబీఐ సోదాలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూకో బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణంలో కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గురువారం పలుచోట్ల తనిఖీలు చేపట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని ఏడు నగరాల్లో 67 చోట్ల సోదాలు జరుపుతోంది. యూకో బ్యాంక్‌లోని వివిధ ఖాతాల్లో సుమారు 820 కోట్ల అనుమానాస్పద ఐఎంపీఎస్ లావాదేవీలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ దాడులు చేస్తోంది. వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిన సొమ్మును మళ్లీ వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈ సోదాల్లో భాగంగా యూకో బ్యాంక్, ఐడీఎఫ్సీకి చెందిన 130 పత్రాలను అధికారులు సీజ్ చేశారు. అలాగే మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. 30 మంది అనుమానితులను కూడా విచారించినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు పేర్కొన్నారు. కాగా గత ఏడాది నవంబర్ 10 నుంచి13 మధ్య ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14,600 ఖాతాల నుంచి తమ బ్యాంక్‌కు చెందిన 41,000 ఖాతాలలో ఐఎంపీఎస్ అంతర్గత లావాదేవీలు తప్పుగా జరిగినట్లు గుర్తించిన యూకో.. సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా నవంబర్ 21న కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. దీని ఫలితంగా బదిలీ చేసిన బ్యాంక్ ఖాతాల నుంచి డెబిట్ కాకుండానే యూకో బ్యాంక్ ఖాతాల్లో రూ. 820 కోట్లు జమ అయ్యాయి. దీంతో డబ్బులు పడ్డాయని తెలిసిన చాలా మంది ఖాతాదారులు వారి ఖాతాలలోని ఆకస్మిక మొత్తాన్ని విత్‌డ్రా కూడా చేసుకున్నారు. ఇక 2023 డిసెంబర్‌లోనూ కోల్‌కతా, మంగళూరులోని యూకో బ్యాంక్ అధికారులకు చెందిన 13 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. చదవండి: సవాల్ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్‌నాథ్ సింగ్ -
8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం!
దేశంలో శివరాత్రి ఉత్సాహం నెలకొంది. శుక్రవారం జరిగే శివరాత్రి పూజలకు భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఇక్కడ కొలువైన శివుడు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చి అదృశ్యమవుతాడు. దీనివెనుకగల ఆసక్తికర కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బన్స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత శివాలయం ఉంది. సంవత్సరంలో ఏడెనిమిది నెలల పాటు ఈ ఆలయం కనుమరుగువుతుంది. ఈ ఆలయం నాలుగు అడుగుల నీటిలో మునిగి ఉంటుంది. ఏళ్ల తరబడి ఇలా జరుగుతున్నా ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవడం విశేషం. ఈ ఆలయం ఇలా మునిగిపోవడానికి గల కారణం గుజరాత్‌లోని కడనా డ్యామ్‌లోకి చేరిన నీరు ఈ ఆలయ ప్రాంతంలో నిలిచిపోవడం. ఇటుక, రాయి, సున్నంతో నిర్మితమైన ఈ ఆలయం సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పేరొందింది. ఈ ఆలయం బన్స్వారాకు 70 కి.మీ. దూరంలో ఉంది. ఫిబ్రవరి, మార్చిలలో ఈ ప్రాంతంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపిస్తుంది. శివరాత్రి సమయంలో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, శివుణ్ణి దర్శించుకుంటారు. నదుల సంగమ తీరం కావడంతో ఈ ఆలయానికి సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయం అనే పేరు వచ్చింది. -
Rajasthan : డబుల్ జీరో! కాంగ్రెస్ ‘సున్నా’ రాత మారేనా?
రాజస్థాన్‌లో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గానూ 24 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా రాష్ట్రంలో 34.6 శాతం ఓట్లు సాధించింది. సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ.. మార్చి 7న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుందని చెప్పారు. అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నామని, అతి త్వరలోనే పేర్లను ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా గెలుపు గుర్రాలను గుర్తించినట్లు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ తెలిపారు. రాజస్థాన్‌లో పొత్తుల భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకంపై మాట్లాడుతూ.. “రాజస్థాన్‌లో పొత్తు ఎవరితో, ఎలా ఉండాలో నిర్ణయించే ఇండియా కూటమితో పాటు మాకు ఏఐసీసీ కమిటీ ఉంది” అన్నారు. 2019లో ఎన్డీఏ క్లీన్‌స్వీప్ 2019 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం 25 స్థానాలకు గానూ 24 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. ఈ పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామి కావడం విశేషం. అంటే అన్ని స్థానాలను ఎన్డీఏ కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 59 శాతం ఓట్లు సాధించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా రాష్ట్రంలో 34.6 శాతం ఓట్లను సాధించగలిగింది. కాగా 2018లో రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014లో ‘జీరో’ సీట్లు అంతకు ముందు 2014 సార్వత్రికలో ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లోక్‌సభ స్థానాల్లో ఖాతా తెరవలేకపోయింది. అప్పుడు కూడా ఎన్డీఏ క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 25 సీట్లలో 21 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. 55.6 శాతం ఓట్లు సాధించింది. ఇక ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ 30.7 శాతం ఓట్లు తెచ్చుకుంది. 2019 ఎన్నికలను పరిశీలిస్తే 47 శాతం ఓట్లతో 20 సీట్లు గెలుపొందగా, బీజేపీ 36.6 శాతం ఓట్లతో కేవలం 4 స్థానాలే గెలిచింది. మరి ఈసారైనా కాంగ్రెస్ ‘సున్నా’ రాత మారుతుందో లేదో చూడాలి. -
రూ. 2 కోట్లకు ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షా పత్రాలు!
రాజస్థాన్‌లో మరో అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను గత గెహ్లాట్ ప్రభుత్వం నిర్వహించింది. 2021 సెప్టెంబరులో ఈ పరీక్షను మూడు దశల్లో నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తాజాగా వెల్లడైంది. గత ఏడాది మే నెలలో ఈ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. విజయం సాధించినవారు ప్రస్తుతం రాజస్థాన్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇన్నాళ్లకు ఈ పరీక్షలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పరీక్షలో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అభ్యర్థులు మోసపూరితంగా ఉత్తీర్ణులయ్యారని ఆధార పూర్వకంగా తేలిందని కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా తెలిపారు. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు 42 మంది భాగస్వాములు పేర్లు వెల్లడయ్యాయి. వీరిలో 20 మందిని అరెస్టు చేశారు. రాజధాని జైపూర్‌లోని హస్నుపర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి ఈ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ పేపర్‌ను వాట్సాప్‌లో పంపారు. ఇందుకోసం సదరు స్కూల్ డైరెక్టర్ పది లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ పేపర్ రూ. 2 కోట్లకు పైగా మొత్తానికి అమ్ముడుపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూత
రాజస్థాన్ క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ జట్టు మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ (40) కన్నుమూశాడు. గతకొంతకాలంగా లివర్ సమస్యలతో బాధపడుతున్న రోహిత్ జైపూర్‌లోని ప్రైవేటు అసుపత్రిలో నిన్న తుది శ్వాస విడిచాడు. 2014లో ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్ ఆతర్వాత క్రికెట్ అకాడమీని స్థాపించి, కోచ్‌గా సేవలందిస్తున్నాడు. రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్, లెగ్ స్పిన్ బౌలర్ అయిన రోహిత్ 2004-2014 మధ్యలో రాజస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రోహిత్ రాజస్థాన్ తరఫున 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 28 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టీ20లు ఆడాడు. రోహిత్ ఖాతాలో రెండు లిస్ట్-ఏ సెంచరీలు ఉన్నాయి. -
1993 పేలుళ్ల కేసులో ‘డాక్టర్ బాంబ్’ తుండాకు ఊరట!
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. లష్కరే తోయిబా ప్రధాన సభ్యుడు అబ్దుల్ కరీమ్ తుండాను రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. పేలుళ్ల కేసులకు సంబంధించి.. తుండాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. .. అదే సమయంలో ఈ కేసులో అమీనుద్దీన్, ఇర్ఫాన్ అనే ఇద్దరికి జీవితఖైదు విధించింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరీం తుండా బాగా దగ్గర. బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నందునే కరీం తుండాను ‘మిస్టర్ బాంబ్’గా పేర్కొంటారు. గతంలో.. లష్కరే తోయిబా, ఇండియన ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, బబ్బర్ ఖాల్సా సంస్థలకు పని చేశాడు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా పేర్కొంటూ పలు ఉగ్రసంస్థలు దేశంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాయి. 1993లో కోటా, కాన్పూర్, సూరత్, సికింద్రాబాద్ స్టేషన్ల పరిధిలో రైళ్లలో జరిగిన పేలుళ్లు యావత్ దేశాన్ని షాక్‌కి గురి చేశాయి. ఈ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే వివిధ నగరాల్లో నమోదైన ఈ కేసులంటిని ఉగ్రవాద నిరోధక చట్టం ఆధారంగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. కరీం తుండాను నిర్దోషిగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించడాన్ని.. సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని సీబీఐ భావిస్తోంది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్పెంటర్ పని చేసే తుండా.. ముంబై పేలుళ్ల తర్వాతే నిఘా సంస్థల పరిశీలనలోకి వచ్చాడు. ఉత్తరాఖండ్ నేపాల్‌సరిహద్దులో 2013లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశాయి. 1996 పేలుడు కేసుకు సంబంధించి హర్యానా కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. ఇక.. బాంబు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి కరీం తన ఎడమ చేతిని కోల్పోయాడు. -
ఆ చిన్నారికి అరుదైన వ్యాధి.. రూ. 17 కోట్ల సాయం కోసం ఎదురుచూపు!
రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాలోని మణియన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారి నరేష్ చంద్ర శర్మ కుమారుడు హృదయాంశ్(22 నెలలు) అరుదైన జన్యుపరమైన వ్యాధి ఎస్ఎంఏ టైప్-2తో బాధపడుతున్నాడు. హృదయాంశ్ తన కాళ్లపై తాను నిలబడలేడు. చికిత్స లో భాగంగా ఆ చిన్నారికి రూ. 17.5 కోట్ల విలువైన ZOLGESMA ఇంజక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. హృదయాంశ్‌కు రెండు నెలల వ్యవధిలోగా ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇంత స్వల్ప వ్యవధిలో రూ. 17 కోట్ల భారీ మొత్తాన్ని ఏర్పాటు చేయడం హృదయాంశ్ తండ్రి నరేష్ చంద్రకు సాధ్యంకాని పని. ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ యూఆర్ సాహు దీనిపై పలువురు పోలీసు సూపరింటెండెంట్లకు నరేష్ చంద్ర శర్మకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఈ మెయిల్ చేశారు. తన కుమారుని వైద్యం కోసం అవసరమయ్యే సొమ్ము భారీగా ఉండటంతో సామాజిక సంస్థలు, సంఘాలు కూడా ముందుకువచ్చి సహాయం అందించాలని పోలీసు అధికారి నరేష్ చంద్ర శర్మ కోరుతున్నారు. -
రసవత్తర సమరంలో పరుగు తేడాతో గెలుపొందిన తెలంగాణ టైగర్స్
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) మొట్టమొదటి ఎడిషన్‌లో (2024) తెలంగాణ టైగర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ లెజెండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 25) జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ టైగర్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తెలంగాణ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా.. ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. రాజస్థాన్ 7 వికెట్ల నష్టానికి 172 పరుగులకు పరిమితమై అతి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. మెరిసిన శివ భరత్.. ఓపెనర్ శివ భరత్ కుమార్ సాగిరి (59 బంతుల్లో 87 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తెలంగాణ భారీ స్కోర్ చేసింది. తెలంగాణ ఇన్నింగ్స్‌లో దిల్షన్ మునవీర 27, రికార్డో పావెల్ 20, మన్ప్రీతి గోని 25 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో పర్విందర్ అవానా 2, సెక్కుగే ప్రసన్న, ఇషాన్ మల్హోత్రా, లఖ్విందర్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. తెలంగాణ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లక్ష్యానికి అతి సమీపంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. తంగిరాల పవన్ కుమార్, తిలక్, ఖాద్రి తలో 2 వికెట్లు, సందీప్ త్యాగి ఓ వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఏంజెలో పెరీరా (32), ఇషాన్ మల్హోత్రా (36), రాజేశ్ బిష్ణోయ్ (44) రాజస్థాన్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, IVPL 2024 ఎడిషన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ నెల 23న జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై.. తెలంగాణపై, ఆతర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో చత్తీస్‌ఘడ్‌పై ఢిల్లీ, నిన్న జరిగిన మూడో మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఉత్తర్ ప్రదేశ్ గెలుపొందాయి. ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. రాత్రి ఏడు గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ లీగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. -
ఆ విషాదమే ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది..ఏకంగా ఏడాదికి..!
భర్త అకాల మరణం ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఓ సక్సెస్ ఫుల్ ఆగ్రో ఎంట్రప్రెన్యూర్‌గా మార్చింది. నేడు ఏకంగా ఏడాదికి 30 లక్షలు దాక ఆర్జిస్తోంది. పైగా ఎలాంటి ఉన్నత చదువులు చదువుకోకపోయినా కొడుకులను ఉన్నత చదువులు చదివిస్తోంది. తాను నమ్ముకున్న భూమితల్లే తన విజయానికి కారణమని సగర్వంగా చెబుతోంది రాజ్‌బాల. ఎవరీ రాజ బాల? ఎలా అన్ని లక్షలు ఆర్జిస్తుందంటే.. రాజస్తాన్‌కి చెందిన 64 ఏళ్ల వృద్ధురాలు రాజ్‌బాల భర్త అకాల మరణంతో ఏం చేయాలేని అగాధంలోకి వెళ్లిపోయింది. ఓ పక్క ఇద్దరు పిల్లలు వాళ్లను ఎలా సాకాలో తెలియని సందిగ్ధ స్థితి. ఇక లాభం లేదు తానే ఏదో ఒకటి చేయాల్సిందే అనుకుంది. తాను నమ్ముకున్న భూమినే ఆశ్రయించింది. అందరి రైతుల్లా కాకుండా రాజ్‌బాల సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యిపోయింది. అనుకున్నదే తడువుగా సేంద్రీయ పద్ధతిలో ఇంటికి సరిపడ కాయగూరలు తదితర వాటిని పెంచుకునేది. ఆ తర్వాత క్రమేణ ఇలాంటి సేంద్రియ ఉత్పత్తులు మంచివని, కేన్యర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే రసాయనిక ఎరువులు వేయకుండా పండించే కూరగాయాలతోనే సాధ్యమని పలు అవగాహన కార్యక్రమల ద్వారా తెలుసుకుంది. మొదట్లో ఇంట్లోకి కావాల్సినంత మటికే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించిన ఆమె ఈ రోజు అందరి కోసం సేంద్రియ పద్ధతుల్లో చాలా కూరగాయాలు పండిచడం ప్రారంభించింది. ఇలా ఆమె తన పొలంలో బొప్పాయి, మామిడి, అల్లం, పసుపు, బీట్ రూట్, టమాటాలతో సహా వివిధ రకాల కూరగాయలను పండిస్తోంది. అక్కడితో రాజ్‌బాల ఆగిపోలేదు పప్పు ధన్యాలు, సుగంధాలు పండించడం నుంచి పశువులకు దాణ అందించడం వరకు అన్నింటిని పండించేది. ఇక్కడ సేంద్రియ వ్యవసాయానికి శ్రమనే అధికంగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని అన్నారు. ఆమె వ్యవసాయ నైపుణ్యం చూసి ఇతరులు కూడా ఈ సేంద్రియ వ్యవసాయమే చేయడం విశేషం. తాను తన భర్త మరణంతోనే సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చానని, నేడు దీంతో ఏడాదికి రూ. 30 లక్షలు పైనే ఆర్జిస్తున్నానని సగర్వంగా చెబుతోంది. ఇంకా ఆమె తాను మంచి చదువులు చదువుకోకపోయిన పిల్లలను ఉన్నత చదువులు చదివించడమే గాకుండా ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫిసర్‌గా, మరోకరు లండన్‌లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారని చెప్పుకొచ్చారు. అంతేగాదు తన కోడళ్లు మద్దతుతో సోషల్ మీడియా ద్వారా సేంద్రియ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అందులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు, సలహాలు సూచనలు కూడా ఇస్తోంది రాజ్ బాల. (చదవండి: ఆత్మవిశ్వాసం గల పిల్లలుగా ఎదగాలంటే..ఆ తప్పులు చెయ్యొదంటున్న మిచెల్ ఒబామా!)